Lafzullah

Telugu Meal — Mevlânâ Abdürrahîm b. Muhammed — Kasas 28:1 – Fatır 35:45

Author / source: Mevlânâ Abdürrahîm b. Muhammed — QuranEnc.com (v1.0.6)

Contents
  1. Kasas 28:1
  2. Kasas 28:2
  3. Kasas 28:3
  4. Kasas 28:4
  5. Kasas 28:5
  6. Kasas 28:6
  7. Kasas 28:7
  8. Kasas 28:8
  9. Kasas 28:9
  10. Kasas 28:10
  11. Kasas 28:11
  12. Kasas 28:12
  13. Kasas 28:13
  14. Kasas 28:14
  15. Kasas 28:15
  16. Kasas 28:16
  17. Kasas 28:17
  18. Kasas 28:18
  19. Kasas 28:19
  20. Kasas 28:20
  21. Kasas 28:21
  22. Kasas 28:22
  23. Kasas 28:23
  24. Kasas 28:24
  25. Kasas 28:25
  26. Kasas 28:26
  27. Kasas 28:27
  28. Kasas 28:28
  29. Kasas 28:29
  30. Kasas 28:30
  31. Kasas 28:31
  32. Kasas 28:32
  33. Kasas 28:33
  34. Kasas 28:34
  35. Kasas 28:35
  36. Kasas 28:36
  37. Kasas 28:37
  38. Kasas 28:38
  39. Kasas 28:39
  40. Kasas 28:40
  41. Kasas 28:41
  42. Kasas 28:42
  43. Kasas 28:43
  44. Kasas 28:44
  45. Kasas 28:45
  46. Kasas 28:46
  47. Kasas 28:47
  48. Kasas 28:48
  49. Kasas 28:49
  50. Kasas 28:50
  51. Kasas 28:51
  52. Kasas 28:52
  53. Kasas 28:53
  54. Kasas 28:54
  55. Kasas 28:55
  56. Kasas 28:56
  57. Kasas 28:57
  58. Kasas 28:58
  59. Kasas 28:59
  60. Kasas 28:60
  61. Kasas 28:61
  62. Kasas 28:62
  63. Kasas 28:63
  64. Kasas 28:64
  65. Kasas 28:65
  66. Kasas 28:66
  67. Kasas 28:67
  68. Kasas 28:68
  69. Kasas 28:69
  70. Kasas 28:70
  71. Kasas 28:71
  72. Kasas 28:72
  73. Kasas 28:73
  74. Kasas 28:74
  75. Kasas 28:75
  76. Kasas 28:76
  77. Kasas 28:77
  78. Kasas 28:78
  79. Kasas 28:79
  80. Kasas 28:80
  81. Kasas 28:81
  82. Kasas 28:82
  83. Kasas 28:83
  84. Kasas 28:84
  85. Kasas 28:85
  86. Kasas 28:86
  87. Kasas 28:87
  88. Kasas 28:88
  89. Ankebut 29:1
  90. Ankebut 29:2
  91. Ankebut 29:3
  92. Ankebut 29:4
  93. Ankebut 29:5
  94. Ankebut 29:6
  95. Ankebut 29:7
  96. Ankebut 29:8
  97. Ankebut 29:9
  98. Ankebut 29:10
  99. Ankebut 29:11
  100. Ankebut 29:12
  101. Ankebut 29:13
  102. Ankebut 29:14
  103. Ankebut 29:15
  104. Ankebut 29:16
  105. Ankebut 29:17
  106. Ankebut 29:18
  107. Ankebut 29:19
  108. Ankebut 29:20
  109. Ankebut 29:21
  110. Ankebut 29:22
  111. Ankebut 29:23
  112. Ankebut 29:24
  113. Ankebut 29:25
  114. Ankebut 29:26
  115. Ankebut 29:27
  116. Ankebut 29:28
  117. Ankebut 29:29
  118. Ankebut 29:30
  119. Ankebut 29:31
  120. Ankebut 29:32
  121. Ankebut 29:33
  122. Ankebut 29:34
  123. Ankebut 29:35
  124. Ankebut 29:36
  125. Ankebut 29:37
  126. Ankebut 29:38
  127. Ankebut 29:39
  128. Ankebut 29:40
  129. Ankebut 29:41
  130. Ankebut 29:42
  131. Ankebut 29:43
  132. Ankebut 29:44
  133. Ankebut 29:45
  134. Ankebut 29:46
  135. Ankebut 29:47
  136. Ankebut 29:48
  137. Ankebut 29:49
  138. Ankebut 29:50
  139. Ankebut 29:51
  140. Ankebut 29:52
  141. Ankebut 29:53
  142. Ankebut 29:54
  143. Ankebut 29:55
  144. Ankebut 29:56
  145. Ankebut 29:57
  146. Ankebut 29:58
  147. Ankebut 29:59
  148. Ankebut 29:60
  149. Ankebut 29:61
  150. Ankebut 29:62
  151. Ankebut 29:63
  152. Ankebut 29:64
  153. Ankebut 29:65
  154. Ankebut 29:66
  155. Ankebut 29:67
  156. Ankebut 29:68
  157. Ankebut 29:69
  158. Rum 30:1
  159. Rum 30:2
  160. Rum 30:3
  161. Rum 30:4
  162. Rum 30:5
  163. Rum 30:6
  164. Rum 30:7
  165. Rum 30:8
  166. Rum 30:9
  167. Rum 30:10
  168. Rum 30:11
  169. Rum 30:12
  170. Rum 30:13
  171. Rum 30:14
  172. Rum 30:15
  173. Rum 30:16
  174. Rum 30:17
  175. Rum 30:18
  176. Rum 30:19
  177. Rum 30:20
  178. Rum 30:21
  179. Rum 30:22
  180. Rum 30:23
  181. Rum 30:24
  182. Rum 30:25
  183. Rum 30:26
  184. Rum 30:27
  185. Rum 30:28
  186. Rum 30:29
  187. Rum 30:30
  188. Rum 30:31
  189. Rum 30:32
  190. Rum 30:33
  191. Rum 30:34
  192. Rum 30:35
  193. Rum 30:36
  194. Rum 30:37
  195. Rum 30:38
  196. Rum 30:39
  197. Rum 30:40
  198. Rum 30:41
  199. Rum 30:42
  200. Rum 30:43
  201. Rum 30:44
  202. Rum 30:45
  203. Rum 30:46
  204. Rum 30:47
  205. Rum 30:48
  206. Rum 30:49
  207. Rum 30:50
  208. Rum 30:51
  209. Rum 30:52
  210. Rum 30:53
  211. Rum 30:54
  212. Rum 30:55
  213. Rum 30:56
  214. Rum 30:57
  215. Rum 30:58
  216. Rum 30:59
  217. Rum 30:60
  218. Lukman 31:1
  219. Lukman 31:2
  220. Lukman 31:3
  221. Lukman 31:4
  222. Lukman 31:5
  223. Lukman 31:6
  224. Lukman 31:7
  225. Lukman 31:8
  226. Lukman 31:9
  227. Lukman 31:10
  228. Lukman 31:11
  229. Lukman 31:12
  230. Lukman 31:13
  231. Lukman 31:14
  232. Lukman 31:15
  233. Lukman 31:16
  234. Lukman 31:17
  235. Lukman 31:18
  236. Lukman 31:19
  237. Lukman 31:20
  238. Lukman 31:21
  239. Lukman 31:22
  240. Lukman 31:23
  241. Lukman 31:24
  242. Lukman 31:25
  243. Lukman 31:26
  244. Lukman 31:27
  245. Lukman 31:28
  246. Lukman 31:29
  247. Lukman 31:30
  248. Lukman 31:31
  249. Lukman 31:32
  250. Lukman 31:33
  251. Lukman 31:34
  252. Secde 32:1
  253. Secde 32:2
  254. Secde 32:3
  255. Secde 32:4
  256. Secde 32:5
  257. Secde 32:6
  258. Secde 32:7
  259. Secde 32:8
  260. Secde 32:9
  261. Secde 32:10
  262. Secde 32:11
  263. Secde 32:12
  264. Secde 32:13
  265. Secde 32:14
  266. Secde 32:15
  267. Secde 32:16
  268. Secde 32:17
  269. Secde 32:18
  270. Secde 32:19
  271. Secde 32:20
  272. Secde 32:21
  273. Secde 32:22
  274. Secde 32:23
  275. Secde 32:24
  276. Secde 32:25
  277. Secde 32:26
  278. Secde 32:27
  279. Secde 32:28
  280. Secde 32:29
  281. Secde 32:30
  282. Ahzab 33:1
  283. Ahzab 33:2
  284. Ahzab 33:3
  285. Ahzab 33:4
  286. Ahzab 33:5
  287. Ahzab 33:6
  288. Ahzab 33:7
  289. Ahzab 33:8
  290. Ahzab 33:9
  291. Ahzab 33:10
  292. Ahzab 33:11
  293. Ahzab 33:12
  294. Ahzab 33:13
  295. Ahzab 33:14
  296. Ahzab 33:15
  297. Ahzab 33:16
  298. Ahzab 33:17
  299. Ahzab 33:18
  300. Ahzab 33:19
  301. Ahzab 33:20
  302. Ahzab 33:21
  303. Ahzab 33:22
  304. Ahzab 33:23
  305. Ahzab 33:24
  306. Ahzab 33:25
  307. Ahzab 33:26
  308. Ahzab 33:27
  309. Ahzab 33:28
  310. Ahzab 33:29
  311. Ahzab 33:30
  312. Ahzab 33:31
  313. Ahzab 33:32
  314. Ahzab 33:33
  315. Ahzab 33:34
  316. Ahzab 33:35
  317. Ahzab 33:36
  318. Ahzab 33:37
  319. Ahzab 33:38
  320. Ahzab 33:39
  321. Ahzab 33:40
  322. Ahzab 33:41
  323. Ahzab 33:42
  324. Ahzab 33:43
  325. Ahzab 33:44
  326. Ahzab 33:45
  327. Ahzab 33:46
  328. Ahzab 33:47
  329. Ahzab 33:48
  330. Ahzab 33:49
  331. Ahzab 33:50
  332. Ahzab 33:51
  333. Ahzab 33:52
  334. Ahzab 33:53
  335. Ahzab 33:54
  336. Ahzab 33:55
  337. Ahzab 33:56
  338. Ahzab 33:57
  339. Ahzab 33:58
  340. Ahzab 33:59
  341. Ahzab 33:60
  342. Ahzab 33:61
  343. Ahzab 33:62
  344. Ahzab 33:63
  345. Ahzab 33:64
  346. Ahzab 33:65
  347. Ahzab 33:66
  348. Ahzab 33:67
  349. Ahzab 33:68
  350. Ahzab 33:69
  351. Ahzab 33:70
  352. Ahzab 33:71
  353. Ahzab 33:72
  354. Ahzab 33:73
  355. Sebe' 34:1
  356. Sebe' 34:2
  357. Sebe' 34:3
  358. Sebe' 34:4
  359. Sebe' 34:5
  360. Sebe' 34:6
  361. Sebe' 34:7
  362. Sebe' 34:8
  363. Sebe' 34:9
  364. Sebe' 34:10
  365. Sebe' 34:11
  366. Sebe' 34:12
  367. Sebe' 34:13
  368. Sebe' 34:14
  369. Sebe' 34:15
  370. Sebe' 34:16
  371. Sebe' 34:17
  372. Sebe' 34:18
  373. Sebe' 34:19
  374. Sebe' 34:20
  375. Sebe' 34:21
  376. Sebe' 34:22
  377. Sebe' 34:23
  378. Sebe' 34:24
  379. Sebe' 34:25
  380. Sebe' 34:26
  381. Sebe' 34:27
  382. Sebe' 34:28
  383. Sebe' 34:29
  384. Sebe' 34:30
  385. Sebe' 34:31
  386. Sebe' 34:32
  387. Sebe' 34:33
  388. Sebe' 34:34
  389. Sebe' 34:35
  390. Sebe' 34:36
  391. Sebe' 34:37
  392. Sebe' 34:38
  393. Sebe' 34:39
  394. Sebe' 34:40
  395. Sebe' 34:41
  396. Sebe' 34:42
  397. Sebe' 34:43
  398. Sebe' 34:44
  399. Sebe' 34:45
  400. Sebe' 34:46
  401. Sebe' 34:47
  402. Sebe' 34:48
  403. Sebe' 34:49
  404. Sebe' 34:50
  405. Sebe' 34:51
  406. Sebe' 34:52
  407. Sebe' 34:53
  408. Sebe' 34:54
  409. Fatır 35:1
  410. Fatır 35:2
  411. Fatır 35:3
  412. Fatır 35:4
  413. Fatır 35:5
  414. Fatır 35:6
  415. Fatır 35:7
  416. Fatır 35:8
  417. Fatır 35:9
  418. Fatır 35:10
  419. Fatır 35:11
  420. Fatır 35:12
  421. Fatır 35:13
  422. Fatır 35:14
  423. Fatır 35:15
  424. Fatır 35:16
  425. Fatır 35:17
  426. Fatır 35:18
  427. Fatır 35:19
  428. Fatır 35:20
  429. Fatır 35:21
  430. Fatır 35:22
  431. Fatır 35:23
  432. Fatır 35:24
  433. Fatır 35:25
  434. Fatır 35:26
  435. Fatır 35:27
  436. Fatır 35:28
  437. Fatır 35:29
  438. Fatır 35:30
  439. Fatır 35:31
  440. Fatır 35:32
  441. Fatır 35:33
  442. Fatır 35:34
  443. Fatır 35:35
  444. Fatır 35:36
  445. Fatır 35:37
  446. Fatır 35:38
  447. Fatır 35:39
  448. Fatır 35:40
  449. Fatır 35:41
  450. Fatır 35:42
  451. Fatır 35:43
  452. Fatır 35:44
  453. Fatır 35:45

Kasas 28:1

తా-సీన్-మీమ్[1]. ——— [1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

Kasas 28:2

ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయాత్)[1]. ——— [1] చూడండి, 12:1.

Kasas 28:3

విశ్వసించే ప్రజల కొరకు, మేము మూసా మరియు ఫిర్ఔన్ ల యొక్క నిజ వృత్తాంతాన్ని నీకు వినిపిస్తున్నాము.

Kasas 28:4

నిశ్చయంగా, ఫిర్ఔన్ భూమి మీద అహంకారంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. మరియు అందులోని ప్రజలను వర్గాలుగా విభజించి, వారిలోని ఒక తెగ వారిని నీచపరచి వారి పుత్రులను వధిస్తూ ఉండేవాడు[1] మరియు వారి స్త్రీలను బ్రతకనిచ్చేవాడు. నిశ్చయంగా, అతడు దౌర్జన్యపరులలోని వాడిగా ఉండేవాడు. ——— [1] వీరు ఇస్రాయీ'ల్ సంతతివారు. ఫిర్'ఔన్ జాతివారు వీరిని బానిసలుగా చేసి హింసించే వారు.

Kasas 28:5

మరియు భూమి మీద అణచి వేయబడిన వారిని కనికరించాలని మరియు వారిని నాయకులుగా చేయాలని మరియు వారిని వారసులుగా చేయాలని మేము కోరాము[1]. ——— [1] చూడండి, 7:137.

Kasas 28:6

మరియు (ఇస్రాయీల్ సంతతి) వారికి భూమిలో అధికారం ఒసంగాలనీ[1] మరియు ఫిర్ఔన్, హామాన్[2] మరియు వారి సైనికులకు - దేనిని గురించైతే (ఫిర్ఔన్ జాతి) వారు భయపడుతూ ఉండేవారో[3] - అదే వారికి చూపాలని! ——— [1] ఇక్కడ అ'ర్దున్, భూమి అంటే కనాన్ (షామ్). [2] హామాన్, ఫిర్'ఔన్ యొక్క ముఖ్య నాయకుడు. చూడండి, 40:36-37. [3] అంటే, ఇస్రాయీ'ల్ సంతతివారి ద్వారా తమ నాశనం కావచ్చనే ఏ భయం వల్లనైతే ఫిర్'ఔన్ జాతి వారు ఇస్రాయీ'ల్ సంతతివారి మగ సంతానాన్ని హత్య చేస్తూ ఉండేవారో - దానినే వారికి సత్యం చేసి చూపటానికి.

Kasas 28:7

మేము మూసా తల్లి మనస్సులో ఇలా[1] సూచించాము: "నీవు అతనికి (మూసాకు) పాలు ఇస్తూ ఉండు. కాని అతనికి ప్రమాదమున్నదని, నీవు భావిస్తే అతనిని నదిలో విడిచి పెట్టు[2]. మరియు నీవు భయపడకు మరియు దుఃఖించకు; నిశ్చయంగా మేము అతనిని నీ వద్దకు తిరిగి చేర్చుతాము. మరియు అతనిని (మా) సందేశహరులలో ఒకనిగా చేస్తాము!" ——— [1] వ'హీ: అంటే ఇక్కడ ఆమె మనస్సులో ఆలోచన పుట్టించడం. [2] చూడండి, 20:39.

Kasas 28:8

తరువాత ఫిర్ఔన్ కుటుంబంవారు[1] - తమకు శత్రువై, దుఃఖకారణుడవటానికి - అతనిని ఎత్తుకున్నారు. నిశ్చయంగా ఫిర్ఔన్, హామాన్ మరియు వారి సైనికులు పాపిష్ఠులు! ——— [1] అంటే ఫిర్'ఔన్ భార్య. ఇంకా చూడండి, 66:11.

Kasas 28:9

మరియు ఫిర్ఔన్ భార్య (అతనితో) ఇలా అన్నది: "ఇతను నీకూ మరియు నాకూ కంటి చలువ! ఇతనిని చంపకు, బహుశా ఇతడు మనకు ఉపయోగకారి కావచ్చు![1] లేదా మనం ఇతనిని కుమారునిగా చేసుకోవచ్చు!" కాని వారు (వాస్తవాన్ని) తెలుసుకోలేక పోయారు. ——— [1] వారికి సంతానం లేనందుకు ఆమె అతనిని ('అ.స.ను) కుమారునిగా చేసుకోదలచింది.

Kasas 28:10

మరియు మూసా తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఆమె విశ్వసించినవారిలో ఉండటానికి మేము, ఆమె హృదయాన్ని దృఢపరచి ఉండకపోతే, ఆమె అతనిని (మూసాను) గురించి అంతా బట్టబయలు చేసి ఉండేది.

Kasas 28:11

ఆమె, అతని (మూసా) సోదరితో[1] అన్నది: "అతని వెంట వెళ్ళు." కావున ఆమె దూరం నుండియే అతనిని గమనించసాగింది. కానీ, వారది గ్రహించలేక పోయారు. ——— [1] మూసా('అ.స.) సోదరీమణి పేరు మర్యమ్ బిన్తె 'ఇమ్రాన్ మరియు 'ఈసా ('అ.స.) తల్లిపేరు కూడా మర్యమ్ బిన్తె 'ఇమ్రాన్.

Kasas 28:12

మరియు మేము అతనిని (ఇతరుల) పాలు త్రాగకుండా మొదటనే నిషేధించి ఉన్నాము. (అతని సోదరి) వారితో అన్నది: "మీ కొరకు అతనిని (పాలిచ్చి) పోషించగల ఒక కుటుంబం వారిని నేను మీకు చూపనా? మరియు వారు అతనిని మంచిగా చూసుకునే వారై ఉంటారు."

Kasas 28:13

ఈ విధంగా మేము అతనిని (మూసాను) - అతని తల్లి కళ్ళు చల్లబడటానికి, ఆమె దుఃఖించకుండా ఉండటానికి మరియు అల్లాహ్ వాగ్దానం సత్యమైనదని ఆమె తెలుసుకోవటానికి - తిరిగి ఆమె వద్దకు చేర్చాము. కాని వాస్తవానికి చాలా మందికి ఇది తెలియదు.

Kasas 28:14

మరియు అతను (మూసా) యుక్తవయస్సుకు చేరి పరిపూర్ణుడు అయినప్పుడు, మేము అతనికి వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు ఈ విధంగా, మేము సజ్జనులకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము.[1] ——— [1] చూడండి, 12:22.

Kasas 28:15

మరియు (ఒకరోజు) నగరవాసులు ఏమరుపాటులో ఉన్నప్పుడు, అతను నగరంలోకి ప్రవేశించాడు, అతను ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడం చూశాడు, వారిలో ఒకడు అతని జాతికి చెందినవాడు, మరొకడు విరోధి జాతికి చెందినవాడు. అతని జాతికి చెందిన వాడు, విరోధి జాతివానికి వ్యతిరేకంగా సహాయపడమని అతనిని (మూసాను) అర్థించాడు. మూసా అతడిని ఒక గుద్దుగుద్దాడు. అది అతడిని అంతమొందించింది. (అప్పుడు) అతను (మూసా) అన్నాడు: "ఇది షైతాన్ పనే! నిశ్చయంగా, అతడు శత్రువు మరియు స్పష్టంగా దారి తప్పించేవాడు."[1] ——— [1] దైవప్రవక్త ప్రవచనం: 'తెగలకొరకు, తెగల పేరట కృషిచేసేవాడూ మరియు తెగల కొరకు పోరాడే వాడూ మరియు తెగల కొరకు మరణించేవాడూ మాలోనివాడుకాడు!' (అబూ దావూద్ - 'జుబైర్ ఇబ్నె మత్'ఇమ్ - కథనం ఆధారంగా) దీని భావం అడుగగా అతను ('స'అస) అన్నారు: 'అన్యాయ విషయంలో తమ వారికి సహాయపడటం.'

Kasas 28:16

(మూసా) ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. కావున నన్ను క్షమించు!" (అల్లాహ్) అతనిని క్షమించాడు. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత[1]. ——— [1] ఉద్ధేశ్యపూర్వకంగా చంపకున్నా, ఒక మానవుని హత్య జరిగింది. దానికి మూసా ('అ.స.) పశ్చాత్తాపపడి క్షమాపణ వేడుకుంటే, అల్లాహ్ (సు.తా.) అతనిని క్షమించాడు.

Kasas 28:17

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నాకు మహోపకారం చేశావు. కావున నేను ఇక ఎన్నటికీ నేరస్తులకు సహాయపడను!"

Kasas 28:18

మరుసటి రోజు ఉదయం అతను (మూసా) భయపడుతూ అతని జాగ్రత్తగా (ఇటూ అటూ చూస్తూ) నగరంలోకి వెళ్ళాడు. అప్పుడు అకస్మాత్తుగా అంతకు ముందు రోజు, అతనిని సహాయానికి పిలిచినవాడే, మళ్ళీ సహాయానికై అరవసాగాడు. మూసా వానితో అన్నాడు: "నిశ్చయంగా, నీవు స్పష్టమైన తప్పు దారికి లాగేవాడవు!"[1] ——— [1] ఇబ్నె 'అబ్బాస్ మరియు ముఖాతిల్ (ర'ది.'అన్హుమ్) ల కథనం ప్రకారం ఆ ఇస్రాయీ'ల్ వంశీయుడు సత్యతిరస్కారి.

Kasas 28:19

ఆ తరువాత అతను తమ ఇద్దరికీ విరోధి అయిన వాడిని గట్టిగా పట్టుకోబోగా, అతడు అరిచాడు: "ఓ మూసా! ఏమీ? నీవు నిన్న ఒక వ్యక్తిని చంపినట్లు నన్ను కూడా చంపదలచుకున్నావా? నీవు ఈ దేశంలో క్రూరునిగా మారి ఉండదలుచుకున్నావా? సద్వర్తనునిగా ఉండదలుచుకోలేదా?"

Kasas 28:20

మరియు ఒక వ్యక్తి నగరపు ఒక వైపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: ఓ మూసా! నాయకులందరూ కలిసి నిన్ను హత్య చేయాలని సంప్రదింపులు చేస్తున్నారు. కావున నీవు వెళ్ళిపో, నేను నిశ్చయంగా, నీ శ్రేయోభిలాషిని!"

Kasas 28:21

అప్పుడతను భయపడుతూ, అతి జాగ్రత్తగా అక్కడి నుండి బయలు దేరాడు. అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను దుర్మార్గుల నుండి కాపాడు!"

Kasas 28:22

ఆ తరువాత మద్ యన్ వైపుకు బయలు దేరుతూ, ఇలా అనుకున్నాడు: "బహుశా, నా ప్రభువు నాకు సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తున్నాడు!"[1] ——— [1] మద్ యన్ అక్కడ నివసించే ప్రజల తెగ పేరు. వారు అమోరైట్ (Amorite) తెగకు చెందిన 'అరబ్బులు. యూదుల సంతతితో వారికి దగ్గరి సంబంధం ఉండెను. చూడండి, 7:8. ఇబ్రాహీమ్ ('అ.స.) కుమారుడైన ఇస్'హాఖ్ ('అ.స.) యొక్క కుమారుడగు య'అఖూబ్ ('అ.స.) మరొక పేరు ఇస్లాయీ'ల్. ఆ పేరుతోనే పిలువబడే అతని పన్నెండుమంది కుమారుల సంతతి వారే ఇస్రాయీ'ల్ సంతతి వారు (బనీ ఇస్రాయీ'ల్).

Kasas 28:23

ఇత అతను మద్ యన్ లోని ఒక బావి వద్దకు చేరుకున్నప్పుడు; అక్కడ చాలా మంది ప్రజలు, తమ తమ పశువులకు నీరు త్రాగించటాన్ని మరియు వారికి దూరంగా ఒక ప్రక్కన ఇద్దరు స్త్రీలు తమ పశువులను ఆపుతూ ఉండటాన్ని చూశాడు. (మూసా) ఆ స్త్రీలను అడిగాడు: "మీరిద్దరి చిక్కు ఏమిటి?" వారిద్దరన్నారు: "ఈ పశువుల కాపరులంతా పోయే వరకు మేము (మా పశువులకు) నీరు త్రాపలేము. మరియు మా తండ్రి చాలా వృద్ధుడు"

Kasas 28:24

అప్పుడు అతను వారిద్దరి పశువులకు నీరు త్రాపాడు. తరువాత నీడలోకి పోయి ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నీవు నాపై ఏ మేలును అవతరింపజేసినా, నేను దాని ఆవశ్యకత గలవాడనే!"

Kasas 28:25

తరువాత ఆ ఇద్దరిలో ఒకామె సిగ్గుపడుతూ మెల్లగా అతని వద్దకు వచ్చి ఇలా అన్నది: "వాస్తవానికి నా తండ్రి - నీవు మా కొరకు (మా పశువులకు) నీరు త్రాపించి నందుకు - ప్రతిఫలమివ్వటానికి, నిన్ను పిలుస్తున్నాడు."[1] అతను, అతని వద్దకు పోయి తన వృత్తాంతాన్ని వినిపించాడు. అప్పుడతను అన్నాడు: "నీవు ఏ మాత్రం భయపడకు. నీవు దుర్మార్గ ప్రజల నుండి విముక్తి పొందావు." ——— [1] ఆ ఇద్దరు స్త్రీల తండ్రి పేరు ఖుర్ఆన్ పేర్కొనలేదు. ఇమామ్ షౌకాని మరియు ఇతర చాలామంది వ్యాఖ్యాతలు అతని పేరు షు'ఐబ్ ('అ.స.) అని అన్నారు. ఎందుకంటే అతను మద్ యన్ జాతి వారివైపునకే ప్రవక్తగా పంపబడి ఉండెను. కాని ఇబ్నె-కసీ'ర్ అభిప్రాయం వేరుంది. అతను అంటారు: 'షు'ఐబ్ ('అ.స.) మరియు మూసా ('అ.స.) కాలాలలో చాలా గడువు ఉంది. కాబట్టి ఇతను షు'ఐబ్ ('అ.స.) తెగకు చెందిన మరొక వ్యక్తి కావచ్చు.' అల్లాహు ఆలమ్.

Kasas 28:26

వారిద్దరిలో ఒకామె ఇలా అన్నది: "నాన్నా! ఇతనిని పని కొరకు పెట్టుకో. నిశ్చయంగా, ఇలాంటి బలవంతుని మరియు నమ్మదగిన వానిని పని కొరకు పెట్టుకోవటం ఎంతో మేలైనది."

Kasas 28:27

(వారి తండ్రి) అన్నాడు: "నీవు నా వద్ద ఎనిమిది సంవత్సరాలు పని చేస్తూ ఉండటానికి ఒప్పుకుంటే, నేను నా ఈ ఇద్దరు కుమార్తెలలో ఒకామెను నీకిచ్చి వివాహం చేయగోరుతున్నాను.[1] నీవు ఒకవేళ పది సంవత్సరాలు పూర్తి చేయదలిస్తే అది నీ ఇష్టం! నేను నీకు కష్టం కలిగించ దలచుకోలేదు. అల్లాహ్ కోరితే, నీవు నన్ను సద్వర్తనునిగా పొందుతావు!" ——— [1] మన సాంఘిక సంప్రదాయంలో ఆడబిడ్డ (వధువు) ఇంటివారు తమ బిడ్డ కొరకు వరుని (పెండ్లి కుమారుని) వారితో వివాహసంబంధం గురించి మొదట మాట ప్రారంభించటం అనుచితమైన విషయంగా భావిస్తారు. కాని అల్లాహ్ (సు.తా.) షరీయత్ లో ఇది అనుచితం కాదు. ఒకవేళ సద్వర్తనుడు, సుశీలుడు అయిన వరుడు ఉంటే అతనితో గానీ, లేక అతని కుటుంబంవారితో గానీ, వధువు ఇంటివారు మాట్లాడితే తప్పులేదు. దైవప్రవక్త ('స'అస) మరియు సహాబీల (ర'ది.'అన్హుమ్)లలో కూడా ఈ ఆచారం ఉండెను.

Kasas 28:28

(మూసా) అన్నాడు: "ఈ విషయం నీకూ మరియు నాకూ మధ్య నిశ్చయమే! ఈ రెండు గడువులలో నేను దేనిని పూర్తి చేసినా, నా పై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. మరియు మన ఈ మాటలకు అల్లాహ్ యే సాక్షి!"

Kasas 28:29

ఆ తరువాత మూసా తన గడువు[1] పూర్తి చేసి, తన కుటుంబం వారిని తీసుకొని పోతుండగా, తూర్ పర్వతపు దిక్కులో ఒక మంటను చూశాడు. (అప్పుడు) తన ఇంటి వారితో అన్నాడు: "ఆగండి! నేను ఒక మంటను చూశాను, బహుశా! నేను అక్కడి నుండి ఏదైనా మంచి వార్తను తీసుకొని రావచ్చు, లేదా ఒక అగ్ని కొరవినైనా! అప్పుడు మీరు దానితో చలి కాచుకోవచ్చు." ——— [1] ఇబ్నె 'అబ్బాస్ (ర'ది.'అ.) కథనం ప్రకారం అతను ఈ గడువు పది సంవత్సరాలు పూర్తి చేశారు. ఎందుకంటే మూసా ('అ.స.) వృద్ధుడైన తన భార్య తండ్రికి సహాయపడగోరారు. చూడండి, 27:7-8.

Kasas 28:30

కాని అతను దాని (అగ్ని) వద్దకు చేరుకున్నప్పుడు,[1] ఆ లోయ కుడివైపు ఉన్న ఒక శుభవంతమైన స్థలములో ఉన్న ఒక చెట్టు నుండి: "ఓ మూసా! నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! సర్వలోకాల ప్రభువును." అనే మాటలు వినిపించాయి. ——— [1] ఆ మంట వాస్తవానికి అల్లాహ్ (సు.తా.) దివ్యజ్యోతి. చూడండి, 19:52, 20:80.

Kasas 28:31

(ఇంకా ఇలా వినిపించింది): "నీ చేతి కర్రను పడవేయి!" అతను (మూసా) దానిని పామువలే కదలటం చూసి వెనక్కి మరలి పరుగెత్తాడు, తిరిగి కూడా చూడలేదు. (తరువాత ఇలా సెలవీయబడింది): "ఓ మూసా, ముందుకు రా, భయపడకు! నిశ్చయంగా, నీవు సురక్షితంగా ఉన్నావు!

Kasas 28:32

నీ చేతిని నీ చంకలోకి దూర్చుకో, అది ఎలాంటి లోపం లేకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది[1]. నీవు భయపడకుండా ఉండటానికి నీ చేతిని నీ ప్రక్కకు అదుముకో! ఈ రెండు, నీవు ఫిర్ఔన్ మరియు అతని నాయకులకు (చూపటానికి) నీ ప్రభువు ప్రసాదించిన నిదర్శనాలు (ఆయాత్). నిశ్చయంగా వారు చాలా దుష్టులయి పోయారు!" ——— [1] చూడండి, 7:108.

Kasas 28:33

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నేను వారి మనిషిని ఒకనిని చంపాను. కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను.

Kasas 28:34

మరియు నా సోదరుడు హారూన్ మాట్లాడటంలో నా కంటే మంచి వాగ్ధాటి గలవాడు.[1] నన్ను సమర్థించటానికి అతనిని నాకు సహాయకునిగా నాతో పాటు పంపు. వాస్తవానికి వారు నన్ను అసత్యవాదివని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను!" ——— [1] చూడండి, 20:27-28 మరియు 26:12-13

Kasas 28:35

ఆయన (అల్లాహ్) అన్నాడు: "మేము నీ సోదరుని ద్వారా నీ చేతులను బలపరుస్తాము. మరియు మేము మీ ఇద్దరికీ విశేష శక్తి నొసంగుతాము. వారు మీ ఇద్దరికి ఏ మాత్రం హాని చేయలేరు. మా సూచనల ద్వారా మీరిద్దరూ మరియు మిమ్మల్ని అనుసరించే వారు గెలుపొందుతారు."[1] ——— [1] ఆ వాక్యం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. చూడండి, 5:67, 33:39, 51:21, 40:51-52..

Kasas 28:36

ఆ తరువాత మూసా మా స్పష్టమైన సూచనలను తీసుకొని వారి వద్దకు పోగా వారన్నారు: "ఇది కల్పితమైన మాయాజాలం మాత్రమే.[1] ఇలాంటిది పూర్వీకులైన మా తాతముత్తాతల కాలంలో కూడా జరిగినట్లు మేము వినలేదు."[2] ——— [1] చూడండి, 74:24. [2] చూడండి, 38:5.

Kasas 28:37

ఇక మూసా అన్నాడు: "నా ప్రభువు తరఫు నుండి ఎవడు మార్గదర్శకత్వం తీసుకొని వచ్చాడో మరియు చివరికి ఎవరి పర్యవసానం మంచిదవుతుందో ఆయనకు బాగా తెలుసు.[1] నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు." ——— [1] పరలోక సాఫల్యమే నిజమైన సాఫల్యం. సత్యతిరస్కారులు ఇహలోకంలో సాఫల్యం పొంద వచ్చు. భూలోకంలో దొరికే సుఖసంతోషాలు తాత్కాలికమైనవే! వాస్తవానికి పరలోక సుఖ సంతోషాలే చిరకాలముండేవి.

Kasas 28:38

మరియు ఫిర్ఔన్ అన్నాడు: "ఓ నాయకులారా! నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు గలడని నాకు తెలియదు.[1] కావున ఓ హామాన్! కాల్చిన మట్టి ఇటుకలతో నాకొక ఎత్తైన గోపురాన్ని నిర్మించు. దానిపై ఎక్కి నేను బహుశా, మూసా దేవుణ్ణి చూడగలనేమో! నిశ్చయంగా, నేను ఇతనిని అసత్యవాదిగా భావిస్తున్నాను." ——— [1] చూడండి, 79:24.

Kasas 28:39

మరియు, అతడు మరియు అతడి సైనికులు భూమిపై అన్యాయంగా అహంభావాన్ని ప్రదర్శించారు. మరియు నిశ్చయంగా, మా వైపుకు తాము ఎన్నడూ మరలిరారని భావించారు.

Kasas 28:40

కావున మేము అతనిని మరియు అతని సేనలను పట్టుకొని సముద్రంలోకి విసరివేశాము. ఇక చూడు! దుర్మార్గుల పర్యవసానం ఏమయిందో!

Kasas 28:41

మరియు మేము వారిని నరకం వైపునకు పిలిచే నాయకులుగా చేశాము. మరియు పునరుత్థాన దినమున వారికెలాంటి సహాయం దొరకదు.

Kasas 28:42

మరియు మేము ఈ లోకంలో కూడా అభిశాపం వారిని వెంటాడేటట్లు చేశాము. మరియు పునరుత్థాన దినమున వారు తృణీకరింప బడేవారిలో చేరుతారు.

Kasas 28:43

మరియు వాస్తవానికి - పూర్వ తరాల వారిని నాశనం చేసిన తరువాత - మేము మానవులకు జ్ఞానవృద్ధి చేయటానికి మరియు వారికి మార్గదర్శకత్వంగా కారుణ్యంగా ఉండటానికి, మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. బహుశా వారు హితబోధ నేర్చుకుంటారని!

Kasas 28:44

మరియు (ఓ ముహమ్మద్!) మేము మూసాపై మా ఆదేశం (తౌరాత్) పూర్తిగా అవతరింప జేసినపుడు, నీవు (తూర్ పర్వతపు) కుడి వైపునా లేవు. మరియు నీవు అక్కడ ప్రత్యక్ష సాక్షులలో కూడా లేవు!

Kasas 28:45

కాని నిశ్చయంగా, (ఆ తరువాత కూడా) మేము అనేక తరాలను ప్రభవింపజేశాము. వారి మీదుగా ఒక సుదీర్ఘకాలం గడిచి పోయింది. మా సూచనలను వినిపించటానికి నీవు మద్ యన్ వాసులతో కూడా లేవు, కాని మేము (ఎల్లప్పుడూ) మా సందేశహరులను పంపుతూ వచ్చాము.

Kasas 28:46

మరియు మేము (మూసాను) పిలిచినపుడు, నీవు (ఓ ముహమ్మద్!) తూర్ పర్వతం దగ్గర లేవు. కాని నీవు నీ ప్రభువు యొక్క కారుణ్యంతో, నీకు పూర్వం హెచ్చరిక చేసేవాడు రానటువంటి జాతివారిని హెచ్చరించటానికి - బహుశా వారు హితబోధ నేర్చుకుంటారేమోనని - (పంపబడ్డావు).

Kasas 28:47

మరియు వారు తమ చేతులారా, చేసుకొని పంపిన కర్మల ఫలితంగా వారిపై ఆపద వచ్చి పడినపుడు, వారు: "ఓ మా ప్రభూ! నీవు మా వద్దకు ఒక సందేశహరుణ్ణి ఎందుకు పంపలేదు, అలా చేస్తే మేము నీ సూచనలను అనుసరిస్తూ, విశ్వాసులైన వారిలో చేరి ఉండేవారం కదా!" (అని తీర్పు దినమున అనకూడదని).

Kasas 28:48

ఆ తర్వాత మా తరఫు నుండి వారి వద్దకు సత్యం వచ్చినపుడు, వారిలా అన్నారు: "మూసాకు ఇవ్వ బడినటువంటిది, ఇతనికి ఎందుకు ఇవ్వబడలేదు!" ఏమీ? దీనికి పూర్వం మూసాకు ఇవ్వబడిన దానిని వారు తిరస్కరించలేదా? వారన్నారు: "రెండూ మాయాజాలాలే! అవి ఒకదాని కొకటి సహాయపడుతున్నాయి." ఇంకా ఇలా అన్నారు: "నిశ్చయంగా, మేము వీటన్నింటినీ తిరస్కరిస్తున్నాము."

Kasas 28:49

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "మీరు నిజాయితీపరులే అయితే, అల్లాహ్ దగ్గర నుండి ఈ రెండింటి కంటే ఉత్తమమైన మార్గం చూపే ఒక గ్రంథాన్ని తీసుకురండి. దానిని నేను అనుసరిస్తాను."

Kasas 28:50

వారు నీకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే, వారు కేవలం తమ కోరికలను అనుసరిస్తున్నారని తెలుసుకో! మరియు అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని విడిచి కేవలం తన కోరికలను అనుసరించే వాని కంటే ఎక్కువ మార్గభ్రష్టుడు ఎవడు? నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు.

Kasas 28:51

మరియు వారు హితబోధ పొందాలని, వాస్తవంగా మేము ఈ వచనాన్ని (ఖుర్ఆన్ ను) క్రమక్రమంగా అందజేశాము.

Kasas 28:52

ఎవరికైతే పూర్వం మేము గ్రంథాన్ని ఇచ్చామో వారు దీనిని (ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు.[1] ——— [1] అంటే యూదులలో 'అబ్దుల్లాహ్ బిన్-సల్లామ్ మరియు 'హబష నుండి వచ్చిన క్రైస్తవులు (ర'.ది.'అన్హుమ్). చూడండి, 26:196-197.

Kasas 28:53

మరియు వారికి ఇది వినిపించబడి నప్పుడు, వారు ఇలా అంటారు: "మేము దీనిని విశ్వసించాము, నిశ్చయంగా ఇది మా ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నిశ్చయంగా, మేము మొదటి నుండియో అల్లాహ్ కు విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము."[1] ——— [1] ఈ విషయం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. దైవప్రవక్తలందరూ ప్రచారం చేసిన ధర్మం ఇస్లాం మాత్రమే. అంటే ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) కు తప్ప ఇతరులకు దాస్యం, ఆరాధన చేయరాదని. ప్రతికాలపు వారు తమతమ భాషలలో దానికి వివిధ పేర్లు ఇచ్చారు. అంటే క్రైస్తవధర్మం, యూదధర్మం, మొదలైనవి. కాని వాస్తవానికి ప్రవక్తలందరి ధర్మం ఇస్లాం మాత్రమే. అంటే అల్లాహ్ (సు.తా.) కు విధేయులై కేవలం ఆయనకే దాస్యం, ఆరాధన చేయటం. కాని ఆ ప్రాచీన దివ్యగ్రంథాలు ఆయా ప్రవక్తల ప్రచారానికి ఎన్నో వందల సంవత్సరాల తరువాత లిఖిత రూపంలోకి వచ్చాయి. దాని వల్ల వాటిని లిఖించిన వారు, తమ ప్రవక్తుల వినిపించిన దివ్యసందేశాలను వాటి అసలు అవతరించిన రూపంలో వ్రాయలేక పోయారు. తరువాత తరాల ధర్మవేత్తలు మొదటి వారు వ్రాసిన వాటితో ఏకీభవించక వాటిలో మార్పులు చేస్తూ పోయారు. ఉదాహరణకు: ఈ రోజు ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ ప్రామాణికమైనదిగా పరిగణించబడే బైబిల్ - ఏదైతే తౌరాత్, 'జబూర్ మరియు ఇంజీల్ గ్రంథా(Old and New Testaments)ల సముదాయమో - అందులో కూడా ఎన్నోసార్లు మార్పులు చేయబడ్డాయి. చివరి మార్పులు గలది, ఈనాటి (Revised) Authorized K.J.V. అందుకే అసలు ఆ ప్రవక్తలు ప్రచారం చేసింది, ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.) ఆరాధన. అయినా ఈనాడు వాటిలో మానవులు మార్పులు చేయడం వల్ల, ఆ గ్రంథాలను అనుసరిస్తున్నారు ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.) ఆరాధనను వదలి, బహుదైవారాధన, ప్రవక్తల విగ్రహాల ఆరాధన చేస్తున్నారు. కాని ఇస్లాం స్వీకరించిన యూదులు మరియు క్రైస్తవులు సత్యాన్ని తెలుసుకొని: 'మేము మొదటి నుండియే ముస్లింలముగా ఉన్నాము' అని అన్నారు. ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.) ఆరాధనయే సత్యధర్మమని, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు.

Kasas 28:54

వీరే, తమ సహనానికి ఫలితంగా రెండింతలు ప్రతిఫలమొసంగపడే వారు.[1] వీరే మంచితో చెడును నివారించే వారు. మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి ఖర్చు చేసేవారు. ——— [1] చూసహనం వహించటం అంటే, ఇక్కడ దైవప్రవక్తలను మరియు దివ్యగ్రంథాలను విశ్వసించి ఆ విశ్వాసంపై స్థిరంగా ఉండటం. మొదటి దివ్యగ్రంథం మీద స్థిరంగా ఉండి, రెండవ దివ్యగ్రంథం వస్తే దానిని అనుసరించటం. ఇలాంటి వారికి రెండింతలు ప్రతిఫలముంది. రెండింతలు ప్రతిఫలం పొందే ముగ్గురిలో వీరొకరు. ('స.బు'ఖారీ) చూ. 13:22.

Kasas 28:55

మరియు వారు వ్యర్థమైన మాటలు విన్నప్పుడు, ఇలా అంటూ దూరంగా తొలగి పోతారు: "మాకు మా కర్మలు మరియు మీకు మీ కర్మలు, మీకు సలాం![1] మాకు మూర్ఖులతో పనిలేదు." ——— [1] ఈ సలాం అభివందనం కాదు. మేము మీవంటి మూర్ఖులతో వాదులాడమని తప్పించుకోవటానికి పలికేది. చూడండి, 25:63, 43:89.

Kasas 28:56

(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేయలేవు, కాని అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకత్వం పొందే వారెవరో బాగా తెలుసు.[1] ——— [1] చూఈ ఆయత్ దైవప్రవక్త ('స'అస) పినతండ్రి అబూ 'తాలిబ్ మరణిచినప్పుడు అవతరింపజేయబడింది. అతని ఆఖరు ఘడియలలో దైవప్రవక్త ('స'అస) అతనితో అన్నారు: "ఇప్పుడైనా: 'లా ఇలాహ ఇల్లల్లాహ్' అను. దానితో నేను పునరుత్థానదినమున నీ క్షమాపణ కొరకు అల్లాహ్ (సు.తా.)ను పేడుకోగలను." అక్కడున్న ఖురైష్ సర్దారులను చూసి అతను అలా అనలేదు. ('స'హీ'హ్ బు'ఖారీ) ఇంకా చూ. 14:4.

Kasas 28:57

వారు ఇలా అంటారు: "ఒకవేళ నీతో పాటు మేము కూడా ఈ మార్గదర్శకత్వాన్ని అవలంబిస్తే! మేము మా భూమి నుండియే పారద్రోలబడతాము."[1] ఏమీ? మేము వారిని శాంతికి నిలయమైన ఒక పవిత్ర స్థలం (మక్కా) లో స్థిరనివాసము నొసంగి వారికి మా తరఫు నుండి జీవనోపాధిగా అన్ని రకాల ఫలాలను సమకూర్చలేదా? కాని వాస్తవానికి వారిలో చాలా మందికి ఇది తెలియదు.[2] ——— [1] దీనిని ఈ విధంగా బోధించారు: 1) ఆ కాలపు ఖురైషులు ఇస్లాం స్వీకరిస్తే, వారి తోటి వారు, వారిని మతద్రోహులుగా పరిగణించి వారిని, వారి నగరం మక్కా నుండి పారద్రోలుతారని భయపడ్డారు. 2) అదే విధంగా ఈ కాలంలో కూడా చాలామంది ఇది సత్యధర్మమని తెలిసి కూడా తమ బంధువుల నుండి మరియు తమ సమాజం నుండి విడదీయబడతామని భయపడి సత్యాన్ని అవలంబించరు. కాని రాబోయే పరలోక జీవితపు శాశ్వత సుఖాల ముందు ఈ జీవిత సుఖం అతి స్వల్పమైనదనే సత్యాన్ని వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది! [2] చూడండి, 14:35-41, 21:26, 29:67. 22. ఇబ్రాహీం ('అ.స.) మక్కా కొరకు చేసిన ప్రార్థన.

Kasas 28:58

మరియు మేము ఎన్నో నగరాలను, జీవన సుఖసంపదలతో ఉప్పొంగిపోతూ ఉండగా, వాటిని నాశనం చేయలేదా! అవిగో వారి నివాసాలు, వారి తరువాత వాటిలో నివసించిన వారు చాలా తక్కువ! మరియు నిశ్చయంగా, మేమే వాటికి వారసులయ్యాము. [1] ——— [1] చూడండి, 15:23.

Kasas 28:59

మరియు నీ ప్రభువు నగరాలను ఏ మాత్రమూ నాశనం చేసేవాడు కాదు, ఎంత వరకైతే వాటి ముఖ్య నగరానికి మా సూచన (ఆయాత్) లను వినిపించే సందేశహరులను పంపమో! మేము నగరాలను వాటి ప్రజలు దుర్మార్గులై పోతే తప్ప, నాశనం చేసే వారం కాము.[1] ——— [1] సందేశహరులు ఎల్లప్పుడూ పెద్ద నగరాలలోనే పంపబడ్డారు. వారే దాని చుట్టూ ఉన్న చిన్న గ్రామాల వారికి కూడా ప్రచారం చేశారు. కేవలం సత్యతిరస్కారులుగా ఉన్నంత మాత్రాన, ఏ నగరవాసులు కూడా నాశనం చేయబడలేదు. సత్యతిరస్కారంతో బాటు వాటిలోని ప్రజలు దుర్మార్గానికి, విశ్వాసుల పట్ల దౌర్జన్యానికి పాల్పడినప్పుడే అవి నాశనం చేయబడ్డాయి. చూడండి, 11:117, 6:130-132, 28:59.

Kasas 28:60

మరియు మీకు ఇవ్వబడిన వన్నీ ఈ ప్రాపంచిక జీవితపు సుఖసంతోషాల సామాగ్రి మరియు దాని అలంకరణలు మాత్రమే! కాని అల్లాహ్ వద్ద ఉన్నది దీని కంటే ఎంతో ఉత్తమమైనది మరియు నిత్యమైనది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?[1] ——— [1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'అల్లాహ్ (సు.తా.) సాక్షి! ఈ ప్రాపంచిక జీవితం పరలోక జీవితం ముందు, ఒకడు తన వ్రేలును సముద్రంలో ముంచి బయటికి తీస్తే, దానికి అంటే నీటితో సమానమైనది.' ('స'హీ'హ్ ముస్లిం)

Kasas 28:61

ఏమీ? మేము చేసిన మంచి వాగ్దానాన్ని తప్పకుండా పొందేవాడు,[1] మేము ఒసంగిన ఈ ప్రాపంచిక సుఖసంతోషాలు పొంది, పునరుత్థాన దినమున మా ముందు (శిక్షకై) హాజరు చేయబడే వాడితో సమానుడు కాగలడా? ——— [1] చూఅల్లాహ్ (సు.తా.) మంచి వాగ్దానం చేసిన, సద్వర్తనులైన విశ్వాసులకు: 'ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!' చూడండి, 2:38, 62, 112, 262, 274, 277, 3:170, 5:69, 6:48, 7:35, 49, 10:62, 46:13.

Kasas 28:62

మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ రోజు ఆయన (అల్లాహ్) వారిని పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు నా భాగస్వాములని నొక్కి చెప్పిన వారు (భావించిన వారు) ఇప్పుడు ఎక్కడున్నారు?"[1] ——— [1] చూడండి, 6:22-23.

Kasas 28:63

ఎవరైతే ఆ మాట (శిక్ష) వర్తిస్తుందో, వారిలా విన్నవించుకుంటారు: "ఓ మా ప్రభూ! మేము దారి తప్పించిన వారు వీరే! మేము దారి తప్పిన విధంగానే వీరిని కూడా దారి తప్పించాము. వీరితో మాకెలాంటి సంబంధం లేదని నీ ముందు ప్రకటిస్తున్నాము. అసలు వీరు మమ్మల్ని ఆరాధించనేలేదు."[1] ——— [1] అసలు వీరు మమ్మల్ని ఆరాధించనే లేదు. ఈ వాక్యం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. చూడండి, 6:49, 19:81, 82, 46:5-6, 10:28, 29:25, 2:166, 167 .

Kasas 28:64

మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు సాటి కల్పించిన మీ భాగస్వాములను పిలువండి!" అప్పుడు వారు, వారిని (భాగస్వాములను) పిలుస్తారు, కాని వారు, వారికి సమాధానమివ్వరు. మరియు వారు శిక్షను చూసి (అనుకుంటారు): "ఒకవేళ వాస్తవానికి తాము సన్మార్గాన్ని అవలంబించి వుంటే ఎంత బాగుండేది!" [1] అని. ——— [1] ఇంకా చూడండి, 18:52, 53.

Kasas 28:65

మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆయన (అల్లాహ్) వారిని పిలిచిన రోజు ఇలా ప్రశ్నిస్తాడు: "మేము పంపిన సందేశహరులకు మీరు ఏ విధంగా సమాధానమిచ్చారు?"

Kasas 28:66

ఆ రోజు వారి సమాధానాలన్నీ (కారణాలన్నీ) అస్పష్టమై పోతాయి మరియు వారు ఒకరితో నొకరు సంప్రదించుకోనూ లేరు.

Kasas 28:67

కాని ఎవడైతే పశ్చాత్తాప పడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో! అతడు సాఫల్యం పొందే వారిలో చేరగలడని ఆశించవచ్చు!

Kasas 28:68

మరియు నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు ఎన్నుకుంటాడు. మరియు ఎన్నుకునే హక్కు వారికి ఏ మాత్రం లేదు. అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు, వారు సాటి కల్పించే భాగస్వాముల కంటే మహోన్నతుడు.

Kasas 28:69

మరియు వారు తమ హృదయాలలో దాచుకున్నది మరియు బహిర్గతం చేసేది అంతా నీ ప్రభువుకు తెలుసు.

Kasas 28:70

మరియు ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! మొదట (ఇహలోకంలో) మరియు చివరకు (పరలోకంలో) స్తుతింపదగినవాడు కేవలం ఆయనే! మరియు విశ్వన్యాయాధిపత్యం ఆయనదే. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.

Kasas 28:71

వారితో అను: "ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపైన పునరుత్థాన దినం వరకు ఎడతెగకుండా రాత్రి ఆవరింపజేస్తే, అల్లాహ్ తప్ప మరే దేవుడైనా, మీకు వెలుగును తేగలడా? అయితే మీరెందుకు వినరు?"

Kasas 28:72

ఇంకా ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపై పునరుత్థాన దినము వరకు ఎడతెగకుండా పగటిని అవతరింపజేస్తే, అల్లాహ్ తప్ప మరే దేవుడైనా మీకు విశ్రాంతి పొందటానికి రాత్రిని తేగలడా? అయితే, మీరెందుకు చూడలేరు?"

Kasas 28:73

ఆయన తన కారుణ్యంతో మీ కొరకు రాత్రిని మరియు పగటిని, విశ్రాంతి పొందటానికి మరియు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి చేశాడు, బహుశా మీరు కృతజ్ఞులౌతారేమోనని.[1] ——— [1] రాత్రి మరియు పగలు ఈ రెండూ అల్లాహ్ (సు.తా.) అనుగ్రహించిన వరాలు. ఒకవేళ రాత్రి లేకుంటే, ప్రజలందరూ ఒకేసారి విశ్రాంతి తీసుకోలేక పోయేవారు. ప్రతి ఒక్కడు తన ఇష్టానుసారం విశ్రాంతి తీసుకుంటే ప్రపంచ కార్యక్రమాలు సరళంగా జరిగేవి కావు. మానవుల జీవితాలు పరస్పర సహయోగం, వల్లనే సరళంగా జరుగుతున్నాయి. దాని కొరకు రాత్రింబవళ్ళు ఎంతో ఉపయోగకరమైనవి.

Kasas 28:74

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆయన (అల్లాహ్), వారిని ఆ రోజు పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు నాకు భాగస్వాములని నొక్కి చెప్పిన వారు (భావించిన వారు) ఇప్పుడు ఎక్కడున్నారు?"

Kasas 28:75

మరియు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని[1] నిలబెట్టి ఇలా అంటాము: "మీ నిదర్శనాన్ని తీసుకురండి!" అప్పుడు వారు సత్యం, నిశ్చయంగా అల్లాహ్ వైపే ఉందని తెలుసుకుంటారు. మరియు వారు కల్పించుకున్నవన్నీ వారిని త్యజించి ఉంటాయి. ——— [1] ఈ సాక్షులు ప్రవక్త ('అలైహిమ్ స.)లు ప్రతి ప్రవక్త తన కాలపు ప్రజలకు సాక్షిగా ఉంటాడు.

Kasas 28:76

వాస్తవానికి, ఖారూన్, మూసా జాతికి చెందినవాడే. కాని అతడు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు.[1] మరియు మేము అతడికి ఎన్నో నిధులను ఇచ్చి ఉంటిమి. వాటి తాళవు చెవులను బలవంతులైన పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కూడా ఎంతో కష్టంతో మాత్రమే మోయగలిగే వారు. అతడి జాతి వారు అతనితో అన్నారు: "నీవు విర్రవీగకు, నిశ్చయంగా, అల్లాహ్ విర్రవీగే వారిని ప్రేమించడు! ——— [1] చూఎంత గొప్ప ప్రవక్తను అనుసరించినా, అహంభావం మరియు స్వాభిమానంతో ప్రవర్తించే వారిని అల్లాహ్ (సు.తా.) ప్రేమించడు. ఈ ఉదాహరణ ఇక్కడ మూసా ('అ.స.) జాతికి చెందిన ఖారూన్ అనే గొప్ప ధనవంతుడైన వ్యక్తి విషయంలో ఇవ్వబడింది. ఇంకా చూడండి, 29:39 మరియు 40:24.

Kasas 28:77

మరియు అల్లాహ్ నీకు ఇచ్చిన సంపదతో పరలోక గృహాన్ని పొందటానికి ప్రయత్నించు. మరియు ఇహలోకం నుండి లభించే భాగాన్ని మరచిపోకు. నీకు అల్లాహ్ మేలు చేసినట్లు, నీవు కూడా (ప్రజలకు) మేలు చేయి.[1] భూమిపై కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నించకు. నిశ్చయంగా, అల్లాహ్ కల్లోలం రేకెత్తించేవారిని ప్రేమించడు!" ——— [1] ఏ విధంగానైతే నీ ప్రభువుకు నీపై హక్కు ఉందో, అదే విధంగా నీ ఆత్మకు, నీ భార్యాపిల్లలకు, నీ బంధువులకు మరయు నీ అతిథులను మొదలైన వారికి కూడా నీ మీద., నీ ఆదాయం మీద హక్కు ఉంది. కావున ప్రతి ఒక్కనికి వాని హక్కు చెల్లించు.

Kasas 28:78

అతడు (ఖారూన్) అన్నాడు: "నిశ్చయంగా, ఇది (ఈ ధనం) నాకు నా జ్ఞానం వల్లనే ఇవ్వబడింది!" [1] ఏమీ? అతడికి తెలియదా? నిశ్చయంగా అల్లాహ్ అతడికి ముందు ఎన్నో తరాల వారిని - అతడి కంటే ఎక్కువ బలం మరియు ఎక్కువ ధనసంపదలు గలవారిని కూడా - నాశనం చేశాడని? మరియు పాపాత్ములు వారి పాపాలను గురించి ప్రశ్నింపబడరు. ——— [1] ఇటువంటి వాక్యానికి చూడండి, 28:78 మరియు 41:50.

Kasas 28:79

తరువాత అతడు తన వైభవంతో తన జాతి వారి ఎదుటకు వచ్చాడు. ఇహలోక జీవితపు సుఖాలు కోరేవారు ఇలా అన్నారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! ఖారూన్ కు లభించినటు వంటివి (ధనసంపత్తులు) మాకు కూడా లభించి ఉంటే ఎంత బాగుండేది? నిశ్చయంగా అతడు ఎంతో అదృష్టవంతుడు!"

Kasas 28:80

కాని జ్ఞానసంపన్నులు అన్నారు: "మీ దౌర్భాగ్యం! అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలమే, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ఎంతో శ్రేష్ఠమైనది. మరియు ఈ మహాభాగ్యం, సహనం వహించే వారికి తప్ప ఇతరులకు లభించదు."[1] ——— [1] 'హదీస్' ఖుద్సీ: అల్లాహ్ (సు.తా.) అంటాడు: 'నేను నా సద్వర్తనులైన దాసుల కొరకు సిద్ధపరచిన వస్తువులు ఎలాంటివంటే, వాటిని ఇంత వరకు ఏ కన్నూ చూడలేదు, ఏ చెవి వినలేదు మరియు ఏ ఆత్మ కూడా ఊహించలేదు!' (బు'ఖారీ, ముస్లిం)

Kasas 28:81

ఆ పిదప మేము అతనిని, అతని గృహంతో సహా భూమిలోకి అణగద్రొక్కాము. అతడిని, అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించగల, అతడి తెగవారు ఎవ్వరూ లేకపోయారు మరియు అతడు కూడా తనను తాను కాపాడు కోలేకపోయాడు.

Kasas 28:82

మరియు నిన్నటి వరకు అతడి (ఖారూన్) వలే కావలెనని ఎవరైతే కోరుతూ వచ్చారో, వారు ఇప్పుడు ఇలా పలుకసాగారు: "తెలుసుకోండి! [1] అల్లాహ్ తన దాసులలో, తాను కోరిన వారికి జీవనోపాధిని విస్తరింపజేస్తాడు.[2] మరియు (తాను కోరిన వారికి) తగ్గిస్తాడు. ఒకవేళ అల్లాహ్ అనుగ్రహమే మాపై లేకుంటే ఆయన మమ్మల్ని కూడా భూమిలోకి అణగద్రొక్కి ఉండేవాడు. తెలుసుకోండి! సత్యతిరస్కారులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు!" ——— [1] వయ్ క అన్న : ఈ శబ్దానికి, Woe unto thee, Oh, Ah, Know అనే అర్తాలిచ్చారు. అంటే, నీ పాడు గాను, అయ్యే, తెలుసుకో మొదలైనవి. [2] అల్లాహ్ (సు.తా.) ధన సంపత్తులు ప్రసాదించినంత మాత్రాన అల్లాహ్ (సు.తా.) వానితో సంతుష్టుడయ్యాడని మరియు అల్లాహ్ (సు.తా.) వాటిని ఇవ్వని వాని మీద కోపంతో ఉన్నాడని కాదు. శాశ్వత సుఖసంతోషాలు కేవలం విశ్వసించి సత్కార్యాలు చేసే వారికే లభిస్తాయి. భూలోక సుఖసంతోషాలు, పరలోక సుఖసంతోషాల ముందు అతి స్వల్వమైనవి.

Kasas 28:83

ఆ పరలోక జీవితపు గృహాన్ని మేము భూమిలో పెద్దరికం చూపగోరని వారి కొరకు మరియు కల్లోలం రేకెత్తించని వారి కొరకు ప్రత్యేకిస్తాము. మరియు దైవభీతి గలవారికే (మేలైన) పర్యవసానం ఉంటుంది.

Kasas 28:84

మంచి పనులు చేసి వచ్చిన వారికి వాటి కంటే ఉత్తమమైన (ప్రతిఫలం) లభిస్తుంది.[1] మరియు చెడ్డపనులు చేసి వచ్చిన వారికి, వారు చేస్తూ ఉండిన చెడ్డపనులకు తగినంత ప్రతిఫలమే ఇవ్వబడుతుంది. ——— [1] చూడండి, 27:89 ప్రతి మంచిపనికి పదింతలు అధికంగా పుణ్యఫలితం ఇవ్వబడుతుంది. అల్లాహ్ (సు.తా.) కోరితే అంతకంటే ఎక్కువ పుణ్య ఫలితం ఇస్తాడు. కాని ప్రతి చెడ్డ పనికి దానంత శిక్ష మాత్రమే విధించబడుతుంది. పునరుత్థానదినమున ఎవరికీ అన్యాయం జరుగదు. చూడండి, 6:160.

Kasas 28:85

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ను నీకు విధిగా చేసినవాడు (అల్లాహ్) తప్పక నిన్ను నీ నిర్ణీత స్థానానికి తిరిగి తెస్తాడు.[1] వారితో ఇలా అను: "ఎవడు మార్గదర్శకత్వంలో ఉన్నాడో మరియు ఎవడు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాడో, నా ప్రభువుకు బాగా తెలుసు." ——— [1] అంటే తప్పక తిరిగి మక్కాకు తెస్తాడు. కావున హిజ్రత్ కు 8 సంవత్సరాల తరువాత దైవప్రవక్త ('స'అస) తిరిగి మక్కాకు విజేయులై వచ్చారు. (ఇబ్నె-'అబ్బాస్ ర'ది.'అ. కథనం, 'స'హీ'హ్ బు'ఖారీ).

Kasas 28:86

మరియు నీకు ఈ గ్రంథం (ఖుర్ఆన్) ఇవ్వబడుతుందని నీవెన్నడూ ఆశించలేదు, ఇది కేవలం నీ ప్రభువు కారుణ్యం వల్లనే లభించింది. కావున నీవు ఎన్నటికీ సత్యతిరస్కారులకు తోడ్పడే వాడవు కావద్దు!

Kasas 28:87

మరియు అల్లాహ్ ఆయతులు, నీపై అవతరింపజేయబడిన తరువాత; వారు (సత్యతిరస్కారులు) వాటి (పఠనం / ప్రచారం) నుండి నిన్ను ఏ మాత్రం తొలగింపనివ్వరాదు. మరియు (ప్రజలను) నీ ప్రభువు వైపునకు ఆహ్వానించు. మరియు నీవు బహుదైవారాధకులలో చేరిపోకు.

Kasas 28:88

మరియు అల్లాహ్ తో పాటు ఏ ఇతర దైవాన్నీ ఆరాధించకు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. కేవలం ఆయన ఉనికి (ముఖం) తప్ప ప్రతిదీ నశిస్తుంది.[1] సర్వన్యాయాధిపత్యం కేవలం ఆయనదే మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు. ——— [1] చూడండి, 55:26-27.

Ankebut 29:1

అలిఫ్-లామ్-మీమ్[1] ——— [1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

Ankebut 29:2

ఏమీ? : ప్రజలు "మేము విశ్వసించాము!" అని అన్నంత మాత్రాన్నే తాము విడిచి పెట్ట బడతారని మరియు తాము పరీక్షింపబడరని భావిస్తున్నారా?[1] ——— [1] చూమొట్టమొదట విశ్వాసం (ఇస్లాం) స్వీకరించిన 'అమ్మార్ అతని తల్లి-దండ్రులైన సుమయ్యా మరియు యాసర్, 'సుహేబ్ మరియు బిలాల్ మొదలైన వారు (ర'ది.'అన్హుమ్) ఎన్నో తీవ్రమైన పరీక్షలకు గురి చేయబడ్డారు.

Ankebut 29:3

మరియు వాస్తవానికి, మేము వారికి పూర్వం గతించిన వారిని కూడా పరీక్షించి ఉన్నాము. కావున నిశ్చయంగా సత్యవంతులు ఎవరో మరియు అసత్యవంతులు ఎవరో అల్లాహ్ వ్యక్తపరుస్తాడు.

Ankebut 29:4

లేక, చెడుపనులు చేస్తున్నవారు, మా (శిక్ష) నుండి తప్పించుకోగలరని భావిస్తున్నారా? ఎంత చెడ్డ నిర్ణయం వారిది!

Ankebut 29:5

అల్లాహ్ ను కలుసుకునే కోరిక ఉన్నవాడు, అల్లాహ్ నిర్ణయించిన ఆ సమయం తప్పక రానున్నదని నమ్మాలి. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

Ankebut 29:6

కావున (అల్లాహ్ మార్గంలో) పాటుపడే వాడు నిశ్చయంగా, తన (మేలు) కొరకే పాటు పడుతున్నాడని (తెలుసుకోవాలి)[1]. నిశ్చయంగా, అల్లాహ్ సర్వలోకాల వారి అక్కర ఏ మాత్రం లేనివాడు. ——— [1] చూడండి, 15:23. జిహాదున్ : అంటే - 1) తన సత్యధర్మాన్ని, తన స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను కాపాడుకోవటానికి దానిని అడ్డగించే వారితో; 2) సత్యం మీద మరియు సన్మార్గం మీద ఉండడానికి తన ఆత్మలోని అసత్యం, అధర్మంతో మరియు 3) దుష్టప్రేరణలతో - చేసే పోరాటం.

Ankebut 29:7

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, నిశ్చయంగా అలాంటి వారి (పూర్వపు) పాపాలను మేము తప్పక తొలగిస్తాము మరియు వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమమైన ప్రతిఫలం ఇస్తాము.

Ankebut 29:8

మరియు మేము మానవునికి తన తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించమని ఆదేశించాము.[1] కాని వారిద్దరూ, నీవు ఎరుగని వానిని నాకు భాగస్వామిగా చేయమని బలవంతపెడితే, నీవు వారి ఆజ్ఞాపాలన చేయకు.[2] మీరందరూ నా వైపుకే మరలి రావలసి ఉన్నది, అప్పుడు నేను మీకు, మీరు ఏమి చేస్తూ ఉండేవారో తెలుపుతాను. ——— [1] ఖుర్ఆన్ లో కేవలం ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) ఆరాధనే చేయాలనీ మరియు తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించాలని అల్లాహ్ (సు.తా.) ఆదేశిస్తున్నాడు. తమ తల్లిదండ్రులను ఆదరించే వారే అల్లాహ్ (సు.తా.) యొక్క స్థానాన్ని అర్థం చేసుకో గలుగుతారు. చూడండి, 31:14-15. [2] స'అద్ బిన్ అబీ-వఖ్ఖా'స్ (ర'ది.'అ) ఇస్లాం స్వీకరించినప్పుడు అతని తల్లి నీవు ఇస్లాం మరియు ము'హమ్మద్ (సఅస) ను వదలనంత వరకు నేను అన్నపానీయాలను ముట్టను అని మొండిపట్టు పట్టుతుంది. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడుతుంది. ('స.ముస్లిం, తిర్మిజీ')

Ankebut 29:9

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉంటారో, మేము వారిని తప్పక సద్వర్తనులతో చేర్చుతాము.

Ankebut 29:10

మరియు ప్రజలలో కొందరు (తమ నాలుకలతో): "మేము అల్లాహ్ ను విశ్వసించాము." అని అనే వ్యక్తులున్నారు. కాని వారు అల్లాహ్ మార్గంలో హింసించపడినప్పుడు, మానవులు పెట్టిన పరీక్షలను అల్లాహ్ యొక్క శిక్షగా భావిస్తారు; మరియు ఒకవేళ నీ ప్రభువు నుండి సహాయం వస్తే వారు (కపట విశ్వాసులు) అంటారు: "నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము.[1] సర్వలోకాల వారి హృదయాల స్థితి అల్లాహ్ కు తెలియదా ఏమిటి?" ——— [1] ఇలాంటి భావమిచ్చే మరొక ఆయత్ కు చూడండి, 4:141.

Ankebut 29:11

మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వసించిన వారిని స్పష్టపరుస్తాడు మరియు ఆయన కపట విశ్వాసులను కూడా స్పష్టపరుస్తాడు.[1] ——— [1] అంటే అల్లాహ్ (సు.తా.) సుఖదుఃఖాలనిచ్చి విశ్వాసులెవరో మరియు కపట విశ్వాసులెవరో విశదం చేస్తాడు. ఎవరైతే ప్రతి స్థితిలో అల్లాహ్ (సు.తా.) కు కృతజ్ఞులై ఉంటారో వారే నిజమైన విశ్వాసులు. ఇంకా చూడండి, 15:23 మరియు 15:23, ఇది కపట విశ్వాసు(మునాఫిఖు)లను గురించి వచ్చిన మొదటి ఆయత్.

Ankebut 29:12

మరియు సత్యతిరస్కారులు, విశ్వాసులతో: "మీరు మా మార్గాన్ని అనుసరించండి. మేము మీ పాపాలను భరిస్తాము." అని అంటారు. వాస్తవానికి వారి పాపాలలో నుండి దేనిని కూడా వారు భరించరు. నిశ్చయంగా, వారు అసత్యవాదులు.[1] ——— [1] సత్యతిరస్కారులు: 'మీరు మా మార్గాన్ని అనుసరిస్తే మేము మీ పాపాలను భరిస్తాము.' అని అనే మాటలు అబద్ధాలని ఇక్కడ విశదీకరించబడింది. అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: "భారం మోసేవాడు, ఎవరి భారాన్ని మోయడు!" పునరుత్థాన దినమున స్నేహితుడు తన స్నేహితుని స్థితిని అడగడు, 70:10 మరియు దగ్గరి బంధువులు కూడా ఒకరినొకరు అడుగుకోరు, 35:18.

Ankebut 29:13

మరియు నిశ్చయంగా, వారు తమ బరువులను మోస్తారు మరియు తమ బరువులతో పాటు ఇతరుల బరువులను కూడా మోస్తారు.[1] మరియు నిశ్చయంగా, వారు పునరుత్థాన దినమున, తమ బూటక కల్పనలను గురించి ప్రశ్నింపబడతారు. ——— [1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 16:25. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "ఇతరులను సన్మార్గానికి పిలచిన వారికి, వారు సన్మార్గాన్ని అనుసరిస్తే పునరుత్థానదినం వరకు వారంతా చేసే సత్కార్యాల ఫలితాల పుణ్యం దొరుకుతుంది. దుర్మార్గులకు, పాపకార్యాలకు, దుష్టకార్యాలకు ఆహ్వానించే వారు తమను అనుసరించిన వారి పాపభారాన్ని పునరుత్థాన దినం వరకు భరిస్తారు." ('స'హీ'హ్ బు'ఖారీ).

Ankebut 29:14

మరియు వాస్తవానికి, మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు పంపాము. అతను వారి మధ్య యాభై తక్కువ వేయి సంవత్సరాల వరకు (వారిని అల్లాహ్ ధర్మం వైపుకు ఆహ్వానిస్తూ) నివసించాడు; చివరకు వారు దుర్మార్గాన్ని విడనాడనందుకు, వారిని తుఫాను పట్టుకున్నది.[1] ——— [1] నూ'హ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:25-48 ఇక్కడ ఉద్దేశమేమిటంటే: ఒక ప్రవక్త ('అ.స.) కూడా తాను ప్రేమించేవారిని సన్మార్గానికి తేలేడు. ఇంకా చూడండి, 28:56 నూ'హ్ ('అ.స.) వారికి 950 సంవత్సరాలు ఇస్లాం ధర్మప్రచారం చేశారు. మార్గదర్శకత్వమంతా అల్లాహ్ (సు.తా.) మార్గదర్శకత్వమే. చూడండి, 3:73.

Ankebut 29:15

తరువాత మేము అతనిని (నూహ్ ను) మరియు నావలో ఎక్కిన వారిని రక్షించి, దానిని సర్వలోకాల వారికి ఒక సూచనగా చేశాము.

Ankebut 29:16

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) ఇలాగే ఇబ్రాహీమ్ కూడా తన జాతి వారితో: "కేవలం అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు అర్థం చేసుకోగలిగితే, ఇది మీకు ఎంతో మేలైనది."

Ankebut 29:17

"నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదలి విగ్రహాలను ఆరాధిస్తూ, ఒక అభూత కల్పన చేస్తున్నారు. నిశ్చయంగా, అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, ఆరాధిస్తున్నారో, వారికి మీకు జీవనోపాధిని సమకూర్చే యోగ్యత లేదు. కావున మీరు, మీ జీవనోపాధిని అల్లాహ్ నుండియే అపేక్షించండి మరియు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనకే కృతజ్ఞులై ఉండండి. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు."

Ankebut 29:18

"ఒకవేళ మీరు (ఈ సందేశాన్ని) అబద్ధమని తిరస్కరిస్తే, (ఆశ్చర్యమేమీ లేదు) వాస్తవానికి మీకు పూర్వం ఎన్నో సమాజాలు (దివ్యసందేశాలను అబద్ధాలని) తిరస్కరించాయి. మరియు సందేశహరుని బాధ్యత, స్పష్టంగా మీకు సందేశాన్ని అందజేయటం మాత్రమే!"

Ankebut 29:19

అల్లాహ్ సృష్టిని ఏ విధంగా ప్రారంభిస్తున్నాడో తరువాత దానిని ఏ విధంగా మరల ఉనికిలోకి తెస్తున్నాడో, వారు గమనించడం లేదా? నిశ్చయంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం!

Ankebut 29:20

వారితో అను: "మీరు భూమిలో సంచారం చేసి చూడండి. ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడో!"[1] తరువాత అల్లాహ్ యే మరల (రెండవసారి) దానిని ఉనికిలోకి తెస్తున్నాడు! నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు!" ——— [1] చూడండి, 23:12-14.

Ankebut 29:21

ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు మరియు తాను కోరిన వారిని కరుణిస్తాడు. మరియు ఆయన వైపుకే మీరంతా మరలింపబడతారు.

Ankebut 29:22

మరియు మీరు భూమిలో గాని, ఆకాశంలో గాని ఆయన నుండి తప్పించుకోజాలరు. మరియు అల్లాహ్ తప్ప మీకు సంరక్షకుడు గానీ మరియు సహాయకుడు గానీ ఎవ్వడూ లేడు.

Ankebut 29:23

మరియు ఎవరైతే, అల్లాహ్ సూచనలను మరియు ఆయనతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తారో, అలాంటి వారు నా కరుణ పట్ల నిరాశ చెందుతారు.[1] మరియు అలాంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది. ——— [1] చూడండి, 8:156.

Ankebut 29:24

ఇక అతని (ఇబ్రాహీమ్) జాతివారి జవాబు ఈ విధంగా అనడం తప్ప మరొకటి లేక పోయింది: "ఇతనిని చంపండి లేదా కాల్చి వేయండి" చివరకు అల్లాహ్ అతనిని అగ్ని నుండి రక్షించాడు.[1] నిశ్చయంగా, ఇందులో విశ్వసించే వారికి సూచన లున్నాయి. ——— [1] చూడండి, 21:69.

Ankebut 29:25

మరియు (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: "నిశ్చయంగా, మీరు ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ ను వదలి, విగ్రహారాధనను మీ మధ్య ప్రేమకు సాధనంగా చేసుకున్నారు. కాని పునరుత్థాన దినమున మీకు పరస్పరం సంబంధమే లేదంటారు మరియు పరస్పరం శపించుకుంటారు మరియు మీ ఆశ్రయం నరకాగ్నియే మరియు మీకు సహాయపడే వారు ఎవ్వరూ ఉండరు."

Ankebut 29:26

అప్పుడు లూత్ అతనిని విశ్వసించాడు. (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: "నేను నా ప్రభువు వైపునకు వలస పోతాను.[1] నిశ్చయంగా, ఆయనే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు." ——— [1] ఇబ్రాహీమ్ ('అ.స.) తన భార్య సారహ్ మరియు తన సోదరుని కుమారుడు లూ'త్ ('అ.స.)లతో, తమ దేశం కూసీ అంటే - కూఫా ప్రాంతంలోని ఒక నగరం నుండి షామ్ వైపునకు ప్రస్థానం చేశారు. ఎందుకంటే ఆ దేశపు ప్రజలు - వారు ఇస్లాం అనుసరిస్తున్నందుకు - వారిపై దౌర్జన్యాలు చేశారు.

Ankebut 29:27

మరియు మేము అతనికి (ఇబ్రాహీమ్ కు) ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించి, అతని సంతతిలో ప్రవక్త పదవినీ మరియు గ్రంథాన్ని ఉంచి, ప్రపంచంలో అతనికి, అతని ప్రతిఫలాన్ని ఇచ్చాము.[1] మరియు పరలోకంలో అతడు నిశ్చయంగా, సద్వర్తనులతో పాటు ఉంటాడు.[2] ——— [1] చూఈ ప్రతిఫలమేమిటంటే అతను ఇబ్రాహీమ్ ('అ.స.) అబుల్-అంబియా అనబడ్డారు. అంటే ప్రవక్తల మూలపురుషుడు. ఎందుకంటే అతన సంతానం నుండి ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. అతని పెద్ద కుమారుడు, సయ్యిదా హాజర్ పుత్రుడైన ఇస్మాయీ'ల్ ('అ.స.) వంశం నుండి మహాప్రవక్త ము'హమ్మద్ ('స'అస) వచ్చారు. మరియు అతని రెండవ కుమారుడైన ఇ'స్హాఖ్ ('అ.స.) యొక్క కుమారుడైన యా'అఖూబ్ ('అ.స.) నుండి అతని కుమారుడైన యూసుఫ్ ('అ.స.) వచ్చారు. మరియు య'అఖూబ్ ('అ.స.) యొక్క పన్నెండు మంది కుమారుల నుండి ఇంకా ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. దావుద్, సులైమాన్, మూసా మరియు 'ఈసా ('అలైహిమ్. స.) లు అందరూ య'అఖూబ్ ('అ.స.) సంతతి వారే, అంటే ఇబ్రాహీమ్ ('అ.స.) సంతతి వారే. అందుకే యూదులు, క్రైస్తవులు, ముస్లిములే గాక ముష్రికులు కూడా ఇబ్రాహీమ్ ('అ.స.) ను ఆదరిస్తారు. ప్రతి ఒక్కరూ మేము ఇబ్రాహీమ్ ('అ.స.) ధర్మాన్నే ఆచరిస్తున్నాము అంటారు. కాని, వాస్తవానికి అతని ధర్మం, ఏకైక దైవసిద్ధాంతం (ఇస్లాం) మాత్రమే. [2] చూడండి, 16:122.

Ankebut 29:28

మరియు (జ్ఞాపకం చేసుకోండి) లూత్ తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, మీరు చాలా హేయమైన పని చేస్తున్నారు. మీకు పూర్వం లోకంలో ఎవ్వడూ ఇలాంటి పని చేయలేదు.[1] ——— [1] లూ'త్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:69-83.

Ankebut 29:29

వాస్తవానికి, మీరు (కామంతో) పురుషుల వద్దకు పోతున్నారు! మరియు దారి కొడుతున్నారు (దోపిడి చేస్తున్నారు)! మరియు మీ సభలలో అసభ్యకరమైన పనులు చేస్తున్నారు!" అతని జాతి వారి జవాబు కేవలం ఇలానే ఉండేది: "నీవు సత్యవంతుడవే అయితే అల్లాహ్ శిక్షను మా పైకి తీసుకురా!"

Ankebut 29:30

అప్పుడు లూత్ ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! దౌర్జన్యపరులపై నాకు విజయము నొసంగు."

Ankebut 29:31

మరియు మా దూతలు ఇబ్రాహీమ్ వద్దకు శుభవార్త తీసికొని వచ్చినపుడు వారన్నారు: "నిశ్చయంగా, మేము ఈ నగరవాసులను నాశనం చేయబోతున్నాము. ఎందుకంటే వాస్తవానికి దాని ప్రజలు దుర్మార్గులై పోయారు!"

Ankebut 29:32

(ఇబ్రాహీమ్) అన్నాడు: "వాస్తవానికి, అక్కడ లూత్ కూడా ఉన్నాడు కదా!" వారన్నారు: "అక్కడెవరున్నారో, మాకు బాగా తెలుసు. మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని రక్షిస్తాము - అతని భార్య తప్ప - ఆమె వెనుక ఉండి పోయేవారిలో చేరి పోయింది."[1] ——— [1] చూడండి, 7:83 మరియు 11:81.

Ankebut 29:33

ఆ తరువాత మా దూతలు లూత్ వద్దకు రాగా అతను వారి నిమిత్తం చాలా చింతించాడు.[1] మరియు ఇబ్బందిలో పడి పోయాడు. వారిలా అన్నారు: "నీవు భయపడకు మరియు దుఃఖ పడకు! నిశ్చయంగా, మేము నిన్ను మరియు నీ కుటుంబం వారిని రక్షిస్తాము - నీ భార్య తప్ప - ఆమె వెనుక ఉండి పోయేవారిలో చేరిపోయింది! ——— [1] చూడండి, 11:77.

Ankebut 29:34

నిశ్చయంగా, మేము ఈ నగరవాసుల మీద ఆకాశం నుండి ఘోర విపత్తు అవతరింపజేయ బోతున్నాము. ఎందుకంటే వారు అవిధేయులయ్యారు!"

Ankebut 29:35

మరియు వాస్తవానికి, బుద్ధిమంతుల కొరకు మేము దీని ద్వారా ఒక స్పష్టమైన సూచనను వదలి పెట్టాము.[1] ——— [1] చూసోడోమ్ మరియు గొమెర్రాహ్ (లూ'త్ జాతి వారి) నగరాలు ఉండే చోట్లలో, ఈ రోజు మృత సముద్రం (Dead Sea) ఉంది. దాని పేరు ఇలా ఎందుకు పడిందంటే అందులో గంధకం మరియు పొటాష్ (Sulphur and Potash), అత్యధికంగా ఉండడం వల్ల అందులో ఏ జీవరాసి గానీ వృక్షరాసి గానీ నివసించజాలదు.

Ankebut 29:36

మరియు మేము మద్ యన్ వాసుల వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను పంపాము.[1] అతను ఇలా అన్నాడు: "నా జాతి ప్రజలారా! కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. మరియు అంతిమ దినం కొరకు నిరీక్షిస్తూ (భయపడుతూ) ఉండండి. మరియు దౌర్జన్యపరులుగా భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ తిరగకండి!" ——— [1] షు'ఐబ్ ('అ.స.) గాథకు చూడండి, 11:85-93.

Ankebut 29:37

కాని వారు అతనిని అసత్యుడని తిరస్కరించారు, ఒక తీవ్రమైన భూకంపం వారిని పట్టుకున్నది, అప్పుడు వారు తమ ఇండ్లలోనే చలనం లేని శవాలుగా మారి పోయారు.

Ankebut 29:38

మరియు వాస్తవంగా, ఆద్ మరియు సమూద్ జాతల వారి (వినాశ) విషయం (మిగిలి పోయిన) వారి నివాస స్థలాల నుండి, మీకు స్పష్టంగా తెలుస్తుంది.[1] వాస్తవానికి, వారు (సత్యాన్ని) గ్రహించే వారు అయినప్పటికీ, షైతాన్ వారి కర్మలను వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు. ఆ తరువాత వారిని (ఋజు) మార్గం నుండి తొలగించాడు. ——— [1] 'ఆద్ జాతి వారి నివాసం - అ'హ్ ఖాఫ్ - యమన్, లోని హ'దరమౌత్ దగ్గర ఉంది. స'మూద్ జాతి వారి నివాసం మదాయన్ 'సాలి'హ్, అనే ప్రాంతంలో మదీనా మునవ్వరా - తబూక్ ల మధ్య స'ఊది 'అరేబియాలో ఉంది. ఇది 'హిజా'జ్ ఉత్తర ప్రాంతంలో ఉంది. చూడండి, 9:7.

Ankebut 29:39

ఇక ఖారూన్[1], ఫిర్ఔన్ మరియు హామానులను[2] (కూడా మేము ఇదే విధంగా నాశనం చేశాము). వాస్తవానికి, మూసా వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకొని వచ్చాడు; కాని వారు భూమిలో అహంభావం చూపారు. కావున వారు (మా శిక్ష నుండి) తప్పించుకోలేక పోయారు. ——— [1] ఖారూన్ గాథకు చూడండి, 28:76-82. [2] హామాన్ గాథకు చూడండి, 28:6.

Ankebut 29:40

కావున ప్రతి ఒక్కరిని మేము అతని పాపానికి బదులుగా పట్టుకున్నాము. వారిలో కొందరిపైకి మేము తుఫాన్ గాలిని పంపాము.[1] మరికొందరిని ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) చిక్కించుకున్నది.[2] ఇంకా కొందరిని భూమిలోనికి అణగ ద్రొక్కాము.[3] ఇంకా ఇతరులను ముంచి వేశాము.[4] మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. ——— [1] 'తుఫాన్ గాలి 'ఆద్ జాతివారిపై వచ్చింది. [2] ఈ శిక్ష వచ్చిన వారు స'మూద్ జాతివారు. [3] ఇది ఖారూన్ కు సంభవించిన శిక్ష. [4] ఇది ఫిర్'ఔన్ మరియు అతన సైనికులకు సంభవించిన శిక్ష.

Ankebut 29:41

అల్లాహ్ ను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారి ఉపమానాన్ని సాలె పురుగు నిర్మించే ఇంటితో పోల్చవచ్చు. నిశ్చయంగా, అన్నిటి కంటే బలహీనమైన ఇల్లు సాలె పురుగు ఇల్లే! వారిది తెలుసుకుంటే ఎంత బాగుండేది![1] ——— [1] ఏ విధంగానైతే సాలె పురుగు అల్లిన ఇల్లు బలహీనమైనదో! అదే విధంగా అల్లాహ్ (సు.తా.) ను వదలి ఇతరులను ఆరాధించే వారి ఆరాధన కూడా వ్యర్థమైనదే. ఎందుకంటే వారు (ఆ దేవతలు) తమను ఆరాధించే వారికి ఎలాంటి సహాయం చేయలేరు.

Ankebut 29:42

వారు ఆయనను వదిలి దేనిని ప్రార్థిస్తున్నారో, అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

Ankebut 29:43

మరియు ఈ ఉదాహరణలను మేము ప్రజలకు (అర్థం చేసుకోవాలని) ఇస్తున్నాము. మరియు జ్ఞానం గలవారు తప్ప ఇతరులు వీటిని అర్థం చేసుకోలేరు.

Ankebut 29:44

అల్లాహ్ ఆకాశాలను మరియు భూమిని సత్యాధారంగా సృష్టించాడు. నిశ్చయంగా, విశ్వసించే వారికి ఇందులో సూచన ఉంది.

Ankebut 29:45

(ఓ ప్రవక్తా!) నీపై దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేయబడిన గ్రంథాన్ని చదివి వినిపించు మరియు నమాజ్ ను స్థాపించు. నిశ్చయంగా, నమాజ్ అసహ్యకరమైన పనుల నుండి మరియు అధర్మమైన పనుల నుండి నిషేధిస్తుంది. మరియు అల్లాహ్ ధ్యానమే (అన్నిటి కంటే) గొప్పది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.

Ankebut 29:46

మరియు నీవు గ్రంథ ప్రజలతో - దుర్మార్గాన్ని అవలంబించిన వారితో తప్ప - కేవలం ఉత్తమమైన రీతి లోనే వాదించు.[1] మరియు వారితో ఇలా అను: "మేము మా కొరకు అవతరింప జేయబడిన దానిని మరియు మీ కొరకు అవతరింప జేయబడిన దానిని విశ్వసించాము. మరియు మా ఆరాధ్య దేవుడు మరియు మీ ఆరాధ్య దేవుడు ఒక్కడే (అల్లాహ్). మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము." ——— [1] చూచూడండి, 16:125.

Ankebut 29:47

(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింప జేశాము. కావున మేము (ఇంతకు పూర్వం) గ్రంథాన్ని ఇచ్చిన వారిలో కొందరు దీనిని విశ్వసిస్తారు.[1] మరియు ఇతర ప్రజలలో నుండి కూడా కొందరు దీనిని విశ్వసిస్తారు.[2] మరియు మా సూచనలను సత్యతిరస్కారులు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు.[3] ——— [1] వీరు 'అబ్దుల్లాహ్ బిన్-సలాం మరియు ఇతరులు. [2] వీరు మక్కా ముష్రికులలో నుండి కొందరు. [3] జిహాదున్: దీని అర్థానికి చూడండి, 31:32, 40:63, మరియు 41:28.

Ankebut 29:48

మరియు (ఓ ముహమ్మద్!) ఇంతకు పూర్వం నీవు ఏ గ్రంథాన్ని కూడా చదువ గలిగే వాడవు కావు మరియు దేనిని కూడా నీ కుడిచేతితో వ్రాయగలిగే వాడవూ కావు.[1] అలా జరిగి వుంటే ఈ అసత్యవాదులు తప్పక అనుమానానికి గురి అయి ఉండేవారు. ——— [1] చూడండి, 7:157, 158.

Ankebut 29:49

వాస్తవానికి ఇవి, స్పష్టమైన సూచనలు (ఖుర్ఆన్ ఆయాత్), జ్ఞానమివ్వబడిన వారి హృదయాలలో (భద్రంగా) ఉంచ బడ్డాయి. మరియు మా సూచనలను (ఆయాత్ లను) దుర్మార్గులు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు.

Ankebut 29:50

మరియు వారు ఇలా అంటారు: "ఇతని ప్రభువు తరఫు నుండి ఇతని మీద అద్భుత సంకేతాలు ఎందుకు అవతరింప జేయబడలేదు?" వారితో ఇలా అను: "నిశ్చయంగా, అద్భుత సంకేతాలన్నీ అల్లాహ్ దగ్గరనే ఉన్నాయి.[1] మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!" ——— [1] చూచూడండి, 6:109.

Ankebut 29:51

ఏమీ? వాస్తవానికి మేము నీపై అవతరింప జేసిన ఈ గ్రంథం (ఖుర్ఆన్) వారికి వినిపించబడుతోంది కదా! ఇది వారికి చాలదా?[1] నిశ్చయంగా, ఇందులో విశ్వసించే ప్రజలకు కారుణ్యం మరియు హితబోధలనున్నాయి. ——— [1] ఖుర్ఆన్, అల్లాహ్ (సు.తా.) అద్భుత సంకేతాలలో ఒకటి. అందుకే ఖుర్ఆన్ లో అల్లాహ్ (సు.తా.) దాని వంటి ఒక్క సూరహ్ నైనా రచించి తెమ్మని సత్యతిరస్కారులతో సవాలు చేశాడు. కాని వారు ఈ నాటికీ దానిని పూర్తి చేయలేక పోయారు. ఇంతకంటే మంచి అద్భుత సంకేతం ఇంకేం కావాలి? విశ్వసించనవారు ఎన్ని అద్భుతసంకేతాలు చూసినా విశ్వసించరు. ఉదాహరణకు: ఫిర్'ఔన్ మరియు అతని జాతివారు.

Ankebut 29:52

(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "నాకూ మరియు మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ యే చాలు! ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తమూ ఆయనకు తెలుసు." మరియు ఎవరైతే, అసత్యాన్ని విశ్వసించి, అల్లాహ్ ను తిరస్కరిస్తారో, అలాంటి వారే నష్టపడే వారు.

Ankebut 29:53

మరియు వారు (అవిశ్వాసులు) శిక్షను త్వరగా తీసుకు రమ్మని నిన్ను కోరు తున్నారు.[1] మరియు దానికై ఒక గడువు (అల్లాహ్ తరఫు నుండి) నిర్ణయింప బడి ఉండకపోతే! ఆ శిక్ష వారిపై వచ్చి పడి ఉండేది. మరియు నిశ్చయంగా, అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి వారి మీద పడనున్నది! ——— [1] చూడండి, 8:32.

Ankebut 29:54

వారు (అవిశ్వాసులు) శిక్షను త్వరగా తీసుకు రమ్మని నిన్ను కోరుతున్నారు మరియు నిశ్చయంగా, నరకాగ్ని సత్యతిరస్కారులను చుట్టుముట్ట నున్నది.

Ankebut 29:55

ఆ రోజు, శిక్ష వారి పైనుండి మరియు పాదాల క్రింది నుండి వారిని క్రమ్ముకున్నప్పుడు, వారితో ఇలా అనబడుతుంది: "మీరు చేస్తూ ఉండిన కర్మల ఫలితాన్ని చవి చూడండి."

Ankebut 29:56

ఓ విశ్వసించిన నా దాసులారా! నిశ్చయంగా, నా భూమి ఎంతో విశాలమైనది. కావున మీరు కేవలం నన్నే ఆరాధించండి.[1] ——— [1] ఏ స్థలంలోనైతే అల్లాహ్ (సు.తా.) ను ఆరాధించడం కష్టమయిపోతుందో మరియు ఇస్లాం ధర్మం మీద నిలువడం దుర్భరమవుతుందో అలాంటి చోటు నుండి ప్రస్థానం (హిజ్రత్) చేయటానికి అనుమతి ఇవ్వబడింది. ఉదాహరణకు మొట్టమొదటి ముస్లింలు 'హబషాకు, ప్రస్థానం చేశారు, దాని తరువాత మదీనాకు.

Ankebut 29:57

ప్రతి ప్రాణి చావును చవి చూస్తుంది. ఆ తరువాత మీరందరూ మా వైపునకే మరలింపబడతారు.

Ankebut 29:58

ఇక ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో! వారికి మేము స్వర్గంలో గొప్ప భవనాలలో స్థిర నివాసం ఇస్తాము. దాని క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసిన వారి ప్రతిఫలం ఎంత శ్రేష్ఠమైనది!

Ankebut 29:59

(వారికే) ఎవరైతే సహనం వహించి తమ ప్రభువునే నమ్ముకొని ఉంటారో!

Ankebut 29:60

మరియు (ప్రపంచంలో) ఎన్నో ప్రాణులున్నాయి. అవి తమ జీవనోపాధిని తాము సాధించలేవు! అల్లాహ్ యే వాటికీ మరియు మీకు కూడా జీవనోపాధిని సమకూర్చుతున్నాడు. మరియు ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

Ankebut 29:61

మరియు ఒకవేళ నీవు వారితో: "ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించి, సూర్యచంద్రులను ఉపయుక్తంగా చేసింది ఎవరు?" అని అడిగితే, వారు తప్పక: "అల్లాహ్!" అని అంటారు. అయినా వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు?)

Ankebut 29:62

అల్లాహ్ తన దాసులలో, తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి దానిని మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి దానిని గురించి బాగా తెలుసు.[1] ——— [1] అల్లాహ్ (సు.తా.) ఇహలోకంలో ప్రసాదించే ధనసంపత్తులకు విశ్వాసంతో, సత్కార్యాలతో సంబంధం లేదు. అల్లాహ్ (సు.తా.) ధనసంపత్తులు, హోదాలు ఇచ్చేది లేక పేదవారిగా ఉంచేది కూడా మానవులను పరీక్షించడానికే. ఇహలోక జీవితం అతి స్వల్పమైనది. కానీ శాశ్వాతమైన పరలోక జీవితంలో కేవలం విశ్వాసులై సత్కార్యాలు చేసి అల్లాహ్ (సు.తా.) అనుమతితో స్వర్గం పొందిన వారికే ఎడతెగని శాశ్వత సుఖసంతోషాలు ఉంటాయి.

Ankebut 29:63

మరియు ఒకవేళ నీవు వారితో: "ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని నుండి నిర్జీవంగా ఉన్న భూమికి జీవితాన్ని ఇచ్చింది ఎవరు?" అని అడిగితే, వారు తప్పకుండా: "అల్లాహ్!" అని అంటారు. నీవు ఇలా అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే!" కాని చాలా మంది అర్థం చేసుకోలేరు.[1] ——— [1] దీనిని అర్థం చేసుకోవటానికి వారు తమ తెలివిని ఉపయోగించరు. కావున వారు విగ్రహాలను, జిన్నాతులను, చచ్చినవారిని, పుణ్యపురుషులను, దేవదూతలను మొదలైన వాటిని తమ ఆరాధ్య దైవాలుగా చేసుకుంటారు.

Ankebut 29:64

మరియు ఈ ప్రాపంచిక జీవితం కేవలం వినోద కాలక్షేపం మరియు క్రీడ మాత్రమే. మరియు అసలు పరలోక గృహ జీవితమే వాస్తవమైన జీవితం. ఇది వారు తెలుసుకుంటే ఎంత బాగుండేది!

Ankebut 29:65

వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయననే ప్రార్థిస్తారు; కాని ఆయన వారిని రక్షించి నేల మీదకు తీసుకు రాగానే ఆయనకు సాటి కల్పించ సాగుతారు.[1] ——— [1] ఇక్రిమ ('ర.ది.'అ) మక్కా విజయం సమయంలో మక్కా విడిచి పారిపోతాడు. అతడు ఒక నావలోకి ఎక్కి పోతూ ఉండగా అది ప్రమాదంలో చిక్కుకుంటుంది. దానిలో ఉన్నవారు పరస్పరం ఇలా చెప్పుకుంటారు: "అల్లాహ్ (సు.తా.) ను వేడుకోండి. ఆయన తప్ప మమ్మల్ని మరెవ్వరూ కాపాడలేరు." అప్పుడు అతడు ఆలోచిస్తాడు: "సముద్రంలో అల్లాహ్ (సు.తా.) తప్ప మరొకరు కాపాడలేకుంటే నేలపై కూడా ఇతరులెవ్వరూ కాపాడలేరు. ఒకవేళ తాను ఇక్కడ నుండి బ్రతికి బయటపడితే దైవప్రవక్త ('స'అస) సన్నిధిలోకి పోయి ఇస్లాం స్వీకరిస్తాను." అని అనుకుంటాడు. అదేవిధంగా జరుగుతుంది. అతడు (ర'ది.'అ.) ఇస్లాం స్వీకరించి ఇస్లాం ప్రచారంలో చాలా పాటుపడ్తాడు. (ఇబ్నె-కసీ'ర్)

Ankebut 29:66

ఈ విధంగా మేము వారికి ప్రసాదించిన వాటికి కృతఘ్నులై (ప్రాపంచిక) భోగభాగ్యాలలో మునిగి వుంటారు. (దాని ఫలితం) వారు మున్ముందు తెలుసు కుంటారు.

Ankebut 29:67

ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా మేము హరమ్ ను (మక్కాను) ఒక శాంతి నిలయంగా నెలకొల్పామని![1] మరియు వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు వారి నుండి లాక్కోబడుతున్నారని? అయినా వారు అసత్యాన్ని నమ్మి, అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరిస్తారా? ——— [1] చూడండి, 28:57.

Ankebut 29:68

మరియు అల్లాహ్ మీద అబద్ధాలు కల్పించే వాని కంటే, లేక తన వద్దకు సత్యం వచ్చినపుడు దానిని అబద్ధమని తిరస్కరించే వాని కంటే, ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? ఏమీ? ఇలాంటి సత్యతిరస్కారులకు నరకమే నివాస స్థలం కాదా?

Ankebut 29:69

మరియు ఎవరైతే మా కొరకు హృదయపూర్వకంగా పాటుపడతారో, వారికి మేము మా మార్గాల వైపునకు మార్గదర్శకత్వం చేస్తాము. మరియు నిశ్చయంగా, అల్లాహ్ సజ్జనులకు తోడుగా ఉంటాడు.

Rum 30:1

అలిఫ్-లామ్-మీమ్[1] ——— [1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

Rum 30:2

రోమన్ లు పరాజితులయ్యారు.

Rum 30:3

తమ పొరుగు భూభాగంలోనే! మరియు వారు తమ ఈ పరాజయం తరువాత, తిరిగి విజేతలు కాగలరు[1] - ——— [1] పొరుగు నేల అంటే షామ్ మరియు ఫలస్తీన్.

Rum 30:4

(రాబోయే) కొన్ని[1] సంవత్సరాలలోనే. మొదట నయినా, తరువాత నయినా నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ దే మరియు ఆ రోజు విశ్వాసులు సంతోష పడతారు; ——— [1] బి'ద్ ఇన్ : అంటే, 3 నుండి 10 అని అర్థం.

Rum 30:5

అల్లాహ్ ప్రసాదించిన సహాయానికి[1]. ఆయన తనకు ఇష్టమైన వారికి సహాయం చేస్తాడు. మరియు ఆయనే సర్వశక్తి మంతుడు, అపార కరుణా ప్రదాత. ——— [1] ఇది దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత 2 హిజ్రీలో (622 క్రీ.స్తు శకంలో) కాబోయే బద్ర్ యుద్ధం గురించి చెప్పుతోంది.

Rum 30:6

మరియు (ఇది) అల్లాహ్ చేసిన వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగ పరచడు, కానీ వాస్తవానికి చాలా మందికి ఇది తెలియదు.[1] ——— [1] ఇది రోమన్ లు తిరిగి విజేతలౌతారన్న వాగ్దానం. అది పూర్త అయింది.

Rum 30:7

వారికి ఇహలోక జీవితపు బాహ్యరూపం మాత్రమే తెలుసు మరియు వారు పరలోకాన్ని గురించి ఏమరుపాటులో పడి ఉన్నారు.

Rum 30:8

ఏమీ? వారు తమలో తాము (ఎన్నడూ) ఆలోచించలేదా? ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్య ఉన్నదంతా, అల్లాహ్ సత్యంతో ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడని? అయినా నిశ్చయంగా ప్రజలలో చాలా మంది తమ ప్రభువును దర్శించవలసి వున్న వాస్తవాన్ని తిరస్కరిస్తున్నారు.

Rum 30:9

ఏమీ? వీరు భూమిపై ప్రయాణం చేయలేదా? వీరి పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరి కంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు, సేద్యం చేసేవారు మరియు దానిపై, వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు[1] మరియు వారి వద్దకు వారి సందేశహరులు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. ——— [1] వంకర అక్షరాలలో ఉన్న వాక్యం నోబుల్ ఖుర్ఆన్ లో ఈ విధంగా వ్యాఖ్యానించబడింది: "వారు దానిని వీరి కంటే ఎక్కువ సంఖ్యంలో వసింపజేశారు."

Rum 30:10

చివరకు చెడుకార్యాలు చేసిన వారి ముగింపు చెడుగానే జరిగింది. ఎందుకంటే, వారు అల్లాహ్ సూచనలను అబద్ధాలని నిరాకరించేవారు. వాటిని గురించి ఎగతాళి చేసేవారు.

Rum 30:11

అల్లాహ్ యే సృష్టి ప్రారంభిస్తాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి (పూర్వ స్థితిలోకి) తెస్తాడు. ఆ తరువాత మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు.

Rum 30:12

మరియు ఆ ఘడియ (పునరుత్థానం) ఆసన్నమైన రోజు, అపరాధులందరూ నిరాశ చెందుతారు.

Rum 30:13

మరియు వారు అల్లాహ్ కు భాగస్వాములుగా కల్పించిన వారెవ్వరూ వారి సిఫారసు చేయజాలరు. మరియు వారు కల్పించుకున్న తమ భాగస్వాములను తిరస్కరిస్తారు.

Rum 30:14

మరియు ఆ ఘడియ (పునరుత్థానం) ఆసన్నమైన రోజు, ఆ రోజు వారు (ప్రజలు), వేర్వేరు వర్గాలలో విభజింప బడతారు.

Rum 30:15

అప్పుడు ఎవరైతే, విశ్వసించి, సత్కార్యాలు చేసి ఉంటారో, వారు ఉద్యానవనంలో ఆనందంగా ఉంచబడతారు.

Rum 30:16

మరియు ఎవరైతే సత్యతిరస్కారులై మా సూచనలను మరియు పరలోక సమావేశాన్ని తిరస్కరించారో, అలాంటి వారు శిక్ష కొరకు హాజరు చేయబడతారు.[1] ——— [1] చూడండి, 7:147.

Rum 30:17

కావున, మీరు సాయంత్రము వేళ మరియు ఉదయం పూట అల్లాహ్ పవిత్రతను కొనియాడండి.

Rum 30:18

మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ సర్వస్తోత్రాలు ఆయన (అల్లాహ్) కే మరియు సంధ్యాకాలంలోనూ మరియు మధ్యాహ్న కాలంలోనూ (స్తోత్రాలు ఆయనకే)![1] ——— [1] ఈ రెండు ఆయతులలో ప్రతి దినపు ఐదు నమా'జుల ప్రస్తావన ఉంది. తుమ్సూన అంటే మగ్రిబ్ మరియు ఇషా నమా'జులు. తు'స్ బి'హూన అంటే ఫజ్ర్ నమా'జు అని అర్థం (ఫ'త్హ్ అల్-ఖదీర్). ఇంకా చూడండి, 11:114, 17:78 20:130.

Rum 30:19

ఆయన సజీవిని నిర్జీవి నుండి తీస్తాడు. మరియు నిర్జీవిని సజీవి నుండి తీస్తాడు. మరియు ఆయన భూమి మృతి చెందిన తరువాత దానికి ప్రాణం పోస్తాడు. ఇదే విధంగా మీరు కూడా (గోరీల నుండి) వెలికి తీయబడతారు.

Rum 30:20

మరియు ఆయన సూచనలలో ఒకటి మిమ్మల్ని మట్టి నుండి సృష్టించటం.[1] ఆ తరువాత మీరు మానవులుగా (భూమిలో) వ్యాపిస్తున్నారు! ——— [1] చూడండి, 3:59, 23:12 మరియు ఇతర చోట్లలో కూడా.

Rum 30:21

మరియు ఆయన సూచనలలో; ఆయన మీ కొరకు మీ జాతి నుండియే - మీరు వారి వద్ద సౌఖ్యం పొందటానికి - మీ సహవాసులను (అజ్వాజ్ లను) పుట్టించి, మీ మధ్య ప్రేమను మరియు కారుణ్యాన్ని కలిగించడం. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలున్నాయి.

Rum 30:22

మరియు ఆయన సూచనలలో ఆయన ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించడం; మరియు మీ భాషలలో మరియు మీ రంగులలో ఉన్న విభేదాలు కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో జ్ఞానులకు ఎన్నో సూచనలున్నాయి.

Rum 30:23

మరియు ఆయన సూచనలలో, మీరు రాత్రిపూట మరియు పగటి పూట, నిద్ర పోవటం మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో శ్రద్ధతో వినేవారికి ఎన్నో సూచనలున్నాయి.

Rum 30:24

మరియు ఆయన సూచనలలో, ఆయన మీకు మెరుపును చూపించి, భయాన్ని మరియు ఆశను కలుగజేయడం;[1] మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి దానితో నిర్జీవి అయిన భూమికి ప్రాణం పోయడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో బుద్ధిమంతులకు ఎన్నో సూచనలున్నాయి. ——— [1] వర్షం కురువవచ్చనే ఆశ. చూడండి, 13:12.

Rum 30:25

మరియు ఆయన సూచనలలో, ఆయన ఆజ్ఞతో భూమ్యాకాశాలు నిలకడ కలిగి ఉండటం.[1] ఆ తరువాత ఆయన మిమ్మల్ని ఒక్క పిలుపు పిలువగానే మీరంతా భూమి నుండి లేచి ఒకేసారి బయటికి రావటం కూడా ఉన్నాయి. ——— [1] చూడండి, 13:2.

Rum 30:26

మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ ఆయనదే. అన్నీ ఆయనకే ఆజ్ఞావర్తనులై ఉంటాయి.

Rum 30:27

మరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు.[1] ఇది ఆయనకు ఎంతో సులభమైనది. భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది.[2] ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేచనా పరుడు. ——— [1] చూడండి, 10:4. [2] చూడండి, 42:11.

Rum 30:28

ఆయన, స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని మీకు తెలుపుతున్నాడు. ఏమీ? మేము మీకు జీవనోపాధిగా సమకూర్చిన దానిలో మీ బానిసలు మీతో పాటు సరిసమానులుగా, భాగస్వాములు కాగలరా? మీరు పరస్పరం ఒకరి పట్ల నొకరు భీతి కలిగి ఉన్నట్లు, వారి పట్ల కూడా భీతి కలిగి ఉంటారా? ఈ విధంగా మేము బుద్ధిమంతులకు మా సూచనలను వివరిస్తూ ఉంటాము[1]. ——— [1] చూడండి, 16:75-76. ఇటువంటి సామెతలకు. మానవులు, తమతోటి మానవులైన బానిసలను తమతో పాటు సమానులుగా స్వీకరించలేరు. అయితే అల్లాహ్ (సు.తా.) సర్వసృష్టికర్త తాను సృష్టించిన దానిని తనకు సమానంగా ఏ విధంగా స్వీకరించగలడు. ఆయన (సు.తా.) ను వదలి, ఆయన పుట్టించిన వాటిని ఆరాధించటం ఎలా క్షమించగలడు. అందుకే ఆయన ఖుర్ఆన్ లో వ్యక్తం చేశాడు. షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించడం) అల్లాహ్ (సు.తా.) ఎన్నటికీ క్షమించడు.

Rum 30:29

కాని దుర్మార్గులైనటువంటి వారు, తెలివి లేనిదే, తమ కోరికలను అనుసరిస్తారు. అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలిన వ్యక్తికి మార్గదర్శకత్వం ఎవడు చేయగలడు? [1] మరియు వారికి సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు. ——— [1] ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి వారికే మార్గదర్శకత్వం లభిస్తుంది, ఎవరైతే మార్గదర్శకత్వాన్ని ఆపేక్షిస్తారో! ఇక ఎవరైతే హృదయపూర్వకంగా అల్లాహ్ (సు.తా.) మార్గదర్శకత్వాన్ని అపేక్షించరో ఆయన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. ఇదే సున్నతుల్లాహ్ - అల్లాహ్ (సు.తా.) సంప్రదాయం. ఈ విషయం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు విశదీకరించబడింది. అల్లాహ్ (సు.తా.) మానవులకు మరియు జిన్నాతులకు మంచి చెడుల మధ్య విచక్షణా జ్ఞాననాన్నొసంగి; విశ్వసించి, మంచి పనులు చేసేవారికి స్వర్గం మరియు చెడుదారి పట్టేవారికి నరకం, అని వ్యక్తం చేశాడు. మరియు ప్రతి యుగం వారికి, అల్లాహ్ (సు.తా.) ను మాత్రమే ఆరాధించమని మరియు మంచిని చేయమని ఆదేశించటానికి, చెడునుండి నివారించటానికి మార్గదర్శకులుగా ప్రవక్తలను పంపి, వారి వద్దకు దివ్యజ్ఞానం (వ'హీ) పంపుతూ వచ్చాడు. చూడండి, 14:4 మరియు 2:7.

Rum 30:30

కావున నీవు నీ ముఖాన్ని, ఏకాగ్రచిత్తంతో, సత్యధర్మం (ఇస్లాం) దిశలో స్థిరంగా నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావం పైననే వారు ఉంటారు.[1] అల్లాహ్ సృష్టి స్వభావాన్ని (ఎవ్వరూ) మార్చలేరు. ఇదే సరైన ధర్మం, కాని చాలా మంది ఇది ఎరుగరు. ——— [1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ప్రతి వ్యక్తి పుట్టుకతో స్వాభావికంగా అల్లాహ్ (సు.తా.) కు విధేయుడు (ముస్లిం) అయి ఉంటాడు. కానీ ముస్లిమేతరులైన అతని తల్లిదండ్రులు అతనిని యూదుడు, క్రైస్తవుడు, మజూసీ (లేక ఇతర మతస్తుడి) గా చేస్తారు.' ('స'హీ'హ్ బు'ఖారీ మరియు 'స'హీ'హ్ ముస్లిం)

Rum 30:31

(ఎల్లప్పుడు) మీరు ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతూ ఉండండి. మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నమాజ్ స్థాపించండి. మరియు ఆయన (అల్లాహ్) కు సాటి (భాగస్వాములు) కల్పించే వారిలో చేరిపోకండి;

Rum 30:32

వారిలో ఎవరైతే, తమ ధర్మాన్ని విభజించి వేర్వేరు తెగలుగా చేసుకున్నారో! ప్రతివర్గం వారు తమ వద్దనున్న దాని (సిద్ధాంతం) తోనే సంతోషపడుతున్నారు.[1] ——— [1] అంటే ప్రతి ధర్మం, తెగ లేక వర్గం వారు తాము అనుసరించే దానితోనే సంతుష్టులై ఉంటారు. మరియు వారి వద్ద దానిని సమర్ధించే వాదాలు కూడా ఉంటాయి. వాస్తవానికి సత్యం మీద ఒకే ఒక్క ధర్మం, తెగ ఉండగలదు. ఆ ధర్మే - అల్లాహ్ (సు.తా.) మార్గదర్శకత్వం చేసిన, ప్రవక్తలందరూ మరియు చివరి ప్రవక్త ము'హమ్మద్ ('స'అస') కూడా అనుసరించి, బోధించిన ధర్మం - ఇస్లాం; మహాప్రవక్త ('స'అస) మరియు అతని అనుచరు(ర'ది.'అన్హుమ్)లు అనుసరించిన ధర్మం. ఇంకా చూడండి, 6:159, 21:92-93 మరియు 23:52-53.

Rum 30:33

మరియు మానవులకు ఆపద వచ్చినపుడు, వారు తమ ప్రభువు వైపునకు పశ్చాత్తాపంతో మరలి ఆయనను వేడుకుంటారు. ఆ తరువాత ఆయన కారుణ్యం నుండి కొంత వారికి రుచి చూపించినప్పుడు, వారిలో కొందరు తమ ప్రభువుకు సాటి (భాగస్వాములను) కల్పించసాగుతారు.[1] ——— [1] చూచూడండి, 16:54.

Rum 30:34

మేము వారికి ప్రసాదించిన దానికి (అనుగ్రహాలకు) కృతఘ్నత చూపటానికి (వారు అలా చేస్తారు). సరే! మీరు కొంత కాలం సుఖసంతోషాలు అనుభవించండి, త్వరలోనే మీరు (మీ ముగింపును) తెలుసుకుంటారు.

Rum 30:35

లేక మేము వారిపై ఏదైనా ప్రమాణాన్ని[1] అవతరింప జేశామా, అది వారు ఆయనకు కల్పించే భాగస్వాములను గురించి పలుకటానికి?[2] ——— [1] సు'ల్ తానున్: అంటే ఇక్కడ దివ్యజ్ఞానం వహీ అని అర్థం. [2] చూడండి, 35:40.

Rum 30:36

మరియు మేము మానవులకు కారణ్యపు రుచి చూపించినప్పుడు వారు దానితో చాలా సంతోషపడతారు. కాని వారు తమ చేతులారా చేసుకున్న కర్మల ఫలితంగా[1] వారికేదైనా కీడు కలిగితే నిరాశ చెందుతారు. ——— [1] చూడండి, 4:79.

Rum 30:37

ఏమీ? వారికి తెలియదా? అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ఇస్తాడని మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడని? నిశ్చయంగా, ఇందులో విశ్వసించేవారికి ఎన్నో సూచనలున్నాయి.

Rum 30:38

కావున నీవు నీ బంధువుకు అతని హక్కు ఇవ్వు మరియు యాచించని పేదవానికి మరియు బాటసారికి (కూడా)[1]. ఇది అల్లాహ్ ప్రసన్నతను కోరేవారికి ఎంతో ఉత్తమమైనది. మరియు ఇలాంటి వారే సాఫల్యము పొందేవారు. ——— [1] చూడండి, 17:26. బంధువులకు, పేదవారికి మరియు బాటసారులకు మీరు ఇచ్చేది వారిపై చేసిన అనుగ్రహం కాదు. మీరు వారి హక్కు చెల్లిస్తున్నారు. పేదవాడైన దగ్గరి బంధువుకు ఇవ్వటం వల్ల రెండింతలు పుణ్యం దొరుకుతుంది. ఒకటి నీవు నీ దగ్గరివానికి ఇచ్చినందుకు, రెండవది పేదవానికి ఇచ్చినందుకు. ('స'హీ'హ్ 'హదీసు').

Rum 30:39

మరియు మీరు ప్రజలకు - రిబా[1] (వడ్డీ మీద డబ్బు /కానుకలు) ఇచ్చి దాని ద్వారా వారి సంపద నుండి వృద్ధి పొందాలని - ఇచ్చే ధనం, అల్లాహ్ దృష్టిలో ఏ మాత్రం వృద్ధి పొందదు. మరియు మీరు అల్లాహ్ ప్రసన్నతను పొందే ఉద్దేశంతో ఏదైనా దానం (జకాత్) చేస్తే అలాంటి వారి (సంపద) ఎన్నో రెట్లు అధికమవుతుంది. ——— [1] రిబా': వడ్డీ అనే పదం ఖుర్ఆన్ అవతరణా క్రమంలో ఈ ఆయత్ లో మొదటిసారి వచ్చింది. దాని అర్థం : ఏదైనా ఇచ్చి - ఇచ్చిన దానికంటే - ఎక్కువ తీసుకోవటం. ఇబ్నె 'అబ్బాస్ మరియు చాలామంది ఇతర 'స'హాబీలు ('రది.'అన్హుమ్) ఈ ఆయత్ లో వచ్చిన పదం రిబా' అంటే ఈ విధమైన వ్యాఖ్యానం కూడా ఇచ్చారు: ఒక పేదవాడు ఒక ధనవంతునికి లేక ఒక వ్యక్తి తన రాజుకు, లేక ఒక సేవకుడు తనను పెట్టుకున్న వానికి, తాను ఇచ్చిన దాని కంటే ఎక్కువ తిరిగి వచ్చుననే ఆశతో, ఇచ్చే బహుమానం, అని. ఇచ్చేటప్పుడు, ఎక్కువ తిరిగి వస్తుంది అనే భావన ఉండటం వల్లనే, ఇది నిషిద్ధం చేయబడింది (ఇబ్నె-కసీ'ర్, అయ్ సర్ అత్తఫాసీర్). చూడండి, 3:130 మరియు 2:275-281..

Rum 30:40

అల్లాహ్ యే మిమ్మల్ని పుట్టించాడు, తరువాత జీవనోపాధినిచ్చాడు. తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మళ్ళీ బ్రతికిస్తాడు. అయితే? మీరు (అల్లాహ్ కు) సాటిగా (భాగస్వాములుగా) కల్పించిన వారిలో, ఎవడైనా వీటిలో నుండి ఏదైనా ఒక్క పనిని చేయగలవాడు ఉన్నాడా! [1] ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే భాగస్వాముల కంటే ఆయన మహోన్నతుడు. ——— [1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ఒక దుష్టుడు మరణిస్తే, కేవలం మానవులే గాక పశుపక్షులు, చెట్లు చేమలు కూడా వాని నుండి శాంతి పొందుతాయి.' 'స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం)

Rum 30:41

మానవులు తమ చేజేతులా సంపాదించుకున్న దాని ఫలితంగా భూమిలో మరియు సముద్రంలో కల్లోలం వ్యాపించింది. ఇది వారిలో కొందరు చేసిన దుష్కర్మల ఫలితాన్ని రుచి చూపటానికి, బహుశా ఇలాగైనా వారు (అల్లాహ్ వైపునకు) మరలుతారేమోనని!

Rum 30:42

వారితో ఇలా అను: "భూమిలో ప్రయాణం చేసి చూడండి, మీకు పూర్వం గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో! వారిలో చాలా మంది బహుదైవారాధకు లుండిరి."

Rum 30:43

కావున నీవు నీ ముఖాన్ని సరైన ధర్మం (ఇస్లాం) వైపునకే స్థిరంగా నిలుపు[1] - అల్లాహ్ తరఫు నుండి - ఆ రోజు రాకముందే దేనినైతే ఎవ్వడూ తొలగించలేడో! ఆ రోజు వారు పరస్పరం చెదిరిపోయి వేరవుతారు.[2] ——— [1] అల్లాహ్ (సు.తా.) దృష్టిలో సత్యధర్మం: అంటే అల్లాహ్ (సు.తా.) కు దాస్యం - తనను తాను అల్లాహ్ (సు.తా.) అభీష్టానికి అప్పగించడం (ఇస్లాం) - మాత్రమే. చూడండి, 3:19. [2] ఒకటి విశ్వాసులది, రెండవది సత్యతిరస్కారులది.

Rum 30:44

సత్యాన్ని తిరస్కరించినవాడు, తన తిరస్కార ఫలితాన్ని అనుభవిస్తాడు. మరియు సత్కార్యాలు చేసిన వారు, తమ కొరకే (సాఫల్యమార్గాన్ని) తయారు చేసుకుంటారు.

Rum 30:45

ఇది ఆయన (అల్లాహ్), తన అనుగ్రహంతో విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ప్రతిఫల మివ్వటానికి.[1] నిశ్చయంగా, ఆయన సత్యతిరస్కారులను ప్రేమించడు. ——— [1] స్వర్గం పొందటానికి కేవలం విశ్వసించి సత్కార్యాలు చేయటమే సరిపోదు. దానికి అల్లాహ్ (సు.తా.) అనుగ్రహం కూడా ఉండాలి. ఆయనయే సత్కార్యాల ప్రతిఫలాన్ని ఎన్నోరెట్లు అధికం చేసి ఇస్తాడు.

Rum 30:46

ఇక ఆయన సూచనలలో ఆయన గాలులను శుభవార్తలిచ్చేవిగా పంపి మీకు తన కారుణ్యాన్ని రుచి చూపటం మరియు ఆయన ఆజ్ఞతో ఓడలను నడిపి, మిమ్మల్ని ఆయన అనుగ్రహాన్ని అన్వేషించనివ్వటం కూడా ఉన్నాయి. ఇవన్నీ, బహుశా మీరు కృతజ్ఞతలు చూపుతారేమోనని!

Rum 30:47

మరియు వాస్తవానికి మేము నీకు పూర్వం కూడా, సందేశహరులను తమ తమ జాతి వారి వద్దకు పంపాము.[1] వారు, వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకొని వచ్చారు. ఆ తరువాత కూడా నేరం చేసిన వారికి తగిన ప్రతీకారం[2] చేశాము. మరియు విశ్వాసులకు సహాయం చేయటం మా కర్తవ్యం. ——— [1] చూడండి, 10:74. [2] అల్-ముంతఖిమ్ (సేకరించబడిన పదం): Retributor, Avenger of evil, ప్రతీకారం తీర్చుకునే, ప్రతీకారం చేసే, దుష్టులను శిక్షించేవాడు. చూడండి, 32:22.

Rum 30:48

అల్లాహ్ యే గాలులను పంపేవాడు, కావున అవి మేఘాలను పైకి ఎత్తుతాయి, ఆ తరువాత ఆయన వాటిని తాను కోరినట్లు ఆకాశంలో వ్యాపింపజేస్తాడు. మరియు వాటిని ముక్కలు ముక్కలుగా చేసి, తరువాత వాటి మధ్య నుండి వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన దానిని తన దాసులలో తాను కోరిన వారిపై కురిపించగా వారు సంతోషపడతారు!

Rum 30:49

మరియు వాస్తవానికి, అది (వర్షం) కురవక ముందు వారు ఎంతో నిరాశ చెంది ఉండేవారు.

Rum 30:50

కావున (ఓ మానవుడా!) అల్లాహ్ కారుణ్య చిహ్నాలను చూడు: ఆయన నిర్జీవంగా ఉన్న భూమిలో ఏ విధంగా ప్రాణం పోస్తాడో! నిశ్చయంగా, ఇదే విధంగా ఆయన (మరణానంతరం) మృతులకు కూడా ప్రాణం పోస్తాడు! మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు.

Rum 30:51

మరియు మేము గాలిని పంపితే, దాని నుండి వారి పంటలను పసుపు పచ్చగా మారి పోవటాన్ని చూసిన తరువాత వారు కృతఘ్నతకు లోనవుతారు (సత్యతిరస్కారులవుతారు).

Rum 30:52

నిశ్చయంగా, నీవు (ఓ ముహమ్మద్!) మృతులకు వినిపించలేవు. మరియు నీవు వెనుదిరిగి పోయే చెవిటివారికి కూడా సందేశాన్ని వినిపించలేవు.

Rum 30:53

మరియు నీవు అంధులను, వారి మార్గభ్రష్టత్వం నుండి తప్పించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. నీవు కేవలం విశ్వసించి, అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మాత్రమే మా సూచనలు వినిపించగలవు.[1] ——— [1] ఇటువంటి ఆయత్ లకు చూడండి, 27:80-81.

Rum 30:54

అల్లాహ్ యే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించిన వాడు. మళ్ళీ ఆ బలహీన స్థితి తరువాత మీకు బలాన్ని ఇచ్చాడు. ఆ బలం తరువాత మళ్ళీ మిమ్మల్ని బలహీనులుగా, ముసలివారిగా చేశాడు. ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. మరియు కేవలం ఆయనే సర్వజ్ఞుడు, సర్వసమర్ధుడు.

Rum 30:55

మరియు ఆ ఘడియ[1] సంభవించిన రోజు, అపరాధులు, ప్రమాణం చేస్తూ: "మేము ఒక ఘడియ సేపు కంటే ఎక్కువ కాలం (ప్రపంచంలో) ఉండలేదు" అని అంటారు. ఇదే విధంగా వారు (ప్రాపంచిక జీవితంలో) భ్రమలో ఉండేవారు.[2] ——— [1] ఆ ఘడియ అంటే పునరుత్థాన ఘడియ. అదే ఈ లోకపు అంతిమ ఘడియ. [2] చూచూడండి, 17:52.

Rum 30:56

మరియు జ్ఞానం మరియు విశ్వాసం అనుగ్రహింప బడినవారు ఇలా అంటారు: "వాస్తవానికి అల్లాహ్ మూలగ్రంథం[1] ప్రకారం మీరు పునరుత్థాన దినం వరకు (ఇహలోకంలో) ఉంటిరి. ఇక ఇదే ఆ పునరుత్థాన దినం, కాని నిశ్చయంగా! మీరిది తెలుసు కోలేక పోయారు." ——— [1] కితాబిల్లాహి: అంటే అల్లాహ్ వ్రాసి ఉంచిన లౌ'హె మ'హ్ ఫూ''జ్, మూలగ్రంథం.

Rum 30:57

కనుక ఆ రోజు దుర్మార్గులకు, వారి సాకులు ఏ మాత్రం ప్రయోజనకరం కావు మరియు వారికి తమను తాము సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వబడదు.

Rum 30:58

మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజలకు, ప్రతి ఒక్క విషయపు ఉపమానాన్ని బోధించాము.[1] అయినా నీవు వారి వద్దకు ఏ అద్భుత సూచన (ఆయత్) తెచ్చినా, వారిలో సత్యతిరస్కారులైన వారు ఇలా అంటారు: "మీరు కేవలం బూటకాలే పలుకుతున్నారు." ——— [1] చూడండి, 39:27.

Rum 30:59

ఈ విధంగా, అల్లాహ్ జ్ఞానహీనుల హృదయాల మీద ముద్ర వేస్తాడు.[1] ——— [1] చూడండి, 2:7.

Rum 30:60

కావున నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం! కావున విశ్వాసహీనులు నిన్ను వ్యాకుల పరచరాదు సుమా!

Lukman 31:1

అలిఫ్-లామ్-మీమ్.[1] ——— [1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

Lukman 31:2

ఇవి వివేకంతో నిండి ఉన్న గ్రంథ సూచనలు (ఆయాత్)

Lukman 31:3

(ఇందులో) సజ్జనులకు[1] మార్గదర్శకత్వమూ మరియు కారుణ్యమూ ఉన్నాయి. ——— [1] ము'హ్ సినీన్, ము'హ్ సిన్ (ఏ.వ.): దీనికి మూడు అర్థాలున్నాయి. 1) ఉపకారం చేసేవాడు; తన తల్లిదండ్రులకు, బంధువులకు, మొదలైనవారికి. 2) సత్కార్యాలు చేసేవాడు మరియు పాపాలనుండి దూరంగా ఉండేవాడు. 3) అల్లాహ్ (సు.తా.) యొక్క ఆరాధన - భక్తి, శ్రద్ధ, దైవభీతి మరియు ఏకాగ్రతతో - చేసేవాడు.

Lukman 31:4

(వారికే) ఎవరైతే నమాజ్ ను స్థాపించి విధిదానం (జకాత్) ఇస్తారో[1] మరియు పరలోక జీవితం మీద దృఢమైన నమ్మకం కలిగి ఉంటారో; ——— [1] చూడండి, 2:2-4.

Lukman 31:5

అలాంటి వారే, తమ ప్రభువు తరఫు నుండి (వచ్చిన) మార్గదర్శకత్వం మీద ఉన్నవారు. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు.

Lukman 31:6

మరియు మానవులలో కొందరు - జ్ఞానం లేక, వ్యర్థ కాలక్షేపం చేసే మాటలను కొని[1] - ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పించే వారున్నారు మరియు వారు దానిని (అల్లాహ్ మార్గాన్ని) పరిహాసం చేస్తుంటారు. అలాంటి వారికి అవమానకరమైన శిక్ష పడుతుంది. ——— [1] అంటే సంగీతం మరియు ఇతర వృథా మాటలలో, విషయాలలో కాలక్షేపం చేయడానికి వాడే వస్తువులు.

Lukman 31:7

అలాంటి వానికి, మా సూచనలు (ఆయాత్) వినిపింప జేసినప్పుడు, అతని రెండు చెవులలో చెవుడు ఉన్నట్లుగా, అతడు వాటిని విననే లేదన్నట్లుగా, అహంకారంతో మరలిపోతాడు.[1] వానికి అతి బాధాకరమైన శిక్ష పడుతుందనే వార్తను వినిపించు. ——— [1] చూడండి, 23:66-67.

Lukman 31:8

నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో, వారి కొరకు పరమానందకరమైన స్వర్గ వనాలుంటాయి.

Lukman 31:9

వారు, శాశ్వతంగా వాటిలో ఉంటారు. ఇది అల్లాహ్ యొక్క సత్య వాగ్దానం. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

Lukman 31:10

మీరు చూస్తున్నారు కదా! ఆయన ఆకాశాలను స్థంభాలు లేకుండానే సృష్టించాడు.[1] మరియు భూమిలో పర్వతాలను నాటాడు, అది మీతో పాటు కదలకుండా ఉండాలని;[2] మరియు దానిలో ప్రతి రకమైన ప్రాణిని నివసింపజేసాడు. మరియు మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిలో రకరకాల శ్రేష్ఠమైన (పదార్థాలను)[3] ఉత్పత్తి చేశాము. ——— [1] చూడండి, 13:2. [2] చూడండి, 16:15. [3] 'జౌజిన్: అంటే ప్రతిరకమైన ధాన్యాలు మరియు ఫలాలు, (ము'హమ్మద్ జూనాగఢి). మరొక అర్థం: రకరకాల జీవరాశి (నోబుల్ ఖుర్ఆన్). రెండూ సరైనవే. ఇంకా చూడండి, 26:7.

Lukman 31:11

ఇదంతా అల్లాహ్ సృష్టియే! ఇక ఆయన తప్ప ఇతరులు ఏమి సృష్టించారో నాకు చూపండి. అలా కాదు ఈ దుర్మార్గులు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు.

Lukman 31:12

మరియు నిశ్చయంగా, మేము లుఖ్మాన్ కు వివేకాన్ని ప్రసాదించాము,[1] అతను అల్లాహ్ కు కృతజ్ఞుడుగా ఉండాలని. మరియు ఎవడైతే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాడో, అతడు నిశ్చయంగా, తన మేలు కొరకే కృతజ్ఞతలు తెలుపుతాడు. మరియు కృతఘ్నతకు పాల్పడిన వాడు, నిశ్చయంగా అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడని (తెలుసుకోవాలి). ——— [1] లుఖ్మాన్ ('అ.స.): ఒక మహా సత్పురుషుడు. అల్లాహ్ (సు.తా.) అతనికి ('అ.స.) మంచి జ్ఞానం, దూరదృష్టి, దైవభీతి మరియు వివేచనాశక్తిని ప్రసాదించాడు.

Lukman 31:13

మరియు (జ్ఞాపకం చేసుకోండి) లుఖ్మాన్ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: "ఓ నా పుత్రుడా! అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పించకు. నిశ్చయంగా, అల్లాహ్ కు భాగస్వాములను కల్పించటం (బహుదైవారాధన) మహా దుర్మార్గము."

Lukman 31:14

మరియు (అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు): "మేము మానవునకు తన తల్లిదండ్రుల యెడల మంచితనంతో మెలగటం విధిగా జేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తన గర్భంలో) భరిస్తుంది మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు. నీకు నా వైపునకే మరలి రావలసి ఉన్నది."[1] ——— [1] చూడండి, 17:23-24.

Lukman 31:15

"మరియు ఒకవేళ వారిరువురు - నీవు ఎరగని దానిని - నాకు (అల్లాహ్ కు) భాగస్వామిగా చేర్చమని, నిన్ను బలవంతం చేస్తే, వారి మాటను నీవు ఏ మాత్రం వినకు.[1] మరియు ఇహలోక విషయాలలో ధర్మసమ్మతమైన వాటిలో వారికి తోడుగా ఉండు. మరియు పశ్చాత్తాపంతో నా వైపుకు మరలేవాని మార్గాన్ని అనుసరించు. తరువాత మీరంతా నా వైపునకే మరలి రావలసి ఉన్నది. అప్పుడు నేను మీరు చేసే కర్మలను గురించి మీకు తెలుపుతాను." ——— [1] చూడండి, 29:8.

Lukman 31:16

"ఓ నా కుమారా! ఒకవేళ నీ కర్మ ఆవగింజంత ఉండి, అది ఒక పెద్ద రాతిబండలో గానీ, ఆకాశంలో గానీ లేదా భూమిలో గానీ దాగివున్నా, అల్లాహ్ దానిని తప్పక (వెలుగులోకి) తెస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ఎంతో సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు."

Lukman 31:17

"ఓ నా కుమారా! నమాజ్ స్థాపించు మరియు ధర్మాన్ని ఆదేశించు మరియు అధర్మాన్ని నిషేధించు, ఆపదలో సహనం వహించు. నిశ్చయంగా, ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన విషయాలు."[1] ——— [1] వంకర అక్షరా (Italics) లలో ఉన్నది నోబుల్ ఖుర్ఆన్ లో ఉన్న తాత్పర్యం.

Lukman 31:18

"మరియు నీ చెంపలను గర్వంతో ప్రజల యెదుట ఉబ్బించకు.[1] మరియు భూమిపై అహంకారంతో నడవకు. నిశ్చయంగా, అల్లాహ్ డాంబికాలు చెప్పుకొని, విర్రవీగే వాడంటే ఇష్టపడడు." ——— [1] పైన ఉన్నది ముహమ్మద్ జూనాగఢీ గారి తాత్పర్యం. ఈ వాక్యపు తాత్పర్యం నోబుల్ ఖుర్ఆన్ లో ఇలా ఉంది: "ప్రజలతో ముఖం ప్రక్కకు త్రిప్పుకొని (చిట్లించుకొని) గర్వంతో మాట్లాడకు."

Lukman 31:19

"మరియు నీ నడకలలో నమ్రత పాటించు.[1] మరియు నీ స్వరాన్ని తగ్గించు. నిశ్చయంగా, స్వరాలలో అన్నిటికంటే కరకైన (వినసొంపుకానిది) గాడిద స్వరమే!" ——— [1] చూడండి, 25:63.

Lukman 31:20

ఏమీ? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సకల వస్తువులను వాస్తవానికి అల్లాహ్ మీకు ఉపయుక్తంగా చేశాడనీ[1] మరియు ఆయన బహిరంగంగానూ మరియు గోప్యంగానూ తన అనుగ్రహాలను, మీకు ప్రసాదించాడనీ, మీకు తెలియదా? మరియు ప్రజలలో కొందరు ఎలాంటి జ్ఞానం, మార్గదర్శకత్వం మరియు వెలుగు చూపే స్పష్టమైన గ్రంథం లేనిదే అల్లాహ్ ను గురించి వాదులాడే వారున్నారు! ——— [1] చూడండి, 14:32-33.

Lukman 31:21

మరియు వారితో: "అల్లాహ్ అవతరింపజేసిన దానిని అనుసరించండి!" అని అన్నప్పుడు, వారు: "కాదు మా తండ్రితాతలు నడిచిన మార్గాన్నే మేము అనుసరిస్తాము." అని అంటారు. ఏమీ? షైతాన్ వారిని భగభగమండే అగ్ని వైపునకు ఆహ్వానిస్తున్నప్పటికీ, (వారు అలాంటి మార్గాన్నే అనుసరిస్తారా)?[1] ——— [1] చూడండి, 2:14 మరియు 15:17.

Lukman 31:22

ఎవడైతే, తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని[1] సజ్జనుడై ఉంటాడో, అలాంటి వాడు నిస్సందేహంగా దృఢమైన ఆధారాన్ని పట్టుకున్నవాడే! మరియు సకల వ్యవహారాల ముగింపు (తీర్పు) అల్లాహ్ వద్దనే ఉంది. ——— [1] చూడండి, 2:112.

Lukman 31:23

మరియు సత్యాన్ని తిరస్కరించేవాని, తిరస్కారం నిన్ను దుఃఖానికి గురి చేయకూడదు. వారందరి మరలింపు మా వైపునకే ఉంది; అప్పుడు మేము వారు చేసిన కర్మలను వారికి తెలుపుతాము. నిశ్చయంగా, అల్లాహ్ కు హృదయాలలో ఉన్న విషయాలు సైతం బాగా తెలుసు.

Lukman 31:24

మేము వారిని కొంత కాలం సుఖాలను అనుభవించనిస్తాము. ఆ తరువాత మేము వారిని కఠినమైన శిక్ష వైపుకు త్రోస్తాము.

Lukman 31:25

ఒకవేళ మీరు వారిని: "ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించింది ఎవరు?" అని అడిగితే! వారు నిస్సంకోచంగా అంటారు: "అల్లాహ్!" అని. వారితో అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే!" కాని వారిలో చాలా మందికి ఇది తెలియదు.

Lukman 31:26

ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్తమూ అల్లాహ్ కే చెందుతుంది. నిశ్చయంగా, అల్లాహ్! కేవలం ఆయనే సర్వసంపన్నుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.

Lukman 31:27

ఒకవేళ వాస్తవానికి, భూమిలో ఉన్న వృక్షాలన్నీ కలములై ఈ సముద్రం మరియు దానితో పాటు అటువంటి ఏడు సముద్రాల (నీళ్ళంతా) సిరాగా ఉన్నా, అల్లాహ్ మాటలు (సూచనలు వ్రాయటానికి) పూర్తి కావు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.[1] ——— [1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 18:109.

Lukman 31:28

మీ అందరినీ సృష్టించటం మరియు తిరిగి (సజీవులుగా) లేపటం ఆయనకు ఒక మానవుణ్ణి (సృష్టించి, తిరిగి లేపడం వంటిదే). నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వ చూసేవాడు.

Lukman 31:29

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? నిశ్చయంగా, అల్లాహ్ రాత్రిని పగటిలోనికి ప్రవేశింప జేస్తున్నాడని మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేస్తున్నాడని.[1] మరియు సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి నియమబద్దులుగా చేసి ఉంచాడనీ ప్రతి ఒక్కటీ ఒక నిర్ణీత కాలంలో మరియు (పరిధిలో) తిరుగుతూ ఉంటాయనీ![2] మరియు నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగునని? ——— [1] అంటే చలికాలంలో రాత్రి పెద్దదై పగలు చిన్నదవటం మరియు వేసవి కాలంలో పగలు పెద్దదయి రాత్రి చిన్నదవటం. [2] ఈ నిర్ణీతకాలం, పునరుత్థానదినం కావచ్చు లేక అవి తమ పరిధిలో ఒకసారి చుట్టు తిరిగి మరల మొదటి స్థానానికి వచ్చుటకు పట్టే కాలం కావచ్చు!

Lukman 31:30

ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ కేవలం ఆయనే సత్యం. మరియు ఆయనను వదలి వారు ఆరాధించేవన్నీ అసత్యాలు మరియు నిశ్చయంగా అల్లాహ్! కేవలం ఆయనే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).

Lukman 31:31

ఏమీ? నీకు తెలియదా? మీకు కొన్ని సూచనలను తెలుపటానికి, అల్లాహ్ అనుగ్రహంతో, ఓడ సముద్రంలో పయనం చేస్తున్నదనీ? నిశ్చయంగా, ఇందులో సహనం వహించే ప్రతివానికి, కృతజ్ఞునికి, ఎన్నో సూచనలున్నాయి.

Lukman 31:32

మరియు వారిని సముద్రపు అల, మేఘంగా క్రమ్ముకున్నప్పుడు, వారు పరిపూర్ణ భక్తితో అల్లాహ్ నే వేడుకుంటారు. కాని ఆయన వారిని రక్షించి ఒడ్డుకు చేర్చిన తరువాత వారిలో కొందరు (విశ్వాస-అవిశ్వాసాల) మధ్య ఆగిపోతారు.[1] మరియు మా సూచనలను, కేవలం విశ్వాసఘాతకులు, కృతఘ్నులైన వారు మాత్రమే, తిరస్కరిస్తారు. ——— [1] చూడండి, 17:67 మరియు 29:65.

Lukman 31:33

ఓ మానవులారా! మీ ప్రభువు నందే భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఆ దినానికి భయపడండి, (ఏనాడైతే) తండ్రి తన కుమారునికి నష్టపరిహారం చెల్లించలేడో మరియు ఏ కుమారుడు కూడా తన తండ్రికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేడో! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం! కావున ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసానికి గురి చేయనివ్వకూడదు. మరియు ఆ వంచకుణ్ణి (షైతానును) మిమ్మల్ని అల్లాహ్ విషయంలో వంచనకు గురి చేయనివ్వకూడదు సుమా!

Lukman 31:34

నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం, కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మరియు ఆయనే వర్షం కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసినవాడు. మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో, ఏ మానవుడు కూడా ఎరుగడు.[1] మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తం తెలిసినవాడు (ఎరిగినవాడు). ——— [1] పై ఐదు అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది అవి : 1) అంతిమ ఘడియ సమయం, 2) వర్షం వచ్చే సమయం, 3) మాతృగర్భంలో ఉన్నదాని గతి, 4) రేపు సంభవించబోయే విషయం మరియు 5) మానవుని మరణ స్థానం ('స'హీ'హ్ బు'ఖారీ).

Secde 32:1

అలిఫ్-లామ్-మీమ్[1] ——— [1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

Secde 32:2

నిస్సంకోచంగా, ఈ గ్రంథం (ఖుర్ఆన్) అవతరణ సర్వలోకల ప్రభువు తరఫు నుండియే ఉంది.

Secde 32:3

ఏమీ? వారు (అవిశ్వాసులు): "ఇతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు." అని అంటున్నారా?[1] అలా కాదు! వాస్తవానికి ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించే వారెవ్వరూ రాని జాతి వారికి నీవు హెచ్చరిక చేయటానికి, బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమోనని! ——— [1] అలాంటప్పుడు వారిని ఇలాంటి గ్రంథాన్ని రచించి తెమ్మను? అనే ప్రశ్నకు చూడండి, 17:88, 52:34. ఇలాంటి 10 సూరాహ్ లనైనా రచించి తెమ్మను? అనే ప్రశ్నకు, 11:13. ఇలాంటి ఒక్క సూరహ్ నైనా రచించి తెమ్మను? అనే ప్రశ్నకు, 2:23, 10:38.

Secde 32:4

అల్లాహ్, ఆయనే ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా ఆరు దినములలో (అయ్యామ్ లలో)[1] సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు. ఆయన తప్ప మీకు మరొక సంరక్షకుడు గానీ, సిఫారసు చేసేవాడు గానీ ఎవ్వడూ లేడు, అయినా మీరు హితబోధ గ్రహించరా? ——— [1] చూడండి, 7:54 వ్యాఖ్యానం 1.

Secde 32:5

ఆయనే ఆకాశం నుండి భూమి వరకు ప్రతి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు; తరువాత అంతా ఒకే దినమున,[1] ఆయన వద్దకు పోయి చేరుతుంది; దాని (ఆ దినపు) పరిమాణం మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలు. ——— [1] అంటే ఇది పునరుత్థానదినం అని, కొందరు వ్యాఖ్యాతలు బోధించారు. అది చాలా కష్టతరమైన దినం కావటం వల్ల వేయి సంవత్సరాల వలే కనిపిస్తుంది. చూడండి, 22:47లో కూడా: "…మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్ద ఒక్క వద్ద ఒక్క దినం, మీ లెక్కల ప్రకారం వేయి సంపత్సరాలకు సమానమైనది." అని ఉంది. కాని 70:4లో: "యాభై వేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో, దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్ 'అ.స.) ఆయన (సు.తా.) వద్దకు అధిరోహిస్తారు." అని, ఉంది. అంటే వారు అంత తీవ్రంగా ప్రయాణం చేస్తారన్నమాట.

Secde 32:6

ఆయన (అల్లాహ్) యే అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

Secde 32:7

ఆయన తాను సృష్టించిన ప్రతి దానిని ఉత్తమరీతిలో చేశాడు. మరియు మానవ సృష్టిని మట్టితో ప్రారంభించాడు.[1] ——— [1] చూడండి, 23:12.

Secde 32:8

తరువాత అతని సంతతిని ఒక అధమమైన ద్రవపదార్థపు సారంతో (వీర్యంతో) చేశాడు.

Secde 32:9

ఆ తరువాత. అతనిని యుక్తమైన రూపంలో తీర్చిదిద్ది, అతనిలో తన (నుండి) ప్రాణం (ఆత్మ) ఊదాడు.[1] మరియు మీకు వినేశక్తిని, చూసేశక్తిని మరియు హృదయాలను (అర్థం చేసుకునే శక్తిని) ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలుపు కునేది చాలా తక్కువ! ——— [1] చూడండి, 15:29, 38:72.

Secde 32:10

మరియు వారు (అవిశాసులు) అంటున్నారు: "ఏమీ? మేము నశించి, మట్టిలో కలిసి పోయినా, మేము మళ్ళీ క్రొత్తగా సృష్టించబడతామా?" అది కాదు! వారు తమ ప్రభువుతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తున్నారు.[1] ——— [1] చూడండి, 13:5.

Secde 32:11

వారితో ఇలా అను: "మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు."

Secde 32:12

మరియు (పునరుత్థాన దినమున) ఈ అపరాధులు, తమ ప్రభువు సమక్షంలో, ఏ విధంగా తమ తలలు వంచుకొని నిలబడి ఉంటారో, నీవు చూడగలిగితే! వారు: "ఓ మా ప్రభూ! మేమిప్పుడు చూశాము మరియు విన్నాము, కావున మమ్మల్ని తిరిగి (భూలోకానికి) పంపించు. మేము సత్కార్యాలు చేస్తాము, నిశ్చయంగా, మాకు ఇప్పుడు నమ్మకం కలిగింది." అని అంటారు.

Secde 32:13

మరియు మేము కోరినట్లయితే, ప్రతి వ్యక్తికి (ఆత్మకు) దాని మార్గదర్శకత్వం చేసి ఉండేవారము.[1] కాని, నేను: "నిశ్చయంగా జిన్నాతులు మరియు మానవులందరితో నరకాన్ని నింపివేస్తాను." అని పలికిన, నా మాట సత్యమయ్యింది.[2] ——— [1] చూడండి, 26:4. అల్లాహ్ (సు.తా.) ఎవ్వరినీ సన్మార్గం మీద ఉండటానికి బలవంతం చేయడు కాని మార్గదర్శకత్వం చేస్తాడు. దానిని అనుసరించనివాడు శిక్షకు గురి అవుతాడు. [2] ఇటువంటి వాక్యాలకు చూడండి, 7:18 మరియు 11:119.

Secde 32:14

కావున మీరు మీ యొక్క ఈనాటి సమావేశాన్ని మరచిపోయిన దాని ఫలితాన్ని రుచి చూడండి. నిశ్చయంగా, మేము కూడా మిమ్మల్ని మరచి పోయాము. మరియు మీరు మీ కర్మల ఫలితమైన ఈ శాశ్వత శిక్షను రుచి చూడండి!

Secde 32:15

నిశ్చయంగా వారే, మా సూచనలు (ఆయాత్) వారికి బోధించినప్పుడు, వాటిని విశ్వసించి సాష్టాంగంలో (సజ్దాలో) పడిపోతారు మరియు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతారు. మరియు ఆయనను స్తుతిస్తారు మరియు వారెన్నడూ గర్వపడరు.

Secde 32:16

వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరం చేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు[1] మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేస్తారు. ——— [1] రాత్రులలో లేచి తహజ్జుద్ (నఫిల్) నమాజులు చేస్తారు.

Secde 32:17

కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు.[1] ——— [1] 'హదీస్' ఖుద్సీ: నేను నా పుణ్యాత్ములైన దాసుల కొరకు స్వర్గంలో సిద్ధపరచి ఉంచిన వాటిని ఇంతవరకు ఏ కన్నూ చూడలేదు, ఏ చెవీ వినలేదు మరియు ఏ మానవుడు కూడా వాటిని గురించి ఆలోచించడు, ('స'హీ'హ్ బు'ఖారీ మరియు 'స.ముస్లిం).

Secde 32:18

ఏమీ? విశ్వాసి అయినవాడు (దైవభీతి లేని) అవిధేయునితో సమానుడా? (కాదు!) వారు సరిసమానులు కాలేరు.[1] ——— [1] ఇటువంటి ఆయతులకు చూడండి, 45:21, 38:28, 59:20 మొదలైనవి.

Secde 32:19

ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో వారికి వారి కర్మల ఫలితంగా, వారి ఆతిథ్యం కొరకు స్వర్గవనాలలో నివాసాలుంటాయి.

Secde 32:20

ఇక ఎవరైతే, విద్రోహ వైఖరి అవలంబిస్తారో, వారి నివాసం నరకాగ్నియే. ప్రతిసారి వారు దాని నుండి బయట పడటానికి ప్రయత్నించినప్పుడల్లా, వారందులోకి తిరిగి నెట్టబడతారు. మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకాగ్ని శిక్షను చవి చూడండి."

Secde 32:21

మరియు ఆ పెద్ద శిక్షకు ముందు మేము (ఇహలోకంలో) వారికి సమీప శిక్షను రుచి చూపుతాము.[1] బహుశా, వారు (పశ్చాత్తాప పడి సత్కార్యాల వైపునకు) మరలి వస్తారేమోనని! ——— [1] చూడండి, 52:47.

Secde 32:22

మరియు తన ప్రభువు సూచన (ఆయాత్) ల ద్వారా హితబోధ చేయబడిన తరువాత కూడా, వాటి నుండి విముఖుడయ్యే వాని కంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, మేము అలాంటి అపరాధులకు ప్రతీకారం[1] చేసి తీరుతాము. ——— [1] అల్-ముంతఖిమ్ (సేకరించబడిన పదం):ప్రతీకారం తీర్చుకునే, ప్రతీకారం చేసే, దుష్టులను శిక్షించే వాడు. చూడండి, 30:47.

Secde 32:23

మరియు వాస్తవంగా, మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. కావున, (ఓ ప్రవక్తా!) నీవు అతనిని (ఇస్రా రాత్రిలో) కలుసుకోబోయే విషయాన్ని గురించి సందేహంలో పడకు.[1] మరియు మేము దానిని (తౌరాత్ ను) ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేశాము.[2] ——— [1] మహాప్రవక్త ('స'అస) మె'అరాజ్ రాత్రిలో మూసా ('అ.స.) ను కలుసుకున్నప్పుడు అతను, దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస)కు, అల్లాహ్ (సు.తా.) ను వేడుకొని, నమా'జ్ ల సంఖ్యను, తగ్గించుకోమని సలహా ఇచ్చిన విషయాన్ని ఈ ఆయత్ సూచిస్తుందని వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. [2] ఇక్కడ సంబోధన మూసా ('అ.స.) కు కూడా కావచ్చు.

Secde 32:24

మరియు మేము (ఇస్రాయీల్ సంతతి) వారిలో నుండి కొందరిని నాయకులుగా చేశాము. వారు, వారికి మా ఆజ్ఞానుసారంగా మార్గదర్శకత్వం చేస్తూ ఉన్నారు - ఎంత వరకైతే వారు సహనం వహించి ఉన్నారో మరియు వారు మా ఆయాత్ (సూచనలను) నమ్ముతూ ఉన్నారో!

Secde 32:25

నిశ్చయంగా, నీ ప్రభువు, పునరుత్థాన దినమున, వారికున్న భేదాభిప్రాయాలను గురించి వారి మధ్య తీర్పు చేస్తాడు.[1] ——— [1] చూడండి, 22:67-69.

Secde 32:26

ఏమీ? వీరికి పూర్వం అనేక తరాలను నాశనం చేసిన విషయం వీరికి మార్గదర్శకత్వం కాదా? వీరు, వారి నివాసస్థలాలలో తిరుగుతున్నారు కదా! నిశ్చయంగా ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఏమీ? వీరు వినటం లేదా?

Secde 32:27

ఏమీ? వారు చూడటం లేదా? నిశ్చయంగా, మేము ఒక బంజరు భూమి వైపునకు నీళ్ళను (వర్షాన్ని) పంపి దాని నుండి పైరును ఉత్పత్తి చేస్తే, దానిని వారి పశువులు మరియు వారూ తింటున్నారని. ఏమీ? వారిది గమనించటం (చూడటం) లేదా?

Secde 32:28

ఇంకా ఇలా అంటున్నారు: "మీరు సత్యవంతులే అయితే, ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో చెప్పండి!"[1] ——— [1] ఇక్కడ తీర్పు అంటే, ఆ తీర్పు దేనినైతే ముష్రిక్ ఖురైషులు తమ మీదికి తెమ్మని దైవప్రవక్త('స'అస) ను హేళనతో అడిగేవారో. అంటే అల్లాహ్ (సు.తా.) శిక్ష.

Secde 32:29

ఇలా అను: "ఆ తీర్పుదినం నాడు[1] సత్యతిరస్కారులు విశ్వసించ గోరినా, అది వారికి ఏ విధంగానూ పనికిరాదు! మరియు వారికెలాంటి గడువు కూడా ఇవ్వబడదు." ——— [1] ఇక్కడ తీర్పుదినం అంటే పునరుత్థాన దినం.

Secde 32:30

కావున నీవు వారితో విముఖుడవగు![1] మరియు వేచి ఉండు నిశ్చయంగా, వారు కూడా (ఆ దినం కొరకు) వేచి ఉంటారు. ——— [1] చూడండి, 6:106.

Ahzab 33:1

ఓ ప్రవక్తా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు మరియు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల యొక్క అభిప్రాయాన్ని లక్ష్య పెట్టకు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనా పరుడు.

Ahzab 33:2

మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వహీని) మాత్రమే అనుసరించు. నిశ్చయంగా, అల్లాహ్ మీరు చేసేదంతా ఎరుగును.

Ahzab 33:3

కావున అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకో మరియు కార్యసాధకుడుగా అల్లాహ్ చాలు.

Ahzab 33:4

అల్లాహ్ ఏ వ్యక్తి ఎదలో కూడా రెండు హృదయాలు పెట్టలేదు. మరియు మీరు మీ భార్యలను 'తల్లులు' అని పలికి, జిహార్[1] చేసినంతటనే వారిని మీకు తల్లులుగా చేయలేదు. మరియు మీరు దత్త తీసుకొన్న వారిని మీ (కన్న) కుమారులుగా చేయలేదు. ఇవన్నీ మీరు మీ నోటితో పలికే మాటలు మాత్రమే! మరియు అల్లాహ్ సత్యం పలుకుతాడు మరియు ఆయన (ఋజు) మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు. ——— [1] "జిహార్: అంటే భార్యను తల్లిగా ఎంచటం ఏ విధంగానైతే ఒక వక్షంలో రెండు హృదయాలు ఉండవో అదే విధంగా ఒక వ్యక్తికి ఇద్దరు తల్లులు ఉండరు. ఇద్దరు తండ్రులు కూడా ఉండరు. కావున ఇస్లాంకు ముందు, ముష్రికులు తమ భార్యను శిక్షించటానికి :"ఈ నాటి నుండి నేను నిన్ను తల్లిగా భావిస్తున్నాను." అని చెప్పి, ఆమెకు విడాకులివ్వకుండా తన ఇంట్లోనే ఉంచుకొని బాధించేవారు. ఇస్లాం దానిని నిషేధించింది. దత్తకుమారులు, మీ కుమారులు కారు. కాబట్టి వారిని వారి వాస్తవ తండ్రి పేరుతోనే కిలపి పిలవాలి అనే శాసనం కూడా ఇచ్చింది.

Ahzab 33:5

వారిని (మీ దత్త పిల్లలను), వారి (వాస్తవ) తండ్రుల పేర్లతోనే కలిపి పిలవండి.[1] అల్లాహ్ దృష్టిలో ఇదే న్యాయమైనది. ఒకవేళ వారి తండ్రులెవరో మీకు తెలియక పోతే, అపుడు వారు మీ ధార్మిక సోదరులు మరియు మీ స్నేహితులు.[2] మీరు ఈ విషయంలో (ఇంత వరకు) చేసిన పొరపాటు గురించి మీ కెలాంటి పాపం లేదు, కాని ఇక ముందు మీరు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తే (పాపం) అవుతుంది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ——— [1] అంటే వారు వారి వాస్తవ తండ్రి పేరుతోనే పిలువబడాలి. దానితో వారి నిజ వ్యక్తిత్వం భద్రపరచబడుతుంది. వారిని మీ నిజ సంతానంగా పరిగణించకండి. [2] ఒకవేళ దత్తపుత్రుని వాస్తవతండ్రి పేరు తెలియకుంటే, వారు మీ ధార్మిక సోదరులు అట్టి పక్షంలో కూడా వారిని పోషించండి, కాని మీ పుత్రులుగా చేసుకొని, మీ పేరు ఇవ్వకండి.

Ahzab 33:6

విశ్వాసులకు (ముస్లింలకు), దైవప్రవక్త స్వయంగా తమ కంటే కూడా ముఖ్యుడు.[1] మరియు అతని భార్యలు వారికి తల్లులు.[2] అల్లాహ్ గ్రంథం ప్రకారం రక్తసంబంధీకులు - ఇతర విశ్వాసుల మరియు వలస వచ్చిన వారి (ముహాజిరీన్) కంటే - ఒకరి కొకరు ఎక్కువగా పరస్పర సంబంధం (హక్కులు) గలవారు. కాని! మీరు మీ స్నేహితులకు మేలు చేయగోరితే (అది వేరే విషయం)![3] వాస్తవానికి ఇదంతా గ్రంథంలో వ్రాయబడి వుంది. ——— [1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'నేను, మీకు మీ తండ్రులకంటే, మీ సంతానం కంటే మరియు సర్వమానవుల కంటే ఎక్కువ ప్రీతిపాత్రుడనయ్యేంత వరకు మీరు నిజమైన విశ్వాసులు కాజాలరు!' (బు'ఖారీ ముస్లిం) - అనస్ (ర'ది.'అ.) కథనం. [2] దైవప్రవక్త ('స'అస) భార్యలు (ర'ది. 'అన్హుమ్ లు) ముస్లింల తల్లుల వంటి వారు. కాబట్టి ఈ ఆయత్ శాసనం ప్రకారం దైవప్రవక్త మరణం తరువాత, వారిని ఎవ్వరూ వివాహమాడరాదు. ఇంకా చూడండి 8:75. అందులో విశ్వాసుల పరస్పర సహోదరత్వం తెలుపబడింది. మరియు ఈ ఆయత్ లో ఒక విశ్వాసునికి, దైవప్రవక్త ('స'అస) మరియు అతని భార్యలు (ర'ది. 'అన్హుమ్ లు), తల్లిదండ్రుల వంటి వారు అని తెలుపబడింది.. [3] చూడండి, 49:10 మరియు 8:75 దగ్గరి బంధువులు తప్ప ఇతరులు వారసులు కాలేరు.

Ahzab 33:7

మరియు (జ్ఞాపకముంచుకో) వాస్తవానికి మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము మరియు నీతో (ఓ ముహమ్మద్), నూహ్ తో, ఇబ్రాహీమ్ తో, మూసాతో మరియు మర్యమ్ కుమారుడైన ఈసాతో కూడా! మరియు మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము.[1] ——— [1] చూడండి, 3:81, 42:13.

Ahzab 33:8

ఇది సత్యవంతులను, వారి సత్యాన్ని గురించి ప్రశ్నించడానికి. మరియు ఆయన సత్యతిరస్కారుల కొరకు బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు.[1] ——— [1] చూడండి, 5:109 మరియు 7:6.

Ahzab 33:9

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పైకి సైన్యాలు (దండెత్తి) వచ్చినపుడు, మేము వారి పైకి ఒక తుఫాను గాలిని మరియు మీకు కనబడని సైన్యాలను పంపాము.[1] మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు. ——— [1] చూఈ సూరహ్ యొక్క 9-27 ఆయతులు కందక యుద్ధం ('గ'జ్వతుల్ అ'హ్జాబ్) గురించి ఉన్నాయి. ఇంకా చూడండి, 3:124-125.

Ahzab 33:10

వారు (మీ శత్రువులు) మీ మీదకు పైనుండి మరియు క్రింది నుండి (దండెత్తి) వచ్చినపుడు[1] మరియు మీ కళ్ళు (భయంతో) తిరిగిపోయి, మీ గుండెలు గొంతులోనికి వచ్చినపుడు, మీరు అల్లాహ్ ను గురించి పలువిధాలుగా ఊహించసాగారు. ——— [1] పై నుండి నజ్ద్, ఉత్తర తూర్పు నుండి వచ్చిన 'గి'త్ఫాన్, హవా'జిన్ మరియు ఇతర తెగల వారు; క్రింది నుండి ఖురైషులు; మరియు పడమర దిక్కునుండి ఇతర ముష్రికులు దాడి చేయటానికి వస్తారు.

Ahzab 33:11

అక్కడ (ఆ సమయంలో) విశ్వాసులు పరీక్షించబడ్డారు. మరియు దానితో వారు తీవ్రంగా కంపింప జేయబడ్డారు.

Ahzab 33:12

మరియు ఆ సమయంలో, కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగమున్న వారు: "అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాతో చేసిన వాగ్దానాలన్నీ బూటకాలు మాత్రమే!" అని అనసాగారు.[1] ——— [1] ఈ విధమైన సందేశం వచ్చిన వారు దాదాపు డెబ్భై మంది మునాఫిఖులు.

Ahzab 33:13

అపుడు వారిలోని ఒక పక్షం వారు: "ఓ యస్ రిబ్[1] (మదీనా మునవ్వరా) ప్రజలారా! ఇక మీరు వీరిని (శత్రువులను) ఎదిరించలేరు. కనుక వెనుదిరగండి!" అని అన్నారు. మరియు వారిలో మరొక వర్గం వారు ప్రవక్తతో ఈ విధంగా పలుకుతూ (వెనుదిరిగి) పోవటానికి అనుమతి అడగసాగారు: "మా ఇండ్లు భద్రంగా లేవు."[2] కాని వాస్తవానికి అవి భద్రంగానే ఉండెను. వారు కేవలం అక్కడి నుండి పారిపోదలచారు. ——— [1] ఆ కాలంలో ఆ ప్రాంతమంతా యస్'రిబ్ అనే పేరుతో పిలువబడేది. ఆ ప్రాంతంలోనే మదీనా మునవ్వరా ఉంది. [2] అంటే ఒడంబడిక త్రెంపిన బనూఖురైజా తెగవారు దక్షిణ దిక్కునుండి దాడి చేస్తారేమోననే భయం.

Ahzab 33:14

ఒకవేళ నగరపు చుట్టుప్రక్కల నుండి శత్రువులు లోపలికి దూరి, వారిని విద్రోహ చర్యలకు పాల్పడమని పిలిస్తే, వారు వెంటనే సమ్మతించే వారు, మరియు వారు దాని కోసం ఏ మాత్రం ఆలస్యం చేసేవారు కాదు.

Ahzab 33:15

వాస్తవానికి వారు ఇంతకు ముందు, తాము వెన్ను చూపి పారిపోమని, అల్లాహ్ తో వాగ్దానం చేసి ఉన్నారు. మరియు అల్లాహ్ తో చేసిన వాగ్దానం గురించి తప్పక ప్రశ్నించటం జరుగుతుంది.

Ahzab 33:16

వారితో ఇలా అను: "ఒకవేళ మీరు మరణం నుండి గానీ, లేదా హత్య నుండి గానీ, పారిపోదలచు కుంటే! ఆ పారిపోవటం మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు. అప్పుడు మీరు కేవలం కొంతకాలం మాత్రమే సుఖసంతోషాలు అనుభవిస్తారు!"

Ahzab 33:17

వారితో ఇంకా ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ మీకు కీడు చేయదలిస్తే! లేదా కరుణించదలిస్తే! ఆయన నుండి మిమ్మల్ని తప్పించే వాడెవడు?" మరియు వారు అల్లాహ్ ను వదలి ఇతరుణ్ణి ఎవడినీ సంరక్షకునిగా గానీ లేక సహాయకునిగా గానీ పొందలేరు.

Ahzab 33:18

వాస్తవానికి మీలో ఎవరు ఇతరులను (యుద్ధం నుండి) ఆటంక పరుస్తూ ఉన్నారో మరియు తమ సోదరులతో: "మా వైపునకు రండి!" అని పలుకుతూ ఉన్నారో, అలాంటి వారందరి గురించి, అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు వారు మాత్రం యుద్ధంలో చాలా తక్కువగా పాల్గొనేవారు;

Ahzab 33:19

(మీకు తోడ్పడే విషయంలో) వారు పరమ లోభులుగా ఉండేవారు. (ఓ ప్రవక్తా!) వారి పైకి ప్రమాదం వచ్చినపుడు వారు (నీ సహాయం కోరుతూ) మరణం ఆసన్నమైన వ్యక్తి కనుగ్రుడ్లు త్రిప్పే విధంగా నీ వైపుకు తిరిగి చూడటాన్ని, నీవు చూస్తావు. కాని ఆ ప్రమాదం తొలగిపోయిన వెంటనే, వారు లాభాలను పొందే ఉద్దేశంతో, కత్తెర వలే ఆడే నాలుకలతో మీతో బడాయీలు చెప్పుకుంటారు. అలాంటి వారు ఏ మాత్రం విశ్వసించలేదు. కావున, అల్లాహ్ వారి కర్మలను నిరర్థకం చేశాడు. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.

Ahzab 33:20

దాడి చేసిన వర్గాలు ఇంకా వెళ్ళి పోలేదు అనే వారు భావిస్తున్నారు. ఒకవేళ ఆ వర్గాలు తిరిగి మళ్ళీ దాడి చేస్తే! ఎడారి వాసులతో (బద్దూలతో)[1] కలిసి నివసించి అక్కడి నుండి మీ వృత్తాంతాలను తెలుసుకుంటే బాగుండేది కదా! అని అనుకుంటారు. ఒకవేళ వారు మీతో పాటు ఉన్నా చాలా తక్కువగా యుద్ధంలో పాల్గొని ఉండేవారు. ——— [1] ఈ పదానికి ఇంకా చూడండి, 9:90, 97, 98, 99, 101, 120, 48:11, 16, 49:14.

Ahzab 33:21

వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో!

Ahzab 33:22

మరియు విశ్వాసులు, దాడి చేసిన వర్గాల వారిని చూసినపుడు ఇలా పలికారు: "అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు సత్యం పలికారు." ఇది వారి విశ్వాసాన్ని మరియు అల్లాహ్ పట్ల వారి విధేయతను మరింత అధికమే చేసింది.

Ahzab 33:23

విశ్వాసులలో అల్లాహ్ కు తాము చేసిన ఒప్పందం నిజం చేసి చూపినవారు కూడా ఉన్నారు. వారిలో కొందరు తమ శపథాన్ని పూర్తి చేసుకున్న వారున్నారు, మరికొందరు దానిని పూర్తి చేసుకోవటానికి నిరీక్షిస్తున్నారు. మరియు వారు తమ వైఖరిని ఏ మాత్రం మార్చుకోలేదు.

Ahzab 33:24

అల్లాహ్, సత్యవంతులకు వారి సత్యానికి ప్రతిఫలం నొసంగటానికి మరియు కపట విశ్వాసులకు తాను కోరితే శిక్ష విధించటానికి లేదా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి ఇలా చేశాడు.[1] నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ——— [1] చూడండి, 6:12.

Ahzab 33:25

మరియు అల్లాహ్ అవిశ్వాసులను వారి క్రోధావేశంతోనే - వారికెలాంటి మేలు లభింప జేయకుండా - వెనుకకు మరలించాడు. యుద్ధరంగంలో విశ్వాసులకు అల్లాహ్ యే (సహాయకునిగా) మిగిలాడు. వాస్తవంగా అల్లాహ్ మహా బలవంతుడు, సర్వశక్తిమంతుడు.

Ahzab 33:26

మరియు గ్రంథ ప్రజలలో నుండి వారికి (అవిశ్వాసులకు యుద్ధంలో) తోడ్పడిన వారిని ఆయన (అల్లాహ్) వారి కోటల నుండి క్రిందికి తీసుకు వచ్చాడు.[1] మరియు వారి హృదయాలలో భీతిని ప్రవేశింపజేశాడు. వారిలో కొందరిని మీరు చంపుతున్నారు, మరికొందరిని ఖైదీలుగా చేసుకుంటున్నారు. ——— [1] అంటే యూదులైన బనూ-ఖురై"జా తెగవారు. వారు మొదట శత్రువులకు సహాయపడమని మదీనా ముస్లింలతో ఒప్పందం చేసుకుంటారు. కాని మదీనా నగరం నుండి వెడలగొట్టబడిన బనూ-న'దీర్ తెగవారి మాటలు విని, తమ ఒడంబడికను త్రెంపి శత్రువులకు సహాయపడటానికి పూనుకుంటారు. అందుకే శత్రువులు పారిపోయింది చూసి వారు తమ కోటలలో దాక్కుంటారు. ముస్లింలు వారిని 25 రోజులు ముట్టడించి ఉంచుతారు. చివరకు వారు - తమ విశ్వాసఘాతానికి - శిక్షకు గురి అవుతారు.

Ahzab 33:27

మరియు ఆయన (అల్లాహ్) వారి భూమికి, వారి ఇండ్లకు మరియు వారి ఆస్తులకు మిమ్మల్ని వారసులుగా చేశాడు.[1] మరియు మీరు ఎన్నడూ అడుగుమోపని భూమికి కూడా, (మిమ్మల్ని వారసులుగా చేశాడు). మరియు వాస్తవంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు. ——— [1] కొందరు వ్యాఖ్యాతలు ఇది 6వ హిజ్రీలో జరిగిన 'ఖైబర్ విజయమని అభిప్రాయపడ్డారు. మరి కొందరు రోమ్ మరియు పర్షియాల విజయాలని! (ఫ'త్హ్ అల్-ఖదీర్).

Ahzab 33:28

ఓ ప్రవక్తా! నీవు నీ భార్యలతో ఇలా అను: "ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్ని మరియు దాని శోభను కోరుతున్నట్లైతే, రండి నేను మీకు తప్పక జీవన సామాగ్రినిచ్చి, మిమ్మల్ని మంచి పద్ధతిలో విడిచి పెడతాను."[1] ——— [1] ఈ విజయాల వల్ల ముస్లింలకు ధన సంపత్తులు దొరకడం వల్ల, వారు మొదటి కంటే ఎంతో అధికంగా సుఖవంతమైన జీవితం గడుపసాగారు. ఇది చూసి దైవప్రవక్త భార్యలు (ర'ది.'అన్హుమ్) కూడా ఆ సంపదలను తమ కొరకు కోరారు. దానికి జవాబుగా ఈ ఆయత్ అవతరింపజేయబడింది. దీనితో అర్థమయ్యేదేమిటంటే, ఎన్నో సంపత్తులు ముస్లింలకు దొరికినా, దైవప్రవక్త ('స'అస) తన స్వంత వినియోగం కొరకు మొదటి వలెనే అతి తక్కువ జీవనోపాధిని ఉంచుకునే వారు. అంతా ముస్లింలకు పంచేవారు. దీని తరువాత ఉమ్మహాతుల్ మోమినీన్ (ర'ది.'అన్హుమ్) లు తమ పట్టు వదలుకున్నారు. ఆ కాలంలో దైవప్రవక్త ('స'అస) వివాహబంధంలో తొమ్మిది మంది భార్య (ర'ది.'అన్హుమ్) లు ఉన్నారు. ఐదుగురు ఖురైషులు 'ఆయిషహ్, 'హ'ఫ్సా, ఉమ్ము - 'హబీబా, 'సౌదా, మరియు ఉమ్ము సల్మా (ర'ది.'అన్హుమ్) మరియు నలుగురు ఇతరులు: 'సఫియ్యా, మైమూనా, 'జైనబ్ మరియు జువేరియా (ర'ది.'అన్హుమ్).

Ahzab 33:29

"కాని ఒకవేళ మీరు అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి మరియు పరలోక గృహాన్ని కోరుతున్నట్లైతే, నిశ్చయంగా, అల్లాహ్ మలో సజ్జనులైన వారికి గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు."

Ahzab 33:30

ఓ ప్రవక్త స్త్రీలారా! మీలో ఎవరైనా స్పష్టంగా అనుచితమైన పనికి పాల్పడితే ఆమెకు రెట్టింపు శిక్ష విధించబడుతుంది.[1] మరియు వాస్తవంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం. ——— [1] అల్ ఫా'హిషహ్ అంటే ఖుర్ఆన్ లో 'జినా' అంటే వ్యభిచారం, అనే అర్థంలో వాడబడింది. అల్ - లేకుండా ఫా'హిషహ్ అని ఉంటే - ఇక్కడ ఉన్నట్లు - సభ్యతలేని పని, లేక అనుచితమైన పని అనే అర్థంలో వాడబడింది. పెద్దవారు చేసే చిన్నతప్పు కూడా పెద్దదే. కాబట్టి వారికి రెండింతలు శిక్ష దని బోధింపబడింది.

Ahzab 33:31

మరియు మీలో ఏ స్త్రీ అయితే అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి విధేయురాలై ఉండి సత్కార్యాలు చేస్తుందో, ఆమెకు రెట్టింపు ప్రతిఫలమిస్తాము మరియు ఆమె కొరకు గౌరవప్రదమైన జీవనోపాధిని సిద్ధపరచి ఉంచాము.[1] ——— [1] చూడండి, 8:4.

Ahzab 33:32

ఓ ప్రవక్త భార్యలారా! మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. మీరు దైవభీతి గలవారైతే మీరు మెత్తని స్వరంతో మాట్లాడకండి. ఎందుకంటే! దానితో తన హృదయంలో రోగమున్న వానికి దుర్భుద్ధి పుట్టవచ్చు. కావున మీరు స్పష్టంగా, సూటిగానే మాట్లాడండి.

Ahzab 33:33

మరియు మీరు మీ ఇండ్లలోనే ఉండిండి మరియు పూర్వపు అజ్ఞానకాలంలో అలంకరణను ప్రదర్శిస్తూ తిరిగినట్లు తిరగకండి.[1] మరియు నమాజ్ స్థాపించండి మరియు విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు అల్లాహ్ కు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి. (ఓ ప్రవక్త) గృహిణులారా![2] నిశ్చయంగా, అల్లాహ్ మీ నుండి మాలిన్యాన్ని తొలగించి, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగోరు తున్నాడు. ——— [1] చూడండి, 5:50. [2] అహ్లల్ - బైత్, శబ్దానికి ఈ విధంగా అర్థాలు ఇవ్వబడ్డాయి. ఈ ఆయత్ లో ఖుర్ఆన్, దైవప్రవక్త ('స'అస) సతీమణు (ర'ది.'అన్హుమ్)లనే సంబోధిస్తోంది. ఖుర్ఆన్ లో ఇతర చోట్లలో కూడా భార్యలను అహ్లల్-బైత్ అని, సంబోధించబడింది. ఉదాహరణకు 11:73. కొందరు 'అలీ, ఫాతిమా, 'హసన్ మరియు 'హుసైన్ (ర'ది.'అన్హుమ్)లను మాత్రమే అహ్లల్-బైత్ గా భావిస్తున్నారు. వాస్తవమేమిటంటే, దైవప్రవక్త సతీమణులూ (ర'ది.'అన్హుమ్), దైవప్రవక్త ('స'అస) సంతానం (ర'ది'అన్హుమ్) మరియు ఈ నలుగురూ (ర'ది'అన్హుమ్), అందరూ అహ్లల్-బైత్ వారే! (ఫ'త్హ్ అల్-ఖదీర్, షౌకానీ)

Ahzab 33:34

మరియు మీ ఇండ్లలో వినిపించబడే అల్లాహ్ ఆయతులను మరియు జ్ఞాన విషయాలను (హదీస్ లను) స్మరిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ అత్యంత సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసిన వాడు.[1] ——— [1] చూడండి, 6:103.

Ahzab 33:35

నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము'మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము'మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు[1] ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్గాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు;[2] మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు. ——— [1] 'సౌమున్: కేవలం ఆహార పానీయాలే గాక ఇతర చెడు విషయాల నుండి కూడా దూరంగా ఉండటం. ఇంకా చూడండి, 19:26 అక్కడ ఈ శబ్దం మాట్లాడకుండా ఉండటాన్ని సూచిస్తుంది. [2] చూడండి, 24:30.

Ahzab 33:36

మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు, ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, విశ్వసించిన పురుషునికి గానీ లేక విశ్వసించిన స్త్రీకి గానీ ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు లేదు.[1] మరియు ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి అవిధేయుడవుతాడో, వాస్తవంగా, అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే! ——— [1] ఈ ఆయత్ దైవప్రవక్త ('స'అస) మరియు 'జైనబ్ (ర.'అన్హా)ల వివాహం గురించి అవతరింపజేయబడింది.

Ahzab 33:37

మరియు (ఓ ప్రవక్తా జ్ఞాపకం చేసుకో!) అల్లాహ్ అనుగ్రహించిన మరియు నీవు అనుగ్రహించిన వ్యక్తితో నీవు:[1] "నీ భార్యను ఉండనివ్వు (విడిచి పెట్టకు) మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు." అని అన్నప్పుడు; నీవు అల్లాహ్ బయట పెట్టదలచిన విషయాన్ని, నీ మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడ్డావు, వాస్తవానికి నీవు అల్లాహ్ కు భయపడటమే చాలా ఉత్తమమైనది. జైద్, ఆమెతో తన సంబంధాన్ని తన ఇచ్ఛానుసారంగా త్రెంపుకున్న తరువాతనే, మేము ఆమె వివాహం నీతో జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యలతో పెండ్లి చేసుకోవటంలో - వారు తమ భార్యల నుండి తమ ఇష్టానుసారంగా తమ సంబంధం త్రెంపు కున్నప్పుడు - ఏ విధమైన దోషం లేదు. వాస్తవానికి అల్లాహ్ ఆదేశం తప్పక అమలులోకి రావలసిందే! ——— [1] ముహమ్మద్ ('స'అస) ప్రవక్తగా ఎన్నుకోబడక ముందు 'ఖదీజహ్ (ర.'అన్హా) అతనికి ('స'అస) ఒక బానిసను కానుకగా ఇస్తారు. అతని పేరు 'జైద్ బిన్-'హారిసా. అతడు ఉత్తర అరేబియాకు చెందిన బనూ-కల్బ్ తెగకు చెందిన 'అరబ్బ్. అతడు (ర'ది.'అ.) చిన్నతనంలోనే తెగల మధ్య జరిగే యుద్ధాలలో బందీ అయ్యి అమ్మి వేయబడతారు. అతనిని (ర'ది.'అ.) 'ఖదీజహ్ (ర.'అన్హా) కొని, తరువాత దైవప్రవక్త ('స'అస) కు ఇస్తారు. దైవప్రవక్త ('స'అస) అతనికి స్వేచ్ఛనిస్తారు. ఆ తరువాత అతనిని తమ దత్తకుమారునిగా చేసుకుంటారు. దైవప్రవక్త ('స'అస) పై వ'హీ అవతరించిన తరువాత మొట్టమొదట ఇస్లాం స్వీకరించిన వారిలో ఇతను (ర'ది.'అ.) కూడా ఒకరు. అతని ('ర'ది.'అ.) వివాహం దైవప్రవక్త ('స'అస) తన మేనత్త కుమార్తె 'జైనబ్ బింతె-జ'హష్ (ర.'అన్హా) తో చేయిస్తారు. కాని మొదటి నుండియే ఆమె (ర.'అన్హా)కు ఈ వివాహం నచ్చదు. వారి మధ్య మొదటి రోజు నుండియే కలహాలు ప్రారంభమవుతాయి. 'జైద్ (ర'ది.'అ.) కూడా తన మొదటి భార్య - స్వేచ్ఛ ఇవ్వబడిన బానిస - ఉమ్ముఆయ్ మన్ (ర. 'అన్హా), అతని కుమారుడు ఉసామహ్ (ర'ది.'అ.) యొక్క తల్లితో సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. 'జైద్ బిన్ 'హారిస'హ్ మరియు 'జైనబ్ బింతె-జ'హష్ (ర'ది. 'అన్హుమ్)ల మధ్య ఎల్లప్పుడూ కలహాలు జరుగుతూ ఉంటాయి. దానితో 'జైద్ (ర'.ది.'అ.) 5వ హిజ్రీలో 'జైనబ్ బింతె-జ'హష్ (ర.'అన్హా)కు విడాకులు ఇస్తారు. తరువాత దైవప్రవక్త ('స'అస) అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ ప్రకారం ఆమె (ర.'అన్హా)తో వివాహం చేసుకుంటారు. దత్తపుత్రుడు ఏ మాత్రం స్వంతపుత్రుడు కాజాలడు. కావున అతడు విడిచిన స్త్రీతో వివాహం చేసుకోవచ్చు అనే విషయం కూడా దీనితో స్పష్టమవుతుంది.

Ahzab 33:38

అల్లాహ్ తన కొరకు ధర్మసమ్మతం చేసిన దానిని ప్రవక్త పూర్తి చేస్తే, అతనిపై ఎలాంటి నింద లేదు. ఇంతకు పూర్వం గతించిన వారి విషయంలో కూడా అల్లాహ్ సంప్రదాయం ఇదే. మరియు అల్లాహ్ ఆజ్ఞ, నిర్దేశింపబడిన (తిరుగులేని) శాసనం;

Ahzab 33:39

వారికి, ఎవరైతే అల్లాహ్ సందేశాలను అందజేస్తారో మరియు కేవలం ఆయనకే భయపడతారో మరియు అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడరో! మరియు లెక్క తీసుకోవటానికి కేవలం అల్లాహ్ యే చాలు!

Ahzab 33:40

(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు.[1] కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు.[2] మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు. ——— [1] అంటే అతను ('స'అస), 'జైద్ బిన్-'హారిసా (ర'ది.'అ.) యొక్క తండ్రి కారు. మరియు ఏ ఇతర పురుషుని తండ్రి కూడా కారు. ప్రతివాడు తన నిజతండ్రి పేరుతోనే పిలువబడాలి. దైవప్రవక్త ('స'అస) కు 'ఖదీజహ్ (ర.'అన్హా) నుండి ముగ్గురు కుమారులు: ఖాసిమ్, 'తయ్యబ్ మరియు 'తాహిర్. మారియా ఖబ్తియా (ర.'అన్హా) నుండి ఇబ్రాహీం. వారంతా బాల్యావస్థలోనే మరణించారు, (ఇబ్నె-కసీ'ర్, ము'హమ్మద్ జూనాగఢి). కొందరు వ్యాఖ్యాతలు 'ఖదీజహ్ (ర.'అన్హా)కు ఇద్దరు కుమారులే అని అంటారు: ఖాసిమ్ మరియు అబ్దుల్లాహ్. 'తయ్యబ్, 'తాహిహ్ అనేవి అబ్దుల్లాహ్ యొక్క మారు పేర్లు అని వారంటారు. [2] 'ఖాతమున్: అంటే ముద్ర. ముద్రవేయటం చివరిపని, కావున దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) తరువాత ఇక ఏ ప్రవక్త కూడా రాడు. కాబట్టి అతను ప్రవక్తల ముద్ర (చివరివాడు), అని సంబోధించబడ్డారు. కావున అతన తరువాత తనను తాను ప్రవక్తగా పరిగణించేవాడు, అసత్యుడూ, దజ్జాల్ మాత్రమే! చివరికాలంలో దైవప్రవక్త 'ఈసా ('అ.స.) తిరిగి వస్తారు. కానీ అతను ప్రవక్తగా గాక ము'హమ్మద్ ('స'అస) యొక్క ఉమ్మతి (అనుచరునిగా) వస్తారు. ఇదంతా స'హీ 'హదీసులలో ఉంది. చాలా మంది ధర్మవేత్తల అభిప్రాయం ఇదే! అతను ('స'అస) చివరి ప్రవక్త కాబట్టి సమస్తలోకాలకు ప్రవక్తగా పంపబడ్డారు. చూడండి, 21:107.

Ahzab 33:41

ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను (ఏకాగ్రతతో) అత్యధికంగా స్మరించండి.

Ahzab 33:42

మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి.

Ahzab 33:43

ఆయన మీపై ఆశీర్వాదాలు (సలాత్) పంపుతూ ఉంటాడు మరియు ఆయన దూతలు మిమ్మల్ని అంధకారం నుండి వెలుగులోకి తీసుకు రావటానికి (ఆయనను ప్రార్థిస్తూ ఉంటారు). మరియు ఆయన విశ్వాసుల పట్ల అపార కరుణా ప్రదాత.

Ahzab 33:44

వారు ఆయనను కలుసుకునే రోజున వారికి: "మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అనే అభినందనలతో స్వాగతం లభిస్తుంది.[1] మరియు ఆయన వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం సిద్ధపరచి ఉంచాడు. ——— [1] స్వర్గవాసులు లేక దైవదూతలు దానిలోకి వచ్చేవారికి ఈ విధంగా స్వాగతం చేస్తారు.

Ahzab 33:45

ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేము, నిన్ను సాక్షిగా, శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము!

Ahzab 33:46

మరియు ఆయన అనుమతితో, అల్లాహ్ వైపునకు పిలిచేవానిగా మరియు ప్రకాశించే దీపంగానూ (చేసి పంపాము)!

Ahzab 33:47

మరియు నిశ్చయంగా, వారి మీద అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం ఉందనే శుభవార్తను విశ్వాసులకు ఇవ్వు.

Ahzab 33:48

మరియు నీవు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల మాటలకు లోబడకు మరియు వారి వేధింపులను లక్ష్య పెట్టకు మరియు కేవలం అల్లాహ్ నే నమ్ముకో మరియు కార్యకర్తగా కేవలం అల్లాహ్ యే చాలు!

Ahzab 33:49

ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహమాడి, తరువాత - మీరు వారిని తాకక పూర్వమే - వారికి విడాకులిచ్చినట్లైతే, మీ కొరకు వేచి వుండే వ్యవధి (ఇద్దత్) పూర్తి చేయమని అడిగే హక్కు మీకు వారిపై లేదు.[1] కనుక వారికి పారితోషికం ఇచ్చి, మంచితనంతో వారిని సాగనంపండి.[2] ——— [1] వివాహం తరువాత స్త్రీతో సంభోగించి ఉంటే ఆమె వేచిఉండే గడువు ('ఇద్దత్) మూడు రుతుస్రావాలు. చూడండి, 2:228. కాని వివాహం తరువాత సంభోగించక ముందే విడాకులిస్తే ఆమె వేచిఉండక వెంటనే, మరొకనితో వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ సంభోగం జరుగకముందే భర్త చనిపోతే 'ఇద్దత్ నాలుగు నెలల మీద పది రోజులు, (ఫ'త్హ్ అల్-ఖదీర్, ఇబ్నె-కసీ'ర్). నికా'హ్ జరిగిన తరువాతనే 'తలాఖ్, ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. నికా'హ్ యే కాకుంటే 'తలాఖ్ ఇవ్వవలసిన అవసరం ఎక్కడ ఉంటుంది! "లా'తలాఖ ఖబ్ ల నికా'హ్." (ఇబ్నె-మాజా): "లా 'తలాఖ లి ఇబ్ని ఆదమ్ ఫీమా లా యమ్ లికు." (అబూ-దావూద్, తిర్మిజీ' మరియు అ'హ్మద్ - 2/189) అంటే పెండ్లి (నికా'హ్) కానిదే 'తలాఖ్ విషయమే రాదు. [2] అంటే వారి మహ్ర్ నిర్ణయించబడి ఉంటే సగం ఇవ్వండి. లేకపోతే మీకు తోటినది ఇచ్చి మంచివిధంగా సాగనంపండి.

Ahzab 33:50

ఓ ప్రవక్తా! నిశ్చయంగా, మేము నీకు: నీవు మహ్ర్ చెల్లించిన నీ భార్యలను[1] మరియు అల్లాహ్ ప్రసాదించిన (బానిస) స్త్రీల నుండి నీ ఆధీనంలోకి వచ్చిన వారిని (స్త్రీలను)[2] మరియు నీతో పాటు వలస వచ్చిన నీ పినతండ్రి (తండ్రి సోదరుల) కుమార్తెలను మరియు నీ మేనత్తల (తండ్రి సోదరీమణుల) కుమార్తెలను మరియు నీ మేనమామల (తల్లిసోదరుల) కుమార్తెలను మరియు నీ పినతల్లుల (తల్లిసోదరీమణుల) కుమార్తెలను; మరియు తనను తాను ప్రవక్తకు సమర్పించుకున్న విశ్వాసిని అయిన స్త్రీని - ఒకవేళ ప్రవక్త ఆమెను వివాహం చేసుకోదలిస్తే ఇతర విశ్వాసుల కొరకు గాక ప్రత్యేకంగా నీ కొరకే - ధర్మసమ్మతం చేశాము. వాస్తవానికి వారి (ఇతర విశ్వాసుల) కొరకు, వారి భార్యల విషయంలో మరియు వారి బానిసల విషయంలో, మేము విధించిన పరిమితులు మాకు బాగా తెలుసు.[3] ఇదంతా మేము నీకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండాలని చేశాము. వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ——— [1] దైవప్రవక్త ('స'అస) కు కొన్ని ప్రత్యేకతలు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు అతని ('స'అస) పై తహజ్జుద్ నమా'జ్ విధిగా చేయబడింది. మరియు సదఖహ్ (దానం) అతని ('స'అస)పై హరాం చేయబడింది. ఇక్కడ ఎవరికైతే అతను ('స'అస) మహ్ర్ చెల్లించారో వారు అతనికి 'హలాల్ గావించబడ్డారు. వారికి మహ్ర్ ఇంత అని నియమించబడలేదు. ఉదాహరణకు: 'సఫియా మరియు జువేరియా (ర'ది. 'అన్హుమ్)ల మహ్ర్. ఇతరులందరికీ దైవప్రవక్త ('స'అస) మహ్ర్ నగదు చెల్లించారు. కేవలం ఉమ్మె 'హబీబా (ర.'అన్హా) మహ్ర్ నజ్జాషీ (ర'ది.'అ.) చెల్లించారు. [2] జువేరియా మరియు చివరి భార్య 'సఫియా (ర'ది.'అన్హుమ్)లను ఇద్దరిని అతను ('స'అస) వారి స్వేచ్ఛనే మహ్ర్ గా ప్రసాదించి వివాహమాడారు. రె'హానా మరియు మారియా ఖిబ్తియా (ర'ది.'అన్హుమ్)లు బానిసలుగానే ఉన్నారు. (ము'హమ్మద్ జూనాగఢి). [3] ఇతర విశ్వాసులు ఒకేసారి నలుగురి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండరాదు. మరియు వారి నికా'హ్ కొరకు వలీ, సాక్షులు మరియు మహ్ర్ తప్పనిసరిగా ఉండాలి. ఈనాడు బానిసలు లేరు. ఎందుకంటే బానిసలు జిహాద్ లో పట్టుబడిన వారు మాత్రమే. డబ్బిచ్చి బానిసను కొనడం ఇస్లాంలో 'హరామ్. చూడండి, 2:221, 4:3-4 మరియు 19:25.

Ahzab 33:51

నీవు వారిలో (నీ భార్యలలో) నుండి, నీవు కోరిన ఆమెను నీ నుండి కొంత కాలం వేరుగా ఉంచవచ్చు. మరియు నీవు కోరిన ఆమెను నీతోపాటు ఉంచవచ్చు. మరియు నీవు వేరుగా ఉంచిన వారిలో నుండి ఏ స్త్రీనైనా నీవు తిరిగి పిలుచుకోగోరితే, నీపై ఎలాంటి దోషం లేదు. దీనితో వారి కళ్లకు చల్లదనం కలుగుతుందని, వారు దుఃఖపడరనీ నీవు వారికి ఏమి ఇచ్చినా, వారు సంతోషపడతారని ఆశించవచ్చు! వాస్తవానికి మీ హృదయాలలో ఏముందో అల్లాహ్ కు తెలుసు.[1] మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, శాంత స్వభావుడు (సహన శీలుడు). ——— [1] 'అయి'షహ్ (ర.'అన్హా) కథనం - దైవప్రవక్త ('స'అస) ఇలా ప్రార్థించేవారు: "ఓ అల్లాహ్! నేను నా మేరకు నా భార్యల మధ్య న్యాయంగా వ్యవహరిస్తున్నాను. ఇక నా వశంలో లేని దాని కొరకు నన్ను బాధ్యునిగా చేయకు! అది కేవలం నీ చేతిలో ఉంది." అంటే హృదయంలో ఉన్న ప్రేమ, అది ఒక భార్యకంటే మరొక భార్య కొరకు అధికంగా ఉండవచ్చు! (ఇబ్నె-'హంబల్).

Ahzab 33:52

వీరు గాక, ఇతర స్త్రీలు నీకు (వివాహమాడటానికి) ధర్మసమ్మతం కారు.[1] వీరికి బదులుగా కూడా మరెవ్వరినీ భార్యలుగా తీసుకునే అనుమతి కూడా నీకు లేదు - వారి సౌందర్యం నీకు ఎంత నచ్చినా - నీ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలు తప్ప![2] వాస్తవానికి అల్లాహ్ ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు. ——— [1] అప్పుడు దైవప్రవక్త ('స'అస) కు తొమ్మిది మంది సతీమణులు (ర'ది.'అన్హుమ్) ఉండేవారు. ఐదుమంది ఖురైషులు 'ఆయిషహ్, 'హఫ్సా, ఉమ్ము-'హబీబా, 'సౌదా, మరియు ఉమ్ము-సల్మా. నలుగురు ఇతరులు: 'సఫియ్యా, మైమూనా, 'జైనబ్ మరియు జువేరియా. అతను ('స'అస) ఆ తరువాత ఎవ్వరితోనూ వివాహమాడలేదు. [2] బానిస స్త్రీల విషయంలో సంఖ్యాపరిమితి లేదు. వారిని గురించి 4:3, 23:6 మరియు 70:30.

Ahzab 33:53

ఓ విశ్వాసులారా! ప్రవక్త యొక్క ఇండ్లలోకి అనుమతి లేకుండా ప్రవేశించకండి. భోజనార్థం (పిలువబడినపుడు) ఆహారం సిద్ధపరిచే సమయం కొరకు వేచి ఉండకండి, కాని మీరు పిలువబడి నప్పుడు తప్పకుండా వెళ్ళండి. అయితే భోజనం చేసిన వెంటనే వెళ్ళిపొండి మరియు సాధారణ సంభాషణలో కాలక్షేపం చేస్తూ కూర్చోకండి. నిశ్చయంగా, దీని వలన ప్రవక్తకు కష్టం కలుగుతుంది; కాని అతను మిమ్మల్ని (పొమ్మనటానికి) సంకోచిస్తాడు. మరియు అల్లాహ్ సత్యం చెప్పటానికి సంకోచించడు (సిగ్గు పడడు).[1] మరియు మీరు ప్రవక్త భార్యలతో ఏదైనా అడగ వలసి వచ్చినప్పుడు తెరచాటు నుండి అడగండి. ఇది మీ హృదయాలను మరియు వారి హృదయాలను కూడా నిర్మలంగా ఉంచుతుంది. మరియు అల్లాహ్ సందేశహరునికి కష్టం కలిగించటం మీకు తగదు. మరియు అతని తరువాత అతని భార్యలతో మీరు ఎన్నటికీ వివాహం చేసుకోకండి. నిశ్చయంగా ఇది అల్లాహ్ దృష్టిలో మహా అపరాధం. ——— [1] దైవప్రవక్త ('స'అస) 'జైనబ్ (ర.'అన్హా) తో వివాహమాడి ఇచ్చిన వలీమా భోజనం సందర్భంలో ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ఆ రోజు కొందరు 'స'హాబీలు భోజనం తరువాత కూర్చొని కాలక్షేపం చేయసాగారు. ('స.బు'ఖారీ).

Ahzab 33:54

ఒకవేళ మీరు ఏ విషయాన్నైనా వెలిబుచ్చినా లేదా దానిని దాచినా! నిశ్చయంగా, అల్లాహ్ కు మాత్రం ప్రతి విషయం గురించి బాగా తెలుసు.

Ahzab 33:55

వారిపై (ప్రవక్త భార్యలపై) - తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల, తమ సోదరీమణుల కుమారుల, తమ స్త్రీల లేదా తమ బానిస (స్త్రీల) - యెదుట వస్తే ఎలాంటి దోషం లేదు.[1] (ఓ స్త్రీలారా!) మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానికి సాక్షి; ——— [1] చూడండి, 24:31 అక్కడ కూడా ఈ శాసనం ఉంది.

Ahzab 33:56

నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దరూద్ లు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ లు మరియు మీ హృదయ పూర్వక సలాంలు పంపుతూ ఉండండి.[1] ——— [1] అల్లాహ్ (సు.తా.) దైవదూతల ('అలైహిమ్. స.) ముందు దైవప్రవక్త ('స'అస) ను ప్రశంసిస్తాడు. మరియు అతనిపై తన కారుణ్యాలను అవతరింపజేస్తాడు. మరియు దైవదూత ('అలైహిమ్.స.) లు అతని ('స'అస) ఔన్నత్యాలకు ప్రార్థనలు చేస్తారు. సహాబీ (ర'ది.'అన్హుమ్)లు దైవప్రవక్తతో మేము ఏ విధంగా మీపై దురూద్ పంపాలి అని ప్రశ్నించగా, అతను ('స'అస) నమాజ్ లో చదివే దురూద్ ఇబ్రాహీమ్ వివరించారు, ('స.బు'ఖారీ).

Ahzab 33:57

నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి బాధ కలిగిస్తారో, వారిని అల్లాహ్ ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా శపిస్తాడు (బహిష్కరిస్తాడు) మరియు ఆయన వారికై అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.[1] ——— [1] అల్లాహ్ (సు.తా.) ను ఎవ్వరూ బాధించలేరు. ఇక్కడ దీని అర్థం అల్లాహ్ (సు.తా.) కు ఇష్టం లేని పని చేయడం. ఉదా: అల్లాహ్ (సు.తా.)కు సంతానం అంటగట్టడం. అల్లాహ్ (సు.తా.) యొక్క సందేశహరునికి బాధ కలిగించడం అంటే, అతని ('స'అస) పై అసత్యవాదుడు, కవి, మాంత్రికుడు అని అపనిందలు మోపడం. ల'అనతున్: అంటే అల్లాహ్ (సు.తా.) అనుగ్రహాల నుండి బహిష్కరించ, శపించ, నిషేధించ, త్రోసివేయ, దూషించ బడటం అనే అర్థాలున్నాయి. చూడండి, 2:88.

Ahzab 33:58

మరియు ఎవరైతే, ఏ తప్పూ చేయని, విశ్వాసులైన పురుషులకు మరియు స్త్రీలకు బాధ కలిగిస్తారో, వాస్తవానికి వారు అపనిందను మరియు స్పష్టమైన పాపభారాన్ని తమ మీద మోపుకున్నట్లే!

Ahzab 33:59

ఓ ప్రవక్తా! నీ భార్యలతో, నీ కుమార్తెలతో మరియు విశ్వాసినులైన స్త్రీలతోనూ తమ దుప్పట్లను తమ మీద పూర్తిగా కప్పుకోమని చెప్పు. ఇది వారు గుర్తించబడి బాధింపబడ కుండా ఉండటానికి ఎంతో సముచితమైనది.[1] మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ——— [1] చూడండి, 24:31. శరీరాన్ని పూర్తిగా కప్పుకొని, నెత్తిపై ఉన్న దుప్పటిని ముఖం మీదికి లాగుకొని కప్పుకోమని ఆజ్ఞ ఇవ్వబడింది.

Ahzab 33:60

ఒకవేళ ఈ కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగం (కలుషితం) ఉన్న వారు మరియు మదీనాలో వదంతులు వ్యాపింప జేసేవారు. తమ (దుశ్చేష్టలను) మానుకోక పోతే, మేము తప్పక నీకు వారిపై ఆధిక్యత నొసంగుతాము. ఆ తరువాత వారు ఈ నగరంలో నీ పొరుగు వారిగా కొన్నాళ్ళ కంటే ఎక్కువ ఉండలేరు.

Ahzab 33:61

వారు శపించబడ్డ (బహిష్కరించబడ్డ) వారు. వారు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకోబడతారు మరియు వారు దారుణంగా చంపబడతారు.[1] ——— [1] చూడండి, 2:191.

Ahzab 33:62

ఇది ఇంతకు పూర్వం గడిచిన వారి విషయంలో జరుగుతున్న అల్లాహ్ సంప్రదాయమే! మరియు అల్లాహ్ సంప్రదాయంలో నీవు ఎలాంటి మార్పును చూడవు.[1] ——— [1] చూడండి, 35:42-44.

Ahzab 33:63

ప్రజలు నిన్ను అంతిమ ఘడియ (పునరుత్థానం) ను గురించి అడుగు తున్నారు. వారితో ఇలా అను: "దాని జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది." మరియు నీకెలా తెలియదు? బహుశా ఆ ఘడియ సమీపంలోనే ఉండవచ్చు![1] ——— [1] చూడండి, 7:187.

Ahzab 33:64

నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులను శపించాడు (బహిష్కరించాడు) మరియు ఆయన వారి కొరకు మండే (నరక) అగ్నిని సిద్ధపరచి ఉంచాడు.

Ahzab 33:65

వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. వారు ఎలాంటి సంరక్షకుణ్ణి గానీ సహాయకుణ్ణి గానీ పొందలేరు.

Ahzab 33:66

వారి ముఖాలు నిప్పులపై బొర్లింప బడిన నాడు; వారు: "అయ్యే! మేము అల్లాహ్ కు విధేయులమై ఉండి, సందేశహరుణ్ణి అనుసరించి ఉంటే ఎంత బాగుండేది?" అని వాపోతారు.

Ahzab 33:67

వారు ఇంకా ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము మా నాయకులను మరియు మా పెద్దలను అనుసరించాము. కాని, వారే మమ్మల్ని (ఋజు) మార్గం నుండి తప్పించారు."

Ahzab 33:68

"ఓ మా ప్రభూ! వారికి రెట్టింపు శిక్ష విధించు మరియు వారిని పూర్తిగా శపించు (బహిష్కరించు)!"

Ahzab 33:69

ఓ విశ్వాసులారా! మీరు మూసాను బాధించిన వారి వలే అయి పోకండి.[1] తరువాత అల్లాహ్ వారు (కల్పించిన) ఆరోపణ నుండి అతనికి విముక్తి కలిగించాడు. అతను (మూసా), అల్లాహ్ దృష్టిలో ఎంతో ఆదరణీయుడు. ——— [1] మూసా ('అ.స.) ను బాధించిన వివరాలకు చూడండి, 2:55, 5:24.

Ahzab 33:70

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే పలకండి.

Ahzab 33:71

ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహ్ కు విధేయుడై సందేశహరుని ఆజ్ఞను పాలిస్తాడో! నిశ్చయంగా, అతడే గొప్ప విజయం పొందినవాడు!

Ahzab 33:72

నిశ్చయంగా, మేము బాధ్యతను[1] ఆకాశాలకు, భూమికి మరియు పర్వతాలకు సమర్పించగోరాము, కాని అవి దానిని భరించటానికి సమ్మతించలేదు మరియు దానికి భయపడ్డాయి, కాని మానవుడు దానిని తన మీద మోపుకున్నాడు. నిశ్చయంగా అతడు దుర్మార్గుడు, మూఢుడు కూడాను. ——— [1] బాధ్యత అంటే, అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ పాఠించడం వల్ల కలిగే పుణ్యఫలాలు మరియు తిరస్కరించడం వల్ల కలిగే కష్టనష్టాలు. శిక్షలకు భయపడి, ఆకాశాలూ, భూమీ మరియు పర్వతాలు, దానిని భరించటానికి సమ్మతించలేదు. కాని మానవుడు తన మూఢత్వం వల్ల ఈ బాధ్యతను తన మీద మోపుకున్నాడు. బాధ్యత అంటే ఖుర్ఆన్ కూడా కావచ్చు!

Ahzab 33:73

(దాని ఫలితంగా!) అల్లాహ్ కపట విశ్వాసులయిన పురుషులను మరియు కపట విశ్వాసులయిన స్త్రీలను మరియు అల్లాహ్ కు సాటి కల్పించే పురుషులను మరియు సాటి కల్పించే స్త్రీలను శిక్షిస్తాడు; మరియు విశ్వాసులైన పురుషుల మరియు విశ్వాసులైన స్త్రీల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

Sebe' 34:1

సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు పరలోకంలో కూడా సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే![1] మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు.[2] ——— [1] ఈ స్తోత్రాలు పునరుత్థాన దినమున విశ్వాసులు చేస్తారు. చూడండి, 39:74, 7:43, 35:34. [2] చూడండి, 6:18.

Sebe' 34:2

భూమిలోకి ప్రవేశించేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి పైకి ఎక్కిపోయేది, అంతా ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన అపార కరుణా ప్రదాత, క్షమాశీలుడు.

Sebe' 34:3

మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: "అంతిమ ఘడియ (పునరుత్థానం) మాపై ఎన్నడూ రాదు!" వారితో ఇలా అను: "ఎందుకు రాదు! అగోచర విషయ జ్ఞానం గల నా ప్రభువు సాక్షిగా! అది తప్పక మీ మీదకు వస్తుంది." ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న రవ్వతో (పరమాణువుతో) సమానమైన వస్తువుగానీ, లేదా దాని కంటే చిన్నది గానీ లేదా దాని కంటే పెద్దది గానీ, ఒక స్పష్టమైన గ్రంథంలో (వ్రాయబడకుండా) ఆయనకు మరుగుగా లేదు.

Sebe' 34:4

అది (అంతిమ ఘడియ), విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ప్రతిఫలము నివ్వటానికి వస్తుంది. అలాంటి వారికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి (స్వర్గం) ఉంటాయి.[1] ——— [1] చూడండి, 8:4.

Sebe' 34:5

మరియు ఎవరైతే మా సూచనలను (ఆయాత్ లను) విఫలం చేయటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారికి అధమమైన, బాధాకరమైన శిక్ష ఉంటుంది.

Sebe' 34:6

మరియు ఎవరికైతే జ్ఞానం ఇవ్వబడిందో! వారు,[1] ఇది నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన సత్యమనీ మరియు అది సర్వశక్తిమంతుడు ప్రశంసనీయుడు (అయిన అల్లాహ్) మార్గం వైపునకే మార్గదర్శకత్వం చేస్తుందనీ గ్రహిస్తారు. ——— [1] జ్ఞానమివ్వబడిన వారు అంటే 'స'హాబా (ర'ది.'అన్హుమ్) లు, విశ్వాసులు మరియు గ్రంథజ్ఞానం గలవారు, అందరూ కావచ్చు!

Sebe' 34:7

మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: "మీరు (చచ్చి) దుమ్ముగా మారి, చెల్లాచెదురైన తరువాత కూడా! నిశ్చయంగా, మళ్ళీ క్రొత్తగా సృష్టింపబడతారని తెలియజేసే వ్యక్తిని[1] మీకు చూపమంటారా?" ——— [1] ఇది సత్యతిరస్కారులు దైవప్రవక్త ('స'అస) గురించి పలుకుతున్నారు.

Sebe' 34:8

"అతను అల్లాహ్ పై అబద్ధం కల్పించాడో లేక! అతనికి పిచ్చిపట్టిందో తెలియటం లేదు!" అలా కాదు, ఎవరైతే పరలోకాన్ని నమ్మరో వారు శిక్షకు గురి అవుతారు. మరియు వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు.

Sebe' 34:9

ఏమిటి? వారు తమకు ముందున్న మరియు తమకు వెనుకనున్న ఆకాశాన్ని మరియు భూమిని చూడటం లేదా? మేము కోరితే, వారిని భూమిలోకి అణగ ద్రొక్కేవారం, లేదా వారిపై ఆకాశం నుండి ఒక ముక్కను పడవేసే వారం. నిశ్చయంగా, ఇందులో పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపునకు) మరలే, ప్రతి దాసుని కొరకు ఒక సూచన ఉంది.[1] ——— [1] చూడండి, 24:31 చివరి వాక్యం.

Sebe' 34:10

మరియు వాస్తవంగా, మేము దావూద్ కు మా తరఫు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము: "ఓ పర్వతాల్లారా! మరియు పక్షులారా! అతనితో కలిసి (మా స్తోత్రాన్ని) ఉచ్ఛరించండి!"[1] (అని మేము ఆజ్ఞాపించాము). మేము అతని కొరకు ఇనుమును మెత్తదిగా చేశాము. ——— [1] చూడండి, 21:79.

Sebe' 34:11

(అతనికి ఇలా ఆదేశమిచ్చాము): "నీవు కవచాలు తయారు చేయి మరియు వాటి వలయాలను (కడియాలను) సరిసమానంగా కూర్చు!" మరియు (ఓ మానవులారా!): "మీరు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా నేను చూస్తున్నాను."

Sebe' 34:12

మరియు మేము గాలిని సులైమాన్ కు (వశపరచాము); దాని ఉదయపు గమనం ఒక నెల రోజుల పాటి ప్రయాణాన్ని పూర్తి చేసేది మరియు దాని సాయంకాలపు గమనం ఒక నెల.[1] మరియు మేము అతని కొరకు రాగి ఊటను ప్రవహింప జేశాము. మరియు అతని ప్రభువు ఆజ్ఞతో, అతని సన్నధిలో పని చేసే జిన్నాతులను అతనికి వశపరచాము. మరియు వారిలో మా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడికి ప్రజ్వలించే నరకాగ్ని శిక్షను రుచి చూపుతూ ఉండేవారము. ——— [1] చూడండి, 21:81-82.

Sebe' 34:13

వారు (జిన్నాతులు) అతనికి అతను కోరే, పెద్ద పెద్ద కట్టడాలను, ప్రతిమలను, గుంటల వంటి పెద్ద పెద్ద గంగాళాలను, (తమ స్థానము నుండి) కదిలింపలేని కళాయీలను తయారు చేసేవారు. "ఓ దావూద్ వంశీయులారా! మీరు కృతజ్ఞులై పనులు చేస్తూ ఉండిండి." మరియు నా దాసులలో కృతజ్ఞతలు తెలిపేవారు చాలా తక్కువ.

Sebe' 34:14

మేము అతని (సులైమాన్)పై మృత్యువును విధించినప్పుడు, అతని చేతికర్రను తింటూ ఉన్న పురుగు తప్ప, మరెవ్వరూ అతని మరణం విషయం, వారికి (జిన్నాతులకు) తెలుపలేదు.[1] ఆ తరువాత అతను పడిపోగా జిన్నాతులు తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే, తాము అవమాన కరమైన ఈ బాధలో పడి ఉండే వారం కాము కదా అని తెలుసుకున్నారు. ——— [1] దీనితోతెలిపేది ఏమిటంటే జిన్నాతులకు అగోచర విషయాల జ్ఞానం ఉండదు.

Sebe' 34:15

వాస్తవంగా, సబా వారి కొరకు, వారి నివాస స్థలంలో ఒక సూచన ఉంది.[1] దాని కుడి మరియు ఎడమ ప్రక్కలలో రెండు తోటలు ఉండేవి (వారితో): "మీ ప్రభువు ప్రసాదించిన ఆహారం తిని ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి!" (అని అనబడింది). ఇది చాలా మంచి దేశం మరియు మీ ప్రభువు క్షమాశీలుడు. ——— [1] సబా': ఒక జాతి పేరు. బైబిల్ లో వారు షీబా (Sheiba) అనే పేరుతో పిలువబడ్డారు. వారిపై ఒక స్త్రీ రాజ్యాధికారి. అది ఈ నాటి యమన్ లోని 'హ'దరమౌత్ ప్రాంతాలలో ఉండేది. ఆమె సులైమాన్ ('అ.స.) ను కలుసుకొనిన తరువాత ఇస్లాం స్వీకరించింది. అంతకు పూర్వం వారు సూర్యుణ్ణి పుజించేవారు. ఆ రాజ్యపు రాజధాని పేరు మ'ఆరిబ్. వారు డామ్ లు నిర్మించారు. దానివల్ల వారు మంచి పంటలు పండించి సుఖసంతోషాలలో వర్ధిల్లుతూ ఉండేవారు.

Sebe' 34:16

అయినా వారు విముఖులయ్యారు. కాబట్టి మేము వారి పైకి, కట్టను తెంచి వరదను పంపాము. మరియు వారి రెండు తోటలను చేదైనా ఫలాలిచ్చే చెట్లు, ఝావుక చెట్లు మరియు కొన్ని మాత్రమే రేగు చెట్లు ఉన్న తోటలుగా మార్చాము.[1] ——— [1] అస్లీ'న్, ఝావుక చెట్లు (Tamarisk Trees) లేక వాటివంటి చెట్లు. దీని తాత్పర్యమేమిటంటే, వారి అవిశ్వాస వైఖరి మరియు సత్యతిరస్కారం వల్ల, మొదట మంచి ఫలాలనిచ్చే ఆ రెండు తోటలు ఎక్కువగా చేదైన ఫలాలిచ్చే పెద్ద పెద్ద ముండ్లు గల చెట్లుగా మారిపోయాయి. మరియు కొన్ని మాత్రమే మంచి ఫలాలిచ్చే రేగుచెట్లు (Lote-Trees)గా మిగిలి పోయాయి.

Sebe' 34:17

ఇది వారి కృతఘ్నతకు (సత్యతిరస్కారానికి) బదులుగా వారికిచ్చిన ప్రతిఫలం. మరియు ఇలాంటి ప్రతిఫలం మేము కృతఘ్నులకు తప్ప, ఇతరులకు ఇవ్వము.

Sebe' 34:18

మరియు మేము వారి మధ్య మరియు మేము శుభాలు ప్రసాదించిన నగరాల మధ్య, స్పష్టంగా కనిపించే నగరాలను స్థాపించి: "వాటి మధ్య సురక్షితంగా రేయింబవళ్ళు ప్రయాణిస్తూ ఉండండి." (అని అన్నాము).

Sebe' 34:19

కాని వారు: "ఓ మా ప్రభూ! మా ప్రయాణ దూరాలను పొడిగించు." అని వేడుకొని, తమకు తామే అన్యాయం చేసుకున్నారు. కావున మేము వారిని కథలుగా మిగిల్చి, వారిని పూర్తిగా చెల్లా చెదురు చేశాము.[1] నిశ్చయంగా, ఇందులో సహనశీలుడు, కృతజ్ఞుడు అయిన ప్రతీ వ్యక్తికి సూచనలున్నాయి. ——— [1] మ'ఆరిబ్ డామ్, తెగిన తరువాత అక్కడి ప్రజలు ఇటూ అటూ చెల్లాచెదరై పోయారు.

Sebe' 34:20

వాస్తవానికి ఇబ్లీస్ (షైతాన్) వారి విషయంలో తాను ఊహించింది సత్యమయిందని నిరూపించాడు. ఎందుకంటే! విశ్వాసులలోని ఒక వర్గం వారు తప్ప, అందరూ వాడిని అనుసరించారు.

Sebe' 34:21

మరియు వాడికి (షైతాన్ కు) వారిపై ఎలాంటి అధికారం లేదు.[1] కాని, పరలోకాన్ని విశ్వసించేవాడెవడో (మరియు) దానిని గురించి సంశయంలో పడ్డ వాడెవడో, తెలుసుకోవటానికి మాత్రమే (మేమిలా చేశాము) మరియు నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టుకొని ఉంటాడు. ——— [1] చూడండి, 14:22.

Sebe' 34:22

వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తున్నారో, వారిని పిలిచి చూడండి!" ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ రవ్వ (పరమాణువు) అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడూ సహాయకుడునూ కాడు.[1] ——— [1] చూడండి, 17:56-57.

Sebe' 34:23

మరియు ఆయన దగ్గర ఏ విధమైన సిఫారసు పలికిరాదు, ఆయన అనుమతించింన వాడి (సిఫారసు తప్ప)[1]! చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు వారు (దేవతలు): "మీ ప్రభువు మీతో చెప్పిందేమిటీ?" అని అడుగుతారు. దానికి వారంటారు: "సత్యం మాత్రమే!" మరియు ఆయన మహోన్నతుడు, మహనీయుడు. ——— [1] చూడండి, 10:3, 19:87, 20:109.

Sebe' 34:24

వారిని ఇలా అడుగు: "మీకు ఆకాశాల నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడెవడు?" వారికి తెలుపు: "అల్లాహ్!" అయితే నిశ్చయంగా మేమో లేక మీరో ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్నాము.

Sebe' 34:25

ఇంకా ఇలా అను: "మేము చేసిన పాపాలకు మీరు ప్రశ్నించబడరు మరియు మీ కర్మలను గురించి మేమూ ప్రశ్నించబడము."

Sebe' 34:26

వారితో ఇలా అను: "మన ప్రభువు మనందరినీ (పునరుత్థాన దినమున) ఒకే చోట సమకూర్చుతాడు. తరువాత న్యాయంగా మన మధ్య తీర్పు చేస్తాడు. ఆయనే (సర్వోత్తమమైన) తీర్పు చేసేవాడు,[1] సర్వజ్ఞుడు." ——— [1] అల్-ఫత్తా'హు: The Decider, The Judge, The Opener of the gates of sustenance and of mercy to His servants. తన దాసులకు జీవనోపాధి మరియు కారుణ్యపు ద్వారాలు తెరిచేవాడు. ఆపద్బాంధవుడు, న్యాయాధిపతి, తీర్పు చేసేవాడు, పరిష్కరించేవాడు.

Sebe' 34:27

వారితో ఇలా అను: "మీరు ఆయనకు సాటిగా నిలబెట్టిన భాగస్వాములను నాకు చూపించండి. ఎవరూ లేరు! వాస్తవానికి ఆయన, అల్లాహ్ యే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు."

Sebe' 34:28

మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము.[1] కాని వాస్తవానికి చాలా మంది ప్రజలకు ఇది తెలియదు.[2] ——— [1] చూడండి, 7:158, 25:1. [2] చూడండి, 12:103, 6:116.

Sebe' 34:29

మరియు వారు: "మీరు సత్యవంతులే అయితే, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది?" అని అడుగుతున్నారు.[1] ——— [1] చూడండి, 7:187.

Sebe' 34:30

వారితో ఇలా అను: "మీ కొరకు ఒక రోజు వ్యవధి నిర్ణయించబడి ఉంది; మీరు దాని రాకను ఒక్క ఘడియ వెనుకకూ చేయలేరు లేదా (ఒక్క ఘడియ) ముందుకునూ చేయలేరు."[1] ——— [1] చూడండి, 71:4. పైన ఇవ్వడిన తాత్పర్యం నోబుల్ ఖుర్ఆన్ ను అనుసరించి ఉంది. అంటే మీరు ఎవ్వరునూ ఆ నిర్ణీత వ్యవధిని ఒక్క ఘడియ ముందుగానూ తీసుకురాలేరు లేదా దానిని ఒక్క ఘడియ కూడా ఆసల్యమూ చేయలేరు. అది అల్లాహుతా'ఆలా నిర్ణయించిన ఘడియలోనే రానున్నది. దానిని మార్చే శక్తి ఇతరులకు ఎవ్వరికీ లేదు.

Sebe' 34:31

మరియు సత్యతిరస్కారులైన వారు ఇలా అంటారు: "మేము ఈ ఖుర్ఆన్ ను మరియు దీనికి ముందు వచ్చిన ఏ గ్రంథాన్ని కూడా నమ్మము." ఒకవేళ ఈ దుర్మార్గులను తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడినప్పుడు, వారు ఒకరి నొకరు, ఆరోపణలు చేసుకోవటం నీవు చూస్తే (ఎంత బాగుండును)! బలహీన వర్గం వారు దురహంకారులైన తమ నాయకులతో: "మీరే లేకుంటే మేము తప్పక విశ్వాసుల మయ్యేవారం!" అని అంటారు.

Sebe' 34:32

దురహంకారులైన నాయకులు బలహీనులైన వారితో ఇలా అంటారు: "ఏమీ? మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని దాని నుండి నిరోధించామా? అలా కాదు, మీరే అపరాధానికి పాల్పడ్డారు!"

Sebe' 34:33

మరియు బలహీనులైన వారు దురహంకారులైన నాయకులతో ఇలా అంటారు: "అలా కాదు! ఇది మీరు రాత్రింబవళ్ళు పన్నిన కుట్ర.[1] మీరు మమ్మల్ని - అల్లాహ్ ను తిరస్కరించి - ఇతరులను ఆయనకు సాటి కల్పించమని ఆజ్ఞాపిస్తూ ఉండేవారు." మరియు వారు శిక్షను చూసినప్పుడు, తమ పశ్చాత్తాపాన్ని దాస్తారు. మరియు మేము సత్యతిరస్కారుల మెడలలో సంకెళ్ళు వేస్తాము.[2] వారు తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేదైనా పొందగలరా? ——— [1] చూడండి, 10:21, 35:43, 86:15. [2] చూడండి, 13:5, 36:8.

Sebe' 34:34

మరియు మేము హెచ్చరిక చేసే అతనిని (ప్రవక్తను) ఏ నగరానికి పంపినా, దానిలోని ఐశ్యర్యవంతులు: "నిశ్చయంగా, మేము మీ వెంట పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము." అని అనకుండా ఉండలేదు.[1] ——— [1] మొట్టమొదట కేవలం పేదవారు మరియు దిగువ సామాజిక తరగతుల వారు మాత్రమే ప్రవక్త ('అలైహిమ్ స.) అనుసరించారు. చూడండి, 26:111, 11:27, 7:75, 17:16.

Sebe' 34:35

వారు ఇంకా ఇలా అన్నారు: "మేము (నీ కంటే) ఎక్కువ సంపద మరియు సంతానం కలిగి ఉన్నాము. మరియు మేము ఏ మాత్రం శిక్షింపబడము."

Sebe' 34:36

వారితో అను: "నిశ్చయంగా, నా ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు, మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడు. కాని చాలా మందికి ఇది తెలియదు."

Sebe' 34:37

మరియు మీ సంపద గానీ మరియు మీ సంతానం గానీ మిమ్మల్ని మా దగ్గరికి తేలేవు; కాని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప! కావున అలాంటి వారికి తాము చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. మరియు వారు భవనాలలో సురక్షితంగా ఉంటారు.

Sebe' 34:38

మరియు ఎవరైతే మా సూచనలను భంగపరచటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారు కఠినశిక్షకు హాజరు చేయబడతారు.

Sebe' 34:39

వారితో అను: "నిశ్చయంగా, నా ప్రభువు తన దాసులలో తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన) వారికి మితంగా ఇస్తాడు. మరియు మీరు (ఆయన మార్గంలో) ఖర్చు పెట్టేదంతా ఆయన మీకు తిరిగి ఇస్తాడు. మరియు ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధి ప్రదాత."

Sebe' 34:40

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు ఆయన వారందరినీ సమీకరించిన తరువాత దేవదూతలతో ఇలా అడుగుతాడు: "ఏమీ? వీరేనా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండేవారు?"[1] ——— [1] చూడండి, 25:17.

Sebe' 34:41

వారు (దేవదూతలు) జవాబిస్తారు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు! నీవే మా సంరక్షకుడవు, వీరు కారు. వాస్తవానికి, వీరు జిన్నాతులను ఆరాధించేవారు, వీరిలో చాలా మంది, వారిని (జిన్నాతులను) విశ్వసించే వారు."[1] ——— [1] చూడండి, 4:117.

Sebe' 34:42

(అప్పుడు వారితో ఇట్లనబడుతుంది): "అయితే ఈ రోజు మీరు ఒకరికొకరు లాభం గానీ, నష్టం గానీ చేకూర్చుకోలేరు." మరియు మేము దుర్మార్గులతో: "మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకబాధను రుచి చూడండి!" అని పలుకుతాము.

Sebe' 34:43

మరియు వారికి మా స్పష్టమైన సూచన (ఆయాత్) లను వినిపింప జేసినప్పుడు వారు: "ఈ వ్యక్తి కేవలం మీ తండ్రి తాతలు ఆరాధించే వాటి నుండి మిమ్మల్ని నిరోధిస్తున్నాడు." అని అంటారు. వారింకా ఇలా అంటారు: "ఇది (ఈ ఖుర్ఆన్) కేవలం కల్పించబడిన బూటకం మాత్రమే." మరియు సత్యతిరస్కారులు, సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు: "ఇది కేవలం స్పష్టమైన మంత్రజాలం మాత్రమే!"[1] అని అంటారు. ——— [1] చూడండి, 74:24.

Sebe' 34:44

(ఓ ముహమ్మద్!) మేము, వారికి చదవటానికి ఎలాంటి గ్రంథాలు ఇవ్వలేదు.[1] మరియు మేము వారి వద్దకు నీకు పూర్వం హెచ్చరించే (సందేశహరుణ్ణి) కూడా పంపలేదు. ——— [1] చూడండి, 30:35.

Sebe' 34:45

మరియు వారికి పూర్వం గతించిన వారు కూడా (ఇదే విధంగా) తిరస్కరించారు. మేము (పూర్వం) వారికిచ్చిన దానిలో వీరు పదోవంతు కూడా పొందలేదు. అయినా వారు నా సందేశహరులను తిరస్కరించారు. చూశారా! నా శిక్ష ఎంత ఘోరంగా ఉండిందో![1] ——— [1] చూడండి, 46:26.

Sebe' 34:46

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి, నేను మీకు ఒక విషయం బోధిస్తాను: 'మీరు అల్లాహ్ కొరకు ఇద్దరిద్దరిగా, ఒక్కొక్కరిగా నిలవండి. తరువాత బాగా ఆలోచించండి!' మీతోపాటు ఉన్న ఈ వ్యక్తికి (ప్రవక్తకు) పిచ్చి పట్టలేదు.[1] అతను కేవలం, మీపై ఒక ఘోరశిక్ష రాకముందే, దానిని గురించి మిమ్మల్ని హెచ్చరించేవాడు మాత్రమే!"[2] ——— [1] చూడండి, 7:184. [2] ఒకరోజు దైవప్రవక్త ('స'అస) 'సఫా గుట్టమీద ఎక్కి అంటారు: "ఓ ప్రజలారా, వినండి!". ప్రజలందరూ అక్కడికి చేరుకుంటారు. "ఒకవేళ: 'ఉదయమో, సాయంత్రమో, శత్రువు మీపై దాడి చేయనున్నాడు.' అని అంటే మీరు నమ్ముతారా?" వారంటారు: "ఎందుకు నమ్మము." అప్పుడతను ('స'అస) అంటారు: "అయితే వినండి! నేను మిమ్మల్ని ఘోరశిక్ష రాక ముందు విశ్వసించండని హెచ్చరిస్తున్నాను." దానికి అబూ-లహబ్ అంటాడు: "నీ పాడుగాను, దీనికా నీవు మమ్మల్ని ప్రోగుచేసింది?" అప్పుడు అల్లాహ్ (సు.తా.) సూరహ్ అల్-మసద్ (111) అవతరింపజేశాడు. ('స'హీ'హ్ బు'ఖారీ).

Sebe' 34:47

ఇలా అను: "నేను మిమ్మల్ని ఏదైనా ప్రతిఫలం అడిగి ఉన్నట్లైతే, దానిని మీరే ఉంచుకోండి.[1] వాస్తవానికి, నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ వద్దనే ఉంది. మరియు ఆయనే ప్రతి దానికి సాక్షి!" ——— [1] చూడండి, 25:57.

Sebe' 34:48

ఇలా అను: "నిశ్చయంగా, నా ప్రభువే సత్యాన్ని (అసత్యానికి విరుద్ధంగా) పంపేవాడు.[1] ఆయనే అగోచర యథార్థాలన్నీ తెలిసి ఉన్నవాడు." ——— [1] చూడండి, 21:18.

Sebe' 34:49

ఇలా అను: "సత్యం వచ్చేసింది! మరియు అసత్యం (మిథ్యం దేనినీ ఆరంభం చేయజాలదు మరియు దానిని తిరిగి ఉనికిలోకి తేజాలదు."[1] ——— [1] ఇక్కడ 'హఖ్ఖ్ అంటే ఖుర్ఆన్, బా'తిల్ అంటే షై'తాన్ - కుఫ్ర్ మరియు షిర్క్. మక్కా విజయం రోజు, దైవప్రవక్త ('స'అస) కాబా గృహంలో ప్రవేశించారు. అందులో అన్ని వైపులా విగ్రహాలు ఉండేవి. అతను తన బాణపు కొనతో విగ్రహాలను కొట్టుతూ ఈ ఆయత్ మరియు 17:81, చదివారు: "వ ఖుల్ జా' అల్ 'హఖ్ఖు వ 'జహఖల్ బా'తిల్," ('స'హీ'హ్ బు'ఖారీ).

Sebe' 34:50

ఇలా అను: "ఒకవేళ నేను మార్గభ్రష్టుడనైతే! నిశ్చయంగా, అది నా స్వంత నాశనానికే! మరియు ఒకవేళ మార్గదర్శకత్వం పొందితే, అది కేవలం నా ప్రభువు నాపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం (వహీ) వల్లనే! నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, దగ్గరలోనే ఉంటాడు (అతి సన్నిహితుడు)!"[1] ——— [1] మీరు చెవిటి లేక అగోచర శక్తిని వేడుకోవడం లేదు. వాస్తవానికి మీకు దగ్గర ఉండి వినగల మరియు మీ ప్రార్థనలను అంగీకరించగల ఆయనను వేడుకుంటున్నారు.

Sebe' 34:51

మరియు వారు భయకంపితులై ఉండటాన్ని, నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది), కాని వారికి తప్పించుకోవటానికి వీలుండదు. మరియు వారు చాలా సమీపం నుండి పట్టుకోబడతారు.[1] ——— [1] చూడండి, 17:13, 13:5.

Sebe' 34:52

అప్పుడు (పరలోకంలో) వారంటారు: "మేము (ఇప్పుడు) దానిని (సత్యాన్ని) విశ్వసించాము!" వాస్తవానికి వారు చాలా దూరం నుండి దానిని (విశ్వాసాన్ని) ఎలా పొందగలరు?

Sebe' 34:53

మరియు వాస్తవానికి వారు దానిని (సత్యాన్ని) ఇంతకు ముందు తిరస్కరించి ఉన్నారు. మరియు వారు తమకు అగోచరమైన విషయానికి దూరం నుండియే నిరసన చూపుతూ ఉండేవారు.

Sebe' 34:54

మరియు వారికి పూర్వం గడిచిన వారి విధంగానే, వారి మధ్య మరియు వారి కోరికల మధ్య అడ్డు వేయబడుతుంది. నిశ్చయంగా, వారు సంశయంలో పడవేసే గొప్ప సందేహంలో పడి ఉండేవారు.[1] ——— [1] శిక్షను చూసిన తరువాత విశ్వసించగోరితే, ఆ విశ్వాసం అంగీకరించబడదు. ఖతాదా (రజి.అ.) కథనం: "సందేహాల మరియు సంశయాల నుండి దూరంగా ఉండండి. ఎవడైతే సందేహావస్థలో మరణిస్తాడో! అదే స్థితిలో పునరుత్థరింపబడతాడు. మరియు ఎవడైతే విశ్వాసంతో మరణిస్తాడో ఆ రోజు విశ్వాసంతోనే లేపబడతాడు!" (ఇబ్నె-కసీ'ర్)

Fatır 35:1

సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి.[1] ఆయనే దేవదూతలను సందేశాలు అందజేసేవారిగా నియమించాడు. వారు రెండేసి, మూడేసి లేదా నాలుగేసి రెక్కలు గలవారు.[2] ఆయన తన సృష్టిలో తాను కోరిన దానిని అధికం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు. ——— [1] ఫా'తిర్ చూడండి, 6:14, 12:101. [2] ఈ దేవదూతలు జిబ్రీల్, మీకాయీ'ల్, ఇస్రాఫీల్ మరియు ఇ'జ్రాయీల్ ('అలైహిమ్. స.) లు. వారికి రెక్కలున్నాయి. మేరాజ్ రాత్రిలో దైవప్రవక్త ('స'అస) జిబ్రీల్ ('అ.స.) కు ఆరు వందల రెక్కలు చూశారు, (బు'ఖారీ, ముస్లిం - ఇబ్నె మస్'ఊద్ (ర'ది. 'అ.) కథనం.

Fatır 35:2

అల్లాహ్ ప్రజల కొరకు ఏ కారుణ్యాన్ని పంపినా దానిని ఆపేవాడు ఎవ్వడూ లేడు. మరియు ఏ (కారుణ్యాన్నైనా) ఆయన ఆపితే, ఆ తరువాత దానిని పంపగలవాడు కూడా ఎవ్వడూ లేడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.

Fatır 35:3

ఓ మానవులారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి! ఏమీ? భూమ్యాకాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే సృష్టికర్త అల్లాహ్ తప్ప మరొకడు ఉన్నాడా?[1] ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! అయితే మీరు ఎందుకు మోసగింప (సత్యం నుండి మరలింప) బడుతున్నారు? ——— [1] చూడండి, 10:31.

Fatır 35:4

మరియు (ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరించినా (ఇది క్రొత్త విషయం కాదు), వాస్తవానికి నీకు పూర్వం పంపబడిన సందేశహరులు కూడా తిరస్కరింపబడ్డారు. మరియు వ్యవహారాలన్నీ (తీర్పు కొరకు) చివరకు అల్లాహ్ వద్దకే మరలింప బడతాయి.

Fatır 35:5

ఓ మానవులారా! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం! కావున ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించరాదు. మరియు ఆ మహా వంచకుణ్ణి (షైతాన్ ను) కూడా మిమ్మల్ని అల్లాహ్ విషయంలో మోసగింపనివ్వకండి.[1] ——— [1] చూడండి, 31:33.

Fatır 35:6

నిశ్చయంగా, షైతాన్ మీ శత్రువు, కావున మీరు కూడా వాడిని శత్రువుగానే భావించండి.[1] నిశ్చయంగా, వాడు తన అనుచరులను (భగభగ మండే) అగ్నివాసులవటానికే ఆహ్వానిస్తూ ఉంటాడు. ——— [1] చూడండి, 18:50.

Fatır 35:7

ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, వారికి కఠినమైన శిక్ష పడుతుంది. మరియు ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో, వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం (స్వర్గం) కూడా ఉంటాయి.

Fatır 35:8

ఏమీ? తన దుష్కార్యాలు తనకు ఆకర్షణీయంగా కనబడేటట్లు చేయబడి నందుకు, ఎవడైతే వాటిని మంచి కార్యాలుగా భావిస్తాడో! (అతడు సన్మార్గంలో ఉన్న వాడితో సమానుడు కాగలడా)? నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వానిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు మరియు తాను కోరిన వానికి మార్గదర్శకత్వం చేస్తాడు. కావున నీవు వారి కొరకు చింతించి నిన్ను నీవు దుఃఖానికి గురి చేసుకోకు. నిశ్చయంగా, వారి కర్మలన్నీ అల్లాహ్ కు బాగా తెలుసు.

Fatır 35:9

మరియు అల్లాహ్ యే గాలులను పంపుతాడు. తరువాత అవి మేఘాలను ఎత్తుతాయి. ఆ తరువాత మేము వాటిని మృత ప్రదేశం వైపునకు పంపి, దానితో ఆ నేలను మరణించిన తరువాత తిరిగి బ్రతికిస్తాము. ఇదే విధంగా, (మానవుల) పునరుత్థానం కూడా జరుగుతుంది.

Fatır 35:10

గౌరవాన్ని కాంక్షించు వాడు తెలుసు కోవాలి, గౌరవమంతా అల్లాహ్ కే చెందుతుందని! మంచి ప్రవచలన్నీ)[1] ఆయన వైపునకు ఎక్కి పోతాయి. మరియు సత్కర్మ దానిని పైకి ఎత్తుతుంది. మరియు ఎవరైతే చెడు కుట్రలు పన్నుతారో![2] వారికి కఠిన శిక్ష ఉంటుంది. మరియు అలాంటి వారి కుట్ర, అదే! నశించి పోతుంది. ——— [1] మంచి ప్రవచనాలు అంటే, తస్బీ'హ్, ఖుర్ఆన్ పఠించటం, మంచిని ఆదేశించి, చెడునుండి నిరోధించటం మొదలైనవి. [2] మక్ రున్: అంటే Plot, కుట్ర, కపటోపాయం, తంత్రం, ఎత్తుగడ, రహస్యంగా ఇతరులకు హాని కలిగించటానికి పన్నే పన్నాగం. కుఫ్ర్ మరియు షిర్క్ కూడా మక్ర్. ఎందుకంటే, దాని వల్ల అల్లాహ్ (సు.తా.) మార్గానికి హాని కలుగుతుంది. దైవప్రవక్త ('స'అస) ను చంపడానికి మక్కా ముష్రికులు చేసిన మక్ర్. ఇంకా చూడండి, 10:21, 34:33 మరియు 35:43.

Fatır 35:11

మరియు అల్లాహ్ మిమ్మల్ని మట్టితో సృష్టించాడు.[1] తరువాత ఇంద్రియ బిందువుతో, ఆ తరువాత మిమ్మల్ని (ఆడ-మగ) జంటలుగా చేశాడు. మరియు ఏ స్త్రీ కూడా ఆయనకు తెలియకుండా గర్భం దాల్చజాలదు మరియు ప్రసవించనూ జాలదు. గ్రంథంలో వ్రాయబడనిదే, పెరుగుతున్న వాడి వయస్సు పెరగనూ జాలదు మరియు ఎవని వయస్సు తరగనూ జాలదు. నిశ్చయంగా, ఇదంతా అల్లాహ్ కు ఎంతో సులభం. ——— [1] అల్లాహ్ (సు.తా.)తో మరుగైనది ఏదీలేదు. ఇంకా చూడండి, 6:59 భూమిలోపల మరియు తల్లిగర్భంలో ఉండే ప్రతి ఒక్కదాని విషయం అల్లాహ్ (సు.తా.)కు బాగా తెలుసు.

Fatır 35:12

రెండు సముద్రాలు సరిసమానం కాజాలవు.[1] వాటిలోని ఒకదాని (నీరు) రుచికరమైనది, దాహం తీర్చేది మరియు త్రాగటానికి మధురమైనది. రెండోదాని (నీరు) ఉప్పుగానూ, చేదుగానూ ఉన్నది. అయినా వాటిలో ప్రతి ఒక్క దాని నుండి మీరు తాజా మాంసం తింటున్నారు మరియు ఆభరణాలు తీసి ధరిస్తున్నారు. మరియు నీవు చూస్తున్నావు, ఓడలు వాటిని చీల్చుతూ పోవటాన్ని; (వాటిలో) మీరు, ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికి! ——— [1] చూడండి, 25:53.

Fatır 35:13

ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింప జేస్తున్నాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేస్తున్నాడు మరియు సూర్యచంద్రులను నియమబద్ధులుగా చేసి ఉన్నాడు. అవి తమ తమ పరిధిలో, నిర్ణీత వ్యవధిలో తిరుగుతూ ఉన్నాయి. ఆయనే అల్లాహ్! మీ ప్రభువు, విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే! మరియు ఆయనను వదలి మీరు వేడుకునే వారు, ఖర్జూర బీజంపై నున్న పొరకు[1] కూడా యజమానులు కారు. ——— [1] ఖి'త్ మీరున్: అంటే ఖర్జూర బీజముపై ఉండే సన్నని పొర. paltry, small, mean, contemptibel, thing. లేక పనికిమాలిన, అల్పమైన, నికృష్టమైన వస్తువు.

Fatır 35:14

మీరు వారిని వేడుకొన్నప్పటికీ, వారు మీ ప్రార్థనలను వినలేరు, ఒకవేళ విన్నా, వారు మీకు జవాబివ్వలేరు. మరియు పునరుత్థాన దినమున మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు తిరస్కరిస్తారు.[1] మరియు (సత్యాన్ని) గురించి నీకు ఆ సర్వం తెలిసినవాడు తెలిపినట్లు మరెవ్వరూ తెలుపజాలరు. ——— [1] చూడండి, 10:28 మరియు 29. వారు అల్లాహ్ (సు.తా.)ను విడిచి, ఆరాధించే విగ్రహాలు, మూర్తులు, దైవదూతలు, జిన్నాతు, షై'తానులు మరియు సద్పురుషులు మొదలైనవన్నీ వారి ఆరాధనను పునరుత్థాన దినమున తిరస్కరిస్తాయి.

Fatır 35:15

ఓ మానవులారా![1] అల్లాహ్ అక్కర గలవారు మీరే! వాస్తవానికి అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు. ——— [1] మానవులారా! అంటే మానవులూ, దైవప్రవక్తలూ, సద్పురుషులూ అందరూ!

Fatır 35:16

ఆయన కోరితే మిమ్మల్ని నాశనం చేసి (మీ స్థానంలో) క్రొత్త సృష్టిని తేగలడు.[1] ——— [1] చూడండి, 14:19.

Fatır 35:17

మరియు అలా చేయటం అల్లాహ్ కు కష్టమైనది కాదు.

Fatır 35:18

మరియు బరువు మోసేవాడెవ్వడూ మరొకని బరువును మోయడు.[1] మరియు ఒకవేళ బరువు మోసేవాడు, దానిని ఎత్తుకోవడానికి ఎవరినైనా పిలిచినా, దగ్గరి బంధువైనా దాని నుండి కొంతైనా ఎత్తుకోడు. కాని నిశ్చయంగా, నీవు వారినే హెచ్చరించ గలవు ఎవరైతే తమకు అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో![2] మరియు నమాజ్ ను స్థాపిస్తారో. మరియు ఎవడైతే నీతిమంతుడవుతాడో అతడు తన స్వంత (లాభం) కొరకే నీతిమంతుడవుతాడు. మరియు (అందరికీ) అల్లాహ్ వైపునకే మరలి పోవలసి ఉన్నది. ——— [1] చూడండి, 6:164, 17:15, 29:13, 39:7, 53:38 23 కాని ఇతరులను సన్మార్గం నుండి నిరోధించేవాడు, లేక తప్పించేవాడు, తన పాపభారంతో పాటు తాను తప్పించిన వారి పాపభారాలను కూడా భరిస్తాడు. [2] విశ్వాసం అంటే అగోచరుడైన అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించటం. ఆయన శక్తి సామర్థ్యాలను గుర్తించి, కేవలం ఆయననే ప్రార్థించటం.

Fatır 35:19

మరియు గ్రుడ్డివాడు మరియు కళ్ళున్నవాడు సరిసమానులు కాజాలరు;

Fatır 35:20

మరియు (అదే విధంగా) చీకట్లు (అవిశ్వాసం) మరియు వెలుగు (విశ్వాసం);

Fatır 35:21

మరియు నీడలు, మరియు ఎండా;[1] ——— [1] అంటే స్వర్గనరకాలు.

Fatır 35:22

మరియు బ్రతికి ఉన్నవారు మరియు మరణించిన వారు కూడా సరిసమానులు కాజాలరు.[1] నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వానికి (హితబోధ) వినేటట్లు చేస్తాడు. కాని నీవు గోరీలలో ఉన్న వారికి వినిపించ జాలవు.[2] ——— [1] అంటే విశ్వాసులు మరియు అవిశ్వాసులు. [2] ఏ విధంగానైతే మరణించి గోరీలలో ఉన్నవారు వినలేరో అదే విధంగా సత్యతిరస్కారం వల్ల, చనిపోయిన హృదయాలకు నీవు హితోపదేశాన్ని, సత్యాన్ని బోధించలేవు.

Fatır 35:23

నీవు (ఓ ముహమ్మద్!) కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే.[1] ——— [1] మరియు మార్దదర్శకత్వం చేయటం అల్లాహ్ (సు.తా.)కే చెందినది. ఎంతవరకైతే ఒకడు, అల్లాహ్ (సు.తా.) అతనికి ప్రసాదించిన విచక్షణాబుద్ధిని ఉపయోగించి సత్యాన్ని అనుసరించటానికి ప్రయత్నించడో! అంతవరకు అల్లాహ్ (సు.తా.) అతనికి సన్మార్గం చూపడు. ఈ విషయం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వ్యక్తపరచబడింది.

Fatır 35:24

నిశ్చయంగా, మేము, నిన్ను సత్యం ప్రసాదించి, శుభవార్తనిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము. మరియు హెచ్చరిక చేసేవాడు వారి మధ్య లేకుండా, ఏ సమాజం కూడా గడచిపోలేదు!

Fatır 35:25

మరియు ఒకవేళ వీరు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తున్నారంటే (ఆశ్చర్యమేమీ కాదు)! ఎందుకంటే, వీరిక పూర్వం గతించిన వారు కూడా (ఇదే విధంగా తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు. వారి సందేశహరులు, వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలను, శాసనాలను (జబుర్ లను)[1] మరియు వెలుగునిచ్చే గ్రంథాన్ని తీసుకొని వచ్చారు.[2] ——— [1] జు'బురున్: అనే పదానికి, Scriptures, చిన్న చిన్న ముక్కలు లేక గ్రంథాలు, శాసనాలు, శృతులు మరియు కీర్తనలు అనే అర్థాలున్నాయి. [2] చూడండి, 13:7, మరియు 16:36. ప్రతి సమాజానికి ఒక హెచ్చరిక చేసేవాడు (ప్రవక్త) పంపబడ్డాడు.

Fatır 35:26

ఆ తరువాత సత్యతిరస్కారులను నేను (శిక్షకు) గురి చేశాను. (చూశారా) నా శిక్ష ఎంత కఠినమైనదో!

Fatır 35:27

ఏమీ? నీవు చూడటం లేదా? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశం నుండి వర్షం కురిపించేవాడని. తరువాత దాని నుండి మేము రంగురంగుల ఫలాలను ఉత్పత్తి చేస్తామని! మరియు పర్వతాలలో తెల్లని, ఎర్రని వివిధ రంగుల చారలను (కొన్నిటిని) మిక్కిలి నల్లగా కూడా చేస్తామని.[1] ——— [1] ఈ వివిధ రకాల రంగులు అల్లాహ్ (సు.తా.) ప్రసాదించనవే! వాటిని చూసి అల్లాహ్ (సు.తా.) మహత్వాన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది.

Fatır 35:28

మరియు ఇదే విధంగా మానవుల, ఇతర ప్రాణుల మరియు పశువుల రంగులు కూడా వేర్వేరుగా ఉంటాయి.[1] నిశ్చయంగా, అల్లాహ్ దాసులలో జ్ఞానం గలవారు మాత్రమే ఆయనకు భయపడతారు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు. ——— [1] చూడండి, 16:13.

Fatır 35:29

నిశ్చయంగా, అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) పారాయణం చేసేవారు మరియు నమాజ్ ను స్థాపించేవారు మరియు తమకు ప్రసాదించబడిన జీవనోపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా ఖర్చు (దానం) చేసేవారు అందరూ![1] నష్టంలేని వ్యాపారాన్ని అపేక్షించేవారే! ——— [1] బహిరంగంగా ఖర్చు చేయటం అంటే విధి జకాత్ చెల్లించటం మరియు రహస్యంగా అంటే జకాత్ చెల్లించిన తరువాత అధికంగా దానం చేయటం.

Fatır 35:30

ఇదంతా అల్లాహ్ వారి ప్రతిఫలాన్ని పూర్తిగా వారికి ఇవ్వాలనీ మరియు తన అనుగ్రహంతో వారికి మరింత అధికంగా ఇవ్వాలనీ! నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు.

Fatır 35:31

మరియు (ఓ ముహమ్మద్!) మేము నీపై అవతరింపజేసిన గ్రంథమే నిజమైనది, దానికి పూర్వం వచ్చిన గ్రంథాలలో (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవపరిచేది. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులను బాగా ఎరిగేవాడు, సర్వదృష్టికర్త.

Fatır 35:32

ఆ తరువాత మేము ఈ గ్రంథానికి, మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారిని వారసులుగా చేశాము.[1] వారిలో కొందరు తమకు తాము అన్యాయం చేసుకున్న వారున్నారు,[2] మరికొందరు మధ్యస్థంగా ఉండేవారున్నారు,[3] ఇంకా కొందరు అల్లాహ్ సెలవుతో సత్కార్యాలలో మున్ముందు ఉండే వారూ ఉన్నారు.[4] ఇదే ఆ గొప్ప అనుగ్రహం. ——— [1] గ్రంథం అంటే ఖుర్ఆన్, ఎన్నుకున్నవారు అంటే అంటే ము'హమ్మద్ ('స'అస) ను అనుసరించేవారు, ముస్లింలు అని అర్థం. ఇటువంటి ఆయత్ కు చూడండి, 2:143. [2] ము'హమ్మద్ ('స'అస) ఉమ్మత్ లో మూడు రకాల వారున్నారు. వీరు మొదటి రకానికి చెందినవారు : తమకు తాము అన్యాయం చేసుకునే వారున్నారు. వీరు కొన్ని విధు(ఫ'రాయద్)లను ఉపేక్షిస్తారు. మరియు కొన్ని 'హరామ్ - నిషిద్ధ విషయాల నుండి దూరంగా ఉండరు, కాబట్టి వీరిని తమకు తాము అన్యాయం చేసుకున్నవారు అన్నారు. వీరు తమకు తాము అన్యాయం చేసుకున్నందుకు ఇతర రెండు రకాల వారి స్థానాలకు చేరలేక పోతారు. చూడండి, 7:46. [3] వీరు రెండో రకానికి చెందినవారు, మధ్యస్థంగా ఉండేవారు. వీరు కొన్నిసార్లు ముస్త'హబ్ విషయాలను విడిచి పెడతారు. మరియు కొన్ని ము'హర్రమాత్ లను పాటించరు. [4] వీరు మూడో రకానికి చెందినవారు, మొదట పేర్కొన్న ఇద్దరికంటే ధర్మ విషయాలలో మున్ముందు ఉండేవారు.

Fatır 35:33

శాశ్వతమైన స్వర్గవనాలలో వారు ప్రవేశిస్తారు. అందు వారు బంగారు కంకణాలు మరియు ముత్యాలతో అలంకరింప బడుతారు. మరియు వారి వస్త్రాలు పట్టుతో చేయబడి ఉంటాయి. [1] ——— [1] "ఏ పురుషులైతే ఇహలోకంలో పట్టు, బంగారు ధరిస్తారో, వారు పరలోకంలో వాటిని ధరించలేరు." ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం) స్వర్గపు వస్త్రాల కొరకు చూడండి, 18:31.

Fatır 35:34

మరియు (అప్పుడు) వారు ఇలా అంటారు: "మా నుండి దుఃఖాన్ని తొలగించిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. నిశ్చయంగా, మా ప్రభువు క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు.

Fatır 35:35

ఆయనే తన అనుగ్రహంతో మమ్మల్ని శాశ్వతమైన నివాస స్థలంలో దింపాడు. ఇందులో మాకు ఎలాంటి కష్టమూ లేదు మరియు ఇందులో ఎలాంటి అలసట కూడా లేదు."

Fatır 35:36

మరియు సత్యతిరస్కారులైన వారి కొరకు నరకాగ్ని ఉంటుంది. అందులో వారు చనిపోవాలనీ తీర్పూ ఇవ్వబడదు, లేదా వారికి దాని (నరకపు) శిక్ష కూడా తగ్గింప బడదు. ఈ విధంగా, మేము ప్రతి కృతఘ్నునికి (సత్యతిరస్కారునికి) ప్రతీకారం చేస్తాము.

Fatır 35:37

మరియు వారు దానిలో (నరకంలో) ఇలా మొరపెట్టుకుంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని బయటికి తీయి. మేము పూర్వం చేసిన కార్యాలకు భిన్నంగా సత్కార్యాలు చేస్తాము." (వారికిలా సమాధానం ఇవ్వబడుతుంది) : "ఏమీ? గుణపాఠం నేర్చుకోదలచిన వాడు గుణపాఠం నేర్చుకోవటానికి, మేము మీకు తగినంత వయస్సును ఇవ్వలేదా? మరియు మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చాడు కదా? కావున మీరు (శిక్షను) రుచి చూడండి. ఇక్కడ దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవ్వడూ ఉండడు."

Fatır 35:38

నిశ్చయంగా, అల్లాహ్ కు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న అగోచర విషయాలన్నీ తెలుసు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలు కూడా బాగా తెలుసు.[1] ——— [1] అంటే మిమ్మల్ని మరల భూమిలోకి పంపినా మీరు సత్కార్యాలు చేయరని, అల్లాహ్ (సు.తా.)కు బాగా తెలుసు. ఇంకా చూడండి, 6:28.

Fatır 35:39

ఆయనే మిమ్మల్ని భూమిపై ఉత్తరాధికారులుగా చేసినవాడు. కావున ఎవడు (సత్యాన్ని) తిరస్కరిస్తాడో అతని తిరస్కారం అతనిపైననే పడుతుంది. సత్యతిరస్కారులకు వారి తిరస్కారం వారి ప్రభువు వద్ద కేవలం వారి యెడల అసహ్యాన్నే అధికం చేస్తుంది. మరియు సత్యతిరస్కారులకు వారి తిరస్కారం వారికి నష్టాన్నే అధికం చేస్తుంది.[1] ——— [1] చూడండి, 2:30.

Fatır 35:40

వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే ఈ భాగస్వాములను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వారు భూమిలో ఏమి సృష్టించారో నాకు చూపండి? లేదా వారికి ఆకాశాలలో ఏదైనా భాగస్వామ్యం ఉందా? లేదా మేము వారికి ఏదైనా గ్రంథాన్ని ఇచ్చామా? వారు దాని స్పష్టమైన ప్రమాణంపై ఉన్నారని అనటానికి? అది కాదు, అసలు ఈ దుర్మార్గులు పరస్పరం, కేవలం మోసపు మాటలను గురించి వాగ్దానం చేసుకుంటున్నారు."

Fatır 35:41

నిశ్చయంగా, అల్లాహ్ భూమ్యాకాశాలను తమ స్థానాల నుండి విడి పోకుండా వాటిని నిలిపి ఉంచాడు. ఒకవేళ అవి తొలగిపోతే, ఆయన తప్ప మరెవరైనా వాటిని నిలిపి ఉంచగలరా?[1] నిశ్చయంగా, ఆయన సహనశీలుడు, క్షమాశీలుడు. ——— [1] చూభూమ్యాకాశాలను విడిపోకుండా తమస్థానంలో ఉంచినవాడు అల్లాహ్ (సు.తా.) మాత్రమే! చూడండి 19:90-91, 22:65, 30:25, 15:23. అల్లాహ్ తప్ప మరెవ్వరూ వాటిని తమ స్థానాలలో ఉంచలేరు!

Fatır 35:42

మరియు, ఒకవేళ హెచ్చరిక చేసేవాడు వారి వద్దకు వస్తే! వారు తప్పక, ఇతర సమాజాల వారి కంటే ఎక్కువగా సన్మార్గం మీద ఉండేవారని అల్లాహ్ సాక్షిగా గట్టి ప్రమాణాలు చేస్తారు.[1] కాని హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వచ్చినపుడు మాత్రం (అతని రాక) వారి వ్యతిరేకతను తప్ప మరేమీ అధికం చేయలేక పోయింది;[2] ——— [1] చూ"హెచ్చరిక చేసేవాడు వస్తే మేము తప్పక సన్మార్గం మీద ఉంటాము." అని ఈ ముష్రిక్ లు గట్టి ప్రమాణాలు చేశారు. కానీ, అతను వచ్చిన తరువాత అతనిని తిరస్కరించారు. ఇంకా చూడండి, 6:156-157, 37:168-170. [2] అంటే ము'హమ్మద్ ('స'అస) వచ్చిన తరువాత కూడా అతనిని తిరస్కరించారు.

Fatır 35:43

(ఇది) వారు భూమిలో మరింత దురహంకారంతో తిరుగుతూ, దుష్ట పన్నాగాలు పన్నినందుకు.[1] వాస్తవానికి దుష్ట పన్నాగాలు, వాటిని పన్నే వారికే హాని కలిగిస్తాయి. తమ పూర్వీకుల పట్ల అవలంబించ బడిన విధానమే (వారి పట్ల కూడా) అవలంబించ బడాలని వారు నిరీక్షిస్తున్నారా ఏమిటి? కాని నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు మరియు అల్లాహ్ సంప్రదాయంలో నీవు ఎలాంటి అతిక్రమాన్ని చూడలేవు. ——— [1] చూడండి, 10:21 లేక 34:33.

Fatır 35:44

వారు భూమిలో ఎన్నడూ సంచరించలేదా ఏమిటి? వారికి పూర్వం గతించిన వారు వీరి కంటే అత్యంత బలవంతులైనా, వారి పరిణామం ఏమయిందో వారు చూడలేదా? అల్లాహ్ నుండి తప్పించుకో గలిగేది ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ ఏదీ లేదు. నిశ్చయంగా ఆయన సర్వజ్ఞుడు, సర్వ సమర్ధుడు.

Fatır 35:45

ఒకవేళ అల్లాహ్ మానవులను వారు చేసిన కర్మలకు గానూ పట్టుకోదలిస్తే! (భూమి) మీద ఏ ఒక్క ప్రాణిని కూడా ఆయన వదిలి పెట్టి ఉండేవాడు కాదు! నిజానికి ఆయన వారికి ఒక నియమిత సమయం వరకు గడువునిస్తున్నాడు. కాని వారి గడువు పూర్తయితే; అప్పుడు నిశ్చయంగా, అల్లాహ్ సదా తన దాసులను స్వయంగా చూసుకుంటాడు.