Telugu Meal — Mevlânâ Abdürrahîm b. Muhammed — A'raf 7:1 – Yunus 10:109
Contents
- A'raf 7:1
- A'raf 7:2
- A'raf 7:3
- A'raf 7:4
- A'raf 7:5
- A'raf 7:6
- A'raf 7:7
- A'raf 7:8
- A'raf 7:9
- A'raf 7:10
- A'raf 7:11
- A'raf 7:12
- A'raf 7:13
- A'raf 7:14
- A'raf 7:15
- A'raf 7:16
- A'raf 7:17
- A'raf 7:18
- A'raf 7:19
- A'raf 7:20
- A'raf 7:21
- A'raf 7:22
- A'raf 7:23
- A'raf 7:24
- A'raf 7:25
- A'raf 7:26
- A'raf 7:27
- A'raf 7:28
- A'raf 7:29
- A'raf 7:30
- A'raf 7:31
- A'raf 7:32
- A'raf 7:33
- A'raf 7:34
- A'raf 7:35
- A'raf 7:36
- A'raf 7:37
- A'raf 7:38
- A'raf 7:39
- A'raf 7:40
- A'raf 7:41
- A'raf 7:42
- A'raf 7:43
- A'raf 7:44
- A'raf 7:45
- A'raf 7:46
- A'raf 7:47
- A'raf 7:48
- A'raf 7:49
- A'raf 7:50
- A'raf 7:51
- A'raf 7:52
- A'raf 7:53
- A'raf 7:54
- A'raf 7:55
- A'raf 7:56
- A'raf 7:57
- A'raf 7:58
- A'raf 7:59
- A'raf 7:60
- A'raf 7:61
- A'raf 7:62
- A'raf 7:63
- A'raf 7:64
- A'raf 7:65
- A'raf 7:66
- A'raf 7:67
- A'raf 7:68
- A'raf 7:69
- A'raf 7:70
- A'raf 7:71
- A'raf 7:72
- A'raf 7:73
- A'raf 7:74
- A'raf 7:75
- A'raf 7:76
- A'raf 7:77
- A'raf 7:78
- A'raf 7:79
- A'raf 7:80
- A'raf 7:81
- A'raf 7:82
- A'raf 7:83
- A'raf 7:84
- A'raf 7:85
- A'raf 7:86
- A'raf 7:87
- A'raf 7:88
- A'raf 7:89
- A'raf 7:90
- A'raf 7:91
- A'raf 7:92
- A'raf 7:93
- A'raf 7:94
- A'raf 7:95
- A'raf 7:96
- A'raf 7:97
- A'raf 7:98
- A'raf 7:99
- A'raf 7:100
- A'raf 7:101
- A'raf 7:102
- A'raf 7:103
- A'raf 7:104
- A'raf 7:105
- A'raf 7:106
- A'raf 7:107
- A'raf 7:108
- A'raf 7:109
- A'raf 7:110
- A'raf 7:111
- A'raf 7:112
- A'raf 7:113
- A'raf 7:114
- A'raf 7:115
- A'raf 7:116
- A'raf 7:117
- A'raf 7:118
- A'raf 7:119
- A'raf 7:120
- A'raf 7:121
- A'raf 7:122
- A'raf 7:123
- A'raf 7:124
- A'raf 7:125
- A'raf 7:126
- A'raf 7:127
- A'raf 7:128
- A'raf 7:129
- A'raf 7:130
- A'raf 7:131
- A'raf 7:132
- A'raf 7:133
- A'raf 7:134
- A'raf 7:135
- A'raf 7:136
- A'raf 7:137
- A'raf 7:138
- A'raf 7:139
- A'raf 7:140
- A'raf 7:141
- A'raf 7:142
- A'raf 7:143
- A'raf 7:144
- A'raf 7:145
- A'raf 7:146
- A'raf 7:147
- A'raf 7:148
- A'raf 7:149
- A'raf 7:150
- A'raf 7:151
- A'raf 7:152
- A'raf 7:153
- A'raf 7:154
- A'raf 7:155
- A'raf 7:156
- A'raf 7:157
- A'raf 7:158
- A'raf 7:159
- A'raf 7:160
- A'raf 7:161
- A'raf 7:162
- A'raf 7:163
- A'raf 7:164
- A'raf 7:165
- A'raf 7:166
- A'raf 7:167
- A'raf 7:168
- A'raf 7:169
- A'raf 7:170
- A'raf 7:171
- A'raf 7:172
- A'raf 7:173
- A'raf 7:174
- A'raf 7:175
- A'raf 7:176
- A'raf 7:177
- A'raf 7:178
- A'raf 7:179
- A'raf 7:180
- A'raf 7:181
- A'raf 7:182
- A'raf 7:183
- A'raf 7:184
- A'raf 7:185
- A'raf 7:186
- A'raf 7:187
- A'raf 7:188
- A'raf 7:189
- A'raf 7:190
- A'raf 7:191
- A'raf 7:192
- A'raf 7:193
- A'raf 7:194
- A'raf 7:195
- A'raf 7:196
- A'raf 7:197
- A'raf 7:198
- A'raf 7:199
- A'raf 7:200
- A'raf 7:201
- A'raf 7:202
- A'raf 7:203
- A'raf 7:204
- A'raf 7:205
- A'raf 7:206
- Enfal 8:1
- Enfal 8:2
- Enfal 8:3
- Enfal 8:4
- Enfal 8:5
- Enfal 8:6
- Enfal 8:7
- Enfal 8:8
- Enfal 8:9
- Enfal 8:10
- Enfal 8:11
- Enfal 8:12
- Enfal 8:13
- Enfal 8:14
- Enfal 8:15
- Enfal 8:16
- Enfal 8:17
- Enfal 8:18
- Enfal 8:19
- Enfal 8:20
- Enfal 8:21
- Enfal 8:22
- Enfal 8:23
- Enfal 8:24
- Enfal 8:25
- Enfal 8:26
- Enfal 8:27
- Enfal 8:28
- Enfal 8:29
- Enfal 8:30
- Enfal 8:31
- Enfal 8:32
- Enfal 8:33
- Enfal 8:34
- Enfal 8:35
- Enfal 8:36
- Enfal 8:37
- Enfal 8:38
- Enfal 8:39
- Enfal 8:40
- Enfal 8:41
- Enfal 8:42
- Enfal 8:43
- Enfal 8:44
- Enfal 8:45
- Enfal 8:46
- Enfal 8:47
- Enfal 8:48
- Enfal 8:49
- Enfal 8:50
- Enfal 8:51
- Enfal 8:52
- Enfal 8:53
- Enfal 8:54
- Enfal 8:55
- Enfal 8:56
- Enfal 8:57
- Enfal 8:58
- Enfal 8:59
- Enfal 8:60
- Enfal 8:61
- Enfal 8:62
- Enfal 8:63
- Enfal 8:64
- Enfal 8:65
- Enfal 8:66
- Enfal 8:67
- Enfal 8:68
- Enfal 8:69
- Enfal 8:70
- Enfal 8:71
- Enfal 8:72
- Enfal 8:73
- Enfal 8:74
- Enfal 8:75
- Tevbe 9:1
- Tevbe 9:2
- Tevbe 9:3
- Tevbe 9:4
- Tevbe 9:5
- Tevbe 9:6
- Tevbe 9:7
- Tevbe 9:8
- Tevbe 9:9
- Tevbe 9:10
- Tevbe 9:11
- Tevbe 9:12
- Tevbe 9:13
- Tevbe 9:14
- Tevbe 9:15
- Tevbe 9:16
- Tevbe 9:17
- Tevbe 9:18
- Tevbe 9:19
- Tevbe 9:20
- Tevbe 9:21
- Tevbe 9:22
- Tevbe 9:23
- Tevbe 9:24
- Tevbe 9:25
- Tevbe 9:26
- Tevbe 9:27
- Tevbe 9:28
- Tevbe 9:29
- Tevbe 9:30
- Tevbe 9:31
- Tevbe 9:32
- Tevbe 9:33
- Tevbe 9:34
- Tevbe 9:35
- Tevbe 9:36
- Tevbe 9:37
- Tevbe 9:38
- Tevbe 9:39
- Tevbe 9:40
- Tevbe 9:41
- Tevbe 9:42
- Tevbe 9:43
- Tevbe 9:44
- Tevbe 9:45
- Tevbe 9:46
- Tevbe 9:47
- Tevbe 9:48
- Tevbe 9:49
- Tevbe 9:50
- Tevbe 9:51
- Tevbe 9:52
- Tevbe 9:53
- Tevbe 9:54
- Tevbe 9:55
- Tevbe 9:56
- Tevbe 9:57
- Tevbe 9:58
- Tevbe 9:59
- Tevbe 9:60
- Tevbe 9:61
- Tevbe 9:62
- Tevbe 9:63
- Tevbe 9:64
- Tevbe 9:65
- Tevbe 9:66
- Tevbe 9:67
- Tevbe 9:68
- Tevbe 9:69
- Tevbe 9:70
- Tevbe 9:71
- Tevbe 9:72
- Tevbe 9:73
- Tevbe 9:74
- Tevbe 9:75
- Tevbe 9:76
- Tevbe 9:77
- Tevbe 9:78
- Tevbe 9:79
- Tevbe 9:80
- Tevbe 9:81
- Tevbe 9:82
- Tevbe 9:83
- Tevbe 9:84
- Tevbe 9:85
- Tevbe 9:86
- Tevbe 9:87
- Tevbe 9:88
- Tevbe 9:89
- Tevbe 9:90
- Tevbe 9:91
- Tevbe 9:92
- Tevbe 9:93
- Tevbe 9:94
- Tevbe 9:95
- Tevbe 9:96
- Tevbe 9:97
- Tevbe 9:98
- Tevbe 9:99
- Tevbe 9:100
- Tevbe 9:101
- Tevbe 9:102
- Tevbe 9:103
- Tevbe 9:104
- Tevbe 9:105
- Tevbe 9:106
- Tevbe 9:107
- Tevbe 9:108
- Tevbe 9:109
- Tevbe 9:110
- Tevbe 9:111
- Tevbe 9:112
- Tevbe 9:113
- Tevbe 9:114
- Tevbe 9:115
- Tevbe 9:116
- Tevbe 9:117
- Tevbe 9:118
- Tevbe 9:119
- Tevbe 9:120
- Tevbe 9:121
- Tevbe 9:122
- Tevbe 9:123
- Tevbe 9:124
- Tevbe 9:125
- Tevbe 9:126
- Tevbe 9:127
- Tevbe 9:128
- Tevbe 9:129
- Yunus 10:1
- Yunus 10:2
- Yunus 10:3
- Yunus 10:4
- Yunus 10:5
- Yunus 10:6
- Yunus 10:7
- Yunus 10:8
- Yunus 10:9
- Yunus 10:10
- Yunus 10:11
- Yunus 10:12
- Yunus 10:13
- Yunus 10:14
- Yunus 10:15
- Yunus 10:16
- Yunus 10:17
- Yunus 10:18
- Yunus 10:19
- Yunus 10:20
- Yunus 10:21
- Yunus 10:22
- Yunus 10:23
- Yunus 10:24
- Yunus 10:25
- Yunus 10:26
- Yunus 10:27
- Yunus 10:28
- Yunus 10:29
- Yunus 10:30
- Yunus 10:31
- Yunus 10:32
- Yunus 10:33
- Yunus 10:34
- Yunus 10:35
- Yunus 10:36
- Yunus 10:37
- Yunus 10:38
- Yunus 10:39
- Yunus 10:40
- Yunus 10:41
- Yunus 10:42
- Yunus 10:43
- Yunus 10:44
- Yunus 10:45
- Yunus 10:46
- Yunus 10:47
- Yunus 10:48
- Yunus 10:49
- Yunus 10:50
- Yunus 10:51
- Yunus 10:52
- Yunus 10:53
- Yunus 10:54
- Yunus 10:55
- Yunus 10:56
- Yunus 10:57
- Yunus 10:58
- Yunus 10:59
- Yunus 10:60
- Yunus 10:61
- Yunus 10:62
- Yunus 10:63
- Yunus 10:64
- Yunus 10:65
- Yunus 10:66
- Yunus 10:67
- Yunus 10:68
- Yunus 10:69
- Yunus 10:70
- Yunus 10:71
- Yunus 10:72
- Yunus 10:73
- Yunus 10:74
- Yunus 10:75
- Yunus 10:76
- Yunus 10:77
- Yunus 10:78
- Yunus 10:79
- Yunus 10:80
- Yunus 10:81
- Yunus 10:82
- Yunus 10:83
- Yunus 10:84
- Yunus 10:85
- Yunus 10:86
- Yunus 10:87
- Yunus 10:88
- Yunus 10:89
- Yunus 10:90
- Yunus 10:91
- Yunus 10:92
- Yunus 10:93
- Yunus 10:94
- Yunus 10:95
- Yunus 10:96
- Yunus 10:97
- Yunus 10:98
- Yunus 10:99
- Yunus 10:100
- Yunus 10:101
- Yunus 10:102
- Yunus 10:103
- Yunus 10:104
- Yunus 10:105
- Yunus 10:106
- Yunus 10:107
- Yunus 10:108
- Yunus 10:109
A'raf 7:1
అలిఫ్ - లామ్ - మీమ్ - సాద్![1]
———
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
A'raf 7:2
(ఓ ముహమ్మద్!) ఈ గ్రంథం నీపై అవతరింప జేయబడింది. కావున దీనిని గురించి నీ హృదయంలో ఏ విధమైన సంకోచం ఉండనివ్వకు; ఇది నీవు (సన్మార్గం నుండి తప్పేవారికి) హెచ్చరిక చేయటానికి (అవతరింపజేయబడింది); మరియు ఇది విశ్వాసులకొక హితోపదేశం.
A'raf 7:3
(ప్రజలారా!) మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింప జేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) అనుసరించండి. మరియు ఆయన (అల్లాహ్)ను కాదని ఇతర స్నేహితులను (సహాయకులను) అనుసరించకండి. మీరు ఎంతో తక్కువగా ఈ హితబోధను స్వీకరిస్తున్నారు!
A'raf 7:4
మరియు మేము ఎన్నో నగరాలను (వాటి నేరాలకు గాను) నాశనం చేశాము. వారిపై, మా శిక్ష (ఆకస్మాత్తుగా) రాత్రివేళలో గానీ, లేదా మధ్యహ్నం వారు విశ్రాంతి తీసుకునే సమయంలో గానీ వచ్చిపడింది.
A'raf 7:5
వారిపై మా శిక్ష పడినప్పుడు వారి రోదన: "నిశ్చయంగా, మేము అపరాధులంగా ఉండే వారం!" అని అనడం తప్ప మరేమీ లేకుండింది![1]
———
[1] కాని అప్పుడది వారికి ఏ విధంగాను పనికిరాదు. చూడండి, 40:85.
A'raf 7:6
కావున మేము ఎవరి వద్దకు మా సందేశాన్ని (ప్రవక్తను) పంపామో, వారిని తప్పక ప్రశ్నిస్తాము. మరియు నిశ్చయంగా, ప్రవక్తలను కూడా ప్రశ్నిస్తాము[1].
———
[1] చూడండి, 5:109.
A'raf 7:7
అప్పుడు (జరిగిందంతా) వారికి పూర్తి జ్ఞానంతో వివరిస్తాము. ఎందుకంటే, మేము (ఎక్కడనూ, ఎప్పుడునూ) లేకుండా లేము[1].
———
[1] అంటే అల్లాహ్ (సు.తా.) కు ప్రతి ప్రత్యక్ష-పరోక్ష, గోచర-అగోచర, విషయాల జ్ఞానం ఉంది. అల్లాహుతా'ఆలా తన జ్ఞానంతో ప్రతిచోట ఉంటాడు.
A'raf 7:8
మరియు ఆ రోజు (కర్మల) తూకం న్యాయంగా జరుగుతుంది. కావున ఎవరి తూనికలు బరువుగా ఉంటాయో అలాంటి వారే సఫలీకృతలు[1].
———
[1] చూడండి, 101:6-7 మరియు 'స. బు'ఖారీ, పు. 9, 'హ. 652.
A'raf 7:9
మరియు ఎవరి తూనికలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేస్తుకున్నవారు[1]. ఎందుకంటే, వారు మా సూచనలను దుర్మార్గంతో తిరస్కరిస్తూ ఉండేవారు.
———
[1] చూడండి, 101:8-11.
A'raf 7:10
మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని భూమిలో స్థిరపరచాము. మరియు అందులో మీకు జీవన వసతులను కల్పించాము (అయినా) మీరు కృతజ్ఞత చూపేది చాలా తక్కువ.
A'raf 7:11
మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని సృష్టించాము. పిదప మీ రూపాన్ని తీర్చిదిద్దాము. ఆ పిదప దైవదూతలను: "మీరు ఆదమ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి!" అని ఆదేశించగా, ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం (సజ్దా) చేశారు, అతడు సాష్టాంగం చేసేవారిలో చేరలేదు[1].
———
[1] చూడండి, 2:30-34.
A'raf 7:12
(అప్పుడు అల్లాహ్) అన్నాడు: "(ఓ ఇబ్లీస్!) నేను ఆజ్ఞాపించినప్పటికీ, సాష్టాంగం చేయకుండా నిన్ను ఆపింది ఏమిటి?" దానికి (ఇబ్లీస్): "నేను అతని కంటే శ్రేష్ఠుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని నీవు మట్టితో సృష్టించావు." అని జవాబిచ్చాడు[1].
———
[1] చూడండి, 18:50, 38:76. అతడు (ఇబ్లీస్) జిన్నాతులలోని వాడు.
A'raf 7:13
(అప్పుడు అల్లాహ్) ఆజ్ఞాపించాడు: "నీవిక్కడ నుండి దిగిపో! ఇక్కడ గర్వపడటం నీకు తగదు, కావున వెళ్ళిపో! నిశ్చయంగా, నీవు నీచులలో చేరావు!"
A'raf 7:14
(ఇబ్లీస్) ఇలా వేడుకున్నాడు: "వారు తిరిగి లేపబడే (పునరుత్థాన) దినం వరకు నాకు వ్యవధినివ్వు!"
A'raf 7:15
(అల్లాహ్) సెలవిచ్చాడు: "నిశ్చయంగా, నీకు వ్యవధి ఇవ్వబడుతోంది!"
A'raf 7:16
(దానికి ఇబ్లీస్) అన్నాడు: "నీవు నన్ను మార్గభ్రష్టత్వంలో వేసినట్లు, నేను కూడా వారి కొరకు నీ ఋజుమార్గంపై మాటువేసి కూర్చుంటాను!"
A'raf 7:17
"తరువాత నేను వారి ముందు నుండి, వారి వెనుక నుండి, వారి కుడివైపు నుండి మరియు వారి ఎడమ వైపు నుండి, వారి వైపుకు వస్తూ ఉంటాను. మరియు వారిలో అనేకులను నీవు కృతజ్ఞులుగా పొందవు!"[1]
———
[1] చూడండి, 34:20.
A'raf 7:18
(అల్లాహ్) జవాబిచ్చాడు, "నీవిక్కడి నుండి అవమానింపబడి, బహిష్కృతుడవై వెళ్ళిపో! వారిలో ఎవరైతే నిన్ను అనుసరిస్తారో! అలాంటి మీ వారి అందరితో నిశ్చయంగా, నేను నరకాన్ని నింపుతాను."
A'raf 7:19
మరియు : "ఓ ఆదమ్! నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో ఉండండి. మరియు మీద్దరూ మీ ఇచ్ఛానుసారంగా దీనిలోని (ఫలాలను) తినండి. కాని ఈ వృక్షాన్ని సమీపించకండి![1] అలా చేస్తే మీరు దుర్మార్గులలో చేరి పోతారు."
———
[1] చూడండి, 20:120.
A'raf 7:20
ఆ పిదప షైతాన్ వారిద్దరి చూపులకు మరుగుగా ఉన్న వారిద్దరి మర్మాంగాలను వారికి బహిర్గతం చేయటానికి, రహస్యంగా వారి చెవులలో అన్నాడు: "మీరిద్దరూ దైవదూతలు అయిపోతారని, లేదా మీరిద్దరూ శాశ్వత జీవితాన్ని పొందుతారని మీ ప్రభువు, మీ ఇద్దరినీ ఈ వృక్షం నుండి నివారించాడు!"[1]
———
[1] చూడండి, 20:120.
A'raf 7:21
మరియు (షైతాన్) వారిద్దరితో ప్రమాణం చేస్తూ పలికాడు: "నిశ్చయంగా, నేను మీ ఇద్దరి శ్రేయోభిలాషిని!"
A'raf 7:22
ఈ విధంగా వారిద్దరిని మోసపుచ్చి, తన (పన్నుగడ) వైపునకు త్రిప్పుకున్నాడు. వారిద్దరూ ఆ వృక్షమును (ఫలమును) రుచి చూడగానే వారిద్దరి మర్మాంగాలు వారికి బహిర్గతమయ్యాయి. అప్పుడు వారు తమ (శరీరాల)పై స్వర్గపు ఆకులను కప్పుకోసాగారు. మరియు వారి ప్రభువు వారిద్దరినీ పిలిచి అన్నాడు: "ఏమీ? నేను మీ ఇద్దరినీ ఈ చెట్టు వద్దకు పోవద్దని నివారించలేదా? మరియు నిశ్చయంగా, షైతాన్ మీ ఇద్దరి యొక్క బహిరంగ శత్రువని చెప్పలేదా?"
A'raf 7:23
వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు: "మా ప్రభూ! మాకు మేము అన్యాయం చేసుకున్నాము. మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే! మమ్మల్ని క్షమించకపోతే! నిశ్చయంగా, మేము నాశనమై పోయేవారమవుతాము."[1]
———
[1] చూడండి, 2:37.
A'raf 7:24
(అల్లాహ్) అన్నాడు: "మీరందరు దిగిపోండి! మీరు ఒకరికొకరు శత్రువులు అవుతారు. మరియు మీరందరికీ ఒక నిర్ణీతకాలం వరకు భూమిలో నివాసం మరియు జీవనోపాధి ఉంటాయి."
A'raf 7:25
ఇంకా ఇలా అన్నాడు: "మీరందరూ అందులోనే జీవిస్తారు మరియు అందులోనే మరణిస్తారు మరియు దాని నుండే మరల లేపబడతారు (పురుత్థరింపబడతారు)."
A'raf 7:26
ఓ ఆదమ్ సంతానమా! వాస్తవానికి మేము మీ కొరకు వస్త్రాలను కల్పించాము, అవి మీ మర్మాంగాలను కప్పుతాయి మరియు మీకు అలంకారమిస్తాయి. మరియు దైవభీతియే అన్నింటి కంటే శ్రేష్ఠమైన వస్త్రం. ఇవి అల్లాహ్ సూచనలలో కొన్ని; బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమోనని, (వీటిని మీకు వినిపిస్తున్నాము).
A'raf 7:27
ఓ ఆదమ్ సంతానమా! షైతాన్ మీ తల్లిదండ్రుల నుండి (స్వర్గ) వస్త్రాలను తొలగించి, వారి మర్మాంగాలను వారికి కనబడేటట్లు చేసి వారిని స్వర్గం నుండి వెడలగొట్టినట్లు మిమ్మల్ని కూడా ఆపదకు (ఫిత్నాకు) గురిచేయకూడదు. నిశ్చయంగా, వాడు మరియు వాని సంతతివారు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు. కాని, మీరు వారిని చూడలేరు. నిశ్చయంగా, మేము షైతానులను, విశ్వసించని వారికి స్నేహితులుగా చేశాము.
A'raf 7:28
మరియు వారు (అవిశ్వాసులు), ఏదైనా అశ్లీలమైన పని చేసినపుడు ఇలా అంటారు: "మేము మా తండ్రితాతలను ఈ పద్ధతినే అవలంబిస్తూ ఉండగా చూశాము. మరియు అలా చేయమని అల్లాహ్ యే మమ్మల్ని ఆదేశించాడు." వారితో అను: "నిశ్చయంగా, అల్లాహ్ అశ్లీలమైన పనులు చేయమని ఎన్నడూ ఆదేశించడు. ఏమీ? మీకు తెలియని విషయాన్ని గురించి అల్లాహ్ పై నిందలు వేస్తున్నారా?"
A'raf 7:29
(ఓ ముహమ్మద్! వారితో) ఇలా అను: "నా ప్రభువు న్యాయాన్ని పాటించమని ఆదేశించాడు. మరియు మీరు ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ ముఖాలను సరిగ్గా (ఆయన వైపునకే)[1] మరల్చుకొని నమాజ్ ను పూర్తి శ్రద్ధతో నిర్వహించండి మరియు ధర్మాన్ని / ఆరాధనను (దీన్ ను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకొని ఆయనను మాత్రమే ప్రార్థించండి." ఆయన మిమ్మల్ని మొదట సృష్టించినట్లు మీరు తిరిగి సృష్టించబడతారు.
———
[1] అంటే మీరు మీ ముఖాలను ఖిబ్లా వైపునకే మరల్చి మీ ఆరాధనను కేవలం అల్లాహ్ (సు.తా.) కొరకే ప్రత్యేకించుకోండి.
A'raf 7:30
మీలో కొందరికి ఆయన సన్మార్గం చూపించాడు. మరికొందరు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ ను వదలి షైతానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు మరియు నిశ్చయంగా, తామే సన్మార్గంపై ఉన్నామని భ్రమలో ఉన్నారు.
A'raf 7:31
ఓ ఆదమ్ సంతానమా ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి[1]. తినండి, త్రాగండి, కాని మితిమీరకండి. నిశ్చయంగా, ఆయన (అల్లాహ్) మితిమీరే వారిని ప్రేమించడు.
———
[1] నమా'జ్, 'తవాఫ్, చేసేటప్పుడు బట్టలు ధరించటం విధి. ఇంకా (చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 368) ఇస్లాంకు ముందు ముష్రికులు, క'అబహ్ 'తవాఫ్ బట్టలు ధరించకుండా చేసేవారు. ఇస్లాం దానిని నిషేధించింది. చూడండి, 'స. బు'ఖారీ, పు.1, 'హ. 368.
A'raf 7:32
ఇలా అను: "అల్లాహ్ తన దాసుల కొరకు సృష్టించిన వస్త్రాలంకరణను మరియు మంచి జీవనోపాధిని నిషేధించేవాడెవడు?" (ఇంకా) ఇలా అను: "ఇవి ఇహలోక జీవితంలో విశ్వాసుల కొరకే; పునరుత్థాన దినమున ప్రత్యకంగా వారి కొరకు మాత్రమే గలవు[1]. ఈ విధంగా మేము మా సూచనలను జ్ఞానం గల వారికి స్పష్టంగా వివరిస్తున్నాము."
———
[1] చూడండి, 7:50-51.
A'raf 7:33
ఇలా అను: "నా ప్రభువు బహిరంగంగా గానీ, లేదా రహస్యంగా గానీ, అశ్లీల (అసహ్యకరమైన) కార్యాలను, పాపకార్యాలను చేయటాన్ని మరియు దౌర్జన్యం చేయటాన్ని మరియు ఆయన (అల్లాహ్) అవతరింపజేసిన ప్రమాణం ఏదీ లేనిదే ఇతరులను అల్లాహ్ కు సాటి (భాగస్వాములుగా) కల్పించటాన్ని మరియు మీకు జ్ఞానం లేనిదే ఏ విషయాన్ని అయినా అల్లాహ్ పై మోపటాన్ని నిషేధించి వున్నాడు."
A'raf 7:34
మరియు ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. కావున ఆ గడువు వచ్చినపుడు, వారు ఒక ఘడియ వెనుక గానీ మరియు ముందు గానీ కాలేరు.
A'raf 7:35
ఓ ఆదమ్ సంతానమా! మీలో నుంచే మీ వద్దకు నా సూచనలను వినిపించే ప్రవక్తలు వచ్చినపుడు, ఎవరైతే దైవభీతి కలిగి వుండి తమను తాము సరిదిద్దుకుంటారో, అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
A'raf 7:36
కాని ఎవరైతే మా సూచనలను అసత్యాలని నిరాకరించి, వాటి యెడల దరహంకారం చూపుతారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
A'raf 7:37
ఇక అల్లాహ్ పై అసత్యాలు కల్పించే వాని కంటే; లేదా ఆయన సూచనలను అసత్యాలని తిరస్కరించే వాని కంటే మించిన దుర్మార్గుడెవడు? అలాంటి వారు తమ విధివ్రాత ప్రకారం తమ భాగ్యాన్ని పొందుతారు[1]. తుదకు మేము పంపే దైవదూతలు వారి ప్రాణాలు తీయటానికి వారి వద్దకు వచ్చి: "మీరు అల్లాహ్ ను వదలి ప్రార్థించేవారు (ఆ దైవాలు) ఇపుడు ఎక్కడున్నారు?" అని అడుగుతారు. వారిలా జవాబిస్తారు: "వారు మమ్మల్ని వదిలి పోయారు." మరియు ఈ విధంగా వారు: "మేము నిజంగానే సత్యతిరస్కారులమై ఉండేవారము." అని తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిచ్చుకుంటారు.
———
[1] దీనిని వివిధ రకాలుగా బోధించారు. ఒక అర్థం వయస్సు మరియు జీవనోపాధి ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆయత్ కు చూడండి, 10:69-70.
A'raf 7:38
(అల్లాహ్) అంటాడు: "మీకు పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవుల సమాజాలు పోయి చేరిన ఆ నరకాగ్నిలోకి ప్రవేశించండి." ప్రతి సమాజం (నరకంలో) ప్రవేశించినపుడు తన పూర్వపు వారిని (సమాజాన్ని) శపిస్తుంది. తుదకు వారంతా అక్కడ చేరిన పిదప; తరువాత వచ్చిన వారు తమ కంటే ముందు వచ్చని వారిని గురించి: "ఓ మా ప్రభూ! వీరే మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసినవారు, కావున వీరికి రెట్టింపు నరకాగ్ని శిక్ష విధించు!" అని అంటారు[1]. దానికి (అల్లాహ్): "ప్రతి వాడికి రెట్టింపు (శిక్ష) విధించబడుతుంది[2]. కాని మీరది తెలుసుకోలేరు!" అని అంటాడు.
———
[1] చూడండి, 33:67-68 మరియు 16:25. [2] చూడండి, 34:31-32.
A'raf 7:39
మరియు అప్పుడు మొదటి వారు తరువాత వచ్చిన వారితో: "మీకు మాపై ఎలాంటి ఆధిక్యకత లేదు కావున మీరు కూడా మీ కర్మలకు బదులుగా శిక్షను చవి చూడండి!" అని అంటారు.
A'raf 7:40
నిశ్చయంగా, మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారి కొరకు మరియు వాటి పట్ల దురహంకారం చూపిన వారి కొరకు ఆకాశ ద్వారాలు ఏ మాత్రం తెరువబడవు. మరియు ఒంటె సూదిబెజ్జంలో నుండి దూరి పోగలిగేవరకు వారు స్వర్గంలో ప్రవేశించజాలరు. మరియు ఈ విధంగా మేము అపరాధులకు ప్రతిఫలమిస్తాము.
A'raf 7:41
నరకమే వారి పాన్పు మరియు వారి దుప్పటి అవుతుంది. మరియు ఈ విధంగా మేము దుర్మార్గులకు ప్రతిఫలమిస్తాము.
A'raf 7:42
కాని, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వ్యక్తికి, మేము అతని శక్తికి మించిన భారం వేయము. ఇటువంటి వారే స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
A'raf 7:43
మరియు మేము వారి హృదయాల నుండి పరస్పర ద్వేషభావాలను తొలగిస్తాము. వారి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు వారు ఇలా అంటారు: "మాకు ఇక్కడికి చేరటానికి సన్మార్గం చూపిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. అల్లాహ్ మాకు ఈ సన్మార్గం చూపకపోతే మేము సన్మార్గం పొంది ఉండేవారమ కాదు. మా ప్రభువు పంపిన ప్రవక్తలు వాస్తవంగా సత్యాన్నే తీసుకు వచ్చారు!" అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: "మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా, మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే!"
A'raf 7:44
మరియు స్వర్గవాసులు, నరకవాసులను ఉద్దేశించి ఇలా అంటారు: "మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాన్ని మేము వాస్తవంగా, సత్యమైనదిగా పొందాము. ఏమీ? మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని సత్యమైనదిగా పొందారా? వారు జవాబిస్తారు: "అవును!" అప్పుడు ప్రకటించే వాడొకడు వారి మధ్య ఇలా ప్రకటిస్తాడు: "దుర్మార్గులపై అల్లాహ్ శాపం (బహిష్కారం) ఉంది!"
A'raf 7:45
ఎవరైతే (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తారో మరియు అది తప్పు మార్గమని చూపగోరుతారో! అలాంటి వారే పరలోక జీవితాన్ని తిరస్కరించినవారు.
A'raf 7:46
మరియు ఆ ఉభయ వర్గాల మధ్య ఒక అడ్డుతెర ఉంటుంది[1]. దాని ఎత్తైన ప్రదేశాల మీద కొందరు ప్రజలు ఉంటారు[2]. వారు ప్రతి ఒక్కరినీ వారి గుర్తులను బట్టి తెలుసుకుంటారు. వారు స్వర్గవాసులను పిలిచి: "మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అంటారు. వారు ఇంకా స్వర్గంలో ప్రవేశించలేదు, కాని దానిని ఆశిస్తున్నారు.
———
[1] చూడండి, 57:13. [2] అల్-అ'అరాఫు: ('అపఫున్, ఏ.వ.) ఇవి స్వర్గ నరకాల మధ్య ఉన్న గోడపై నున్న ఎత్తైన ప్రదేశాలు. అక్కడ కొందరు తమ గమ్యస్థానం (స్వర్గం / నరకం) కొరకు వేచి ఉంటారు..
A'raf 7:47
మరియు వారి దృష్టి నరకవాసుల వైపునకు మళ్ళించబడినపుడు వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గులతో చేర్చకు!"
A'raf 7:48
మరియు ఎత్తైన ప్రదేశాలపై ఉన్నవారు వారిని (నరకవాసులను) వారి గుర్తుల ద్వారా గుర్తించి వారితో అంటారు: "మీరు కూడ బెట్టిన ఆస్తిపాస్తులు మరియు మీ దురహంకారాలు, మీకు ఏమైనా లాభం చేకూర్చాయా?
A'raf 7:49
" 'వీరీకీ, అల్లాహ్ తన కారుణ్యాన్ని ఏ మాత్రం ప్రసాదించడు.' అని మీరు ప్రమాణాలు చేసి చెబుతూ ఉండేవారు, వీరే కదా? (చూడండి వారితో ఇలా అనబడింది): 'మీరు స్వర్గంలో ప్రవేశించండి, మీకు ఎలాంటి భయమూ ఉండదు మరియు మీరు దుఃఖపడరు కూడా!' "
A'raf 7:50
మరియు నరకవాసులు స్వర్గవాసులతో: "కొద్ది నీళ్ళో లేక అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారంలో నుండైనా కొంత మా వైపుకు విసరండి." అని అంటారు. (దానికి స్వర్గవాసులు): "నిశ్చయంగా అల్లాహ్! ఈ రెండింటినీ సత్యతిరస్కారులకు నిషేధించి వున్నాడు."[1] అని అంటారు.
———
[1] చూడండి, 7:32.
A'raf 7:51
వీరే, వారు; ఎవరైతే తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా చేసుకున్నారో. మరియు ఇహలోక జీవితం వారిని మోసానికి గురి చేసింది. (అల్లాహ్ ఇలా సెలవిస్తాడు): "వారు ఈనాటి సమావేశాన్ని మరచి, మా సూచనలను తిరస్కరించినట్లు, ఈనాడు మేమూ వారిని మరచిపోతాము!"
A'raf 7:52
మరియు వాస్తవానికి మేము వారికి గ్రంథాన్ని ప్రసాదించి, దానిని జ్ఞానపూర్వకంగా స్పష్టంగా వివరించి ఉన్నాము[1]. అది విశ్వసించే వారికి ఒక మార్గదర్శిని, మరియు కారుణ్యం.
———
[1] చూడండి, 17:15.
A'raf 7:53
ఏమీ? వారు (అవిశ్వాసులు) దాని తుది ఫలితం సంభవించాలని నిరీక్షిస్తున్నారా? దాని తుది ఫలితం సంభవించే దినమున, దానిని నిర్లక్ష్యం చేసినవారు: "వాస్తవానికి మా ప్రభువు పంపిన ప్రవక్తలు సత్యం తెచ్చారు. అయితే ఏమీ? మా కొరకు సిఫారసు చేయటానికి, సిఫారసుదారులు ఎవరైనా ఉన్నారా? లేదా మేము మళ్ళీ తిరిగి (భూలోకంలోకి) పంపబడితే మేమింత వరకు చేసిన కర్మలకు విరుద్ధంగా చేసేవారం కదా?" అని పలుకుతారు. వాస్తవానికి వారు తమకు తాము నష్టం కలిగించుకున్నారు మరియు వారు కల్పించుకున్న (దైవాలన్నీ) వారిని త్యజించి ఉంటాయి.
A'raf 7:54
నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు[1]. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు[2]. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు[3], సర్వ లోకాలకు పోషకుడు!
———
[1] యౌమున్: దినం, మనం లెక్కిస్తున్న దినం (ఒక పగలు-రాత్రితో కూడుకున్నది), ఈ భూలోకానికే పరిమితిమైనది. ఇది మన భూలోక వాసుల అనుకూలం కొరకు అల్లాహ్ (సు.తా.) నిర్ణయించిన దినం. దీని సంబంధం భూమి సంచారంతో ఉంది. అల్లాహుతా'ఆలా ఇక్కడు: "ఆకాశాలు మరియు భూమిని ఆరు దినాలలో సృష్టించాను." అని అంటున్నాడు. ఈ యౌమున్, అంటే యుగం, దశ లేక కాలం (Aeon, Epoch) కావచ్చు! నిజం అల్లాహ్ తెలుసు. [2] అల్లాహ్ (సు.తా.) ఏ విధంగా తన 'అర్ష్ ను (సింహాసనాన్ని/విశ్వాధికార పీఠాన్ని) అధిష్ఠించి ఉన్నాడో మనకు తెలియదు. మనం దానిని మానవ జ్ఞానపరిధి ప్రకారం ఉదాహరణలతో వివరించటం తగినది కాదు. మనము ఇలాంటి విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా విశ్వసించటమే నిజమైన విశ్వాసం (ఇబ్నె-కసీ'ర్). ఇది ముతషాబిహాత్ - అస్పష్టమైన విషయాలలోనిది. ఈ శబ్దం ఖుర్ఆన్ లో చాలా చోట్లలో వచ్చింది. చూడండి, 7:54, 9:129, 10:3, 11:7, 13:2, 20:5, 25:59, 32:4 57:4. [3] తబారక్: Blessed, Exalted, శుభదాయకుడు, శుభప్రదుడు, శుభకరుడు, అనుగ్రహించు, ఆశీర్వదించు, వరాలను, శుభాలను ప్రసాదించు, ఘనతగల, మహిమ గల వాడు..
A'raf 7:55
మీ ప్రభువును వినయంతో మరియు రహస్యంగా (మౌనంగా) ప్రార్థించండి. నిశ్చయంగా, ఆయన హద్దులు మీరే వారిని ప్రేమించడు.
A'raf 7:56
మరియు భూమిలో సంస్కరణ జరిగిన పిదప దానిలో కల్లోలాన్ని రేకెత్తించకండి మరియు భయంతో మరియు ఆశతో ఆయనను ప్రార్థించండి. నిశ్చయంగా, అల్లాహ్ కారణ్యం సజ్జనులకు సమీపంలోనే ఉంది[1].
———
[1] ఈ రెండు ఆయత్ లలో నాలుగు విషయాలు వివరించబడ్డాయి. 1) అల్లాహ్ (సు.తా.) ను వినయంతో, రహస్యంగా (మౌనంగా) ప్రార్థించాలి. 2) ప్రార్థనలో మన కోరికలు హద్దులు మీరి ఉండకూడదు. 3) సంస్కరణ తరువాత భూమిలో సంక్షోభాన్ని రేకెత్తించకూడదు. 4) హృదయాలలో అల్లాహ్ (సు.తా.) శిక్ష - భీతితో పాటూ, ఆయన (సు.తా.) కారుణ్యంపై ఆశ కూడా ఉండాలి.
A'raf 7:57
మరియు ఆయనే తన కారుణ్యానికి ముందు శుభవార్తలు తెచ్చే వాయువులను పంపేవాడు. ఎప్పుడైతే అవి బరువైన మేఘాలను ఎత్తుకొని వస్తాయో మేము వాటిని నిర్జీవమైన నగరాల వైపునకు తీసుకొని పోయి వాటి నుండి నీటిని కురిపిస్తాము. ఆ నీటి వలన పలు విధాలైన ఫలాలను ఉత్పత్తి చేస్తాము. ఇదే విధంగా మేము మృతులను కూడా లేపుతాము; ఈ విధంగానైనా మీరు హితబోధ స్వీకరిస్తారని![1]
———
[1] ఏ విధంగానైతే అల్లాహుతా'ఆలా వర్షం కురిపించి మృత భూమి నుండి పంట, ఫలాలను ఉత్పత్తి చేస్తాడో! అదే విధంగా, పునరుత్థాన దినమున మృతులను కూడా సజీవులుగా చేసి లేపుతాడు. అల్లాహుతా'ఆలా ప్రతిదీ చేయగల సమర్థుడు.
A'raf 7:58
మరియు సారవంతమైన నేల తన ప్రభువు ఆదేశంతో పుష్కలంగా పంటనిస్తుంది. మరియు నిస్సారమైన దాని (నేల) నుండి నాసిరకం పంట తప్ప మరేమీ రాదు. ఈ విధంగా మేము కృతజ్ఞతలు చూపేవారికి మా సూచనలను వివరిస్తాము.[1]
———
[1] దైవప్రవక్త ('స.అస) ప్రవచనం: "అల్లాహ్ (సు.తా.) నాకు ఇచ్చి పంపిన జ్ఞానం మరియు మార్గదర్శకత్వపు ఉదాహరణ, ధారాళంగా కురిసే వర్షం లాంటిది. దానిని కొన్ని ప్రాంతాలలోని నేల పీల్చుకొని మంచి పంటలు, ఫలాలు పుష్కలంగా ఇస్తుంది. మరికొన్ని గట్టి ప్రాంతాలు నీటిని నిలబెట్టి తరవాత పండే పంటలకు, నీరు పారటానికి ఉపయోగబడతాయి. కాని ఏ రాళ్ళ నేల అయితే నీటిని పీల్చుకోలేదో, లేక దానిని ఆపలేదో, అది దానిని ఏ విధంగాను ఉపయోగించుకోలేదు. ఈ ఉదాహరణలు ఆ మానవుని వంటివి ఎవడైతే అల్లాహ్ ధర్మాన్ని అర్థం చేసుకుంటాడో మరియు అల్లాహుతా'ఆలా నాకు ఇచ్చి పంపిన దానితో మంచి ఫలితం పొందుతాడో! అతడు తాను కూడా జ్ఞానం పొందుతాడు మరియు ఇతరులకు కూడా బోధిస్తాడు. మరొక వ్యక్తి ఉదాహరణ కూడా ఇలా ఉంది: ఎవడైతే స్వయంగా కూడా జ్ఞానం మరియు హితబోధ పొందడు, దేనితోనైతే నేను పంపబడ్డానో. ('స'హీ'హ్ బు'ఖారీ, కితాబ్ అల్-'ఇల్మ్, బాబ్ ఫ'ద్ల్ మినల్ 'ఇల్మ్).
A'raf 7:59
వాస్తవంగా, మేము నూహ్ ను అతని జాతివారి వద్దకు పంపాము[1]. అతను వారితో: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నాను." అని అన్నాడు.
———
[1] ఈ సూరహ్ లోని 7:59-93 ఆయత్ లలో ప్రవక్తల గాథలున్నాయి.
A'raf 7:60
అతని జాతి నాయకులు అన్నారు: "నిశ్చయంగా, మేము నిన్ను స్పష్టమైన తప్పు దారిలో చూస్తున్నాము!"
A'raf 7:61
దానికి (నూహ్) అన్నాడు: "నా జాతి ప్రజలారా! నాలో ఏ తప్పిదం లేదు. మరియు వాస్తవానికి నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను.
A'raf 7:62
నా ప్రభువు సందేశాలను మీకు అందజేస్తున్నాను మరియు (ధర్మ) బోధన చేస్తున్నాను. ఎందుకంటే! మీకు తెలియని విషయాలు అల్లాహ్ తరఫు నుండి నాకు తెలుస్తున్నాయి.
A'raf 7:63
మీలోని ఒక పురుషుని ద్వారా - దైవభీతి కలిగి ఉంటే, మీరు కరుణింపబడతారని - మిమ్మల్ని హెచ్చరించటానికి, మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు జ్ఞాపిక వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా?"
A'raf 7:64
అయినా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము అతనిని మరియు అతనితో పాటు ఓడలో ఉన్నవారిని కాపాడాము. మరియు మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన వారిని ముంచి వేశాము. నిశ్చయంగా, వారు గుడ్డిగా ప్రవర్తించిన జనం.
A'raf 7:65
ఇంకా మేము ఆద్ (జాతి) వద్దకు వారి సోదరుడైన హూద్ ను పంపాము[1]. అతను: "ఓ నా జాతి సోదరులారా! మీరు అల్లాహ్ నే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొకు ఆరాధ్య దైవుడు లేడు. ఏమీ? మీకు దైవభీతి లేదా ?" అని అన్నాడు.
———
[1] ఈ జాతివారు యమన్ ప్రాంతంలో ఇసుక పర్వతాలలో ఉండేవారు. ఈ ప్రాంతపు పేరు అహ'ఖాఫ్ అని పేర్కొనబడింది. ఈ ఎడారి 'ఉమాన్ మరియు హ'దరమౌత్ మధ్య ఉంది. హూద్ ('అ.స.) బహుశా మొదటి 'అరబ్బు ప్రవక్త. ఇంకా చూడండి, 89:8.
A'raf 7:66
అతని జాతివారిలో సత్యతిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు: "మేము, నిశ్చయంగా నిన్ను మూఢత్వంలో చూస్తున్నాము మరియు నిశ్చయంగా,నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము!"
A'raf 7:67
(హూద్) అన్నాడు: "నా జాతి ప్రజలారా! నాలో ఏ మూఢత్వం లేదు. మరియు నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను!
A'raf 7:68
"నేను మీకు నా ప్రభువు సందేశాలను అందజేస్తున్నాను మరియు నిశ్చయంగా, నేను మీకు నమ్మదగిన ఉపదేశకుడను.
A'raf 7:69
లేదా ! మిమ్మల్ని హెచ్చరించటానికి మీ ప్రభువు తరఫు నుండి హితోపదేశం - మీలోని ఒక పురుషుని ద్వారా వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా? నూహ్ జాతి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి, మీకు అపార బలాధిక్యతను ఇచ్చిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి[1]. ఈ విధంగా అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు!"
———
[1] చూడండి, 89:8 మరియు 41:15.
A'raf 7:70
వారన్నారు: "మేము అల్లాహ్ ను ఒక్కణ్ణి మాత్రమే ఆరాధించి, మా తండ్రితాతలు ఆరాధించే వాటిని వదలిపెట్టమని (చెప్పటానికి) నీవు మా వద్దకు వచ్చావా? ఒకవేళ నీవు సత్యవంతుడవే అయితే మమ్మల్ని భయపెట్టే దానిని (శిక్షను) తీసుకొనిరా!"[1]
———
[1] చూడండి, 8:32. ఇది ముష్రిక్ ఖురైషులు ము'హమ్మద్ ('సఅస) యొక్క ఇస్లాం ఆహ్వానానికి ఇచ్చిన జవాబు.
A'raf 7:71
(హూద్) అన్నాడు: "వాస్తవానికి మీపై మీ ప్రభువు యొక్క ఆగ్రహం మరియు శిక్ష విరుచుకుపడ్డాయి, అల్లాహ్ ఏ ప్రమాణం ఇవ్వకున్నా - మీరు మరియు మీ తండ్రితాతలు పెట్టుకున్న (కల్పిత) పేర్ల విషయంలో - నాతో వాదులాడుతున్నారా? సరే, అయితే మీరు నిరీక్షించండి, మీతో పాటు నేనూ నిరీక్షిస్తాను!"
A'raf 7:72
కావున తుదకు మేము అతనిని (హూద్ ను) మరియు అతని తోటి వారిని మా అనుగ్రహంతో రక్షించాము. మరియు మా సూచనలు అసత్యాలని తిరస్కరించిన వారిని నిర్మూలించాము[1]. ఎందుకంటే వారు విశ్వసించకుండా ఉన్నారు.
———
[1] వారిపై ఎనిమిది రోజులు, ఏడు రాత్రులు భయంకరమైన తుఫాను గాలి, విరుచుకు పడింది. వారు కోసిన ఖర్జూర చెట్ల వలె పడిపోయారు. చూడండి, 69:6-8, 11:53-56, 46:24-25.
A'raf 7:73
ఇక సమూద్ జాతి వారి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ ను పంపాము[1]. అతను వారితో! "నా జాతి సోదరులారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి ఒక స్పష్టమైన సూచన వచ్చింది. ఇది అల్లాహ్ మీకు ఒక అద్భుత సూచనగా పంపిన ఆడ ఒంటె. కావున దీనిని అల్లాహ్ భూమిపై మేయటానికి వదలిపెట్టిండి. మరియు హాని కలిగించే ఉద్దేశంతో దీనిని ముట్టుకోకండి. ఆలా చేస్తే మిమ్మల్ని బాధాకరమైన శిక్ష పట్టుకుంటుంది.[2]
———
[1] నబాతియన్ - తెగకు చెందిన స'మూద్ జాతివారు, 'ఆద్ జాతికి చెందిన వారు. కావున వారు రెండవ 'ఆద్ జాతి వారిగా పిలువబడ్డారు. వారు 'హిజా'జ్ ఉత్తరభాగంలో ఉండే వారు. ఆ ప్రాంతం, వాది అల్-ఖురా అనబడుతొంది. వారు ఆ 'హిజ్ర్ ప్రాంతంలో గుట్టలను తొలిచి గృహాలను నిర్మించారు. వాటి పేరు మదాయిన్ 'సాలి'హ్. ఈ రోజు కూడా అవి ఈ పేరుతోనే పిలుబడతాయి. మదాయన్ 'సాలి'హ్ మదీనా మునవ్వరా మరియు తబూక్ ల మధ్య ఉన్నాయి. ఇప్పటికి కూడా అక్కడ స'మూద్ జాతి వారు కొండలను తొలిచి నిర్మించిన కట్టడాలు ఉన్నాయి. [2] చూడండి, 54:27.
A'raf 7:74
"మరియు ఆయన, ఆద్ జాతి వారి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి మిమ్మల్ని భూమిపై స్థిరపరచిన విషయం జ్ఞాపకం చేసుకోండి. మీరు దాని మైదానాలలో కోటలను నిర్మించుకున్నారు. మరియు కొండలను తొలచి గృహాలను నిర్మించుకుంటున్నారు. కావున అల్లాహ్ అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు భూమిపై అనర్థాన్ని, కల్లోల్లాన్ని రేకెత్తించకండి!" అని అన్నాడు.
A'raf 7:75
(సాలిహ్) జాతి వారిలోని అహంకారులైన నాయకులు విశ్వసించిన బలహీనవర్గం వారితో అన్నారు: "సాలిహ్ తన ప్రభువు పంపిన ప్రవక్త అని మీకు నిశ్చయంగా తెలుసా? దానికి వారు: "మేము నిశ్చయంగా, అతని ద్వారా పంపబడిన సందేశాన్ని విశ్వసిస్తున్నాము." అని జవాబిచ్చారు.
A'raf 7:76
ఆ అహంకారులన్నారు: "మీరు విశ్వసించిన దానిని మేము నిశ్చయంగా తిరస్కరిస్తున్నాము!"
A'raf 7:77
ఆ తరువాత వారు ఆ ఆడఒంటె వెనుక కాలి మోకాలి పెద్దనరం కోసి (చంపి), తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, అతనితో అన్నారు: "ఓ సాలిహ్! నీవు నిజంగానే సందేశహరుడవైతే నీవు మమ్మల్ని బెదిరించే, ఆ శిక్షను తీసుకురా!"
A'raf 7:78
అప్పుడు వారిని భూకంపం పట్టుకున్నది[1]. వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలుగా మారి) పడిపోయారు.
———
[1] ఇక్కడ రజ్ ఫతున్: భూకంపం, అని ఉంది. మరొకచోట 54:31లో 'సై'హతున్: భయంకర అరుపు (ధ్వని), అని వ్రాయబడి ఉంది. బహశా ఈ రెండు ఒకేసారి వచ్చి ఉంటాయి.
A'raf 7:79
పిదప అతను (సాలిహ్) వారి నుండి తిరిగి పోతూ అన్నాడు: "నా జాతి ప్రజలారా! వాస్తవంగా, నేను నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేశాను. మరియు మీకు మంచి సలహాలను ఇచ్చాను, కానీ మీరు మంచి సలహాలు ఇచ్చే వారంటే ఇష్టపడలేదు!"
A'raf 7:80
ఇక లూత్![1] అతను తన జాతి వారితో: "ఏమీ? మీరు ఇంతకు పూర్వం ప్రపంచంలో ఎవ్వరూ చేయని అసహ్యకరమైన పనులు చేస్తారా?" అని అడిగిన విషయం జ్ఞప్తికి తెచ్చుకోండి.
———
[1] లూ'త్ ('అ.స.), ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క సోదరుని కుమారులు. అతని వృత్తాంతం, 11:69-83లలో వివరంగా ఉంది. ఇతను ఇబ్రాహీమ్('అ.స.) ను విశ్వసించారు. ఈయన నివసించిన నగరం, ''సోడోమ్, జోర్డన్ మరియు బైతుల్ మఖ్దిస్ మధ్య మృత సముద్రం ప్రాంతంలో ఉంది. ఇతని జాతివారు చరిత్రలో మొదటిసారి పురుషులు-పురుషులతో లైంగిక క్రియ (Sodomy) చేయసాగారు. స్త్రీలను, వదలి, పురుషులు-పురుషులతో తమ కామఇచ్ఛను పూర్తి చేసుకొనేవారు. ఇది మహాపాపం. కాని ఈ రోజు కొన్ని పశ్చిమ దేశాలలో ఇది నేరమూ కాదు, పాపమూ కాదు. ఇది వారి దగ్గర చట్టరీత్యా ఆమోదించబడింది. షరీయత్ లలో దీని శిక్ష వ్యభిచారానికి ఇవ్వ వలసిన శిక్షయే!
A'raf 7:81
"వాస్తవానికి, మీరు స్త్రీలను వదలి కామంతో పురుషుల వద్దకు పోతున్నారు. వాస్తవంగా, మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు.
A'raf 7:82
కాని అతని జాతి వారి జవాబు కేవలం ఇలాగే ఉండింది:[1] "వీరిని మీ నగరం నుండి వెళ్ళగొట్టండి. వాస్తవానికి వీరు తమను తాము మహా పవిత్రులని అనుకుంటున్నారు!"
———
[1] చూడండి, 27:56.
A'raf 7:83
ఆ పిదప మేము అతనినీ మరియు అతని ఇంటివారినీ - అతని భార్యను తప్ప - రక్షించాము. ఆమె వెనుక ఉండిపోయిన వారిలో చేరిపోయింది.[1]
———
[1] చూడండి, 11:81 మరియు 66:10.
A'raf 7:84
మరియు మేము వారిపై (రాళ్ళ) వర్షాన్ని కురిపించాము.[1] చూడండి! ఆ అపరాధుల ముగింపు ఎలా జరిగిందో!
———
[1] చూడండి, 11:82.
A'raf 7:85
మరియు మేము మద్ యన్ జాతి వారి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము).[1] అతను వారితో అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చి వున్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై సంస్కరణ జరిగిన తరువాత కల్లోల్లాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులో అయితే, ఇదే మీకు మేలైనది.
———
[1] మద్ యన్: ఒక తెగ మరియు నగరపు పేరు. వారి వద్దకు షు'ఐబ్ ('అ.స.) ప్రవక్తగా పంపబడ్డారు. దీని మరొక పేరు అయ్ కహ్.అది ఇప్పటి 'అఖబా అగాధం (Gulf of Aqaba) నుండి పడమటి వైపుకు సినాయి ద్వీపకల్పం (Sinai Peninsula) మరియు మో'ఆబ్ (Moab) పర్వతాల వరకు మరియు మృత సముద్రాని (Dead Sea)కి తూర్పు దిక్కున ఉంది. అక్కడ నివసించే వారు అమోరైట్ (Amorite) తెగకు చెందిన 'అరబ్బులు. షు'ఐబ్ ('అ.స.) మరొక పేరు ఎత్రో (Jethro), ఇతనే మూసా ('అ.స.) యొక్క భార్య తండ్రి అని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. ఇంకా చూడండి, 26:176.
A'raf 7:86
మరియు ఆయనను విశ్వసించిన వారిని, అల్లాహ్ మార్గం నుండి నిరోధించటానికి వారిని బెదరిస్తూ, అది వక్రమమైనదని చూపగోరి ప్రతి మార్గంలో కూర్చోకండి. మీరు అల్పసంఖ్యలో ఉన్నప్పుడు ఆయన మీ సంఖ్యను అధికం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు కల్లోలం రేకెత్తించిన వారి గతి ఏమయిందో చూడండి.
A'raf 7:87
మరియు నా ద్వారా పంపబడిన దానిని (సందేశాన్ని) మీలో ఒక వర్గం వారు విశ్వసించి, మరొక వర్గం వారు విశ్వసించకపోతే! అల్లాహ్ మన మధ్య తీర్పు చేసే వరకూ సహనం వహించండి. మరియు ఆయనే అత్యుత్తమమైన న్యాయాధిపతి!"[1]
———
[1] చూడండి, 9:52. 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 9, 'హదీస్' నం. 252, 266, 267, పు - 2 'హ. 539.
A'raf 7:88
దురహంకారులైన అతని జాతి నాయకులన్నారు: "ఓ షుఐబ్! మేము నిన్నూ మరియు నీతో పాటు విశ్వసించిన వారినీ, మా నరగం నుండి తప్పక వెడలగొడ్తాము. లేదా మీరు తిరిగి మా ధర్మంలోకి రండి!" అతనన్నాడు: "మేము దానిని అసహ్యించుకున్నప్పటికీ (మీ ధర్మంలోకి చేరాలా)?"
A'raf 7:89
(ఇంకా ఇలా అన్నాడు): "వాస్తవంగా అల్లాహ్ మాకు (మీ ధర్మం నుండి) విముక్తి కలిగించిన తరువాత కూడా మేము తిరిగి మీ ధర్మంలోకి చేరితే! మేము అల్లాహ్ పై అబద్ధం కల్పించిన వారమవుతాము. మా ప్రభువైన అల్లాహ్ కోరితే తప్ప! మేము తిరిగి దానిలో చేరలేము. మా ప్రభువు జ్ఞానం ప్రతి వస్తువునూ ఆవరించి ఉంది. మేము అల్లాహ్ పైననే ఆధరపడి ఉన్నాము. 'ఓ మా ప్రభూ! మా మధ్య మరియు మా జాతివారి మధ్య న్యాయంగా తీర్పు చేయి. మరియు నీవే అత్యుత్తమమైన తీర్పు చేసేవాడవు!"
A'raf 7:90
మరియు అతన జాతిలోని సత్యతిరస్కారులైన నాయకులు అన్నారు: "ఒకవేళ మీరు షుఐబ్ ను అనుసరిస్తే! నిశ్చయంగా మీరు నష్టం పొందిన వారవుతారు."
A'raf 7:91
అప్పుడు వారిని ఒక భూకంపం పట్టుకున్నది[1] మరియు వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలై) పడిపోయారు.
———
[1] ఇక్కడ రజ్ ఫతున్ - భూకంపం అని, 11:94లో 'సై'హతున్ - భయంకరమైన అరుపు (ధ్వని) అని, మరియు 26:189లో "జుల్లతున్ - మేఘాల ఛాయ అని ఉంది. అన్నీ ఒకదాని వెంట ఒకటి, ఒకేసారి వచ్చాయన్నమాట, (ఇబ్నె-కసీ'ర్).
A'raf 7:92
షుఐబ్ ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించినవారు అక్కడ ఎన్నడూ నివసించి ఉండనే లేదన్నట్లుగా నశించి పోయారు. షుఐబ్ ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారే వాస్తవానికి నష్టం పొందిన వారయ్యారు.
A'raf 7:93
(షుఐబ్) ఇలా అంటూ వారి నుండి మరలి పోయాడు: "నా జాతి ప్రజలారా! వాస్తవంగా నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేశాను మరియు మీకు హితోపదేశం చేశాను. కావున ఇపుడు సత్యతిరస్కారులైన జాతివారి కొరకు నేనెందుకు దుఃఖించాలి?"
A'raf 7:94
మరియు మేము ఏ నగరానికి ప్రవక్తను పంపినా! దాని ప్రజలను ఆపదలకు మరియు దౌర్భగ్యానికి గురి చేయకుండా ఉండలేదు, వారు ఇలాగైనా వినమ్రులు అవుతారేమోనని!
A'raf 7:95
ఆ తరువాత వారి దుస్థితిని, సుస్థితిగా మార్చిన పిదప వారు హాయిగా ఉంటూ, ఇలా అన్నారు: "వాస్తవానికి కష్టసుఖాలు మా పూర్వీకులకు కూడా సంభవించాయి." కావున మేము వారిని ఆకస్మాత్తుగా పట్టుకున్నాము మరియు వారు దానిని గ్రహించలేక పోయారు.[1]
———
[1] చూడండి, 6:42-45.
A'raf 7:96
మరియు ఒకవేళ ఆ నగరవాసులు విశ్వసించి, దైవభీతి కలిగి ఉంటే - మేము వారిపై ఆకాశం నుండి మరియు భూమి నుండి - సర్వశుభాల నొసంగి ఉండేవారం. కాని వారు (ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు, కనుక వారు చేసిన కర్మలకు ఫలితంగా మేము వారిని శిక్షించాము.
A'raf 7:97
ఏమీ? ఈ నగరాలవాసులు, తాము నిద్రపోయేటప్పుడు రాత్రి సమయమన వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా?
A'raf 7:98
లేదా ఈ నగరాల వాసులు, పట్టపగలు తాము కాలక్షేపంలో ఉన్నప్పుడు వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా?
A'raf 7:99
ఏమీ? వారు అల్లాహ్ యుక్తి (శిక్ష) నుండి నిర్భయంగా ఉన్నారా? నాశనం కాబోయే వారు తప్ప ఇతర జాతి వారెవ్వరూ అల్లాహ్ యుక్తి గురించి నిర్భయంగా ఉండజాలరు.[1]
———
[1] చూడండి, 3:54, 33:62 మరియు 35:43.
A'raf 7:100
ఏమీ? పూర్వపు భూలోకవాసుల తరువాత, భూమికి వారసులయిన వారికి, మేము కోరితే వారి పాపాల వలన వారికి కూడా శిక్ష విధించగలమని ఉపదేశం అందలేదా? మరియు మేము, వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాము, దాని వల్ల వారు (మా హితోపదేశాన్ని) వినలేకున్నారు.
A'raf 7:101
ఈ నగరాల వృత్తాంతాలను కొన్నింటిని మేము నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన (నిదర్శనాలు) తీసుకొని వచ్చారు.[1] కాని వారు ముందు తిరస్కరించిన దానిని మరల విశ్వసించలేదు. ఈ విధంగా అల్లాహ్ సత్యతిరస్కారుల హృదయాలపై ముద్ర వేస్తాడు. [2]
———
[1] చూడండి, 17:15. [2] అల్లాహ్ (సు.తా.) కు ప్రతిదానిని గురించి, దాని భూతకాలపు, వర్తమానకాలపు మరియు భవిష్యత్తు కాలపు విషయాలన్నీ తెలుసు. ఇదంతా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. అల్లాహుతా'ఆలా సర్వవ్యాప్తి, సర్వస్వపరిచితుడు. కాబట్టి, ఇక్కడ: "సత్యతిరస్కారుల హృదయాల మీద ముద్రవేయబడి ఉంది." అని చెప్పబడింది. ('స. బు'ఖారీ, తఫ్సీర్ సూ. అల్లైల్)
A'raf 7:102
మరియు మేము వారిలో చాలా మందిని తమ వాగ్దానాన్ని పాటించే వారిగా చూడలేదు. మరియు వాస్తవానికి వారిలో చాలా మందిని దుష్టులుగానే (ఫాసిఖీన్ గానే) పొందాము (చూశాము).
A'raf 7:103
ఆ తరువాత మేము మూసాను మా సూచనలతో ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. వారు వాటి (మా సూచనల) పట్ల దుర్మార్గంతో ప్రవర్తించారు. కావున చూడండి, దౌర్జన్యపరుల గతి ఏమయిందో!
A'raf 7:104
మరియు మూసా అన్నాడు: "ఓ ఫిర్ఔన్! నేను నిశ్చయంగా, సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను!
A'raf 7:105
"అల్లాహ్ ను గురించి సత్యం తప్ప మరే విషయాన్ని పలకని బాధ్యత గలవాడను. వాస్తవానికి, నేను మీ వద్దకు, మీ ప్రభువు తరఫు నుండి స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాను, కావున ఇస్రాయీల్ సంతతి వారిని నా వెంట పోనివ్వు."[1]
———
[1] ఇస్రాయీ'ల్ సంతతి వారు అసలు సిరియా (షామ్) ప్రాంతపు వాసులు. యూసుఫ్ ('అ.స.) కాలంలో వారు ఈజిప్టులో స్థిరపడ్డారు. కాలచక్రంలో ఈజిప్టురాజులు మారిప పోయారు. వారి ప్రాధాన్యత తగ్గి, వారు ఫిర్'ఔనుల రాజరికంలో బానిసలుగా మారిపోయారు. మరియు ఎన్నో కష్టాలకు అవమానాలకు గురి చేయబడ్డారు. వారికి స్వాతంత్ర్యం ఇప్పించటానికి అల్లాహ్ (సు.తా.) మూసా ('అ.స.)ను ప్రవక్తగా చేసి పంపాడు.
A'raf 7:106
(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు ఏదైనా సూచనను తీసుకొని వచ్చి ఉంటే - నీవు సత్యవంతుడవే అయితే - దానిని తీసుకొనిరా!"
A'raf 7:107
అప్పుడు (మూసా) తన చేతికర్రను విసిరాడు, అకస్మాత్తుగా అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా (సుఅబాన్ గా) మారిపోయింది.
A'raf 7:108
మరియు అతడు తన చేతిని బయటికి తీశాడు. ఇక అది చూసే వారికి తెల్లగా మెరుస్తూ కనిపించింది.
A'raf 7:109
(ఇది చూసి), ఫిర్ఔన్ జాతి నాయకులు అన్నారు: "నిశ్చయంగా, ఇతడు నేర్పు గల ఒక గొప్ప మాంత్రికుడు!"
A'raf 7:110
(ఫిర్ఔన్ అన్నాడు): "ఇతడు మిమ్మల్ని మీ భూమి నుండి వెడల గొట్ట గోరుతున్నాడు. అయితే! మీ సలహా ఏమిటి?"
A'raf 7:111
వారన్నారు: "అతనికి (మూసాకు) మరియు అతని సోదరునికి కొంత వ్యవధి నిచ్చి, అన్ని నగరాలకు బంటులను పంపు.
A'raf 7:112
"వారు నిపుణులైన ప్రతి మాంత్రికుణ్ణి నీ వద్దకు తీసుకొని వస్తారు."[1]
———
[1] చూడండి, 20:57-59.
A'raf 7:113
మరియు మాంత్రికులందరూ ఫిర్ఔన్ వద్దకు వచ్చి: "ఒకవేళ మేము గెలిస్తే మాకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది కదా!" అని అన్నారు.
A'raf 7:114
(ఫిర్ఔన్) అన్నాడు: "అవును, నిశ్చయంగా మీరు నా సాన్నిధ్యాన్ని కూడా పొందుతారు."
A'raf 7:115
వారన్నారు: "ఓ మూసా! (ముందు) నీవు విసురుతావా? లేక మేము విసరాలా?"
A'raf 7:116
(మూసా) అన్నాడు: "(ముందు) మీరే విసరండి!" వారు (తమ కర్రలను) విసిరి, ప్రజల చూపులను మంత్రముగ్ధం చేస్తూ వారికి భయం కలిగించే ఒక అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించారు.
A'raf 7:117
మేము మూసాకు: "నీ చేతికర్రను విసురు." అని ఆదేశమిచ్చాము. అప్పుడది వారి (మాంత్రికుల) బూటక (మాయాజాలాన్ని) మ్రింగి వేసింది.
A'raf 7:118
ఈ విధంగా సత్యం స్థాపితమయ్యింది మరియు వారు (మాంత్రికులు) చేసిందంతా విఫలమయ్యింది.
A'raf 7:119
ఈ విధంగా వారక్కడ అపజయం పొంది అవమానంతో కృంగిపోయారు.
A'raf 7:120
మరియు మాంత్రికులు సాష్టాంగ పడ్డారు.
A'raf 7:121
(మాంత్రికులు) అన్నారు: "మేము సర్వలోకాల ప్రభువును విశ్వసించాము.
A'raf 7:122
మూసా మరియు హారున్ ల ప్రభువును."
A'raf 7:123
ఫిర్ఔన్ అన్నాడు: "నేను అనుమతి ఇవ్వక ముందే మీరు అతనిని విశ్వసించారా? నిశ్చయంగా, మీరందరూ కలిసి ఈ నగరం నుండి దాని వాసులను వెడల గొట్టటానికి పన్నిన పన్నాగమిది, (దీని పరిణామం) మీరిప్పుడే తెలుసుకోగలరు.
A'raf 7:124
"నేను తప్పక మీ ఒక ప్రక్క చేతులను మరొక ప్రక్క కాళ్ళను నరికిస్తాను. ఆ తరువాత మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను."
A'raf 7:125
వారు ఇలా జవాబిచ్చారు: "నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది!
A'raf 7:126
మరియు మా ప్రభువు తరఫు నుండి మా వద్దకు వచ్చిన సూచనలను, మేము విశ్వసించామనే కదా! నీవు మాతో పగతీర్చుకోదలచావు." (ఇలా ప్రార్థించారు): "ఓ మా ప్రభూ! మాకు సహనమొసంగు. మేము నీకు విధేయులముగా (ముస్లింలముగా) మృతినొందేటట్లు చేయి!"
A'raf 7:127
మరియు ఫిర్ఔన్ జాతి నాయకులు అతనితో అన్నారు: "ఏమీ? భూమిలో కల్లోలం రేకెత్తించటానికి మరియు నిన్నూ నీ దేవతలను విడిచి పోవటానికి, నీవు మూసాను మరియు అతని జాతి వారిని వదులుతున్నావా?" అతడు (ఫిర్ఔన్) జవాబిచ్చాడు: "మేము తప్పక వారి కుమారులను చంపి వారి కుమార్తెలను బ్రతకనిస్తాము. మరియు నిశ్చయంగా, మేము వారిపై ప్రాబల్యం కలిగి ఉన్నాము."
A'raf 7:128
మూసా తన జాతి వారితో అన్నాడు: "అల్లాహ్ సహాయం కోరండి మరియు సహనం వహించండి. నిశ్చయంగా ఈ భూమి అల్లాహ్ దే! ఆయన తన దాసులలో, తాను కోరిన వారిని దానికి వారసులుగా చేస్తాడు. మరియు అంతిమ (సాఫల్యం) దైవభీతి గలవారిదే!"
A'raf 7:129
(మూసా జాతివారు) అన్నారు: "నీవు రాక పూర్వమూ మరియు నీవు వచ్చిన తర్వాతనూ మేము బాధించబడ్డాము!" (మూసా) జవాబిచ్చాడు: "మీ ప్రభువు త్వరలోనే మీ శత్రువులను నాశనం చేసి మిమ్మల్ని భూమిలో ఖలీఫాలుగా[1] చేసినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆయన చూస్తాడు?"
———
[1] యస్త'ఖ్లిఫకుమ్: అంటే మిమ్ము ఉత్తరాధికారులుగా, వారసులుగా లేక నాయకులుగా చేస్తాడు.
A'raf 7:130
మరియు వాస్తవానికి, మేము ఫిర్ఔన్ జాతి వారిని - బహుశా వారికి తెలివి వస్తుందేమోనని - ఎన్నో సంవత్సరాల వరకు కరువుకు, ఫలాల నష్టానికి గురిచేశాము.
A'raf 7:131
ఆ పిదప వారికి మంచికాలం వచ్చినపుడు వారు: "మేము దీనికే అర్హులం!" అని అనేవారు. కాని వారికి కష్టకాలం దాపురించి నపుడు, వారు మూసా మరియు అతనితో పాటు ఉన్నవారిని తమకు అపశకునంగా పరిగణించేవారు.[1] వాస్తవానికి వారి అపశకునాలన్నీ అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి, కాని వారిలో చాలా మందికి తెలియదు.
———
[1] 'తాఇ'రున్: ఎగురుట. 'తాఇ'రుహుమ్: అపశకునం. ప్రాచీన కాలంలో శుభ - అశుభ శకునాలను పక్షులను ఎగుర వేసి అంచనా వేసేవారు. శకునాలు చూడటం ఇస్లాంలో 'హరాం. శకునాలను గురించి ఇంకా చూడండి, 3:49, 5:110, 17:13, 27:47 మరియు 36:18-19.
A'raf 7:132
మరియు వారు (మూసాతో) అన్నారు: "నీవు మమ్మల్ని భ్రమింపజేయటానికి ఏ సూచనను తెచ్చినా మేము నిన్ను నమ్మేవారం కాము!"
A'raf 7:133
కావున మేము వారిపై జలప్రళయం (తూఫాన్), మిడుతల దండు, పేనులు, కప్పలు మరియు రక్తం మొదలైన స్పష్టమైన సూచనలను పంపాము.[1] అయినా వారు దురహంకారం చూపారు ఎందుకంటే వారు మహా అపరాధులై ఉండిరి.
———
[1] ఈ తొమ్మిది అద్భుత సూచనలు: 1) కర్ర, 2) చేయి తెల్లగా మారుట, 3) కరువు (ఫల, పంటల నష్టం, 4) జల ప్రళయం (తుఫాను), 5) మిడుతల దండు, 6) పేనులు, 7) కప్పలు, 8) రక్తం, 9) సముద్రంలో త్రోవ.
A'raf 7:134
మరియు వారిపైకి ఆపద వచ్చినపుడు వారనేవారు: "ఓ మూసా! నీ ప్రభువు నీకిచ్చిన వాగ్దానం ఆధారంగా నీవు మా కొరకు ప్రార్థించు! ఒకవేళ నీవు మా నుండి ఈ ఆపదను తొలగిస్తే మేము నిన్ను విశ్వసిస్తాము; మరియు ఇస్రాయీల్ సంతతి వారిని తప్పక నీ వెంట పంపుతాము."
A'raf 7:135
కానీ, ఒక నిర్ణీతకాలం వరకు వారి నుండి ఆపదను తొలగించగానే - ఆ కాలానికి వారు చేరుకోవలసిన వారే కాబట్టి - వారు తమ వాగ్దానాన్ని భంగపరిచేవారు!
A'raf 7:136
కావున మేము వారికి ప్రతీకారం చేశాము మరియు వారిని సముద్రంలో ముంచి వేశాము; ఎందుకంటే! వాస్తవానికి వారు మా సూచనలను అసత్యాలని తిరస్కరించారు మరియు వాటిని లక్ష్యపెట్టకుండా ఉన్నారు.
A'raf 7:137
మరియు వారి స్థానంలో బలహీనులుగా ఎంచబడేవారిని మేము శుభాలతో నింపిన, ఆ దేశపు తూర్పు భాగాలకు మరియు పశ్చిమ భాగాలకు వారసులుగా చేశాము.[1] ఈ విధంగా నీ ప్రభువు ఇస్రాయీల్ సంతతి వారికి చేసిన ఉత్తమమైన వాగ్దానం, వారు ఓర్పు వహించి నందుకు పూర్తయింది.[2] మరియు ఫిర్ఔన్ మరియు అతని జాతి వారు ఉత్పత్తి చేసిన వాటిని మరియు ఎత్తిన (నిర్మించిన) కట్టడాలను నాశనం చేశాము.[3]
———
[1] చూడండి, 3:26. [2] ఈ వాగ్దానం కొరకు చూడండి, 7:128-129 మరియు 28:5-6. [3] ఇస్రాయీ'ల్ సంతతివారు, బహుశా సూయుజ్ అగాధం (Gulf of Suez) దాటి సినాయి వైపుకు వెళ్ళారు. మరియు ఫిర్'ఔను మరియు అతని సైన్యం అందులో మునిగి పోయారు.
A'raf 7:138
మరియు మేము ఇస్రాయీల్ సంతతి వారిని సముద్రం దాటించిన తరువాత వారు (నడుస్తూ) తమ విగ్రహాలను ఆరాధించే ఒక జాతి వద్దకు చేరారు.[1] వారన్నారు: "ఓ మూసా! వీరి ఆరాధ్య దైవాల వలే మాకు కూడా ఒక ఆరాధ్య దైవాన్ని నియమించు." (దానికి మూసా) జవాబిచ్చాడు: "నిశ్చయంగా, మీరు జ్ఞానహినులైన జాతికి చెందినవారు."
———
[1] ఈ ప్రజలు ఎవరో ఖుర్ఆన్ లో లేదు. వారు అమాలేకీయ (Amalekites) తెగకు చెందిన 'అరబ్బులు కావచ్చు! వీరు దక్షిణ ఫలస్తీన్ లో మరియు సినాయి ద్వీపకల్పం (Peninsula)లో నివసించేవారు.
A'raf 7:139
"నిశ్చయంగా వీరు ఆచరిస్తున్నందుకు (విగ్రహారాధన చేస్తున్నందుకు) నాశనం చేయబడతారు. వీరు చేస్తున్నదంతా నిరర్థకమైనదే."
A'raf 7:140
(మూసా ఇంకా) ఇలా అన్నాడు: "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి మరొక ఆరాధ్యదైవాన్ని మీ కొరకు అన్వేషించాలా? వాస్తవానికి ఆయనే (మీకాలపు) సర్వలోకాల వారిపై మీకు ఘనతను ప్రసాదించాడు కదా!"
A'raf 7:141
మరియు మేము మిమ్మల్ని ఫిర్ఔన్ జాతి వారి నుండి విముక్తి కలిగించిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వారు మిమ్మల్ని ఘోర బాధకు గురిచేస్తూ ఉన్నారు. మీ కుమారులను చంపి, మీ స్త్రీలను సజీవులుగా వదులుతూ ఉన్నారు. మరియు ఇందు మీ ప్రభువు తరఫు నుండి మీకొక గొప్ప పరీక్ష ఉండింది.
A'raf 7:142
మరియు మేము మూసా కొరకు (సినాయి కొండపై) ముప్పై రాత్రుల (గడువు) నిర్ణయించాము. తరువాత పది (రాత్రులు) పొడిగించాము. ఈ విధంగా అతని ప్రభువు నిర్ణయించిన నలభై రాత్రుల గుడువ పూర్తయ్యింది. మూసా తన సోదరుడగు హారూన్ తో అన్నాడు: "నీవు నా జాతి ప్రజలలో నాకు ప్రాతినిథ్యం వహించు మరియు సంస్కరణకు పాటు పడు మరియు అరాచకాలు చేసేవారి మార్గాన్ని అనుసరించకు."
A'raf 7:143
మరియు మూసా మేము నిర్ణయించిన సమయానికి (మా నిర్ణీత చోటుకు) వచ్చినపుడు, అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. (మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు నీ దర్శన భాగ్యమివ్వు (కనిపించు). నేను నిన్ను చూడదలచాను!" (అల్లాహ్) అన్నాడు: "నీవు నన్ను (ఏ మాత్రం) చూడలేవు! కాని ఈ పర్వతం వైపుకు చూడు! ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండగలిగితే, అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో!" [1] అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది భస్మమై పోయింది మరియు మూసా స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత (మూసా) అన్నాడు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు, నేను పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలు తున్నాను మరియు నేను విశ్వసించేవారిలో మొట్టమొదటి వాడను." [2]
———
[1] 'స'హీ'హ్ 'హదీస్'ల ద్వారా విశదమయ్యేది ఏమిటంటే, ఇహలోక జీవితంలో ఏ మానవుడు కూడా అల్లాహ్ (సు.తా.) ను చూడలేడు. అహ్లె-సున్నత్ వారి అఖీదహ్ ఏమిటంటే పునరుత్థాన దినమున అహ్లె ఈమాన్ (విశ్వాసు)లకు అల్లాహుతా'ఆలా దర్శనభాగ్యం లభిస్తుంది. మరియు స్వర్గంలో కూడా వారికి అల్లాహ్ (సు.తా.) దర్శనం లభిస్తుంది. [2] ఇది రెండవసారి మూసా ('అ.స.) అల్లాహ్ (సు.తా.)తో మాట్లాడింది. మొదటిసారి అతను 'తువా వాదిలో వెలుగు చూసి దాని నుండి కొరివి తీసుకురావటానికి పోయినప్పుడు, అల్లాహుతా'ఆలా అతనిని ప్రవక్తగా ఎన్నుకొని ఫిర్'ఔను జాతి వద్దకు అద్భుత చిహ్నాలతో పంపాడు.
A'raf 7:144
(అల్లాహ్) అన్నాడు: "ఓ మూసా ప్రవక్త పదవికి మరియు సంభాషించటానికి - నిశ్చయంగా, నేను ప్రజలందరిలో, నిన్ను ఎన్నుకున్నాను. కావున నేను నీకిచ్చిన దానిని తీసుకొని, కృతజ్ఞులలో చేరు."
A'raf 7:145
మరియు మేము అతని కొరకు, ఫలకాల మీద ప్రతి విధమైన ఉపదేశాన్ని ప్రతి వ్యవహారానికి సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చి, అతనితో (మూసాతో) అన్నాము: "వీటిని గట్టిగా పట్టుకో! మరియు వీటి ఉత్తమ ఉపదేశాలను అనుసరించమని నీ జాతి వారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను అవిధేయుల (ఫాసిఖూన్ ల) నివాసాన్ని మీకు చూపుతాను."[1]
———
[1] ఇది అమాలోకీయుల షామ్ రాజ్యం కావచ్చు. వారు అల్లాహుతా'ఆలాకు అవిధేయులై ఉండిరి. (ఇబ్నె-కసీ'ర్).
A'raf 7:146
ఏ హక్కూ లేకుండా భూమిపై దురహంకారంతో వ్యవహరించే వారిని నేను నా సూచనల (ఆయాత్ ల) నుండి దూరం చేస్తాను. మరియు వారు ఏ సూచనను (ఆయత్ ను) చూసినా దానిని విశ్వసించరు.[1] ఒకవేళ సక్రమమైన మార్గం వారి ముందుకు వచ్చినా, వారు దానిని అవలంబించరు. కాని వారు తప్పు దారిని చూస్తే దానిని అవలంబిస్తారు.[2] ఎందుకంటే వాస్తవానికి, వారు మా సూచనలను (ఆయాత్ లను) అబద్ధాలని తిరస్కరించారు మరియు వాటి నుండి నిర్లక్ష్యులై ఉన్నారు.[3]
———
[1] చూడండి, 10:96-97. [2] ఈ విషయం ఈ కాలంలో గూడ జరుగుతోంది. ఈ కాలపు చాలా మంది ముస్లింలు కూడా మంచి నుండి దూరమై పోతున్నారు మరియు చెడును అవలంబిస్తున్నారు. [3] చూడండి, 96:67.
A'raf 7:147
మరియు మా సూచనలను (ఆయాత లను) మరియు పరలోక దర్శనాన్ని (పునరుత్థాన దినాన్ని) అబద్ధాలని తిరస్కరించిన వారు చేసిన కర్మలన్నీ వ్యర్థమవుతాయి. ఏమీ? వారు కేవలం తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా పొందగలరా!
A'raf 7:148
మరియు మూసా జాతి వారు, అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవు దూడ విగ్రహాన్ని తయారు చేశారు. దానిలో నుండి (ఆవు అరుపు వంటి) ధ్వని వచ్చేది. ఏమీ? అది వారితో మాట్లాడజాలదని మరియు వారికి ఏ విధమైన మార్గదర్శకత్వం చేయజాలదని వారికి తెలియదా? అయినా వారు దానిని (దైవంగా) చేసుకొని పరమ దుర్మార్గులయ్యారు.[1]
———
[1] మూసా ('అ.స.) 'తూర్ పర్వతంపైకి నలభై రాత్రుల కొరకు వెళ్ళినప్పుడు సామిరి ప్రజల ఆభరణాలతో ఒక ఆవు దూడ విగ్రహాన్ని తయారు చేస్తాడు. అందులో నుండి గాలి దూరినప్పుడు ఆవు అరుపు వంటి అరుపు వచ్చేది. దానిని అతడు ఇదే మీ ఆరాధ్య దైవం అని అంటాడు. ప్రజలు మూఢత్వంలో అతనిని అనుసరించి దానిని పూజించ సాగుతారు. ఏ విధంగానైతే ఈ నాడు కూడా, ఈ విధమైన మూఢనమ్మకాలు గలవారి కొరత లేదో! అది వారికి లాభం గానీ, నష్టం గానీ చేయలేదని తెలిసి కూడా, ప్రజలు ఇటువంటి వాటిని ఆరాధించడం, ప్రాచీన కాలం నుండి వస్తున్న తప్పుడు ఆచారమే!
A'raf 7:149
మరియు వారు మార్గం తప్పారని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపంతో మొత్తుకుంటూ అనేవారు: "మా ప్రభువు మమ్మల్ని కరుణించి, మమ్మల్ని క్షమించక పోతే మేము తప్పక నాశనం అయ్యే వారమే!"
A'raf 7:150
మరియు మూసా తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి క్రోధంతో విచారంతో అన్నాడు: "నేను వెళ్ళిన పిదప మీరు ఆచరించింది ఎంత చెడ్డది! ఏమీ? మీ ప్రభువు ఆజ్ఞ (రాకముందే) తొందరపడి (ఆయన ఆరాధనను వదిలారా)?" తరువాత ఫలకాలను పడవేసి,[1] తన సోదరుని తల వెంట్రుకలను పట్టుకొని తన వైపుకు లాగాడు. (హారూన్) అన్నాడు: "నా సోదరుడా (తల్లి కుమారుడా!) వాస్తవానికి ఈ ప్రజలు బలహీనునిగా చూసి నన్ను చంపేవారే,[2] కావున నీవు (మన) శత్రువులకు, నన్ను చూసి సంతోషించే అవకాశం ఇవ్వకు మరియు నన్ను దుర్మార్గులలో లెక్కించకు!"
———
[1] మూసా ('అ.స.) తన జాతివారు అల్లాహ్ (సు.తా.) ను వదలి ఆవుదూడ విగ్రహాన్ని ఆరాధించటాన్ని చూసి, క్రోధావేశంలో ఏమీ తోచక - తన సోదరుణ్ణి పట్టుకొని శిక్షించటానికి, తన చేతులలో ఉన్న ఫలకాలను క్రిందపెట్టి - తన సోదరుని తలవెంట్రుకలను పట్టుకున్నారే గానీ, ఫలకాలకు అనాదరణ చేయటం అతని ఉద్దేశం కాదు. కోపం చల్లారిన తరువాత అతను వాటిని ఎత్తుకున్నారు. చూడండి, ఆయత్, 154. [2] చూడండి, 20:92-94.
A'raf 7:151
(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా సోదరుణ్ణి క్షమించు. మరియు మా ఇద్దరినీ నీ కారుణ్యంలోకి చేర్చుకో. మరియు నీవే కరుణించే వారిలో అందరి కంటే అధికంగా కరుణించేవాడవు!"
A'raf 7:152
ఆవుదూడను (దైవంగా) చేసుకున్న వారు తప్పకుండా తమ ప్రభువు ఆగ్రహానికి గురి అవుతారు మరియు వారు ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు. మరియు అసత్యాలు కల్పించే వారిని మేము ఇదే విధంగా శిక్షిస్తాము.
A'raf 7:153
మరియు ఎవరు దుష్కార్యాలు చేసిన పిదప, పశ్చాత్తాపపడతారో మరియు విశ్వసిస్తారో! అలాంటి వారు నిశ్చయంగా, ఆ తరువాత నీ ప్రభువును క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొందుతారు.
A'raf 7:154
మరియు మూసా కోపం చల్లారిని తరువాత ఆ ఫలకాలను ఎత్తుకున్నాడు.[1] మరియు తమ ప్రభువుకు భయపడేవారికి, వాటి వ్రాతలలో మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ఉన్నాయి.
———
[1] మూసా ('అ.స.) ఫలకాలను క్రింద పెట్టారు. అవి ముక్కలు కాలేదు. కావున కోపం చల్లారిన తరువాత మూసా ('అ.స.) ఆ ఫలకాలను తిరిగి తీసుకున్నారు.
A'raf 7:155
మరియు మేము నిర్ణయించిన గడువు కొరకు, మూసా తన జాతి వారిలో నుండి డెబ్బై మందిని ఎన్నుకున్నాడు. ఆ పిదప వారిని భూకంపం ఆవరించగా[1] (మూసా) ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నీవు కోరితే, వీరిని మరియు నన్ను కూడా ఇంతకు పూర్వమే సంహరించి ఉండేవాడవు. ఏమీ? మాలో కొందరు మూఢులు చేసిన పనికి నీవు మమ్మల్ని నశింపజేస్తావా? ఇదంతా నీ పరీక్షయే! దీని ద్వారా నీవు కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తావు మరియు నీవు కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తావు. మా సంరక్షకుడవు నీవే, కావున మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. మరియు క్షమించే వారందరిలో నీవే అత్యుత్తముడవు!"
———
[1] చూడండి, 2:55 అక్కడ పిడుగు ('సా'యిఖతున్) పడి ఆ 70 మంది చనిపోయినట్లు ఉంది. బహుశా ఈ రెండు శిక్షలు వచ్చి ఉండవచ్చు. మూసా ('అ.స.) ప్రార్థన వల్ల ఆ 70 మంది మళ్ళీ సజీవులయ్యారు.
A'raf 7:156
"మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మంచి స్థితినే వ్రాయి. నిశ్చయంగా మేము నీ వైపునకే మరలాము." (అల్లాహ్) సమాధానం ఇచ్చాడు: "నేను కోరిన వారికి నా శిక్షను విధిస్తాను. నా కారుణ్యం ప్రతి దానిని ఆవరించి ఉన్నది.[1] కనుక నేను దానిని దైవభీతి గలవారికీ, విధిదానం (జకాత్) ఇచ్చే వారికీ మరియు నా సూచనలను విశ్వసించే వారికీ వ్రాస్తాను!
———
[1] చూడండి, 6:12 మరియు 54.
A'raf 7:157
"ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్యరాస్యుడైన[1] ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్ద వున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో,[2] అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్భంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అతవరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు."
———
[1] అల్లాహ్ (సు.తా.) ఇక్కడ ము'హమ్మద్ ('స'అస) ను నిరక్షరాస్యుడైన ప్రవక్త అని విశదం చేస్తున్నాడు. అంటే అతను ఏమీ చదువనూ లేరు మరియు వ్రాయనూ లేరు. కాబట్టి అతను చెప్పే మాటలు ప్రాచీన గ్రంథాలలో నుండి చదివినవి కావు, అవి దివ్యజ్ఞానం (వ'హీ) ద్వారా అతనిపై అవతరింపజేయబడినవి. కావున అతను వాటిని ప్రాచీన గ్రంథాలలో వ్రాయబడిన విధంగా గాకుండా నిజమైన వృత్తాంతాలను బోధించారు. ఎందుకంటే కొన్ని విషయాలు, ఈనాటి తౌరాత్ మరియు ఇంజీల్ లలో మార్చబడ్డాయి. వాటి నిజ వృత్తాంతం కేవలం అల్లాహుతా'ఆలా కే తెలుసు కాబట్టి 1400 సంవత్సరాలలో ఒక్క అక్షరపు మార్పు కూడా చెందని ఈ ఖుర్ఆన్ లో వచ్చిన అల్లాహుతా'ఆలా వ'హీయే పరమసత్యం. అల్లాహ్ (సు.తా.) స్వయంగా తీర్పుదినం వరకు ఈ ఖుర్ఆన్ ను , అది ఉన్నది ఉన్నట్లుగా భద్రంగా ఉంచుతానని తన గ్రంథంలో విశదం చేశాడు. చూడండి, ఖుర్ఆన్, 2:42, 4:47, 57:28, 61:6, 15:9. [2] ము'హమ్మద్ ('స'అస) అరబ్బులలో నుండి దైవప్రవక్తగా రాబోతున్నాడనే ప్రస్తావన కొరకు చూడండి, బైబిల్, ద్వితీయోపదేశ కాండము - (Deuteronomy) 18:15, 18; కీర్తనలు - (Pslams), 118:22-23; యెషయా - (Isaiah), 42:1-13;హబక్కూకు - (Habakkuk), 3:3-4; మత్తయి - (Mathew), 21:42-43; యోహాను - (John), 14:16-17, 26-28, 16:7-14.
A'raf 7:158
(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను.[1] భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు; ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్ ను మరియు ఆయన సందశహరుడు నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్ ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుసరించండి, అప్పుడే మీరు మార్గదర్శకత్వం పొందుతారు!"[2]
———
[1] పూర్వప్రవక్తలు ('అలైహిమ్ స.) తమ తమ జాతులవారి వద్దకే పంపబడి వుండిరి. మూసా ('అ.స.) ఇస్రాయీ'ల్ సంతతివారి కొరకు వచ్చారని తౌరాత్ అంటుంది. 'ఈసా ('అ.స.) : "నేను దారి తప్పిన ఇస్రాయీ'ల్ సంతతి వారి కొరకు పంపబడ్డాను." అని అన్నారు. చూడండి, 5:46 వ్యాఖ్యానం 1. కాని ఇక్కడ అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: "(ఓ ము'హమ్మద్!) వారితో అను: 'ఓ మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరివైపుకు పంపబడిన సందేశహరుడను, (ర'హ్ మతల్ లిల్ 'ఆలమీన్, 21:107),' మరియు : 'ప్రవక్తలందరి ముద్రను ('ఖాతమన్నబియ్యీన్, 33:40' " [2] ఇక్కడ మరొకసారి నిరక్షరాస్యుడుగా, దైవప్రవక్తగా, ము'హమ్మద్ ('స'అస) పేర్కొనబడ్డారు. అంటే అతనికి ఏ మానవ గురువు లేడు. అతను నేర్చుకున్నది, దైవదూత జిబ్రీల్ ('అ.స.) తెచ్చిన, అల్లాహ్ (సు.తా.) దివ్యజ్ఞానం (వ'హీ), ద్వారా మాత్రమే. చూశారా! అది ఎంత మహత్త్యమైనదో! ఈనాటికి కూడా దాని వంటి ఒక్క సూరహ్ కూడా ఎవ్వరూ రచించి తేలేక పోయారు. ఎందుకంటే ఇది (దివ్యఖుర్ఆన్) మానవ రచన కాదు, అల్లాహుతా'ఆలా తరపు నుండి అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం. ఇది అల్లాహ్ (సు.తా.) ద్వారానే పునరుత్థాన దినం వరకు భద్రంగా చబడుతుందని అల్లాహుతా'ఆలా వ్యక్తం కూడా చేశాడు. చూడండి, 15:9.
A'raf 7:159
మరియు మూసా జాతివారిలో సత్యం ప్రకారమే మార్గదర్శకత్వం చూపుతూ మరియు దాని (సత్యం) ప్రకారమే న్యాయం చేసే ఒక వర్గం వారు ఉన్నారు.[1]
———
[1] చూడండి, 3:113-115. ఉదాహరణకు 'అబ్దుల్లాహ్ బిన్ సల్లామ్.
A'raf 7:160
మరియు మేము వారిని పన్నెండు తెగలుగా (వర్గాలుగా) విభవించాము.[1] మరియు మూసా జాతి వారు అతనిని నీటి కొరకు అడిగినపుడు, మేము అతనిని: "నీ చేతికర్రతో రాయిపై కొట్టు!" అని ఆజ్ఞాపించాము. అపుడు దాని నుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. అపుడు ప్రతి తెగవారు, తాము నీళ్ళు తీసుకునే స్థలాన్ని తెలుసుకున్నారు. మరియు మేము వారిపై మేఘాల ఛాయను కల్పించాము. మరియు వారి కొరకు మన్న మరియు సల్వాలను దింపాము:[2] "మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను తినండి." అని అన్నాము. మరియు వారు మాకు అన్యాయం చేయలేదు, కాని తమకు తామే అన్యాయం చేసుకున్నారు.
———
[1] చూడండి, 5:12. [2] చూడండి, 2:57.
A'raf 7:161
మరియు వారికి ఇలా ఆజ్ఞ ఇవ్వబడిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!): "ఈ నగరంలో నివసించి, అందులో మీ ఇష్టప్రకారం తినండి. మరియు : 'మా పాపాలను క్షమించు (హిత్తతున్), అని అంటూ ఉండండి. మరియు సాష్టాంగ పడుతూ దాని ద్వారంలో ప్రవేశించండి, మేము మీ పాపాలను క్షమిస్తాము. మేము సజ్జనులను అధికంగా (అనుగ్రహిస్తాము)."
A'raf 7:162
కాని వారిలో దుర్మార్గులైన వారు తమకు చెప్పబడిన మాటను మార్చి, మరొకు మాటను ఉచ్ఛరించారు; కావున వారు చేస్తున్న దుర్మార్గానికి ఫలితంగా మేము వారిపై ఆకాశం నుండి ఆపదను పంపాము.[1]
———
[1] ఆయత్ లు 160-162లలో వివరించబడిన విషయాలు సూరహ్ అల్ బఖరహ్ మొదటి భాగంలో కూడా ఉన్నాయి. (2:58-59).
A'raf 7:163
మరియు సముద్ర తీరము నందున్న ఆ నగర (వాసులను) గురించి వారిని అడుగు; వారు శనివారపు (సబ్త్) ధర్మాన్ని ఉల్లంఘించేవారు! ఆ శనివారం (సబ్త్) రోజుననే చేపలు వారి ముందుకు ఎగిరెగిరి నీటిపైకి వచ్చేవి. మరియు శనివారపు (సబ్త్) ధర్మం పాటించని రోజు (చేపలు) వచ్చేవి కావు. వారి అవిధేయతకు కారణంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురిచేశాము.[1]
———
[1] చూడండి, బైబిల్ యిర్మియీ - (Jeremia), 17:21-27.
A'raf 7:164
వారిలోని ఒక వర్గం వారు: "అల్లాహ్ ఎవరిని నశింప జేయనున్నాడో లేదా ఎవరికి కఠినశిక్ష విధించనున్నాడో! అలాంటి వారికి, మీరెందుకు ఉపదేశం చేస్తున్నారు?" అని అంటే అతను (ఉపదేశం చేసే వ్యక్తి) అన్నాడు: "మీ ప్రభువు ముందు, (హింతబోధ ఎందుకు చేయలేదని), నాపై నింద ఉండకుండా మరియు వారు దైవభీతి గల వారు అవుతారేమోనని!"
A'raf 7:165
తరువాత వారికి చేయబడిన హితబోధను వారు మరచినప్పుడు! దుష్కార్యాల నుంచి వారిస్తూ ఉన్న వారిని మేము రక్షించాము. మరియు దుర్మార్గులైన ఇతరులను, అవిధేయత చూపినందుకు కఠినశిక్షకు గురిచేశాము.
A'raf 7:166
కాని నిషేధించబడిన వాటినే వారు హద్దులు మీరి చేసినప్పుడు మేము వారితో: "మీరు నీచమైన కోతులుగా మారండి." అని అన్నాము. [1]
———
[1] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 481. ఇంకా చూడండి, 2:65, 5:60.
A'raf 7:167
మరియు నీ ప్రభువు వారిపై (యూదులపై) అంతిమదినం వరకు దుఃఖకరమైన శిక్ష విధించే వారిని పంపుతూ ఉంటానని ప్రకటించిన విషయాన్ని (జ్ఞప్తికి తెచ్చుకోండి)[1]. నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష విధించటంలో శీఘ్రుడు, మరియు నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
———
[1] చూడండి, 3:112.
A'raf 7:168
మరియు మేము వారిని భువిలో వేర్వేరు తెగలుగా జేసి వ్యాపింప జేశాము. వారిలో కొందరు సన్మార్గులున్నారు, మరి కొందరు దానికి దూరమైన వారున్నారు. బహుశా వారు (సన్మార్గానికి) మరలి వస్తారేమోనని, మేము వారిని మంచి-చెడు స్థితుల ద్వారా పరీక్షించాము.
A'raf 7:169
ఆ పిదప వారి తరువాత దుష్టులైన వారు వారి స్థానంలో గ్రంథానికి వారసులై, తుచ్ఛమైన ప్రాపంచిక వస్తువుల లోభంలో పడుతూ: "మేము క్షమింపబడతాము." అని పలుకుతున్నారు. అయినా ఇటువంటి సొత్తు తిరిగి వారికి లభిస్తే దానిని తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. "అల్లాహ్ విషయంలో సత్యం తప్ప మరేమీ పలుకరాదు." అని గ్రంథంలో వారితో వాగ్దానం తీసుకో బడలేదా ఏమిటి? అందులో (గ్రంథంలో) ఉన్నదంతా వారు చదివారు కదా! మరియు దైభీతి గలవారి కొరకు పరలోక నివాసమే ఉత్తమమైనది, ఏమీ? మీరిది గ్రహించలేరా?
A'raf 7:170
మరియు ఎవరైతే గ్రంథాన్ని స్థిరంగా అనుసరిస్తారో మరియు నమాజ్ స్థాపిస్తారో, అలాంటి సద్వర్తనుల ప్రతిఫలాన్ని నిశ్చయంగా మేము వ్యర్థం చేయము.
A'raf 7:171
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము (తూర్) పర్వతాన్ని పైకెత్తి వారిపై కప్పుగా ఉంచితే! వాస్తవానికి, వారు అది తమపై పడుతుందేమోనని భావించినప్పుడు మేము వారితో అన్నాము: "మేము మీకు ఇచ్చిన దానిని (గ్రంథాన్ని) దృఢంగా పట్టుకోండి మరియు అందులో ఉన్న దానిని జ్ఞాపకం ఉంచుకోండి, దానితో మీరు దైవభీతి పరులు కావచ్చు!"
A'raf 7:172
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) నీ ప్రభువు ఆదమ్ సంతతి వారి వీపున నుండి వారి సంతానాన్ని తీసి, వారికి వారినే సాక్షులుగా నిలబెట్టి: "ఏమీ? నేను మీ ప్రభువును కానా?" అని అడుగగా! వారు: "అవును! (నీవే మా ప్రభువని) మేము సాక్ష్యమిస్తున్నాము." అని జవాబిచ్చారు.[1] తీర్పుదినమున మీరు: "నిశ్చయంగా, మేము దీనిని ఎరుగము." అని అనగూడదని.
———
[1] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, కితాబుల్ జనాయ"జ్, మరియు ముస్లిం, కితాబుల్ ఖద్ర్: "ప్రతి బిడ్డ సహజ స్వభావంతో పుడ్తాడు. అంటే అల్లాహ్ (సు.తా.)కు విధేయత (ఇస్లాం)తో. కానీ, అతని తల్లిదండ్రులు అతనిని యూదుడు, క్రైస్తవుడు మజూసి లేక్ ఇతర ధర్మం వాడిగా మార్చుతారు."
A'raf 7:173
లేక: "వాస్తవానికి ఇంతకు పూర్వం మా తాతముత్తాతలు అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించారు. మేము వారి తరువాత వచ్చిన, వారి సంతతి వారం (కాబట్టి వారిని అనుసరించాము). అయితే? ఆ అసత్యవాదులు చేసిన కర్మలకు నీవు మమ్మల్ని నశింప జేస్తావా?" అని అనగూడదని.
A'raf 7:174
మరియు ఈ విధంగానైనా వారు సన్మార్గానికి మరలుతారేమోనని మేము ఈ సూచనలను స్పష్టంగా తెలుపుతున్నాము.
A'raf 7:175
మరియు మేము, మా సూచనలు (ఆయాత్) ప్రసాదించిన ఆ వ్యక్తి గాథ వారికి వినిపించు. అతడు వాటి నుండి విముఖుడై నందుకు షైతాన్ అతనిని వెంబడించాడు, కావున అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు.
A'raf 7:176
మరియు మేము కోరుకుంటే వాటి (ఆ సూచనల) ద్వారా అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించేవారము. కాని అతడు భూమి వైపునకు వంగాడు, మరియు తన కోరికలను అనుసరించాడు. అతని దృష్టాంతం ఆ కుక్క వలె ఉంది: నీవు దానిని బెదిరించినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది, లేక వదలి పెట్టినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది. మా సూచన (ఆయాత్) లను అబద్ధాలని నిరాకరించే వారి దృష్టాంతం కూడా ఇదే! నీవు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉంటే, బహుశా వారు ఆలోచించవచ్చు!
A'raf 7:177
మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారి దృష్టాంతం చాలా చెడ్డది. ఎందుకంటే వారు తమకు తాము అన్యాయం చేసుకుంటున్నారు.
A'raf 7:178
అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గభ్రష్టత్వంలో పడ నిచ్చినవారు! వారే నష్టపోయేవారు.
A'raf 7:179
మరియు వాస్తవానికి మేము చాలా మంది జిన్నాతులను మరియు మానవులను నరకం కొరకు సృజించాము. ఎందుకంటే! వారికి హృదయాలున్నాయి కాని వాటితో వారు అర్థం చేసుకోలేరు మరియు వారికి కళ్ళున్నాయి కాని వాటితో వారు చూడలేరు మరియు వారికి చెవులున్నాయి కాని వాటితో వారు వినలేరు. ఇలాంటి వారు పశువుల వంటి వారు; కాదు! వాటి కంటే అధములు. ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు.
A'raf 7:180
మరియు అల్లాహ్ పేర్లు! అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి.[1] మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు.
———
[1] 'హదీస్'లలో అల్లాహ్ (సు.తా.) ఉత్తమ పేర్లు 99 ఉన్నాయని ఉంది. కాని ఇబ్నె-కసీ'ర్ మరియు ఫ'త్హ అల్ ఖదీర్ లలో, ఇవి 99 కంటే ఎక్కువ ఉన్నాయని ఉంది. ఈ శబ్దం అల్-అస్మాఉ'ల్ 'హుస్నా ఖుర్ఆన్ లో నాల్గుసార్లు వచ్చింది. ఈ ఆయత్ లో మరియు 17:110, 20:8 మరియు 59:24. ఈ శబ్దం అల్-అస్మాఉ'ల్ 'హుస్నా ఖుర్ఆన్ లో కేవలం అల్లాహ్ (సు.తా.) కొరకే వాడబడింది. యు'ల్హిదూన: అంటే ఒకవైపుకు మొగ్గటం. వ్యంగ్యార్థం తీయటం, మార్గభ్రష్టత్వంలో పడి పోవటం. Profanity భక్తిహీనంగా ప్రవర్తించటం, అగౌరవపరచటం, అల్లాహ్ (సు.తా.) పేర్ల విషయంలో తప్పు త్రోవలో పోవుటలో మూడు రకాలు ఉన్నాయి: 1) అల్లాహుతా'ఆలా పేర్లలో మార్పులు చేయటం. ఉదా: మక్కా ముష్రికులు 'అ'జీ'జ్ ను 'ఉజ్జా' గా మార్చింది. 2) అల్లాహుతా'ఆలా పేర్లను హెచ్చించటం. 3) అల్లాహుతా'ఆలా పేర్లను తగ్గించటం. (ఫ'త్హ అల్ ఖదీర్).
A'raf 7:181
మరియు మేము సృష్టించిన వారిలో ఒక వర్గం వారు సత్యం ప్రకారం మార్గదర్శకత్వం చేసేవారునూ మరియు దానిని అనుసరించియే న్యాయం చేసేవారునూ ఉన్నారు.
A'raf 7:182
మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించేవారిని, మేము వారికి తెలియకుండానే క్రమక్రమంగా (నాశనం వైపునకు) తీసుకుపోతాము.
A'raf 7:183
మరియు నేను వారికి వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా వ్యూహం బలమైనది.[1]
———
[1] చూడండి, 68:45. ఆ ఆయత్ లో ఖుర్ఆన్ అవతరణలో మొదటిసారి 'కైద్' పదం వాడబడింది.
A'raf 7:184
ఏమీ? తన సహచరుడు పిచ్చి పట్టిన వాడు కాదని వారు గమనించలేదా? అతను కేవలం స్పష్టమైన హెచ్చరిక చేసేవాడు మాత్రమే!
A'raf 7:185
ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతివస్తువును గమనించి చూసి, బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరేవిధమైన సందేశాన్ని విశ్వసిస్తారు?
A'raf 7:186
అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడెవ్వడూ లేడు![1] మరియు ఆయన వారిని తమ తలబిరుసుతనంలో త్రోవతప్పి తిరుగటానికి వదలిపెడుతున్నాడు.
———
[1] ఇక్కడ మరియు 178వ ఆయత్ లో మరియు ఇంకా ఎన్నోచోట్లలో ఖుర్ఆన్ లో చెప్పబడిన విధంగా ఇది సున్నతుల్లాహ్ అంటే ఎవడైతే తనను తాను సవరించుకో గోరక అల్లాహ్ (సు.తా.) ఆదేశాలను అసత్యాలని మరియు ఆయన ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించి, మూఢత్వంతో మార్గభ్రష్టత్వంలో పడిపోతాడో, అలాంటి వానిని అల్లాహుతా'ఆలా మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. అలాంటి వానికి మార్గదర్శకత్వం చేయడు. కానీ అల్లాహ్ (సు.తా.) అతనిని బలవంతంగా మార్గభ్రష్టత్వంలో పడవేయడు.
A'raf 7:187
(ఓ ప్రవక్తా!) వారు నిన్ను ఆ అంతిమఘడియను గురించి: "అది ఎప్పుడు రానున్నది?" అని అడుగుతున్నారు. వారితో ఇలా అను: "నిస్సందేహంగా, దాని జ్ఞానం నా ప్రభువుకు మాత్రమే ఉంది.[1] కేవలం ఆయన స్వయంగా దానిని, దాని సమయంలో తెలియజేస్తాడు. అది భూమ్యాకాశాలకు ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగానే వచ్చి పడుతుంది." దానిని గురించి నీకు బాగా తెలిసి ఉన్నట్లు భావించి, వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానం ఇవ్వు: "నిస్సందేహంగా, దాని జ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ఉంది. కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు."[2]
———
[1] అంతిమ ఘడియ ఎప్పుడు రానున్నదో అల్లాహ్ (సు.తా.) కు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఏ ప్రవక్తకు గానీ లేక దైవదూతకు గానీ అది వచ్చే సమయం గురించి తెలియదనే విషయం ఈ ఆయత్ ద్వారా స్పష్టమవుతోంది. [2] చూడండి, 31:34.
A'raf 7:188
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం[1] గానీ, నష్టం[2] గానీ చేసుకునే అధికారం నాకు లేదు. నాకు అగోచర విషయజ్ఞానం ఉండి ఉన్నట్లైతే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని. మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్త నిచ్చేవాడను మాత్రమే!"[3]
———
[1] నప్'అన్: అంటే లాభం, మేలు, ప్రయోజనం, ఉపయోగం అనే అర్థాలున్నాయి. [2] 'దర్రన్: అంటే నష్టం, కీడు, హాని, చెరుపు, అపాయం, దోషం, ఆపద, బాధ అనే అర్థాలున్నాయి. [3] దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) కు ఎట్టి అగోచర జ్ఞానం లేదు అని ఇక్కడ స్పష్టంగా విశదమవుతుంది. అగోచర జ్ఞానం గలవాడు కేవలం అల్లాహ్ (సు.తా.) ఒక్కడు మాత్రమే! దీనికి నిదర్శనాలు: 1) ము'హమ్మద్ ('స'అస) యొక్క పన్ను 'ఉహుద్ యుద్ధరంగంలో విరిగి పోయింది. అతను గాయాలతో స్పృహ తప్పి పడిపోయారు. ఏ విధంగానైతే ఒక సాధారణ మానవుడు బాధపడుతాడో అదే విధంగా అతను బాధపడ్డారు. 2) 'ఆయి'షహ్ (ర.'అన్హా)పై నింద మోపబడినప్పుడు, అల్లాహుతా'ఆలా వ'హీ వచ్చేంత వరకు, అతను సాధారణ వ్యక్తిగానే వ్యవహరించారు. ఒకవేళ అతనికి అగోచర జ్ఞానమే ఉంటే ఇదంతా అతనికి ముందుగా తెలిసి, బాధపడేవారు కాదు.
A'raf 7:189
ఆయనే, మిమ్మల్ని ఒకే వ్యక్తి నుండి సృష్టించాడు మరియు అతని నుండియే జీవిత సౌఖ్యం పొందటానికి అతని భార్యను (జౌజను) పుట్టించాడు.[1] అతను ఆమెను కలుసుకున్నపుడు, ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించి దానిని మోస్తూ తిరుగుతూ ఉంటుంది. పిదప ఆమె గర్భభారం అధికమైనప్పుడు, వారు ఉభయులూ కలిసి వారి ప్రభువైన అల్లాహ్ ను ఇలా వేడుకుంటారు: "నీవు మాకు మంచి బిడ్డను ప్రసాదిస్తే మేము తప్పక నీకు కృతజ్ఞతలు తెలిపే వారమవుతాము!"
———
[1] చూడండి, 4:1 మరియు 30:21.
A'raf 7:190
ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించిన పిదప వారు, ఆయన ప్రసాదించిన దాని విషయంలో ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించసాగుతారు. కాని వారు కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ మహోన్నతుడు.
A'raf 7:191
ఏమీ? దేనినీ కూడ సృష్టించలేని మరియు (స్వయంగా) తామే సృష్టించబడిన వారిని, వారు ఆయనకు సాటిగా (భాగస్వాములుగా) కల్పిస్తారా?
A'raf 7:192
మరియు వారు, వారికి ఎలాంటి సహాయం చేయలేరు. మరియు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు.
A'raf 7:193
మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా, వారు మిమ్మల్ని అనుసరించలేరు. మీరు వారిని పిలిచినా, లేక మౌనం వహించినా మీకు సమానమే!
A'raf 7:194
నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను విడిచి ఎవరినైతే పిలుస్తున్నారో, వారు కూడా మీలాంటి దాసులే! మీరు వారిని పిలువండి, మీరు సత్యవంతులే అయితే మీ పిలుపుకు వారు సమాధానమివ్వాలి.[1]
———
[1] ఇక్కడ ప్రజలు అల్లాహ్ (సు.తా.)ను వదలి ఇతరుల దగ్గరకు తమకు సహాయపడమని, ఆరోగ్యం చేకూర్చమని, పిల్లల నివ్వమని, బిడ్డల పెళ్ళిళ్లు చేయించమని, ఉద్యోగాలు ఇప్పించమని లేక పరలోక జీవితంలో సిఫారసు చేయమని, వగైరా వగైరా కొరకు, దర్గాల దగ్గర, సన్యాసుల దగ్గర, బాబాల దగ్గర లేక మూర్తుల దగ్గరకు పోయి వేడుకోవటం గురించి విమర్శించబడింది. ఇంకా వారేమి చేయలేరని కూడా విశదపరచబడింది.
A'raf 7:195
ఏమీ? వారికి కాళ్ళున్నాయా, వాటితో నడవటానికి? లేదా వారికి చేతులున్నాయా, వాటితో పట్టుకోవటానికి? లేదా వారికి కళ్ళున్నాయా, వాటితో చూడటానికి? లేదా వారికి చెవులున్నాయా, వాటిలో వినటానికి? వారితో అను: "మీరు సాటి కల్పించిన వారిని (భాగస్వాములను) పిలువండి. తరువాత మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు (వ్యూహాలు) పన్నండి, నాకు గడువు కూడా ఇవ్వకండి.
A'raf 7:196
నిశ్చయంగా, ఈ గ్రంథాన్ని అవతరింప జేసిన అల్లాహ్ యే నా సంరక్షకుడు, ఆయన సద్వర్తనులనే మిత్రులుగా చేసుకుంటాడు.
A'raf 7:197
మరియు ఆయనను విడిచి మీరు వేడుకునే వారు మీకు ఏ విధమైన సహాయం చేయలేరు. మరియు వారు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు.
A'raf 7:198
మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా వారు వినలేరు. మరియు వారు నీవైపుకు చూస్తున్నట్లు నీవు భావిస్తావు, కాని వారు చూడలేరు.
A'raf 7:199
మన్నింపు వైఖరిని అవలంబించు, ధర్మమును బోధించు మరియు మూర్ఖుల నుండి విముఖుడవకు.[1]
———
[1] ఎందుకంటే మానవుడు బలహీనుడిగా పుట్టించబడ్డాడు. (చూడండి 4:28). అల్లాహ్ (సు.తా.) ఏ మానవుడి పైననూ అతన శక్తికి మించిన భారం వేయడు. (చూడండి, 2:286, 6:152 7:42 23:62).
A'raf 7:200
మరియు ఒకవేళ షైతాన్ నుండి నీకు ప్రేరేపణ కలిగితే! నీవు అల్లాహ్ శరణు వేడుకో! నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
A'raf 7:201
వాస్తవానికి, దైవభీతి గలవారు తమకు షైతాన్ నుండి కలత గలిగితే! వారు (అల్లాహ్ ను) స్మరిస్తారు, అప్పుడు వారు అంతా సరిగ్గా చూస్తారు.
A'raf 7:202
మరియు వారి (షైతాన్ ల) సహోదరులు వారిని తప్పు దారి వైపుకు లాక్కొని పోగోరుతారు మరియు వారు ఏ మాత్రం పట్టు వదలరు.
A'raf 7:203
మరియు (ఓ ప్రవక్తా!) నీవు వారికి ఏదైనా సూచనను తేలేక పోయినప్పుడు వారు: "నీవే స్వయంగా దానిని ఎందుకు (కల్పించుకొని) తేలేదు?" అని అంటారు. వారితో ఇలా అను: "నేను కేవలం నా ప్రభువు తరఫు నుండి నాకు పంప బడే సందేశాన్ని (వహీని) మాత్రమే అనుసరించేవాడను.[1] ఇందు (ఈ ఖుర్ఆన్) లో విశ్వసించేవారి కొరకు, మీ ప్రభువు తరఫు నుండి అనేక బోధనలు, మార్గదర్శకత్వం మరియు కారుణ్యమున్నాయి."[2]
———
[1] చూడండి, 6:37 మరియు 109. [2] చూడండి, స. బు'ఖారీ, పు.4, 'హ. 831.
A'raf 7:204
మరియు ఖుర్ఆన్ పారాయణం జరిగేటప్పుడు దానిని శ్రద్ధగా వినండి మరియు నిశ్శబ్దంగా ఉండండి, అప్పుడు మీరు కరుణింపబడవచ్చు![1]
———
[1] చూడండి, 41:26.
A'raf 7:205
మరియు నీవు నీ మనస్సులో వినయంతో, భయంతో మరియు ఎక్కువ శబ్దంతో గాక (తగ్గు స్వరంతో) ఉదయం మరియు సాయంత్రం నీ ప్రభువును స్మరించు. మరియు నిర్లక్ష్యం చేసేవారిలో చేరకు.[1]
———
[1] చూడండి, 13:28.
A'raf 7:206
నిశ్చయంగా, నీ ప్రభువుకు దగ్గరగా ఉన్నవారు (దైవదూతలు) తమ ప్రభువును ఆరాధించటానికి అహంభావం చూపరు. మరియు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. మరియు ఆయనకే సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు.
Enfal 8:1
(ఓ ప్రవక్తా!) వారు నిన్ను విజయధనం (అన్ ఫాల్) ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: "విజయధనం అల్లాహ్ ది మరియు ఆయన సందేశహరునిది." కనుక మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీ పరస్పర సంబంధాలను సరిదిద్దుకోండి. మీరు విశ్వాసులే అయితే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి.
Enfal 8:2
నిశ్చయంగా, విశ్వాసులైన వారి హృదయాలు అల్లాహ్ ప్రస్తావన వచ్చినపుడు భయంతో వణుకుతాయి. మరియు వారి ముందు ఆయన సూచనలు (ఖుర్ఆన్) పఠింపబడినప్పుడు వారి విశ్వాసం మరింత అధికమే అవుతుంది. మరియు వారు తమ ప్రభువు మీదే దృఢనమ్మకం కలిగి ఉంటారు.
Enfal 8:3
వారే నమాజ్ ను స్థాపిస్తారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి (ఇతరులపై) ఖర్చు చేస్తారు.
Enfal 8:4
అలాంటి వారు! వారే, నిజమైన విశ్వాసులు. వారి ప్రభువు వద్ద వారికి ఉన్నత స్థానాలు, క్షమాపణ మరియు గౌరవనీయమైన జీవనోపాధి ఉంటాయి.
Enfal 8:5
(ఓ ప్రవక్తా!) ఎప్పుడైతే! నీ ప్రభువు నిన్ను సత్యస్థాపన కొరకు నీ గృహం నుండి (యుద్ధానికి) బయటకు తీసుకొని వచ్చాడో! అప్పుడు నిశ్చయంగా, విశ్వాసులలో ఒక పక్షం వారు దానికి ఇష్టపడలేదు;
Enfal 8:6
సత్యం బహిర్గతమైన తరువాత కూడా, వారు దానిని గురించి నీతో వాదులాడుతున్నారు. అప్పుడు (వారి స్థితి) వారు చావును కళ్ళారా చూస్తూ ఉండగా! దాని వైపునకు లాగబడే వారి వలే ఉంది.
Enfal 8:7
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఆ రెండు పక్షాలలో, ఒక పక్షం మీ చేతికి తప్పక చిక్కుతుందని అల్లాహ్ మీతో వాగ్దానం చేసినప్పుడు; ఆయుధాలు లేని పక్షం మీకు దొరకాలని మీరు కోరుతూ ఉన్నారు. కాని అల్లాహ్ తాను ఇచ్చిన మాట ప్రకారం సత్యాన్ని సత్యంగా నిరూపించాలనీ మరియు అవిశ్వాసులను సమూలంగా నాశనం చేయాలనీ కోరాడు.
Enfal 8:8
అపరాధులు ఎంత అసహ్యించుకున్నా, సత్యాన్ని సత్యంగా నిరూపించాలని (నెగ్గించాలని) మరియు అసత్యాన్ని అసత్యంగా నిరూపించాలని (విఫలం చేయాలని) ఆయన (ఇచ్ఛ).[1]
———
[1] ముస్లింలు, మక్కా ముష్రికుల సైన్యంతో పోరాడి, వారిని ఓడించి, వారి హృదయాలలో భయభీతులు కలిగించాలని మరియు ముస్లింలకు ధైర్యస్థైర్యాలు ప్రసాదించాలని అల్లాహుతా'ఆలా కోరిక.
Enfal 8:9
(జ్ఞాపకం చేసుకోండి!) మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించినపుడు ఆయన ఇలా జవాబిచ్చాడు: "నిశ్చయంగా, నేను వేయి దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని పంపి మిమ్మల్ని బలపరుస్తాను."[1]
———
[1] చూడండి, 3:124-125 అక్కడ ఉ'హుద్ యుద్ధంలో అల్లాహ్ (సు.తా.) 3000 దైవదూతలను పంపి సహాయపడ్డాడు, అని ఉంది.
Enfal 8:10
మరియు మీకు శుభవార్తనిచ్చి, మీ హృదయాలకు శాంతి కలుగ జేయటానికే, ఈ విషయాన్ని అల్లాహ్ మీకు తెలిపాడు. మరియు వాస్తవానికి సహాయం (విజయం) కేవలం అల్లాహ్ నుంచే వస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.[1]
———
[1] ము'హమ్మద్ ('స'అస) ఇలా ప్రార్థించారు: "ఓ అల్లాహ్ (సు.తా.)! నీవు నాకు చేసిన వాగ్దానం పూర్తి చేయి. ఓ అల్లాహ్ (సు.తా.)! ఒకవేళ ఈనాడు నీకు విధేయు(ముస్లిం)లు అయిన ఈ చిన్న సమూహం, నిర్మూలించబడితే! నిన్ను ప్రార్థించేవారు భూమిలో ఎవ్వరూ ఉండరు!" ('స. బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం, తిర్మిజీ', అబూ-దావూద్, అ'హ్మద్ మరియు ఇబ్నె'హంబల్).
Enfal 8:11
(జ్ఞాపకం చేసుకోండి!) ఆయన (అల్లాహ్), తన తరఫు నుండి మీకు మనశ్శాంతి కలుగజేయటానికి మీకు నిద్రమత్తును కలిగించాడు మరియు మీపై ఆకాశం నుండి నీటిని కురిపించాడు, దాని ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరచటానికి మీ నుండి షైతాన్ మాలిన్యాన్ని దూరం చేయటానికి మరియు మీ హృదయాలను బలపరచటానికి మరియు మీ పాదాలను స్థిరపరచటానికీ!
Enfal 8:12
నీ ప్రభువు దైవదూతలకు ఇచ్చిన దివ్యజ్ఞానాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను నిశ్చయంగా, మీతో ఉన్నాను. కావున మీరు విశ్వాసులకు ఈ విధంగా ధైర్యస్థైర్యాలను కలిగించండి: 'నేను సత్యతిరస్కారులైన వారి హృదయాలలో భయాన్ని కలిగిస్తాను, అప్పుడు మీరు వారి మెడలపై కొట్టండి మరియు వారి వ్రేళ్ళకొనలను నరికివేయండి.' "
Enfal 8:13
ఇది ఎందుకంటే! వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. కాబట్టి ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తాడో! నిశ్చయంగా, అల్లాహ్ (అలాంటి వానికి) శిక్ష విధించటంలో ఎంతో కఠినుడు.
Enfal 8:14
(ఓ సత్యతిరస్కారులారా!): "ఇదే (మీ శిక్ష), దీనిని మీరు చవిచూడండి! నిశ్చయంగా, సత్యతిరస్కారులకు నరకాగ్ని శిక్ష ఉంటుంది."
Enfal 8:15
ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు సత్యతిరస్కారుల సైన్యాలను యుద్ధరంగంలో ఎదుర్కొన్నప్పుడు, వారికి మీ వీపులు చూపకండి (పారిపోకండి)!
Enfal 8:16
మరియు ఆ దినమున వారికి వీపు చూపినవాడు - యుద్ధతంత్రం కోసమో, లేక (తమవారి) మరొక సమూహంలో చేరటానికో (వెనుదిరిగితే తప్ప) - తప్పక అల్లాహ్ ఆగ్రహానికి పాత్రుడవుతాడు మరియు అతని ఆశ్రయం నరకమే. అది ఎంత చెడ్డ గమ్యస్థానం!
Enfal 8:17
మీరు వారిని చంపలేదు, కానీ అల్లాహ్ వారిని చంపాడు. (ప్రవక్తా!) నీవు (దుమ్ము) విసిరినపుడు, నీవు కాదు విసిరింది,[1] కాని అల్లాహ్ విసిరాడు. మరియు విశ్వాసులను దీనితో పరీక్షించి, వారికి మంచి ఫలితాన్ని ఇవ్వటానికి ఆయన ఇలా చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
———
[1] బద్ర్ యుద్ధ రంగంలో దైవప్రవక్త ('స'అస) పిడికెడు దుమ్ము, అల్లాహ్ (సు.తా.) పేరుతో సత్యతిరస్కారులపై విసిరారు.
Enfal 8:18
ఇదే (ఆయన ఇచ్ఛ!) మరియు నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారుల ఎత్తుగడలను బలహీనపరుస్తాడు.
Enfal 8:19
(ఓ అవిశ్వాసులారా!) మీరు తీర్పు కోరితే, వాస్తవానికి మీకు తీర్పు లభించింది. ఇక మీద మీరు (దుర్మార్గాన్ని) మానుకుంటే అది మీకే మేలైనది. ఒకవేళ మీరు తిరిగి ఇలా చేస్తే మేము కూడా తిరిగి చేస్తాము. అప్పుడు మీ సైనికదళం ఎంత హెచ్చుగా ఉన్నా మీకెలాంటి లాభం చేకూర్చదు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసులతో ఉంటాడు.
Enfal 8:20
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. మరియు మీరు (అతని సందేశాలను) వింటూ కూడా, అతని (ప్రవక్త) నుండి మరలి పోకండి.
Enfal 8:21
మరియు వాస్తవానికి వినకుండానే: "మేము విన్నాము!" అని అనే వారి వలే కాకండి.[1]
———
[1] చూడండి, 2:93 మరియు 4:46.
Enfal 8:22
తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే, నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో నీచాతినీచమైన పశుజాతికి చెందినవారు.[1]
———
[1] చూడండి, 7:179.
Enfal 8:23
మరియు అల్లాహ్ వారిలో కొంతైనా మంచితనాన్ని చూసి ఉంటే, వారిని వినేటట్లు చేసి ఉండేవాడు. (కాని వారిలో మంచితనం లేదు కాబట్టి), ఆయన వారిని వినేటట్లు చేసినా, వారు (తమ మూర్ఖత్వంలో) ముఖాలు త్రిప్పుకొని వెనుదిరిగి పోయేవారు.
Enfal 8:24
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీకు జీవనమిచ్చే దాని వైపునకు, మిమ్మల్ని పిలిచినప్పుడు దానికి జవాబు ఇవ్వండి.[1] మరియు నిశ్చయంగా, అల్లాహ్ మానవునికి మరియు అతని హృదయకాంక్షలకు మధ్య ఉన్నాడనీ మరియు నిశ్చయంగా, మీరంతా ఆయన వద్దనే సమీకరించబడతారని తెలుసుకోండి.
———
[1] అంటే ఖుర్ఆన్ మరియు షరీ'అత్ వైపుకు మరియి జిహాద్ కు. అంటే కేవలం అల్లాహ్ (సు.తా.) మరియు ఆయన ప్రవక్త ('స'అస) ఆజ్ఞలనే అనుసరించండి, అని అర్థం.
Enfal 8:25
మరియు మీలోని దుర్మార్గులకు మాత్రమే గాక (అందరికీ) సంభవించబోయే ఆ విపత్తు గురించి భీతిపరులై ఉండండి. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడని తెలుసుకోండి.
Enfal 8:26
మరియు ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి: అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉన్నారు. భూమిపై మీరు బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని పారద్రోలుతారని (హింసిస్తారని) భయపడే వారు. అప్పుడు ఆయన మీకు ఆశ్రయమిచ్చి తన సహాయంతో మిమ్మల్ని బలపరచి, మీకు మంచి జీవనోపాధిని సమకూర్చాడు, బహుశా మీరు కృతజ్ఞులవుతారని.
Enfal 8:27
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చేయకండి మరియు తెలిసి ఉండి కూడా మీ (పరస్పర) అమానతుల[1] విషయంలో నమ్మకద్రోహం చేయకండి.
———
[1] అమానతుల కొరకు చూడండి, 33:72.
Enfal 8:28
మరియు వాస్తవానికి మీ ఆస్తిపాస్తులు, మీ సంతానం పరీక్షా సాధనాలనీ మరియు నిశ్చయంగా, అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం ఉన్నదనీ తెలుసుకోండి!
Enfal 8:29
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మీకు (మంచి-చెడులను గుర్తించే) విచక్షణా శక్తిని ప్రసాదించి, మీ నుండి మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో సర్వోత్తముడు.
Enfal 8:30
మరియు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారులు, నిన్ను బంధించటానికి నిన్ను హతమార్చటానికి, లేదా నిన్ను వెడలగొట్టటానికి కుట్రలు పన్నుతున్న విషయాన్ని (జ్ఞప్తికి తెచ్చుకో!) వారు కుట్రలు పన్నుతూ ఉన్నారు మరియు అల్లాహ్ కూడా కుట్రలు పన్నుతూ ఉన్నాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే కుట్రలు పన్నటంలో అందరి కంటే ఉత్తముడు.[1]
———
[1] ఇది మక్కా ముష్రిక్ లు దారున్నద్వాలో ము'హమ్మద్ ('స'అస)ను హత్య చేయటానికి; ప్రతి తెగ నుండి ఒక యువకుణ్ణి తయారుచేసిన కుట్ర. వారంతా దైవప్రవక్త ('స'అస), ఇంటి చుట్టు రాత్రివేళ గుమిగూడి, అతని రాకకు ఎదురు చూస్తూ ఉంటారు. అల్లాహ్ (సు.తా.), ఈ విషయం దైవప్రవక్త ('స'అస)కు తెలుపుతాడు. మరియు అతను ('స'అస) పిడికెడు దుమ్ము తీసుకొని, అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించి వారిపై చల్లుతారు. దానితో వారు అతని వెళ్ళిపోవటాన్ని గమనించలేకపోతారు. అతను ('స'అస) అబూబక్ర్ (ర'ది.'అ.) తో సహా 'గారె సూ'ర్ లో చేరుకుంటారు.
Enfal 8:31
మరియు మా సూచనలు (ఆయాత్) వారికి వినిపించబడి నప్పుడు వారు: "వాస్తవానికి, మేము విన్నాము మేము కోరితే మేము కూడా ఇటువంటివి రచించగలము (చెప్పగలము). ఇవి కేవలం పూర్వీకుల గాథలు మాత్రమే!" అని అంటారు.
Enfal 8:32
మరియు వారు: "ఓ అల్లాహ్! ఇది (ఈ ఖుర్ఆన్) నిజంగా నీ తరపు నుండి వచ్చిన సత్యమే అయితే! మాపై ఆకాశం నుండి రాళ్ళ వర్షం కురిపించు! లేదా ఏదైనా బాధాకరమైన శిక్షను మా పైకి తీసుకొనిరా!" అని పలికిన మాట (జ్ఞాపకం చేసుకోండి).
Enfal 8:33
కాని (ఓ ముహమ్మద్!) నీవు వారి మధ్య ఉన్నంత వరకు అల్లాహ్ వారిని ఏ మాత్రం శిక్షించడు. మరియు వారు క్షమాభిక్ష కోరుతూ ఉన్నంత వరకు కూడా! అల్లాహ్ వారిని ఏ మాత్రం శిక్షించడు.
Enfal 8:34
వారి వాదమేమిటీ? అల్లాహ్ వారిని ఎందుకు శిక్షించకూడదు? వారు దాని ధర్మకర్తలు కాకున్నా, వారు ప్రజలను మస్జిద్ అల్ హరామ్ నుండి ఆవుతున్నారు.[1] దాని ధర్మకర్తలు కేవలం దేవభీతి గలవారే కాగలరు. కాని వాస్తవానికి, చాలా మంది ఇది తెలుసుకోలేరు.
———
[1] ముష్రిక్ ఖురైషులు, ముస్లింలు అయిన వారిని క'అబహ్ లోకి ప్రవేశించకుండా ఆపేవారు.
Enfal 8:35
మరియు (అల్లాహ్) గృహం (కఅబహ్) వద్ద వారి ప్రార్థనలు, కేవలం ఈలలు వేయటం (ముకాఅ) మరియు చప్పట్లు కొట్టడం (తస్దియహ్) తప్ప మరేమీ లేవు. కావున మీ సత్యతిరస్కారానికి బదులుగా ఈ శిక్షను రుచి చూడండి.[1]
———
[1] ఇదే విధంగా ఈ కాలంలో కూడా మూఢులైన 'సూఫీలు, మస్జిద్ లలో మరియు ఆస్థానాలలో డోలు కొట్టుతూ నాట్యం చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈ విధంగానే మేము అల్లాహుతా'ఆలాను సంతోషపరుస్తాము, అని అంటారు. అల్లాహ్ (సు.తా.) విశ్వాసులను ఇలాంటి విషయాల నుండి కాపాడుగాక!
Enfal 8:36
నిశ్చయంగా, సత్యతిరస్కారులు, ప్రజలను అల్లాహ్ మార్గం వైపునకు రాకుండా ఆపటానికి, తమ ధనం ఖర్చు చేస్తారు. వారు ఇలాగే ఖర్చు చేస్తూ ఉంటారు; చివరకు అది వారి వ్యసనానికి (దుఃఖానికి) కారణమవుతుంది. తరువాత వారు పరాధీనులవుతారు. మరియు సత్యతిరస్కారులైన వారు నరకం వైపుకు సమీకరించబడతారు.
Enfal 8:37
ఇదంతా అల్లాహ్, చెడును (దుష్టులను) మంచి (సత్పురుషుల) నుండి వేరు చేసి, దుష్టులందరినీ ఒకరితో పాటు మరొకరిని చేకూర్చి, ఒక గుంపుగా చేసి వారందరినీ నరకంలో పడవేయటానికి. ఇలాంటి వారు, వారే నష్టపోయేవారు!
Enfal 8:38
సత్యతిరస్కారులతో ఇలా అను: ఒకవేళ వారు మానుకుంటే గడిచిపోయింది క్షమించబడుతుంది. కాని వారు (పూర్వ వైఖరినే) మళ్ళీ అవలంబిస్తే! వాస్తవానికి, (దుష్టులైన) పూర్వీకుల విషయంలో జరిగిందే, మరల వారికి సంభవిస్తుంది![1]
———
[1] అంటే వారు సత్యతిరస్కారం మరియు దుష్ట కర్మలలో మునిగి ఉంటే, వారిపై అల్లాహుతా'ఆలా శిక్ష తప్పక పడుతుందని తెలుసుకోవాలి.
Enfal 8:39
మరియు అధర్మం (ఫిత్న)[1] ఏ మాత్రం మిగలకుండా పోయే వరకు మరియు ఆరాధన (ధర్మం) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడనంత వరకు వారితో (సత్యతిరస్కారులతో) పోరాడుతూ ఉండండి. కాని వారు (పోరాడటం) మానుకుంటే! నిశ్చయంగా అల్లాహ్ వారి కర్మలను గమనిస్తున్నాడు.
———
[1] ఫిత్నతున్: అంటే ఇక్కడ సత్యతిరస్కారం మరియు అధర్మం అని అర్థం. చూడండి,2:193. ఈ విధమైన ఆయతే అక్కడ కూడా ఉంది. ఇంకా చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 24 మరియు పుస్తకం - 3, 'హదీస్' నం. 425.
Enfal 8:40
మరియు ఒకవేళ వారు తిరిగిపోతే! నిశ్చయంగా, అల్లాహ్ మీ స్నేహితుడు (సంరక్షకుడు) అని తెలుసుకోండి. ఆయనే ఉత్తమ స్నేహితుడు (సంరక్షకుడు) మరియు ఉత్తమ సహాయకుడూను!
Enfal 8:41
మరియు మీ విజయధనంలో[1] నిశ్చయంగా, అయిదవ భాగం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు మరియు (అతని) దగ్గరి బంధువులకు మరియు అనాధులకు మరియు యాచించని పేదవారికి[2] మరియు ప్రయాణీకులకు ఉందని తెలుసుకోండి, ఒకవేళ మీరు - అల్లాహ్ ను మరియు మేము సత్యాసత్యాల అంతరాన్ని విశదం చేసే దినమున, ఆ రెండు సైన్యాలు మార్కొనిన (బద్ర్ యుద్ధ) దినమున, మా దాసునిపై అవతరింపజేసిన దానిని - విశ్వసించేవారే అయితే! మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.[3]
———
[1] 'గనీమతున్: విజయధనం, అంటే సత్యతిరస్కారులతో జరిగిన ధర్మయుద్ధంలో గెలుపు పొందిన తరువాత ముస్లింలకు దొరికేదంతా. [2] ఇక్కడ అల్-మిస్కీనున్, అనే శబ్దం ఉంది. ఇది అల్ ఫుఖరా కంటే భిన్నమైనది. ఫఖీరున్ - అంటే ఏమీ లేనందుకు ఇతరుల నుండి యాచించే వాడు. మిస్కీన్ అంటే అతని దగ్గర కొంత ఆదాయం ఉంది, కాని అది అతని నిత్యావసరాలకు పూర్తి కాదు. ఇట్టివారు తమ స్వాభిమానం వల్ల ఇతరులను సహాయానికై యాచించారు. [3] బద్ర్ యుద్ధం - యుద్ధ సామగ్రి తక్కువ తీసుకొని కేవలం వాణిజ్య బిడారాన్ని దోచుకోవటానికి వచ్చిన 313 ముస్లింలు మరియు వారిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో! అత్యధిక యుద్ధసామగ్రితో వచ్చిన ముష్రిక్ ఖురైషుల మధ్య జరిగింది. అల్లాహ్ (సు.తా.) తాను పంపిన ప్రవక్త ము'హమ్మద్ ('స'అస) సత్యవంతుడు, సన్మార్గంపై ఉన్నాడు మరియు తాను పంపిన, జీవన మార్గమే (ఇస్లామే), మోక్షం (స్వర్గం) పొందటానికి సరైన మార్గమని నిరూపించదలచి, ఈ యుద్ధాన్ని చేయించి, ముస్లింలకు విజయాన్ని చేకూర్చి, సత్యాసత్యాల మధ్య భేదాన్ని నిరూపించాడు. చివరకు సత్యమే వర్ధిల్లుతుందని చూపాడు.
Enfal 8:42
(ఆ దినాన్ని గుర్తుకు తెచ్చుకోండి!) అప్పుడు మీరు లోయలో (మదీనాకు) సమీపంగా ఉన్న స్థలంలో ఉన్నారు మరియు వారు (ముష్రికులు) దూరంగా ఉన్న స్థలంలో ఉన్నారు.[1] మరియు బిడారం మీకు క్రింది (ఒడ్డు) వైపునకు. ఒకవేళ మీరు (ఇరువురు) యుద్ధం చేయాలని నిర్ణయించుకొని ఉంటే! మీరు మీ నిర్ణయాన్ని పాటించకుండా ఉండేవారు. కాని అల్లాహ్ తాను నిర్ణయించిన కార్యాన్ని పూర్తి చేయటానికి, నశించేవాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత నశించాలని మరియు జీవించేవాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత జీవించాలని అలా చేశాడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
———
[1] 'ఉద్ వతిద్దునియా: సమీప స్థలం. అంటే బద్ర్ లోయలో, మదీనా నుండి సమీపంలో నున్న స్థలం. మరియు 'ఉద్వతిల్ ఖు'స్ వా: అంటే, బద్ర్ లోయలో, మొదటి స్థలంతో పోల్చితే మదీనా నుండి దూరంగా ఉన్న స్థలం.
Enfal 8:43
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు, నీ స్వప్నంలో వారిని కొద్దిమందిగా చూపింది (జ్ఞాపకం చేసుకో)! వారిని ఎక్కువ మందిగా నీకు చూపి ఉంటే, మీరు తప్పక ధైర్యాన్ని కోల్పోయి (యుద్ధ) విషయంలో వాదులాడే వారు. కాని వాస్తవానికి, అల్లాహ్ మిమ్మల్ని రక్షించాడు. నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు.
Enfal 8:44
మరియు (జ్ఞాపకం చేసుకోండి) అల్లాహ్ నెరవేర్చవలసిన పనిని నెరవేర్చటానికి - మీరు (బద్ర్ యుద్ధరంగంలో) మార్కొనినపుడు - వారి (అవిశ్వాసుల) సైన్యాన్ని మీ కన్నులకు కొద్దిగా చూపాడు మరియు మిమ్మల్ని కొద్దిమందిగా వారికి చూపాడు. మరియు అన్ని వ్యవహారాలూ (నిర్ణయానికి) అల్లాహ్ వైపునకే మరలింపబడతాయి.
Enfal 8:45
ఓ విశ్వాసులారా! మీరు ఏ సైన్యాన్నైనా ఎదుర్కొనేటప్పుడు, స్థైర్యంతో ఉండండి. మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తే, మీరు సాఫల్యం పొందవచ్చు!
Enfal 8:46
మరియు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి మరియు పరస్పర కలహాలకు గురి కాకండి, అట్లు చేస్తే మీరు బలహీనులవుతారు మరియు మీ బలసాహసాలు తగ్గిపోతాయి. మరియు సహనం వహించండి నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించే వారితో ఉంటాడు.
Enfal 8:47
మరియు తమ గృహాల నుండి, ప్రజలకు చూపటానికి దురాభిమానంతో బయలుదేరి ఇతరులను అల్లాహ్ మార్గం నుండి ఆపేవారి వలే కాకండి. మరియు వారు చేసే క్రియలన్నింటినీ అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు.
Enfal 8:48
మరియు (జ్ఞాపకం చేసుకోండి అవిశ్వాసులకు) వారి కర్మలు ఉత్తమమైనవిగా చూపించి షైతాన్ వారితో అన్నాడు: "ఈ రోజు ప్రజలలో ఎవ్వడునూ మిమ్మల్ని జయించలేడు, (ఎందుకంటే) నేను మీకు తోడుగా ఉన్నాను." కాని ఆ రెండు పక్షాలు పరస్పరం ఎదురు పడినపుడు, అతడు తన మడమలపై వెనకకు మరలి అన్నాడు: " వాస్తవంగా, నాకు మీతో ఎలాంటి సంబంధం లేదు, మీరు చూడనిది నేను చూస్తున్నాను. నిశ్చయంగా, నేను అల్లాహ్ కు భయపడుతున్నాను.[1] మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడు."
———
[1] చూడండి, 59:16.
Enfal 8:49
కపట విశ్వాసులు మరియు ఎవరి హృదయాలలో రోగముందో వారు: "వీరిని (ఈ విశ్వాసులను) వీరి ధర్మం మోసపుచ్చింది." అని అంటారు, కాని అల్లాహ్ యందు నమ్మకం గలవాని కొరకు, నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు.
Enfal 8:50
మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దేవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ ఇలా అంటారు: "భగభగమండే ఈ నరకాగ్ని శిక్షను చవి చూడండి.[1]
———
[1] చూడండి, 6:93.
Enfal 8:51
ఇది మీరు స్వయంగా మీ చేతులారా చేసి పంపిన కర్మల ఫలితమే! మరియు నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఏ మాత్రం అన్యాయం చేయడు."
Enfal 8:52
ఫిర్ఔన్ జాతి వారి మరియు వారికి పూర్వం వారి మాదిరిగా, వీరు కూడా అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారి పాపాల ఫలితంగా వారిని శిక్షించాడు. నిశ్చయంగా అల్లాహ్ మహా బలవంతుడు, శిక్ష విధించటంలో చాలా కఠినుడు.[1]
———
[1] షదీద్ అల్ - 'ఇఖాబ్: Severe in Chastising కఠినంగా శిక్షించేవాడు, పటిష్టంగా పట్టుకునేవాడు.
Enfal 8:53
ఇది ఎందుకంటే! వాస్తవానికి, ఒక జాతి వారు, తమ నడవడికను తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారికి ప్రసాదించిన తన అనుగ్రహాన్ని ఉపసంహరించుకోడు.[1] మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
———
[1] చూడండి, 13:11.
Enfal 8:54
ఫిర్ఔన్ జాతివారు మరియు వారికి పూర్వం వారి మాదిరిగా! వీరు కూడా తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) అబద్ధాలను నిరాకరించారు. కాబట్టి వారి పాపాలకు ఫలితంగా వారిని నాశనం చేశాము. మరియు ఫిర్ఔను జాతి వారిని ముంచి వేశాము. మరియు వారందరూ దుర్మార్గులు.[1]
———
[1] అల్లాహ్ (సు.తా.) ఎవరికీ అన్యాయం చేయడు. చూడండి, 41:46.
Enfal 8:55
నిశ్చయంగా, అల్లాహ్ దృష్టిలో సత్యాన్ని తిరస్కరించే వారు నీచాతినీచమైన జీవులు, ఇక వారు విశ్వసించరు.[1]
———
[1] సత్యతిరస్కారులు అల్లాహ్ (సు.తా.) దృష్టిలో మానవులలోనే కాదు, జంతువులలో కూడా నీచాతి నీచ జాతికి చెందిన వారు అర్థం.
Enfal 8:56
వారిలో ఎవరితోనైతే నీవు ఒడంబడిక చేసుకున్నావో! వారు ప్రతిసారీ తమ ఒడంబడికను భంగపరుస్తున్నారు. మరియు వారికి దైవభీతి లేదు.[1]
———
[1] కొందరు వ్యాఖ్యాతలు, వీరు బనూ-ఖురై"జహ్ అనే యూద తెగవారు అని అంటారు. కందక యుద్ధకాలంలో వీరు సత్యతిరస్కారులకు సహాయపడమని దైవప్రవక్త ('స'అస)తో ఒడంబడిక చేసుకుంటారు. కాని వారు తమ ఒడంబడికకు కట్టుబడి ఉండరు. దీని మరొక భావం ఏమిటంటే ముస్లింలు, ఇతర ధర్మాల వారితో ఒప్పందాలు చేసుకొని వారితో శాంతియుతంగా నివసించడం, ధర్మ సమ్మతం మరియు యుక్తమైనది కూడాను. కాని వారు బహిరంగంగా విశ్వాసఘాతానికి పూనుకుంటే వారితో పోరాడాలి.
Enfal 8:57
ఒకవేళ నీవు యుద్ధరంగంలో వారిపై ప్రాబల్యం పొందితే - వారి వెనుక ఉన్నవారు చెల్లాచెదరై పోయేటట్లుగా - వారిని శిక్షించు. బహుశా వారు గుణపాఠం నేర్చుకోవచ్చు!
Enfal 8:58
మరియు ఒకవేళ నీకు ఏ జాతి వారి వల్లనైనా నమ్మకద్రోహం జరుగుతుందనే భయం ఉంటే - మీరు ఇరుపక్షం వారు సరిసమానులని తెలుపటానికి[1] - (వారి ఒప్పందాన్ని) వారి వైపుకు విసరివేయి. నిశ్చయంగా, అల్లాహ్ నమ్మకద్రోహులంటే ఇష్టపడడు.
———
[1] 'అలా సవాఇన్: అంటే సరిసమానులని తెలుపటానికి. అంటే మీరు ఒడంబడికను త్రెంపి నందుకు మేము కూడా ఆ ఒడంబడికను త్రెంపుతున్నాము. ఇక మీదట ప్రతి ఒక్కరు తమ రక్షణకు తామే బాధ్యులని, స్పష్టం చేయటం.
Enfal 8:59
మరియు సత్యతిరస్కారులు, తాము తప్పించుకున్నామని భావించ నవసరంలేదు. నిశ్చయంగా, వారు (అల్లాహ్ శిక్ష నుండి) తప్పించుకోలేరు.
Enfal 8:60
మరియు మీరు మీ శక్తి మేరకు బలసామగ్రిని, యుద్ధపు గుర్రాలను సిద్ధపరచుకొని, దాని ద్వారా అల్లాహ్ కు శత్రువులైన మీ శత్రువులను మరియు అల్లాహ్ కు తెలిసి, మీకు తెలియని ఇతరులను కూడా భయకంపితులుగా చేయండి. మరియు అల్లాహ్ మార్గంలో మీరు ఏమి ఖర్చు చేసినా దాని ఫలితం మీకు పూర్తిగా చెల్లించ బడుతుంది. మరియు మీకెలాంటి అన్యాయం జరగదు.
Enfal 8:61
కాని ఒకవేళ వారు శాంతి వైపుకు మొగ్గితే నీవు కూడా దానికి దిగు మరియు అల్లాహ్ పై ఆధారపడు.[1] నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
———
[1] చూడండి, 47:35 మరియు 8:39.
Enfal 8:62
కాని ఒకవేళ వారు నిన్ను మోసగించాలని సంకల్పిస్తే! నిశ్చయంగా, నీకు అల్లాహ్ యే చాలు. ఆయనే తన సహాయం ద్వారా మరియు విశ్వాసుల ద్వారా నిన్ను బలపరుస్తాడు.
Enfal 8:63
మరియు ఆయనే వారి (విశ్వాసుల) హృదయాలను కలిపాడు. ఒకవేళ నీవు భూమిలో ఉన్న సమస్తాన్ని ఖర్చు చేసినా, వారి హృదయాలను కలుపజాలవు. కాని అల్లాహ్ యే వారి మధ్య ప్రేమను కలిగించాడు.[1] నిశ్చయంగా, ఆయన సర్వ శక్తిసంపన్నుడు, మహా వివేచనాపరుడు.
———
[1] చూడండి, 3:103. 'హునైన్ విజయధనం పంచేటప్పుడు ము'హమ్మద్ ('స'అస) మదీనా అన్సార్ లను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి చూడండి, ('స'హీ'హ్ బు.'ఖారీ, కితాబ్ అల్ మ'గా'జీ, బాబ్ 'గ'జ్ వత్ అ'త్తాయ'ఫ్, 'స.ముస్లిం కితాబ్ అ'జ్జకాత్, బాబ్ ఇ'అతా' అల్ - ముఅ'ల్లఫత్ ఖులూబుహుమ్ 'అలా అల్-ఇస్లాం).
Enfal 8:64
ఓ ప్రవక్తా! నీకూ మరియు నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాహ్ యే చాలు!
Enfal 8:65
ఓ ప్రవక్తా! విశ్వాసులను యుద్ధానికి ప్రోత్సహించు. మీలో ఇరవై మంది స్థైర్యం గల వారుంటే, వారు రెండు వందల మందిని జయించగలరు. మరియు మీరు వంద మంది ఉంటే వేయి మంది సత్యతిరస్కారులను జయించగలరు. ఎందుకంటే వారు (సత్యాన్ని) గ్రహించలేని జాతికి చెందిన వారు.[1]
———
[1] చూడండి, 6:25, 7:179, 9:87.
Enfal 8:66
ఇప్పుడు అల్లాహ్ మీ భారాన్ని తగ్గించాడు, ఎందుకంటే వాస్తవానికి, మీలో బలహీనత ఉన్నదని ఆయనకు తెలుసు. కాబట్టి మీలో వందమంది స్థైర్యం గలవారు ఉంటే వారు రెండు వందల మందిని జయించగలరు. మరియు మీరు వేయి మంది ఉంటే, అల్లాహ్ సెలవుతో రెండు వేల మందిని జయించగలరు. మరియు అల్లాహ్ సహనం గలవారితో ఉంటాడు.
Enfal 8:67
(శత్రువులతో తీవ్రంగా పోరాడి, వారిని) పూర్తిగా అణచనంత వరకు, తన వద్ద యుద్ధఖైదీలను ఉంచుకోవటం ధరణిలో, ఏ ప్రవక్తకూ తగదు.[1] మీరు ప్రాపంచిక సామగ్రి కోరుతున్నారు. కాని అల్లాహ్ (మీ కొరకు) పరలోక (సుఖాన్ని) కోరుతున్నాడు. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.
———
[1] చూడండి, 47:4. ఈ ఆయత్ సారాంశం ఏమిటంటే: ఎంత వరకైతే శత్రువులను హతమార్చి, వారిపై పూర్తిగా ప్రాబల్యాన్ని పొందరో, జయించరో! అంత వరకు, వారితో పోరాడి వారిని హతమార్చాలి, వారి యుద్ధం చేయగల శక్తిని పూర్తిగా అంతమొందించాలి. ఆ తరువాతనే వారి యుద్ధ ఖైదీలను విమోచనాధనం తీసుకొని విడిచే విషయం గురించి ఆలోచించాలి, లేనిచో అవకాశం దొరకగానే వారు మిమ్మల్ని, నిర్మూలించటానికి ప్రయత్నించవచ్చు!
Enfal 8:68
ఒకవేళ అల్లాహ్ (ఫర్మానా) ముందే వ్రాయబడి ఉండకపోతే, మీరు తీసుకున్న దానికి (నిర్ణయానికి) మీకు ఘోరశిక్ష విధించబడి ఉండేది.[1]
———
[1] ఈ ఆయత్ 67వ ఆయత్ తరువాత అవతరింపజేయబడింది. 'వ్రాయబడిన మాట'ను గురించి వ్యాఖ్యాతలలో భేదాభిప్రాయాలున్నాయి. కొందరు ఇది విజయధనం అంటారు. అందుకే ఫిద్య తీసుకున్నా క్షమించబడ్డారు అంటారు. మరికొందరు బద్ర్ యుద్ధంలో పాల్గొన్నవారి 'పాపాలన్నీ క్షమించబడిన' విషయం అంటారు. మరికొందరు, దైవప్రవక్త వారి మధ్య ఉండటమే క్షమాపణకు కారణం అంటారు. బద్ర్ యుద్ధంలో ఖైదీలైన 70 మంది ముష్రిక్ ఖురైషులను విమోచనాధనం (ఫిద్య) తీసుకొని విడిచిన తరువాత ఈ ఆయత్ మరియు దీని మునుపటి మరియు దీని తరువాత ఆయత్ లు అవతరింపజేయబడ్డాయి. వివరాలకు చూడండి, ఫ'త్హ అల్ ఖదీర్.
Enfal 8:69
కావున మీకు ధర్మసమ్మతంగా లభించిన ఉత్తమమైన విజయధనాన్ని అనుభవించండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Enfal 8:70
ఓ ప్రవక్తా! నీ ఆధీనంలో ఉన్న యుద్ధఖైదీలతో ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ మీ హృదయాలలో మంచితనం చూస్తే ఆయన మీ వద్ద నుండి తీసుకున్న దాని కంటే ఎంతో ఉత్తమమైన దానిని మీకు ప్రసాదించి ఉంటాడు. మరియు మిమ్మల్ని క్షమించి ఉంటాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."[1]
———
[1] చూడండి, 47:4.
Enfal 8:71
కాని ఒకవేళ వారు నీకు నమ్మక ద్రోహం చేయాలని తలచుకుంటే, వారు ఇంతకు పూర్వం అల్లాహ్ కు నమ్మకద్రోహం చేశారు, కావున వారిపై నీకు శక్తినిచ్చాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
Enfal 8:72
నిశ్చయంగా, విశ్వసించి వలస పోయే వారూ మరియు తమ సంపద మరియు ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడేవారూ,[1] వారికి ఆశ్రయమిచ్చేవారూ మరియు సహాయం చేసేవారూ,[2] అందరూ ఒకరికొకరు మిత్రులు.[3] మరియు ఎవరైతే విశ్వసించి వలస పోలేదో వారు, వలస పోనంత వరకు వారి మైత్రిత్వంతో మీకు ఎలాంటి సంబంధం లేదు. కాని వారు ధర్మం విషయంలో మీతో సహాయం కోరితే, వారికి సహాయం చేయటం మీ కర్తవ్యం; కాని మీతో ఒడంబడిక ఉన్న జాతి వారికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా చూస్తున్నాడు.
———
[1] వీరు వలసపోయిన 'స'హాబీలు, మొదటి శ్రేణివారు. [2] వీరు మదీనా ముస్లింలు (అన్సారులు), రెండవ శ్రేణివారు. [3] మౌలా: అంటే మిత్రుడు, స్నేహితుడు, సమర్థుడు, సహాయకుడు, సహకారుడు, ఆశ్రయమిచ్చేవాడు, సన్నిహితుడు, సంరక్షకుడు, స్వామి, బంధువు, కార్యకర్త, వారసుడు.
Enfal 8:73
మరియు సత్యతిరస్కారులు ఒకరికొకరు స్నేహితులు. కావున (ఓ విశ్వాసులారా!) మీరు కూడా అలా చేయక (విశ్వాసుల మధ్య పరస్పర మైత్రిత్వాన్ని పెంచక) పోతే, భూమిలో ఉపద్రవం మరియు కల్లోలం చెలరేగుతాయి.
Enfal 8:74
మరియు ఎవరైతే విశ్వసించి వలస పోయి అల్లాహ్ మార్గంలో పోరాడారో వారూ మరియు ఎవరైతే వారికి ఆశ్రయమిచ్చి సహాయపడ్డారో వారూ; ఇలాంటి వారే నిజమైన విశ్వాసులు. వారికి వారి (పాపాల) క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి.
Enfal 8:75
మరియు ఎవరైతే తరువాత విశ్వసించి మరియు వలస పోయి మరియు మీతో బాటు (అల్లాహ్ మార్గంలో) పోరాడారో, వారు కూడా మీ వారే! కాని అల్లాహ్ గ్రంథం ప్రకారం, రక్తసంబంధం గలవారు (వారసత్వ విషయంలో) ఒకరిపై నొకరు ఎక్కువ హక్కుదారులు.[1] నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.
———
[1] విశ్వాసులు (ముస్లింలందరు) ఒకరికొకరు సహోదరులు, 49:10. కాని వారసత్వపు విషయంలో ముస్లిం బంధువులే ఒకరికొకరు వారసులవుతారు. ఒక ముస్లిం అవిశ్వాసికి గానీ, లేక ఒక అవిశ్వాసి ముస్లింనకు గానీ వారసులు కాలేరు.
Tevbe 9:1
అల్లాహ్ తరఫు నుండి మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి (ఓ విశ్వాసులారా!) మీరు ఒడంబడిక చేసుకున్న బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) ఎలాంటి సంబంధం లేదు, అని ప్రకటించబడుతోంది.[1]
———
[1] బరా'తున్: అంటే ఎట్టి సంబంధం లేదనటం. ఈ ఆయత్ లు అంవతరింపజేయబడినప్పుడు దైవప్రవక్త ('స'అస) 'అలీ ('ర.ది.అ.ను) 9వ హిజ్రీ 'హజ్ జనసమూహంలో ఈ విషయాలను ప్రకటించమని పంపారు: 1) ప్రజలు క'అబహ్ (బైతుల్లాహ్) చుట్టూ దిగంబరులై ప్రదక్షిణ ('తవాఫ్) చేయకూడదు. 2) ఈ సంవత్సరం (9 హిజ్రీ) తరువాత ఏ ముష్రిక్ కూడా బైతుల్లాహ్ ('హజ్)కు రాకూడదు. 3) ఏ అవిశ్వాసులతోనైతే ఒడంబడిక ఉందో, వారి యెడల గడువు పూర్తి అయ్యేవరకు విశ్వాసపాత్రంతో వ్యవహరించడం జరుగుతుంది. ('స. బు'ఖారీ మరియు 'స. ముస్లిం). ఆ 9వ హిజ్రీ 'హజ్ కు అబూ బక్ర్ 'సిద్ధీఖ్ (ర.'ది.అ.) అమీర్ గా ఉన్నారు.
Tevbe 9:2
కావున (ఓ ముష్రికులారా!) మీరు నాలుగు నెలల వరకు ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగండి[1]. కాని మీరు అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్! సత్యతిరస్కారులను అవమానం పాలు చేస్తాడు.
———
[1] చూడండి, 8:58. ఈ ఆయత్, ముస్లింలతో చేసిన ఒడంబడికను, త్రెంపిన ముష్రికులను ఉద్దేశించి ఉంది.
Tevbe 9:3
మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి పెద్ద హజ్జ్[1] రోజున సర్వమానవ జాతికి ప్రకటన చేయబడుతోంది: "నిశ్చయంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు, బహుదైవారాధకులతో, ఎలాంటి సంబంధం లేదు. కావున మీరు (ఓ ముష్రికులారా!) పశ్చాత్తాపపడితే, అది మీ మేలుకే. కాని మీరు విముఖులైతే, మీరు అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి." మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష (విధించబడ) నున్నదనే వార్తను వినిపించు.
———
[1] యౌమల్ 'హజ్జిల్-అక్బర్: అంటే 10వ జు'ల్-'హజ్ దినమని 'స'హీ'హ్ 'హదీసుల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు 'హాజీలకు చాలా మనాసిక్ లను పూర్తి చేయవలసి ఉంటుంది. అది 'హజ్జె 'అస్గర్ కు భిన్నపదం. అరేబియా వాసులు, 'ఉమ్ రాను చిన్న హజ్ ('హజ్ 'అస్గర్) అనేవారు. దీనికి భిన్నంగా జు'ల్-'హజ్ మాసంలో జరిగేది పెద్ద హజ్ (హ'జ్ అక్బర్). 9వ జు'ల్-'హజ్ శుక్రవారం రోజు వస్తే 'హజ్జె అక్బర్ అనే దానికి ఎలాంటి ఆధారం లేదు. ('స.బు'ఖారీ, నం4655, 'స. ముస్లిం, నం. 982 మరియు తిర్మిజీ', నం. 957).
Tevbe 9:4
కాని ఏ బహుదైవాధకులతోనైతే మీరు ఒడంబడికలు చేసుకొని ఉన్నారో, వారు మీకు ఏ విషయంలోను లోపం చేయక, మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయకుండా ఉంటే! వారి ఒడంబడికను దాని గడువు వరకు పూర్తి చెయ్యండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు.
Tevbe 9:5
ఇక నిషిద్ధమాసాలు[1] గడిచిపోయిన తరువాత బహుదైవారాధకులను, ఎక్కడ దొరికితే అక్కడ వధించండి.[2] మరియు వారిని పట్టుకోండి[3] మరియు చుట్టుముట్టండి మరియు ప్రతి మాటు వద్ద వారికై పొంచి ఉండండి[4]. కాని వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే, వారిని వారి మార్గాన వదలి పెట్టండి.[5] నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
———
[1] హిజ్రీ శకంలోని రజబ్, జు'ల్-ఖాయిదహ్, జు'ల్-'హిజ్జహ్ మరియు ము'హర్రమ్ నెలలు నిషిద్ధమాసాలు. ఈ మాసాలలో యుద్ధం నిషిద్ధం. ఇది 'అరబ్బులలో ఇస్లాంకు ముందు నుండి వస్తూ ఉన్న ఆచారం. చూడండి, 2:194, 217. ఇబ్నె-కసీ'ర్ (ర'హ్మ) ఇక్కడ (ఈ ఆయత్ లో) నిషిద్ధమాసాలు అంటే ఈ ప్రకటన తరువాత నాలుగు నెలలు అంటే 10వ జు'ల్-'హిజ్జహ్ నుండి 10వ రబీ'అ-అత్తాని వరకు, అని అన్నారు. [2] 'హరమ్ సరిహద్దులలో కేవలం వారితోనే పోరాడాలి, ఎవరైతే మీపై దాడి చేస్తారో! చూడండి,2:190-194, (ఇబ్నె-కసీ'ర్). మీతో యుద్ధం చేసే వారితోఅల్లాహ్ (సు.తా.) మార్గంలో పోరాడండి. ఎవరైతే మీతో విరోధాలు చేయరో, వారితో పోరాడవద్దు. జిహాద్ అంటే, మీరు ముస్లింలు అయి ఉండి. ఇతరులకు శాంతియుతంగా ఏక దైవసిద్ధాంతాం, సత్యధర్మం అయిన ఇస్లాంను బోధిస్తూ ఉంటే, మీ మార్గంలో ఆటంకాలు పెడుతూ, మీ ధన, మాన, ప్రాణాలకు హాని గలిగించగోరే వారితో, వారు మానుకునే వరకు లేదా నిర్మూలించబడే వరకు చేసే ధర్మయుద్ధం. చూడండి, 4:91. అంటే ఆత్మ సంరక్షణ కొరకు చేసే పోరాటం జిహాద్. చూడండి, 60:8-9. [3] ఖైదీలుగా చేసుకొనండి. [4] వారి రాకపోకడలపై కాపలా పెట్టండి. మీ అనుమతి లేనిదే వారిని కదలనివ్వకండి. వారి నివాస స్థలాలను కాపెట్టుకొని ఉండండి. [5] చూడండి, 2:256. 'ధర్మ విషయంలో బలవంతం లేదు.' అంటే ఎవ్వరినీ కూడా ఇస్లాం స్వీకరించటానికి బలవంతం చేయకూడదు.
Tevbe 9:6
మరియు బహుదైవారాధకులలో (ముష్రికీన్ లలో) ఎవడైనా నీ శరణు కోరితే - అతడు అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) వినటానికి - అతడికి శరణు ఇవ్వు. తరువాత అతడిని, అతడి కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు. ఇది ఎందుకంటే! వాస్తవానికి, వారు (సత్యం) తెలియని ప్రజలు. [1]
———
[1] పై ఆయత్ మీతో యుద్ధం చేస్తున్న సత్యతిరస్కారుల విషయంలో అవతరింపజేయబడింది. ఈ విరోధులైన సత్యతిరస్కారులలో ఎవడైనా మీ శరణు కోరితే అతనికి శరణు ఇవ్వండి. అతడు మీతో ఉండి మీ మంచితనాన్ని మరియు ఇస్లాంను దగ్గరనుండి చూసి ఖుర్ఆన్ విని ముస్లిం కావచ్చు. అతడు ఖుర్ఆన్ ను విన్న తరువాత కూడా ఇస్లాం స్వీకరించకుంటే అతనిని, అతనికి భద్రతనిచ్చే స్థలానికి పంపండి. అతడు ముస్లిం కాకున్నా సరే. మీరిచ్చిన శరణపు ప్రతిజ్ఞను పూర్తి చేసుకోండి. అతడు తన భద్రతాస్థలానికి చేరేంత వరకు వాని ప్రాణ రక్షణ మీ బాధ్యత.
Tevbe 9:7
బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? మస్జిద్ అల్ హరామ్ వద్ద మీరు ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప! వారు తమ (ఒడంబడికపై) స్థిరంగా ఉన్నంత వరకు మీరు కూడా దానిపై స్థిరంగా ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు.
Tevbe 9:8
(వారితో ఒడంబడిక) ఎలా సాధ్యం కాగలదు? ఎందుకంటే వారు మీపై ప్రాబల్యం వహిస్తే, వారు మీ బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు. వారు కేవలం నోటి మాటలతోనే మిమ్మల్ని సంతోష పరుస్తున్నారు. కాని వారి హృదయాలు మాత్రం మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాయి మరియు వారిలో అనేకులు అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు.
Tevbe 9:9
వారు అల్లాహ్ సూక్తులను (ఆయాత్ లను) అల్పధరకు విక్రయించి, ప్రజలను ఆయన మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. నిశ్చయంగా, వారు చేసే పనులు ఎంతో నీచమైనవి!
Tevbe 9:10
వారు ఏ విశ్వాసి విషయంలో కూడా బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు! ఇటువంటి వారే, హద్దును అతిక్రమించినవారు.
Tevbe 9:11
కావున వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే! వారు మీ ధార్మిక సోదరులు. మరియు తెలుసుకోగల వారికి, మేము మా సూచనలను, ఈ విధంగా స్పష్టపరుస్తున్నాము.
Tevbe 9:12
మరియు వారు ఒడంబడిక చేసిన తరువాత, మళ్ళీ తమ ప్రమాణాలను భంగం చేస్తే! మరియు మీ ధర్మాన్ని అవమానపరిస్తే, అలాంటి సత్యతిరస్కారుల నాయకులతో మీరు యుద్ధం చేయండి. నిశ్చయంగా, వారి ప్రమాణాలు నమ్మదగినవి కావు. బహుశా ఈ విధంగానైనా వారు మానుకోవచ్చు![1]
———
[1] ఎవరైతే ఒడంబడిక చేసిన తరువాత తమ ఒండబడికలను భంగం చేస్తారో మరియు మీ ధర్మాన్ని అవమానపరుస్తారో, అలాంటి సత్యతిరస్కారులతో యుద్ధం చేయండి.
Tevbe 9:13
ఏమీ? ఎవరైతే తమ ప్రమాణాలను భంగం చేసి, సందేశహరుణ్ణి (మక్కా నుండి) వెడల గొట్టాలని నిర్ణయించారో! మరియు మొదట వారే, మీతో తగవు ఆరంభించారో,[1] అలాంటి వారితో మీరు యుద్ధం చేయరా? ఏమీ? మీరు వారికి భయపడుతున్నారా? వాస్తవానికి మీరు విశ్వాసులే అయితే, కేవలం అల్లాహ్ కు మాత్రమే భయపడటం మీ కర్తవ్యం.
———
[1] బహుశా ఇక్కడ ఖురైషులు తమ ఒడంబడికకు విరుద్ధంగా బనీ-'ఖు'జా'అ వారిని చంపటానికి, బనీ-బక్ర్ వారికి తోడ్పడిన విషయం పేర్కొనబడింది. బనీ-'ఖు'జా'అ - ముస్లింల హలీఫ్ లు, మరియు బనీ-బక్ర్ - ఖురైషుల హలీఫ్ లు. దైవప్రవక్త ('స'అస) మరియు మక్కా ముష్రిక్ ఖురైషుల మధ్య: 'పది సంవత్సరాల వరకు - వారి మధ్య మరియు వారి హలీఫ్ లతో కూడా - యుద్ధం చేయకూడదు మరియు వారితో పోరాడే వారికి సహాయం కూడా చేయరాదు.' అనే, ఒడంబడిక ఉండెను. ఇది 6వ హిజ్రీలో హుదైబియాలో జరిగిన ఒడంబడిక.
Tevbe 9:14
వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు మరియు వారిని అవమానం పాలు చేస్తాడు. మరియు వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు. మరియు విశ్వసించిన ప్రజల హృదయాలను చల్లబరుస్తాడు;
Tevbe 9:15
మరియు వారి హృదయాలలోని క్రోధాన్ని దూరం చేస్తాడు. మరియు అల్లాహ్! తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
Tevbe 9:16
ఏమీ? అల్లాహ్ మీలో నుండి (తన మార్గంలో) పోరాడేవారెవరో మరియు - అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు తప్ప - ఇతరుల నెవ్వరినీ తమ ఆప్తమిత్రులుగా చేసుకోని వారెవరో, తెలుసుకోనిదే మిమ్మల్ని వదలిపెడతాడని అనుకుంటున్నారా? మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా బాగా ఎరుగును.
Tevbe 9:17
బహుదైవారాధకులు (ముష్రికీన్), తాము సత్యతిరస్కారులమని సాక్ష్యమిస్తూ, అల్లాహ్ మస్జిదులను నిర్వహించటానికి (సేవ చేయటానికి) అర్హులు కారు. అలాంటి వారి కర్మలు వ్యర్థమై పోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు.
Tevbe 9:18
నిశ్చయంగా, అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు![1]
———
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ఒకవేళ మీరు ఒక వ్యక్తిని సక్రమంగా మస్జిద్ కు వస్తూ ఉండేది చూస్తే, అతని విశ్వాసానికి సాక్ష్యం ఇవ్వండి.' (తిర్మిజీ', తఫ్సీర్ 'సూ. అత్-తౌబహ్). ఖుర్ఆన్ లో ఇక్కడ కూడా అల్లాహ్ (సు.తా.)ను అంతిమదినాన్ని విశ్వసించిన తరువాత చేయవలసిన పనులలో నమా'జ్, దాని తరువాత 'జకాత్ అని పేర్కొనబడ్డాయి. మరొక 'హదీస్' ముత్తఫిఖ్ అలైహి ఉంది. అబూ-బక్ర్ 'సిద్ధీఖ్ (ర'ది.'అ) అన్నారు: 'అల్లాహ్ తోడు, నేను అలాంటి వారితో తప్పక పోరాడుతాను, ఎవరైతే నమా'జ్ మరియు 'జకాత్ ల మధ్య భేదం చూపుతారో!' అంటే నమా'జ్ చేస్తారు కాని 'జకాత్ ఇవ్వడానికి వెనుకంజవేస్తారో! (చూడండి, 9:5).
Tevbe 9:19
ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాపటాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర, వారు (ఈ రెండు పక్షాల వారు) సరిసమానులు కారు.[1] మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు.
———
[1] ఈ ఆయత్ అవతరింపజేయబడిన సందర్భాన్ని గురించి, 'స'హాబా ('ర.ది.'అన్హుమ్)ల మధ్య మస్జిదె నబవీలో శుక్రవారం మింబర్ దగ్గర జరిగిన ఈ సంభాషణ కారణం అంటారు. ఒక 'సహాబీ (ర'ది.'అ) అంటారు: "నేను ఇస్లాం స్వీకరించిన తరువాత నా దృష్టిలో అన్నిటి కంటే ఉత్తమమైన కార్యం 'హాజీలకు 'జమ్'జమ్ త్రావపడం." రెండో అతను అంటాడు: "నా దగ్గర మస్జిద్ అల్-'హరాం సేవ చేయడం." మూడవ అతను అంటారు: "అల్లాహ్ (సు.తా.) మార్గంలో జిహాద్ చేయడం." ఈ 'హదీస్' కథకుడు నూమూన్ బిన్-బషీర్ (ర.'ది.'అ.) నేను ఆరోజు జుమ'అహ్ నమాజ్' తరువాత వెళ్ళి దైవప్రవక్త ('స'అస)కు ఈ విషయం తెలిపాను. అప్పుడు ఈ ఆయత్ అవతరింప జేయబడింది. ('స'హీ'హ్ ముస్లిం, కితాబ్ అల్ ఇమారహ్, బాబ్ ఫజ్ల్ అష్షహాదహ్ ఫీ సబీలిల్లాహ్). అల్లాహ్ (సు.తా.)ను అంతిమదినాన్ని విశ్వసించిన తరువాతనే అల్లాహ్ (సు.తా.) మార్గంలో జిహాద్ స్వీకరించబడుతుంది. ఈమాన్ లేనిదే ఎంత గొప్ప కార్యం చేసినా దాని ఫలితం శూన్యమే. విశ్వాసుని జిహద్ సర్వకార్యాలలో గొప్పది. ఈ విషయం దీని తరువాత ఉన్న ఆయత్ లో స్పష్టంగా ఉంది.
Tevbe 9:20
విశ్వసించి, అల్లాహ్ మార్గంలో వలస పోయిన వారికీ మరియు తమ ధనసంపత్తులను, ప్రాణాలను వినియోగించి పోరాడిన వారికీ, అల్లాహ్ దగ్గర అత్యున్నత స్థానముంది. మరియు అలాంటి వారే సాఫల్యం (విజయం) పొందేవారు.[1]
———
[1] చూడండి, 'స. బు'ఖారీ, పు - 4, 'హ. 48, 54.
Tevbe 9:21
వారి ప్రభువు వారికి, తన తరఫు నుండి కారుణ్యాన్ని మరియు ప్రసన్నతను మరియు శాశ్వత సౌఖ్యాలు గల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు.
Tevbe 9:22
వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ దగ్గర గొప్ప ప్రతిఫలముంది.
Tevbe 9:23
ఓ విశ్వాసులారా! మీ తండ్రితాతలు మరియు మీ సోదరులు సత్యతిరస్కారానికి విశ్వాసంపై ప్రాధాన్యతనిస్తే, మీరు వారిని స్నేహితులుగా చేసుకోకండి. మీలో వారి వైపు మొగ్గేవారే (వారిని మీ స్నేహితులుగా చేసుకునే వారే) దుర్మార్గులు.[1]
———
[1] హిజ్ రత్ నుండి జిహాద్ విషయంలో మీరు, మీ సోదరుల మరియు తండ్రుల ప్రేమను రానివ్వకండి. వారు మీ స్నేహితులు కాలేరు. వారు మీతో మంచిగా వ్యవహరిస్తే, మిమ్మల్ని మీ ఇస్లాం ధర్మాన్ని పాటించటం నుండి ఆపకుంటే, వారితో మంచిగా వ్యవహరించండి. కాని వారు మిమ్మల్ని ఇస్లాం కొరకే బాధిస్తే, వారిని మీ స్నేహితులుగా భావించకండి. (చూ. 3:28, 60:89).
Tevbe 9:24
వారితో ఇలా అను: "మీ తండ్రితాతలు మీ కుమారులు, మీ సోదరులు, మీ సహవాసులు (అజ్వాజ్), మీ బంధువులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగిస్తాయేమోనని భయపడే మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ భవనాలు - అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే మరియు ఆయన మార్గంలో పోరాడటం కంటే - మీకు ఎక్కువ ప్రియమైనవైతే, అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైన జాతి వారికి సన్మార్గం చూపడు."[1]
———
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "ఎవరిచేతిలోనైతే నా ప్రాణాలున్నాయో ఆ అల్లాహ్ (సు.తా.) తోడు. మీలో ఏ ఒక్కడు కూడా ముఅ'మిన్ కాజాలడు, ఎంతవరకైతే అతడు తన తండ్రి, తన సంతానం మరియు ఇతరులందరికంటే, నన్ను ('స'అస) ఎక్కువగా ప్రేమించడో!" ('స'హీ'హ్ బుఖా'రీ, కితాబ్ అల్ - ఈమాన్, బాబ్ 'హుబ్బె రసూల్ ('స'అస) మినల్ ఈమాన్; 'స'హీ'హ్ ముస్లిం, కితాబ్ అల్ - ఈమాన్).
Tevbe 9:25
వాస్తవానికి ఇది వరకు చాలా యుద్ధరంగాలలో (మీరు కొద్దిమంది ఉన్నా) అల్లాహ్ మీకు విజయం చేకూర్చాడు. మరియు హునైన్ (యుద్ధం) రోజు మీ సంఖ్యాబలం మీకు గర్వకారణమయింది. కాని, అది మీకు ఏ విధంగానూ పనికి రాలేదు మరియు భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకై పోయింది. తరువాత మీరు వెన్ను చూపి పారిపోయారు.[1]
———
[1] 'హునైన్, మక్కా మరియు 'తాయిప్ ల మధ్య పర్వతాలలో ఉన్న ఒక లోయ (వాది). అక్కడ హవా'జిన్ మరియు స'ఖీఫ్ అనే రెండు తెగలవారు ఉండేవారు. వారు విలువిద్యలో నిపుణులు. వారు ముస్లింలకు విరుద్ధంగా పోరాడటానికి, యుద్ధ తయారీలు చేస్తున్నారని తెలుసుకొని దైవప్రవక్త ('స'అస), 12,000 సైనికులతో, మక్కా విజయపు 18-19 దినాల తరువాత 8వ హిజ్రీ, షవ్వాల్ నెలలో వారిపై దాడి చేయడానికి వెళ్తారు. ముస్లింలకు తమ సంఖ్యాబలం కొంత వరకు గర్వానికి కారణమవుతుంది. ఇది అల్లాహ్ (సు.తా.)కు నచ్చదు. శత్రువులు దాదాపు 4,000 మంది ఉంటారు. శత్రువుల బాణాల దెబ్బలకు తాళుకోలేక ముస్లిం సైనికులు వెనుదిరిగి పారిపోసాగుతారు. కేవలం దైవప్రవక్త ('స'అస), కొందరు ముస్లింలతో బాటు మిగిలిపోతారు. దైవప్రవక్త ('స'అస), పారిపోయేవారిని ఆపటానికి కేకలు వేస్తారు. తరువాత అతను ('స'అస), 'అబ్బాస్ (ర.'ది.'అ)తో వారిని పిలవమని అంటారు. అతను పెద్ద పెద్ద కేకలు వేయటం వల్ల, సిగ్గుపడి కొందరు తిరిగి వస్తారు. ఆ ఉన్నవారే ధైర్యస్థైర్యాలతో యుద్ధం చేసి అల్లాహ్ (సు.తా.) అనుగ్రహంతో విజయం పొందుతారు. శత్రువులు తమ ఆస్తిపాస్తులన్నీ విడిచి పారిపోతారు.
Tevbe 9:26
తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై మరియు విశ్వాసులపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. మరియు మీకు కనిపించని (దైవదూతల) దళాలను దింపి సత్యతిరస్కారులను శిక్షించాడు.[1] మరియు ఇదే సత్యతిరస్కారులకు లభించే ప్రతిఫలం.
———
[1] కనిపించని దళాలను అంటే దైవదూతలను, అల్లాహ్ (సు.తా.) పంపాడు. ఏ విధంగానైతే ఉ'హుద్ యుద్ధంలో (చూడండి, 3:124-125) మరియు బద్ర్ యుద్ధంలో (చూడండి, 8:9) పంపాడో!
Tevbe 9:27
ఆ తరువాత కూడా అల్లాహ్ తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Tevbe 9:28
ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, బహుదైవారాధకులు (ముష్రికీన్) అపరిశుద్ధులు (నజ్స్)[1]. కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిద్ అల్ హరామ్ సమీపానికి రాకూడదు.[2] మరియు ఒకవేళ మీరు లేమికి భయపడితే! అల్లాహ్ కోరితే, తన అనుగ్రహంతో మిమ్మల్ని సంపన్నులుగా చేయగలడు! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
———
[1] నజసున్: అంటే అవిశ్వాసులు, అశుచులు, అశుభ్రులు, అపరిశుద్ధులు, మురికివారు, మాలిన్యులు, కల్మాషులు అనే అర్థాలున్నాయి. ఈ అపరిశుద్ధత శారీరకంగా గానీ, లేక మానసికంగా గానీ, లేక రెండూ గానీ కావచ్చు. శారీరకంగా ఎందుకంటే వారు లైంగిక లేక కాలకృత్యాల అపరిశుద్ధత తరువాత విధిగా పరిశుద్ధత అవలంబించక పోవడం. మానసికంగా, ఎందుకంటే వారు ఏకైక ఆరాధ్యుడు, సర్వసృష్టికర్త, సర్వపోషకుడు అయిన అల్లాహ్ (సు.తా.)ను వదలి ఇతరులను ఏమీ చేయలేని వారిని అల్లాహ్ (సు.తా.)కు సాటి కల్పించడం. ఈ శబ్దం ఖురఆన్ లో ఈ ఆయత్ లోనే ఒకేసారి వచ్చింది. [2] ముస్లిమేతరులు 'హరమ్ సరిహద్దులలోకి రాకూడదు. ఈ ఆజ్ఞ 9వ హిజ్రీలో వచ్చింది. కాని వారు ఇతర మస్జిదులలో ప్రవేశించవచ్చు. ఉదాహరణకు దైవప్రవక్త ('స'అస) స'మామ బిన్ - ఆసాల్ (ర'ది.'అ.)ను అతడు ఇస్లాం స్వీకరించక ముందు మస్జిద్ అన్ నబవీలో ఒక స్థంభానికి ఖైదీగా కట్టి ఉంచారు.
Tevbe 9:29
అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని; అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించినవి, నిషిద్ధమని భావించని; సత్యధర్మాన్ని తమ ధర్మంగా స్వీకరించని గ్రంథ ప్రజలతో - వారు స్వయంగా తమ చేతులతో జిజ్ యా[1] ఇచ్చి లోబడి ఉండే వరకూ - పోరాడండి.[2]
———
[1] జి'జ్ యతున్: ఖుర్ఆన్ లో ఇచ్చట ఒకేసారి వచ్చింది. జి'జ్ యా అంటే, ముస్లిమేతరులతో ఇస్లామీయ ప్రభుత్వం వసూలు చేసే పన్ను. దీనికి కారణాలు: 1) వారు విధిగా 'జకాత్ చెల్లించరు, 2) వారికి ఇస్లామీయ ప్రభుత్వంలో జిహాద్, అంటే ఇస్లాం ధర్మ రక్షణ కొరకు పోరాడటం విధికాదు, 3) వారి ఆత్మరక్షణ ఖర్చు కొరకు. ఈ క్రింద పేర్కొన్న వారికి జి'జ్ యా లేదు. 1) స్త్రీలు, 2) యుక్తవయస్సుకు రాని పురుషులు, 3) వృద్ధులు, 4) వ్యాధిగ్రస్తులు మరియు వికలాంగులు, 5) ధర్మవేత్తలు, గురువులు, మునులు, 6) ఎవరైతే జిహాద్ (మిలటరీ డ్యూటీ) కొరకు సిద్ధపడతారో వారు. [2] జిహాద్ ను ఈ విధంగా కూడా వివరించారు : అల్లాహ్ (సు.తా.) మార్గంలో పోరాడటం, అంటే సత్యాన్ని మరియు దానిని అనుసరించే వారిని (ముస్లింలను) రక్షించటానికి చేసే ధర్మ యుద్ధం. ఇది ప్రతి ముస్లిం యొక్క విధి. (చూడండి, 2:190-194).
Tevbe 9:30
మరియు యూదులు ఉజైర్ అల్లాహ్ కుమారుడని అంటారు.[1] మరియు క్రైస్తవులు మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడని. ఇవి వారు తమ నోటితో అనే మాటలే. ఇంతకు పూర్వపు సత్యతిరస్కారులు పలికిన మాటలనే వారు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నశింపజేయుగాక! వారెంత మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)!
———
[1] బాబిలోనియన్ లు (Babylonians) యూదులను, వెడలగొట్టిన తరువాత వారు (యూదులు) తౌరాత్ ను కోల్పోయారు. అది ఈ రోజు న్న స్థితిలోకి, దానిని తిరిగి తెచ్చినవారు 'ఉ'జైర్ 'అ.స. (Ezra). అతనే ఈ రోజు ఆచారంలో ఉన్న యూదమతాన్ని స్థాపించారు. (Encyclopedia Brittanica, 1963, vol-9, p.15). అతనినే యూదులు అల్లాహుతా'ఆలా కుమారుడంటారు.
Tevbe 9:31
వారు (యూదులు మరియు క్రైస్తవులు) అల్లాహ్ ను వదలి తమ యూద మతాచారులు (అహ్ బార్) లను మరియు (క్రైస్తవ) సన్యాసులను (రుహ్ బాన్ లను) మరియు మర్యమ్ కుమారుడైన మసీహ్ ను (క్రీస్తును) తమ ప్రభువులుగా చేసుకుంటున్నారు.[1] వాస్తవానికి, వారు ఒకే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. ఆయన వారు సాటి కల్పించే వాటికి అతీతుడు.
———
[1] చూడండి, 3:64.
Tevbe 9:32
వారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో (ఊది) ఆర్పగోరుతున్నారు, కాని అల్లాహ్ అలా కానివ్వడు; సత్యతిరస్కారులకు అది ఎంత అసహ్యకరమైనా, ఆయన తన జ్యోతిని పూర్తిచేసి (ప్రసరింపజేసి) తీరుతాడు.
Tevbe 9:33
బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అది ఎంత అసహ్యకరమైనా, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్నీ ఇచ్చి పంపి దానిని సకల ధర్మాల మీద ప్రబలింప జేసినవాడు (ఆధిక్యతనిచ్చిన వాడు) ఆయన (అల్లాహ్) యే![1]
———
[1] చూడండి, 3:19 మరియు 61:8-9.
Tevbe 9:34
ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, చాలా మంది యూద మతాచారులు (అహ్ బార్) మరియు క్రైస్తవ సన్యాసులు (రుహ్ బాన్) ప్రజల సొత్తును అక్రమ పద్ధతుల ద్వారా తిని వేస్తున్నారు మరియు వారిని అల్లాహ్ మార్గం నుండి ఆటంక పరుస్తున్నారు. మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడ బెట్టి, దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధారకమైన శిక్ష గలదనే వార్తను వినిపించు.
Tevbe 9:35
ఆ దినమున దానిని (జకాత్ ఇవ్వని ధనాన్ని /ఆ వెండి బంగారాన్ని) నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి.[1] (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "ఇదంతా మీరు మీ కొరకు కూడ బెట్టుకున్నదే. కావున మీరు కూడ బెట్టుకున్న దానిని చవి చూడండి."
———
[1] చూడండి, 3:180 ఇంకా చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 2, 'హదీస్' నెం. 486.
Tevbe 9:36
నిశ్చయంగా, నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర పన్నెండు నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం నుండి అల్లాహ్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో నాలుగు నిషిద్ధ (మాసాలు).[1] ఇదే సరైన ధర్మం. కావున వాటిలో (ఆ నాలుగ హిజ్రీ మాసాలలో) మీకు మీరు అన్యాయం చేసుకోకండి.[2] బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) అందరూ కలిసి పోరాడండి. ఏ విధంగా అయితే వారందరూ కలిసి మీతో పోరాడుతున్నారో! మరియు నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గల వారితోనే ఉంటాడని తెలుసుకోండి.[3]
———
[1] నిషిద్ధమాసాలు హిజ్రీ శకపు రజబ్, జు'ల్-ఖాయిదహ్, జు'ల్-'హిజ్జహ్ మరియు ము'హర్రమ్ (7, 11, 12 మరియు 1వ నెలలు). [2] హిజ్రీ నెలల లెక్క చంద్రుని నెలప్రకారం ఉంది.అంటే హిజ్రీ సంవత్సరం చాంద్రమాన సంవత్సరం. ఇది ప్రకృతి సిద్ధమైన నెలలు మరియు సంవత్సరాలు. వీటిని అనుసరించటానికి లెక్కలు పెట్టే అవసరం లేదు. దీని వల్ల రమ'దాన్ ఉపవాసాలు మరియు 'హజ్ వేరువేరు ఋతువులలో వస్తాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ప్రజలు ప్రతి ఋతువులో ఉపవాసాలు, పండుగలు చేసుకుంటారు. చాంద్రనెల 29.5 రోజులది మరియు చాంద్ర సంవత్సరం 354 రోజులది. సూర్యమాన సంవత్సరంలో ఇది 11.25 రోజులు తక్కువ. దీని వల్ల ప్రతి 34 చాంద్రమాన సంవత్సరాలకు అంటే 12,036 దినాలకు ఒకసారి 'హజ్ అదే దినమున మళ్ళీ వస్తుంది. ముష్రిక్ అరబ్బులు, చాంద్రమాన సంవత్సరాన్ని సూర్యమాన సంవత్సరంతో సరిపెట్టటానికి అధికమాసాన్ని చేర్చేవారు. ఈ ఆయత్ తరువాత ఇస్లాం షరీయత్ లో సూర్యమాన సంవత్సరం మరియు అలా సరిపెట్టటం రద్దు చేయబడ్డాయి. [3] చూడండి, 2:193, 8:73.
Tevbe 9:37
నిశ్చయంగా, నెలలను వెనుక ముందు చేయటం (నసీఉ) సత్యతిరస్కారంలో అదనపు చేష్టయే! దాని వల్ల సత్యతిరస్కారులు మార్గభ్రష్టత్వానికి గురి చేయబడుతున్నారు. వారు దానిని ఒక సంవత్సరం ధర్మసమ్మతం చేసుకుంటారు, మరొక సంవత్సరం నిషేధించుకుంటారు. ఈ విధంగా వారు అల్లాహ్ నిషేధించిన (నెలల) సంఖ్యను తమకు అనుగుణంగా మార్చుకొని అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకుంటున్నారు. వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనవిగా కనిపిస్తున్నాయి. మరియు అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.
Tevbe 9:38
ఓ విశ్వాసులారా! మీకేమయింది? మీతో: "అల్లాహ్ మార్గంలో బయలు దేరండి." అని చెప్పినపుడు మీరు భూమికి అతుక్కొని పోతున్నారేమిటి? ఏమీ? మీరు పరలోకాన్ని వదలి, ఇహలోక జీవితంతోనే తృప్తి పడదలచుకున్నారా? కాని ఇహలోక జీవిత సుఖం పరలోక (జీవిత సుఖాల ముందు) ఎంతో అల్పమైనది![1]
———
[1] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నెం. 53.
Tevbe 9:39
మీరు బయలు దేరకపోతే, ఆయన మీకు బాధాకరమైన శిక్షను విధిస్తాడు. మరియు మీకు బదులుగా మరొక జాతిని మీ స్థానంలో తెస్తాడు. మరియు మీరు ఆయనకు ఎలాంటి నష్టం కలిగించలేరు.[1] మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
———
[1] ఇక్కడ 9వ హిజ్రీ షవ్వాల్ నెలలో జరిగిన తబూక్ దండ్రయాత్ర ప్రస్తావన ఉంది. బైజాంటైన్ (Byzantine) చక్రవర్తి, క్రైస్తవుడైన, హెరాక్లియస్, ముస్లింలకు విరుద్ధంగా యుద్ధసన్నాహాలు మొదలు పెడ్తాడు. కావున ము'హమ్మద్ ('స'అస) కూడా యుద్ధసన్నాహాలు మొదలు పెడ్తారు. అది కపట విశ్వాసులకు ఎంతో బాధాకరంగా ఉంటుంది. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడింది. దైవప్రవక్త ('స'అస) ముస్లింలతో, క్రైస్తవులను ఎదుర్కోవటానికి తబూక్ వెళ్ళి, అక్కడ 20 రోజులుండి, క్రైస్తవులు యుద్ధానికి రానందుకు తిరిగి వచ్చేస్తారు.
Tevbe 9:40
ఒకవేళ మీరు అతనికి (ప్రవక్తకు) సహాయం చేయకపోతే ఏం ఫర్వాలేదు! (అల్లాహ్ అతనికి తప్పక సహాయం చేస్తాడు). ఏ విధంగానైతే, సత్యతిరస్కారులు అతనిని పారద్రోలి నపుడు, అల్లాహ్ అతనికి సహాయం చేశాడో! అప్పుడు అతను ఇద్దరిలో రెండవ వాడిగా (సౌర్) గుహలో ఉన్నప్పుడు అతను తన తోటి వానితో (అబూ బక్ర్ తో): "నీవు దుఃఖ పడకు, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు!" అని అన్నాడు.[1] అప్పుడు అల్లాహ్! అతనిపై తన తరఫు నుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనిని మీకు కనిపించని (దైవదూతల) దళాలతో సహాయం చేసి సత్యతిరస్కారుల మాటను కించపరచాడు. మరియు అల్లాహ్ మాట సదా సర్వోన్నతమైనదే. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహో వివేచనాపరుడు.
———
[1] క్రీ.శకం 622, (ప్రవక్త పదవి ప్రసాదించబడిన దాదాపు 13వ సంవత్సరం)లో, ము'హమ్మద్ ('స'అస) ను చంపటానికి, మక్కా ముష్రికులు అతని ఇంటి మీదికి, రాత్రివేళ ప్రతి తెగ నుండి ఒక యువకుణ్ణి తయారుచేసి పంపుతారు. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో, దైవప్రవక్త ('స'అస) వారి మీద దుమ్ము విసరగా, వారికి కునుకు వస్తుంది. ఆ తరువాత అతను ('స'అస), అబూ బక్ర్ (ర'ది.'అ.)తో సహా బయలుదేరి, సౌ'ర్ కొండ గుహలో మూడు రోజులు దాగుతారు. ముష్రికులు వారిని వెతుక్కుంటూ గుహపై వరకు చేరుతారు. కాని ముష్రికులు వారిద్దరిని కనుగొనలేక పోతారు. అది వారిద్దరు గమనిస్తారు. ఆ సందర్భంలో దైవప్రవక్త ('స'అస) అబూ బక్ర్ (ర'ది.'అ)తో ఈ మాటలు అంటారు. ('స'హీ'హ్ బు'ఖారీ).
Tevbe 9:41
తేలికగానైనా సరే, బరువుగా నైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడండి. ఒకవేళ మీరిది తెలుసుకో గలిగితే, ఇది మీకెంతో ఉత్తమమైనది.
Tevbe 9:42
అది తొందరగా దొరికే లాభం మరియు సులభమైన ప్రయాణం అయితే వారు తప్పక నీ వెంట వెళ్ళేవారు. కాని వారికది (తబూక్ ప్రయాణం) చాలా కష్టమైనదిగా (దూరమైనదిగా) అనిపించింది. కావున వారు అల్లాహ్ పై ప్రమాణం చేస్తూ అంటున్నారు: "మేము రాగల స్థితిలో ఉంటే తప్పక మీ వెంట వచ్చి ఉండేవారము." (ఈ విధంగా అబద్ధమాడి) వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. మరియు వారు అబద్ధమాడుతున్నారని అల్లాహ్ కు బాగా తెలుసు.[1]
———
[1] ఎండకాలం, ఖర్జూర పంటకాలం, చాలా దూరపు ప్రయాణం కావటం వల్ల కపటవిశ్వాసులు, బలహీన విశ్వాసం గలవారు, మరికొందరు ఎడారి వాసు(బద్ధూ)లు, ఎన్నో బూటక సాకులు చెప్పి దైవప్రవక్త ('స'అస) ను వెనుక ఉండి పోవటానికి అనుమతి అడుగుతారు. దైవప్రవక్త ('స'అస) అనుమతి కూడా ఇస్తారు. ఆ సందర్భంలో ఇది మరియు దీని తరువాత ఆయతులు అవతరింపజేయబడ్డాయి.
Tevbe 9:43
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నిన్ను మన్నించు గాక! సత్యవంతులెవరో నీకు స్పష్టం కాకముందే మరియు అబద్ధమాడే వారెవరో నీకు తెలియక ముందే, వారిని (వెనుక ఉండటానికి) ఎందుకు అనుమతి నిచ్చావు?[1]
———
[1] చూడండి, 24:62.
Tevbe 9:44
అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించేవారు, తమ సంపత్తి మరియు తమ ప్రాణాలను వినియోగించి (అల్లాహ్ మార్గంలో) పోరాడటం నుండి తప్పించుకోవటానికి ఎన్నడూ అనుమతి అడగరు. మరియు దైవభీతి గలవారు ఎవరో అల్లాహ్ కు బాగా తెలుసు.
Tevbe 9:45
నిస్సందేహంగా, అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని వారే, వెనుక ఉండటానికి అనుమతి అడుగుతారు. మరియు వారి హృదయాలు సందేహంలో మునిగి ఉన్నాయి. కావున వారు తమ సందేహాలలో పడి ఊగిసలాడుతున్నారు.[1]
———
[1] ఈ జిహాద్ లో పాల్గొనే విషయంలో ముస్లింల నాలుగు వర్గాలు ఏర్పడ్డాయి: 1) సహృదయంతో వెంటనే జిహాద్ కు సిద్ధపడ్డ వారు; 2) మొదట సంకోచించి వెంటనే సిద్ధపడ్డవారు; 3) వృద్ధులు, రోగులు, మరియు ప్రయాణ ఖర్చులు లేనివారు - వీరిని అల్లాహ్ (సు.తా.) క్షమించాడు - చూడండి 9:91-92; 4) కేవలం సోమరితనం వల్ల పాల్గొననివారు. వీరు పశ్చాత్తాపపడి క్షమాపణ కోరగా వారి క్షమాపణ తరువాత అంగీకరించబడుతుంది. వీరు గాక బూటక సాకులు చెప్పి వెనుక ఉండి పోయిన కపట విశ్వాసులు కూడా ఉన్నారు.
Tevbe 9:46
మరియు ఒకవేళ వారు బయలుదేరాలని కోరి ఉంటే తప్పక దానికై వారు యుద్ధ సామగ్రి సిద్ధ పరచుకొని ఉండేవారు, కాని వారు బయలు దేరటం అల్లాహ్ కు ఇష్టం లేదు, కావున వారిని నిలిపివేశాడు. మరియు వారితో: "కూర్చొని ఉన్న వారితో మీరు కూడా కూర్చొని ఉండండి!" అని చెప్పబడింది.
Tevbe 9:47
ఒకవేళ వారు మీతో కలిసి వెళ్ళినా మీలో కలతలు తప్ప మరేమీ అధికం చేసేవారు కాదు. మరియు మీ మధ్య ఉపద్రవం (ఫిత్న) రేకెత్తించటానికి తీవ్రప్రయత్నాలు చేసేవారు. మరియు మీలో కొందరు వారి కొరకు (కపట విశ్వాసుల కొరకు) మాటలు వినేవారు (వారి గూఢాచారులు) ఉన్నారు. మరియు అల్లాహ్ కు దుర్మార్గుల గురించి బాగా తెలుసు.
Tevbe 9:48
(ఓ ప్రవక్తా!) వాస్తవానికి, వారు ఇంతకు ముందు కూడా కల్లోలాన్ని (ఫిత్నను) పుట్టించి, నీ కార్యాలను తలక్రిందులు చేయగోరారు. చివరకు సత్యం బహిర్గతమయింది మరియు అల్లాహ్ నిర్ణయం స్పష్టమయ్యింది. మరియు వారు దీన్ని అసహ్యించుకున్నారు!
Tevbe 9:49
మరియు వారిలో: "నాకు (వెనుక ఉండటానికి) అనుమతినివ్వు! నన్ను ఏ మాత్రం పరీక్షకు గురిచేయకు!" అని అనేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి, వారు (ఇలా అనుమతి కోరి) పరీక్షకు గురి అయ్యారు! మరియు నిశ్చయంగా, సత్యతిరస్కారులను నరకాగ్ని చుట్టుకోనున్నది.
Tevbe 9:50
(ఓ ప్రవక్తా!) ఒకవేళ నీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. మరియు నీపై ఆపద వస్తే వారు: "మేము ముందుగానే జాగ్రత్త పడ్డాము!" అని అంటూ సంతోషపడుతూ మరలిపోతారు.
Tevbe 9:51
వారితో ఇలా అను: "అల్లాహ్ మా కొరకు వ్రాసింది తప్ప మరేమీ మాకు సంభవించదు. ఆయనే మా సంరక్షకుడు. మరియు విశ్వాసులు అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి!"
Tevbe 9:52
ఇలా అను: "మీరు మా విషయంలో నిరీక్షిస్తున్నది రెండు మేలైన వాటిలో ఒకటి. అల్లాహ్ స్వయంగా మీకు శిక్ష విధిస్తాడా, లేదా మా చేతుల ద్వారానా? అని మేము నిరీక్షిస్తున్నాము. కావున మీరూ నిరీక్షించండి, నిశ్చయంగా మేము కూడా మీతో పాటు నిరీక్షిస్తున్నాము!"
Tevbe 9:53
ఇలా అను: "మీరు మీ (సంపదను) ఇష్టపూర్వకంగా ఖర్చు చేసినా, లేదా ఇష్టం లేకుండా ఖర్చు చేసినా అది మీ నుండి స్వీకరించబడదు.[1] నిశ్చయంగా, మీరు అవిధేయులు (ఫాసిఖూన్)."
———
[1] చూడండి, 2:264, 4:38.
Tevbe 9:54
మరియు వారి విరాళం (చందా) స్వీకరించబడకుండా పోవటానికి కారణం, వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి తిరస్కరించడం మరియు నమాజ్ కొరకు ఎంతో సోమరితనంతో తప్ప రాకపోవడం మరియు అయిష్టంతో (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టడమే!"[1]
———
[1] చూడండి, 'స. బు'ఖారీ, పు-1, 'హ. 626.
Tevbe 9:55
కావున వారి సిరిసంపదలు గానీ, వారి సంతానం గానీ, నిన్ను ఆశ్చర్యంలో పడనివ్వకూడదు![1] నిశ్చయంగా, అల్లాహ్ వాటి వలన వారిని, ఇహలోక జీవితంలో శిక్షించగోరుతున్నాడు. మరియు వారు సత్యతిరస్కార స్థితిలోనే తమ ప్రాణాలను కోల్పోతారు.
———
[1] చూడండి, 20:131 మరియు 23:55-56. ఇంకా చూడండి, 3:178 మరియు 8:28.
Tevbe 9:56
మరియు వారు నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నామని అల్లాహ్ పై ప్రమాణం చేస్తున్నారు. కాని వారు మీతో లేరు. వాస్తవానికి వారు మీకు భయపడుతున్నారు.
Tevbe 9:57
ఒకవేళ వారికి ఏదైనా ఆశ్రయం గానీ, గుహగానీ లేదా తలదాచుకోవటానికి ఏకాంత స్థలం గానీ దొరికితే, వారు తొందరగా పరుగెత్తి అందులో దాక్కుంటారు.[1]
———
[1] ఈ ఆయత్ కపట విశ్వాసులను గురించి ఉంది. వారిని గురించి ఇంకా చూడండి, 4:142, 9:67 మరియు 29:11. (ఖుర్ఆన్ అవతరణాక్రమంలో ఇది బహుశా కపట విశ్వాసులను గురించి వచ్చిన మొట్టమొదటి ఆయత్).
Tevbe 9:58
మరియు (ఓ ప్రవక్తా!) వారిలో కొందరు దానాలు (సదఖాత్) పంచే విషయంలో నీపై అపనిందలు మోపుతున్నారు.[1] దాని నుండి వారికి కొంత ఇవ్వబడితే సంతోషిస్తారు. కాని దాని నుండి వారికి ఇవ్వబడక పోతే కోపగించుకుంటారు!
———
[1] చూడండి, 2:263-264.
Tevbe 9:59
మరియు ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో వారు తృప్తి పడి: "అల్లాహ్ యే మాకు చాలు! అల్లాహ్ తన అనుగ్రహంతో మాకు ఇంకా చాలా ఇస్తాడు మరియు ఆయన ప్రవక్త కూడా (ఇస్తాడు). నిశ్చయంగా, మేము అల్లాహ్ నే వేడుకుంటాము!" అని పలికి ఉంటే (అది వారికే బాగుండేది!)
Tevbe 9:60
నిశ్చయంగా దానాలు (సదఖాత్)[1] కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి[2], (జకాత్) వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాలనైతే (ఇస్లాం వైపుకు) ఆకర్షించ వలసి ఉందో వారికి, బానిసల విముక్తి కొరకు, ఋణగ్రస్తులైన వారి కొరకు, అల్లాహ్ మార్గంలో (పోయేవారి) కొరకు మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
———
[1] ఇక్కడ 'సదఖాత్ అంటే 'జకాత్ అని అర్థం. ఎనిమిది (8) రకాల వారు వీటికి హక్కుదారులు: 1) ఫుఖరాకు; 2)మసాకీన్ లకు; 3)'జకాత్ ప్రోగుచేయటానికి నియుక్తులైన వారికి; 4) ఎవరి హృదయాలను ఇస్లాం వైపునకు ఆకర్షించవలసి ఉందో వారికి; 5) ముస్లిం బానిసల విముక్తికి; 6)ఋణగ్రస్తులైన వారికి; 7) అల్లాహ్ మార్గంలో మరియు 8) బాటసారులకు - వారు పేదవారు కాకున్నా - ప్రయాణంలో ఉన్నప్పుడు లేమికి గురి అయితే వారికి ఇవ్వాలి. [2] ఫఖీరున్: అంటే ఏమీ ఆదాయం లేనందుకు తన నిత్యావసరాలకు ఇతరులపై ఆధారపడి ఉండేవాడు. ఇట్టివారు విధిలేక యాచించవచ్చు . మిస్కీనున్: కొంత ఆదాయం గలవాడు కాని అది అతన నిత్యావసరాలకు సరిపోదు. అతడు ఇతరులతో యాచించుటకు వెనుకంజవేస్తాడు. తన స్వాభిమానంలో ఉంటాడు. ఇట్టివాడికి వాడి లక్షణాలు చూసి ఇవ్వాలి. ('స'హీ'హ్ బు.'ఖారీ, 'స'హీ'హ్. ముస్లిం).
Tevbe 9:61
మరియు వారిలో కొందరు ప్రవక్తను తమ మాటలతో బాధ కలిగించే వారున్నారు. వారంటారు: "ఇతను (చెప్పుడు మాటలు) వినేవాడు[1]." ఇలా అను: "అతను వినేది మీ మేలుకే! అతను అల్లాహ్ ను విశ్వసిస్తాడు మరియు విశ్వాసులను నమ్ముతాడు మరియు మీలో విశ్వసించిన వారికి అతను కారుణ్యమూర్తి." మరియు అల్లాహ్ సందేశహరునికి బాధ కలిగించే వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
———
[1] చూడండి, 9:74.
Tevbe 9:62
(ఓ విశ్వాసులారా!) మిమ్మల్ని సంతోషపెట్టటానికి వారు మీ ముందు అల్లాహ్ పై ప్రమాణాలు చేస్తున్నారు. వాస్తవానికి వారు విశ్వాసులే అయితే, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను సంతోషపెట్టటమే వారి బాధ్యత.[1]
———
[1] చూడండి, 4:80 మరియు 3:31
Tevbe 9:63
ఏమీ? అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి విరోధించేవానికి, నిశ్చయంగా! భగభగమండే నరకాగ్ని శిక్ష ఉందనీ, అదే అతని శాశ్వత నివాసమనీ, వారికి తెలియదా? ఇది ఎంత గొప్ప అవమానం!
Tevbe 9:64
తమ హృదయాలలో ఉన్న (రహస్యాలను) స్పష్టంగా తెలియజేసేటటు వంటి సూరహ్ వారికి విరుద్ధంగా అవతరింప జేయబడుతుందేమోనని, ఈ కపట విశ్వాసులు భయపడుతున్నారు. వారితో అను: "మీరు ఎగతాళి చెయ్యండి, మీరు (బయట పడుతుందని) భయపడుతున్న విషయాన్ని, అల్లాహ్ తప్పక బయటపెడ్తాడు."
Tevbe 9:65
నీవు వారిని అడిగితే వారు తప్పక: "మేము కేవలం కాలక్షేపానికి మరియు పరిహాసానికి మాత్రమే ఇలా మాట్లాడు తున్నాము." అని సమాధానమిస్తారు. వారితో అను: "ఏమీ? మీరు అల్లాహ్ తో మరియు ఆయన సూచనలతో (ఆయాత్ లతో) మరియు ఆయన ప్రవక్తతో వేళాకోళం చేస్తున్నారా?
Tevbe 9:66
ఇక మీరు సాకులు చెప్పకండి, వాస్తవానికి మీరు విశ్వసించిన తరువాత సత్యాన్ని తిరస్కరించారు." మీలో కొందరిని మేము క్షమించినా ఇతరులను తప్పకుండా శిక్షిస్తాము, ఎందుకంటే వాస్తవానికి వారు అపరాధులు.[1]
———
[1] చూడండి, 4:98
Tevbe 9:67
కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు అందరూ ఒకే కోవకు చెందినవారు! వారు అధర్మాన్ని ఆదేశిస్తారు. మరియు ధర్మాన్ని నిషేధిస్తారు.[1] మరియు తమ చేతులను (మేలు నుండి) ఆపుకుంటారు. వారు అల్లాహ్ ను మరచిపోయారు,[2] కావున ఆయన కూడా వారిని మరచిపోయాడు. నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులే అవిధేయులు (ఫాసిఖూన్).
———
[1] చూడండి, 3:104, 110, 114; 9:71, 112 మరియు 22:41 '[2] చూడండి, 45:34
Tevbe 9:68
మరియు కపట విశ్వాసులైన పురుషులకు మరియు కపట విశ్వాసులైన స్త్రీలకు మరియు సత్యతిరస్కారులకు, అల్లాహ్ నరకాగ్ని వాగ్దానం చేశాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే వారికి తగినది. మరియు అల్లాహ్ వారిని శపించాడు (బహష్కరించాడు). మరియు వారికి ఎడతెగని శిక్ష ఉంటుంది.
Tevbe 9:69
(మీరు కూడా) గతించిన మీ పూర్వీకుల వంటివారు. వారు మీకంటే ఎక్కువ బలవంతులు, ధనవంతులు మరియు అధిక సంతానం గలవారు. వారు తమ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. మీరు కూడా మీ పూర్వీకులు అనుభవించినట్లు మీ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. వారు పడి నటువంటి వ్యర్థ వాదోపవాదాలలో మీరు కూడా పడ్డారు. ఇలాంటి వారి కర్మలు ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ వ్యర్థమవుతాయి. మరియు ఇలాంటి వారు! వీరే నష్టానికి గురి అయ్యేవారు.
Tevbe 9:70
ఏమీ? వారి పూర్వీకుల గాథ వారికి అందలేదా? నూహ్ జాతి వారి, ఆద్, సమూద్,[1] ఇబ్రాహీమ్ జాతి వారి,[2] మద్ యన్ (షుఐబ్) ప్రజల[3] మరియు తలక్రిందులు చేయబడిన పట్టణాల (లూత్) వారి (గాథలు అందలేదా)?[4] వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారికి అన్యాయం చేయదలచు కోలేదు కాని వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారు.
———
[1] నూ'హ్, హూద్ మరియు 'సాలి'హ్ ('అలైహిమ్ స.) గాథల కొరకు చూడండి, 7:59-79. [2] ఇబ్రాహీమ్ ('అ.స.) జాతివారు, బాబిలోనియనులు. 1100 సంవత్సరాలు క్రీస్తు శకానికి ముందు వారు అస్సీరియన్ ల ద్వారా అపజయం పొంది నాశనం చేయబడ్డారు. [3] మద్ యన్ ప్రజల గాథలకు చూడండి, 7:85-93. [4] సోడోమ్ మరియు గొమోర్రాహ్ లు, లూ'త్ ('అ.స.) ప్రజల నగరాలు. చూడండి, 7:80-84, 11:69-83.
Tevbe 9:71
మరియు విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు ఒకరికొకరు స్నేహితులు. వారు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు అధర్మం నుండి నిషేధిస్తారు (వారిస్తారు) మరియు నమాజ్ ను స్థాపిస్తారు మరియు విధిదానం (జకాత్) చెల్లిస్తారు మరియు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. ఇలాంటి వారినే అల్లాహ్ కరుణిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనా పరుడు.
Tevbe 9:72
మరియు అల్లాహ్ విశ్వాసులైన పురుషులకు మరియు విశ్వాసులైన స్త్రీలకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల వాగ్దానం చేశాడు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. మరియు శాశ్వతమైన సుఖాలున్న ఆ స్వర్గవనాలలో, వారి కొరకు పరిశుద్ధ నివాసాలు ఉంటాయి.[1] వాటన్నిటి కంటే మించింది వారికి లభించే అల్లాహ్ ప్రసన్నత. అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).
———
[1] చూడండి, 38:50. 'అద్న్: అవతరణ ప్రకారం ఈ శబ్దం మొట్టమొదట పై ఆయత్ లో వచ్చింది. 'అద్న్, అంటే శాశ్వతమైన అని అర్థం.
Tevbe 9:73
ఓ ప్రవక్తా! సత్యతిరస్కారులతో మరియు కపట విశ్వాసులతో పోరాడు మరియు వారి పట్ల కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం.
Tevbe 9:74
"మేము ఏమీ (చెడు మాట) అనలేదు!" అని వారు అల్లాహ్ పై ప్రమాణం చేసి అంటున్నారు. కాని వాస్తవానికి వారు సత్యతిరస్కారపు మాట అన్నారు. మరియు ఇస్లాంను స్వీకరించిన తరువాత దానిని తిరస్కరించారు. మరియు వారికి అసాధ్యమైన దానిని చేయదలచుకున్నారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త, (అల్లాహ్) అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేశారనే కదా! వారు ఈ విధంగా ప్రతీకారం చేస్తున్నారు. ఇప్పుడైనా వారు పశ్చాత్తాప పడితే అది వారికే మేలు. మరియు వారు మరలిపోతే, అల్లాహ్ వారికి ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ, బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మరియు భూమిలో వారికి ఏ రక్షకుడు గానీ సహాయకుడు గానీ ఉండడు.
Tevbe 9:75
మరియు వారిలో (కొందరు) ఈ విధంగా అల్లాహ్ పై ప్రమాణం చేసేవారు కూడా ఉన్నారు: "ఆయన (అల్లాహ్) తన అనుగ్రహంతో మాకేమీ ప్రసాదించినా మేము తప్పక దానం చేస్తాము మరియు సద్వర్తనులమై ఉంటాము."
Tevbe 9:76
కాని అల్లాహ్ తన అనుగ్రహం వల్ల వారికి (ధనం) ప్రసాదించినప్పుడు, వారు పిసినారితనం ప్రదర్శించి, తమ (వాగ్దానం) నుండి విముఖులై మరలిపోతారు.
Tevbe 9:77
ఆ పిదప వారు అల్లాహ్ తో చేసిన వాగ్దానం పూర్తి చేయనందుకు, అసత్యం పలికినందుకు, ఆయన్ను కలుసుకునే (పునరుత్థాన) దినం వరకు, ఆయన వారి హృదయాలలో కాపట్యం నాటుకునేటట్లు చేశాడు.
Tevbe 9:78
ఏమీ? వారి గుప్త రహస్యాలు మరియు వారి రహస్య సమాలోచనలు , అల్లాహ్ కు తెలుసని వారికి తెలియదా? మరియు నిశ్చయంగా, అల్లాహ్ అగోచర విషయాలన్నీ తెలిసి వున్నవాడు.
Tevbe 9:79
మనస్ఫూర్తిగా సంతోషంతో (అల్లాహ్ మార్గంలో) దానం చేసే విశ్వాసులను నిందించే వారినీ మరియు తమ శ్రమ తప్ప మరేమీ ఇవ్వటానికి లేని వారిని ఎగతాళి చేసే వారినీ, అల్లాహ్ ఎగతాళికి గురి చేస్తాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
Tevbe 9:80
(ఓ ప్రవక్తా!) నీవు వారి (కపట విశ్వాసుల) క్షమాపణ కొరకు వేడుకున్నా, లేదా వారి క్షమాపణ కొరకు వేడుకోక పోయినా ఒక్కటే - ఇంకా నీవు డెబ్బైసార్లు వారి క్షమాపణ కొరకు వేడుకున్నా - అల్లాహ్ వారిని క్షమించడు.[1] ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు అల్లాహ్ అవిధేయులైన ప్రజలకు సన్మార్గం చూపడు.[2]
———
[1] దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) తన శత్రువులను క్షమించమని అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థించినట్లు బు'ఖారీ, ముస్లిం మరియు ఇతరుల 'స'హీ'హ్ 'హదీస్'ల ద్వారా తెలుస్తుంది. [2] చూడండి, 76:3.
Tevbe 9:81
(తబూక్ దండయాత్రకు పోకుండా) వెనుక ఆగిపోయిన వారు, తాము అల్లాహ్ సందేశహరుని వెంట వెళ్ళటాన్ని నిరోధించి (తమ ఇండ్లలో) కూర్చుండి నందుకు సంతోషపడ్డారు. మరియు వారు తమ ధనసంపత్తులతో మరియు తమ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడటాన్ని అసహ్యించుకున్నారు. మరియు వారు ఇతరులతో: "ఈ తీవ్రమైన వేడిలో వెళ్ళకండి!" అని అన్నారు. వారితో అను: "భగభగ మండే నరకాగ్ని దీని కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది." అది వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది!
Tevbe 9:82
కావున ఇప్పుడు వారిని కొంత నవ్వనివ్వు మరియు వారి కర్మలకు ప్రతిఫలంగా (మున్ముందు) వారికి ఎంతో ఏడ్వవలసి ఉంది.
Tevbe 9:83
కావున (ఓ ప్రవక్తా!) ఒకవేళ అల్లాహ్ నిన్ను తిరిగి వారిలో (కపట విశ్వాసులలో) ఒక వర్గం వారి వద్దకు తీసుకొని పోతే! మరియు వారు నిన్ను (మరొక దండయాత్రకు) పోవటానికి అనుమతి అడిగితే! వారితో అను! "మీరు నాతో ఏ మాత్రం బయలుదేర వద్దు! మరియు నా పక్షమున శత్రువులతో పోరాడనూ వద్దు! వాస్తవానికి మీరు మొదట కూర్చొని ఉండటానికి ఇష్టపడ్డారు, కాబట్టి మీరు వెనుక ఉండి పోయిన వారితో (ఇండ్లలోనే) కూర్చొని ఉండండి."
Tevbe 9:84
మరియు వారిలో (కపట విశ్వాసులలో) ఎవరైనా మరణిస్తే, అతడి నమాజే జనాజహ్ కూడా నీవు ఏ మాత్రం చేయకు మరియు అతని గోరీ వద్ద కూడా నిలబడకు,[1] నిశ్చయంగా వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు వారు అవిధేయులు (ఫాసిఖూన్)గా ఉన్న స్థితిలోనే మరణించారు.
———
[1] ఈ ఆయత్ కపట విశ్వాసుల నాయకుడు 'అబ్దుల్లాహ్ బిన్ ఉబైను గురించి అవతరింపజేయబడింది. కాని ఈ ఆజ్ఞ కపట విశ్వాసులందరికీ వర్తిస్తుంది. 'అబ్దుల్లాహ్ బిన్ ఉబై మరణించినప్పుడు అతని కుమారుడు 'అబ్దుల్లాహ్ (ర.'ది.అ) దైవప్రవక్త ('స'అస) దగ్గరికి వచ్చి, అతని ('స'అస) అంగీని, తన తండ్రికి కఫన్ గా తొడిగించటానికి అడుగుతారు మరియు అతని ('స'అస)తో , తన తండ్రి నమా'జే జనా'జహ్ చేయమని కూడా కోరుతారు. దైవప్రవక్త ('స'అస) తన అంగీని, ఇస్తారు. 'ఉమర్ (ర.'ది.'అ.) ఆపినా, వినకుండా నమా'జే జనా'జహ్ కూడా చేస్తారు. ఆ తరువాత ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ('స'హీ'హ్ బు'ఖారీ, తఫ్సీర్ సూరహ్ అత్-తౌబహ్ మరియు 'స'హీ'హ్ ముస్లిం, కితాబ్ సిఫాత్ అల్-మునాఫిఖీన్ వ అ'హ్ కామహుమ్). ఇక్కడ మరొక విషయం విశదమయ్యే దేమిటంటే: ఎవడైతే నిజమైన విశ్వాసుడు కాడో అతని మోక్షం కొరకు ఎంత పెద్దవారు ప్రార్థన చేసినా అది అంగీకరించబడదు.
Tevbe 9:85
మరియు వారి సిరిసంపదలు మరియు వారి సంతానం నిన్ను ఆశ్చర్యానికి గురి చేయనివ్వకూడదు. నిశ్చయంగా, అల్లాహ్! వాటితో ఈ ప్రపంచంలో వారిని శిక్షించాలనీ మరియు వారు సత్యతిరస్కారులుగా ఉన్న స్థితిలోనే వారి ప్రాణాలను కోల్పోవాలనీ సంకల్పించాడు.[1]
———
[1] చూడండి, 9:55, 3:178 మరియు 8:28; ఈ ఆయత్ దాదాపు 9:55 మాదిరిగానే ఉంది.
Tevbe 9:86
మరియు: "అల్లాహ్ ను విశ్వసించండి. మరియు ఆయన ప్రవక్తతో కలసి (అల్లాహ్ మార్గంలో) పోరాడండి!" అని సూరహ్ అవతరింప జేయబడి నపుడు,[1] వారిలోని ధనవంతులు నీతో: "వెనుక ఉండే వారితో కూర్చోవటానికి మమ్మల్ని విడిచి పెట్టు." అని అనుమతి కోరారు.
———
[1] చూడండి, 47:20.
Tevbe 9:87
వారు, వెనుక ఉండిపోయే వారితో ఉండటానికి ఇష్టపడ్డారు. వారి హృదయాల మీద ముద్ర వేయబడి వుంది, కావున వారు అర్థం చేసుకోలేరు.[1]
———
[1] చూడండి 7:100-101.
Tevbe 9:88
కాని, ప్రవక్త మరియు అతనితో పాటు విశ్వసించిన వారు తమ సిరిసంపదలతో మరియు తమ ప్రాణాలతో (అల్లాహ్ మార్గంలో) పోరాడారు. మరియు అలాంటి వారికి అన్ని మేళ్ళూ ఉన్నాయి. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు.
Tevbe 9:89
అల్లాహ్ వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు సిద్ధం చేసి ఉంచాడు, వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే గొప్ప విజయం.
Tevbe 9:90
మరియు సాకులు చెప్పే ఎడారి వాసులు (బద్దూలు)[1] కూడా వచ్చి వెనుక ఉండి పోవటానికి అనుమతి అడిగారు. మరియు ఈ విధంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు అబద్ధాలు చెప్పిన వారు కూర్చుండి పోయారు. త్వరలో సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష ఉండగలదు.
———
[1] అల్-అ'అరాబు అంటే, ఎడారి వాసు(బద్దూ)లు. ఈ పదానికి ఇంకా చూడండి, 9:97, 98, 99, 101, 120, 33:20, 48:11, 16 మరియు 49:14.
Tevbe 9:91
బలహీనులు మరియు వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణపు ఖర్చులు లేనివారు, ఒకవేళ అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు వాస్తవానికి విశ్వాసపాత్రులై ఉంటే వారిపై (జిహాద్ కు వెళ్ళకుంటే) ఎలాంటి నిందలేదు. సజ్జనులపై కూడా ఎలాంటి నిందలేదు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Tevbe 9:92
మరియు ఎవరైతే నీ వద్దకు వచ్చి వాహనాలు కోరినప్పుడు నీవు వారితో: "నా దగ్గర మీకివ్వటానికి ఏ వాహనం లేదు." అని పలికినప్పుడు, ఖర్చు చేయటానికి తమ దగ్గర ఏమీ లేదు కదా అనే చింతతో కన్నీరు కార్చుతూ తిరిగి పోయారో, అలాంటి వారిపై కూడా ఎలాంటి నింద లేదు.
Tevbe 9:93
కాని వాస్తవానికి ధనవంతులై కూడా, వెనుక కూర్చున్న వారితో ఉండటానికి ఇష్టపడి, నిన్ను అనుమతి అడిగే వారిపై తప్పక నింద గలదు. అల్లాహ్ వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాడు, కావున (తాము పోగొట్టుకునేదేమిటో) వారికి తెలియదు.[1]
———
[1] వీరు ఆయత్ 86, 87లలో పేర్కొనబడ్డ కపటవిశ్వాసులు.
Tevbe 9:94
మీరు (తబూక్ దండయాత్ర నుండి) మరలి వారి వద్దకు వచ్చిన తరువాత కూడా వారు (కపటవిశ్వాసులు) మీతో తమ సాకులు చెబుతున్నారు. వారితో అను: "మీరు సాకులు చెప్పకండి, మేము మీ మాటలను నమ్మము. అల్లాహ్ మాకు మీ వృత్తాంతం తెలిపి వున్నాడు. మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీ ప్రవర్తనను కనిపెట్టగలరు, తరువాత మీరు అగోచర మరియు గోచర విషయాలు ఎరుగునట్టి ఆయన (అల్లాహ్) వైపునకు మరలింపబడతారు. అప్పుడాయన మీరు చేస్తూ ఉన్న వాటిని గురించి మీకు తెలుపుతాడు."
Tevbe 9:95
(ఓ విశ్వాసులారా!) మీరు వారి వద్దకు మరలి వచ్చిన తరువాత వారిని వదలి పెట్టాలని (మీరు వారిపై చర్య తీసుకో గూడదని), వారు మీ ముందు అల్లాహ్ పేరుతో ప్రమాణాలు చేస్తారు. కావున మీరు వారి నుండి విముఖులు కండి. నిశ్చయంగా, వారు అశుచులు (మాలిన్యం వంటివారు). వారి నివాసం నరకమే. అదే వారు అర్జించిన దాని ఫలితం.
Tevbe 9:96
మీరు వారితో రాజీ పడాలని, వారు (కపట విశ్వాసులు) మీ ముందు ప్రమాణాలు చేస్తున్నారు. ఒకవేళ మీరు వారితో రాజీ పడినా, నిశ్చయంగా, అల్లాహ్ అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలతో రాజీ పడడు.[1]
———
[1] దైవప్రవక్త ('స'అస) తబూక్ దండయాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత, వారంతా క్షేమంగా తిరిగి వచ్చింది చూసి కపట విశ్వాసులు, తాము నమ్మకస్తులమని నిరూపించగోరారు. ఆ సమయంలో పై మూడు ఆయతులు (94-96) అవతరింపజేయబడ్డాయి.
Tevbe 9:97
ఎడారివాసులు (బద్దూలు) సత్యతిరస్కార మరియు కపట విశ్వాస విషయాలలో అతి కఠినులు. వారు అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపజేసిన (ధర్మ) నియమాలు అర్థం చేసుకునే యోగ్యత లేనివారు.[1] మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
———
[1] ఎందుకంటే వారు నగరాల నుండి దూరప్రాంతాలలో ఉండటం వలన అల్లాహ్ (సు.తా.) మరియు ఆయన (సు.తా.), ప్రవక్త ('స'అస) మాటలు వినలేరు.
Tevbe 9:98
మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసిన దానిని దండుగగా భావించే వారున్నారు. (ఓ విశ్వాసులారా!) మీరు ఆపదలలో చిక్కుకోవాలని వారు ఎదురు చూస్తున్నారు. (కాని) వారినే ఆపద చుట్టుకుంటుంది. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.[1]
———
[1] వీరు మొదటి రకానికి చెందిన బుద్ధూలు.
Tevbe 9:99
మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారున్నారు.[1] వారు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసేది, తమకు అల్లాహ్ సాన్నిధ్యాన్ని మరియు ప్రవక్త ప్రార్థనలను చేకూర్చటానికి సాధనంగా చేసుకుంటున్నారు. వాస్తవానికి అది వారికి తప్పక సాన్నిధ్యాన్ని చేకూర్చుతుంది. అల్లాహ్ వారిని తన కారుణ్యంలోకి చేర్చుకోగలడు. నిశ్చయంగా! అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
———
[1] వీరు రెండో రకానికి చెందిన మంచి విశ్వాసులు.
Tevbe 9:100
మరియు వలస వచ్చిన ముహాజిర్ లలో నుండి మరియు అన్సారులలో (మదీనావాసులలో) నుండి, ప్రప్రథమంగా ముందంజ వేసిన (ఇస్లాం ను స్వీకరించిన) వారితోనూ మరియు సహృదయంతో వారిని అనుసరించిన వారితోనూ, అల్లాహ్ సంతోషపడ్డాడు. మరియు వారు కూడా ఆయనతో సంతోషపడ్డారు. మరియు వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధ పరిచి ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అదే గొప్ప సాఫల్యం (విజయం).
Tevbe 9:101
మరియు మీ చుట్టుప్రక్కల ఉండే ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు కపట విశ్వాసులున్నారు. మరియు (ప్రవక్త) నగరం (మదీనా మునవ్వరా)లో కూడా (కపటవిశ్వాసులు) ఉన్నారు.[1] వారు తమ కాపట్యంలో నాటుకొని ఉన్నారు. కాని (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఎరుగవు.[2] మేము వారిని ఎరుగుతాము. మేము వారికి రెట్టింపు శిక్షను విధించగలము. తరువాత వారు ఘోరశిక్ష వైపుకు మరలింపబడతారు.
———
[1] మదీనా మునవ్వరా మొదటి పేరు యస్'రిబ్. 622 క్రీస్తుశకంలో ము'హమ్మద్ ('స'అస) వలస వచ్చిన తరువాత అది మదీనతున్నబీ - ప్రవక్త నగరంగా, ఆ తరువాత మదీనా మునవ్వరగా కూడా పిలువబడుతోంది. [2] ఇక్కడ స్పష్టమైన శబ్దాలతో దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస)కు అగోచర జ్ఞానం లేదని విశదపరచబడింది.
Tevbe 9:102
మరియు ఇతరులు, తమ పాపాలను ఒప్పుకున్న వారున్నారు. వారు తమ సత్కార్యాన్ని ఇతర పాపకార్యంతో కలిపారు.[1] అల్లాహ్ వారిని తప్పక[2] క్షమిస్తాడు! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
———
[1] వీరు ఉచితమైన కారణం లేకుండానే వెనుక ఉండి పోయిన విశ్వాసులు. వీరు పోనందుకు తమ వల్ల జరిగిన పాపాన్ని ఒప్పుకున్నారు. వీరి సత్కార్యాలంటే ఇంతకు ముందు జరిగిన యుద్ధాలలో పాల్గొనటం. వీరి పాపకార్యం అంటే తబూక్ యుద్ధానికి పోకుండా ఉండటం. ఇంకా చూడండి 'స'హీ'హ్ బు'ఖారీ, పు.6, 'హ. 196. [2] 'అసా : అన్న పదం అల్లాహ్ (సు.తా.) కు సంబంధించి వస్తే, Be hopeful with Allah, నమ్ము, ఆశించు అనే భావం ఇస్తుంది. ఒకవేళ మానవునికి సంబంధించి ఉంటే Be conscious or Be afraid, జాగ్రత్త, ఏమో, బహుశా అనే భావం ఇస్తుంది.
Tevbe 9:103
(కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు. మరియు వారి కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు. మరియు నిశ్చయంగా, నీ ప్రార్థనలు వారికి మనశ్శాంతిని కలిగిస్తాయి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
Tevbe 9:104
ఏమీ? వాస్తవానికి అల్లాహ్ తన దాసుల పశ్చాత్తాపాన్ని (తౌబహ్ ను) అంగీకరిస్తాడని మరియు వారి దానాలను (సదఖాత్ లను) స్వీకరిస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.
Tevbe 9:105
మరియు (ఓ ప్రవక్తా!) వారితో అను: "మీరు (మీ పని) చేస్తూ ఉండండి, అల్లాహ్ ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు మీరు చేస్తున్న పనులు చూస్తున్నారు. తరువాత మీరు తప్పక అగోచర మరియు గోచర విషయాలను ఎరుగు ఆయన (అల్లాహ్) వద్దకు తిరిగి పంపబడగలరు. అప్పుడాయన మీరు చేస్తూ వున్న కర్మలను గురించి మీకు తెలియజేస్తాడు."
Tevbe 9:106
మరికొందరు అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) కొరకు వేచి ఉన్నారు. ఆయన వారిని శిక్షించనూ వచ్చు, లేదా క్షమించనూ వచ్చు! మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
Tevbe 9:107
మరియు (కపట విశ్వాసులలో) కొందరు (విశ్వాసులకు) హాని కలిగించటానికి, సత్యతిరస్కార వైఖరిని (బలపరచటానికి) మరియు విశ్వాసులను విడదీయటానికి, అల్లాహ్ మరియు ఆయన సందేశహరునితో ఇంతకు ముందు పోరాడిన వారు పొంచి ఉండటానికి, ఒక మస్జిద్ నిర్మించారు. మరియు వారు: "మా ఉద్దేశం మేలు చేయటం తప్ప మరేమీ కాదు!" అని గట్టి ప్రమాణాలు కూడా చేస్తున్నారు.[1] కాని వారు వాస్తవంగా అసత్యవాదులని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు.
———
[1] 'ఖ'జరజ్ తెగకు చెందిన ఒక మదీనా వాసుడు అబూ'ఆమిర్ క్రైస్తవుడవుతాడు. అతడు 3వ హిజ్రీలో జరిగిన ఉహుద్ యుద్ధంలో మక్కా ఖురైషులకు సహాయపడి, ఆ యుద్ధం తరువాత సిరియాకు పారిపోతాడు. అతుడ బైజాన్ టైన్ చక్రవర్తి హిరాక్లియస్ ను మదీనా పై దండయాత్ర చేయటానికి ప్రోత్సహిస్తాడు. మదీనాపై వారు రాకూడదని దైవప్రవక్త ('స'అస) వారిని ఎధుర్కొనటానికి తబూక్ కు బయలుదేరే సమయంలో అతడి అనుచరులు వచ్చి: "మేము మదీనా-ఖుబాల మధ్య ఒక మస్జిద్ నిర్మించాము. మీరు వచ్చి అందులో నమా'జ్ చేయించండి." అని కోరుతారు. దైవప్రవక్త ('స'అస): "తబూక్ నుండి వచ్చిన తరువాత వస్తాను." అని అంటారు. ఆ సందర్భంలో తబూక్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఈ ఆయత్ లు అవతరింపజేయబడ్డాయి. దైవప్రవక్త ('స'అస) తరువాత దానిని పడగొట్టిస్తారు. ఎందుకంటే ఆ మస్జిద్ నిర్మాణ లక్ష్యం విశ్వాసుల మధ్య భేదభావాలు పుట్టించడే ఉండెను.
Tevbe 9:108
నీవెన్నడూ దానిలో (నమాజ్ కు) నిలబడకు. మొదటి రోజు నుండియే దైవభీతి ఆధారంగా స్థాపించబడిన మస్జిదే నీకు (నమాజ్ కు) నిలబడటానికి తగినది. అందులో పరిశుద్ధులు కాగోరేవారున్నారు. మరియు అల్లాహ్ పరిశుద్ధులు కాగోరేవారిని ప్రేమిస్తాడు.
Tevbe 9:109
ఏమీ? ఎవడైతే అల్లాహ్ యందు గల భయభక్తులు మరియు ఆయన ప్రీతి, పునాదుల మీద తన (మస్జిద్) కట్టడాన్ని కట్టాడో, అతడు శ్రేష్ఠుడా? లేక, తన కట్టడపు పునాదులను, వరదలకు కూలిపోయి దాని క్రింది భాగం ఖాళీగా ఉన్న నది ఒడ్డున కట్టేవాడా? అది వానితో సహా నరకాగ్నిలోకి కొట్టుకొని పోతుంది. మరియు అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.
Tevbe 9:110
వారి హృదయాలు ముక్కలైపోయి (వారు చనిపోయి) నంత వరకు, వారు కట్టిన కట్టడం వారి హృదయాలలో కలతలు పుట్టిస్తూ ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
Tevbe 9:111
నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను వారి సంపదలను కొన్నాడు. కాబట్టి నిశ్చయంగా, వారి కొరకు స్వర్గముంది. వారు అల్లాహ్ మార్గంలో పోరాడి (తమ శత్రువులను) చంపుతారు మరియు చంపబడతారు. మరియు ఇది తౌరాత్, ఇంజీల్ మరియు ఖుర్ఆన్ లలో, ఆయన (అల్లాహ్) చేసిన వాగ్దానం, సత్యమైనది. మరియు తన వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్ ను మించిన వాడు ఎవడు? కావున మీరు ఆయనతో చేసిన వ్యాపారానికి సంతోషపడండి. మరియు ఇదే ఆ గొప్ప విజయం.[1]
———
[1] చూడండి, 'స. బు'ఖారీ, పు-4, 'హ. 352, పు-5, 'హ 377, మరియు పు-3, 'హ 3462.
Tevbe 9:112
(వీరే అల్లాహ్ ముందు) పశ్చాత్తాప పడేవారు, ఆయనను ఆరాధించేవారు, స్తుతించేవారు (అల్లాహ్ మార్గంలో) సంచరించేవారు (ఉపవాసాలు చేసేవారు).[1] ఆయన సన్నిధిలో వంగే (రుకూఉ చేసే) వారు, సాష్టాంగం (సజ్దా) చేసేవారు, ధర్మమును ఆదేశించేవారు మరియు ఆధర్మమును నిషేధించేవారు[2] మరియు అల్లాహ్ విధించిన హద్దును పాటించేవారు కూడాను. మరియు విశ్వాసులకు శుభవార్త తెలుపు.
———
[1] చాలా మంది వ్యాఖ్యాతలు ఈ శబ్దం 'సాయి'హూన్ ను 'సాయిమూన్' గా బోధించారు. అంటే ఉపవాసాలు చేసేవారు అని. [2] ఇటువంటి వాక్యానికి చూడండి, 3:104, 110, 1114; 9:71 మరియు 22:41.
Tevbe 9:113
అల్లాహ్ కు సాటి కల్పించే వారు (ముష్రికులు), దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించటం తగదు.[1]
———
[1] చూడండి, 28:56
Tevbe 9:114
మరియు ఇబ్రాహీమ్ తన తండ్రి క్షమాపణ కొరకు ప్రార్థించింది కేవలం అతను అతడి (తన తండ్రి)తో చేసిన వాగ్దానం వల్లనే.[1] కాని అతనికి, అతడు (తన తండ్రి) నిశ్చయంగా అల్లాహ్ కు శత్రువని స్పష్టమైనప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అతడిని విడనాడాడు. వాస్తవానికి ఇబ్రాహీమ్ వినయ విధేయతలతో (అల్లాహ్ ను) అర్థించేవాడు,[2] సహనశీలుడు.
———
[1] ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఈ వాగ్దానం కొరకు చూడండి, 19:47-48 మరియు 60:4. అతని ప్రార్థన కొరకు చూడండి, 26:86-87. ఇంకా చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పు-4, 'హ. 565. [2] అవ్వాహున్: మృదుహృదయుడు, వినయవిధేయతలతో (అల్లాహుతా'ఆలా ను) అర్థించేవాడు.
Tevbe 9:115
మరియు ఒక జాతికి సన్మార్గం చూపిన తరువాత వారు దూరంగా ఉండవలసిన విషయాలను గురించి వారికి స్పష్టంగా తెలుపనంత వరకు, అల్లాహ్ వారిని మార్గభ్రష్టత్వంలో పడవేయడు. నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.[1]
———
[1] చూడండి, 6:131-132. ఇంకా చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ పు-9, 'హ, 66.
Tevbe 9:116
నిశ్చయంగా, భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. మరియు అల్లాహ్ తప్ప మీకు వేరే రక్షకుడు గానీ సహాయకుడు గానీ ఎవ్వడూ లేడు.
Tevbe 9:117
వాస్తవానికి అల్లాహ్ ప్రవక్తను మరియు వలస వచ్చిన వారిని (ముహాజిర్ లను) మరియు అన్సార్ లను, ఎవరైతే బహు కష్టకాలంలో ప్రవక్త వెంట ఉన్నారో! అలాంటి వారినందరినీ క్షమించాడు.[1] వారిలో ఒక పక్షం వారి హృదయాలు, దాదాపు వక్రత్వం వైపునకు మరలినప్పటికీ (ప్రవక్త వెంట వెళ్ళారు), అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయన వారి పట్ల ఎంతో కనికరుడు, అపార కరుణా ప్రదాత.
———
[1] తబూక్ దండయాత్ర కాలం బహు కష్టకాలంగా పేర్కొనబడింది. ఎందుకంటే అది తీవ్రమైన ఎండకాలం. ఖర్జూర ఫలాలు సిద్ధమయ్యిన కాలం. ఆ ప్రయాణం చాలా దూరప్రదేశానిది. మరియు ప్రయాణ సౌకర్యాలు కూడా చాలా తక్కువ ఉండేవి.
Tevbe 9:118
మరియు వెనుక ఉండి పోయిన ఆ ముగ్గురిని కూడా (ఆయన క్షమించాడు).[1] చివరకు విశాలంగా ఉన్న భూమి కూడా వారికి ఇరుకై పోయింది. మరియు వారి ప్రాణాలు కూడా వారికి భారమయ్యాయి. అల్లాహ్ నుండి (తమను కాపాడుకోవటానికి) ఆయన శరణం తప్ప మరొకటి లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు - వారు పశ్చాత్తాప పడాలని. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.
———
[1] తబూక్ దండయాత్రలో పాల్గొనని ఆ ముగ్గురు, క'అబ్ ఇబ్నె మాలిక్, మరారా ఇబ్నె రబీ మరియు హిలాల్ ఇబ్నె 'ఉమయ్యా (ర'ది.'అన్హుమ్) అనే అన్ సారులు. వీరు, పై ఆయత్ అవతరింప జేయబడేవరకు దైవప్రవక్త ('స'అస) మరియు అతని అనుచరులతో బహిష్కరించబడి ఉండిరి. వీరి పశ్చాత్తాపం యాభై రోజుల తరువాత అంగీకరించబడింది. వీరు విధేయులైన ముస్లింలు. ఇంతకు ముందు ప్రతి యుద్ధంలో పాల్గొన్నారు. తబూక్ దండయాత్రలో కేవలం సోమరితనం వల్లనే పాల్గొన లేక పోయారు. వారు కపటవిశ్వాసుల వలే బూటక సాకులు చెప్పలేదు. (చూడండి 'స'హీ'హ్ బు'ఖారీ, కితాబ్ అల్ మ'గాజీ, బాబ్ 'గజ్ వత్ అత్ తబూక్. ముస్లిం కితాబ్ అత్-తౌబహ్, బాబ్ 'హదీస్ తౌబతు క'అబ్ బిన్ మాలిక్).
Tevbe 9:119
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు సత్యవంతులతో ఉండండి.[1]
———
[1] చూడండి, 'స. బు'ఖారీ, పు-8, 'హ. 116, 117, 118.
Tevbe 9:120
మదీనా పురవాసులకు మరియు చుట్టుప్రక్కలలో ఉండే ఎడారి వాసులకు (బద్దూలకు) అల్లాహ్ ప్రవక్తను వదలి వెనుక ఉండి పోవటం మరియు తమ ప్రాణాలకు అతని (దైవప్రవక్త) ప్రాణాలపై ఆధిక్యత నివ్వటం తగిన పని కాదు. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో వారు ఆకలి దప్పులు, (శారీరక) కష్టాలు సహిస్తే, శత్రువుల భూమిలోకి దూరి సత్యతిరస్కారుల కోపాన్ని రేకెత్తిస్తే మరియు శత్రువుల నుండి ఏదైనా సాధిస్తే,[1] దానికి బదులుగా వారికి ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనుల ఫలితాన్ని వ్యర్థ పరచడు.
———
[1] నైలన్: attainment, సిద్ధి లేక సాధించడం. ఇక్కడ ఈ వాక్యపు అర్థం, శత్రువుల నుండి ఏదైనా తీసుకోవటం, లేక వారికి హాని కలిగించటం అంటే వారిని సంహరించటం లేదా ఖైదీలుగా చేసుకోవటం లేదా ఓడించి విజయధనం పొందటం, లేక అమరగతి పొందటం.
Tevbe 9:121
మరియు (అల్లాహ్ మార్గంలో) వారు ఖర్చు చేసే ధనం కొంచెమైనా లేదా అధికమైనా లేక వారు (శ్రమపడి) కొండలోయలను దాటే విషయమూ, అంతా వారి కొరకు వ్రాయబడకుండా ఉండదు - వారు చేస్తూ ఉండిన ఈ సత్కార్యాల కొరకు - అల్లాహ్ వారికి ప్రతిఫలాన్ని ప్రసాదించటానికి.
Tevbe 9:122
మరియు విశ్వాసులందరూ (పోరాటానికి) బయలు దేరటం సరికాదు. కావున వారిలో ప్రతి తెగ నుండి కొందరు ధర్మజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి పోయి, వారు వారి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తమ జాతి (ప్రాంత) ప్రజలను హెచ్చరిస్తే! బహుశా వారు కూడా తమను తాము (దుర్మార్గం నుండి) కాపాడు కోగలరు.[1]
———
[1] తబూక్ దండయాత్ర కొరకు, ఆర్థిక మరియు భౌతిక స్తోమత గల వారంతా బయలుదేరాలని ప్రకటన చేయబడి ఉండెను. ఎందుకంటే అప్పుడు వారికి ఒక గొప్ప సామ్రాజ్యపు సేనతో యుద్ధం చేయవలసి ఉండెను. లేనిచో వారు మదీనాపై దాడి చేయటానికి యత్నాలు చేయచుండిరి. కాని అన్ని యుద్ధాలలో, అందరూ పాల్గొనే అవసరముండదు. అలాంటప్పుడు కొందరు యుద్ధానికి పోకుండా ధర్మజ్ఞానం పెంపొందించుకోవటానికి పోయి, తిరిగి వచ్చి తమ ప్రాంతంలోని ప్రజలకు ధర్మజ్ఞానం బోధించాలి. దీని వల్ల ప్రజలలో దైవభీతి పెరుగుతుంది.
Tevbe 9:123
ఓ విశ్వాసులారా! మీ దగ్గరున్న సత్యతిరస్కారులతో పోరాడి, వారిని మీలో నున్న కాఠిన్యాన్ని గ్రహించనివ్వండి.[1] మరియు నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గల వారితో ఉంటాడని తెలుసుకోండి.
———
[1] ఎందుకు జిహాద్ చేయాలో 2:190-194, 22:39, 60:8-9 ఆయత్ లలో వచ్చింది. ఇక్కడ: 'మీ ఇరుగు పొరుగులో ఉన్నవారు మీకు హాని చేకూర్చదలిస్తే, మిమ్మల్ని, మీ ధర్మం అనుసరించటంలో ఆటంకపరిస్తే, అట్టివారితో మీరు కఠినత్వాన్ని వ్యక్తపరుస్తూ పోరాడండి.' అని ఆదేశమివ్వబడుతోంది. ఇంకా చూడండి, 48:29 మరియు 5:54.
Tevbe 9:124
మరియు ఒక సూరహ్ అవతరింప జేయబడినప్పుడల్లా వారి (కపట విశ్వాసుల) లో కొందరు: "ఇది మీలో ఎవరి విశ్వాసాన్ని అధికం చేసింది?" అని అడుగుతారు. కాని వాస్తవానికి అది విశ్వసించిన వారందరి విశ్వాసాన్ని అధికం చేస్తుంది. మరియు వారు దానితో సంతోషపడతారు.[1]
———
[1] చూడండి, 8:2.
Tevbe 9:125
కాని ఎవరి హృదయాలలో రోగముందో, ఇది వారి మాలిన్యంలో మరింత మాలిన్యాన్ని అధికం చేస్తుంది. మరియు వారు సత్యతిరస్కారులుగానే మరణిస్తారు.[1]
———
[1] చూడండి, 17:82.
Tevbe 9:126
ఏమీ? వారు ప్రతి సంవత్సరం ఒకసారి లేక రెండుసార్లు (బాధలతో) పరీక్షింప బడటాన్ని గమనించటం లేదా? అయినా వారు పశ్చాత్తాప పడటం లేదు మరియు గుణపాఠం కూడా నేర్చుకోవటం లేదు.
Tevbe 9:127
మరియు ఏదైనా సూరహ్ అవతరించినపుడల్లా వారు ఒకరినొకరు చూసుకుంటూ (అంటారు): "ఎవడైనా మిమ్మల్ని చూస్తున్నాడా?" ఆ తరువాత అక్కడి నుండి మెల్లగా జారుకుంటారు. అల్లాహ్ వారి హృదయాలను (సన్మార్గం నుండి) మళ్ళించాడు. ఎందుకంటే నిశ్చయంగా, వారు అర్థం చేసుకోలేని జనులు.[1]
———
[1] చూడండి, 8:55.
Tevbe 9:128
(ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు;[1] మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణామయుడు.
———
[1] చూడండి, 50:2.
Tevbe 9:129
అయినా వారు విముఖులైతే, వారితో అను: "నాకు అల్లాహ్ చాలు! ఆయన తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు! నేను ఆయననే నమ్ముకున్నాను. మరియు ఆయనే సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు."[1]
———
[1] చూడండి, ఖుర్ఆన్ 7:54 మరియు 'స'హీ'హ్ బు'ఖారీ, పు-9, 'హ. 86 మరియు పు-6, 'హ. 87.
Yunus 10:1
అలిఫ్ - లామ్ - రా[1]. ఇవి వివేకంతో నిండి వున్న దివ్యగ్రంథం యొక్క ఆయతులు.
———
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
Yunus 10:2
"ఏమీ? మానవులను హెచ్చరించటానికి మరియు విశ్వసించిన వారికి నిశ్చయంగా, తమ ప్రభువు వద్ద, వారు చేసి పంపిన మంచిపనులకు తగిన స్థానం ఉంది." అనే శుభవార్త వినిపించటానికి, మేము వారిలోని ఒక మనిషి (ముహమ్మద్) పై మా సందేశాన్ని అవతరింప జేయటం ప్రజలకు ఆశ్చర్యకమైన విషయంగా ఉందా?[1] (ఎందుకంటే) సత్యతిరస్కారులు ఇలా అన్నారు: "నిశ్చయంగా ఇతను పచ్చి మాంత్రికుడు!"
———
[1] చూడండి, 9:128.
Yunus 10:3
నిశ్చయంగా మీ పోషకుడూ, ప్రభువూ అయిన అల్లాహ్, ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించి, తర్వాత తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు.[1] ఆయనే (సర్వసృష్టి) వ్యవహారాలను నడుపుతున్నాడు. ఆయన అనుమతి లేకుండా సిఫారసు చేయగలవాడు ఎవ్వడూ లేడు.[2] ఆయనే అల్లాహ్! మీ పోషకుడు (ప్రభువు), కావున మీరు ఆయననే ఆరాధించండి. ఏమీ? మీరు హితోపదేశం స్వీకరించరా?
———
[1] చూడండి, 7:54. [2] అల్లాహ్ (సు.తా.) అనుమతి లేకుండా సిఫారసు చేయగలవారు ఎవ్వడూ లేడు. అల్లాహ్ (సు.తా.) వారి కొరకే సిఫారసు చేయటానికి అనుమతిస్తాడు. ఎవరికొరకైతే ఆయన (సు.తా.) ఇష్టపడతాడో; అంటే షిర్క్ చేయకుండా, విశ్వాసులై అల్లాహ్ విధులను పాటిస్తూ అనుకోకుండా పాపాలు చేసిన వారి కొరకు మాత్రమే. ముష్రికీన్ లు భావిచినట్లు: 'వారు ఆరాధించేవి, తమను అల్లాహ్ (సు.తా.) శిక్ష నుండి తప్పించటానికి, అల్లాహ్ (సు.తా.) వద్ద సిఫారసు చేస్తాయి.' అనే తప్పుడు ఊహలను ఈ ఆయత్ మరియు ఇలాంటి ఎన్నో ఆయతులు ఖండిస్తున్నాయి. షిర్క్ (అల్లాహుతా'ఆలాకు సాటి కల్పించడం) ఎన్నటికీ క్షమించబడని మహా పాపం. ముష్రికీన్ ల గమ్యస్థానం - వారెన్ని పుణ్యకార్యాలు చేసినా - నరకం మాత్రమే. చూడండి, 2:255, 19:87, 20:109, 21:28, 34:23, మరియు 53:26.
Yunus 10:4
ఆయన వైపునకే మీరందరూ మరలి పోవలసి ఉంది. అల్లాహ్ వాగ్దానం నిజమైనది. నిశ్చయంగా, ఆయనే సృష్టిని మొదట సరిక్రొత్తగా ప్రారంభించాడు, మరల ఆయనే దానిని ఉనికిలోకి తెస్తాడు. ఇది విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి న్యాయమైన ప్రతిఫల మివ్వటానికి. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారికి - వారు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండినందుకు - త్రాగటానికి సలసల కాగే నీళ్ళు మరియు బాధాకరమైన శిక్ష ఉంటాయి.
Yunus 10:5
ఆయనే, సూర్యుణ్ణి (ప్రకాశించే) దీపంగానూ మరియు చంద్రుణ్ణి వెలుగును (ప్రతిబింబింపజేసే) దాని గానూ చేసి, దానికి (పెరిగే - తరిగే) దశలు నియమించాడు,[1] దాని ద్వారా మీరు సంవత్సరాల మరియు (కాలపు) గణనను తెలుసుకోవాలని.[2] అల్లాహ్ ఇదంతా సత్యాధారంగా తప్ప సృష్టించలేదు. జ్ఞానం గల వారికి ఆయన తన సూచనలను (ఈ విధంగా) విశదీకరిస్తున్నాడు.
———
[1] సూర్యుని ప్రకాశం స్వంతమైనది, విధంగానైతే ద్వీపపు వెలుగో. చంద్రుని వెలుగు ప్రతిబింబింపజేయబడిన సూర్యుని వెలుగు. చంద్రునిలో తన స్వంత వెలుగు లేదు. [2] చంద్రునికి 28 దశలున్నాయి. వాటిలో చంద్రుడు చిన్న రేఖ నుండి పూర్ణిమ రోజు పూర్తి చంద్రునిగా 14 రోజులలో మారుతాడు. ఆ తరువాత తిరిగి తగ్గుతూ 14 పోజులలో చిన్న రేఖగా మారుతాడు. తరువాత ఒకటి రెండు రోజులు కానరాకుండా పోతాడు. మళ్ళీ చిన్న రేఖగా మొదలవుతాడు. ఈ విధంగా చంద్రుని దిశల వల్ల దినాల, నెలల మరియు సంవత్సరాల గణనలు తెలుస్తాయి.
Yunus 10:6
నిశ్చయంగా, రేయింబవళ్ళ నిరంతర మార్పులలోనూ మరియు భూమ్యాకాశాలలో అల్లాహ్ సృష్టించిన ప్రతిదానిలోనూ, దైవభీతి గల ప్రజలకు సూచనలున్నాయి.
Yunus 10:7
నిశ్చయంగా, ఎవరైతే మమ్మల్ని కలుసుకోవటాన్ని ఆశించక, ఇహలోక జీవితంతోనే సంతసించి, దానితోనే తృప్తి చెందుతారో మరియు మా సూచన (ఆయాత్) లను గురించి నిర్లక్ష్యభావం కలిగి ఉంటారో!
Yunus 10:8
అలాంటి వారి ఆశ్రయం - తమ కర్మలకు ఫలితంగా - నరకాగ్నియే!
Yunus 10:9
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని వారి విశ్వాసఫలితంగా వారి ప్రభువు వారిని సన్మార్గం మీద నడిపిస్తాడు. వారి క్రింద పరమ సుఖాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో, సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.
Yunus 10:10
అందులో వారి ప్రార్థన: "ఓ అల్లాహ్! నీవు సర్వలోపాలకు అతీతుడవు." అని మరియు వారి అభివందనం: "అస్సలాము అలైకుం (మీకు శాంతి కలుగు గాక)!" అని, మాత్రమే ఉంటాయి. మరియు వారు తమ ప్రార్థనలను: "సర్వస్తోత్రాలకు అర్హుడు సమస్తలోకాల పోషకుడైన అల్లాహ్ మాత్రమే!" అని ముగించుకుంటారు.
Yunus 10:11
మరియు ప్రజలు తమ మేలు కొరకు తొందర పడినట్లు అల్లాహ్ వారిపై (వారి చేష్టలకు) కీడును పంపటంలో తొందర పడి ఉంటే, వారి వ్యవధి ఎప్పుడో పూర్తయి ఉండేది. అందువలన మేము, మమ్మల్ని కలుసుకునే నమ్మకంలేని వారిని, తమ తలబిరుసుతనంలో భ్రష్టులై తిరగటానికి వదలిపెడుతున్నాము.[1]
———
[1] చూడండి, 6:12.
Yunus 10:12
మరియు మానవునికి కష్టకాలం వచ్చినప్పుడు: అతడు పరుండినా, కూర్చుండినా లేక నిలుచుండినా, మమ్మల్ని ప్రార్థిస్తాడు. కాని మేము అతని ఆపదను తొలగించిన వెంటనే, అతడు తనకు కలిగిన కష్టానికి, ఎన్నడూ మమ్మల్ని ప్రార్థించనే లేదు, అన్నట్లు ప్రవర్తిస్తాడు. ఈ విధంగా మితిమీరి ప్రవర్తించే వారికి, వారి చేష్టలు ఆకర్షణీయమైనవిగా చూపబడతాయి.
Yunus 10:13
మరియు వాస్తవంగా మీకు పూర్వం ఎన్నో తరాలను మేము నాశనం చేశాము,[1] ఎందుకంటే వారు దుర్మార్గపు వైఖరిని అవలంబించారు; మరియు వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకొని వచ్చినా, వారు విశ్వసించలేదు. ఈ విధంగా మేము అపరాధులకు ప్రతీకారం చేస్తాము.
———
[1] చూడండి, 6:131-132. ఖర్ నున్: అంటే, ఒకే కాలానికి, లేక తరానికి చెందిన ప్రజలు.
Yunus 10:14
వారి తరువాత - మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూడటానికి - మేము మిమ్మల్ని భూమికి వారసులుగా చేశాము.
Yunus 10:15
మరియు మా స్పష్టమైన ఆయతులను వారికి చదివి వినిపించినప్పుడు - మమ్మల్ని కలుసుకునే నమ్మకం లేనివారు - అంటారు: "దీనికి బదులుగా మరొక ఖుర్ఆన్ తీసుకురా లేదా ఇందులో సవరణలు చెయ్యి." (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "ఇందులో నా అంతట నేను మార్పులు చేయటం నా పని కాదు. నా వద్దకు పంపబడే దివ్యజ్ఞానాన్ని (వహీని) మాత్రమే నేను అనుసరిస్తాను. నిశ్చయంగా, నేను నా ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘిస్తే, ఆ గొప్ప దినమున శిక్ష పడుతుందని భయపడుతున్నాను!"
Yunus 10:16
(ఇంకా ఇలా) అను: "ఒకవేళ అల్లాహ్ కోరితే, నేను దీనిని మీకు వినిపించి ఉండేవాడిని కాదు; మరియు ఆయన కూడా దీనిని మీకు తెలిపి ఉండేవాడు కాదు. వాస్తవంగా నేను దీనికి (ఈ గ్రంథ అవతరణకు) పూర్వం మీతో నా వయస్సులోని దీర్ఘకాలాన్ని గడిపాను కదా?[1] ఏమీ? మీరిది గ్రహించలేరా?"
———
[1] దైవప్రవక్తగా ఎన్నుకొనబడక ముందు ము'హమ్మద్ ('స'అస) 40 సంవత్సరాలు మక్కా వారితో నివసించారు. మరియు వారు అతనిని నమ్మకస్తునిగా (అల్-అమీన్) మరియు ఎన్నడూ అబద్ధమాడని వారి (అ'స్సాదిఖ్)గా సాక్ష్యమిచ్చేవారు. అతనికి ('స'అస) ఏ గురువు లేడు. అతను చదువటం వ్రాయటం ఎరుగరు. ఇది కూడా వారికి బాగా తెలుసు. అలాంటప్పుడు ఈ ఖుర్ఆన్ ఏదైతే ఎన్నో అద్భుత విషయాలను, విజ్ఞాన విషయాలను, నక్షత్రాల విషయాలను, ప్రాచీన ప్రవక్తల గాథలను వివరిస్తుందో, అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి గాక మరెవరి తరఫు నుండి రాగలదు. ఎందుకంటే ఇందులో వేయి కంటే ఎక్కువ విజ్ఞాన (Science) విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడిప్పుడే వైజ్ఞానికి ప్రయోగాల ద్వారా సత్యమని నిరూపించబడ్డాయి. ఇకా ఎన్నో నిరూపించబడనున్నాయి. ఇంకొక విశేషమేమిటంటే దివ్య ఖుర్ఆన్ లో సూచించబడిన వైజ్ఞానిక విషయాలలో ఇంత వరకు ఒక్కటి కూడా తప్పని నిరూపించబడలేదు. మరియు దివ్యఖుర్ఆన్ లో సూచించబడిన ఇంకా ఎన్నో వైజ్ఞానిక విషయాలను మానవుడు ఇంతవరకు కూడా అర్థం చేసుకోలేక పోయాడు. .
Yunus 10:17
ఇక అబద్ధాన్ని కల్పించి, దానిని అల్లాహ్ కు ఆపాదించే వాడి కంటే, లేక ఆయన సూచన (ఆయాత్) లను అబద్ధాలని తిరస్కరించే వాడి కంటే, మహా దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, పాపులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు!
Yunus 10:18
మరియు వారు అల్లాహ్ ను కాదని తమకు నష్టం గానీ, లాభం గానీ కలిగించలేని వాటిని ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా అంటున్నారు: "వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు." వారినడుగు: "ఏమీ? ఆకాశాలలో గానీ, భూమిలో గానీ, అల్లాహ్ ఎరుగని విషయాన్ని, మీరు ఆయనకు తెలుపగోరుతున్నారా?" ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే వాటి కంటే ఆయన అత్యున్నతుడు.[1]
———
[1] విశ్వంలో అల్లాహ్ (సు.తా.)కు తెలియనిది ఏదీ లేదు, అలాంటప్పుడు అల్లాహ్ (సు.తా.) కు తెలియని, ఈ సిఫారసుదారులను వీరు ఎక్కడి నుండి కల్పించి తెచ్చారు?
Yunus 10:19
మరియు మానవులందరూ మొదట ఒకే సంఘంగా (ఒకే ధర్మం మీద) ఉండేవారు. కానీ, వారు తరువాత భిన్నాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు నీ ప్రభువు తరఫు నుండి ముందుగానే ఈ విషయం నిర్ణయించ బడకుండా ఉండి ఉన్నట్లయితే, వారి మధ్య ఉన్న ఈ విభేదాల తీర్పు ఎప్పుడో జరిగి వుండేది.[1]
———
[1] చూడండి, 2:213, 253. అల్లాహ్ (సు.తా.), పునరుత్థాన దినమున తీర్పు చేయాలనీ - మానవులకూ మరియు జిన్నాతులకూ - అంతవరకు వ్యవధినివ్వాలని నిర్ణయించి ఉండకపోతే! వీరి తీర్పుఅప్పటికప్పుడే జరిగి ఉండేది.
Yunus 10:20
మరియు వారంటున్నారు: "అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా (అద్భుత) సంకేతం ఎందుకు అవతరింప జేయబడలేదు?" నీవిలా జవాబివ్వు: "నిశ్చయంగా అగోచర విషయ జ్ఞానం కేవలం అల్లాహ్ కే చెందుతుంది,[1] కావున వేచి ఉండండి! నిశ్చయంగా, నేను కూడా మీతో బాటు వేచి ఉంటాను."
———
[1] చూడండి, 2:105 మరియు 3:73-74.
Yunus 10:21
మరియు మానవులకు ఆపద కలిగిన పిదప, మేము వారికి కారుణ్యం రుచి చూపిస్తే, వెంటనే వారు మా సూచనలకు విరుద్ధంగా ఎత్తుగడలు వేయటం ప్రారంభిస్తారు.[1] వారితో అను: "ఎత్తుగడలు వేయటంలో అల్లాహ్ అతి శీఘ్రుడు!" నిశ్చయంగా, మా దూతలు మీరు చేసే ఎత్తుగడలన్నింటినీ వ్రాస్తున్నారు.
———
[1] వీరు ఆయత్ లు 7, 11, 12, 15, 18 మరియు 20లలో పేర్కొనబడిన రెండు రకాల మానవులు.
Yunus 10:22
ఆయన (అల్లాహ్) యే! మిమ్మల్ని భూమిలోను మరియు సముద్రంలోనూ ప్రయాణింప జేయగలవాడు. ఇక మీరు ఓడలలో ఉన్నప్పుడు: అవి వారితో సహా, అనుకూలమైన గాలి వీస్తూ ఉండగా పోతూ ఉంటాయి మరియు దానితో వారు ఆనందిస్తూ ఉంటారు. (అకస్మాత్తుగా) వారిపైకి తీవ్రమైన తుఫాను గాలి వస్తుంది మరియు ప్రతిదిక్కు నుండి వారి మీదికి పెద్ద పెద్ద అలలు వస్తాయి మరియు వారు వాటి వల్ల వారు నిశ్చయంగా, చుట్టుకోబడ్డామని భావించి, అల్లాహ్ ను వేడుకుంటారు. తమ ధర్మం (ప్రార్థన)లో కేవలం ఆయననే ప్రత్యేకించుకొని ఇలా ప్రార్థిస్తారు: "ఒకవేళ నీవు మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేము నిశ్చయంగా కృతజ్ఞతలు చూపేవారమై ఉంటాము!"[1]
———
[1] ఇక్రిమా బిన్ - అబూ జహల్ (ర'ది.'అ) మక్కా విజయం తరువాత మక్కాను విడిచి, ఒక నావలో కూర్చొని పోతూవుండగా, ఆ నావ తుఫానులో చిక్కుకుంటుంది. నావ నడిపించేవాడు: "ఇప్పుడు మమ్మల్ని రక్షించగలవాడు కేవలం ఆ ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) మాత్రమే! కావున మీరు ఆయనను ప్రార్థించండి." అని అంటాడు. అప్పుడు - ము'హమ్మద్ ('స'అస) అనే మాటలు నిజమేనని - ఇక్రిమా అర్థంచేసుకుంటాడు. "ఒకవేళ ఈ తుఫాను నుండి బ్రతికి బయటపడితే ఇస్లాం స్వీకరిస్తాను." అని అతడు నిర్ణయించుకుంటాడు. ఆ ఆపద దాటిన తరువాత అతడు దైవప్రవక్త ('స'అస) దగ్గరికి వచ్చి ఇస్లాం స్వీకరిస్తాడు. (సునన్ నసా'యీ, అబూ-దావూద్ నం. 2683, అల్బాని ప్రమాణీకం నం. 1723).
Yunus 10:23
కాని, ఆయన వారిని కాపాడిన వెంటనే, వారు భూమిలో అన్యాయంగా దౌర్జన్యం చేయసాగుతారు.[1] ఓ మానవులారా! నిశ్చయంగా, మీ దౌర్జన్యాలు మీకే హాని కలిగిస్తాయి. ఇహలోక జీవితం తాత్కాలిక ఆనందమే. చివరకు మీకు మా వైపునకే మరలి రావలసి ఉన్నది, అప్పుడు మేము, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నీ మీకు తెలియజేస్తాము.
———
[1] ఇదే మానవుడి కృతఘ్నతా బుద్ధి. ఇది ఈ సూరహ్ 12వ ఆయత్ లో మరియు ఖుర్ఆన్ లో ఇతర ఎన్నో చోట్లలో పేర్కొనబడింది.
Yunus 10:24
వాస్తవానికి ఈ ప్రాపంచిక జీవితాన్ని ఇలా పోల్చవచ్చు: మేము ఆకాశం నుండి నీటిని కురిపించగా దాని నుండి భూమిలో మానవులకు మరియు పశువులకు తినటానికి, వివిధ రకాల చెట్లూ చేమలూ పెరుగుతాయి. అప్పుడు భూమి తన అలంకారంతో వర్ధిల్లుతూ ఉండగా, దాని యజమానులు నిశ్చయంగా, అది తమ వశంలో ఉందనుకుంటారు; అలాంటి సమయంలో అకస్మాత్తుగా రాత్రి పూటనో లేక పగటి పూటనో మా తీర్పు వస్తుంది. అప్పుడు మేము దానిని - నిన్నటి వరకు ఏమీ లేని - కోసివేసిన పంటపొలంగా మార్చివేస్తాము. ఈ విధంగా మేము మా సూచనలను ఆలోచించే ప్రజల కొరకు స్పష్టంగా వివరిస్తాము.
Yunus 10:25
మరియు అల్లాహ్ మిమ్మల్ని శాంతినిలయం (దారుస్సలాం) వైపునకు ఆహ్వానిస్తున్నాడు. మరియు ఆయన తాను కోరిన వానికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
Yunus 10:26
మంచిపనులు చేసిన వారికి, మంచి ఫలితం దొరుకుతుంది. మరియు ఇంకా ఎక్కువ లభిస్తుంది.[1] మరియు వారి ముఖాలు నల్లబడవు మరియు వారికి అవమానమూ జరుగదు. అలాంటి వారు స్వర్గవాసులు. వారందు శాశ్వతంగా ఉంటారు.
———
[1] చూడండి, 6:160 మరియు 27:89.
Yunus 10:27
మరియు పాపకార్యాలు చేసిన వారికి, వారి పాపాలకు తగినట్టి ప్రతిఫలం లభిస్తుంది మరియు వారిని అవమానం క్రమ్ముకుంటుంది. అల్లాహ్ నుండి వారిని రక్షించేవాడెవ్వడూ ఉండడు. వారి ముఖాలు చీకటి రాత్రి యొక్క నల్లని తెరల వంటి వాటితో కప్పబడి ఉంటాయి.[1] అలాంటి వారు నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
———
[1] చూడండి, 3:106 మరియు 80:38-41.
Yunus 10:28
మరియు మేము వారందరినీ సమావేశపరచిన రోజు,[1] సాటి కల్పించిన (షిర్కు చేసిన) వారితో ఇలా అంటాము: "మీరునూ మరియు మీరు అల్లాహ్ కు సాటి కల్పించిన వారునూ, మీ స్థానాలలోనే ఆగండి!" ఆ పిదప మేము వారిని వేరు చేస్తాము.[2] వారు అల్లాహ్ కు భాగస్వాములుగా కల్పించినవారు (వారి దైవాలు) ఇలా అంటారు: "మీరు ఆరాధిస్తూ ఉండేది మమ్మల్ని కాదు;[3]
———
[1] చూడండి, 18:47. [2] చూడండి, 36:59 మరియు 30:43. [3] చూడండి, 34:41.
Yunus 10:29
ఇక మీకూ మరియు మాకూ మధ్య అల్లాహ్ సాక్ష్యం చాలు. నిశ్చయంగా, మీరు (చేస్తూ వున్న) ఆరాధన గురించి మాకు ఏ మాత్రం తెలియదు!"[1]
———
[1] చూడండి, 46:5-6 ఇక్కడ విశదపరచబడుతున్నది ఏమిటంటే, ఏ సాధూ సన్యాసులను, దర్గాలను, వలీలను, ప్రవక్తలను వీరు ఆరాధించేవారో వారు: "మాకు వీరితో ఎలాంటి సంబంధం లేదు, వీరి ఆరాధన గురించి మాకు ఏమీ తెలియదు." అంటారు. ఇంకా చూడండి, 5:116-117, 10:30, 11:21, 16:87 మరియు 28:75.
Yunus 10:30
అక్కడ ప్రతి వ్యక్తీ తాను ముందుగా చేసి పంపుకున్న కర్మలను తెలుసుకుంటాడు. అందరూ తమ వాస్తవ యజమాని అయిన అల్లాహ్ వైపునకు మరలింపబడతారు మరియు వారు కల్పించుకున్న (బూటకదైవాలన్నీ) వారిని వీడి పోతాయి.[1]
———
[1] అంటే వారికి అక్కడ అల్లాహ్ (సు.తా.) తప్ప వారి ఏ కల్పిత దైవం కూడా పనికి రాదు.
Yunus 10:31
వారిని అడుగు: "ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?" వారు: "అల్లాహ్!" అని తప్పకుండా అంటారు. అప్పుడను: "అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా?"
Yunus 10:32
ఆయనే అల్లాహ్! మీ నిజమైన ప్రభువు. అయితే సత్యం తరువాత, మార్గభ్రష్టత్వం తప్ప మిగిలేదేమిటి? అయితే మీరు ఎందుకు (సత్యం నుండి) తప్పించబడుతున్నారు?
Yunus 10:33
ఈ విధంగా దుష్టులైన వారి విషయంలో వారెన్నడూ విశ్వసించరని, నీ ప్రభువు అన్న మాట నిజమయింది.[1]
———
[1] చూడండి, 39:71.
Yunus 10:34
వారిని అడుగు: "మీరు అల్లాహ్ కు సాటిగా కల్పించుకున్న వారిలో సృష్టిని మొదటిసారి ఆరంభించేవాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా?" ఇలా అను: "సృష్టి ఆరంభించేవాడు, దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడూ కేవలం అల్లాహ్ మాత్రమే! అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)?"
Yunus 10:35
వారిని అడుగు: "మీరు అల్లాహ్ కు సాటి కల్పించుకున్న వారిలో సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు, ఎవడైనా ఉన్నాడా?" ఇంకా ఇలా అను: "కేవలం అల్లాహ్ యే సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు. ఏమీ? సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు విధేయతకు ఎక్కువ అర్హుడా? లేక మార్గదర్శకత్వం చేయబడితేనే తప్ప స్వయంగా సన్మార్గం పొందలేని వాడా? అయితే మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు?"
Yunus 10:36
మరియు వారిలో చాలా మంది తమ ఊహలను మాత్రమే అనుసరించే వారున్నారు. నిశ్చయంగా ఊహ, సత్య (అవగాహనకు) ఏ మాత్రం పనికిరాదు.[1] నిశ్చయంగా, వారు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
———
[1] చాలామంది ఊహలను, అంటే తమ కల్పనలను లేక భావనలను అనుసరించే వారున్నారు. కాని సత్యం ముందు ఊహలకు, భావనలకు, కల్పనలకు ఎలాంటి స్థానం లేదు. ఖుర్ఆన్ లో 'జన్న' అనే పదం ఊహ మరియు నిశ్చయం రెండూ అర్థాలలో వాడబడింది. ఈ సందర్భాలలో ఊహ లేక కల్పన అనే అర్థంలో వాడబడింది. (ము'హమ్మద్ జూనాగఢి).
Yunus 10:37
మరియు అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా ఈ ఖుర్ఆన్ కల్పించబడటం సంభవం కాదు; వాస్తవానికి ఇది (పూర్వగ్రంథాలలో) మిగిలి ఉన్న దానిని (సత్యాన్ని) ధృవపరుస్తోంది మరియు ఇది (ముఖ్య సూచనలను) వివరించే గ్రంథం; ఇది సమస్త లోకాల పోషకుని (అల్లాహ్) తరఫు నుండి వచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు!
Yunus 10:38
అయినా వారు: "అతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే - అల్లాహ్ ను విడిచి మీరు పిలువ గలిగే వారినందరినీ (మీ సహాయానికి) పిలుచుకొని - దీని వంటి ఒక్క సూరహ్ నైనా (రచించి) తీసుకురండి!"[1]
———
[1] చూడండి, 2:23 వ్యాఖ్యానం 1; 11:13, 17:88 మరియు 52:34.
Yunus 10:39
కాని వారు - దాని జ్ఞానాన్ని ఇముడ్చుకొనక ముందే మరియు దాన వ్యాఖ్యానం వారి వద్దకు రాకముందే - దానిని అబద్ధమని తిరస్కరించారు. వీరికి పూర్వమున్న వారు కూడా ఈ విధంగానే అబద్ధమని తిరస్కరించారు. కావున, చూశారా! ఆ దుర్మార్గుల ముగింపు ఎలా జరిగిందో!
Yunus 10:40
మరియు వారిలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మేవారున్నారు మరికొందరు దీనిని నమ్మనివారున్నారు. మరియు దౌర్జన్యపరులు ఎవరో నీ ప్రభువుకు బాగా తెలుసు.
Yunus 10:41
మరియు ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే, వారితో అను: "నా కర్మలు నాకు మరియు మీ కర్మలు మీకు. నా కర్మలకు మీరు బాధ్యులు కారు మరియు మీ కర్మలకు నేను బాధ్యుడను కాను."
Yunus 10:42
మరియు వారిలో కొందరు నీ మాటలను వింటూ ఉంటారు! ఏమీ? నీవు చెవిటి వారికి వినిపించ గలవా? మరియు వారు ఏమీ అర్థం చేసు కోలేక పోయినప్పటికీ (వారికి వినిపించగలవా)?
Yunus 10:43
మరియు వారిలో కొందరు నీ వైపునకు చూస్తూ ఉంటారు. ఏమీ? నీవు గ్రుడ్రివారికి సరైన మార్గం చూపించగలవా? మరియు వారికి ఏమీ కనిపించనప్పటికి కూడానా?
Yunus 10:44
నిశ్చయంగా, అల్లాహ్ మానవులకు ఎలాంటి అన్యాయం చేయడు, కాని మానవులే తమకు తాము అన్యాయం చేసుకుంటారు.
Yunus 10:45
మరియు ఆయన (అల్లాహ్) వారిని సమావేశపరచే రోజు, ఒక దినపు ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం (ఇహలోకంలో) గడపలేదని వారు భావిస్తారు.[1] వారు ఒకరినొకరు గుర్తుపడతారు.[2] వాస్తవానికి అల్లాహ్ ను దర్శించ వలసివున్న సత్యాన్ని నిరాకరించిన వారు, తీవ్రమైన నష్టానికి గురి అవుతారు మరియు వారు మార్గదర్శకత్వాన్ని పొందలేక పోయారు.
———
[1] చూడండి, 79:46. [2] చూడండి, 23:101.
Yunus 10:46
మరియు (ఓ ముహమ్మద్!) మేము వాస్తవానికి వారికి వాగ్దానం చేసిన (శిక్షలలో) కొన్నింటిని నీకు చూపినా, లేక (అంతకు ముందే) నిన్నూ మరణింపజేసినా, వారు మా వైపుకే కదా మరలి రావలసి వున్నది. చివరకు వారి కర్మలన్నింటికీ అల్లాహ్ యే సాక్షి!
Yunus 10:47
మరియు ప్రతి సమాజానికీ ఒక ప్రవక్త (పంపబడ్డాడు). ఎప్పుడైతే వారి ప్రవక్త వస్తాడో, అప్పుడు వారి మధ్య (వ్యవహారాల) తీర్పు న్యాయంగా చేయబడుతుంది. మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు.[1]
———
[1] చూడండి, 6:131-132, 17:15.
Yunus 10:48
మరియు వారిలా అడుగుతున్నారు: "మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం ఎప్పుడు పూర్తి కానున్నది?"
Yunus 10:49
(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప! నా కొరకు నేను కీడుగానీ, మేలుగానీ చేసుకోగలిగే శక్తి నాకు లేదు.[1] ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. వారి గడువు వచ్చినపుడు వారు ఒక ఘడియ వెనక గానీ లేక ముందు గానీ కాలేరు."[2]
———
[1] ఇక్కడ అల్లాహుతా'ఆలా దైవప్రవక్త ('స'అస)తో: "అల్లాహ్ కోరనిదే నాకు నేను, కీడు గానీ, మేలు గానీ, చేసుకోలేను." అని చెప్పమంటున్నాడు. దైవప్రవక్త ('స'అస) కే తన స్వంతానికి కీడుగానీ మేలుగానీ చేసుకునే శక్తి లేనప్పుడు, ఇతర వలీలకు గానీ లేక సద్పురుషులకు గానీ - జీవించి ఉన్నా లేక మరణించినా - ఇతరులకు కీడు గానీ మేలు గానీ చేయగల శక్తి ఎలా ఉండగలదు? వారిని అర్థించేవారు ఇది ఎందుకు అర్థం చేసుకోలేరు? [2] చూడండి, 7:34.
Yunus 10:50
వారితో అను: "ఏమీ? మీరు ఆలోచించారా (చూశారా)! ఒకవేళ ఆయన శిక్ష మీపై రాత్రిగానీ, లేక పగలు గానీ వచ్చి పడితే (మీరేం చేయగలరు)? అయితే దేని కొరకు ఈ అపరాధులు తొందర పెడుతున్నారు?"[1]
———
[1] చూడండి, 6:57-58, 48:32.
Yunus 10:51
ఏమి? అది (ఆ శిక్ష) మీపై వచ్చిపడిన తరువాతనే మీరు దానిని నమ్ముతారా? (ఆ రోజు మీరిలా అడగబడతారు): "ఇప్పుడా (మీరు దానిని నమ్మేది)? వాస్తవానికి మీరు దాని కొరకు తొందరపడ్తూ ఉండేవారు కదా!"
Yunus 10:52
అప్పుడు దుర్మార్గులతో ఇలా అనబడుతుంది: "మీరు శాశ్వతమైన శిక్షను అనుభవించండి! మీకు - మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రతిఫలం తప్ప - వేరే (శిక్ష) విధించబడునా?"
Yunus 10:53
మరియు (ఓ ముహమ్మద్!) వారు ఇంకా ఇలా అడుగుతున్నారు: " ఏమీ? ఇదంతా సత్యమేనా?[1] వారితో అను: "అవును, నా ప్రభువు సాక్షిగా! ఇదంతా నిశ్చయంగా, జరగబోయే సత్యమే! మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు!"
———
[1] "మరణించి మట్టిగా మారిపోయిన తరువాత కూడా మళ్ళీ సజీవులుగా మునపటి ఆకారంలో లేపబడతామా?" ఇలాంటి ప్రశ్నలు ఖుర్ఆన్ లో ఇంకా రెండు చోట్లలో ఉన్నాయి. 34:3, 64:7.
Yunus 10:54
మరియు దుర్మార్గం చేసిన ప్రతి వ్యక్తి వద్ద ఒకవేళ వాస్తవానికి భూమిలో ఉన్న ధనమంతా ఉన్నా, దానిని అంతా పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతాడు,[1] (కాని అది స్వీకరించబడదు). మరియు వారు ఆ శిక్షను చూసినప్పుడు లోలోపల పశ్చాత్తాప పడతారు. మరియు వారి మధ్య తీర్పు న్యాయంగా జరుగుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.
———
[1] చూడండి, 3:91 మరియు 5:36.
Yunus 10:55
వినండి! నిశ్చయంగా, ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తమూ, అల్లాహ్ కే చెందినది. తెలుసుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం, కాని చాలా మందికి ఇది తెలియదు.
Yunus 10:56
ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.[1]
———
[1] చూడండి, 11:123.
Yunus 10:57
ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు హితోపదేశం (ఈ ఖుర్ఆన్) వచ్చింది మరియు ఇది మీ హృదయాల (రోగాల) కు స్వస్థత నిస్తుంది. మరియు విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు కారుణ్యం (ప్రసాదిస్తుంది).[1]
———
[1] చూడండి, 17:82 మరియు 41:44.
Yunus 10:58
ఇలా అను: "ఇది అల్లాహ్ అనుగ్రహం వల్ల మరియు ఆయన కారుణ్యం వల్ల, కావున దీనితో వారిని ఆనందించమను, ఇది వారు కూడబెట్టే దానికంటే ఎంతో మేలైనది."
Yunus 10:59
ఇలా అను: "మీరు ఆలోచించారా! అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని ధర్మసమ్మతం, మరికొన్నింటిని నిషేధం చేసుకున్నారు."[1] ఇలా అడుగు: "ఏమీ అల్లాహ్ దీనికి అనుమతినిచ్చాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్ కు అంటగట్టు తున్నారా?"
———
[1] చూడండి, 5:101-102.
Yunus 10:60
మరియు అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవారు, తీర్పుదినమును గురించి ఏమనుకుంటున్నారు? నిశ్చయంగా, అల్లాహ్ మానవుల యెడల అత్యంత అనుగ్రహం కలవాడు, కాని చాలా మంది కృతజ్ఞతలు చూపరు.
Yunus 10:61
మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ కార్యంలో ఉన్నా మరియు ఖుర్ఆన్ నుండి నీవు దేనిని పఠిస్తూ ఉన్నా మరియు (ఓ మానవులారా!) మీరు ఏమి చేస్తూ ఉన్నా! మీరు మీ పనులలో నిమగ్నులై ఉన్నప్పుడు, మేము మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటాము. భూమ్యాకాశాలలో ఉన్నటువంటి ఒక రవంత (పరమాణువంత) వస్తువైనా, దాని కంటే చిన్నదైనా లేదా పెద్దదైనా, నీ ప్రభువు దృష్టి నుండి మరుగుగా లేదు. అదంతా ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది.[1]
———
[1] చూడండి, 6:59, 38, 11:6.
Yunus 10:62
వినండి! నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రియులైన వారికి[1] ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
———
[1] అవ్ లియా', వలియ్యున్: (ఏక.వ.) ఈ పదానికి, సహాయకుడు, రక్షించేవాడు, పోషించేవాడు, బంధువు, సన్నిహితుడు, ప్రియుడు, యజమాని, స్వామి, కర్త, స్నేహితుడు మొదలైన అర్థాలున్నాయి. చూడండి, 2:257 మరియు 3:68.
Yunus 10:63
ఎవరైతే విశ్వసించారో మరియు దైవభీతి కలిగి ఉంటారో!
Yunus 10:64
వారికి ఇహలోక జీవితంలోనూ మరియు పరలోకంలోనూ శుభవార్త ఉంటుంది. అల్లాహ్ పలుకులలో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).
Yunus 10:65
మరియు (ఓ ముహమ్మద్!) వారి మాటలు నిన్ను దుఃఖింప జేయకూడదు. నిశ్చయంగా, శక్తి (గౌరవం)[1] అంతా అల్లాహ్ కే చెందుతుంది. ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
———
[1] 'ఇజ్జ'తున్: అనే పదానికి శక్తి, గౌరవం, ఆదరం అనే అర్థాలున్నాయి.
Yunus 10:66
వినండి! నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు అల్లాహ్ ను కాదని ఆయనకు భాగస్వాములను కల్పించి వారిని ప్రార్థించేవారు, ఎవరిని అనుసరిస్తున్నారు? వారు అనుసరిస్తున్నది కేవలం తమ భ్రమలనే. మరియు వారు కేవలం ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు.
Yunus 10:67
ఆయనే మీ కొరకు రాత్రిని విశ్రాంతి పొందటానికి మరియు పగటిని (సంపాదించటానికి) ప్రకాశవంతంగా చేశాడు. నిశ్చయంగా శ్రద్ధగా వినేవారికి ఇందులో సూచనలున్నాయి.
Yunus 10:68
"అల్లాహ్ (ఒకడ్ని) కొడుకుగా చేసుకున్నాడు."[1] అని వారు (యూదులు మరియు క్రైస్తవులు) అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్నదంతా ఆయనకే చెందుతుంది! ఇలా అనటానికి మీ దగ్గర ఏదైనా నిదర్శనం ఉందా? ఏమీ? అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలు అంటారా?
———
[1] యూదులు అంటారు: " 'ఉ'జైర్ ('అ.స.) అల్లాహ్ కొడుకు." అని. క్రైస్తవులు అంటారు : "ఏసుక్రీస్తు అల్లాహ్ కొడుకు." అని, కుమారుడు ఉండాలని, వారే కోరుతారు, ఎవరైతే తమ మరణం తరువాత తమ ఆస్తిపాస్తులకు వారసుడు ఉండాలని కోరుతారో! అల్లాహ్ (సు.తా.) నిత్యుడు, సజీవుడు, అంతా నశించిన తరువాత కూడా మిగిలి ఉండేవాడు. విశ్వంలో ఉన్న సమస్తమూ ఆయనకే చెందినది. ఆయనే సర్వానికి వారసుడు. అలాంటప్పుడు, ఆయనకు కొడుకు అవసరం ఎందుకుంటుంది. చూడండి, 2:116, 19:90-92 మరియు 6:100.
Yunus 10:69
ఇలా అను: "నిశ్చయంగా, అల్లాహ్ కు అబద్ధం అంటగట్టేవారు ఎన్నటికీ సాఫల్యం పొందరు."
Yunus 10:70
ఇహలోకంలో వారు కొంతకాలం సుఖాలు అనుభవించవచ్చు! కాని తరువాత మా వైపునకే, వారికి మరలి రావలసి ఉంది. అప్పుడు మేము వారి సత్యతిరస్కారానికి ఫలితంగా, వారికి కఠినశిక్షను రుచి చూపుతాము.
Yunus 10:71
మరియు వారికి నూహ్ గాథను వినిపించు.[1] అతను తన జాతివారితో ఇలా అన్నప్పుడు: "నా జాతి సోదరులారా! నేను మీతో ఉండటం మరియు అల్లాహ్ సూచన (ఆయాత్) లను బోధించటం, మీకు బాధాకరమైనదిగా ఉంటే! నేను మాత్రం అల్లాహ్ నే నమ్ముకున్నాను. మీరూ మరియు మీరు అల్లాహ్ కు సాటి కల్పించినవారూ, అందరూ కలిసి ఒక (పన్నాగపు) నిర్ణయం తీసుకోండి, తరువాత మీ నిర్ణయంలో మీకెలాంటి సందేహం లేకుండా చూసుకోండి. ఆ పిదప ఆ పన్నాగాన్ని నాకు వ్యతిరేకంగా ప్రయోగించండి; నాకు ఏ మాత్రం వ్యవధి నివ్వకండి.
———
[1] నూ'హ్ ('అ.స.) వివరాలకు చూడండి, 11:36-48 మరియు 7:59-64.
Yunus 10:72
"కాని, ఒకవేళ మీరు వెనుదిరిగితే, నేను మాత్రం మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు! నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ దగ్గర ఉంది. మరియు నేను కేవలం అల్లాహ్ కే విధేయుడను (ముస్లిం) అయి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాను."[1]
———
[1] నూ'హ్ ('అ.స.) యొక్క ఈ మాటల నుండి తెలిసేదేమిటంటే ప్రవక్తలందరూ, ఇస్లాం - అంటే, ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) కే విధేయులై ఉండాలని - బోధించారు. చూడండి, 27:91, 2:131-132, 12:101, 10:84, 7:126, 27:44, 5:111 మరియు 6:162-163.
Yunus 10:73
కాని, వారు అబద్ధీకుడని తిరస్కరించారు. కావున మేము అతనిని మరియు అతనితో పాటు ఓడలో ఉన్నవారిని రక్షించి, వారిని భూమికి వారసులుగా చేశాము. మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారిని ముంచి వేశాము. కావున చూడండి, హెచ్చరిక చేయబడినా (విశ్వసించని) వారి గతి ఏమయిందో!
Yunus 10:74
అతని (నూహ్) తరువాత ప్రవక్తలను వారి వారి జాతులవారి వద్దకు పంపాము. వారు, వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకొని వచ్చినా! వారు మొదట అబద్ధమని తిరస్కరించిన విషయాన్ని మళ్ళీ విశ్వసించ లేక పోయారు. ఈ విధంగా మేము హద్దులు మీరి ప్రవర్తించే వారి హృదయాల మీద ముద్ర వేస్తాము.
Yunus 10:75
ఇక వారి తరువాత, మూసా మరియు హారూన్ లను మా సూచనలతో ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపితే, వారు దురహంకారం చూపారు. వారు అపరాధులైన జనులు.
Yunus 10:76
కావున మా వద్ద నుండి సత్యం వారి ముందుకు వచ్చినపుడు వారు: "నిశ్చయంగా, ఇది స్పష్టమైన మంత్రజాలమే! " అని అన్నారు.
Yunus 10:77
మూసా అన్నాడు: "ఏమీ? సత్యం మీ ముందుకు వచ్చిన తరువాత కూడా ఇలా అంటారా? ఏమీ? ఇది మంత్రజాలమా? మరియు మాంత్రికులు ఎన్నడూ సాఫల్యం పొందరు కదా!"
Yunus 10:78
వారన్నారు: "మా తండ్రితాతలు నడిచిన మార్గం నుండి మమ్మల్ని మళ్ళించాలని మరియు మీ ఇద్దరి పెద్దరికాన్ని భూమిలో స్థాపించాలనా, మీరిద్దరూ వచ్చింది? మరియు మేము మీ ఇద్దరినీ ఏ మాత్రం విశ్వసించము!"
Yunus 10:79
మరియు ఫిర్ఔన్ (తన వారితో) అన్నాడు: "నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి నా వద్దకు తీసుకురండి!"
Yunus 10:80
మాంత్రికులు వచ్చిన తరువాత మూసా వారితో: "మీరు విసర దలచుకున్న వాటిని విసరండి!" అని అన్నాడు.
Yunus 10:81
వారు విసరగానే మూసా: "మీరు విసిరింది మంత్రజాలం. నిశ్చయంగా, అల్లాహ్ దానిని భంగ పరుస్తాడు.[1] నిశ్చయంగా అల్లాహ్ దౌర్జన్యపరుల కార్యాలను చక్కబడనివ్వడు.
———
[1] చూడండి, 7:116 మరియు 20:66.
Yunus 10:82
మరియు అల్లాహ్ తన ఆజ్ఞతో సత్యాన్ని సత్యంగా నిరూపిస్తాడు,[1] అది అపరాధులకు ఎంత అసహ్యకరమైనా సరే!"
———
[1] చూడండి, 8:7 మరియు 42:24.
Yunus 10:83
కాని ఫిర్ఔన్ మరియు అతని నాయకులు తమను హింసిస్తారేమో అనే భయంతో! అతని జాతివారి లోని కొందరు ప్రజలు తప్ప ఇతరులు మూసాను విశ్వసించలేదు.[1] మరియు వాస్తవానికి, ఫిర్ఔన్ దేశంలో ప్రాబల్యం వహించి ఉండేవాడు. మరియు నిశ్చయంగా, అతడు మితిమీరి ప్రవర్తించేవారిలో ఒకడుగా ఉండేవాడు.
———
[1] చూడండి, 7:120-126.
Yunus 10:84
మరియు మూసా అన్నాడు: "నా జాతి ప్రజలారా! మీకు నిజంగానే అల్లాహ్ మీద విశ్వాసం ఉంటే మరియు మీరు నిజంగానే అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయితే, మీరు ఆయన (అల్లాహ్) పైననే నమ్మకం ఉంచుకోండి."[1]
———
[1] చూడండి, 7:128-129.
Yunus 10:85
అప్పుడు వారిలా జవాబిచ్చారు: "మేము అల్లాహ్ నే నమ్ముకున్నాము. ఓ మా ప్రభూ! మమ్మల్ని దుర్మార్గులకు పరీక్షా సాధనంగా చేయకు;
Yunus 10:86
"మరియు నీ కారుణ్యంతో మమ్మల్ని సత్యతిరస్కార ప్రజల నుండి కాపాడు."
Yunus 10:87
మరియు మేము మూసాకు మరియు అతని సోదరునికి ఇలా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "మీరు, మీ జాతివారి కొరకు ఈజిప్టులో గృహాలను సమకూర్చుకోండి. మరియు మీ గృహాలను, ప్రార్థనా స్థలాలుగా చేసుకొని నమాజ్ లను స్థాపించండి.[1] మరియు విశ్వాసులకు శుభవార్తలు ఇవ్వు."
———
[1] దీని అర్థం ఏమిటంటే ఫిర్'ఔన్ జాతివారి దౌర్జన్యాల నుండి తప్పించుకోవటానికి వారితో: "మీరు మీ ఇండ్లలోనే ప్రార్థనాస్థలాలు ఏర్పాటు చేసుకొని, బైతుల్ మఖ్దిస్ వైపునకు మరలి ప్రార్థనలు చేయండి." అని ఆదేశమివ్వబడింది.
Yunus 10:88
మూసా ఇలా ప్రార్థించాడు: "ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు ఫిర్ఔన్ కు మరియు అతని నాయకులకు ఇహలోక జీవితంలో వైభవం మరియు సంపదలను ప్రసాదించావు. ఓ మా ప్రభూ! వారిని (ప్రజలను) నీ మార్గం నుండి తప్పించటానికా ఇవి? ఓ మా ప్రభూ! వారి సంపదలను ధ్వంసం చేయి, వారి హృదయాలపై కఠినావస్థను కలుగజేయి, ఎందుకంటే వారు కఠిన శిక్షను చూసేంతవరకు విశ్వసించరు!"[1]
———
[1] నూ'హ్ ('అ.స.) 950 సంవత్సరాల వరకు ధర్మ ప్రచారం చేసినా కూడా అతని జాతివారు, ఇస్లాం వైపుకు రాలేదు, వారు అతని ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆ తరువాత అతను సహించలేక చేసిన శాపాన్ని గురించి చూడండి, 71:26. అదేవిధంగా మూసా ('అ.స.) కూడా సహించుకోలేక వారి మీదకు ఆపదలను పంపమని అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించారు.
Yunus 10:89
(అల్లాహ్) సెలవిచ్చాడు: "మీ ఉభయుల ప్రార్థన అంగీకరించబడింది. మీరిద్దరూ (ఋజుమార్గంపై) స్థిరంగా ఉండండి. మీరిద్దరూ తెలివి లేని వారి మార్గాన్ని అనుసరించకండి."
Yunus 10:90
మరియు మేము ఇస్రాయీల్ సంతతి వారిని సముద్రం దాటించాము. ఆ పిదప ఫిర్ఔన్ మరియు అతని సైనికులు దౌర్జన్యంతో మరియు శతృత్వంతో వారిని వెంబడించారు. చివరకు (ఫిర్ఔన్) మునిగిపోతూ అన్నాడు:[1] "నిశ్చయంగా, ఇస్రాయీల్ సంతతివారు విశ్వసించిన దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నేను విశ్వసించాను. నేను విధేయులలో (ముస్లింలలో) చేరాను!"
———
[1] ఖుర్ఆన్ లో పేర్కొనబడిన కథలు గుణపాఠం నేర్చుకోవటానికే ఉన్నాయి. కానీ కథలు చెప్పాలనే ఉద్దేశ్యంతో కాదు. చూడండి ఖుర్ఆన్, 2:50 మరియు సూరహ్ అష్-షు'అరా.
Yunus 10:91
(అతనికి ఇలా జవాబివ్వబడింది): "ఇప్పుడా[1], (నీవు విశ్వసించేది? మరియు వాస్తవానికి నీవు, ఇంత వరకు ఆజ్ఞోల్లంఘన చేస్తూ ఉన్నావు మరియు దౌర్జన్యపరులలో చేరి ఉన్నావు కదా!
———
[1] చూడండి, 4:18.
Yunus 10:92
"ఇక నీ తరువాత వచ్చేవారికి ఒక సూచనగా ఉండటానికి ఈనాడు నీ శవాన్ని కాపాడతాము." మరియు నిశ్చయంగా, చాలా మంది ప్రజలు మా సూచనల పట్ల నిర్లక్ష్యులై ఉన్నారు.
Yunus 10:93
మరియు వాస్తవానికి మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఉండటానికి మంచి స్థానాన్ని ఇచ్చి, వారికి ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించాము. మరియు వారి వద్దకు దివ్యజ్ఞానం వచ్చినంత వరకు వారి మధ్య భేదాభిప్రాయాలు రాలేదు. నిశ్చయంగా, నీ ప్రభువు పునరుత్థాన దినమున వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను గురించి తీర్పు చేస్తాడు.
Yunus 10:94
(ఓ ముహమ్మద్) ఒకవేళ నీ వైపునకు అవతరింప జేయబడిన విషయాలను గురించి నీకేమైనా సందేహముంటే నీకు పూర్వం వచ్చిన గ్రంథాన్ని చదువు తున్న వారిని అడుగు! వాస్తవంగా, నీ ప్రభువు తరఫు నుండి నీ వద్దకు సత్యం వచ్చింది. కావున నీవు సందేహించే వారిలో చేరకు;
Yunus 10:95
మరియు అల్లాహ్ సూచనలను అబద్ధాలని నిరాకరించిన వారిలో చేరకు. అలా చేస్తే నీవు కూడా తప్పక నష్టం పొందే వారిలో చేరి పోతావు.
Yunus 10:96
నిశ్చయంగా, ఎవరి విషయంలోనైతే నీ ప్రభువు వాక్కు సత్యమని నిరూపించబడిందో, వారు ఎన్నటికీ విశ్వసించరు.
Yunus 10:97
మరియు ఒకవేళ వారి వద్దకు ఏ విధమైన అద్భుత సూచన వచ్చినా! వారు బాధాకరమైన శిక్షను చూడనంత వరకు (విశ్వసించరు).[1]
———
[1] మా శిక్ష చూసిన తరువాత విశ్వసిస్తే అది వారికి లాభదాయకం కాజాలదు. చూడండి, 40:85.
Yunus 10:98
యూనుస్ జాతివారు తప్ప! ఇతర ఏ పురవాసులకు కూడా, (శిక్షను చూసిన తరువాత) విశ్వసించగా, వారి విశ్వాసం వారికి లాభదాయకం కాలేక పోయింది! (యూనుస్ జాతి) వారు విశ్వసించిన పిదప మేము వారి నుండి ఇహలోక జీవితపు అవమానకరమైన శిక్షను తొలగించాము. మరియు వారిని కొంతకాలం వరకు వారికి (ఇహలోక జీవితాన్ని) అనుభవించే అవకాశాన్ని ఇచ్చాము.[1]
———
[1] యూనుస్ ('అ.స.) 'నైనవా' (Nineveh) వాసులకు ధర్మప్రచారం చేశారు. కాని వారతనిని తిరస్కరించారు. దానికి అతను కోపపడి ఉద్రేకంతో వారిని శపించి వెళ్ళిపోయారు. వారి పైకి శిక్ష రావడం చూసి ప్రజలందరూ ఒక మైదానంలో చేరుకొని అల్లాహ్ (సు.తా.) ను మన్నించమని ప్రార్థించారు. వారి క్షమాపణను అంగీకరించి అల్లాహ్ (సు.తా.) వారి శిక్షను తొలగించాడు. ఆ తరువాత వారు అల్లాహ్ (సు.తా.)కు విధేయు(ముస్లిం)లయ్యారు. ఈ విధంగా శిక్షను చూసిన తరువాత క్షమాపణ అంగీకరించబడిన వారు కేవలం యూనుస్ ('అ.స.) జాతి ప్రజలు మాత్రమే. ఇంకా చూడండి, 21:87-88, 37:139-148, (ఫ'త్హ అల్ -'ఖదీర్).
Yunus 10:99
మరియు నీ ప్రభువు కోరితే, భూమిలో ఉన్న వారందరూ విశ్వసించేవారు. ఏమీ? నీవు మానవులందరినీ విశ్వాసులయ్యే వరకు, వారిని బలవంతం చేస్తూ ఉంటావా?
Yunus 10:100
మరియు ఏ వ్యక్తి అయినా సరే అల్లాహ్ అనుమతి లేనిదే విశ్వసించ జాలడు. జ్ఞానాన్ని ఉపయోగించని వారిపై ఆయన (ఆవిశ్వాసపు) మాలిన్యాన్ని రుద్దుతాడు.
Yunus 10:101
ఇలా అను: "ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ, ఏమేమున్నాయో చూడండి!" మరియు విశ్వసించని ప్రజలకు సూచనలు గానీ, హెచ్చరికలు గానీ ఏ విధంగానూ పనికి రావు!
Yunus 10:102
ఇప్పుడు వారు, తమకు పూర్వం గతించిన వారికి సంభవించిన దినాల కోసం తప్ప మరి దేని కోసం నిరీక్షిస్తున్నారు? వారితో అను: "మీరూ నిరీక్షించండి! నిశ్చయంగా, నేను కూడా మీతో పాటే నిరీక్షిస్తాను!"
Yunus 10:103
తరువాత (చివరకు) మేము మా ప్రవక్తలను మరియు విశ్వసించిన వారిని కాపాడుతూ ఉంటాము. ఈ విధంగా విశ్వాసులను కాపాడటం మా విధి.
Yunus 10:104
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "ఓ మానవులారా! నా ధర్మాన్ని గురించి మీకు ఎలాంటి సందేహం ఉన్నా అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వారిని నేనెన్నడూ ఆరాధించను. అంతేకాదు, నేను అల్లాహ్ నే ఆరాధిస్తాను. ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు నేను విశ్వాసులలో ఒకడిగా ఉండాలని ఆదేశించబడ్డాను."
Yunus 10:105
(నేను ఇలా ఆజ్ఞాపించబడ్డాను): "నీవు మాత్రం సత్యధర్మమైన ఏకదైవ సిద్ధాంతాన్నే అనుసరించు. మరియు ఎన్నటికీ అల్లాహ్ కు సాటి కల్పించేవారిలో (షిర్క్ చేసేవారిలో) చేరకు.
Yunus 10:106
మరియు అల్లాహ్ ను వదలి నీకు లాభంగానీ మరియు నష్టం గానీ కలిగించలేని దానిని నీవు ప్రార్థించకు. ఒకవేళ నీవు అలా చేస్తే! నిశ్చయంగా, నీవు దుర్మార్గులలో చేరిన వాడవుతాడు."
Yunus 10:107
ఒకవేళ అల్లాహ్ నీకు ఏదైనా ఆపద కలిగించదలిస్తే ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేయదలిస్తే, ఆయన అనుగ్రహాన్ని ఎవ్వడూ మళ్ళించలేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మరియు ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Yunus 10:108
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "ఓ మానవులారా! వాస్తవంగా, మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు సత్యం వచ్చి ఉన్నది. ఇక ఎవడు సన్మార్గాన్ని అనుసరిస్తాడో! నిశ్చయంగా, అతడు తన మేలుకే సన్మార్గాన్ని అనుసరిస్తాడు. ఇక ఎవడు మార్గభ్రష్టుడవుతాడో నిశ్చయంగా, తనకే నష్టం కలిగించు కుంటాడు. నేను మీ బాధ్యత వహించేవాడను కాను!"
Yunus 10:109
మరియు (ఓ ప్రవక్తా!) నీపై అవతరింప జేయబడిన సందేశాన్ని (వహీని) అనుసరించు. మరియు అల్లాహ్ తీర్పు చేసే వరకు నీవు ఓర్పు వహించు. మరియు న్యాయాధిపతులలో ఆయనే అత్యుత్తముడు.