Telugu Meal — Mevlânâ Abdürrahîm b. Muhammed — İsra' 17:1 – Enbiya 21:112
Contents
- İsra' 17:1
- İsra' 17:2
- İsra' 17:3
- İsra' 17:4
- İsra' 17:5
- İsra' 17:6
- İsra' 17:7
- İsra' 17:8
- İsra' 17:9
- İsra' 17:10
- İsra' 17:11
- İsra' 17:12
- İsra' 17:13
- İsra' 17:14
- İsra' 17:15
- İsra' 17:16
- İsra' 17:17
- İsra' 17:18
- İsra' 17:19
- İsra' 17:20
- İsra' 17:21
- İsra' 17:22
- İsra' 17:23
- İsra' 17:24
- İsra' 17:25
- İsra' 17:26
- İsra' 17:27
- İsra' 17:28
- İsra' 17:29
- İsra' 17:30
- İsra' 17:31
- İsra' 17:32
- İsra' 17:33
- İsra' 17:34
- İsra' 17:35
- İsra' 17:36
- İsra' 17:37
- İsra' 17:38
- İsra' 17:39
- İsra' 17:40
- İsra' 17:41
- İsra' 17:42
- İsra' 17:43
- İsra' 17:44
- İsra' 17:45
- İsra' 17:46
- İsra' 17:47
- İsra' 17:48
- İsra' 17:49
- İsra' 17:50
- İsra' 17:51
- İsra' 17:52
- İsra' 17:53
- İsra' 17:54
- İsra' 17:55
- İsra' 17:56
- İsra' 17:57
- İsra' 17:58
- İsra' 17:59
- İsra' 17:60
- İsra' 17:61
- İsra' 17:62
- İsra' 17:63
- İsra' 17:64
- İsra' 17:65
- İsra' 17:66
- İsra' 17:67
- İsra' 17:68
- İsra' 17:69
- İsra' 17:70
- İsra' 17:71
- İsra' 17:72
- İsra' 17:73
- İsra' 17:74
- İsra' 17:75
- İsra' 17:76
- İsra' 17:77
- İsra' 17:78
- İsra' 17:79
- İsra' 17:80
- İsra' 17:81
- İsra' 17:82
- İsra' 17:83
- İsra' 17:84
- İsra' 17:85
- İsra' 17:86
- İsra' 17:87
- İsra' 17:88
- İsra' 17:89
- İsra' 17:90
- İsra' 17:91
- İsra' 17:92
- İsra' 17:93
- İsra' 17:94
- İsra' 17:95
- İsra' 17:96
- İsra' 17:97
- İsra' 17:98
- İsra' 17:99
- İsra' 17:100
- İsra' 17:101
- İsra' 17:102
- İsra' 17:103
- İsra' 17:104
- İsra' 17:105
- İsra' 17:106
- İsra' 17:107
- İsra' 17:108
- İsra' 17:109
- İsra' 17:110
- İsra' 17:111
- Kehf 18:1
- Kehf 18:2
- Kehf 18:3
- Kehf 18:4
- Kehf 18:5
- Kehf 18:6
- Kehf 18:7
- Kehf 18:8
- Kehf 18:9
- Kehf 18:10
- Kehf 18:11
- Kehf 18:12
- Kehf 18:13
- Kehf 18:14
- Kehf 18:15
- Kehf 18:16
- Kehf 18:17
- Kehf 18:18
- Kehf 18:19
- Kehf 18:20
- Kehf 18:21
- Kehf 18:22
- Kehf 18:23
- Kehf 18:24
- Kehf 18:25
- Kehf 18:26
- Kehf 18:27
- Kehf 18:28
- Kehf 18:29
- Kehf 18:30
- Kehf 18:31
- Kehf 18:32
- Kehf 18:33
- Kehf 18:34
- Kehf 18:35
- Kehf 18:36
- Kehf 18:37
- Kehf 18:38
- Kehf 18:39
- Kehf 18:40
- Kehf 18:41
- Kehf 18:42
- Kehf 18:43
- Kehf 18:44
- Kehf 18:45
- Kehf 18:46
- Kehf 18:47
- Kehf 18:48
- Kehf 18:49
- Kehf 18:50
- Kehf 18:51
- Kehf 18:52
- Kehf 18:53
- Kehf 18:54
- Kehf 18:55
- Kehf 18:56
- Kehf 18:57
- Kehf 18:58
- Kehf 18:59
- Kehf 18:60
- Kehf 18:61
- Kehf 18:62
- Kehf 18:63
- Kehf 18:64
- Kehf 18:65
- Kehf 18:66
- Kehf 18:67
- Kehf 18:68
- Kehf 18:69
- Kehf 18:70
- Kehf 18:71
- Kehf 18:72
- Kehf 18:73
- Kehf 18:74
- Kehf 18:75
- Kehf 18:76
- Kehf 18:77
- Kehf 18:78
- Kehf 18:79
- Kehf 18:80
- Kehf 18:81
- Kehf 18:82
- Kehf 18:83
- Kehf 18:84
- Kehf 18:85
- Kehf 18:86
- Kehf 18:87
- Kehf 18:88
- Kehf 18:89
- Kehf 18:90
- Kehf 18:91
- Kehf 18:92
- Kehf 18:93
- Kehf 18:94
- Kehf 18:95
- Kehf 18:96
- Kehf 18:97
- Kehf 18:98
- Kehf 18:99
- Kehf 18:100
- Kehf 18:101
- Kehf 18:102
- Kehf 18:103
- Kehf 18:104
- Kehf 18:105
- Kehf 18:106
- Kehf 18:107
- Kehf 18:108
- Kehf 18:109
- Kehf 18:110
- Meryem 19:1
- Meryem 19:2
- Meryem 19:3
- Meryem 19:4
- Meryem 19:5
- Meryem 19:6
- Meryem 19:7
- Meryem 19:8
- Meryem 19:9
- Meryem 19:10
- Meryem 19:11
- Meryem 19:12
- Meryem 19:13
- Meryem 19:14
- Meryem 19:15
- Meryem 19:16
- Meryem 19:17
- Meryem 19:18
- Meryem 19:19
- Meryem 19:20
- Meryem 19:21
- Meryem 19:22
- Meryem 19:23
- Meryem 19:24
- Meryem 19:25
- Meryem 19:26
- Meryem 19:27
- Meryem 19:28
- Meryem 19:29
- Meryem 19:30
- Meryem 19:31
- Meryem 19:32
- Meryem 19:33
- Meryem 19:34
- Meryem 19:35
- Meryem 19:36
- Meryem 19:37
- Meryem 19:38
- Meryem 19:39
- Meryem 19:40
- Meryem 19:41
- Meryem 19:42
- Meryem 19:43
- Meryem 19:44
- Meryem 19:45
- Meryem 19:46
- Meryem 19:47
- Meryem 19:48
- Meryem 19:49
- Meryem 19:50
- Meryem 19:51
- Meryem 19:52
- Meryem 19:53
- Meryem 19:54
- Meryem 19:55
- Meryem 19:56
- Meryem 19:57
- Meryem 19:58
- Meryem 19:59
- Meryem 19:60
- Meryem 19:61
- Meryem 19:62
- Meryem 19:63
- Meryem 19:64
- Meryem 19:65
- Meryem 19:66
- Meryem 19:67
- Meryem 19:68
- Meryem 19:69
- Meryem 19:70
- Meryem 19:71
- Meryem 19:72
- Meryem 19:73
- Meryem 19:74
- Meryem 19:75
- Meryem 19:76
- Meryem 19:77
- Meryem 19:78
- Meryem 19:79
- Meryem 19:80
- Meryem 19:81
- Meryem 19:82
- Meryem 19:83
- Meryem 19:84
- Meryem 19:85
- Meryem 19:86
- Meryem 19:87
- Meryem 19:88
- Meryem 19:89
- Meryem 19:90
- Meryem 19:91
- Meryem 19:92
- Meryem 19:93
- Meryem 19:94
- Meryem 19:95
- Meryem 19:96
- Meryem 19:97
- Meryem 19:98
- Tâhâ 20:1
- Tâhâ 20:2
- Tâhâ 20:3
- Tâhâ 20:4
- Tâhâ 20:5
- Tâhâ 20:6
- Tâhâ 20:7
- Tâhâ 20:8
- Tâhâ 20:9
- Tâhâ 20:10
- Tâhâ 20:11
- Tâhâ 20:12
- Tâhâ 20:13
- Tâhâ 20:14
- Tâhâ 20:15
- Tâhâ 20:16
- Tâhâ 20:17
- Tâhâ 20:18
- Tâhâ 20:19
- Tâhâ 20:20
- Tâhâ 20:21
- Tâhâ 20:22
- Tâhâ 20:23
- Tâhâ 20:24
- Tâhâ 20:25
- Tâhâ 20:26
- Tâhâ 20:27
- Tâhâ 20:28
- Tâhâ 20:29
- Tâhâ 20:30
- Tâhâ 20:31
- Tâhâ 20:32
- Tâhâ 20:33
- Tâhâ 20:34
- Tâhâ 20:35
- Tâhâ 20:36
- Tâhâ 20:37
- Tâhâ 20:38
- Tâhâ 20:39
- Tâhâ 20:40
- Tâhâ 20:41
- Tâhâ 20:42
- Tâhâ 20:43
- Tâhâ 20:44
- Tâhâ 20:45
- Tâhâ 20:46
- Tâhâ 20:47
- Tâhâ 20:48
- Tâhâ 20:49
- Tâhâ 20:50
- Tâhâ 20:51
- Tâhâ 20:52
- Tâhâ 20:53
- Tâhâ 20:54
- Tâhâ 20:55
- Tâhâ 20:56
- Tâhâ 20:57
- Tâhâ 20:58
- Tâhâ 20:59
- Tâhâ 20:60
- Tâhâ 20:61
- Tâhâ 20:62
- Tâhâ 20:63
- Tâhâ 20:64
- Tâhâ 20:65
- Tâhâ 20:66
- Tâhâ 20:67
- Tâhâ 20:68
- Tâhâ 20:69
- Tâhâ 20:70
- Tâhâ 20:71
- Tâhâ 20:72
- Tâhâ 20:73
- Tâhâ 20:74
- Tâhâ 20:75
- Tâhâ 20:76
- Tâhâ 20:77
- Tâhâ 20:78
- Tâhâ 20:79
- Tâhâ 20:80
- Tâhâ 20:81
- Tâhâ 20:82
- Tâhâ 20:83
- Tâhâ 20:84
- Tâhâ 20:85
- Tâhâ 20:86
- Tâhâ 20:87
- Tâhâ 20:88
- Tâhâ 20:89
- Tâhâ 20:90
- Tâhâ 20:91
- Tâhâ 20:92
- Tâhâ 20:93
- Tâhâ 20:94
- Tâhâ 20:95
- Tâhâ 20:96
- Tâhâ 20:97
- Tâhâ 20:98
- Tâhâ 20:99
- Tâhâ 20:100
- Tâhâ 20:101
- Tâhâ 20:102
- Tâhâ 20:103
- Tâhâ 20:104
- Tâhâ 20:105
- Tâhâ 20:106
- Tâhâ 20:107
- Tâhâ 20:108
- Tâhâ 20:109
- Tâhâ 20:110
- Tâhâ 20:111
- Tâhâ 20:112
- Tâhâ 20:113
- Tâhâ 20:114
- Tâhâ 20:115
- Tâhâ 20:116
- Tâhâ 20:117
- Tâhâ 20:118
- Tâhâ 20:119
- Tâhâ 20:120
- Tâhâ 20:121
- Tâhâ 20:122
- Tâhâ 20:123
- Tâhâ 20:124
- Tâhâ 20:125
- Tâhâ 20:126
- Tâhâ 20:127
- Tâhâ 20:128
- Tâhâ 20:129
- Tâhâ 20:130
- Tâhâ 20:131
- Tâhâ 20:132
- Tâhâ 20:133
- Tâhâ 20:134
- Tâhâ 20:135
- Enbiya 21:1
- Enbiya 21:2
- Enbiya 21:3
- Enbiya 21:4
- Enbiya 21:5
- Enbiya 21:6
- Enbiya 21:7
- Enbiya 21:8
- Enbiya 21:9
- Enbiya 21:10
- Enbiya 21:11
- Enbiya 21:12
- Enbiya 21:13
- Enbiya 21:14
- Enbiya 21:15
- Enbiya 21:16
- Enbiya 21:17
- Enbiya 21:18
- Enbiya 21:19
- Enbiya 21:20
- Enbiya 21:21
- Enbiya 21:22
- Enbiya 21:23
- Enbiya 21:24
- Enbiya 21:25
- Enbiya 21:26
- Enbiya 21:27
- Enbiya 21:28
- Enbiya 21:29
- Enbiya 21:30
- Enbiya 21:31
- Enbiya 21:32
- Enbiya 21:33
- Enbiya 21:34
- Enbiya 21:35
- Enbiya 21:36
- Enbiya 21:37
- Enbiya 21:38
- Enbiya 21:39
- Enbiya 21:40
- Enbiya 21:41
- Enbiya 21:42
- Enbiya 21:43
- Enbiya 21:44
- Enbiya 21:45
- Enbiya 21:46
- Enbiya 21:47
- Enbiya 21:48
- Enbiya 21:49
- Enbiya 21:50
- Enbiya 21:51
- Enbiya 21:52
- Enbiya 21:53
- Enbiya 21:54
- Enbiya 21:55
- Enbiya 21:56
- Enbiya 21:57
- Enbiya 21:58
- Enbiya 21:59
- Enbiya 21:60
- Enbiya 21:61
- Enbiya 21:62
- Enbiya 21:63
- Enbiya 21:64
- Enbiya 21:65
- Enbiya 21:66
- Enbiya 21:67
- Enbiya 21:68
- Enbiya 21:69
- Enbiya 21:70
- Enbiya 21:71
- Enbiya 21:72
- Enbiya 21:73
- Enbiya 21:74
- Enbiya 21:75
- Enbiya 21:76
- Enbiya 21:77
- Enbiya 21:78
- Enbiya 21:79
- Enbiya 21:80
- Enbiya 21:81
- Enbiya 21:82
- Enbiya 21:83
- Enbiya 21:84
- Enbiya 21:85
- Enbiya 21:86
- Enbiya 21:87
- Enbiya 21:88
- Enbiya 21:89
- Enbiya 21:90
- Enbiya 21:91
- Enbiya 21:92
- Enbiya 21:93
- Enbiya 21:94
- Enbiya 21:95
- Enbiya 21:96
- Enbiya 21:97
- Enbiya 21:98
- Enbiya 21:99
- Enbiya 21:100
- Enbiya 21:101
- Enbiya 21:102
- Enbiya 21:103
- Enbiya 21:104
- Enbiya 21:105
- Enbiya 21:106
- Enbiya 21:107
- Enbiya 21:108
- Enbiya 21:109
- Enbiya 21:110
- Enbiya 21:111
- Enbiya 21:112
İsra' 17:1
తన దాసుణ్ణి (ముహమ్మద్ ను), మస్జిద్ అల్ హరామ్ (మక్కా ముకర్రమా) నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్ అల్ అఖ్సా (బైతుల్ మఖ్దిస్) వరకు రాత్రి వేళ తీసుకు పోయిన ఆయన (అల్లాహ్) సర్వ లోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను (ఆయాత్ లను) చూపటానికి చేశాము.[1] నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.
———
[1] 'ఈ ప్రయాణాన్ని మేము మా దాసునికి కొన్ని అద్భుత నిదర్శనాలు, సంకేతాలను చూపటానికి చేయించాము.' ఇంత దూరప్రయాణం రాత్రిపూట స్వల్పకాలంలో పూర్తి చేయించడం కూడా ఒక అద్భుత సూచనయే. ఈ ప్రయాణం రెండు భాగాలలో ఉంది. (1) మొదటి భాగం : ఇస్రా' జిబ్రీల్ ('అ.స.) తెచ్చిన బుర్రాఖ్ పై ఎక్కి అతనితో బాటు, మక్కా ముకర్రమా నుండి బైతుల్-మఖ్దిస్ కు రాత్రిపూట పయనించడం, అక్కడ మహాప్రవక్త ('స'అస) సర్వదైవప్రవక్తలకు ('అలైహిమ్ స.) ఇమాముగా నిలిచి నమా'జ్ చేయించడం. (2) రెండో భాగం మే'రాజ్ : అంటే పైకి ఎక్కించబడటం, లేక పైకి తీసుకొని పోబడటం. బైతుల్-మఖ్దిస్ నుండి ఆకాశాలలోనికి, చివరకు సిద్రతుల్ ముంతహా వరకు పోయిన ప్రయామం. అది 'అర్ష్ క్రింది ఏడవ ఆకాశంపై ఉంది. అక్కడ అతనికి ('స'అస) అల్లాహుతా'ఆలా వ'హీ ద్వారా నమా'జ్ మరియు ఇతర ఆదేశాలు ఇచ్చాడు. ఆ విషయాలు 'స'హీ'హ్ 'హదీస్ లలో పేర్కొనబడ్డాయి. మే'రాజ్ గురించి కొంతవరకు సూరహ్ అన్-నజ్మ్ (53) లో కూడ ఉంది. మే'రాజ్ సమయంలో దైవప్రవక్త ('స'అస), ఆకాశాలలో ఇతర ప్రవక్తలతో కలుసుకున్నారు. ఈ ప్రయాణం దైవప్రవక్త పూర్తి చేసింది కలలో కాదు. అతను శారీరకంగా మేల్కొని ఉండి, పూర్తి స్పృహలో ఉన్న స్థితిలో (Bodily, Fully awake and with Full Consciousness and orientation of Mind) చేశారు. ఈ ప్రయాణం అల్లాహుతా'ఆలా ఆజ్ఞతో జరిగింది. అల్లాహ్ (సు.తా.) తాను కోరినది చేస్తాడు. ఇది జరిగిన కాలం మరియు తేదీలలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు రబీ'అ అల్ అవ్వల్ 17 లేక 27వ తేదీలలో అని, మరి కొందరు రజబ్ 27 అని, మరి కొందరు ఇతర నెలలని కూడా అంటారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
İsra' 17:2
మరియు మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము[1] మరియు దానిని ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేసి, దాని ద్వారా ఇలా ఆజ్ఞాపించాము: "నన్ను (అల్లాహ్ ను) తప్ప మరెవ్వరినీ సంరక్షకునిగా (కార్యసాధకునిగా) చేసుకోవద్దు.
———
[1] అల్లాహుతా'ఆలా మూసా ('అ.స.)తో సూటీగా మాట్లాడిన దానికి చూడండి, 4:164, 7:144.
İsra' 17:3
మేము నూహ్ తో బాటు ఓడలో ఎక్కించిన వారి సంతతివారలారా! నిశ్చయంగా అతను (నూహ్) కృతజ్ఞుడైన దాసుడు."
İsra' 17:4
మరియు మేము గ్రంథంలో ఇస్రాయీల్ సంతతి వారిని ఇలా హెచ్చరించాము: "మీరు భువిలో రెండు సార్లు సంక్షోభాన్ని రేకెత్తిస్తారు, మరియు గొప్ప అహంకారాన్ని ప్రదర్శిస్తారు!"
İsra' 17:5
ఇక ఆ రెంటిలో మొదటి వాగ్దానం రాగా మేము మీపై ఘోర యుద్ధనిపుణులైన మా దాసులను పంపాము.[1] వారు మీ గృహాలలోకి దూసుకెళ్ళారు. మరియు ఈ విధంగా మా వాగ్దానం నెరవేర్చబడింది.
———
[1] మొదటి శిక్ష దాదాపు క్రీస్తు శ ఆరంభానికి 600 సంవత్సరాలకు ముందు వచ్చింది. ఇది బాబిలోనియన్ పాలకుడు బ'ఖ్త్ న'స్ర్ ఇస్రాయీ'ల్ సంతతి వారిపై జెరూసలంలో చేసిన దౌర్జన్యం. అతడు ఎంతో మంది యూదులను చంపి మిగిలిన వారిని ఖైదీలుగా, బానిసలుగా చేసుకున్నాడు. ఈ శిక్ష వారు దైవప్రవక్తలను చంపినందుకు మరియు తౌరాత్ ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు పడింది. కొందరి అభిప్రాయంలో ఈ రాజు జాలూత్. ఆ తరువాత 'తాలూత్ సైన్యాధిపత్యంలో ఉన్న దావూద్ ('అ.స.) జాలూత్ ను సంహరించి వారికి విముక్తి కలిగించారు.
İsra' 17:6
ఆ తరువాత మేము మీకు వారిపై మరల ప్రాబల్యం వహించే అవకాశం కలిగించాము. మరియు సంపదతోనూ మరియు సంతానంతోనూ మీకు సహాయం చేశాము మరియు మీ సంఖ్యా బలాన్ని కూడా పెంచాము.
İsra' 17:7
(మరియు మేము అన్నాము): "ఒకవేళ మీరు మేలు చేస్తే అది మీ స్వయం కొరకే మేలు చేసుకున్నట్లు. మరియు ఒకవేళ మీరు కీడు చేస్తే అది మీ కొరకే!" పిదప రెండవ వాగ్దానం రాగా మీ ముఖాలను (మిమ్మల్ని) అవమాన పరచటానికి, మొదటిసారి వారు మస్జిద్ అల్ అఖ్సాలో దూరినట్లు, మరల దూరటానికి మరియు వారికి అందిన ప్రతి దానిని నాశనం చేయటానికి (మీ శత్రువులను మీపైకి పంపాము).[1]
———
[1] రెండవసారి యూదులు అత్యాచారాలు చేశారు. జ'కరియ్యా ('అ.స.)ను చంపారు. ఏసు క్రీస్తును సిలువపై ఎక్కించగోరారు కాని అల్లాహుతా'ఆలా అతనిని సజీవునిగా ఆకాశాలలోకి ఎత్తుకున్నాడు. అప్పుడు అల్లాహుతా'ఆలా రోమన్ పాలకుడు టైటస్ ను వారి పైకి పంపాడు. అతడు జేరూసలంపై దండయాత్ర చేసి యూదులను నాశనం చేశాడు. వారిని ఖైదీలుగా, బానిసలుగా చేసుకున్నాడు. హైకిలె సులేమాన్ ను నాశనం చేశాడు. యూదులను బైతుల్ మ'ఖ్దిస్ నుండి వెళ్ళగొట్టాడు. ఇది దాదాపు క్రీ.శ. 70వ సంవత్సరంలో జరిగింది.
İsra' 17:8
(మరియు తౌరాత్ లో ఇలా అన్నాము): "బహుశా మీ ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని కరుణించవచ్చు! కాని ఒకవేళ మీరు అలాగే ప్రవర్తిస్తే, మేము కూడా తిరిగి అలాగే చేస్తాము. మేము నరకాగ్నిని, సత్యతిరస్కారుల కొరకు చెరసాలగా చేసి ఉంచాము."
İsra' 17:9
నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరైన (సవ్యమైన) మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కార్యాలు చేస్తూ ఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫలముందనే శుభవార్తనూ అందజేస్తుంది;
İsra' 17:10
మరియు నిశ్చయంగా, పరలోకాన్ని విశ్వసించిన వారికి మేము బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచామని (తెలియజేస్తుంది).
İsra' 17:11
మరియు మానవుడు (తెలియక తరచుగా) మేలు కొరకు ఎలా అర్థించాలో, కీడు కొరకు కూడా అలాగే అర్థిస్తాడు. మరియు మానవుడు చాలా తొందరపాటు గలవాడు (ఆత్రగాడు).
İsra' 17:12
మరియు మేము రాత్రింబవళ్ళను రెండు సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనం చేశాము. మరియు పగటి సూచనను - మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు సంవత్సరాల లెక్క పెట్టటానికి మరియు (కాలాన్ని) గణించటానికి - ప్రకాశవంతమైనదిగా చేశాము. మరియు మేము ప్రతి విషయాన్ని వివరించి స్పష్టంగా తెలిపాము.
İsra' 17:13
మరియు మేము ప్రతి మానవుని మెడలో అతని కర్మలను[1] కట్టి ఉంటాము. మరియు పునరుత్థాన దినమున అతని (కర్మ) గ్రంథాన్ని అతని ముందుపెడ్తాము, దానిని అతడు స్పష్టమైనదిగా గ్రహిస్తాడు.
———
[1] చూడండి, 'స. బు'ఖారీ, పు. 9, 'హ. నం. 625. ఇమామ్ షౌకాని 'తాయిరతున్ - అంటే మానవుని అదృష్టం లేక భవిష్యత్తు, అని అన్నారు. అల్లాహుతా'ఆలా కు జరుగబోయేది అంతా తెలుసు కాబట్టిఆయన ప్రతివాని అదృష్టం వ్రాసి అతని వెంట ఉంచుతాడు. అందుకొరకే దాని ప్రకారం అతని కర్మలు (మంచి-చెడులు) ఉంటాయి. పునరుత్థాన దినమున వాటికి తగినట్టి ప్రతిఫలమే దొరుకుతుంది.
İsra' 17:14
(అతనితో ఇలా అనబడుతుంది): "నీవు నీ కర్మపత్రాన్ని చదువుకో! ఈ రోజు నీ (కర్మల) లెక్క చూసుకోవటానికి స్వయంగా నీవే చాలు."[1]
———
[1] చూడండి, 50:22.
İsra' 17:15
ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో, అతడు నిశ్చయంగా, తన మేలుకే సన్మార్గాన్ని అవలంబిస్తాడు. మరియు ఎవడు మార్గభ్రష్టుడవుతాడో, అతడు నిశ్చయంగా, తన నష్టానికే మార్గభ్రష్టుడవుతాడు. మరియు బరువు మోసే వాడెవ్వడూ మరొకని బరువును మోయడు.[1] మరియు మేము ఒక ప్రవక్తను పంప నంత వరకు (ప్రజలకు) శిక్ష విధించేవారము కాము.
———
[1] ఇలాంటి సందేశానికి చూడండి, 6:164, 35:18, 39:7 మరియు 53:38. దీని మరొక తాత్పర్యం: 'భారం మోసేవానిపై మరొకని భారం మోపబడదు.'
İsra' 17:16
మరియు మేము ఒక నగరాన్ని నాశనం చేయదలచు కున్నప్పుడు (మొదట) అందులో ఉన్న స్థితిమంతులకు ఆజ్ఞ పంపుతాము; ఆ పిదప కూడా వారు భ్రష్టాచారానికి పాల్పడితే! అప్పుడు దానిపై (మా) ఆదేశం జారీ చేయబడుతుంది. అప్పుడు మేము దానిని నాశనం చేస్తాము.
İsra' 17:17
మరియు మేము నూహ్ తర్వాత ఎన్నో తరాల వారిని ఈ విధంగా నాశనం చేశాము. మరియు తన దాసుల పాపాలను తెలుసుకోవటానికి, చూడటానికి నీ ప్రభువే చాలు!
İsra' 17:18
ఎవడు (ఇహలోక) తాత్కాలిక సుఖాలు కోరుకుంటాడో - మేము కోరిన వానికి - దానిలో మాకు ఇష్టం వచ్చినంత, ఒసంగుతాము. తరువాత అతని కొరకు నరకాన్ని నియమిస్తాము, దానిలో అతడు అవమానంతో బహిష్కరించ బడినవాడై దహింపబడతాడు.
İsra' 17:19
మరియు ఎవడు విశ్వాసి అయి, పరలోక (సుఖాన్ని) కోరి దానికై కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, అలాంటి వారి కృషి స్వీకరించబడుతుంది.
İsra' 17:20
నీ ప్రభువు యొక్క బహుమానాలు వీరికి మరియు వారికీ అందరికీ స్వేచ్ఛగా ప్రసాదించ బడతాయి. మరియు నీ ప్రభువు యొక్క బహుమానాలు (ఎవ్వరికీ) నిషేధించబడలేదు.
İsra' 17:21
చూడండి! మేము కొందరికి మరికొందరిపై ఏ విధంగా ఘనత నొసంగామో! కాని పరలోక (జీవిత సుఖ) మే గొప్ప స్థానాలు గలది మరియు గొప్ప ఘనత గలది.
İsra' 17:22
(ఓ మానవుడా!) అల్లాహ్ కు తోడుగా మరొక ఆరాధ్య దైవాన్ని కల్పించకు. అలా చేస్తే నీవు అవమానించబడి సహకారాలు పొందని (త్యజించబడిన) వాడవవుతావు.
İsra' 17:23
మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ, ఆజ్ఞాపించి ఉన్నాడు.[1] ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గానీ, లేదా వారిరువురు గానీ ముసలివారైతే, వారితో విసుక్కుంటూ: "ఛీ! (ఉఫ్)" అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు.
———
[1] అల్లాహుతా'ఆలా ఈ ఆయత్ లో తన ఆరాధన తరువాత, రెండో స్థానంలో, తమ తల్లిదండ్రులతో మంచిగా వ్యవహించాలని ఆజ్ఞాపించాడు. దీనితో వారి ఆదరణ, ఆజ్ఞాపాలన మరియు వారికి వినయవిధేయతలు చూపటం ఎంత ముఖ్యమో తెలుస్తోంది.
İsra' 17:24
మరియు వారి మీద కరుణ మరియు వినయవిధేయతల రెక్కలను చాపు మరియు వారి కొరకు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారో అదే విధంగా నీవు వారి యెడల కరుణను చూపు!"
İsra' 17:25
మీ మనస్సులలో ఉన్నది మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు సన్మార్గులయితే, నిశ్చయంగా ఆయన వైపునకు (పశ్చాత్తాపంతో) పలుమార్లు మరలే వారిని ఆయన క్షమిస్తాడు.
İsra' 17:26
మరియు బంధువులకు, పేదలకు మరియు బాటసారులకు, వారి హక్కు ఇవ్వు.[1] మరియు (నీ ధనాన్ని) వృథా ఖర్చులలో వ్యర్థం చేయకు.
———
[1] ఇక్కడ విశదమయ్యేది ఏమిటంటే మన సంపత్తిలో దగ్గరి బంధువులకు, పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది. కావున వారికి ఇవ్వటం, వారిని కనికరించటమని భావించరాదు. వారికి, వారి హక్కు ఇవ్వని వారు అల్లాహుతా'ఆలా దృష్టిలో నిందార్హులు. ఈ ఆయత్ లో పేర్కొన్నట్లు ధన సహాయానికి మొట్టమొదటి హక్కుదార్లు, దగ్గరి బంధువులు, ఎవరి పోషణైతే విధి కాదో వారు, తరువాత పేదవారు ఆ తరువాత బాటసార్లు అని తెలుస్తోంది.
İsra' 17:27
నిశ్చయంగా, వ్యర్థమైన ఖర్చులు చేసేవారు షైతానుల సోదరులు. మరియు షైతాన్ తన ప్రభువు పట్ల కృతఘ్నుడైన వాడు.
İsra' 17:28
మరియు నీవు ఆశించే, నీ ప్రభువు కారుణ్యాన్ని పొందటానికి - నీకు వారి నుండి ముఖం త్రిప్పుకోవలసి వచ్చినా - వారితో మృదువుగా మాట్లాడు.[1]
———
[1] ఒకవేళ నీవు బంధువులకు, పేదలకు ఇవ్వలేని స్థితిలో ఉంటే, వారిని కసిరి కొట్టే బదులు, నమ్రతతో, మృదువుగా నిరాకరించు.
İsra' 17:29
మరియు నీవు (పిసినారితనంతో) నీ చేతిని నీ మెడకు కట్టుకోకు[1] మరియు దానిని పూర్తిగా స్వేచ్ఛగా కూడా వదలి పెట్టకు. అలా చేస్తే నిందలకు గురి అవుతావు, దిక్కులేని వాడవై కూర్చుంటావు (విచారిస్తావు).
———
[1] ఇదే విధమైన వాక్యానికి చూడండి, 5:64.
İsra' 17:30
నిశ్చయంగా, నీ ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి తగ్గిస్తాడు. నిశ్చయంగా, ఆయనే తన దాసుల (స్థితుల)ను బాగా ఎరిగేవాడూ, చూసేవాడూను!
İsra' 17:31
మరియు పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని చంపకండి. మేమే వారికి మరియు మీకు కూడా జీవనోపాధిని సమకూర్చేవారము. నిశ్చయంగా, వారిని చంపటం గొప్ప నేరం.[1]
———
[1] చూడండి, 6:137, 6:151, 81:8-9లలో మరియు 'స'హీహ్ బు'ఖారీలో: 'షిర్క్ తరువాత ఘోరపాపం, పేదరికానికి భయపడి తన సంతానాన్ని హత్య చేయటం.' అని ఉంది. అంటే, పేమిలీ ప్లానింగ్ చేయటం, అబార్షన్ చేయించుకోవటం.
İsra' 17:32
మరియు వ్యభిచారాన్ని సమీపించకండి. అది నిశ్చయంగా, అశ్లీలమైనది మరియు బహు చెడ్డ మార్గము.[1]
———
[1] వ్యభిచారం అంటే భార్యా-భర్త కాకుండా, ఏ ఇతర ఆడ-మగ, మగ-మగ లేక ఆడ-ఆడ వారి మధ్య ఉండే లైంగిక సంబంధం. వారిలో ఏ ఒక్కరూ లేక ఇద్దరూ వివాహితులైనా కాకపోయినా.
İsra' 17:33
న్యాయానికి తప్ప, అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా చంపకండి.[1] ఎవడు అన్యాయంగా చంపబడతాడో, మేము అతని వారసునికి (ప్రతీకార) హక్కు ఇచ్చి ఉన్నాము.[2] కాని అతడు హత్య (ప్రతీకార) విషయంలో హద్దులను మీరకూడదు. నిశ్చయంగా, అతనికి (ధర్మప్రకారం) సహాయ మొసంగబడుతుంది.
———
[1] చూడండి, 2:190. అంటే, ధర్మయుద్ధంలో గానీ లేక న్యాయ ప్రతీకారానికి గానీ, లేక ఆత్మరక్షణకు గానీ కాకుండా, అన్యాయంగా ఏ ప్రాణిని కూడా చంపరాదు. [2] అల్-ఖి'సా'సు: న్యాయ ప్రతీకారం. చూడండి, 2:178. ఇక్కడ వలీ అంటే రక్తసంబంధీకుడైన దగ్గర బంధువు అని అర్థం.
İsra' 17:34
మరియు అతడు యుక్తవయస్సుకు చేరనంత వరకు - సక్రమమైన పద్ధతిలో తప్ప అనాథుని ఆస్తిని సమీపించకండి. మరియు చేసిన వాగ్దానాన్ని పూర్తి చేయండి, నిశ్చయంగా వాగ్దానం గురించి ప్రశ్నించడం జరుగుతుంది.[1]
———
[1] మానవుడు అల్లాహ్ (సు.తా.)తో చేసుకున్న వాగ్దానమైనా, లేక తన తోటి మానవునితో చేసిన వాగ్దానమైనా దానిని తప్పక పూర్తి చేయాలి, లేకుంటే పునరుత్థాన దినమున దానిని గురించి ప్రశ్నించడం జరుగుతుంది.
İsra' 17:35
మరియు మీరు కొలిచి ఇచ్చేటప్పుడు కొలత పాత్ర నిండుగా కొలిచి ఇవ్వండి. మరియు (తూచి ఇచ్చేటప్పుడు) త్రాసుతో సమానంగా తూకం చేయండి. ఇదే మంచి పద్ధతి మరియు (ఇదే) చివరకు మంచి ఫలితం ఇస్తుంది.
İsra' 17:36
మరియు (ఓ మానవుడా!) నీకు తెలియని విషయం వెంటబడకు.[1] నిశ్చయంగా చూపులూ, వినికిడీ మరియు హృదయం వీటన్నింటినీ గురించీ, (తీర్పు దినమున) ప్రశ్నించడం జరుగుతుంది.
———
[1] అంటే నీకు తెలియని దానిని గురించి ఇతరులపై అనుమానపడకు. మరియు నీకు తెలియని దానిని అనుసరించకు.
İsra' 17:37
మరియు భూమిపై విర్రవీగుతూ నడవకు.[1] నిశ్చయంగా నీవు భూమిని చీల్చనూ లేవు మరియు పర్వతాల ఎత్తుకు చేరనూ లేవు!
———
[1] విర్రవీగటం అల్లాహుతా'ఆలాకు ఎంతో అసహ్యకరమైనది. ఖారూన్ విర్రవీగటం వల్లనే, తన ధనసంపత్తులతో సహా భూమిలోకి త్రొక్కి వేయబడ్డాడు. చూడండి, 28:81.
İsra' 17:38
ఇవన్నీ దుష్కార్యాలే, నీ ప్రభువు దృష్టిలో ఎంతో అసహ్యకరమైనవి.
İsra' 17:39
ఇవి వివేకంతో నిండి వున్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలియజేశాడు. మరియు అల్లాహ్ తో పాటు మరొకరిని ఆరాధ్య దైవంగా చేసుకోకు. అలా చేస్తే అవమానానికి గురి అయి, బహిష్కరించబడి నరకంలో త్రోయబడతావు.
İsra' 17:40
ఏమీ? మీ ప్రభువు, మీకు ప్రత్యేకంగా కుమారులను ప్రసాదించి తన కొరకు దేవదూతలను కుమార్తెలుగా చేసుకున్నాడా? నిశ్చయంగా మీరు పలికేది చాలా ఘోరమైన మాట.[1]
———
[1] వారు అల్లాహ్ (సు.తా.)కు కుమార్తెలను మరియు తమకేమో కుమారులను ఎన్నుకుంటున్నారు. చూడండి, 16:57-59.
İsra' 17:41
మరియు వారు వాస్తవానికి హితబోధ పొందుతారని, మేము ఈ ఖుర్ఆన్ లో అనేక విధాలుగా బోధించాము.[1] కాని అది వారి వ్యతిరేకతను మాత్రమే అధికం చేస్తున్నది.
———
[1] ప్రతివిధంగా బోధించాము: అంటే పూర్వకాలపు ప్రజల కథలు చెప్పి, ఉదాహరణలు, ఉపమానాలు ఇచ్చి, హితబోధలు చేసి, పర్యవసానాలు చూపి, అనేక విధాలుగా అల్లాహ్ (సు.తా.) ఖుర్ఆన్ లో బోధించాడు, భయపెట్టాడు. బహుశా మానవులు గుణపాఠం నేర్చుకొని, అతి స్వల్పకాలపు ఈ జీవితంలో విశ్వసించి, సత్కార్యాలు చేసి, రాబోయే శాశ్వత జీవితంలో ఎడతెగని సుఖసంతోషాలు పొందాలని. కాని చాలా మంది దానిని అర్థం చేసుకోలేక పోతున్నారు. తమ భ్రష్టాచారాలను మరింత అధికం చేసుకుంటున్నారు.
İsra' 17:42
వారితో అను: "ఒకవేళ వారు వారన్నట్లు అల్లాహ్ తో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లైతే, వారు కూడా (అల్లాహ్) సింహాసనానికి (అర్ష్ కు) చేరే మార్గాన్ని వెతికే వారు కదా!"[1]
———
[1] ఈ ఆయత్ ను వ్యాఖ్యాతలు రెండు విధాలుగా బోధించారు: (1) ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది రాజులు ఉంటే, వారిలో ప్రతి ఒక్కడు భూమిలో ప్రతి చోటా తన అధికారాన్నే నెలకొల్పటానికి పాటు పడతాడు. అదే విధంగా ఈ ఇతర దేవతలు కూడా ప్రయత్నించేవారు, ఒకవేళ వారు ఉండి ఉంటే! అది ఇంత వరకు జరుగలేదు. అంటే అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక విశ్వసామ్రాజ్యాధిపతి లేడు. (2) ఏ విధంగానైతే ముష్రికులు భావిస్తున్నారో: వారు ఆరాధించేవారు ఇంత వరకు అల్లాహ్ (సు.తా.) సాన్నిహిత్యాన్ని పొంది ఉన్నారు మరియు తమను ఆరాధించే వారిని కూడా అల్లాహ్ (సు.తా.) దగ్గరకు తీసుకుపోవటానికి ప్రయత్నిస్తారు. ఇది సత్యం కాదు. ఈ విషయం అల్లాహుతా'ఆలా తన గ్రంథం (ఖుర్ఆన్)లో ఎన్నో సార్లు విశదం చేశాడు. చూడండి, 17:57.
İsra' 17:43
ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు అత్యున్నతుడు, వారు ఆపాదించే మాటల కంటే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).
İsra' 17:44
సప్తాకాశాలు, భూమి మరియు వాటిలో ఉన్న సమస్తమూ ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయన పవిత్రతను కొనియాడనిది, ఆయన స్తోత్రం చేయనటువంటిది ఏదీ లేదు, కాని మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. నిశ్చయంగా, ఆయన ఎంతో సహనశీలుడు, క్షమాశీలుడు.
İsra' 17:45
మరియు నీవు ఖుర్ఆన్ ను పఠించేటప్పుడు నీకూ మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారికీ, మధ్య కనబడని తెర వేసి ఉన్నాము.
İsra' 17:46
మరియు వారు గ్రహించకుండా, వారి హృదయాల మీద తెరలు మరియు వారి చెవులలో చెవుడు వేసి ఉన్నాము.[1] ఒకవేళ నీవు ఖుర్ఆన్ (పారాయణం) తో నీ ప్రభువు యొక్క ఏకత్వాన్ని ప్రస్తావిస్తే వారు అసహ్యంతో వెనుదిరిగి మరలిపోతారు.
———
[1] చూడండి, 6:25 మరియు 2:7.
İsra' 17:47
వారు నీ మాటలను వింటున్నప్పుడు, వారు ఏమి వింటున్నారో మాకు బాగా తెలుసు. ఈ దుర్మార్గులు ఏకాంతంలో ఉన్నప్పుడు పరస్పరం గుసగుసలాడుతూ ఇలా చెప్పుకుంటారు: "మీరు అనుసరిస్తున్న ఈ మనిషి కేవలం మంత్రజాలానికి గురి అయిన వాడు మాత్రమే."
İsra' 17:48
(ఓ ముహమ్మద్!) చూడు! వారు నిన్ను ఎలాంటి ఉదాహరణలతో పోల్చుతున్నారో, ఎందుకంటే వారు మార్గం తప్పారు, కావున వారు (సరైన) మార్గం పొందలేరు.[1]
———
[1] వారు దైవప్రవక్త ('స'అస) ను మాంత్రికుడు, మంత్రజాలానికి గురి అయినవాడు, పిచ్చివాడు, జ్యోతిష్యుడు అని నోటికి వచ్చినట్లు ఆరోపించారు. ఎందుకంటే వారు మార్గభ్రష్టులైన వారు కాబట్టి వారెన్నడూ మార్గదర్శకత్వం పొందలేరు.
İsra' 17:49
మరియు వారు ఇలా అంటారు: "ఏమీ? మేము ఎముకలుగా మరియు దుమ్ముగా (పొడిగా) మారిపోయిన తరువాత కూడా తిరిగి క్రొత్త సృష్టిగా లేపబడతామా?"
İsra' 17:50
వారితో అను: "మీరు రాళ్ళుగా గానీ, లేదా ఇనుముగా గానీ మారిపోయి ఉండినా సరే!"
İsra' 17:51
"లేదా! తిరిగి సృష్టింపబడటానికి అసాధ్యమైనదని మీ హృదయాలు భావించే దానిగా ఉన్నా సరే! (తిరిగి లేపబడతారు)". వారు మళ్ళీ ఇలా అడుగుతారు: "మమ్మల్ని తిరిగి బ్రతికించి లేపగల వాడు ఎవడు?" వారితో అను: "ఆయనే, మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన వాడు!" వారు ఎగతాళిగా తలలు ఊపుతూ అంటారు: "అయితే! అది ఎప్పుడు సంభవిస్తుంది?" వారితో అను: "బహుశా ఆ సమయం సమీపంలోనే ఉండవచ్చు!"
İsra' 17:52
ఆ దినమున, ఆయన మిమ్మల్ని పిలిచినపుడు! మీరు ఆయన పిలుపుకు సమాధానంగా ఆయనను స్తుతిస్తూ వస్తారు. మరియు మీరు కేవలం కొంత కాలం మాత్రమే (భూమిలో) ఉండి వున్నట్లు భావిస్తారు.[1]
———
[1] పరలోక జీవితంతో పోల్చితే ఇహలోక జీవితకాలం ఎంతో చిన్నది. పరలోక జీవితం అంతం లేనిది. మానవుని కాలగణనం ఈ భూలోకానికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే దాని గణన భూగోళపు తన చుట్టూ చేసే పర్యటనకు బద్ధమై ఉంది. చూడండి, 79:46, 20:102, 104, 30:55, 23:112, 114.
İsra' 17:53
మరియు నా దాసులతో, వారు మాట్లాడేటప్పుడు మంచి మాటలనే పలకమని చెప్పు. (ఎందుకంటే) షైతాన్ నిశ్చయంగా, వారి మధ్య విరోధాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తుంటాడు. నిశ్చయంగా, షైతాన్ మానవుడికి బహిరంగ శత్రువు.[1]
———
[1] ఇది ప్రతి ఒక్కడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జ్ఞాపకముంచుకోవలసిన ఆయత్. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'మీలో ఎవ్వరు కూడా తన సోదరుని (ముస్లిం) వైపునకు ఆయుధాన్ని చూపకండి. ఎందుకంటే మీకు తెలియకుండానే షై'తాన్ ఆ ఆయుధాన్ని నడిపించి అతన్ని చంపించవచ్చు మరియు మీరు నరకాగ్నిలో పడి పోవచ్చు.' ('స. బు'ఖారీ, ముస్లిం). ఇంకా చూడండి, 16:125 మరియు 29:46.
İsra' 17:54
మీ ప్రభువుకు మిమ్మల్ని గురించి బాగా తెలుసు. ఆయన కోరితే మిమ్మల్ని కరుణించ వచ్చు, లేదా ఆయన కోరితే మిమ్మల్ని శిక్షించవచ్చు! మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను వారి కార్యకర్తగా (రక్షకునిగా) నియమించి పంపలేదు.
İsra' 17:55
మరియు భూమ్యాకాశాలలో ఉన్న వారందరినీ గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు వాస్తవానికి మేము కొందరు ప్రవక్తలకు మరికొందరిపై ఘనత నొసంగాము. మరియు మేము దావూద్ కు జబూర్[1] ఇచ్చాము.
———
[1] దావూద్ ('అ.స.) పై అవతరింపజేయబడిన దివ్యగ్రంథం 'జబూర్ (కీర్తనలు / Psalms).
İsra' 17:56
వారితో ఇట్లను: "ఆయన (అల్లాహ్) ను కాదని మీరెవరినైతే (ఆరాధ్యదైవాలుగా) భావించారో, వారిని అర్థించి చూడండి; మీ ఆపదను తొలగించటానికి గానీ, దానిని మార్చటానికి గానీ వారికి ఎలాంటి శక్తి లేదు."
İsra' 17:57
వారు, ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు.[1] నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష, దానికి భయపడ వలసిందే!
———
[1] వారు ఆ దైవాలు: అంటే, యూదులూ మరియు క్రైస్తవులు, దేవుళ్ళని భావించే 'ఉ'జైర్ ('అ.స.) లేక 'ఈసా ('అ.స.) గానీ ; లేక ముష్రికులు ఆరాధించే జిన్నాతులు గానీ, దైవదూతలు గానీ, కల్పిత దైవాలు గానీ, విగ్రహాలు గానీ లేక పుణ్యవంతులైన ముస్లింలు గానీ, లేక ఇతర వలీలు గానీ కావచ్చు. వీరంతా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందే మార్గాన్ని వెతుకుతున్నారు. అలాంటప్పుడు వారు ఇతరులకు ఏ విధంగా సహాయపడగలరు. వీరిని ఆరాధించటం మరియు వీరి సహాయం కోరటం షిర్క్. అల్లాహ్ (సు.తా.) షిర్క్ ను ఎన్నడూ క్షమించడు.
İsra' 17:58
మరియు పునరుత్థాన దినానికి ముందు మేము నాశనం చేయని, లేదా కఠినశిక్షకు గురిచేయని, నగరమనేది ఉండదు. ఈ విషయం గ్రంథంలో వ్రాయబడి వుంది.
İsra' 17:59
మరియు నిదర్శనాలను (ఆయాత్ లను) పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు. కాని పూర్వకాలపు ప్రజలు వాటిని తిరస్కరించడమే తప్ప![1] మరియు మేము సమూద్ జాతి వారికి ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడ ఒంటెను పంపాము, కాని వారు దాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు.[2] మరియు మేము నిదర్శనాలను (ఆయాత్ లను) పంపుతున్నది, కేవలం ప్రజలు వాటిని చూసి భయపడటానికే!
———
[1] పూర్వకాలపు ప్రజలు తమ ప్రవక్తల నుండి నిదర్శనాలు (ఆయాత్) కోరారు. ఆ నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా వారు విశ్వాసులు కాలేదు. దాని ఫలితంగా వారిపై అల్లాహ్ (సు.తా.) శిక్ష పడి వారు నాశనం చేయబడ్డారు. ఇదే విధంగా మక్కా ముష్రిక్ లు కూడా దైవప్రవక్త ('స'అస) నుండి నిదర్శనాలు కోరారు. మక్కా పర్వతాలను బంగారంగా మార్చమన్నారు. పూర్వ జాతి వారి వలే వీరూ నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా విశ్వసించరని మరియు వారంతా నాశనం చేయబడతారని అతను ('స'అస) నిదర్శనాలను కోరలేదు. (వివరాలకు చూడండి, ముస్నద్ అ'హ్మద్, పుస్తకం-1, పేజీ 258) [2] ఆ ఆడ ఒంటె నిదర్శనం కొరకు చూడండి, 7:73 మరియు 54:27.
İsra' 17:60
"నిశ్చయంగా, నీ ప్రభువు ప్రజలను పరివేష్టించి ఉన్నాడు." అని మేము నీతో చెప్పిన విషయం (జ్ఞాపకం చేసుకో)! మేము నీకు (ఇస్రా రాత్రిలో) చూపిన దృశ్యం[1] - మరియు ఖుర్ఆన్ లో శపించబడిన (నరక) వృక్షం[2] - మేము వారికి ఒక పరీక్షగా చేశాము. కాని మా భయ పెట్టడం, వారి తలబిరుసుతనాన్ని మాత్రమే మరింత అధికం చేస్తున్నది.
———
[1] దైవప్రవక్త ('స'అస) యొక్క రాత్రివేళ మస్జిద్ అల్-'హరాం నుండి మస్జిద్ అల్ అ'ఖ్సా మరియు అక్కడ నుండి సప్తాకాశాలలోనికి పోవటం మరియు తమ ప్రయాణాలలో సాక్షాత్తుగా చూసిన దృశ్యాల వివరణ విశ్వాసులకు వారి విశ్వాసాన్ని అధికం చేసింది మరియు సత్యతిరస్కారులకు వారి తలబిరుసుతనాన్ని. [2] ఆ నరకవృక్షఫలాలు, నరకవాసులకు ఆహారంగా ఇవ్వబడతాయి. దాని పేరు 'జఖ్ఖూమ్ (జెముడు వృక్షం). దాని వివరాలకు చూడండి, 37:62-66 44:43-44.
İsra' 17:61
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము దేవదూతలతో: "ఆదమ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని చెప్పినపుడు; ఒక్క ఇబ్లీస్ తప్ప, అందరూ సాష్టాంగపడ్డారు.[1] అతడు అన్నాడు: "ఏమీ? నీవు మట్టితో సృష్టించిన వానికి నేను సాష్టాంగం (సజ్దా) చేయాలా?"
———
[1] ఆదమ్ ('అ.స.) వివరాలక కొరకు చూడండి, 2:30-34, 7:11-18, 15:26-41 మరియు సూరహ్ లు 18, 20, 38 కూడా.
İsra' 17:62
ఇంకా ఇలా అన్నాడు: "ఏమీ? నేను చూడటం లేదా? నీవు ఇతనికి వాపై ఆధిక్యత నిచ్చావు. కానీ ఒకవేళ నీవు నాకు పునరుత్థాన దినం వరకు వ్యవధినిస్తే, నేను ఇతని సంతతి వారిలో కొందరిని తప్ప అందరినీ వశపరచుకొని తప్పు దారి పట్టిస్తాను."[1]
———
[1] ఇబ్లీస్ మాటల కొరకు చూడండి, 7:16-17
İsra' 17:63
ఆయన (అల్లాహ్) అన్నాడు: "సరే పో! వారిలో నిన్ను ఎవరు అనుసరిస్తారో! నిశ్చయంగా, మీరందరికీ నరకమే ప్రతిఫలమవుతుంది. పరిపూర్ణ ప్రతిఫలం!
İsra' 17:64
మరియు నీవు నీ ధ్వనితో (మాటలతో) వారిలో ఎవరెవరిని ఆశ చూపి (ఆకర్షించగలవో) ఆకర్షించు.[1] మరియు నీ అశ్విక దళాలతో మరియు నీ పదాతి దళాలతో వారి మీద పడు.[2] మరియు వారికి సంపదలో, సంతానంలో భాగస్వామివికా[3] మరియు వారితో వాగ్దానాలు చెయ్యి.[4] మరియు షైతాన్ చేసే వాగ్దానాలు మోసపుచ్చటం తప్ప ఇంకేముంటాయి.[5]
———
[1] 'సౌతిక: నీ ధ్వని అంటే పాటలు, వాద్యాలు మరియు ఇతర మోసపుచ్చే మాటలు, అని అర్థం. వీటితో ష'తాన్ మానవులను మోసపుచ్చుతాడు. [2] దళాలు అంటే - షైతాను అడుగు జాడలను అనుసరించే మానవులు, జిన్నాతులు. [3] అమ్వాల్ వ అవ్ లాద్: అంటే సంపదలు మరియు సంతానం. అంటే నిషిద్ధ ( 'హరామ్) మార్గాలతో సంపాదించి, 'హరామ్ చేష్టలలో ఖర్చు చేసే ధనసంపత్తులు మరియు వ్యభారం వల్ల వచ్చే సంతానం. [4] 'షైతాన్ వాగ్దానాలు అంటే స్వర్గనరకాలు అనేవి ఏమీ లేవు, మరణించిన తరువాత పునరుత్థానం అనేది లేదు. మన జీవితం ఈ భూలోక జీవితం మాత్రమే. కావున వీలైనంత వరకు దీని సుఖసంతోషాలను మీకు తోచినట్లు అనుభవించండి, అని ప్రజలను మోసపుచ్చటం. [5] చూడండి, 4:120
İsra' 17:65
నిశ్చయంగా, నా దాసులు! వారిపై నీకు ఏ విధమైన అధికారం లేదు.[1] మరియు వారికి కార్యకర్తగా (రక్షకునిగా) నీ ప్రభువే చాలు!"
———
[1] నా దాసులు: అంటే అల్లాహ్ (సు.తా.) ను నమ్ముకుని ఆయనపై ఆధారపడి, ఆయన చూపిన మార్గం మీదనే నడిచే సద్పురుషులు. అల్లాహ్ (సు.తా.) అలాంటి వారి, రక్షకుడు మరియు కార్యకర్త. షై'తాన్ కు అలాంటి వారిపై ఎలాంటి అధికారం ఉండదు. చూడండి, 14:22 మరియు 15:42
İsra' 17:66
మీ ప్రభువు, ఆయనే - ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి - మీ కొరకు సముద్రంలో నావలను నడిపింపజేసేవాడు. నిశ్చయంగా, ఆయన మీ పట్ల అపార కరుణా ప్రదాత.
İsra' 17:67
మరియు ఒకవేళ సముద్రంలో మీకు ఆపద వస్తే ఆయన (అల్లాహ్) తప్ప, మీరు పిలిచేవారందరూ మిమ్మల్ని త్యజిస్తారు. కాని, ఆయన మిమ్మల్ని రక్షించి, ఒడ్డుకు చేర్చినపుడు, మీరు ఆయన నుండి ముఖం త్రిప్పుకుంటారు. వాస్తవానికి మానవుడు ఎంతో కృతఘ్నుడు.
İsra' 17:68
ఏమీ? ఆయన! నేల చీలిపోయి మిమ్మల్ని మ్రింగకుండా; లేదా తుఫాను మీపై రాకుండా; మిమ్మల్ని సురక్షితంగా ఉండనివ్వగలడని మీరు భావిస్తున్నారా?"[1] అప్పుడు మీరు ఏ రక్షకుడినీ పొందలేరు.
———
[1] ఏ విధంగానైతే అల్లాహ్ (సు.తా.) కు అవిధేయులైన, పూర్వ తరాల వారు శిక్షింపబడ్డారో, అలా మీరు కూడా శిక్షింపబడరని భావిస్తురా?
İsra' 17:69
లేదా! మరొకసారి ఆయన మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొని పోయి - మీ కృతఘ్నతకు ఫలితంగా - మీ మీద తీవ్రమైన తుఫాను గాలిని పంపి, మిమ్మల్ని ముంచి వేయకుండా సురక్షితంగా ఉండనివ్వగలడని భావిస్తున్నారా? అప్పుడు మాకు విరుద్ధంగా[1] సహాయపడే వారినెవ్వరినీ మీరు పొందలేరు.
———
[1] తబీ'ఉన్: పగతీర్చుకునేవాడు, కక్ష తీర్చుకునేవాడు. అంటే ఒకసారి మిమ్మల్ని సముద్రంలో తుఫాన్ నుండి క్షేమంగా బయట పెట్టిన తర్వాత ఆయన (అల్లాహుతా'ఆలాయే) మీ అవిధేయతకు కారణంగా మీరు మరల సముద్రంలోకి పోయినపుడు మిమ్మల్ని ముంచి వేయ వచ్చని మీరు భయపడరా? అప్పుడు ఆయన (సు.తా.)కు విరుద్ధంగా మీకు, మీ కల్పిత దైవాలు ఎవ్వరూ సహాయపడలేరు.
İsra' 17:70
మరియు వాస్తవానికి మేము ఆదమ్ సంతతికి గౌరవము నొసంగాము.[1] మరియు వారికి నేల మీదనూ, సముద్రం లోనూ, ప్రయాణం కొరకు వాహనాలను ప్రసాదించాము. మరియు మేము వారికి పరిశుద్ధమైన వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాము. మరియు మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చాము.
———
[1] చూడండి 2:31, వారికి మంచి చెడును అర్థం చేసుకునే విచక్షణా శక్తినీ, బుద్ధినీ ప్రసాదించాము.
İsra' 17:71
(జ్ఞాపకముంచుకోండి!) ఒకరోజు మేము మానవులందరినీ వారి వారి నాయకులతో (ఇమామ్ లతో) సహా పిలుస్తాము.[1] అప్పుడు వారి కర్మపత్రాలు కుడిచేతిలో ఇవ్వబడిన వారు,[2] తమ కర్మ పత్రాలను చదువుకుంటారు మరియు వారికి రవ్వంత (ఖర్జూర బీజపు చీలికలోని పొరంత) అన్యాయం కూడా జరగదు.
———
[1] ఇమామ్: అంటే నాయకుడు ఇక్కడ వ్యాఖ్యాతలు దీనికి మూడు అర్థాలిచ్చారు. 1) దైవప్రవక్తలు, 2) దివ్యగ్రంథాలు, 3) కర్మపత్రాలు. ప్రతి ఒక్కరు తమ కాలపు దైవప్రవక్త లేక దివ్యగ్రంథం లేక కర్మపత్రంతో పిలువబడతారు. ఇబ్నె-కసీ'ర్ మరియు షౌకాని ఈ మూడవది అంటే కర్మపత్రమని భావిస్తున్నారు. చూడండి, 53:39. [2] చూడండి, 69:19 మరియు 84:7.
İsra' 17:72
మరియు ఎవడు ఇహలోకంలో అంధుడై మెలగుతాడో, అతడు పరలోకంలో కూడా అంధుడిగానే ఉంటాడు[1] మరియు సన్మార్గం నుండి భ్రష్టుడవుతాడు.
———
[1] చూడండి, 20:124-125.
İsra' 17:73
మరియు (ఓ ప్రవక్తా!) మేము నీపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం (వహీ) నుండి నిన్ను మరలించి, నీవు అదికాక మా పేరుతో మరొక దానిని (సందేశాన్ని) కల్పించాలని నిన్ను పురికొల్పటానికి వారు ప్రయత్నిస్తున్నారు.[1] నీవు అలా చేసి ఉంటే వారు తప్పకుండా నిన్ను తమ ఆప్తమిత్రులుగా చేసుకునేవారు.
———
[1] ఇది ముష్రిక్ ఖురైషులు దైవప్రవక్త ('స'అస) ముందు పెట్టిన మరొక ప్రస్తావన. అంటే అతను వారి కల్పిత దైవాలను నిజమైన దైవాలని గుర్తిస్తే వారు కూడా అతనిని దైవప్రవక్తగా గుర్తిస్తామని పెట్టిన షరతు. దానిని అతను ('స'అస) నిరాకరించారు.
İsra' 17:74
మరియు ఒకవేళ మేము నిన్ను స్థిరంగా ఉంచకపోతే నీవు వారి వైపుకు కొంతైనా మొగ్గి ఉండే వాడవు.
İsra' 17:75
అలాగైతే, మేము నీకు ఈ జీవితంలో రెట్టింపు శిక్షను మరియు చనిపోయిన తరువాత కూడా రెట్టింపు శిక్షను రుచి చూపి ఉండేవారం. అప్పుడు మాకు వ్యతిరేకంగా నీకు సహాయపడే వాడిని ఎవ్వడినీ నీవు పొంది వుండేవాడవు కాదు.
İsra' 17:76
మరియు వారు (అవిశ్వాసులు) నిన్ను కలవరపెట్టి, నిన్ను ఈ భూమి నుండి వెడలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు నీవు వెళ్ళిపోయిన తరువాత, వారు కూడా కొద్ది కాలం మాత్రమే ఉండగలిగేవారు.[1]
———
[1] కావున కొద్దికాలం తరువాత 2 హి.శ.లో బద్ర్ లో మక్కా ఖురైషుల పలువురు నాయకులు చంపబడ్డారు. మరియు 8వ హిజ్రీలో ముస్లింలు మక్కాను జయించారు.
İsra' 17:77
(ఓ ముహమ్మద్!) ఇది వాస్తవానికి! మేము నీకు పూర్వం పంపిన ప్రవక్తలందరికీ వర్తించిన సంప్రదాయమే! నీవు మా సాంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు.
İsra' 17:78
మధ్యాహ్నం సూర్యుడు వాలినప్పటి నుండి, రాత్రి అయి చీకటి పడే వరకూ నమాజ్ లను సలుపు. మరియు ప్రాతఃకాలంలో (నమాజ్ లో) ఖుర్ఆన్ పఠించు.[1] నిశ్చయంగా ప్రాతఃకాల ఖుర్ఆన్ పఠనం (దేవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది.[2]
———
[1] ఈ ఆయత్ లో ఐదు విధి (ఫ'ర్ద్) గా సలుప వలసిన నమా'జ్ ల ప్రస్తావన వచ్చింది. సూర్యుడు వాలిన తరువాత జుహ్ర్, సూర్యాస్తమయానికి కొంత కాలం ముందు 'అ'స్ర్, సూర్యాస్తమయం కాగానే మ'గ్ రిబ్, కొంత చీకటి పడ్డ తరువాత 'ఇషా మరియు ప్రాతఃకాలమున సూర్యోదయానికి ముందు ఫజ్ర్ చేయాలని. ఫజ్ర్ నమాజ్ లో ఖుర్ఆన్ పఠనం ఎక్కువగా చేయాలి. ఈ నమా'జ్ లను గురించి వివరాలు 'స'హీ'హ్ 'హదీస్'లలో ఉన్నాయి. [2] ప్రాతఃకాలపు ఫజ్ర్ నమా'జ్ సమయంలో పగటి మరియు రాత్రి దైవదూతలు కలుస్తారు. వారంతా ప్రజల నమా'జ్ లను చూస్తారు. మరియు దానిని గురించి అల్లాహుతా'ఆలాకు తెలుపుతారు. అది అల్లాహ్ (సు.తా.)కు అగోచరమైనది కాదు, కానీ ఆయన (సు.తా.) వారి నుండి తన ప్రజల ప్రశంసలు వినగోరుతాడు. ('స. బు'ఖారీ మరియు ముస్లిం).
İsra' 17:79
మరియు రాత్రివేళలో జాగరణ (తహజ్జుద్) నమాజ్ చెయ్యి.[1] ఇది నీ కొరకు అదనపు (నఫిల్) నమాజ్. దీనితో నీ ప్రభువు నిన్ను (పునరుత్థాన దినమున) ప్రశంసనీయమైన స్థానము (మఖామ్మ్ మహ్మూద్) నొసంగవచ్చు!
———
[1] తహజ్జుద్: అంటే నిద్రాభంగం. ఇది నఫీల్ నమా'జ్, అంటే అదనంగా చేసే నమా'జ్. దైవప్రవక్త ('స'అస) రాత్రి మొదటి భాగంలో నిద్ర తీసుకొని, చివరి భాగంలో నిద్ర నుండి లేచి నమా'జ్ చేసేవారు, అదే తహజ్జుద్ నమా'జ్. 'స'హీ'హ్ 'హదీస్'లలో దీని వివరాలున్నాయి. ఇంకా చూడండి, 76:26.
İsra' 17:80
మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నీవు నా ప్రతి ప్రవేశాన్ని, సత్యప్రవేశంగా చేయి మరియు నా బహిర్గమనాన్ని కూడా సత్య బహిర్గమనంగా చేయి మరియు నీ వైపు నుండి నాకు అధికార శక్తిని, సహాయాన్ని ప్రసాదించు."[1]
———
[1] కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయత్ ప్రస్థానం (హిజ్రత్) సమయంలో అవతరింపజేయ బడిందని అంటారు. అంటే యస్'రిబ్ (మదీనా మునవ్వరా) ప్రవేశాన్ని మరియు మక్కా ముకర్రమా బహిర్గమనాన్ని సత్యమైనవి చేయమని దైవప్రవక్త ('స'అస) ప్రార్థిస్తున్నారు. మరికొందరు అంటారు: నన్ను సత్యం మీద మరణింపజేయి మరియు సత్యంతో పునరుత్థరింపజేయి. ఇమామ్ షౌకాని అంటారు: ఈ అన్నీ అర్థాలు కూడా సమంజసమైనవే, ఎందుకంటే ఇది ఒక దు'ఆ.
İsra' 17:81
మరియు ఇలా అను: "సత్యం వచ్చింది మరియు అసత్యం అంతరించింది. నిశ్చయంగా అసత్యం అంతరించక తప్పదు.[1]
———
[1] మక్కా ముకర్రమా విజయం తరువాత, దైవప్రవక్త ('స'అస) కాబాలో ప్రవేశిస్తారు. అక్కడ 360 విగ్రహాలు ఉంటాయి. వాటిని ఒక చిన్న కట్టెతో కొట్టుతూ ఈ ఆయత్ చదువుతారు. ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం).
İsra' 17:82
మరియు మేము ఈ ఖుర్ఆన్ ద్వారా విశ్వాసులకు స్వస్థతను మరియు కారుణ్యాన్ని క్రమక్రమంగా అవతరింపజేస్తాము. కాని దుర్మార్గులకు ఇది నష్టం తప్ప మరేమీ అధికం చేయదు.[1]
———
[1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 10:57
İsra' 17:83
మరియు ఒకవేళ మేము మానవుణ్ణి అనుగ్రహిస్తే, అతడు ముఖం త్రిప్పుకొని (మా నుండి మరలిపోతాడు. కాని అతనికి కీడు కలిగితే నిరాశ చెందుతాడు.[1]
———
[1] మానవుడు సుఖసంతోషాలలో ఉన్నప్పుడు అల్లాహ్ (సు.తా.)ను మరచిపోతాడు మరియు కష్టకాలంలో నిరాశ చెందుతాడు. కాని ఒక విశ్వాసి రెండు పరిస్థితులలోనూ తన ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయన స్తోత్రం చేస్తూ ఉంటాడు. చూడండి, 11:9-11.
İsra' 17:84
వారితో ఇలా అను: "ప్రతి ఒక్కడు తనకు తోచినట్లే పనులు చేస్తాడు, కాని మీ ప్రభువుకు మాత్రం ఎవడు సన్మార్గం పొందే వాడో బాగా తెలుసు."[1]
———
[1] దీని సారాంశము, 11:121-122 ఆయత్ ల మాదిరిగానే ఉంది.
İsra' 17:85
మరియు వారు నిన్ను ఆత్మ (రూహ్) ను గురించి ప్రశ్నిస్తున్నారు. వారితో ఇలా అను: "ఆత్మ! నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. మరియు (దానిని గురించి) మీకు ఇవ్వబడిన జ్ఞానం అతి స్వల్పమైనది."[1]
———
[1] అర్-రూ'హు: ఆత్మను గురించి కేవలం అల్లాహ్ (సు.తా.) కు మాత్రమే తెలుసు. దాని జ్ఞానం కేవలం నా ప్రభువు (సు.తా.) కు మాత్రమే ఉంది. దాని జ్ఞానం (సు.తా.) ప్రవక్తల (అ.స.)కు కూడా ఇవ్వలేదు. అది ఆయన (సు.తా.) ఆజ్ఞతో వస్తుంది: 'కున్ ఫ యకూన్.'
İsra' 17:86
మరియు ఒకవేళ మేము కోరినట్లయితే నీపై అవతరింపజేయబడిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) లాగుకోగలము. (స్వాధీన పరచుకోగలము). అప్పుడు దానిని గురించి, మాకు వ్యతిరేకంగా, నీవు ఏ సహాయకుడినీ పొందలేవు -
İsra' 17:87
కేవలం నీ ప్రభువు కారుణ్యం తప్ప! నిశ్చయంగా, నీపై ఉన్న ఆయన (నీ ప్రభువు) అనుగ్రహం ఎంతో గొప్పది.
İsra' 17:88
ఇలా అను: "ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్ వంటి దానిని కల్పించి తీసుకు రావటానికి ప్రయత్నించినా - వారు ఒకరి కొకరు తోడ్పడినప్పటికీ - ఇటువంటి దానిని కల్పించి తేలేరు."[1]
———
[1] చూడండి, 52:34.
İsra' 17:89
మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజలకు ప్రతివిధమైన ఉపమానాన్ని వివరించి బోధించి ఉన్నాము. అయినా చాలామంది ప్రజలు సత్యతిరస్కారులు గానే ఉండిపోయారు.
İsra' 17:90
మరియు వారు ఇలా అంటారు: "(ఓ ముహమ్మద్!) నీవు భూమి నుండి మా కొరకు ఒక చెలమను ఝల్లున ప్రవహింప జేయనంత వరకు మేము నిన్ను విశ్వసించము;[1]
———
[1] ఇది ముష్రిక్ ఖురైషులు ఇస్లాం స్వీకరించటానికి - మూసా ('అ.స.) బండ నుండి పన్నెండు ఊటలను ప్రవహింపజేసినట్లు, మీరు కూడా ప్రవహింపజేయండని - పెట్టిన షర్తు. చూ, 2:60.
İsra' 17:91
లేదా! నీ కొరకు ఖర్జూరపు మరియు ద్రాక్షతోట ఏర్పడి దాని మధ్య నుండి సెలయేళ్ళు పొంగి ప్రవహింప జేయనంత వరకు;
İsra' 17:92
లేదా, నీవు మమ్మల్ని భయపెట్టినట్లు,[1] ఆకాశం ముక్కలై మాపై పడవేయబడనంత వరకు; లేదా అల్లాహ్ ను మరియు దేవదూతలను మా ముందు ప్రత్యక్ష పరచనంత వరకు;
———
[1] భయ పెట్టుటకు - ఇలాంటి ఆయత్ కు చూడండి, 34:9.
İsra' 17:93
లేదా నీ కొరకు స్వర్ణగృహం ఏర్పడనంత వరకు; లేదా నీవు ఆకాశంలోకి ఎక్కి పోయినా నీవు, మేము చదువగలిగే ఒక గ్రంథాన్ని అవతరింప జేయనంత వరకు; నీవు ఆకాశంలోకి ఎక్కటాన్ని మేము నమ్మము." వారితో అను: "నా ప్రభువు సర్వలోపాలకు అతీతుడు, నేను కేవలం సందేశహరునిగా పంపబడిన మానవుడను మాత్రమే?"[1]
———
[1] అద్భుత సూచనలు కేవలం అల్లాహ్ (సు.తా.) చేతిలోనే ఉన్నాయి. ఆయన (సు.తా.) కోరితేనే వాటిని చూపుతాడు. చూడండి, 6:109.
İsra' 17:94
మరియు ప్రజల ముందుకు మార్గదర్శకత్వం వచ్చినపుడు, దానిని విశ్వసించకుండా వారిని ఆపిందేమిటి? వారు (మూఢ విశ్వాసంలో మునిగి): "ఏమీ? అల్లాహ్ మానవుణ్ణి తన సందేశహరునిగా పంపాడా?" అని పలకడం తప్ప!
İsra' 17:95
ఇలా అను: "ఒకవేళ భూమి మీద దేవదూతలు నివసిస్తూ నిశ్చింతగా తిరుగుతూ ఉండినట్లయితే, మేము వారి కొరకు దేవదూతనే సందేశహరునిగా పంపి ఉండేవారము."
İsra' 17:96
ఇలా అను: "నాకూ మరియు మీకూ మధ్య అల్లాహ్ యే సాక్షిగా చాలు. నిశ్చయంగా ఆయన తన దాసులను బాగా ఎరుగువాడు, సర్వదృష్టికర్త."
İsra' 17:97
మరియు ఎవడికి అల్లాహ్ మార్గదర్శకత్వం చేస్తాడో అతడే సన్మార్గం పొందుతాడు. మరియు ఎవడిని ఆయన మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో వాడికి, ఆయన తప్ప, ఇతరుల నెవ్వరినీ నీవు సంరక్షకులుగా పొందలేవు. మరియు వారిని మేము పునరుత్థాన దినమున గ్రుడ్డివారిగా, మూగవారిగా మరియు చెవిటివారిగా చేసి, వారి ముఖాల మీద బోర్లా పడవేసి లాగుతూ ప్రోగుచేస్తాము. వారి ఆశ్రయం నరకమే! అది చల్లారినప్పుడల్లా మేము వారికై అగ్నిజ్వాలను తీవ్రం చేస్తాము.
İsra' 17:98
అదే వారి ప్రతిఫలం. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను తిరస్కరించారు మరియు అన్నారు: "ఏమీ? మేము ఎముకలుగా, పొడిగా మారిపోయిన తరువాత కూడా, సరిక్రొత్త సృష్టిగా మళ్ళీ లేపబడతామా?" [1]
———
[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 17:49.
İsra' 17:99
ఏమీ? వారు చూడటం లేదా (ఎరుగరా)? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడనీ[1] మరియు వారి వంటి వారినీ సృష్టించగల సమర్ధుడనీ మరియు ఆయనే వారి కొరకు ఒక నిర్ణీత సమయాన్ని నియమించాడనీ,[2] దానిని (ఆ సమయాన్ని) గురించి ఎలాంటి సందేహం లేదనీ; అయినా ఈ దుర్మార్గులు మొండిగా సత్యాన్ని తిరస్కరించటానికే పూనుకున్నారు.
———
[1] చూడండి, 40:57, 46:33 మరియు 36:81-82. [2] నిర్ణీత సమయం అంటే పునరుత్థాన దినం.
İsra' 17:100
వారితో అను: "ఒకవేళ మీరు నా ప్రభువు యొక్క అనుగ్రహపు నిధులను పొంది వున్నా, అవి ఖర్చయి పోతాయేమోననే భయంతో, వాటిని మీరు పట్టుకొని (ఖర్చు చేయకుండా) ఉండేవారు.[1] మరియు వాస్తవానికి మానవుడు ఎంతో లోభి!"
———
[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 4:53.
İsra' 17:101
మరియు మేము వాస్తవానికి, మూసాకు స్పష్టమైన తొమ్మిది అద్భుత సూచనలను ప్రసాదించాము.[1] ఇస్రాయీల్ సంతతి వారిని అడుగు, అతను (మూసా) వారి వద్దకు వచ్చినపుడు ఫిరఔన్ అతనితో అన్నాడు: "ఓ మూసా! నిశ్చయంగా, నీవు మంత్రజాలానికి గురి అయ్యావని నేను భావిస్తున్నాను."
———
[1] మూసా ('అ.స.) కు ఇవ్వబడిన (ఫిర్'ఔన్ జాతి వారికి చూపిన) తొమ్మిది అద్భుత సూచనలు: 1) ప్రకాశించే చేయి, 2) సర్పంగా మారే చేతి కర్ర, 3) దుష్టులకు కలిగిన కరువు మరియు ఫల నష్టము, 4) 'తుఫాను, 5) మిడుతల దండు, 6) పేనులు, 7) కప్పలు, 8) రక్తం మరియు 9) సముద్రంలో ఏర్పడిన బాట. ఇవి సూరహ్ అల్-అ'అరాఫ్ (7) లో కూడా వివరించబడ్డాయి. ఇబ్నె'అబ్బాస్, ముజాహిద్, ఇక్రిమా, షాబీ, ఖతద ర'ది. 'అన్హుమ్ ల వ్యాఖ్యానం, (ఇబ్నె-క'సీర్). ఇవేగాక బండ నుండి తీసిన 12 ఊటలూ, మన్న మరియు సల్వాలు కూడా అద్భుత సూచనలే, కానీ వీటిని ఫిర'ఔన్ జాతి వారు చూడలేదు.
İsra' 17:102
(మూసా) అన్నాడు: "నీకు బాగా తెలుసు, జ్ఞానవృద్ధి కలుగజేసే వాటిని (సూచనలను) భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరెవ్వరూ అవతరింపజేయలేరని! ఓ ఫిర్ఔన్, నీవు నిశ్చయంగా నశింపనున్నావని నేను భావిస్తున్నాను!"[1]
———
[1] మూసా ('అ.స.) యొక్క వివరాలకు చూడండి, 7:103-137 మరియు 20:49-79.
İsra' 17:103
అప్పుడు అతడు (ఫిర్ఔన్) వారిని భూమి (ఈజిప్టు) నుండి వెడలగొట్టాలని సంకల్పించుకున్నాడు. కావున మేము అతనిని (ఫిర్ఔన్ ను) మరియు అతనితో పాటు ఉన్న వారందరినీ ముంచి వేశాము.
İsra' 17:104
మరియు ఆ తరువాత, ఇస్రాయీల్ సంతతివారితో మేము ఇలా అన్నాము: "మీరు ఈ భూమిలో స్వేచ్ఛగా నివసించండి. కానీ అంతిమ వాగ్దానం ఆసన్నమైనప్పుడు, మేము మీరందరినీ ఒకేచోట చేర్చుతాము."
İsra' 17:105
మరియు మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) సత్యంతో అవతరింపజేశాము. మరియు ఇది సత్యంతోనే అవతరించింది. (ఓ ప్రవక్తా!) మేము నిన్ను కేవలం శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము!
İsra' 17:106
మరియు నీవు ప్రజలకు నెమ్మది నెమ్మదిగా చదివి వినిపించాలని, మేము ఖుర్ఆన్ ను విభజించి, క్రమక్రమంగా అవతరింపజేశాము.
İsra' 17:107
వారితో అను: "మీరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మినా నమ్మకపోయినా; నిశ్చయంగా, ఇది వరకు జ్ఞానమొసంగపడిన వారికి దీనిని వినిపించినప్పుడు, వారు తమ ముఖాల మీద పడి సాష్టాంగం (సజ్దా) చేస్తారు."
İsra' 17:108
మరియు ఇలా అంటారు: "మా ప్రభువు సర్వలోపాలకు అతీతుడు, మా ప్రభువు వాగ్దానం పూర్తయి తీరుతుంది."
İsra' 17:109
మరియు వారు ఏడుస్తూ, తమ ముఖాల మీద పడి పోతారు. మరియు వారి వినమ్రత మరింత అధికమవుతుంది.
İsra' 17:110
వారితో అను: "మీరు ఆయనను, అల్లాహ్! అని పిలవండీ, లేదా అనంత కరుణా మయుడు (అర్రహ్మాన్) ! అని పిలువండీ, మీరు ఆయనను ఏ పేరుతోనైనా పిలవండీ, ఆయనకున్న పేర్లన్నీ అత్యుత్తమమైనవే! నీ నమాజ్ లో నీవు చాలా గట్టిగా గానీ, చాలా మెల్లగా గానీ పఠించక, వాటి మధ్య మార్గాన్ని అవలంబించు."
İsra' 17:111
ఇంకా ఇలా అను: "సంతానం లేనటువంటి మరియు తన రాజరికంలో భాగస్వాములు లేనటువంటి మరియు తనలో ఎలాంటి లోపం లేనటువంటి మరియు సహాయకుడి అవసరం లేనటు వంటి అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు మీరు ఆయన మహనీయతను గొప్పగా కొనియాడండి!"
Kehf 18:1
తన దాసునిపై (ముహమ్మద్ పై) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేసిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు ఆయన ఇందులో ఏ విధమైన వక్తత్వాన్ని ఉంచలేదు. [1]
———
[1] చూడండి, 4:82, ఈ గ్రంథం అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి కాక ఇతరుల దగ్గర నుండి వచ్చి ఉంటే అందులో ఎన్నో లోపాలు ఉండేవి.
Kehf 18:2
ఇది సక్రమంగా స్థిరంగా ఉండి, ఆయన నుండి వచ్చే కఠిన శిక్షను గురించి హెచ్చరిస్తుంది మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి మంచి ప్రతిఫలం (స్వర్గం) తప్పక ఉంటుందనే శుభవార్తనూ ఇస్తుంది.
Kehf 18:3
అందులో వారు నిరంతరంగా కలకాలముంటారు.
Kehf 18:4
ఇంకా ఇది: "అల్లాహ్ కు సంతానముంది!" అని అనే వారిని హెచ్చరిస్తుంది.
Kehf 18:5
ఈ విషయాన్ని గురించి వారికి గానీ, వారి తండ్రి తాతలకు గానీ ఎలాంటి జ్ఞానం లేదు, వారి నోటి నుండి వచ్చే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు పలికేదంతా కేవలం అసత్యమే.
Kehf 18:6
ఈ సందేశాన్ని విశ్వసించని వారి వైఖరి వల్ల దుఃఖపడి బహుశా నీవు నీ ప్రాణాన్నే కోల్పోతావేమో!
Kehf 18:7
నిశ్చయంగా - ప్రజలలో మంచిపనులు చేసేవారు ఎవరో పరీక్షించటానికి - మేము భూమిపై ఉన్న వస్తువులను దానికి అలంకారంగా (ఆకర్షణీయమైనవిగా) చేశాము.
Kehf 18:8
మరియు నిశ్చయంగా, మేమే దానిపై ఉన్న దాన్నంతటినీ చదువైన మైదానం (బంజరునేల) గా మార్చగలము.
Kehf 18:9
ఏమీ? నిశ్చయంగా, ఆ గుహవాసులు మరియు ఆ శిలాఫలకం వారు, మా (ఇతర) సూచనలన్నింటిలో అద్భుతమైనవి నీవు భావించావా?[1]
———
[1] అంటే ఇదొక్కటే అద్భుత సూచన కాదు. దీని కంటే అద్భుత సూచనలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సూర్య-చంద్రుల, నక్షత్రాల మరియు రేయింబవళ్ళ సృష్టి మొదలైనవి. అర్-రఖీమ్ : కొందరు వ్యాఖ్యాతలు దీనిని ఆ గుహవాసుల నగరపు పేరని మరి కొందరు గుహ ఉన్న ఆ కొండ పేరని ఇంకా కొందరు ఆ సీసపు పలక దేనిపైనైతే వారి పేర్లు వ్రాయబడి ఉండెనో అది, అని అంటారు.
Kehf 18:10
(జ్ఞాపకం చేసుకోండి) ఎప్పుడైతే ఆ యువకులు ఆ గుహలో ఆశ్రయం పొందారో, ఇలా ప్రార్థించారు: "ఓ మా ప్రభూ! మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు. మరియు మా వ్యవహారంలో మేము నీతిపరులమై ఉండేటట్లు మమ్మల్ని సరిదిద్దు!"
Kehf 18:11
కావున ఆ గుహలో, కొన్ని సంవత్సరాల వరకు మేము వారి చెవులను మూసివేశాము.[1]
———
[1] వారికి గాఢ నిద్రను కలిగించాము.
Kehf 18:12
ఆ తరువాత ఆ రెండు పక్షాల వారిలో [1] ఎవరు, వారు (గుహలో) నివసించిన కాలాన్ని సరిగ్గా లెక్కపెడతారో చూద్దామని వారిని లేపాము.
———
[1] గుహలో నున్న వారిలోని రెండు పక్షాలు.
Kehf 18:13
మేము వారి యథార్థ గాథ నీకు వినిపిస్తున్నాము. నిశ్చయంగా, వారు తమ ప్రభువును విశ్వసించిన కొందరు యువకులు;[1] మేము వారి మార్గదర్శకత్వాన్ని అధికం చేశాము.
———
[1] ఫిత్ యతున్: అంటే 9 లేక దాని కంటే తక్కువ అని అర్థం. ఆ యువకులు 'ఈసా ('అ.స.) కంటే ముందు వారు కావచ్చని ఇబ్నె-కసీ'ర్ (ర'హ్మ) అభిప్రాయం. మరికొందరు వారు క్రైస్తవులని అంటారు. వారు ఎవరైనా సరే, ఏక దైవ సిద్ధాంతంపై ఉన్నవారూ మరియు కేవలం అల్లాహ్ (సు.తా.) ను మాత్రమే ఆరాధించేవై ఉండిరి. వారి కాలపు నాయకులు మరియు ఇతర ప్రజల వలే అల్లాహ్ (సు.తా.) ను విడిచి ఇతరులను ఆరాధించేవారు కారు. కాబట్టి ఆ సత్యతిరస్కారుల శిక్షకు భయపడి ఏకాంతపు కొండగుహలో శరణం తీసుకొని ఉండిరి.
Kehf 18:14
మరియు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని ప్రసాదించాము. వారు లేచి నిలబడినప్పుడు ఇలా అన్నారు: "భూమ్యాకాశాల ప్రభువే మా ప్రభువు! ఆయనను వదలి మేము వేరే దైవాన్ని ఎలాంటి స్థితిలోనూ ప్రార్థించము. వాస్తవానికి అలా చేస్తే దారుణం చేసిన వారమవుతాము!
Kehf 18:15
"ఈ, మా జాతివారు ఆయనను విడిచి ఇతర దైవాలను నియమించుకున్నారు. అయితే, వారిని (ఆ దైవాలను) గురించి వారు స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురారు? ఇక అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవాని కంటే మించిన దుర్మార్గుడు ఎవడు?"
Kehf 18:16
(వారు పరస్పరం ఇలా అనుకున్నారు): "ఇపుడు మీరు వారిని మరియు అల్లాహ్ ను కాదని వారు ఆరాధించే దైవాలను విడిచి, గుహలో శరణు తీసుకోండి. మీ ప్రభువు తన కారుణ్యాన్ని మీపై విస్తరింపజేస్తాడు. మరియు మీ కార్యాలను సరిదిద్ది వాటిని మీకు సులభమైనట్లుగా చేస్తాడు."
Kehf 18:17
మరియు వారు (ఆ గుహలోని) ఒక విశాలమైన భాగంలో (నిద్రిస్తూ) ఉన్నప్పుడు; సూర్యుడు ఉదయించే టప్పుడు, (ఎండ) వారి గుహ నుండి కుడి ప్రక్కకు వాలి పోవటాన్ని మరియు అస్తమించేటప్పుడు (ఎండ) ఎడమ ప్రక్కకు తొలగి పోవటాన్ని నీవు చూసి ఉంటావు. ఇది అల్లాహ్ సూచనలలో ఒకటి. అల్లాహ్ మార్గదర్శకత్వం చేసినవాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గభ్రష్టత్వంలో వదలిన వాడికి సరైన మార్గం చూపే సంరక్షకుడిని నీవు పొందలేవు.
Kehf 18:18
మరియు వారు నిద్రపోతున్నప్పటికీ, నీవు వారిని మేల్కొని ఉన్నారనే భావించి ఉంటావు! మరియు మేము వారిని కుడి ప్రక్కకు మరియు ఎడమ ప్రక్కకు మరలించే వారము. మరియు వారి కుక్క గుహద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాచి పడి ఉండెను. ఒకవేళ నీవు వారిని తొంగిచూసి ఉంటే, నీవు తప్పక వెనుదిరిగి పారిపోయే వాడవు మరియు వారిని గురించి భయకంపితుడవై పోయేవాడవు.
Kehf 18:19
మరియు ఈ విధంగా (ఉన్న తరువాత), వారు ఒకరినొకరు ప్రశ్నించుకోవటానికి మేము వారిని (నిద్ర నుండి) లేపాము. వారిలో నుండి ఒకడు మాట్లాడుతూ ఇలా అన్నాడు: "మీరు ఈ స్థితిలో ఎంత కాలమున్నారు?" వారన్నారు: "మేము ఒక దినమో లేదా అంతకంటే తక్కువనో ఈ స్థితిలో ఉన్నాము."[1] (మరికొందరు) ఇలా అన్నారు: "మీరెంత కాలమున్నారో మీ ప్రభువుకే తెలుసు! మీలో ఒకనికి నాణ్యం (డబ్బు) ఇచ్చి పట్టణానికి పంపండి. అతడు అక్కడ శ్రేష్ఠమైన ఆహారాన్ని వెతికి, దానినే మీ కొరకు తినటానికి తెస్తాడు. అతడు జాగ్రత్తగా వ్యవహరించాలి మరియు మీ గురించి ఎవ్వడికీ తెలియనివ్వ గూడదు.
———
[1] చూడండి, 2:259 అక్కడ ఒకడు, మరణించి నూరు సంవత్సరాలు పడి ఉన్న తరువాత, అల్లాహ్ (సు.తా.) అతడిని మరల సజీవునిగా చేసినప్పుడు ఇలాగే భావిస్తాడు. అల్లాహుతా'ఆలా నిర్జీవుల నుండి సజీవులను మరియు సజీవుల నుండి నిర్జీవులను తేగలడు, అనే సత్యానికి ఇది ఉదాహరణం. ఇంకా చూడండి, 3:27, 6:95, 10:31, 30:19.
Kehf 18:20
"ఒకవేళ వారు మిమ్మల్ని గుర్తు పడితే, వారు తప్పక మిమ్మల్ని రాళ్ళు రువ్వి చంపుతారు లేదా (బలవంతంగా) మిమ్మల్ని వారి మతంలోకి త్రిప్పుకుంటారు, అలాంటప్పుడు మీరు ఎలాంటి సాఫల్యం పొందలేరు."
Kehf 18:21
మరియు ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమని చివరి ఘడియ నిశ్చయమని, అది రావటంలో ఎలాంటి సందేహం లేదని తెలుసుకోవటానికి, ఆ యువకుల విషయం ప్రజలకు తెలియజేశాము. అప్పుడు వారు (ప్రజలు) వారి (గుహవాసుల) విషయాన్ని తీసుకొని పరస్పరం వాదులాడుకున్న విషయం (జ్ఞాపకం చేసుకోండి!) వారిలో కొందరన్నారు: "వారి కొరకు ఒక స్మారక భవనం నిర్మించాలి." వారి విషయం వారి ప్రభువుకే తెలుసు. ఆ వ్యవహారంలో పైచేయి (ప్రాబల్యం) ఉన్నవారు: "వారి స్మారకంగా ఒక మస్జిద్ ను నిర్మించాలి." అని అన్నారు.
Kehf 18:22
(వారి సంఖ్యను గురించి) కొందరంటారు: "వారు ముగ్గురు, నాలుగవది వారి కుక్క." మరికొందరంటారు: "వారు అయిదుగురు ఆరవది వారి కుక్క." ఇవి వారి ఊహాగానాలే. ఇంకా కొందరంటారు: "వారు ఏడుగురు, ఎనిమిదవది వారి కుక్క." వారితో అను: "వారి సంఖ్య కేవలం నా ప్రభువుకే తెలుసు. వారిని గురించి కొందరికి మాత్రమే తెలుసు." కావున నిదర్శనం లేనిదే వారిని గురించి వాదించకు. మరియు (గుహ) వారిని గురించి వీరిలో ఎవ్వరితోనూ విచారణ చేయకు.
Kehf 18:23
మరియు ఏ విషయాన్ని గురించి అయినా: "నేను ఈ పనిని రేపు చేస్తాను." అని అనకు -
Kehf 18:24
"అల్లాహ్ కోరితే తప్ప (ఇన్షా అల్లాహ్)!" అని అననిదే![1] మరియు నీ ప్రభువును స్మరించు, ఒకవేళ నీవు మరచిపోతే! ఇలా ప్రార్థించు: "బహుశా నా ప్రభువు నాకు సన్మార్గం వైపునకు దీని కంటే దగ్గరి త్రోవ చూపుతాడేమో!"
———
[1] యూదులు దైవప్రవక్త ('స'అస) తో మూడు ప్రశ్నలు అడిగారు: 1) రూ'హ్ ఆత్మ అంటే ఏమిటి? 2) గుహవారి విషయం ఏమిటి? 3) జు'ల్-ఖర్ నైన్ ఎవడు? దైవప్రవక్త ('స'అస) అన్నారు: 'నేను రేపు మీకు జవాబిస్తాను.' కాని అతను ('స'అస): "అల్లాహ్ కోరితే," (ఇన్షా 'అల్లాహ్! అని అనలేదు. కావున 15 రోజుల వరకు ఏ వ'హీ రాలేదు. ఆ తరువాత వ'హీ వచ్చినప్పుడు: "ఇన్షా 'అల్లాహ్," అని తప్పక అనాలని ఆజ్ఞ వచ్చింది.
Kehf 18:25
మరియు వారు తమ గుహలో మూడు వందల సంవత్సరాలు ఉన్నారు. మరియు వాటి తొమ్మిది సంవత్సరాలు అధికం.[1]
———
[1] చాలామంది వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం ఇది అల్లాహ్ (సు.తా.) ప్రవచనం. అంటే వారు గుహలో 300 సూర్య సంవత్సరాలు లేక 309 చాంద్రమాన సంవత్సరాలు ఉన్నారు.
Kehf 18:26
వారితో అను: "వారెంతకాలం (గుహలో) ఉన్నారో అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న సమస్త అగోచర విషయాలు కేవలం ఆయనకే తెలుసు. ఆయన అంతా చూడగలడు మరియు వినగలడు. వారికి ఆయన తప్ప మరొక సంరక్షకుడు లేడు మరియు ఆయన తన ఆధిపత్యంలో ఎవ్వడినీ భాగస్వామిగా చేర్చుకోడు."
Kehf 18:27
మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు గ్రంథం నుండి నీపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) చదివి వినిపించు.[1] ఆయన ప్రవచనాలను ఎవ్వడూ మార్చలేడు. మరియు ఆయన వద్ద తప్ప నీవు మరెక్కడా శరణు పొందలేవు. [2]
———
[1] గుహవారి కథ వినిపిస్తూ అల్లాహుతా'ఆలా అలా అంటున్నాడు:'ఇప్పుడు నిన్ను ప్రశించేవారికి ఇది వినిపించు.' వాస్తవానికి ('స'అస) ఎల్లప్పుడు తనపై అవతరింపజేయబడిన దివ్య జ్ఞానాన్నంతా ప్రజలకు వినిపించారు. మరియు వారిని సన్మార్గం వైపునకు పిలిచారు. అది అతని ('స'అస) విద్యుక్త ధర్మం. అల్లాహ్ (సు.తా.) దాని కొరకే ప్రవక్తలను ఎన్నుకుంటాడు. [2] అల్లాహ్ (సు.తా.) ప్రవచనాలను ఉన్నవి ఉన్నట్లుగా ఎట్టి మార్పులు చేయకుండా వినిపించాలని ఆజ్ఞ ఇవ్వబడుతోంది. లేనిచో అల్లాహ్ (సు.తా.) శిక్ష నుండి తప్పించేవాడు ఎవ్వడూ లేడు. ఈ ప్రవచనం దైవప్రవక్త ('స'అస) తో చెప్పబడినా అది సర్వసమాజం కొరకు వర్తిస్తుంది.
Kehf 18:28
మరియు (ఓ ప్రవక్తా!) ఎవరు ఆయన ముఖ దర్శనం (ప్రసన్నతను) కోరుతూ, ఉదయం మరియు సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తున్నారో, వారి సహచర్యంలోనే సహనం వహించి ఉండు. ఇహలోక ఆడంబరాలను అపేక్షించి నీ దృష్టిని వారి నుండి దాటనివ్వకు (వారిని ఉపేక్షించకు).[1] మరియు అలాంటి వానిని అనుసరించకు (మాట వినకు), ఎవడి హృదయాన్ని మా ధ్యానం నుండి తొలగించామో మరియు ఎవడు తన మనోవాంఛలను అనుసరిస్తున్నాడో మరియు ఎవడి వ్యవహారాలు (కర్మలు) వ్యర్థమయ్యాయో!
———
[1] ఈ వాక్యం 6:52లో కూడా ఉంది. స'ఆద్ బిన్ అబీ- వఖ్ఖా'స్ కథనం: ఒకసారి దైవప్రవక్త '(స'అస) స'ఆద్ బిన్ అబీ-వఖ్ఖా'స్, బిలాల్, ఇబ్నె-మసూ'ద్, ఒక 'హజ'లీ మరియు ఇద్దరు 'స'హాబీ (ర'ది. 'అన్హుమ్)లతో కలిసి కూర్చొని ఉంటారు. అప్పుడు కొందరు ఖురైష్ నాయకులు వచ్చి, దైవప్రవక్త ('స'అస)తో: 'వీరిని మీ దగ్గర నుండి పంపండి. మేము మీతో మాట్లాడదలచాము.' అని అంటారు. అప్పుడు దైవప్రవక్త ('స'అ)కు తట్టుతుంది: 'బహుశా వీరు నా మాట వింటారేమో.' అని, కాని అల్లాహుతా'ఆలా అతనిని ('స'అ) నివారించాడు.' ('స.ముస్లిం)
Kehf 18:29
మరియు వారితో అను: "ఇది మీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున ఇష్టపడిన వారు దీనిని విశ్వసించ వచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు!" నిశ్చయంగా, మేము దుర్మార్గుల కొరకు నరకాగ్నిని సిద్ధపరచి ఉంటాము, దాని జ్వాలలు వారిని చుట్టుకుంటాయి. అక్కడ వారు నీటి కొరకు మొర పెట్టుకున్నప్పుడు, వారికి ముఖాలను మాడ్చే (మరిగే) నూనె వంటి నీరు (అల్ ముహ్లు) ఇవ్వబడుతుంది. అది ఎంత చెడ్డ పానీయం మరియు ఎంత చెడ్డ (దుర్భరమైన) విరామ స్థలం!
Kehf 18:30
నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో, నిశ్చయంగా మేము అలాంటి వారి మంచిపనుల ప్రతిఫలాన్ని వృథా కానివ్వము.[1]
———
[1] ప్రజలలో స్వర్గాన్ని పొందే అభిలాష అధికం కావాలని ఇక్కడ నరకం తర్వాత స్వర్గపు సౌఖ్యాల ప్రస్తావన ఇవ్వబడింది.
Kehf 18:31
అలాంటి వారు! వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే శాశ్వత స్వర్గవనాలు ఉంటాయి. అందు వారు బంగారు కంకణాలను మరియు ఆకు పచ్చని బంగారు జలతారుగల పట్టు వస్త్రాలను ధరించి, ఎత్తైన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.[1] ఎంత మంచి ప్రతిఫలం మరియు ఎంత శ్రేష్ఠమైన విరామ స్థలం!
———
[1] రాజులు బంగారు కంకణాలు, ఆభరణాలు మరియు పట్టు వస్త్రాలు ధరిస్తారు. స్వర్గవాసులకు రాజులకు ఉంటేటటువంటి సుఖసంతోషాలు ఉంటాయిని చెప్పడానికి ఈ వివరాలు ఇవ్వబడ్డాయి. మరియు పురుషులకు ఇహలోకంలో హరాం చేయబడిన, బంగారు ఆభరణాలు మరియు పట్టు వస్త్రాలను వారు త్యజించుకుంటే వారికి స్వర్గంలో అవన్నీ లభిస్తాయి. అంతేగాక వారు కోరేవన్నీ దొరుకుతాయి. చూడండి, 22:23, 35:33, 76:21.
Kehf 18:32
మరియు వారికి ఆ ఇద్దరు మనుష్యుల ఉదాహరణ తెలుపు: వారిద్దరిలో ఒకడికి మేము రెండు ద్రాక్షతోటలను ప్రసాదించి, వాటి చుట్టూ ఖర్జూరపు చెట్లను మరియు వాటి మధ్య పంటపొలాన్ని ఏర్పరిచాము.
Kehf 18:33
ఆ రెండు తోటలు, ఏ కొరతా లేకుండా (పుష్కలంగా) పంటలిచ్చేవి. మరియు వాటి మధ్య మేము ఒక సెలయేరును ప్రవహింపజేశాము.
Kehf 18:34
మరియు అతడికి పుష్కలమైన ఫలాలు పండేవి (లాభాలు వచ్చేవి). మరియు అతడు తన పొరుగువాడితో మాట్లాడుతూ అన్నాడు: "నేను నీ కంటే ఎక్కువ ధనవంతుణ్ణి మరియు నా వద్ద బలవంతులైన మనుషులు కూడా ఉన్నారు."
Kehf 18:35
మరియు ఈ విధంగా అతడు తనకు తాను అన్యాయం చేసుకునేవాడవుతూ, తన తోటలో ప్రవేశించి ఇలా అన్నాడు: "ఇది ఎన్నటికైనా నాశనమవుతుందని నేను భావించను!
Kehf 18:36
మరియు అంతిమ ఘడియ కూడా వస్తుందని నేను భావించను, ఒకవేళ నా ప్రభువు వద్దకు నేను తిరిగి మరలింపబడినా, అచ్చట నేను దీని కంటే మేలైన స్థానాన్నే పొందగలను." [1]
———
[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 41:50 మరియు 19:77.
Kehf 18:37
అతడి పొరుగువాడు అతడితో మాట్లాడుతూ అన్నాడు: "నిన్ను మట్టితో, [1] తరువాత ఇంద్రియ బిందువుతో సృష్టించి, ఆ తరువాత నిన్ను (సంపూర్ణ) మానవుడిగా తీర్చిదిద్దిన ఆయన (అల్లాహ్)ను నీవు తిరస్కరిస్తున్నావా?
———
[1] ఆదమ్ ('అ.స.) మట్టితో సృష్టించిన వివరాలకు చూడండి, 3:59, 23:12, 11:61, 22:5 మరియు 30:20.
Kehf 18:38
కాని నిశ్చయంగా, నా మట్టుకు మాత్రం ఆయన! అల్లాహ్ యే నా ప్రభువు మరియు నేను ఎవ్వడినీ నా ప్రభువుకు భాగస్వామిగా (సాటిగా) కల్పించను.
Kehf 18:39
"మరియు ఒకవేళ నీవు, నన్ను సంపదలో మరియు సంతానంలో నీ కంటే తక్కువగా తలచినప్పటికీ, నీవు నీ తోటలో ప్రవేశించినపుడు: "అల్లాహ్ కోరిందే అవుతుంది (మాషా అల్లాహ్), సర్వశక్తికి ఆధారభూతుడు కేవలం అల్లాహ్ యే (లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్)! అని అని వుంటే ఎంత బాగుండేది.
Kehf 18:40
"వాస్తవానికి నా ప్రభువు, నీ తోట కంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించి, దాని (నీ తోట) పైకి ఆకాశం నుండి ఒక పెద్ద ఆపదను పంపి, దానిని చదునైన మైదానంగా చేయవచ్చు!
Kehf 18:41
లేదా ! దాని నీటిని భూమిలో ఇంకి పోయినట్లు చేస్తే, నీవు దానిని ఏ విధంగానూ తిరిగి పొందలేవు!"
Kehf 18:42
మరియు అతడి పంటను (వినాశం) చుట్టుముట్టింది, అతడు తాను ఖర్చు చేసినదంతా నాశనమైనదని చేతులు నలుపుకుంటూ ఉండిపోయాడు. మరియు అది దాని పందిరితో సహా నాశనమైపోయింది. మరియు అతడు ఇలా వాపోయాడు: "అయ్యో! నా దౌర్భాగ్యం! నేను నా ప్రభువుకు భాగస్వాములను (షరీక్ లను) కల్పించకుండా ఉంటే ఎంత బాగుండేది!"
Kehf 18:43
మరియు అల్లాహ్ కు విరుద్ధంగా అతడికి సహాయపడే వారెవ్వరూ లేక పోయారు. మరియు అతడు కూడా తనకు తాను సహాయం చేసుకోలేక పోయాడు.
Kehf 18:44
అక్కడ (ఆ తీర్పుదినం నాడు)[1] శరణు (రక్షణ) కేవలం అల్లాహ్, ఆ సత్యవంతునిదే! ఆయనే ప్రతిఫలం ఇవ్వటంలో ఉత్తముడు మరియు అత్యుత్తమ అంతిమ ఫలితం ఇచ్చేవాడు.
———
[1] ఈ బ్రాకెట్ ఇబ్నె-కసీ'ర్ లో ఇవ్వబడి ఉంది.
Kehf 18:45
మరియు వారికి ఇహలోక జీవితాన్ని[1] ఈ ఉపమానం ద్వారా బోధించు: మేము ఆకాశం నుండి నీటిని కురిపించినపుడు, దానిని భూమిలోని చెట్టూ చేమలు పీల్చుకొని (పచ్చగా పెరుగుతాయి). ఆ తరువాత అవి ఎండి పొట్టుగా మారిపోయినపుడు, గాలి వాటిని చెల్లాచెదురు చేస్తుంది. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతిదీ చేయగల సమర్ధుడు.
———
[1] ఇహలోక జీవితం ఈ విధంగా బోధించబడుతోంది: అల్లాహుతా'ఆలా! ఆ ఏకైక ఆరాధ్యుడు, సర్వశక్తిమంతుడు, కోరితే మన జీవితాలను, వర్షం కురిసినపుడు కళకళలాడే పంటపొలాల మాదిరిగా చేయగలడు. లేదా ఎండిన పొట్టుగా గాలికి ఎగురవేయగలడు. కేవలం అల్లాహ్ (సు.తా.) యే ప్రతిదీ చేయగల సమర్థుడు. ఇటువంటి వాక్యాలకు చూడండి 10:24, 39:21, 57:20
Kehf 18:46
ఈ సంపదా మరియు ఈ సంతానం, కేవలం ఐహిక జీవితపు అలంకారాలు మాత్రమే. కాని శాశ్వతంగా నిలిచేవి సత్కార్యాలే! అవే నీ ప్రభువు దృష్టిలో ప్రతిఫలానికి ఉత్తమమైనవి మరియు దానిని ఆశించటానికి కూడా ఉత్తమమైనవి.[1]
———
[1] సత్కార్యాలంటే మంచి పనులు; అల్లాహ్ (సు.తా.) నియమించిన విధులు (ఫ'ర్ద్ లు) వాజిబాత్ లు, దైవప్రవక్త సంప్రదాయాలు (సునన్), అదనంగా చేసే మంచి పనులు (నవాఫిల్). ఇంతే గాకుండా నిషేధింపబడిన వాటి నుండి దూరంగా ఉండటం కూడా సత్కార్యాలలోనే లెక్కించ బడుతుంది. ఇంకా ఇటువంటివాక్యానికి చూడండి, 19:76.
Kehf 18:47
మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజున మేము పర్వతాలను చలింపజేస్తాము.[1] మరియు నీవు భూమిని చదువైన మైదానంగా చూస్తావు. మరియు మేము ఒక్కడిని కూడా విడువకుండా అందరినీ సమావేశపరుస్తాము.
———
[1] పర్వతాలు ఏకిన దూదివలే మారి ఎగిరిపోతూ ఉంటాయి. చూడండి, 101:5, 52:9-10, 27:88, 20:105-107 మరియు భూమిపై ఉన్న భవనాలూ, చెట్టుచేమలూ అన్నీ నాశనమై పోయి భూమి ఒక చదునైన మైదానంగా మారి పోతుంది.
Kehf 18:48
మరియు వారందరు నీ ప్రభువు సన్నిధిలో వరుసలలో ప్రవేశపెట్టబడతారు, (నీ ప్రభువు వారితో): "వాస్తవానికి మేము మొదటిసారి మిమ్మల్ని పుట్టించిన స్థితిలోనే[1] మీరు మా వద్దకు వచ్చారు! కాని మా ముందు హాజరయ్యే ఘడియను మేము నియమించలేదని మీరు భావించేవారు కదా!" అని పలుకుతాడు.
———
[1] ఇట్టి వాక్యానికి చూడండి, 6:94.
Kehf 18:49
మరియు కర్మపత్రం వారి ముందు ఉంచబడినపుడు, ఆ అపరాధులు, అందులో ఉన్న దానిని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం, ఇదేమి గ్రంథం! ఏ చిన్న విషయాన్న గానీ, ఏ పెద్ద విషయాన్ని గానీ ఇది లెక్కపెట్టకుండా విడువ లేదే!" తాము చేసిందంతా వారు తమ ఎదుట పొందుతారు. నీ ప్రభువు ఎవ్వరికీ అన్యాయం చేయడు.
Kehf 18:50
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము దేవదూతలతో: "ఆదమ్ కు సాష్టాంగ పడండి." అని చెప్పినపుడు, ఒక్క ఇబ్లీస్ తప్ప మిగతా వారందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతులలోని వాడు.[1] అప్పుడు అతడు తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించాడు. ఏమీ? మీరు నన్ను కాదని అతనిని మరియు అతని సంతానాన్ని స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకుంటారా? మరియు వారు మీ శత్రువులు కదా! దుర్మార్గులకు ఎంత చెడ్డ ఫలితముంది.
———
[1] ఇబ్లీస్ దైవదూత కాడు జిన్నాతుడు అని ఇక్కడ విశదమౌతుంది. ఇంకా చూడండి, 2:31-34.
Kehf 18:51
నేను ఆకాశాలను మరియు భూమిని సృష్టించినప్పుడు గానీ, లేదా స్వయంగా వారిని (షైతానులను) సృష్టించినప్పుడు గానీ వారిని సాక్షులుగా పెట్టలేదు.[1] మార్గం తప్పించే వారిని నేను (అల్లాహ్) సహాయకులుగా చేసుకునే వాడను కాను.
———
[1] అంటే భూమ్యాకాశాలను మరియు (వారిని) షైతానులను సృష్టించినప్పుడు, వారు (షై'తానులు) ఉనికిలో లేరు. అల్లాహ్ (సు.తా.) యే వారిని సృష్టించాడు.
Kehf 18:52
మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ దినమున ఆయన (అల్లాహ్) వారితో: "మీరు నా భాగస్వాములని భావించిన వారిని పిలవండి!" అని అన్నప్పుడు, వారు (భాగస్వాములుగా భావించిన) వారిని పిలుస్తారు, కాని వారు వారికి జవాబివ్వరు. మరియు మేము వారి మధ్య ఒక పెద్ద లోతైన వినాశగుండాన్ని నియమించి ఉంటాము.
Kehf 18:53
మరియు ఆ అపరాధులు నరకాగ్నిని చూసి వారు తప్పక అందులో పడవలసి ఉన్నదని తెలుసుకుంటారు. మరియు వారు దాని నుండి తప్పించుకోవటానికి ఎలాంటి ఉపాయం పొందరు.
Kehf 18:54
మరియు నిశ్చయంగా, మేము ఈ ఖుర్ఆన్ లో మానవులకు, ప్రతి విధమైన ఉపమానాన్ని వివరించాము. కాని మానవుడు పరమ జగడాల మారి!
Kehf 18:55
మరియు వారి ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు, దానిని విశ్వసించకుండా మరియు తమ ప్రభువు సన్నిధిలో క్షమాభిక్ష కోరకుండా ఉండటానికి వారిని ఆటంక పరిచిందేమిటి! వారి పూర్వీకుల మీద పడిన (ఆపద) వారి మీద కూడా పడాలనో, లేదా ఆ శిక్ష ప్రత్యక్షంగా వారిపైకి రావాలనో వేచి ఉండటం తప్ప?
Kehf 18:56
మరియు మేము సందేశహరులను కేవలం శుభవార్తలు అందజేసేవారిగా మరియు హెచ్చరికలు చేసేవారిగా మాత్రమే పంపుతాము. మరియు సత్యతిరస్కారులు, సత్యాన్ని ఖండించటానికి నిరర్థకమైన మాటలతో వాదులాడుతారు. మరియు నా సూచనలను మరియు హెచ్చరికలను హాస్యంగా తీసుకుంటారు.
Kehf 18:57
మరియు తన ప్రభువు సూచనలతో హితబోధ చేయబడినపుడు, వాటికి విముఖుడై తన చేతులారా చేసుకొని పంపిన దాన్ని (దుష్పరిణామాన్ని) మరచి పోయే వ్యక్తి కంటే, పరమ దుర్మార్గుడెవడు? వారు దానిని (ఖుర్ఆన్ ను) అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాల మీద తెరలు వేసి ఉన్నాము మరియు వారి చెవులకు చెవుడు కలిగించాము. కావున, నీవు వారిని సన్మార్గం వైపునకు పిలిచినా వారెన్నటికీ సన్మార్గం వైపునకు రాలేరు.
Kehf 18:58
మరియు నీ ప్రభువు క్షమాశీలుడు, కారుణ్యమూర్తి. ఆయన వారి దుష్కర్మల ఫలితంగా వారిని పట్టుకోదలిస్తే, వారిపై తొందరగానే శిక్ష పంపి ఉండేవాడు. కాని వారికొక నిర్ణీత సమయం నిర్ణయించబడి ఉంది, దాని నుండి వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.[1]
———
[1] ఇటువంటి ఆయతులకు చూడండి, 16:61 మరియు 35:45
Kehf 18:59
మరియు (ఆ నగరాల వారు) దుర్మార్గం చేసినందుకు మేము నాశనం చేసిన నగరాలు ఇవే! మరియు వారి నాశనం కొరకు కూడా మేము ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నాము.
Kehf 18:60
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన సేవకునితో [1] ఇలా అన్నది: "రెండు సముద్రాల సంగమ స్థలానికి చేరనంత వరకు నేను నా ప్రయాణాన్ని ఆపను.[2] నేను సంవత్సరాల తరబడి సంచరిస్తూ ఉండవలసినా సరే!"[3]
———
[1] ఈ యువకుడే యూషాఅ'బిన్. మూసా ('అ.స.) తరువాత, అతను తన జాతి వారికి నాయకత్వాన్ని వహించారు. [2] ఈ సంగమ స్థానం అఖ్బా అఖాతం మరియు సూయజ్ అఖాతం రెండు వచ్చి ఎర్ర సముద్రంలో (రెడ్ సీ) లో కలిసే సంగమం కావచ్చని వ్యాఖ్యాతల అభిప్రాయం. [3] మూసా ('అ.స.) ఒకనితో ఒకసారి: 'నాకు మించిన జ్ఞానవంతుడు ఇప్పుడు ఎవ్వడూ లేడు!' అని అంటారు. అది అల్లాహ్ (సు.తా.)కు నచ్చదు. అప్పుడు అల్లాహుతా'ఆలా అతనితో రెండు సముద్రాల సంగమంలో నీవు: 'నిన్ను మించిన జ్ఞానిని పొందగలవు.' అని దివ్యజ్ఞానం ద్వారా తెలుపుతాడు. అప్పుడతను ('అ.స.) ఆ జ్ఞాని అన్వేషణలో బయలుదేరుతారు.
Kehf 18:61
ఆ పిదప వారిద్దరు ఆ (రెండు సముద్రాల) సంగమ స్థలానికి చేరినప్పుడు, వారి చేపను గురించి మరిచిపోయారు. అది వారి నుండి తప్పించుకొని వేగంగా సముద్రంలోకి - సొరంగం గుండా పోయినట్లు [1] - దూసుకు పోయింది.
———
[1] "తన త్రోవను సొరంగంగా చేసుకుంటూ." (ఇది ము'హమ్మద్ జునాగఢీ గారి తాత్పర్యం). పైన ఉన్నది నోబుల్ ఖుర్ఆన్ తాత్పర్యము.
Kehf 18:62
ఆ పిదప వారు మరికొంత ముందుకు పోయిన తరువాత, అతను (మూసా) తన సేవకునితో ఇలా అన్నాడు: "మన భోజనం తీసుకురా! వాస్తవానికి మనం ఈ ప్రయాణంలో చాలా అలసిపోయాము."
Kehf 18:63
(సేవకుడు) ఇలా అన్నాడు: "చూశారా! మనం ఆ బండ మీద విశ్రాంతి తీసుకోవటానికి ఆగినపుడు వాస్తవానికి నేను చేపను గురించి పూర్తిగా మరచి పోయాను. షైతాను తప్ప మరెవ్వడూ నన్ను దానిని గురించి మరపింపజేయలేదు. అది విచిత్రంగా సముద్రంలోకి దూసుకొని పోయింది!"
Kehf 18:64
(మూసా) అన్నాడు: "అదే కదా, మనం కోరుతున్నది (వెతుకుతున్న స్థానం)!" ఆ పిదప వారిరువురు తమ అడుగుజాడలను అనుసరిస్తూ వెనుకకు మరలిపోయారు.
Kehf 18:65
అప్పుడు వారు మా దాసులలో ఒక దాసుణ్ణి (అచ్చట) చూశారు. మేము అతనికి మా అనుగ్రహాన్ని ప్రసాదించి,[1] అతనికి మా తరఫు నుండి విశిష్ట జ్ఞానం నేర్పి ఉన్నాము.[2]
———
[1] ర'హ్మాతున్: అంటే ఇక్కడ ప్రత్యేక అనుగ్రహాలు అని కొందరు వ్యాఖ్యాతలు అన్నారు. మరియు చాలా మంది వ్యాఖ్యాతలు దీనిని ప్రవక్త పదవిగా వ్యాఖ్యానించారు. [2] అల్లాహుతా'ఆలా 'ఖి'ద్ర్ ('అ.స.)కు ప్రవక్త పదవినే గాక, తన వైపు నుండి విశిష్ట జ్ఞానం కూడా ప్రసాదించాడు.
Kehf 18:66
మూసా అతనితో (ఖిద్ర్ తో) అన్నాడు: "నీకు నేర్పబడిన జ్ఞానాన్ని నీవు నాకు నేర్పుటకై నేను నిన్ను అనుసరించ వచ్చునా?"
Kehf 18:67
అతను జవాబిచ్చాడు: "నీవు నాతో పాటు ఏ మాత్రం సహనం వహించలేవు!
Kehf 18:68
అసలు నీకు తెలియని విషయాన్ని గురించి నీవెట్లు సహనం వహించగలవు?"
Kehf 18:69
(మూసా) అన్నాడు: "అల్లాహ్ కోరితే! నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు. నేను నీ యొక్క ఏ ఆజ్ఞనూ ఉల్లంఘించను!"
Kehf 18:70
అతను అన్నాడు: "ఒకవేళ నీవు నన్ను అనుసరించటానికే నిశ్చయించుకుంటే, స్వయంగా నేనే నీతో ప్రస్తావించనంత వరకు నీవు నన్ను, ఏ విషయాన్ని గురించి కూడా ప్రశ్నించకూడదు."
Kehf 18:71
ఆ పిదప వారిద్దరూ బయలుదేరారు. చివరికి వారిద్దరు పడవలో ఎక్కినపుడు అతను పడవకు రంధ్రం చేశాడు. (మూసా) అతనితో అన్నాడు: "ఏమీ? పడవలో ఉన్న వారిని ముంచి వేయటానికా, నీవు దానిలో రంధ్రం చేశావు? వాస్తవానికి, నీవు ఒక దారుణమైన పని చేశావు!"
Kehf 18:72
అతను అన్నాడు: "నేను నీతో అనలేదా? నీవు నాతో పాటు ఏ మాత్రం సహనం వహించలేవని?"
Kehf 18:73
(మూసా) అన్నాడు: "మరచిపోయి చేసిన దానికి నన్ను తప్పుపట్టకు. నేను చేసిన దానికి నా పట్ల కఠినంగా వ్యవహరించకు!"
Kehf 18:74
ఆ పిదప వారు తమ ప్రయాణం సాగించగా వారికి ఒక బాలుడు కలిశాడు. అతను వానిని (బాలుణ్ణి) చంపాడు. (అది చూసి) మూసా అన్నాడు: "ఏమీ? ఒక అమాయకుడిని చంపావా? అతడు ఎవ్వడినీ (చంపలేదే)! వాస్తవానికి నీవు ఒక ఘోరమైన పని చేశావు!"
Kehf 18:75
అతను (ఖిద్ర్) అన్నాడు: "నేను నీతో అనలేదా, నిశ్చయంగా, నీవు నాతో పాటు ఏ మాత్రం సహనం వహించలేవని?"
Kehf 18:76
(మూసా) అన్నాడు: "ఇక ముందు దేన్ని గురించి అయినా నిన్ను అడిగితే నన్ను నీతో పాటు ఉండనివ్వకు. వాస్తవానికి నీవు, నా తరఫు నుండి ఇంత వరకు చాలినన్ని సాకులు స్వీకరించావు."
Kehf 18:77
ఆ పిదప వారిద్దరూ ముందుకు సాగిపోయి ఒక నగరం చేరుకొని ఆ నగరవాసులను భోజనమడిగారు. కాని వారు (ఆ నగరవాసులు) వారిద్దరికి ఆతిథ్యమివ్వటానికి నిరాకరించారు.[1] అప్పుడు వారక్కడ కూలిపోనున్న ఒక గోడను చూశారు. అతను (ఖిద్ర్) దానిని మళ్ళీ నిలబెట్టాడు. (మూసా) అన్నాడు: "నీవు కోరితే దానికి (ఆ శ్రమకు) ప్రతిఫలం (వేతనం) తీసుకొని ఉండవచ్చు కదా!"
———
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'అల్లాహుతా'ఆలాను మరియు పరలోకాన్ని విశ్వసించేవాడు, తన అతిథిని ఆదరించాలి, ఆతిథ్యమివ్వాలి.' ('ఫైద్ అల్ - ఖదీర్, ష'ర్హ్ అల్ జామె' అ'స్స'గీర్ 5-209)
Kehf 18:78
అతను (ఖిద్ర్) అన్నాడు: "ఇక నేనూ నీవూ విడిపోవలసిన (సమయం) వచ్చింది. ఇక నీవు సహనం వహించ లేక పోయిన విషయాల వాస్తవాలను (తత్త్వాలను) గురించి నీకు తెలుపుతాను.
Kehf 18:79
ఇక ఆ నావ విషయం: అది సముద్రంలో పని చేసుకునే కొందరు పేదవారిది. కావున దానిలో లోపం కలిగించగోరాను; ఎందుకంటే వారి వెనుక ఒక క్రూరుడైన రాజు ఉన్నాడు. అతడు (లోపం లేని) ప్రతి నావను బలవంతంగా తీసుకుంటాడు.
Kehf 18:80
ఇక ఆ బాలుని విషయం: అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతడు తన సత్యతిరస్కారం మరియు తలబిరుసుతనం వలన వారిని బాధిస్తాడని భయపడ్డాము.
Kehf 18:81
కావున వారిద్దరి ప్రభువు వారికి అతనికి బదులు అతని కంటే ఎక్కువ నీతిమంతుడు మరియు కారుణ్యం గలవాడిని ఇవ్వాలని కోరాము.
Kehf 18:82
ఇక ఆ గోడ విషయం: అది ఈ పట్టణంలోని ఇద్దరు ఆనాథ బాలురకు చెందినది. దాని క్రింద వారి ఒక నిధి (పాతబడి) ఉంది. మరియు వారి తండ్రి పుణ్యపురుషుడు. ఆ ఇద్దరు బాలురు యుక్తవయస్తులైన పిదప - నీ ప్రభువు కారుణ్యంగా - తమ నిధిని, వారు త్రవ్వి తీసుకోవాలని, నీ ప్రభువు సంకల్పం. ఇదంతా నా అంతట నేను చేయలేదు. నీవు సహనం వహించలేని విషయాల వాస్తవం (తత్త్వం) ఇదే!"
Kehf 18:83
మరియు వారు నిన్ను జుల్ ఖర్ నైన్[1] ను గురించి అడుగుతున్నారు. వారితో అను: "అతనిని గురించి జ్ఞాపకముంచుకో దగిన విషయాన్ని నేను మీకు వినిపిస్తాను."
———
[1] జు'ల్-ఖర్ నైన్ అంటే రెండు కొమ్ములున్నవాడు.
Kehf 18:84
నిశ్చయంగా మేము అతని (అధికారాన్ని) భూమిలో స్థాపించాము మరియు అతనికి ప్రతిదానిని పొందే మార్గాన్ని చూపాము.[1]
———
[1] అస్-సబబు: అంటే ఇక్కడ తాను కోరిన దానిని పొందే మార్గాన్ని అన్వేంషించడమని అర్థం.
Kehf 18:85
అతను ఒక మార్గం మీద పోయాడు.
Kehf 18:86
చివరకు సూర్యుడు అస్తమించు (నట్లు కనబడే) స్థలానికి చేరాడు. దానిని (సూర్యుణ్ణి) నల్ల బురద వంటి నీటి చెలిమలో మునుగుతున్నట్లు చూశాడు.[1] మరియు అక్కడొక జాతి వారిని చూశాడు. మేము అతనితో అన్నాము:[2] "ఓ జుల్ ఖర్ నైన్! నీవు వారిని శిక్షించవచ్చు, లేదా వారి యెడల ఉదార వైఖరిని అవలంబించవచ్చు!"
———
[1] 'ఐనున్: సముద్రం లేక చెలిమ. 'హమిఅతిన్: బురద. వజద: పొందాడు, చూశాడు, కనుగొన్నాడు. అతడు పూర్తి పశ్చిమ దిశకు పోయిన తరువాత అక్కడ ఒక సముద్రం లేక చెలిమను చూశాడు. దాని నీరు నల్లని బురదగా కనిపించింది. దాని తరువాత అతనికి ఏమీ కనిపించక అస్తమయ్యే సూర్యుడు మాత్రమే కనిపించాడు. సముద్రపు ఒడ్డున నిలబడి అస్తమించే సూర్యుణ్ణి చూస్తే, సూర్యుడు ఆ సముద్రమలో మునిగిపోతున్నట్లు కనబడటం మనం చూస్తున్న విషయమే! భూమి గుండ్రంగా ఉన్నదనటానికి ఇదొక నిదర్శనం. [2] ఖుల్నా: మేమన్నాము, అంటే అల్లాహుతా'ఆలా అనతికి వ'హీ ద్వారా తెలిపాడు. అంటే, అతడు ప్రవక్త కావచ్చని కొందరు భావిస్తారు. అతనిని ప్రవక్తగా పరిగణించని వారు; ఆ కాలపు ప్రవక్త ద్వారా అతనికి సందేశం ఇవ్వబడిందని అంటారు.
Kehf 18:87
అతను అన్నాడు: "ఎవడైతే దుర్మార్గం చేస్తాడో మేము అతనిని శిక్షిస్తాము. ఆ పిదప అతడు తన ప్రభువు వైపునకు మరలింపబడతాడు. అప్పుడు ఆయన అతనికి ఘోరమైన శిక్ష విధిస్తాడు.
Kehf 18:88
ఇక ఎవడైతే! విశ్వసించి సత్కార్యాలు చేస్తాడో అతనికి మంచి ప్రతిఫల ముంటుంది. మేము అతనిని ఆజ్ఞాపించి నపుడు, సులభతరమైన ఆజ్ఞనే ఇస్తాము."
Kehf 18:89
తరువాత అతను మరొక మార్గం మీద పోయాడు.
Kehf 18:90
చివరకు సూర్యుడు ఉదయించు (నట్లు కనబడే) స్థలానికి చేరాడు. అక్కడ అతను దానిని (సూర్యుణ్ణి) ఒక జాతిపై ఉదయించడం చూశాడు. వారికి మేము దాని (సూర్యుని) నుండి కాపాడుకోవటానికి ఎలాంటి చాటు (రక్షణ) నివ్వలేదు.[1]
———
[1] ఆ జాతివారు ఇండ్లలో నివసించేవారు కాదు. మైదానాలలో నివసించేవారు. మరియు వారు బట్టలు కూడా ధరించకుండా నివసించే ఆదివాసులు.
Kehf 18:91
ఈ విధంగా! వాస్తవానికి, అతనికి (జుల్ ఖర్ నైన్ కు) తెలిసి ఉన్న విషయాలను గురించి మాకు బాగా తెలుసు.
Kehf 18:92
ఆ తరువాత అతను మరొక మార్గం మీద పోయాడు.
Kehf 18:93
చివరకు అతను రెండు పర్వతాల మధ్య చేరాడు. వాటి మధ్య ఒక జాతివారిని చూశాడు. వారు అతని మాటలను అతి కష్టంతో అర్థం చేసుకోగలిగారు.[1]
———
[1] ఆ జాతి వారు తమ భాష తప్ప ఇతరుల భాషను అర్థం చేసుకోలేరు. కావున వారు అతని మాటలను అర్థం చేసుకోలేక పోయారు.
Kehf 18:94
వారన్నారు: "ఓ జుల్ ఖర్ నైన్! వాస్తవానికి యాజూజ్ మరియు మాజూజ్ లు,[1] ఈ భూభాగంలో కల్లోలం రేకెత్తిస్తున్నారు. అయితే నీవు మాకూ మరియు వారికీ మధ్య ఒక అడ్డుగోడను నిర్మించటానికి, మేము నీకేమైనా శుల్కం చెల్లించాలా?"
———
[1] వీరి గాథ బైబిల్ లో కూడా పేర్కొనబడింది. చూడండి, యెహంజ్కేలు - (Exekiel), 38:2 మరియు 39:6. ఇంకా ఇతర చోట్లలో కూడా వీరి విషయం పేర్కొనబడింది. చూడండి, యోహాను ప్రకటన - (Revelation of St. John), 20:8. చాలా మంది వ్యాఖ్యాతలు వీరిని మంగోలులు లేక టాటార్ లు (Mongols or Tatars) కావచ్చని అంటారు. వీరు అసత్యవాదులు మరియు అంతిమ గడియకు ముందు భూమిలో కల్లోలం రేకెత్తించి మానవ నాగరికతను నాశనం చేస్తారు. ఇంకా చూడండి, 21:96-97. వాస్తవం అల్లాహ్ (సు.తా.)కే తెలుసు. 'స'హీ'హ్ బు'ఖారీ మరియు ముస్లింలలో ఇలా ఉంది: 'యా'జూజ్ మా'జూజ్ లు,' రెండు మానవ జాతులు. వారి సంఖ్య ఇతర మానవుల కంటే అధికముగా ఉంటుంది. మరియు వారితోనే నరకం అత్యధికంగా నిండుతుంది.
Kehf 18:95
అతను అన్నాడు: "నా ప్రభువు ఇచ్చిందే నాకు ఉత్తమమైనది. ఇక మీరు మీ శ్రమ ద్వారా మాత్రమే నాకు సహాయపడితే, నేను మీకూ మరియు వారికీ మధ్య అడ్డుగోడను నిర్మిస్తాను.
Kehf 18:96
"మీరు నాకు ఇనుప ముద్దలు తెచ్చి ఇవ్వండి." అతను ఆ రెండు కొండల మధ్య ఉన్న సందును మూసిన తరువాత వారితో అన్నాడు: "అగ్ని రగిలించండి." దానిని ఎర్రని నిప్పుగా మార్చిన తరువాత, అన్నాడు: "ఇక కరిగిన రాగిని తీసుకు రండి, దీని మీద పోయటానికి."
Kehf 18:97
ఈ విధంగా వారు (యాజూజ్ మరియు మాజూజ్ లు) దానిపై నుండి ఎక్కి రాలేక పోయారు. మరియు దానిలో కన్నం కూడా చేయలేక పోయారు.
Kehf 18:98
అతను (జుల్ ఖర్ నైన్) అన్నాడు: "ఇది నా ప్రభువు యొక్క కారుణ్యం. కాని నా ప్రభువు వాగ్దానపు ఘడియ వచ్చినపుడు ఆయన దీనిని బూడిదగా మార్చివేస్తాడు. మరియు నా ప్రభువు వాగ్దానం నిజమై తీరుతుంది."
Kehf 18:99
మరియు ఆ (యాజూజ్ మరియు మాజూజ్ లు బయటికి వచ్చిన) రోజు, మేము వారిని అలల వలే ఒకరి మీద ఒకరు పడటానికి వదిలివేస్తాము. మరియు బాకా (సూర్) ఊదబడి నప్పుడు, వారందరినీ ఒకచేట సమావేశ పరుస్తాము.
Kehf 18:100
మరియు ఆ రోజున మేము సత్యతిరస్కారులకు నరకాన్ని స్పష్టంగా చూసేందుకు వారి ముందుకు తెస్తాము.
Kehf 18:101
అలాంటి వారికి, ఎవరి కన్నులైతే, మా హితోపదేశం పట్ల కప్పబడి ఉండెనో మరియు వారికి, ఎవతైతే (దానిని) ఏ మాత్రమూ వినటానికి కూడా ఇష్టపడలేదో!
Kehf 18:102
ఏమీ? ఈ సత్యతిరస్కారులు నన్ను వదలి, నా దాసులను తమ స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకొనగలరని భావించారా? నిశ్చయంగా, మేము సత్యతిరస్కారుల ఆతిథ్యం కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంటాము.
Kehf 18:103
వారితో అను: "కర్మలను బట్టి అందరి కంటే ఎక్కువ నష్టపడేవారు ఎవరో మీకు తెలుపాలా?
Kehf 18:104
"ఎవరైతే ఇహలోక జీవితంలో చేసే కర్మలన్నీ వ్యర్థమైనా, తాము చేసే వన్నీ సత్కార్యాలే అని భావిస్తారో!
Kehf 18:105
వీరే తమ ప్రభువు సూచనలను మరియు ఆయనను కలుసుకోవలసి వున్నదనే విషయాన్ని తిరస్కరించిన వారు. కావున వారి కర్మలన్నీ వ్యర్థమయ్యాయి. కాబట్టి మేము పునరుత్థాన దినమున వారి కర్మలకు ఎలాంటి విలువ (తూకము) నివ్వము.
Kehf 18:106
అదే వారి ప్రతిఫలం నరకం! ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు మరియు నా సూచనలను మరియు నా సందేశహరులను పరిహసించారు.
Kehf 18:107
నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! వారి ఆతిథ్యం కొరకు ఫిర్ దౌస్ స్వర్గవనాలు ఉంటాయి.[1]
———
[1] జన్నతుల్-ఫిర్ దౌస్: ఇది అన్నిటి కంటే ఉత్తమమైన స్వర్గం. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'మీరు ఎల్లప్పుడు జన్నతుల్ ఫిర్ దౌస్ కొరకే ప్రార్థించండి.' ('స'హీ'హ్ బు'ఖారీ).
Kehf 18:108
వారందులో శాశ్వతంగా ఉంటారు. వారు అక్కడి నుండి వేరగుటకు ఇష్టపడరు.
Kehf 18:109
వారితో అను: "నా ప్రభువు మాటలను వ్రాయటానికి, సముద్రమంతా సిరాగా మారి పోయినా - నా ప్రభువు మాటలు పూర్తికాక ముందే - దానికి తోడుగా దాని వంటి మరొక సముద్రాన్ని తెచ్చినా, అది కూడా తరిగి పోతుంది."[1]
———
[1] చూడండి, 31:27.
Kehf 18:110
(ఓ ప్రవక్తా!) ఇంకా ఇలా అను: "నిశ్చయంగా, నేను కూడా మీలాంటి ఒక మానవుడనే! నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేయబడింది. నిశ్చయంగా, మీ ఆరాధ్య దేవుడు ఆ ఏకైక దైవం (అల్లాహ్) మాత్రమే! కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా (షరీక్ లుగా) కల్పించుకోరాదు."
Meryem 19:1
కాఫ్ - హా - యా - ఐన్ - సాద్[1].
———
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
Meryem 19:2
ఇది నీ ప్రభువు తన దాసుడు జకరియ్యాపై చూపిన కారుణ్య ప్రస్తావన.
Meryem 19:3
అతను తన ప్రభువును రహస్యంగా (ఏకాంతంలో) మొరపెట్టుకుంటూ;
Meryem 19:4
ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నా ఎముకలు బలహీనమై పోయాయి మరియు నా తల (వెంట్రుకలు) ముసలితనం వల్ల తెల్లబడి మెరిసిపోతున్నాయి మరియు ఓ నా ప్రభూ! నిన్ను వేడుకొని నేను ఎన్నడూ నిష్పలుడను కాలేదు!
Meryem 19:5
మరియు వాస్తవానికి నా తరువాత నా బంధువులు (ఏమి చేస్తారో అని) నేను భయ పడుతున్నాను. నా భార్యనేమో గొడ్రాలు. కావున (నీ అనుగ్రహంతో) నాకు ఒక వారసుణ్ణి ప్రసాదించు.
Meryem 19:6
అతడు నాకు మరియు యఅఖూబ్ సంతతి వారికి వారసుడవుతాడు మరియు ఓ నా ప్రభూ! అతనిని నీకు ప్రీతిపాత్రునిగా చేసుకో!"
Meryem 19:7
(అతనికి ఇలా జవాబివ్వబడింది): "ఓ జకరియ్యా! నిశ్చయంగా, మేము నీకు 'యహ్యా' అనే పేరు గల ఒక కుమారుని శుభవార్తను ఇస్తున్నాము![1] ఇంతకు పూర్వం మేము ఈ పేరు ఎవ్వరికీ ఇవ్వలేదు."
———
[1] చూడండి, 3:39.
Meryem 19:8
(జకరియ్యా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? నా భార్యనేమో గొడ్రాలు,[1] మరియు నేనేమో వృద్ధాప్యంతో క్షీణించి (దుర్భలుడనై) పోయాను?"
———
[1] 'జకరియ్యా ('అ.స.) భార్య, మర్యమ్ ('అ.స.) తల్లి యొక్క సోదరిమణి అని కొందరంటారు. చూడండి, 3:37 వ్యాఖ్యానం 3. మరికొందరు ఆమె మర్యమ్ ('అ.స.) తండ్రి 'ఇమ్రాన్ కూతురని అంటారు. అంటే య'హ్యా ('అ,స.) మరియు 'ఈసా ('అ.స.) అక్కాచెల్లేళ్ళ కుమారులు, అంటె కజిన్ లు. ('స'హీ'హ్ అ'హాదీస్ ల ఆధారంగా, ఫ'త్హ్ అల్-ఖదీర్.)
Meryem 19:9
ఇలా జవాబిచ్చాడు: "అలాగే అవుతుంది. నీ ప్రభువు ఇలా అంటున్నాడు: 'ఇది నాకు సులభం మరియు వాస్తవానికి ఇంతకు ముందు నీవు ఏమీ లేనప్పుడు, నేను నిన్ను సృష్టించాను కదా!'"
Meryem 19:10
(జకరియ్యా) అన్నాడు: " ఓ నా ప్రభూ! నాకొక గుర్తును నియమించు." ఇలా జవాబు ఇవ్వబడింది: "నీ గుర్తు ఏమిటంటే! నీవు స్వస్థతతో ఉండి కూడా వరుసగా మూడు రాత్రులు (దినములు) ప్రజలతో మాట్లాడలేవు."[1]
———
[1] చూడండి, 3:41
Meryem 19:11
ఆ పిదప అతను (జకరియ్యా) తన ప్రార్థనాలయం నుండి బయటికి వచ్చి తన జాతి వారికి, సైగలతో ఉదయమూ మరియు సాయంత్రమూ, ఆయన (ప్రభువు) పవిత్రతను కొనియాడండని సూచించాడు.
Meryem 19:12
(అతని కుమారునితో ఇలా అనబడింది): "ఓ యహ్యా! ఈ దివ్యగ్రంథాన్ని గట్టిగా పట్టుకో." మరియు మేము అతనికి బాల్యంలోనే వివేకాన్ని[1] ప్రసాదించాము.
———
[1] అల్-'హుక్మ్: అంటే జ్ఞానం, తెలివి, నిర్ణయసామర్థ్యం గ్రంథాన్ని అర్థం చేసుకునే శక్తి, మొదలైనవన్నీ అని ఇమామ్ షౌకాని అభిప్రాయం.
Meryem 19:13
మరియు మా తరఫు నుండి కనికరాన్ని, పరిశుద్ధతను ఒనంగాము మరియు అతను దైవభీతి గలవాడు.
Meryem 19:14
మరియు తన తల్లిదండ్రుల పట్ల కర్తవ్యపాలకుడు మరియు అతను హింసాపరుడు గానీ, అవిధేయుడు గానీ కాడు.
Meryem 19:15
మరియు అతను పుట్టినరోజూ మరియు అతను మరణించే రోజూ మరియు అతను బ్రతికించి మరల లేపబడే రోజూ అతనికి శాంతి కలుగు గాక![1]
———
[1] ఎందుకంటే ఈ మూడు దినాలు మానవుని కొరకు ఎంతో కష్టదాయకమైనవి మరియు భయంకరమైనవి.
Meryem 19:16
మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్ లో) ఉన్న మర్యమ్ (గాథను) ప్రస్తావించు. ఆమె తన కుటుంబం వారిని విడిచి తూర్పుదిశలో ఒక స్థలానికి వెళ్ళిపోయింది.
Meryem 19:17
అక్కడ ఆమె వారి నుండి ఏకాంతంలో ఒక అడ్డుతెర కట్టుకొని ఉండసాగింది. అప్పుడు మేము ఆమె వద్దకు మా దూత (జిబ్బీల్)ను పంపాము.[1] అతను ఆమె ముందు సంపూర్ణ మానవ ఆకారంలో (రూపంలో) ప్రత్యక్షమయ్యాడు.
———
[1] రూహు'న్: దివ్యజ్ఞానం (వ'హీ)గా లేక దానిని తెచ్చే దేవదూత జిబ్రీల్ ('అ.స.) గా ఉపయోగించబడింది. ఇక్కడ దేవదూత జిబ్రీల్ ('అ.స.)గా ఉపయోగించబడింది. రూ'హుల్ ఖుద్స్: అని , 2:87, 253, 5:110 మరియు 16:102లలో జిబ్రీల్ ('అ.స.) కొరకు నాలుగు చోట్లలో వాడబడింది. రూ'హుల్ అమీన్: అని 26:193లో జిబ్రీల్ ('అ.స.) కొరకు వాడబడింది. అర్-రూ'హు: అని ఇక్కడ, 78:38 మరియు 97:4లలో జిబ్రీ('అ.స.) కొరకు మూడు చోట్లలో వాడబడింది, అవతరణలో మొదటిసారిగా 97:4లో వచ్చింది. అర్-రూ'హు: అంటే దివ్యజ్ఞానం అని, 16:2, 40:15 మరియు 42:52లలో మూడు చోట్లలో వాడబడింది.
Meryem 19:18
(మర్యమ్) ఇలా అన్నది: "ఒకవేళ నీవు దైవభీతి గల వాడవే అయితే! నిశ్చయంగా నేను నీ నుండి (రక్షింపబడటానికి) అనంత కరుణామయుని శరణు వేడుకుంటున్నాను."
Meryem 19:19
(దేవదూత ఇలా) జవాబిచ్చాడు: "నిశ్చయంగా, నేను నీ ప్రభువు యొక్క సందేశహరుడను! నీకు ఒక సుశీలుడైన (నీతిమంతుడైన) కుమారుని (సందేశాన్ని) ఇవ్వటానికి పంపబడ్డాను."
Meryem 19:20
ఆమె ఇలా ప్రశ్నించింది: "నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? నన్ను ఏ మానవుడునూ ముట్టుకోలేదే! మరియు నేను చెడు నడవడిక గల దానిని కూడా కాను!"
Meryem 19:21
అతనన్నాడు: "అలాగే అవుతుంది! నీ ప్రభువు అంటున్నాడు: 'అది నాకు సులభం! మేము అతనిని, మా నుండి ప్రజలకు ఒక సూచనగా మరియు కారుణ్యంగా పంపుతున్నాము.' మరియు (నీ ప్రభువు) ఆజ్ఞ నెరవేరి తీరుతుంది."
Meryem 19:22
తరువాత మర్యమ్ ఆ బాలుణ్ణి గర్భంలో భరించి, అతనితో ఒక దూరమైన స్థలానికి వెళ్ళిపోయింది.
Meryem 19:23
ఆ తరువాత ప్రసవ వేదనతో ఆమె ఒక ఖర్జూరపు చెట్టు మొదలు దగ్గరికి చేరుకొని ఇలా వాపోయింది: "అయ్యో! నా దౌర్భాగ్యం, దీనికి ముందే నేను చనిపోయి వుంటే! మరియు నామరూపాలు లేకుండా నశించి పోతే ఎంత బాగుండేది!"
Meryem 19:24
అప్పుడు క్రింది నుండి ఒక ధ్వని వినిపించింది: "నీవు దుఃఖించకు! వాస్తవాంగా నీ ప్రభువు, నీ క్రింద (దగ్గరగా) ఒక సెలయేరు సృష్టించాడు;
Meryem 19:25
మరియు నీవు ఈ చెట్టు మొదలు పట్టి ఊపితే నీపై తాజా ఖర్జూరపు పండ్లు రాలుతాయి.
Meryem 19:26
కావున నీవు తిను త్రాగు, నీ కళ్ళను చల్లబరచుకో! ఇక ఏ మానవుణ్ణి చూసినా అతనితో (సైగలతో): 'నేను నా కరుణామయుని కొరకు ఉపవాసమున్నాను, కావున ఈ రోజు నేను ఏ మానవునితో మాట్లాడను.' అని చెప్పు."
Meryem 19:27
తరువాత ఆమె ఆ బాలుణ్ణి తీసుకొని తన జాతి వారి వద్దకు రాగా! వారన్నారు: "ఓ మర్యమ్! వాస్తవానికి నీవు నింద్యమైన (పాపమైన) పని చేశావు!
Meryem 19:28
ఓ హారూన్ సోదరీ![1] నీ తండ్రీ చెడ్డవాడు కాదు మరియు నీ తల్లి కూడా చెడు నడత గలది కాదే!"
———
[1] హారూన్ సోదరీ! అంటే ఆమెకు హారూన్ అనే సవతి (అర్థ) సోదరుడు ఉండవచ్చు, లేదా మూసా ('అ.స.) సోదరుడు హారూన్ తో సంబంధం ఉన్నందున అలా పిలువబడి ఉండవచ్చు! తమ వంశంలోని పెద్దవాని పేరుతో పిలువబడటం ఆచారమే. (ఇబ్నె-కసీ'ర్ మరియు ఏసర్ అత్ -తఫాసీర్). చూడండి, 3:37 వ్యాఖ్యానం 3.
Meryem 19:29
అప్పుడామె అతని (ఆ బాలుని) వైపు సైగ చేసింది. వారన్నారు: "తొట్టెలో వున్న ఈ బాలునితో మేమెలా మాట్లాడగలము?"
Meryem 19:30
(ఆ బాలుడు) అన్నాడు: "నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుణ్ణి. ఆయన నాకు దివ్యగ్రంథాన్నిచ్చి, నన్ను ప్రవక్తగా నియమించాడు.
Meryem 19:31
మరియు నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు; నేను బ్రతికి వున్నంత కాలం నమాజ్ చేయమని మరియు విధిదానం (జకాత్) ఇవ్వమని నన్ను ఆదేశించాడు.
Meryem 19:32
మరియు నన్ను నా తల్లి యెడల కర్తవ్యపాలకునిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగా, దౌర్భాగ్యునిగా చేయలేదు.
Meryem 19:33
మరియు నేను పుట్టినరోజూ మరియు నేను మరణించే రోజూ మరియు నేను సజీవుడనై మరల లేచే రోజూ, నాకు శాంతి కలుగు గాక!"
Meryem 19:34
ఇతనే మర్యమ్ కుమారుడు ఈసా! ఇదే సత్యమైన మాట, దీనిని గురించే వారు వాదులాడుతున్నారు (సందేహంలో పడి ఉన్నారు).
Meryem 19:35
ఎవరినైనా కుమారునిగా చేసుకోవటం అల్లాహ్ కు తగినపని కాదు. ఆయన సర్వలోపాలకు అతీతుడు, ఆయన ఏదైనా చేయదలుచు కుంటే, దానిని కేవలం: "అయిపో!" అని అంటాడు, అంతే అది అయిపోతుంది.[1]
———
[1] అల్లాహుతా'ఆలా ప్రతిదీ చేయగల సమర్థుడు. తాను చేయదలచుకున్న దానిని: 'అయిపో!' అని అనగానే, అది అయిపోతుంది. అలాంటప్పుడు ఆయన (సు.తా.)కు సంతానపు ఆవశ్యకత ఎలా ఉంటుంది. అల్లాహుతా'ఆలాకు సంతానముందని భావించేవారు ఆయన (సు.తా.) శక్తి సామర్థ్యాలను విశ్వసించనట్లే! అది సత్యతిరస్కారం.
Meryem 19:36
(ఈసా అన్నాడు): "నిశ్చయంగా అల్లాహ్ యే నా ప్రభువు మరియు మీ ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గము."
Meryem 19:37
తరువాత విభిన్న (క్రైస్తవ) వర్గాల వారు (ఈసాను గురించి) పరస్పర అభిప్రాయభేదాలు నెలకొల్పుకున్నారు. కావున ఈ సత్యతిరస్కారులకు ఆ మహా దినపు దర్శనం వినాశాత్మకంగా ఉంటుంది.[1]
———
[1] యూదులు 'ఈసా ('అ.స.)ను మాంత్రికుడు, యూసుఫ్ నజ్జార్ కుమారుడు అన్నారు. ప్రొటెస్టెంట్ క్రైస్తవులు అతనిని అల్లాహ్ (సు.తా.) కుమారుడు అన్నారు. కేథోలిక్ తెగవారు అతను ముగ్గురు దైవాలలో, అల్లాహ్ (సు.తా.) జిబ్రీల్ ('అ.స.) మరియు 'ఈసా ('అ.స.) ముగ్గురిలో మూడవవారు అన్నారు. ఆర్థోడాక్స్ తెగవారు అతనిని స్వయం దేవుడు (God అల్లాహ్) అన్నారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్ మరియు అయ్ సర్ అత్-తఫాసీర్)
Meryem 19:38
వారు మా ముందు హాజరయ్యే రోజున వారి చెవులు బాగానే వింటాయి మరియు వారి కండ్లు బాగానే చూస్తాయి. కాని ఈనాడు ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు.[1]
———
[1] కాని వారు వినడం మరియు చూడడం పునరుత్థాన దినమున వారికి ఏమీ పనికి రావు.
Meryem 19:39
మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని[1] గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించ బడి ఉంటుంది.[2] (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు, కావున వారు విశ్వసించడం లేదు.
———
[1] యౌమల్-'హస్ రతి: పశ్చాత్తాప పడే దినం అంటే పునరుత్థాన దినము. [2] పునరుత్థాన దినమున స్వర్గానికి అర్హులైన వారిని స్వర్గానికి మరియు నరకానికి అర్హులైన వారిని నరకానికి పంపిన తరువాత మరణం ఒక గొర్రె ఆకారంలో తేబడుతుంది. దానిని స్వర్గనరకాల మధ్య నిలబెట్టబడి, స్వర్గ-నరక వాసులతో: 'దీనిని ఎరుగుదురా?' అని ప్రశ్నించగా వారు: 'అవును, ఇది మరణం.' అని అంటారు. వారి సమక్షంలో అది వధింపబడుతుంది. అప్పుడు స్వర్గవాసులతో ఇలా అనబడుతుంది: 'స్వర్గవాసులారా! మీ కొరకు స్వర్గజీవితం కలకాలం ఉంటుంది.' మరియు నరకవాసులతో అనబడుతుంది: 'మీకు ఈ నరకశిక్ష ఎల్లప్పుడూ ఉంటుంది.' మరియు మీ కెవ్వరికీ ఇక చావురాదు. ('స'హీ'హ్ బు'ఖారీ).
Meryem 19:40
నిశ్చయంగా! భూమికి మరియు దానిపై వున్న వారికి వారసులం మేమే! వారందరూ మా వైపునకే మరలింపబడతారు.
Meryem 19:41
మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్ లో) వున్న ఇబ్రాహీమ్ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను సత్యవంతుడైన దైవప్రవక్త.
Meryem 19:42
అతను తన తండ్రితో ఇలా అన్నప్పుడు: "ఓ నాన్నా! వినలేని మరియు చూడలేని మరియు నీకు ఏ విధంగానూ సహాయపడలేని వాటిని, నీవెందుకు ఆరాధిస్తున్నావు?
Meryem 19:43
ఓ నాన్నా! వాస్తవానికి, నా వద్దకు వచ్చిన జ్ఞానం నీ వద్దకు రాలేదు, కావున నీవు నన్ను అనుసరిస్తే, నేను నీకు సరైన మార్గం చూపుతాను.
Meryem 19:44
ఓ నాన్నా! నీవు షైతాన్ ను ఆరాధించకు, నిశ్చయంగా షైతాన్ అనంత కరుణామయుణ్ణి ఉల్లంఘించాడు.
Meryem 19:45
ఓ నాన్నా! నిశ్చయంగా, నీవు అనంత కరుణామయుని శిక్షకు గురి అయ్యి, షైతాను యొక్క స్నేహితుడవు / సహచరుడవు (వలి) అయి పోతావేమోనని నేను భయపడుతున్నాను!"
Meryem 19:46
(అతని తండ్రి) అన్నాడు: "ఓ ఇబ్రాహీమ్! ఏమీ? నీవు నా దేవుళ్ళకు విముఖత చూపుతున్నావా? ఒకవేళ నీవిది మానుకోక పోతే నేను నిన్ను రాళ్ళు రువ్వి చంపిస్తాను. కావున నీవు నా నుండి చాలా దూరమై పో!"
Meryem 19:47
(ఇబ్రాహీమ్) అన్నాడు: "నీకు సలాం![1] నీ కొరకు నా ప్రభువు క్షమాపణను వేడుకుంటాను.[2] నిశ్చయంగా, ఆయన నా యెడల ఎంతో దయాళువు.
———
[1] ఈ సలాం ఇక నా సంభాషణ ముగిస్తాను, అనే భావంలో ఉంది. ఎందుకంటే దీని ముందు 'అల్' లేదు. ఇంకా ఇటువంటి సందర్భానికి చూడండి, 25:63. [2] ఈ దు'ఆ - ముష్రిక్ ల కొరకు క్షమాపణ పేడుకోరాదని తెలియక - అల్లాహ్ (సు.తా.) ను, తన తండ్రిని క్షమించమని వేడుకున్నది. కాని ముష్రిక్ కొరకు క్షమాపణ వేడుకోరాదని, తెలిసిన తరువాత, అతని తండ్రి అల్లాహ్ (సు.తా.) కు విరోధుడని స్పష్టమైనప్పుడు, అతను ('అ.స.) తన తండ్రి నుండి దూరమయ్యాడు. అంటే అతని క్షమాపణ కొరకు ప్రార్థించడం మానుకున్నాడు. చూడండి, 9:114.
Meryem 19:48
మరియు నేను మిమ్మల్ని - మరియు అల్లాహ్ కు బదులుగా మీరు ప్రార్థిస్తున్న వాటిని - అందరినీ వదలి పోతున్నాను. మరియు నేను నా ప్రభువును ప్రార్థిస్తాను. నేను నా ప్రభువును ప్రార్థించి విఫలుడను కానని, నమ్ముతున్నాను!"
Meryem 19:49
అతను (ఇబ్రాహీమ్) వారిని - మరియు అల్లాహ్ ను వదలి వారు ఆరాధించే వాటిని - వదలి పోయిన తరువాత మేము అతనికి ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించాము. మరియు ప్రతి ఒక్కరినీ ప్రవక్తలుగా చేశాము.
Meryem 19:50
మరియు వారికి మా కారుణ్యాన్ని ప్రసాదించాము. వారికి నిజమైన, ఉన్నతమైన కీర్తి ప్రతిష్ఠను కలుగజేశాము.
Meryem 19:51
మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్) లో వచ్చిన మూసా గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను (అల్లాహ్) ఎన్నుకున్న ఒక సందేశహరుడు మరియు ఒక ప్రవక్త.[1]
———
[1] చూడండి, 22:52 రసూలున్: సందేశహరుడు - అంటే అల్లాహ్ (సు.తా.) తన సందేశం అవతరింపజేయటానికి ఎన్నుకున్న ప్రవక్త. సందేశహరునిపై దివ్యగ్రంథం అవతరింపజేయబడుతుంది, ఉదా.మూసా('అ.స.) నబియ్యున్: ప్రవక్త - దివ్యగ్రంథమివ్వబడక అతని కంటే ముందు వచ్చి ఉన్న దివ్యగ్రంథపు సందేశాన్నే ప్రజలకు బోధించేవాడు. ఉదా. హారూన్ ('అ.స.) చూడండి, 19:53. సందేశహరులందరూ ప్రవక్తలే కాని ప్రవక్తలందరూ సందేశరులు కారు.
Meryem 19:52
మరియు మేము తూర్ కొండ కుడివైపు నుండి అతనిని (మూసాను) పిలిచి,[1] అతనితో ఏకాంతంలో మాట్లాడటానికి మమ్మల్ని సమీపింపజేశాము.
———
[1] వివరాల కొరకు చూడండి, 20:9 మరియు దాని తరువాత ఉన్న ఆయతులు.
Meryem 19:53
మరియు మా కారుణ్యంతో, అతనికి తోడుగా అతని సోదరుడైన, హారూన్ ను కూడా ప్రవక్తగా నియమించాము.
Meryem 19:54
మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్) లో వచ్చిన ఇస్మాయీల్ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను వాగ్దానాలను సత్యం చేసే (నెరవేర్చే) వాడు మరియు ఒక సందేశహరుడు మరియు ఒక ప్రవక్త.
Meryem 19:55
మరియు అతను తన కుటుంబం వారిని నమాజ్ మరియు విధిదానం (జకాత్) లను పాటించమని ఆజ్ఞాపించేవాడు. మరియు తన ప్రభువుకు ప్రీతిపాత్రుడుగా ఉండేవాడు.
Meryem 19:56
మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్)లో వచ్చిన ఇద్రీస్ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను సత్యవంతుడైన ప్రవక్త.
Meryem 19:57
మరియు మేము అతనిని ఉన్నత స్థానానికి ఎత్తాము.[1]
———
[1] ఇద్రీస్ ('అ.స.) ఆదమ్ ('అ.స.) తరువాత వచ్చిన మొదటి ప్రవక్త. ఇతను నూ'హ్ ('అ.స.) లేక అతని తండ్రి యొక్క తాత. ఇస్రాయీ'లీ గాథలలో అతను ఆకాశంలోకి లేపుకోబడ్డారు, అని ఉంది. కాని ఖుర్ఆన్ మరియు 'స'హీ'హ్ 'హదీస్'లు ఈ విషయాన్ని ధృవపరచలేదు. వాస్తవం అల్లాహ్ (సు.తా.)కే తెలుసు. ఇంకా చూడండి, 21:85. ఇతను బైబిల్ లో E'noch గా పేర్కొనబడ్డారు. చూడండి, ఆదికాండము - (Genesis), 5:18-19 మరియు 21-24.
Meryem 19:58
వారందరూ, అల్లాహ్ అనుగ్రహించిన ఆదమ్ సంతతి వారిలోని దైవప్రవక్తలలో కొందరు. మరియు వారిలో కొందరు మేము నూహ్ ఓడలో ఎక్కింపజేసిన వారు, మరికొందరు ఇబ్రాహీమ్ మరియు ఇస్రాయీల్ (యఅఖూబ్) సంతానానికి చెందిన వారున్నారు. మరియు వారిలో మేము ఎన్నుకొని సన్మార్గం చూపిన వారున్నారు. ఒకవేళ వారికి కరుణామయుని సూచనలు (ఆయాత్) చదివి వినిపించినప్పుడు, వారు విలపిస్తూ సాష్టాంగం (సజ్దా)లో పడిపోయేవారు.
Meryem 19:59
కాని వారి తరువాత వచ్చిన, వారి సంతతి వారు కొందరు, నమాజ్ లను విడిచి పెట్టి తమ (దుష్ట) మనోవాంఛలను అనుసరించారు. కావున త్వరలోనే వారు అధోగతి (నరకంలో)కి చేరగలరు.
Meryem 19:60
కాని ఎవరైతే, పశ్చాత్తాప పడి మరియు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు.
Meryem 19:61
అనంత కరుణామయుడు, తన దాసులకు వాగ్దానం చేసిన అగోచర జగత్తులోని శాశ్వతమైన స్వర్గవనాలు. నిశ్చయంగా ఆయన వాగ్దానం పూర్తయి తీరుతుంది.
Meryem 19:62
వారందులో మీకు శాంతి కలుగు గాక (సలాం!) అనడం తప్ప ఇతర ఏ విధమైన వ్యర్థపు మాటలు వినరు. మరియు అందులో వారికి ఉదయం మరియు సాయంత్రం జీవనోపాధి లభిస్తూ ఉంటుంది.
Meryem 19:63
మా దాసులలో దైవభీతి గలవారిని వారసులుగా చేసే స్వర్గం ఇదే!
Meryem 19:64
(దేవదూతలు అంటారు): "మరియు మేము కేవలం నీ ప్రభువు ఆజ్ఞతో తప్ప క్రిందికి దిగిరాము. మా ముందున్నది, మా వెనుక నున్నది మరియు వాటి మధ్య నున్నదీ, సర్వం ఆయనకు చెందినదే![1] నీ ప్రభువు మరచి పోయేవాడు కాడు.
———
[1] ఇటువంటి వాక్యం కొరకు చూడండి, 2:255.
Meryem 19:65
"ఆకాశాలకూ, భూమికీ మరియు వాటి మధ్యనున్న సమస్తానికీ ఆయనే ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయన ఆరాధనలోనే స్థిరంగా వుండండి. ఆయనతో సమానమైన స్థాయిగల వానిని ఎవడినైనా మీరెరుగుదురా?"
Meryem 19:66
మరియు మానవుడు[1] ఇలా అంటూ ఉంటాడు: "ఏమీ? నేను చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతికించబడి లేపబడతానా?"
———
[1] ఇక్కడ మానవుడు అంటే సత్యతిరస్కారుడు, చనిపోయిన తరువాత పునరుత్థానాన్ని మరియు పరలోక ప్రతిఫలాన్ని నమ్మని వాడు.
Meryem 19:67
ఏమీ? మునుపు, అతడి ఉనికే లేనప్పుడు, మేము అతనిని సృష్టించిన విషయం అతనికి జ్ఞాపకం రావటం లేదా?"
Meryem 19:68
కావున నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ మరియు (వారితో పాటు) షైతానులను కూడా ప్రోగు చేసి, ఆ తరువాత నిశ్చయంగా, వారందరినీ నరకం చుట్టూ మోకాళ్ల మీద సమావేశ పరుస్తాము.
Meryem 19:69
ఆ తరువాత నిశ్చయంగా, ప్రతి తెగ వారిలో నుండి అనంత కరుణామయునికి ఎవరు ఎక్కువ అవిధేయులుగా ఉండేవారో, వారిని వేరు చేస్తాము.[1]
———
[1] అంటే సత్యతిరస్కారుల నాయకులు, ఎవరైతే దురహంకారంతో సత్యాన్ని తిరస్కరించే వారో వారికి అధిక శిక్ష విధించబడుతుంది.
Meryem 19:70
అప్పుడు వారిలో (నరకాగ్నిలో) కాలటానికి ఎక్కువ అర్హులెవరో, మాకు బాగా తెలుసు.
Meryem 19:71
మరియు మీలో ఎవ్వడునూ దాని (నరకంపై గల వంతెన) మీద నుండి పోకుండా (దాటకుండా) ఉండలేడు. ఇది తప్పించుకోలేని, నీ ప్రభువు యొక్క నిర్ణయం.[1]
———
[1] 'స'హీ'హ్ 'హదీస్'లో ఈ ఆయత్ వివరాలు ఈ విధంగా వచ్చాయి: నరకం మీద ఒక వంతెన ఉంది. ప్రతి ఒక్కనికి దానిపై నుండి దాట వలసి ఉంటుంది. విశ్వాసులు తమ తమ సత్కార్యాలను బట్టి త్వరత్వరగా లేక నెమ్మదిగా దానిపై నుండి దాటిపోతారు. కొందరు ఏ హానీ కలుగకుండా దాటుతారు. మరికొందరు గాయాలు తగిలి చివరకు దానిని దాటుతారు. మరికొందరు నరకంలో పడిపోతారు. కాని తరువాత సిఫారసు వల్ల దాని నుండి బయటపడి స్వర్గం చేరుకుంటారు. కాని సత్యతిరస్కారులు ఆ వంతెనను దాటలేరు. వారు నరకాగ్నిలో పడిపోతారు. మరొక హదీసు ఇలా ఉంది: 'ఏ విశ్వాసుల ముగ్గురు పిల్లలు యౌవ్వనానికి చేరక ముందే మరణిస్తారో వారిని నరకాగ్ని కేవలం వారి ప్రమాణాలను పూర్తిచేయటానికే తాకుతుంది.' ('స'హీ'హ్ బు'ఖారీ) చూడండి, ఇబ్నె-కసీ'ర్).
Meryem 19:72
ఆ పిదప మేము దైవభీతి గలవారిని రక్షిస్తాము. మరియు దుర్మార్గులను అందులో మోకాళ్ళ మీద పడి ఉండటానికి వదులుతాము.
Meryem 19:73
మరియు స్పష్టమైన మా సూచనలను వారికి చదివి వినిపించినపుడు, సత్యతిరస్కారులు విశ్వాసులతో అంటారు: "మన రెండు వర్గాల వారిలో ఎవరి వర్గం మంచి స్థితిలో ఉంది మరియు ఎవరి సభ ఉత్తమమైనది?"[1]
———
[1] సత్యతిరస్కారులైన ఖురైషులు - పేద ముస్లింలు అయిన 'అమ్మార్, బిలాల్ 'సుహైబ్ (ర.'ది. 'అ.)లను మరియు వారి సమావేశ స్థలాలైన దారుష్షూరా' మరియు దారుల్-అ'ర్ఖమ్ లను - అబూ జహల్, న'దర్ బిన్ 'హారిస్, 'ఉత్బా, షైబా, వంటి ధనవంతుల మరియు వారి పెద్ద పెద్ద భవనాల మరియు వారు సమావేశాలు చేసే దారున్నద్వాలతో పోల్చి తమ భౌతిక ఉన్నత స్థాయికి గర్వించేవారు మరియు పునరుత్థానాన్ని తిరస్కరించేవారు. మనం జీవించేది ఈ భూలోక జీవితం మాత్రమేనని వాదులాడే వారు. కాని వారికి ముందున్నవారు, వారి కంటే ఎక్కువ సిరిసంపదలున్నా నాశనం చేయబడ్డారనే విషయాన్ని మరచిపోయే వారు. చూడండి, 19:74
Meryem 19:74
మరియు వారికి ముందు మేము ఎన్నో తరాలను (వంశాలను) నాశనం చేశాము; వారు వీరి కంటే ఎక్కువ సిరిసంపదలు మరియు బాహ్య ఆడంబరాలు గలవారై ఉండిరి?
Meryem 19:75
వారితో అను: "మార్గభ్రష్టత్వంలో పడి వున్నవానికి, అనంత కరుణామయుడు, ఒక సమయం వరకు వ్యవధి నిస్తూ ఉంటాడు. తుదకు వారు తమకు వాగ్దానం చేయబడిన దానిని చూసినపుడు, అది (కఠినమైన) శిక్షనో కావచ్చు లేదా అంతిమ ఘడియనో కావచ్చు! హీనస్థితిలో ఉన్న వాడెవడో మరియు బలహీన వర్గం (సేన) ఎవరిదో వారికి తెలియగలదు!
Meryem 19:76
మరియు (దానికి ప్రతిగా) మార్గదర్శకత్వం పొందిన వారికి, అల్లాహ్ మార్గదర్శత్వంలో వృద్ధిని ప్రసాదిస్తాడు. చిరస్థాయిగా ఉండిపోయే సత్కార్యాలే, "నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా ఉత్తమమైనవి మరియు పర్యవసానం దృష్ట్యా కూడా ఉత్తమమైనవి."[1]
———
[1] చూడండి, 18:46.
Meryem 19:77
ఏమీ? మా సూచనలను తిరస్కరించి: "నిశ్చయంగా, నాకు ధనసంపదలూ మరియు సంతానం ఇవ్వబడుతూనే ఉంటాయి." అని పలికే వానిని నీవు చూశావా?
Meryem 19:78
ఏమీ? అతడు అగోచరాన్ని చూశాడా? లేదా అనంత కరుణామయుని వాగ్దానం పొందాడా?
Meryem 19:79
అలా కాదు! అతడు చెప్పేది, మేము వ్రాసి పెట్టగలము. మరియు అతడి శిక్షను మరింత పెంచగలము.
Meryem 19:80
మరియు అతడు చెప్పే వస్తువులకు మేమే వారసులమవుతాము మరియు అతడు ఒంటరిగానే మా వద్దకు వస్తాడు.
Meryem 19:81
మరియు వారు అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు, వారు వీరికి అండగా ఉంటారనుకొని!
Meryem 19:82
అలా కాదు! వారు (ఆ దైవాలు) వీరి ఆరాధనను నిరాకరించటమే గాక, వీరికి విరోధులుగా ఉంటారు.
Meryem 19:83
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా మేము సత్యతిరస్కారులపై షైతానులను వదిలామని? అవి వారిని (సత్యాన్ని తిరస్కరించమని) అత్యధికంగా ప్రేరేపిస్తూ ఉంటాయని?[1]
———
[1] షై'తాన్ చివరకు ఎలాంటి బాధ్యత వహించడు. దానికి చూడండి, 14:22.
Meryem 19:84
కావున వారి మీద (శిక్షను) అవతరింప జేయమని నీవు తొందర పెట్టకు. నిశ్చయంగా, మేము (వారి దినాలను) ఖచ్చితంగా లెక్క పెడుతున్నాము.
Meryem 19:85
ఆ రోజు మేము దైవభీతి గలవారిని అనంత కరుణామయుని సన్నిధిలో అతిథులుగా ప్రవేశపెడతాము.
Meryem 19:86
మరియు అపరాధులను దప్పిక గొన్న వాటి వలే (జంతువుల వలే), నరకం వైపునకు తోలుకొని పోతాము.
Meryem 19:87
(ఆనాడు) అనంత కరుణామయుని అనుమతి పొందినవాడు తప్ప మరెవ్వరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు.[1]
———
[1] సిఫారసు చేసే అనుమతి అల్లాహుతా'ఆలా తాను కోరిన వారికే ఇస్తాడు. చూడండి 10:3, 21:28, 53:26.
Meryem 19:88
వారిలా అన్నారు: "అనంతకరుణామయునికి కొడుకున్నాడు."[1]
———
[1] ప్రవక్తలకు దైవత్వం అంటగట్టడం అల్లాహ్ (సు.తా.) తో సంబంధం తెంపుకోవటమే. మరియు ఇది క్షమింపబడని మహా పాపం. చూడండి, 4:48.
Meryem 19:89
వాస్తవానికి, మీరు ఎంత పాపిష్ఠికరమైన విషయాన్ని కల్పించారు.
Meryem 19:90
దాని వలన ఆకాశాలు ప్రేలి పోవచ్చు! భూమి చీలి పోవచ్చు! మరియు పర్వతాలు ధ్వంసమై పోవచ్చు!
Meryem 19:91
ఎందుకంటే వారు అనంత కరుణామయునికి కొడుకున్నాడని ఆరోపించారు.[1]
———
[1] చూడండి 42:11: 'ఆయనను పోలిన వస్తువు ఏదీ లేదు.' అనే ఖుర్ఆన్ ఆయత్ అల్లాహ్ (సు.తా.)కు సంతానం లేదు అనే విషయాన్ని స్పష్టపరుస్తోంది. ఇంకా చూడండి, 112:4 మరియు 6:100: 'మరియు ఆయ(సు.తా.)తో పోల్చదగినది ఏదియూ లేదు.' సంతానమనేది ఇంద్రియ సంబంధమైనది. కావున దీనిని అల్లాహ్ (సు.తా.)కు అంటగట్టడం ఘోరపాపం.
Meryem 19:92
ఎవరినైనా కొడుకునిగా చేసుకోవటం అనంత కరుణామయునికి తగినది కాదు.
Meryem 19:93
ఎందుకంటే! భూమ్యాకాశాలలో నున్న వారందరూ కేవలం అనంత కరుణామయుని దాసులుగా మాత్రమే హాజరు కానున్నారు.[1]
———
[1] మానవులు కానీ, దైవదూతలు కానీ, జిన్నాతులు కానీ, అందరూ ఆయన (సు.తా.) సృష్టించిన వారే, కావున వారికి ఆయన దైవత్వంలో ఎలాంటి భాగం లేదు. వారంతా ఇష్టంతో గానీ అయిష్టంతో గానీ ఆయన ఇచ్ఛను శిరసావహించవలసిందే. చూడండి, 13:15, 16:48-49.
Meryem 19:94
వాస్తవానికి, ఆయన అందరినీ పరివేష్టించి ఉన్నాడు మరియు వారిని సరిగ్గా లెక్క పెట్టి ఉన్నాడు.
Meryem 19:95
మరియు పునరుత్థాన దినమున వారందరూ, ఒంటరిగానే ఆయన ముందు హాజరవుతారు.[1]
———
[1] అక్కడ ధన సంపత్తులు గానీ, సంతానం గానీ ఏ విధంగానూ పనికిరావు. చూడండి, 26:88
Meryem 19:96
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసే వారి పట్ల అనంత కరుణామయుడు (ప్రజల హృదయాలలో) ప్రేమను (వాత్సల్యాన్ని) కలుగజేయగలడు.
Meryem 19:97
కావున నీవు (ఓ ప్రవక్తా!) దైవభీతి గలవారికి శుభవార్త నివ్వటానికి మరియు వాదులాడే జాతి వారిని హెచ్చరించటానికీ, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) సులభతరం చేసి, నీ భాషలో అవతరింపజేశాము.[1]
———
[1] మానవుడు అల్లాహ్ (సు.తా.) మాటలను అర్థం చేసుకోవటానికి ఆయన దివ్యగ్రంథాలను ఆ ప్రాంతపు ప్రజల భాషలోనే అవతరింపజేశాడు, చూడండి, 14:4 మరియు ము'హమ్మద్ ('స'అస) పై ఈ ఖుర్ఆన్ అవతరణ కొరకు చూడండి, 2:97 మరియు 26:193-194.
Meryem 19:98
మరియు వీరికి పూర్వం మేము ఎన్ని తరాల వారిని నాశనం చేయలేదు! ఏమీ? నీవు ఇప్పుడు వారిలో ఏ ఒక్కరినైనా చూస్తున్నావా? లేక వారి మెల్లని శబ్దమైనా వింటున్నావా?
Tâhâ 20:1
తాహా![1]
———
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
Tâhâ 20:2
మేము ఈ ఖుర్ఆన్ ను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురి చేయటానికి కాదు.[1]
———
[1] చూడండి, 18:6.
Tâhâ 20:3
కేవలం (అల్లాహ్ కు) భయపడే వారికి హితబోధ చేయటానికే!
Tâhâ 20:4
ఇది (ఈ ఖుర్ఆన్) భూమినీ మరియు అత్యున్నతమైన ఆకాశాలనూ సృష్టించిన ఆయన (అల్లాహ్) తరఫు నుండి క్రమక్రమంగా అవతరింపజేయబడింది.
Tâhâ 20:5
ఆ కరుణామయుడు, సింహాసనం (అర్ష్)పై ఆసీనుడై ఉన్నాడు.[1]
———
[1] తన గొప్పతనానికి అనుగుణంగా అల్లాహ్ (సు.తా.) 'అర్ష్ (విశ్వసామ్రాజ్యాధిపత్య పీఠం)పై అధిష్ఠుడై ఉన్నాడు. కాని ఎట్లు, ఏ విధంగా ఎవ్వరికీ తెలియదు.
Tâhâ 20:6
ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ మరియు ఆ రెండింటి మధ్యనూ, ఇంకా నేల క్రిందనూ ఉన్న,[1] సమస్తమూ ఆయనకు చెందినదే.
———
[1] అస్-స'రా: అంటే భూమిలోని లోతైన భాగంలో, అంటే సర్వం ఆయనకు చెందిందే!
Tâhâ 20:7
మరియు నీవు బిగ్గరగా మాట్లాడితే (ఆయన విననే వింటాడు); వాస్తవానికి, ఆయనకు రహస్యంగా (చెప్పుకునే మాటలే గాక) అతి గోప్యమైన మాటలు కూడా, తెలుస్తాయి.[1]
———
[1] అల్లాహ్ (సు.తా.) ను పెద్ద స్వరంతో అర్థించే అవసరం లేదు. ఎందుకంటే ఆయన అతి రహస్య విషయాలను కూడా తెలుసుకుంటాడు. ఆయనకు మానవుల భవిష్యత్తు కూడా తెలుసు. అది ఆయన దగ్గర వ్రాయబడి ఉంది! ఆయనకు జరిగిపోయిందే గాక, జరుగుతున్నది మరియు ముందు జరగబోయేది అన్నీ తెలుసు. అంటే పునరుత్థాన దినం వరకు మరియు ఆ తరువాత కూడా ఎల్లప్పుడూ జరుగబోయే అన్ని విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ (సు.తా.) కే ఉంది మరియు ఇతరులకు ఎవ్వరికీ లేదు. అంటే దైవప్రవక్తలు, దైవదూత ('అలైహిమ్.స.)లకు మరియు జిన్నాతులకు కూడా లేదు.
Tâhâ 20:8
అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనకు అత్యుత్తమమైన పేర్లు ఉన్నాయి.[1]
———
[1] "అల్లాహ్ (సు.తా.) యొక్క అత్యుత్తమ పేర్లు" (అల్-అస్మాఉ'ల్-'హుస్నా). ఈ శబ్దం ఖుర్ఆన్ లో నాల్గుసార్లు వచ్చింది. 7:180, 17:110, 59:24 మరియు ఇక్కడ.
Tâhâ 20:9
ఇక మూసా వృత్తాంతం నీకు అందిందా? [1]
———
[1] మూసా (అ.స.) వృత్తాంతం, 7, 17, 18 మరియు 28 సూరాహ్ లలో వచ్చింది. ఈ సూరహ్ లో 9-98 ఆయత్ లలో కొన్ని వివరాలున్నాయి.
Tâhâ 20:10
అతను ఒక మంటను చూసినపుడు తన ఇంటి వారితో ఇలా అన్నాడు:[1] "ఆగండి! నిశ్చయంగా, నాకొక మంట కనబడుతోంది; బహుశా నేను దాని నుండి మీ కొరకు ఒక కొరివిని తీసుకొని వస్తాను లేదా ఆ మంట దగ్గర, నాకేదైనా మార్గదర్శకత్వం లభించవచ్చు!"
———
[1] మూసా ('అ.స.) కొన్ని సంవత్సరాలు ఆయ్ కహ్ లో గడిపిన తరువాత - తన భార్యా పిల్లలతో సహా - తన తల్లి, సోదరుడు హారూన్ ('అ.స.) మరియు తన జాతి వారి వద్దకు వెళ్ళటానికి బయలుదేరుతారు. సినాయి ద్వీపకల్పం దక్షిణ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ విషయం సంభవిస్తుంది. ఇంకా చూడండి, 27:78 మరియు 28:29.
Tâhâ 20:11
అతను దాని దగ్గరకు చేరినప్పుడు ఇలా పిలువబడ్డాడు:[1] "ఓ మూసా!
———
[1] మూసా ('అ.స.) అక్కడికి చేరుకున్న తరువాత ఒక వృక్షం వెలుగుతో నిండి ఉంటుంది. దాని నుండి ఈ విధంగా పిలువబడతారు. చూడండి, 28:30.
Tâhâ 20:12
నిశ్చయంగా, నేనే నీ ప్రభువును, కావున నీవు నీ చెప్పులను విడువు. వాస్తవానికి, నీవు పవిత్రమైన తువా[1] లోయలో ఉన్నావు.
———
[1] 'తువా - ఆ లోయ పేరు.
Tâhâ 20:13
మరియు నేను నిన్ను (ప్రవక్తగా) ఎన్నుకున్నాను. నేను నీపై అవతరింపజేసే దివ్యజ్ఞానాన్ని (వహీని) జాగ్రత్తగా విను.
Tâhâ 20:14
నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజ్ ను స్థాపించు.
Tâhâ 20:15
నిశ్చయంగా, తీర్పు ఘడియ రానున్నది, ప్రతి వ్యక్తీ తాను చేసిన కర్మల ప్రకారం ప్రతిఫలం పొందటానికి; నేను దానిని గోప్యంగా ఉంచాలని నిర్ణయించాను.[1]
———
[1] చూడండి, 53:39.
Tâhâ 20:16
కావున దానిని విశ్వసించకుండా, తన మనోవాంఛలను అనుసరించేవాడు, నిన్ను దాని (ఆ ఘడియ చింత) నుండి మరలింపనివ్వరాదు; అలా అయితే నీవు నాశనానికి గురి కాగలవు.
Tâhâ 20:17
మరియు ఓ మూసా! నీ కుడిచేతిలో ఉన్నది ఏమిటి?"
Tâhâ 20:18
(మూసా) అన్నాడు: "ఇది నా చేతికర్ర, దీనిని ఆనుకొని నిలబడతాను మరియు దీనితో నా మేకల కొరకు ఆకులు రాల్చుతాను. మరియు దీని నుండి నాకు ఇంకా ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి."
Tâhâ 20:19
(అల్లాహ్) అన్నాడు: "ఓ మూసా! దానిని భూమి మీద పడవేయి."
Tâhâ 20:20
అప్పుడు అతను దానిని పడవేశాడు. వెంటనే అది పాముగా[1] మారిపోయి చురుకుగా చలించసాగింది.
———
[1] ఇక్కడ (20:20లో) 'హయ్యతున్ అని, 27:10, 28:31లలో జాన్నున్ అని, 7:107లో సు''అబానున్ అని ఉంది. సందర్భాన్ని బట్టి దానిని మార్చబడింది.
Tâhâ 20:21
(అల్లాహ్) ఆజ్ఞాపించాడు: "దానిని పట్టుకో, భయపడకు. మేము దానిని దాని పూర్వస్థితిలోకి మార్చుతాము.
Tâhâ 20:22
మరియు నీ చేతిని చంకలో పెట్టి తీయి, దాని కెలాంటి బాధ కలుగకుండా, అది తెల్లగా మెరుస్తూ బయటికి వస్తుంది,[1] ఇది రెండవ అద్భుత సూచన!
———
[1] చూడండి, 7:108, 28:32.
Tâhâ 20:23
ఇదంతా మేము నీకు మా గొప్ప సూచనలను చూపటానికి!
Tâhâ 20:24
నీవు ఫిర్ఔన్ వద్దకు పో! నిశ్చయంగా అతడు మితిమీరి పోయాడు."[1]
———
[1] ఫిర్'ఔన్ తనను తాను ఆరాధ్యదైవంగా చేసుకున్నాడు. చూడండి, 28:38 మరియు 79:24, 'నేనే మీ ప్రభువును' అని అనేవాడు.
Tâhâ 20:25
(మూసా) ఇలా మనవి చేసుకున్నాడు: "ఓ నా ప్రభూ! నా హృదయాన్ని వికసింపజేయి.
Tâhâ 20:26
మరియు నా వ్యవహారాన్ని నా కొరకు సులభం చేయి.
Tâhâ 20:27
నా నాలుకలోని ముడిని (ఆటంకాన్ని) తొలగించు.
Tâhâ 20:28
(దానితో) వారు నా మాటలను సులభంగా అర్థం చేసుకోవటానికి.
Tâhâ 20:29
మరియు నా కొరకు నా కుటుంబం నుండి ఒక సహాయకుణ్ణి నియమించు.[1]
———
[1] వ'జీరున్: భారం మోసేవాడు, మంత్రి, రాజు యొక్క రాజకీయ భారాన్ని పంచుకునేవాడు.
Tâhâ 20:30
నా సోదరుడైన హారూన్ ను.
Tâhâ 20:31
అతని ద్వారా నా బలాన్ని దృఢపరచు.
Tâhâ 20:32
మరియు అతనిని నా వ్యవహారంలో సహాయకారిగా (భాగస్వామిగా) చేయి.
Tâhâ 20:33
మేము నీ పవిత్రతను బాగా కొనియాడటానికి;
Tâhâ 20:34
మరియు నిన్ను అత్యధికంగా స్మరించటానికి;
Tâhâ 20:35
నిశ్చయంగా, నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ కని పెట్టుకునే ఉంటావు!"
Tâhâ 20:36
(అల్లాహ్) సెలవిచ్చాడు: "ఓ మూసా! వాస్తవంగా, నీవు కోరినదంతా నీకు ఇవ్వబడింది.
Tâhâ 20:37
మరియు వాస్తవానికి మేము నీకు మరొకసారి ఉపకారం చేశాము.[1]
———
[1] ఈ వివరాలకు చూడండి, 28:3-21.
Tâhâ 20:38
అప్పుడు మేము నీ తల్లికి ఇవ్వవలసిన ఆ సూచనను ఈ విధంగా సూచించాము:
Tâhâ 20:39
ఇతనిని (ఈ బాలుణ్ణి) ఒక పెట్టెలో పెట్టి దానిని (ఆ పెట్టెను) నదిలో విడువు. నది దానిని ఒక ఒడ్డుకు చేర్చుతుంది; దానిని నాకు మరియు ఇతనికి శత్రువు అయిన వాడు తీసుకుంటాడు.; మరియు నేను నా తరఫు నుండి నీ మీద ప్రేమను కురిపించాను మరియు నిన్ను నా కంటి మందు పోషింపబడేటట్లు చేశాను.[1]
———
[1] చూడండి, 79:24 మరియు 28:9.
Tâhâ 20:40
అప్పుడు నీ సోదరి (నిన్ను) అనుసరిస్తూ పోయి, వారితో ఇలా అన్నది: 'ఇతనిని పెంచి పోషించగల ఒకామెను నేను మీకు చూపనా?'[1] ఈ విధంగా మేము నిన్ను మళ్ళీ నీ తల్లి దగ్గరకు చేర్చాము, ఆమె కళ్ళకు చల్లదనమివ్వటానికి, ఆమెను దుఃఖపడకుండా ఉంచటానికి.[2] మరియు నీవొక వ్యక్తిని చంపావు,[3] మేము ఆ ఆపద నుండి నీకు విముక్తి కలిగించాము. మేము నిన్ను అనేక విధాలుగా పరీక్షించాము.[4] ఆ తరువాత నీవు ఎన్నో సంవత్సరాలు మద్ యన్ వారితో ఉంటివి.[5] ఓ మూసా! ఇప్పుడు నీవు (మా) నిర్ణయానుసారంగా (ఇక్కడికి) వచ్చావు.
———
[1] వివరాలకు చూడండి, 28:12. [2] చూడండి, 28:12-13. [3] చూడండి, 28:14. [4] చూడండి, 28:15-21. [5] చూడండి, 28:22-28.
Tâhâ 20:41
మరియు నేను నిన్ను నా (సేవ) కొరకు ఎన్నుకున్నాను.
Tâhâ 20:42
నీవు మరియు నీ సోదరుడు నా సూచనలతో వెళ్ళండి. నన్ను స్మరించటంలో అశ్రద్ధ వహించకండి.[1]
———
[1] ఇక్కడ అల్లాహ్ (సు.తా.) వైపుకు ఆహ్వానించే దా'ఈలకు ఎల్లప్పుడూ అల్లాహ్ (సు.తా.)ను స్మరిస్తూ ఉండాలనే సూచన ఉంది.
Tâhâ 20:43
మీరిద్దరు ఫిర్ఔన్ దగ్గరకు వెళ్ళండి. అతడు మితమీరి ప్రవర్తిస్తున్నాడు.
Tâhâ 20:44
కాని అతనితో మృదువుగా మాట్లాడండి. బహుశా అతడు హితబోధ స్వీకరిస్తాడేమో, లేదా భయపడతాడేమో!"[1]
———
[1] అల్లాహ్ (సు.తా.)కు తెలుసు అతడు హితబోధ స్వీకరించడని, కాని మూసా (అ.స.)కు ఏమీ తెలియదు. ఎందుకంటే ప్రవక్తలు కూడా మానవులే. వారికి అల్లాహ్ (సు.తా.) తెలిపేది తప్ప ఇతర అగోచర విషయాల జ్ఞానం ఉండదు. ఇదే అల్లాహ్ (సు.తా.) ఇచ్ఛ. దీని వల్ల ప్రవక్త ప్రతి వానిని: 'అల్లాహ్ (సు.తా.) మార్గం వైపునకు, సత్యమార్గం వైపునకు, మోక్షం పొందటానికి రండి.' అని ఆహ్వానిస్తుంటాడు. అదే ప్రవక్త బాధ్యత. ఇందులో దా'ఈలు మృదువుగా వ్యవహరించాలనే సూచన కూడా ఉంది.
Tâhâ 20:45
(మూసా మరియు హారూన్) ఇద్దరూ ఇలా అన్నారు: "ఓ మా ప్రభూ! వాస్తవానికి, అతడు మమ్మల్ని శిక్షిస్తాడేమోనని, లేదా తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడేమోనని మేము భయపడుతున్నాను!"
Tâhâ 20:46
(అల్లాహ్) సెలవిచ్చాడు: "మీరిద్దరు భయపడకండి, నిశ్చయంగా, మీరిద్దరితో పాటు నేనూ ఉన్నాను. నేను అంతా వింటూ ఉంటాను మరియు అంతా చూస్తూ ఉంటాను.
Tâhâ 20:47
కావున మీరిద్దరూ అతని వద్దకు పోయి ఇలా అనండి: "నిశ్చయంగా, మేమిద్దరం నీ ప్రభువు యొక్క సందేశహరులము. కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు.[1] మరియు వారిని బాధ పెట్టకు. వాస్తవానికి మేము నీ వద్దకు నీ ప్రభువు తరఫు నుండి సూచనలు తీసుకొని వచ్చాము. మరియు సన్మార్గాన్ని అనుసరించే వానిపై (అల్లాహ్ తరపు నుండి) శాంతి వర్ధిల్లుతుంది![2]
———
[1] వివరాలకు చూడండి, 2:49, 7:141, 14:6. [2] వస్సలాము 'అలా మనిత్తబ'ల్ హుదా! దైవప్రవక్త ('స'అస) రోమన్ చక్రవర్తికి వ్రాసిన ఉత్తరాన్ని ఈ పై వాక్యంతో ప్రారంభించారు, (ఇబ్నె-కసీ'ర్). దీనితో స్పష్టమయ్యేది ఏమిటంటే ముస్లిమేతరుల సభలో లేక ఉత్తరం ద్వారా సంభాషణ ప్రారంభించునప్పుడు ఈ శభ్దాలను వాడాలి.
Tâhâ 20:48
" 'నిశ్చయంగా, ఎవడైతే సత్యాన్ని తిరస్కరించి వెనుదిరిగి పోతాడో, అతనికి కఠినశిక్ష తప్పక ఉంటుంది' అని వాస్తవానికి మాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలుపబడింది."
Tâhâ 20:49
(ఫిర్ఔన్) అన్నాడు: "ఓ మూసా! మీ ఇరువురి ప్రభువు ఎవరు?"
Tâhâ 20:50
(మూసా) జవాబిచ్చాడు: "ప్రతి దానికి దాని రూపాన్నిచ్చి, తరువాత దానికి మార్గదర్శకత్వం చేసేవాడే మా ప్రభువు."
Tâhâ 20:51
(ఫిర్ఔన్) అన్నాడు: "అయితే పూర్వం గతించిన తరాల వారి సంగతి ఏమిటి?"
Tâhâ 20:52
(మూసా) జవాబిచ్చాడు: "వాటి జ్ఞానం నా ప్రభువు వద్ద ఒక గ్రంథంలో (వ్రాయబడి) వుంది. నా ప్రభువు పొరపాటు చేయడు మరియు మరువడు కూడాను."
Tâhâ 20:53
ఆయనే మీ కొరకు భూమిని చదునుగా (పరువుగా) జేసి, అందులో మీకు (నడవటానికి) త్రోవలను ఏర్పరిచాడు. మరియు ఆకాశం నుండి నీటిని కురిపించాడు. మేము దాని ద్వారా రకరకాల వృక్షకోటిని పుట్టించాము.[1]
———
[1] అ'జ్వాజున్: ఇక్కడ దీని అర్థం వివిధ రకాలు. ఇదే అర్థం 13:3లో కూడా ఉంది.
Tâhâ 20:54
మీరు వాటిని తినండి మరియు మీ పశువులకు మేపండి. నిశ్చయంగా, అర్థం చేసుకోగలవారికి ఇందులో అనేక సూచనలున్నాయి.
Tâhâ 20:55
దాని (ఆ మట్టి) నుంచే మిమ్మల్ని సృష్టించాము, మరల మిమ్మల్ని దానిలోకే చేర్చుతాము మరియు దాని నుంచే మిమ్మల్ని మరొకసారి లేవుతాము.[1]
———
[1] మానవుణ్ణి మట్టి నుండి సృష్టించాము. వివరాలకు చూడండి, 3:59లో తురాబ్ మరియు 15:26లో 'స'ల్సాలిన్ 'హమఇన్ మన్నూన్. ఇబ్నె మాజా ఉల్లేఖనం: ఒక మృతుణ్ణి సమాధిలో పెట్టిన తరువాత రెండు చేతులతో మూడు సార్లు మట్టి పోయడం అభిలషణీయం (ముస్త'హబ్).
Tâhâ 20:56
మరియు వాస్తవానికి, మేము అతనికి (ఫిర్ఔన్ కు) మా సూచనలన్నీ చూపాము, కాని అతడు వాటిని అబద్దాలన్నాడు మరియు తిరస్కరించాడు.
Tâhâ 20:57
(ఫిర్ఔన్) ఇలా అన్నాడు: "ఓ మూసా! నీవు నీ మంత్రజాలంతో మమ్మల్ని మా దేశం నుండి వెడల గొట్టటానికి మా వద్దకు వచ్చావా?[1]
———
[1] చూడండి, 7:110.
Tâhâ 20:58
సరే! మేము కూడా దాని వంటి మంత్రజాలాన్ని నీకు పోటీగా తెస్తాము; కావున మా మధ్య నీ మధ్య (సమావేశానికి) ఒక సమయం మరియు స్థలాన్ని నిర్ణయించు. దాని నుండి మేము కానీ నీవు కానీ వెనుకాడ కూడదు. మరియు అదొక యుక్తమైన స్థలమై ఉండాలి."
Tâhâ 20:59
(మూసా) అన్నాడు: "మీతో సమావేశం ఉత్సవ దినమున నియమించుకుందాము. ప్రొద్దెక్కే వరకు ప్రజలందరూ సమావేశమై ఉండాలి."
Tâhâ 20:60
ఆ పిదప ఫిర్ఔన్ వెళ్ళిపోయి తన తంత్ర సామగ్రిని సమీకరించుకొని తిరిగి వచ్చాడు.[1]
———
[1] చూడండి, 7:111-114.
Tâhâ 20:61
మూసా వారితో అన్నాడు: "మీరు నాశనమవుగాక! అల్లాహ్ పై అబద్ధాలు కల్పించకండి! అలా చేస్తే ఆయన కఠినశిక్షతో మిమ్మల్ని నిర్మూలించవచ్చు! (అల్లాహ్ పై) అబద్ధాలు కల్పించేవాడు తప్పక విఫలుడవుతాడు."
Tâhâ 20:62
(ఇది విన్న) తరువాత వారు ఆ విషయాన్ని గురించి తర్కించుకున్నారు, కాని తమ చర్చను రహస్యంగానే సాగించారు.
Tâhâ 20:63
(వారు పరస్పరం ఈ విధంగా) మాట్లాడుకున్నారు: "వాస్తవానికి వీరిద్దరూ మాంత్రికులే! వీరిద్దరు తమ మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి వెడల గొట్టి, మీ ఆదరణీయమైన విధానాన్ని అంతమొందించ గోరుతున్నారు.[1]
———
[1] ఏ విధంగానైతే ఈ రోజు కూడా అసత్య మార్గం మీద, షిర్కులో మునిగి ఉన్నవారు కూడా తామే సరైన మార్గం మీద ఉన్నామని గర్విస్తారో అదే విధంగా వారూ గర్వించారు. చూడండి, 30:32.
Tâhâ 20:64
కావున మీరు మీ యుక్తులను సమీకరించుకొని సమైక్యంగా (రంగంలోకి) దిగండి. ఈనాడు ప్రాబల్యం పొందిన వాడే, వాస్తవానికి సాఫల్యం (గెలుపు) పొందిన వాడు."[1]
———
[1] చూడండి, 7:113-114.
Tâhâ 20:65
వారు (మాంత్రికులు) ఇలా అన్నారు: "ఓ మూసా! నీవు విసురుతావా, లేదా మేము మొదట విసరాలా?"
Tâhâ 20:66
(మూసా) అన్నాడు: "లేదు! మీరే (ముందు) విసరండి!" అప్పుడు ఆకస్మాత్తుగా వారి త్రాళ్ళు మరియు వారి కర్రలూ - వారి మంత్రజాలం వల్ల - అతనికి (మూసాకు) చలిస్తూ ఉన్నట్లు కనిపించాయి.[1]
———
[1] ఇక్కడ: 'వారి త్రాళ్ళు మంత్రజాలం వల్ల చలిస్తున్నట్లు,' అని ఉంది. అంటే అవి పాములుగా కనిపించాయే, గానీ వాస్తవానికి పాములుగా మారలేదు. దీనితో విశదమయ్యేది ఏమిటంటే మంత్రజాలం (మిస్మరిస్మ్), మంత్ర ప్రభావం వల్ల తాత్కాలికంగా ప్రజలకు అలా కనిపిస్తుందే కానీ నిజానికి ఏ మార్పూ రాదు.
Tâhâ 20:67
దానితో మూసాకు, తన మసనస్సులో కొంత భయం కలిగింది.[1]
———
[1] చూడండి, 7;116.
Tâhâ 20:68
మేము (అల్లాహ్) అన్నాము: "భయపడకు! నిశ్చయంగా నీవే ప్రాబల్యం పొందుతావు.[1]
———
[1] మూసా ('అ.స.) భయపడటానికి కారణం అతను కూడా ఒక మానవుడే. ప్రవక్త ('అలైహిమ్. స.) లు అందరూ మానవులే కాని వారిపై దివ్యజ్ఞానం (వ'హీ) అవతరింపజేయబడుతుంది. అల్లాహ్ (సు.తా.) తెలిపినది తప్ప, వేరే అగోచర జ్ఞానం గానీ, భవిష్యత్తులో జరుగబోయే వాటి జ్ఞానం గానీ వారికి ఉండదు. అల్లాహ్ (సు.తా.): 'భయపడకు నీవే ఆధిక్యత వహిస్తావు.' అని అన్నప్పుడు అతనికి ధైర్యం వచ్చింది. అంటే అద్భుత సూచనలు చూపటం కూడా అల్లాహ్ (సు.తా.) చేతిలోనే ఉంది. ప్రవక్తలు ఏదైనా అద్భుత విషయం జరిగే వరకు, అది జరుగనున్నదని ఎరగరు. అంటే వారికెలాంటి అగోచర జ్ఞానం ఉండదు.
Tâhâ 20:69
నీ కుడిచేతిలో ఉన్నదానిని విసురు! అది వారు కల్పించిన వాటిని మ్రింగి వేస్తుంది. వారు కల్పించినది నిశ్చయంగా, మాంత్రికుని తంత్రమే! మరియు మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కానేరడు. వాడు ఎటు నుంచి, ఎలా వచ్చినా సరే!"
Tâhâ 20:70
అప్పుడు ఆ మాంత్రికులు సాష్టాంగం (సజ్దా)లో పడుతూ అన్నారు: "మేము హారూన్ మరియు మూసాల ప్రభువును విశ్వసించాము."[1]
———
[1] చూడండి, 7:117-120.
Tâhâ 20:71
(ఫిర్ఔన్) అన్నాడు: "నేను అనుమతించక ముందే, మీరు ఇతనిని విశ్వసించారా?[1] నిశ్చయంగా, ఇతనే మీకు మంత్రజాలం నేర్పిన గురువు! కావున ఇప్పుడు నేను మీ అందరి చేతులను మరియు కాళ్ళను వ్యతిరేక పక్షల నుండి నరికిస్తాను[2] మరియు మిమ్మల్ని అందరినీ, ఖర్జూరపు దూలాల మీద సిలువ (శూలారోహణ) చేయిస్తాను. అప్పుడు మా ఇద్దరిలో ఎవరి శిక్ష ఎక్కువ కఠినమైనదో మరియు దీర్ఘకాలికమైనదో మీకు తప్పక తెలియగలదు."
———
[1] చూడండి, 71:23. [2] అంటే కుడిచేయి ఎడమకాలు.
Tâhâ 20:72
వారు (మాంత్రికులు) అన్నారు: "మా వద్దకు వచ్చిన స్పష్టమైన సూచనలను మరియు మమ్మల్ని సృజించిన ప్రభువు (అల్లాహ్)ను వదలి, మేము నీకు ప్రాధాన్యతనివ్వము. నీవు చేయ దలచు కున్నది చేసుకో! నీవు కేవలం ఐహిక జీవితాన్ని మాత్రమే అంతమొందించ గలవు. [1]
———
[1] ఇక్కడ మాంత్రికులు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఫిర్'ఔన్ ను సంతోషపరచటంలో నిమగ్నులై ఉండిరి. ప్రాపంచిక వ్యామోహంలో పడి ఉండిరి, కాబట్టి: 'మేము గెలిస్తే మాకు బహుమానం దొరుకుతుంది కదా?' అని అడిగారు. కాని వారికి మార్గదర్శకత్వం దొరికి మూసా ('అ.స.) ఆరాధించే ప్రభువే నిజమైన ప్రభువు అని తెలిసినప్పుడు, వారు అల్లాహ్ (సు.తా.) సాన్నిధ్యాన్ని పొందటానికి ఇహలోక భోగభాగ్యాలనే కాదు, తమ జీవితాలను కూడా కోల్పోవటానికి సిద్ధపడ్డారు. ఎంత గొప్ప దైవభితిని (తఖ్వా) కనబరచారో చూడండి.
Tâhâ 20:73
నిశ్చయంగా, మేము మా ప్రభువునందే విశ్వాసముంచాము, ఆయన (అల్లాహ్) యే మా తప్పులను మరియు నీవు బలవంతంగా మా చేత చేయించిన మంత్రతంత్రాలను క్షమించేవాడు. (ప్రతి ఫలమివ్వటంలో) అల్లాహ్ యే సర్వశ్రేష్ఠుడు మరియు శాశ్వతంగా ఉండేవాడు (నిత్యుడు)."[1]
———
[1] అబ్'ఖా, అల్-బా'ఖి: The Ever-Lasting. He whose existence will have no end. నిత్యుడు, శాశ్వితుడు, చిరస్థాయిగా ఉండేవాడు. చూడండి, 55:26-27, (సేకరించబడిన పదం). ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
Tâhâ 20:74
నిశ్చయంగా, తన ప్రభువు ముందు పాపాత్ముడిగా హాజరయ్యే వాడికి తప్పక నరకం గలదు. అందులో వాడు చావనూ లేడు, బ్రతకనూ లేడు!
Tâhâ 20:75
ఎవడైతే విశ్వాసిగా హాజరవుతాడో మరియు సత్కార్యాలు చేసి ఉంటాడో,[1] అలాంటి వారికి ఉన్నత స్థానాలుంటాయి -
———
[1] సత్కార్యాలు చేయకుండా కేవలం విశ్వసించటం మాత్రమే పునరుత్థాన దినమున ఏ విధంగానూ ఉపయోగకరం కాదు. చూడండి, 6:158.
Tâhâ 20:76
శాశ్వతమైన స్వర్గవనాలు! వాటి క్రింద సెలయేళ్ళు పారుతూ ఉంటాయి. వారందులో శాశ్వతంగా ఉంటారు. మరియు ఇదే పుణ్యవంతులకు దొరికే ప్రతిఫలం.
Tâhâ 20:77
మరియు వాస్తవానికి, మేము మూసాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలిపాము:[1] "నా దాసులను రాత్రివేళ తీసుకొని బయలుదేరు మరియు వారి కొరకు సముద్రం నుండి తడిలేని మార్గాన్ని ఏర్పరచు; వెంబడించి పట్టుబడతావేమోనని భయపడకు, (సముద్రంలో మునిగి పోతావేమోనని కూడా) భీతి చెందకు."[2]
———
[1] చూడండి, 7:130 [2] చూడండి, 26:63-66.
Tâhâ 20:78
ఆ పిదప ఫిర్ఔన్ తన సేనలతో వారిని వెంబడించి (అక్కడికి) చేరగానే, సముద్రం వారిని హఠాత్తుగా అలుముకొని క్రమ్ముకున్నది.
Tâhâ 20:79
మరియు ఫిర్ఔన్ తన జాతి ప్రజలను మార్గభ్రష్టులుగా చేశాడు మరియు వారికి సన్మార్గం చూపలేదు.
Tâhâ 20:80
ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! వాస్తవానికి మేము, మిమ్మల్ని మీ శత్రువు నుండి విముక్తి కలిగించి, తూర్ పర్వతపు కుడివైపున మీతో వాగ్దానం చేసి, మీపై మన్న మరియు సల్వాలను అవతరింపజేశాము.[1]
———
[1] చూడండి, 19:52 మరియు 2:63.
Tâhâ 20:81
(ఇంకా ఇలా అన్నాము): "మేము మీకు ప్రసాదించిన మంచి ఆహారపదార్థాలను తినండి,[1] అందు తలబిరుసుతనం చేయకండి, అలా చేస్తే నా ఆగ్రహానికి గురి కాగలరు. నా ఆగ్రహానికి గురి అయినవాడు తప్పక నాశనమవుతాడు.
———
[1] మన్న మరియు సల్వాలను గురించి చూడండి, 2:57, 7:160. మన్న ఒక తియ్యని ఆహారపదార్థం. సల్వా ఒక రకమైన పక్షి (బుర్రపిట్ట, పూరెడు పిట్ట, కోలంకి పిట్ట లాంటిది).
Tâhâ 20:82
అయితే, ఎవడైతే పశ్చాత్తాపపడి విశ్వసించి మరియు సత్కార్యాలు చేసి సన్మార్గంలో ఉంటాడో, అలాంటి వాని పట్ల నేను క్షమాశీలుడను."[1]
———
[1] అల్-గఫ్ఫారు': Oft-Forgiving, Most Forgiving. క్షమించేవాడు, పాపాలను క్షమించేవాటడు, ఎక్కువగా క్షమించేవాడు. ఇంకా చూడండి, అల్-గాఫిర్: క్షమాగుణ పరిపూర్ణుడు, 40:3. అల్-'గఫూరు: క్షమాశీలుడు, 2:173, అల్-'గఫ్ఫారు మరియు అల్-'గఫూరు అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
Tâhâ 20:83
మరియు (మూసా తూర్ పర్వతం మీద ఉన్నప్పుడు[1] అల్లాహ్ అన్నాడు): "ఓ మూసా! నీవు నీ జాతి వారిని విడిచి శీఘ్రంగా (ఇక్కడికి) వచ్చిన కారణమేమిటి?"
———
[1] చూడండి, 2:51 మరియు 7:142.
Tâhâ 20:84
(మూసా) జవాబిచ్చాడు: "అదిగో! వారు నా వెనుక నా అడుగు జాడలలో వస్తూనే ఉన్నారు; నీవు నా పట్ల ప్రసన్నుడవు కావాలని, ఓ నా ప్రభూ! నేను త్వరత్వరగా నీ సాన్నిధ్యానికి వచ్చాను."[1]
———
[1] ఇక్కడ స్పష్టమయ్యేది ఏమిటంటే ఒక జాతి చాలా కాలం వరకు దాస్యంలో ఉండి అకస్మాత్తుగా దానికి స్వాతంత్ర్యం దొరికితే, అది తన భూత కాలపు క్రమశిక్షణలేని స్వభావాన్ని మార్చుకోలేదు. కాబట్టి ముందు తెలుపబడినట్లు, మూసా ('అ.స.) వెళ్ళిపోగానే అతన జాతివారు, ఆవుదూడను ఆరాధ్యదైవంగా చేసుకున్నారు. ఎందుకంటే, అంతకు ముందు వారు ఈజిప్టులో విగ్రహారాధనకు అలవాటు పడి ఉండిరి.
Tâhâ 20:85
(అల్లాహ్) అన్నాడు "వాస్తవానికి! నీ వెనుక మేము, నీ జాతి వారిని పరీక్షకు గురి చేశాము మరియు సామిరి వారిని మార్గభ్రష్టులుగా చేశాడు."
Tâhâ 20:86
ఆ తరువాత మూసా కోపంతోనూ, విచారంతోనూ, తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? మీ ప్రభువు మీకు మంచి వాగ్దానం చేయలేదా? ఏమీ? ఒడంబడిక పూర్తి కావటంలో ఏమైనా ఆలస్య మయ్యిందా? లేదా! మీ ప్రభువు యొక్క ఆగ్రహం మీపై విరుచుకు పడాలని కోరుతున్నారా? అందుకేనా మీరు నాకు చేసిన వాగ్దానాన్ని భంగ పరచారు?"
Tâhâ 20:87
వారు అన్నారు: "మేము నీకు చేసిన వాగ్దానాన్ని మాకు మేమై భంగపరచలేదు. కాని మాపై ప్రజల ఆభరణాల భారం మోపబడి ఉండెను, దానిని (అగ్నిలోకి) విసిరాము, ఇదే విధంగా సామిరి కూడా వేశాడు."
Tâhâ 20:88
తరువాత అతడు (సామిరి) వారికొక ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేశాడు. దాని నుండి ఆవుదూడ అరుపు వంటి శబ్దం వచ్చేది.[1] పిదప వారన్నారు: "ఇదే మీ ఆరాధ్య దైవం మరియు మూసా యొక్క ఆరాధ్య దైవం కూడాను, కాని అతను దానిని మరచిపోయాడు."
———
[1] చూడండి, 7:148.
Tâhâ 20:89
ఏమీ? అది వారికెలాంటి సమాధానమివ్వజాలదనీ మరియు వారికెలాంటి కీడు గానీ, మేలు గానీ చేయజాలదనీ వారు చూడటం లేదా?"[1]
———
[1] అల్లాహ్ (సు.తా.) వారి బుద్ధిహీనతను స్పష్టం చేస్తున్నాడు. ఆ ఆవుదూడ వారి ప్రశ్నకు సమాధాన మివ్వజాలదూ మరియు వారికెలాంటి లాభం గానీ నష్టం గానీ చేయజాలదూ, అని తెలిసి కూడా వారు దానిని ఆరాధించడం, బుద్ధిహీనత కాక మరేమిటి? ఆరాధ్య దేవుడు అల్లాహ్ (సు.తా.) మాత్రమే, ఆయనే తన దాసుల మొర వింటాడు మరియు వారికి లాభాం గానీ, నష్టం గానీ చేయగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు.
Tâhâ 20:90
మరియు వాస్తవానికి హారూన్ ఇంతకు ముందు వారితో చెప్పి ఉన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! దీని (విగ్రహం)తో మీరు పరీక్షింప బడుతున్నారు. మరియు నిశ్చయంగా, ఆ అనంత కరుణామయుడే మీ ప్రభువు! కావున మీరు నన్నే అనుసరించండి మరియు నా ఆజ్ఞనే పాలించండి."
Tâhâ 20:91
వారన్నారు: "మూసా తిరిగి మా వద్దకు వచ్చే వరకు, మేము దీనిని ఆరాధించకుండా ఉండలేము."
Tâhâ 20:92
(మూసా, హారూన్ తో) అన్నాడు: "ఓ హారూన్! నీవు వారిని మార్గభ్రష్టత్వంలో పడటం చూసినప్పుడు (వారిని వారించకుండా) నిన్ను ఎవరు ఆపారు?
Tâhâ 20:93
నీవెందుకు నన్ను అనుసరించలేదు? నీవు కూడా నా ఆజ్ఞను ఉల్లంఘించావా?"[1]
———
[1] చూడండి, 7:142.
Tâhâ 20:94
(హారూన్) అన్నాడు: "నా తల్లి కుమారుడా (సోదరుడా)! నా గడ్డాన్ని గానీ, నా తలవెంట్రుకలను గానీ పట్టి లాగకు: 'వాస్తవానికి ఇస్రాయీల్ సంతతి వారిలో విభేదాలు కల్పించావు, నీవు నా మాటను లక్ష్యపెట్టలేదు.' అని, నీవు అంటావేమోనని నేను భయపడ్డాను."[1]
———
[1] దీని వివరాలకు చూడండి, 7:150.
Tâhâ 20:95
(మూసా) అన్నాడు: "ఓ సామిరీ! ఇక నీ సంగతేమిటి?"
Tâhâ 20:96
(సామిరీ) అన్నాడు: "వారు చూడని దానిని నేను చూశాను. ఆ తరువాత నేను సందేశహరుని (జిబ్రీల్)[1] పాదగుర్తుల నుండి ఒక పిడికెడు (మట్టి) తీసుకొని దాని (ఆవుదూడ విగ్రహం) మీద వేశాను మరియు నా ఆత్మ నన్ను ఈ విధంగా ప్రేరేపించింది."
———
[1] చాలామంది వ్యాఖ్యాతలు రసూల్ అంటే ఇక్కడ జిబ్రీల్ ('అ.స.) అనే వ్యాఖ్యానించారు.
Tâhâ 20:97
(మూసా) అన్నాడు: "సరే వెళ్ళిపో! నిశ్చయంగా, నీ శిక్ష ఏమిటంటే, నీవు జీవితాంతం 'నన్ను ముట్టవద్దు' (లా మిసాస) అని, అంటూ ఉంటావు. మరియు నిశ్చయంగా, నీకు (వచ్చే జీవితంలో శిక్ష) నిర్ణయించబడి ఉంది, దాని నుండి నీవు తప్పించుకోలేవు. ఇక నీవు, భక్తుడవైన నీ ఆరాధ్యదైవాన్ని చూడు! మేము దానిని నిశ్చయంగా, కాల్చుతాము తరువాత దానిని భస్మం చేసి సముద్రంలో విసిరి వేస్తాము."[1]
———
[1] దీనితో విశదమయ్యేదేమిటంటే, షిర్క్ వైపుకు మరల్చే ప్రతిదానిని నాశనం చేయాలి. అది జిబ్రీల్ ('అ.స.) పాద గుర్తుల మట్టి అయినా సరే! దానిని ప్రసాదంగా భావించి ఆరాధిస్తే, అది కూడా షిర్కే.
Tâhâ 20:98
నిశ్చయంగా, మీ ఆరాధ్యదైవం అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన జ్ఞానం ప్రతి దానిని ఆవరించి ఉంది.
Tâhâ 20:99
(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము పూర్వం జరిగిన గాథలను నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవంగా మేము, మా తరఫు నుండి నీకు హితోపదేశాన్ని (ఈ ఖుర్ఆన్ ను) ప్రసాదించాము.
Tâhâ 20:100
దీని నుండి ముఖం త్రిప్పుకునే వాడు పునరుత్థాన దినమున (గొప్ప పాప) భారాన్ని భరిస్తాడు.
Tâhâ 20:101
అదే స్థితిలో వారు శాశ్వతంగా ఉంటారు. పునరుత్థాన దినమున వారికా భారం ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది.
Tâhâ 20:102
ఆ దినమున బాకా (సూర్) ఊదబడుతుంది.[1] మరియు మేము అపరాధులను ఒకచోట జమ చేస్తాము. ఆ రోజు వారి కళ్ళు (భయంతో) నీలమై పోతాయి.
———
[1] 'సూర్: అంటే ఖర్న్, బాకా. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో ఇస్రాఫీల్ ('అ.స.) దానిని ఊదుతారు. అప్పుడు పునరుత్థానం ఆవరిస్తుంది. (ముస్నద్ అ'హ్మద్, 2/191) దాదాపు ఇలాంటి 'హదీసే 'తిర్మిజీ'లో కూడా ఉంది. మొదటి శబ్దంతో అందరూ మరణిస్తారు. రెండవసారి బాకా ఊదగానే అందరూ తిరిగి సజీవులుగా లేచి వస్తారు.
Tâhâ 20:103
వారు ఒకరితో నొకరు ఇలా గుసగుసలాడుకుంటారు: "మీరు (భూమిలో) పది (రోజుల) కంటే ఎక్కువ ఉండలేదు."[1]
———
[1] ఈ విధమైన ఆయత్ ల కొరకు చూడండి, 2:259, 17:52, 18:19, 23:112-113, 30:55, 79:46.
Tâhâ 20:104
వారు ఏమి మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో మంచి తెలివి గలవారు: "మీరు కేవలం ఒక్క దినం మాత్రమే ఉన్నారు!" అని అంటారు.
Tâhâ 20:105
మరియు వారు నిన్ను పర్వతాలను గురించి అడుగుతున్నారు. వారితో అను: "నా ప్రభువు వాటిని ధూళిగా మార్చి ఎగురవేస్తాడు.
Tâhâ 20:106
ఆ తరువాత దానిని (భూమిని) చదునైన మైదానంగా చేసి వేస్తాడు.
Tâhâ 20:107
నీవు దానిలో ఎలాంటి పల్లం గానీ, మిట్టగానీ చూడలేవు."[1]
———
[1] చూడండి, 14:48.
Tâhâ 20:108
ఆ రోజు అందరూ పిలిచేవానిని వెంబడిస్తారు, అతని నుండి తొలగిపోరు.[1] అనంత కరణామయుని ముందు వారి కంఠస్వరాలన్నీ అణిగిపోయి ఉంటాయి, కావున నీవు గొణుగులు తప్ప మరేమీ వినలేవు.
———
[1] ఆ పిలిచే వాని నుండి తప్పించుకొని అటూ ఇటూ పోకుండా అతని వెంటబడే పోతారు.
Tâhâ 20:109
ఆ రోజు సిఫారసు ఏ మాత్రం పనికిరాదు. కానీ! అనంత కరుణామయుడు ఎవరికైనా అనుమతినిచ్చి, అతని మాట ఆయనకు సమ్మతమైనదైతేనే తప్ప! [1]
———
[1] ఈ విధమైన ఆయత్ ఖుర్ఆన్ లో ఎన్నో సార్లు వచ్చింది. చూడండి, 53:26, 21:28, 34:23, 10:3, 78:38, 2:255, 19:87 మొదలైనవి.
Tâhâ 20:110
(ఎందుకంటే!) ఆయనకు - వారికి ప్రత్యక్షంగా నున్నది మరియు పరోక్షంగా నున్నది - అంతా తెలుసు, కాని వారు తమ జ్ఞానంతో ఆయనను గ్రహించజాలరు.[1]
———
[1] అల్లాహ్ (సు.తా.)కు ప్రతి ఒక్కరి విషయం తెలుసు, కాబట్టి ఎవరు ఎక్కువ సత్పురుషులో ఆయనకు బాగా తెలుసు. అల్లాహ్ (సు.తా.) తప్ప మరెవ్వరూ అది ఎరుగరు. కావున సిఫారసు చేసే అర్హత గల వానిని ఆయనే ఎన్నుకుంటాడు.
Tâhâ 20:111
మరియు సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు (శాశ్వితుడు) అయిన ఆయన (అల్లాహ్) ముందు అందరి ముఖాలు నమ్రతతో వంగి ఉంటాయి. మరియు దుర్మార్గాన్ని అవలంబించినవాడు, నిశ్చయంగా, విఫలుడవుతాడు.[1]
———
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ప్రతివానికి అతని హక్కు చెల్లించండి. లేకుంటే పునరుత్థాన దినమున ఇవ్వవలసి ఉంటుంది.' మరొక 'హదీస్'లో ఉంది: 'దుర్మార్గం నుండి దూరంగా ఉండండి, షిర్క్ మహా దుర్మార్గం (''జుల్మె అ''జీమ్), అది క్షమించబడదు.' ('స. ముస్లిం).
Tâhâ 20:112
మరియు సత్కార్యాలు చేస్తూ, విశ్వాసి అయి ఉన్న వానికి ఎలాంటి అన్యాయం గానీ, నష్టం గానీ జరుగునేమోనని భయపడే అవసరం ఉండదు.[1]
———
[1] చూడండి, 16:96-97.
Tâhâ 20:113
మరియు ఈ విధంగా మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో క్రమక్రమంగా అవతరింపజేశాము. మరియు ఇందులో పలురకాల హెచ్చరికలు చేశాము. బహుశా వారు దైవభీతి కలిగి ఉంటారేమోనని; లేదా! వారు ఉపదేశం గ్రహిస్తారేమోనని.[1]
———
[1] చూడండి, 12:2, 13:37, 14:4, 19:97.
Tâhâ 20:114
అల్లాహ్ అత్యున్నతుడు, సార్వభౌముడు,[1] పరమ సత్యుడు (ఓ ముహమ్మద్!) నీకు ఖుర్ఆన్ సందేశం (వహీ) పూర్తిగా అవతరింప జేయబడే వరకు దానిని గురించి తొందరపడకు. మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నా జ్ఞానాన్ని వృద్ధి పరచు!"[2]
———
[1] అల్-మలికు: చూడండి, 23:116, 59:23, 62:1, Soveriegn, సార్వభౌముడు, విశ్వాధిపతి. అల్-మలీక్: Mighty Emperor, చక్రవర్తి, సర్వాధికారి, 54:55. మాలికు: Master, Owner, 1:4 : Sovereign, of the Universe, విశ్వసామ్రాట్టు, విశ్వసామ్రాజ్యాధిపతి, చూడండి, 3:26. [2] ఖుర్ఆన్ అవతరణకు చూడండి, 75:16-19 మరియు 25:32.
Tâhâ 20:115
మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఆదమ్ తో ఒక వాగ్దానం చేయించి ఉన్నాము, కాని అతడు దానిని మరచి పోయాడు మరియు మేము అతనిలో స్థిరత్వాన్ని చూడలేదు.[1]
———
[1] ఆ వాగ్దానం ఏమిటంటే ఒక ప్రత్యేక వృక్షపు దరిదాపులకు పోగూడదని, అంటే ఆ వృక్షపు ఫలాలు తినకూడదని. కాని షైతాన్ అతనిని ('అ.స.) మరియు అతని ('అ.స.) భార్యను తన వలలోకి తీసుకొని: 'ఆ వృక్షపు ఫలాలను తినటం వల్ల మీరు చిరంజీవులవుతారు.' అని చెప్పి, వారి చేత ఆ ఫలాన్ని తినిపించి, అల్లాహ్ (సు.తా.) తో చేసిన వాగ్దానాన్ని భంగం చేయించాడు.
Tâhâ 20:116
మరియు మేము దేవదూతలతో: "ఆదమ్[1] కు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆజ్ఞాపించినపుడు ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం (సజ్దా) చేశారు. అతడు నిరాకరించాడు.
———
[1] ఆదమ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 2:30-34, 15:28-34.
Tâhâ 20:117
అప్పుడు అన్నాము: "ఓ ఆదమ్! నిశ్చయంగా, ఇతడు నీకు మరియు నీ భార్యకు శత్రువు, కాబట్టి ఇతడిని, మీ ఇద్దరిని స్వర్గం నుండి వెడల గొట్టనివ్వకండి అలా అయితే మీరు దురవస్థకు గురి కాగలరు.[1]
———
[1] తష్ఖా: అంటే ప్రయాస, కష్టం, కఠినం. ఏమిటంటే, స్వర్గంలో మానవుని అత్యవసర వసతులు అంటే ఆహారపానీయాలు, వస్త్రాలు మరియు నివాసం అన్నీ కోరిన వెంటనే లభిస్తాయి. వాటి కొరకు కష్టపడే అవసరం వుండదు. కాని, ఇహలోకంలో వాటి కొరకు మానవుడు ప్రయాస పడుతూ వుంటాడు. అదే దీని అర్థం.
Tâhâ 20:118
నిశ్చయంగా, ఇక్కడ నీవు ఆకలి గొనవూ మరియు వస్త్రహీనుడవూ (దిగంబరుడవూ) కావు.[1]
———
[1] చూడండి, 7:20-22.
Tâhâ 20:119
మరియు నిశ్చయంగా, ఇందులో నీకు దాహమూ కలుగదు మరియు ఎండ కూడా తగలదు."
Tâhâ 20:120
అప్పుడు షైతాన్ అతని మనస్సులో కలతలు రేకెత్తిస్తూ అన్నాడు: "ఓ ఆదమ్! శాశ్వత జీవితాన్ని మరియు అంతం కాని సామ్రాజ్యాన్ని, ఇచ్చే వృక్షాన్ని నీకు చూపనా?"
Tâhâ 20:121
ఆ పిదప వారిద్దరు దాని నుండి (ఫలాన్ని) తినగానే వారిద్దరికి, వారి దిగంబరత్వం వ్యక్తం కాసాగింది.[1] మరియు వారిద్దరు స్వర్గపు ఆకులను తమ మీద కప్పుకోసాగారు. (ఈ విధంగా) ఆదమ్ తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, సన్మార్గం నుండి తప్పి పోయాడు.
———
[1] వారి దిగంబరత్వం వ్యక్తం కాసాగింది. చూడండి, 7:26-27.
Tâhâ 20:122
ఆ తరువాత అతని ప్రభువు, అతనిని (తన కారుణ్యానికి) ఎన్నుకొని, అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి, అతనికి మార్గదర్శకత్వం చేశాడు.
Tâhâ 20:123
(అల్లాహ్) అన్నాడు: "మీరిద్దరూ కలసి ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరి కొకరు శత్రువులై[1] ఉంటారు. కాని నా తరపు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది, కావున నా మార్గదర్శకత్వాన్ని అనుసరించే వాడు, మార్గభ్రష్టుడూ కాడు మరియు దురవస్థకు గురికాడు.
———
[1] అంటే మానవుడు మరియు షై'తాను చూడండి, 7:24 మరియు 2:36.
Tâhâ 20:124
మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది మరియు పునరుత్థాన దినమున అతినిని అంధునిగా లేపుతాము."
Tâhâ 20:125
అప్పుడతను అంటాడు: "ఓ నా ప్రభూ! నన్నెందుకు గ్రుడ్డివానిగా లేపావు, వాస్తవానికి నేను (ప్రపంచంలో) చూడగలిగే వాణ్ణి కదా?"
Tâhâ 20:126
అప్పుడు (అల్లాహ్) అంటాడు: "మా సూచనలు నీ వద్దకు వచ్చినపుడు, నీవు వాటిని విస్మరించావు. మరియు అదే విధంగా ఈ రోజు నీవు విస్మరించబడుతున్నావు."
Tâhâ 20:127
మరియు ఈ విధంగా, మేము మితిమీరి ప్రవర్తిస్తూ, తన ప్రభువు సూచనలను విశ్వసించని వానికి ప్రతీకారం చేస్తాము. మరియు పరలోక శిక్ష ఎంతో కఠినమైనది మరియు శాశ్వతమైనది.
Tâhâ 20:128
వీరికి పూర్వం గడిచిన ఎన్నో తరాలను మేము నాశనం చేసి ఉన్నాము. వీరు వారి నివాస స్థలాలలో తిరుగుతున్నారు. ఏమీ? దీని వలన కూడా వీరికి మార్గదర్శకత్వం లభించలేదా? నిశ్చయంగా, ఇందులో అర్థం చేసుకునే వారికి ఎన్నో సూచనలున్నాయి.
Tâhâ 20:129
మరియు నీ ప్రభువు నుండి మొదట్లోనే ఒక గడువు కాలం నిర్ణయించబడి ఉండక పోతే, వీరికి ఈ పాటికే (శిక్ష) తప్పక విధించబడి ఉండేది. కాని (వీరి) గడువు కాలం నిర్ణయించబడి ఉంది.[1]
———
[1] అల్లాహ్ (సు.తా.) పాపం చేసేవారిని వెనువెంటనే శిక్షిస్తే ప్రపంచంలో ఒక్కడు కూడా శిక్షింపబడకుండా ఉండడు. ఇది అల్లాహ్ (సు.తా.) కు తెలుసు, కాబట్టి ఆయన (సు.తా.) ప్రతి ఒక్కరికి పశ్చాత్తాప పడటానికి గడువు ఇస్తాడు. ఇదే అల్లాహ్ (సు.తా.) విధానం (సాంప్రదాయం). ఇక ఆ సమయం వచ్చిన తరువాత ఆయన శిక్ష నుండి తప్పించేవారు ఎవ్వరూ ఉండరు. అందుకే నీవు సత్యతిరస్కారులను భోగభాగ్యాలతో విర్రవీగుతూ ఉండటాన్ని చూస్తున్నావు. చూడండి, 10:11, 16:61, 18:58.
Tâhâ 20:130
కావున (ఓ ముహమ్మద్!) వారు పలికే మాటలకు నీవు ఓర్పు వహించు. సూర్యుడు ఉదయించక ముందు మరియు అస్తమించక ముందు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయన స్తోత్రం చెయ్యి. మరియు రాత్రి సమయాలలో మరియు పగటి వేళలలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు.[1] అప్పుడు నీపు సంతుష్టుడవవు తావు!
———
[1] చూడండి, 11:114.
Tâhâ 20:131
మేము వారిలో చాలా మందికి - వాటితో వారిని పరీక్షించటానికి - వారు అనుభవించటానికి, ఇచ్చిన ఇహలోక జీవిత శోభను నీవు కళ్ళెత్తి చూడకు.[1] నీ ప్రభువు ఇచ్చే జీవనోపాధియే అత్యుత్తమమైనది మరియు చిరకాలముండేది.[2]
———
[1] ఇలాంటి సందేశానికి చూడండి, 3:196-197, 15:88 18:7 [2] ఒకసారి 'ఉమర్ (ర'ది.'అ.) దైవప్రవక్త ('స'అ) దగ్గరికి వచ్చారు. అతన ఒక చాప మీద పండుకొని ఉన్నది చూసి ఏడ్వసాగారు. అతని ఇంట్లో రెండు చర్మాల కంటే ఎక్కువ ఏమీ లేవు. దైవప్రవక్త ('స'అస) అతని ఏడ్పుకు కారణమడగగా, 'ఉమర్ (ర'ది.'అ) ఇలా జవాబిచ్చారు: 'ఖైసర్ మరియు కిస్రాలు ఎన్నో భోగభాగ్యాలలో మునిగి ఉన్నారు. మీరేమో అత్యుత్తమ సృష్టి అయి కూడా ఈ స్థితిలో ఉన్నారు.' దానికి దైవప్రవక్త ('స'అస) అన్నారు: " 'ఉమర్ (ర'ది.'అ) నీకు ఇంకా సందేహముందా? ఎవరికైతే కేవలం ఇహలోకంలోనే భోగభాగ్యాలు ఇవ్వబడ్డాయో వారే వీరు. వీరికి పరలోకంలో ఏమీ మిగలదు." ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం).
Tâhâ 20:132
మరియు నీ కుటుంబం వారిని నమాజ్ చేయమని ఆజ్ఞాపించు; మరియు స్వయంగా నీవు కూడా దానిని సహనంతో పాటించు. మేము నీ నుండి జీవనోపాధిని ఆశించము. మేమే నీకు జీవనోపాధిని ఇచ్చే వారము. చివరకు దైవభీతి గలవారిదే ఉత్తమ ముగింపు.
Tâhâ 20:133
మరియు వారంటారు: "ఇతను (ఈ ప్రవక్త) తన ప్రభువు నుండి ఏదైనా ఒక అద్భుత సూచన (మహిమ) ఎందుకు తీసుకురాడు?" ఏమీ? పూర్వపు గ్రంథాలలో పేర్కొనబడిన స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు రాలేదా?[1]
———
[1] ఇంకా చూడండి, 2:42 మరియు 61:6.
Tâhâ 20:134
ఒకవేళ మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను / ముహమ్మద్ ను) పంపక ముందే వారిని శిక్షించి ఉంటే! వారు అనేవారు: "ఓ మా ప్రభూ! నీవు మా వద్దకు ఒక సందేశహరుణ్ణి ఎందుకు పంపలేదు? (అలా చేస్తే) నిశ్ఛయంగా, మేము - అవమానం పొంది, అగౌరవం పాలుకాక ముందే - నీ సూచనలను పాటించేవారం కదా?"[1]
———
[1] అల్లాహ్ (సు.తా.) ఎవరిని కూడా అజ్ఞానంతో చేసే తప్పుల కొరకు - వారికి మార్గదర్శకత్వం చూపనంతవరకు - శిక్షించడు. అంటే సన్మార్గాన్ని చూసిన తరువాత కూడా దాన్ని తిరస్కరించి మార్గభ్రష్టులైన వారిని శిక్షిస్తాడు. ఇంకా చూడండి, 6:131, 15:4 మరియు 26:208-209.
Tâhâ 20:135
వారితో ఇలా అను: "ప్రతి ఒక్కడు (తన అంతిమ ఫలితం కొరకు వేచి ఉన్నాడు. కావున మీరు కూడా వేచి ఉండండి. సరైన మార్గంలో ఉన్న వారెవరో మరియు మార్గదర్శకత్వం పొందిన వారెవరో మీరు త్వరలోనే తెలుసుకుంటారు."
Enbiya 21:1
మానవులతో లెక్క (తీసుకునే) సమయం సమీపించింది, అయినా వారు ఏమరుపాటులో పడి విముఖులై ఉన్నారు.[1]
———
[1] అంటే పునరుత్థాన దినం.
Enbiya 21:2
(కావున) వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు ఏ క్రొత్త సందేశం వచ్చినా, వారు దానిని పరిహసించకుండా వినలేరు.
Enbiya 21:3
వారి హృదయాలు వినోద క్రీడలలో (అశ్రద్ధలో) మునిగి ఉన్నాయి. మరియు వారిలో దుర్మార్గానికి పాల్పడిన వారు రహస్య సంప్రదింపులు చేసుకొని (ఇలా అంటారు): "ఏమీ? ఇతను (ముహమ్మద్) మీలాంటి ఒక సాధారణ మానవుడు కాడా?[1] అయినా మీరు చూస్తూ వుండి కూడా, ఇతని మంత్రజాలంలో[2] చిక్కుకుపోయారా?"
———
[1] అంటే ఆ కాలపు మక్కా ముష్రికులు, వారి తోటి మానవుడు ప్రవక్త కావడం నమ్మ లేక పోయారు. కాని ఈ కాలంలో కొందరు ప్రవక్తలను దైవాలుగా చేసుకుంటున్నారు. [2] అస్-సి'హ్రా: మంత్రజాలం, జాలవిద్య, మాయాజాలం. ఈ పదం ఖుర్ఆన్ అవతరణ క్రమంలో మొదటి సారి 74:24లో వచ్చింది.
Enbiya 21:4
(ముహమ్మద్) ఇలా అన్నాడు: "నా ప్రభువుకు ఆకాశంలోను మరియు భూమిలోను పలుకబడే ప్రతి మాట తెలుసు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
Enbiya 21:5
అలా కాదు! వారన్నారు: "ఇవి (ఈ సందేశాలు) కేవలం పీడకలలు మాత్రమే; కాదు కాదు! ఇతడే దీనిని కల్పించాడు; అలా కాదు! ఇతడొక కవి! (ఇతడు ప్రవక్తయే అయితే) పూర్వం పంపబడిన సందేశహరుల మాదిరిగా, ఇతనిని కూడా మా కొరకు ఒక అద్భుత సూచన (ఆయత్) ను తెమ్మను!"
Enbiya 21:6
మరియు వీరికి పూర్వం మేము నాశనం చేసిన ఏ పురవాసులు కూడా విశ్వసించి ఉండలేదు. అయితే! వీరు మాత్రం విశ్వసిస్తారా?
Enbiya 21:7
మరియు నీకు పూర్వం కూడా (ఓ ముహమ్మద్!) మేము పురుషులను మాత్రమే ప్రవక్తలుగా చేసి పంపి, వారిపై దివ్యజ్ఞానాన్ని (వహీని) అవతరింపజేశాము. కావున మీకిది తెలియకుంటే హితబోధ గలవారిని (గ్రంథప్రజలను) అడగండి.
Enbiya 21:8
మరియు మేము వారికి (ఆ ప్రవక్తలకు) ఆహారం తినే అవసరం లేని శరీరాలను ఇవ్వలేదు. మరియు వారు చిరంజీవులు కూడా కాలేదు.[1]
———
[1] అంటే ఏ ప్రవక్తకు కూడా అమానుషమైన యోగ్యతలు ప్రసాదించబడలేదు. వారు ('అలైహిమ్. స.) సాధారణ మానవుల్లాగానే ఉండేవారు, కాని వారిపై అల్లాహ్ (సు.తా.) దివ్యజ్ఞానం (వ'హీ) అవతరింపజేయబడుతూ ఉండేది. వారికి అల్లాహ్ (సు.తా.) తెలిపినది తప్ప మరే అగోచర జ్ఞానం లేదు. ఇంకా చూడండి, 5:75, 3:164, 13:38, 25:20.
Enbiya 21:9
ఆ పిదప మేము వారికి చేసిన వాగ్దానాలు పూర్తి చేశాము. కావున వారిని మరియు మేము కోరిన వారిని రక్షించాము మరియు మితిమీరి ప్రవర్తించిన వారిని నాశనం చేశాము.
Enbiya 21:10
(ఓ మానవులారా!) వాస్తవంగా, మేము మీ కొరకు ఒక గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. అందులో మీ కొరకు ఉపదేశముంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?
Enbiya 21:11
మరియు దుర్మార్గానికి పాల్పడిన ఎన్ని నగరాలను మేము నిర్మూలించలేదు! మరియు వారి తరువాత మరొక జాతి వారిని పుట్టించాము![1]
———
[1] చూడండి, 17:17
Enbiya 21:12
మా శిక్ష (రావటం) తెలుసుకున్నప్పుడు వారు దాని నుండి పారిపోవటానికి ప్రయత్నంచేవారు.
Enbiya 21:13
(అప్పుడు వారితో ఇలా చెప్పబడింది): "పారిపోకండి! మరలిరండి - మీరు అనుభవిస్తున్న, మీ సుఖసంపదల వైపుకు మరియు మీ ఇళ్ళ వైపుకు - ఎందుకంటే! మిమ్మల్ని ప్రశ్నించవలసి ఉంది!"
Enbiya 21:14
వారన్నారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! నిస్సందేహంగా మేము దుర్మార్గులము."
Enbiya 21:15
ఆ పిదప మేము వారిని కోయబడిన పైరువలే, చల్లారిన అగ్ని వలే, చేసినంత వరకు వారి అరపు ఆగలేదు.
Enbiya 21:16
మరియు మేము ఈ ఆకాశాన్ని, భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా కేవలం వినోదం కొరకు సృష్టించలేదు.
Enbiya 21:17
ఒకవేళ మేము కాలక్షేపమే చేయదలచుకుంటే, మేము మా వద్ద ఉన్న దానితోనే చేసుకునే వారం; వాస్తవానికి, ఇలా చేయడమే, మా ఉద్దేశ్యమై ఉంటే![1]
———
[1] చూడండి, 10:5.
Enbiya 21:18
అలా కాదు! మేము సత్యాన్ని అసత్యంపై విసురుతాము. అది దాని తలను పగుల గొడుతుంది, అప్పుడు అది (అసత్యం) నశించి పోతుంది మరియు మీరు కల్పించే కల్పనలకు, మీకు వినాశం తప్పదు.
Enbiya 21:19
మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. మరియు ఆయనకు దగ్గరగా ఉన్నవారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నామని గర్వించరు మరియు (ఆయన ఆరాధనలో) అలసట కూడా చూపరు. [1]
———
[1] చాలా మంది వ్యాఖ్యాతలు వీరిని దైవదూతలుగా పరిగణిస్తారు.
Enbiya 21:20
వారు రేయింబవళ్ళు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, వారు ఎన్నడూ బలహీనత చూపరు.
Enbiya 21:21
ఏమీ? వారు భూలోకం నుండి ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? అవి (చనిపోయిన వారిని) మరల బ్రతికించి లేపగలవా?[1]
———
[1] అంటే అవి చనిపోయిన వారిని మరల బ్రతికించి లేపలేవు, అని అర్థం. అంటే వారికి ఎలాంటి శక్తి లేదు. అలాంటప్పుడు వారు ఆ కల్పిత దైవాలను ఎందుకు ఆరాధించాలి?
Enbiya 21:22
వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.[1]
———
[1] ఒకవేళ అల్లాహ్ (సు.తా.)కు సాటిగా మరొక దైవం ఉండి ఉంటే, ఇద్దరి ఆధిపత్యం నడిచేది. ప్రతి ఒక్కరూ తమ ఇచ్ఛానుసారంగా ప్రపంచాన్ని నడపగోరేవారు. దాని వల్ల విశ్వంలో ఇంత శాంతి ఉండక పోయేది. అల్లకల్లోలం చెలరేగిపోయేది. మానవుల రాజ్యపాలన ఏదైతే భూమిలోని ఒక్క చిన్న భాగం మీద ఉందో, దానికి ఒకే ఒక్క ఉన్నత పాలకుడిని ప్రసిడెంట్, లేక రాజు, లేక ప్రైమ్ మినిష్టర్ ను నియమించుకుంటాము. అలాంటప్పుడు విశ్వసామ్రాజ్య వ్యవస్థలో ఒకని కంటే ఎక్కువ పాలకులు ఉండి ఉంటే, అల్లాకల్లోలం చెలరేగదా? ఇంకా చూడండి, 6:100.
Enbiya 21:23
తాను చేసే దానిని గురించి ఆయన (అల్లాహ్) ప్రశ్నించబడడు, కాని వారు ప్రశ్నించబడతారు.
Enbiya 21:24
ఏమీ? వారు ఆయనను వదలి ఇతర ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? వారితో అను: "మీ నిదర్శనాన్ని తీసుకురండి." ఇది (ఈ ఖుర్ఆన్) నాతో పాటు ఉన్నవారికి హితబోధ; మరియు నా పూర్వీకులకు కూడా (ఇలాంటి) హితబోధలు (వచ్చాయి). కాని వారిలో చాలా మంది సత్యాన్ని గ్రహించలేదు, కావున వారు విముఖులై పోతున్నారు.
Enbiya 21:25
మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము.
Enbiya 21:26
వారంటున్నారు: "అనంత కరుణామయునికి సంతానముంది!" అని. ఆయన సర్వలోపాలకు అతీతుడు, (అల్లాహ్ సంతానంగా పరిగణించబడే) వారు కేవలం గౌరవనీయులైన (ఆయన) దాసులు మాత్రమే!"[1]
———
[1] చూడండి, 19:92.
Enbiya 21:27
వారు ఆయన (అనుమతించక) ముందు మాట్లాడలేరు. మరియు వారు (దైవదూతలు) ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు.[1]
———
[1] ఈ ఆయత్ ముష్రికీన్ లు దేవదూతలను ('అ.స.) అల్లాహ్ (సు.తా.) బిడ్డలుగా పరిగణించే విషయాన్ని ఖండిస్తుంది. దేవదూతలు ('అ.స.) అల్లాహ్ (సు.తా.) సృష్టించిన దాసులు మరియు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారు.
Enbiya 21:28
ఆయనకు, వారికి ప్రత్యక్షంగా (ముందు) ఉన్నదీ, అంతా తెలుసు. వారు, ఆయన సమ్మతించిన వారికి తప్ప ఇతరుల కొరకు సిఫారసు చేయలేరు.[1] వారు, ఆయన భీతి వలన భయకంపితులై ఉంటారు.
———
[1] చూడండి, 2:255 దీనితో వ్యక్తమయ్యేది ఏమిటంటే ప్రవక్తలు మరియు 'సాలెహీన్ లే గాక దైవదూతలు కూడా, అల్లాహ్ (సు.తా.) అనుమతించిన వారికి మాత్రమే సిఫారసు చేయగలరు. ఇంకా చూడండి, 10:3, 19:87, 20:109, 53:26.
Enbiya 21:29
వారిలో (దేవదూతలలో) ఎవరైనా: "నిశ్చయంగా, ఆయనే కాక, నేను కూడా ఒక ఆరాధ్య దైవాన్ని" అని అంటే, అలాంటి వానికి మేము నరకశిక్ష విధిస్తాము.[1] మేము దుర్మార్గులను ఇదే విధంగా శిక్షిస్తాము.
———
[1] ఇది ఒక ఉదారహణమే. ఇలా సంభవించనవసరం లేదు. అంటే దేవదూతలు ఎన్నడూ అలా చేయరు. ఒకవేళ వారు అలా చేస్తే, వారు ('అలైహిమ్. స.) కూడా శిక్షించబడతారు. ఈ విధమైన ఉదాహరణలకు చూడండి, 43:81 మరియు 39:65.15.
Enbiya 21:30
ఏమి? ఈ సత్యతిరస్కారులకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి భూమ్యాకాశాలు (ఒకే ఒక్క భౌతికాంశంగా) కలుసుకొని ఉండేవని, అయితే మేమే వాటిని పగుల గొట్టి వేరు చేశామని?[1] మరియు మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము.[2] ఇకనైన వారు విశ్వసించరా?
———
[1] ఇదే సైంటిస్టులు పలికే Big Bang Theory. ఈ ఆయత్ అవతరింపజేయబడినప్పుడు అరేబియా వాసులకు ఏ విధమైన సైన్సు జ్ఞానం లేదు. ఈ Big Band Theory ఇప్పుడిప్పుడే ఆవిష్కరించబడింది. ఈ ఖుర్ఆన్ ను దైవప్రవక్త ('స'అస) వ్రాయలేదు, ఎందుకంటే అతను నిరక్షరాస్యుడని మక్కా ప్రజలందరికీ తెలుసు. ఆ కాలపు విద్వాంసులకు కూడా ఇలాంటి సైన్సు విషయాల జ్ఞానం ఉండేది కాదు. దీనితో ఈ ఖుర్ఆన్ దివ్యాష్కృతి అని నిరూపించబడుతోంది. దాదాపు వేయి కంటే ఎక్కువ ఆయతులలో ఈ విధమైన సైన్సు విషయాలు పేర్కొనబడ్డాయి. వాటిలో కొన్ని ఇప్పుడిప్పుడే పరిశోధించబడి నిరూపించబడ్డాయి. వాటిలో ఒక ఒక్క ఆవిష్కారం కూడా ఖుర్ఆన్ లో పేర్కొనబడ్డ విషయం తప్పని నిరూపించలేదు. ఇంకా ఎన్నో నిరూపించబడనున్నాయి. ఈ కాలపు Modern Astrophysicists లందరి అభిప్రాయం ఏమిటంటే: ఈ విశ్వమంతా ఒకే ఒక మూల ద్రవ్యం హైడ్రోజన్ పరమాణువు నుండి సృష్టించబడింది. తరువాత ఆ హైడ్రోజన్ పరమాణువులు గరుత్వాకర్షణ శక్తి వల్ల కలుపబడి అనేక పదార్థాల సముదాయం ఏర్పడి, తరువాత అది పగల గొట్టబడటం వల్ల Galaxies, Nedulae and Solar Systems, అంటే నక్షత్ర సముదాయం ఏర్పడింది. ఇదంతా జరగటానికి ఎంతో శక్తి (Energy) కావాలి. కాబట్టి, ఇదంతా చేసే శక్తి గలవాడు, సర్వసృష్టికి ఆధార భూతుడైన అల్లాహ్ (సు.తా.) మాత్రమే. ఇంకా చూడండి 51:47. [2] ఈ విషయం కూడా ఇప్పటి సైంటిస్టులందరూ అంగీకరిస్తారు. అంటే ప్రతి జీవి నీటి నుండి పుట్టించబడిందని. జీవకణం (Cell) లోని అత్యధిక భాగం Protoplasm అందులో కూడా అత్యధిక భాగం (దాదాపు 72%) నీరే.
Enbiya 21:31
మరియు భూమి వారితో పాటు కదలకుండా ఉండాలని మేము దానిలో స్థిరమైన పర్వతాలను (మేకుల వలే) నాటాము.[1] మరియు వారు (ప్రజలు) మార్గదర్శకత్వం పొందాలని మేము దానిలో విశాలమైన మార్గాలను కూడా ఏర్పాటు చేశాము.
———
[1] చూడండి, 16:15.
Enbiya 21:32
మరియు మేము ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేశాము.[1] అయినా వారు అందులోని సూచనల (ఆయాత్ ల) నుండి విముఖులవుతున్నారు.
———
[1] చూడండి, 13:2.
Enbiya 21:33
మరియు రేయింబవళ్ళను మరియు సూర్యచంద్రులను సృష్టించినవాడు ఆయనే. అవి తమ తమ కక్ష్యలలో తేలియాడుతూ (తిరుగుతూ) ఉన్నాయి.
Enbiya 21:34
మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము ఏ మానవునికి కూడా శాశ్వత జీవితాన్ని ప్రసాదించలేదు.[1] ఏమీ? ఒకవేళ నీవు మరణిస్తే! వారు మాత్రం శాశ్వతంగా సజీవులుగా (చిరంజీవులుగా) ఉంటారా? [2]
———
[1] చూడండి, 3:144. [2] చూడండి, 39:30.
Enbiya 21:35
ప్రతి ప్రాణి మృత్యువును చవి చూస్తుంది. మరియు మేము మీ అందరినీ, మంచి మరియు చెడు స్థితులకు గురి చేసి, పరీక్షిస్తాము.[1] మరియు మీరందరూ మా వైపునకే మరలింపబడతారు.
———
[1]మీలో ఎవరు కృతజ్ఞులో మరియు ఎవరు సహనం వహించని కృతఘ్నులో చూడటానికి. మంచి స్థితిలో అల్లాహ్ (సు.తా.) కు కృతజ్ఞులవటం మరియు దురావస్థలో సహనం వహించటమే విశ్వాసుల లక్షణాలు.
Enbiya 21:36
మరియు ఈ సత్యతిరస్కారులు నిన్ను చూసినప్పుడల్లా మీతో పరహాసమాడే వైఖరిని మాత్రమే అవలంబిస్తూ (అంటారు):[1] "ఏమీ? మీ ఆరాధ్యదైవాలను గురించి (నిర్లక్ష్యంగా) మాట్లాడే వ్యక్తి ఇతనేనా?" ఇక వారేమో అనంత కరుణామయుని ప్రస్తావన వచ్చినప్పుడు! వారే సత్యాన్ని తిరస్కరిస్తున్నారు.
———
[1] చూడండి, 25:41.
Enbiya 21:37
మానవుడు ఆత్రగాడుగా (తొందర పాటు జీవిగా) పుట్టించబడ్డాడు.[1] త్వరలోనే నేను మీకు నా సూచనలు చూపుతాను, కావున నన్ను తొందరపెట్టకండి.[2]
———
[1] మానవునికి సహనం లేదు, చూడండి 17:11. [2] చూడండి, 16:1, అంటే తీర్పుదినం రానున్నది.
Enbiya 21:38
మరియు వారంటున్నారు: "మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం (బెదిరింపు) ఎప్పుడు నెరవేరనున్నది.[1]
———
[1] దీని జవాబుకై చూడండి, 7:187.
Enbiya 21:39
ఒకవేళ, ఈ సత్యతిరస్కారులు, ఆ సమయాన్ని గురించి తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది! అప్పుడు వారు ఆ అగ్ని నుండి తమ ముఖాలను గానీ, తమ వీపులను గానీ కాపాడుకోలేరు. మరియు వారికెలాంటి సహాయం కూడా లభించదు.
Enbiya 21:40
వాస్తవంగా, అది వారిపై అకస్మాత్తుగా వచ్చిపడి వారిని కలవర పెడుతుంది.[1] వారు దానిని నివారించనూ లేరు మరియు వారికెలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు.
———
[1] తబ్ హతు: perplex, stupify, కలవర పెట్టు, చికాకు పరచు, తెలివితేటలను పోగొట్టు.
Enbiya 21:41
మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి, నీకు పూర్వం కూడా ప్రవక్తలు ఎగతాళి చేయబడ్డారు, కానీ ఆ వెక్కిరించిన వారిని, వారి ఎగతాళియే చుట్టుకున్నది.[1]
———
[1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 6:10.
Enbiya 21:42
ఇలా అను: "రేయింబవళ్ళు మిమ్మల్ని అనంత కరుణామయుని (శిక్ష) నుండి ఎవడు కాపాడగలడు?" అయినా వారు తమ ప్రభువు స్మరణ నుండి విముఖులవుతున్నారు.
Enbiya 21:43
లేక! వారిని మా (శిక్ష) నుండి కాపాడటానికి మేము తప్ప వేరే దైవాలు ఎవరైనా ఉన్నారా? వారు (ఆ దైవాలు) తమకు తామే సహాయం చేసుకోలేరు మరియు వారు మా నుండి కాపాడుకోనూ లేరు.
Enbiya 21:44
అయినా! మేము వారికి మరియు వారి తండ్రితాతలకు చాలా కాలం వరకు సుఖసంతోషాలను ఇస్తూ వచ్చాము. అయితే! వారు చూడటం లేదా! వాస్తవానికి, మేము భూమిని , దాని అన్ని వైపుల నుండి తగ్గిస్తున్నామని?[1] అయినా! వారు ఆధిక్యత వహించగలరని భావిస్తున్నారా?
———
[1] చూడండి, 13:41, అంటే విశ్వాసుల సంఖ్య క్రమక్రమంగా పెరగటం మరియు వారు 'అరబ్ దేశాన్ని ఆక్రమించటం మరియు ముష్రికుల సంఖ్య తగ్గిపోవటం మరియు వారి అధికారంలో నున్న భూమి దినదినానికి తగ్గిపోవటం.
Enbiya 21:45
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నేను కేవలం దివ్యజ్ఞానం (వహీ) ఆధారంగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను." కాని చెవిటి వారిని, ఎంత హెచ్చరించినా, వారు పిలుపును వినలేరు కదా!
Enbiya 21:46
మరియు ఒకవేళ నీ ప్రభువు శిక్ష, కొంత వారికి పడితే వారు: "అయ్యో! మా పాడుగాను! వాస్తవానికి, మేము దుర్మార్గులముగా ఉండేవారం." అని అంటారు.
Enbiya 21:47
మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము. కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్క చూడటానికి మేమే చాలు!
Enbiya 21:48
మరియు వాస్తవానికి మేము, మూసా మరియు హారూన్ లకు ఒక గీటురాయిని మరియు దివ్యజ్యోతిని (తౌరాత్ ను) ప్రసాదించి ఉన్నాము మరియు దైవభీతి గల వారికి ఒక హితబోధను.[1]
———
[1] అంటే దివ్యజ్ఞానమే నీతి నిజాయితీలను పరీక్షించే గీటురాయి. కావున అల్లాహ్ (సు.తా.) వరుసగా దివ్యగ్రంథాలను అవతరింపజేశాడు. చూడండి, 2:44 మరియు 2:53.
Enbiya 21:49
వారి కొరకు ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో![1] మరియు అంతిమ ఘడియను గురించి భీతిపరులై ఉంటారో!
———
[1] చూడండి, 2:3.
Enbiya 21:50
మరియు ఈ శుభప్రదమైన జ్ఞాపిక (ఖుర్ఆన్ ను) మేము అవతరింపజేశాము. ఏమీ? మీరు దీనిని నిరాకరిస్తారా?
Enbiya 21:51
మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఇబ్రాహీమ్ కు కూడా మార్గదర్శకత్వం చేశాము మరియు అతనిని గురించి మాకు బాగా తెలుసు.[1]
———
[1] ఇబ్రాహీమ్ గాథకు చూడండి, 6:74-79 మరియు 83.
Enbiya 21:52
అతను తన తండ్రి మరియు తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు: "మీరు భక్తితో ఆరాధిస్తున్న ఈ విగ్రహాలు ఏమిటి?"
Enbiya 21:53
వారన్నారు: "మేము మా తండ్రి తాతలను, వీటినే ఆరాధిస్తూ ఉండగా చూశాము."
Enbiya 21:54
(ఇబ్రాహీమ్) అన్నాడు: "వాస్తవానికి, మీరు మరియు మీ తండ్రితాతలు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు."
Enbiya 21:55
వారన్నారు: "ఏమీ? నీవు మా వద్దకు ఏదైనా సత్యాన్ని తెచ్చావా? లేదా నీవు మాతో పరిహాసమాడుతున్నావా?"
Enbiya 21:56
(ఇబ్రాహీమ్) అన్నాడు: "అలా కాదు! భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు! ఆయనే వాటన్నింటినీ సృజించాడు. మరియు నేను ఈ విషయం గురించి మీ ముందు సాక్ష్యమిస్తున్నాను.
Enbiya 21:57
"మరియు నేను అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను. మీరు వెళ్ళిపోయిన తరువాత మీ విగ్రహాలకు విరుద్ధంగా తప్పక యుక్తి పన్నుతాను."
Enbiya 21:58
తరువాత అతను ఒక పెద్ద దానిని (విగ్రహాన్ని) తప్ప అన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేశాడు; బహుశా వారు దాని వైపునకు మరలుతారని!
Enbiya 21:59
వారన్నారు: "మా ఆరాధ్య దైవాలతో ఈ విధంగా ప్రవర్తించినవాడెవడు? నిశ్చయంగా వాడు దుర్మార్గుడు."
Enbiya 21:60
(కొందరు) ఇలా అన్నారు; "ఇబ్రాహీమ్ అనే యువకుడు, వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండగా మేము విన్నాము."
Enbiya 21:61
(ఇతరులు) అన్నారు: "అయితే, అతనిని ప్రజల కళ్ళ ముందుకు తీసుకురండి; బహుశా వారు సాక్ష్యమిస్తారేమో!"
Enbiya 21:62
(అతనిని తెచ్చిన తరువాత) వారు అడిగారు: "ఓ ఇబ్రాహీమ్! ఏమీ? నీవేనా మా ఆరాధ్య దైవాలతో ఇలా వ్యవహరించిన వాడవు?"
Enbiya 21:63
(ఇబ్రాహీమ్) జవాబిచ్చాడు: "కాదు కాదు! వారిలోని ఈ పెద్దవాడే ఇలా చేశాడు! అవి మాట్లాడగలిగితే వాటినే అడగండి!"
Enbiya 21:64
వారు తమలో తాము సమాలోచనలు చేసుకుంటూ ఇలా అనుకున్నారు: "నిశ్చయంగా స్వయంగా మీరే దుర్మార్గులు!"
Enbiya 21:65
కాని, తరువాత వారి బుద్ధి తలక్రిందులై వారు ఇలా అన్నారు: "వాస్తవానికి, నీకు తెలుసు కదా, ఇవి మాట్లాడలేవని!"
Enbiya 21:66
(ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: "అలా అయితే! మీరు అల్లాహ్ ను వదలి, మీకెలాంటి లాభం కానీ నష్టం కానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తారా?
Enbiya 21:67
"ధిక్కారం! మీపై మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటిపై (దైవాలపై)! ఏమీ? మీరు ఏ మాత్రమూ తెలివిని ఉపయోగించరా?"
Enbiya 21:68
వారన్నారు: "మీరేమైనా చేయ దలుచుకుంటే! ఇతనిని కాల్చి వేయండి, మీ ఆరాధ్యదైవాలకు తోడ్పడండి."
Enbiya 21:69
మేము (అల్లాహ్) ఆజ్ఞాపించాము: "ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీమ్ కొరకు చల్లగా సురక్షితంగా అయిపో!"[1]
———
[1] చూడండి, 29:24 మరియు 37:97.
Enbiya 21:70
మరియు వారు ఇబ్రాహీమ్ కు కీడు తల పెట్టగోరారు, కాని మేము వారినే నష్టంలో పడవేశాము.
Enbiya 21:71
మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు లూత్ ను రక్షించి, సర్వజనుల కొరకు శుభప్రదం చేసిన భూమి వైపునకు పంపాము.[1]
———
[1] లూ'త్ ('అ.స.), ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క సోదరుని కుమారులు. అతను ఇస్లాం స్వీకరించి ఇబ్రాహీమ్ ('అ.స.) తో సహా తమ నగరం 'ఊర్ - ఏదైతే Mesopotamia (ఇరాఖ్)లో ఉందో - విడిచి ఫల'స్తీన్ (సిరియా)కు వెళ్ళారు. అల్లాహ్ (సు.తా.) అతనిని కూడా ప్రవక్తగా ఎన్నుకున్నాడు. లూ'త్ ('అ.స.) సోడోమ్ మరియు గొమొర్రాహ్ ('సద్దూమ్, 'అమూరహ్) ప్రాంతంలో నివసించారరు. అవి ఈ నాటి మృత సముద్రం (Dear Sea) దగ్గర ఉండేవి.
Enbiya 21:72
మరియు అతనికి (ఇబ్రాహీమ్) కు ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను అదనపు కానుకగా ప్రసాదించాము.[1] మరియు మేము ప్రతి ఒక్కరినీ సద్వర్తనులుగా చేశాము.
———
[1] మొదటి కుమారుడు ఇస్మా'యీలు ('అ.స.) కావున ఇస్హా'ఖ్ ('అ.స.) 'అదనపు కానుకగా) అని ఇక్కడ పేర్కొనబడ్డారు. '.
Enbiya 21:73
మరియు మేము వారిని నాయకులుగా చేశాము. వారు ప్రజలకు మా ఆజ్ఞ ప్రకారం మార్గదర్శకత్వం చేస్తూ ఉండేవారు. మరియు మేము వారిపై - సత్కార్యాలు చేయాలని, నమాజ్ స్థాపించాలని, విధిదానం (జకాత్) ఇవ్వాలని - దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు వారు (కేవలం) మమ్మల్నే ఆరాధించేవారు.
Enbiya 21:74
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము లూత్ కు[1] వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము మరియు మేము అతనిని అసహ్యకరమైన పనులు చేస్తున్న వారి నగరం నుండి కాపాడాము. నిశ్చయంగా వారు నీచులు, అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలు.
———
[1] లూ'త్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 7:80-84; 11:77-83, 15:58-76.
Enbiya 21:75
మరియు మేము అతనిని మా కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకున్నాము. నిశ్చయంగా, అతను సద్వర్తనులలోని వాడు.
Enbiya 21:76
మరియు (జ్ఞాపకం చేసుకోండి) నూహ్[1] అంతకు ముందు, మమ్మల్ని వేడుకొనగా మేము అతని (ప్రార్థనను) అంగీకరించాము. కావున అతనికి మరియు అతనితో బాటు ఉన్నవారికి ఆ మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము.
———
[1] నూ'హ్ ('అ.స.) గాథ ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. ముఖ్యంగా చూడండి, 11:25-48.
Enbiya 21:77
మరియు మా సూచనలను అబద్ధాలని నిరాకరించిన వారికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము. నిశ్చయంగా, వారు దుష్ట ప్రజలు. కావున వారినందరినీ ముంచి వేశాము.
Enbiya 21:78
మరియు దావూద్ మరియు సులైమాన్ ఇద్దరు ఒక చేను గురించి తీర్పు చేసిన విషయం (జ్ఞాపకం చేసుకోండి):[1] "ఒక తెగవారి మేకలు (మరొక తెగవారి చేను) మేశాయి. అప్పుడు వాస్తవానికి, మేము వారి తీర్పునకు సాక్షులుగా ఉన్నాము.
———
[1] ఒక వ్యక్తి మేకలు ఒక రాత్రి మరొక వ్యక్తి పంట పొలాన్ని మేస్తాయి. అతడు, దావూద్ ('అ.స.) దగ్గరకు తీర్పు కొరకు వస్తాడు. అతను ('అ.స.) పంట నష్టానికి సమానమైన విలువ గల మేకలను, పొలం వానికి ఇవ్వాలని తీర్పు ఇస్తారు. ఇది విని అక్కడే ఉన్న అతని ('అ.స.) కుమారులు సులైమాన్ ('అ.స.) అంటారు: 'అలా కాదు! చేను మేకలవానికి ఇవ్వాలి. అతడు సేద్యం చేసి దానిని మేకలు మేయక ముందు ఉన్న స్థితిలోకి పెంచి తీసుకు రావాలి. ఈ కాలమంతా మేకలు చేనువాని దగ్గర ఉండాలి. అతడు వాటి పాలు, ఉన్ని మరియు పిల్లలతో లాభం పొంద వచ్చు. ఎప్పుడైతే చేను మొదటి స్థితిలోకి వస్తుందో అప్పుడు చేనూ, మేకలూ, తమ తమ యజమానులకు తిరిగి ఇవ్వాలి.' ఈ తీర్పు ఎక్కువ ఉచితమైనదై నందుకు, దానినే అమలు చేస్తారు.
Enbiya 21:79
అసలు సులైమాన్ కు మేము (వాస్తవ విషయం) తెలియజేశాము. మరియు వారిద్దరికీ మేము వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు మేము పర్వతాలను మరియు పక్షులను దావూద్ తో బాటు మా స్తోత్రం చేయటానికి లోబరిచాము.[1] మరియు నిశ్చయంగా, మేమే (ప్రతిదీ) చేయగలవారము.
———
[1] చూడండి, 17:44, 57:1 మరియు 13:13.
Enbiya 21:80
మరియు మేము అతనికి, మీ యుద్ధాలలో, మీ రక్షణ కొరకు కవచాలు తయారు చేయడం నేర్పాము. అయితే! (ఇప్పుడైనా) మీరు కృతజ్ఞులవుతారా?
Enbiya 21:81
మరియు మేము తీవ్రంగా వీచే గాలిని సులైమాన్ కు (వశపరిచాము). అది అతని ఆజ్ఞతో మేము శుభాలను ప్రసాదించిన (అనుగ్రహించిన) భూమి మీద వీచేది.[1] మరియు నిశ్చయంగా, మాకు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.
———
[1] ఈ భూమి ఆ కాలపు షామ్, అంటే కాలపు ఫల'స్తీన్, జోర్డాన్ మరియు సిరియాలు.
Enbiya 21:82
మరియు షైతానులలో కొందరు అతని (సులైమాన్) కొరకు (సముద్రంలో) మునిగే వారు మరియు ఇతర పనులు కూడా చేసేవారు. మరియు నిశ్చయంగా, మేమే వారిని కనిపెట్టుకొని ఉండేవారము.
Enbiya 21:83
మరియు (జ్ఞాపకం చేసుకోండి) అయ్యూబ్ తన ప్రభువును వేడుకున్నప్పుడు (ఇలా అన్నాడు): "నిశ్చయంగా, నన్ను బాధ (వ్యాధి) చుట్టుకున్నది. మరియు నీవే కరుణామయులలో కెల్లా గొప్ప కరుణామయుడవు.!"[1]
———
[1] అయ్యూబ్ ('అ.స.) మొదట, సుఖసంతోషాలలో జీవితం గడిపారు. తరువాత అల్లాహ్ (సు.తా.) అతనిని తీవ్రమైన కష్టాలతో, వ్యాధితో పరీక్షించాడు. అతను, ఆ కష్ట కాలంలో కూడా సహనం వహించారు. ఆ తరువాత అల్లాహ్ (సు.తా.) అతనిని అనుగ్రహించి మరల మొదటి కంటే మంచి స్థితికి తెచ్చాడు. చూడండి, 38:44.
Enbiya 21:84
అప్పుడు మేము అతని (ప్రార్థనలు) అంగీకరించి, అతని బాధ నుండి అతనికి విముక్తి కలిగించాము. మరియు అతనికి, అతని కుటుంబ వాసులను తిరిగి ఇవ్వటమే గాక వారితో బాటు ఇంకా అంతమందిని ఎక్కువగా ఇచ్చి, దానిని మా నుండి ఒక ప్రత్యేక కరుణగా మరియు మమ్మల్ని ఆరాధించే వారికి ఒక జ్ఞాపికగా చేశాము.
Enbiya 21:85
మరియు (జ్ఞాపకం చేసుకోండి), ఇస్మాయీల్, ఇద్రీస్ మరియు జుల్కిప్ల్,[1] వీరందరు కూడా సహన శీలురైన వారే!
———
[1] జు'ల్ కిఫ్ల ('అ.స.): ప్రవక్తేనా కాదా అనే విషయం గురించి వ్యాఖ్యాతలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇబ్నె-కసీర్ (ర'హ్మ) అంటారు: అతని పేరు ఇతర ప్రవక్త ('అలైహిమ్ స.) ల పేర్లతో పాటు వచ్చింది కాబట్టి అతను కూడా ప్రవక్తయే!
Enbiya 21:86
మరియు మేము వారందరినీ మా కారుణ్యంలోకి తీసుకున్నాము. నిశ్చయంగా, వారందరూ సద్వర్తనులు.
Enbiya 21:87
మరియు (జ్ఞాపకం చేసుకోండి) చేపవాడు (యూసుస్)[1] - ఉద్రేకంతో వెళ్ళిపోతూ - మేము అతనిని పట్టుకోలేమని అనుకున్నాడు! కాని ఆ తరువాత, అంధకారాలలో చిక్కుకొని పోయినప్పుడు, ఇలా మొరపెట్టుకున్నాడు: "వాస్తవానికి నీవు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నిశ్చయంగా, నేనే అపరాధులలోని వాడను."
———
[1] యూనుస్ ('అ.స.) తన ప్రజల సత్యతిరస్కారాన్ని ఓర్చుకోలేక అల్లాహ్ (సు.తా.) అనుమతించక ముందే వారిని విడిచి పారి పోయి పడవనెక్కారు. అతను చీటీలలో ఓడిపోయి, పడవను మునిగి పోకుండా కాపాడటానికి, సముద్రంలోకి దూకారు. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది. అతను ('అ.స.) ఆ చేప కడుపులో తమ ప్రభువు (అల్లాహుతా'లా) ను వేడుకున్నారు. అప్పుడు అల్లాహ్ (సు.తా.) అతనిని తిరిగి ఒడ్డు మీదికి చేర్చాడు. అతను ('అ.స.) తిరిగి వెళ్ళి తన ప్రజలకు హితబోధ చేశారు. వివరాలకు చూడండి, 37:139-148 మరియు 10:98.
Enbiya 21:88
అప్పుడు మేము అతని (ప్రార్థనను) అంగీకరించి, అతనిని ఆ దుఃఖము నుండి విముక్తి కలిగించాము మరియు విశ్వసించిన వారిని మేము ఇదే విధంగా కాపాడుతూ ఉంటాము.
Enbiya 21:89
మరియు (జ్ఞాపకం చేసుకోండి), జకరియ్యా[1] తన ప్రభువును వేడుకున్నప్పుడు ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను ఒంటరివానిగా (సంతానహీనునిగా) వదలకు. నీవే సర్వశ్రేష్ఠమైన వారసుడవు!"
———
[1] 'జకరియ్యా ('అ.స.) గాథకు చూడండి, 3:37 19:2 మరియు సూరహ్ తా'హా (20).
Enbiya 21:90
అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి అతని కొరకు అతని భార్యను (సంతానానికి) యోగ్యురాలుగా చేసి, అతనికి యహ్యాను ప్రసాదించాము. వాస్తవానికి వారు సత్కార్యాలు చేయటానికి పోటీ పడే వారు. మరియు శ్రద్ధతో మరియు భీతితో మమ్మల్ని ఆరాధించేవారు. మరియు మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు.
Enbiya 21:91
మరియు (జ్ఞాపకం చేసుకోండి), తన శీలాన్ని కాపాడుకున్న ఆ మహిళ (మర్యమ్) లో మా నుండి ప్రాణం (రూహ్) ఊది, ఆమెను మరియు ఆమె కొడుకును, సర్వలోకాల వారికి ఒక సూచనగా చేశాము.[1]
———
[1] చూడండి, 15:29, 38:72 మరియు 32:9.
Enbiya 21:92
నిశ్చయంగా,మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం[1] మరియు కేవలం నేనే మీ ప్రభువును, కావున మీరు నన్ను మాత్రమే ఆరాధించండి.
———
[1] ఉమ్మతున్: అంటే ధర్మం లేక సమాజం. ఇక్కడ ఇస్లాం ధర్మం మరియు సమాజం. దీని వైపునకే ప్రవక్తలందరూ తమ ప్రజలను ఆహ్వానించారు. ప్రవక్తలందరి ధర్మం ఇస్లామే! దైవప్రవక్త ప్రవచనం: 'ప్రవక్తలందరి కుటుంబం ఒక్కటే, మా తండ్రి ఒక్కడు మరియు మా తల్లులు వేరు వేరు. మా అందరి ధర్మం ఒక్కటే, ఇస్లాం.' (ఇబ్నె-కసీ'ర్).
Enbiya 21:93
కాని వారు (ప్రజలు) తమ ధర్మ విషయంలో తెగలు తెగలుగా చీలిపోయారు. వారందరికీ మా వైపునకే మరలి రావలసి వున్నది.
Enbiya 21:94
సత్కార్యాలు చేసేవాడు విశ్వసించేవాడై ఉంటే, అతని శ్రమ నిరాదరించబడదు మరియు నిశ్చయంగా, మేము దానిని వ్రాసి పెడతాము.
Enbiya 21:95
మరియు మేము నాశనం చేసిన ప్రతి నగరం (వారి)పై, వారు (ఆ నగరవాసులు) మరలి రావటం నిషేధించబడింది.
Enbiya 21:96
ఎంత వరకైతే యాజూజ్ మరియు మాజూజ్ లు వదలి పెట్టబడి ప్రతి మిట్టనుండి పరుగెడుతూరారో![1]
———
[1] చూడండి, 18:94-98. తీర్పుదినం దగ్గరికి వచ్చి 'ఈసా ( 'అ.స.) తిరిగి భూలోకంలోకి వచ్చినప్పుడు యూ'జూజ్ మరియు మా'జూజ్ లు ప్రపంచంలో ప్రతిచోట వ్యాపించి ఉంటారు. వారి హింసలు మరియు దౌర్జన్యాలకు విశ్వాసులు తాళ లేకపోతారు. చివరకు 'ఈసా ('అ.స.) విశ్వాసులను తీసుకొని 'తూర్ పర్వతం పైకి ఎక్కుతారు. అతను యా'జూజ్ మరియు మా'జూజ్ లను శిక్షించటానికి అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థిస్తారు. అప్పుడు వారంతా వధింపబడతారు. వారి శవాల దుర్వాసన అంతటా వ్యాపించి పోతుంది. అప్పుడు అల్లాహ్ (సు.తా.) పక్షులను పంపుతాడు. అవి ఆ శవాలను సముద్రంలోకి విసరుతాయి. ఆ తరువాత ఒక పెద్ద వర్షం కురుస్తుంది. దానితో భూమి శుభ్రపరచబడుతుంది. ('స'హీ'హ్ 'హదీస్'ల ఆధారంగా, ఇబ్నె-కసీ'ర్).
Enbiya 21:97
మరియు సత్యవాగ్దానం నెరవేరే సమయం దగ్గర పడినప్పుడు సత్యతిరస్కారుల కళ్ళు విచ్చుకుపోయి: "అయ్యో! మా దౌర్భాగ్యం! వాస్తవానికి మేము దీని నుండి అశ్రద్ధకు గురి అయ్యాము. కాదు కాదు! మేము దుర్మార్గులముగా ఉండేవారము." అని అంటారు.
Enbiya 21:98
(వారితో ఇంకా ఇలా అనబడుతుంది): "నిశ్చయంగా, మీరు మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవారూ, నరకాగ్నికి ఇంధనమవుతారు! (ఎందుకంటే) మీకు అక్కడికే పోవలసి ఉన్నది.[1]
———
[1] ఒక 'హదీస్' ప్రకారం ఈ ఆయత్ విని ఒక ముష్రికుల నాయకుడు అన్నాడు: 'యూదులు మరియు క్రైస్తవులు ఆరాధించే 'ఉ'జైర్ ('అ.స.) మరియు 'ఈసా ('అ.స.) లు కూడా నరకానికి పోతారా+?' దానికి దైవప్రవక్త ('సఅ'స) అన్నారు: 'అల్లాహ్ (సు.తా.)కు బదులుగా తనను ఆరాధించటాన్ని సమ్మతించిన ప్రతి వ్యక్తి, తనను ఆరాధించిన వారితో పాటు నరకానికి పోతాడు.'
Enbiya 21:99
ఒకవేళ ఇవన్నీ ఆరాధ్య దైవాలే అయి వుంటే, ఇవి అందులో (నరకంలో) ప్రవేశించి ఉండేవి కావు కదా! ఇక మీరంతా అందులోనే శాశ్వతంగా ఉంటారు!"
Enbiya 21:100
అందులో వారు (దుఃఖం చేత) మూలుగుతూ ఉంటారు. అందులో వారేమి వినలేరు.[1]
———
[1] నరకంలో వారంతా బాధల వల్ల ఏడుస్తూ ఉంటారు. వారి రోధనల ధ్వని వల్ల వారందు ఏమీ వినలేక పోతారు.
Enbiya 21:101
నిశ్చయంగా, ఎవరి కొరకైతే మా తరఫు నుండి మేలు (స్వర్గం) నిర్ణయింపబడివుందో, అలాంటి వారు దాని (నరకం) నుండి దూరంగా ఉంచబడతారు.
Enbiya 21:102
వారు దాని మెల్లని శబ్దం కూడా వినరు. వారు తాము కోరిన వాటిలో శాశ్వతంగా ఉంటారు.
Enbiya 21:103
ఆ గొప్ప భీతి కూడా వారికి దుఃఖం కలిగించదు[1] మరియు దైవదూతలు వారిని ఆహ్వానిస్తూ వచ్చి: "మీకు వాగ్దానం చేయబడిన మీ దినం ఇదే!" అని అంటారు.
———
[1] ఆ గొప్ప భీతి అంటే ఇస్రాఫీల్ ('అ.స.) యొక్క 'సూర్, లేక స్వర్గ-నరకాల మధ్య 'చావు'ను వధించటం. అంటే స్వర్గానికి మరియు నరకానికి పోయే వారి తీర్పు ముగిసిన తరువాత 'చావు' ఒక గొర్రె ఆకారంలో తెచ్చి జి'బహ్ చేయడం. ఆ తరువాత ఎవ్వరికీ చావు ఉండదు. చూడండి, 19:39.
Enbiya 21:104
(జ్ఞాపకముంచుకోండి)! ఆ రోజు మేము ఆకాశాన్ని, చిట్టాకాగితాలను (ఖాతా గ్రంథాలను) చుట్టినట్టు చుట్టివేస్తాము.[1] మేము ఏ విధంగా సృష్టిని మొదట ఆరంభించామో! అదే విధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది (మాపై బాధ్యతగా) ఉన్న మా వాగ్దానం మేము దానిని తప్పక పూర్తి చేస్తాము.
———
[1] చూడండి, 39:67.
Enbiya 21:105
వాస్తవానికి మేము జబూర్ లో- మా హితబోధ తరువాత - నిశ్చయంగా, ఈ భూమికి[1] సద్వర్తునులైన నా దాసులు వారసులవుతారని వ్రాసి ఉన్నాము.
———
[1] ఇక్కడ భూమి అంటే స్వర్గమని అనేక వ్యాఖ్యాతల అభిప్రాయం.
Enbiya 21:106
నిశ్చయంగా ఇందులో భక్తిపరులైన ప్రజలకు సందేశం ఉంది.[1]
———
[1] దైవప్రవక్త ము'హమ్మద్ ('స.అస) పై అవతరింపజేయబడిన ఈ ఖుర్ఆన్ సర్వమానవాళి కొరకు అవతరింపజేయబడిన దివ్యగ్రంథం. అల్లాహ్ (సు.తా.) దీనిని తీర్పుదినం వరకు భద్రంగా ఉంచుతానని, అన్నాడు. (చూడండి, 15:9). ఇది రంగు రూపాల, పుట్టుపూర్వోత్తరాల, భేదభావాలు లేకుండా సర్వమానవులను ఆకర్షిస్తుంది. ఇది మానవుని హేతువాదానికి జవాబిస్తుంది. మరొక విశేషమేమిటంటే 1400 సంవత్సరాలలో ఒక్క అక్షరం కూడా మార్చబడకుండా ఉన్న ఒకే ఒక్క దివ్యగ్రంథం, ఈ ఖుర్ఆన్ మాత్రమే మరియు ఇది అవతరింపజేయబడిన ప్రవక్త ము'హమ్మద్ ('స'అస) చివరి ప్రవక్త. చూడండి, 33:40
Enbiya 21:107
మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము.[1]
———
[1] దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) సర్వమానవజాతి కొరకు పంపబడిన దైవప్రవక్త చూడండి, 7:158. దైవప్రవక్త ('స'అస) ముష్రికులను శపించలేదు. ('స'హీ'హ్ ముస్లిం, 2006).
Enbiya 21:108
(ఓ ముహమ్మద్!) ఇలా అను: "నిశ్చయంగా, నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింప జేయబడింది. వాస్తవంగా మీ ఆరాధ్య దైవం ఆ అద్వితీయ ఆరాధ్యుడే (అల్లాహ్ యే)! ఇకనైన మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా?
Enbiya 21:109
ఒకవేళ వారు వెనుదిరిగితే వారితో ఇలా అను: "నేను మీకు అందరికి బహిరంగంగా ప్రకటిస్తున్నాను. మరియు మీతో చేయబడిన వాగ్దానం సమీపంలో ఉందో లేదా బహుదూరం ఉందో నాకు తెలియదు."
Enbiya 21:110
నిశ్చయంగా, ఆయన (అల్లాహ్)కు మీరు బహిరంగంగా వ్యక్త పరిచేది మరియు దాచేది అంతా తెలుసు.
Enbiya 21:111
మరియు బహుశా ఇది (ఈ ఆలస్యం) మీకు పరీక్ష కావచ్చు, లేదా మీకు కొంతకాలం సుఖసంతోషాలు అనుభవించటానికి ఇవ్వబడిన వ్యవధి కావచ్చు, అది నాకు తెలియదు!
Enbiya 21:112
అతను (ముహమ్మద్) ఇలా అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు సత్యంతో తీర్పు చేయి! మరియు మీరు కల్పించే వాటికి (ఆరోపణలకు), ఆ అపార కరుణామయుడైన మా ప్రభువు సహాయమే కోరబడుతుంది.!"