Telugu Meal — Mevlânâ Abdürrahîm b. Muhammed — Hacc 22:1 – Neml 27:93
Contents
- Hacc 22:1
- Hacc 22:2
- Hacc 22:3
- Hacc 22:4
- Hacc 22:5
- Hacc 22:6
- Hacc 22:7
- Hacc 22:8
- Hacc 22:9
- Hacc 22:10
- Hacc 22:11
- Hacc 22:12
- Hacc 22:13
- Hacc 22:14
- Hacc 22:15
- Hacc 22:16
- Hacc 22:17
- Hacc 22:18
- Hacc 22:19
- Hacc 22:20
- Hacc 22:21
- Hacc 22:22
- Hacc 22:23
- Hacc 22:24
- Hacc 22:25
- Hacc 22:26
- Hacc 22:27
- Hacc 22:28
- Hacc 22:29
- Hacc 22:30
- Hacc 22:31
- Hacc 22:32
- Hacc 22:33
- Hacc 22:34
- Hacc 22:35
- Hacc 22:36
- Hacc 22:37
- Hacc 22:38
- Hacc 22:39
- Hacc 22:40
- Hacc 22:41
- Hacc 22:42
- Hacc 22:43
- Hacc 22:44
- Hacc 22:45
- Hacc 22:46
- Hacc 22:47
- Hacc 22:48
- Hacc 22:49
- Hacc 22:50
- Hacc 22:51
- Hacc 22:52
- Hacc 22:53
- Hacc 22:54
- Hacc 22:55
- Hacc 22:56
- Hacc 22:57
- Hacc 22:58
- Hacc 22:59
- Hacc 22:60
- Hacc 22:61
- Hacc 22:62
- Hacc 22:63
- Hacc 22:64
- Hacc 22:65
- Hacc 22:66
- Hacc 22:67
- Hacc 22:68
- Hacc 22:69
- Hacc 22:70
- Hacc 22:71
- Hacc 22:72
- Hacc 22:73
- Hacc 22:74
- Hacc 22:75
- Hacc 22:76
- Hacc 22:77
- Hacc 22:78
- Mü'minûn 23:1
- Mü'minûn 23:2
- Mü'minûn 23:3
- Mü'minûn 23:4
- Mü'minûn 23:5
- Mü'minûn 23:6
- Mü'minûn 23:7
- Mü'minûn 23:8
- Mü'minûn 23:9
- Mü'minûn 23:10
- Mü'minûn 23:11
- Mü'minûn 23:12
- Mü'minûn 23:13
- Mü'minûn 23:14
- Mü'minûn 23:15
- Mü'minûn 23:16
- Mü'minûn 23:17
- Mü'minûn 23:18
- Mü'minûn 23:19
- Mü'minûn 23:20
- Mü'minûn 23:21
- Mü'minûn 23:22
- Mü'minûn 23:23
- Mü'minûn 23:24
- Mü'minûn 23:25
- Mü'minûn 23:26
- Mü'minûn 23:27
- Mü'minûn 23:28
- Mü'minûn 23:29
- Mü'minûn 23:30
- Mü'minûn 23:31
- Mü'minûn 23:32
- Mü'minûn 23:33
- Mü'minûn 23:34
- Mü'minûn 23:35
- Mü'minûn 23:36
- Mü'minûn 23:37
- Mü'minûn 23:38
- Mü'minûn 23:39
- Mü'minûn 23:40
- Mü'minûn 23:41
- Mü'minûn 23:42
- Mü'minûn 23:43
- Mü'minûn 23:44
- Mü'minûn 23:45
- Mü'minûn 23:46
- Mü'minûn 23:47
- Mü'minûn 23:48
- Mü'minûn 23:49
- Mü'minûn 23:50
- Mü'minûn 23:51
- Mü'minûn 23:52
- Mü'minûn 23:53
- Mü'minûn 23:54
- Mü'minûn 23:55
- Mü'minûn 23:56
- Mü'minûn 23:57
- Mü'minûn 23:58
- Mü'minûn 23:59
- Mü'minûn 23:60
- Mü'minûn 23:61
- Mü'minûn 23:62
- Mü'minûn 23:63
- Mü'minûn 23:64
- Mü'minûn 23:65
- Mü'minûn 23:66
- Mü'minûn 23:67
- Mü'minûn 23:68
- Mü'minûn 23:69
- Mü'minûn 23:70
- Mü'minûn 23:71
- Mü'minûn 23:72
- Mü'minûn 23:73
- Mü'minûn 23:74
- Mü'minûn 23:75
- Mü'minûn 23:76
- Mü'minûn 23:77
- Mü'minûn 23:78
- Mü'minûn 23:79
- Mü'minûn 23:80
- Mü'minûn 23:81
- Mü'minûn 23:82
- Mü'minûn 23:83
- Mü'minûn 23:84
- Mü'minûn 23:85
- Mü'minûn 23:86
- Mü'minûn 23:87
- Mü'minûn 23:88
- Mü'minûn 23:89
- Mü'minûn 23:90
- Mü'minûn 23:91
- Mü'minûn 23:92
- Mü'minûn 23:93
- Mü'minûn 23:94
- Mü'minûn 23:95
- Mü'minûn 23:96
- Mü'minûn 23:97
- Mü'minûn 23:98
- Mü'minûn 23:99
- Mü'minûn 23:100
- Mü'minûn 23:101
- Mü'minûn 23:102
- Mü'minûn 23:103
- Mü'minûn 23:104
- Mü'minûn 23:105
- Mü'minûn 23:106
- Mü'minûn 23:107
- Mü'minûn 23:108
- Mü'minûn 23:109
- Mü'minûn 23:110
- Mü'minûn 23:111
- Mü'minûn 23:112
- Mü'minûn 23:113
- Mü'minûn 23:114
- Mü'minûn 23:115
- Mü'minûn 23:116
- Mü'minûn 23:117
- Mü'minûn 23:118
- Nur 24:1
- Nur 24:2
- Nur 24:3
- Nur 24:4
- Nur 24:5
- Nur 24:6
- Nur 24:7
- Nur 24:8
- Nur 24:9
- Nur 24:10
- Nur 24:11
- Nur 24:12
- Nur 24:13
- Nur 24:14
- Nur 24:15
- Nur 24:16
- Nur 24:17
- Nur 24:18
- Nur 24:19
- Nur 24:20
- Nur 24:21
- Nur 24:22
- Nur 24:23
- Nur 24:24
- Nur 24:25
- Nur 24:26
- Nur 24:27
- Nur 24:28
- Nur 24:29
- Nur 24:30
- Nur 24:31
- Nur 24:32
- Nur 24:33
- Nur 24:34
- Nur 24:35
- Nur 24:36
- Nur 24:37
- Nur 24:38
- Nur 24:39
- Nur 24:40
- Nur 24:41
- Nur 24:42
- Nur 24:43
- Nur 24:44
- Nur 24:45
- Nur 24:46
- Nur 24:47
- Nur 24:48
- Nur 24:49
- Nur 24:50
- Nur 24:51
- Nur 24:52
- Nur 24:53
- Nur 24:54
- Nur 24:55
- Nur 24:56
- Nur 24:57
- Nur 24:58
- Nur 24:59
- Nur 24:60
- Nur 24:61
- Nur 24:62
- Nur 24:63
- Nur 24:64
- Furkan 25:1
- Furkan 25:2
- Furkan 25:3
- Furkan 25:4
- Furkan 25:5
- Furkan 25:6
- Furkan 25:7
- Furkan 25:8
- Furkan 25:9
- Furkan 25:10
- Furkan 25:11
- Furkan 25:12
- Furkan 25:13
- Furkan 25:14
- Furkan 25:15
- Furkan 25:16
- Furkan 25:17
- Furkan 25:18
- Furkan 25:19
- Furkan 25:20
- Furkan 25:21
- Furkan 25:22
- Furkan 25:23
- Furkan 25:24
- Furkan 25:25
- Furkan 25:26
- Furkan 25:27
- Furkan 25:28
- Furkan 25:29
- Furkan 25:30
- Furkan 25:31
- Furkan 25:32
- Furkan 25:33
- Furkan 25:34
- Furkan 25:35
- Furkan 25:36
- Furkan 25:37
- Furkan 25:38
- Furkan 25:39
- Furkan 25:40
- Furkan 25:41
- Furkan 25:42
- Furkan 25:43
- Furkan 25:44
- Furkan 25:45
- Furkan 25:46
- Furkan 25:47
- Furkan 25:48
- Furkan 25:49
- Furkan 25:50
- Furkan 25:51
- Furkan 25:52
- Furkan 25:53
- Furkan 25:54
- Furkan 25:55
- Furkan 25:56
- Furkan 25:57
- Furkan 25:58
- Furkan 25:59
- Furkan 25:60
- Furkan 25:61
- Furkan 25:62
- Furkan 25:63
- Furkan 25:64
- Furkan 25:65
- Furkan 25:66
- Furkan 25:67
- Furkan 25:68
- Furkan 25:69
- Furkan 25:70
- Furkan 25:71
- Furkan 25:72
- Furkan 25:73
- Furkan 25:74
- Furkan 25:75
- Furkan 25:76
- Furkan 25:77
- Şuara 26:1
- Şuara 26:2
- Şuara 26:3
- Şuara 26:4
- Şuara 26:5
- Şuara 26:6
- Şuara 26:7
- Şuara 26:8
- Şuara 26:9
- Şuara 26:10
- Şuara 26:11
- Şuara 26:12
- Şuara 26:13
- Şuara 26:14
- Şuara 26:15
- Şuara 26:16
- Şuara 26:17
- Şuara 26:18
- Şuara 26:19
- Şuara 26:20
- Şuara 26:21
- Şuara 26:22
- Şuara 26:23
- Şuara 26:24
- Şuara 26:25
- Şuara 26:26
- Şuara 26:27
- Şuara 26:28
- Şuara 26:29
- Şuara 26:30
- Şuara 26:31
- Şuara 26:32
- Şuara 26:33
- Şuara 26:34
- Şuara 26:35
- Şuara 26:36
- Şuara 26:37
- Şuara 26:38
- Şuara 26:39
- Şuara 26:40
- Şuara 26:41
- Şuara 26:42
- Şuara 26:43
- Şuara 26:44
- Şuara 26:45
- Şuara 26:46
- Şuara 26:47
- Şuara 26:48
- Şuara 26:49
- Şuara 26:50
- Şuara 26:51
- Şuara 26:52
- Şuara 26:53
- Şuara 26:54
- Şuara 26:55
- Şuara 26:56
- Şuara 26:57
- Şuara 26:58
- Şuara 26:59
- Şuara 26:60
- Şuara 26:61
- Şuara 26:62
- Şuara 26:63
- Şuara 26:64
- Şuara 26:65
- Şuara 26:66
- Şuara 26:67
- Şuara 26:68
- Şuara 26:69
- Şuara 26:70
- Şuara 26:71
- Şuara 26:72
- Şuara 26:73
- Şuara 26:74
- Şuara 26:75
- Şuara 26:76
- Şuara 26:77
- Şuara 26:78
- Şuara 26:79
- Şuara 26:80
- Şuara 26:81
- Şuara 26:82
- Şuara 26:83
- Şuara 26:84
- Şuara 26:85
- Şuara 26:86
- Şuara 26:87
- Şuara 26:88
- Şuara 26:89
- Şuara 26:90
- Şuara 26:91
- Şuara 26:92
- Şuara 26:93
- Şuara 26:94
- Şuara 26:95
- Şuara 26:96
- Şuara 26:97
- Şuara 26:98
- Şuara 26:99
- Şuara 26:100
- Şuara 26:101
- Şuara 26:102
- Şuara 26:103
- Şuara 26:104
- Şuara 26:105
- Şuara 26:106
- Şuara 26:107
- Şuara 26:108
- Şuara 26:109
- Şuara 26:110
- Şuara 26:111
- Şuara 26:112
- Şuara 26:113
- Şuara 26:114
- Şuara 26:115
- Şuara 26:116
- Şuara 26:117
- Şuara 26:118
- Şuara 26:119
- Şuara 26:120
- Şuara 26:121
- Şuara 26:122
- Şuara 26:123
- Şuara 26:124
- Şuara 26:125
- Şuara 26:126
- Şuara 26:127
- Şuara 26:128
- Şuara 26:129
- Şuara 26:130
- Şuara 26:131
- Şuara 26:132
- Şuara 26:133
- Şuara 26:134
- Şuara 26:135
- Şuara 26:136
- Şuara 26:137
- Şuara 26:138
- Şuara 26:139
- Şuara 26:140
- Şuara 26:141
- Şuara 26:142
- Şuara 26:143
- Şuara 26:144
- Şuara 26:145
- Şuara 26:146
- Şuara 26:147
- Şuara 26:148
- Şuara 26:149
- Şuara 26:150
- Şuara 26:151
- Şuara 26:152
- Şuara 26:153
- Şuara 26:154
- Şuara 26:155
- Şuara 26:156
- Şuara 26:157
- Şuara 26:158
- Şuara 26:159
- Şuara 26:160
- Şuara 26:161
- Şuara 26:162
- Şuara 26:163
- Şuara 26:164
- Şuara 26:165
- Şuara 26:166
- Şuara 26:167
- Şuara 26:168
- Şuara 26:169
- Şuara 26:170
- Şuara 26:171
- Şuara 26:172
- Şuara 26:173
- Şuara 26:174
- Şuara 26:175
- Şuara 26:176
- Şuara 26:177
- Şuara 26:178
- Şuara 26:179
- Şuara 26:180
- Şuara 26:181
- Şuara 26:182
- Şuara 26:183
- Şuara 26:184
- Şuara 26:185
- Şuara 26:186
- Şuara 26:187
- Şuara 26:188
- Şuara 26:189
- Şuara 26:190
- Şuara 26:191
- Şuara 26:192
- Şuara 26:193
- Şuara 26:194
- Şuara 26:195
- Şuara 26:196
- Şuara 26:197
- Şuara 26:198
- Şuara 26:199
- Şuara 26:200
- Şuara 26:201
- Şuara 26:202
- Şuara 26:203
- Şuara 26:204
- Şuara 26:205
- Şuara 26:206
- Şuara 26:207
- Şuara 26:208
- Şuara 26:209
- Şuara 26:210
- Şuara 26:211
- Şuara 26:212
- Şuara 26:213
- Şuara 26:214
- Şuara 26:215
- Şuara 26:216
- Şuara 26:217
- Şuara 26:218
- Şuara 26:219
- Şuara 26:220
- Şuara 26:221
- Şuara 26:222
- Şuara 26:223
- Şuara 26:224
- Şuara 26:225
- Şuara 26:226
- Şuara 26:227
- Neml 27:1
- Neml 27:2
- Neml 27:3
- Neml 27:4
- Neml 27:5
- Neml 27:6
- Neml 27:7
- Neml 27:8
- Neml 27:9
- Neml 27:10
- Neml 27:11
- Neml 27:12
- Neml 27:13
- Neml 27:14
- Neml 27:15
- Neml 27:16
- Neml 27:17
- Neml 27:18
- Neml 27:19
- Neml 27:20
- Neml 27:21
- Neml 27:22
- Neml 27:23
- Neml 27:24
- Neml 27:25
- Neml 27:26
- Neml 27:27
- Neml 27:28
- Neml 27:29
- Neml 27:30
- Neml 27:31
- Neml 27:32
- Neml 27:33
- Neml 27:34
- Neml 27:35
- Neml 27:36
- Neml 27:37
- Neml 27:38
- Neml 27:39
- Neml 27:40
- Neml 27:41
- Neml 27:42
- Neml 27:43
- Neml 27:44
- Neml 27:45
- Neml 27:46
- Neml 27:47
- Neml 27:48
- Neml 27:49
- Neml 27:50
- Neml 27:51
- Neml 27:52
- Neml 27:53
- Neml 27:54
- Neml 27:55
- Neml 27:56
- Neml 27:57
- Neml 27:58
- Neml 27:59
- Neml 27:60
- Neml 27:61
- Neml 27:62
- Neml 27:63
- Neml 27:64
- Neml 27:65
- Neml 27:66
- Neml 27:67
- Neml 27:68
- Neml 27:69
- Neml 27:70
- Neml 27:71
- Neml 27:72
- Neml 27:73
- Neml 27:74
- Neml 27:75
- Neml 27:76
- Neml 27:77
- Neml 27:78
- Neml 27:79
- Neml 27:80
- Neml 27:81
- Neml 27:82
- Neml 27:83
- Neml 27:84
- Neml 27:85
- Neml 27:86
- Neml 27:87
- Neml 27:88
- Neml 27:89
- Neml 27:90
- Neml 27:91
- Neml 27:92
- Neml 27:93
Hacc 22:1
ఓ మానవులారా! మీ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉండండి! నిశ్చయంగా, ఆ అంతిమ ఘడియ యొక్క భూకంపం ఎంతో భయంకరమైనది.
Hacc 22:2
ఆ రోజు ఆవరించినప్పుడు, పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటిబిడ్డను మరచిపోవటాన్ని, గర్భవతి అయిన ప్రతి స్త్రీ, తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. మరియు మానవులందరినీ మత్తులో ఉన్నట్లు నీవు చూస్తావు. కానీ (వాస్తవానికి) వారు త్రాగి (మత్తులో) ఉండరు. కాని అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది.
Hacc 22:3
మరియు ప్రజలలో ఒకడుంటాడు, జ్ఞానం లేనిదే, అల్లాహ్ ను గురించి వాదులాడే వాడు మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ ను అనుసరించేవాడు.
Hacc 22:4
అతడిని (షైతాన్ ను) గురించి వ్రాయబడిందేమిటంటే, వాస్తవానికి ఎవడైతే అతడి వైపునకు మరలుతాడో, వాడిని నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టుడిగా చేస్తాడు మరియు వాడికి మండే నరకాగ్ని వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
Hacc 22:5
ఏ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, [1] తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు;[2] అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది.
———
[1] 'మట్టితో సృష్టించాము.' ఇటువంటి ఇతర ఆయతులకు చూడండి, 3:59, 11:61, 18:37, 30:20, 23:12. [2] చూడండి, 16:70.
Hacc 22:6
ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ ! ఆయనే సత్యం, మరియు నిశ్చయంగా ఆయన మాత్రమే చచ్చిన వారిని తిరిగి బ్రతికించగలవాడు మరియు నిశ్చయంగా ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు.
Hacc 22:7
మరియు అంతిమ ఘడియ నిశ్చయంగా రానున్నది. అందులో ఎలాంటి సందేహం లేదు మరియు నిశ్చయంగా, అల్లాహ్ గోరీలలో నున్న వారిని మరల బ్రతికించి లేపుతాడు.
Hacc 22:8
అయినా మానవులలో - జ్ఞానం లేనిదే మరియు మార్గదర్శకత్వం లేనిదే మరియు ప్రకాశవంతమైన గ్రంథం లేనిదే - అల్లాహ్ ను గురించి వాదులాడే వాడు ఉన్నాడు.
Hacc 22:9
(అలాంటి వాడు) గర్వంతో తన మెడను త్రిప్పుకుంటాడు. ఇతరులను అల్లాహ్ మార్గం నుండి తప్పింప జూస్తాడు.[1] వానికి ఈ లోకంలో అవమానముంటుంది. మరియు పునరుత్థాన దినమున అతనికి మేము దహించే అగ్ని శిక్షను రుచి చూపుతాము.
———
[1] ఇక్కడ ఆ వ్యక్తిని గురించి చెప్పబడింది. ఎవనికైతే అల్లాహ్ (సు.తా.)ను గురించి ఎలాంటి జ్ఞానం లేదో! ఈ విధమైన వివరాలకు చూడండి, 31:7, 63:5 మరియు 17:83.
Hacc 22:10
(అతనితో): "ఇది నీవు నీ చేతులారా చేసి పంపిన దాని (ఫలితం) మరియు నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేయడు!" (అని అనబడుతుంది).
Hacc 22:11
మరియు ప్రజలలో కొందరు అంచున[1] నిలచి (సందేహంతో) అల్లాహ్ ను ఆరాధించే వారున్నారు. (అలాంటివాడు) తనకు లాభం కలిగితే, ఎంతో తృప్తి పొందుతాడు. కాని ఆపదకు గురి అయితే ముఖం త్రిప్పుకొని, ఇహమును మరియు పరమును కూడా కోల్పోతాడు. స్పష్టమైన నష్టమంటే ఇదే!
———
[1] 'హర్ ఫున్: అంచున నిలబడినవాడు. అంటే హృదయపూర్వకంగా పూర్తిగా ఇస్లాంలో చేరనివాడు. ఇస్లాం స్వీకరించిన తరువాత లాభం కనిపిస్తే మంచి ధర్మం అంటాడు, లేకుంటే మంచిది కాదు అంటాడు. కొందరు ఎడారి వాసులు ( బద్దూలు) మొదట ఇస్లాం స్వీకరించినప్పుడు ఈ విధంగానే వ్యవహరించారు.
Hacc 22:12
అతడు అల్లాహ్ ను వదలి తనకు నష్టం గానీ, లాభం గానీ చేకూర్చలేని వారిని ప్రార్థిస్తున్నాడు. ఇదే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోవటం.[1]
———
[1] చూడండి, 14:18.
Hacc 22:13
ఎవరి వల్ల లాభం కంటే, నష్టమే ఎక్కువ రానున్నదో వారినే అతడు ప్రార్థిస్తున్నాడు. ఎంత నికృష్టుడైన సంరక్షకుడు మరియు ఎంత నికృష్టుడైన అనుచరుడు (అషీరు).
Hacc 22:14
విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, అల్లాహ్ నిశ్చయంగా, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది చేస్తాడు.
Hacc 22:15
ఎవడైతే - ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా - అల్లాహ్, అతనికి (ప్రవక్తకు) సహాయపడడని భావిస్తాడో! (వాడికి సాధ్యమైతే) వాడిని ఒక త్రాడు సహాయంతో ఆకాశంపైకి పోయి, తరువాత వాటిని (అంటే ప్రవక్తపై అవతరింప జేయబడే వహీ మరియు ఇతర సహాయాలను) త్రెంపి చూడమను, అతడి ఈ యుక్తి అతడి క్రోధావేశాన్ని దూరం చేయగలదేమో![1]
———
[1] పైది ఇమామ్ అష్-షౌకాని (ర'హ్మ) గారి తాత్పర్యం. ఇమామ్ ఇబ్నె-కసీ'ర్ (ర'హ్మ) గారి తాత్పర్యం ఇలా ఉంది: 'ఎవడైతే ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా అల్లాహ్, దైవప్రవక్తకు సహాయపడడని భావిస్తాడో! వాడిని (తన ఇంటి) కప్పుకు ఒక త్రాడు వేసి దానితో ఉరి వేసుకొని చూడమను. అతడి ఈ యుక్తి అతడి క్రోధావేశాన్ని దూరం చేయగలదేమో!'
Hacc 22:16
మరియు ఈ విధంగా మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) స్పష్టమైన సందేశాలతో అవతరింపజేశాము. మరియు నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు.[1]
———
[1] చూడండి, 14:4.
Hacc 22:17
నిశ్చయంగా, (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించిన వారి మరియు యూదులు, సాబీయులు, క్రైస్తవులు, మజూసీలు[1] మరియు బహుదైవారాధకులు అయిన వారి మధ్య పునరుత్థాన దినమున అల్లాహ్ తప్పక తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానికి సాక్షిగా ఉంటాడు.
———
[1] అల్-మజూసు: (Magians / Zoroastrians) అంటే మజూసీలు. వారు Zerdusht అనే ఈరాన్ ప్రవక్తను అనుసరిస్తారు. వారి గ్రంథం పేరు, Zend-Avesta, వీరు రెండు ఆరాధ్య దైవాలున్నాయి అంటారు. ఒకటి చీకటి, రెండోది వెలుగు. వీరు ఈరాన్ లో మరియు ఇండియా పాకిస్తాన్ లలో ఉన్న పార్సీలు. వీరు అగ్నిని పూజిస్తారు. కాని అల్ల్హాహ్ (సు.తా.) సర్వసృష్టికి మూలాధారుడు అని కూడా విశ్వాసిస్తారు.
Hacc 22:18
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, సర్వవృక్షరాశి, సర్వ జీవరాశి మరియు ప్రజలలో చాలా మంది, అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారని?[1] మరియు చాలా మంది శిక్షకు కూడా గురి అవుతారు. మరియు అల్లాహ్ ఎవడినైతే అవమానం పాలు చేస్తాడో, అతడికి గౌరవమిప్పించ గలవాడు ఎవ్వడూ లేడు. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు.
———
[1] చూడండి, 13:15 16:48-49.
Hacc 22:19
ఆ రెండు విపక్ష తెగల వారు తమ ప్రభువును గురించి వాదులాడారు, కావున వారిలో సత్యతిరస్కారులకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడి (కుట్టించబడి) ఉంటాయి, వారి తలల మీద సలసలకాగే నీరు పోయబడు తుంది.[1]
———
[1] కొందరు వ్యాఖ్యాతలు వీరిని, విశ్వాసులు మరియు సత్యతిరస్కారులతో పోల్చారు. ఇతరులు బద్ర్ యుద్ధంలో పోరాడిన విశ్వాసులు మరియు ముష్రికులైన మక్కా ఖురైషులతో పోల్చారు. ఇబ్నె-కస'ర్ (ర'హ్మ) ఈ రెండు వ్యాఖ్యానాలు సరైనవే అంటారు.
Hacc 22:20
దానితో వారి కడుపులలో ఉన్నది మరియు వారి చర్మాలు కరిగి పోతాయి.
Hacc 22:21
మరియు వారిని (శిక్షించటానికి) ఇనుప గదలు ఉంటాయి.
Hacc 22:22
ప్రతిసారి వారు దాని (ఆ నరకం) నుండి దాని బాధ నుండి బయట పడటానికి ప్రయత్నించి నప్పుడల్లా తిరిగి అందులోకే నెట్టబడతారు. మరియు వారితో : "నరకాగ్నిని చవి చూడండి!" (అని అనబడుతుంది).
Hacc 22:23
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని అల్లాహ్ క్రింద సెలయేళ్ళు ప్రవహంచే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారికి బంగారం మరియు ముత్యాలతో చేయబడిన కంకణాలు తొడిగింప బడతాయి. అక్కడ వారి కొరకు పట్టు వస్త్రాలు ఉంటాయి.[1]
———
[1] ఈ ఆటంకపరచే వారు, మక్కా ముష్రికులు. వీరు 6వ హిజ్రీలో దైవప్రవక్త ('స'అస) మరియు అతని అనుచరులను (ర'ది.'అన్హుమ్) మక్కాలో ప్రవేశించకుండా ఆపారు. మరియు వారు హుదైబియా నుండి మరలిపోయారు.
Hacc 22:24
ఎందుకంటే వారికి మంచి మాటల వైపునకు మార్గదర్శకత్వం చూపబడింది. మరియు వారు సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) యొక్క మార్గం వైపునకు మార్గదర్శకత్వం పొందారు.
Hacc 22:25
నిశ్చయంగా, ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తూ (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి, మస్జిద్ అల్ హరామ్ నుండి ఆటంకపరుస్తారో - దేనికైతే మేము అందరి కొరకు సమానంగా చేసి ఉన్నామో - వారు అక్కడ నివసించేవారైనా సరే, లేదా బయట నుండి వచ్చిన వారైనా సరే.[1] మరియు ఎవరైనా దులో అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అలాంటి వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపుతాము.
———
[1] దీనిని ఈ విధంగా చాలా మంది వ్యాఖ్యాతలు వివరించారు: మస్జిద్ అల్ - 'హరామ్ మీద అక్కడ నివసించే వారికి మరియు బయట నుండి వచ్చే వారికి సరిసమానమైన హక్కులున్నాయి. అంటే ఏ ముస్లింకు అయినా ఏ సమయంలో గానీ రాత్రింబవళ్ళు, మస్జిద్ అల్ - 'హరాంలో ప్రవేశించి 'తవాఫ్, నమా'జ్, 'ఉమ్రా మొదలైనవి చేసే హక్కు ఉంది. అతనిని ఎవ్వరూ, తన ప్రార్థనల నుండి ఆపరాదు. ఇక 'హరమ్ హద్దులలో ఉన్న భూమిలో ఇండ్లు కట్టుకున్న వారు తమ ఇండ్ల యజమానులు. కాని మినా, ము'జ్ దలిఫా, 'అరఫాత్ ('హజ్ ప్రాంతారాలు) మాత్రం సర్వముస్లింల కొరకు ఉన్నాయి. వాటిపై ఎవ్వరీ యజమాన్యం లేదు. ఈ విషయంపై ధర్మవేత్తలందరూ ఏకీభవిస్తున్నారు. చూ. 2:125.
Hacc 22:26
మరియు మేము ఇబ్రాహీమ్ కు ఈ గృహం (కఅబహ్) యొక్క స్థలాన్ని నిర్దేశించి (చూపుతూ)[1] అతనితో: "ఎవ్వరినీ నాకు సాటిగా (భాగస్వాములుగా) కల్పించకు, మరియు నా గృహాన్ని, ప్రదక్షిణ (తవాఫ్) చేసేవారి కొరకు నమాజ్ చేసేవారి కొరకు, వంగే (రుకూఉ) మరియు సాష్టాంగం (సజ్దా) చేసేవారి కొరకు, పరిశుద్ధంగా ఉంచు"[2] అని అన్నాము.
———
[1] నూ'హ్ ('అ.స.) 'తుఫాన్ తరువాత, క'అబహ్ గృహాన్ని నిర్మించిన వారు ఇబ్రాహీమ్ ('అ.స.) మరియు అతని కుమారుడు ఇస్మా'యీల్ ('అ.స.). ఆ తరువాత 40 సంవత్సరాల పిదప మస్జిద్ అల్ - అ'ఖ్సా నిర్మించబడింది. (ముస్నద్ అ'హ్మద్ 5/150, 166, 167 మరియు ముస్లిం, కితాబుల్ మసాజిద్). [2] 'తవాఫ్ మరియు నమా'జ్ కేవలం ఈ కాబాకే ప్రత్యేకించబడ్డాయి. కావున అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ ప్రకారం కేవలం క'అబహ్ కు మాత్రమే 'తవాఫ్ చేయాలి మరియు కేవలం ఈ క'అబహ్ వైపునకే ముఖం చేసి నమా'జ్ చేయాలి. ఈ క'అబహ్ ను విడిచి ఏ ఇతర దానికి 'తవాఫ్ చేయటం లేక దాని పైవునకు ముఖం చేసి నమా'జ్ చేయటం సత్యతిరస్కారం (కుఫ్ర్) అవుతుంది.
Hacc 22:27
మరియు ప్రజలకు హజ్జ్ యాత్రను గురించి ప్రకటించు:[1] "వారు పాదాచారులగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు.
———
[1] 'హజ్ వివరాలకు చూడండి, 2:196-203.
Hacc 22:28
వారు, తమ కొరకు ఇక్కడ ఉన్న ప్రయోజనాలను అనుభవించటానికి మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన పశువుల మీద, నిర్ణీత దినాలలో అల్లాహ్ పేరును స్మరించి (జిబహ్ చేయటానికి), కావున దానిని (వాటి మాంసాన్ని) తినండి మరియు లేమికి గురి అయిన నిరుపేదలకు తినిపించండి.[1]
———
[1] అయ్యామిమ్ మ'లూమాత్: అంటే జి''బహ్ చేసే దినాలు, అంటే 10వ తేదీ మరియు దాని తరువాత మూడు దినాలు, అంటే 11, 12, 13 జు'ల్-'హజ్ తేదీలు. దాని మూడోవంతు మాంసాన్ని నిరుపేదలకు పంచటం విధి. ఈ 'జిబహ్ ఇస్మాయీల్ ('అ.స.) ను, అంతని తండ్రి ఇబ్రాహీమ్ ('అ.స.) - అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో - జి''బహ్ చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవటానికే. అంటే అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను శిరసావహించటమే ప్రతి ముస్లిం విధి. చూడండి, 37:102-107.
Hacc 22:29
తరువాత వారు హజ్జ్ ఆచారాలు[1] (తఫస్) మరియు మొక్కుబడులు (నుజుర్) పూర్తి చేసుకొనిన పిదప ఆ ప్రాచీన గృహం (కఅబహ్) యొక్క ప్రదక్షిణ చేయాలి.[2]
———
[1] అంటే 10వ జు'ల్-'హజ్ న చివరి షై'తైన్ (జమరతుల్ 'అఖబహ్)కు - ఏదైతే మక్కా వైపు ఉందో - ఏడు రవ్వలు రువ్వి, ఖుర్బానీ చేసి, తలవెంట్రుకలను కత్తిరించుకుంటే, అది త'హ్లీలె అవ్వల్ లేక చిన్న 'హలాల్ అవుతుంది. అంటే ఇ'బ్రాహీమ్ నిషేధాలన్నీ ముగిసిపోతాయి. కాని 'తవాఫ్ ఇఫాదా ('జ్యారహ్) చేసే వరకు భార్యతో సంభోగం చేయడం నిషిద్ధం. [2] 'తవాఫె 'జ్యారహ్ : ఇది విధి, తప్పక చేయవలసింది. ఇది 'అరఫాత్ నుండి బయలు దేరి 9-10 తేదీల మధ్య రాత్రి ము'జ్ దలిఫాలో గడిపి 10వ తేదీ ఉదయం చివరి షై'తాన్ (జమరతుల్ 'అఖబహ్) కు ఏడు రవ్వలు రువ్వి, 'ఖుర్బానీ ఇచ్చి తలవెంట్రుకలు కత్తిరించుకొని, ఇ'హ్రామ్ విడిచిన తరువాత మక్కాకు పోయి క'అబహ్ గృహం చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయటం. ఇది 10,11,12 జు'ల్-'హజ్ తేదీలలో పూర్తి చేయాలి. దీని తరువాత భార్యతో సంభోగం చేయవచ్చు. ఇది చివరి 'హలాల్. వివరాలకు చూడండి, 2:196-197.
Hacc 22:30
ఇదే (హజ్జ్)! మరియు ఎవడైతే అల్లాహ్ విధించిన నిషేధాలను (పవిత్ర నియమానలను) ఆదరిస్తాడో, అది అతని కొరకు, అతని ప్రభువు వద్ద ఎంతో మేలైనది. మరియు మీ కొరకు ఇది వరకు మీకు (నిషిద్ధమని) చెప్ప బడినవి తప్ప,[1] ఇతర పశువులన్నీ ధర్మ సమ్మతం చేయబడ్డాయి. ఇక మీరు విగ్రహారాధన వంటి మాలిన్యం నుండి దూరంగా ఉండండి మరియు అబద్ధపు (బూటకపు) మాటల నుండి కూడా దూరంగా ఉండండి.
———
[1] చూడండి, 5:3.
Hacc 22:31
ఏకాగ్రచిత్తంతో (ఏకదైవ సిద్ధాంతంతో)[1] అల్లాహ్ వైపునకే మరలండి. ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించకండి. అల్లాహ్ కు సాటి కల్పించిన వాని గతి ఆకాశం నుండి క్రింద పడిపోయే దాని వంటిదే! దానిని పక్షులైనా ఎత్తుకొని పోవచ్చు, లేదా గాలి అయినా దూర ప్రదేశాలకు ఎగుర గొట్టుకు పోవచ్చు!
———
[1] హునఫా': అంటే ఒకే వైపుకు మొగ్గటం. అంటే ఏకదైవ సిద్ధాంతాన్ని పాటించటం. ఆరాధనలను కేవలం ఆ ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) కే ప్రత్యేకించుకోవటం. ఇంకా చూడండి, 2:135.
Hacc 22:32
ఇదే! మరియు ఎవడైతే, అల్లాహ్ నియమించిన చిహ్నాలను[1] గౌరవిస్తాడో, అది నిశ్చయంగా, హృదయాలలో ఉన్న దైవభీతి వల్లనే!
———
[1] ష'ఆఇరల్లాహ్: అల్లాహ్ నియమించిన చిహ్నాలు అంటే 'సఫా-మర్వాలు మరియు ఖుర్బానీ పశువులు మొదలైనవి. ఇంకా చూడండి, 5:2.
Hacc 22:33
ఒక నిర్ణీత కాలం వరకు మీకు వాటిలో (ఈ పశువులలో) లాభాలున్నాయి.[1] ఆ తరువాత వాటి గమ్యస్థానం ప్రాచీన గృహమే (కఅబహ్ యే)!
———
[1] అంటే ఖుర్బానీ పశువులను, జి''బహ్ చేయనంతవరకు వాటిని వినియోగించుకోవటం ధర్మసమ్మతమే! అంటే ఒకవేళ అది ఒంటె ఉంటే దానిపై ఎక్కి'హజ్ కు పోవచ్చు. ('స'హీ'హ్ బు'ఖారీ).
Hacc 22:34
మరియు ప్రతి సమాజానికి మేము ధర్మ ఆచారాలు (ఖుర్బానీ పద్ధతి)[1] నియమించి ఉన్నాము. మేము వారి జీవనోపాధి కొరకు ప్రసాదించిన పశువులను, వారు(వధించేటప్పుడు) అల్లాహ్ పేరును ఉచ్ఛరించాలి. ఎందుకంటే మీరందరి ఆరాధ్య దైవం ఆ ఏకైక దేవుడు (అల్లాహ్)! కావున మీరు ఆయనకు మాత్రమే విధేయులై (ముస్లింలై) ఉండండి. మరియు వినయ విధేయతలు గలవారికి శుభవార్తనివ్వు.
———
[1] అల్-మనాసికు: అంటే, విధేయత లేక ఆరాధన అంటే అల్లాహ్ (సు.తా.) సాన్నిధ్యం పొందటానికి, అల్లాహ్ (సు.తా.) ప్రీతి కొరకు అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞాపించిన ఆచారాలను పూర్తి చేయటం. అల్లాయేతరుల పేరుతో ఖుర్బానీ చేయటం నిషిద్ధం ('హరాం). 'హజ్ ఆచారాలు కూడా మనాసిక్ అనబడతాయి. దీని ఏకవచనం నుసుకున్.
Hacc 22:35
(వారికి) ఎవరి హృదయాలైతే, అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడినప్పుడు భయంతో వణికి పోతాయో మరియు ఆపదలలో సహనం వహిస్తారో మరియు నమాజ్ స్థాపిస్తారో మరియు వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చు చేస్తారో!
Hacc 22:36
ఖుర్బానీ పశువులను,[1] మేము మీ కొరకు అల్లాహ్ చిహ్నాలుగా చేశాము; మీకు వాటిలో మేలున్నది. కావున వాటిని (ఖుర్బానీ కొరకు) నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును ఉచ్ఛరించండి. అవి (ప్రాణం విడిచి) ప్రక్కల మీద పడిపోయిన తరువాత మీరు వాటిని తినండి.[2] మరియు యాచించని పేదలకు మరియు యాచించే పేదలకు కూడా తినిపించండి. ఈ విధంగా మేము వాటిని మీకు ఉపయుక్తంగా చేశాము, బహుశా మీరు కృతజ్ఞులవు తారేమోనని.
———
[1] బుద్ నున్, బదనతున్ యొక్క బహువచనం. అంటే బాగా బలసిన పశువు. సాధారణంగా ఈ శబ్దం ఒంటెలకే వాడబడుతుంది. కానీ 'హదీస్'ల ప్రకారం, ఖుర్బానీ కొరకు తేబడిన ఆవులు ఎడ్లు మొదలైన వాటిని సూచిస్తుంది. [2] అంటే వాటి రక్తం పూర్తిగా పారిన తరువాత అవి పూర్తిగా కదలకుండా పడిపోయిన తరువాత వాటిని తినండి. ఎందుకంటే సజీవిగా ఉన్న పశువు మాంసం తినటం నిషిద్ధం, (అబూ దావూద్, తిర్మిజీ'). 'ఖుర్బానీ పశువు మాంసం స్వయంగా తినటం కొందరు ధర్మవేత్తలు వాజిబ్ గా మరికొందరు ముస్తహబ్ గా ఖరారు చేశారు. 'ఖుర్బానీ మాంసాన్ని మూడు భాగాలు చేయాలి. ఒక భాగం స్వంతం మరియు తన కుటుంబం వారికి రెండోది బంధుమిత్రులకు మరియు మూడోది పేదవారి కొరకు, (ముస్లిం, బు'ఖారీ). 'ఖుర్బానీ, 'హజ్ సమయంలోనే గాక, జు'ల్-'హజ్ పండుగ కొరకు కూడా చేయాలి 108:2, అంటే ఎవరు 'హజ్ యాత్రకు పోరో, వారు తమ ఇండ్లలో 10-12వ జు'ల్ 'హజ్ రోజులలో ఖుర్బానీ చేయాలి. ఇది 'ఈద్ నమాజ్ తరువాత చేయాలి, (స'హీహ్ బు'ఖారీ).
Hacc 22:37
వాటి మాంసం గానీ, వాటి రక్తం గానీ అల్లాహ్ కు చేరవు! కానీ మీ భయభక్తులే ఆయనకు చేరుతాయి. మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ ఘనతను కొనియాడటానికి, ఈ విధంగా ఆయన వాటిని మీకు వశపరిచాడు. సజ్జనులకు శుభవార్తను వినిపించు!
Hacc 22:38
నిశ్చయంగా, అల్లాహ్ విశ్వసించిన వారిని కాపాడుతాడు. నిశ్చయంగా అల్లాహ్ ఏ విశ్వాస ఘాతకుణ్ణి మరియు కృతఘ్నుణ్ణి ప్రేమించడు.
Hacc 22:39
తమపై దాడి చేసిన వారితో యుద్ధం చేయటానికి అనుమతి ఇవ్వబడుతోంది.[1] ఎందుకంటే, వారు అన్యాయానికి గురి చేయ బడ్డారు. నిశ్చయంగా, అల్లాహ్ వారికి సహాయం చేయగల సమర్ధుడు.
———
[1] ఈ ఆయత్ లో, ఖుర్ఆన్ అవతరణలో, మొదటిసారి ఆత్మరక్షణ కొరకు యుద్ధపరిమితి ఇవ్వబడింది. అబ్దుల్లాహ్ ఇబ్నె 'అబ్బాస్ (ర'ది.'అ.) కథనం ప్రకారం ఈ ఆయత్ దైవప్రవక్త (సఅస) మక్కా నుండి మదీనా వలస పోయిన వెంటనే అవతరింపజేయబడింది. మొదటి హిజ్రీ మొదట్లో, దీని తరువాత రెండవ హిజ్రీలో ఆయత్ లు 2:190-193 అవతరింపజేయబడ్డాయి. ఆ తరువాత 2:216, 224 అవతరింపజేయబడ్డాయి.
Hacc 22:40
వారికి ఎవరైతే కేవలం: "మా ప్రభువు అల్లాహ్!" అని అన్నందుకు మాత్రమే, అన్యాయంగా తమ ఇండ్ల నుండి తరిమి వేయబడ్డారో! ఒకవేళ అల్లాహ్ ప్రజలను ఒకరి ద్వారా మరొకరిని తొలగిస్తూ ఉండకపోతే[1] క్రైస్తవ సన్యాసుల మఠాలు, చర్చులు, యూదుల ప్రార్థనాలయాలు[2] మరియు మస్జిదులు, ఎక్కడైతే అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరించబడుతుందో, అన్నీ ధ్వంసం చేయబడి ఉండేవి.[3] నిశ్చయంగా తనకు తాను సహాయం చేసుకునే వానికి అల్లాహ్ తప్పకుండా సహాయం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహా బలవంతుడు, సర్వశక్తిమంతుడు.
———
[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 2:251 [2] యూదుల మాతాచారు (అ'హ్ బార్) లు తమ మత ధర్మాలను ఉపేదేశించే స్థలాలు, లేక యూదుల ప్రార్థనాలయాలు (సైనగోజెస్ / Synagogues) అనబడతాయి. [3] ధర్మస్వాతంత్ర్యం కొరకు ఆయుధాలు ఎత్తుకోవడం అత్యవసరమైన పని. చూడండి, 2:193.
Hacc 22:41
వారే! ఒకవేళ మేము వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే, వారు నమాజ్ స్థాపిస్తారు, విధిదానం (జకాత్) ఇస్తారు మరియు ధర్మమును (మంచిని) ఆదేశిస్తారు మరియు అధర్మము (చెడు) నుండి నిషేధిస్తారు.[1] సకల వ్యవహారాల అంతిమ నిర్ణయం అల్లాహ్ చేతిలోనే వుంది.
———
[1] ఈ ఆయత్ లో ఇస్లామీయ రాజ్యం యొక్క మూలసూత్రాలు పేర్కొనబడ్డాయి. 1) నమా'జ్, 2) 'జకాత్, 3) మంచిని ఆదేశించడం లేక ప్రోత్సహించడం, 4) చెడును నిరోధించడం లేక నివారించడం మరియు 5) షరీయత్ ప్రకారం శిక్ష విధించడం మొదలైనవి. ఇటువంటి సూత్రాలు ఇప్పుడు స'ఊదీ 'అరేబియాలోనే అత్యధికంగా పాటించబడుతున్నాయి. కాబట్టి అక్కడ ప్రపంచంలో ఏ దేశంలో లేని శాంతిభద్రతలు ఉన్నాయి. అల్లాహ్ (సు.తా.) దానిని భద్రపరచు గాక!
Hacc 22:42
మరియు (ఓ ముహమ్మద్!) వారు (సత్యతిరస్కారులు) ఒకవేళ నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తే (ఆశ్చర్యపడకు); వాస్తవానికి, వారికి పూర్వం నూహ్, ఆద్ మరియు సమూద్ జాతుల వారు కూడా (తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు;
Hacc 22:43
మరియు ఇబ్రాహీమ్ జాతివారు మరియు లూత్ జాతివారు;
Hacc 22:44
మరియు మద్ యన్ వాసులు కూడాను! అంతేకాదు మూసా కూడా అసత్యవాదుడవని తిరస్కరించబడ్డాడు. కావున నేను సత్యతిరస్కారులకు (మొదట) కొంత వ్యవధినిచ్చి, తరువాత పట్టుకుంటాను. (చూశారా!) నన్ను తిరస్కరించడం వారి కొరకు ఎంత ఘోరమైనదిగా ఉండెనో!
Hacc 22:45
(ఈ విధంగా), మేము ఎన్నో పురాలను నాశనం చేశాము. ఎందుకంటే, వాటి (ప్రజలు) దుర్మార్గులై ఉండిరి. (ఈనాడు) అవి నాశనమై, తమ కప్పుల మీద తలక్రిందులై పడి వున్నాయి. వారి బావులు మరియు వారి దృఢమైన కోటలు కూడా పాడుపడి ఉన్నాయి!
Hacc 22:46
ఏమీ? వారు భూమిలో ప్రయాణం చేయరా? దానిని, వారి హృదయాలు (మనస్సులు) అర్థం చేసుకోగలగటానికి మరియు వారి చెవులు దానిని వినటానికి? వాస్తవమేమిటంటే వారి కన్నులైతే గ్రుడ్డివి కావు, కాని ఎదలలో ఉన్న హృదయాలే గ్రుడ్డివయి పోయాయి.
Hacc 22:47
మరియు (ఓ ముహమ్మద్!) వారు నిన్ను శిక్ష కొరకు తొందర పెడుతున్నారు.[1] కాని అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగపరచడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్ద ఒక్క దినం మీ లెక్కల ప్రకారం వేయి సంవత్సరాలకు సమానమైనది.[2]
———
[1] చూడండి, 6:57, 8:32 మరియు 13:6. [2] మానవుల 'కాలగణనం' భూమి, సూర్యచంద్రుల సంచారంతో బంధింపబడివుంది. అల్లాహ్ (సు.తా.) కాలానికి పరిమితుడైనవాడు కాడు. ఆయన అంతర్యామి. ఆయనకు మొదలు, ముగింపు అనేవి లేవు. ఏవైతే కాలానికి సంబంధించినవో! ఇంకా చూడండి, 70:4. అక్కడ ఒక దినం ఏబది వేల సంవత్సరాలతో సమానమనబడింది. దీనిని సమర్థించటానికి ఎన్నో 'స'హీ'హ్ హదీస్'లున్నాయి. అల్లాహ్ (సు.తా.) అన్నాడు: 'నేనే కాలాన్ని (అద్దహ్ర్).'
Hacc 22:48
మరియు దుర్మార్గంలో మునిగివున్న ఎన్నో నగరాలకు నేను వ్యవధినిచ్చాను! తరువాత వాటిని (శిక్షించటానికి) పట్టుకున్నాను. (వారి) గమ్యస్థానం నా వైపునకే కదా!"
Hacc 22:49
(ఓ ముహమ్మద్!) వారితో అను: "ఓ మానవులారా! నేను కేవలం మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!"
Hacc 22:50
కావున ఎవరైతే, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి. [1]
———
[1] చూడండి, 8:4.
Hacc 22:51
కాని ఎవరైతే మా సూచనలను కించపరచటానికి ప్రయత్నిస్తారో అలాంటి వారు తప్పక భగభగ మండే నరకాగ్నివాసులవుతారు.
Hacc 22:52
మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము పంపిన ఏ సందేశహరుడు గానీ, లేదా ప్రవక్త గానీ (నా సందేశాన్ని ప్రజలకు) అందించగోరినపుడు, షైతాన్ అతని కోరికలను ఆటంక పరచకుండా ఉండలేదు.[1] కాని షైతాన్ కల్పించిన ఆటంకాలను అల్లాహ్ నిర్మూలించాడు. ఆ తరువాత అల్లాహ్ తన ఆయత్ లను స్థిరపరచాడు.[2] మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
———
[1] చూడండి, 6:112. [2] చూడండి, 11:1.
Hacc 22:53
ఎవరి హృదయాలలో రోగముందో![1] మరియు ఎవరి హృదయాలు కఠినమైనవో, వారికి షైతాన్ కల్పించేవి (సందేహాలు) ఒక పరీక్షగా చేయబడటానికి. మరియు నిశ్చయంగా ఈ దుర్మార్గులు విరోధంలో చాలా దూరం వెళ్ళిపోయారు.
———
[1] చూడండి, 2:10
Hacc 22:54
మరియు జ్ఞానమొసంగ బడినవారు ఇది (ఈ ఖుర్ఆన్) నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని తెలుసుకొని దానిని విశ్వసించటానికి, వారి హృదయాలు దానికి అంకితం అవటానికి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వసించే వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శత్వం[1] చేస్తాడు.
———
[1] అల్-హాది: సేకరించబడిన పదం. Guide, Leader. మార్గదర్శకుడు, సన్మార్గం చూపువాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
Hacc 22:55
మరియు సత్యతిరస్కారులు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి - అకస్మాత్తుగా అంతిమ ఘడియ వచ్చేవరకు లేదా ఆ ఏకైక దినపు శిక్ష అవతరించే వరకు - సందేహంలో పడి ఉంటారు.[1]
———
[1] యౌమిన్ 'అ'ఖీమ్: అంటే గొడ్డుదినం. అంటే మళ్ళీ రాని ఏకైక దినం, పునరుత్థానం. చూ. 51:41.
Hacc 22:56
ఆ రోజు సర్వాధిపత్యం అల్లాహ్ దే.[1] ఆయన వారి మధ్య తీర్పు చేస్తాడు. కావున విశ్వసించి సత్కార్యాలు చేసేవారు పరమానందకరమైన స్వర్గవనాలలో ఉంటారు.
———
[1] చూడండి, 25:26 మరియు 40:16.
Hacc 22:57
కాని, ఎవరైతే సత్యతిరస్కారులై, మా సూచనలను అబద్ధాలని తిరస్కరించారో, వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.
Hacc 22:58
ఎవరు అల్లాహ్ మార్గంలో తమ ఇండ్లను వదలి (వలస) పోయి, ఆ తరువాత చంపబడతారో లేదా మరణిస్తారో వారికి అల్లాహ్ (పరలోకంలో) శ్రేష్ఠమైన ఉపాధిని ప్రసాదిస్తాడు.[1] నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే ఉత్తమ ఉపాధి ప్రదాత.
———
[1] ఎవరైతే అల్లాహ్ (సు.తా.) మార్గంలో వలసపోయి అక్కడ చంపబడతారో వారికి స్వర్గసుఖాలు లభిస్తాయి. ఇంకా చూడండి, 2:218 మరియు 4:95-96.
Hacc 22:59
ఆయన వారిని వారు తృప్తిపడే స్థలంలో ప్రవేశింపజేస్తాడు.[1] మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సహనశీలుడు.
———
[1] స్వర్గసుఖాలు ఎలాంటి వంటే వాటిని ఇంత వరకు ఏ కన్నూ చూడలేదు, ఏ చెవీ వినలేదు మరియు ఏ మానవుడు కూడా ఊహించలేడు.
Hacc 22:60
ఇదే (వారి పరిణామం!)[1] ఇక ఎవడైతే తనకు కలిగిన బాధకు సమానంగా మాత్రమే ప్రతీకారం తీసుకున్న[2] తరువాత అతనిపై మరల దౌర్జన్యం జరిగితే! నిశ్చయంగా అల్లాహ్ అతనికి సహాయం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ మన్నించేవాడు, క్షమించేవాడు.[3]
———
[1] ఏ విశ్వాసులైతే వలసపోయి మరణిస్తారో! [2] చూడండి, 16:126 శత్రువు నుండి బాధ కలిగిన వానికి తనకు జరిగిన బాధకు సమానంగా ప్రతీకారం తీసుకునే హక్కు ఉంది. ఇలాంటి న్యాయ ప్రతీకారంలో అల్లాహ్ (సు.తా.) కూడా చాలా క్షమించేవాడు. [3] చూడండి, 2:190-193, ఒకవేళ క్షమిస్తే! అల్లాహ్ (సు.తా.) కూడా చాలా క్షమించేవాడు.
Hacc 22:61
ఇలాగే జరుగుతుంది! నిశ్చయంగా, అల్లాహ్ యే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేసే వాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేసేవాడు మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, అంతా చూసేవాడు.[1]
———
[1] చూడండి, 3:26-27 కాని అల్లాహ్ (సు.తా.) కోరితే దుర్మార్గులకు ప్రతీకారం కూడా చేయగలడు. అల్లాహ్ (సు.తా.) ప్రతిదీ చేయగల సమర్థుడు.
Hacc 22:62
ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే సత్యం![1] మరియు అయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! మరియు నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).
———
[1] ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) ధర్మమే సత్యధర్మం, ఆయన ఆరాధనయే సత్య ఆరాధన, ఆయన వాగ్దనమే సత్యవాగ్దానం. ఆయన, తన స్నేహితులకు వారి శత్రువులకు విరుద్ధంగా సహాయపడటం కూడా సత్యమే! అల్లాహ్ (సు.తా.) తన ఉనికిలో తన కార్యసాధనలో, తన యోగ్యతలో సత్యవంతుడు.
Hacc 22:63
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశం నుండి వర్షం కురిపించి, దానితో భూమిని పచ్చగా చేస్తాడని? నిశ్చయంగా, అల్లాహ్ సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు.
Hacc 22:64
ఆకాశాలలో ఉన్నది మరియు భూమిలో ఉన్నది అంతా ఆయనకు చెందినదే. మరియు నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే స్వయం సమృద్ధుడు, ప్రశంసనీయుడు.
Hacc 22:65
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ భూమిలో ఉన్న సమస్తాన్ని మీకు వశపరచాడు. మరియు సముద్రంలో పడవ ఆయన అనుమతితోనే నడుస్తుంది మరియు ఆయనే! తాను అనుమతించే వరకు ఆకాశాన్ని భూమి మీద పడకుండా నిలిపి ఉంచాడు.[1] నిశ్చయంగా, అల్లాహ్ మానవుల పట్ల ఎంతో కనికరుడు, అపార కరుణా ప్రదాత.
———
[1] అంటే నక్షత్రాలు మరియు గ్రహాలు పడిపోకుండా మరియు ఒక దానితో ఒకటి ఢీకొనకుండా ఉన్న గురుత్వాకర్షణ శక్తి (Gravitational Force) అల్లాహ్ (సు.తా.) ప్రసాదించినదే.
Hacc 22:66
మరియు ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదించాడు, తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత ఆయనే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాడు. నిశ్చయంగా మానవుడు ఎంతో కృతఘ్నుడు!
Hacc 22:67
మేము ప్రతి సమాజం వారికి ఒక ఆరాధనా రీతిని నియమించాము.[1] వారు దానినే అనుసరిస్తారు. కావున వారిని ఈ విషయంలో నీతో వాదులాడనివ్వకు. మరియు వారిని నీ ప్రభువు వైపుకు ఆహ్వానించు. నిశ్చయంగా నీవు సరైన మార్గదర్శకత్వంలో ఉన్నావు.
———
[1] చూడండి, 5:48.
Hacc 22:68
ఒకవేళ వారు నీతో వాదులాటకు దిగితే, వారితో అను: "మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.[1]
———
[1] చూడండి, 10:41.
Hacc 22:69
అల్లాహ్ పునరుత్థాన దినమున, మీరు పరస్పరం కలిగి ఉన్న అభిప్రాయ భేదాల గురించి తీర్పు చేస్తాడు."
Hacc 22:70
ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది.[1]
———
[1] ప్రతివాడు ఏమి కాబోతున్నాడు అనేది అల్లాహ్ కు తెలుసు కాబట్టి ఆయన సంభవించబోయేదంతా ఒక గ్రంథంలో వ్రాసి పెట్టాడు. ఇదే విధివ్రాత (ఖద్ర్). అంటే అల్లాహ్ (సు.తా.) ఎవరిని కూడా మంచి లేక చెడు మార్గాలను అవలంబించటానికి బలవంతం చేయడు. 'స'హీ'హ్ ముస్లింలో ఉంది: 'అల్లాహ్ భూమ్యాకాశాల సృష్టికి 50 వేల సంవత్సరాలకు ముందు తన సృష్టి యొక్క విధి వ్రాసి పెట్టాడు. అప్పుడు ఆయన విశ్వసామ్రాజ్యాధిపత్య పీఠం ('అర్ష్) నీటిపై ఉండెను.'
Hacc 22:71
మరియు వారు అల్లాహ్ ను వదలి ఇతరులను ఆరాధిస్తున్నారు. దాని కొరకు ఆయన ఎలాంటి నిదర్శనాన్ని అవతరింపజేయలేదు మరియు వారికి (సత్యతిరస్కారులకు) దానిని గురించి ఎలాంటి జ్ఞానం లేదు. మరియు దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవ్వడూ ఉండడు.[1]
———
[1] అంటే అల్లాహ్ (సు.తా.) ను విడిచి ఇతరులను ఆరాధించాలని, ఎలాంటి దివ్యజ్ఞానం గానీ, - వివేచనా బుద్ధితో ఆలోచిస్తే అర్థమయ్యే - నిదర్శనం గానీ ఈ సత్యతిరస్కారుల దగ్గర ఏదీ లేదు.
Hacc 22:72
మరియు మా స్పష్టమైన సూచనలు వారికి వినిపించబడినప్పుడు, సత్యతిరస్కారుల ముఖాల మీద తిరస్కారాన్ని నీవు గమనిస్తావు. ఇంకా వారు మా సూచనలను వినిపించే వారిపై దాదాపు విరుచుకు పడబోయే వారు. వారితో అను: "ఏమీ? నేను దీని కంటే ఘోరమైన విషయాన్ని గురించి మీకు తెలుపనా? అది నరకాగ్ని! అల్లాహ్ దానిని సత్యతిరస్కారులకు వాగ్దానం చేసి ఉన్నాడు. మరియు అది ఎంత అధ్వాన్నమైన గమ్యస్థానం."
Hacc 22:73
ఓ మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది, దానిని శ్రద్ధగా వినండి! నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. మరియు ఒకవేళ, ఆ ఈగ వారి నుండి ఏమైనా లాక్కొని పోయినా, వారు దానిని, దాని (ఆ ఈగ) నుండి విడిపించుకోనూ లేరు.[1] ఎంత బలహీనులు, ఈ అర్థించేవారు మరియు అర్థించబడేవారు.
———
[1] ఇక్కడ మానవులు అల్లాహ్ (సు.తా.)ను వదలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు అంటే, మూర్తులు, దర్గాలు, సన్యాసులు, దైవ అవతారులుగా భావించబడే వారు, అల్లాహ్ కుమారులుగా భావించబడేవారు, దైవదూతలు, ప్రవక్తలు మొదలైన వారంతా అని అర్థము.
Hacc 22:74
అల్లాహ్ ఘనతను వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. వాస్తవానికి, అల్లాహ్ మహా బలవంతుడు, సర్వ శక్తిమంతుడు.
Hacc 22:75
అల్లాహ్ దేవదూతల నుండి మానవుల నుండి తన సందేశహరులను ఎన్నుకుంటాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, అంతా చూసేవాడు.
Hacc 22:76
ఆయనకు, వారికి ప్రత్యక్షంగా ఉన్నది మరియు వారికి పరోక్షంగా ఉన్నది అంతా తెలుసు. మరియు అన్ని వ్యవహారాలు (పరిష్కారానికి) అల్లాహ్ వైపునకే మరలింప బడతాయి.
Hacc 22:77
ఓ విశ్వాసులారా! (మీ ప్రభువు సన్నిధిలో) వంగండి (రుకూఉ చేయండి), సాష్టాంగం (సజ్దా) చేయండి మరియు మీ ప్రభువునే ఆరాధించండి మరియు మంచి పనులు చేయండి, అప్పుడే మీరు సాఫల్యం పొందుతారు.
Hacc 22:78
మరియు అల్లాహ్ మార్గంలో పోరాడవలసిన విధంగా ధర్మపోరాటం చేయండి.[1] ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మరియు ఆయన ధర్మం విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఇది మీ తండ్రి ఇబ్రాహీమ్ మతమే.[2] ఆయన మొదటి నుండి మీకు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అని పేరు పెట్టాడు. దీనికై మీ సందేశహరుడు మీకు సాక్షిగా ఉండటానికి మరియు మీరు ప్రజలకు సాక్షులుగా ఉండటానికి.[3] కావున నమాజ్ స్థాపించండి, విధి దానం (జకాత్) ఇవ్వండి. మరియు అల్లాహ్ తో గట్టి సంబంధం కలిగి ఉండండి, ఆయనే మీ సంరక్షకుడు, ఎంత శ్రేష్ఠమైన సంరక్షకుడు మరియు ఎంత ఉత్తమ సహాయకుడు!
———
[1] అల్-జిహాదు: ధర్మపోరాటం అంటే: 1) అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను పాలించటానికి, తన ఆత్మతో, 2) ష'తాన్ రేకెత్తించే ప్రేరణలతో, 3) ఆత్మరక్షణకు మరియు తన ధర్మాన్ని స్వేచ్ఛగా పాటిస్తూ, శాంతితో, దానిని ఇతరులకు బోధిస్తూ ఉంటే, ఆటంక పరిచే వారితో, చేసే ధర్మపోరాటం. [2] తండ్రి ఇబ్రాహీమ్, అంటే అతను దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) పూర్వికుడే కాక, ఏక దైవసిద్ధాంతాన్ని అనుసరించే వారందరి తండ్రి కూడాను. [3] ఈ సాక్ష్యాలు తీర్పుదినమున జరుగుతాయి. చూడండి, 2:143.
Mü'minûn 23:1
వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు;
Mü'minûn 23:2
వారే! ఎవరైతే తమ నమాజ్ లో వినమ్రత పాటిస్తారో!
Mü'minûn 23:3
మరియు ఎవరైతే వ్యర్థమైన మాటల నుండి దూరంగా ఉంటారో;
Mü'minûn 23:4
మరియు ఎవరైతే విధిదానం (జకాత్) సక్రమంగా చెల్లిస్తారో!
Mü'minûn 23:5
మరియు ఎవరైతే తమ మర్మాంగాలను కాపాడుకుంటారో -
Mü'minûn 23:6
తమ భార్యలతో (అజ్వాజ్ లతో) లేక తమ ఆధీనంలో (కుడిచేతిలో) ఉన్న బానిస స్త్రీలతో తప్ప![1] అలాంటప్పుడు వారు నిశ్చయంగా, నిందార్హులు కారు.
———
[1] ఈ కాలంలో వాస్తవమైన బానిసలు (అంటే యుద్ధంలో పట్టుబడటం వల్ల బానిసలైన వారు) లేరు. ఎందుకంటే ఒక ముస్లింకు మానవులను బానిసలుగా కొనటం, అమ్మటం నిషిద్ధం చేయబడింది. కేవలం ధర్మయుద్ధంలో చేజిక్కిన ఖైదీలే బానిసలు. వారు ఇస్లాం స్వీకరిస్తే వారికి స్వాతంత్ర్యం ఇవ్వాలి. బానిస స్త్రీతో సంతానమైతే వారు వారసత్వంలో హక్కుదారులు. ఈ విధంగా చూస్తే బానిస స్త్రీకి కూడా భార్య హక్కులే ఉంటాయి. కేవలం మహ్ర్ మాత్రమే చెల్లించబడదు. చూడండి, 4:3, 24, 25, 24:32.
Mü'minûn 23:7
కాని ఎవరైతే దీనిని మించి కోరుతారో! అలాంటి వారే వాస్తవంగా హద్దులను అతిక్రమించిన వారు.
Mü'minûn 23:8
మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో.[1]
———
[1] అమానత్: అంటే మనఃపూర్వకంగా, బాధ్యతతో విధేయతతో, డ్యూటీ చేయటం, రహస్య మాటలను, విషయాలను కాపాడటం. చేసిన వాగ్దానాలను పూర్తి చేయటం మొదలైనవి.
Mü'minûn 23:9
మరియు వారు ఎవరైతే తమ నమాజ్ లను కాపాడుకుంటారో!
Mü'minûn 23:10
అలాంటి వారే (స్వర్గానికి) వారసులు అవుతారు.
Mü'minûn 23:11
వారే ఫిరదౌస్ స్వర్గానికి వారసులై, అందులో వారు శాశ్వతంగా ఉంటారు.[1]
———
[1] ఫిర్ దౌస్ అనేది స్వర్గాలలో అత్యున్నతమైనది. అక్కడి నుండియే స్వర్గపు నదులు ప్రారంభమవుతాయి. ('స'హీ'హ్ బు'ఖారీ).
Mü'minûn 23:12
మరియు వాస్తవంగా, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము.[1]
———
[1] మట్టితో, అంటే మానవుని సృష్టి భూమిలో ఉన్న పదార్థాలతోనే చేయబడింది. ఈ విషయం మనకు ఈనాడు సైన్సు ద్వారా తెలిసింది.
Mü'minûn 23:13
తరువాత అతనిని ఇంద్రియ బిందువుగా ఒక కోశంలో భద్రంగా ఉంచాము.[1]
———
[1] తల్లి గర్భకోశంలో.
Mü'minûn 23:14
ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా (జలగగా) మార్చాము. ఆ పైన ఆ రక్తపు ముద్దను (జలగను) మాంసపు ముద్దగా (జీవాణువుల పిండంగా) మార్చాము, ఆ జీవాణువుల పిండంలో ఎముకలను ఏర్పరచి, ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తరువాత దానిని మరొక (భిన్న) సృష్టిగా చేశాము. కావున శుభకరుడు (శుభప్రదుడు)[1] అయిన అల్లాహ్ యే అత్యుత్తమ సృష్టికర్త.
———
[1] చూడండి, 7:54.
Mü'minûn 23:15
ఆ తరువాత మీరు నిశ్చయంగా, మరణిస్తారు.
Mü'minûn 23:16
అటు పిమ్మట నిశ్చయంగా, మీరు పునరుత్థాన దినమున మరల లేపబడతారు.
Mü'minûn 23:17
మరియు వాస్తవానికి మేము మీపై ఏడు మార్గాలను (ఆకాశాలను) సృష్టించాము.[1] మరియు మేము సృష్టి విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా లేము.
———
[1] చూడండి, 2:29.
Mü'minûn 23:18
మరియు మేము ఆకాశం నుండి ఒక పరిమాణంతో వర్షాన్ని (నీటిని) కురిపించాము, పిదప దానిని భూమిలో నిలువ జేశాము. మరియు నిశ్చయంగా, దానిని వెనక్కి తీసుకునే శక్తి మాకుంది.
Mü'minûn 23:19
తరువాత దాని ద్వారా మేము మీ కొరకు ఖర్జూరపు తోటలను ద్రాక్షతోటలను ఉత్పత్తి చేశాము; అందులో మీకు ఎన్నో ఫలాలు దొరుకుతాయి. మరియు వాటి నుండి మీరు తింటారు.
Mü'minûn 23:20
మరియు సినాయి కొండ ప్రాంతంలో ఒక వృక్షం పెరుగుతున్నది. అది నూనె ఇస్తుంది మరియు (దాని ఫలం) తినేవారికి రుచికరమైన (కూరగా) ఉపయోగపడుతుంది.[1]
———
[1] ఇది 'జైతూన్ వృక్షం.
Mü'minûn 23:21
మరియు నిశ్చయంగా, మీ పశువులలో మీకు ఒక గుణపాఠముంది. మేము వాటి కడుపులలో ఉన్నది (పాలు) మీకు త్రాపుతున్నాము. మరియు వాటిలో మీకు ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటి (మాంసం) మీరు తింటారు.
Mü'minûn 23:22
మరియు వాటి మీద మరియు ఓడల మీద మీరు సవారీ చేస్తారు.
Mü'minûn 23:23
మరియు వాస్తవానికి మేము నూహ్ ను తన జాతి ప్రజల వద్దకు పంపాము. అతను వారితో అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! ఏమీ మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండరా?"
Mü'minûn 23:24
అతని జాతిలోని సత్యతిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు: "ఇతను మీ వంటి ఒక సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు! మీపై ఆధిక్యత పొందగోరుతున్నాడు. మరియు అల్లాహ్ తలుచుకుంటే దైవదూతలను పంపి ఉండేవాడు. ఇలాంటి విషయం పూర్వీకులైన మన తాతముత్తాతలలో కూడా జరిగినట్లు మేము వినలేదే!"[1]
———
[1] నూ'హ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:25-48.
Mü'minûn 23:25
"ఇతడు కేవలం పిచ్చి పట్టిన మనిషి కావున కొంత కాలం ఇతనిని సహించండి."
Mü'minûn 23:26
(నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! వీరు నన్ను అసత్యపరుడని తిరస్కరిస్తున్నారు. కావున నాకు సహాయం చేయి."[1]
———
[1] చూడండి, 54:10
Mü'minûn 23:27
కావున మేము అతనికి ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "మా పర్యవేక్షణలో, మా దివ్యజ్ఞానం (వహీ) ప్రకారం ఒక ఓడను తయారు చెయ్యి. తరువాత మా ఆజ్ఞ వచ్చినప్పుడు మరియు పొయ్యి నుండి నీరు ఉబికినప్పుడు (పొంగినప్పుడు)[1], ఆ నావలో ప్రతిరకపు జంతుజాతి నుండి ఒక్కొక్క జంటను మరియు నీ పరివారపు వారిని ఎక్కించుకో ఎవరిని గురించి అయితే ముందుగానే నిర్ణయం జరిగిందో వారు తప్ప! ఇక దుర్మార్గుల కొరకు నాతో మనవి చేయకు. నిశ్చయంగా, వారు ముంచి వేయబడతారు."
———
[1] ఫారత్తన్నూరు: కొందరు వ్యాఖ్యాతలు దీనిని భూమి ప్రతిభాగం నుండి నీటి ఊటలు ఉబికి రావటం, అని అన్నారు.
Mü'minûn 23:28
"ఆ తరువాత నీవు మరియు నీతో ఉన్నవారు నావలోకి ఎక్కిన పిదప ఇలా ప్రార్థించండి: 'సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే, ఆయనే మమ్మల్ని దుర్మార్గుల నుండి విమోచనం కలిగించాడు.'
Mü'minûn 23:29
ఇంకా ఇలా ప్రార్థించు: 'ఓ నా ప్రభూ! నన్ను శుభప్రదమైన గమ్యస్థానంలో దించు. గమ్యస్థానానికి చేర్పించే వారిలో నీవే అత్యుత్తముడవు!'"[1]
———
[1] ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు ఈ దు'ఆ చేయాలి. దైవప్రవక్త ('స'అస) తమ సవారిపై కూర్చుంటూ ఈ దు'ఆ చదివేవారు: 'అల్లాహు అక్బర్. (3 సార్లు, తరువాత) సుబ 'హానల్లజీ' స'ఖ్ఖరలనా హ'జా' వ మా కున్నా లహూ ముఖ్ రినీన్. వ ఇన్నా ఇలా రబ్బినా లమున్ ఖలిబూన్.' (ఇవి ఆయతులు 43:13-14).
Mü'minûn 23:30
నిశ్చయంగా, ఇందులో (ఈ గాథలో) సూచనలున్నాయి. మరియు నిశ్చయంగా, మేము (ప్రజలను) పరీక్షకు గురి చేస్తూ ఉంటాము.
Mü'minûn 23:31
వారి తరువాత మేము మరొక తరాన్ని పుట్టించాము.[1]
———
[1] ఈ జాతి హూద్ ('అ.స.) యొక్క 'ఆద్ జాతి అని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం.
Mü'minûn 23:32
మరియు వారి వద్దకు వారి నుండియే, ఒక సందేశహరుణ్ణి పంపినప్పుడు, (అతను): "కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఏమీ? మీకు దైవభీతి లేదా?" అని అన్నాడు.
Mü'minûn 23:33
దానికి, అతని జాతివారిలోని - సత్యతిరస్కారులైనట్టి వారు, పరలోక సమావేశాన్ని అబద్ధమని నిరాకరించేవారు మరియు ఇహలోక జీవితంలో మేము భాగ్యవంతులుగా చేసినట్టి - నాయకులు ఇలా అన్నారు: "ఇతను మీ వంటి సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు, మీరు తినేదే ఇతనూ తింటున్నాడు మరియు మీరు త్రాగేదే ఇతనూ త్రాగుతున్నాడు.
Mü'minûn 23:34
మరియు ఒకవేళ మీరు మీ వంటి ఒక సాధారణ మానవుణ్ణి అనుసరించినట్లైతే! నిశ్చయంగా, మీరు నష్టపడిన వారవుతారు.
Mü'minûn 23:35
ఏమీ? మీరు మరణించి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా తిరిగి లేపబడతారని ఇతను మీకు వాగ్దానం చేస్తున్నాడా?
Mü'minûn 23:36
అసంభవం! మీకు చేయబడే ఈ వాగ్దానం నెరవేరటం అసంభవం.
Mü'minûn 23:37
ఇక మన జీవితం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మనం మరణించేది జీవించేది ఇక్కడే! మనం ఏ మాత్రమూ తిరిగి సజీవులుగా లేపబడము!
Mü'minûn 23:38
ఇక ఇతను, ఈ వ్యక్తి అల్లాహ్ పేరుతో కేవలం అబద్ధాలు కల్పిస్తున్నాడు మరియు మేము ఇతనిని (ఇతని మాటలను) ఎన్నటికీ విశ్వసించలేము."
Mü'minûn 23:39
(ఆ ప్రవక్త) అన్నాడు: "ఓ నా ప్రభూ! వీరు చేసే నిందారోపణల నుండి నన్ను కాపాడు."
Mü'minûn 23:40
(అల్లాహ్) ఇలా సెలవిచ్చాడు: "వీరు కొంతకాలంలోనే పశ్చాత్తాప పడతారు."
Mü'minûn 23:41
ఆ తరువాత సత్య (వాగ్దాన) ప్రకారం ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని చుట్టు ముట్టింది. మేము వారిని చెత్తా చెదారంగా మార్చి వేశాము. ఇక దుర్మార్గులైన జాతివారు ఈ విధంగానే దూరమై పోతారు (నాశనం చేయబడతారు)!
Mü'minûn 23:42
వారి తరువాత ఇతర తరాల వారిని పుట్టించాము.[1]
———
[1] వీరు 'సాలెహ్, లూ'త్, మరియు షు'ఐబ్ ('అలైహిమ్. స.)లు కావచ్చు. ఎందుకంటే సూరహ్ అల్-'అరాఫ్ (7) మరియు సూరహ్ హూద్ (11) లలో ఇదే వరుసలో వారి వృత్తాంతం పేర్కొనబడింది.
Mü'minûn 23:43
ఏ సమాజం వారు కూడా తమకు (నియమింపబడిన) గడువుకు ముందు కాలేరు మరియు దానికి వెనుక కాలేరు.[1]
———
[1] ఇదే విధమైన వాక్యానికి చూడండి, 15:5 మరియు దాని వ్యాఖ్యానం. దీని మరొక తాత్పర్యం ఈ విధంగా కూడా ఉంది: 'ఏ సమాజం కూడా తన నిర్ణీత గడువుకు, ముందు గానీ మరియు వెనక గానీ కాజాలదు.'
Mü'minûn 23:44
ఆ తరువాత మేము మా సందేశహరులను ఒకరి తరువాత ఒకరిని పంపుతూ వచ్చాము. ప్రతిసారి ఒక సమాజం వద్దకు దాని సందేశహరుడు వచ్చినప్పుడు, వారు అతనిని అసత్యుడని తిరస్కరించారు. వారిని ఒకరి తరువాత ఒకరిని నశింపజేస్తూ వచ్చాము. చివరకు వారిని గాథలుగా చేసి వదిలాము. ఇక విశ్వసించని ప్రజలు ఈ విధంగా దూరమై పోవుగాక (నాశనం చేయబడుగాక!)
Mü'minûn 23:45
ఆ తరువాత మూసా మరియు అతని సోదరుడు హారూన్ లను మా సూచనలతో మరియు స్పష్టమైన ప్రమాణంతో పంపాము;
Mü'minûn 23:46
ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు. కాని వారు దురహంకారం చూపారు. వారు తమ అహంభావంలో మునిగి ఉండేవారు.
Mü'minûn 23:47
అపుడు వారన్నారు: "ఏమీ? మేము మా వంటి ఈ ఇద్దరు మానవులను విశ్వసించాలా? మరియు ఎవరి జాతి వారైతే మా బానిసలుగా ఉన్నారో!"
Mü'minûn 23:48
కావున వారు, ఆ ఇరువురిని అసత్యవాదులని తిరస్కరించి, నాశనం చేయబడిన వారిలో చేరిపోయారు.
Mü'minûn 23:49
మరియు వాస్తవానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము, బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమోనని!
Mü'minûn 23:50
ఇక మర్యమ్ కుమారుణ్ణి మరియు అతని తల్లిని మేము (మా అనుగ్రహపు) సూచనగా చేశాము.[1] మరియు వారిద్దరికి ఉన్నతమైన, ప్రశాంతమైన నీడ, ప్రవహించే సెలయేళ్ళు మరియు చెలమలు గల స్థానంలో ఆశ్రయమిచ్చాము.
———
[1] ఎందుకంటే మేము (అల్లాహ్): ' 'ఈసాను తండ్రి లేనిదే పుట్టించాము. ఏ విధంగానైతే మేము ఆదమ్ ను తల్లీ-తండ్రి లేనిదే మరియు 'హవ్వాను తల్లి లేనిదే ఆదమ్ నుండి పూట్టించామో!'
Mü'minûn 23:51
ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వస్తువులనే తినండి మరియు సత్కార్యాలు చేయండి.[1] నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు.
———
[1] అ'త్తయ్యిబాతు: అంటే పరిశుద్ధ వస్తువులు. కొందరు వ్యాఖ్యాతలు వీటిని 'హలాల్ వస్తువులు అని అన్నారు. రెండూ సరైనవే. ఎందుకంటే ప్రతి పరిశుద్ధ వస్తువు 'హలాలే! అందుకే అల్లాహ్ (సు.తా.) అపరిశుద్ధ వస్తువులను 'హరాం చేశాడు. అ'అమాల్ 'సాలిహ్: సత్కార్యాలు అంటే ఏ కార్యాలైతే ఖుర్ఆన్ మరియు 'స'హీ'హ్ 'హదీస్'ల ప్రకారం ఉంటయో! ఈ రెంటి మధ్య గాఢమైన సంబంధముంది. కావున వీటిని గురించి ప్రవక్తలందరికీ బోధింపబడింది. అందుకే ప్రవక్తలందరూ తాము పని చేసి సంపాదించిన సంపాదన నుండే తినేవారు. చాలా మంది ప్రవక్తలు కొంతకాలం గొర్ల కాపరులుగా పనిచేశారు, (బు'ఖారీ). ప్రవక్తలందరూ పురుషులే!
Mü'minûn 23:52
మరియు నిశ్చయంగా, మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం మరియు నేనే మీ ప్రభువును, కావున మీరు నా యందే భయభక్తులు కలిగి ఉండండి.[1]
———
[1] ఉమ్మతున్: అంటే ఇక్కడ ధర్మం అని అర్థం. ప్రవక్తలందరి ధర్మం ఒక్కటే, 'ఇస్లాం' అంటే అల్లాహ్ (సు.తా.)కు విధేయులై ఉండి, ఆయన తప్ప మరొకరిని ఆరాధించకుండా ఉండటం. ఇటువంటి ఆయత్ కు చూడండి, 21:92.
Mü'minûn 23:53
కాని వారు తమ (ధర్మం) విషయంలో పరస్పర భేదాభిప్రాయాలు కల్పించుకొని, విభిన్న తెగలుగా చీలిపోయారు.[1] ప్రతి వర్గం వారు, తాము అనుసరించే దానితో సంతోషపడుతున్నారు.[2]
———
[1] చూడండి, 21:93. [2] చూడండి, 22:67. దైవప్రవక్త ('స'అస) అన్నారు: 'యూదులు 71 తెగలుగా మరియు క్రైస్తవులు 72 తెగలుగా చీలిపోయారు. కాని నా సమాజం వారు 73 తెగలుగా చీలిపోతారు.' (ఇబ్నె 'హంబల్, అబూ-దావూద్, తిర్మిజీ' మరియు దారిమీ).
Mü'minûn 23:54
కావున వారిని కొంత కాలం వరకు వారి మూఢత్వంలోనే మునిగి ఉండనివ్వు.
Mü'minûn 23:55
ఏమీ? మేము వారికి సంపదలు మరియు సంతానం సమృద్ధిగా ఇస్తున్నామంటే!
Mü'minûn 23:56
మేము వారికి మేలు చేయటంలో తొందరపడుతున్నామని, వారు భావిస్తున్నారా?[1] అలా కాదు వారు గ్రహించటం లేదు!
———
[1] వాలు అక్షరాలలో (Italics లో) ఉన్న భాగం 55వ ఆయతుకు చెందినది. వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో భేదం రాకుండా ఉండటానికి ఇక్కడ చేర్చబడింది.
Mü'minûn 23:57
నిశ్చయంగా, ఎవరైతే, తమ ప్రభువు భయం వల్ల, భీతిపరులై ఉంటారో;
Mü'minûn 23:58
మరియు ఎవరైతే, తమ ప్రభువు ఆయాతులను విశ్వసిస్తారో;
Mü'minûn 23:59
మరియు ఎవరైతే తమ ప్రభువుకు ఎవ్వరినీ సాటిగా (భాగస్వాములుగా) కల్పించరో;
Mü'minûn 23:60
మరియు ఎవరైతే, తాము ఇవ్వ వలసినది (జకాత్) ఇచ్చేటప్పుడు, నిశ్చయంగా, వారు తమ ప్రభువు వైపుకు మరలిపోవలసి ఉన్నదనే భయాన్ని తమ హృదయాలలో ఉంచుకొని ఇస్తారో;
Mü'minûn 23:61
ఇలాంటి వారే మంచిపనులు చేయటంలో పోటీ పడేవారు. మరియు వారు వాటిని చేయటానికి అందరి కంటే ముందు ఉండేవారు.
Mü'minûn 23:62
మరియు మేము ఏ ప్రాణి పై కూడా దాని శక్తికి మించిన భారం వేయము.[1] మరియు మా వద్ద అంతా వ్రాయబడిన ఒక గ్రంథముంది. అది సత్యాన్ని పలుకుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.
———
[1] చూడండి, 2:286 మొదటి వాక్యం.
Mü'minûn 23:63
అలా కాదు, వారి హృదయాలు దీనిని గురించి అజ్ఞానంలో పడి ఉన్నాయి. ఇంతేగాక వారు చేసే (దుష్ట) కార్యాలు ఎన్నో ఉన్నాయి వారు వాటిని చూస్తునే ఉంటారు.[1]
———
[1] అంటే 'షిర్కే' కాక వేరే ఇతర పెద్ద పాపాలు.
Mü'minûn 23:64
చివరకు, వారిలోని ఇహలోక భోగభాగ్యాలలో మునిగి ఉన్న వారిని శిక్షించటానికి మేము పట్టుకున్నప్పుడు, వారు మొరపెట్టుకుంటారు.[1]
———
[1] చూడండి, 17:16.
Mü'minûn 23:65
(అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "ఈరోజు మీరు మొరపెట్టుకోకండి! నిశ్చయంగా, మా తరఫు నుండి మీకు ఎలాంటి సహాయం లభించడం జరుగదు.
Mü'minûn 23:66
వాస్తవానికి, నా సూచనలు మీకు వినిపించబడినప్పుడు, మీరు మీ మడమల మీద వెనుకకు తిరిగి పోయేవారు.
Mü'minûn 23:67
"దురహంకారంతో దానిని[1] గురించి వ్యర్థపు ప్రలాపాలలో రాత్రులు గడుపుతూ ఉండేవారు."
———
[1] బిహి: దానిని గురించి అంటే, చాలా మంది వ్యాఖ్యాతలు క'అబహ్ అని అంటారు. అంటే మక్కా. ముష్రిక్ ఖురైషులు తాము క'అబహ్ గృహపు కార్యకర్తలని దురహంకారంతో వ్యవహరిస్తూ ము'హమ్మద్ ('స'అస) పై అవతరింపజేయబడిన ఖుర్ఆన్ ను గురించి వ్యర్థపు మాటలు పలికేవారు. ఇతర వ్యాఖ్యాతలు అంటారు: 'బిహీ - అంటే ఖుర్ఆన్. దానిని గురించి వ్యర్థపు మాటలాడుతూ రాత్రులు గడిపేవారు.' చూడండి, 31:6.
Mü'minûn 23:68
ఏమీ? వారు ఈ (దైవ) వాక్కును[1] గురించి ఎన్నడూ ఆలోచించలేదా? లేక వారి పూర్వీకులైన, వారి తాతముత్తాతల వద్దకు ఎన్నడూ రానిది, వారి వద్దకు వచ్చిందనా?
———
[1] దైవవాక్కు అంటే ఖుర్ఆన్.
Mü'minûn 23:69
లేక వారు తమ సందేశహరుణ్ణి ఎరుగరా? అందుకే అతన్ని తిరస్కరిస్తున్నారా?
Mü'minûn 23:70
లేక: "అతనికి పిచ్చిపట్టింది!" అని అంటున్నారా? వాస్తవానికి, అతను వారి వద్దకు సత్యాన్ని తెచ్చాడు. కాని చాలామంది సత్యాన్ని అసహ్యించుకుంటున్నారు.
Mü'minûn 23:71
మరియు ఒకవేళ సత్యమే[1] వారి కోరికలకు అనుగుణంగా ఉంటే భూమ్యాకాశాలు మరియు వాటిలో ఉన్నదంతా నాశనమై పోయేది. వాస్తవానికి మేము వారి వద్దకు హితబోధను పంపాము.[2] కాని వారు తమ హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.
———
[1] అల్-'హఖ్ఖు: అంటే ధర్మం మరియు షరియత్. (ధర్మశాసనం). [2] అజ-జి'క్ రు: అంటే దివ్యఖుర్ఆన్. చూడండి, 21:110.
Mü'minûn 23:72
లేక నీవు (ఓ ముహమ్మద్!) వారిని ప్రతిఫలం ఏమైనా అడుగుతున్నావా? నీ ప్రభువు ఇచ్చే ప్రతిఫలమే ఎంతో మేలైనది. ఆయనే అందరి కంటే శ్రేష్ఠుడైన ఉపాధి ప్రదాత.
Mü'minûn 23:73
మరియు నిశ్చయంగా, నీవు వారిని ఋజుమార్గం వైపునకు పిలుస్తున్నావు.
Mü'minûn 23:74
మరియు నిశ్చయంగా, పరలోకాన్ని నమ్మని వారు (ఋజు) మార్గం నుండి వైదొలగిన వారే!
Mü'minûn 23:75
ఒకవేళ మేము వారిని కరుణించి, (ఇహలోకంలో వారికున్న) ఆపదను తొలగించినా! వారు తలబిరుసుతనంతో పట్టు విడువకుండా త్రోవ తప్పి, సంచరిస్తూ ఉంటారు.
Mü'minûn 23:76
మరియు వాస్తవానికి, మేము వారిని శిక్షకు గురి చేశాము.[1] అయినా వారు తమ ప్రభువు ముందు వంగలేదు మరియు వారు వినమ్రులు కూడా కాలేదు.
———
[1] ఇక్కడ శిక్ష అంటే బద్ర్ యుద్ధరంగంలో ముష్రికులకు సంభవించిన పరాభవం. లేక దైవ ప్రవక్త ('స'అస) ప్రార్థన వల్ల మక్కా ముష్రిక్ లపై వచ్చిన కరువుకాలం కావచ్చు. (ఇబ్నె-కసీ'ర్).
Mü'minûn 23:77
చివరకు మేము వారి కొరకు కఠిన శిక్షా ద్వారాన్ని తెరిచాము. అప్పుడు వారు నిరాశ చెందిన వారయ్యారు.
Mü'minûn 23:78
మరియు ఆయనే, మీకు వినే శక్తినీ, చూసే శక్తినీ మరియు (అర్థం చేసుకోవటానికి) హృదయాలను సృజించినవాడు! అయినా మీరెంత తక్కువగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు!
Mü'minûn 23:79
మరియు మిమ్మల్ని భూమిపై వ్యాపింప జేసినవాడు ఆయనే. మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశ పరచబడతారు.
Mü'minûn 23:80
మరియు మీకు జీవితాన్ని ఇచ్చేవాడు మరియు మరణింపజేసేవాడు ఆయనే! మరియు రాత్రింబవళ్ళ మార్పు ఆయన ఆధీనంలోనే ఉంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?
Mü'minûn 23:81
కాని వారు తమ పూర్వీకులు పలికినట్లే పలుకుతున్నారు.
Mü'minûn 23:82
వారంటున్నారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా మళ్ళీ సజీవులుగా లేపబడతామా?
Mü'minûn 23:83
వాస్తవానికి, ఇటువంటి వాగ్దానాలు, మాకూ మరియు మాకు పూర్వం మా తాతముత్తాతలకు చేయబడినవే! వాస్తవానికి ఇవి కేవలం పూర్వకాలపు కట్టుకథలు మాత్రమే"[1]
———
[1] అసా'తీరున్: అంటే పూర్వకాలంలో వ్రాసిపెట్టిన కట్టుకథలు. అంటే పునరుత్థానమని నీవు ('స'అస) అంటున్నది మేము ఎన్నో తరాల నుండి వింటున్న గాథయే! అది ఎప్పుడు రానున్నది? ఇది కేవలం ఒక కట్టు కథ!
Mü'minûn 23:84
వారిని ఇలా అడుగు: "ఈ భూమి మరియు ఇందులో ఉన్నదంతా ఎవరికి చెందినదో మీకు తెలిస్తే చెప్పండి?"
Mü'minûn 23:85
వారంటారు: "అల్లాహ్ కే!" వారితో అను: "అయినా మీరు హితోపదేశం స్వీకరించరా?"
Mü'minûn 23:86
వారిని అడుగు: "సప్తాకాశాల ప్రభువు మరియు సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు ఎవరు?"[1]
———
[1] చూడండి, 2:29, 7:54 మరియు 9:129.
Mü'minûn 23:87
వారంటారు: "అల్లాహ్ మాత్రమే!" అని. వారితో అను: "అయితే మీరెందుకు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండరు?"
Mü'minûn 23:88
వారిని ఇలా అడుగు: "మీకు తెలిస్తే చెప్పండి! ప్రతిదానిపై పాలనాధికారం ఎవరి చేతిలో ఉంది? మరియు ప్రతిదానికి శరణమిచ్చేవాడు ఆయనే మరియు ఆయనకు వ్యతిరేకంగా శరణమివ్వగల వాడెవ్వడూ లేనివాడు, ఎవరు?"
Mü'minûn 23:89
వారంటారు: "అల్లాహ్ మాత్రమే!" వారితో అను: "అయితే మీరెందుకు మాయాజాలానికి గురవుతున్నారు (మోసగింపబడుతున్నారు)?"
Mü'minûn 23:90
అలా కాదు! మేము వారికి సత్యాన్ని అందజేశాము. మరియు నిశ్చయంగా, వారే అసత్యవాదులు!
Mü'minûn 23:91
అల్లాహ్ ఎవ్వరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టితో వేరై పోయేవాడు మరియు వారు ఒకరిపై నొకరు ప్రాబల్యం పొందగోరేవారు. అల్లాహ్! వారు కల్పించే వాటికి అతీతుడు.[1]
———
[1] చూడండి, 6:100
Mü'minûn 23:92
ఆయన అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు. వారు సాటి కల్పించే భాగస్వాముల కంటే, ఆయన అత్యున్నతుడు.
Mü'minûn 23:93
(ఓ ముహమ్మద్!) ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! ఏ (శిక్ష అయితే) వారికి (అవిశ్వాసులకు) వాగ్దానం చేయబడి ఉన్నదో దానిని నీవు నాకు చూపనున్నచో!
Mü'minûn 23:94
ఓ నా ప్రభూ! నన్ను ఈ దుర్మార్గ ప్రజలలో చేర్చకు."[1]
———
[1] దైవప్రవక్త ('స'అస) ఇలా ప్రార్థించారు: 'ఓ అల్లాహ్ (సు.తా.)! ఒకవేళ నీవు ఈ సమాజాన్ని పరీక్షించగోరితే లేక శిక్షించగోరితే! అంతకు ముందే నన్ను ఈ ప్రపంచం నుండి లేపుకో!' (తిర్మిజీ', అ'హ్మద్).
Mü'minûn 23:95
మరియు నిశ్చయంగా, మేము వారికి (అవిశ్వాసులకు) వాగ్దానము చేసింది (శిక్ష) నీకు చూపగల సమర్ధులము.
Mü'minûn 23:96
చెడును, మంచితనముతో నివారించు.[1] వారు ఆపాదించే విషయాలు మాకు బాగా తెలుసు.
———
[1] చూడండి, 13:22 చివరి వాక్యం మరియు 41:34-35.
Mü'minûn 23:97
మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! షైతానులు రేకెత్తించే కలతల నుండి (రక్షణ పొందటానికి) నేను నీ శరణు వేడుకుంటున్నాను.
Mü'minûn 23:98
మరియు ఓ నా ప్రభూ! అవి నా వద్దకు రాకుండా ఉండాలని, నేను నీ శరణు వేడుకుంటున్నాను."[1]
———
[1] కావున ప్రతి కార్యానికి ముందు: 'బిస్మిల్లా హిర్ర'హ్మా నిర్ర'హీమ్' చదవండి అని దైవప్రవక్త ('స'అస) అన్నారు. దీనిని గురించి 'హదీస్'లలో, దు'ఆలు కూడా పేర్కొనబడ్డాయి. (ముస్నద్ అ'హ్మద్ 2/181, అబూ-దావూద్, తిర్మిజీ').
Mü'minûn 23:99
చివరికి వారిలో ఒకడికి మరణం సమీపించినప్పుడు వాడిలా వేడుకుంటాడు: "ఓ నా ప్రభూ! నన్ను తిరిగి (భూలోకానికి) పంపు:
Mü'minûn 23:100
నేను చేయకుండా వచ్చిన సత్కార్యాలు చేయటానికి."[1] అది కాని పని. నిశ్చయంగా అది అతని నోటిమాట మాత్రమే![2] ఇక (ఈ మరణించిన) వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది.[3]
———
[1] ఈ దు'ఆ ప్రతి సత్యతిరస్కారి: 1) మరణం ఆసన్నమైనప్పుడు, 2) పునరుత్థానదినమున, అల్లాహ్ (సు.తా.) సమక్షంలో హాజరు చేయబడినప్పుడు మరియు 3) నరకంలోకి త్రోయబడి నప్పుడు చేస్తాడు. కాని సఫలుడు కాడు. ఈ వాక్యం ఖుర్ఆన్ లో అనేక సార్లు వచ్చింది. చూడండి, 63:10-11, 14:44, 7:53, 32:12, 6:27-28, 40:11-12, 35:37 మొదలైనవి. [2] అది కాని పని, చూడండి, 6:28 [3] ఇహలోక మరియు పరలోక జీవితపు మధ్య కాలాన్ని బర్'జ'ఖ్ అంటారు.
Mü'minûn 23:101
ఆ తరువాత బాగా ఊదబడిన దినమున వారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు. మరియు వారు ఒకరి నొకరు పలుకరించుకోరు కూడా!
Mü'minûn 23:102
ఇక ఎవరి (సత్కార్యాల) పళ్ళాలు బరువుగా ఉంటాయో, ఆలాంటి వారే సాఫల్యం పొందేవారు.
Mü'minûn 23:103
మరియు ఎవరి పళ్ళాలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్న వారు, వారే నరకంలో శాశ్వతంగా ఉండేవారు.
Mü'minûn 23:104
అగ్ని వారి ముఖాలను కాల్చి వేస్తుంది.[1] వారి పెదవులు బిగించుకు పోయి, పళ్ళు బయట పడతాయి.
———
[1] ముఖం ఎందుకు పేర్కొనబడిందంటే మానవ ఉనికికి అన్నింటికంటే ముఖ్యమైన అంశం ముఖమే! నరకాగ్ని మాత్రం శరీరన్నంతా కాల్చుతుంది.
Mü'minûn 23:105
(వారిని అల్లాహ్ ఇలా ప్రశ్నిస్తాడు): "ఏమీ? నా సూచనలు మీకు వినిపించబడలేదా? అప్పుడు మీరు వాటిని అసత్యాలని తిరస్కరిస్తూ ఉండేవారు కదా?"
Mü'minûn 23:106
వారిలా అంటారు: "ఓ మా ప్రభూ! మా దురదృష్టం మమ్మల్ని క్రమ్ముకొని ఉండింది. మేము మార్గభ్రష్టులమైన వారిగా ఉండేవారం!
Mü'minûn 23:107
ఓ మా ప్రభూ! మమ్మల్ని దీని (ఈ నరకం) నుండి బయటకు తీయి. ఒకవేళ మేము మరల (పాపాలు) చేస్తే, మేము నిశ్చయంగా, దుర్మార్గులమే!"
Mü'minûn 23:108
ఆయన (అల్లాహ్) అంటాడు: "దానిలోనే పరాభవంతో పడి ఉండండి మరియు నాతో మాట్లాడకండి!"
Mü'minûn 23:109
నిశ్చయంగా, నా దాసులలో కొందరు ఇలా ప్రార్థించే వారున్నారు: "ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు మరియు కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు!"
Mü'minûn 23:110
కాని మీరు వారిని పరిహాసానికి గురి చేసేవారు, చివరకు (ఆ పరిహాసమే) మిమ్మల్ని నా ధ్యానం నుండి మరపింపజేసింది; మరియు మీరు వారి మీద నవ్వేవారు (ఎగతాళి చేసేవారు)!
Mü'minûn 23:111
నిశ్చయంగా, ఈ రోజు నేను వారికి, వారి సహనానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాను. నిశ్చయంగా వారే విజయం పొందినవారు!
Mü'minûn 23:112
(అల్లాహ్) ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు భూమిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు?"
Mü'minûn 23:113
వారిలా జవాబిస్తారు: "మేమక్కడ ఒక్క దినమో లేక దినపు కొంత భాగమో ఉంటిమి. లెక్క పెట్టిన వారిని అడుగు!"[1]
———
[1] ఈ లెక్క పెట్టే వారు దైవదూతలు.
Mü'minûn 23:114
(అల్లాహ్) అంటాడు: "మీరక్కడ ఉన్నది కొంతకాలం మాత్రమే! ఒకవేళ ఇది మీరు తెలుసుకొని ఉంటే (ఎంత బాగుండేది)!"
Mü'minûn 23:115
"ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?"
Mü'minûn 23:116
కావున (తెలుసుకోండి) అల్లాహ్ అత్యున్నతుడు, నిజమైన విశ్వసార్వభౌముడు,[1] ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే గౌరవప్రదమైన సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు!
———
[1] చూడండి, 20:114 వ్యాఖ్యానం 2.
Mü'minûn 23:117
ఇక ఎవడైనా అల్లాహ్ తో పాటు మరొక దైవాన్ని - తన వద్ద దాని కొరకు ఎలాంటి ఆధారం లేకుండానే - ప్రార్థిస్తాడో, నిశ్చయంగా అతని లెక్క అతని ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా, సత్యతిరస్కారులు సాఫల్యము పొందలేరు.[1]
———
[1] నిజమైన సాఫల్యం, స్వర్గ నివాసమే కాని ఇహలోకంలోని ఆస్తిపాస్తులు, సంతానం హోదాలు, పేరు ప్రతిష్టలు మొదలైనవి కావు.
Mü'minûn 23:118
కావున నీవు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నన్ను కరుణించు, కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు!"
Nur 24:1
ఇది ఒక సూరహ్! మేమే దీనిని అవతరింపజేశాము మరియు దీనిని విధిగా జేశాము మరియు బహుశా మీరు గుణపాఠం నేర్చుకుంటారని, మేమిందులో స్పష్టమైన సూచనలను (ఆయాత్ లను) అవతరింపజేశాము.
Nur 24:2
వ్యభిచారిణి మరియు వ్యభిచారుడు, ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి.[1] మరియు మీకు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసముంటే - అల్లాహ్ విధించిన ధర్మవిషయంలో - వారిద్దరి యెడల మీకు జాలి కలుగకూడదు. మరియు వారిద్దరి శిక్షను, విశ్వాసులలో కొందరు చూడాలి.
———
[1] 'మరియు మీ స్త్రీలలో ఎవరైనా వ్యభిచారానికి పాల్పబడితే, వారికి వ్యతిరేకంగా, మీలో నుండి నలుగురి సాక్ష్యం తీసుకోండి. వారు (నలుగురు) సాక్ష్యమిస్తే, వారు మరణించే వరకైనా, లేదా వారి కొరకు అల్లాహ్ ఏదైనా మార్గం చూపించే వరకైనా, వారిని ఇండ్లలో నిర్బంధించండి.' అని 4:15లో వచ్చింది. ఇక్కడ: 'వ్యభిచారిణి మరియు వ్యభిచారుడు, ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి.' అని వచ్చింది. ఈ శిక్ష పెండ్లి కాని వారిది. ఇక పెండ్లి అయిన వారు వ్యభిచారం చేస్తే రాళ్ళు రువ్వి చంపండి. అని ముస్లిం, కితాబ్ అల్ 'హూదూద్, బాబ్'హద్ అ'జ్జానిలో ఉంది. ఇంకా ఎన్నో 'హదీస్'లు మరియు దైవ ప్రవక్త ('స'అస) మరియు 'స'హాబీలు అమలు పరచిన విధానాలు మరియు ముస్లిం సమాజంలోని ఏకాభిప్రాయాలు ఉన్నాయి. వీటిననుసరించి వివాహితులైన స్త్రీపురుషులు వ్యభిచారం చేస్తే వారికి రాళ్ళు రువ్వి చంపే శిక్ష (రజ్మ్) విధించబడుతుంది. కాని, ఈ శిక్ష విధించటానికి, లైంగిక క్రియ జరుగుతూ ఉండగా ప్రత్యక్షంగా కళ్ళారా చశామని, సత్యవంతులైన నలుగురు వ్యక్తులు అల్లాహ్ పేరుతో ప్రమాణం చేస్తూ సాక్ష్యం ఇవ్వాలి. కేవలం వృత్తంతానుమేయ ప్రమాణం సరిపోదు. చూడండి, 24:4.
Nur 24:3
ఒక వ్యభిచారి, ఒక వ్యభిచారిణిని లేక బహుదైవారాధకురాలయిన (ముష్రిక్) స్త్రీని మాత్రమే వివాహమాడుతాడు; మరియు ఒక వ్యభిచారిణిని, ఒక వ్యభిచారుడో లేక ఒక బహుదైవారాధకుడో మాత్రమే వివాహమాడుతాడు. మరియు ఇలాంటి విషయం విశ్వాసుల కొరకు నిషేధించబడింది.[1]
———
[1] కొందరు 'స'హాబీ (ర'ది. 'అన్హుమ్)లు చరిత్రహీనులైన స్త్రీలతో వివాహమాడటానికి అనుమతి అడిగినప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడిందని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. ఇక్కడ నికా'హ్: అంటే సాధారణ వివాహం కాదు, లైంగిక సంబంధం. ఒక వ్యభిచారియే ఒక వ్యభిచారిణితో లైంగిక సంబంధం ఉంచుకుంటాడు అని కొందరు అభిప్రాయపడ్డారు. మరొక వ్యాఖ్యానం ఏమిటంటే: ప్రతివాడు తనవంటి వారినే తన సహవాసులుగా ఎన్నుకుంటాడు. ఇది ఇమామ్ అష్-షౌకాని వ్యాఖ్యానం.
Nur 24:4
మరియు ఎవరైనా శీలవతులైన స్త్రీలపై అపనింద మోపిన తరువాత నలుగురు సాక్షులను తీసుకొని రాలేరో, వారికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి మరియు వారి సాక్ష్యాన్ని ఎన్నటికీ స్వీకరించకండి. అలాంటి వారు పరమ దుష్టులు (ఫాసిఖూన్).[1]
———
[1] ఇక్కడ వ్యభిచార నిర్ధారణకు నలుగురు సాక్షులను - ఎవరైతే లైంగిక క్రియ జరుగు తున్నప్పుడు కళ్ళారా చూశారో - తేవాలి! అని స్పష్టంగా పేర్కొనబడింది. వృత్తాంతానుమేయ ప్రమాణం సరిపోదు. అంటే అక్కడ దొరికిన ఇతర ప్రమాణాలను బట్టి లైంగిక క్రియ జరిగి ఉండవచ్చు అని, అంచనా వేయడం సరిపోదు. నలుగురు సాక్ష్యులు లైంగిక క్రియ జరుగుతూ ఉండగా కళ్ళారా చూశాము, అని సాక్ష్యమిస్తే ఈ శిక్ష విధించాలి, లేకుంటే అపనింద మోపిన వానికి 80 కొరడా దెబ్బలు కొట్టాలి మరియు వాని సాక్ష్యం ఎన్నటికీ స్వీకరించరాదు. అల్లాహ్ (సు.తా.) దృష్టిలో అసత్య సాక్ష్యమిచ్చిన వాడు పరమదుష్టుడు. మరొక విశేషమేమిటంటే, అప్పులలో, హత్యలలో మరియు ఇతర విషయాలలో ఇద్దరు సాక్షులు చాలు. కానీ, శిక్ష గంభీరమైనది, కాబట్టి వ్యభిచార విషయంలో లైంగిక క్రియ జరిగేటప్పుడు,కళ్ళారా చూసినామని అల్లాహ్ పేరట ప్రమాణం చేసి, నలుగురు సాక్ష్యమిస్తేనే శిక్ష విధించాలి. చూడండి, 24:2.
Nur 24:5
కాని అటు పిమ్మట ఎవరైతే పశ్చాత్తాప పడి తమను తాము సవరించుకుంటారో! నిశ్చయంగా, అలాంటి వారి పట్ల అల్లాహ్ క్షమీశీలుడు, అపార కరుణా ప్రదాత.
Nur 24:6
మరియు ఎవరైతే, తమ భార్యల మీద అపనింద మోపి, దానికి తాము స్వయమే తప్ప ఇతరులను సాక్షులుగా తేలేరో, వారు తమంతట తామే నాలుగు సార్లు అల్లాహ్ పై ప్రమాణం చేసి సాక్ష్యమిస్తూ; నిశ్చయంగా, తాను సత్యం పలుకుతున్నాననీ;[1]
———
[1] అంటే ఇక్కడ నాల్గు సార్లు అల్లాహ్ పై ప్రమాణం చేసి అనడం, నాలుగు సాక్షులతో సమానం, అని అర్థం.
Nur 24:7
మరియు ఐదవసారి అతడు ఒకవేళ అసత్యం పలుకుతున్నట్లయితే! నిశ్చయంగా, అల్లాహ్ ఆగ్రహం తన మీద విరుచుకు పడుగాక! అనీ అనాలి,
Nur 24:8
ఇక ఆమె (భార్య) శిక్షను తప్పించుకోవటానికి, నాలుగు సార్లు అల్లాహ్ పై ప్రమాణం చేస్తూ; నిశ్చయంగా, అతడు అబద్ధం చెబుతున్నాడనీ;
Nur 24:9
మరియు అయిదవసారి ఒకవేళ అతడు సత్యవంతుడైతే! నిశ్చయంగా, తన మీద అల్లాహ్ ఆగ్రహం విరుచుకు పడుగాక! అనీ అనాలి.[1]
———
[1] ఈ విధానం షరీయత్ లో ల'అనున్ అనబడుతుంది. అంటే నిందారోపణను ఖండించటానికి చేసే ప్రమాణం. ఈ విధమైన సాక్ష్యాల తరువాత వారిద్దరి మధ్య విడాకులు జరుగుతాయి. దైవప్రవక్త ('స'అస) కాలంలో ఇటువంటి విషయాలు జరిగినందువల్లనే ఈ ఆత్ లు అవతరింపజేయబడ్డాయి.
Nur 24:10
మరియు మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే! (ఆయన మీ శిక్షను త్వరలోనే తెచ్చేవాడు) మరియు నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, మహా వివేకవంతుడు.[1]
———
[1] ఇక్కడ అల్లాహ్ (సు.తా.) శిక్ష వెంటనే రాకపోవచ్చు. ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) అనంత కరుణామయుడు, పశ్చాత్తాపాన్ని అంగీకరించే వాడు మరియు మహా వివేకవంతుడు.
Nur 24:11
నిశ్చయంగా, అపనింద మోపేవారు,[1] మీలో నుంచే కొందరున్నారు. అది మీకు హానికరమైనదని భావించకండి. వాస్తవానికి అది మీకు మేలైనదే. వారిలో ప్రతి ఒక్కనికి తాను చేసిన పాపానికి తగిన శిక్ష లభిస్తుంది. మరియు వారిలో (ఈ అపనింద మోపటంలో), పెద్ద బాధ్యత వహించిన వానికి ఘోరమైన శిక్ష పడుతుంది.
———
[1] బనూ-ము'స్ 'తలిఖ్ యుద్ధం నుండి 5వ హిజ్రీలో తిరిగి మదీనాకు వస్తున్నప్పుడు దైవప్రవక్త ('స'అస) మరియు 'సహాబీలు (ర'ది.'అన్హుమ్) మదీనాకు కొంత దూరముండగా రాత్రి గడపటానికి ఆగుతారు. ఉదయం వారి ప్రయాణం మొదలు పెట్టినప్పుడు, 'ఆయి'షహ్ (ర.'అన్హా) యొక్క అంబారీ (హోదజ్) ఆమె లోపల ఉన్నారనుకొని - ఒంటె మీద పెట్టి ప్రయాణం మొదలు పెడ్తారు. 'ఆయి'షహ్ (ర.'అన్హా) తమ హారం వెతకటానికి వెళ్ళి ఉంటుంది. ఆమె తిరిగి వచ్చే వరకు ఎవ్వరూ లేనిది చూసి అక్కడే కూర్చుంటుంది. అంతలో వెనుక నుండి 'సఫ్వాన్ బిన్-మ'అ'తల్ సులమి (ర'.ది.'అ.) వస్తాడు. అతడి పని, వెనుక ఉండి బిడారం వారు ఏమైనా మరచిపోతే దానిని తీసుకొని రావడమే. '''''''''''''''11-20.
Nur 24:12
విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు దానిని వినినప్పుడు, తమను గురించి తాము మంచి తలంపు వహించి: "ఇది స్పష్టమైన అపనిందయే!" అని ఎందుకు అనలేదు? [1]
———
[1] 'ఆయి'షహ్ (ర.'అన్హా) ను గురించి లేపిన అపనింద కొరకు చూడండి, 'స'హా'హ్ బు'ఖారీ, పుస్తకం-6 'హదీస్' నెం. 274
Nur 24:13
మరియు వారు దీనికై నలుగురు సాక్షులను ఎందుకు తీసుకురాలేదు? ఒకవేళ వారు సాక్షులను తీసుకొని రానప్పుడు, అల్లాహ్ వద్ద వారే అసత్యవాదులు.
Nur 24:14
మరియు ఒకవేళ మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణ, ఇహలోకంలో మరియు పరలోకంలో లేకుంటే - మీరు ఏ విషయాలలో పడి పోయారో, వాటి పర్యవసానంగా - మీపై ఘోరమైన శిక్ష పడి ఉండేది.
Nur 24:15
అప్పుడు మీరు దానిని (ఆ అపనిందను) మీ నాలుకలతో వ్యాపింపజేస్తూ పోయారు మరియు మీకు తెలియని దానిని మీ నోళ్ళతో పలుకసాగారు మరియు మీరు దానిని చిన్న విషయంగా భావించారు, కాని అల్లాహ్ దగ్గర (దృష్టిలో) అది ఎంతో గొప్ప విషయం (అపరాధం).
Nur 24:16
మరియు మీరు దానిని విన్నప్పుడు: "ఇలాంటి మాట పలకడం మాకు తగదు, (ఓ మా ప్రభూ!) నీవు సర్వలోపాలకు అతీతుడవు, ఇది గొప్ప నిందారోపణ!" అని ఎందుకు అనలేదు. [1]
———
[1] ఈ మాటలు వ్యాపింపజేసిన వారితో: 'మీరు నలుగురు సాక్షులను ఎందుకు తేలేదు.' అని విశ్వాసులు ఎందుకు ప్రశ్నించలేదు. వారు నలుగురు సాక్షులను తేకుంటే మీరు వారిని అసత్యవాదులని ఎందుకు అనలేదు ? ఈ ఆయత్ అవతరింపజేయబడిన తరువాత 'హస్సాన్, మి'స్'తహ్ బిన్-అసా'స'హ్ మరియు 'హమ్న బిన్త్-జ'హష్ (ర'ది.'అన్హుమ్) లు అపనింద మోపినందుకు శిక్షింపబడ్డారు. (అ'హ్మద్, తిర్మిజీ', అబూ-దావూద్, ఇబ్నె-మాజా).
Nur 24:17
మీరు విశ్వాసులే అయితే, ఇక మీదట ఎన్నటికీ ఇటువంటి చేష్టలు మరల చేయకూడదని అల్లాహ్ మిమ్మల్ని ఉపదేశిస్తున్నాడు.
Nur 24:18
మరియు అల్లాహ్ మీకు స్పష్టమైన ఆయాత్ లను చూపుతున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
Nur 24:19
నిశ్చయంగా, ఎవరైతే విశ్వాసవర్గంలో అశ్లీలత [1] వ్యాపించాలని కోరుతారో, అలాంటి వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా కఠినశిక్ష పడుతుంది[2]. మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కాని మీకు తెలియదు.
———
[1] అల్-ఫా'హిషహ్: దుర్నీతి, అశ్లీలత, చెడ్డనడత, నీచకార్యము, అపనింద మెదలైనవి.
[2] అంటే 80 కొరడా దెబ్బలు చూడండి, ఆయత్ 24:4.
Nur 24:20
మరియు మీ యెడల అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే (మీరు నాశనమై పోయేవారు); మరియు నిశ్చయంగా, అల్లాహ్ మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత.
Nur 24:21
ఓ విశ్వాసులారా! షైతాన్ అడుగు జాడలలో నడవకండి. మరియు ఎవడు షైతాన్ అడుగుజాడలలో నడుస్తాడో! నిశ్చయంగా షైతాన్ అతనిని అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు మరియు మీ యెడల అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే, మీలో ఒక్కడూ కూడా నీతిమంతునిగా ఉండలేడు. కాని అల్లాహ్ తాను కోరిన వానిని నీతిమంతునిగా చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు సర్వజ్ఞుడు.
Nur 24:22
మరియు మీలో (అల్లాహ్) అనుగ్రహం మరియు సమృద్ధిగా (సంపదలు) గలవారు, తమ బంధువులకు, పేదలకు [1], అల్లాహ్ మార్గంలో వలస (హిజ్రత్) పోయే వారికి, సహాయం చేయమని ప్రతిజ్ఞ చేయరాదు [2]. వారిని మన్నించాలి, (వారి తప్పులను) ఉపేక్షించాలి. ఏమీ? అల్లాహ్ మీ తప్పులను క్షమించాలని మీరు కోరరా? వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
———
[1] మిస్కీనున్: తన ఆదాయం నిత్యావసరాలకు సరిపోకున్నా ఇతరులను యాచించనివాడు.
[2] 'ఆయి'షహ్ (ర.'అన్హా) పై అపనింద మోపిన విశ్వాసులలో ఒకడు మిస్'తహ్ (ర'.ది.'అ.), అబూ బక్ర్ (ర.'ది.'అ.) యొక్క దగ్గరి బంధువు. అబూ బక్ర్ (ర.'ది.'అ.) అతనికి సహాయం చేసేవారు. 'ఆయి'షహ్ (ర.'ది.'అన్హా) ను అపనింద నుండి విముక్తి కలిగించే ఆయతులు అవతరింపజేయబడిన తరువాత అబూ బక్ర్ (ర.'ది.'అ.) మి'స్'తహ్ (ర'ది.'అ.) కు ఇక ఎలాంటి సహాయం చేయనని ప్రతిజ్ఞ చేస్తారు. అది అల్లాహ్ (సు.తా.)కు నచ్చక ఈ ఆయత్ అవతరింపజేశాడు. అప్పుడు అబూ బక్ర్ (ర.'ది.'అ.) తన ప్రతిజ్ఞకు పరిహారం (కఫ్ఫారహ్) చెల్లించి మి'స్'తహ్ (ర'ది.'అ) కు మరల సహాయం చేయసాగారు. (ఇబ్నె-కసీ'ర్, ఫ'త్హ్ అల్-ఖదీర్), చూడండి, 13:22.
Nur 24:23
నిశ్చయంగా, ఎవరైతే శీలవతులు, అమాయకులు అయిన విశ్వాస స్త్రీలపై అపనిందలు మోపుతారో, వారు ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ శపించబడతారు (బహిష్కరింపబడతారు) మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది.
Nur 24:24
వారి నాలుకలు, వారి చేతులు మరియు వారి కాళ్ళు - వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి - వారికి విరుద్ధంగా సాక్ష్యమిచ్చే రోజు!
Nur 24:25
ఆ రోజు! అల్లాహ్ వారికి, (వారి కర్మలకు) పూర్తి ప్రతిఫలమిస్తాడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్! ఆయనే పరమ సత్యమని వారు తెలుసుకుంటారు.
Nur 24:26
నికృష్టులైన స్త్రీలు, నికృష్టులైన పురుషులకు మరియు నికృష్టులైన పురుషులు, నికృష్టులైన స్త్రీలకు తగినవారు. మరియు నిర్మల స్త్రీలు, నిర్మల పురుషులకు మరియు నిర్మల పురుషులు, నిర్మల స్త్రీలకు తగినవారు. వారు (కపట విశ్వాసులలు) మోపే అపనిందలకు వీరు నిర్దోషులు. వీరికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి.
Nur 24:27
ఓ విశ్వాసులారా! మీ ఇండ్లు తప్ప, ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటివారికి సలామ్ చేయకుండా ప్రవేశించకండి[1]. ఈ పద్ధతి మీకు అతి ఉత్తమమైనది మీరు ఈ హితోపదేశం జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశింపబడుతోంది!
———
[1] దైవప్రవక్త ('స.'అస) ఏ ఇంటికి వెళ్ళినా మొదట సలాం చేసేవారు. తరువాత ప్రవేశించటానికి, ద్వారపు ఒక ప్రక్కకు నిలబడి అనుమతి అడిగేవారు. మూడుసార్లు అనుమతి అడిగిన తరువాత కూడా జవాబు రాకుంటే మరలిపోయే వారు. ('స.'అస). 'ఎవరు?' అని లోపల ఉన్నవారు ప్రశ్నిస్తే బయట ఉన్నవారు తమ పేరు తెలపాలి. ('స.'బుఖా'రీ).
Nur 24:28
మరియు ఒకవేళ మీకు దానిలో (ఆ ఇంటిలో) ఎవ్వరూ కనబడకపోయినా, మీకు అనుమతి ఇవ్వబడనంత వరకు అందులోకి ప్రవేశించకండి. మరియు (అనుమతి ఇవ్వక) మీతో తిరిగి పొమ్మని (ఆ ఇంటివారు) అంటే! తిరిగి వెళ్ళి పోండి. ఇదే మీ కొరకు శ్రేష్ఠమైన పద్ధతి. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
Nur 24:29
ఎవ్వరికీ నివాస స్థలం కాకుండా మీకు ప్రయోజనకరమైన వస్తువులున్న ఇండ్లలో ప్రవేశిస్తే, మీపై ఎట్టి దోషం లేదు. మరియు మీరు వ్యక్తపరిచేది మరియు మీరు దాచేది అంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
Nur 24:30
విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు[1]. ఇది వారికి ఎంతో శ్రేష్ఠమైనది. నిశ్చయంగా, అల్లాహ్ వారి చేష్టలను బాగా ఎరుగును.
———
[1] చూడండి, 23:5-6, అంటే పురుషులు తమ చూపులను అదుపులో ఉంచుకోవాలి. చూడదని విషయాల నుండి చూపులను మరల్చుకోవాలి. అంటే పురుషులు అన్య స్త్రీలను చూడటం, ఇతరుల ఆచ్ఛాదనీయ అవయవాలను చూడటం, అసభ్య దృశ్యాలపై చూపును నిలపటం తగదు, అని అర్థం. ఇంకా చూడండి, మత్తయి - (Mathew), 5:27-29.
Nur 24:31
మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు - (దానంతట అదే) ప్రదర్శనమయ్యేది తప్ప. వారిని, తమ తల మీది దుప్పటిని రొమ్ముల వరకు కప్పుకోమని చెప్పు. వారు తమ అలంకారాన్ని తమ భర్తలకు, తమ తండ్రులకు, తమ భర్తల తండ్రులకు, తమ కుమారులకు, తమ భర్తల కుమారులకు, తమ సోదరులకు, తమ సోదరుల కుమారులకు, తమ సోదరీమణుల కుమారులకు, తమ (తోటి స్త్రీలకు, తమ బానిస స్త్రీలకు, లేక కామ ఇచ్ఛలేని మగ సేవకులకు, లేక స్త్రీల గుప్తాంగాలను గురించి తెలియని బాలురకు తప్ప. ఇతరుల ముందు ప్రదర్శించకూడదని మరియు కనబడకుండా ఉన్న తమ అలంకారం తెలియబడేటట్లుగా, వారు తమ పాదాలను నేలపై కొడుతూ నడవకూడదని చెప్పు. మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు!
Nur 24:32
మీలోని పెండ్లికాని వారికి మరియు శీలవతులైన మీ బానిస పురుషులు మరియు బానిస స్త్రీలకు వివాహాలు చేయించండి[1]. ఒకవేళ వారు పేదవారయితే, అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని సంపన్నులగా చేయవచ్చు! మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు.
———
[1] అ'యామా, అయ్యిమున్ (ఏ.వ.): అంటే, కన్య, విధవ, విడాకురాలు - మూడు రకాల స్త్రీలు మరియు భార్య లేని పురుషుడు కూడా, దైవప్రవక్త ('స'అస) ప్రవచనం:"ఎవడైతే నా సున్నత్ ను తిరస్కరిస్తాడో వాడు నావాడు కాడు!" ('స'హీ'బ్ బు'ఖారీ - 5063, ముస్లిం - 1023)
Nur 24:33
ఎవరికైతే, పెండ్లి చేసుకునే శక్తి లేదో వారు, అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేసే వరకు శీలశుద్ధతను పాటించాలి[1]. మరియు మీ బానిసలలో ఎవరైనా స్వేచ్ఛాపత్రం వ్రాయించుకోగోరితే వారి యందు మీకు మంచితనం కనబడితే, వారికి స్వేచ్ఛాపత్రం వ్రాసి ఇవ్విండి[2]. అల్లాహ్ మీకు ఇచ్చిన ధనం నుండి వారికి కూడా కొంత ఇవ్వండి. మీరు ఇహలోక ప్రయోజనాల నిమిత్తం, మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరితే వారిని వ్యభిచారానికి బలవంతపెట్టకండి[3], ఎవరైనా వారిని బలవంతపెడితే! నిశ్చయంగా, అల్లాహ్ వారిని (ఆ బానిస స్త్రీలకు) బలాత్కారం తరువాత క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత.
———
[1] ఇలాంటి వారు నఫిల్ ఉపవాసాలు ఉండాలి. దాని వల్ల వారు తమ మనస్సును అదుపులో ఉంచుకోగలరు, ('స'హీ'హ్ బు'ఖారీ).
[2] మీ బానిసలు స్వేచ్ఛగోరి - మీరు వారితో వారి స్వేచ్ఛకొరకు కుదుర్చుకున్న - మీ సొమ్మును కొంతకాలంలో ఇవ్వటానికి ఒప్పుకుంటే! దానిని ఒక పత్రం మీద వ్రాయించుకొని వారికి స్వేచ్ఛనివ్వండి. అంటే ఇస్లాం బానిసత్వాన్ని నిర్మూలించటానికి మొదట నుండియే పాటుపడుతున్నది. చూడండి, 9:60. 'జకాత్ డబ్బును, బానిసల స్వేచ్ఛ కొరకు ఉపయోగించండని ఆజ్ఞ ఉంది.
[3] ఇస్లాంకు పూర్వం, ప్రజలు తమ బానిస స్త్రీలతో వ్యభిచారం చేయించి ఆ సొమ్ము తినేవారు. ఇది ఇస్లాంలో నిషేధించబడింది.
Nur 24:34
మరియు వాస్తవానికి, మేము మీ వద్దకు స్పష్టమైన సూచనలను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను మరియు దైవభీతి గలవారికి బోధనలను (ఉపదేశాలను) అవతరింపజేశాము.
Nur 24:35
అల్లాహ్ ఆకాశాలకూ మరియు భూమికీ జ్యోతి[1]. ఆయన జ్యోతిని, గూటిలోని దీపంలో పోల్చవచ్చు. ఆ దీపం చుట్టూ గాజు ఉంది. ఆ గాజు ఒక నక్షత్రం వలే ప్రకాశిస్తున్నది. అదొక పావనమైన జైతూన్ వృక్షం (నూనె) తో వెలిగించబడుతున్నది, అది (ఆ వృక్షం) తూర్పుకు గానీ, పడమరకు గానీ చెందినది కాదు. దాని నూనె అగ్ని అంటకున్నా మండుతూనే ఉంటుంది. వెలుగు మీద వెలుగు! అల్లాహ్ తన వెలుగు వైపునకు తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. అల్లాహ్ ఉదాహరణల ద్వారా ప్రజలకు బోధిస్తాడు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.
———
[1] అన్-నూర్: He, by whose light the obscure in perception sees, and by whose guidance the erring is directed aright. Or the Manifest by whom is every manifestation. The Light, జ్యోతి కాంతికి నిలయమైనవాడు. ఆకాశాలలో మరియు భూమిలో నున్న వారికి మార్గదర్శకత్వం చేయగలవాడు, వెలుగు చూపగలవాడు కేవలం అల్లాహ్ (సు.తా.) మాత్రమే!
Nur 24:36
అల్లాహ్ ఏ ఇండ్లను (మస్జిదులను) లేపి, వాటిలో ఆయన నామాన్ని స్మరించమని సెలవిచ్చాడో, అందులో వారు, ఆయన పవిత్రతను ఉదయం మరియు సాయంత్రం స్తుతిస్తూ ఉంటారు[1].
———
[1] చూడండి, 72:18.
Nur 24:37
ప్రజలలో కొందరిని - వారి వ్యాపారం గానీ మరియు క్రయవిక్రయాలు గానీ - అల్లాహ్ స్మరణ నుండీ, నమాజ్ స్థాపించడం నుండీ మరియు విధిదానం (జకాత్) ఇవ్వడం నుండీ తప్పించలేవు. హృదయాలు మరియు కనుగ్రుడ్లు గిరగిర తిరిగి పోయే, ఆ దినమును గురించి, వారు భయపడుతూ ఉంటారు[1].
———
[1] చూడండి, 40:18.
Nur 24:38
వారు ఇలా చేయటం, అల్లాహ్ వారికి వారి మంచిపనుల కొరకు ప్రతిఫలమివ్వటానికి; మరియు తన అనుగ్రహాలను వారిపై అధికం చేయటానికి. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.
Nur 24:39
ఇక సత్యాన్ని తిరస్కరించిన వారి కర్మలను ఎడారిలోని ఎండమావితో పోల్చ వచ్చు. దప్పిక గొన్నవాడు - దానిని నీరుగా భావించి దాని వద్దకు చేరి, చివరికి ఏమీ పొందలేక - అక్కడ అల్లాహ్ ను పొందుతాడు. అప్పుడు ఆయన అతని లెక్కను పూర్తిగా తీర్చుతాడు. మరియు అల్లాహ్ లెక్క తీర్చటంలో అతి శీఘ్రుడు[1].
———
[1] అంటే సత్యతిరస్కారుడు ఎన్ని మంచిపనులు, సత్కార్యాలు చేసినా అవి పరలోకంలో ఎండమావులుగా అదృశ్యమైపోతాయి. అంటే అతనికి వాటి నుండి ఎట్టి పుణ్యఫలితం లభించదు. అతడు నరకంతో చేరిపోతాడు.
Nur 24:40
లేక (సత్యతిరస్కారుల పరిస్థితి) చాలా లోతుగల సముద్రంలోని చీకట్లవలే ఉంటుంది. దానిపై ఒక గొప్ప అల క్రమ్ముకొని ఉంటుంది. దానిపై మరొక గొప్ప అల, దానిపై మేఘాలు. చీకట్లు ఒకదానిపై నొకటి క్రమ్ముకొని ఉంటాయి. అపుడు ఎవడైనా తన చేతిని (చూడాలని) చాచితే, వాడు దానిని చూడలేడు. మరియు ఎవనికైతే అల్లాహ్ వెలుగునివ్వడో, అతనికి ఏ మాత్రం వెలుగు దొరకదు[1].
———
[1] సత్యరిరస్కారులను సముద్రపులోతులో చీకట్లలో ఉన్నవాటితో పోల్చబడింది. అంటే సత్యతిరస్కారుడు అంధకారంలో మునిగి ఉన్నాడు. అవి వానిని విశ్వాసపు వెలుగులోనికి రానివ్వవను. పరలోకంలో కూడా వాడు నరకపు అంధకారంలో ఉంటాడు.
వెలుగు సముద్రపు లోతుతోకి చేరలేదు. ఎందుకంటే వెలుగులో ఇమిడి ఉన్న ఏడు రంగులు ఒకదాని తరువాత ఒకటి, సముద్రపు తలాలలోనికి వెలుగు పోయేటప్పుడు పీల్చుకోబడతాయి. కాబట్టి సముద్రపు లోపటి భాగంలో చీకటి ఉంటుందని సైంటిస్టులు ఇప్పుడిప్పుడే తెలుసుకున్నారు. కాని ఇది దివ్యఖుర్ఆన్ లో 1400 వందల సంవత్సరాల ముందే వ్రాయబడింది.
Nur 24:41
ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా) ? నిశ్చయంగా, భూమ్యాకాశాలలో ఉన్న సర్వమూ మరియు రెక్కలు విప్పి ఎగిరే పక్షులు సైతం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయని? వాస్తవానికి ప్రతిదానికి తన నమాజ్ మరియు స్తోత్రం చేసే పద్ధతి తెలుసు[1]. మరియు అవి చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు[2].
———
[1] అంటే ప్రతి దానికి అల్లాహ్ (సు.తా.) యొక్క స్తోత్రం (ప్రార్థన) ఏ విధంగా చేయాలో తెలుసు. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేయడమనేది కూడా అల్లాహ్ (సు.తా.) ఘనతలలో ఒకటి. ఏ విధంగానైతే వాటిని సృష్టించడం కూడా కేవలం ఆయన (సు.తా.) ఘనతలలో ఒకటో! చూడండి, 17:44.
[2] విచక్షణాశక్తి లేని ప్రతివస్తువు కూడా అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేస్తుంది. అలాంటప్పుడు ఈ విచక్షణాశక్తి గల జిన్నాతులు మరియు మానవులు కూడా అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేయకుంటే వారు ఆయన శిక్షకు అర్హులు కాగూడదా ?
Nur 24:42
మరియు భూమ్యాకాశాల మీద సర్వాధిపత్యం అల్లాహ్ దే! మరియు అల్లాహ్ వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది.
Nur 24:43
ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా) ? నిశ్చయంగా, అల్లాహ్ యే మేఘాలను మెల్లమెల్లగా నడుపుతూ, వాటిని ఒక దానితో ఒకటి కలుపుతాడని, ఆ తరువాత వాటిని ప్రోగు చేస్తాడని! ఆ పిదప వాటి నుండి వర్షాన్ని కురిపించేది నీవు చూస్తున్నావు కదా! మరియు ఆయనే ఆకాశంలో ఉన్న కొండల వంటి (మేఘాల) నుండి వడగండ్ల చల్లని (వర్షాన్ని) తాను కోరిన వారిపై కురిపిస్తాడు. మరియు తాను కోరిన వారిని వాటి నుండి తప్పిస్తాడు. వాటి పిడుగు యొక్క మెరుపు కంటి చూపులను దాదాపు హరించేలా ఉంటుంది.
Nur 24:44
అల్లాహ్ యే రేయింబవళ్లను మార్చుతున్నాడు. నిశ్చయంగా, కన్నులు గలవారికి ఇందులో గుణపాఠముంది.
Nur 24:45
మరియు అల్లాహ్ ప్రతి ప్రాణిని నీటి నుండి సృష్టించాడు[1]. వాటిలో కొన్ని తమ కడుపు మీద ప్రాకేవి ఉన్నాయి. మరియు వాటిలో కొన్ని రెండు కాళ్ళ మీద నడిచేవి ఉన్నాయి. మరియు వాటిలో మరికొన్ని నాలుగు (కాళ్ళ) మీద నడిచేవి ఉన్నాయి. అల్లాహ్ తాను కోరిన దానిని సృష్టిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
———
[1] అంటే సర్వజీవరాసి, అంటే జీవం ఉండి చలించేది. చూడండి, 21:30.
Nur 24:46
వాస్తవంగా! మేము సుస్పష్టమైన సూచనలను (ఆయాత్ లను) అవతరింపజేశాము[1]. మరియు అల్లాహ్ తాను కోరిన వానికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
———
[1] అంటే ఖుర్ఆన్ చూడండి, 6:38.
Nur 24:47
వారు (కపట విశ్వాసులు) అంటారు: "మేము అల్లాహ్ ను మరియు సందేశహరుణ్ణి విశ్వసించాము మరియు విధేయుల మయ్యాము." కాని దాని తరువాత వారిలో ఒక వర్గం వారు వెను దిరిగి పోతారు. మరియు అలాంటి వారు విశ్వసించిన వారు కారు.
Nur 24:48
మరియు వారి మధ్య తీర్పు చేయటానికి, వారిని అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని వద్దకు పిలిచినప్పుడు, వారిలోని ఒక వర్గం వారు ముఖం త్రిప్పుకుంటారు.
Nur 24:49
మరియు ఒకవేళ తీర్పు (సత్యం) వారికి అనుకూలమైనదిగా ఉంటే, వారు వినమ్రతతో దానిని స్వీకరిస్తారు[1].
———
[1] చూడండి, 4:60-61.
Nur 24:50
ఏమీ? వారి హృదయాలలో రోగముందా? లేక వారు సందేహంలో పడి పోయారా? లేక అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు తమకు న్యాయం చేయరని వారికి భయమా? అలా కాదు! అసలు వారే అన్యాయపరులు.
Nur 24:51
కాని వాస్తవానికి ఒకవేళ విశ్వాసులను, వారి మధ్య తీర్పు చేయటానికి అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని వద్దకు పిలిచినప్పుడు, వారి పలుకులు కేవలం ఇలాగే ఉంటాయి: "మేము విన్నాము మరియు విధేయత చూపాము" మరియు ఇలాంటి వారే సాఫల్యం పొందేవారు.
Nur 24:52
మరియు అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి విధేయత చూపేవారు మరియు అల్లాహ్ కు భయపడి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారు, ఇలాంటి వారే సాఫల్యం (విజయం) పొందేవారు.
Nur 24:53
మరియు నీవు ఒకవేళ ఆజ్ఞాపిస్తే, అంతా వదలి తప్పక బయలుదేర గలమని వారు (ఆ కపట విశ్వాసులు) అల్లాహ్ పేరుతో గట్టి ప్రమాణాలు చేస్తారు. వారితో అను: "ప్రమాణాలు చేయకండి; మీ విధేయత తెలిసిందే. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు!"
Nur 24:54
వారితో అను: "అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు సందేశహరుణ్ణి అనుసరించండి. కాని ఒకవేళ మీరు మరలిపోతే, అతనిపై (ప్రవక్తపై) విధించబడినదాని బాధ్యత అతనిది[1]; మరియు మీపై విధించబడినదాని బాధ్యత మీది[2]. మీరు అతనిని (ప్రవక్తను) అనుసరిస్తే మార్గదర్శకత్వం పొందుతారు. మరియు సందేశహరుని బాధ్యత కేవలం స్పష్టంగా సందేశాన్ని అందజేయటం మాత్రమే[3]."
———
[1] చూడండి అంటే, ద'అవహ్ (తబ్లీగ్) చేయటం - ఇస్లాం వైపుకు ఆహ్వానించటం.
[2] అతని ('స'అస) ఆహ్వానాన్ని అంగీకరించి అల్లాహ్ (సు.తా.) మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించటం మరియు వారికి విధేయులవటం.
[3] చూడండి, 13:40.
Nur 24:55
మరియు మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారితో: వారికి పూర్వం వారిని భూమికి ఉత్తరాధికారులుగా చేసినట్లు, వారిని కూడా ఉత్తరాధికారులుగా చేస్తానని; మరియు వారి కొరకు తాను సమ్మతించిన ధర్మాన్ని (ఇస్లాంను) స్థిరపరుస్తానని; మరియు వారి పూర్వపు భయస్థితిని వారి కొరకు శాంతిస్థితిగా మార్చుతానని, అల్లాహ్ వాగ్దానం చేశాడు[1]. (ఇదంతా) వారు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించాలని మరియు నాకు ఎవరినీ సాటిగా (భాగస్వాములగా) కల్పించరాదని, మరియు దీని తరువాత కూడా ఎవరైనా సత్యతిరస్కారానికి పాల్పబడితే అలాంటి వారు, వారే అవిధేయులు.
———
[1] చూడండి, 5:3.
Nur 24:56
మరియు మీరు కరుణించబడాలి అంటే నమాజ్ స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు సందేశహరునికి విధేయులై ఉండండి!
Nur 24:57
సత్యతిరస్కారులు భూమిలో తప్పించుకుంటారని భావించవద్దు. వారి నివాసం నరకాగ్నియే! అది ఎంత అధ్వాన్నమైన గమ్యస్థానం.
Nur 24:58
ఓ విశ్వాసులారా! మీ బానిసలు మరియు యుక్తవయస్సుకు చేరని మీ పిల్లలు, మూడు సమయాలలో అనుమతి తీసుకొనే మీ వద్దకు రావాలి. (అవి) ఉదయపు (ఫజ్ర్) నమాజ్ కు ముందు, మధ్యాహ్నం (జుహ్ర్) తరువాత - మీరు మీ వస్త్రాలు విడిచి ఉన్నప్పుడు - మరియు రాత్రి (ఇషా) నమాజ్ తరువాత. ఈ మూడు, మీ కొరకు ఏకాంత (పరదా) సమయాలు. వీటి తరువాత వారు మరియు మీరు ఒకరి వద్దకు మరొకరు వచ్చి పోతూ వుంటే, వారిపై గానీ, మీపై గానీ ఎలాంటి దోషం లేదు. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
Nur 24:59
మరియు మీ పిల్లలు యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు; వారి కంటే పెద్దవారు (ముందువారు) అనుమతి తీసుకున్నట్లు వారు కూడా అనుమతి తీసుకోవాలి. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
Nur 24:60
మరియు ఋతుస్రావం ఆగిపోయి, వివాహ ఉత్సాహంలేని స్త్రీలు - తమ సౌందర్యం బయట పడకుండా ఉండేటట్లుగా - తమపై వస్త్రాలను (దుప్పట్లను) తీసి వేస్తే, వారిపై దోషం లేదు. కాని వారు అట్లు చేయకుండా ఉండటమే వారికి ఉత్తమమైనది[1]. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
———
[1] చూడండి, 33:59.
Nur 24:61
అంధుని మీద నిందలేదు మరియు కుంటివాని మీద నిందలేదు మరియు రోగి మీద నిందలేదు మరియు మీ మీద కూడా నిందలేదు: ఒకవేళ మీరు మీ ఇండ్లలో లేదా మీ తండ్రితాతల ఇండ్లలో లేదా మీ తల్లి నాయనమ్మల ఇండ్లలో లేదా మీ సోదరుల ఇండ్లలో లేదా మీ సోదరీమణుల ఇండ్లలో లేదా పినతండ్రుల (తండ్రి సోదరుల) ఇండ్లలో లేదా మీ మేనత్తల (తండ్రిసోదరీమణుల) ఇండ్లలో లేదా మీ మేనమామల (తల్లి సోదరుల) ఇండ్లలో లేదా మీ పిన్నమ్మల (తల్లి సోదరీమణుల) ఇండ్లలో లేదా మీ ఆధీనంలో తాళపు చెవులు ఉన్నవారి ఇండ్లలో లేదా మీ స్నేహితుల ఇండ్లలో తింటే! మీరు అందరితో కలిసి తిన్నా లేదా వేరుగా తిన్నా కూడా మీపై నింద లేదు. అయితే మీరు ఇండ్లలోనికి ప్రవేశించినపుడు, మీరు ఒకరి కొకరు సలాం చేసుకోవాలి. ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన దీవెన, శుభప్రదమైనది మేలైనది. ఈ విధంగా, అల్లాహ్ - మీరు అర్థం చేసుకుంటారని - తన ఆజ్ఞలను మీకు విశదీకరిస్తున్నాడు.
Nur 24:62
అల్లాహ్ ను ఆయన ప్రవక్తను హృదయపూర్వకంగా విశ్వసించిన వారే నిజమైన విశ్వాసులు మరియు వారు ఏదైనా సామూహిక కార్యం నిమిత్తం అతనితో (దైవప్రవక్తతో) ఉన్నప్పుడు, అతని అనుమతి లేనిదే వెళ్ళిపోకూడదు. నిశ్చయంగా, ఎవరైతే నీతో (ఓ ముహమ్మద్!) అనుమతి అడుగుతారో అలాంటి వారే వాస్తవంగా! అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించిన వారు. కనుక వారు తమ ఏ పని కొరకైనా అనుమతి అడిగితే, వారిలో నీవు కోరిన వారికి అనుమతినివ్వు. మరియు వారిని క్షమించమని అల్లాహ్ ను ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Nur 24:63
(ఓ విశ్వాసులారా!) సందేశహరుని పిలుపును మీరు, మీలో ఒకరి నొకరు పిలుచుకునే పిలుపుగా భావించకండి. మీలో ఒకరి చాటున ఒకరు దాక్కుంటూ మెల్లగా జారిపోయే వారిని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు[1]. దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించే వారు, తాము ఏదైనా ఆపదలో చిక్కుకు పోతారేమోననీ లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడాలి.
———
[1] మునాఫిఖులు దైవప్రవక్తతో సమాలోచనలు జరిగేటప్పుడు మెల్లగా జారుకునేవారు.
Nur 24:64
వినండి! నిశ్చయంగా, ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్తమూ అల్లాహ్ దే! మీ స్థితి ఆయనకు బాగా తెలుసు మరియు అందరూ ఆయన వద్దకు మరలింపబడిన రోజు వారు చేసి వచ్చిన కర్మలన్నీ ఆయన వారికి తెలియజేస్తాడు. మరియు అల్లాహ్ కు ప్రతి దానిని గురించి పూర్తి జ్ఞానముంది.
Furkan 25:1
సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా, ఈ గీటురాయిని (ఫుర్ఖాన్ ను) తన దాసునిపై క్రమక్రమంగా అవతరింపజేసిన ఆయన (అల్లాహ్) ఎంతో శుభదాయకుడు![1]
———
[1] దీనితో తెలిసేదేమిటంటే ఈ ఖుర్ఆన్ - ఏదైతే దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస)పై అవతరింప జేయబడిందో - సర్వలోకాల వారికి, అంటే మానవుల కొరకు మరియు జిన్నాతుల కొరకు గూడా మార్గదర్శినిగా అవతరింపజేయబడింది. కావున ము'హమ్మద్ ('స'అస) వారందరికీ సందేశహరుడు. అతను వారందరి కొరకు మార్గదర్శకునిగా పంపబడ్డారు. చూడండి 7:158. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "నేను ఎర్ర-నల్ల అందరి వైపుకూ సందేశహరునిగా పంపబడ్డాను కాని పూర్వపు ప్రవక్తలు ('అలైహిమ్ స.) ఒక్క జాతివారి వైపుకు మాత్రమే పంపబడేవారు." ('స'హీ'హ్ బు'ఖారీ).
Furkan 25:2
భూమ్యాకాశాల విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవ్వరినీ సంతానంగా చేసుకోలేదు[1]. విశ్వసామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి, దానికొక విధిని నిర్ణయించాడు[2].
———
[1] చూడండి, 17:111.
[2] చూడండి, 87:3. అల్లాహ్ (సు.తా.) ప్రతిదాని విధిని, అంటే దాని జీవన విధానం మరియు దాని మరణం, మొదలైనవి అన్నీ మొదటనే వ్రాసిపెట్టి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు గడిచిపోయింది మరియు ముందు జరగనున్నది అంతా తెలుసు.
Furkan 25:3
అయినా వారు ఆయనకు బదులుగా ఏమీ సృష్టించలేని మరియు తామే సృష్టింపబడిన వారిని ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. మరియు వారు తమకు తాము ఎట్టి నష్టం గానీ, లాభం గానీ చేసుకోజాలరు. మరియు వారికి మరణం మీద గానీ, జీవితం మీద గానీ మరియు పునరుత్థాన దినం మీద గానీ, ఎలాంటి అధికారం లేదు.
Furkan 25:4
మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: "ఇది (ఈ ఖుర్ఆన్) కేవలం ఒక బూటక కల్పన; దీనిని ఇతనే కల్పించాడు. మరియు ఇతర జాతివారు కొందరు, ఇతనికి ఈ పనిలో సహాయపడ్డారు[1]. కాని వాస్తవానికి వారు అన్యాయానికి మరియు అబద్ధానికి పూనుకున్నారు."
———
[1] చూడండి, 16:103. దైవప్రవక్త ('స'అస) ఈ గ్రంథాన్ని, అబూ ఫకీహా యసార్, 'అదాస్ మరియు జబర్ మొదలైన యూద విద్వాంసుల నుండి నేర్చుకున్నారని సత్యతిరస్కారులు ఆరోపించారు.
Furkan 25:5
మరియు వారింకా ఇలా అంటారు: "ఇవి పూర్వీకుల గాథలు, వాటిని ఇతను వ్రాసుకున్నాడు, ఇవి ఇతనికి ఉదయం మరియు సాయంత్రం చెప్పి వ్రాయించబడుతున్నాయి[1]."
———
[1] సత్యతిరస్కారుల నుండి.
Furkan 25:6
వారితో ఇలా అను: "దీనిని (ఈ ఖుర్ఆన్ ను) భూమ్యాకాశాల రహస్యాలు తెలిసిన వాడు అవతరింపజేశాడు. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."
Furkan 25:7
మరియు వారిలా అంటారు: "ఇతను ఎటువంటి సందేశహరుడు, (సాధారణ వ్యక్తివలే) ఇతనూ అన్నం తింటున్నాడు మరియు వీధులలో తిరుగుతున్నాడు? (ఇతను వాస్తవంగానే దైవప్రవక్త అయితే) ఇతనికి తోడుగా హెచ్చరిక చేసేవాడిగా, ఒక దేవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు?[1]"
———
[1] సత్యతిరస్కారులు మొదట ఖుర్ఆన్ ను అసత్యమని తిరస్కరించారు. దానిని పూర్వికుల కట్టుకథ అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త ('స'అస) ను ఒక సాధారణ వ్యక్తి ఎలా దైవప్రవక్త కాగలడు, ఇతడు ఒక మాంత్రికుడు లేదా మంత్రజాలానికి గురి అయినవాడు లేదా ఇతరుల నుండి పూర్వ గాథలను నేర్చుకొని మాకు వినిపిస్తున్నాడు, అన్నారు. వాస్తవమేమిటంటే అతను ('స'అస) నిరక్షరాస్యుడు మరియు ఆయన చెప్పే గాథలు పూర్వ గ్రంథ ప్రజల గాథల కంటే భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే వారి గాథలు, పూర్వ ప్రవక్తలు తెచ్చిన నిజ గ్రంథాల నుండి గాక తరువాత తరాల వారు వ్రాసి పెట్టినవి. వారు తమ గ్రంథాలలో ఎన్నో మార్పులు తెచ్చారు. ఖుర్ఆన్ అయితే అల్లాహ్ తరఫు నుండి వచ్చింది మరియు 1400ల సంత్సరాలలో దానిలో ఒక్క అక్షరపు మార్పు కూడా రాలేదు. ఈ విషయాన్ని సత్యతిరస్కారులు కూడా ధృవీకరిస్తునారు.
Furkan 25:8
లేదా ఇతనికొక నిధి ఎందుకు ఇవ్వబడలేదు? లేదా ఇతనికొక తోట ఎందుకు ఇవ్వబడలేదు? ఇతను దాని నుండి తినటానికి!" ఆ దుర్మార్గులు ఇంకా ఇలా అంటారు :"మీరు కేవలం ఒక మంత్రజాలానికి గురి అయిన మానవుణ్ణి అనుసరిస్తున్నారు."
Furkan 25:9
(ఓ ప్రవక్తా!) చూడు వారు నిన్ను గురించి ఎటువంటి ఉదాహరణలు ఇస్తున్నారు? వారు మార్గభ్రష్టులై పోయారు, వారు ఋజుమార్గం పొందజాలరు.
Furkan 25:10
ఆ శుభదాయకుడు కోరితే నీకు వాటి కంటే ఉత్తమమైన వాటిని ప్రసాదించగలడు - స్వర్గవనాలు - వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి మరియు అక్కడ నీ కొరకు పెద్ద కోటలు కూడా ఉంటాయి.
Furkan 25:11
వాస్తవానికి వారు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించారు. మరియు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించే వారి కొరకు మేము జ్వలించే నరకాగ్నిని సిద్ధపరచి ఉంచాము.
Furkan 25:12
అది, దూరం నుండి వారిని చూసినప్పుడు వారు దాని ఆవేశ ధ్వనులను మరియు దాని బుసను వింటారు[1].
———
[1] చూడండి, 67:8.
Furkan 25:13
మరియు దానిలోని ఒక ఇరుకైన స్థలంలో, వారు బంధింపబడి, త్రోయబడినప్పుడు వారక్కడ తమ చావును పిలువడం ప్రారంభిస్తారు[1].
———
[1] చూడండి, 14:49.
Furkan 25:14
వారితో అనబడుతుంది: "ఈ రోజు మీరు ఒక్క చావును పిలువకండి, ఎన్నో చావుల కొరకు అరవండి!"
Furkan 25:15
వారితో అను: "ఏమీ? ఇది మంచిదా, లేతా దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన శాశ్వతమైన స్వర్గమా? అదే (దైవభీతి గల) వారి ప్రతిఫలం మరియు గమ్యస్థానం.
Furkan 25:16
అందులో వారికి వారు కోరింది లభిస్తుంది. వారందు శాశ్వతంగా వుంటారు. ఇది నీ ప్రభువు కర్తవ్యంతో పూర్తి చేయవలసిన వాగ్దానం.
Furkan 25:17
మరియు ఆయన (అల్లాహ్) వారిని (సత్యతిరస్కారులను) మరియు అల్లాహ్ కు బదులుగా వారు ఆరాధించేవారిని, అందరినీ, ఆ రోజు సమావేశపరచి వారితో ఇలా అంటాడు: " ఏమీ? మీరేనా నా దాసులను మార్గం తప్పించిన వారు? లేక స్వయంగా వారే మార్గభ్రష్టులయ్యారా?"
Furkan 25:18
వారంటారు: "ఓ మా ప్రభూ! నీవు సర్వలోపాలకు అతీతుడవు! మేము నిన్ను వదలి ఇతరులను మా సంరక్షకులుగా చేసుకోవటం మాకు తగినది కాదు, కాని నీవు వారికి మరియు వారి తండ్రితాతలకు చాలా సుఖసంతోషాలను ప్రసాదించావు, చివరకు వారు నీ బోధననే మరచి పోయి నాశనానికి గురి అయిన వారయ్యారు."
Furkan 25:19
(అప్పుడు అల్లాహ్ అంటాడు): "కాని ఇప్పడైతే వారు, మీ మాటలను అసత్యాలని తిరస్కరిస్తున్నారు. ఇక మీరు మీ శిక్ష నుండి తప్పించుకోలేరు మరియు ఎలాంటి సహాయమూ పొందలేరు. మరియు మీలో దుర్మార్గానికి పాల్పడిన వానికి మేము ఘోరశిక్ష రుచి చూపుతాము!"
Furkan 25:20
మరియు (ఓ ముహమ్మద్!) మేము నీకు పూర్వం పంపిన సందేశహరులు అందరూ నిశ్చయంగా, ఆహారం తినేవారే, వీధులలో సంచరించేవారే. మరియు మేము మిమ్మల్ని ఒకరిని మరొకరి కొరకు పరీక్షా సాధనాలుగా చేశాము; ఏమీ? మీరు[1] సహనం వహిస్తారా? మరియు వాస్తవానికి, నీ ప్రభువు సర్వం చూసేవాడు[2].
———
[1] మీరు అంటే విశ్వాసులు.
[2] చూడండి, 6:124.
Furkan 25:21
మరియు మమ్మల్ని కలుసుకోవలసి ఉందని ఆశించనివారు ఇలా అన్నారు: "దేవదూతలు మా వద్దకు ఎందుకు పంపబడలేదు? లేదా మేము మా ప్రభువును ఎందుకు చూడలేము?" వాస్తవానికి, వారు తమను తాము చాలా గొప్పవారిగా భావించారు మరియు వారు తలబిరుసుతనంలో చాలా మితిమీరి పోయారు[1].
———
[1] అల్లాహ్ (సు.తా.), అగోచరాన్ని విశ్వసించే విషయంలో మానవులను పరీక్షిస్తున్నాడు. ఒకవేళ వారి ముందుకు దైవదూతలు లేక అల్లాహ్ (సు.తా.) స్వయంగా వచ్చి ప్రతి ఒక్కరితో తనను విశ్వసించండి అని చెప్పితే! ఈ పరీక్ష అవసరమే ఉండేది కాదు. అల్లాహ్ (సు.తా.) మానవుల ఇచ్ఛ ప్రకారం కాక తన ఇష్టప్రకారం ప్రవర్తిస్తాడు.
Furkan 25:22
ఆ రోజు[1] వారు దేవదూతలను చూస్తారు; ఆరోజు అపరాధులకు ఎలాంటి శుభవార్తలు ఉండవు మరియు వారు (దేవదూతలు) ఇలా అంటారు: "మీకు శుభవార్తలన్నీ ఖచ్చితంగా నిషేధించబడ్డాయి."
———
[1] ఆ రోజు అంటే, మరణదినం కానీ లేక పునరుత్థానదినం కానీ కావచ్చు (ఇబ్నె-కసీ'ర్). ఆ రోజు సత్యతిరస్కారుల పరిస్థితికి చూడండి, 8:50. విశ్వాసుల పరిస్థితికి చూడండి, 41:30-32.
Furkan 25:23
మరియు మేము, వారు (అవిశ్వాసులు) చేసిన కార్యాల వైపుకు మరలుతాము, తరువాత వాటిని సూక్ష్మకణాల వలే (ధూళి వలే) ఎగురవేస్తాము[1].
———
[1] హబాఅన్': అంటే చిన్న సందులోనుండి ఇంటిలోకి వచ్చే సూర్య కిరణాలలో కనబడే సూక్ష్మకణాలు. వాటిని చేతితో పట్టుకోవటం అసాధ్యం. సత్యతిరస్కారుల కర్మలు, ఇక్కడ సూక్ష్మ కణాలతో పోల్చబడ్డాయి. అవి ఇతర ఆయతులలో ఎండమావులతో, బూడిదతో లేక సున్నని బండతో పోల్చబడ్డాయి. చూడండి, 2:264, 14:18 మరియు 24:39.
Furkan 25:24
ఆ దినమున స్వర్గానికి అర్హులైన వారు మంచి నివాసంలో మరియు ఉత్తమ విశ్రాంతి స్థలంలో ఉంటారు.
Furkan 25:25
మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు ఆకాశం మేఘాలతో సహా బ్రద్దలు చేయబడుతుంది. మరియు దేవదూతలు వరుసగా దింపబడతారు[1].
———
[1] చూడండి, 22:10.
Furkan 25:26
ఆ రోజు వాస్తవమైన విశ్వ సామ్రాజ్యాధిపత్యం కేవలం ఆ అనంత కరుణామయునిదే! సత్యతిరస్కారులకు ఆ దినం ఎంతో కఠినమైనదిగా ఉంటుంది.
Furkan 25:27
మరియు (జ్ఞాపకముంచుకోండి), ఆ దినమున దుర్మార్గుడు తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: "అయ్యో! నేను సందేశహరుని మార్గం అనుసరిస్తే, ఎంత బాగుండేది!"
Furkan 25:28
"అయ్యో! నా దౌర్భాగ్యం! నేను ఫలానా వానిని స్నేహితునిగా చేసుకోకుండా వుంటే ఎంత బాగుండేది[1]!"
———
[1] దీనితో వ్యక్తమయ్యేది ఏమిటంటే మంచివారి సాంగత్యంలో మానవుడు మంచివాడౌతాడు, మరియు దుష్టుల సాంగత్యంలో దుష్టుడౌతాడు. (ముస్లిం).
Furkan 25:29
"వాస్తవానికి అతడే, హితబోధ (ఖుర్ఆన్) నా వద్దకు వచ్చిన తరువాత కూడా, నన్ను దాని నుండి తప్పించాడు! వాస్తవానికి షైతాన్ మానవుని యెడల నమ్మకద్రోహి[1]."
———
[1] చూడండి, 15:17 మరియు 14:22
Furkan 25:30
అప్పుడు సందేశహరుడు ఇలా అంటాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నా జాతివారు ఈ ఖుర్ఆన్ ను పూర్తిగా వదలి పెట్టారు[1]."
———
[1] హిజ్ రున్: ఆటంకపరచటం, నిషేధించటం, ఆపటం మొదలైనవి. ముష్రికులు ఖుర్ఆన్ వినిపించే టప్పుడు, గొడవ చేసేవారు ఇదే హిజ్ రున్. ఖుర్ఆన్ ను విశ్వసించకుండటం, దానిని అనుసరించ కుండటం, అది నిషేధించిన దానిని విడువకకుండటం మొదలైనవి కూడా ఈ అర్థంలోకి వస్తాయి.
Furkan 25:31
మరియు ఈ విధంగా మేము అపరాధుల నుండి ప్రతి ప్రవక్తకూ శత్రువులను నియమించాము[1]. మరియు నీ ప్రభువే, నీకు మార్గదర్శకుడిగా మరియు సహాయకుడిగా చాలు!
———
[1] ఇలాంటి ఆయత్ కు చూడండి, 6:112.
Furkan 25:32
మరియు సత్యతిరస్కారులు అంటారు: "ఇతని (ముహమ్మద్) మీద ఈ ఖుర్ఆన్ పూర్తిగా ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు?" మేము (ఈ ఖుర్ఆన్ ను) ఈ విధంగా (భాగాలుగా పంపింది) నీ హృదయాన్ని దృఢపరచడానికి మరియు మేము దీనిని క్రమక్రమంగా అవతరింపజేశాము[1].
———
[1] అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: 'మేము ఈ ఖుర్ఆన్ ను 23 సంవత్సరాలలో క్రమక్రమంగా అవతరింపజేశాము.' ఇంకా చూడండి, 17:106, 73:4.
Furkan 25:33
మరియు వారు నీ వద్దకు (నిన్ను వ్యతిరేకించటానికి) ఎలాంటి ఉపమానాన్ని తెచ్చినా! మేము నీకు దానికి సరైన జవాబు మరియు ఉత్తమమైన వ్యాఖ్యానం ఇవ్వకుండా ఉండము[1].
———
[1] సత్యతిరస్కారులు దైవప్రవక్త ('స'అస) ను వ్యతిరేకించటానికి, ఎలాంటి ఉపమానాలు తెచ్చినా వాటికి తగిన సమాధానాలు ఇవ్వటానికి మేము క్రమక్రమంగా ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము.
Furkan 25:34
ఎవరైతే, వారి ముఖాల మీద (బోర్లా పడవేయబడి) లాగుతూ నరకంలో కూడబెట్ట బడతారో, అలాంటి వారు ఎంతో దుస్థితిలో మరియు మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నవారు[1].
———
[1] అంటే సత్యతిరస్కారుడు ఎన్ని సత్కార్యాలు చేసినా అవి పరలోకంలో ఎండమావులుగా అదృశ్యమైపోతాయి. అంటే అతనికి వాటి నుండి ఎలాంటి పుణ్యఫలితం లభించదు. అతడు నరకంలో చేరిపోతాడు.
Furkan 25:35
మరియు నిశ్చయంగా, మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము మరియు అతని సోదరుడైన హారూన్ ను అతనికి సహాయకునిగా చేశాము[1].
———
[1] చూడండి, 20:29.
Furkan 25:36
వారిద్దరితో ఇలా అన్నాము: "మీరిద్దరూ మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన జాతి వారి వద్దకు వెళ్ళండి." తరువాత మేము (ఆ జాతి) వారిని పూర్తిగా నాశనం చేశాము.
Furkan 25:37
ఇక నూహ్ జాతి వారు: ఎప్పుడైతే వారు ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించారో, మేము వారిని ముంచి వేసి, సర్వజనులకు వారిని ఒక సూచనగా చేశాము. మరియు దుర్మార్గుల కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధ పరిచి ఉంచాము.
Furkan 25:38
మరియు ఇదే విధంగా ఆద్ మరియు సమూద్ మరియు అర్ రస్స్[1] ప్రజలు మరియు వారి మధ్య ఎన్నో తరాల వారిని[2] (నాశనం చేశాము).
———
[1] రస్సున్: అంటే బావి. ఇమామ్ ఇబ్నె-జరీర్ 'తబరీ: వీరే అ'స్హాబ్ అల్-ఉ'ఖ్దూద్ అని అన్నారు. చూడండి, 85:4 (ఇబ్నె-కసీ'ర్).
[2] ఖర్నున్: అంటే ఒక యుగానికి లేక ఒక తరానికి చెందిన ప్రజలు. ప్రతి ప్రవక్త సమాజాన్ని ఒక ఖర్న్ కు చెందినది అని అనవచ్చు. (ఇబ్నె-కసీ'ర్).
Furkan 25:39
మరియు వారిలో ప్రతి ఒక్కరినీ మేము దృష్టాంతాలను ఇచ్చి నచ్చజెప్పాము. చివరకు ప్రతి ఒక్కరినీ పూర్తిగా నిర్మూలించాము[1].
———
[1] చూడండి, 17:89.
Furkan 25:40
మరియు మేము దారుణమైన (రాళ్ళ) వర్షం కురిపించిన (లూత్) నగరం మీద నుండి వాస్తవానికి వారు (అవిశ్వాసులు) ప్రయాణం చేసి ఉంటారు. ఏమీ? వారు దానిని (దాని స్థితిని) చూడటం లేదా? వాస్తవానికి, వారు తిరిగి బ్రతికించి లేపబడతారని నమ్మలేదు[1].
———
[1] చూడండి, 11:82
Furkan 25:41
(ఓ ముహమ్మద్!) వారు నిన్ను చూసినప్పుడల్లా నిన్ను పరిహాసాలనికి గురి చేస్తూ ఇలా అంటారు: "ఏమీ? ఇతనినేనా, అల్లాహ్ తన సందేశహరునిగా చేసి పంపింది?
Furkan 25:42
మేము వాటి (మా దేవతల) పట్ల (దృఢవిశ్వాసం మీద) స్థిరంగా ఉండకపోతే, ఇతను మమ్మల్ని మా దేవతల నుండి తప్పించి దూరం చేసేవాడే!" మరియు త్వరలోనే వారు మా శిక్షను చూసినప్పుడు ఎవరు మార్గం తప్పి ఉన్నారో తెలుసుకుంటారు[1].
———
[1] చూడండి, 21:36.
Furkan 25:43
(ఓ ముహమ్మద్!) ఎవడు తన మనోవాంఛలను తనకు దైవంగా చేసుకొని ఉన్నాడో, అలాంటి వానిని నీవు చూశావా? నీవు అలాంటి వానికి రక్షకుడవు కాగలవా?
Furkan 25:44
లేక వారిలోని చాలా మంది వింటారని లేదా అర్థం చేసుకుంటారని నీవు భావిస్తున్నావా? అసలు వారు పశువుల వంటి వారు. అలా కాదు! వారు వాటి కంటే ఎక్కువ దాని తప్పిన వారు.
Furkan 25:45
ఏమీ? నీవు చూడటం లేదా? నీ ప్రభువు! ఏ విధంగా ఛాయను పొడిగిస్తాడో? ఒకవేళ ఆయన కోరితే, దానిని నిలిపివేసి ఉండేవాడు, కాని మేము సూర్యుణ్ణి దానికి మార్గదర్శిగా చేశాము.
Furkan 25:46
తరువాత మేము దానిని (ఆ నీడను) క్రమక్రమంగా మా వైపునకు లాక్కుంటాము.
Furkan 25:47
మరియు ఆయన (అల్లాహ్) యే మీ కొరకు రాత్రిని వస్త్రంగానూ (తెరగానూ), నిద్రను విశ్రాంతి స్థితిగానూ మరియు పగటిని తిరిగి బ్రతికించి లేపబడే (జీవనోపాధి) సమయంగానూ చేశాడు.
Furkan 25:48
మరియు ఆయన (అల్లాహ్) యే తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలుగా పంపేవాడు మరియు మేమే ఆకాశం నుండి నిర్మలమైన నీటిని కురిపించే వారము.
Furkan 25:49
దాని ద్వారా ఒక మృత ప్రదేశానికి ప్రాణం పోయటానికి మరియు దానిని మేము సృష్టించిన ఎన్నో పశువులకు మరియు మానవులకు త్రాగటానికి!
Furkan 25:50
మరియు వాస్తవానికి, మేము దానిని (నీటిని) వారి మధ్య పంచాము, వారు (మా అనుగ్రహాన్ని) జ్ఞాపకముంచుకోవాలని; కానీ మానవులలో చాలా మంది దీనిని తిరస్కరించి, కృతఘ్నులవుతున్నారు.
Furkan 25:51
మరియు మేము తలుచుకుంటే, ప్రతి నగరానికొక హెచ్చరిక చేసేవానిని (ప్రవక్తను) పంపి ఉండేవారము.
Furkan 25:52
కావున నీవు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారుల అభిప్రాయాన్ని లక్ష్యపెట్టకు మరియు దీని (ఈ ఖుర్ఆన్) సహాయంతో, (వారికి హితబోధ చేయటానికి) గట్టిగా పాటుపడు.
Furkan 25:53
మరియు రెండు సముద్రాలను కలిపి ఉంచిన వాడు ఆయనే! ఒకటేమో రుచికరమైనది, దాహం తీర్చునది, మరొకటేమో ఉప్పగనూ, చేదుగనూ ఉన్నది మరియు ఆయన ఆ రెండింటి మధ్య ఒక అడ్డుతెరను - అవి కలిసి పోకుండా - అవరోధంగా ఏర్పరచాడు[1].
———
[1] బావుల, నదుల, సరోవరాల మరియు సముద్రాల నీరు.
Furkan 25:54
మరియు ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు[1]. తరువాత అతనికి తన వంశ బంధుత్వాన్ని మరియు వివాహ బంధుత్వాన్ని ఏర్పరచాడు. మరియు వాస్తవానికి నీ ప్రభువు (ప్రతిదీ చేయగల) సమర్ధుడు.
———
[1] చూడండి, 21:30 మరియు 24:45.
Furkan 25:55
మరియు వారు అల్లాహ్ ను వదలి తమకు లాభం గానీ, నష్టం గానీ, చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు. మరియు సత్యతిరస్కారుడు తన ప్రభువుకు విరుద్ధంగా, (షైతానుకు తోడుగా) ఉంటాడు.
Furkan 25:56
మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను ఒక శుభవార్తాహరునిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము.
Furkan 25:57
కావున నీవు వారితో అను: "దీనికై (ఈ ప్రచారానికై) మీతో ఎలాంటి ప్రతిఫలము నడగటం లేదు. కేవలం, తాను కోరిన వ్యక్తియే తన ప్రభువు మార్గాన్ని అవలంబించవచ్చు!"
Furkan 25:58
కావున ఎన్నడూ మరణించని, ఆ సజీవుని (నిత్యుని) పైననే ఆధారపడి ఉండు మరియు ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. తన దాసుల పాపాలను ఎరుగుటకు ఆయనే చాలు.
Furkan 25:59
ఆయనే ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించి, తరువాత తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు[1]. ఆయన అనంత కరుణా మయుడు, ఆయన ఘనతను గురించి ఎరిగిన వాడిని అడుగు.
———
[1] చూడండి, 7:54, 9:129, 10:9, 13:2.
Furkan 25:60
మరియు వారితో: "ఆ కరుణామయునికి సాష్టాంగం (సజ్దా) చేయండి." అని అన్నప్పుడల్లా, వారంటారు: "ఆ కరుణామయుడెవడు? మీరు ఆజ్ఞాపించిన వానికి మేము సాష్టాంగం (సజ్దా) చేయాలా?" మరియు అది (నీ పిలుపు) వారి వ్యతిరేకతను మరింత అధికమే చేసింది[1].
———
[1] 'హుదైబియహ్ ఒప్పందాన్ని: 'బిస్మిల్లా హిర్ర'హ్మా నిర్ర'హీమ్' తో, వ్రాయటం మొదలు పెడ్తే దానికి ముష్రిక్ ఖురైషీ రాయబారి అయఇన సుహైల్ బిన్ అమ్ర్ మేము ర'హ్మాన్, ర'హీంలను ఎరుగము: 'బి ఇస్మిక అల్లాహుమ్మ.' అని మొదలు పెట్టండన్నారు. (సీరత్ ఇబ్నె'హిషామ్). చూడండి 17:110, 13:30.
Furkan 25:61
ఆకాశంలో నక్షత్రరాసులను (బురూజులను)[1] నిర్మించి అందులో ఒక (ప్రకాశించే) సూర్యుణ్ణి[2] మరియు వెలుగునిచ్చే (ప్రతిబింబింప జేసే) చంద్రుణ్ణి నియమించిన ఆయన (అల్లాహ్) శుభదాయకుడు.
———
[1] బురూజున్: మొట్టమొదటి వ్యాఖ్యాతలు బురూజున్, అంటే పెద్ద పెద్ద నక్షత్ర సముదాయాలన్నారు. తరువాత కాలపు వ్యాఖ్యాతలు పన్నెండు నక్షత్రరాసులు (సముదాయాలు) - మేషం, వృషభం, మిథునం, కర్కాట్కం, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం - అనేవి అన్నారు. (అయ్ సర్ అత్తఫాసీర్) ఇంకా చూడండి, 15:16.
[2] చూడండి, 10:5, ప్రకాశించే సూర్యుడు. సూర్యుని వెలుగును ప్రతిబింపజేసే చంద్రుడు.
Furkan 25:62
మరియు ఆయనే, రేయింబవళ్ళను ఒకదాని వెంట ఒకటి అనుక్రమంగా వచ్చేటట్లు చేసేవాడు, ఇవన్నీ గమనించ గోరిన వారి కొరకు లేదా కృతజ్ఞత చూపగోరిన వారి కొరకు ఉన్నాయి.
Furkan 25:63
మరియు వారే, అనంత కరుణామయుని దాసులు, ఎవరైతే భూమి మీద నమ్రతతో నడుస్తారో! మరియు మూర్ఖులు వారిని పలుకరించి నప్పుడు: "మీకు సలాం!"[1] అని అంటారో!
———
[1] చూడండి, 28:55, 43:89.
Furkan 25:64
మరియు ఎవరైతే, తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ మరియు (నమాజ్ లో) నిలబడుతూ రాత్రులు గడుపుతారో!
Furkan 25:65
మరియు ఎవరైతే: "ఓ మా ప్రభూ! మా నుండి నరకపు శిక్షను తొలగించు. నిశ్చయంగా, దాని శిక్ష ఎడతెగని పీడన" అని అంటారో![1]
———
[1] చూవారే అనంతకరుణామయునికి ప్రియులైనవారు ఎవరైతే నమా'జ్ చేస్తారో, విధిదానం ('జకాత్) ఇస్తారో, సత్కార్యాలు చేస్తారో మరియు తమ ప్రభువును రేయింబవళ్ళు నరకపు శిక్ష నుండి తొలగించమని ప్రార్థిస్తారో! అంటే అల్లాహ్ (సు.తా.) ఆరాధన చేస్తూ ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తూ ఉండి కూడా, దానికై గర్వితులు కారో మరియు సదా తమ ప్రభువు శిక్ష నుండి భీతిపరులై ఉంటారో, అలాంటి వారు! ఇంకా చూడండి, 23:60.
Furkan 25:66
నిశ్చయంగా, అది అతి చెడ్డ ఆశ్రయం మరియు నివాస స్థలం.
Furkan 25:67
మరియు ఎవరైతే ఖర్చు చేసేటప్పుడు అనవసర ఖర్చు గానీ లేక లోభత్వం గానీ చేయకుండా, ఈ రెండింటి మధ్య మితంగా ఉంటారో;
Furkan 25:68
మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో[1]! మరియు వ్యభిచారానికి పాల్పబడరో[2]. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.
———
[1] న్యాయానికి చంపే పరిస్థితులు మూడు: 1) ఇస్లాం స్వీకరించిన తరువాత మరల సత్యతిరస్కారి అవటం, 2) పెండ్లి అయినవాడు వ్యభిచారం చేయటం, 3) ఎవరినైనా చంపటం.
[2] ఒకడు దైవప్రవక్త ('స'అస)తో ప్రశ్నించాడు: 'అన్నింటి కంటే మహాపాపం ఏమిటీ?' అతను ('స'అస) జవాబిచ్చారు: 'అల్లాహ్ (సు.తా.)కు ఎవరినైనా సాటికల్పించటం (షిర్క్). ఎందుకంటే ఆయనయే నిన్ను సృష్టించాడు.' అతనన్నాడు: 'దాని తరువాత ఏ పాపం పెద్దది?' దైవప్రవక్త ('స'అస) అన్నారు: 'తన సంతానాన్ని జీవనోపాధికి భయపడి చంపటం.' అతడు మళ్ళీ అడిగాడు, ఆ తరువాత అతను జవాబిచ్చారు: 'తన పొరుగు వాని భార్యతో వ్యభిచారం చేయటం!' ఆ తరువాత దైవప్రవక్త ('స'అస) అన్నారు: 'ఈ మూడు విషయాలు ఈ ఆయత్ తో విశదీకరించబడుతున్నాయి.' ఆని ఈ ఆయత్ ను చదివారు. ('స. బు'ఖారీ, ముస్లిం).
Furkan 25:69
పునరుత్థాన దినం నాడు, అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు.
Furkan 25:70
కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు[1]. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
———
[1] చూడండి, 21:30 మరియు 24:45.
Furkan 25:71
మరియు ఎవడైతే, పశ్చాత్తాప పడి సత్కార్యాలు చేస్తాడో! నిశ్చయంగా అలాంటి వాడు హృదయపూర్వకంగా అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలుతాడు!
Furkan 25:72
మరియు ఎవరైతే, అబద్ధమైన సాక్ష్యం ఇవ్వరో! మరియు వ్యర్థమైన పనుల వైపు నుండి పోవటం జరిగితే, సంస్కారవంతులుగా అక్కడి నుండి దాటిపోతారో[1]!
———
[1] ల'గ్వున్: అంటే ఆ పని దేనికైతే షరీయత్లో ఎలాంటి స్థానం లేదో! ఇటువంటి చేష్టలు మరియు మాటలు జరిగేటప్పుడు, వారు అక్కడి నుండి మెల్లగా దాటిపోతారు.
Furkan 25:73
మరియు ఎవరైతే, తమ ప్రభువు సూచనల (ఆయాత్ ల) హితబోధ చేసినపుడు, వారు దానికి చెవిటివారిగా మరియు గ్రుడ్డివారిగా ఉండిపోరో!
Furkan 25:74
మరియు ఎవరైతే, ఇలా ప్రార్థిస్తారో: "ఓ మా ప్రభూ! మా సహవాసుల (అజ్వాజ్ ల) మరియు సంతానం ద్వారా మా కన్నులకు చల్లదనం ప్రసాదించు. మరియు మమ్మల్ని దైవభీతి గలవారికి నాయకులుగా (ఇమాములుగా) చేయి."
Furkan 25:75
ఇలాంటి వారే తమ సహనశీలతకు ప్రతిఫలంగా (స్వర్గంలో) ఉన్నత స్థానాన్ని పొందేవారు. అక్కడ వారికి గౌరవమైన స్వాగతం మరియు శాంతి లభిస్తాయి.
Furkan 25:76
వారందు శాశ్వతంగా ఉంటారు. అది ఎంత మంచి నివాసం మరియు ఎంత మంచి స్థలం.
Furkan 25:77
(ఓ ముహమ్మద్! అవిశ్వాసులతో) ఇలా అను: "మీరు ఆయనను ప్రార్థిస్తున్నారు కాబట్టి నా ప్రభువు మిమ్మల్ని అలక్ష్యం చేయడం లేదు[1]. కాని వాస్తవానికి, ఇప్పుడు మీరు (ఆయనను) తిరస్కరించారు. కావున త్వరలోనే ఆయన శిక్ష మీపై అనివార్యమవుతుంది."
———
[1] అల్లాహ్ (సు.తా.) యందు భయభక్తులు కలిగివుండి కేవలం ఆయననే ఆరాధించే వారిని ఆయన (సు.తా.) లక్ష్యం చేస్తాడు. అల్లాహ్ (సు.తా.) ను తిరస్కరించిన వారికీ మరియు ఆయనకు సాటికల్పించిన వారికీ నరక శిక్ష తప్పదు.
Şuara 26:1
తా - సీన్ - మీమ్[1].
———
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
Şuara 26:2
ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయతులు)
Şuara 26:3
(ఓ ముహమ్మద్) వారు విశ్వసించలేదనే బాధతో బహుశా నీవు నీ ప్రాణాలే కోల్పోతావేమో![1]
———
[1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 18:6.
Şuara 26:4
మేము కోరితే ఆకాశం నుండి వారిపై ఒక అద్భుత సంకేతాన్ని (ఆయత్ ను) అవతరింపజేసి, దానికి వారి మెడలను నమ్రతతో వంగి పోయేలా చేసేవారము.
Şuara 26:5
మరియు వారి వద్దకు అనంత కరుణామయుడని వద్ద నుండి క్రొత్త సందేశం వచ్చినప్పుడల్లా, వారు దాని నుండి విముఖులు కాకుండా ఉండలేదు.
Şuara 26:6
వాస్తవానికి, ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చిన దాని యథార్థమేమిటో వారికి తెలిసిపోతుంది.[1]
———
[1] చూడండి, 6:4-5.
Şuara 26:7
ఏమీ? వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవరాసుల్ని)[1] పుట్టించామో?
———
[1] 'జౌజున్: అంటే ఇక్కడ వివిధరకాలు అని అర్థం.
Şuara 26:8
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.
Şuara 26:9
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
Şuara 26:10
మరియు నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించిన విషయాన్ని వారికి జ్ఞాపకం చేయించు: "దుర్మార్గులైన జాతి ప్రజల వద్దకు వెళ్ళు;[1]
———
[1] మూసా ('అ.స.) తన పరివారంతో సహా తిరిగి ఈజిప్టుకు వస్తున్నప్పుడు అతనికి ఒక వెలుగు కనిపిస్తుంది. అతను దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఆదేశం వస్తుంది.
Şuara 26:11
ఫిర్ఔన్ జాతివారి వద్దకు. ఏమీ? వారికి దైవభీతి లేదా?"
Şuara 26:12
(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను.[1]
———
[1] దీనితో తెలిసేదేమిటంటే సాధారణ మానవుల వలె, దైవప్రవక్తలకు కూడా సహజమైన భయం కలగవచ్చు.
Şuara 26:13
నా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది[1], కావున నీవు హారూన్ వద్దకు కూడా (వహీ) పంపు.
———
[1] దీనికి కారణం అతని నాలుకలో ఉన్న ముడి ('ఉఖ్ దతున్) చూడండి, 20:25-34.
Şuara 26:14
మరియు వారి దగ్గర నా మీద ఒక నేరం మోపబడి ఉన్నది[1], కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను."
———
[1] ఇది మూసా ('అ.స.) ఈజిప్టు నుండి వెళ్ళకముందు అనుకోకుండా జరిగిన సంఘటన. ఒక ఫిర్'ఔన్ జాతివాడు, ఒక ఇస్రాయీ'ల్ జాతివానితో కలహిస్తూ ఉండగా - ఇస్రాయీ'లు వాని పిలుపు విని - మూసా ('అ.స.) అతనికి సహాయపడటానికి, ఫిర్'ఔన్ జాతి వానిని ఒక దెబ్బ కొట్టడం వల్ల, అతడు మరణిస్తాడు. ఆ నేరానికి వారు అతనిని చంపగోరుతారు. (వివరాలకు చూడండి, 28:15).
Şuara 26:15
(అల్లాహ్) సెలవిచ్చాడు: "అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతో పాటు ఉండి సర్వమూ వింటూ ఉంటాము[1].
———
[1] 'మీతోపాటు ఉండి.' అంటే అల్లాహ్ (సు.తా.) నేలపైకి ప్రతి మానవుని దగ్గరికి రాడు. ఆయన జ్ఞానం ప్రతి ఒక్కరితో ఉంటుంది. కాని అల్లాహ్ (సు.తా.) 'అర్ష్ పైననే కూర్చుని ఉంటాడు. అంటే విశ్వంలో జరిగేది ఏది కూడా అల్లాహ్ (సు.తా.)కు తెలియకుండా లేదు.
Şuara 26:16
కావున మీరిద్దరూ ఫిరఔన్ వద్దకు వెళ్ళి అనండి: "నిశ్చయంగా, మేము సర్వలోకాల పోషకుని సందేశహరులము.
Şuara 26:17
కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు[1]."
———
[1] ఎందుకంటే నీవు నాలుగువందల సంవత్సరాలు వారిని బానిసలుగా చేసి ఉంచావు. ఇప్పుడు వారికి స్వేచ్ఛనివ్వు. నేను వారిని బైతుల్ మఖ్దిస్ వైపునకు తీసుకొని పోతాను.
Şuara 26:18
(ఫిర్ఔన్) అన్నాడు: "ఏమీ? మేము నిన్ను బాల్యంలో మాతో పాటు పోషించలేదా? మరియు నీవు నీ వయస్సులోని అనేక సంవత్సరాలు మాతో పాటు గడిపావు కదా!
Şuara 26:19
అయినా నీవు హీనమైన ఆ పని చేశావు, కావున నీవు కృతఘ్నులలోని వాడవు!"[1]
———
[1] చూడండి, 28:4-22, హీనమైన పని అంటే ఒక ఫిర్'ఔన్ జాతి వానిని దెబ్బకొట్టి చంపింది.
Şuara 26:20
(మూసా) అన్నాడు: "నేను పొరపాటుగా ఆ పని చేశాను!
Şuara 26:21
ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు.[1]
———
[1] చూడండి, 28:15-16.
Şuara 26:22
ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా!"[1]
———
[1] చూడండి, 28:4-5.
Şuara 26:23
(ఫిర్ఆన్) అడిగాడు: "అయితే ఈ సర్వలోకాల ప్రభువు అంటే ఏమిటి?"[1]
———
[1] ఫిర్'ఔన్ తన దురహంకారంలో ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ఈజిప్టు వాసులందరికీ అతడు, తానే దైవమని చెప్పి, తన ఆరాధ్యం చేయించుకునేవాడు. చూడండి, 28:38.
Şuara 26:24
(మూసా) జవాబిచ్చాడు: "మీరు నమ్మేవారే అయితే! ఆయనే ఆకాశాలకూ మరియు భూమికీ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు!"
Şuara 26:25
(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న వారితో: "ఏమీ? మీరు వింటున్నారా?"[1] అని ప్రశ్నించాడు.
———
[1] నేను తప్ప మీకు మరొక ప్రభువు కూడా ఉన్నాడా ?
Şuara 26:26
(మూసా) అన్నాడు: "ఆయన (అల్లాహ్) మీ ప్రభువు మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కూడానూ!"
Şuara 26:27
(ఫిర్ఔన్) అన్నాడు: "మీ వద్దకు పంపబడిన మీ ఈ సందేశహరుడు నిశ్చయంగా పిచ్చివాడే!"
Şuara 26:28
(మూసా) అన్నాడు: "మీరు అర్థం చేసుకోగలిగితే! ఆయనే తూర్పూ పడమరలకూ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు[1]."
———
[1] చూడండి, 2:115.
Şuara 26:29
(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకుంటే నేను నిన్ను చెరసాలలో ఉన్నవారితో చేర్చుతాను."
Şuara 26:30
(మూసా) అన్నాడు: "ఏమీ? నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని (సత్యాన్ని) తీసుకువచ్చిన తరువాత కూడానా?"[1]
———
[1] చూడండి, 12:1.
Şuara 26:31
(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు సత్యవంతుడవే అయితే దానిని (ఆ అద్భుత సూచనను) చూపు!"
Şuara 26:32
అప్పుడు (మూసా) తన చేతి కర్రను పడవేయగానే, అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది[1].
———
[1] జాన్నున్ (27:10, 28:31) అంటే - చిన్న సర్పం. సు' 'అబానున్ (7:107) అంటే - పెద్ద సర్పం. 'హయ్యతున్ (20:20) అంటే - చిన్నదీ కావచ్చు పెద్దదీ కావచ్చు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
Şuara 26:33
తరువాత అతను (మూసా) తన చేతిని (చంక నుండి) వెలుపలికి తీయగానే, అది చూసేవారి యెదుట తెల్లగా ప్రకాశించసాగింది![1]
———
[1] చూడండి, 7:107, 20:22, 27:12, 28:38.
Şuara 26:34
(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న నాయకులతో అన్నాడు: "నిశ్చయంగా, ఇతనొక నేర్పు గల మాంత్రికుడు.
Şuara 26:35
ఇతను తన మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి తరుమ గోరుతున్నాడు, అయితే మీ సలహా ఏమిటి?"[1]
———
[1] చూడండి, 7:109-110)
Şuara 26:36
వారన్నారు: "అతనిని మరియు అతని సోదరుణ్ణి ఆపి ఉంచు మరియు (మంత్రగాళ్ళను) సమావేశ పరచటానికి అన్ని నగరాలకు వార్తాహరులను పంపు;
Şuara 26:37
వారు నీ వద్దకు నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి తెస్తారు."
Şuara 26:38
ఈ విధంగా ఒక నియమిత రోజున ఒక నియమిత ప్రదేశంలో మాంత్రికులంతా సమావేశ పరచబడ్డారు.[1]
———
[1] చూఇది అల్లాహ్ (సు.తా.) ఇచ్ఛయే! ప్రజలకు, మూసా ('అ.స.) సత్యుడని మరియు మాంత్రికులు చేసేదంతా బూటక కల్పనలని నిరూపించటానికి. చూడండి, 21:18.
Şuara 26:39
మరియు ప్రజలతో ఇలా ప్రశ్నించడం జరిగింది: "ఏమీ? మీరంతా సమావేశమయ్యారా?
Şuara 26:40
ఒకవేళ మాంత్రికులు గెలుపొందితే మనమంతా వారిని అనుసరించాలి కదా!"
Şuara 26:41
మాంత్రికులు వచ్చిన తరువాత ఫిర్ఔన్ తో అన్నారు: "మేము గెలుపొందితే నిశ్చయంగా మాకు బహుమాన ముంది కదా?"[1]
———
[1] చూడండి, 7:113.
Şuara 26:42
(ఫిర్ఔన్) అన్నాడు: "అవును! నిశ్చయంగా, అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరుతారు!"
Şuara 26:43
మూసా వారితో అన్నాడు: "మీరు విసర దలుచుకున్న దానిని విసరండి!"
Şuara 26:44
అప్పుడు వారు తమ త్రాళ్ళను మరియు తమ కర్రలను విసిరి ఇలా అన్నారు: "ఫిర్ఔన్ శక్తి సాక్షిగా! నిశ్చయంగా మేమే విజయం పొందుతాము[1]."
———
[1] చూడండి, 7:116 మరియు 20:66-67.
Şuara 26:45
ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగి వేసింది[1].
———
[1] చూడండి, 7:117.
Şuara 26:46
అప్పుడు ఆ మాంత్రికులు సజ్దాలో పడ్డారు.
Şuara 26:47
వారన్నారు: "మేము సర్వలోకాల ప్రభువును విశ్వసిస్తున్నాము,
Şuara 26:48
మూసా మరియు హారూన్ ల ప్రభువును."
Şuara 26:49
(ఫిర్ఔన్) అన్నాడు: "నేను మీకు అనుమతి ఇవ్వక ముందే మీరు ఇతనిని విశ్వసించారా?[1] నిశ్చయంగా, ఇతడే మీ గురువు, మీకు జాలవిద్యను నేర్పినవాడు. సరే! ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ వ్యతిరేక (ప్రతిపక్ష) దిశల చేతులను మరియు కాళ్ళను నరికిస్తాను మరియు మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను[2]."
———
[1] చూడండి, 7:123.
[2] చూడండి, 5:33 మరియు 7:124.
Şuara 26:50
(మాంత్రికులు) అన్నారు: "బాధ లేదు! నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది.
Şuara 26:51
నిశ్చయంగా, మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే వాస్తవానికి అందరి కంటే ముందుగా విశ్వసించిన వారం మేమే!"
Şuara 26:52
మరియు మేము మూసాకు ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "నీవు నా దాసులను రాత్రివేళ తీసుకొని వెళ్ళిపో నిశ్చయంగా, మీరు వెంబడించబడతారు[1]."
———
[1] చూడండి, 7:130.
Şuara 26:53
తరువాత ఫిర్ఔన్ అన్ని పట్టణాలకు వార్తాహరులను పంపాడు.
Şuara 26:54
(ఇలా ప్రకటన చేయించాడు): "వాస్తవానికి వీరు (ఈ ఇస్రాయీల్ సంతతి వారు) ఒక చిన్న తెగవారు మాత్రమే.
Şuara 26:55
మరియు నిశ్చయంగా, వారు మాకు చాలా కోపం తెప్పించారు;
Şuara 26:56
మరియు నిశ్చయంగా, మనం ఐకమత్యంతో ఉండి జాగరూకత చూపేవారము."
Şuara 26:57
కావున మేము వారిని, తోటల నుండి మరియు చెలమల నుండి వెళ్ళగొట్టాము;
Şuara 26:58
మరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా.
Şuara 26:59
ఈ విధంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని, వాటికి వారసులుగా చేశాము[1].
———
[1] చూడండి, 7:137.
Şuara 26:60
అప్పుడు (ఫిర్ఔన్ జాతి) వారు సూర్యోదయ కాలమున (ఇస్రాయీల్ సంతతి) వారిని వెంబడించారు.
Şuara 26:61
ఆ ఇరుపక్షాల వారు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు, మూసా అనుచరులు అన్నారు: "నిశ్చయంగా మేము చిక్కి పోయాము!"
Şuara 26:62
(మూసా అన్నాడు): "అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)[1]."
———
[1] అంటే అల్లాహ్ (సు.తా.) సహాయం నాతో ఉంది.
Şuara 26:63
అప్పుడు మేము మూసాకు: "నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది[1].
———
[1] చూడండి, 20:77.
Şuara 26:64
మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింప జేశాము.
Şuara 26:65
మరియు మూసాను మరియు అతనితో పాటు ఉన్నవారిని అందరినీ రక్షించాము.
Şuara 26:66
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము.
Şuara 26:67
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
Şuara 26:68
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిసంపన్నుడు, అపార కరుణా ప్రదాత.
Şuara 26:69
ఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు.
Şuara 26:70
అతను తన తండ్రితో మరియు తన జాతి వారితో: "మీరెవరిని ఆరాధిస్తున్నారు?" అని అడిగినపుడు;
Şuara 26:71
వారన్నారు: "మేము విగ్రహాలను ఆరాధిస్తున్నాము మరియు మేము వాటికే ఎల్లప్పుడు భక్తులమై ఉంటాము."
Şuara 26:72
(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా?
Şuara 26:73
లేదా, మీకేమైనా మేలు చేయగలవా? లేదా హాని చేయగలవా?"
Şuara 26:74
వారన్నారు: "అలా కాదు! మేము మా తండ్రితాతలను ఇలా చేస్తూ ఉండగా చూశాము."
Şuara 26:75
అతను అన్నాడు: "ఏమీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరెవరిని ఆరాధిస్తున్నారో?
Şuara 26:76
మీరు గానీ మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గానీ (ఆలోచించారా)?
Şuara 26:77
ఎందుకంటే! నిశ్చయంగా, ఇవన్నీ నా శత్రువులే! కేవలం ఆ సర్వలోకాల ప్రభువు తప్ప!
Şuara 26:78
ఆయనే నన్ను సృష్టించాడు. కాబట్టి ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు.
Şuara 26:79
ఆయనే నాకు తినిపించేవాడు మరియు త్రాగించేవాడు.
Şuara 26:80
మరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే, ఆయనే నాకు స్వస్థత నిచ్చేవాడు.
Şuara 26:81
మరియు ఆయనే నన్ను మరణింపజేసేవాడు, తరువాత మళ్ళీ బ్రతికింపజేసేవాడు.
Şuara 26:82
మరియు ఆయనే తీర్పుదినమున నా తప్పులను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాను.
Şuara 26:83
మరియు ఓ నా ఫ్రభూ! నాకు వివేకాన్ని ప్రసాదించు మరియు నన్ను సద్వర్తనులలో కలుపు.
Şuara 26:84
మరియు తరువాత వచ్చే తరాల వారిలో నాకు మంచి పేరును ప్రసాదించు[1].
———
[1] చూడండి, 19:50.
Şuara 26:85
మరియు సర్వసుఖాల స్వర్గానికి వారసులయ్యేవారిలో నన్ను చేర్చు.
Şuara 26:86
మరియు నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టులలోని వాడే![1]
———
[1] చూడండి, 19:47-48 మరియు 9:114.
Şuara 26:87
మరియు అందరూ తిరిగి బ్రతికింపబడే రోజు నన్ను అవమానం పాల చేయకు.
Şuara 26:88
ఏ రోజునైతే ధనసంపత్తులు గానీ, సంతానం గానీ పనికిరావో!
Şuara 26:89
కేవలం నిర్మలమైన హృదయంతో అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు తప్ప!"
Şuara 26:90
మరియు (ఆ రోజు) స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకు రాబడుతుంది.
Şuara 26:91
మరియు నరకం మార్గం తప్పిన వారి ముందు పెట్టబడుతుంది.
Şuara 26:92
మరియు వారితో అనబడుతుంది: "మీరు ఆరాధించేవారు (ఆ దైవాలు) ఇప్పుడు ఎక్కడున్నారు?
Şuara 26:93
అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా?"[1]
———
[1] అంటే దేవతలుగా భావించబడిన పుణ్యపురుషులు మరియు విగ్రహాలు లేక మానవుడు ఆరాధించే సంపత్తులు, హోదాలు ఉన్నత స్థానాలు మొదలైనవి. చూడండి, 10:28-29.
Şuara 26:94
అప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు.
Şuara 26:95
మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ[1].
———
[1] చూడండి, 2:24 19:68 మరియు 19:83.
Şuara 26:96
వారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు:
Şuara 26:97
"అల్లాహ్ సాక్షిగా! మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము.
Şuara 26:98
ఎప్పుడైతే మేము మిమ్మల్ని సర్వలోకాల ప్రభువుతో సమానులుగా చేశామో!
Şuara 26:99
మరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే[1].
———
[1] చూడండి, 7:38 33:67-68 మరియు 38:60-61.
Şuara 26:100
మాకిప్పుడు సిఫారసు చేసేవారు ఎవ్వరూ లేరు.
Şuara 26:101
మరియు ఏ ప్రాణ స్నేహితుడు కూడా లేడు.
Şuara 26:102
ఒకవేళ మళ్ళీ మరలిపోయే అవకాశం మాకు దొరికి ఉంటే, మేము తప్పకుండా విశ్వసించిన వారిలో చేరిపోతాము!"[1]
———
[1] చూడండి, 6:27-28.
Şuara 26:103
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
Şuara 26:104
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
Şuara 26:105
నూహ్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
Şuara 26:106
వారి సహోదరుడు నూహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
Şuara 26:107
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
Şuara 26:108
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
Şuara 26:109
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
Şuara 26:110
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
Şuara 26:111
వారన్నారు: "ఏమీ? మేము నిన్ను విశ్వసించాలా? నిన్ను కేవలం అధములైన[1] వారే కదా అనుసరిస్తున్నది?"
———
[1] అల్-అర్జ'లూన్: ధనసంపత్తులు లేనివారు. సమాజంలో తక్కువ శ్రేణికి చెందినవారిగా లెక్కించబడేవారు. లేక అధమమైనవిగా భావించే వృత్తులు చేసేవారు. చూడండి, 11:27.
Şuara 26:112
(నూహ్) అన్నాడు: "వారేమి (పనులు) చేస్తూ ఉండేవారో నాకేం తెలుసు?
Şuara 26:113
వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది[1].
———
[1] ఏ మానవుడు కూడా ఇతర మానవుడి హృదయంలో ఏముందో ఎరుగలేడు. కావున ఒకడు: 'నేను విశ్వాసుణ్ణి.' అని పలికి, తన ధర్మానికి విరుద్ధమైన చేష్టలు చేయడో, మాటలు పలుకడో, అట్టివాడు విశ్వాసుడిగానే పరిగణించబడాలి. మానవుని హృదయంలో ఉన్నది కేవలం అల్లాహ్ (సు.తా.) కే తెలుసు. కావున ఏ మానవునికి కూడా, ఇతర మానవుని విశ్వాసం గురించి అతని హృదయంలో ఉన్న ఆలోచనలను గురించి నిర్ణయం తీసుకునే హక్కు లేదు.
Şuara 26:114
మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించే వాడను కాను.
Şuara 26:115
నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!"
Şuara 26:116
వారన్నారు: "ఓ నూహ్! నీవు దీనిని మానుకోకపోతే, నీవు తప్పక రాళ్ళు రువ్వి చంపబడతావు."
Şuara 26:117
(నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నా జాతి ప్రజలు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తున్నారు.
Şuara 26:118
కావున నీవే నాకూ మరియు వారికీ మధ్య తీర్పు చేయి. మరియు నన్నూ మరియు నాతో పాటు ఉన్న విశ్వాసులనూ కాపాడు[1]."
———
[1] చూడండి, 7:89.
Şuara 26:119
ఆ పిదప మేము అతనిని మరియు అతనితో పాట నిండునావలో ఎక్కి ఉన్న వారినందరినీ కాపాడాము.
Şuara 26:120
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము[1].
———
[1] నూ'హ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:25-48. ముంచి వేయబడిన వారిలో నూ'హ్ ('అ.స.) భార్య మరియు కుమారుడు కూడా ఉన్నారు. ఎందుకంటే వారు సత్యతిరస్కారులు.
Şuara 26:121
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.
Şuara 26:122
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
Şuara 26:123
ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
Şuara 26:124
వారి సహోదరుడు[1] హూద్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
———
[1] సహోదరుడు అంటే జాతి సోదరుడు. అదే జాతికి చెందినవాడు. ఇంకా చూడండి, 7:65.
Şuara 26:125
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
Şuara 26:126
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
Şuara 26:127
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
Şuara 26:128
ఏమీ? మీరు కేవలం ఆడంబరానికి ప్రతి ఎత్తైన స్థలం మీద ఒక స్మారకాన్ని నిర్మిస్తారా?
Şuara 26:129
మరియు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారన్నట్లు పెద్దపెద్ద కోటలు కడతారా?
Şuara 26:130
మరియు మీరు ఎవరినైనా పట్టుకుంటే, అతి క్రూరులై పట్టుకుంటారా?
Şuara 26:131
ఇకనైన మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
Şuara 26:132
మరియు మీకు తెలిసివున్న (మంచి) వస్తువులను, మీకు విస్తారంగా ఇచ్చిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి.
Şuara 26:133
ఆయన విస్తారంగా మీకు పశువులను మరియు సంతానాన్ని అనుగ్రహించాడు.
Şuara 26:134
మరియు తోటలను మరియు చెలమలను.
Şuara 26:135
నిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను!"
Şuara 26:136
వారన్నారు: "నీవు ఉపదేశించినా, ఉపదేశించక పోయినా మాకు అంతా సమానమే!
Şuara 26:137
ఇది మా పూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే![1]
———
[1] కాబట్టి మేము దానిని విడువలేము.
Şuara 26:138
మరియు మాకు ఎలాంటి శిక్ష విధించబడదు."
Şuara 26:139
ఈ విధంగా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము[1]. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
———
[1] 'ఆద్ జాతి ఒక బలవంతమైన సమాజముండేది. చూడండి, 89:8 చూడండి 41:15. అయినా వారు సత్యాన్ని తిరస్కరించి, దౌర్జన్యాలు చేసినందుకు నాశనం చేయబడ్డారు.
Şuara 26:140
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
Şuara 26:141
సమూద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది[1].
———
[1] స'మూద్ జాతి వారి నివాసం స'ఊది 'అరేబియాలో 'హిజ్ర్ అనే ప్రాంతంలో ఉండేది. ఆ ప్రాంతం మదాయిన్ 'సాలిహ్' అని కూడా పిలవబడుతుంది. వారు అరబ్బులు. దైవప్రవక్త ('స'అస) తబూక్ దండయాత్రకు పోయేటప్పుడు, ఈ ప్రాంతం గుండా ప్రయాణం చేశారు. అక్కడి నుండి పోయేటప్పుడు తన ఒంటెను త్వరత్వరగా నడిపిస్తూ, తన అనుచరులతో అల్లాహ్ (సు.తా.) ను క్షమాపణ కోరుతూ త్వరత్వరగా ఈ ప్రాంతం నుండి సాగిపొండన్నారు.
Şuara 26:142
వారి సహోదరుడు సాలిహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?[1]
———
[1] చూడండి, 7:73 మరియు 11:61-68.
Şuara 26:143
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
Şuara 26:144
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
Şuara 26:145
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
Şuara 26:146
ఏమీ? మీరిప్పుడు ఇక్కడ ఉన్న స్థితిలోనే సుఖశాంతులలో ఎల్లప్పుడూ వదలి వేయబడతారని అనుకుంటున్నారా?
Şuara 26:147
తోటలలో మరియు చెలమలలో!
Şuara 26:148
మరియు ఈ పొలాలలో, మాగిన పండ్లగుత్తులు గల ఖర్జూరపు చెట్ల మధ్య;[1]
———
[1] 'తల్'ఉన్: అంటే క్రొత్తగా పుట్టే ఖర్జూర ఫలం, కొద్దిగా పెద్దదైన తరువాత దానిని బల్'హున్, ఆ తరువాత బస్ రున్, ఆ పిదప ర'త్ బున్, చివరకు తమ రున్. ఈ విధంగా వేర్వేరు స్థితులలో ఖర్జూర ఫలం పిలువబడుతోంది.
Şuara 26:149
మరియు మీరు కొండలను తొలిచి ఎంతో నేర్పుతో గృహాలను నిర్మిస్తూ ఉంటారనీ![1]
———
[1] చూడండి, 7:74.
Şuara 26:150
అలా కాదు, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
Şuara 26:151
మరియు మితిమీరి ప్రవర్తించే వారి ఆజ్ఞలను అనుసరించకండి.
Şuara 26:152
ఎవరైతే భూమిలో కల్లోలం రేకెత్తిస్తున్నారో మరియు ఎన్నడూ సంస్కరణను చేపట్టరో!"
Şuara 26:153
వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు!
Şuara 26:154
నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! కావున నీవు సత్యవంతుడవే అయితే, ఏదైనా అద్భుత సూచన తీసుకురా!"
Şuara 26:155
(సాలిహ్) అన్నాడు: "ఇదిగో ఈ ఆడ ఒంటె. ఇది నీరు త్రాగే (దినం) మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణయించబడ్డాయి[1].
———
[1] ఒంటె వృత్తాంతానికి చూడండి, 7:73-77.
Şuara 26:156
దీనికి హాని కలిగించకండి. అలా చేస్తే ఒక మహా దినపు శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది."
Şuara 26:157
కాని వారు దాని వెనుక కాలి మోకాలి పెద్ద నరమును కోసి చంపారు, ఆ తరువాత వారు పశ్చాత్తాప పడతూ ఉండిపోయారు[1].
———
[1] వారు ఆ ఒంటెను చంపిన తరువాత 'సాలి'హ్ ('అ.స.) అన్నారు. మీకు మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. నాలుగవ రోజు వారు అల్లాహ్ శిక్ష అవతరించడం చూసి పశ్చాత్తాప పడ్డారు. కాని శిక్ష వచ్చిన తరువాత పడే పశ్చాత్తాపం లాభదాయకం కాజాలదు.
Şuara 26:158
కావున, వారిని శిక్ష పట్టుకుంది. నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
Şuara 26:159
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
Şuara 26:160
లూత్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది[1].
———
[1] చూలూ'త్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:69-83 లూ'త్ ('అ.స.) ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క సోదరుడైన హారాన్ బిన్-ఆ'జర్ కుమారుడు. అతను కూడా ఇబ్రాహీమ ('అ.స.) జీవిత కాలంలోనే ప్రవక్తగా ఎన్నుకొనబడి, సోడోమ్ మరియు గొమొర్రెహ్ ప్రాంతాలకు పంపబడ్డారు. అవి జోర్డాన్ లో మృతసముద్రం (Dead Sea), ప్రాంతంలో ఉండేవి.
Şuara 26:161
వారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
Şuara 26:162
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
Şuara 26:163
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
Şuara 26:164
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
Şuara 26:165
(ప్రకృతికి విరుద్ధంగా) సర్వప్రాణులలో కెల్లా మీరే పురుషుల వద్దకు పోతారేమిటీ?
Şuara 26:166
మీ ప్రభువు, మీ కొరకు సహవాసులు (అజ్వాజ్) గా పుట్టించిన వారిని విడిచి పెడుతున్నారేమిటి? అలా కాదు, మీరు హద్దు మీరి ప్రవర్తించే జాతివారు!"[1]
———
[1] మొదటిసారిగా చరిత్రలో స్త్రీలను విడిచి, పురుషులు - పురుషులతో రతిక్రీడ (సంభోగం) వీరే ప్రారంభించారంటారు. ఆ నగరం పేరట, ఆ క్రియ ఈనాటికీ సొడోమి (Sodomy) అనబడుతోంది. ఈ కాలపు పశ్చిమ దేశాలలో పరస్పర అంగీకారంతో చేసే సొడోమి, లిస్బనిస్మ (Lesbianism) మరియు స్త్రీ పురుషుల వ్యభిచారాలు చట్టప్రకారం నేరంకావు. ఈ సమాజం ఎటుపోతోంది?
Şuara 26:167
(దానికి) వారన్నారు: "ఓ లూత్! ఇక నీవు మానుకోక పోతే నీవు దేశం నుండి బహిష్కరించబడిన వారిలో చేరుతావు!"
Şuara 26:168
(లూత్) అన్నాడు: "నిశ్చయంగా మీ ఈ చేష్టను అసహ్యించుకునే వారిలో నేనూ ఉన్నాను."
Şuara 26:169
(ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా కుటుంబం వారినీ వీరి చేష్ట నుండి కాపాడు."
Şuara 26:170
కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరినీ కాపాడాము -
Şuara 26:171
వెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప![1]
———
[1] చూముసలామె అంటే లూ'త్ ('అ.స.) భార్య. ఆమె సత్యతిరస్కారి. ఆమె అదే ప్రాంతవాసి. చూడండి, 7:83, 11:81, 27:57, 29:32-33 మరియు 66:10.
Şuara 26:172
ఆ తరువాత, మిగతా వారిని నిర్మూలించాము.
Şuara 26:173
వారిపై ఒక వర్షాన్ని కురిపించాము. అది (ముందు) హెచ్చరించబడిన వారిపై (కురిపించబడ్డ) అతి భయంకరమైన వర్షం[1].
———
[1] చూడండి, 11:82-83.
Şuara 26:174
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.
Şuara 26:175
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
Şuara 26:176
వన (అయ్ కహ్) వాసులు సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించారు[1].
———
[1] చూఅ'య్ కహ్ వాసులు అంటే, అడవివాసులు. మద్ యన్ కు కొంత దూరంలో ఉన్న అడవి ప్రాంతం అ'య్ కహ్ అనబడుతుందని కొందరి అభిప్రాయం. మరికొందరి అభిప్రాయం ఇలా ఉంది: అ'య్ కహ్ అంటే ఒక పెద్ద చెట్టు అది మద్ యన్ కు కొంత దూరంలో ఉండింది. దాని వాసులు ఆ చెట్టును ఆరాధించే వారు. షు'ఐబ్ ('అ.స.) మద్ యన్ వాసులు. కావున అతను మద్ యన్ వాసుల సోదరుడు అని పేర్కొనబడ్డారు. చూడండి, 7:85. వారు ఈ రెండు ప్రాంతాలలో ధర్మప్రచారం చేశారు. (ఇబ్నె-కసీ'ర్).
Şuara 26:177
షుఐబ్ వారితో ఇలా అన్నాడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?[1]
———
[1] చూడండి 7:85 మరియు షు'ఐబ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:84-95.
Şuara 26:178
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
Şuara 26:179
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
Şuara 26:180
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
Şuara 26:181
మీరు (ఇచ్చినపుడు) సరిగ్గా కొలిచి ఇవ్వండి. నష్టపరిచే వారిలో చేరకండి!
Şuara 26:182
త్రాసుతో సరిసమానంగా తూచండి.
Şuara 26:183
ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ దౌర్జన్యపరులుగా ప్రవర్తించకండి[1].
———
[1] చూడండి, 7:86.
Şuara 26:184
మిమ్మల్ని మరియు మీకు పూర్వం గతించిన తరాల వారిని సృష్టించిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి[1]."
———
[1] జిబలతున్: అంటే చాలా మంది లేక పెద్ద వర్గం అని అర్థం.
Şuara 26:185
వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు!
Şuara 26:186
నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! నిశ్చయంగా, మేము నిన్ను అసత్యవాదులలో ఒకనిగా పరిగణిస్తున్నాము!
Şuara 26:187
నీవు సత్యవంతుడవే అయితే ఆకాశం యొక్క ఒక తునకను మాపై పడవేయి."
Şuara 26:188
(షుఐబ్) అన్నాడు: "మీరు చేసేది నా ప్రభువుకు బాగా తెలుసు!"
Şuara 26:189
కాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చి పడింది. నిశ్చయంగా, అదొక భయంకరమైన దినపు శిక్ష![1]
———
[1] చూషు'ఐబ్ ('అ.స) తెగవారి మీద మూడు రకాల శిక్షలు వచ్చాయి. 7:91 లో భూకంపం, 11:94 లో భయంకర ధ్వని, మరియు ఇక్కడ మేఘాల, రాళ్ళ వర్షపు శిక్ష అని పేర్కొనబడ్డాయి. అంటే మూడు రకాల శిక్షలు ఒకేసారి వచ్చాయన్నమాట. (ఇబ్నె-కసీ'ర్).
Şuara 26:190
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
Şuara 26:191
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత[1].
———
[1] చూదీనితో ఏడు గాథలు ముగుస్తున్నాయి. అన్నితరాల ప్రజలలో ఒకే విధమైన లక్షణాలు, స్వభావాలు ఉన్నాయి. వారంతా తమ సందేశహరుల సత్యసందేశాన్ని తిరస్కరించి వారిపై దౌర్జన్యాలు చేశారు. తమ తండ్రితాతల ధర్మాలను అవలంబించారు. 'నీ ప్రభువు శిక్షను తీసుకురా,' అని అన్నారు. చివరకు వారిపై శిక్ష అవతరింపజేయబడి నాశనం చేయబడ్డారు. వారి పరలోక శిక్ష నరకమే. ప్రతికాలంలో కూడా చాలా మట్టుకు పేదవారూ, తక్కువ ఆర్థిక, సామాజిక స్థానాలకు చెందిన వారే ప్రవక్తలను మొట్టమొదట అనుసరించారు. అందుకే స్వర్గంలో ఎక్కువగా ఇలాంటి వారే ఉంటారు.
Şuara 26:192
మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం).
Şuara 26:193
దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు[1];
———
[1] చూఏ విధంగానైతే పూర్వపు దైవప్రవక్తల మీద జిబ్రీల్ ('అ.స.) ద్వారా దివ్యజ్ఞానం అవతరింపజేయ బడిందో, అదే విధంగా ము'హమ్మద్ ('స'అస) పైన కూడా ఈ ఖుర్ఆన్ అవతరింప జేయబడింది. అతను నిరక్షరాస్యుడయినా, పూర్వ ప్రవక్తల గాథలు వినిపించటమే ఖుర్ఆన్ దివ్యావతరణకు నిదర్శనం. అర్ రూ'హుల్ అమీన్: నమ్మదగిన ఆత్మ, అంటే జిబ్రీల్ ('అ.స.)'
Şuara 26:194
నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని;
Şuara 26:195
స్పష్టమైన అరబ్బీ భాషలో[1]!
———
[1] చూడండి, 14:4 ఇతర 'అరబ్ ప్రవక్తలు ఇస్మా'యీల్, హూద్, 'సాలి'హ్ మరియు షు'ఐబ్ 'అలైహిస్సలామ్ లు. హీబ్రూ మరియు అరమాయిక్ ప్రాచీన 'అరబ్బీ భాషలే! ఇతర దివ్యగ్రంథాలు ఆయా సంఘాల వారి కొరకు అవతరింప జేయబడి ఉండెను. 'అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖుర్ఆన్ చివరి దివ్యగ్రంథం మరియు ఆధునిక కాలంలో వచ్చింది. ఇప్పుడు భూగోళమంతా ఒక గ్లోబల్ విల్లేజ్ గా మారిపోయింది, కాబట్టి ఈ ఖుర్ఆన్ సర్వలోకాల వారికి మార్గదర్శనిగా చివరి దివ్యగ్రంథంగా పంపబడింది. చూడండి, 7:158 మరియు 25:1. ఈ ఖుర్ఆన్ 14 వందల సంవత్సరాలు గడిచినా దాని అసలు రూపంలో ఉండి, అందులో ఏ ఒక్క అక్షరపు మార్పు కూడా లేకుండా భద్రపరచబడింది. ఇది అల్లాహ్ (సు.తా.) వాగ్దానం. అల్లాహ్ (సు.తా.) ఇష్టంతో ఇది ఇప్పుడు ప్రపంచంలోని వివిధ భాషలలో అనువాదం చేయబడుతోంది. అల్లాహ్ (సు.తా.) అనుగ్రహంతో సత్యాన్ని అర్థం చేసుకోగలవారు, దీనిని అర్తం చేసుకొని, సత్యధర్మాన్ని (ఇస్లాంను) స్వీకరించి శాశ్వతంగా స్వర్గవాసానికి అర్హులయ్యే మార్గాన్ని అవలంబిస్తున్నారు.
Şuara 26:196
నిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది[1].
———
[1] ఈ ప్రస్తావన కొరకు చూడండి, 2:42 మరియు ద్వితీయోపదేశ కాండము - (Deuteronomy), 18:15,18 మరియు యోహాను - (John), 14:16.
Şuara 26:197
ఇస్రాయీల్ సంతతి వారిలోని విద్వాంసులు[1] ఈ విషయాన్ని ఒప్పు కోవటం వారికొక సూచనగా సరిపోదా?
———
[1] ఉదాహరణకు: 'అబ్దుల్లాహ్ ఇబ్నె-సల్లాం, కా'బ్ ఇబ్నె మాలిక్ మరియు ఇతర మదీనా యూద విద్వాంసులు ఈ విషయం తెలుసుకొని ఇస్లాం స్వీకరించారు. ఈ రోజు వరకు కూడా ఎంతో మంది యూద మరియు క్రైస్తవ విద్వాంసులు ఈ విషయం తెలుసుకొని ఇస్లాం స్వీకరిస్తున్నారు.
Şuara 26:198
ఒకవేళ మేము దీనిని అరబ్ కాని వానిపై అవతరింపజేసి ఉంటే!
Şuara 26:199
అతను దానిని వారికి చదివి వినిపించినా, వారు దానిని విశ్వసించేవారు కారు[1].
———
[1] చూడండి, 41:44.
Şuara 26:200
ఈ విధంగా, మేము దీనిని (తిరస్కారాన్ని) అపరాధుల హృదయాల లోనికి దిగిపోయేలా చేశాము.
Şuara 26:201
కఠినశిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు.
Şuara 26:202
అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి పడుతుంది.
Şuara 26:203
అప్పుడు వారంటారు: "ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా?[1]
———
[1] శిక్ష వచ్చిన తరువాత వ్యవధి ఇవ్వబడదు మరియు అప్పుడు చేసే పశ్చాత్తాపం కూడా అంగీకరించబడదు. చూడండి, 23:85.
Şuara 26:204
ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా?[1]
———
[1] ఈ శిక్ష కోరిన దానికి చూడండి, 6:57 మరియు 8:32.
Şuara 26:205
చూశావా? మేము కొన్ని సంవత్సరాలు వారికి (ఈ జీవితంలో) సుఖసంతోషాలతో గడిపే వ్యవధినిచ్చినా!
Şuara 26:206
తరువాత వాగ్దానం చేయబడినది (శిక్ష) వారిపైకి వచ్చినపుడు;
Şuara 26:207
వారు అనుభవిస్తూ ఉండిన సుఖసంతోషాలు వారికేమీ పనికిరావు[1].
———
[1] చూడండి, 2:96.
Şuara 26:208
మరియు - హెచ్చరిక చేసేవారిని (ప్రవక్తలను) పంపనిదే - మేము ఏ నగరాన్ని కూడా నాశనం చేయలేదు!
Şuara 26:209
హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు[1].
———
[1] చూడండి, 6:131, 15:4, 20:134, 17:15, 28:59 అల్లాహ్ (సు.తా.), హెచ్చరిక చేయటానికి ప్రవక్తలను పంపనిదే ఏ సమాజాన్ని కూడా నాశనం చేయలేదు.
Şuara 26:210
మరియు దీనిని (ఈ దివ్యగ్రంథాన్ని) తీసుకొని క్రిందికి దిగిన వారు షైతానులు కారు.
Şuara 26:211
మరియు అది వారికి తగినది కాదు; వారది చేయలేరు.
Şuara 26:212
వాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు.
Şuara 26:213
కావున అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు.
Şuara 26:214
మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు;
Şuara 26:215
విశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపై నీ కనికరపు రెక్కలను చాపు[1].
———
[1] చూడండి, 17:24.
Şuara 26:216
ఒకవేళ వారు నీ పట్ల అవిధేయత చూపితే వారితో అను: "మీరు చేసే కార్యాలకు నేను బాధ్యుడను కాను."
Şuara 26:217
మరియు ఆ సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత మీద నమ్మకం ఉంచుకో!
Şuara 26:218
ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు[1].
———
[1] కొందరు వ్యాఖ్యాతలు: "నీవు నమా'జ్ లో నిలిచినప్పుడు." అని అంటారు.
Şuara 26:219
మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారితో నీ రాకపోకడలను కూడా!
Şuara 26:220
నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
Şuara 26:221
షైతాన్ లు ఎవరిపై దిగుతారో నేను మీకు తెలుపనా?
Şuara 26:222
వారు అసత్యవాదులైన పాపాత్ములపై దిగుతారు;
Şuara 26:223
గాలి వార్తలను చెవులలో ఊదుతారు[1]; మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే!
———
[1] అంటే ఆ సైతానులు తమను వినేవారి చెవులలో వినీవినని బూటకపు మాటలను ఊదుతారు.
Şuara 26:224
మరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు[1].
———
[1] చూడండి, 36:69. ఆ కాలపు కొందరు 'అరబ్బులు ఈ ఖుర్ఆన్ ను ము'హమ్మద్ ('స.'అస) రచించిన కవితగా అపోహపడ్డారు. అందుకే ఈ ఆయత్ లో కవులను అనుసరించే వారు మార్గభ్రష్టులని అల్లాహ్ (సు.తా.) విశదీకరించాడు. ఈ ఖుర్ఆన్ దివ్యజ్ఞానం (వ'హీ) కాబట్టి ఖుర్ఆన్ లో : "దీని వంటి ఒక్క సూరహ్ నయినా మీరంతా కలసి రచించి తీసుకురండి." అని సవాలు (Challenge) చేయబడింది. కానీ ఇంతవరకు ఎవ్వరు కూడా దానిని పూర్తి చేయలేక పోయారు.
Şuara 26:225
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా వారు (కవులు) తమ కవిత్వంలో ప్రతి విషయాన్ని ఉద్దేశరహితంగా (ప్రశంసిస్తూ) ఉంటారని[1];
———
[1] చూ కవులు చాలా మట్టుకు ఊహాగానాలే చేస్తుంటారు. కాబట్టి కవిత్వంలో స్వవిరుద్ధమైన వ్యాఖ్యానాలు ఉంటాయి. వారి వివరణ లక్ష్యం లేనిది, భ్రమింపజేసేది. కాని ఖుర్ఆన్ మానవులను సత్యమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయటానికి అవతరింప జేయబడింది. అల్లాహ్ (సు.తా.), మానవుని సృష్టికర్త అవతరింపజేసిన మానవుని యొక్క నిర్దేశక గ్రంథమే (Operation Manual) ఈ ఖుర్ఆన్. ఇది మానవునికి మార్గదర్శిని.
Şuara 26:226
మరియు నిశ్చయంగా, వారు తాము ఆచరించని దానిని చెప్పుకుంటారని;
Şuara 26:227
కాని, (వారిలో) విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ, అల్లాహ్ ను అమితంగా స్మరించే వారూ మరియు - తమకు అన్యాయం జరిగినప్పుడే - ప్రతీకార చర్య తీసుకునే వారు తప్ప![1] అన్యాయం చేసేవారు తమ పర్యవసానం ఏమిటో త్వరలో తెలుసుకోగలరు.
———
[1] ఇక్కడ ఆ కవులకే, కవిత్వం చేసే అనుమతి ఇవ్వబడింది, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో మరియు అల్లాహ్ (సు.తా.) ను అమితంగా ప్రార్థిస్తారో మరియు ఊహాగానాలు చేయక సత్యాధారంపై కవిత్వం చేస్తారో! ఉదారహరణకు: 'హస్సాన్ బిన్ సా'బిత్ (ర'ది. 'అ.), తన కవిత్వంతో సత్యతిరస్కారుల కవిత్వానికి తగిన జవాబు ఇచ్చేవారు. దైవప్రవక్త ('స'అస) అతనితో ఇలా అనేవారు: 'ఈ సత్యతిరస్కారులకు జవాబివ్వు, జిబ్రీల్ (అ.స.) నీకు తోడ్పడు గాక!' ('స'హీ'హ్ బుఖా'రీ). దీనితో వ్యక్తమయ్యేది ఏమిటంటే సత్యతిరస్కారులకు జవాబివ్వటానికి, సత్యాధారంగా చేసే కవిత్వం మరియు సత్యాన్ని, తౌహీద్ ను మరియు సున్నతును స్థాపించటానికి చేసే కవిత్వం ధర్మసమ్మతమైనదే!
Neml 27:1
తా-సీన్[1]. ఇవి దివ్యఖుర్ఆన్ ఆయతులు మరియు ఇది ఒక స్పష్టమైన గ్రంథము[2].
———
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
[2] ఇటువంటి ఆయత్ కొరకు చూడండి, 12:1.
Neml 27:2
ఇవి విశ్వాసులకు మార్గదర్శకత్వం గానూ మరియు శుభవార్తలు ఇచ్చేవి గానూ ఉన్నాయి.
Neml 27:3
ఎవరైతే నమాజ్ స్థాపిస్తారో మరియు విధిదానం (జకాత్) ఇస్తారో మరియు పరలోక జీవితాన్ని నమ్ముతారో!
Neml 27:4
నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో, వారికి మేము వారి చేష్టను ఆకర్షణీయమైనవిగా చేశాము. అందువల్ల వారు అంధుల వలే దారి తప్పి తిరుగుతూ ఉంటారు[1].
———
[1] పరలోక జీవితాన్ని నమ్మని వారు తమ భౌతిక మరియు ఆర్థిక లాభాలకే ప్రాధాన్యత నిస్తారు. కాబట్టి వారికి వారి దుష్ట చేష్టలు ఆకర్షణీయమైనవిగా కనిపిస్తాయి. దానివల్ల వారు మరింత మార్గభ్రష్టత్వంలో పడిపోతారు. జిన్నాతులకు మరియు మానవులకు, సత్యాసత్యాలనూ, మంచిచెడులనూ గుర్తించే విచక్షణా శక్తి ఇవ్వబడింది కాబట్టి వారు తమ కర్మలకు తామే బాధ్యులవుతారు. అల్లాహ్ (సు.తా.) తనను తాను సరిదిద్దుకోవటానికి ప్రయత్నించేవానికే సన్మార్గం చూపుతాడు. మరియు బుద్ధిపూర్వకంగా దుర్మార్గాన్ని అవలంభించేవాడిని, వాడి దుర్మార్గంలో వదలుతాడు. చూడండి, 2:7.
Neml 27:5
ఇలాంటి వారికి చెడ్డ శిక్ష ఉంది. మరియు చివరకు వారే అందరి కంటే ఎక్కువగా నష్టపడేవారు.
Neml 27:6
మరియు (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా నీవు ఈ ఖుర్ఆన్ ను మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు అయిన (అల్లాహ్) నుండి పొందుతున్నావు.
Neml 27:7
(జ్ఞాపకం చేసుకోండి!) మూసా తన ఇంటివారితో: "నిశ్చయంగా నాకు ఒక అగ్ని కనిపిస్తోంది[1]. నేను దాని నుండి మీ వద్దకు ఏదైనా వార్తను తీసుకు వస్తాను లేదా మీరు కాచుకోవడానికి మండే కొరివినైనా తీసుకువస్తాను." అని అన్నాడు.
———
[1] చూడండి, 20:10.
Neml 27:8
కాని అతడు అక్కడికి చేరినప్పుడు ఒక ధ్వని ఇలా వినిపించింది: "ఈ అగ్నిలో ఉన్న వానికీ మరియు దాని పరిసరాలలో ఉన్నవానికీ శుభాలు కలుగుగాక! సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు."
Neml 27:9
ఓ మూసా! నిశ్చయంగా ఆయన అల్లాహ్ ను నేనే! సర్వశక్తిమంతుడను, మహా వివేకవంతుడను.
Neml 27:10
నీ చేతికర్రను పడవేయి!" అతను దానిని (పడవేసి) చూశాడు. అది పామువలే కదలసాగింది[1]. అతడు వెనుదిరిగి చూడకుండా పరుగెత్తసాగాడు. (అల్లాహ్ అన్నాడు): "ఓ మూసా! భయపడకు[2]. నిశ్చయంగా, నా సన్నిధిలో సందేశహరులకు ఎలాంటి భయం ఉండదు.
———
[1] చూడండి, 20:17-21.
[2] దీనితో తెలిసేదేమిటంటే ప్రవక్తలకు అగోచరజ్ఞానం ఉండదు. వారు కూడా సాధారణ మానవుల వలే భయపడవచ్చు!
Neml 27:11
కాని ఎవడైనా తప్పు చేస్తే తప్ప! ఆ తరువాత అతడు దానికి బదులుగా మంచి పనులు చేస్తే![1] నిశ్చయంగా, నేను క్షమించేవాడను, కరుణా ప్రదాతను.
———
[1] ఒకడు పాపం చేసి, దాని తరువాత హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి క్షమాభిక్ష వేడుకుంటే అల్లాహ్ (సు.తా.) అతనిని క్షమించవచ్చు! బహుశా మూసా ('అ.స.) వల్ల అనుకోకుండా జరిగిన ఫిర్'ఔన్ జాతివాని హత్య గురించి ఈ ఆయత్ చెప్పుతోంది. చూడండి, 28:101.
Neml 27:12
ఇక నీ చేతిని నీ చంకలో (జేబులో) పెట్టి (తీయి), అది ఎలాంటి లోపం లేకుండా తెల్లగా (ప్రకాశిస్తూ) బయటికి వస్తుంది[1]. ఈ తొమ్మిది అద్భుత సూచనలు (ఆయాత్) తీసుకొని నీవు ఫిరఔన్ మరియు అతని జాతి వారి వద్దకు వెళ్ళు[2]. నిశ్చయంగా, వారు అవిధేయులై పోయారు!"
———
[1] చూడండి, 7:108.
[2] ఆ తొమ్మిది అద్భుత సంకేతాల కొరకు చూడండి, 17:101.
Neml 27:13
కాని వారి ముందుకు మా ప్రత్యక్ష సూచనలు వచ్చినపుడు వారు: "ఇది స్పష్టమైన మాయాజాలమే!" అని అన్నారు[1].
———
[1] చూడండి, 10:76.
Neml 27:14
మరియు వారి హృదయాలు వాటిని అంగీకరించినా వారు అన్యాయంగా, అహంకారంతో తిరస్కరించారు. ఇక చూడు ఆ దౌర్జన్యపరుల గతి ఏమయి పోయిందో!
Neml 27:15
మరియు వాస్తవంగా, మేము దావూద్ మరియు సులైమాన్ లకు జ్ఞానాన్ని ప్రసాదించాము[1]. వారిద్దరు అన్నారు: "విశ్వాసులైన తన అనేక దాసులలో, మా ఇద్దరికి ఘనతను ప్రసాదించిన ఆ అల్లాహ్ యే సర్వస్తోత్రములకు అర్హుడు!"
———
[1] జ్ఞానం: అల్లాహ్ (సు.తా.) తన ప్రవక్తలకు ప్రసాదించే గొప్ప బహుమానం.
Neml 27:16
మరియు సులైమాన్, దావూద్ కు వారసుడయ్యాడు[1]. మరియు అతను (సులైమాన్) అన్నాడు: "ఓ ప్రజలారా! మాకు పక్షుల భాష నేర్పబడింది. మరియు మాకు ప్రతి వస్తువు ఒసంగబడింది. నిశ్చయంగా, ఇది ఒక స్పష్టమైన (అల్లాహ్) అనుగ్రహమే!"
———
[1] అంటే ప్రవక్త పదవి యొక్క వారసత్వం. ఎందుకంటే దావూద్ ('అ.స.)కు ఇతర కుమారులుండిరి. కాని వారు ప్రవక్తలు కాలేదు. ప్రవక్త ('అ.స.)లు వదలిపోయిన ధనసంపత్తులు 'సదఖ' అంటే దానాలుగా పరిగణింపబడతాయి. ('స'హీ'హ్ బు'ఖారీ).
Neml 27:17
మరియు సులైమాన్ కొరకు జిన్నాతుల[1], మానవుల మరియు పక్షుల సైన్యాలు సమీకరింపబడి ఉండేవి. తరువాత వాటిని తమ తమ స్థానాల ప్రకారం వరుసలలో పెట్టి (బయలు దేరారు)!
———
[1] ఖుర్ఆన్ అవతరణా క్రమంలో 114:6లో మొదటిసారి జిన్నాతుల పేరు వచ్చింది.
Neml 27:18
చివరకు వారు చీమల లోయకు (కనుమకు) చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా అన్నది: "ఓ చీమలారా! మీరు మీ ఇండ్లలోకి ప్రవేశించండి, లేకపోతే సులైమాన్ మరియు అతన సైనికులు - వారికి తెలియకుండానే - మిమ్మల్ని నలిపి వేయవచ్చు!"[1]
———
[1] చూదీనితో వ్యక్తమయ్యేది ఏమిటంటే సులైమాన్ ('అ.స.)కు పశుపక్షుల భాషలు అర్థమయ్యేవి. కాని అతనికి అగోచరజ్ఞానం లేదు. అల్లాహ్ (సు.తా.) తప్ప మరెవ్వరికీ అగోచరజ్ఞానం ఉండదు. ఈ విషయం ముందు రాబోయే వడ్రంగి పిట్ట కథ వల్ల తెలుస్తోంది.
Neml 27:19
(సులైమాన్) దాని మాటలకు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నన్ను - నాకూ మరియు నా తల్లిదండ్రులకు చూపిన అనుగ్రహాలకు - కృతజ్ఞత తెలిపేవానిగా[1] మరియు నీకు నచ్చే సత్కార్యాలు చేసేవానిగా, ప్రోత్సాహపరచు. మరియు నన్ను నీ కారుణ్యంతో సద్వర్తనులైన నీ దాసులలో చేర్చుకో!"[2]
———
[1] చూడండి, 38:31-33.
[2] దీనితో వ్యక్తమయ్యేది ఏమిటంటే సద్వర్తనులైన విశ్వాసులకే స్వర్గం లభిస్తుంది. మరియు ఎవడు కూడా అల్లాహ్ (సు.తా.) అనుగ్రహం లేనిదే స్వర్గంలో ప్రవేశించలేడు. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'మీరు సన్మార్గం మీద మరియు సత్యం మీద ఉండండి. మరియు జ్ఞాపకముంచుకోండి. ఏ వ్యక్తి కూడా కేవలం తన సత్కార్యాల వల్లనే స్వర్గాన్ని పొందలేడు.' అప్పుడు అనుచరలు (ర'ది.'అన్హుమ్)లు అన్నారు: 'ఓ సందేశహరుడా ('స'అస)! మీరు కూడానా?' అతను జవాబిచ్చారు: 'అవును నేను కూడా!' అల్లాహ్ (సు.తా.) కరుణించే వరకు నేను కూడా స్వర్గంలో ప్రవేశించలేను.' ('స. బు'ఖారీ, నం. 6467, 'స. ముస్లిం 217)
Neml 27:20
మరియు (ఒకరోజు) అతను పక్షులను పరిశీలిస్తూ ఇలా అన్నాడు: "ఏమిటీ, నాకు వడ్రంగి పిట్ట (హుద్ హుద్) కనిపించడం లేదే! అది ఎలా అదృశ్యమైపోయింది?
Neml 27:21
నేను దానిని కఠినంగా శిక్షిస్తాను. లేదా దానిని కోసివేస్తాను, అది నాకు సరైన కారణం చూపితేనే తప్ప!"
Neml 27:22
ఆ తరువాత ఎంతో సేపు గడవక ముందే అది వచ్చి ఇలా అన్నది: "నీకు తెలియని విషయమొకటి నేను తెలుసుకొని వచ్చాను. నేను సబాను గురించి ఒక నమ్మకమైన వార్తను నీ కొరకు తెచ్చాను.[1]
———
[1] చూడండి, 34:15. సబా' ఒక ప్రఖ్యాత వ్యక్తి పేరు మీద, ఒక తెగ, ఒక పట్టణం మరియు దేశపు పేరు పెట్టబడింది. అది యమన్ ప్రాంతంలో ఉండేది. అది మ'అరిబే యమన్ అనే పేరుతో కూడా పిలువబడింది. ఆ సమయంలో దాని పాలకురాలు (రాణి) ఒక స్త్రీ. ఆమె పేరు బిల్ఖీస్ అని అంటారు. దాని రాజధాని మ'అరిబ్. వారు సూర్యుణ్ణి పూజించేవారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
Neml 27:23
నిశ్చయంగా, నేను అక్కడ ఒక స్త్రీని చూశాను. ఆమె వారిపై (రాణిగా) పరిపాలన చేస్తుంది. ఆమెకు ప్రతి వస్తువు ఒసంగబడి ఉంది. ఆమె దగ్గర ఒక గొప్ప సింహాసనం ఉంది.
Neml 27:24
మరియు నేను ఆమెను మరియు ఆమె జాతివారిని అల్లాహ్ ను వదలి సూర్యునికి సాష్టాంగం (సజ్దా) చేయటం చూశాను మరియు షైతాన్ వారి కర్మలను, వారికి మంచివిగా తోచేటట్లు చేశాడు. కావున వారిని సన్మార్గం నుండి నిరోధించాడు, కాబట్టి వారు సన్మార్గం పొందలేక పోయారు.
Neml 27:25
అందుకే వారు - ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ దాని వున్న వాటిని బయటికి తీసేవాడూ మరియు మీరు దాచే వాటినీ మరియు వ్యక్త పరిచే వాటినీ ఎరుగువాడూ అయిన - అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేయటం లేదు.
Neml 27:26
అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఆయనే సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు."
Neml 27:27
(సులైమాన్) అన్నాడు: "నీవు సత్యం పలుకుతున్నావో, లేదా అబద్ధాలాడే వారిలో చేరిన వాడవో, మేము ఇప్పుడే చూస్తాము.
Neml 27:28
నా ఈ ఉత్తరం తీసుకొని పో! దీనిని వారి వద్ద పడవేయి, తరువాత వారి నుండి ఒక వైపుకు తొలగిపోయి వారేమి సమాధానమిస్తారో చూడు."
Neml 27:29
(రాణి) అన్నది: "ఓ నా ఆస్థాన నాయకులారా! ఇదిగో నా వైపుకు ఒక విశేషమైన ఉత్తరం పంపబడింది.
Neml 27:30
నిశ్చయంగా, ఇది సులైమాన్ దగ్గర నుండి వచ్చింది. మరియు ఇది: ''అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో,' ప్రారంభించబడింది."
Neml 27:31
"(ఇందులో ఇలా వ్రాయబడి ఉంది): 'నా పై ఆధిక్యత చూపకండి. నా సన్నిధిలోకి అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయి రండి' "[1]
———
[1] సబా' వాసులు అల్లాహ్ (సు.తా.) ను వదిలి సూర్యుణ్ణి పూజించేవారు. (ఆయతులు 24-25) కావున సులైమాన్ ('అ.స.) ఒక ప్రవక్త కాబట్టి వారిని అల్లాహ్ (సు.తా.)కు విధేయులవటానికి ఆహ్వానించారు. (చూడండి, 44:19) ఇదే విధంగా మహా ప్రవక్త ముహమ్మద్ ('స'అస) కూడా ఆయన కాలపు రాజులను ఇస్లాం స్వీకరించటానికి, ఆహ్వానపత్రాలు పంపారు.
Neml 27:32
(రాణి) అన్నది: "ఓ నాయకులారా! ఈ విషయంలో మీరు నాకు సలహా ఇవ్వండి. నేను ఏ విషయంలోనూ, మీరు లేనిదే ఎలాంటి నిర్ణయం తీసుకోనే!"
Neml 27:33
వారిలా జవాబిచ్చారు: "మనం చాలా బలవంతులం. మరియు గొప్ప యుద్ధ నిపుణులం, కాని నిర్ణయం మాత్రం నీదే! కావున, నీవు ఏమి ఆజ్ఞాపించ దలచుకున్నావో అలోచించు!"
Neml 27:34
(రాణి) అన్నది: "రాజులు ఏ దేశంలోనైనా జొరబడినప్పుడు, వారందులో కల్లోలం రేకెత్తిస్తారు మరియు అక్కడి గౌరవనీయులైన ప్రజలను అవమాన పరుస్తారు. వీరు కూడా అదే విధంగా చేయవచ్చు!
Neml 27:35
కావున నేను తప్పక, వారి వద్దకు ఒక కానుకను పంపుతాను. ఆ తరువాత నా దూతలు ఏమి జవాబు తెస్తారో చూస్తాను."
Neml 27:36
(రాయబారులు) సులైమాన్ వద్దకు వచ్చినపుడు, అతను అన్నాడు: "ఏమీ? మీరు నాకు ధనసహాయం చేయదలచారా? అల్లాహ్ నాకు ఇచ్చింది, మీకు ఇచ్చిన దాని కంటే ఎంతో ఉత్తమమైనది, ఇక మీ కానుకతో మీరే సంతోషపడండి!"
Neml 27:37
(సులైమాన్) అన్నాడు): "నీవు వారి వద్దకు తిరిగిపో, మేము వారిపైకి గొప్ప సేనలతో వస్తాము. వారు వాటిని ఎదిరించజాలరు. మేము వారిని పరాభవించి అచ్చటి నుండి వెడల గొడ్తాము. మరియు వారు అవమానితులై ఉండిపోతారు."
Neml 27:38
(తరువాత సులైమాన్) ఇలా అన్నాడు: "ఓ నాయకులారా! వారు అల్లాహ్ కు విధేయులై (ముస్లింలై) రాకముందే, ఆమె సింహాసనాన్ని నా వద్దకు మీలో ఎవరు తేగలరు?"
Neml 27:39
జిన్నాతులలో బలిష్ఠుడైన ఒకడు ఇలా అన్నాడు: "నీవు నీ స్థానం నుండి లేవక ముందే నేను దానిని తీసుకువస్తాను. నిశ్చయంగా నేను ఇలా చేసే బలం గలవాడను, నమ్మదగిన వాడను!"
Neml 27:40
గ్రంథజ్ఞానం గల ఒకతను ఇలా అన్నాడు: "నేను కనురెప్పపాటు కాలంలో దానిని నీ వద్దకు తేగలను!" ఆ తరువాత (సులైమాన్) దానిని వాస్తవంగా తన ముందు పెట్టబడి ఉండటాన్ని చూసి ఇలా అన్నాడు: "ఇది నా ప్రభువు అనుగ్రహం. నేను కృతజ్ఞతలు చూపుదునా లేక కృతఘ్నుడ నవుదునా అని పరీక్షించటానికి ఇలా చేయబడింది. కృతజ్ఞతలు తెలిపేవాడు, నిశ్చయంగా, తన మేలు కొరకే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. కాని ఎవడైనా కృతఘ్నతకు పాల్పడితే, నిశ్చయంగా, నా ప్రభువు స్వయం సమృద్ధుడు, పరమ దాత[1] (అని తెలుసుకోవాలి)."
———
[1] అల్-కరీము: Most Bouteous, Generous, Most Noble, Honourable, దాతృత్వుడు, దానశీలుడు, ఔదార్యుడు, ఉదారుడు, పరమదాత, గొప్పవాడు, అత్యంత ఆదరణీయుడు, దివ్యుడు (82:6, 96:3) ఈ శబ్దము అల్లాహ్ (సు.తా.) కే గాక, దివ్య ఖుర్ఆన్ కొరకు గూడా వాడబడింది, అల్-మజీద్ మాదిరిగా. అల్-ఇక్రామ్: కొరకు చూడండి, 55:27,78.
Neml 27:41
(సులైమాన్) అన్నాడు: "ఆమె గుర్తించ లేకుండా ఆమె సింహాసనపు రూపాన్ని మార్చి వేయండి. మనం చూద్దాం! ఆమె మార్గదర్శకత్వం పొందుతుందా, లేక మార్గదర్శకత్వం పొందని వారిలో చేరి పోతుందా?"
Neml 27:42
ఆ తరువాత ఆమె అక్కడికి రాగానే: "ఏమీ? నీ సింహాసనం విధంగానే ఉంటుందా?" అని అడుగ్గా, ఆమె: "నిశ్చయంగా, ఇది దాని మాదిరిగానే ఉంది!"అని అన్నది. మరియు (సులైమాన్ అన్నాడు): "మనకు ఈమె కంటే ముందు (దివ్య) జ్ఞానం ప్రసాదించ బడింది (లభించింది) కావున మనం అల్లాహ్ కు విధేయులం (ముస్లింలం) అయ్యాము!"[1]
———
[1] ఇది సులైమాన్ ('అ.స.) వాక్యమని ఇబ్నె-కసీ'ర్ మరియు షౌకాని గారి అభిప్రాయం.
Neml 27:43
మరియు అల్లాహ్ ను వదలి ఆమె ఆరాధిస్తున్నది, ఆమెను (ఇస్లాం నుండి) తొలగించింది. అందుకే! ఆమె వాస్తవానికి, సత్యతిరస్కారులలో చేరి ఉండేది.
Neml 27:44
ఆమెతో: "రాజగృహంలో ప్రవేశించు!" అని చెప్పగా! ఆమె దానిని చూసి, అదొక నీటి కొలనని భావించి (తన వస్త్రాలను) పైకెత్తగా ఆమె పిక్కలు కనబడ్డాయి. అప్పుడు (సులైమాన్): "ఇది గాజుతో నిర్మించబడిన నున్నని నేల మాత్రమే!" అని అన్నాడు. (రాణి) అన్నది: "ఓ నా ప్రభూ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. మరియు నేను సులైమాన్ తో పాటు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు విధేయతను (ఇస్లాంను) స్వీకరిస్తున్నాను."[1]
———
[1] ఇస్లాం స్వీకరించిన తరువాత బిల్ఖీస్ వివాహం సులైమాన్ ('అ.స.) తో అయిందా లేదా అనే విషయం ఖుర్ఆన్ మరియు 'హదీస్'లలో పేర్కొనబడలేదు.
Neml 27:45
మరియు వాస్తవంగా! మేము సమూద్ జాతివారి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ ను: "మీరు అల్లాహ్ నే ఆరాధించండి."[1] అనే (సందేశంతో) పంపాము. కాని వారు రెండు వర్గాలుగా చీలి పోయి పరస్పరం కలహించుకోసాగారు.
———
[1] 'సాలిహ్' ('అ.స.) గాథ కొరకు చూడండి, 7:73.
Neml 27:46
(సాలిహ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు సుస్థితికి ముందు దుస్థితి కొరకు ఎందుకు తొందరపెడుతున్నారు? మీరు అల్లాహ్ ను మీ తప్పులను క్షమించమని ఎందుకు వేడుకోరు? బహశా మీరు కరుణించబడవచ్చు!"
Neml 27:47
వారన్నారు: "మేము నిన్నూ మరియు నీ అనుచరులను అపశకునపు సూచనలుగా పరిగణిస్తున్నాము!" (సాలిహ్) అన్నాడు: "మీ శకునం అల్లాహ్ వద్ద ఉంది. వాస్తవానికి, మీరు పరీక్షించ బడుతున్నారు!"[1]
———
[1] చూడండి, 17:13.
Neml 27:48
మరియు ఆ నగరంలో తొమ్మిది మంది ఉండేవారు. వారు దేశంలో కల్లోలం రేకెత్తిస్తూ ఉండేవారు. మరియు ఎలాంటి సంస్కరణ చేసేవారు కాదు.
Neml 27:49
వారు పరస్పరం ఇలా అనుకున్నారు: "అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా ప్రతిజ్ఞ చేయండి[1]. మనం అతనిపై మరియు అతనితో పాటు ఉన్న వారిపై రాత్రివేళ దాడి చేద్దాము. తరువాత అతని వారసులతో: 'మీ సంబంధీకులను వధించింది మేము చూడనే లేదు. మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము.' "అని అందాము.
———
[1] అల్లాహ్ (సు.తా.) పై ప్రమాణం అంటే స'మూద్ జాతివారు అల్లాహ్ (సు.తా.) ను విశ్వసించేవారు. కాని వారు పాటించే మతం వారిని ఏకైక ఆరాధ్యుడైన (అల్లాహుతా'ఆలా) ఆరాధన నుండి తొలగించింది. (చూడండి, 7:73).
Neml 27:50
మరియు ఈ విధంగా, వారు పన్నాగం పన్నారు మరియు మేము కూడా ఒక పన్నాగం పన్నాము. కాని వారికది తెలియదు.
Neml 27:51
ఇక చూడండి! వారి పన్నాగపు పర్యవసానం ఏమయిందో! వాస్తవానికి మేము వారిని మరియు వారి వంశం వారినందరినీ సర్వనాశనం చేశాము.
Neml 27:52
అవిగో వారి గృహాలు! వారు చేసిన దుర్మార్గాలకు అవి ఎలా పాడుపడి పోయాయో చూడండి. నిశ్చయంగా ఇందులో తెలుసుకునే వారికి గొప్ప సూచన ఉంది.
Neml 27:53
మరియు విశ్వసించి, దైవభీతి కలిగి ఉన్న వారిని మేము కాపాడాము.
Neml 27:54
మరియు లూత్ ను (జ్ఞాపకం చేసుకోండి)! అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీరు బహిరంగంగా అశ్లీల కార్యాలు చేస్తారా?"[1]
———
[1] లూ'త్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 7:80-84, 11:69-83, 26:160-173.
Neml 27:55
"ఏమీ? మీరు స్త్రీలను వదలి పురుషుల వద్దకు, మీ కామ ఇచ్ఛను తీర్చుకోవటానికి పోతారా? వాస్తవానికి, మీరు మూఢ జనులు!"
Neml 27:56
కాని, అతని జాతివారి జవాబు ఈ విధంగా మాత్రమే ఉండింది. వారు అన్నారు: "లూత్ కుటుంబాన్ని మీ పట్టణం నుండి వెళ్ళ గొట్టండి. వాస్తవానికి, వారు తమను తాము చాలా పవిత్రులుగా పరిగణిస్తున్నారు."[1]
———
[1] చూడండి, 7:82.
Neml 27:57
కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని కాపాడాము - అతని భార్య తప్ప - ఆమెను వెనుక ఉండిపోయే వారిలో చేర్చాలని నిర్ణయించాము[1].
———
[1] చూడండి, 7:83, 11:81 మరియు 66:10
Neml 27:58
మరియు వారిపై (రాళ్ళ) వర్షాన్ని కురిపించాము. కాని అది, హెచ్చరించబడిన వారిపై కురిపించబడ్డ ఎంతో ఘోరమైన వర్షం.[1]
———
[1] చూడండి, 26:173.
Neml 27:59
(ఓ ముహమ్మద్!) ఇలా అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఆయన ఎన్నుకొన్న, ఆయన దాసులకు శాంతి కలుగు గాక (సలాం)! ఏమీ? అల్లాహ్ శ్రేష్ఠుడా? లేక వారు ఆయనకు సాటి కల్పించే భాగస్వాములా?"
Neml 27:60
ఏమీ? ఆయనే కాడా? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించినవాడు మరియు మీ కొరకు ఆకాశం నుండి నీటిని కురిపించిన వాడు? దానితో మేము మనోహరమైన తోటలను పుట్టించాము. వాటిలో ఒక్క చెట్టును కూడా మొలిపించటం మీకు సాధ్యమయ్యే పని కాదు కదా? ఏమీ? అల్లాహ్ తో బాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? అలా కాదు! వారే (ఇతరులను) ఆయనకు సమానులుగా చేసే ప్రజలు!
Neml 27:61
ఏమీ? ఆయనే కాడా? భూమిని నివాసస్థలంగా చేసి,[1] దాని మధ్య నదులను ఏర్పరచి, అది కదలకుండా దానిపై పర్వతాలను మేకులుగా నాటినవాడు మరియు రెండు సముద్రాల మధ్య అడ్డుతెరను నిర్మించిన వాడు?[2] ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వాస్తవానికి చాలా మంది ఇది తెలుసుకోలేరు.
———
[1] చూడండి, 77:25-26.
[2] చూడండి, 25:53.
Neml 27:62
ఏమీ? ఆయనే కాడా? బాధితుడు వేడుకున్నప్పుడు అతడి మొరను ఆలకించి ఆపదను తొలగించేవాడు[1] మరియు భూమిలో మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసినవాడు?[2] ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? మీరు ఆలోచించేది చాలా తక్కువ.
———
[1] చూడండి, 17:67 మరియు 27:53.
[2] చూడండి, 2:30.
Neml 27:63
ఏమీ? ఆయనే కాడా? నేల మరియు సముద్రాల, అంధకారంలో మీకు మార్గదర్శకత్వం చేసేవాడు మరియు తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలతో పంపేవాడు?[1] ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వారు సాటిగా కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ అత్యున్నతుడు!
———
[1] చూడండి, 7:57
Neml 27:64
ఏమీ? ఆయనే కాడా? సృష్టిని తొలిసారి ప్రారంభించి, తరువాత దానిని మరల ఉనికిలోకి తేగలవాడు మరియు మీకు ఆకాశం నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడు[1]. ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే మీ నిదర్శనాన్ని తీసుకురండి!"
———
[1] చూడండి, 10:31.
Neml 27:65
వారితో అను: "ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న అగోచర విషయజ్ఞానం గలవాడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు[1]. మరియు వారు తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా వారికి తెలియదు."
———
[1] అగోచరజ్ఞానం అల్లాహ్ (సు.తా.) తప్ప మరెవ్వరికీ లేదు. ప్రవక్త ('అలైహిమ్ స.) లకు అల్లాహ్ (సు.తా.) వ'హీ ద్వారా తెలిపిన జ్ఞానం మాత్రమే ఉంటుంది. 'ఆయి'షహ్ (ర.'అన్హా) కథనం: "ఎవడైతే ప్రవక్తకు రేపు కాబోయే విషయాల గురించి జ్ఞానముందని భావిస్తాడో, అతడు అల్లాహ్ (సు.తా.) మీద పెద్ద అపనింద మోపుతున్నాడు. ఎందుకంటే! అల్లాహ్ (సు.తా.) కే అంటున్నాడు: 'భూమ్యాకాశాలలో ఉన్న అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ (సు.తా.)కే ఉంది.' " ('స'హీ'హ్ బు'ఖారీ, నం. 4855, 'స'హీ'హ్ ముస్లిం, నం. 287, తిర్మిజీ' నం. 3068) ఖతదా (ర'ది.'అ.) అన్నారు: 'అల్లాహ్ (సు.తా.) నక్షత్రాలను మూడు విషయాల కొరకు పుట్టించాడు: 1) ఆకాశపు అలంకరణ కొరకు, 2) (రాత్రిలో) మార్గదర్శకానికి (దారి తెలుసుకోవటానికి), 3) షై'తాన్ లను తరిమి కొట్టడానికి. కాని అల్లాహ్ (సు.తా.) ఆదేశాలను ఎరుగని వారు వాటి ద్వారా అగోచర జ్ఞానం (జ్యోతిష్యం) చెప్పుతామని ఇతరులను మోసగిస్తున్నారు. వారు పలికేవన్నీ మోసపు మాటలే, అబద్దాలే. (ఇబ్నె-కసీ'ర్).
Neml 27:66
వాస్తవానికి, పరలోక జీవితం గురించి వారి జ్ఞానం శూన్యమే. అలా కాదు! దానిని గురించి వారు సంశయంలో పడి వున్నారు. అలా కాదు! దాని విషయంలో వారు అంధులై పోయారు.
Neml 27:67
సత్యతిరస్కారులు అంటారు: "ఏమీ? మేమూ మరియు మా తండ్రితాతలు మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవానికి మరల (సజీవులుగా) వెలికి తీయబడతామా?
Neml 27:68
వాస్తవానికి ఇంతకు పూర్వం కూడా మాకు మరియు మా తండ్రితాతలకు ఇదే విధంగా వాగ్దానం చేయబడింది. ఇవి కేవలం పూర్వకాలపు గాథలు మాత్రమే."
Neml 27:69
వారితో అను: "భూమిలో ప్రయాణం చేసి చూడండి. అపరాధుల గతి ఏమయిందో!"
Neml 27:70
మరియు నీవు వారి గురించి దుఃఖపడకు మరియు వారి కుట్రలకు బాధపడకు.
Neml 27:71
వారంటున్నారు: "మీరు సత్యవంతులే అయితే! ఈ వాగ్దానం ఎప్పుడు పూర్తి కానున్నది?"
Neml 27:72
వారితో అను: "మీరు దేనిని (ఏ శిక్షను) గురించి తొందర పెడుతున్నారో? అందులోని కొంతభాగం బహుశా మీకు సమీపంలోనే ఉండవచ్చు!"[1]
———
[1] ఇది బద్ర్ యుద్ధాన్ని సూచిస్తోంది.
Neml 27:73
"మరియు నిశ్చయంగా, నీ ప్రభువు మానవులపై ఎంతో అనుగ్రహం కలవాడు, కాని వారిలో చాలా మంది కృతజ్ఞతలు చూపరు."
Neml 27:74
మరియు నిశ్చయంగా వారి హృదయాలు ఏమి దాస్తున్నాయో మరియు ఏమి వ్యక్తపరుస్తున్నాయో, నీ ప్రభువుకు బాగా తెలుసు.
Neml 27:75
మరియు ఆకాశంలో మరియు భూమిలో అగోచరంగా ఉన్నది ఏదీ కూడా, స్పష్టమైన ఒక గ్రంథంలో వ్రాయబడకుండా లేదు[1].
———
[1] దీని అర్థం: లౌ'హె మ'హ్ ఫూజ్.
Neml 27:76
నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ఇస్రాయీల్ సంతతి వారు విభేదిస్తూ వున్న పెక్కు విషయాల వాస్తవాన్ని వారికి తెలుపుతున్నది.
Neml 27:77
మరియు నిశ్చయంగా, ఇది విశ్వాసులకు మార్గదర్శిని మరియు కారుణ్యం.
Neml 27:78
నిశ్చయంగా, నీ ప్రభువు వారి మధ్య న్యాయంగా తీర్పు చేస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు.
Neml 27:79
కావున నీవు అల్లాహ్ పై ఆధారపడి ఉండు. నిశ్చయంగా, నీవు స్పష్టమైన సత్యంపై ఉన్నావు.
Neml 27:80
నిశ్చయంగా, నీవు మృతులకు వినిపింపజేయలేవు మరియు వీపు త్రిప్పి మరలి పోయే చెవిటివారికి కూడా నీ పిలుపును వినిపింప జేయలేవు[1].
———
[1] ఈ ఆయత్ సత్యతిరస్కారులను గురించి చెప్పుతోంది. వారి బుద్ధి సత్యాన్ని గ్రహించకున్నది కావున వారు మృతులుగా పేర్కొనబడ్డారు.
Neml 27:81
మరియు నీవు అంధులను మార్గభ్రష్టత్వం నుండి తొలగించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. మా సూచనలను (ఆయాత్ లను) విశ్వసించి, అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయ్యే వారికి మాత్రమే నీవు (నీ మాటలను) వినిపించగలవు.
Neml 27:82
మరియు వారిని గురించిన (శిక్ష) వాగ్దానం పూర్తికానున్నప్పుడు[1], మేము వారి కొరకు భూమి నుండి ఒక జంతువును బయటికి తీస్తాము[2]. అది వారితో నిశ్చయంగా, మానవులు మా సూచలను (ఆయాత్ లను) నమ్మేవారు కాదని చెబుతుంది.
———
[1] చూఎప్పుడైతే మంచిని ఆదేశించే వాడు మరియు చెడు నుండి నిరోధించే వాడు ఎవ్వడూ ఉండడో!
[2] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'పునరుత్థానదినం అంతవరకు రాదు, ఎంతవరకైతే మీరు పది సంకేతాలు చూడరో!' ఆ పది సంకేతాలలో ఈ జంతువు ఒకటి, ('స'హీ'హ్ ముస్లిం). మరొక 'హదీస్'లో ఉంది: అన్నిటి కంటే మొదటి సంకేతం, సూర్యుడు తూర్పునుండి గాక పడమర నుండి ఉదయించడం. ('స'హీ'హ్ ముస్లిం)
Neml 27:83
మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు (పునరుత్థాన దినమున) మేము ప్రతి జాతివారిలో నుండి మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన జనసమూహాన్ని సమీకరిస్తాము. మరియు వారు (వారి పాపాల ప్రకారం) వివిధ వరుసలలో నిలబెట్టబడతారు.
Neml 27:84
చివరకు అందరూ వచ్చిన తరువాత వారి (ప్రభువు) వారిని ప్రశ్నిస్తాడు: "ఏమీ? మీరు నా సూచనలను, మీ జ్ఞానంతో గ్రహించకుండానే వాటిని అసత్యాలని తిరస్కరించారా? ఇదిగాక మీరు ఏమి చేస్తూ ఉండేవారు?"
Neml 27:85
మరియు వారు చేసిన దుర్మార్గం వలన వారికి చేయబడిన వాగ్దానం (శిక్ష) పూర్తి అవుతుంది, కావున వారేమీ మాట్లాడలేరు.
Neml 27:86
ఏమీ? వారికి తెలియదా? మేము రాత్రిని వారు విశ్రాంతి పొందటానికి మరియు పగటిని (చూడగలగటానికి) ప్రకాశవంతంగా చేశామని?[1] నిశ్చయంగా, విశ్వసించేవారికి ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
———
[1] చూడండి, 10:67 మరియు 40:61.
Neml 27:87
మరియు (జ్ఞాపకముంచుకోండి) బాకా (సూర్) ఊదబడే దినమున - అల్లాహ్ కోరిన వారు తప్ప[1] - ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్నవన్నీ భయంతో కంపించి పోతాయి[2]. మరియు ఆన్నీ అత్యంత వినమ్రతతో ఆయన ముందు హాజరవుతాయి.
———
[1] ఎవరా అల్లాహ్ (సు.తా.) కోరినవారు? ఇమామ్ షౌకాని ప్రకారం: వారు దైవదూతలు, దైవప్రవక్తలు, అమరవీరులు (షుహదా') మరియు విశ్వాసులందరూ!
[2] 'సూర్: బాకా, కొమ్ము, దానిని ఇస్రాఫీల్ ('అ.స.) అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో ఊదుతారు. ఇది రెండుసార్లు లేక అంతకంటే ఎక్కువ సారర్లు ఊదబడుతుంది. మొదట ఊదబడినప్పుడు సమస్త (జీవరాసులు) భయంతో స్పృహ కోల్పోతారు. రెండవసారి ఊదబడినప్పుడు అందరూ చనిపోతారు. మూడవసారి ఊదబడినప్పుడు అందరూ తమ గోరీల నుండి లేచి వస్తారు. మరికొందరి ప్రకారం నాలుగవసారి బాకా ఊదబడినప్పుడు అందరూ మైదానంలో సమీకరించబడతారు.
Neml 27:88
మరియు నీవు పర్వతాలను చూసి అవి స్థిరంగా ఉన్నాయని అనుకుంటున్నావు. కాని అవి అప్పుడు మేఘాల వలే ఎగురుతూ పోతుంటాయి. ఇది అల్లాహ్ కార్యం! ఆయన ప్రతి కార్యాన్ని నేర్పుతో చేస్తాడు. నిశ్చయంగా మీరు చేసేదంతా ఆయన ఎరుగును[1].
———
[1] చూడండి, 14:48 మరియు 20:105-107.
Neml 27:89
మంచిపనులు చేసి వచ్చిన వారికి, అంతకంటే మంచి (ప్రతిఫలం) ఉంటుంది. మరియు వారు ఆ దినపు మహా భీతి నుండి సురక్షితంగా ఉంటారు[1].
———
[1] చూడండి, 21:103.
Neml 27:90
మరియు చెడుపనులు చేసి వచ్చిన వారు నరకాగ్నిలో బోర్లా త్రోయబడతారు. (వారితో అనబడుతుంది): "మీకు ఇవ్వబడే ప్రతిఫలం మీ కర్మలకు భిన్నంగా ఉండగలదా?"
Neml 27:91
(ఓ ముహమ్మద్!) వారితో (ఇలా అను): "నిశ్చయంగా, ఈ (మక్కా) నగరపు ప్రభువునే ఆరాధించాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఆయనే! దీనిని పవిత్ర క్షేత్రంగా[1] చేశాడు మరియు ప్రతి వస్తువు ఆయనకు చెందినదే! మరియు నేను ఆయనకు విధేయుడనై (ముస్లింనై) ఉండాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది.
———
[1] చూడండి, 3:96 'హర్రమహా: అంటే ఈ నగరంలో రక్తప్రసారం (హత్యచేయటం, ఇతరులపై దౌర్జన్యం, అన్యాయం చేయటం, వేటాడటం, చెట్లను నరకటం, ముల్లు కూడా తెంపటం నిషేధించబడింది. ('స'హీ'హ్ బు'ఖారీ).
Neml 27:92
మరియు ఈ ఖుర్ఆన్ ను చదివి వినిపించాలని కూడా (ఆజ్ఞ ఇవ్వబడింది). కావున మార్గదర్శకత్వం పొందినవాడు తన మేలుకే, మార్గదర్శకత్వం పొందుతాడు. మరియు మార్గభ్రష్టుడైన వాడితో అను: "నిశ్చయంగా, నేను హెచ్చరిక చేసేవాడను మాత్రమే!"
Neml 27:93
వారితో (ఇంకా) ఇలా అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! త్వరలోనే ఆయన మీకు తన సూచనలను చూపుతాడు, అప్పుడు మీకు తెలుస్తుంది[1]. మరియు మీరు చేస్తున్న కార్యాలను నీ ప్రభువు ఎరుగకుండా లేడు!"
———
[1] చూడండి, 41:53.