Telugu Meal — Mevlânâ Abdürrahîm b. Muhammed — Zuhruf 43:1 – Rahman 55:78
Contents
- Zuhruf 43:1
- Zuhruf 43:2
- Zuhruf 43:3
- Zuhruf 43:4
- Zuhruf 43:5
- Zuhruf 43:6
- Zuhruf 43:7
- Zuhruf 43:8
- Zuhruf 43:9
- Zuhruf 43:10
- Zuhruf 43:11
- Zuhruf 43:12
- Zuhruf 43:13
- Zuhruf 43:14
- Zuhruf 43:15
- Zuhruf 43:16
- Zuhruf 43:17
- Zuhruf 43:18
- Zuhruf 43:19
- Zuhruf 43:20
- Zuhruf 43:21
- Zuhruf 43:22
- Zuhruf 43:23
- Zuhruf 43:24
- Zuhruf 43:25
- Zuhruf 43:26
- Zuhruf 43:27
- Zuhruf 43:28
- Zuhruf 43:29
- Zuhruf 43:30
- Zuhruf 43:31
- Zuhruf 43:32
- Zuhruf 43:33
- Zuhruf 43:34
- Zuhruf 43:35
- Zuhruf 43:36
- Zuhruf 43:37
- Zuhruf 43:38
- Zuhruf 43:39
- Zuhruf 43:40
- Zuhruf 43:41
- Zuhruf 43:42
- Zuhruf 43:43
- Zuhruf 43:44
- Zuhruf 43:45
- Zuhruf 43:46
- Zuhruf 43:47
- Zuhruf 43:48
- Zuhruf 43:49
- Zuhruf 43:50
- Zuhruf 43:51
- Zuhruf 43:52
- Zuhruf 43:53
- Zuhruf 43:54
- Zuhruf 43:55
- Zuhruf 43:56
- Zuhruf 43:57
- Zuhruf 43:58
- Zuhruf 43:59
- Zuhruf 43:60
- Zuhruf 43:61
- Zuhruf 43:62
- Zuhruf 43:63
- Zuhruf 43:64
- Zuhruf 43:65
- Zuhruf 43:66
- Zuhruf 43:67
- Zuhruf 43:68
- Zuhruf 43:69
- Zuhruf 43:70
- Zuhruf 43:71
- Zuhruf 43:72
- Zuhruf 43:73
- Zuhruf 43:74
- Zuhruf 43:75
- Zuhruf 43:76
- Zuhruf 43:77
- Zuhruf 43:78
- Zuhruf 43:79
- Zuhruf 43:80
- Zuhruf 43:81
- Zuhruf 43:82
- Zuhruf 43:83
- Zuhruf 43:84
- Zuhruf 43:85
- Zuhruf 43:86
- Zuhruf 43:87
- Zuhruf 43:88
- Zuhruf 43:89
- Duhan 44:1
- Duhan 44:2
- Duhan 44:3
- Duhan 44:4
- Duhan 44:5
- Duhan 44:6
- Duhan 44:7
- Duhan 44:8
- Duhan 44:9
- Duhan 44:10
- Duhan 44:11
- Duhan 44:12
- Duhan 44:13
- Duhan 44:14
- Duhan 44:15
- Duhan 44:16
- Duhan 44:17
- Duhan 44:18
- Duhan 44:19
- Duhan 44:20
- Duhan 44:21
- Duhan 44:22
- Duhan 44:23
- Duhan 44:24
- Duhan 44:25
- Duhan 44:26
- Duhan 44:27
- Duhan 44:28
- Duhan 44:29
- Duhan 44:30
- Duhan 44:31
- Duhan 44:32
- Duhan 44:33
- Duhan 44:34
- Duhan 44:35
- Duhan 44:36
- Duhan 44:37
- Duhan 44:38
- Duhan 44:39
- Duhan 44:40
- Duhan 44:41
- Duhan 44:42
- Duhan 44:43
- Duhan 44:44
- Duhan 44:45
- Duhan 44:46
- Duhan 44:47
- Duhan 44:48
- Duhan 44:49
- Duhan 44:50
- Duhan 44:51
- Duhan 44:52
- Duhan 44:53
- Duhan 44:54
- Duhan 44:55
- Duhan 44:56
- Duhan 44:57
- Duhan 44:58
- Duhan 44:59
- Câsiye 45:1
- Câsiye 45:2
- Câsiye 45:3
- Câsiye 45:4
- Câsiye 45:5
- Câsiye 45:6
- Câsiye 45:7
- Câsiye 45:8
- Câsiye 45:9
- Câsiye 45:10
- Câsiye 45:11
- Câsiye 45:12
- Câsiye 45:13
- Câsiye 45:14
- Câsiye 45:15
- Câsiye 45:16
- Câsiye 45:17
- Câsiye 45:18
- Câsiye 45:19
- Câsiye 45:20
- Câsiye 45:21
- Câsiye 45:22
- Câsiye 45:23
- Câsiye 45:24
- Câsiye 45:25
- Câsiye 45:26
- Câsiye 45:27
- Câsiye 45:28
- Câsiye 45:29
- Câsiye 45:30
- Câsiye 45:31
- Câsiye 45:32
- Câsiye 45:33
- Câsiye 45:34
- Câsiye 45:35
- Câsiye 45:36
- Câsiye 45:37
- Ahkaf 46:1
- Ahkaf 46:2
- Ahkaf 46:3
- Ahkaf 46:4
- Ahkaf 46:5
- Ahkaf 46:6
- Ahkaf 46:7
- Ahkaf 46:8
- Ahkaf 46:9
- Ahkaf 46:10
- Ahkaf 46:11
- Ahkaf 46:12
- Ahkaf 46:13
- Ahkaf 46:14
- Ahkaf 46:15
- Ahkaf 46:16
- Ahkaf 46:17
- Ahkaf 46:18
- Ahkaf 46:19
- Ahkaf 46:20
- Ahkaf 46:21
- Ahkaf 46:22
- Ahkaf 46:23
- Ahkaf 46:24
- Ahkaf 46:25
- Ahkaf 46:26
- Ahkaf 46:27
- Ahkaf 46:28
- Ahkaf 46:29
- Ahkaf 46:30
- Ahkaf 46:31
- Ahkaf 46:32
- Ahkaf 46:33
- Ahkaf 46:34
- Ahkaf 46:35
- Muhammed 47:1
- Muhammed 47:2
- Muhammed 47:3
- Muhammed 47:4
- Muhammed 47:5
- Muhammed 47:6
- Muhammed 47:7
- Muhammed 47:8
- Muhammed 47:9
- Muhammed 47:10
- Muhammed 47:11
- Muhammed 47:12
- Muhammed 47:13
- Muhammed 47:14
- Muhammed 47:15
- Muhammed 47:16
- Muhammed 47:17
- Muhammed 47:18
- Muhammed 47:19
- Muhammed 47:20
- Muhammed 47:21
- Muhammed 47:22
- Muhammed 47:23
- Muhammed 47:24
- Muhammed 47:25
- Muhammed 47:26
- Muhammed 47:27
- Muhammed 47:28
- Muhammed 47:29
- Muhammed 47:30
- Muhammed 47:31
- Muhammed 47:32
- Muhammed 47:33
- Muhammed 47:34
- Muhammed 47:35
- Muhammed 47:36
- Muhammed 47:37
- Muhammed 47:38
- Feth 48:1
- Feth 48:2
- Feth 48:3
- Feth 48:4
- Feth 48:5
- Feth 48:6
- Feth 48:7
- Feth 48:8
- Feth 48:9
- Feth 48:10
- Feth 48:11
- Feth 48:12
- Feth 48:13
- Feth 48:14
- Feth 48:15
- Feth 48:16
- Feth 48:17
- Feth 48:18
- Feth 48:19
- Feth 48:20
- Feth 48:21
- Feth 48:22
- Feth 48:23
- Feth 48:24
- Feth 48:25
- Feth 48:26
- Feth 48:27
- Feth 48:28
- Feth 48:29
- Hucurat 49:1
- Hucurat 49:2
- Hucurat 49:3
- Hucurat 49:4
- Hucurat 49:5
- Hucurat 49:6
- Hucurat 49:7
- Hucurat 49:8
- Hucurat 49:9
- Hucurat 49:10
- Hucurat 49:11
- Hucurat 49:12
- Hucurat 49:13
- Hucurat 49:14
- Hucurat 49:15
- Hucurat 49:16
- Hucurat 49:17
- Hucurat 49:18
- Kâf 50:1
- Kâf 50:2
- Kâf 50:3
- Kâf 50:4
- Kâf 50:5
- Kâf 50:6
- Kâf 50:7
- Kâf 50:8
- Kâf 50:9
- Kâf 50:10
- Kâf 50:11
- Kâf 50:12
- Kâf 50:13
- Kâf 50:14
- Kâf 50:15
- Kâf 50:16
- Kâf 50:17
- Kâf 50:18
- Kâf 50:19
- Kâf 50:20
- Kâf 50:21
- Kâf 50:22
- Kâf 50:23
- Kâf 50:24
- Kâf 50:25
- Kâf 50:26
- Kâf 50:27
- Kâf 50:28
- Kâf 50:29
- Kâf 50:30
- Kâf 50:31
- Kâf 50:32
- Kâf 50:33
- Kâf 50:34
- Kâf 50:35
- Kâf 50:36
- Kâf 50:37
- Kâf 50:38
- Kâf 50:39
- Kâf 50:40
- Kâf 50:41
- Kâf 50:42
- Kâf 50:43
- Kâf 50:44
- Kâf 50:45
- Zariyat 51:1
- Zariyat 51:2
- Zariyat 51:3
- Zariyat 51:4
- Zariyat 51:5
- Zariyat 51:6
- Zariyat 51:7
- Zariyat 51:8
- Zariyat 51:9
- Zariyat 51:10
- Zariyat 51:11
- Zariyat 51:12
- Zariyat 51:13
- Zariyat 51:14
- Zariyat 51:15
- Zariyat 51:16
- Zariyat 51:17
- Zariyat 51:18
- Zariyat 51:19
- Zariyat 51:20
- Zariyat 51:21
- Zariyat 51:22
- Zariyat 51:23
- Zariyat 51:24
- Zariyat 51:25
- Zariyat 51:26
- Zariyat 51:27
- Zariyat 51:28
- Zariyat 51:29
- Zariyat 51:30
- Zariyat 51:31
- Zariyat 51:32
- Zariyat 51:33
- Zariyat 51:34
- Zariyat 51:35
- Zariyat 51:36
- Zariyat 51:37
- Zariyat 51:38
- Zariyat 51:39
- Zariyat 51:40
- Zariyat 51:41
- Zariyat 51:42
- Zariyat 51:43
- Zariyat 51:44
- Zariyat 51:45
- Zariyat 51:46
- Zariyat 51:47
- Zariyat 51:48
- Zariyat 51:49
- Zariyat 51:50
- Zariyat 51:51
- Zariyat 51:52
- Zariyat 51:53
- Zariyat 51:54
- Zariyat 51:55
- Zariyat 51:56
- Zariyat 51:57
- Zariyat 51:58
- Zariyat 51:59
- Zariyat 51:60
- Tûr 52:1
- Tûr 52:2
- Tûr 52:3
- Tûr 52:4
- Tûr 52:5
- Tûr 52:6
- Tûr 52:7
- Tûr 52:8
- Tûr 52:9
- Tûr 52:10
- Tûr 52:11
- Tûr 52:12
- Tûr 52:13
- Tûr 52:14
- Tûr 52:15
- Tûr 52:16
- Tûr 52:17
- Tûr 52:18
- Tûr 52:19
- Tûr 52:20
- Tûr 52:21
- Tûr 52:22
- Tûr 52:23
- Tûr 52:24
- Tûr 52:25
- Tûr 52:26
- Tûr 52:27
- Tûr 52:28
- Tûr 52:29
- Tûr 52:30
- Tûr 52:31
- Tûr 52:32
- Tûr 52:33
- Tûr 52:34
- Tûr 52:35
- Tûr 52:36
- Tûr 52:37
- Tûr 52:38
- Tûr 52:39
- Tûr 52:40
- Tûr 52:41
- Tûr 52:42
- Tûr 52:43
- Tûr 52:44
- Tûr 52:45
- Tûr 52:46
- Tûr 52:47
- Tûr 52:48
- Tûr 52:49
- Necm 53:1
- Necm 53:2
- Necm 53:3
- Necm 53:4
- Necm 53:5
- Necm 53:6
- Necm 53:7
- Necm 53:8
- Necm 53:9
- Necm 53:10
- Necm 53:11
- Necm 53:12
- Necm 53:13
- Necm 53:14
- Necm 53:15
- Necm 53:16
- Necm 53:17
- Necm 53:18
- Necm 53:19
- Necm 53:20
- Necm 53:21
- Necm 53:22
- Necm 53:23
- Necm 53:24
- Necm 53:25
- Necm 53:26
- Necm 53:27
- Necm 53:28
- Necm 53:29
- Necm 53:30
- Necm 53:31
- Necm 53:32
- Necm 53:33
- Necm 53:34
- Necm 53:35
- Necm 53:36
- Necm 53:37
- Necm 53:38
- Necm 53:39
- Necm 53:40
- Necm 53:41
- Necm 53:42
- Necm 53:43
- Necm 53:44
- Necm 53:45
- Necm 53:46
- Necm 53:47
- Necm 53:48
- Necm 53:49
- Necm 53:50
- Necm 53:51
- Necm 53:52
- Necm 53:53
- Necm 53:54
- Necm 53:55
- Necm 53:56
- Necm 53:57
- Necm 53:58
- Necm 53:59
- Necm 53:60
- Necm 53:61
- Necm 53:62
- Kamer 54:1
- Kamer 54:2
- Kamer 54:3
- Kamer 54:4
- Kamer 54:5
- Kamer 54:6
- Kamer 54:7
- Kamer 54:8
- Kamer 54:9
- Kamer 54:10
- Kamer 54:11
- Kamer 54:12
- Kamer 54:13
- Kamer 54:14
- Kamer 54:15
- Kamer 54:16
- Kamer 54:17
- Kamer 54:18
- Kamer 54:19
- Kamer 54:20
- Kamer 54:21
- Kamer 54:22
- Kamer 54:23
- Kamer 54:24
- Kamer 54:25
- Kamer 54:26
- Kamer 54:27
- Kamer 54:28
- Kamer 54:29
- Kamer 54:30
- Kamer 54:31
- Kamer 54:32
- Kamer 54:33
- Kamer 54:34
- Kamer 54:35
- Kamer 54:36
- Kamer 54:37
- Kamer 54:38
- Kamer 54:39
- Kamer 54:40
- Kamer 54:41
- Kamer 54:42
- Kamer 54:43
- Kamer 54:44
- Kamer 54:45
- Kamer 54:46
- Kamer 54:47
- Kamer 54:48
- Kamer 54:49
- Kamer 54:50
- Kamer 54:51
- Kamer 54:52
- Kamer 54:53
- Kamer 54:54
- Kamer 54:55
- Rahman 55:1
- Rahman 55:2
- Rahman 55:3
- Rahman 55:4
- Rahman 55:5
- Rahman 55:6
- Rahman 55:7
- Rahman 55:8
- Rahman 55:9
- Rahman 55:10
- Rahman 55:11
- Rahman 55:12
- Rahman 55:13
- Rahman 55:14
- Rahman 55:15
- Rahman 55:16
- Rahman 55:17
- Rahman 55:18
- Rahman 55:19
- Rahman 55:20
- Rahman 55:21
- Rahman 55:22
- Rahman 55:23
- Rahman 55:24
- Rahman 55:25
- Rahman 55:26
- Rahman 55:27
- Rahman 55:28
- Rahman 55:29
- Rahman 55:30
- Rahman 55:31
- Rahman 55:32
- Rahman 55:33
- Rahman 55:34
- Rahman 55:35
- Rahman 55:36
- Rahman 55:37
- Rahman 55:38
- Rahman 55:39
- Rahman 55:40
- Rahman 55:41
- Rahman 55:42
- Rahman 55:43
- Rahman 55:44
- Rahman 55:45
- Rahman 55:46
- Rahman 55:47
- Rahman 55:48
- Rahman 55:49
- Rahman 55:50
- Rahman 55:51
- Rahman 55:52
- Rahman 55:53
- Rahman 55:54
- Rahman 55:55
- Rahman 55:56
- Rahman 55:57
- Rahman 55:58
- Rahman 55:59
- Rahman 55:60
- Rahman 55:61
- Rahman 55:62
- Rahman 55:63
- Rahman 55:64
- Rahman 55:65
- Rahman 55:66
- Rahman 55:67
- Rahman 55:68
- Rahman 55:69
- Rahman 55:70
- Rahman 55:71
- Rahman 55:72
- Rahman 55:73
- Rahman 55:74
- Rahman 55:75
- Rahman 55:76
- Rahman 55:77
- Rahman 55:78
Zuhruf 43:1
హా - మీమ్[1].
———
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
Zuhruf 43:2
స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా! [1]
———
[1] చూడండి, 12:1.
Zuhruf 43:3
నిశ్చయంగా, మీరు అర్థం చేసుకోగలగటానికి, మేము దీనిని అరబ్బీ భాషలో ఖుర్ఆన్ [1] గా అవతరింపజేశాము.
———
[1] ఖుర్ఆనున్ / ఖుర్ఆనన్ : దీని పదార్థాలు సంభాషణ, ప్రసంగం, ఉపన్యాసం, పఠనగ్రంథం, Recitation, Talk, Lecture, Discourse, Sermon, అని ఉన్నాయి. అల్-ఖుర్ఆను అంటే ఈ ఖుర్ఆన్ గ్రంథం. అల్ ఖుర్ఆనుల్-కరీమ్ అంటే The Glorious Quran, ఈ దివ్యఖుర్ఆన్.
Zuhruf 43:4
మరియు నిశ్చయంగా, ఇది మా వద్ద నున్న మాతృ గ్రంథంలోనిదే! [1] అది మహోన్నతమైనది, వివేకంతో నిండి ఉన్నది.
———
[1] ఉమ్ముల్ కితాబ్ : చూడండి, 13:39, 85:22 అంటే లౌ'హె మ'హ్ ఫూ''జ్. మాతృగ్రంథం, సురక్షితమైన ఫలకం, మూలగ్రంథం. అంటే యథాస్థితిలో, భద్రంగా ఉంచబడిన గ్రంథం.
Zuhruf 43:5
ఏమిటి? మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారని, మేము ఈ హితోపదేశాన్ని (ఖుర్ఆన్ ను) మీ నుండి తొలగించాలా? [1]
———
[1] మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారని మేము మీకు హితబోధ చేయటం మానుకుంటామని భావిస్తున్నారా? (ఇబ్నె-కసీ'ర్).
Zuhruf 43:6
మరియు మేము పూర్వం గతించిన వారి వద్దకు ఎంతో మంది ప్రవక్తలను పంపాము.
Zuhruf 43:7
మరియు వారు, తమ వద్దకు వచ్చిన ప్రవక్తలలో ఏ ఒక్కరిని కూడా ఎగతాళి చేయకుండా వదల లేదు.
Zuhruf 43:8
కావున వీరి కంటే ఎంతో బలిష్ఠులైన వారిని మేము పట్టుకొని నాశనం చేశాము. [1] మరియు పూర్వ జాతుల వారి దృష్టాంతాలు ఈ విధంగా గడిచాయి.
———
[1] అంటే వారు మక్కా ముష్రికుల కంటే ఎక్కువ బలవంతులు. ఇంకా చూడండి, 40:82.
Zuhruf 43:9
ఒకవేళ, నీవు వారితో: "భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారు?" అని అడిగితే! వారు తప్పక: "వాటిని సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు సృష్టించాడు." అని అంటారు.
Zuhruf 43:10
ఆయనే మీ కొరకు ఈ భూమిని పరుపుగా చేశాడు; మరియు మీరు మీ గమ్యస్థానాలకు చేరుకోవడానికి, అందులో మీ కొరకు త్రోవలు ఏర్పరచాడు. [1]
———
[1] చూడండి, 20:53.
Zuhruf 43:11
మరియు ఆయనే ఆకాశం నుండి తగినంత నీటిని (వర్షాన్ని) కురిపించాడు. తరువాత దాని ద్వారా మేము చచ్చిన నేలను బ్రతికిస్తాము. ఇదే విధంగా మీరు కూడా (బ్రతికింపబడి) బయటికి తీయబడతారు.
Zuhruf 43:12
మరియు ఆయనే అన్ని రకాల జతలను పుట్టించాడు! మరియు ఓడలను మరియు పశువులను మీకు వాహనాలుగా చేశాడు;
Zuhruf 43:13
మీరు వాటి వీపుల మీద ఎక్కటానికి; తరువాత మీరు వాటి మీద కూర్చున్నప్పుడు, మీ ప్రభువు అనుగ్రహాన్ని తలచుకొని ఇలా ప్రార్థించటానికి: "ఆ సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) వీటిని మాకు వశపరచాడు, లేకపోతే ఆ (వశపరచుకునే) సామర్థ్యం మాకు లేదు.
Zuhruf 43:14
మరియు నిశ్చయంగా, మేము మా ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉన్నది!" [1]
———
[1] దైవప్రవక్త ('స'అస) తమ వాహనం ఎక్కినప్పుడు: మూడుసార్లు అల్లాహు అక్బర్ తరువాత "సు'హానల్లజీ' స'ఖ్ఖరలనా హాజా' వమా కున్నా లహూ ముఖ్ రినీన్. వ ఇన్నా ఇలా రబ్బినా లమున్ ఖలిబూన్!" వరకు ఆ ఆయత్ లు (43:13-14) చదివే వారు. ('స. ముస్లిం).
Zuhruf 43:15
మరియు వారు ఆయన దాసులలో కొందరిని ఆయనలో భాగంగా (భాగస్వాములుగా / సంతానంగా) చేశారు. [1] నిశ్చయంగా, మానవుడు పరమ కృతఘ్నుడు!
———
[1] చూవారు (ముష్రికులు) దైవదూత ('అలైహిమ్ స.) లను అల్లాహ్ (సు.తా.) కుమార్తెలుగా భావించే వారు. ఇక్కడ 'ఇబాదున్ - దాసులు, అంటే దైవదూతలు మరియు జు'జ్ అన్ - అంటే కుమార్తెలు. ఇంకా చూడండి, 6:100.
Zuhruf 43:16
ఏమిటి? ఆయన తాను సృష్టించిన వాటిలో నుండి తన కొరకు కుమార్తెలను తీసుకొని మీ కొరకు ప్రత్యేకంగా కుమారులను ఉంచాడా? [1]
———
[1] చూడండి, 16:57-59.
Zuhruf 43:17
మరియు వారు, కరుణామయునికి అంటగట్టేది (ఆడ సంతానమే గనక) వారిలో ఎవడికైనా కలిగిందనే వార్త అంద జేయబడి నప్పుడు, అతని ముఖం నల్లబడిపోతుంది మరియు అతడు దుఃఖంలో మునిగి పోతాడు!
Zuhruf 43:18
ఏమీ? ఆభరణాల అలంకారంలో పెంచబడి మరియు వివాదంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించలేని (స్త్రీ సంతానాన్ని అల్లాహ్ కు అంటగట్టుతున్నారా)?
Zuhruf 43:19
మరియు వీరు కరుణామయునికి దాసులైన దేవదూతలను స్త్రీలుగా పరిగణిస్తున్నారా? వీరు! వారు (దేవదూతలు) సృష్టించబడినప్పుడు చూశారా ఏమిటి? వీరి ఆరోపణలు వ్రాసి వుంచబడతాయి. మరియు వీరు దానిని గురించి ప్రశ్నింపబడతారు.
Zuhruf 43:20
మరియు వారు ఇలా అంటారు: "ఒకవేళ ఆ కరుణామయుడు తలచుకుంటే మేము వారిని ఆరాధించేవారం కాదు." దాని వాస్తవ జ్ఞానం వారికి లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు!
Zuhruf 43:21
మేము వారికి ఇంతకు ముందు ఏదైనా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నామా ఏమిటి? వారు దానిని ఖచ్చితంగా అనుసరించటానికి?
Zuhruf 43:22
అలా కాదు! వారిలా అంటారు: "వాస్తవానికి మేము, మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తుండగా చూశాము. మరియు నిశ్చయంగా మేము కూడా వారి అడుగుజాడల్లోనే వారి మార్గదర్శకత్వంపై ఉన్నాము."
Zuhruf 43:23
మరియు ఇదే విధంగా, నీకు ముందు (ఓ ముహమ్మద్!) మేము హెచ్చరించే వాడిని ఏ పట్టణానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు అనేవారు: [1] "వాస్తవానికి మేము మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తూ ఉండగా చూశాము. మరియు నిశ్చయంగా, మేము కూడా వారి అడుగు జాడలనే అనుసరిస్తాము."
———
[1] చూడండి, 11:116.
Zuhruf 43:24
(వారి ప్రవక్త) ఇలా అనేవాడు: "ఒకవేళ నేను మీ తండ్రితాతలు అనుసరిస్తూ వచ్చిన దాని కంటే ఉత్తమమైన మార్గదర్శకత్వాన్ని మీ కోసం తెచ్చినా (మీరు వారినే అనుసరిస్తారా)?" వారిలా జవాబిచ్చే వారు: "నిశ్చయంగా, మీరు దేనితో పంపబడ్డారో దానిని మేము తిరస్కరిస్తున్నాము."
Zuhruf 43:25
కావున మేము వారిపై మా ప్రతీకారాన్ని (శిక్షను) పంపాము. చూశారా! సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమయిందో!
Zuhruf 43:26
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ తన తండ్రి మరియు తన జాతివారితో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, మీరు పూజించే వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. [1]
———
[1] ఇబ్రాహీమ్ ('అ.స.) గాథకు చూడండి, 6:74 మరియు 21:51.
Zuhruf 43:27
(నేనైతే) నన్ను సృజించిన ఆయన (అల్లాహ్ నే ఆరాధిస్తాను). ఎందుకంటే! నిశ్చయంగా, ఆయనే నాకు మార్గదర్శకత్వం చేయగలడు."
Zuhruf 43:28
మరియు అతను (ఇబ్రాహీమ్) ఈ వచనాన్నే తన తర్వాత తన సంతానం కొరకు విడిచి వెళ్ళాడు. [1] వారు దాని వైపుకు మరలుతారని!
———
[1] చూడండి, 2:132.
Zuhruf 43:29
వాస్తవానికి, నేను వారికి మరియు వారి తండ్రితాతలకు ప్రాపంచిక సుఖసంతోషాలను ఇస్తూనే వచ్చాను. చివరకు వారి వద్దకు సత్యం మరియు (దానిని) స్పష్టంగా వివరించే దైవప్రవక్త కూడా వచ్చాడు. [1]
———
[1] చూడండి, 21:44.
Zuhruf 43:30
కాని వారి వద్దకు సత్యం (ఈ ఖుర్ఆన్) వచ్చినప్పుడు వారన్నారు: "ఇది కేవలం మంత్రజాలమే. [1] మరియు నిశ్చయంగా, మేము దీనిని తిరస్కరిస్తున్నాము."
———
[1] చూడండి, 74:24.
Zuhruf 43:31
వారు ఇంకా ఇలా అన్నారు: "ఈ ఖుర్ఆన్ ఈ రెండు నగరాలలోని ఒక గొప్ప వ్యక్తిపై ఎందుకు అవతరింప జేయబడలేదు?"[1]
———
[1] ఈ రెండు నగరవాసులలో పేరు ప్రఖ్యాతులున్న మక్కాకు చెందిన వలీద్ బిన్ ముగైరా మరియు తాయఫ్ కు చెందిన ఉర్ వా బిన్ మసవూద్ సఖఫీ కావచ్చని వ్యాక్యాతలంటారు.
Zuhruf 43:32
నీ ప్రభువు కారుణ్యాన్ని పంచి పెట్టే వారు వారేనా ఏమిటి? మేమే వారి జీవనోపాయాలను, ఈ ప్రాపంచిక జీవితంలో వారి మధ్య పంచి పెట్టాము. వారు ఒకరితో నొకరు పని తీసుకోవటానికి,[1] వారిలో కొందరికి మరి కొందరిపై స్థానాలను పెంచాము. మరియు వారు కూడబెట్టే దాని (సంపద) కంటే నీ ప్రభువు కారుణ్యమే [2] ఎంతో ఉత్తమమైనది.
———
[1] అల్లాహ్ (సు.తా.) వ్యవహారాలను సరళంగా నడపటానికి, ప్రజలలో ధనసంపత్తులను, తెలివి జ్ఞానాలను, ఎక్కువ తక్కువగా పంచాడు. దీని వల్ల ప్రతి మానవుడు మరొకని సహాయం మీద ఆధారపడి ఉన్నాడు. ధనవంతుడు పేదవాని మీద, పేదవాడు ధనవంతుని మీద.
[2] ఈ కారుణ్యం అంటే పరలోక జీవిత సుఖం.
Zuhruf 43:33
మరియు మానవులందరూ ఒక (దుష్ట) సమాజంగా మారి పోతారన్న భయమే గనక మాకు లేకున్నట్లయితే, మేము ఆ కరుణామయుణ్ణి తిరస్కరించేవారి ఇళ్ళ కప్పులనూ మరియు వాటి పైకి ఎక్కే మెట్లను వెండితో నిర్మించేవారము.
Zuhruf 43:34
మరియు వారి ఇండ్ల తలుపులను మరియు వారు ఆనుకొని కూర్చునే పీఠాలను కూడా;
Zuhruf 43:35
మరియు బంగారంతో కూడా![1] మరియు ఇవన్నీ ప్రాపంచిక జీవిత సుఖసంతోషాలు మాత్రమే. మరియు దైవభీతి గలవారికి నీ ప్రభువు వద్ద పరలోక జీవిత (సుఖం) ఉంటుంది.
———
[1] 'జు'ఖ్ రుఫున్: బంగారం. దీని అర్థం ఆభరణాలు లేక అలంకరణ కూడా అవుతుంది. చూడండి, 10:24. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "అల్లాహ్ (సు.తా.) దగ్గర ఈ ప్రపంచపు విలువ దోమ రెక్కకు సమానంగా ఉండి ఉన్నా, అల్లాహ్ (సు.తా.) ఏ సత్యతిరస్కారిని గుటికెడు నీళ్ళు కూడా త్రాగనిచ్చేవాడు కాదు." (తిర్మిజీ', ఇబ్నె-మాజహ్).
Zuhruf 43:36
మరియు ఎవడైతే కరుణామయుని స్మరణ విషయంలో అంధుడిగా ప్రవర్తిస్తాడో అతనిపై మేము ఒక షైతాన్ ను నియమిస్తాము. ఇక వాడు (ఆ షైతాన్) వాని సహచరుడు (ఖరీనున్) అవుతాడు.[1]
———
[1] చూచూడండి, 41:25.
Zuhruf 43:37
మరియు నిశ్చయంగా, వారు (షైతాన్ లు) వారిని (అల్లాహ్) మార్గం నుండి ఆటంక పరుస్తారు. మరియు వారేమో నిశ్చయంగా, తాము సరైన మార్గదర్శకత్వంలోనే ఉన్నామని భావిస్తారు!
Zuhruf 43:38
చివరకు అతడు మా వద్దకు వచ్చినపుడు (తన వెంట ఉన్న షైతాన్ తో) ఇలా అంటాడు: "అయ్యో! నా దౌర్భాగ్యం! నీకూ నాకూ మధ్య తూర్పుపడమరల[1] మధ్య ఉన్నంత దూరం ఉండి వుంటే ఎంత బాగుండేది! ఎందుకంటే నీవు అతి చెడ్డ సహచరుడివి!"
———
[1] అల్-మష్ రిఖైన్: ప్రాచీన అరబ్బీ భాషా సంప్రదాయం ప్రకారం కొన్నిసార్లు ఒక శబ్దానికి ద్వివచనం ఇవ్వటం వల్ల దాని అర్థం రెండు విభిన్న వస్తువులను సూచిస్తుంది. ఉదా: ఇక్కడ వ్రాసినట్లు అల్-మష్ రిఖైన్, అంటే తూర్పుపడమరలు; ఖమరైన్, అంటే సూర్యచంద్రులు.
Zuhruf 43:39
మరియు మీరు దుర్మార్గం చేశారు! కావున, ఈరోజు మీరంతా ఈ శిక్షలో కలిసి ఉండటం మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు.[1]
———
[1] ఈ ఆయత్ కు ఈ విధంగా కూడా తాత్పర్యం ఇవ్వబడింది: 'మరియు మీరు దుర్మార్గం చేశారు, అది ఈ రోజు మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు; నిశ్చయంగా, మీరందరు ఈ శిక్షను పంచుకుంటారు.' ఇంకా చూడండి, 14:49.
Zuhruf 43:40
(ఓ ముహమ్మద్!) నీవు చెవిటి వాడికి వినిపింప జేయగలవా? లేదా గ్రుడ్డివాడికి మార్గం చూపించ గలవా? లేక, స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో ఉన్నవాడికి (మార్గదర్శకత్వం చేయగలవా)?[1]
———
[1] చూడండి, 35:22.
Zuhruf 43:41
ఒకవేళ వాస్తవానికి, మేము నిన్ను తీసుకొని పోయినా, వారికి మాత్రం తప్పకుండా ప్రతీకారం చేస్తాము.
Zuhruf 43:42
లేదా మేము వారికి వాగ్దానం చేసిన దానిని (శిక్షను) నీకు తప్పక చూపగలము. ఎందుకంటే మాకు వారిపై పూర్తి అధికారముంది.
Zuhruf 43:43
కావున నీవు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా వచ్చిన సందేశం మీద స్థిరంగా ఉండు. నిశ్చయంగా, నీవు ఋజుమార్గం మీద ఉన్నావు.
Zuhruf 43:44
మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నీకు మరియు నీ జాతి వారికి ఒక హితబోధ. మరియు (దీనిని గురించి) మీరు ప్రశ్నింప బడగలరు.[1]
———
[1] ప్రవక్త 'అలైహిమ్ స.) లందరూ ప్రశ్నింపబడతారు. చూడండి, 5:109.
Zuhruf 43:45
మరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను అడుగు: "మేము, ఆ కరుణామయుడు తప్ప ఇతర దైవాలను ఆరాధింపబడటానికి నియమించామేమో?"
Zuhruf 43:46
మరియు వాస్తవంగా, మేము మూసాను, మా సూచనలతో (ఆయాత్ లతో) ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. అతను వారితో ఇలా అన్నాడు: "నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుణ్ణి."
Zuhruf 43:47
కాని, అతను వారి వద్దకు మా సూచన (ఆయాత్) లను తీసుకొని వచ్చినప్పుడు, వారు వాటిని గురించి పరిహాసాలాడేవారు.[1]
———
[1] చూడండి, 6:109.
Zuhruf 43:48
మరియు మేము వారికి చూపిన ప్రతి అద్భుత సూచన (ఆయాత్), దానికి ముందు చూపినటువంటి దాని (అద్భుత సూచన) కంటే మించినదిగా ఉండేది.[1] మరియు మేము వారిని శిక్షకు గురి చేశాము. బహుశా, ఇలాగైనా వారు మరలి వస్తారేమోనని![2]
———
[1] అద్భుత సూచనల కోసం చూడండి, 7:133-135.
[2] అల్లాహ్ (సు.తా.) వైపునకు మరలటం మానవుడు అల్లాహ్ (సు.తా.) ఉనికిని గ్రహించే స్వాభావిక లక్షణం. కాని మానవుడు అల్లాహ్ (సు.తా.) నుండి మరలిపోవటం అతని మానసిక పతనం, ఆధ్యాత్మిక భ్రష్టత్వం. చూడండి, 7:172-173.
Zuhruf 43:49
మరియు వారు (మూసాతో) ఇలా అన్నారు: "ఓ మాంత్రికుడా! (నీ ప్రభువు) నీతో చేసిన ఒప్పందం ప్రకారం నీ ప్రభువును ప్రార్థించు, మేము తప్పక సన్మార్గులమవుతాము."
Zuhruf 43:50
కాని మేము వారి పై నుండి ఆ శిక్షను తొలగించిన వెంటనే వారు తమ వాగ్దానాన్ని భంగపరచే వారు.
Zuhruf 43:51
మరియు, ఫిర్ఔన్ తన జాతి ప్రజలలో ప్రకటిస్తూ ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఈజిప్టు (మిస్ర్) యొక్క సామ్రాజ్యాధిపత్యం నాది కాదా? మరియు ఈ సెలయేళ్ళు నా క్రింద ప్రవహించటం లేదా? ఇది మీకు కనిపించటం లేదా?
Zuhruf 43:52
ఈ తుచ్ఛమైన వాడు మరియు (తన మాటను) స్పష్టంగా వివరించలేని వాడి (మూసా) కంటే నేను శ్రేష్ఠుడిని కానా?[1]
———
[1] మూసా('అ.స.) సరిగ్గా మాట్లాడలేక పోయేవారు. నత్తినత్తిగా మాట్లాడే వారు (Stammer). దానికి చూడండి, 20:27-28.
Zuhruf 43:53
అయితే ఇతనికి బంగారు కంకణాలు ఎందుకు వేయబడలేదు? లేదా, ఇతనికి తోడుగా ఇతనితో పాటు దేవదూతలు ఎందుకు రాలేదు?"[1]
———
[1] ప్రాచీన కాలంలో ఈజిప్టులో బంగారు కంకణాలు, మెడలో బంగారు ఆభరణాలు పెద్దరికాన్ని సూచించేవి. (ఆదికాండము-Genesis, 12:42) అంటే మూ'సా ('అ.స.) అల్లాహ్ (సు.తా.) సందేశహరుడైతే అల్లాహ్ (సు.తా.), అతనికి, అతని గొప్పతనానికి తగినట్లు బంగారు ఆభరణాలు, కంకణాలు, ఎందుకు ప్రసాదించలేదు? ఇదే విధమైన ప్రశ్నలు ముష్రిక్ ఖురైషులు దైవప్రవక్త ('స'అస) ను కూడా అడిగారు.
Zuhruf 43:54
ఈ విధంగా, అతడు (ఫిర్ఔన్) తన జాతి వారిని ప్రేరేపింప జేయటం వలన వారు అతనిని అనుసరించారు. నిశ్చయంగా వారు దుర్జనులు (ఫాసిఖీన్).
Zuhruf 43:55
ఈ విధంగా, వారు మమ్మల్ని కోపానికి గురి చేయటం వల్ల మేము వారికి ప్రతీకారం చేశాము. మరియు వారందరినీ ముంచి వేశాము.
Zuhruf 43:56
ఇక మేము, వారిని తర్వాత వచ్చే వారి కొరకు ఒక గడిచిన నిదర్శనంగా మరియు ఒక ఉదాహరణగా చేశాము.
Zuhruf 43:57
మరియు మర్యమ్ కుమారుడు ఒక ఉదాహరణగా పేర్కొనబడినప్పుడు (ఓ ముహమ్మద్!) నీ జాతి ప్రజలు అతనిని గురించి కేకలు వేస్తారు.
Zuhruf 43:58
మరియు అంటారు: "మా దేవుళ్ళు మంచివా లేక అతడా (ఈసానా)?" వారు ఈ విషయం నీ ముందు పెట్టేది కేవలం జగడమాడటానికే. వాస్తవానికి వారు కలహ ప్రియులైన జనులు.
Zuhruf 43:59
అతను (ఈసా) కేవలం ఒక దాసుడు మాత్రమే. మేము అతనిని అనుగ్రహిచాము. మరియు మేము అతనిని ఇస్రాయీల్ సంతతి వారికి ఒక నిదర్శనంగా చేశాము.
Zuhruf 43:60
మరియు మేము కోరితే మీకు బదులుగా, దేవదూతలను భూమిపై ఉత్తరాధికారులుగా చేసే వారము.
Zuhruf 43:61
మరియు నిశ్చయంగా, అతని (ఈసా పునరాగమనం) అంతిమ ఘడియ రావటానికి సూచన.[1] కావున మీరు దానిని (ఆ ఘడియను) గురించి సంశయంలో పడకండి. మరియు నన్నే (అల్లాహ్ నే) అనుసరించండి, ఇదే ఋజుమార్గం.
———
[1] చాలామంది వ్యఖ్యాతల ప్రకారం 'ఈసా ('అ.స.) మరల వచ్చారంటే, పునరుత్థానదినం దగ్గరున్నట్లే! ఇది ఎన్నో 'స'హీ'హ్ 'హదీస్'లలో పేర్కొనబడింది.
Zuhruf 43:62
మరియు షైతాన్ ను, మిమ్మల్ని ఆటంక పరచనివ్వకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు.
Zuhruf 43:63
మరియు ఈసా స్పష్టమైన (మా) సూచనలు తీసుకొని వచ్చినప్పుడు ఇలా అన్నాడు: "వాస్తవంగా, నేను మీ వద్దకు వివేకాన్ని తీసుకొని వచ్చాను;[1] మరియు మీరు విభేదాలకు లోనైన కొన్ని విషయాల వాస్తవాన్ని మీకు స్పష్టంగా వివరించటానికి వచ్చాను. కావున మీరు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మరియు నన్ను అనుసరించండి.
———
[1] వివేకం, అంటే దివ్యజ్ఞానం (వ'హీ).
Zuhruf 43:64
నిశ్చయంగా, అల్లాహ్ యే నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గం."
Zuhruf 43:65
అయినా, తరువాత వచ్చిన వర్గాల వారు పరస్పర వర్గ భేదాలకు లోనయ్యారు. కావున దుర్మర్గానికి పాల్పడిన వారికి బాధాకరమైన ఆ దినమున శిక్ష పడుతుంది!
Zuhruf 43:66
వారు కేవలం ఆ అంతిమ ఘడియ అకస్మాత్తుగా - తమకు తెలియకుండానే - తమపై వచ్చి పడాలని నిరీక్షిస్తున్నారా ఏమిటి?
Zuhruf 43:67
ఆ దినమున దైవభీతి గలవారు తప్ప ఇతర స్నేహితులంతా ఒకరి కొకరు శత్రువులవుతారు.
Zuhruf 43:68
(విశ్వాసులతో ఇలా అనబడుతుంది): "ఓ నా దాసులారా! ఈనాడు మీకు ఏ భయమూ లేదు మరియు మీరు దుఃఖ పడరు కూడా!
Zuhruf 43:69
అలాంటి వారు, ఎవరైతే మా సూచనలను విశ్వసించారో మరియు ముస్లింలు అయి ఉన్నారో!
Zuhruf 43:70
మీరు మరియు మీ సహవాసులు (అజ్వాజ్) సంతోషంగా స్వర్గంలో ప్రవేశించండి."
Zuhruf 43:71
వారి మధ్య, బంగారు పళ్ళాలు[1] మరియు కప్పులు త్రిప్పబడతాయి మరియు అందులో మనస్సులు కోరేవి మరియు కళ్ళకు ఇంపుగా ఉండేవి, అన్నీ ఉంటాయి. మరియు మీరందులో శాశ్వతంగా ఉంటారు.
———
[1] 'సి'హాఫున్, 'స'హ్ ఫతున్ (ఏ.వ.): Plate, అన్నం తినే పళ్ళెం. అన్నింటి కంటే పెద్ద పళ్ళాన్ని జఫ్ నతున్ అంటారు. దాని తరువాత ఖ'స్'అతున్ దీనిలో పది మంది తినగలుగుతారు. దానిలో సగం ఉండేది 'సహ్ ఫతున్, దాని కంటే చిన్నది మికీలతున్. (ఫ త్హ్'అల్-ఖదీర్).
Zuhruf 43:72
మరియు మీరు చేస్తూ వున్న కర్మల ఫలితానికి బదులుగా, మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు.
Zuhruf 43:73
మీకు అందులో పండ్లూ ఫలాలు పుష్కలంగా ఉంటాయి, వాటిని మీరు తింటారు.
Zuhruf 43:74
నిశ్చయంగా, అపరాధులు నరకశిక్షలో శాశ్వతంగా ఉంటారు.[1]
———
[1] చూడండి, 6:128 చివరి వాక్యం మరియు 40:12/3 వ్యాఖ్యానంలో సూచించిన 'హదీస్'.
Zuhruf 43:75
వారి (శిక్ష) ఏ మాత్రం తగ్గించబడదు మరియు వారందులో హతాశులై పడి ఉంటారు.
Zuhruf 43:76
మేము వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే దుర్మార్గులై ఉండిరి. [1]
———
[1] అంటే వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.
Zuhruf 43:77
మరియు వారిలా మొరపెట్టుకుంటారు: "ఓ నరక పాలకుడా (మాలిక్)! నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను." అతను అంటాడు: "నిశ్చయంగా మీరిక్కడే (ఇదే విధంగా) పడి ఉంటారు."
Zuhruf 43:78
వాస్తవానికి మేము మీ వద్దకు సత్యాన్ని తీసుకొని వచ్చాము, కాని మీలో చాలా మంది సత్యమంటేనే అసహ్యించుకునే వారు.
Zuhruf 43:79
వారు ఏదైనా నిర్ణయం (పన్నాగం) చేస్తున్నారా ఏమిటి? అయితే నిశ్చయంగా మేము కూడా ఒక గట్టి నిర్ణయం (పన్నాగం) చేస్తున్నాము.[1]
———
[1] చూడండి, 52:42.
Zuhruf 43:80
లేదా! మేము వారి రహస్య విషయాలను మరియు వారి గుసగుసలను వినటం లేదని వారనుకుంటున్నారా? అలా కాదు, (వాస్తవానికి) మా దూతలు వారి దగ్గర ఉండి, అంతా వ్రాస్తున్నారు.
Zuhruf 43:81
వారితో ఇలా అను: "ఒకవేళ ఆ కరుణామయునికి కుమారుడే ఉంటే, అందరి కంటే ముందు నేనే అతనిని ఆరాధించేవాడిని."
Zuhruf 43:82
భూమ్యాకాశాలకు ప్రభువు మరియు సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు అయిన ఆయన (అల్లాహ్) వారి కల్పనలకు అతీతుడు. [1]
———
[1] చూడండి, 6:100.
Zuhruf 43:83
వారికి వాగ్దానం చేయబడిన ఆ దినాన్ని వారు దర్శించే వరకు, వారిని వారి వాదోపవాదాలలో మరియు వారి క్రీడలలో మునిగి ఉండనీ!
Zuhruf 43:84
మరియు ఆయన (అల్లాహ్) మాత్రమే ఆకాశాలలో ఆరాధ్యుడు మరియు భూమిలో కూడా ఆరాధ్యుడు. మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు.[1]
———
[1] చూడండి, 6:3.
Zuhruf 43:85
మరియు ఆకాశాలలోను మరియు భూమిలోను మరియు ఆ రెండింటి మధ్యను ఉన్న సమస్తానికీ సామ్రాజ్యాధికారి అయిన ఆయన (అల్లాహ్) శుభదాయకుడు; మరియు అంతిమ ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే ఉంది; మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.
Zuhruf 43:86
మరియు వారు ఆయనను వదలి, ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారికి సిఫారసు చేసే అధికారం లేదు.[1] కేవలం సత్యానికి సాక్ష్యమిచ్చేవారు మరియు (అల్లాహ్ ఒక్కడే! అని) తెలిసి ఉన్నవారు తప్ప!
———
[1] చూడండి, 10:3.
Zuhruf 43:87
మరియు నీవు: "మిమ్మల్ని ఎవరు సృష్టించారు?" అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)?
Zuhruf 43:88
"మరియు ఓ నా ప్రభూ! నిశ్చయంగా, ఈ ప్రజలు విశ్వసించరు!" అని పలికే (ప్రవక్త యొక్క) మాట (అల్లాహ్ కు బాగా తెలుసు).
Zuhruf 43:89
కావున నీవు (ఓ ముహమ్మద్!) వారిని ఉపేక్షించు. మరియు ఇలా అను: "మీకు సలాం!"[1] మున్ముందు వారు తెలుసుకుంటారు.
———
[1] ఇక్కడ కేవలం సలామున్ ఉంది; అస్సలాము అని లేదు. అంటే - మీదారి మీది మరియు మాదారి మాది, అని అర్థం. మీరు మున్ముందు తెలుసుకుంటారు. ఎవరు సన్మార్గం మీద ఉన్నారో! మరియు ఎవరు దుర్మార్గం మీద ఉన్నారో! ఇంకా చూడండి, 25:63, 28:55.
Duhan 44:1
హా - మీమ్[1].
———
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
Duhan 44:2
స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా![1]
———
[1] చూడండి, 12:1.
Duhan 44:3
నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము.[1] నిశ్చయంగా, మేము (ప్రజలను) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము. [2]
———
[1] ఖుర్ఆన్ అవతరింపజేయబడిన రాత్రి లైలతుల్ ఖద్ర్ శుభవంతమైన రాత్రి. చూడండి, సూరహ్ అల్-ఖద్ర్ (97) . ఇంకా చూడండి 2:185 ఈ రాత్రి రమ'దాన్ నెల చివరి 10 రోజులలోని బేసి రాత్రులలో ఒకటి అని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం. 1) ఈ రాత్రిలో ఖుర్ఆన్ అవతరింపజేయబడింది. 2) ఈ రాత్రిలోనే దైవదూత (అలైహిమ్ స.)లు మరియు పవిత్ర ఆత్మ (జిబ్రీల్ 'అ.స.) దిగి వస్తారు. 3) ఈ రాత్రిలో, రాబోయే సంవత్సరంలో జరగబోయే విషయాల నిర్ణయం జరుగుతుంది. 4) ఈ రాత్రిలో చేసే ఆరాధన ('ఇబాదహ్) వేయి నెలల (83 సంవత్సరాల 4 నెలల) ఆరాధన కంటే ఉత్తమమైనది. ఈ రాత్రిలోనే ఖుర్ఆన్ ఏడవ ఆకాశంపై ఉన్న లౌ'హె మ'హ్ ఫూ"జ్ నుండి భూలోకపు ఆకాశంపై ఉన్న బైతుల్ 'ఇజ్జహ్ లోకి మొత్తం ఒకేసారి దింపబడింది. ఆ తరువాత 23 సంవత్సరాలలో క్రమక్రమంగా దైవప్రవక్త ('స'అస) మీద అవతరింపజేయబడింది.
[2] ఖుర్ఆన్ అవతరణ ప్రజలకు మంచి చెడును బోధించటానికి జరిగింది.
Duhan 44:4
దానిలో (ఆ రాత్రిలో), ప్రతి విషయం వివేకంతో విశదీకరించ బడుతుంది;
Duhan 44:5
మా ఆజ్ఞానుసారంగా, నిశ్చయంగా, మేము (సందేశహరులను) పంపుతూ వచ్చాము.
Duhan 44:6
నీ ప్రభువు తరఫు నుండి కారుణ్యంగా! నిశ్చయంగా, ఆయనే అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.
Duhan 44:7
భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు. మీకు వాస్తవంగా నమ్మకమే ఉంటే!
Duhan 44:8
ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మరియు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. ఆయన మీ ప్రభువు మరియు పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు.[1]
———
[1] చూడండి, 7:158. ఈ ఆయత్ పోలిన ఆయత్.
Duhan 44:9
అసలు! వారు సందేహంలో పడి ఆటల్లో మునిగి ఉన్నారు (పరిహసిస్తున్నారు).
Duhan 44:10
కావున నీవు ఆకాశం నుండి స్పష్టమైన పొగ వచ్చే దినం కొరకు నిరీక్షించు!
Duhan 44:11
అది మానవులందరినీ క్రమ్ముకుంటుంది. అదొక బాధాకరమైన శిక్ష.
Duhan 44:12
(అప్పుడు వారు ఇలా వేడుకుంటారు): "ఓ మా ప్రభూ! ఈ శిక్షను మా నుండి తొలగించు. నిశ్చయంగా, మేము విశ్వాసుల మవుతాము."
Duhan 44:13
ఇక (అంతిమ ఘడియలో) హితబోధ స్వీకరించటం వారికి ఎలా పనికి రాగలదు? వాస్తవానికి వారి వద్దకు (సత్యాన్ని) స్పష్టంగా తెలియజేసే ప్రవక్త వచ్చి ఉన్నాడు;
Duhan 44:14
అప్పుడు వారు అతని నుండి మరలి పోయారు మరియు ఇలా అన్నారు: "ఇతను ఇతరుల నుండి నేర్చుకున్నాడు, ఇతనొక పిచ్చివాడు!" [1]
———
[1] చూడండి, 16:103 మరియు 25:4.
Duhan 44:15
వాస్తవానికి మేము కొంతకాలం వరకు ఈ శిక్షను తొలగిస్తే నిశ్చయంగా, మీరు చేస్తూ వచ్చిందే మళ్ళీ చేస్తారు.
Duhan 44:16
మేము శిక్షించటం కోసం గట్టిగా పట్టుకున్న రోజు, మేము నిశ్చయంగా, ప్రతీకారం చేస్తాము.
Duhan 44:17
మరియు వాస్తవంగా, వారికి పూర్వం మేము ఫిర్ఔన్ జాతి వారిని పరీక్షకు గురి చేశాము. మరియు వారి వద్దకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చి ఉన్నాడు.
Duhan 44:18
(అతను ఇలా అన్నాడు): "అల్లాహ్ దాసులను నాకు అప్పగించు.[1] నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుణ్ణయిన సందేశహరుణ్ణి.
———
[1] 'ఇబాదల్లాహ్: అంటే ఇక్కడ మూసా ('అ.స.) జాతివారైన బనీ ఇస్రాయీ'ల్ తెగవారు.
Duhan 44:19
మరియు మీరు అల్లాహ్ ముందు అహంభావాన్ని (ఔన్నత్యాన్ని) చూపకండి. నిశ్చయంగా, నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకొని వచ్చాను.
Duhan 44:20
మరియు నిశ్చయంగా, నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు (అయిన) అల్లాహ్ యొక్క శరణు పొందాను, - మీరు నన్ను రాళ్లు రువ్వి చంపకుండా ఉండటానికి.
Duhan 44:21
ఒకవేళ మీరు నా మాట నమ్మకపోయినా సరే! నా జోలికి మాత్రం రాకండి!"
Duhan 44:22
చివరకు అతను తన ప్రభువున ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా, ఈ జనులు చాలా అపరాధులు!"
Duhan 44:23
(అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు): "నీవు నా దాసులను తీసుకొని రాత్రివేళ బయలు దేరు, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు.
Duhan 44:24
మరియు సముద్రాన్ని చీల్చి నెమ్మదిగా వెళ్ళిపో.[1] నిశ్చయంగా, ఆ సైనికులు అందులో మునిగిపోతారు!"
———
[1] చూడండి, 26:63-66. రహ్వాన్: అంటే ప్రశాంతమైనది లేక తడిలేనిది. జౌహరీ (ర'హ్మ) దీనిని ప్రశాంతంగా చీలిపోయి ఉన్నది, అని వివరించారు.
Duhan 44:25
వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచి పోయారు;
Duhan 44:26
మరియు ఎన్నో పంటపొలాలను మరియు గొప్ప భవనాలను;
Duhan 44:27
మరియు వారు అనుభవిస్తూ ఉన్న ఎన్నో సుఖసంతోషాలను కూడా!
Duhan 44:28
ఈ విధంగా, (వారి ముగింపు జరిగింది). మరియు మేము వాటికి ఇతర జాతి వారిని వారసులుగా చేశాము.
Duhan 44:29
కాని, వారి కొరకు ఆకాశం గానీ, భూమి గానీ విలపించలేదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు.
Duhan 44:30
మరియు వాస్తవంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని అవమానకరమైన శిక్ష నుండి విముక్తి కలిగించాము -
Duhan 44:31
ఫిర్ఔన్ నుండి నిశ్చయంగా, అతడు మితిమీరి ప్రవర్తించేవారి, అగ్రగణ్యుడు.
Duhan 44:32
మరియు వాస్తవానికి మాకు తెలిసి ఉండి కూడా మేము వారిని లోకంలో (ఆ కాలపు) సర్వజనులపై ఎన్నుకున్నాము. [1]
———
[1] ఎందుకంటే ఆ కాలంలో కేవలం బనీ-ఇస్రాయీ'ల్ వారు మాత్రమే ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించేవారు. మిగతా వారంతా బహుదైవారాధకులుగా ఉన్నారు. చూడండి, 15:23.
Duhan 44:33
మరియు మేము వారికి అద్భుత సూచనలను (ఆయాత్ లను) ఒసంగి ఉంటిమి. అందులో వారికి స్పష్టమైన పరీక్ష ఉండింది.
Duhan 44:34
నిశ్చయంగా, వీరు (ఖురైషులు) ఇలా అంటున్నారు:
Duhan 44:35
"వాస్తవానికి, మాకు ఈ మొదటి మరణం మాత్రమే ఉంది, ఆ తరువాత మేము తిరిగి బ్రతికించబడము.
Duhan 44:36
మీరు సత్యవంతులే అయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురండి!" [1]
———
[1] చూడండి, 43:22-23.
Duhan 44:37
వారు మేలైన వారా? లేక తుబ్బఅ జాతివారు[1] మరియు వారి కంటే పూర్వం వారా? మేము వారందరినీ నాశనం చేశాము. నిశ్చయంగా, వారందరూ అపరాధులే!
———
[1] తుబ్బ'అ అంటే సబా' ప్రాంతంలో నివసించే 'హిమ్ యార్ తెగకు చెందినవారు. వారి రాజుల బిరుదు తుబ్బ'అ ఏ విధంగానైతే రోమన్ రాజులు సీజర్ అనబడేవారో! వారు చాలా కాలం దక్షిణ 'అరేబియా మీద రాజరికం చేశారు. వారిని, అబిసీనియా వారు (Abyssinians) 4వ క్రీ.శ.లో అంతమొందించారు. చూడండి, 50:14. వారు సత్యతిరస్కారులు.
Duhan 44:38
మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆట (కాలక్షేపం) కొరకు సృష్టించలేదు.[1]
———
[1] ఇటువంటి ఆయత్ కోసం చూడండి, 38:27, 23:115-116, 15:85 మరియు 21:16.
Duhan 44:39
మేము వాటిని ఒక లక్ష్యంతోనే సృష్టించాము, కాని చాలా మందికి ఇది తెలియదు.[1]
———
[1] చూడండి, 10:5.
Duhan 44:40
నిశ్చయంగా, తీర్పుదినం వారందరి కొరకు ఒక నిర్ణీత దినం.[1]
———
[1] చూడండి, 77:13.
Duhan 44:41
ఆ దినమున ఏ స్నేహితుడు కూడా మరొక స్నేహితునికి ఏ మాత్రం ఉపయోగపడడు. మరియు వారికి ఎలాంటి సహాయమూ లభించదు.[1]
———
[1] చూడండి, 23:101, 70:10. మౌలా: అంటే "దగ్గరి బంధువు" అని కూడా తాత్పర్యమిచ్చారు.
Duhan 44:42
అల్లాహ్ కరుణించిన వానికి తప్ప! నిశ్చయంగా, ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
Duhan 44:43
నిశ్చయంగా, జఖ్ఖూమ్ వృక్షఫలం;
Duhan 44:44
పాపులకు ఆహారంగా ఇవ్వబడుతుంది;
Duhan 44:45
మరిగే నూనే (సీసం) వలే,[1] అది వారి కడుపులో మరుగుతుంది;
———
[1] అల్-ముహ్ లు: కరిగిన రాగి అని కూడా కొందరు వ్యాఖ్యానించారు.
Duhan 44:46
సలసల కాగే నీటిలాగా!
Duhan 44:47
(ఇలా అనబడుతుంది): "ఇతనిని పట్టుకొని భగభగ మండే నరకాగ్ని మధ్యలోకి ఈడ్వండి;
Duhan 44:48
ఆ తరువాత అతని నెత్తి మీద సలసల కాగే నీటి శిక్షను పోయండి.
Duhan 44:49
దీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా!"
Duhan 44:50
నిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడి వున్న విషయం!
Duhan 44:51
నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు.
Duhan 44:52
ఉద్యానవనాలలో మరియు చెలమల మధ్య.
Duhan 44:53
వారు, మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టు వస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు.[1]
———
[1] చూడండి, 18:31 మరియు 35:33
Duhan 44:54
ఇలా ఉంటుంది వారి స్థితి! మరియు మేము వారిని అందమైన, ప్రకాశవంతమైన కళ్ళు గల వారితో (హూర్ లతో) వివాహం చేయిస్తాము.[1]
———
[1] 'హూరున్: చూడండి, 56:22, 52:20, 55:56, 37:48, 37:52. వారి కళ్ళ నలుపు మరియు తెలుపు ఎంతో అందంగా ఉంటాయి. వారిని చూసినవారు వారి అందానికి ముగ్దులైపోతారు.
Duhan 44:55
వారక్కడ శాంతియుతంగా ఉంటూ అనేక రకాలైన ఫలాలను అడుగుతుంటారు. [1]
———
[1] చూచూడండి, 43:73.
Duhan 44:56
వారక్కడ మరణాన్ని[1] ఎన్నడూ రుచి చూడరు; వారి మొదటి (ఇహలోక) మరణం తప్ప! మరియు ఆయన వారిని భగభగమండే అగ్నిశిక్ష నుండి కాపాడాడు;
———
[1] 'స'హీ'హ్ 'హదీస్' లో ఉంది: మృత్యువును ఒక గొర్రె ఆకారంలో తెచ్చి స్వర్గనరకాల మధ్య జిబ్హ్ చేస్తారు. మరియు ఈ విధంగా ప్రకటిస్తారు: 'ఓ స్వర్గవాసులారా! ఇక మీకు మృత్యువు లేదు; మీరు కలకాలం స్వర్గంలో ఉంటారు. ఓ నరకవాసులారా! మీకు సదా నరకవాసమే. మీకు మృత్యువు లేదు." (స.'బు'ఖారీ, ముస్లిం.) ఇంకా చూడండి, 19:39, 37:58-59.
Duhan 44:57
నీ ప్రభువు అనుగ్రహం వల్ల. ఇదే ఆ గొప్ప సాఫల్యం!
Duhan 44:58
అందుకే నిశ్చయంగా, మేము (ఈ ఖుర్ఆన్ ను) నీ భాషలో సులభం చేశాము. ఇలాగైనా వారు అర్థం చేసుకుంటారని (హితబోధ గ్రహిస్తారని).[1]
———
[1] చూడండి, 19:97.
Duhan 44:59
కావున, నీవు నిరీక్షించు! నిశ్చయంగా వారు కూడా నిరీక్షిస్తున్నారు.
Câsiye 45:1
హా - మీమ్[1].
———
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
Câsiye 45:2
ఈ గ్రంథం (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది.
Câsiye 45:3
నిశ్చయంగా, విశ్వసించేవారి కొరకు, ఆకాశాలలో మరియు భూమిలో అనేక సూచనలు (ఆయాత్) ఉన్నాయి.[1]
———
[1] చూడండి, 2:164.
Câsiye 45:4
మరియు మీ సృష్టిలోనూ మరియు (భూమిలో) ఆయన వ్యాపింపజేసిన జీవరాసులలోనూ, దృఢవిశ్వాసమున్న వారి కొరకు ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి.[1]
———
[1] చూడండి, 7:185 మరియు 10:5.
Câsiye 45:5
మరియు రేయింబవళ్ళ అనుక్రమంలో మరియు అల్లాహ్ ఆకాశం నుండి జీవనోపాధిని (వర్షాన్ని) పంపి, దాని ద్వారా భూమికి దాని మరణం తర్వాత, తిరిగి జీవం పోయటంలో మరియు వాయువుల మారటంలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి.
Câsiye 45:6
ఇవి అల్లాహ్ సూచనలు (ఆయాత్), మేము వీటిని నీకు యథాతథంగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ ను మరియు ఆయన సూచనలను (ఆయాత్ లను) కాక మరే సమాచారాన్ని విశ్వసిస్తారు?[1]
———
[1] చూడండి, 39:23.
Câsiye 45:7
అపవాదుడు, పాపిష్ఠుడు అయిన ప్రతి వ్యక్తికి తీవ్రమైన వ్యధ గలదు.
Câsiye 45:8
అతడు తన ముందు పఠించబడే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) వింటున్నాడు ఆ తరువాత మూర్ఖపు పట్టుతో దురహంకారంతో వాటిని విననట్లు వ్యవహరిస్తున్నాడు. కావున అతనికి బాధాకరమైన శిక్ష పడనున్నదనే వార్తను వినిపించు.
Câsiye 45:9
మరియు మా సూచన (ఆయాత్) లకు సంబంధించిన విషయం అతనికి తెలిసినప్పుడు, వాటిని గురించి ఎగతాళి చేస్తాడు. అటువంటి వారందరికీ అవమానకరమైన శిక్ష ఉంది.
Câsiye 45:10
వారి ముందు నరకముంటుంది. మరియు వారి సంపాదన వారికి ఏ మాత్రం పనికిరాదు మరియు అల్లాహ్ ను వదలి వారు సంరక్షకులుగా చేసుకున్నవారు కూడా వారికి ఏ విధంగానూ ఉపయోగపడరు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది.
Câsiye 45:11
ఇది (ఈ ఖుర్ఆన్) మార్గదర్శకత్వం. మరియు ఎవరైతే తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తారో, వారికి అధమమైన, బాధాకరమైన శిక్ష ఉంది.[1]
———
[1] చూడండి, 34:5.
Câsiye 45:12
అల్లాహ్! ఆయనే, సముద్రాన్ని మీకు ఉపయుక్తంగా చేశాడు; దానిలో తన ఆజ్ఞతో ఓడలు పయనించటానికి మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు బహుశా మీరు కృతజ్ఞులవుతారని.
Câsiye 45:13
మరియు ఆయన ఆకాశాలలో మరియు భూమిలోనున్న సమస్తాన్ని, తన అనుగ్రహంతో మీకు ఉపయుక్తంగా చేశాడు. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి.
Câsiye 45:14
(ఓ ప్రవక్తా!) విశ్వసించిన వారితో: "ఒక జాతి వారికి తమ కర్మలకు తగిన ప్రతిఫలమిచ్చే అల్లాహ్ దినాలు[1] వస్తాయని నమ్మనివారిని క్షమించండి." అని చెప్పు.[2]
———
[1] అయ్యామల్లాహ్: అల్లాహ్ దినాలు, అంటే పునరుత్థాన దినం. చూడండి, 14:5.
[2] ఈ ఆజ్ఞ ప్రవక్తృత్వం ప్రసాదించబడిన మొదటి రోజులలో ఉండేది. అప్పుడు ముస్లింలు, కొంతమంది మాత్రమే ఉండేవారు. మరియు వారిలో చాలామంది సమాజంలో బలహీన వర్గాలకు చెందినవారు. ఎప్పుడైతే ముస్లింలు తమ శత్రువులను ఎదుర్కొనే స్థితికి వచ్చారో వారికి జిహాద్ ఆజ్ఞ ఇవ్వబడింది..
Câsiye 45:15
సత్కార్యం చేసేవాడు తన మేలుకే చేస్తాడు. మరియు దుష్కార్యం చేసేవాడు దాని (ఫలితాన్ని) అనుభవిస్తాడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలింప బడతారు.
Câsiye 45:16
మరియు వాస్తవంగా, మేము ఇస్రాయీల్ సంతతి వారికి గ్రంథాన్ని (తౌరాత్ ను), వివేకాన్ని మరియు ప్రవక్త పదవులను ప్రసాదించి ఉన్నాము మరియు వారికి మంచి జీవనోపాధిని ప్రసాదించి ఉన్నాము మరియు వారిని (వారి కాలపు) ప్రజలపై ప్రత్యేకంగా ఆదరించి ఉన్నాము.[1]
———
[1] ఆ కాలంలో బనీ-ఇస్రాయీ'ల్ వారు మాత్రమే, ఏకదైవారాధకులుగా ఉండిరి. చూడండి, 2:47.
Câsiye 45:17
మరియు వారికి ధర్మ విషయంలో స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి ఉన్నాము.[1] వారు తమ పరస్పర ద్వేషాల వల్ల వారికి జ్ఞానం వచ్చిన పిదపనే విభేదాలకు లోనయ్యారు.[2] నిశ్చయంగా, నీ ప్రభువు వారి మధ్య ఉన్న విభేదాలను గురించి పునరుత్థాన దినమున, వారి మధ్య తీర్పు చేస్తాడు.
———
[1] అల్-అమ్రు: ఇక్కడ చాలా వ్యాఖ్యాతల దృష్టిలో 'ధర్మం' కొరకు వాడబడింది.
[2] చూడండి, 23:53.
Câsiye 45:18
తరువాత (ఓ ముహమ్మద్!) మేము, నిన్ను (మేము) నియమించిన ధర్మ విధానం మీద ఉంటాము. కావున నీవు దానినే అనుసరించు మరియు నీవు జ్ఞానం లేని వారి కోరికలను అనుసరించకు.
Câsiye 45:19
నిశ్చయంగా వారు, నీకు - అల్లాహ్ కు ప్రతిగా - ఏ మాత్రం ఉపయోగపడలేరు. మరియు నిశ్చయంగా, దుర్మార్గులు ఒకరికొకరు రక్షకులు. మరియు అల్లాహ్ యే దైవభీతి గలవారి సంరక్షకుడు.
Câsiye 45:20
ఇది (ఈ ఖుర్ఆన్) మానవులకు అంతర్దృష్టి (పరిజ్ఞానం) ఇచ్చేదిగానూ మరియు విశ్వసించే జనులకు మార్గదర్శకత్వంగానూ మరియు కారుణ్యంగానూ ఉంది.
Câsiye 45:21
దుష్కార్యాలకు పాల్పడిన వారు, వారి ఇహలోక జీవితంలోనూ మరియు వారి మరణానంతర జీవితంలోనూ - వారినీ మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారినీ - మేము ఒకే విధంగా పరిగణిస్తామని భావిస్తున్నారా ఏమిటి? వారి నిర్ణయాలు ఎంత చెడ్డవి!
Câsiye 45:22
మరియు అల్లాహ్ ఆకాశాలనూ మరియు భూమినీ సత్యంతో సృష్టించాడు మరియు ప్రతి వ్యక్తికి తన కర్మలకు తగిన ప్రతిఫల మివ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు.
Câsiye 45:23
తన మనోవాంఛలను తన దైవంగా చేసుకున్న వానిని నీవు చూశావా? మరియు అతడు జ్ఞానవంతుడు అయినప్పటికీ, అల్లాహ్! అతనిని మార్గభ్రష్టత్వంలో వదిలాడు[1] మరియు అతని చెవుల మీద మరియు అతని హృదయం మీద ముద్ర వేశాడు మరియు అతని కళ్ళ మీద తెరవేశాడు;[2] ఇక అల్లాహ్ తప్ప అతనికి మార్గదర్శకత్వం చేసే వాడెవడున్నాడు? ఇది మీరు గ్రహించలేరా?
———
[1] చూడండి, 14:4.
[2] చూడండి, 2:7 మరియు 7:186.
Câsiye 45:24
మరియు వారిలా అంటారు: "మా (జీవితం) కేవలం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మేము మరణించేది మరియు జీవించేది ఇక్కడే మరియు మమ్మల్ని నశింపజేసేది ఈ కాలచక్రం మాత్రమే!" మరియు వాస్తవానికి, దానిని గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు. [1]
———
[1] 'హదీస్' ఖుద్సీ, అల్లాహ్ (సు.తా.) అంటాడు: "ఆదమ్ కుమారుడు నాకు బాధ కలిగిస్తాడు - కాలాన్ని దూషిస్తాడు - (అంటే కాలం వల్ల తనకు దురవస్థ వచ్చిందంటాడు). వాస్తవానికి కాలం అనేది ఏమీ లేదు. నేనే కాలాన్ని! సర్వాధికారాలు నా చేతిలోనే ఉన్నాయి. రాత్రింబవళ్ళనూ మార్చేవాడను నేనే." ('స.బు'ఖారీ, ముస్లిం.)
Câsiye 45:25
మరియు వారి ముందు స్పష్టమైన మా సూచనలు (ఆయాత్) వినిపించబడి నప్పుడు: "మీరు సత్యవంతులే అయితే మా తాతముత్తాతలను (బ్రతికించి) తీసుకురండి!" అని మాత్రమే వాదిస్తారు.[1]
———
[1] చూడండి, 44:36.
Câsiye 45:26
వారిలో ఇలా అను: "అల్లాహ్ యే మీకు జీవితమిచ్చేవాడు తరువాత మరణింప జేసేవాడు, ఆ పిదప పునరుత్థాన దినమున సమావేశ పరిచేవాడూను! ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలా మంది జనులకు ఇది తెలియదు."
Câsiye 45:27
మరియు ఆకాశాల మరియు భూమి యొక్క సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందినది. మరియు ఆ ఘడియ ఆసన్నమైననాడు, ఆ దినమున అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు.
Câsiye 45:28
మరియు ప్రతి సమాజం వారిని నీవు మోకరిల్లి[1] ఉండటాన్ని చూస్తావు. ప్రతి జాతి వారిని తమ కర్మపత్రం వైపునకు పిలవడం జరుగుతుంది. (వారితో ఇలా అనబడుతుంది): "ఈ రోజు మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది.
———
[1] జా'సియతున్: Kneeling down, మోకరిల్లటం, మోకాళ్ళు భూమికి ఆనించి కూర్చోవడం.
Câsiye 45:29
ఇది మేము వ్రాసి పెట్టిన (మీ కర్మ) పత్రం, ఇది మీ గురించి సత్యమే పలుకుతుంది.[1] నిశ్చయంగా, మేము మీరు చేస్తున్న కర్మలన్నింటినీ వ్రాస్తూ ఉండేవారము."
———
[1] చూడండి, 39:69 మరియు 18:49.
Câsiye 45:30
కావున విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండిన వారిని, వారి ప్రభువు తన కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకుంటాడు.[1] ఇదే ఆ స్పష్టమైన విజయం.
———
[1] అంటే స్వర్గం
Câsiye 45:31
మరియు సత్యాన్ని తిరస్కరించిన వారితో (ఇలా అనబడుతుంది): "మీకు మా సూచనలు వినిపించబడలేదా? కాని మీరు దురహంకారంలో పడి పోయారు మరియు అపరాధులై పోయారు."
Câsiye 45:32
మరియు: "నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం మరియు అంతిమ ఘడియను గురించి ఎలాంటి సందేహం లేదు." అని అన్నప్పుడు మీరన్నారు: "ఆ అంతిమ ఘడియ ఏమిటో మాకు తెలియదు. అది కేవలం ఒక ఊహాగానం తప్ప మరేమీ కాదని మేము భావిస్తున్నాము. మేము దానిని ఏ మాత్రం నమ్మే వారము కాము."[1]
———
[1] అంటే పునరుత్థానదినం, సత్యం.
Câsiye 45:33
అప్పుడు వారి ముందు వారు చేస్తూ ఉండిన దుష్కార్యాలు, ప్రత్యక్షమవుతాయి. మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, అదే వారిని క్రమ్ముకుంటుంది.
Câsiye 45:34
మరియు వారితో ఇలా అనబడుతుంది: "ఈ రోజు మేము మిమ్మల్ని మరచి పోతాము, ఏ విధంగానైతే మీరు మీ సమావేశపు ఈ దినాన్ని మరచిపోయారో! మరియు మీ నివాసం నరకాగ్నియే మరియు మీకు సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు."
Câsiye 45:35
ఇది ఎందుకంటే, వాస్తవానికి మీరు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకున్నారు. మరియు ఇహలోక జీవితం మిమ్మల్ని మోసపుచ్చింది. కావున ఈ రోజు వారిని దాని (నరకం) నుండి బయటికి తీయడం జరగదు.[1] మరియు వారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశమూ దొరకదు.
———
[1] చూడండి, 6:128 మరియు 43:74.
Câsiye 45:36
ఇక సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆయనే ఆకాశాలకూ ప్రభువు మరియు భూమికీ ప్రభువు; ఆయనే సర్వలోకాలకు కూడా ప్రభువు!
Câsiye 45:37
ఆకాశాలలో మరియు భూమిలో ఘనత (మహనీయత) ఆయనకే చెందుతుంది. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
Ahkaf 46:1
హా - మీమ్.[1]
———
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
Ahkaf 46:2
ఈ గ్రంథం (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది.
Ahkaf 46:3
మేము ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని, సత్యంతో ఒక నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాము.[1] మరియు సత్యాన్ని తిరస్కరించిన వారు తమకు చేయబడిన హెచ్చరిక నుండి విముఖులవు తున్నారు.
———
[1] చూడండి, 14:48.
Ahkaf 46:4
వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ప్రార్థిస్తున్న వాటిని గురించి ఆలోచించారా? అయితే నాకు చూపండి.[1] వారు భూమిలో ఏమి సృష్టించారో? లేదా, వారికి ఆకాశాలలో ఏదైనా భాగముందా? మీరు సత్యవంతులే అయితే, దీనికి (ఈ ఖుర్ఆన్ కు) ముందు వచ్చిన ఏదైనా గ్రంథాన్ని లేదా ఏదైనా మిగిలి ఉన్న జ్ఞానాన్ని తెచ్చి చూపండి."[2]
———
[1] రఅ"య్ తుమ్: అంటే చెప్పండి, చూపండి, లేక ఆలోచించారా.
[2] అసా'రతిమ్ మిన్ 'ఇల్మిన్: అంటే తెలివితేటలు, బఖియ్యతిమ్-మిన్-'ఇల్మిన్: అంటే పూర్వప్రవక్తల మీద అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం వహీ నుండి మిగిలి ఉన్న నిజ దివ్యజ్ఞానం.
Ahkaf 46:5
మరియు అల్లాహ్ ను వదలి పునరుత్థాన దినం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారి కంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు (తమను ప్రార్థించే) వారి ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు.
Ahkaf 46:6
మరియు మానవులను (పునరుత్థాన దినమున) సమావేశ పరచిబడినపుడు, (ఆరాధించబడిన) వారు! (తమను ఆరాధించిన) వారికి విరోధులై ఉంటారు. మరియు వారి ఆరాధనను తిరస్కరిస్తారు. [1]
———
[1] ఈవిధమైన ఆయత్ లు ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చాయి. చూడండి, 10:29, 19:81-82, 29:25, 18:52, 16:86 మొదలైనవి అల్లాహ్ (సు.తా.)కు సాటి కల్పించి ఆరాధించే దైవాలు రెండు రకాలు. 1) నిర్జీవులు: అవి విగ్రహాలు, చెట్లుచేమలూ, సూర్యచంద్రులూ, అగ్ని మొదలైనవి. పునరుత్థానదినమున అల్లాహ్ (సు.తా.) వీటికి మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. అవి, వారి ఆరాధనను తిరస్కరిస్తాయి. 2) రెండవరకానికి చెందిన వారు ప్రవక్తలు, ఉదాహరణ ఈ'సా, 'ఉజైర్, దైవదూతలు ('అలైహిమ్ స.) మరియు సద్పురుషులు వీరి సమాధానం అల్లాహ్ (సు.తా.) సమక్షంలో - ఖుర్ఆన్ లో పేర్కొనబడిన - 'ఈసా ('అ.స.) సమాధానంలాగానే ఉంటుంది. ఇంతేకాక షై'తానులు కూడా వీరి ఆరాధనను నిరాకరిస్తారు. ఉదారహరణకు చూ. ' 28:63 .
Ahkaf 46:7
మరియు వారికి మా స్పష్టమైన సూచనలు (ఆయాత్) వినిపించబడినప్పుడు, సత్యతిరస్కారులు - సత్యం (ఈ ఖుర్ఆన్) వారి ముందుకు వచ్చినప్పుడు - ఇలా అంటారు: "ఇది స్పష్టమైన మంత్రజాలమే!"[1]
———
[1] అవతరణా క్రమంలో, 74:24లో సి'హ్ రున్ అనే పదం మొదటిసారి వచ్చింది.
Ahkaf 46:8
లేదా ఇలా అంటారు: "ఇతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు." వారితో ఇలా అను: "ఒకవేళ నేను దీనిని కల్పించి ఉండినట్లయితే, మీరు నన్ను అల్లాహ్ (శిక్ష) నుండి ఏ మాత్రం కాపాడలేరు. మీరు కల్పించే మాటలు ఆయనకు బాగా తెలుసు. నాకూ మీకూ మధ్య ఆయన (అల్లాహ్) సాక్ష్యమే చాలు! మరియు ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."
Ahkaf 46:9
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నేను మొట్టమొదటి ప్రవక్తనేమీ కాను. నాకూ మరియు మీకూ ఏమి కానున్నదో నాకు తెలియదు.[1] నేను అనుసరించేది, నాపై అవతరింపజేయ బడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే. మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే."
———
[1] "అల్లాహ్ (సు.తా.) సాక్షిగా నేను ('స'అస) దైవప్రవక్తను అయినప్పటికీ, మీకూ మరియు నాకూ పునరుత్థానదినమున ఏమి సంభవించనున్నదో నాకు తెలియదు." ('స'బుఖారీ).
Ahkaf 46:10
వారిలో ఇలా అను: "ఇది (ఈ ఖుర్ఆన్) ఒకవేళ అల్లాహ్ తరఫు నుండి వచ్చి ఉండి, మీరు దీనిని తిరస్కరిస్తూ ఉండినట్లయితే (మీ గతి ఏమవుతుందో) మీరు ఆలోచించరా? ఇస్రాయీల్ సంతతికి చెందిన ఒక సాక్షి ఇది (ఈ ఖుర్ఆన్) దాని (తౌరాత్) లాంటి గ్రంథమేనని, సాక్ష్యం ఇచ్చాడు మరియు విశ్వసించాడు కూడా.[1] కాని మీరేమో అహంభావానికి గురి అయ్యారు. నిశ్చయంగా, అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు."
———
[1] ఈ సాక్షి 'అబ్దుల్లాహ్ బిన్-సల్లామ్ ('ర'ది.'అ.) తౌరాత్ లో దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) రాబోతున్నాడని పేర్కొనబడిన వాక్యాలకు చూడండి, 2:42.
Ahkaf 46:11
సత్యతిరస్కారులు, విశ్వాసులను గురించి ఇలా అంటారు: "ఒకవేళ ఇందులో (ఇస్లాంలో) మేలే ఉంటే?, వీరు మా కంటే ముందుగా దాని వైపునకు పోయి ఉండేవారు కాదు!"[1] మరియు వారు దాని (ఖుర్ఆన్) నుండి మార్గదర్శకత్వం పొందలేదు! కాబట్టి వారు: "ఇదొక ప్రాచీన బూటక కల్పనయే!" అని అంటారు.
———
[1] అంటే మొట్టమొదట ఇస్లాం స్వీకరించిన వారిలోని పేదవారూ మరియు బలహీనవర్గాలకు చెందిన వారూ అయిన బిలాల్, 'అమ్మార్, 'సుహైబ్ మరియు 'ఖబ్బాబ్ మొదలైన వారిని (ర'ది.'అన్హుమ్ లను) గురించి, మక్కా ముష్రిక్ నాయకులు చెప్పిన మాటలివి.
Ahkaf 46:12
మరియు దీనికి (ఈ గ్రంథానికి) పూర్వం, మూసా గ్రంథం మార్గదర్శినిగా మరియు కారుణ్యంగా వచ్చింది. మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్) దానిని ధృవీకరిస్తూ, అరబ్బీ భాషలో, దుర్మార్గులను హెచ్చరించటానికి మరియు సజ్జనులకు శుభవార్తలు ఇవ్వటానికి వచ్చింది.
Ahkaf 46:13
నిశ్చయంగా, ఎవరైతే: "మా ప్రభువు అల్లాహ్ యే!" అని, తరువాత దానిపై స్థిరంగా ఉంటారో! అలాంటి వారికి ఎలాంటి భయమూ వుండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
Ahkaf 46:14
అలాంటి వారే స్వర్గవాసులవుతారు. తాము చేస్తూ ఉండిన (మంచి) కర్మల ఫలితంగా వారు అందులో శాశ్వతంగా ఉంటారు.
Ahkaf 46:15
మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల మంచితనంతో మెలగాలని ఆదేశించాము.[1] అతని తల్లి అతనిని ఎంతో బాధతో తన గర్భంలో భరించింది మరియు ఎంతో బాధతో అతనిని కన్నది. మరియు అతనిని గర్భంలో భరించి, అతనిని పాలు విడిపించే వరకు ముప్ఫై నెలలు అవుతాయి.[2] చివరకు అతడు పెరిగి పెద్దవాడవుతాడు మరియు అతడు నలభై సంవత్సరాల[3] వయస్సుకు చేరి ఇలా అంటాడు: "ఓ నా ప్రభూ! నీవు, నాకూ మరియు నా తల్లిదండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి మరియు నీవు ఇష్టపడే సత్కార్యాలు చేయటానికి నాకు సద్భుద్ధిని ప్రసాదించు మరియు నా సంతానాన్ని కూడా సద్వర్తనులుగా చేయి. నిశ్చయంగా, నేను పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలు తున్నాను. మరియు నిశ్చయంగా, నేను నీకు విధేయులైన (ముస్లింలైన) వారిలో ఒకడిని."[4]
———
[1] చూడండి, 29:8 మరియు 31:14 ఒక 'స'హాబి దైవప్రవక్త ('స'అస)తో ఇలా ప్రశ్నిస్తాడు: 'నా సద్వర్తనకు అందరికంటే ఎక్కువ హక్కుదారులు ఎవరు?' దానికి అతను ('స'అస) ఇలా సమాధానమిస్తారు: 'నీ తల్లి!' అతడు మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు. దైవప్రవక్త ('స'అస) అంటారు: 'నీ తల్లి!' అతడు మూడోసారి అదేప్రశ్న అడుగుతాడు. అప్పుడు కూడా: 'నీ తల్లి!' అని అంటారు. అతడు నాలుగవసారి అదే ప్రశ్న అడుగగా దైవప్రవక్త ('స'అస) అంటారు: 'నీ తండ్రి!' దీనితో మానవజీవితంలో తల్లి అందరికంటే - తండ్రి కంటే కూడా మూడు రెట్లు - అధికంగా ఆదరణకు, సద్వర్తనకు అర్హతగలది, అని తెలుస్తోంది! ('స.ముస్లిం)
[2] పాలిచ్చే గడువు 2:233 మరియు 31:14 లలో రెండు సంవత్సరాలు, అని ఉంది. దీనితో వ్యక్తమయ్యేది ఏమిటంటే - సజీవ శిశువుకు జన్మం ఇవ్వటానికి కనీస గడువు 6 మాసాలు. ఈ విధంగా పాలు విడిపించే మొత్తం కాలం ముఫ్ఫై నెలలు.
[3] నలభై సంవత్సరాల వయస్సుకు చేరిన తరువాతనే మానవుడు సంపూర్ణ మానసిక వికాసం పొందుతాడు.
[4] అవ్'జి'అనీ: అంటే నాకు దైవభీతి మరియు భయభక్తులను ప్రసాదించు. ఒక వయస్సు గడిచిన తరువాత ఈ దు'ఆ (రబ్బి అవ్'జి'అనీ ... (నుండి) ... మినల్ ముస్లిమీన్.), అంటే ఆయత్ చివరి వరకు అత్యధికంగా చేయాలి అని ధర్మవేత్తల అభిప్రాయం.
Ahkaf 46:16
ఇలాంటి వారి నుండి మేము వారి మంచి కర్మలను స్వీకరిస్తాము.[1] మరియు వారి చెడు కర్మలను ఉపేక్షిస్తాము; వారు స్వర్గవాసులలో చేరుతారు. ఇది వారికి చేయబడిన వాగ్దానం, ఒక సత్యవాగ్దానం.
———
[1] చూడండి, 29:7.
Ahkaf 46:17
మరియు ఎవడైనా తన తల్లిదండ్రులతో ఇలా అంటే: "ఛీ పొండి (ఉఫ్)![1] నేను (గోరీ నుండి సజీవిగా) లేపబడతానని మీరు నన్ను బెదిరిస్తున్నారా? మరియు వాస్తవానికి, నాకు ముందు ఎన్నో తరాలు గతించాయి. (కాని తిరిగి లేపబడలేదు కదా)?" మరియు వారిద్దరూ అల్లాహ్ సహాయం కోరుతూ ఇలా అంటారు: "ఓ దౌర్భాగ్యుడా! విశ్వసించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం!" అప్పుడు వాడు ఇలా అంటాడు: "ఇవన్నీ కేవలం పాతకాలపు కట్టుకథలు తప్ప మరేమీ కావు."
———
[1] 'ఉఫిన్': ఛీ పొండి! ఇది అయిష్టతను, ఏవగింపును తెలిపే పదం.
Ahkaf 46:18
వీరికి పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవ సమాజాలలో, ఇలాంటి వారి మీదనే (అల్లాహ్) వాక్కు (శిక్ష) సత్యమయింది. నిశ్చయంగా, వారే నష్టపడిన వారయ్యారు.[1]
———
[1] అల్లాహ్ (సు.తా.) వాక్కుకు చూడండి, 38:85.
Ahkaf 46:19
ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మలకు తగిన స్థానాలుంటాయి. మరియు ఇది వారి కర్మలకు తగినట్లుగా పూర్తి ప్రతిఫలమివ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు.
Ahkaf 46:20
మరియు ఆ రోజు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందుకు తెచ్చి, వారితో (ఇలా అనబడుతుంది): "మీరు, మీ ఇహలోక జీవితంలో మీ భోగభాగ్యాలను తరిగించుకున్నారు మరియు వాటిని బాగా అనుభవించారు; కావున మీరు ఏ హక్కూ లేకుండా భూమిలో ప్రదర్శించిన అహంకారానికి మరియు మీరు చేసిన అవిధేయతకు ప్రతిఫలంగా, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది."
Ahkaf 46:21
మరియు జ్ఞాపకం చేసుకోండి, ఆద్ జాతి సోదరుడు (హూద్) ఇసుక దిబ్బలలో[1] ఉన్న తన జాతి వారిని హెచ్చరించింది మరియు అలా హెచ్చరించేవారు అతనికి పూర్వం కూడా వచ్చారు మరియు అతని తరువాత కూడా వచ్చారు. (అతను ఇలా అన్నాడు): "మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించకండి. (అలా చేస్తే) నిశ్చయంగా, ఆ గొప్ప దినమున మీపై పడబోయే, ఆ శిక్షను గురించి నేను భయపడుతున్నాను."
———
[1] అల్-అ'హ్ ఖాఫు, 'హిఖ్ ఫున్ దీని ఏకవచనం: అంటే పొడువుగా పోయే ఇసుక దిబ్బలు. ఇది హూద్ ('అస) జాతి వారైన 'ఆద్ లు నివసించే ప్రాంతం పేరు. ఇది 'హ'దరమౌత్ (యమన్) ప్రాంతంలో ఉంది. వారు కూడా హద్దు మీరి ప్రవర్తించారు.
Ahkaf 46:22
వారిలా అన్నారు: "మా దేవతల నుండి మమ్మల్ని దూరం చేయటానికా నీవు వచ్చింది? నీవు సత్యవంతుడవే అయితే నీవు బెదిరించే (ఆ శిక్షను) తీసుకురా!"
Ahkaf 46:23
(హూద్) అన్నాడు: "నిశ్చయంగా, దాని (ఆ శిక్ష) జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది. మరియు నేను మాత్రం నాకు ఇచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. కాని, నేను మిమ్మల్ని మూఢత్వంలో పడిపోయిన వారిగా చూస్తున్నాను."
Ahkaf 46:24
ఆ తరువాత వారు ఒక దట్టమైన మేఘాన్ని వారి లోయల వైపునకు రావటం చూసి ఇలా అన్నారు: "ఈ మేఘం మాకు వర్షం ఇస్తుంది!"[1] (హూద్ అన్నాడు): "కాదు, కాదు! మీరు దేనికి తొందరపెడుతున్నారో అది (ఆ శిక్ష) ఇదే! ఒక తుఫాను గాలి, అందులో బాధాకరమైన శిక్ష ఉంది;
———
[1] 'ఆయి'షహ్ (ర.'అన్హా), దైవప్రవక్త ('స'అస) తో అన్నారు: "ప్రజలు మేఘాలను చూసి సంతోషపడతారు. కానీ మేఘాలను చూసినప్పుడు మీరు ('స'అస) ఆందోళన పడుతారెందుకు?" దానికి అతను ('స'అస) జవాబిచ్చారు: " 'ఆయి'షహ్ (ర.'అన్హా) ఈ మేఘాలలో అల్లాహ్ (సు.తా.) శిక్ష లేదనే హామీ ఏమీ లేదు కదా! ఒక జాతి గాలి శిక్షతో నాశనం చేయబడింది కదా! వారు కూడా మేఘాలను చూసి అన్నారు: 'ఈ మేఘాలు మాపై వర్షం కురిపిస్తాయి.' " ('స.బు'ఖారీ, 'స. ముస్లిం) మేఘాలను చూసినప్పుడు దైవప్రవక్త ('స'అస) దు'ఆ చేసేవారు. దీనికి చూడండి, 69:6-8, 7:72, 11:53-56.
Ahkaf 46:25
అది తన ప్రభువు ఆజ్ఞతో ప్రతి దానిని నాశనం చేస్తుంది." చివరకు వారి నివాస స్థలాలు తప్ప, అక్కడ ఏమీ కనిపించకుండా పోయాయి. ఈ విధంగా మేము నేరస్థులకు ప్రతీకారం చేస్తాము.
Ahkaf 46:26
మరియు వాస్తవానికి మేము వారిని దృఢంగా స్థిరపరచి ఉన్నాము; ఆ విధంగా మేము (ఓ ఖురైషులారా) మిమ్మల్ని కూడా స్థిరపరచలేదు. మేము వారికి చెవులను, కన్నులను మరియు హృదయాలను ఇచ్చాము. కాని వారి చెవులూ, కళ్ళూ మరియు హృదయాలు వారికి ఉపయోగపడలేదు; ఎందుకంటే వారు అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తూ ఉండేవారు మరియు వారు దేనిని గురించి పరిహాసం చేస్తూ ఉండేవారో అదే వారిని చుట్టుకున్నది.
Ahkaf 46:27
మరియు వాస్తవానికి, మేము మీ చుట్టుప్రక్కల ఎన్నో నగరాలను నాశనం చేశాము. మరియు బహుశా వారు (సత్యం వైపునకు మరలి వస్తారని, మా సంకేతాలను వారికి ఎన్నో విధాలుగా చూపాము.
Ahkaf 46:28
అల్లాహ్ ను వదలి - తమను ఆయన సాన్నిధ్యానికి తేగలవారని - వారు భావించిన, వారి దేవతలు వారికెందుకు సహాయం చేయవు? అలా కాదు! అవి వారిని త్యజించాయి. ఎందుకంటే అది కేవలం వారి భ్రమ. మరియు వారు కల్పించుకున్న బూటక కల్పన మాత్రమే!
Ahkaf 46:29
మరియు (ఓ ముహమ్మద్!) జిన్నాతుల ఒక సమూహాన్ని[1] మేము - ఖుర్ఆన్ వినటానికి - నీ వైపునకు మొగ్గునట్లు చేసినపుడు, వారు అక్కడ చేరిన తరువాత పరస్పరం ఇలా మాట్లాడుకున్నారు: "నిశ్శబ్దంగా వినండి!" అది (ఆ పఠనం) ముగిసిన తరువాత, వారు హెచ్చరిక చేసేవారిగా, తమ జాతి వైపునకు మరలిపోయారు.
———
[1] నఫరన్: అంటే '3 నుండి 10 వరకు' ఉండే సంఖ్యల సమూహం. ఈ సంఘటన మక్కా - 'తాయఫ్ దారిలో న'ఖ్ ల లోయలో సంభవించంది. వివరాలకు చూడండి, 72:1-15. ('స.ముస్లిం, 'స.బు'ఖారీ) ఈ సంఘటన తరువాత జిన్నాతుల రాయబారులు దైవప్రవక్త ('స'అస) దగ్గరికి ఎన్నోసార్లు ఇస్లాం స్వీకరించటానికి, నేర్చుకోవటానికి వచ్చారు. (ఇబ్నె-కసీ'ర్).
Ahkaf 46:30
వారు (జిన్నాతులు) ఇలా అన్నారు: "ఓ మా జాతివారలారా! వాస్తవంగా మేము మూసా తరువాత అవతరింప జేయబడిన ఒక గ్రంథాన్ని విన్నాము. అది దానికి పూర్వం వచ్చిన దానిని (తౌరాత్ ను) ధృవీకరిస్తుంది; సత్యం వైపునకు మరియు ఋజుమార్గం (ఇస్లాం) వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది."[1]
———
[1] ప్రవక్తలందరూ మానవులే! జిన్నాతులలో ప్రవక్తలు వచ్చినట్లు ఖుర్ఆన్ లో, 'స'హీ'హ్ 'హదీస్'లలో లేదు. చూడండి, 16:43, 25:20. ఈ సూరహ్ లోని ఆయత్ లలో దైవప్రవక్త ('స'అస) జిన్నాతులకు కూడా ప్రచారం చేశారని తెలుస్తోంది.
Ahkaf 46:31
"మా జాతి వారలారా! అల్లాహ్ వైపునకు పిలిచేవానిని అనుసరించండి. మరియు ఆయన (అల్లాహ్) ను విశ్వసించండి. ఆయన మీ పాపాలను క్షమిస్తాడు మరియు మిమ్మల్ని బాధాకరమైన శిక్ష నుండి కాపాడుతాడు.
Ahkaf 46:32
మరియు అల్లాహ్ వైపునకు పిలిచే వానిని అనుసరించని వాడు భూమిలో (అల్లాహ్ నుండి) తప్పించుకోలేడు. మరియు ఆతడికి, ఆయన తప్ప మరొక సంరక్షకుడు లేడు. అలాంటి వారు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే!"
Ahkaf 46:33
ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడు అల్లాహ్ యే నని మరియు ఆయన వారిని సృష్టించటంలో అలసి పోడని, మరణించిన వారిని తిరిగి బ్రతికించగల సామర్థ్యం గలవాడని? అలా కాదు (ఎందుకు కలిగిలేడు)! నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు.
Ahkaf 46:34
మరియు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందు ప్రవేశపెట్టబడే రోజు వారితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది: "ఏమీ? ఇది సత్యం కాదా?" అని. వారంటారు: "ఎందుకు కాదు! మా ప్రభువు సాక్షిగా (ఇది సత్యమే!)" వారితో అనబడుతుంది: "అయితే, మీరు తిరస్కరిస్తూ వున్న దానికి గానూ ఈ శిక్షను రుచి చూడండి!"
Ahkaf 46:35
కావున నీవు (ఓ ప్రవక్తా!) సహనం వహించు! దృఢ సంకల్పం గల ప్రవక్తలు సహనం వహించినట్లు; మరియు వారి విషయంలో తొందర పడకు. నిశ్చయంగా, వారికి వాగ్దానం చేయబడిన (శిక్షను) వారు చూసిన రోజు; వారు (ఈ ప్రపంచంలో) దినంలోని ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం గడపలేదని అనుకుంటారు. (ఇదే మా) సందేశం! అలాంటప్పుడు, దుష్టులు (ఫాసిఖూన్) గాక, ఇతరులు నశింప జేయ బడతారా?
Muhammed 47:1
ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ఇతరులను) అల్లాహ్ మార్గం నుండి నిరోధించారో, వారి కర్మలను ఆయన (అల్లాహ్) నిష్ఫలం చేశాడు.
Muhammed 47:2
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ - ముహమ్మద్ మీద అవతరింప జేయబడిన దానిని - తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని నమ్మారో! వారి పాపాలను ఆయన తుడిచి వేశాడు మరియు వారి స్థితిని బాగు పరిచాడు.
Muhammed 47:3
ఇలా ఎందుకు జరిగిందంటే! వాస్తవానికి అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించారు మరియు విశ్వసించినవారు తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఈ విధంగా అల్లాహ్! ప్రజలకు ఉదాహరణల ద్వారా (వారి స్థానం) తెలియజేస్తున్నాడు.
Muhammed 47:4
కావున మీరు సత్యతిరస్కారులను (యుద్ధంలో) ఎదుర్కొన్నప్పుడు,[1] వారిపై ప్రాబల్యం పొందే వరకు, వారి మెడలపై కొట్టండి. ఆ తరువాత వారిని గట్టిగా బంధించండి, (యుద్ధం ముగిసిన) తరువాత వారిని కనికరించి వదలి పెట్టండి,[2] లేదా పరిహార ధనం తీసుకొని వదలి పెట్టండి. (మీతో) యుద్ధం చేసేవారు తమ ఆయుధాలను పడవేసే వరకు (వారితో పోరాడండి). ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్ తలుచుకుంటే ఆయన వారికి ప్రతీకారం చేసేవాడు, కాని మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి (ఆయన ఇలా చేశాడు). మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడ్డారో, అలాంటి వారి కర్మలను ఆయన వ్యర్థం చేయడు.
———
[1] ప్రతి మానవునికి తనకు నచ్చిన ధర్మాన్ని అనుసరించే హక్కు ఉంది. ధర్మ విషయంలో బలవంతం లేదు, చూడండి, 2:256. కావున ఎవరైనా మీ ఇస్లాం ధర్మపాలన కారణంగా మీపై దౌర్జన్యాలు చేస్తే! మీరు ఇస్లాంపై నడవకుండా మీ స్వాతంత్ర్యాన్ని భంగపరిస్తే, వారితో మీ మానప్రాణాల రక్షణ మరియు మీ ఇస్లాం ధర్మ రక్షణకై, వారిని పూర్తిగా అణగద్రొక్కే వరకు, లేదా వారిని ఖైదీలుగా చేసుకునే వరకు, వారితో భయంకరంగా పోరాడమే జిహాద్. వారిపై ప్రాబల్యం వహించిన తరువాత వారిని బంధించండి. యుద్ధం ముగిసిన తరువాత వారిలో మంచితనం చూస్తే వారిని కనికరించి, లేదా పరిహారం తీసుకొని వదలండి. చూడండి, 2:190-191. ఇంకా చూడండి జిహాద్ ను గురించి అవతరింపజేయబడిన మొట్టమొదటి ఆయత్ లకు 22:39-40.
[2] పరిహారధనానికి బదులుగా యుద్ధఖైదీలను పరస్పరం మార్పిడి కూడా చేసుకోవచ్చు.
Muhammed 47:5
ఆయన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు మరియు వారి స్థితిని చక్కబరుస్తాడు.
Muhammed 47:6
మరియు వారికి తెలియజేసి యున్న, స్వర్గంలోకి వారిని ప్రవేశింపజేస్తాడు.
Muhammed 47:7
ఓ విశ్వాసులారా! ఒకవేళ మీరు అల్లాహ్ కు (ఆయన మార్గంలో) సహాయపడితే, ఆయన మీకు సహాయం చేస్తాడు మరియు మీ పాదాలను స్థిరపరుస్తాడు.[1]
———
[1] చూడండి, 22:40.
Muhammed 47:8
ఇకపోతే సత్యాన్ని తిరస్కరించిన వారికి వినాశం తప్పదు. మరియు (అల్లాహ్) వారి కర్మలు వ్యర్థం చేస్తాడు.
Muhammed 47:9
ఇది ఎందుకంటే వాస్తవానికి, వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. కాబట్టి ఆయన వారి కర్మలను విఫలం చేశాడు.[1]
———
[1] కర్మలంటే ఇక్కడ సత్యతిరస్కారుల సత్కర్మలు విఫలమవుతాయి. వీశ్వాసం లేనిదే ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అవి విఫలమే అవుతాయి. పరలోకంలో వాటికి ఎలాంటి మంచి ఫలితం దొరకదు. సత్యతిరస్కారుల గమ్యస్థానం నరకమే.
Muhammed 47:10
ఏమీ? వారు భూమిలో సంచరించి చూడలేదా? వారికి పూర్వం గతించిన వారి పర్యవసానం ఏమయిందో? అల్లాహ్ వారిని నిర్మూలించాడు. మరియు సత్యతిరస్కారులకు అలాంటి గతే పట్టబోతోంది.[1]
———
[1] చూడండి, 6:10.
Muhammed 47:11
ఇది ఎందుకంటే! నిశ్చయంగా, విశ్వసించిన వారి సంరక్షకుడు అల్లాహ్! మరియు నిశ్చయంగా, సత్యతిరస్కారులకు సంరక్షకుడు ఎవ్వడూ లేడు.[1]
———
[1] ఉ'హుద్ యుద్ధంలో మక్కా ముష్రిక్ లు తమకు కొంత ప్రాబల్యం దొరికినందుకు: 'అ'అలు హుబల్' - హుబల్ కు జై! అంటే! విశ్వాసులు: 'అల్లాహు అ'అలావ అజల్లు' - అల్లాహ్ మహోన్నతుడు, గొప్పస్థానం గలవాడు. అని అన్నారు. మరియు ముష్రికులు: 'లనల్'ఉ'జ్జా వలా 'ఉ'జ్జాలకుమ్' - 'ఉ'జ్జా మాతోపాటు ఉన్నాడు, 'ఉ'జ్జా మీతో లేడు. అని, అంటే! ముస్లింలు: 'అల్లాహు మౌలానా వలా మౌలా లకుమ్' - అల్లాహ్ (సు.తా.) మా సంరక్షకుడు, మీ సంరక్షకుడు ఎవ్వడూ లేడు! అని అన్నారు. ('స.బు'ఖారీ)
Muhammed 47:12
నిశ్చయంగా, అల్లాహ్! విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు సత్యాన్ని తిరస్కరించి భోగభాగ్యాలలో మునిగి ఉండి పశువుల మాదిరిగా తింటున్న వారి నివాసం నరకాగ్నియే అవుతుంది.[1]
———
[1] సత్యతిరస్కారుకు, తమ ఐహిక జీవితానికే ప్రాధాన్యతనివ్వటం, అంటే కడుపు నింపుకోవటం మరియు లైంగిక అవసరాలను పూర్తి చేసుకోవటమే ప్రధానమైనది. వీరు పరలోక జీవితం గురించి పూర్తిగా అంధకారంలో పడి ఉన్నారు.
Muhammed 47:13
మరియు (ఓ ముహమ్మద్!) నిన్ను బహిష్కరించిన నగరం కంటే బలమైన ఎన్నో నగరాలను మేము నాశనం చేశాము. వారికి సహాయపడే వాడెవ్వడూ లేకపోయాడు.[1]
———
[1] ఈ ఆయత్ దైవప్రవక్త ('స'అస) యొక్క మక్కా నుండి మదీనా ప్రస్థానం చేసిన మొదటి రాత్రి అవతరింపజేయబడింది. ('తబరీ - ఇబ్నె- 'అబ్బాస్, కథనం) ఇంకా చూడండి, 6:131.
Muhammed 47:14
ఏమీ? తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన మార్గం మీద ఉన్నవాడు, తమ దుష్కార్యాలను మనోహరమైనవిగా భావించి, తమ మనోవాంఛలను అనుసరించే వారితో సమానుడు కాగలడా?
Muhammed 47:15
భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క ఉదాహరణ ఇలా వుంది: అందులో వాసన మరియు రంగు మారని నీటి సెలయేళ్ళు ఉంటాయి మరియు రుచి మారని పాల కాలువలు ఉంటాయి[1] మరియు అందులో త్రాగేవారికి మధురంగా వుండే మద్యపానపు కాలువలు ఉంటాయి మరియు అందులో శుద్ధమైన తేనె కాలువలు ఉంటాయి. మరియు వారి కొరకు అందులో అన్ని రకాల మంచి ఫలాలు మరియు వారి ప్రభువు నుండి క్షమాపణ కూడా వుంటాయి.[2] ఇలాంటి వాడు - నరకాగ్నిలో శాశ్వతంగా ఉండి సలసల కాగే నీటిని[3] త్రాగేందుకు ఇవ్వబడి, దానితో ప్రేగులు కోయబడినట్లు బాధపడేవానితో - సమానుడు కాగలడా?
———
[1] చూడండి, 37:45-47 మరియు 56:19.
[2] మీరు ఎప్పుడు ప్రార్థించినా జన్నతుల్ ఫిర్ దౌస్ కొరకే ప్రార్థించండి. అది స్వర్గాలలో అన్నింటికంటే ఉత్తమమైనది. దాని నుంచే స్వర్గపు సెలయేర్లు ప్రారంభమవుతాయి. మరియు దాని పైననే అనంతకరుణామయుని సింహాసనం ('అర్ష్) ఉంది.('స.బు'ఖారీ).
[3] చూడండి, 6:70.
Muhammed 47:16
మరియు (ఓ ముహమ్మద్!) వారిలో (కపట విశ్వాసులలో) నీ మాటలను చెవి యొగ్గి వినేవారు కొందరున్నారు.[1] కాని వారు నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తరువాత, జ్ఞానవంతులను ఇలా ప్రశ్నిస్తారు: "అతను చెప్పినదేమిటి?" వీరే! అల్లాహ్ హృదయాల మీద ముద్రివేసిన వారు మరియు వీరే తమ మనోవాంఛలను అనుసరించేవారు.[2]
———
[1] చూడండి, 6:25 మరియు 10:42-43.
[2] చూడండి, 2:7.
Muhammed 47:17
మరియు మార్గదర్శకత్వం పొందిన వారికి ఆయన (అల్లాహ్) ఇంకా ఎక్కువగా సన్మార్గం చూపుతాడు మరియు వారి దైవభీతిని వృద్ధి చేస్తాడు.
Muhammed 47:18
ఏమీ? ఇప్పుడు వారు అంతిమ ఘడియ అకస్మాత్తుగా రావాలని ఎదురు చూస్తున్నారా? వాస్తవానికి, దాని చిహ్నాలు కూడా వచ్చేశాయి.[1] అది వచ్చిపడితే, ఇక వారికి హితోపదేశం స్వీకరించే అవకాశం ఎక్కడ ఉంటుంది?
———
[1] చూదైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'నా కాలం మరియు పునరుత్థానదినం ఈ రెండు వ్రేళ్ళవలే ఉంటాయి.' అంటూ అతను (సఅస) తన రెండు వ్రేళ్ళను చూపుతూ అన్నారు: 'ఏ విధంగానైతే ఒక వ్రేలు మరొక వ్రేలుతో కొద్ది మాత్రమే పొడవుగా ఉందో, అదే విధంగా పునరుత్థానదినం నా తరువాత కొంత కాలంలోనే రానున్నది.' (సహీహ్ బుఖారీ).
Muhammed 47:19
కావున (ఓ ముహమ్మద్!) తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. కావున నీ పాపాలకు మరియు విశ్వాస స్త్రీల కొరకు మరియు విశ్వాస పురుషుల కొరకు కూడా క్షమాపణ వేడుకో![1] మరియు అల్లాహ్ కు మీ కార్యకలాపాలు మరియు మీ (అంతిమ) నివాసం కూడా తెలుసు.
———
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ప్రజలారా! అల్లాహ్ (సు.తా.) సన్నిధిలో, పశ్చాత్తాపపడుతూ క్షమాపణలు వేడుకుంటూ ఉండండి. నేను కూడా అల్లాహ్ (సు.తా.) సన్నిధిలో ప్రతిరోజూ డెబ్బై కంటే ఎక్కువసార్లు పశ్చాత్తాపపడుతూ క్షమాపణ వేడుకుంటూ ఉంటాను.' ('స. బు'ఖారీ).
Muhammed 47:20
మరియు విశ్వసించిన వారు ఇలా అంటున్నారు: "(యుద్ధం చేయమని ఆదేశిస్తూ) ఒక సూరహ్ ఎందుకు అవతరింప జేయబడలేదు?"[1] కాని ఇప్పుడు యుద్ధం చేయమని నిర్దేశిస్తూ ఒక సూరహ్ అవతరింప జేయబడితే తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు, మరణం ఆవహించిన వారి వలే నీ వైపునకు చూడటాన్ని, నీవు గమనిస్తావు.[2] కాని అది వారికే మేలైనదై ఉండేది.
———
[1] ఈ సూరహ్ 22:39 కంటే ముందు అవతరింపజేయబడింది.
[2] చూడండి, 4:77 ఇటువంటి వాక్యానికి.
Muhammed 47:21
ఆజ్ఞాపాలన చేయటం మరియు మంచి మాటలు పలుకటం. ఒకవేళ (జిహాద్ కొరకు) దృఢమైన నిర్ణయం తీసుకోబడినప్పుడు, వారు అల్లాహ్ విషయంలో సత్యవంతులుగా ఉన్నట్లయితే వారికే మేలు జరిగేది.
Muhammed 47:22
(వారితో ఇలా అను): "ఏమీ? మీరు (అల్లాహ్) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?"
Muhammed 47:23
ఇలాంటి వారినే అల్లాహ్ శపించాడు (బహిష్కరించాడు). వారిని చెవిటి వారిగా చేశాడు మరియు వారి కండ్లను గ్రుడ్డి చేశాడు.
Muhammed 47:24
వారు ఈ ఖుర్ఆన్ ను గురించి యోచించరా? లేదా వారి హృదయాల మీద తాళాలు పడి వున్నాయా?
Muhammed 47:25
మార్గదర్శకత్వం స్పష్టమైన తర్వాత కూడా, ఎవరైతే తమ వీపులు త్రిప్పుకొని మరలి పోయారో! నిశ్చయంగా, షైతాన్ (వారి చేష్టలను) వారికి మంచివిగా చూపాడు మరియు (అల్లాహ్) వారికి వ్యవధినిచ్చాడు.
Muhammed 47:26
ఇది ఎందుకంటే వాస్తవానికి వారు, అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకునే వారితో ఇలా అన్నందుకు: "మేము కొన్ని విషయాలలో మిమ్మల్ని అనుసరిస్తాము." మరియు అల్లాహ్ కు వారి రహస్య సమాలోచనలను గురించి బాగా తెలుసు.[1]
———
[1] చూడండి, 4:81.
Muhammed 47:27
అయితే దేవదూతలు వారి ఆత్మలను వశపరచుకొని, వారి ముఖాల మీద మరియు వీపుల మీద కొడుతూ వారిని తీసుకు వెళ్ళేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది?[1]
———
[1] చూడండి, 6:93 మరియు 8:50.
Muhammed 47:28
ఇది వాస్తవానికి, వారు అల్లాహ్ కు ఆగ్రహం కలిగించే విధానాన్ని అనుసరించి నందుకు మరియు ఆయన సమ్మతించే మార్గాన్ని అసహ్యించుకున్నందుకు! కావున ఆయన వారి కర్మలను వృథా చేశాడు.
Muhammed 47:29
ఏమీ? తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు, అల్లాహ్ వారి ద్వేషాన్ని బయట పెట్టడని భావిస్తున్నారా?[1]
———
[1] అ'ద్'గానున్: 'ది'గ్ నున్ యొక్క బహువచనం. ద్వేషం, పగ, అసహ్యం, ఏవగింపు.
Muhammed 47:30
మరియు మేము తలచుకుంటే, వారిని నీకు చూపేవారం; వారి లక్షణాలను బట్టి నీవు వారిని తెలుసుకోగలవు. మరియు వారు మాట్లాడే రీతిని బట్టి, వారిని నీవు తప్పక తెలుసుకోగలవు. మరియు అల్లాహ్ కు మీ కర్మలు బాగా తెలుసు.
Muhammed 47:31
మరియు నిశ్చయంగా, మీలో ధర్మయుద్ధం చేసేవారెవరో మరియు సహనం వహించేవారెవరో! చూచే వరకు మేము మిమ్మల్ని తప్పక పరీక్షిస్తాము.[1] మరియు మేము మీ ప్రతిజ్ఞావచనాలను కూడా పరీక్షిస్తాము.
———
[1] చూడండి, 3:140.
Muhammed 47:32
నిశ్చయంగా, మార్గదర్శకత్వం స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా, సత్యాన్ని తిరస్కరించి, ప్రజలను అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తూ, ప్రవక్తతో విరోధం కలిగి వున్నవారు,[1] అల్లాహ్ కు ఏ మాత్రం నష్టం కలిగించలేరు. కాని ఆయన వారి కర్మలను నిష్ఫలం చేయగలడు.
———
[1] చూడండి, 8:13 మరియు 2:190.
Muhammed 47:33
ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు ప్రవక్తను అనుసరించండి మరియు మీ కర్మలను వ్యర్థం చేసుకోకండి.[1]
———
[1] చూడండి, 53:32 ఎన్ని మంచి పనులు చేసినా అవి అల్లాహ్ (సు.తా.) మరియు ఆయన ప్రవక్త ('స'అస) విధేయతల పరిధి నుండి బయట ఉంటే అవి వ్యర్థమే అవుతాయి..
Muhammed 47:34
నిశ్చయంగా, సత్యాన్ని తిరస్కరిస్తూ ప్రజలను అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తూ వుండి, సత్యతిరస్కారులుగానే మరణించిన వారిని అల్లాహ్ ఎంత మాత్రం క్షమించడు.
Muhammed 47:35
కావున మీరు (ధర్మయుద్ధంలో) ధైర్యాన్ని వీడకండి మరియు సంధి కొరకు అడగకండి మరియు మీరే ప్రాబల్యం వహిస్తారు.[1] మరియు అల్లాహ్ మీకు తోడుగా ఉన్నాడు మరియు ఆయన మీ కర్మలను వృథా కానివ్వడు.
———
[1] చూడండి, 3:139 కానీ మీరు మీ శత్రువుల కంటే బలహీనులుగా ఉన్నారనుకుంటే సంధి చేసుకోవచ్చు. దైవప్రవక్త ('స'అస) మక్కా ముష్రికులతో హుదైబియాలో పది సంవత్సరాల సంధి చేసుకున్నారు.
Muhammed 47:36
నిశ్చయంగా, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట మరియు కాలక్షేపం మాత్రమే. ఒకవేళ మీరు విశ్వసించి దైవభీతి కలిగి ఉన్నట్లయితే, ఆయన మీకు మీ ప్రతిఫలం ఇస్తాడు. మరియు మీ నుండి ధనాన్ని కూడా అడగడు.[1]
———
[1] అల్లాహ్ (సు.తా.) కు మీ ధనం అవసరం లేదు. మదీనా కాలపు మొదటి రోజులలోనే 'జకాత్ విధించబడింది. అది ఇస్లాం ధర్మాన్ని కాపాడుకోవటానికి దాని ప్రచారానికి మరియు ముస్లింల కుశలత కొరకు వారి సౌకర్యాల కొరకు. 'జకాత్ ఒక సంవత్సరం వరకు జమ ఉన్న ధనసంపత్తుల మీద, 2.5% మాత్రమే. సంవత్సరం గడిచిన పిదపనే 'జకాత్ ఇవ్వవలసి ఉంటుంది.
Muhammed 47:37
ఒకవేళ ఆయన దానిని (ధనాన్నే) అడిగితే మరియు దాని కొరకు గట్టి పట్టుపట్టితే, మీరు పిసినారితనం చూపితే, ఆయన మీ ద్వేషాన్ని బయట పెట్టేవాడు.
Muhammed 47:38
ఇదిగో చూడండి! వారు మీరే! అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండని పిలువబడుతున్నవారు. కాని మీలో కొందరు పిసినారితనం వహిస్తున్నారు. మరియు ఎవడు పిసినారితనం వహిస్తున్నాడో, అతడు నిజానికి తన సొంత విషయంలోనే పిసినారితనం వహిస్తున్నాడు. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు మరియు మీరే కొరత గల (పేద) వారు.[1] మరియు మీరు విముఖులైతే ఆయన మీకు బదులుగా ఇతర జాతిని మీ స్థానంలో తేగలడు, అప్పుడు వారు మీలాంటి వారై ఉండరు.
———
[1] అల్లాహ్ (సు.తా.) మిమ్మల్ని ఖర్చు చేయమని ప్రోత్సహించేది మీ ఆత్మశుద్ధి కొరకు, మీ చుట్టు ప్రక్కలలో ఉండే పేదవారి అత్యావసరాలను పూర్తి చేయటానికి మరియు మీరు మీ శత్రువులపై ఆధిక్యత పొందటానికి.
Feth 48:1
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము;
Feth 48:2
అల్లాహ్! నీ పూర్వపు మరియు భావికాలపు తప్పులను క్షమించటానికి మరియు నీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి మరియు నీకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయటానికి;
Feth 48:3
మరియు అల్లాహ్! నీకు గొప్ప సహకారంతో సహాయపడటానికి.
Feth 48:4
ఆయనే, విశ్వాసుల హృదయాలలో శాంతిని అవతరింపజేశాడు, వారి విశ్వాసంలో మరింత విశ్వాసాన్ని అధికం చేసేందుకు. మరియు ఆకాశాలలోని భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
Feth 48:5
విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింప జేసేందుకు, అందులో వారు శాశ్వతంగా ఉండేందుకు మరియు వారి పాపాలను తొలగించేందుకూను. మరియు అల్లాహ్ దృష్టిలో ఇది ఒక గొప్ప విజయం.
Feth 48:6
మరియు కపట విశ్వాసులు (మునాఫిఖీన్) అయిన పురుషులను మరియు కపట విశ్వాసులైన స్త్రీలను; మరియు బహుదైవారాధకులైన పురుషులను మరియు బహుదైవారాధకులైన స్త్రీలను; అల్లాహ్ ను గురించి చెడు భావనలు, భావించే వారందరినీ శిక్షించేందుకు. వారిపై చెడు అన్ని వైపుల నుండి ఆవరించి ఉంటుంది. మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహం వారిపై విరుచుకు పడుతుంది. మరియు ఆయన వారిని శపించాడు (బహిష్కరించాడు); మరియు వారి కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంచాడు. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం!
Feth 48:7
ఆకాశాలలోని మరియు భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
Feth 48:8
నిశ్చయంగా, (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సాక్షిగా, శుభవార్తలు అందజేసే వానిగా మరియు హెచ్చరించే వానిగా చేసి పంపాము.
Feth 48:9
ఎందుకంటే (ఓ ముస్లింలారా!) మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించాలనీ మరియు మీరు అతనితో (ప్రవక్తతో) సహకరించాలనీ మరియు అతనిని గౌరవించాలనీ మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడాలనీ!
Feth 48:10
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, (నీ చేతిలో చేయి వేసి) నీతో శపథం చేసేవారు, వాస్తవానికి అల్లాహ్ తో శపథం చేస్తున్నారు.[1] అల్లాహ్ చెయ్యి వారి చేతుల మీద ఉంది. ఇక ఎవడు (తన శపథాన్ని) భంగం చేస్తాడో, వాస్తవానికి అతడు తన నష్టం కొరకే తన శపథాన్ని భంగం చేస్తాడు. మరియు ఎవడు తన వాగ్దానాన్ని పూర్తి చేస్తాడో, అల్లాహ్ అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు.
———
[1] చూడండి, 4:80.
Feth 48:11
వెనుక ఉండిపోయిన ఎడారి వాసులు (బద్దూలు)[1] నీతో ఇలా అంటారు: "మా ఆస్తిపాస్తుల మరియు మా ఆలుబిడ్డల చింత మాకు తీరిక లేకుండా చేశాయి. కావున మా క్షమాపణకై ప్రార్థించండి!" వారు తమ హృదయాలలో లేనిది తమ నాలుకలతో పలుకుతున్నారు. వారితో ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ మీకు నష్టం చేయదలిస్తే, లేదా లాభం చేయదలిస్తే, ఆయన నుండి మిమ్మల్ని తప్పించగల శక్తి ఎవరికుంది? వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును!
———
[1] 'గిఫార్, ముజైనహ్, జుహైనహ్, అష్ జా'అ, అస్ లమ్, దయల్ అనే బద్దూ తెగల వారు, సాకులు చెప్పారు. వారు ఆయుధాలు లేకుండా మక్కా వెళ్ళితే మక్కా ముష్రికులు వారిని చంపవచ్చని భయపడ్డారు. అందుకే దైవప్రవక్త ('స'అస) కు 'హుదైబియహ్ ఒప్పందం చేసుకోవలసి వచ్చింది.
Feth 48:12
అలా కాదు! ప్రవక్త మరియు విశ్వాసులు ఎన్నటికీ - తమ ఆలుబిడ్డల వద్దకు - తిరిగి రాలేరని మీరు భావించారు; మరియు ఇది (ఈ ఆలోచన) మీ హృదయాలకు చాలా నచ్చింది మరియు మీరు చాలా చెడ్డ తలంపులు చేశారు మరియు మీరు అధోగతికి చెందినవారు."
Feth 48:13
మరియు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించని సత్యతిరస్కారుల కొరకు మేము నిశ్చయంగా, భగభగ మండే అగ్ని జ్వాలలను సిద్ధపరచి ఉంచాము.
Feth 48:14
మరియు భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ దే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ సదా క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Feth 48:15
ఇక మీరు మీ విజయధనాన్ని తీసుకోవటానికి పోయినప్పుడు, వెనుక ఉండి పోయిన వారు ఇలా అంటారు: "మమ్మల్ని కూడా మీ వెంట రానివ్వండి."[1] వారు అల్లాహ్ ఉత్తరువును మార్చగోరుతున్నారు.[2] వారితో అను: "మీరు మా వెంట రాజాలరు; మీ గురించి అల్లాహ్ ముందే ఈ విధంగా చెప్పాడు." అప్పుడు వారు ఇలా అంటారు: "అది కాదు! మీరు మా మీద అసూయ పడుతున్నారు." అలా కాదు! వారు వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగేది చాలా తక్కువ.
———
[1] ఇక్కడ 'ఖైబర్ యుద్ధ ప్రస్తావన ఉంది. అది 7వ హిజ్రీలో జరిగింది. 'హుదైబియా ఒప్పందం తరువాత సూరహ్ అల్-ఫ'త్హ్ అవతరింపజేయబడింది. అది విని 6వ హిజ్రీలో సాకులు చెప్పి మక్కాకు 'ఉమ్మా కొరకు రానివారు - విజయధనపు ఆశతో - 'ఖైబర్ యుద్ధంలో పాల్గొనటానికి అనుమతి అడుగుతారు. అప్పుడు దైవప్రవక్త ('స'అస), కేవలం 6వ హిజ్రీలో 'ఉమ్రా కొరకు మక్కాకు పోయినవారు మాత్రమే 'ఖైబర్ కు పోవాలని. సెలవిస్తారు.
[2] చూడండి, 8:1.
Feth 48:16
వెనుక ఉండి పోయిన ఎడారి వాసులతో (బద్దూలతో) ఇలా అను: "ఇక మీద చాలా కఠినంగా పోరాడే వారికి విరుద్ధంగా (యుద్ధం చేసేందుకు)" మీరు పిలువబడతారు. అప్పుడు (మీరు చనిపోయే వరకూ) వారితో యుద్ధం చేయవలసిన ఉంటుంది లేదా వారు లొంగి పోయే వరకు. ఒకవేళ మీరు ఆజ్ఞాపాలన చేస్తే, అల్లాహ్ మీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ మీరు ఇంతకు ముందు మరలి పోయినట్లు, మరలిపోతే ఆయన మీకు అత్యంత బాధాకరమైన శిక్ష విధించగలడు."
Feth 48:17
కాని గ్రుడ్డివానిపై ఎలాంటి నింద లేదు మరియు కుంటివానిపై కూడా ఎలాంటి నింద లేదు మరియు అదే విధంగా వ్యాధిగ్రస్తునిపై కూడా ఎలాంటి నింద లేదు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపేవారిని, ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరియు వెనుదిరిగిన వానికి ఆయన బాధాకరమైన శిక్ష విధిస్తాడు.
Feth 48:18
వాస్తవానికి విశ్వాసులు చెట్టు క్రింద నీతో చేసిన శపథం[1] చూసి అల్లాహ్ సంతోషించాడు; మరియు వారి హృదయాల స్థితి ఆయనకు తెలిసిందే. కావున ఆయన వారి మీద శాంతిని అవతరింప జేశాడు. మరియు బహుమానంగా వారికి సమీప విజయాన్ని ప్రసాదించాడు.[2]
———
[1] ఇది 'హుదైబియాలో 6వ హిజ్రీలో 'ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర'ది.'అ) మరణవార్త విని, దైవప్రవక్త ('స'అస) చేతిపై ఒక తుమ్మచెట్టు క్రింద 'స'హాబాలు ('రది.'అన్హుమ్) అందరూ, తమ చివరి ప్రాణాల వరకు 'ఉస్మాన్ ('రది.'అ.) మరణపు ప్రతీకారం తీర్చుకోవటానికి పోరాడుతామని, చేసిన ప్రతిజ్ఞ.
[2] ఇది 'ఖైబర్ విజయమని చాలామంది వ్యాఖ్యాతలు అంటారు. కొందరు ఇది 8వ హిజ్రీ మక్కా విజయమని, ఆ తరువాత ముస్లింలకు లభించిన ఇతర విజయాలని అంటారు.
Feth 48:19
మరియు అందులో వారు చాలా విజయధనాన్ని కూడా పొందుతారు. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.
Feth 48:20
మరియు అల్లాహ్ మీకు ఇంకా చాలా విజయధనాల వాగ్దానం చేశాడు. మీరు వాటిని పొందుతారు. కావున మీకు వాటిని త్వరగా ప్రసాదిస్తాడు. మరియు ఆయన ప్రజల చేతులను మీ నుండి ఆపాడు. ఇది విశ్వాసులకు ఒక సూచనగా ఉండేందుకు మరియు ఆయన మీకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేసేందుకూను.[1]
———
[1] ఇది తరువాత జరిగే యుద్ధాలు మరియు వాటిలో దొరికే విజయధనపు ప్రస్తావన.
Feth 48:21
ఇంకా ఇతర (విజయాలు) కూడా! వాటిని మీరింకా సాధించలేదు. వాస్తవానికి, అల్లాహ్ వాటిని ఆవరించి ఉన్నాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
Feth 48:22
మరియు ఒకవేళ సత్యతిరస్కారులు మీతో యుద్ధానికి దిగివుంటే, వారు తప్పక వెన్ను చూపి పారిపోయేవారు, అప్పుడు వారు ఏ రక్షకుడిని గానీ లేదా సహాయకుడిని గానీ పొందేవారు కాదు.[1]
———
[1] ఇది హుదైబియా ఒప్పందాన్ని సూచిస్తోంది.
Feth 48:23
ఇది మొదటి నుంచే వస్తూ ఉన్న అల్లాహ్ సంప్రదాయం. నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు.
Feth 48:24
మరియు మక్కా లోయలో మీకు వారి మీద ప్రాబల్యం ఇచ్చిన తర్వాత, ఆయనే వారి చేతులను మీపై పడకుండా మరియు మీ చేతులు వారిపై పడకుండా చేశాడు.[1] మరియు మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు.
———
[1] 'హుదైబియా ఒప్పందానికి ముందు దాదాపు 80 మంది ముష్రికులు ఆయుధాలు తీసుకొని దైవప్రవక్త ('స'అస) ను చంపాలని బయలుదేరుతారు. కాని ముస్లింలు వారిని పట్టుకొని ఖైదీలు చేసుకుంటారు. ఒప్పందం జరిగిన తరువాత దైవప్రవక్త ('స'అస) వారిని విడిచి పెడ్తారు. (ముస్లిం, నసాయి' - 'తబరీ.)
Feth 48:25
(వాస్తవానికి) సత్యాన్ని తిరస్కరించి, మిమ్మల్ని మస్జిద్ అల్ హరామ్ కు పోకుండా నిరోధించి, బలి (ఖుర్బానీ) జంతువులను వాటిని బలి చేసే స్థలానికి చేరనివ్వకుండా ఆపింది వారే కదా![1] ఒకవేళ వారిలో విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు లేకుంటే - ఎవరిని గురించైతే మీకు తెలియదో - వారిని మీరు త్రొక్కివేసి ఉండేవారు. దాని వలన మీరు - మీకు తెలియకుండానే - పాపానికి గురి అయ్యేవారు. అల్లాహ్ తాను కోరిన వారిని తన కారుణ్యంలోనికి తీసుకుంటాడు. ఒకవేళ వారు (విశ్వాసులు) వారి నుండి వేరుగా ఉండి ఉంటే, మేము తప్పక వారిలోని సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష విధించి ఉండేవారము.
———
[1] అల్-హద్ య: అంటే మక్కాకు 'ఉమ్రా లేక 'హజ్జ్ కొరకు పోయేవారు, అక్కడ బలి ఇచ్చే పశువు. వారు దానిని తమ వెంట తీసుకురావచ్చు లేదా అక్కడే కొనవచ్చు.
మ'హిల్లున్: అంటే ఖుర్బానీ (బలి) ఇచ్చే చోటు. ఇది 'హరం సరిహద్దులలోని భాగం ('హుదూద్ అల్-'హరం).
Feth 48:26
సత్యాన్ని తిరస్కరించినవారు, తమ హృదయాలలోని మూఢ అభిమానం వల్ల, మూర్ఖపు పట్టు వహించినప్పుడు,[1] అల్లాహ్! తన సందేశహరుని మీద మరియు విశ్వాసుల మీద, శాంతిని అవతరింప జేశాడు. మరియు వారిలో దైవభీతిని స్థిర పరిచాడు. మరియు వారే దానికి హక్కుదారులు మరియు అర్హులు కూడాను. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.
———
[1] 'హమియ్యతల్ జాహిలియ్యహ్: అంటే ఇక్కడ ముస్లింలను ఎన్నటికీ మక్కాలోకి రానివ్వకూడదు అనే మూర్ఖ హఠము. అంటే ముస్లింలు 'హరంలో ప్రవేశించి, నమా'జ్ చేయటాన్ని మక్కా ముష్రిక్ ఖురైషులు సహించేవారు కాదు. ఎందుకంటే ముస్లింలు అల్లాహ్ (సు.తా.)ను ఆరాధించేవారు. కాని ముష్రిక్ లు తమ విగ్రహాలను ఆరాధించేవారు. ఆ అభిమానం వారు ముస్లింలతో చేసిన సంధిలో వ్యక్తమవుతోంది. అది మొదట ముష్రిక్ లకు అనుకూలమైనదిగా కనిపించినా చివరకు వారికి సహించరానిదిగా మారింది. వారి పతనానికి కారణమయ్యింది.
ఆ సంధి వ్రాసేటప్పుడు దైవప్రవక్త ('స'అస), 'అలీ (ర'ది.'అ.)తో మొదట: "బిస్మిల్లా హిర్ర'హ్ మా నిర్ర'హీమ్" అని వ్రాయమంటారు. అప్పుడు సంధి చేసుకోవటానికి వచ్చిన సుహైల్ బిన్ 'అమ్ర్ అంటాడు: మేము 'అర్ర'హ్ మాన్ అర్ర'హీమ్' ఏమిటో ఎరుగము. మేము వాడే పదం: "బిస్మిక అల్లాహుమ్మ" - 'నీ పేరుతో ఓ అల్లాహ్!' అని వ్రాయి, అంటాడు. దైవప్రవక్త ('స'అస) అలీ (ర'ది.'అ.)ను అలా వ్రాయమని అంటారు. ఆ తరువాత దైవప్రవక్త ('స'అస) అంటారు: 'ము'హమ్మద్ రసూలుల్లాహ్ మరియు మక్కా వాసుల మధ్య ఈ సంధి జరుగున్నది.' అని వ్రాయమంటారు. అలీ (ర'ది.'అ.) ను వెంటనే ఆపుతూ ముష్రిక్ నాయకుడు అంటాడు: 'రసూలుల్లాహ్' అనే పదవి మీదనే కదా మా మధ్య - మీ మధ్య వివాదమున్నది. అలా కాదు: 'ము'హమ్మద్ బిన్ అబ్దుల్లాహ్' అని వ్రాయాలి అంటాడు. దైవప్రవక్త ('స'అస) దానిని కొట్టేసి అలాగే వ్రాయమని అలీ (ర'ది.'అ.)తో అంటారు. దానికి అలీ (ర'ది.'అ.) ఒప్పుకోరు. అప్పుడు దైవప్రవక్త ('స'అస) తమ చేతితోనే దానిని కొట్టేసి, అతడు చెప్పినట్లు వ్రాయమంటారు. అప్పుడు ముస్లింల క్రోధావేశాలకు అంతులేకుండా పోతుంది. కాని అల్లాహ్ (సు.తా.) వారి హృదయాలకు శాంతిని ప్రసాదిస్తాడు. ('స.ముస్లిం, నసాయి', ఇబ్నె'హంబల్, - తబరీ).
Feth 48:27
వాస్తవానికి అల్లాహ్ తన ప్రవక్తకు, అతని స్వప్నాన్ని, నిజం చేసి చూపాడు.[1] అల్లాహ్ కోరితే, మీరు తప్పక శాంతియుతంగా, మీ తలలను పూర్తిగా గొరిగించుకొని లేదా తల వెంట్రుకలను కత్తిరించుకొని, మస్జిద్ అల్ హరామ్ లోకి భయపడకుండా ప్రవేశించేవారు. మీకు తెలియనిది ఆయనకు తెలుసు, ఇక ఇదే కాక సమీపంలోనే మీకు మరొక విజయాన్ని కూడా ప్రసాదించ బోతున్నాడు.[2]
———
[1] దైవప్రవక్త ('స'అస) తన సహచరులతో (ర'ది.'అన్హుమ్) సహా ఇ'హ్రామ్ ధరించి 'హరమ్ లో ప్రవేశించినట్లు చూసిన స్వప్నం. అది 7వ హిజ్రీలో పూర్తి అయింది. అప్పుడు వారంతా 'ఉమ్రా చేసారు.
[2] అంటే మక్కా, 'ఖైబర్ మరియు ముస్లింలకు లభించిన ఇతర విజయాలు.
Feth 48:28
ఆయనే, తన ప్రవక్తను మార్గదర్శకత్వంతో మరియు సత్యధర్మంతో అన్ని ధర్మాలపై అది ఆధిక్యత కలిగి వుండేలా చేసి పంపాడు. మరియు సాక్షిగా అల్లాహ్ యే చాలు.[1]
———
[1] ముస్లింలు, ఇస్లాం ను తూ.చా. తప్పక పాటిస్తే ఈ రోజు కూడా వారు అన్ని ధర్మాలవారి మీద ప్రాబల్యం వహించగలరు. చూడండి, 3:139.
Feth 48:29
ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు. మరియు అతని వెంట ఉన్నవారు, సత్యతిరస్కారుల పట్ల కఠినులు మరియు పరస్పరం కరుణామయులు.[1] నీవు వారిని (అల్లాహ్ ముందు) వంగుతూ (రుకూఉ చేస్తూ), సాష్టాంగాలు (సజ్దాలు) చేస్తూ ఉండటం చూస్తున్నావు. వారు అల్లాహ్ అనుగ్రహాన్ని మరియు ప్రసన్నతను అర్థిస్తూ ఉంటారు. వారి ముఖాల మీద సాష్టాంగం (సజ్దా) చేయటం వల్ల వచ్చిన గుర్తులుంటాయి. వారి ఈ ఉపమానం తౌరాత్ లో కూడా ఇవ్వబడుతుంది. మరియు ఇంజీల్ లో వారు ఒక పైరుతో పోల్చబడ్డారు: మొదట (బీజం నుండి) ఒక మొలక అంకురిస్తుంది,[2] తరువాత దానిని లావుగా చేస్తాడు. ఆ తరువాత అది తన కాండం మీద నిటారుగా నిలబడి[3] రైతులను ఆనంద పరిచి సత్యతిరస్కారులకు క్రోధావేశాలు కలిగిస్తుంది. విశ్వసించి, సత్కార్యాలు చేసే వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు.
———
[1] చూడండి, 5:54.
[2] ష'త్'అహ్: అంటే బీజాన్ని చీల్చి బయటికి వచ్చే మొదటి అంకురం.
[3] ఇది 'స'హాబా (ర'ది.'అ.)లను సూచిస్తోంది. మొదటి వారు అల్ప సంఖ్యలో మరియు బలహీనులుగా ఉంటారు, క్రమక్రమంగా వారి సంఖ్య పెరిగి వారు బలాఢ్యులవుతారు.
Hucurat 49:1
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అనుమతికి ముందే నిర్ణయాలకు దిగకండి.[1] అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.
———
[1] ధర్మం విషయంలో మీ స్వంత నిర్ణయాలకు దిగకండి. అల్లాహ్ (సు.తా.) మరియు దైవప్రవక్త ('స'అస) ఆజ్ఞలనే పాటించండి. అంటే ఖుర్ఆన్ మరియు 'స'హీ'హ్ 'హదీస్'ల ఆదేశాలను మాత్రమే అనుసరించండి. మీ స్వంత భావాలను, నిర్ణయాలను ధర్మంలో చొచ్చితే, అది బిద్'అత్ అవుతుంది. చూడండి, 4:65.
Hucurat 49:2
ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను, ప్రవక్త కంఠస్వరాని కంటే పెంచకండి మరియు మీరు పరస్పరం ఒకరితో నొకరు విచ్చలవిడిగా మాట్లాడుకునే విధంగా అతనితో మాట్లాడకండి, దాని వల్ల మీకు తెలియకుండానే, మీ కర్మలు వ్యర్థం కావచ్చు!
Hucurat 49:3
నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశహరుని సన్నిధిలో తమ కంఠస్వరాలను తగ్గిస్తారో, అలాంటి వారి హృదయాలను అల్లాహ్ భయభక్తుల కొరకు పరీక్షించి ఉన్నాడు. వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.
Hucurat 49:4
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, ఎవరైతే, నిన్ను గృహాల బయట నుండి బిగ్గరగా (అరుస్తూ) పిలుస్తారో, వారిలో చాలా మంది బుద్ధిహీనులే.[1]
———
[1] ఒకరోజు మధ్యాన్నం బనూ-తమీమ్ తెగవారు - మర్యాదలు తెలియని ఎడారివాసు (బద్ధూ)లు - దైవప్రవక్త ('స'అస) ఇంటి ముందుకు వచ్చి పెద్ద కంఠస్వరంతో అతని ('స'అస) పేరు తీసుకొని అరుస్తారు; అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడుతుంది. (ముస్నద్ అ'హ్మద్, 3/488, 6/394).
Hucurat 49:5
మరియు ఒకవేళ వారు నీవు బయటకు వచ్చే వరకు ఓపిక పట్టి వుంటే, అది వారికే మేలై ఉండేది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Hucurat 49:6
ఓ విశ్వాసులారా! ఎవడైనా ఒక అవిధేయుడు (ఫాసిఖ్), మీ వద్దకు ఏదైనా వార్త తెస్తే, మీరు - మీకు తెలియకుండానే జనులకు నష్టం కలిగించి, మీరు చేసిన దానికి పశ్చాత్తాప పడవలసిన స్థితి రాకముందే - నిజానిజాలను విచారించి తెలుసుకోండి.[1]
———
[1] ఒకవేళ దైవప్రవక్త ('స'అస) మీ మాటలు విని మిమ్మల్ని అనుసరిస్తే దానితో మీరే ఎక్కువ కష్టాలలో పడిపోవచ్చు! చూడండి, 23:71.
Hucurat 49:7
మరియు మీ మధ్య అల్లాహ్ యొక్క సందేశహరుడు ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ అతన చాలా విషయాలలో మీ మాటనే వింటే మీరే ఆపదలో పడవచ్చు. కానీ అల్లాహ్ మీకు విశ్వాసం పట్ల ప్రేమ కలిగించాడు మరియు దానిని మీ హృదయాలకు ఆకర్షణీయమైనదిగా చేశాడు. మరియు సత్యతిరస్కారాన్ని, అవిధేయతను మరియు దుర్నడతను (ఆజ్ఞోల్లంఘనను) మీకు అసహ్యకరమైనదిగా చేశాడు. అలాంటి వారే సరైన మార్గదర్శకత్వం పొందినవారు.
Hucurat 49:8
అది అల్లాహ్ తరఫు నుండి వారికి లభించిన అనుగ్రహం మరియు ఉపకారం. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
Hucurat 49:9
మరియు ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాల వారు పరస్పరం కలహించుకుంటే, వారిద్దరి మధ్య సంధి చేయించండి. కాని ఒకవేళ, వారిలోని ఒక వర్గం వారు రెండవ వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసిన వారు, అల్లాహ్ ఆజ్ఞ వైపునకు మరలే వరకు, వారికి వ్యతిరేకంగా పోరాడండి.[1] తరువాత వారు మరలి వస్తే, వారి మధ్య న్యాయంగా సంధి చేయించండి మరియు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. నిశ్చయంగా, అల్లాహ్ నిష్పక్షపాతంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు.
———
[1] ఒక ముస్లిం మరొక ముస్లింపై దౌర్జన్యం చేస్తే, ఖుర్ఆన్ మరియు 'హదీస్'ల వెలుగులో వారి మధ్య సంధి చేయించడానికి ప్రయత్నించాలి. దౌర్జన్యం చేసేవాడు దానికి అంగీకరించకపోతే, ముస్లింలు అందరూ కలిసి అతడు అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞను అనుసరించటానికి అంగీకరించే వరకు అతనికి వ్యతిరేకంగా పోరాడాలి.
Hucurat 49:10
వాస్తవానికి విశ్వాసులు పరస్పరం సహోదరులు, కావున మీ సహోదరుల మధ్య సంధి చేయించండి.[1] మరియు మీరు కరుణించ బడాలంటే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.
———
[1] చూడండి, 9:71.
Hucurat 49:11
ఓ విశ్వాసులారా! మీలో ఎవరూ (పురుషులు) ఇతరులెవరినీ ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే వారే) వీరి కంటే శ్రేష్ఠులు కావచ్చు![1] అదే విధంగా స్త్రీలు కూడా ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు. బహశా వారే (ఎగతాళి చేయబడే స్త్రీలే) వీరి కంటే శ్రేష్ఠురాండ్రు కావచ్చు! మీరు పరస్పరం ఎత్తి పొడుచుకోకండి మరియు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తర్వాత ఒకనిని చెడ్డ పేరుతో పిలవటం ఎంతో నీచమైన విషయం మరియు (ఇలా చేసిన పిదప) పశ్చాత్తాప పడకుంటే, అలాంటి వారు చాలా దుర్మార్గులు.[2]
———
[1] మీరు ఇతరులను చిన్న వారిగా భావించి వారిని ఎగతాళి చేయకండి. వారిని కించపరచకండి. ఎవడు ఉత్తముడో, ఎవడు అధముడో కేవలం అల్లాహ్ (సు.తా.) కే తెలుసు. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ఇతరులను నీచమైనవారుగా, తుచ్ఛమైన వారుగా భావించడం పెద్ద పాపాలలో ఒకటి.' (అబూ-దావూద్)
[2] చూడండి, 6:82.
Hucurat 49:12
ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించడం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుమానాలే నిశ్చయంగా పాపాలు. మరియు మీరు మీ పరస్పర రహస్యాలను తెలుసుకోవటానికి ప్రయత్నించకండి మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహ్యించుకుంటారు కదా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.
Hucurat 49:13
ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. మరియు మీరు ఒకరి నొకరు గుర్తించుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము.[1] నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.
———
[1] షు'ఊబున్, ష'అబున్ యొక్క బహువచనం, పెద్ద కుటుంబాన్ని ష'అబ్ అంటారు. దాని తరువాత ఖబీలహ్, 'ఇమారహ్, బ'తన్, ఫ'సీలహ్ మరియు 'అషీరహ్. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
Hucurat 49:14
ఎడారి వాసులు (బద్దూలు): "మేము విశ్వసించాము." అని అంటారు. (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "మీరు ఇంకా విశ్వసించలేదు కావున: 'మేము విధేయులం (ముస్లింలం) అయ్యాము.' అని అనండి. ఎందుకంటే విశ్వాసం (ఈమాన్) మీ హృదయాలలోకి ఇంకా ప్రవేశించలేదు. ఒకవేళ మీరు అల్లాహ్ యొక్క మరియు ఆయన ప్రవక్త యొక్క ఆజ్ఞాపాలన చేస్తే, ఆయన మీ కర్మలను ఏ మాత్రం వృథా కానివ్వడు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."
Hucurat 49:15
వాస్తవానికి, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించి, ఆ తరువాత ఏ అనుమానానికి లోను కాకుండా, అల్లాహ్ మార్గంలో, తమ సిరిసంపదలతో మరియు ప్రాణాలతో పోరాడుతారో! అలాంటి వారు, వారే! సత్యవంతులు.
Hucurat 49:16
వారితో ఇలా అను: "ఏమిటి? మీరు అల్లాహ్ కు మీ ధర్మస్వీకారం గురించి తెలియజేస్తున్నారా? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు."
Hucurat 49:17
(ఓ ముహమ్మద్!) వారు ఇస్లాంను స్వీకరించి, నీకు ఉపకారం చేసినట్లు వ్యవహరిస్తున్నారు. వారితో ఇలా అను: "మీరు ఇస్లాంను స్వీకరించి నాకు ఎలాంటి ఉపకారం చేయలేదు! వాస్తవానికి, మీరు సత్యవంతులే అయితే! మీకు విశ్వాసం వైపునకు మార్గదర్శకత్వం చేసి, అల్లాహ్ యే మీకు ఉపకారం చేశాడని తెలుసుకోండి."
Hucurat 49:18
నిశ్చయంగా, అల్లాహ్! ఆకాశాలలో మరియు భూమిలోనున్న అగోచర విషయాలన్నింటినీ ఎరుగును. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు.
Kâf 50:1
ఖాఫ్[1], మరియు దివ్యమైన[2] ఈ ఖుర్ఆన్ సాక్షిగా!
———
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
[2] అల్ మజీదు: ఖుర్ఆన్ ను సంబోధించిన సందర్భానికి చూడండి, 85:21. Glorious, Noble, దివ్యమైన, ఉత్కృష్టమైన. అల్లాహు'తాలాను సంబోధించిన సందర్భానికి చూడండి, 11:73, 85:15. మహత్వపూర్ణుడు
Kâf 50:2
అలా కాదు! హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వారిలో నుంచే వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది, కావున సత్యతిరస్కారులు ఇలా అన్నారు[1]: "ఇది ఆశ్చర్యకరమైన విషయం!
———
[1] చూడండి, 25:7, 20.
Kâf 50:3
మేము మరణించి మట్టిగా మారి పోయినా (మరల బ్రతికించ బడతామా)? ఈ విధంగా మరల (సజీవులై) రావటం చాలా అసంభవమైన విషయం!"
Kâf 50:4
వాస్తవానికి వారి (శరీరాల)లో నుండి భూమి దేనిని తగ్గిస్తుందో మాకు బాగా తెలుసు.[1] మరియు మా దగ్గర అంతా ఒక సురక్షితమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.
———
[1] పునరుత్థానం అంటే పూర్తిగా దుమ్ము ధూళిగా మారిపోయిన మానవులను తిరిగి మొదటి రూపంలో బ్రతికించి తీసుకురావటం. చూడండి, 10:4, 21:104, 30:11, 85:13 మొదలైనవి. ఇంకా చూడండి, 10:34, 27:64, 30:27.
Kâf 50:5
కాని వారు, సత్యం వారి వద్దకు వచ్చినపుడు దానిని అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు ఈ విషయం గురించి కలవరపడుతున్నారు.
Kâf 50:6
వారు, తమ మీద ఉన్న ఆకాశం వైపునకు చూడటం లేదా ఏమిటి? మేము దానిని ఏ విధంగా నిర్మించి అలంకరించామో మరియు దానిలో ఎలాంటి చీలికలూ (పగుళ్ళూ) లేవు.[1]
———
[1] అంటే ఎలాంటి లోపాలూ లేవు. చూడండి, 67:3-4.
Kâf 50:7
ఇక భూమిని! మేము దానిని విస్తరింపజేసి, దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము. మరియు అందులో అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పత్తి చేశాము.[1]
———
[1] బహీజున్: మనోహరమైన. ఇక్కడ 'జౌజ్ - అంటే జతలు. చూడండి, 22:5.
Kâf 50:8
(అల్లాహ్) వైపునకు మరలే ప్రతి దాసునికి సూచనగా మరియు బోధనగా!
Kâf 50:9
మరియు మేము ఆకాశం నుండి శుభదాయకమైన నీటిని కురిపించి దాని ద్వారా తోటలను ఉత్పత్తి చేశాము మరియు ధాన్యాలను పండించాము.
Kâf 50:10
మరియు ఎత్తయిన ఖర్జూరపు చెట్లను పెంచి, వాటికి వరుసలలో పండ్ల గుత్తులను (పుట్టించాము);[1]
———
[1] బాసిఖాతిన్: 'తివాలన్ షాహిఖాతిన్, ఎత్తైన. 'తల్'ఉన్: క్రొత్తగా పుట్టిన ఖర్జూరపు ఫలాలు, న'దీదున్: గుత్తులు.
Kâf 50:11
మా దాసులకు జీవనోపాధిగా మరియు దానితో (ఆ నీటితో) చచ్చిన భూమికి ప్రాణం పోశాము. ఇదే విధంగా (చచ్చిన వారిని) కూడా లేపుతాము.
Kâf 50:12
వారికి పూర్వం నూహ్ జాతి వారు, అర్ రస్[1] వాసులు మరియు సమూద్ జాతి వారు కూడా, సత్యాన్ని తిరస్కరించారు.
———
[1] చూడండి, 25:38 మరియు సూరహ్ అల్-బురూజ్ (85). అర్-రస్ వారు ఎవరనే విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇబ్నె-జరీర్ 'తబరీ (ర'హ్మా) అభిప్రాయంలో వీరే అస్'హాబ్ అల్-ఉఖ్దూద్.
Kâf 50:13
మరియు ఆద్ జాతి వారు, ఫిర్ఔన్ జాతి వారు మరియు లూత్ సహోదరులు కూడా;
Kâf 50:14
మరియు అయ్ కహ్ (వన) వాసులు మరియు తుబ్బఅ[1] జాతి వారు కూడాను. ప్రతి ఒక్కరూ తమ ప్రవక్తలను అసత్యులని తిరస్కరించారు, కావున నా బెదరింపు వారి విషయంలో సత్యమయింది.
———
[1] తుబ్బ'అ జాతివారి కొరకు చూడండి, 44:37. అయ్ కహ్ వాసులు (వనవాసులు) అంటే మద్ యన్ వాసులు. చూడండి, 26:176 ఇంకా వివరాలకు చూడండి, 11:84-95.
Kâf 50:15
ఏమిటి? మేము మొదటి సృష్టితోనే అలసిపోయామా? అలా కాదు, అసలు వారు కొత్త సృష్టి (పునరుత్థానమును) గురించి సందేహంలో పడి ఉన్నారు.[1]
———
[1] చూడండి, 30:27 మరియు 36:78-79.
Kâf 50:16
మరియు వాస్తవంగా, మేమే మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనస్సులో మెదిలే ఊహలను కూడా మేము ఎరుగుతాము.[1] మరియు మేము అతనికి అతని కంఠ రక్తనాళం కంటే కూడా అతి దగ్గరగా ఉన్నాము.
———
[1] హృదయాలలో దాగి ఉన్న విషయాలన్నీ అల్లాహ్ (సు.తా.)కు తెలుసు. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'అల్లాహ్ (సు.తా.) నా అనుచరుల మనస్సులలో మెదిలే విషయాలను క్షమించాడు. అంటే వాటి నిమిత్తం శిక్షించడు. ఎంతవరకైతే వారు వాటిని తమ నోటితో ఉచ్ఛరించరో! లేదా వాటిని ఆచరణలోకి తీసుకురారో!' ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం)
Kâf 50:17
(జ్ఞాపకముంచుకోండి) అతని కుడి మరియు ఎడమ ప్రక్కలలో కూర్చుండి (ప్రతి విషయాన్ని వ్రాసే) ఇద్దరు పర్యవేక్షకులు (దేవదూతలు) అతనిని కలుసుకొన్న తరువాత నుంచి -
Kâf 50:18
అతనితో బాటు ఒక పర్యవేక్షకుడైనా సిద్ధంగా లేనిదే - అతడు ఏ మాటనూ పలకలేడు.
Kâf 50:19
మరియు మరణ మూర్ఛ వచ్చేది సత్యం. అది, ఇదే! దేని నుండైతే నీవు తప్పించుకో గోరుతూ ఉండేవాడివో!
Kâf 50:20
మరియు బాకా (సూర్) ఊదబడుతుంది. ఆ హెచ్చరించబడిన (పునరుత్థాన) దినం అదే!
Kâf 50:21
మరియు ప్రతి ఆత్మ (ప్రాణి) ఒక తోలేవాడితో మరొక సాక్ష్యమిచ్చేవాడితో సహా వస్తుంది.
Kâf 50:22
(ఇలా అనబడుతుంది): "వాస్తవానికి నీవు (ఈ దినాన్ని గురించి) నిర్లక్ష్యంగా ఉండే వాడివి. కావున ఇపుడు మేము నీ ముందున్న తెరను తొలగించాము. కావున, ఈ రోజు నీ దృష్టి చాలా చురుకుగా ఉంది."
Kâf 50:23
మరియు అతని సహచరుడు (ఖరీనున్) ఇలా అంటాడు: "ఇదిగో నా దగ్గర సిద్ధంగా ఉన్న (ఇతని కర్మ పత్రం) ఇది!"
Kâf 50:24
(ఇలా ఆజ్ఞ వస్తుంది): "మూర్ఖపు పట్టు (హఠము) గల ప్రతి సత్యతిరస్కారుణ్ణి మీరిద్దరు కలసి నరకంలో విసరివేయండి;
Kâf 50:25
మంచిని నిషేధించే వాడిని, హద్దులు మీరి ప్రవర్తిస్తూ సందేహాలను వ్యాపింప జేసేవాడిని;
Kâf 50:26
అల్లాహ్ కు సాటిగా ఇతర ఆరాధ్య దైవాన్ని కల్పించినవాడు ఇతడే. కావున ఇతనిని మీరిద్దరూ కలిసి ఘోరశిక్షలో పడవేయండి."
Kâf 50:27
అతని స్నేహితుడు (ఖరీనున్) ఇలా అంటాడు:[1] "ఓ మా ప్రభూ! నేను ఇతని తలబిరుసుతనాన్ని ప్రోత్సహించలేదు, కాని ఇతడే స్వయంగా, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళి పోయాడు."
———
[1] చూడండి, 14:22.
Kâf 50:28
ఆయన (అల్లాహ్) ఇలా అంటాడు: "మీరు నా దగ్గర వాదులాడకండి మరియు వాస్తవానికి నేను ముందుగానే మీ వద్దకు హెచ్చరికను పంపి ఉన్నాను."
Kâf 50:29
నా దగ్గర మాట మార్చటం జరుగదు మరియు నేను నా దాసులకు అన్యాయం చేసేవాడను కాను.
Kâf 50:30
ఆ రోజు మేము నరకంతో: "నీవు నిండిపోయావా?" అని ప్రశ్నిస్తాము. మరియు అది: "ఇంకా ఏమైనా ఉందా ఏమిటి?" అని అడుగుతుంది.[1]
———
[1] చూడండి, 32:13.
Kâf 50:31
మరియు స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకురాబడుతుంది! అది వారి నుండి ఏ మాత్రం దూరంగా ఉండదు.
Kâf 50:32
(వారితో ఇలా అనబడుతుంది): "ఇదే మీకు వాగ్దానం చేయబడినది. మళ్ళీ మళ్ళీ మా వైపుకు మరలే ప్రతివానికి, (మా హద్దును) లక్ష్యపెట్టిన (పాటించిన) వానికి;
Kâf 50:33
అగోచరుడైన ఆ కరుణామయునికి భయపడేవానికి మరియు మా వైపునకు పశ్చాత్తాప హృదయంతో మరలేవానికి;
Kâf 50:34
ఇందులో (ఈ స్వర్గంలో), శాంతితో ప్రవేశించండి. ఇదే శాశ్వాత జీవిత దినం."
Kâf 50:35
అందులో వారికి, వారు కోరేదంతా ఉంటుంది. మరియు మా దగ్గర ఇంకా చాలా ఉంది.[1]
———
[1] చూడండి, 10:26.
Kâf 50:36
మరియు మేము, వీరికి పూర్వం ఎన్నో తరాల వారిని నాశనం చేశాము. వారు వీరి కంటే ఎక్కువ శక్తిమంతులు. కాని, (మా శిక్ష పడినప్పుడు) వారు దేశదిమ్మరులై పోయారు. ఏమీ? వారికి తప్పించుకునే మార్గం ఏదైనా దొరికిందా?
Kâf 50:37
నిశ్చయంగా, హృదయమున్న వాడికి, శ్రద్ధతో వినేవాడికి మరియు లక్ష్యపెట్టే వాడికి ఇందులో ఒక గుణపాఠముంది.
Kâf 50:38
మరియు వాస్తవంగా! మేము ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాము. కాని మాకు ఎలాంటి అలసట కలుగలేదు.
Kâf 50:39
కావున (ఓ ముహమ్మద్!) వారు పలికే మాటలకు సహనం వహించు మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా;[1]
———
[1] ఫజ్ర్ మరియు 'అ'స్ర్ నమాజులు చేయండి.
Kâf 50:40
మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు[1] మరియు సాష్టాంగం (సజ్దా) చేసిన తరువాత కూడా స్తుతించు.[2]
———
[1] చూడండి, 17:79 అంటే రాత్రిపూట లేచి తహజ్జుద్ నమా'జ్ చేయండి. మే'రాజ్ కు ముందు ముస్లింలందరికీ ఫజ్ర్ మరియు 'అ'స్ర్ నమాజ్ లు విధించబడి ఉండేవి మరియు దైవప్రవక్త ('స'అస) తహజ్జుద్ చేసేవారు. కానీ మే'రాజ్ తరువాత 5 నమా'జ్ లు అందరి కొరకు విధిగా చేయబడ్డాయి. (ఇబ్నె-కసీ'ర్).
[2] ఫ'ర్ద్ నమాజుల తరువాత త'స్బీహ్ చేయాలి. అంటే సుబ్'హానల్లాహ్ 33 సార్లు, అల్'హమ్దులిల్లాహ్ 33 సార్లు మరియు అల్లాహు అక్బర్ 34 సార్లు చదవాలి. ('స.బు'ఖారీ, 'స.ముస్లిం)
Kâf 50:41
మరియు చెవి యొగ్గి విను, చాటింపు చేసేవాడు అతి దగ్గరి నుంచే పిలిచే రోజున!
Kâf 50:42
ఆ రోజు మీరు ఒక భయంకర శబ్దం వినేది సత్యం. (గోరీలలో నుండి) బయటికి వచ్చే దినం అదే!
Kâf 50:43
నిశ్చయంగా, మేమే జీవనమిచ్చే వారం మరియు మేమే మరణింపజేసే వారం మరియు మీ అందరి మరలింపు మా వైపునకే జరుగుతుంది.
Kâf 50:44
ఆ రోజు భూమి చీలిపోయి వారందరూ పరుగిడుతూ బయటికి వస్తారు. అదే సమావేశ సమయం. అది మాకెంతో సులభం.
Kâf 50:45
వారనేది మాకు బాగా తెలుసు. నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేయలేవు. కావున నా హెచ్చరికకు భయపడే వాడికి మాత్రమే నీవు ఈ ఖుర్ఆన్ ద్వారా హితబోధ చెయ్యి.
Zariyat 51:1
దుమ్ము ఎగురవేసే వాటి (గాలుల) సాక్షిగా!
Zariyat 51:2
మరియు (నీటి) భారాన్ని మోసే (మేఘాల);
Zariyat 51:3
మరియు సముద్రంలో సులభంగా తేలియాడే (ఓడల);
Zariyat 51:4
మరియు (ఆయన) ఆజ్ఞతో (అనుగ్రహాలను) పంచిపెట్టే (దేవదూతల సాక్షిగా);[1]
———
[1] సాక్షిగా అంటే ఇక్కడ నొక్కి చెప్పడం అన్నట్లు. లేక ఉదాహరణగా ఇవ్వటం. ఏ విధంగానైతే గాలులు, మేఘాలు, నీటపై ఓడలు పయనించటం ఎంత సత్యమో పునరుత్థానం కూడా సత్యం.
Zariyat 51:5
నిశ్చయంగా, మీకు చేయబడ్డ వాగ్దానం సత్యం.
Zariyat 51:6
మరియు నిశ్చయంగా తీర్పు రానున్నది.
Zariyat 51:7
మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా!
Zariyat 51:8
నిశ్చయంగా, మీరు భేదాభిప్రాయాలలో పడి ఉన్నారు.[1]
———
[1] మీలో ఏకాభిప్రాయం లేదు. మీలో కొందరు దైవప్రవక్త ('స'అస) ను మాంత్రికుడు, మరి కొందరు కవి, మరికొందరు జ్యోతిషుడు, మరికొందరు అసత్యవాది, అని అంటున్నారు. అంతేకాదు మీలో కొందరు పునరుత్థానదినం రానేరాదని అంటున్నారు. మరికొందరు దానిని గురించి సంశయంలో పడి ఉన్నారు. మీరు అల్లాహ్ (సు.తా.) ను సృష్టికర్త మరియు సర్వపోషకుడని, అంటారు, కాని ఇతరులను కూడా ఆయన (సు.తా.)కు సాటి (భాగస్వాములు)గా నిలబెడతారు. మీలో చిత్తశుద్ధి, ఏకాభిప్రాయం లేవు.
Zariyat 51:9
(సత్యం నుండి) మరలింపబడిన వాడే, మోసగింపబడిన వాడు.
Zariyat 51:10
ఆధారం లేని అభిప్రాయాలు గలవారే నాశనం చేయబడేవారు!
Zariyat 51:11
ఎవరైతే నిర్లక్ష్యంలో పడి అశ్రద్ధగా ఉన్నారో!
Zariyat 51:12
వారు ఇలా అడుగుతున్నారు: "తీర్పుదినం ఎప్పుడు రానున్నది?"
Zariyat 51:13
ఆ దినమున, వారు అగ్నితో దహింపబడతారు (పరీక్షింపబడతారు).
Zariyat 51:14
(వారితో ఇలా అనబడుతుంది): "మీ పరీక్షను[1] రుచి చూడండి! మీరు దీని కొరకే తొందర పెట్టేవారు!"
———
[1] ఫిత్ నతున్: అంటే ఇక్కడ శిక్ష లేక నరకాగ్నిలో కాలడం. చూడండి, 6:128, 40:12, 43:74.
Zariyat 51:15
నిశ్చయంగా, దైవభీతి గలవారు చెలమలు గల స్వర్గవనాలలో ఉంటారు.
Zariyat 51:16
తమ ప్రభువు తమకు ప్రసాదించిన వాటితో సంతోషపడుతూ! నిశ్చయంగా వారు అంతకు పూర్వం సజ్జనులై ఉండేవారు.
Zariyat 51:17
వారు రాత్రివేళలో చాలా తక్కువగా నిద్రపోయేవారు.
Zariyat 51:18
మరియు వారు రాత్రి చివరి ఘడియలలో[1] క్షమాపణ వేడుకునే వారు.
———
[1] అల్-అస్'హరు: అంటే చివరి మూడోవంతు రాత్రి. అది ప్రార్థన (దు'ఆ)లు అంగీకరించబడే సమయం. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: మూడోవంతు రాత్రి బాకీ ఉన్నప్పుడు అల్లాహ్ (సు.తా.) భూమికి దగ్గరగా ఉన్న ఆకాశం మీదికి దిగి వస్తాడు మరియు ఇలా అంటాడు: 'ఏమీ? ఎవరైనా ఏవైనా కోరుకునే వారున్నారా? నేను వారి కోరికలను పూర్తి చేస్తాను. ఇలా తెల్లవారే వరకు ప్రశ్నిస్తూ ఉంటాడు.' ('స'హీ'హ్ ముస్లిం) చూడండి, 3:17.
Zariyat 51:19
మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి[1] హక్కు ఉంటుంది.
———
[1] మ'హ్రూమ్ లకు: అంటే ఆవశ్యకత ఉండి కూడా యాచించని వారికి.
Zariyat 51:20
మరియు భూమిలో కూడా నమ్మేవారి కొరకు ఎన్నో నిదర్శనాలు (ఆయాత్) ఉన్నాయి.
Zariyat 51:21
మరియు స్వయంగా మీలో కూడా ఉన్నాయి. ఏమీ? మీరు చూడలేరా?[1]
———
[1] చూడండి, 45:4.
Zariyat 51:22
మరియు ఆకాశంలో మీ జీవనోపాధి మరియు మీకు వాగ్దానం చేయబడినది ఉంది.
Zariyat 51:23
కావున భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, ఇది సత్యం; ఏ విధంగానైతే మీరు మాట్లాడగలిగేది (సత్యమో)!
Zariyat 51:24
ఏమీ? ఇబ్రాహీమ్ యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా?[1]
———
[1] ఇబ్రాహీమ్ ('అ.స.) గాథ కోసం చూడండి, 11:69 మరియు 15:51. ఈ ఆయతులు అవతరింపజేయబడేవరకు ఈ గాథ దైవప్రవక్త ('స'అస) కు తెలియదు. కాబట్టి వ'హీ ద్వారా తెలుపబడుతోంది..
Zariyat 51:25
వారు అతని వద్దకు వచ్చినపుడు: "మీకు సలాం!" అని అన్నారు. అతను: "మీకూ సలాం!" అని జవాబిచ్చి : "మీరు పరిచయం లేని (కొత్త) వారుగా ఉన్నారు." అని అన్నాడు.
Zariyat 51:26
తరువాత అతను తన ఇంటిలోకి పోయి బలిసిన (వేయించిన) ఒక ఆవు దూడను తీసుకొని వచ్చాడు.
Zariyat 51:27
దానిని వారి ముందుకు జరిపి: "ఏమీ? మీరెందుకు తినటం లేదు?" అని అడిగాడు.
Zariyat 51:28
(వారు తినకుండా ఉండటం చూసి), వారి నుండి భయపడ్డాడు.[1] వారన్నారు: "భయపడకు!" మరియు వారు అతనికి జ్ఞానవంతుడైన కుమారుని శుభవార్తనిచ్చారు.
———
[1] ఇంటికి వచ్చిన అతిథులు ఆహారం తినకపోవడం చూసి, వారు సహృదయంతో రాలేదు! ఏదో, ఆపద నిలబెట్టుటకైతే రాలేదు కదా! అని భయపడ్డాడు.
Zariyat 51:29
అప్పుడతని భార్య అరుస్తూ వారి ముందుకు వచ్చి, తన చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ: "నేను ముసలిదాన్ని, గొడ్రాలను కదా!" అని అన్నది.
Zariyat 51:30
వారన్నారు: "నీ ప్రభువు ఇలాగే అన్నాడు! నిశ్చయంగా, ఆయన మహావివేకవంతుడు, సర్వజ్ఞుడు!"
Zariyat 51:31
(ఇబ్రాహీమ్) అడిగాడు: "ఓ సందేశహరులారా (ఓ దేవదూతలారా)! అయితే మీరు వచ్చిన కారణమేమిటి?"
Zariyat 51:32
వారన్నారు: "వాస్తవానికి, మేము నేరస్థులైన జనుల వైపునకు పంపబడ్డాము.
Zariyat 51:33
వారి మీద (కాల్చబడిన) మట్టి రాళ్ళను కురిపించటం కోసం![1]
———
[1] చూడండి, 11:82.
Zariyat 51:34
నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడిన (రాళ్ళు);[1] మితిమీరి ప్రవర్తించేవారి కొరకు!"
———
[1] ముసవ్వమతున్: అంటే ప్రత్యేకించబడినవి.
Zariyat 51:35
అప్పుడు మేము అందులో ఉన్న విశ్వాసులందరినీ బయటికి తీశాము. [1]
———
[1] వివరాలకు చూడండి, 11:77 మరియు 15:61.
Zariyat 51:36
మేము అందు ఒక్క గృహం తప్ప![1] ఇతర విధేయుల (ముస్లింల)[2] గృహాన్ని చూడలేదు.
———
[1] ఆ ఇల్లు లూ'త్ ('అ.స.) యొక్క ఇల్లు. అతని ఇద్దరు కుమార్తెలు మరియు కొంతమంది విశ్వాసులు. అంతా కలసి దాదాపు 13 మంది మాత్రమే ఉంటారు. లూ'త్ ('అ.స.) భార్య వారితో చేరక, సత్యతిరస్కారులలో చేరిపోతుంది.
[2] ఒకరు దైవప్రవక్త ('స'అస) ను ప్రశ్నిస్తారు: 'ఇస్లాం అంటే ఏమిటి?' అతను ('స'అస) అంటారు: '1) లా ఇలాహ ఇల్లల్లాహ్ (షహాదహ్) సాక్ష్యం పలకడం, 2) నమా'జ్ స్థాపించడం, 3) 'జకాత్ ఇవ్వడం, 4) రమజాన్ నెలలో ఉపవాసముండడం మరియు 5) 'హజ్ చేయడం' అని అంటారు, తరువాత 'ఈమాన్ అంటే ఏమిటి?' అని ప్రశ్నిస్తే, అతను ('స'అస) అంటారు: '1) అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించడం, 2) ఆయన దూతలను, 3) దివ్యగ్రంథాలను, 4) ప్రవక్తలను, 5) పునరుత్థాన దినాన్ని మరియు 6) ఖద్ర్ (మంచి లేక చెడు ఏది సంభవించినా అల్లాహ్ తరఫునుండేనని) విశ్వసించడం.' అంటే హృదయపూర్వకంగా ఈ విషయాలను నమ్మడమే ఈమాన్. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను మరియు విధులను పాటించడం ఇస్లాం. దీని ప్రకారం ప్రతి మూ'మిన్ ముస్లిం మరియు ప్రతి ముస్లిం మూ'మిన్. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
ఇక ఎవరైతే మూ'మిన్ మరియు ముస్లింల మధ్య వ్యత్యాసం చూపుతారో, వారు అంటారు: 'ఖుర్ఆన్ లో ఇక్కడ ఒకే రకమైన జనుల కొరకు మూ'మిన్ మరియు ముస్లిం శబ్దాలు వాడబడ్డాయి. కాని వీటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ప్రతి మూ'మిన్ ముస్లిం అవుతాడు. కానీ ప్రతి ముస్లిం మూ'మిన్ అవటం అనివార్యం కాదు.' ఇబ్నె-కసీ'ర్, (వివరాలకు ము'హమ్మద్ జులాగఢి-పేజీ, 1478, మలిక్ ఫహద్ ఖుర్ఆన్ ప్రింటింగ్ కాంప్లెక్సు, మదీన మునవ్వరహ్).
Zariyat 51:37
మరియు బాధాకరమైన శిక్షకు భయపడేవారి కొరకు, మేము అక్కడ ఒక సూచన (ఆయత్) ను వదలి పెట్టాము.[1]
———
[1] ఆ సూచన (గుర్తు), అంటే మృత సముద్రం.
Zariyat 51:38
ఇక మూసా (గాథలో) కూడా (ఒక సూచన వుంది) మేము అతనిని ఫిర్ఔన్ వద్దకు స్పష్టమైన ప్రమాణంతో పంపినపుడు;
Zariyat 51:39
అతడు (ఫిర్ఔన్) తన సభాసదులతో సహా మరలిపోతూ, ఇలా అన్నాడు: "ఇతడు మాంత్రికుడు లేదా పిచ్చివాడు!"
Zariyat 51:40
కావున మేము అతనిని మరియు అతని సైనికులను పట్టుకొని, వారందరినీ సముద్రంలో ముంచి వేశాము మరియు దానికి అతడే నిందితుడు.
Zariyat 51:41
ఇక ఆద్ జాతి వారిలో కూడా (ఒక సూచన వుంది): మేము వారిపై వినాశకరమైన గాలిని పంపినప్పుడు![1]
———
[1] చూడండి, 7:65.
Zariyat 51:42
అది దేని పైనయితే వీచిందో, దానిని క్షీణింపజేయకుండా వదలలేదు.[1]
———
[1] ఆ గాలి ఎనిమిది రోజులు ఏడు రాత్రులు వీచింది. చూడండి, 69:7.
Zariyat 51:43
మరియు సమూద్ జాతి వారి గాథలో కూడా (ఒక సూచన ఉంది). వారితో: "కొంతకాలం మీరు సుఖసంతోషాలను అనుభవించండి." అని అన్నాము.[1]
———
[1] వారి కోరిక ప్రకారం వారికి ఒక ఆడఒంటె అల్లాహ్ (సు.తా.) తరఫునుండి, ఒక అద్భుత సూచనగా పంపబడితే, వారు దానిని చంపుతారు. అప్పుడు వారితో: 'ఇక మీరు మూడు రోజులుసుఖసంతోషాలను అనుభవించండి.' అని అనబడింది.
Zariyat 51:44
అప్పుడు వారు తమ ప్రభువు ఆజ్ఞను ఉపేక్షించారు. కావున వారు చూస్తూ ఉండగానే ఒక పెద్ద పిడుగు వారి మీద విరుచుకు పడింది.[1]
———
[1] 'సా'ఇఖతున్: అంటే ఒక పెద్ద ధ్వని, గర్జన లేక పిడుగు నుండి వచ్చే ధ్వనిలాంటిది. ఈ ధ్వని ఆకాశంలో నుండి వచ్చింది మరియు భూమిలో భూకంపం కూడా వచ్చింది. చూడండి, 7:73-79.
Zariyat 51:45
అప్పుడు వారికి లేచి నిలబడే శక్తి కూడా లేకపోయింది మరియు వారు తమను తాము కూడా కాపాడు కోలేక పోయారు.
Zariyat 51:46
మరియు దీనికి ముందు నూహ్ జాతి వారిని కూడా (నాశనం చేశాము). నిశ్చయంగా, వారు కూడా అవిధేయులు.
Zariyat 51:47
మరియు ఆకాశాన్ని మేము (మా) చేతులతో నిర్మించాము. మరియు నిశ్చయంగా, మేమే దానిని విస్తరింపజేయ గలవారము.
Zariyat 51:48
మరియు భూమిని మేము పరుపుగా చేశాము, మేమే చక్కగా పరిచేవారము!
Zariyat 51:49
మరియు మేము ప్రతిదానిని జంటలుగా సృష్టించాము, మీరు గ్రహించాలని.[1]
———
[1] అంటే ప్రతి దానిని జంటలుగా సృష్టించాము. ఆడ-మగలు, చీకటి-వెలుగులు, సూర్య-చంద్రులు, తీపి-చేదులు, రాత్రింబవళ్ళు, కీడు-మేలు, జీవన్మరణాలు, విశ్వాసం-అవిశ్వాసం, స్వర్గనరకాలు, జిన్నాతులు-మానవులు, మొదలైనవి. వీటన్నింటినీ సృష్టించిన వాడు అల్లాహ్ (సు.తా.) ఆయనకు ఎవరూ భాగస్వాములు లేరు. చూడండి, 36:36.
Zariyat 51:50
కావున మీరు అల్లాహ్ వైపునకు పరుగెత్తండి. నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే!
Zariyat 51:51
మరియు మీరు అల్లాహ్ కు సాటిగా ఇతర దైవాన్ని నిలుపకండి! నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే!
Zariyat 51:52
ఇదే విధంగా, వారికి పూర్వం గడిచిన వారి వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు: "ఇతను మాంత్రికుడు లేదా పిచ్చివాడు." అని అనకుండా ఉండలేదు.
Zariyat 51:53
ఏమీ? దీనిని (ఇలా పలుకుటను) వారు ఒకరికొకరు వారసత్వంగా ఇచ్చుకున్నారా? అలా కాదు! అసలు వారు తలబిరుసుతనంతో ప్రవర్తించే జనం!
Zariyat 51:54
కావున నీవు వారి నుండి మరలిపో, ఇక నీపై ఎలాంటి నింద లేదు.
Zariyat 51:55
మరియు వారిని ఉపదేశిస్తూ వుండు, నిశ్చయంగా, ఉపదేశం విశ్వాసులకు ప్రయోజనకర మవుతుంది.
Zariyat 51:56
మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే!
Zariyat 51:57
నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు.
Zariyat 51:58
నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు.[1]
———
[1] అర్-రజ్జాఖు: All Provider, The Sustainer. The supplier of the means of subsistence. ఉపాధిప్రదాత, సర్వపోషకుడు, జీవనోపాధిని ప్రసాదించేవాడు.
అల్-ఖవియ్యు: Owner of Power, చూడండి, 11:66, 28:26, 42:19.
అల్-మతీను: The Strongest, Steadfast, Hard, Firm, స్థైర్యవంతుడు, దృఢమైనవాడు, పటిష్టవంతుడు, నిలకడ, స్థామం గలవాడు, ఇక్కడ ఒకేచోట వచ్చింది. పైవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
Zariyat 51:59
కావున నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడినవారి పాపాలు వారి (పూర్వ) స్నేహితుల పాపాల వంటివే! కావున వారు నా (శిక్ష కొరకు) తొందర పెట్టనవసరం లేదు!
Zariyat 51:60
కావున సత్యతిరస్కారులకు వినాశం గలదు - వారికి వాగ్దానం చేయబడిన - ఆ దినమున!
Tûr 52:1
తూర్ పర్వతం సాక్షిగా![1]
———
[1] ఈ 'తూర్ పర్వతం మీదనే మూసా ('అ.స.) అల్లాహ్ (సు.తా.) తో మాట్లాడారు. దీని మరొక పేరు 'తూర్ సినాయి అని కూడా ఉంది.
Tûr 52:2
వ్రాయబడిన గ్రంథం సాక్షిగా!
Tûr 52:3
విప్పబడిన చర్మపత్రం మీద.[1]
———
[1] రఖ్ఖిన్: Parchment, అంటే రాతకు అనువయ్యేటట్లు పదును చేసిన గొర్రెతోలు, చర్మపత్రం, చర్మపత్ర రాతప్రతి.
Tûr 52:4
చిరకాల సందర్శనాలయం సాక్షిగా![1]
———
[1] బైతుల్-మ'అమూర్: ఏడవ ఆకాశం మీద ఉన్న ఆలయం. అక్కడ దైవదూతలు అల్లాహ్ (సు.తా.) ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రతిరోజూ అక్కడికి డెబ్భై వేల దైవదూతలు ఆరాధన కోసం వస్తారు. అయినా వారికి పునరుత్థానదినం వరకూ రెండవ సారి దాని దర్శనం చేసే అవకాశం దొరకదు. మ'అమూర్ అంటే నిండి ఉన్న ప్రదేశం. కాబట్టి కొందరు వ్యాఖ్యాతలు బైతుల్-మ'అమూర్ అంటే మక్కాలోని కాబా అని, కూడా అంటారు. ఎందుకంటే అది కూడా ఎల్లప్పుడు అక్కడికి ఆరాధన కొరకు వచ్చే ప్రజలతో నిండి ఉంటుంది.
Tûr 52:5
పైకెత్తబడిన కప్పు (అంతరిక్షం) సాక్షిగా![1]
———
[1] చూడండి, 21:32.
Tûr 52:6
ఉప్పొంగే సముద్రం సాక్షిగా![1]
———
[1] చూడండి, 81:6.
Tûr 52:7
నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష సంభవించ నున్నది.
Tûr 52:8
దానిని తప్పించేవాడు ఎవ్వడు లేడు.
Tûr 52:9
ఆకాశాలు భయంకరంగా కంపించే రోజు!
Tûr 52:10
మరియు పర్వతాలు దారుణంగా చలించినప్పుడు!
Tûr 52:11
అప్పుడు, ఆ రోజు అసత్యవాదులకు వినాశం ఉంది.
Tûr 52:12
ఎవరైతే వృథా మాటలలో కాలక్షేపం చేస్తూ ఉంటారో!
Tûr 52:13
వారు నరకాగ్నిలోకి నెట్టుతూ త్రోయబడే రోజు;
Tûr 52:14
(వారితో ఇలా అనబడుతుంది): "మీరు అసత్యమని నిరాకరిస్తూ వుండిన నరకాగ్ని ఇదే!
Tûr 52:15
ఏమీ? ఇది మంత్రజాలమా? లేక దీనిని మీరు చూడలేక పోతున్నారా?
Tûr 52:16
ఇందులో మీరు కాలుతూ ఉండండి. దానికి మీరు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా మీకు సమానమే! నిశ్చయంగా, మీ కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతున్నది."
Tûr 52:17
నిశ్చయంగా, భయభక్తులు గలవారు స్వర్గవనాలలో సుఖసంతోషాలలో ఉంటారు.
Tûr 52:18
వారి ప్రభువు వారికి ప్రసాదించిన వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. మరియు వారి ప్రభువు వారిని భగభగ మండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడాడు.
Tûr 52:19
(వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ వుండిన కర్మలకు ఫలితంగా హాయిగా తినండి త్రాగండి!"
Tûr 52:20
వారు వరుసగా వేయబడిన ఆసనాల మీద, దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు మేము అందమైన పెద్ద పెద్ద కన్నులు గల సుందరీమణులతో[1] వారి వివాహం చేయిస్తాము.
———
[1] 'హూరున్: కొరకు చూడండి, 56:22, 55:56, 44:54, 38:52, 37:48.
Tûr 52:21
మరియు ఎవరైతే విశ్వసిస్తారో మరియు వారి సంతానంవారు విశ్వాసంలో వారిని అనుసరిస్తారో! అలాంటి వారిని వారి సంతానంతో (స్వర్గంలో) కలుపుతాము.[1] మరియు వారి కర్మలలో వారికి ఏ మాత్రం నష్టం కలిగించము. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు.[2]
———
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'మానవుడు మరణిస్తే అతని కర్మలు ఆగిపోతాయి. కాని మూడు విషయాల పుణ్యఫలితం మరణించిన తరువాత కూడా దొరుకుతూ ఉంటుంది. 1) సదఖహ్ జారియహ్, 2) అతడు వదిలిన జ్ఞానం - దేనితోనైతే ఇతరులు లాభం పొందుతూ ఉంటారో! 3) సద్వర్తనులైన సంతానం - ఎవరైతే అతని కొరకు ప్రార్థిస్తూ ఉంటారో!' ('స.ముస్లిం).
[2] ఇటువంటి ఆయత్ కే చూడండి, 74:38.
Tûr 52:22
మరియు మేము వారికి, వారు కోరే ఫలాలను మరియు మాంసాన్ని పుష్కలంగా ప్రసాదిస్తాము.
Tûr 52:23
అందులో (ఆ స్వర్గంలో) వారు ఒకరి కొకరు (మధు) పాత్ర మార్చుకుంటూ ఉంటారు; దాన్ని (త్రాగటం) వల్ల వారు వ్యర్థపు మాటలు మాట్లాడరు మరియు పాపాలు చేయరు.[1]
———
[1] చూడండి, 37:47 మరియు 56:19.
Tûr 52:24
మరియు దాచబడిన ముత్యాల వంటి బాలురు,[1] వారి సేవ కొరకు వారి చుట్టు ప్రక్కలలో తిరుగుతూ ఉంటారు.
———
[1] చూడండి, 56:17-18.
Tûr 52:25
మరియు వారు ఒకరి వైపుకొకరు మరలి పరస్పరం (తమ గతించిన జీవితాలను గురించి) మాట్లాడుకుంటూ ఉంటారు.
Tûr 52:26
వారు ఇలా అంటారు: "వాస్తవానికి మనం ఇంతకు పూర్వం మన కుటుంబం వారి మధ్య ఉన్నప్పుడు (అల్లాహ్ శిక్షకు) భయపడుతూ ఉండేవారము.
Tûr 52:27
కావున నిశ్చయంగా, అల్లాహ్ మన మీద కనికరం చూపాడు మరియు మమ్ము దహించే గాలుల శిక్ష నుండి కాపాడాడు.[1]
———
[1] సమూమున్: అతి వేడి గల దహించే గాలి. నరకపు పేర్లలో ఇది కూడా ఒకటి.
Tûr 52:28
నిశ్చయంగా, మనం ఇంతకు పూర్వం ఆయననే ప్రార్థిస్తూ ఉండేవారము. నిశ్చయంగా, ఆయన మహోపకారి,[1] అపార కరుణా ప్రదాత.
———
[1] అల్-బర్రు: Truly Begign to His servancts, Gentle, Kind, Most Subtle, కృపాళువు, మహోపకారి, దయామయుడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
Tûr 52:29
కావున (ఓ ప్రవక్తా!) నీవు హితోపదేశం చేస్తూ వుండు. నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు జ్యోతిష్కుడవు కావు మరియు పిచ్చివాడవూ కావు.
Tûr 52:30
లేదా? వారు: "ఇతను ఒక కవి, ఇతని వినాశకాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము. అని అంటున్నారా?"[1]
———
[1] రైబున్: అంటే అకస్మాత్తుగా జరిగే సంఘటన. మనూనున్: ఇది మరణపు పేర్లలో ఒకటి. అంటే కాలక్రమంలో సంభవించే ఉపద్రవం లేక దుర్ఘటన.
Tûr 52:31
వారితో ఇలా అను: "మీరు ఎదురు చూస్తూ ఉండండి, నిశ్చయంగా, నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తూ ఉంటాను!"
Tûr 52:32
ఏమీ? వారి బుద్ధులు వారికి ఇవే ఆజ్ఞాపిస్తున్నాయా? లేక వారు తలబిరుసుతనం గల జనులా?[1]
———
[1] చూడండి, 96:6-7.
Tûr 52:33
ఏమీ? వారు: "ఇతనే, దీనిని (ఈ సందేశాన్ని) కల్పించుకున్నాడు" అని అంటున్నారా? అలా కాదు, వారు అసలు విశ్వసించ దలుచుకోలేదు!
Tûr 52:34
వారు సత్యవంతులే అయితే దీని వంటి ఒక వచనాన్ని (రచించి) తెమ్మను.[1]
———
[1] చూడండి, 17:88.
Tûr 52:35
వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా?
Tûr 52:36
లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు.
Tûr 52:37
వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలు ఏవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా?
Tûr 52:38
వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానితో పైకెక్కి వారు (దేవదూతల మాటలు) వినటానికి? అలా అయితే! వారిలో ఎవడైతే విన్నాడో, అతనిని స్పష్టమైన నిదర్శనాన్ని తెమ్మను.
Tûr 52:39
ఆయన (అల్లాహ్) కు కూతుళ్ళూ మరియు మీకేమో కుమారులా?[1]
———
[1] చూడండి, 16:57-59.
Tûr 52:40
(ఓ ముహమ్మద్!) నీవు వారితో ఏమైనా ప్రతిఫలం అడుగుతున్నావా? వారు ఋణభారంతో అణిగి పోవటానికి?
Tûr 52:41
లేక వారి దగ్గర అగోచర విషయపు జ్ఞానముందా? వారు దానిని వ్రాసి పెట్టారా?[1]
———
[1] చూడండి, 68:47.
Tûr 52:42
లేక వారేదైనా పన్నాగం పన్నదలచారా? కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, వారే పన్నాగానికి గురి అవుతారు.[1]
———
[1] చూడండి, 35:43.
Tûr 52:43
లేక వారికి అల్లాహ్ గాకుండా మరొక ఆరాధ్య దేవుడు ఉన్నాడా? వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు.
Tûr 52:44
ఒకవేళ వారు ఆకాశపు ఒక తునకను రాలి పడటం చూసినా: "ఇవి దట్టమైన మేఘాలు!" అని అనేవారు.
Tûr 52:45
కావున వారు తమ (తీర్పు) దినాన్ని దర్శించే వరకు వారిని వదిలి పెట్టు. అప్పుడు వారు భీతితో మూర్ఛపోయి పడి పోతారు.
Tûr 52:46
ఆరోజు వారి పన్నాగం వారికి ఏ మాత్రం పనికి రాదు. మరియు వారికి ఎలాంటి సహాయం కూడా లభించదు.
Tûr 52:47
మరియు నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడిన వారికి, ఇదే గాక మరొక శిక్ష కూడా ఉంది,[1] కాని వారిలో చాలా మందికి అది తెలియదు.
———
[1] ఇటువంటి ఆయత్ కై చూడండి, 32:21.
Tûr 52:48
కావున (ఓ ముహమ్మద్!) నీవు, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చే వరకు సహనం వహించు. నిశ్చయంగా, నీవు మా దృష్టిలో ఉన్నావు. మరియు నీవు నిద్ర నుండి లేచినపుడు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన స్తోత్రం చెయ్యి.
Tûr 52:49
మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు[1] మరియు నక్షత్రాలు అస్తమించే వేళలో కూడాను![2]
———
[1] అంటే తహజ్జుద్ నమా'జ్. దైవప్రవక్త ('స'అస) ఎల్లప్పుడూ తహజ్జుద్ నమాజ్ చేసేవారు.
[2] అంటే ఫజ్ర్ నమా'జ్ వేళ చేసే సున్నతులు. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ఫజ్ర్ యొక్క రెండు సున్నతులు ఈ లోకం మరియు దానిలో ఉన్నవాట న్నింటికంటే గొప్పవి.' ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం).
Necm 53:1
అస్తమించే నక్షత్రం సాక్షిగా![1]
———
[1] 'లేక రాలిపోయే నక్షత్రం ... ' అని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం.
Necm 53:2
మీ సహచరుడు (ముహమ్మద్), మార్గభ్రష్టుడు కాలేదు మరియు తప్పు దారిలోనూ లేడు.[1]
———
[1] చూడండి, 7:184. మా'గవా: తప్పు దారిలోనూ లేడు, పెడదారి పట్టలేదు.
Necm 53:3
మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు.
Necm 53:4
అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే.
Necm 53:5
అది అతనికి మహా బలవంతుడు (జిబ్రీల్) నేర్పాడు.
Necm 53:6
అతను శక్తిసామర్ధ్యాలు గలవాడు,[1] తన వాస్తవరూపంలో ప్రత్యక్షమయినప్పుడు;
———
[1] శారీరక శక్తి గలవాడు.
Necm 53:7
అతను ఎత్తైన దిజ్ఞ్మండలంలో (దిక్చక్రంలో) కనిపించాడు. [1]
———
[1] చూడండి, 81:23. 'స'హీ'హ్ 'హదీస్'ల ప్రకారం దైవప్రవక్త ('స'అస), రెండుసార్లు దైవదూత జిబ్రీల్ ('అ.స.) ను అతని నిజరూపంలో చూశారు. మొదటిసారి ఫ'త్ రతుల్ వ'హీ తరువాత. చూడండి, సూరహ్ అల్ ముద్దస్సి'ర్ (74) మరియు రెండవ సారి మే'రాజ్ రాత్రిలో ఏడవ ఆకాశపు చివరి హద్దులలోనున్న రేగుచెట్టు (సిద్ రతుల్ - మున్ తహా) దగ్గర. ఎవరు కూడా ఆ హద్దును దాటిపోలేరు. చూడండి, 53:13-18 ఆయత్ లు.
Necm 53:8
తరువాత సమీపించాడు, మరింత క్రిందికి దిగి వచ్చాడు.
Necm 53:9
అప్పుడు అతను రెండు ధనస్సుల దూరంలోనో లేక అంతకంటే తక్కువ దూరంలోనో ఉన్నాడు.
Necm 53:10
అప్పుడు అతను (జిబ్రీల్), ఆయన (అల్లాహ్) దాసునిపై అవతరింప జేయవలసిన, దానిని (వహీని) అవతరింపజేశాడు.
Necm 53:11
అతను (ప్రవక్త) చూసిన దానిని, అతని హృదయం అబద్ధమని అనలేదు.
Necm 53:12
అయితే మీరు, అతను (కళ్ళారా) చూసిన దానిని గురించి (అతనితో) వాదులాడుతారా?
Necm 53:13
మరియు వాస్తవానికి అతను (ప్రవక్త) అతనిని (జిబ్రీల్ ను) మరొకసారి (ప్రత్యక్షంగా) అవతరించినప్పుడు చూశాడు.
Necm 53:14
(సప్తాకాశంలో) చివరి హద్దులో నున్న రేగు చెట్టు (సిదరతుల్ మున్తహా) దగ్గర.[1]
———
[1] అంటే మే'రాజ్ రాత్రిలో ఏడవ ఆకాశపు చివరి హద్దులోనున్న రేగుచెట్టు (సిద్ రతుల్ - మున్ తహ్) దగ్గర దైవప్రవక్త ('స'అస) జిబ్రీల్ ('అ.స.) ను అతని నిజరూపంలో రెండవసారి చూశారు. ఏ దైవదూత కూడా ఆ 'సిద్ రతుల్ - మున్ తహా కంటే ముందుకు పోలేడు. దైవదూత ('అలైహిమ్.స.) లక అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలు లభించేది అక్కడే.
Necm 53:15
అక్కడికి దగ్గరలోనే జన్నతుల్ మా'వా ఉంది.[1]
———
[1] దీనిని జన్నతుల్-మఅ'వా అనటానికి కారణం ఇది ఒకప్పటి ఆదమ్ ('అ.స.) యొక్క నివాస స్థలం. ఆత్మలన్నీ అక్కడికే పోయి చేరుతాయని కొందరంటారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్.)
Necm 53:16
అప్పుడు ఆ సిదరహ్ వృక్షాన్ని కప్పేది కప్పేసినప్పుడు![1]
———
[1] మే'రాజ్ రాత్రిలో దైవప్రవక్త ('స'అస) అక్కడికి చేరుకున్నప్పుడు బంగారు పక్షులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దైవదూతల నీడలు దానిపై పడుతూ ఉంటాయి. అల్లాహ్ (సు.తా.) యొక్క జ్యోతి అక్కడ ఉంటుంది. (ఇబ్నె-కసీ'ర్ మరియు ఇతరులు). అక్కడ దైవప్రవక్త ('స'అస)కు మూడు విషయాలు ప్రసాదించబడ్డాయి. 1) ఐదు పూటల నమా'జ్ లు, 2) సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు మరియు 3) షిర్క్ కు దూరంగా ఉంటే ముస్లింలను క్షమిస్తాననే వాగ్దానం. ('స'హీ'హ్ ముస్లిం).
Necm 53:17
అతని (ప్రవక్త) దృష్టి తప్పిపోనూ లేదు మరియు హద్దుదాటి కూడా పోలేదు.
Necm 53:18
వాస్తవంగా, అతను (ముహమ్మద్) తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను (ఆయాత్ లను) చూశాడు.[1]
———
[1] ఆ సూచనలు, జిబ్రీల్ ('అ.స.) ను నిజరూపంలో చూసింది, సిద్రతుల్-మున్ తహాను చూసింది. మరియు ఇతర విషయాలసు చూసింది. అవి 'హదీస్'లలో పేర్కొనబడ్డాయి. వివరాలకు చూడండి, 17:1 మరియు 7:187-188.
Necm 53:19
మీరు, అల్ లాత్ మరియు అల్ ఉజ్జాను గురించి ఆలోచించారా?[1]
———
[1] ర'అయ్ తుమ్: అంటే అసలు అర్థం: 'చూశారా?' అని. కాని ఇక్కడ దాని అర్థం 'ఆలోచించారా?' లేక 'గమనించారా?' ఖుర్ఆన్ లో ఈ పదం ఈ అర్థంలో చాలా సార్లు ఉపయోగించబడింది. ఇతర అర్థాలు యోచించు, అనుకొను, భావించు, తలచు, అభిప్రాయపడు, మొదలైనవి.
Necm 53:20
మరియు మూడవదీ చివరిది అయిన మనాత్ ను (గురించి కూడా)?[1]
———
[1] చూఅంటే వారి శక్తి ఏమిటి? అవి మీకేమైనా మేలు గానీ, కీడు గానీ చేయగలవా? ఏమైనా సృష్టించగలవా? అవి తమకు తామే సహాయం చేసుకోలేవు మరి మీకెలా సహాయం చేయగలవు. ఇక్కడ ఆ కాలపు కేవలం మూడు విగ్రహాల పేర్లే పేర్కొనబడ్డాయి.
Necm 53:21
మీ కొరకైతే కుమారులు మరియు ఆయన కొరకు కుమార్తెలా?[1]
———
[1] ఆడపిల్లలంటే ఆ కాలపు 'అరబ్బులతో ఉన్న అసహ్యానికి చూడండి, 16:57-59, 62.
Necm 53:22
ఇది అన్యాయమైన విభజన కాదా!
Necm 53:23
ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. వారు, కేవలం తమ ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు.[1] వాస్తవానికి వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది!
———
[1] చూడండి, 12:40.
Necm 53:24
ఏమిటి? మానవునికి తాను కోరినదంతా లభిస్తుందా?
Necm 53:25
వాస్తవానికి, అంతిమ (పరలోకం) మరియు ప్రథమం (ఇహలోకం) అన్నీ అల్లాహ్ కే చెందినవి.
Necm 53:26
మరియు ఆకాశాలలో ఎందరో దేవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం పనికిరాదు; అల్లాహ్ ఎవరి పట్లనైతే ప్రసన్నుడై, తన ఇష్టంతో వారికి అనుమతిస్తేనే తప్ప![1]
———
[1] మనోవాంఛలు అంటే, ఆ దేవతలు తమ కొరకు అల్లాహ్ (సు.తా.) దగ్గర సిఫారసు చేస్తారని భావించటం.
Necm 53:27
నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో! వారే దేవదూతలను స్త్రీల పేర్లతో పిలుస్తారు;
Necm 53:28
ఈ విషయం గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం తమ ఊహలనే అనుసరిస్తున్నారు. కాని వాస్తవానికి, ఊహ సత్యానికి ఏ మాత్రం బదులు కాజాలదు.
Necm 53:29
కావున, మా హితబోధ (ఖుర్ఆన్) నుండి ముఖం త్రిప్పుకొని ఇహలోక జీవితం తప్ప మరేమీ కోరని వ్యక్తిని నీవు పట్టించుకోకు,
Necm 53:30
ఇదే వారి జ్ఞానపరిధి. నిశ్చయంగా, నీ ప్రభువుకు, ఆయన మార్గం నుండి ఎవడు తప్పిపోయాడో తెలుసు. మరియు ఎవడు సన్మార్గంలో ఉన్నాడో కూడా, ఆయనకు బాగా తెలుసు.
Necm 53:31
మరియు ఆకాశాలలో నున్నది మరియు భూమిలో నున్నది, అంతా అల్లాహ్ కే చెందుతుంది. దుష్టులకు వారి కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి మరియు సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి.[1]
———
[1] సత్కార్యాలకు ఎన్నో రెట్లు ప్రతిఫలమివ్వబడుతుంది. కాని పాపాలకు మాత్రం సమాన శిక్షయే విధించబడుతుంది. చూడండి, 6:160.
Necm 53:32
ఎవరైతే చిన్న చిన్న తప్పులు తప్ప, పెద్ద పాపాల నుండి[1] మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారి కొరకు, నిశ్చయంగా, నీ ప్రభువు క్షమాపణ పరిధి చాలా విశాలమైనది. మిమ్మల్ని మట్టి నుండి సృష్టించినప్పటి నుండి మరియు మీ తల్లుల గర్భాలలో పిండాలుగా[2] ఉన్నప్పటి నుండి కూడా, ఆయనకు మీ గురించి బాగా తెలుసు. కావున మీరు మీ పవిత్రతను గురించి (గొప్పలు) చెప్పుకోకండి.[3] ఎవడు భయభక్తులు గలవాడో ఆయనకు బాగా తెలుసు.
———
[1] పెద్దపాపాల వివరణ విషయంలో విద్వాంసుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. చాలా మంది విద్వాంసుల దృష్టిలో నరకశిక్ష సూచించబడిన పాపాలు పెద్దవి లేక ఖుర్ఆన్ మరియు 'హదీస్'లో గట్టిగా వారించబడినవి కూడా! అలాగే చిన్న పాపాలు మళ్ళీ మళ్ళీ చేయటం కూడా పెద్ద పాపమే.
ఫవా'హిషున్, ఫా'హిషతున్ యొక్క బహువచనం. అంటే సిగ్గుమాలిన పనులు ఉదా: 'జినా మరియు లవా'తత్. ఎవరైతే పెద్ద పాపాల నుండి మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారికి క్షమాభిక్ష దొరకవచ్చు అని ఈ ఆయత్ లో చెప్పబడింది.
[2] అజిన్నతున్-జనీనున్ యొక్క బహువచనం అంటే తల్లిగర్భంలో ఉండే పిండం. అది ఇతరులకు కనిపించదు. కనుక దాన్ని ఆ విధంగా అంటారు.
[3] చూడండి, 4:49.
Necm 53:33
నీవు (ఇస్లాం నుండి) మరలి పోయే వాడిని చూశావా?
Necm 53:34
మరియు (అల్లాహ్ మార్గంలో) కొంత మాత్రమే ఇచ్చి, చేయి ఆపుకునేవాడిని?
Necm 53:35
అతని వద్ద అగోచర జ్ఞానముందా? అతడు (స్పష్టంగా) చూడటానికి?
Necm 53:36
లేక, మూసా గ్రంథంలో నున్న విషయాలు అతనికి తెలుపబడలేదా?
Necm 53:37
మరియు తన బాధ్యతను నెరవేర్చిన ఇబ్రాహీమ్ విషయము;[1]
———
[1] చూడండి, 2:124.
Necm 53:38
మరియు (పాపాల) భారం మోసే వాడెవడూ ఇతరుల (పాపాల) భారం మోయడని;[1]
———
[1] ఈ ఆయత్ ఖుర్ఆన్ లో ఐదుసార్లు వచ్చింది. 6:164, 17:15, 35:18, 39:7 మరియు ఇక్కడ. ఈ సూరహ్ లో ఖుర్ఆన్ అవతరణలో మొట్ట మొదటి సారి వచ్చింది. ఇది క్రైస్తవుల 'మూలపాపం' అనే సిద్ధాంతాన్ని కూడా ఖండిస్తోంది. రెండవది: 'ఒకని పాపభారాన్ని ఒక ప్రవక్త లేక సన్యాసి భరిస్తాడు' అనే సిద్ధాంతాన్ని కూడా ఖండిస్తోంది. ఉదా: క్రైస్తవుల: 'దైవప్రవక్త 'ఈసా ('అస) మానవజాతి పాపాలను భరిస్తాడు.' అనే సిద్ధాంతం.
Necm 53:39
మరియు మానవునికి తాను చేసిన దాని ఫలితం తప్ప మరొకటి లభించదని;[1]
———
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'కర్మల ఫలితాలు, వాటి కర్తల ఉద్దేశాలను బట్టి నిర్ణయించబడతాయి. ప్రతివాడు తాను బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితమే పొందుతాడు.' (బు'ఖారీ, ముస్లిం, తిర్మి'జీ, అబూ-దావూద్, నసాయి', ఇబ్నె-మాజా, ఇబ్నె-'హంబల్ మరియు ఇతరులు). ఆమాల్ అంటే కర్మలు - మంచివి గానీ, చెడ్డవి గానీ. చేయడమే గాక పలకడం గూడా లెక్కించబడుతుంది. ఒక పని, చేయటమే గాక, బుద్ధిపూర్వకంగా ఒక పని చేయకుండా ఉండటం కూడా కర్మగానే లెక్కించబడుతుంది. అది మంచిపని గానీ లేక చెడ్డ పని గానీ. అదే విధంగా నమ్మకాలను,విశ్వాసాలను ప్రకటించటం కూడా, అవి మూఢనమ్మకాలు గానీ లేదా సత్య విశ్వాసాలు గానీ లెక్కింపబడతాయి. అంటే మానవుడు చేసే ప్రతి పని, పలికే ప్రతి మాట లెక్కించబడుతుందన్న మాట.
Necm 53:40
మరియు నిశ్చయంగా, అతనికి తన కృషి ఫలితమే చూపబడుతుందని;
Necm 53:41
అప్పుడు అతనికి తన కృషికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుందని;
Necm 53:42
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్దనే (ప్రతిదాని) ముగింపు ఉన్నదని;
Necm 53:43
మరియు నిశ్చయంగా, ఆయనే నిన్ను నవ్విస్తున్నాడు మరియు ఏడ్పిస్తున్నాడని;
Necm 53:44
మరియు నిశ్చయంగా, ఆయనే మరణింపజేసేవాడు మరియు జీవితాన్ని ప్రసాదించేవాడని;
Necm 53:45
మరియు నిశ్చయంగా, మగ-ఆడ జంటలను సృష్టించినవాడు ఆయనేనని -
Necm 53:46
విసర్జింపబడిన వీర్యబిందువు నుండి.
Necm 53:47
మరియు నిశ్చయంగా, దానికి మరొక జీవితాన్ని (పునరుత్థానం) ప్రసాదించడం ఆయన (అల్లాహ్) కే చెందినదని;
Necm 53:48
మరియు నిశ్చయంగా, ఆయనే సంపన్నునిగా చేసేవాడు మరియు తృప్తినిచ్చు వాడని;
Necm 53:49
మరియు నిశ్చయంగా ఆయనే అగ్ని[1] నక్షత్రానికి ప్రభువని;
———
[1] అష్-షి'అరా: Sirius, అగ్ని నక్షత్రం. ఇది ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ముష్రిక్ 'అరబ్బులు దీన్ని పూజించేవారు.
Necm 53:50
మరియు నిశ్చయంగా, ఆయనే తొలి ఆద్ జాతిని నాశనం చేసినవాడని;[1]
———
[1] 'ఆద్ జాతివారి గాథకై చూడండి, 7:65-69 వీరు నూ'హ్ జాతివారి తరువాత నాశనం చేయబడ్డవారు.
Necm 53:51
మరియు సమూద్ జాతిని; ఒక్కడూ కూడా లేకుండా రూపుమాపాడని.[1]
———
[1] స'మూద్ జాతివారి గాథకై చూడండి, 7:73 మరియు 26:141-158.
Necm 53:52
మరియు అంతకు పూర్వం నూహ్ జాతి వారిని. నిశ్చయంగా, వారు పరమ దుర్మార్గులు మరియు తలబిరుసులు.
Necm 53:53
మరియు ఆయనే తలక్రిందులైన నగరాలను నాశనం చేశాడు.[1]
———
[1] లూ'త్ ప్రజల నాశనానికై చూడండి, 11:77-83.
Necm 53:54
తరువాత వాటిని క్రమ్ముకొనవలసింది (రాళ్ళ వర్షం) క్రమ్ముకున్నది.
Necm 53:55
అయితే (ఓ మానవుడా!) నీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను గురించి నీవు అనుమానంలో పడి ఉంటావు?[1]
———
[1] చూడండి, 55:13.
Necm 53:56
ఇది వరకు వచ్చిన హెచ్చరిక చేసే వారి వలే ఇతను (ముహమ్మద్) కూడా హెచ్చరిక చేసేవాడు మాత్రమే!
Necm 53:57
రానున్న ఘడియ (పునరుత్థాన దినం) సమీపంలోనే వుంది.
Necm 53:58
అల్లాహ్ తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు.
Necm 53:59
ఏమీ? మీరు ఈ సందేశాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారా?
Necm 53:60
మరియు మీరు నవ్వుతున్నారా?మరియు మీకు ఏడ్పు రావటం లేదా?
Necm 53:61
మరియు మీరు నిర్లక్ష్యంలో మునిగి ఉన్నారు.[1]
———
[1] లేక: 'ఆటపాటల్లో మునిగి ఉన్నారా?'
Necm 53:62
కావున! అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి. మరియు (ఆయనను మాత్రమే) ఆరాధించండి![1]
———
[1] ఈ ఆజ్ఞను పాటిస్తూ దైవప్రవక్త ('స'అస) సజ్దా చేశారు. అతనితోబాటు 'స'హాబా(ర'ది.'అన్హుమ్) లు మరియు అక్కడున్న ముష్రికులు కూడా సజ్దా చేశారు.
Kamer 54:1
ఆ ఘడియ దగ్గరకు వచ్చింది మరియు చంద్రుడు పూర్తిగా చీలిపోయాడు.[1]
———
[1] ఈ అద్భుత నిదర్శనం, మక్కావాసుల కోరికపై దైవప్రవక్త ('స'అస) చూపించారు. ('స. ముస్లిం)
Kamer 54:2
అయినా (సత్యతిరస్కారులు), అద్భుత సూచనను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటున్నారు. మరియు: "ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న మంత్రజాలమే." అని అంటున్నారు.
Kamer 54:3
మరియు వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని తిరస్కరించారు. మరియు తమ మనోవాంఛలను అనుసరించారు. మరియు ప్రతి వ్యవహారం ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది.[1]
———
[1] ప్రతి కార్యానికి పర్యవసానం ఉంది. అంటే మంచికి మంచి ప్రతిఫలం మరియు చెడుకు శిక్ష. ఈ ప్రతిఫలం ఈ లోకంలోనే లభించవచ్చు లేనిచో పరలోకంలో తప్పకుండా లభిస్తుంది.
Kamer 54:4
మరియు వాస్తవానికి, వారి వద్దకు సమాచారాలు వచ్చాయి. అందు వారికి మందలింపులు ఉండేవి.
Kamer 54:5
కావలసినంత వివేకమూ ఉండేది. కాని ఆ హెచ్చరికలు వారికి ప్రయోజనకరం కాలేదు.
Kamer 54:6
కావున (ఓ ముహమ్మద్!) నీవు వారి నుండి మరలిపో! పిలిచేవాడు భయంకరమైన ఒక విషయం వైపునకు పిలిచే రోజున;
Kamer 54:7
వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, వారు చెల్లాచెదురైన మిడతల వలే, తమ గోరీల నుండి లేచి బయటికి వస్తారు;
Kamer 54:8
వేగంగా పిలిచేవాని వైపునకు! సత్యతిరస్కారులు: "ఇది చాలా కఠినమైన రోజు." అని అంటారు.
Kamer 54:9
వారికి పూర్వం నూహ్[1] జాతి వారు (తమ ప్రవక్తను) అసత్యవాదుడని తిరస్కరించి ఉన్నారు, అప్పుడు వారు మా దాసుణ్ణి: "అసత్యవాది!" అని అన్నారు. మరియు : "ఇతడు పిచ్చివాడు" అని అన్నారు. మరియు అతను కసిరికొట్టబడ్డాడు.
———
[1] నూ'హ్ గాథ కోసం చూడండి, 11:25-48 మరియు 26:116.
Kamer 54:10
అప్పుడతను తన ప్రభువును ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా నేను ఓడిపోయాను కావున నాకు సహాయం చేయి!"
Kamer 54:11
అప్పుడు మేము ఆకాశపు ద్వారాలు తెరిచి కుంభవర్షాన్ని కురిపించాము.
Kamer 54:12
మరియు భూమి నుండి ఊటలను పొంగింపజేశాము అపుడు నిర్ణీత కార్యానికి గాను నీళ్ళన్నీ కలిసి పోయాయి.
Kamer 54:13
మరియు మేము అతనిని (నూహ్ ను) పలకలు మరియు మేకులు గల దాని (ఓడపై) ఎక్కించాము.
Kamer 54:14
అది మా కన్నుల ముందు తేలియాడుతూ పోయింది. (తన జాతి వారి చేత) తిరస్కరించబడిన వానికి ప్రతిఫలంగా!
Kamer 54:15
మరియు వాస్తవానికి మేము దానిని (ఆ ఓడను) ఒక సూచనగా చేసి వదలి పెట్టాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?[1]
———
[1] ముద్దకిర్: ఈ పదం అసలు రూపం, 'మజ్'తకిర్'. అంటే హితబోధ స్వీకరించేవాడని అర్థం. (ఫత్హ్' అల్-ఖదీర్) చూడండి, 36:41-42.
Kamer 54:16
చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?
Kamer 54:17
మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము. అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?
Kamer 54:18
ఆద్ జాతి సత్యాన్ని తిరస్కరించింది. చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?
Kamer 54:19
నిశ్చయంగా, మేము పూర్తిగా దురదృష్టకరమైన (అరిష్టదాయకమైన) ఒక రోజున, తీవ్రమైన ఎడతెగని తుఫాను గాలిని పంపాము.[1]
———
[1] ఆ 'తుఫాను గాలి ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళు ఎడతెగకుండా వీచింది. ఆ విధంగా ఆ దినాలు, ఆ సత్య తిరస్కారులకు అశుభకరంగా పరిణమించాయి. అంతేగాని విశ్వాసులకు ఏ దినమూ అశుభం కాదు. ఏ దినాన్ని గూడా ఈ ప్రత్యేక దినం అశుభమైనదని అనటం తప్పు. వారంలోని ఏడు దినాలూ మంచివే.
Kamer 54:20
అది ప్రజలను వేర్లతో పెళ్ళగింపబడిన ఖర్జూరపు చెట్ల వలే పెళ్ళగించి వేసింది.[1]
———
[1] చూడండి, 69:6-8.
Kamer 54:21
ఇక చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?
Kamer 54:22
మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము, అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?
Kamer 54:23
సమూద్ జాతి హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది.
Kamer 54:24
అప్పుడు వారు ఇలా అన్నారు: "ఏమీ? మాలోని ఒక వ్యక్తిని, ఒంటరివాడిని, మేము అనుసరించాలా? అలా అయితే నిశ్చయంగా, మేము మార్గభ్రష్టులం మరియు పిచ్చివారం అయినట్లే కదా?"
Kamer 54:25
"ఏమీ? మా అందరిలో, కేవలం అతని మీదనే (దివ్య) సందేశం పంపబడిందా? అలా కాదు! అసలు అతను అసత్యవాది, డంబాలు పలికేవాడు!"
Kamer 54:26
అసత్యవాది, డంబాలు పలికేవాడు! ఎవడో రేపే (త్వరలోనే) వారికి తెలిసిపోతుంది!
Kamer 54:27
నిశ్చయంగా, మేము ఆడ ఒంటెను, వారిని పరీక్షించటం కోసం పంపుతున్నాము, కావున (ఓ సాలిహ్!) వారి విషయంలో వేచి ఉండు మరియు సహనం వహించు!
Kamer 54:28
మరియు వారి మధ్య నీరు (న్యాయంగా) పంచబడాలని వారికి బోధించు. ప్రతి ఒక్కరూ తమ వంతు వచ్చే రోజునే త్రాగాలని నియమించబడింది.[1]
———
[1] చూడండి, 26:155 23. ఒక రోజు ఒంటెను నీరు త్రాగనివ్వాలి, రెండవ రోజు ప్రజలు త్రాగాలి.
Kamer 54:29
ఆ పిదప వారు తమ సహచరుణ్ణి పిలిచారు. వాడు దాన్ని పట్టుకొని (దాని వెనుక కాలి మోకాలి నరాలు కోసి) చంపాడు.[1]
———
[1] చూడండి, 7:77.F4881
Kamer 54:30
అప్పుడు చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?
Kamer 54:31
నిశ్చయంగా, మేము వారి మీదకు ఒక భయంకరమైన శబ్దాన్ని (సయ్ హాను) పంపాము, దాంతో వారు త్రొక్క బడిన పశువుల దొడ్డి కంచె వలే నుగ్గునుగ్గు అయి పోయారు.
Kamer 54:32
మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటానికి సులభం చేశాము. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?
Kamer 54:33
లూత్ జాతి కూడా హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది.
Kamer 54:34
నిశ్చయంగా, మేము లూత్ ఇంటివారు తప్ప! ఇతరుల మీదికి రాళ్ళు విసిరే తుఫాన్ గాలిని పంపాము. (లూత్ ఇంటి) వారిని మేము వేకువ ఝామున రక్షించాము;[1]
———
[1] ఆల-లూ'తున్: అంటే అతనితో సహా అతని ఇద్దరు కూతుళ్ళు మరియు కొందరు అతని అనుచరులు. అతని భార్య సత్యతిరస్కారులలో చేరిపోయింది. ఈ గాథ వివరాల కోసం చూడండి, 11:69-83.
Kamer 54:35
మా తరఫు నుండి అనుగ్రహంగా. ఈ విధంగా మేము కృతజ్ఞులకు ప్రతిఫలం ఇస్తాము.
Kamer 54:36
మరియు వాస్తవానికి (లూత్ తన జాతి) వారిని మా రాబోయే శిక్షను గురించి హెచ్చరించాడు. కాని వారు మా హెచ్చరికలను సందేహించి (మొండి) వాదనలకు దిగారు!
Kamer 54:37
మరియు వాస్తవానికి వారు అతని అతిథులను[1] అతని నుండి బలవంతంగా లాక్కోవాలని అనుకున్నారు. కావున మేము వారి కళ్ళను పోగొట్టాము. (వారితో ఇలా అన్నాము): "ఇప్పుడు నా శిక్షను మరియు నా హెచ్చరికను చవి చూడండి."
———
[1] చూవారు జిబ్రీల్ మీకాయీ'ల్ మరియు ఇస్రాఫీల్ ('అలైహిమ్ స.) లు. చూడండి, 11:77-79.
Kamer 54:38
మరియు వాస్తవానికి, ఉదయపు వేళ శాశ్వతమైన శిక్ష వారి మీద పడింది:
Kamer 54:39
"ఇప్పుడు మీరు నా శిక్షను మరియు నా హెచ్చరికలను చవి చూడండి."
Kamer 54:40
మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటానికి సులభం చేశాము. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?
Kamer 54:41
మరియు వాస్తవానికి ఫిర్ఔన్ జాతి వారికి కూడా హెచ్చరికలు వచ్చాయి.
Kamer 54:42
వారు మా సూచనలను అన్నిటినీ అబద్ధాలని తిరస్కరించారు, కావున మేము వారిని పట్టుకున్నాము, సర్వశక్తిమంతుడు సర్వసమర్ధుడు పట్టుకునే విధంగా!
Kamer 54:43
(ఓ ఖురేషులారా!) ఏమీ? మీ సత్యతిరస్కారులు మీకు పూర్వం గడిచిన వారి కంటే శ్రేష్ఠులా? లేక దివ్యగ్రంథాలలో మీ కొరకు (మా శిక్ష నుండి) ఏదైనా మినహాయింపు వ్రాయబడి ఉందా?
Kamer 54:44
లేక వారు: "మాది ఒక శక్తిగల వర్గం, (కావున) మేము ప్రాబల్యం పొందగలం" అని అంటున్నారా?
Kamer 54:45
కాని త్వరలోనే ఈ శక్తిగల వర్గం పరాజయం పొందగలదు. మరియు వారు వెన్నుచూపి పారిపోతారు.[1]
———
[1] దైవప్రవక్త ('స'అస) ఈ ఆయత్ ను బద్ర్ యుద్ధ ఆరంభంలో చదివారు.
Kamer 54:46
అంతేకాదు! అంతిమ ఘడియయే, వారి వాగ్దాన సమయం మరియు ఆ ఘడియ ఎంతో దారుణమైనది మరియు ఎంతో తీవ్రమైనదీను (చేదైనదీను).
Kamer 54:47
నిశ్చయంగా, పాపాత్ములు మార్గభ్రష్టత్వంలో ఉన్నారు మరియు వారు (పరలోకంలో) నరకాగ్నిలో కాలుతారు.
Kamer 54:48
ఆ రోజు వారు తమ ముఖాల మీద నరకాగ్ని లోకి ఈడ్చబడతారు; (వారితో):"నరకాగ్ని స్పర్శను చవి చూడండి!" అని అనబడుతుంది.[1]
———
[1] చూడండి, 33:66 మరియు 25:34.
Kamer 54:49
నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్) తో సృష్టించాము.[1]
———
[1] అహ్లెసున్నత్ వల్-జమా'అత్ విద్వాంసులు ఈ ఆయత్ మరియు ఇటువంటి ఆయత్ ల ఆధారంగా అంటారు. అల్లాహ్ (సు.తా.)కు మానవులను సృష్టించక ముందే వారికి సంబంధించిన అన్ని విషయాల జ్ఞానముంది, కావున ఆయన అందరి 'ఖద్ర్', Destiny, విధి, అంటే విధివ్రాత నియమం లేక అదృష్టం ముందే వ్రాసి పెట్టాడు. (ఇబ్నె-కసీ'ర్).
Kamer 54:50
మరియు మా ఆజ్ఞ కేవలం ఒక్కటే చాలు, కనురెప్పపాటుది, (అది అయిపోతుంది).[1]
———
[1] అల్లాహ్ (సు.తా.) ఏదైనా చేయాలనుకుంటే, దానిని: 'అయిపో!' అంటాడు. అంతే అది అయిపోతుంది. చూడండి, 2:117, 3:47, 59, 6:73, 16:40, 19:35, 36:8240:68.
Kamer 54:51
మరియు వాస్తవానికి, మేము మీ వంటి వారిని, ఎందరినో నాశనం చేశాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?
Kamer 54:52
మరియు వారు చేసిన ప్రతి విషయం వారి కర్మ గ్రంథాలలో (చిట్టాలలో) వ్రాయబడి ఉంది.[1]
———
[1] చూలేక లౌ'హె మ'హ్-ఫూ''జ్ లో వ్రాయబడి ఉన్నది.
Kamer 54:53
మరియు ప్రతి చిన్న మరియు ప్రతి పెద్ద విషయం అన్నీ వ్రాయబడి ఉన్నాయి.[1]
———
[1] అంటే మానవుల కర్మలూ, మాటలూ, అన్నీ వ్రాయబడి ఉన్నాయి చిన్నవి గానీ పెద్దవి గానీ, మంచివి గానీ చెడ్డవి గానీ!
Kamer 54:54
నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో సెలయేళ్ళ దగ్గర ఉంటారు.
Kamer 54:55
సత్యపీఠం మీద,[1] విశ్వసామ్రాట్టు,[2] సర్వసమర్ధుని సన్నిధిలో.
———
[1] మఖ్'అది 'సిద్ ఖిన్: గౌరవప్రదమైన స్థానంలో - అంటే స్వర్గం.
[2] చూడండి, 20:114 వ్యాఖ్యానం 3
Rahman 55:1
అనంత కరుణామయుడు (అల్లాహ్)!
Rahman 55:2
ఆయనే ఈ ఖుర్ఆన్ ను నేర్పాడు.[1]
———
[1] ఇది మక్కా ముష్రికులకు ఇవ్వబడిన జవాబు. ఎందుకంటే వారు, దైవప్రవక్త (సఅస) మీద, ఈ ఖుర్ఆన్ ను అతనికి ఒక మానవుడు నేర్పాడు అనే అపనింద మోపారు. కాని వాస్తవానికి అల్లాహ్ (సు.తా.) దీనిని తన సందేశహరునికి నేర్పాడు మరియు అతను తమ అనుచరులకు (ర'ది.'అన్హుమ్) నేర్పారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
Rahman 55:3
ఆయనే మానవుణ్ణి సృష్టించాడు.
Rahman 55:4
ఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు.
Rahman 55:5
సూర్యుడు మరియు చంద్రుడు ఒక నియమిత గమనాన్ని (నియమిత పరిధిలో) అనుసరిస్తున్నారు.
Rahman 55:6
మరియు నక్షత్రాలు మరియు వృక్షాలు అన్నీ ఆయనకు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటాయి.[1]
———
[1] చూడండి, 22:18.
Rahman 55:7
మరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు.[1]
———
[1] అంటే ప్రపంచంలో న్యాయాన్ని నెలకొల్పాడు, చూడండి, 57:25, 42:17.
Rahman 55:8
తద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడకూడదని![1]
———
[1] అంటే న్యాయానికి విరుద్ధంగా పోకండి, న్యాయాన్ని భంగపరచకండి.
Rahman 55:9
మరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి.
Rahman 55:10
మరియు ఆయన, భూమిని సకల జీవరాసుల కొరకు ఉంచాడు.
Rahman 55:11
అందులో రకరకాల ఫలాలు మరియు పొరలలో (పుష్పకోశాలలో) ఉండే ఖర్జూర పండ్లు ఉన్నాయి.
Rahman 55:12
మరియు దంట్లపై (పొరలలో చుట్టబడి)[1] ఉన్న ధాన్యం మరియు సుగంధ పుష్పాలు కూడా!
———
[1] అల్-'అ'స్ఫు: అంటే ఎండిన గడ్డి, గడ్డి పరక, పొట్టు, ఊక, పొర, ధాన్యపు దంట్లు ఎండిపోయిన తరువాత 'అ'స్ఫుగా మారిపోతాయి. దానిని పశువులు తింటాయి.
Rahman 55:13
అయితే మీరిరువురు (మానవులు మరియు జిన్నాతులు) మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:14
ఆయన మానవుణ్ణి పెంకులాంటి శబ్దమిచ్చే మట్టితో[1] సృష్టించాడు.
———
[1] 'సల్-'సాలిన్: అంటే ఎండిన మట్టి. ఫ'ఖ్ఖారున్: అంటే మంటలో కాలిన మట్టి. ఇంకా చూడండి, 15:26.
Rahman 55:15
మరియు జిన్నాతులను అగ్నిజ్వాలలతో సృష్టించాడు.[1]
———
[1] చూడండి, 15:27, 6:100 మరియు 37:158.
Rahman 55:16
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:17
ఆయనే రెండు తూర్పు (దిక్కు)లకు మరియు రెండు పడమర (దిక్కు)లకు ప్రభువు.[1]
———
[1] చూడండి, 37:5 మరియు 70:40.
Rahman 55:18
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:19
ఆయనే రెండు సముద్రాలను కలుసుకోవటానికి వదలిపెట్టాడు.
Rahman 55:20
ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డు తెర వుంది.[1]
———
[1] చూఈ విషయం ఎన్నో విధాలుగా బోధించబడింది: 1) భూమిపై మంచి నీళ్ళ నదులు, చెరువులు సరస్సులు మొదలైనవి మరియు ఉప్పునీటి సముద్రాలు, అన్నీ భూమి మీదనే ఉన్నా, వాటి రుచులు వేరువేరుగా ఉన్నాయి. 2) ఉప్పునీటి సముద్రాలలో మంచినీటి ప్రవాహాలు ప్రవహిస్తూ ఉంటాయి. కాని అవి కలిసిపోవు. వాటి రుచి, భిన్నంగానే ఉంటుంది. 3) మరికొన్ని చోట్లలో నదుల నీరు సముద్రంలో పోయి కలుస్తుంది. చాలా దూరం వరకు ఒకవైపు సముద్రపు నీళ్ళు ఉప్పగానూ మరొక వైపు నది నీళ్ళు తియ్యగాను ఉంటాయి. ఇంకా చూడండి, 25:53.
Rahman 55:21
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:22
ఆ రెండింటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి.
Rahman 55:23
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:24
మరియు ఎత్తైన కొండల వలే సముద్రంలో పయనించే ఓడలు ఆయనకు చెందినవే![1]
———
[1] చూడండి, 42:32-34.
Rahman 55:25
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:26
దానిపై (భూమిపై) నున్నది ప్రతిదీ నశిస్తుంది.
Rahman 55:27
మరియు మిగిలివుండేది, కేవలం మహిమాన్వితుడు[1] మరియు పరమదాత[2] అయిన నీ ప్రభువు ముఖం (ఉనికి) మాత్రమే![3]
———
[1] జు'ల్-జలాల్: Majesty, Possessor of Glory, Greatness మహిమాన్వితుడు, ఘనత, వైభవం, విఖ్యాతి, ప్రతాపం గలవాడు, సార్వభౌముడు.
[2] అల్-ఇక్రామ్: Most Generous, Bountenous, Noble, Honourable పరమదాత, దాతృత్వుడు, ఆదరణీయుడు, మహోపకారి, ఉదారుడు, దివ్యుడు, చూడండి, 55:78.
జల్-జలాలి వల్-ఇక్రామ్: మహిమాన్వితుడు మరియు పరమదాత Lord of Majesty and Generosity ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
[3] చూడండి, 28:88.
Rahman 55:28
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:29
భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు.
Rahman 55:30
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:31
భారాలను మోసే మీరిద్దరు![1] త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము.
———
[1] అస్-స'ఖలాన్: దీని మరొక తాత్పర్యం: 'భూమికి భారమైన మీరిద్దరు!' అని ఇవ్వబడింది. ఈ పదం జిన్నాతులు మరియు మానవుల కోసం వాడబడింది.
Rahman 55:32
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:33
ఓ జిన్నాతుల మరియు మానవ జాతి వారలారా! ఒకవేళ మీరు ఆకాశాల మరియు భూమి యొక్క సరిహద్దుల నుండి బయటికి వెళ్ళి పోగలిగితే, వెళ్ళిపోండి! ఆయన (అల్లాహ్) యొక్క సెలవు లేనిదే మీరు వాటి నుండి వెళ్ళి పోలేరు.[1]
———
[1] అల్లాహ్ (సు.తా.) యొక్క విధివ్రాత నుండి పారిపోగల శక్తి ఎవ్వరికీ లేదు. ఎక్కడికి పారిపోగలరు? అల్లాహ్ (సు.తా.) హద్దులలో లేని చోటు అనేదే లేదు!
Rahman 55:34
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:35
మీ ఇద్దరి పైకి అగ్నిజ్వాలలు మరియు పొగ[1] పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు).
———
[1] ను'హాసున్: దీని మరొక అర్థం కరిగిన రాగి లేక ఇత్తడి.
Rahman 55:36
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:37
మరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండే నూనెగా ఎర్రగా మారిపోతుంది.[1]
———
[1] అద్దిహాను: దీని మరొక అర్థం ఎర్రని చర్మం (పచ్చిది లేదా శుభ్రం చేసింది).
Rahman 55:38
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:39
ఇక, ఆ రోజు ఏ మానవునితో గానీ, లేక ఏ జిన్నాతునితో గానీ అతని పాపాలను గురించి అడగడం జరుగదు.[1]
———
[1] చూడండి, 18:49. వారి నాలుకలు, చేతులు మరియు కాళ్ళు వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. ఇంకా చూడండి, 24:24.
Rahman 55:40
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:41
ఈ నేరస్తులు వారి వారి ముఖ చిహ్నాలతోనే గుర్తింపబడతారు. అప్పుడు వారు, వారి ముంగురులు మరియు కాళ్ళు పట్టి లాగబడతారు.[1]
———
[1] చూడండి, 96:15-16.
Rahman 55:42
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:43
ఈ నేరస్తులు అసత్యమని తిరస్కరిస్తూ వుండిన నరకం ఇదే!
Rahman 55:44
వారి దానిలో (ఆ నరకంలో) మరియు సలసల కాగే నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.
Rahman 55:45
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:46
మరియు ఎవడైతే తన ప్రభువు సన్నధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గవనాలుంటాయి.
Rahman 55:47
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:48
అవి రెండూ అనేక శాఖల (వృక్షాల)తో నిండి ఉంటాయి.[1]
———
[1] చూడండి, 32:17. స్వర్గంలో ఉన్న భోగభాగ్యాలు ఎవ్వరూ ఊహించలేరు.
Rahman 55:49
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:50
ఆ రెండింటిలో రెండు సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.[1]
———
[1] ఒక సెలయేరు పేరు తస్ నీమ్, మరొక దాని పేరు సల్ సబీల్.
Rahman 55:51
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:52
ఆ రెండింటిలో ప్రతి ఫలం జోడుగా (రెండు రకాలుగా) ఉంటుంది.
Rahman 55:53
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:54
వారు జరీ పని అస్తరుగల పట్టు తివాచీల మీద ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు ఆ రెండు స్వర్గవనాల ఫలాలు దగ్గరగా అందుబాటులో ఉంటాయి.[1]
———
[1] చూడండి, 18:31.
Rahman 55:55
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:56
అందులో తమ దృష్టి ఎల్లప్పుడూ క్రిందికి వంచి ఉంచే నిర్మల కన్యలుంటారు. వారిని ఇంతకు పూర్వం ఏ మానవుడు గానీ, ఏ జిన్నాతు గానీ తాకి ఉండడు.[1]
———
[1] చూడండి, 56:35-36, 38:52.
Rahman 55:57
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:58
వారు కెంపులను (మాణిక్యాలను) మరియు పగడాలను పోలి ఉంటారు.
Rahman 55:59
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:60
సత్కార్యానికి మంచి ప్రతిఫలం తప్ప మరేమైనా ఉంటుందా?
Rahman 55:61
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:62
మరియు ఆ రెండే కాక ఇంకా రెండు స్వర్గవనాలుంటాయి.
Rahman 55:63
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:64
అవి దట్టంగా ముదరు పచ్చగా ఉంటాయి.
Rahman 55:65
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:66
ఆ రెండు తోటలలో పొంగి ప్రవహించే రెండు చెలమలుంటాయి.
Rahman 55:67
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:68
ఆ రెండింటిలో ఫలాలు, ఖర్జూరాలు మరియు దానిమ్మలు ఉంటాయి.
Rahman 55:69
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:70
వాటిలో గుణవంతులు, సౌందర్యవతులైన స్త్రీలు ఉంటారు.
Rahman 55:71
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:72
నిర్మలమైన, శీలవంతులైన స్త్రీలు (హూర్) డేరాలలో ఉంటారు.[1]
———
[1] చూడండి, 55:56, 52:20, 44:54, 38:52 మరియు 37:48.
Rahman 55:73
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:74
ఆ స్త్రీలను ఇంతకు ముందు ఏ మానవుడు కాని, ఏ జిన్నాతు కాని తాకి ఉండడు.
Rahman 55:75
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
Rahman 55:76
వారు అందమైన తివాచీల మీద ఆకుపచ్చని దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.
Rahman 55:77
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?[1]
———
[1] ఈ ఆయత్ ఈ సూరహ్ లో 31 సార్లు వచ్చింది. అల్లాహ్ (సు.తా.) ఈ సూరహ్ లో స్వర్గంలో ప్రసాదించబడే అన్ని రకాల సౌకర్యాలను, భోగభాగ్యాలను వివరించిన తరువాత ఈ ప్రశ్న వేశాడు. అంకే కాక నరక శిక్ష తరువాత కూడా ఈ ప్రశ్న వేశాడు. అంటే మీరు దాని నుండి ఎందుకు తప్పించుకోవటానికి ప్రయత్నించరు? అని అర్థం. రెండవది: ఏమిటంటే, జిన్నాతులు కూడా మానవుల వలే బుద్ధి మరియు మంచి చెడును అర్థం చేసుకునే విచక్షణాశక్తి కలిగి ఉన్నారు. కావున వారు కూడా ఏక దైవారాధన చేయటానికి ఆజ్ఞాపించబడ్డారు. సర్వసృష్టిలో కేవలం ఈ రెండురకాల జీవులు మాత్రమే - బుద్ధి మరియు విచక్షణాశక్తి ప్రసాదించబడటం వల్ల - పరీక్షకు గురిచేయబడ్డారు. అందులో నెగ్గిన వారికి స్వర్గం మరియు నెగ్గని వారికి నరకం. మూడవది: అల్లాహ్ (సు.తా.) ప్రసాదించిన సుఖసంతోషాలను అనుభవించటం ముస్త'హాబ్. ఈ ఆయత్ మళ్ళీ మళ్ళీ చెప్పే నాలుగవ ఉద్దేశ్యం: అల్లాహ్ కు అవిధేయులై ఉండటం నుండి ఆపటం. ఎందుకంటే ఆయనే (సు.తా.) ఈ అనుగ్రహాలన్నింటినీ ప్రసాదించాడు. కావున దైవప్రవక్త ('స'అస) దీనికి జవాబుగా అన్నారు: 'ఓ మా ప్రభూ! మేము నీ యొక్క ఏ అనుగ్రహాన్ని కూడా నిరాకరించడం లేదు, సర్వస్తోత్రాలకు అర్హుడవు నీవే!'(తిర్మిజీ' - అల్బానీ ప్రమాణీకం).
Rahman 55:78
మహిమాన్వితుడు మరియు పరమ దాత[1] అయిన నీ ప్రభువు పేరే సర్వశ్రేష్ఠమైనది.[2]
———
[1] చూడండి, 55:27 వ్యాఖ్యానం 2.
[2] తబారక, బరకతున్: అంటే ఎల్లప్పుడు శాశ్వతంగా ఉండే మేలు. ఆయన దగ్గర ఎల్లప్పుడు మేలే ఉంది. కొందరు దీని అర్థం, ఎంతో శుభదాయకమైనది, సర్వశ్రేష్ఠమైనది అని అన్నారు. ఆయన పేరే ఇంత శ్రేష్ఠమనదైతే ఆయన స్వయంగా ఎంత గొప్పవాడు, మహిమగలవాడు మరియు శుభాలను ప్రసాదించేవాడు కాగలడు!