Lafzullah

Telugu Mokhtasar — Neml 27:1 – Ahzab 33:73

Author / source: Telugu Mokhtasar

Contents
  1. Neml 27:1
  2. Neml 27:2
  3. Neml 27:3
  4. Neml 27:4
  5. Neml 27:5
  6. Neml 27:6
  7. Neml 27:7
  8. Neml 27:8
  9. Neml 27:9
  10. Neml 27:10
  11. Neml 27:11
  12. Neml 27:12
  13. Neml 27:13
  14. Neml 27:14
  15. Neml 27:15
  16. Neml 27:16
  17. Neml 27:17
  18. Neml 27:18
  19. Neml 27:19
  20. Neml 27:20
  21. Neml 27:21
  22. Neml 27:22
  23. Neml 27:23
  24. Neml 27:24
  25. Neml 27:25
  26. Neml 27:26
  27. Neml 27:27
  28. Neml 27:28
  29. Neml 27:29
  30. Neml 27:30
  31. Neml 27:31
  32. Neml 27:32
  33. Neml 27:33
  34. Neml 27:34
  35. Neml 27:35
  36. Neml 27:36
  37. Neml 27:37
  38. Neml 27:38
  39. Neml 27:39
  40. Neml 27:40
  41. Neml 27:41
  42. Neml 27:42
  43. Neml 27:43
  44. Neml 27:44
  45. Neml 27:45
  46. Neml 27:46
  47. Neml 27:47
  48. Neml 27:48
  49. Neml 27:49
  50. Neml 27:50
  51. Neml 27:51
  52. Neml 27:52
  53. Neml 27:53
  54. Neml 27:54
  55. Neml 27:55
  56. Neml 27:56
  57. Neml 27:57
  58. Neml 27:58
  59. Neml 27:59
  60. Neml 27:60
  61. Neml 27:61
  62. Neml 27:62
  63. Neml 27:63
  64. Neml 27:64
  65. Neml 27:65
  66. Neml 27:66
  67. Neml 27:67
  68. Neml 27:68
  69. Neml 27:69
  70. Neml 27:70
  71. Neml 27:71
  72. Neml 27:72
  73. Neml 27:73
  74. Neml 27:74
  75. Neml 27:75
  76. Neml 27:76
  77. Neml 27:77
  78. Neml 27:78
  79. Neml 27:79
  80. Neml 27:80
  81. Neml 27:81
  82. Neml 27:82
  83. Neml 27:83
  84. Neml 27:84
  85. Neml 27:85
  86. Neml 27:86
  87. Neml 27:87
  88. Neml 27:88
  89. Neml 27:89
  90. Neml 27:90
  91. Neml 27:91
  92. Neml 27:92
  93. Neml 27:93
  94. Kasas 28:1
  95. Kasas 28:2
  96. Kasas 28:3
  97. Kasas 28:4
  98. Kasas 28:5
  99. Kasas 28:6
  100. Kasas 28:7
  101. Kasas 28:8
  102. Kasas 28:9
  103. Kasas 28:10
  104. Kasas 28:11
  105. Kasas 28:12
  106. Kasas 28:13
  107. Kasas 28:14
  108. Kasas 28:15
  109. Kasas 28:16
  110. Kasas 28:17
  111. Kasas 28:18
  112. Kasas 28:19
  113. Kasas 28:20
  114. Kasas 28:21
  115. Kasas 28:22
  116. Kasas 28:23
  117. Kasas 28:24
  118. Kasas 28:25
  119. Kasas 28:26
  120. Kasas 28:27
  121. Kasas 28:28
  122. Kasas 28:29
  123. Kasas 28:30
  124. Kasas 28:31
  125. Kasas 28:32
  126. Kasas 28:33
  127. Kasas 28:34
  128. Kasas 28:35
  129. Kasas 28:36
  130. Kasas 28:37
  131. Kasas 28:38
  132. Kasas 28:39
  133. Kasas 28:40
  134. Kasas 28:41
  135. Kasas 28:42
  136. Kasas 28:43
  137. Kasas 28:44
  138. Kasas 28:45
  139. Kasas 28:46
  140. Kasas 28:47
  141. Kasas 28:48
  142. Kasas 28:49
  143. Kasas 28:50
  144. Kasas 28:51
  145. Kasas 28:52
  146. Kasas 28:53
  147. Kasas 28:54
  148. Kasas 28:55
  149. Kasas 28:56
  150. Kasas 28:57
  151. Kasas 28:58
  152. Kasas 28:59
  153. Kasas 28:60
  154. Kasas 28:61
  155. Kasas 28:62
  156. Kasas 28:63
  157. Kasas 28:64
  158. Kasas 28:65
  159. Kasas 28:66
  160. Kasas 28:67
  161. Kasas 28:68
  162. Kasas 28:69
  163. Kasas 28:70
  164. Kasas 28:71
  165. Kasas 28:72
  166. Kasas 28:73
  167. Kasas 28:74
  168. Kasas 28:75
  169. Kasas 28:76
  170. Kasas 28:77
  171. Kasas 28:78
  172. Kasas 28:79
  173. Kasas 28:80
  174. Kasas 28:81
  175. Kasas 28:82
  176. Kasas 28:83
  177. Kasas 28:84
  178. Kasas 28:85
  179. Kasas 28:86
  180. Kasas 28:87
  181. Kasas 28:88
  182. Ankebut 29:1
  183. Ankebut 29:2
  184. Ankebut 29:3
  185. Ankebut 29:4
  186. Ankebut 29:5
  187. Ankebut 29:6
  188. Ankebut 29:7
  189. Ankebut 29:8
  190. Ankebut 29:9
  191. Ankebut 29:10
  192. Ankebut 29:11
  193. Ankebut 29:12
  194. Ankebut 29:13
  195. Ankebut 29:14
  196. Ankebut 29:15
  197. Ankebut 29:16
  198. Ankebut 29:17
  199. Ankebut 29:18
  200. Ankebut 29:19
  201. Ankebut 29:20
  202. Ankebut 29:21
  203. Ankebut 29:22
  204. Ankebut 29:23
  205. Ankebut 29:24
  206. Ankebut 29:25
  207. Ankebut 29:26
  208. Ankebut 29:27
  209. Ankebut 29:28
  210. Ankebut 29:29
  211. Ankebut 29:30
  212. Ankebut 29:31
  213. Ankebut 29:32
  214. Ankebut 29:33
  215. Ankebut 29:34
  216. Ankebut 29:35
  217. Ankebut 29:36
  218. Ankebut 29:37
  219. Ankebut 29:38
  220. Ankebut 29:39
  221. Ankebut 29:40
  222. Ankebut 29:41
  223. Ankebut 29:42
  224. Ankebut 29:43
  225. Ankebut 29:44
  226. Ankebut 29:45
  227. Ankebut 29:46
  228. Ankebut 29:47
  229. Ankebut 29:48
  230. Ankebut 29:49
  231. Ankebut 29:50
  232. Ankebut 29:51
  233. Ankebut 29:52
  234. Ankebut 29:53
  235. Ankebut 29:54
  236. Ankebut 29:55
  237. Ankebut 29:56
  238. Ankebut 29:57
  239. Ankebut 29:58
  240. Ankebut 29:59
  241. Ankebut 29:60
  242. Ankebut 29:61
  243. Ankebut 29:62
  244. Ankebut 29:63
  245. Ankebut 29:64
  246. Ankebut 29:65
  247. Ankebut 29:66
  248. Ankebut 29:67
  249. Ankebut 29:68
  250. Ankebut 29:69
  251. Rum 30:1
  252. Rum 30:2
  253. Rum 30:3
  254. Rum 30:4
  255. Rum 30:5
  256. Rum 30:6
  257. Rum 30:7
  258. Rum 30:8
  259. Rum 30:9
  260. Rum 30:10
  261. Rum 30:11
  262. Rum 30:12
  263. Rum 30:13
  264. Rum 30:14
  265. Rum 30:15
  266. Rum 30:16
  267. Rum 30:17
  268. Rum 30:18
  269. Rum 30:19
  270. Rum 30:20
  271. Rum 30:21
  272. Rum 30:22
  273. Rum 30:23
  274. Rum 30:24
  275. Rum 30:25
  276. Rum 30:26
  277. Rum 30:27
  278. Rum 30:28
  279. Rum 30:29
  280. Rum 30:30
  281. Rum 30:31
  282. Rum 30:32
  283. Rum 30:33
  284. Rum 30:34
  285. Rum 30:35
  286. Rum 30:36
  287. Rum 30:37
  288. Rum 30:38
  289. Rum 30:39
  290. Rum 30:40
  291. Rum 30:41
  292. Rum 30:42
  293. Rum 30:43
  294. Rum 30:44
  295. Rum 30:45
  296. Rum 30:46
  297. Rum 30:47
  298. Rum 30:48
  299. Rum 30:49
  300. Rum 30:50
  301. Rum 30:51
  302. Rum 30:52
  303. Rum 30:53
  304. Rum 30:54
  305. Rum 30:55
  306. Rum 30:56
  307. Rum 30:57
  308. Rum 30:58
  309. Rum 30:59
  310. Rum 30:60
  311. Lukman 31:1
  312. Lukman 31:2
  313. Lukman 31:3
  314. Lukman 31:4
  315. Lukman 31:5
  316. Lukman 31:6
  317. Lukman 31:7
  318. Lukman 31:8
  319. Lukman 31:9
  320. Lukman 31:10
  321. Lukman 31:11
  322. Lukman 31:12
  323. Lukman 31:13
  324. Lukman 31:14
  325. Lukman 31:15
  326. Lukman 31:16
  327. Lukman 31:17
  328. Lukman 31:18
  329. Lukman 31:19
  330. Lukman 31:20
  331. Lukman 31:21
  332. Lukman 31:22
  333. Lukman 31:23
  334. Lukman 31:24
  335. Lukman 31:25
  336. Lukman 31:26
  337. Lukman 31:27
  338. Lukman 31:28
  339. Lukman 31:29
  340. Lukman 31:30
  341. Lukman 31:31
  342. Lukman 31:32
  343. Lukman 31:33
  344. Lukman 31:34
  345. Secde 32:1
  346. Secde 32:2
  347. Secde 32:3
  348. Secde 32:4
  349. Secde 32:5
  350. Secde 32:6
  351. Secde 32:7
  352. Secde 32:8
  353. Secde 32:9
  354. Secde 32:10
  355. Secde 32:11
  356. Secde 32:12
  357. Secde 32:13
  358. Secde 32:14
  359. Secde 32:15
  360. Secde 32:16
  361. Secde 32:17
  362. Secde 32:18
  363. Secde 32:19
  364. Secde 32:20
  365. Secde 32:21
  366. Secde 32:22
  367. Secde 32:23
  368. Secde 32:24
  369. Secde 32:25
  370. Secde 32:26
  371. Secde 32:27
  372. Secde 32:28
  373. Secde 32:29
  374. Secde 32:30
  375. Ahzab 33:1
  376. Ahzab 33:2
  377. Ahzab 33:3
  378. Ahzab 33:4
  379. Ahzab 33:5
  380. Ahzab 33:6
  381. Ahzab 33:7
  382. Ahzab 33:8
  383. Ahzab 33:9
  384. Ahzab 33:10
  385. Ahzab 33:11
  386. Ahzab 33:12
  387. Ahzab 33:13
  388. Ahzab 33:14
  389. Ahzab 33:15
  390. Ahzab 33:16
  391. Ahzab 33:17
  392. Ahzab 33:18
  393. Ahzab 33:19
  394. Ahzab 33:20
  395. Ahzab 33:21
  396. Ahzab 33:22
  397. Ahzab 33:23
  398. Ahzab 33:24
  399. Ahzab 33:25
  400. Ahzab 33:26
  401. Ahzab 33:27
  402. Ahzab 33:28
  403. Ahzab 33:29
  404. Ahzab 33:30
  405. Ahzab 33:31
  406. Ahzab 33:32
  407. Ahzab 33:33
  408. Ahzab 33:34
  409. Ahzab 33:35
  410. Ahzab 33:36
  411. Ahzab 33:37
  412. Ahzab 33:38
  413. Ahzab 33:39
  414. Ahzab 33:40
  415. Ahzab 33:41
  416. Ahzab 33:42
  417. Ahzab 33:43
  418. Ahzab 33:44
  419. Ahzab 33:45
  420. Ahzab 33:46
  421. Ahzab 33:47
  422. Ahzab 33:48
  423. Ahzab 33:49
  424. Ahzab 33:50
  425. Ahzab 33:51
  426. Ahzab 33:52
  427. Ahzab 33:53
  428. Ahzab 33:54
  429. Ahzab 33:55
  430. Ahzab 33:56
  431. Ahzab 33:57
  432. Ahzab 33:58
  433. Ahzab 33:59
  434. Ahzab 33:60
  435. Ahzab 33:61
  436. Ahzab 33:62
  437. Ahzab 33:63
  438. Ahzab 33:64
  439. Ahzab 33:65
  440. Ahzab 33:66
  441. Ahzab 33:67
  442. Ahzab 33:68
  443. Ahzab 33:69
  444. Ahzab 33:70
  445. Ahzab 33:71
  446. Ahzab 33:72
  447. Ahzab 33:73

Neml 27:1

(طسٓ) తా-సీన్ .సూరతుల్ బఖరా ఆరంభంలో వీటి సారూప్యంపై చర్చ జరిగినది. మీపై అవతరింపబడిన ఈ ఆయతులు ఖుర్ఆన్ యొక్క,ఎటువంటి గందరగోళం లేని ఒక స్పష్టమైన గ్రంధం యొక్క ఆయతులు. అందులో యోచన చేసేవాడు అది అల్లాహ్ వద్ద నుండి అని తెలుసుకుంటాడు.

Neml 27:2

ఈ ఆయతులు సత్యం వైపు మార్గదర్శకత్వం చేసి దానివైపు దారి చూపేవి. మరియు అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్తల పట్ల విశ్వాసమును కనబరిచే వారికి శుభవార్తనిచ్చేవి.

Neml 27:3

వారు నమాజును పరిపూర్ణ పధ్ధతిలో పాటిస్తారు. మరియు వారు తమ సంపదల జకాత్ విధి దానమును తీసి వాటిని ఇవ్వవలసిన చోట ఇస్తారు. మరియు వారే పరలోకంలో ఉన్న పుణ్యమును మరియు శిక్షను నమ్ముతారు.

Neml 27:4

నిశ్ఛయంగా పరలోకము పై మరియు అందులో ఉన్న పుణ్యము,శిక్షను విశ్వసించని అవిశ్వాసపరుల కొరకు మేము వారి దుష్కర్మలను మంచిగా చేసి చూపించాము. అప్పుడు వారు వాటిని చేయటం వెనుక పడి ఉన్నారు. వారు అయోమయంలో పడి సరైన మార్గమును గాని ఋజు మార్గమును గాని పొందలేరు.

Neml 27:5

ప్రస్తావించబడిన వాటి ద్వారా వర్ణించబడిన వీరందరు వారే వారి కొరకు ఇహ లోకంలో హతమార్చటం,ఖైదీ చేయటం ద్వారా చెడ్డ శిక్ష ఉన్నది. మరియు వారిలో నుంచి చాలా మంది పరలోకంలో నష్టములో ఉంటారు. అక్కడ వారు స్వయంగా,వారి ఇంటి వారు ప్రళయదినాన నరకాగ్నిలో శాస్వతంగా పడవేయబడే నష్టమును చవిచూస్తారు.

Neml 27:6

ఓ ప్రవక్తా నిశ్చయంగా నీవు నీపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ను తన సృష్టించటంలో,తన పర్యాలోచనలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడైన,తన దాసుల యొక్క ప్రయోజనాల్లో నుండి ఏదీ తనకు గోప్యంగా లేని జ్ఞానవంతుడి వద్ద నుండి పొందుతావు.

Neml 27:7

ఓ ప్రవక్తా మీరు మూసా అలైహిస్సలాం తన ఇంటి వారితో ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి : నిశ్చయంగా నేను అగ్నిని చూశాను. నేను దాని నుండి దాన్ని వెలిగించిన వాడి ఏదైన సమా చారమును మీ వద్దకు తీసుకుని వస్తాను అతను మనకు మార్గమును చూపిస్తాడు. లేదా దాని నుండి అగ్ని కొరవిని మీరు దానితో చలి నుండి వేడిని పొందుతారని ఆశిస్తూ మీ వద్దకు తీసుకుని వస్తాను.

Neml 27:8

ఎప్పుడైతే ఆయన (మూసా అలైహిస్సలాం) చూసిన అగ్ని ఉన్న ప్రదేశమునకు చేరుకున్నారో అల్లాహ్ ఆయనను పిలిచి ఇలా పలికాడు : ఈ అగ్నిలో ఉన్న వాడు మరియు దాని పరిసరాల్లో ఉన్న దైవ దూతలు పరిశుద్ధులు. మరియు సర్వలోకాల ప్రభువు కొరకు గౌరవంగా, మార్గ భ్రష్టులు వర్ణిస్తున్న గుణాలు ఏవైతే ఆయనకు తగవో వాటి నుండి ఆయన పరిశుద్ధుడు.

Neml 27:9

అల్లాహ్ ఆయనతో ఇలా పలికాడు : ఓ మూసా నిశ్ఛయంగా నేనే ఎవరూ ఓడించని సర్వ శక్తివంతుడైన, నా సృష్టించటంలో,నా తఖ్దీర్ లో,నా ధర్మ శాసనంలో వివేకవంతుడైన అల్లాహ్ ను.

Neml 27:10

మరియు మీరు మీ చేతి కర్రను వేయండి. అప్పుడు మూసా అలాగే చేశారు. ఎప్పుడైతే మూసా దాన్ని పాములా చలించినట్లుగా,కదలినట్లుగా చూశారో దాని నుండి వెనుకకు తిరిగి మరలకుండా పరిగెత్తారు. అప్పుడు అల్లాహ్ ఆయనతో ఇలా పలికాడు : మీరు దానితో భయపడకండి. నిశ్ఛయంగా నా వద్ద ప్రవక్తలు ఏ పాముతో గాని వేరేవాటితో గాని భయపడరు.

Neml 27:11

కాని ఎవరైన ఏదైన పాపమునకు పాల్పడి తన స్వయంపై హింసకు పాల్పడి ఆ తరువాత పశ్ఛాత్తాప్పడితే అప్పుడు నేను అతనిని మన్నించే వాడును,అతనిపై కనికరించే వాడును.

Neml 27:12

మరియు మీరు మీ చేతిని మెడకు క్రింద మీ చొక్కా యొక్క తెరిచి ఉన్న ప్రదేశంలో ప్రవేశింపజేయండి. దాన్ని మీరు ప్రవేశింపజేసిన తరువాత అది బొల్లి రోగం కాకుండా మంచు వలే బయటకు వచ్చును. మీ నిజాయితీ గురించి సాక్ష్యమిచ్చే తొమ్మిది మహిమలను ఫిర్ఔన్ వద్దకు చేర్చండి. అవి చేతితో పాటు చేతి కర్ర, అనావృష్టి,ఫలాల తగ్గుదల,తూఫాను,మిడతలు,నల్లులు,కప్పలు,రక్తము. నిశ్ఛయంగా వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి అల్లాహ్ విధేయత నుండి వైదొలగిన జనులు అయిపోయారు.

Neml 27:13

ఎప్పుడైతే మేము మూసాకు మద్దతిచ్చిన స్పష్టమైన,బహిర్గతమైన మా ఈ ఆయతులు వారి వద్దకు వచ్చాయో వారు మూసా తీసుకుని వచ్చిన ఈ ఆయతులు స్పష్టమైన మంత్రజాలము అని అన్నారు.

Neml 27:14

అవి అల్లాహ్ వద్ద నుండి అని వారి మనస్సులు అంగీకరించినా వారు ఈ స్పష్టమైన సూచనలను తమ దుర్మార్గము వలన,సత్యము నుండి తమ అహంకారము వలన వాటిని తిరస్కరించారు. మరియు వాటిని అంగీకరించలేదు. ఓ ప్రవక్తా మీరు భూమిలో తమ అవిశ్వాసము,తమ పాప కార్యముల వలన అల్లకల్లోలాలను సృష్టించే వారి పరిణామము ఏవిధంగా ఉంటుందో యోచన చేయండి. నిశ్ఛయంగా మేము వారిని తుదిముట్టించాము. మరియు మేము వారందరిని నాశనం చేశాము.

Neml 27:15

నిశ్ఛయంగా మేము దావూదు,అతని కుమారుడు సులైమానుకు జ్ఞానమును ప్రసాదించాము. పక్షులతో మాట్లాడటం అందులో నుంచే. మరియు దావూదు,సులైమాను అల్లాహ్ అజ్జవజల్ల కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలా పలికారు : ఎవరైతే మాకు విశ్వాసపరులైన తన దాసుల్లోంచి చాలా మందిపై దైవ దౌత్యము ద్వారా,జిన్నులను,షైతానులను ఆదీనంలో చేయటం ద్వారా ప్రాముఖ్యతను ప్రసాదించాడో ఆ అల్లాహ్ కొరకే స్థుతులన్నీ.

Neml 27:16

మరియు సులైమాను తన తండ్రి దావూదుకు దైవ దౌత్యంలో,జ్ఞానములో, అధికారములో వారసుడయ్యాడు. మరియు ఆయన తనపై,తన తండ్రిపై గల అల్లాహ్ అనుగ్రహాలను వివరిస్తూ ఇలా పలికాడు : ఓ ప్రజలారా అల్లాహ్ మనకు పక్షుల శబ్దముల అర్ధమును నేర్పాడు. మరియు ప్రవక్తలకు,రాజులకు ప్రసాదించిన ప్రతీ వస్తువును ఆయన మాకు ప్రసాదించాడు. నిశ్ఛయంగా పరిశుద్ధుడైన అల్లాహ్ మాకు ప్రసాదించినది ఇది స్పష్టమైన,బహిర్గతమైన అనుగ్రహము.

Neml 27:17

సులైమాను కొరకు మానవుల్లోంచి,జిన్నల్లోంచి,పక్షుల్లోంచి అతని సైన్యములు సేకరించబడినవి. వారు ఒక పధ్ధతితో నడపబడేవారు.

Neml 27:18

అప్పుడు వారు క్రమంగా నడిపించబడుతూనే ఉన్నారు చివరకు వారు నమల్ లోయ (సిరియాలోని ఒక ప్రాంతము) వద్దకు రావంగానే ఒక చీమ చీమలతో ఇలా పలికింది : ఓ చీమల్లారా మీరు సులైమాను,అతని సైన్యములు వారు మిమ్మల్ని చూడకుండా నాశనం చేయకుండా ఉండటానికి మీ నివాసముల్లో ప్రవేశించండి. ఒక వేళ వారు మిమ్మల్ని గుర్తిస్తే వారు ఎన్నటికీ మిమ్మల్ని కాళ్ళ క్రింద తొక్కరు.

Neml 27:19

ఎప్పుడైతే సులైమాను వారి మాటలు విన్నారో వారి మాటలపై చిరునవ్వు నవ్వారు. మరియు పరిశుద్ధుడైన తన ప్రభువును వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు నాకు,నా తల్లిదండ్రులకు అనుగ్రహించిన అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుకునే వాడిగా నాకు భాగ్యమును కలిగించు,దివ్య జ్ఞానమును కలిగించు. మరియు నీవు సంతుష్ట చెందే సత్కార్యమును నేను చేసే విధంగా నాకు అనుగ్రహించు. మరియు నీవు నన్ను నీ కారుణ్యము ద్వారా నీ పుణ్య దాసులందరిలో చేర్చు.

Neml 27:20

సులైమాను పక్షులను పరిశీలిస్తే ఆయనకు హుద్ హుద్ పక్షి (వడ్రంగి పిట్ట) కనబడలేదు. అప్పుడు ఆయన నాకేమయ్యింది నేను హుద్ హుద్ పక్షిని చూడటం లేదే ?. ఏమీ ఏదైన ఆటంకము దాన్ని చూడటం నుండి నన్ను ఆపినదా లేదా అది అదృశ్యమయ్యే వారిలోంచి అయిపోయినదా ? అని అన్నారు.

Neml 27:21

ఎప్పుడైతే ఆయనకు దాని అదృశ్యమవటం బహిర్గతం అయినదో ఆయన ఇలా పలికారు : దాని అదృశ్యమవటంపై దానికి శిక్షగా నేను తప్పకుండా దాన్ని కఠినంగా శిక్షిస్తాను లేదా దాన్ని కోసివేస్తాను లేదా అది అదృశ్యమైన విషయంలో తన కారణమును స్పష్టపరిచే స్పష్టమైన ఆధారమును నా వద్దకు తీసుకుని రావాలి.

Neml 27:22

అప్పుడు హుద్ హుద్ తన అదృశ్యమవటంలో చాలా సేపు ఉండ లేదు. ఎప్పుడైతే అది వచ్చినదో సులైమాన్ అలైహిస్సలాం తో ఇలా పలికింది : మీకు తెలియని ఒక విషయం నాకు తెలిసినది. మరియు నేను సబా వాసుల వద్ద నుండి మీ వద్దకు ఎటువంటి సందేహం లేని నిజమైన ఒక వార్తను తీసుకుని వచ్చాను.

Neml 27:23

నిశ్ఛయంగా వారిపై పరిపాలన చేస్తుండగా నేను ఒక స్త్రీను చూశాను. మరియు ఆ స్త్రీ బలము,అధికారము యొక్క కారకముల్లోంచి ప్రతీది ఇవ్వబడినది. మరియు ఆమెకు ఒక పెద్ద సింహాసనం కలదు. అక్కడ నుంచి ఆమె తన జాతి వారి యొక్క వ్యవహారాలను నడిపిస్తుంది.

Neml 27:24

నేను ఆ స్త్రీని,ఆమె జాతివారిని మహోన్నతుడైన, పరిశుద్ధుడైన అల్లాహ్ ను వదిలి సూర్యుడిని సాష్టాంగపడుతుండగా చూశాను. మరియు షైతాను వారి కొరకు వారు దేనిపైనైతే ఉన్నారో షిర్కు కార్యాలను,పాప కార్యాలను మంచిగా చేసి చూపించాడు. వారిని సత్య మార్గము నుండి మరలింపజేశాడు. అయితే వారు దాని వైపునకు మార్గం పొందలేరు.

Neml 27:25

షైతాను వారి కొరకు షిర్కు కార్యాలను,పాప కార్యాలను వారు ఆకాశములో ఆయన దాచిన వర్షము,భూమిలోని మొక్కలను వెలికి తీసేవాడైన ఒక్కడైన అల్లాహ్ కు సాష్టాంగ పడకుండా చేయటానికి మంచిగా చేసి చూపించాడు. మరియు ఆయన మీరు గోప్యంగా ఉంచే కర్మలను మరియు మీరు బహిర్గతం చేసే వాటిని తెలుసుకుంటాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.

Neml 27:26

అల్లాహ్ ఆయన కాకుండా వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు. ఆయనే మహోన్నతమైన సింహాసనమునకు అధిపతి.

Neml 27:27

సులైమాను అలైహిస్సలాం హుద్ హుద్ తో ఇలా పలికారు : నీవు వాదిస్తున్న విషయంలో నిజం పలుకుతున్నావో లేదా నీవు అబద్దాలు పలికే వారిలోంచి వాడవో మేము వేచి చూస్తాము.

Neml 27:28

అప్పుడు సులైమాను అలైహిస్సలాం ఒక ఉత్తరాన్ని రాసి దాన్ని హుద్ హుద్ కు అప్పజెప్పి ఇలా ఆదేశించారు : నీవు నా ఈ ఉత్తరాన్ని తీసుకునిపోయి సబా వాసుల వద్ద పడవేసి వారికి దాన్ని అప్పజెప్పు. మరియు నీవు వారి నుండి ఒక వైపునకు దాని గురించి వారు ఏమి అనుకుంటున్నారో వింటూ ఉన్నట్లుగా జరుగు.

Neml 27:29

రాణి ఉత్తరమును స్వీకరించింది. మరియు ఆమె ఇలా పలికింది : ఓ గౌరవనీయులైన వారా నిశ్చయంగా నా వద్దకు ఒక గౌరవప్రధమై, మహోన్నతమైన ఉత్తరం పంపించబడింది.

Neml 27:30

సులైమాను వద్ద నుండి పంపించబడిన ఈ ఉత్తరం యొక్క అంశము బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీంతో ఆరంభం చేమబడినది.

Neml 27:31

మీరు అహంకారమును చూపకండి. మరియు నేను మీకు అల్లాహ్ ఏకత్వము వైపునకు ,మీరు ఉన్న షిర్కు ఆయనతో పాటు మీరు సూర్యుడిని ఆరాధించినప్పుడు చేసిన దాన్ని విడనాడటం వైపునకు దాన్ని అంగీకరిస్తూ ,విధేయత చూపుతూ నా వద్దకు రండి.

Neml 27:32

రాణి ఇలా పలికినది : ఓ నాయకులారా,గొప్పవారా నా విషయంలో సరైన పధ్దతిని నాకు మీరు స్పష్టపరచండి. నేను ఏదైన విషయంలో మీరు నా వద్ద హాజరు అయ్యి అందులో మీ అభిప్రాయమును వ్యక్తపరచేంతవరకు తీర్పునివ్వను.

Neml 27:33

ఆమె జాతి నాయకులు ఆమెతో ఇలా పలికారు : మేము అధిక బలం కలవారము. మరియు యుద్దంలో పరాక్రమ వంతులం. మరియు అభిప్రాయము నీవు చెప్పినదే అయితే నీవు చూడు నీవు మాకు ఏది ఆదేశించదలచావో అప్పుడు మేము దాన్ని పూర్తి చేయటానికి సామర్ధ్యం కలవారము.

Neml 27:34

రాణి ఇలా పలికింది : నిశ్చయంగా రాజులు గ్రామాల్లోంచి ఏదైన గ్రామంలో ప్రవేశిస్తే అందులో హత్యాకాండను,గుంజుకోవటమును,దోచుకోవటమును నెలకొల్పి దాన్ని పాడు చేస్తారు. అక్కడి నాయకులను,గొప్పవారిని వారు మర్యాద,బలము కలవారై ఉండినా కూడా అవమానపాలు చేస్తారు. మరియు రాజులు ఏ గ్రామ వాసులను జయించినప్పుడు హృదయముల్లో భయాందోళనలను నాటటానికి ఎల్లప్పుడు ఇదేవిధంగా చేస్తారు.

Neml 27:35

మరియు నిశ్ఛయంగా నేను సందేశం పంపించిన వ్యక్తి,అతని జాతి వారి వద్దకు ఒక కానుకను పంపిస్తాను. ఆతరువాత ఈ కానుకను పంపిన తరువాత దూతలు ఏమి తెస్తారో వేచి చూస్తాను.

Neml 27:36

ఎప్పుడైతే ఆమె దూత,అతనితో పాటు అతని సహాయకులు కానుకను తీసుకుని సులైమాన్ అలైహిస్సలాం వద్దకు వచ్చినప్పుడు సులైమాన్ అలైహిస్సలాం వారు కానుకను పంపటం నుండి ఇలా పలుకుతూ నిరాకరించారు : ఏమీ మీ నుండి నన్ను మరల్చటానికి మీరు నాకు ధనం ద్వారా సహాయం చేస్తారా ?. నాకు అల్లాహ్ ప్రసాదించినటువంటి దైవ దౌత్యం,రాజరికము,ధనము మీకు ప్రసాదించిన వాటికంటే మేలైనది. అంతే కాక మీరు మీకు కానుకగా ఇవ్వబడిన ప్రాపంచిక శిధిలాల నుండి సంతోషపడండి.

Neml 27:37

సులైమాను అలైహిస్సలాం ఆమె దూతతో ఇలా పలికారు : నీవు తీసుకుని వచ్చిన కానుకను తీసుకుని వారి వైపునకు మరలి వెళ్ళిపో. మేము తప్పకుండా ఆమె వద్దకు,ఆమె జాతి వారి వద్దకు సైన్యాలను తీసుకుని వస్తాము వారిని ఎదుర్కొనే శక్తి వారికి ఉండదు. మరియు ఒక వేళ వారు విధేయులై నా వద్దకు రాకపోతే మేము వారిని సబా ప్రాంతము నుండి వారు అందులో గౌరవం కలవారై ఉండిన తరువాత కూడా వారిని అవమానమునకు,పరాభవమునకు లోనైన స్థితిలో వెళ్ళగొడతాము.

Neml 27:38

సులైమాను అలైహిస్సలాం తన రాజ్యపు సహాయకులను ఉద్దేశించి ఇలా పలికారు : ఓ నాయకుల్లారా వారు నావద్దకు విధేయులై రాక ముందే ఆమె రాజ్య సింహాసనమును మీలో నుండి ఎవరు నా వద్దకు తీసుకుని వస్తారు ?.

Neml 27:39

జిన్నుల్లోంచి తలబిరుసైన ఒకడు ఇలా పలుకుతూ ఆయనకు సమాధానమిచ్చాడు : మీరు ఉన్న మీ కూర్చున్న చోటు నుండి మీరు లేవక ముందే ఆమె సింహాసనమును నేను మీ వద్దకు తీసుకుని వస్తాను. మరియు నేను దాన్ని ఎత్తుకోవటంలో బలవంతుడిని,దానిలో ఉన్న వాటి విషయాల్లో నీతిమంతుడిని. అందులో నుండి నేను ఏమీ తగ్గించను.

Neml 27:40

సులైమాన్ వద్ద ఉన్న ఒక పుణ్యాత్ముడైన జ్ఞాని పలికాడు,అతని వద్ద గ్రంధ జ్ఞానము కలదు,అతని ఆదీనములో అల్లాహ్ యొక్క గొప్ప నామము ఉన్నది దాని ద్వారా అతడు పిలవబడితే అతను సమాధానమిస్తాడు : మీరు కను రెప్ప వేయక ముందే ఆమె సింహాసమును మీ వద్దకు నేను తీసుకుని వస్తాను. అల్లాహ్ తో నేను దుఆ చేస్తే ఆయన దాన్ని తీసుకుని వస్తాడు. అప్పుడు అతడు దుఆ చేస్తే అల్లాహ్ అతని దుఆను స్వీకరించాడు. సులైమాన్ అలైహిస్సలాం ఎప్పుడైతే ఆమె సింహాసనమును తన వద్ద ఉండటంను చూశారో ఇలా పలికారు : ఇది పరిశుద్ధుడైన నా ప్రభువు అనుగ్రహము నేను ఆయన అనుగ్రహమునకు కృతజ్ఞత తెలుపుతానా లేదా కృతఘ్నుడవుతానా ? నన్ను ఆయన పరీక్షించటానికి. మరియు ఎవరైతే అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటాడో అతని కృతజ్ఞత లాభము అతని వైపు మరలుతుంది. అల్లాహ్ స్వయం సమృద్ధుడు దాసుల కృతజ్ఞత ఆయనకు అధికం చేయదు. మరియు ఎవరైతే అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరిస్తాడో అతడే ఆయనకు వాటిపై కృతజ్ఞతలు తెలుపుకోడు ఎందుకంటే నా ప్రభువు అతని కృతజ్ఞల అవసరం లేని వాడు,ఉదారమైన వాడు. వాటిని (అనుగ్రహాలను) తిరస్కరించేవారికి ఆయన అనుగ్రహించటం ఆయన ఉదారత్వం లోనిదే.

Neml 27:41

సులైమాన్ అలైహిస్సలాం ఆదేశించారు : మీరు రాణి సంహాసనమును దాని రూపు రేఖలను ఏవైతే ఆమె వద్ద అది ఉన్నప్పుడు ఉన్నవో మార్చివేయండి. మేము చూద్దాం ఆమె అది తన సింహాసనం అని గుర్తించటం వైపునకు మార్గం పొందుతుందా లేదా తమ వస్తువులను గుర్తించటం వైపు మార్గం పొందని వారిలోంచి అయిపోతుందా ?.

Neml 27:42

ఎప్పుడైతే సబా రాణి సులైమాన్ అలైహిస్సలాం వద్దకు వచ్చినదో ఆమెను పరీక్షించటానికి ఆమెతో ఇలా పలకబడింది : ఏమీ ఇది నీ సింహాసనంలా ఉన్నదా ?. అది దాని మాదిరిగా ఉన్నదని ఆమె ప్రశ్న ఎలా ఉన్నదో జవాబు అలాగే ఇచ్చినది. అప్పుడు సులైమాన్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు : అల్లాహ్ మాకు ఈమె కన్న ముందు తన సామర్ధ్యంతో ఈ విషయాల్లాంటి వాటి పట్ల జ్ఞానమును ప్రసాదించాడు. మరియు మేము అల్లాహ్ ఆదేశమునకు కట్టుబడి ఆయనకు విధేయులమై ఉన్నాము.

Neml 27:43

ఆమె తన జాతి వారిని అనుసరించి, వారిని అనుకరించి అల్లాహ్ ను వదిలి వేటినైతే ఆరాధించినదో అవి ఆమెను అల్లాహ్ ఏకత్వము నుండి మరల్చినవి. నిశ్ఛయంగా ఆమె అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే ప్రజల్లోంచి అయిపోయినది. ఆమె కూడా వారిలా అవిశ్వాసపరురాలైపోయింది.

Neml 27:44

ఆమెతో ఇలా అనబడింది : నీవు రాజభవనంలోకి ప్రవేశించు. అది ఉపరితలం రూపంలా ఉన్నది. ఆమె దాన్ని చూసినప్పుడు దాన్ని నీటిగా భావించి అందులో దిగటానికి తన వస్త్రములను పిక్కలపై నుండి తొలగించుకుంది. అప్పుడు సులైమాన్ అలైహిస్సలాం ఆమెతో ఇది గాజుతో మృదువుగా చేయబడిన భవనం అని అన్నారు. మరియు ఆమెను ఇస్లాం వైపునకు పిలిచారు.అప్పుడు ఆమె ఆయన దేని వైపునకు పిలిచారో దాన్ని ఇలా పలుకుతూ స్వీకరించింది : ఓ నా ప్రభువా నేను నీతోపాటు ఇతరులను ఆరాధించి నా పై హింసకు పాల్పడ్డాను. మరియు నేను సులైమానుతోపాటు సృష్టితాలన్నింటి ప్రభువు అల్లాహ్ కు విధేయులిని అవుతాను.

Neml 27:45

మరియు నిశ్ఛయంగా మేము సమూద్ వద్దకు బంధుత్వములో వారి సోదరుడైన సాలిహ్ అలైహిస్సలాం ను మీరు ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించండి అని సందేశముతో పంపాము. వారికి ఆయన పిలుపు తరువాత రెండు వర్గాలుగా అయిపోయారు : ఒక వర్గము విశ్వాసపరులది ఇంకొకటి అవిశ్వాసపరులది వారిలో ఎవరు సత్యంపై ఉన్నారో అని పరస్పరం తగాదా పడ్డారు.

Neml 27:46

సాలిహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : మీరు ఎందుకు కారుణ్యము కన్న ముందు శిక్షను తొందరపెడుతున్నారు ?. ఎందుకని మీరు మీ పాపముల కొరకు అల్లాహ్ తో మన్నింపును ఆయన మీపై దయ చూపుతాడని ఆశిస్తూ వేడుకోరు.

Neml 27:47

అతనితో అతని జాతివారు సత్యము నుండి మొండితనమును చూపిస్తూ ఇలా పలికారు : మేము నీతో,నీతోపాటు ఉన్న విశ్వాసపరులతో అపశకునమును పొందాము. సాలిహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : మీకు ఇష్టం లేనివి మీకు కలగటం వలన మీరు అపశకునం గురించి దూషిస్తున్నారు. దాని జ్ఞానము అల్లాహ్ వద్ద ఉన్నది అందులో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. అంతేకాదు మీకు కలిగిన మేలు ద్వారా,మీకు సంభవించిన చెడు ద్వారా మీరు పరీక్షంపబడే జనులు మీరు.

Neml 27:48

మరియు హిజ్ర్ నగరంలో తొమ్మిది మంది అవిశ్వాసం,పాపకార్యముల ద్వారా భూమిలో అరాచకాలను సృష్టించేవారు. మరియు వారు అందులో విశ్వాసము ద్వారా,సత్కర్మ ద్వారా సంస్కరణ చేసేవారు కాదు.

Neml 27:49

వారిలోని కొందరు కొందరితో ఇలా పలికారు : మీలో నుండి ప్రతి ఒక్కరు మేము ఒక రాత్రి అతను ఇంటిలో ఉన్నప్పుడు అతని వద్దకు వచ్చి వారందరిని హతమార్చేస్తాము అని అల్లాహ్ పై ప్రమాణం చేయాలి. ఆ తరువాత అతని సంరక్షకుడితో మేము ఇలా చెబుతాము : సాలిహ్,అతని ఇంటివారి హత్య సమయంలో మేము లేము. మరియు నిశ్ఛయంగా మేము చెబుతున్న దానిలో సత్యవంతులము.

Neml 27:50

మరియు వారు సాలిహ్,అతన్ని అనుసరించిన విశ్వాసపరులను తుదిముట్టించటానికి రహస్యంగా కుట్రలు పన్నారు. మరియు మేము కూడా ఆయనకు సహాయం కొరకు,వారి కుట్ర నుండి ఆయనను రక్షించటం కొరకు అతని జాతి వారిలో నుండి అవిశ్వాసపరులను తుదిముట్టించటానికి వ్యూహం రచించాము. అది వారికి తెలియదు.

Neml 27:51

ఓ ప్రవక్తా మీరు వారి కుట్రల,కుతంత్రాల పరిణామం ఏమయిందో దీర్ఘంగా ఆలోచించండి ?. నిశ్చయంగా మేము వారిని మా వద్ద నుండి శిక్ష ద్వారా కూకటి వేళ్ళతో పెకిలించాము అప్పుడు వారు వారి చివరి వరకు నాశనం అయిపోయారు.

Neml 27:52

ఇవి వారి ఇండ్లు వాటి గోడలు వాటి పై కప్పుల సమేతంగా శిధిలమైపోయినవి. మరియు అవి వాటి యజమానుల నుండి వారి దుర్మార్గము వలన ఖాళీగా ఉండిపోయినవి. నిశ్ఛయంగా వారి దుర్మార్గము వలన వారికి సంభవించిన శిక్షలో విశ్వసించే జనులకు గుణపాఠం ఉన్నది. వారే సూచనలతో గుణపాఠం నేర్చుకుంటారు.

Neml 27:53

మరియు సాలిహ్ అలైహిస్సలాం జాతి వారిలో నుండి అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచిన వారిని మేము కాపాడాము. మరియు వారు అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ ఆయన భీతిని కలిగి ఉంటారు.

Neml 27:54

ఓ ప్రవక్తా మీరు లూత్ అలైహిస్సలాం తన జాతి వారిని మందలిస్తూ,వారిని నిరాకరిస్తూ ఇలా పలికిన వైనమును గుర్తు చేసుకోండి : ఏమీ మీరు మీ సభల్లో బహిరంగంగా ఒకరిని ఒకరు చూస్తుండంగా అసహ్యకరమైన కార్యము స్వలింగ సంపర్కముకు పాల్పడుతున్నారా ?.

Neml 27:55

మీరు ఆడవారిని వదిలి మగవారి వద్దకు కామవాంచతో వస్తున్నారేమిటి. మీరు పవిత్రతను,సంతానమును కోరుకోవటం లేదు. కేవలం జంతువుల్లా కామవాంచను తీర్చుకోవటమే. అంతే కాదు మీపై అనివార్యమైన విశ్వాసమును,పరిశుద్ధతను,పాపకార్యముల నుండి దూరమును తెలియని మూర్ఖ జనం మీరు.

Neml 27:56

అతని జాతి వారి వద్ద జవాబుగా వారి ఈ మాటలు తప్ప ఇంకేమి లేదు : మీరు లూత్ పరివారమును మీ ఊరి నుండి వెళ్ళగొట్టండి. నిశ్ఛయంగా వారు మాలిన్యాల నుండి,చెడుల నుండి పవిత్రతను కొనియాడుకునే జనం. వారు ఇదంత వారు పాల్పడే అశ్లీల కార్యాల్లో వారికి పాలుపంచుకోని వారైన లూత్ పరివారంపై హేళనగా మాట్లాడేవారు. అంతే కాదు వారు (లూత్ పరివారము) దాన్ని పాల్పడటమును వారిపై (లూత్ జాతి) కూడా ఇష్టపడేవారు కాదు.

Neml 27:57

అప్పుడు మేము అతనిని రక్షించాము,అతని పరివారమును రక్షించాము. కాని అతని భార్య ఆమె నాశనమయ్యే వారిలోంచి అయిపోవటానికి శిక్షలో ఉండిపోయే వారిలో ఆమె అయిపోవటమును మేము ఆమెపై నిర్ణయించాము.

Neml 27:58

మరియు మేము వారిపై ఆకాశము నుండి రాళ్ళను కురిపించాము. అప్పుడు అది శిక్ష ద్వారా భయపెట్టబడిన వారి కొరకు చెడ్డ వర్షంగా నాశనం చేసేదిగా అయిపోయింది. మరియు వారు స్పందించలేదు.

Neml 27:59

ఓ ప్రవక్తా వారితో అనండి : ప్రశంసలన్నీ అల్లాహ్ కే శోభిస్తాయి. ఆయన అనుగ్రహాల వలన,లూత్ అలైహిస్సలాం జాతి శిక్షించబడిన ఆయన శిక్ష నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులకు ఆయన తరపు నుండి రక్షణ కల్పించటం వలన. ప్రతీ వస్తువు యొక్క అధికారం తన చేతిలో ఉన్న వాస్తవ ఆరాధ్య దైవమైన అల్లాహ్ మేలా లేదా ఎటవంటి లాభం కలిగించటం గాని నష్టం కలిగించే అధికారం లేని వారిని ఆరాధ్య దైవాలుగా ముష్రికులు ఆరాధించేవి మేలా ?.

Neml 27:60

ఓ ప్రజలారా పూర్వ నమూనా లేకుండా ఆకాశములను,భూమిని సృష్టించిన వాడెవడు,మీ కొరకు ఆకాశము నుండి వర్షపు నీటిని కురిపించినదెవరు ?. అప్పుడు మేము దాని ద్వారా మీ కొరకు మనోహరమైన,అందమైన తోటలను మొలకెత్తించాము. ఆ తోటల వృక్షములను మొలకెత్తించటం మీకు సాధ్యం కాదు ఎందుకంటే దాని శక్తి మీకు లేదు. అల్లాహ్ యే వాటిని మొలకెత్తించాడు. ఏమీ అల్లాహ్ తో పాటు దీన్ని చేసే ఎవరైన ఆరాధ్య దైవం ఉన్నాడా ?. లేడు కాని వారు సత్యము నుండి మరలిపోయే జనులు. వారు సృష్టి కర్తను సృష్టితో దుర్మార్గంగా సమానం చేస్తున్నారు.

Neml 27:61

భూమిని స్థిరంగా,దానిపై ఉన్న వారితో అది కదలకుండా నిలకడగా ఉన్నట్లు చేసినదెవరు ?. మరియు దాని లోపల నుండి కాలువలను ప్రవహించే విధంగా చేసినదెవరు ?. మరియు దాని కొరకు స్థిరమైన పర్వతాలను చేసినదెవరు ?. మరియు ఉప్పు నీటి,తీపి నీటి మధ్య ఉప్పు నీరు తీపి నీటితో కలిసిపోయి పాడై త్రాగటానికి అనుకూలం కాని విధంగా కాకుండా ఉండటానికి అడ్డు తెరను ఏర్పరచినదెవరు ?. ఏమీ అల్లాహ్ తో పాటు దీన్ని చేసే ఎవరైన ఆరాధ్య దైవమున్నాడా ?. లేడు కాని వారిలో చాలా మందికి తెలియదు. ఒక వేళ వారికి తెలిస్తే వారు అల్లాహ్ తో పాటు ఆయన సృష్టితాల్లో నుంచి ఎవరినీ సాటి కల్పించే వారు కాదు.

Neml 27:62

ఎవరిపైననైన అతని వ్యవహారము ఇబ్బందిగా మారి,కష్టంగా అయినప్పుడు ఆయనను అతడు వేడుకుంటే అతని వేడుకను స్వీకరించి మానవునిపై వాటిల్లిన రోగము,పేదరికము,ఇతర వాటిని తొలగించేవాడెవడు ?. మరియు మీలోని కొందరు కొందరికి వంశపారంపర్యముగా ప్రాతినిధ్యం వహించటానికి మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినదెవరు ?. ఏమీ అల్లాహ్ తో పాటు దీన్ని చేసే వేరే ఆరాధ్య దైవం ఉన్నాడా ?. మీరు హితోపదేశం స్వీకరించి,గుణపాఠం నేర్చుకునేది చాలా తక్కువ.

Neml 27:63

భూమి యొక్క అంధకారముల్లో,సముద్రం యొక్క అందకారముల్లో ఆయన పెట్టిన సూచనలు,నక్షత్రాల ద్వారా మీకు మార్గమును చూపేదెవరు ?. తన దాసులపై ఆయన కరుణించిన వర్షము కురవక ముందు గాలులను శుభవార్తనిచ్చేవానిగ పంపించేదెవరు ?. ఏమి అల్లాహ్ తో పాటు దీన్ని చేసే ఏ ఆరాధ్య దైవమైన ఉన్నాడా ?!. అల్లాహ్ అతీతుడు. వారు ఆయనతో పాటు ఆయన సృష్టితాలకు సాటి కల్పిస్తున్న వాటి నుండి పరిశుద్దుడు.

Neml 27:64

మాతృ గర్భాల్లో ఒక దశ తరువా త ఇంకో దశ లో సృష్టిని ఆరంభించి ఆతరువాత దానికి మరణమును కలిగించిన తరువాత జీవింపచేసేదెవడు ?. మరియు ఆకాశము నుండి తన వైపు నుండి కురవబడిన వర్షము ద్వారా మీకు జీవనోపాధిని కల్పించేదెవరు ?. మరియు భూమి నుండి అందులో మొక్కలను మొలకెత్తించటం ద్వారా మీకు జీవనోపాధిని కల్పిస్తున్నది ఎవరు ?. ఏమీ అల్లాహ్ తో పాటు దీన్ని చేసే మరోక ఆరాధ్య దైవం ఉన్నాడా ?. ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీరు ఉన్న షిర్కు గురించి మీ వాదనలను తీసుకుని రండి. ఒక వేళ మీరు సత్యముపై ఉన్నారని మీరు వాదిస్తున్న విషయంలో మీరు సత్యవంతులు అయితే.

Neml 27:65

ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి : ఆకాశముల్లో ఉన్న దైవ దూతలకు గానీ భూమిపై ఉన్న మానవులకు గానీ అగోచర విషయాల జ్ఞానము లేదు. కాని అల్లాహ్ ఒక్కడికే దాని జ్ఞానము ఉన్నది. మరియు భూమ్యాకాశముల్లో ఉన్న వారందరికి ప్రతిఫలం కొరకు ఎప్పుడు లేపబడతారో అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియదు.

Neml 27:66

లేదా వారి జ్ఞానము పరలోకమును అనుసరించి దాన్ని గట్టిగా నమ్ముతున్నారా ?. లేదు , కాని వారు పరలోకము నుండి సందేహములో,గందరగోళములో పడి ఉన్నారు. అంతే కాదు వారి అంతర్దృష్టులు దాని గురించి కళ్ళు మూసుకున్నాయి.

Neml 27:67

అవిశ్వాసపరులు తిరస్కరిస్తూ (విముఖత చూపుతూ) ఇలా పలికారు : మేము మరణించి మట్టిగా అయిపోయినప్పుడు జీవింపజేసి మరల లేపబడటం సాధ్యమా ?.

Neml 27:68

నిశ్చయంగా మేమందరం మరల లేపబడుతామని మాకూ వాగ్దానం చేయబడింది మరియు మా పూర్వ తాతముత్తాతలకూ వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానం నెరవేరటమును మేము చూడలేదు. మేమందరం వాగ్దానం చేయబడిన ఈ వాగ్దానం పూర్వికులు తమ పుస్తకాల్లో రాసుకున్న అబద్దాలు మాత్రమే.

Neml 27:69

ఓ ప్రవక్తా మరణాంతరము లేపబడటమును తిరస్కరించే వీరందరితో ఇలా పలకండి : మీరు భూమిపై ఏ ప్రాంతములోనైనా సంచరించి మరణాంతరం లేపబడటమును తిరస్కరించిన అపారాదుల ముగింపు ఏ విధంగా జరిగినదో యోచన చేయండి. నిశ్చయంగా మేము వారిని దాన్ని తిరస్కరించటం వలన నాశనం చేశాము.

Neml 27:70

మరియు నీ పిలుపు నుండి ముష్రికులు విముఖత చూపటం వలన నీవు బాధపడకు. మరియు వారి కుట్రల వలన నీకు మనస్తాపము కలగకూడదు. అల్లాహ్ వారికి వ్యతిరేకంగా మీకు సహాయం చేసేవాడు.

Neml 27:71

మరియు మీ జాతి వారిలో నుంచి మరణాంతరం లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులు ఇలా పలికే వారు : నీవు మరియు విశ్వాసపరులు మాకు వాగ్దానం చేసిన శిక్ష ఎప్పుడు నెరవేరనుంది. ఒక వేళ మీరు చేస్తున్న ఈ వాదనలో మీరు సత్యవంతులే అయితే .

Neml 27:72

ఓ ప్రవక్తా వారితో అనండి : బహుశా మీరు తొందరపెడుతున్న శిక్షలో కొంత భాగము మీకు సమీపంలోనే ఉండవచ్చు.

Neml 27:73

ఓ ప్రవక్త నిశ్చయంగా మీ ప్రభువు ప్రజలపై వారు అవిశ్వాసం,పాపకార్యాల్లో ఉన్నా కూడా ఎప్పుడైతే వారిని శీఘ్రంగా శిక్షంచటమును వదిలివేశాడో అనుగ్రహము కల వాడు. కానీ చాలా మంది ప్రజలు అల్లాహ్ కి ఆయన వారికి కలిగంచిన అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలుపుకోరు.

Neml 27:74

మరియు నిశ్ఛయంగా నీ ప్రభువుకి తన దాసుల హృదయాలు ఏమి దాస్తున్నాయో,ఏమి బహిర్గతం చేస్తున్నాయో తెలుసు. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన దాని పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

Neml 27:75

ఆకాశములో ప్రజల నుండి గోప్యంగా ఉన్నది మరియు భూమిలో వారి నుండి గోప్యంగా ఉన్నది స్పష్టమైన గ్రంధమైన లౌహె మహ్ఫూజ్ లో పొందుపరచకుండా లేదు.

Neml 27:76

నిశ్ఛయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ఇస్రాయీలు సంతతి వారికి వారు విభేదించుకున్న చాలా విషయాల గురించి విడమరచి తెలుపుతుంది. మరియు వారి విచలనాలను వెల్లడిస్తుంది.

Neml 27:77

నిశ్చయంగా ఇది ఇందులో వచ్చిన వాటిని విశ్వసించి ఆచరించే వారి కొరకు మార్గదర్శిని,కారుణ్యము.

Neml 27:78

ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మీ ప్రభువు ప్రళయదినాన ప్రజల మధ్య వారిలో నుండి విశ్వాసపరుడిని,వారిలో నుండి అవిశ్వాసపరుడిని తన న్యాయపూరిత నిర్ణయం ద్వారా తీర్పునిస్తాడు. అప్పుడు ఆయన విశ్వాసపరునిపై కరుణిస్తాడు మరియు అవిస్వాసపరుడిని శిక్షిస్తాడు. మరియు ఆయన తన శతృవులపై ప్రతీకారము తీసుకునే సర్వ శక్తిమంతుడు. మరియు ఆయన పై ఎవరూ ఆధిక్యత చూపలేరు. అసత్యపరుడి ద్వారా సత్యపరుడు ఆయనను అయోమయంలో పడవేయలేని జ్ఞానవంతుడు.

Neml 27:79

కావున నీవు అల్లాహ్ పై నమ్మకమును కలిగిఉండు. మరియు నీ వ్యవహారాలన్నింటిలో ఆయనపైనే ఆధారపడి ఉండు. నిశ్చయంగా నీవు స్పష్టమైన సత్యంపై ఉన్నావు.

Neml 27:80

ఓ ప్రవక్తా నిశ్చయంగా మీరు అల్లాహ్ పై అవిశ్వాసం వలన మరణించిన హృదయములు కలిగిన మృతులకు వినిపించలేరు. మరియు మీరు దేని వైపునైతే పిలుస్తున్నారో దాని నుండి వినికిడిని కోల్పోయిన వారు మీ నుండి విముఖత చూపుతూ వెనుకకు మరలిపోయేటప్పుడు మీరు వినిపించలేరు.

Neml 27:81

మరియు మీరు సత్యము నుండి ఎవరి చూపులైతే గుడ్డివైపోయినవో వారికి మార్గం చూప లేరు. మీరు వారిపై బాధపడకండి మరియు మీరు స్వయంగా అలసిపోకండి. మా ఆయతులను విశ్వసించే వారికి మాత్రమే మీరు మీ పిలుపును వినిపించగలరు. మరియు వారు అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటారు.

Neml 27:82

మరియు వారిపై శిక్ష అనివార్యమై వారి అవిశ్వాసము,వారి పాపములపై వారి మొండితనం వలన వారిపై జరిగి తీరి,ప్రజల్లోంచి చెడ్డవారు ఉండిపోయినప్పుడు మేము ప్రళయం దగ్గరైనప్పుడు వారి కొరకు దాని పెద్ద సూచనల్లోంచి ఒక సూచనను వెలికి తీస్తాము. అది భూమి నుండి ఒక జంతువు అది వారు అర్ధం చేసుకునే మాటల్లో ప్రజలు మన ప్రవక్త పై అవతరింపబడిన మన ఆయతులను నమ్మేవారు కాదని మాట్లాడుతుంది.

Neml 27:83

ఓ ప్రవక్తా మేము సమాజముల్లోంచి ప్రతీ సమాజములో నుంచి మా ఆయతులను తిరస్కరించే వారి పెద్దల ఒక జమాతును సమీకరించే రోజును గుర్తు చేసుకోండి. వారిలో మొదటి వారు వారి చివరి వారి వైపునకు మరలించబడుతారు. ఆతరువాత వారు లెక్క తీసుకోబడటానికి తీసుకుని రాబడతారు.

Neml 27:84

వారిని తీసుకుని రావటం జరుగుతూ ఉంటుంది చివరికి వారు తమ లెక్క తీసుకునే ప్రదేశమునకు వచ్చినప్పుడు అల్లాహ్ వారిని మందలిస్తూ ఇలా పలుకుతాడు : ఏమీ మీరు నా ఏకత్వముపై సూచించే,నా ధర్మ శాసనమును కలిగన నా ఆయతులను తిరస్కరిస్తున్నారా ? మీరు జ్ఞానంతో అవి అసత్యాలని తెలుసుకోకుండా అవి అసత్యాలని తిరస్కరంచటం మీకు అనుమతిస్తుంది లేదా మీరు వాటిపట్ల వ్యవహరిస్తున్న తీరు దృవీకరించటం లేదా తిరస్కరింటం మీరు ఏమి చేస్తున్నారు.

Neml 27:85

అల్లాహ్ పట్ల వారి అవిశ్వాసం,ఆయన ఆయతులను తిరస్కరించటం ద్వారా వారి దుర్మార్గం వలన వారిపై శిక్ష వచ్చిపడినది. అయితే వారు తమ నుండి దాన్ని తొలగించుకోవటానికి తమకు శక్తి లేనందువలన,వారి వాదనలు అసత్యాలవటం వలన వారు మాట్లాడలేరు.

Neml 27:86

మరణాంతరము లేపబడటమును తిరస్కరించే వారందరు చూడటం లేదా ? మేము రాత్రిని వారు అందులో నిద్ర ద్వారా విశ్రాంతి తీసుకోవటానికి చేశాము. మరియు మేము దినమును వారు అందులో చూసి తమ కార్యాల వైపు శ్రమించటానికి కాంతి వంతంగా చేశాము. నిశ్చయంగా ఈ పదే పదే వచ్చే మరణం ఆ తరువాత మరణాంతర లేపబడటంలో విశ్వసించే వారి కొరకు స్పష్టమైన సూచనలు కలవు.

Neml 27:87

ఓ ప్రవక్తా మీరు బాకాలో ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత రెండవ సారి ఊదే రోజును ఒక సారి గుర్తు చేసుకోండి. అప్పుడు ఆకాశముల్లో,భూమిలో ఉన్న వారందరిలో నుండి అల్లాహ్ భయంతో కంపించటం నుండి మినహాయించిన వారు తప్ప వారందరు భయంతో కంపించిపోతారు. ఇది (మినహాయింపు) ఆయన తరపు నుండి వారికి ఒక అనుగ్రహము. అల్లాహ్ సృష్టితాల్లో నుండి ఆ రోజు ఆయన వద్దకు విధేయులై,అణకువతో వస్తారు.

Neml 27:88

మరియు ఆ రోజు నీవు పర్వతాలను ఎటువంటి చలనం లేకుండా స్థిరంగా ఉన్నాయని భావిస్తావు. వాస్తవానికి అవి మేఘములు వెళ్ళినట్లు వేగముగా వెళ్ళుతాయి. ఇది అల్లాహ్ పనితనము. ఆయనే దాన్ని కదిలింపజేస్తాడు. నిశ్ఛయంగా మీరు చేస్తున్నదాని గురించి తెలుసుకునే వాడు. మీ కార్యాల్లో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన వాటిపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

Neml 27:89

ఎవరైతే ప్రళయదినాన విశ్వాసముతో పాటు సత్కార్యమును తీసుకుని వస్తాడో అతని కొరకు స్వర్గము కలదు. మరియు వారు ప్రళయ దిన భీతి నుండి తమ కొరకు కల అల్లాహ్ రక్షణ ద్వారా సురక్షితంగా ఉంటారు.

Neml 27:90

మరియు ఎవరైతే అవిశ్వాసమును,పాపకార్యములను తీసుకుని వస్తారో వారి కొరకు నరకాగ్ని కలదు. అప్పుడు వారు అందులో తమ ముఖములపై బొర్లావేసి వేయబడుతారు. మరియు వారితో మందలిస్తూ,అవమానపరుస్తూ ఇలా చెప్పబడుతుంది : మీరు ఇహలోకంలో చేసుకున్న అవిశ్వాసము,పాపకార్యములకు తప్ప వేరే దాని ప్రతిఫలం ఇవ్వబడినదా ?.

Neml 27:91

ఓ ప్రవక్తా వారితో అనండి : నాకు మాత్రం మక్కా ప్రభువు ఎవరైతే దాన్ని పవిత్ర క్షేత్రంగా చేశాడో ఆయన ఆరాధన చేయమని ఆదేశం ఇవ్వబడినది. కావున అక్కడ ఏ విధమైన రక్తం చిందించకూడదు. మరియు అందులో ఎవరిపై దౌర్జన్యం చేయకూడదు. మరియు దాని వేట జంతువును చంపకూడదు. మరియు దాని వృక్షములను నరకకూడదు. పరిశుద్ధుడైన ఆయనకే ప్రతీ వస్తువు యొక్క అధికారము కలదు. మరియు నేను అల్లాహ్ కు వేధేయుడవ్వాలని,ఆయన కొరకు విధేయతకు కట్టుబడి ఉండాలని నాకు ఆదేశించబడినది.

Neml 27:92

మరియు నేను ప్రజలకు ఖుర్ఆన్ చదివి వినిపించాలని నేను ఆదేశించబడ్డాను. అయితే ఎవరైతే దాని సన్మార్గము నుండి మార్గము పొందతాడో,అందులో ఉన్న వాటిని ఆచరిస్తాడో అతని మార్గదర్శకత్వము అతని కొరకే. మరియు ఎవరైతే మార్గ భ్రష్టుడై,అందులో ఉన్న వాటి నుండి మరలిపోయి దాన్ని తిరస్కరించి,అందులో ఉన్నవాటి పై ఆచరించడో వాడితో మీరు ఇలా పలకండి : నేను మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరిక చేసే హిచ్చరికుడిని మాత్రమే. మిమ్మల్ని సన్మార్గమును చూపటం నా చేతిలో లేదు.

Neml 27:93

మరియు ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : లెక్కవేయలేని అల్లాహ్ అనుగ్రహాలపై సర్వస్తోత్రాలన్నీ అల్లాహ్ కే. తొందరలోనే అల్లాహ్ తన సూచనలను మీలో,ఆకాశములో,భూమిలో,జీవనోపాధిలో చూపిస్తాడు. అప్పుడు మీరు వాటిని ఏవిధంగా గుర్తిస్తారంటే అవి మిమ్మల్ని సత్యానికి లొంగిపోవటానికి మార్గనిర్దేశం చేస్తాయి. మీరు చేస్తున్న వాటి నుండి మీ ప్రభువు నిర్లక్ష్యంగా లేడు. అంతేకాదు దాన్ని ఆయన తెలుసుకునేవాడును. దానిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు. మరియు ఆయన దానిపరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

Kasas 28:1

.(طسٓمٓ) తా - సీన్ - మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.

Kasas 28:2

ఇవి స్పష్టమైన ఖుర్ఆన్ వచనాలు.

Kasas 28:3

మేము మూసా మరియు ఫిర్ఔన్ వృత్తాంతమును విశ్వాస జనుల కొరకు ఎటువంటి సందేహము లేని సత్యముతో మీపై చదివి వినిపిస్తున్నాము. ఎందుకంటే వారే అందులో ఉన్న దానితో ప్రయోజనం చెందుతారు.

Kasas 28:4

నిశ్ఛయంగా ఫిర్ఔన్ మిసర్ (ఈజిప్టు) భూమిలో అతిక్రమించాడు మరియు అందులో ఆదిపత్యమును చెలాయించాడు. మరియు అతడు దాని వాసులను వర్గాలుగా విభజించాడు. వారిలో నుండి ఒక వర్గమును వారి మగ సంతానమును హత మార్చి,వారి ఆడవారిని సేవ కొరకు వారిని మరింత అవమానానికి గురి చేయడానికి జీవించి ఉండేటట్లు చేసి బలహీనులుగా చేశాడు. వారు ఇస్రాయీలు సంతతివారు. నిశ్ఛయంగా అతడు హింస,నిరంకుశత్వము,అహంకారము ద్వారా భూమిలో ఉపద్రవాలను రేకెత్తే వారిలోంచి అయిపోయాడు.

Kasas 28:5

మరియు మేము ఫిర్ఔన్ మిసర్ భూమిలో బలహీనులుగా చేసిన ఇస్రాయీలు సంతతి వారిపై వారి శతృవులను తుదిముట్టించి,వారి నుండి బలహీనతను తొలగించి,వారిని సత్యంలో అనుసరించబడే నాయకులుగా (ఇమాములుగా) చేసి ప్రాముఖ్యతను ఇవ్వదలిచాము. మరుయు మేము ఫిర్ఔన్ వినాశనము తరువాత శుభాలు కల షామ్ (సిరియా) ప్రాంతమునకు వారిని వారసులుగా చేయదలిచాము. ఏవిధంగా నైతే మహోన్నతుడైన అల్లాహ్ పలికాడో : وَأَوْرَثْنَا الْقَوْمَ الَّذِينَ كَانُوا يُسْتَضْعَفُونَ مَشَارِقَ الأَرْضِ وَمَغَارِبَهَا الَّتِي بَارَكْنَا فِيهَاۖ అత్యంత బలహీన వర్గంగా పరిగణించబడే జనులను మేము ఆ భూభాగంలోని తూర్పుపడమరలకు వారసులుగా చేశాము. అందులో మేము శుభాలను కలిగించాము.

Kasas 28:6

మరియు మేము వారిని భూమిలో ఆధిక్యత కలిగిన వారిని చేసి వారికి భూమిలో సాధికారత ప్రసాదించాలని మరియు మేము ఫిర్ఔన్ కు,రాజ్యంలో అతనికి పెద్ద మద్దతు దారుడైన హామాన్ మరియు వారిరువురి సైనికులకు,రాజ్యంలోని వారిరువురి సహాయకులకు వారు దేని గురించైతే భయపడుతున్నారో వారి రాజ్యమును కోల్పోవటమును,అది కూడా ఇస్రాయీలు సంతతి లో నుండి ప్రస్తావించబడిన ఒక పిల్లవాడి చేతిలో జరగటమును చూపించటమును కోరుతున్నాము.

Kasas 28:7

మరియు మేము మూసా అలైహిస్సలాం తల్లి మనస్సులో ఇలా ఆదేశించాము : నీవు అతనికి పాలు ఇస్తూ ఉండు. చివరికి ఫిర్ఔన్,అతని జాతి వారు అతన్ని హతమారుస్తారని నీకు భయమేస్తే అతన్ని ఒక పెట్టిలో ఉంచి దాన్ని నైలు నదిలో పడవేయి. మరియు నీవు మునగటం గురించి గాని ఫిర్ఔన్ నుండి గాని అతనిపై భయపడకు. మరియు అతను నీ నుండి విడిపోతాడని దుఃఖించకు. నిశ్చయంగా మేము అతన్ని జీవించి ఉన్న స్థితిలో నీ వైపునకు మరలించేవారము. మరియు అతన్ని అల్లాహ్ సృష్టితాలవైపు ప్రవక్తలుగా పంపించిన ప్రవక్తల్లోంచి చేసేవారము.

Kasas 28:8

అప్పుడు ఆమె మేము ఆదేశించినట్లే అతన్ని ఒక పెట్టిలో పెట్టి నదిలో పడవేసింది. అప్పుడు అతను ఫిర్ఔన్ వంశీయులకు దొరికాడు. అప్పుడు వారు అతన్ని ఎత్తుకున్నారు. మూసా ఫిర్ఔన్ కు శతృవు అయ్యి అతని రాజ్యం అతని చేతి మీద కోల్పోవటం,వారికి దుఃఖమును తీసుకుని వచ్చే వాడిగా అవటం ఏదైతే అల్లాహ్ తలచుకున్నాడో అది నిజమవటానికి. నిశ్చయంగా ఫిర్ఔన్,అతని మంత్రి అయిన హామాను,వారిరువురి సహాయకులు తమ అవిశ్వాసం వలన,తమ నిరంకుశత్వం వలన,భూమిపై తమ సంక్షోభమును కలిగించటం వలన అపరాధులైపోయారు.

Kasas 28:9

ఎప్పుడైతే ఫిర్ఔన్ అతన్ని హతమార్చదలచాడో అతనితో అతని భార్య ఇలా పలికింది : ఈ పిల్లవాడు నీకూ,నాకూ సంతోషమును కలిగించేవాడు. నీవు అతన్ని హతమార్చకు. బహుశా అతను సేవ ద్వారా మనకు ప్రయోజనం కలిగిస్తాడు లేదా మేము అతన్ని దత్తత చేసుకుని పుతృనిగా చేసుకుందాము. అతని చేతి మీదుగా వారి రాజ్యము అతనికి చేరుతుందన్న విషయం వారికి తెలియదు.

Kasas 28:10

మరియు మూసా అలైహిస్సలాం తల్లి హృదయం మూసా వ్యవహారం విషయం తప్ప ప్రపంచ వ్యవహారాలన్నింటి నుండి ఖాళీ అయిపోయింది. ఆమెకు ఓపిక లేకపోయేది. చివరికి ఆమె అతనితో తనకు ఉన్నసంబంధము వలన అతడు తన కుమారుడని బహిర్గతం చేసే ఆస్కారం ఉండేది. ఒక వేళ మేము ఆమె హృదయమును అతని స్థిరత్వముపై,ఆమె సహనముపై తమ ప్రభువుపై విశ్వసించి,నమ్మకమును కలిగి ఉండి తనపై తీర్పు ఇవ్వబడిన దానిపై సహనము చూపే వారిలో నుండి అవటానికి ముడివేశాము.

Kasas 28:11

మరియు మూసా అలైహిస్సలాం తల్లి ఆయనను నదిలో పడవేసిన తరువాత అతని సోదరినితో ఇలా పలికింది : నీవు అతనిపట్ల ఏమి చేయబడుతుందో తెలుసుకోవటానికి అతని వెంట వెళ్ళు. అప్పుడు ఆమె తన విషయం బయటపడకుండా ఉండేందుకు దూరం నుంచే ఆయనను గమనించసాగింది. మరియు ఆమె అతని సోదరి అని,ఆమె అతని సమాచారమును తనిఖీ చేస్తున్నదని ఫిర్ఔన్,అతని జాతి వారు గ్రహించలేకపోయారు.

Kasas 28:12

మరియు మూసా అల్లాహ్ నిబంధనతో స్త్రీల నుండి పాలు త్రాగటం నుండి దూరంగా ఉన్నారు. అతని సోదరి అతన్ని పాలు త్రాపించటంపై వారి ఆసక్తిని చూసినప్పుడు వారితో ఇలా పలికింది : ఏమీ నేను అతన్ని పాలు త్రాపించి,అతని బాగోగులు చూసుకునే (పోషించే) ఒక కుటుంబం వారిని మీకు తెలుపనా ? . వారు అతని మేలును ఆశించేవారై ఉంటారు.

Kasas 28:13

అప్పుడు మేము మూసాను అతని తల్లికి ఆయన దగ్గరవటం నుండి ఆమె కంటిచలువ అవుతారని ఆశిస్తూ వాపసు చేశాము. మరియు ఆమె అతని విడిపోవటం వలన బాధపడకుండా ఉండటానికి,అతన్ని ఆమెకు వాపసు చేసే విషయంలో అల్లాహ్ వాగ్దానం ఎటువంటి సందేహం లేని సత్యమని తెలుసుకోవటానికి. కాని వారిలో నుండి చాలా మందికి ఈ వాగ్దానం గురించి తెలియదు. మరియు ఎవరికీ ఆమె అతని తల్లి అని తెలియదు.

Kasas 28:14

మరియు అతను దృఢమైన శరీరము అయ్యే వయస్సుకు చేరి,తన బలమును దృఢపరచుకున్నప్పుడు మేము అతనికి ఇస్రాయీలు సంతతి వారి ధర్మ విషయంలో అతని దైవదౌత్యముకు మునుపే అర్ధం చేసుకునే గుణమును,జ్ఞానమును ప్రసాదించాము. ఏ విధంగానైతే మేము మూసాకు తన విధేయత వహించటంపై ప్రతిఫలమును ప్రసాదాంచామో అలాగే ప్రతీ కాలములో,ప్రతీ ప్రదేశములో సద్వర్తనులకు ప్రతిఫలమును ప్రసాదిస్తాము.

Kasas 28:15

మరియు మూసా ప్రజలు తమ ఇండ్లలో విశ్రాంతి తీసుకునే సమయంలో నగరంలో ప్రవేశించారు. అప్పుడు ఆయన అక్కడ ఇద్దరు వ్యక్తులను పరస్పరం తగాదాలాడుతుండగా,ఒకరినొకరు కొట్టుకుంటుండగా చూశారు. వారిలో ఒకడు మూసా అలైహిస్సలాం జాతి అయిన ఇస్రాయీలు సంతతికి చెందినవాడు,ఇంకొకడు మూసా శతృవైన ఫిర్ఔన్ జాతి ఖిబ్తీకు చెందిన వాడు. అప్పుడు తన జాతికి చెందిన వాడు తన శతృవు జాతి ఖిబ్తీ నుండి ఉన్న వ్యక్తి కి విరుద్ధంగా తనకు సహాయం చేయాలని ఆయనతో కోరాడు. అప్పుడు మూసా తన చేతి పిడికిలితో ఖిబ్తీని కొట్టారు. ఆయన ఇలా బలంగా కొట్టి అతన్ని హతమార్చారు. మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : ఇది షైతాను అలంకరణ,అతని మోసం లో నుంచిది. నిశ్చయంగా షైతాను తనను అనుసరించే వాడికి అపమార్గమునకు లోను చేసే ఒక శతృవు .అతని శతృత్వము బహిర్గతమవుతుంది. అయితే నా నుండి ఏదైతే జరిగినదో అతని శతృత్వం వలన,అతడు నన్ను అపమార్గమునకు లోను చేయదలిచే అపమార్గమునకు లోను చేసేవాడు కావటం వలన.

Kasas 28:16

మూసా తన ప్రభువుతో తన ద్వారా జరిగిన దాన్ని అంగీకరిస్తూ వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నేను ఈ ఖిబ్తీను హత్య చేసి నాపై హింసకు పాల్పడ్డాను. అయితే నీవు నా కొరకు నా పాపమును మన్నించు. అప్పుడు అల్లాహ్ మా కొరకు మూసాకి తన మన్నింపును స్పష్టపరచాడు. నిశ్చయంగా ఆయనే తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారికి మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును.

Kasas 28:17

అ తరువాత మూసా ప్రార్ధన గురించి సమాచారము కొనసాగింది అందులో ఆయన ఈ విధంగా పలికాడు : ఓ నా ప్రభువా నీవు నాకు అనుగ్రహించిన బలము,తెలివి,జ్ఞానము వలన నేను అపరాధము చేసే వారికి వారి అపరాధము చేయటం పై సహాయకునిగా ఉండనంటే ఉండను.

Kasas 28:18

ఎప్పుడైతే ఆయన నుండి ఏదైతే సంభవించినదో ఖిబ్తీ హత్య నుండి సంభవించినదో ఆయన ఏమి జరుగుతుందో అని భయపడుతూ నిరీక్షిస్తూ తెల్లవారు చేశాడు. నిన్నటి రోజు తన శతృవుకి విరుద్ధంగా సహాయమును,తోడ్పాటును ఆయనతో కోరాడో అతడు వేరొక ఖిబ్తీకి వ్యతిరేకంగా సహాయమును కోరాడు. మూసా అతనితో ఇలా పలికారు : నిశ్ఛయంగా నీవు మార్గభ్రష్టకు లోను చేసేవాడివి,స్పష్టమైన అపమార్గమునకు లోను చేసేవాడివి.

Kasas 28:19

ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం తనకు,ఇస్రాయిలీకి శతృవైన ఖిబ్తీని గట్టిగా పట్టుకో దలిచారో ఇస్రాయిలీ ఆయనతో إِنَّكَ لَغَوِيٌّ مُبِينٌ నిశ్ఛయంగా నీవు అపమార్గమునకు లోను చేసే వాడివి అన్న మాటలు విన్నాడో మూసా తనను గట్టిగా పట్టుకుంటారని భావించాడు. అప్పుడు అతడు మూసాతో ఇలా పలికాడు : నీవు నిన్న ఒక ప్రాణమును తీసినట్లే నన్ను హత్యచేయదలచావా. నీవు ప్రజలని హతమార్చి,వారిపై హింసకు పాల్పడి భూమిలో క్రూరునిగా అవ్వాలని మాత్రం అనుకుంటున్నావు. నీవు ఇద్దరు పోట్లాడుకునే వారి మధ్య సంస్కరించేవాడవదలచుకోలేదు.

Kasas 28:20

మరియు ఎప్పడైతే వార్త వ్యాపించినదో నగర శివారు నుండి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ మూసాను వేటాడటం పై దయ చూపుతూ ఇలా పలికాడు : ఓ మూసా నిశ్చయంగా ఫిర్ఔన్ జాతి పెద్దలు నిన్ను హత మార్చటానికి సంప్రదింపులు చేస్తున్నారు కాబట్టి నీవు ఊరి నుండి బయలుదేరి వెళ్ళిపో. నిశ్ఛయంగా నేను నీకు ఉపదేశము చేసేవాడిని,నిన్ను వారు పొంది హత్య చేయటం నుండి నీపై కరుణించేవాడిని.

Kasas 28:21

మూసా ఉపదేశము చేసిన వ్యక్తి ఆదేశించినట్లే చేశారు. అప్పుడు ఆయన ఊరి నుండి భయపడుతూ తనకు ఏమి జరుగుతుందో అని నిరీక్షిస్తూ బయలుదేరారు. తన ప్రభువును వేడుకుంటూ ఇలా పలికాడు : ఓ నా ప్రభువా దుర్మార్గ ప్రజల నుండి ,వారు నాకు చెడును కలిగించకుండా నన్ను రక్షించు.

Kasas 28:22

మరియు ఆయన మద్యన్ వైపునకు బయలుదేరినప్పుడు ఆయన ఈ విధంగా పలికారు : బహుశా నా ప్రభువు నన్ను మంచి మర్గం వైపునకు మార్గనిర్దేశకం చేస్తాడు. అప్పుడు నేను దాని నుండి మార్గభ్రష్టుడిని కాను.

Kasas 28:23

మరియు ఆయన మద్యన్ వాసులు నీటిని త్రాగే నీటి వద్దకు చేరుకున్నప్పుడు ప్రజల ఒక సమూహం తమ పశువులకు నీటిని త్రాపిస్తుండగా పొందారు. మరియు వారే కాకుండా ఇద్దరు స్త్రీలను తమ గొర్రెలను ప్రజలు త్రాపించేంత వరకు ఆపి ఉండగా పొందారు. మూసా అలైహిస్సలాం వారిద్దరితో ఇలా అడిగారు : మీరిద్దరి సమస్య ఏమిటి మీరు ప్రజలతోపాటు త్రాపించటం లేదు ?. వారిద్దరు ఆయనకు ఇలా సమాధానమిచ్చారు : కాపరులు మరలిపోయేంత వరకు మేము త్రాపించకుండా ఆగి ఉండటం మా అలవాటు ; వారితో కలవకుండా జాగ్రత్తపడటానికి. మరియు మా తండ్రి అధిక వయస్సు కల వృద్ధుడు. ఆయన త్రాపించలేడు. కాబట్టి మా గొర్రెలకు మేమే నీరు త్రపించాలి.

Kasas 28:24

అప్పుడు ఆయన వారిద్దరిపై దయ చూపి వారిద్దరి కొరకు వారి గొర్రెలకు నీరు త్రాపించారు. ఆ తరువాత నీడ వైపునకు మరలారు అందులో సేదతీరారు. తన అవసరాన్ని తన ప్రభువు ముందట పెట్టి ఇలా ప్రార్ధించారు : ఓ నా ప్రభూ నీవు నా వైపునకు కురుపించే ఏ మేలైనా నేను అవసరం కలవాడిని.

Kasas 28:25

అప్పుడు వారిద్దరు వెళ్లి తమ తండ్రికి అతని గురించి తెలియపరచారు. అప్పుడు ఆయన వారి నుండి ఒకామెను అతన్ని పిలుచుకుని రమ్మని ఆయన వద్దకు పంపించారు. అప్పుడు ఆమే ఆయన వద్దకు సిగ్గు పడుతూ నడిచి వచ్చింది. ఆమె ఇలా పలికింది : నిశ్చయంగా మా తండ్రి మీరు మా కొరకు నీళ్ళు త్రాపించినందుకు మీకు మీ ప్రతిఫలమును ప్రసాదించటానికి ఆయన వద్దకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మూసా వారి తండ్రి వద్దకు వచ్చినప్పుడు,ఆయనకు తన సమాచారములన్ని తెలియపరచారు. ఆయన అతనికి భరోసా కలిగిస్తూ ఇలా పలికారు : నీవు భయపడకు నీవు దుర్మార్గ ప్రజలైన ఫిర్ఔన్,అతని నాయకుల నుండి ముక్తిని పొందావు. వారికి మద్యన్ పై ఎటువంటి అధికారము లేదు. అలాగే వారు నీకు ఎటువంటి కీడును తీసుకుని రాలేరు.

Kasas 28:26

అతని ఇద్దరి కుమార్తెల్లోంచి ఒకామె ఇలా పలికింది : ఓ మా తండ్రి అతన్ని మా గొర్రెలను మేపటానికి జీతంపై పెట్టుకోండి. అతనిలో బలము,అమానత్ కలిగి ఉండటం వలన మీరు అతన్ని జీతంపై పెట్టుకోవటానికి తగిన వాడు. బలముతో అతనికి ఇవ్వబడిన బాధ్యతను నెరవేరుస్తాడు. మరియు అమానత్ తో అతనికి అప్పగించిన అమానత్ ను పరిరక్షిస్తాడు.

Kasas 28:27

వారి తండ్రి మూసా అలైహిస్సలాంను ఉద్దేసించి ఇలా పలికారు : నిశ్చయంగా నేను నా ఇద్దరు కుమార్తెలలో ఒకరితో మీ వివాహం చేయదలిచాను. ఆమె మహర్ గా మీరు ఎనిమిది సంవత్సరాలు మా గొర్రెలను మేపాలి. ఒక వేళ మీరు పది సంవత్సరములు కాలమును పూర్తి చేస్తే అది మీ తరపు నుండి అధికము మీపై తప్పనిసరి కాదు. ఎందుకంటే ఒప్పందం ఎనిమిది సంవత్సరములు మాత్రమే. దానిపై ఏదైతే ఉన్నదో అది స్వచ్ఛందంగా ఉంటుంది. మీకు కష్టమైన దాన్ని నేను మీపై తప్పనిసరి చేయదలచుకోలేదు. ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే మీరు తొందరలోనే నన్ను ఒప్పందాలను పూర్తి చేసే వారైన పుణ్యాత్ముల్లోంచి పొందుతారు,వారు ప్రమాణాలను భంగపరచరు.

Kasas 28:28

మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : మేము చేసుకున్న ఒప్పందము ఏదైతే ఉన్నదో అది మీకూ,మాకూ మధ్య ఉన్నది. రెండు కాలముల్లో నుంచి నేను మీ కొరకు చేసిన ఎనిమిది సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు నేను నాపై ఉన్న బాధ్యతను పూర్తి చేసిన వాడినవుతాను. మీరు నాతో అధికంగా కోరకండి. మరియు మేము చేసుకున్న ఒప్పందంపై అల్లాహ్ యే సాక్షి,దాని పరిరక్షకుడు.

Kasas 28:29

ఎప్పుడైతే మూసా రెండు కాలములను పది సంవత్సరములుగా పూర్తి చేసి,తన ఇంటి వారిని తీసుకుని మద్యన్ నుండి మిసర్ కు బయలు దేరారో తూర్ పర్వత దిక్కులో ఆయన ఒక మంటను చూశారు. అప్పుడు ఆయన తన ఇంటి వారితో ఇలా పలికారు : మీరు ఆగండి, నిశ్చయంగా నేను ఒక మంటను చూశాను. బహుశా నేను దాని నుండి మీ వద్దకు ఏదైన సమాచారము తీసుకుని వస్తాను. లేదా నేను మంట నుండి మీ వద్దకు ఒక కొరివిని తీసుకుని వస్తాను మీరు దానితో మంటను వెలిగిస్తారు. బహుశా మీరు చలి నుండి వెచ్చదనాన్ని గ్రహిస్తారు.

Kasas 28:30

ఎప్పుడైతే మూసా తాను చూసిన మంట వద్దకు వచ్చారో పరిశుద్ధుడైన,మహోన్నతుడైన ఆయన ప్రభువు ఆయనను లోయ కుడి వైపున ఉన్న స్థలము నుండి దేనినైతే అల్లాహ్ మూసా కొరకు వృక్షము నుండి తన మాట ద్వారా శుభప్రదం చేశాడో ఇలా మాట్లాడాడు : ఓ మూసా నేనే సృష్టితాలన్నింటి ప్రభువైన అల్లాహ్ ను.

Kasas 28:31

మరియు నీవు నీ చేతి కర్రను పడవేయి. అప్పుడు మూసా తన ప్రభువు ఆదేశమునకు కట్టుబడి ఉండి దాన్ని పడవేశారు. ఎప్పుడైతే ఆయన దాన్ని చూశారో అది చలిస్తున్న,కదులుతున్న స్థితిలో ఉండి తన వేగములో పాము వలె ఉన్నది. అప్పుడు మూసా దాని నుండి భయపడి వెనుతిరిగి పారిపోసాగారు. తన పరగెత్తటం నుండి తిరిగి చూడ లేదు. అప్పుడు ఆయన్ని ఆయన ప్రభువు ఇలా పిలుపునిచ్చాడు : ఓ మూసా ముందుకు రా,నీవు దానితో భయపడకు. నిశ్చయంగా నీవు దాని నుండి,నీవు భయపడే ఇతర వాటి నుండి సురక్షితంగా ఉన్నావు.

Kasas 28:32

నీవు నీ కుడి చేతిని నీ మెడ దగ్గరలో నీ చొక్క తెరవబడిన భాగములో ప్రవేశింపజేయి అది ఎటువంటి బొల్లి రోగము లేకుండా తెల్లగా బయటకు వస్తుంది. అప్పుడు మూసా దాన్ని ప్రవేశింపజేశారు అది మంచువలె తెల్లగా బయటకు వచ్చింది. మరియు నీ చేతిని నీ వైపునకు నీ భయం తగ్గటానికి అదుముకో. అప్పుడు మూసా దాన్ని తన వైపునకు అదుముకున్నారు అంతే ఆయన భయము ఆయన నుండి తొలగిపోయింది. ఈ ప్రస్తావించబడిన చేతి కర్ర,చేయి నీ ప్రభువు వద్ద నుండి ఫిర్ఔన్,అతని జాతి నాయకుల వైపునకు పంపించబడ్డ నిదర్శనాలు. నిశ్చయంగా వారు అవిశ్వాసము ద్వారా,పాపకార్యలకు పాల్పడటం ద్వారా అల్లాహ్ విధేయత నుండి తొలగిపోయిన ప్రజలు.

Kasas 28:33

మూసా తన ప్రభువును వేడుకుంటూ ఇలా పలికారు : నిశ్చయంగా నేను వారిలో నుండి ఒక ప్రాణమును చంపాను అందు వలన ఒక వేళ నేను వారి వద్దకు నీవు ఇచ్చి పంపించిన వాటిని వారికి చేర వేయటానికి వస్తే వారు నన్ను చంపి వేస్తారని నేను భయపడుతున్నాను.

Kasas 28:34

మరియు నాసోదరుడు హారూన్ నా కన్న ఎక్కువ స్పష్టంగా మాట్లాడుతాడు. కాబట్టి నీవు ఒక వేళ ఫిర్ఔన్,అతని జాతి వారు నన్ను తిరస్కరిస్తే అతన్ని నా మాటను సమర్ధించటానికి సహాయకునిగా నాతోపాటు పంపించు. నిశ్చయంగా వారు నన్ను తిరస్కరిస్తారని భయపడుతున్నాను. ఏ విధంగానైతే అది నాకన్న పూర్వం ప్రవక్తలు పంపించబడ్డ జాతుల అలవాటో,వారు వారిని తిరస్కరించారు.

Kasas 28:35

అల్లాహ్ మూసా దుఆను స్వీకరిస్తూ ఇలా పలికాడు : ఓ మూసా మేము తొందరలోనే నీతో పాటు నీ సోదరుడిని ప్రవక్తగా,సహాయకునిగా పంపింపించి నీకు బలమును చేకూరుస్తాము. మరియు మీరిద్దరి కొరకు ఆధారమును,మద్దతును కలిగిస్తాము. అయితే వారు మీరు అసహ్యించుకునే చెడుతో మీకు చేరుకోలేరు. మేము మీకు ఇచ్చి పంపంపించిన సూచనల మూలంగా మీరు, మిమ్మల్ని అనుసరించిన విశ్వాసపరులు విజయమును పొందుతారు.

Kasas 28:36

మూసా అలైహిస్సలాం వారి వద్దకు మా స్పష్టమైన సూచనలను తీసుకుని వచ్చినప్పుడు వారు ఇది మూసా కల్పించుకున్న అబద్దము మాత్రమే. మరియు మేము దీన్ని మా పూర్వ తాత ముత్తాతలలో వినలేదు.

Kasas 28:37

మరియు మూసా ఫిర్ఔన్ ను ఉద్దేశించి ఇలా పలికారు : పరిశుద్ధుడైన ఆయన వద్ద నుండి మార్గదర్శకమును తీసుకుని వచ్చిన సత్యవంతుడి గురించి నా ప్రభువుకి తెలుసు,మరియు పరలోకములో ప్రశంసనీయమైన పర్యవసానం ఎవరి కొరకు ఉన్నదో ఆయనకు తెలుసు. నిశ్చయంగా దుర్మార్గులు తాము ఆశించిన దానిలో సాఫల్యం చెందలేరు. మరియు తాము భయపడే వాటి నుండి విముక్తి చెందలేరు.

Kasas 28:38

మరియు ఫిర్ఔన్ తన జాతి వారిలో నుండి నాయకులను ఉద్దేశించి ఇలా పలికాడు : ఓ నాయకులారా నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం గలడని నాకు తెలియదు. ఓ హామాన్ గట్టిపడే వరకు మట్టిపై అగ్నిని రాజేసి దానితో ఎత్తైన ఒక నిర్మాణమును కట్టు నేను దానిపై నిలబడి మూసా ఆరాధ్య దైవమును చూస్తానని ఆశిస్తున్నాను. మరియు నిశ్చయంగా మూసా అల్లాహ్ వద్ద నుండి నా వైపునకు,నా జాతి వారి వైపునకు ప్రవక్తగా పంపించబడ్డాడని వాదిస్తున్న విషయంలో అబద్దము పలుకుతున్నాడని భావిస్తున్నాను.

Kasas 28:39

మరియు ఫిర్ఔన్,అతని సైన్యముల అహంకారం తీవ్రమైపోయినది. మరియు వారు మిసర్ ప్రాంతములో అన్యాయంగా అహంకారాన్ని ప్రదర్శించారు. మరియు మరణాంతరం లేపబడటమును నిరాకరించారు. మరియు వారు ప్రళయ దినాన లెక్క తీసుకోవటం,పర్యవసానం కొరకు మా వైపునకు మరలించబడరని భావించారు.

Kasas 28:40

అప్పుడు మేము అతన్నీ పట్టుకున్నాము,అతని సైన్యములనూ పట్టుకున్నాము. వారిని సముద్రంలో ముంచుతూ విసిరివేశాము. చివరికి వారందరు నాశనమయ్యారు. ఓ ప్రవక్తా మీరు యోచన చేయండి దుర్మార్గుల స్థితి,వారి ముగింపు ఏమయిందో. వారి స్థితి,వారి ముగింపు వినాశనమయ్యింది.

Kasas 28:41

మరియు మేము వారిని అవిశ్వాసము, మార్గభ్రష్టతను వ్యాపింపజేసి నరకము వైపునకు పిలిచే నిరంకుశుల కొరకు,మార్గభ్రష్టుల కొరకు నమూనాగా చేశాము. మరియు ప్రళయదినాన శిక్ష నుండి వారిని రక్షించటం ద్వారా వారు సహాయపడరు. అంతే కాదు వారు చెడు సంప్రదాయాలను జారీ చేయటం,అపమార్గముతో దానివైపునకు పిలవటం వలన వారిపై శిక్ష రెట్టింపు చేయబడుతుంది. దానిపై ఆచరించిన దాని బరువు కూడా వారిపై వ్రాయబడుతుంది,మరియు దానిపై ఆచరించటంలో వారిని అనుసరించిన వారి కర్మల బరువు వ్రాయబడుతుంది.

Kasas 28:42

మరియు మేము వారి శిక్షను ఇహలోకములో పరాభవం,ధూత్కారము రూపములో అధికము చేసి వెంటాడేటట్లు చేశాము. మరియు ప్రళయ దినాన వారే దూషించబడినవారు,అల్లాహ్ కారుణ్యము నుండి దూరం చేయబడినవారు.

Kasas 28:43

మరియు నిశ్చయంగా మేము పూర్వ జాతుల వారి వద్దకు మా ప్రవక్తలను పంపించి వారు వారిని తిరస్కరిస్తే మేము వారి తిరస్కారము వలన వారిని తుది ముట్టించిన తరువాత మూసా అలైహిస్సలాంనకు తౌరాత్ ను ప్రసాదించాము. అందులో ప్రజలకు ప్రయోజనం కలిగించే వాటిని వారు చూసి వాటిని వారు ఆచరించేవి,వారికి నష్టం కలిగించేవాటిని చూసి వాటిని వదిలివేసేవి ఉన్నవి. అందులో వారికి మేలు వైపునకు,ఇహపరాల మేలు ఉన్న కారుణ్యం వైపునకు మార్గదర్శకత్వం ఉన్నది. బహుశా వారు తమపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుని,ఆయనను విశ్వసిస్తారేమో.

Kasas 28:44

ఓ ప్రవక్తా మేము మూసాను ఫిర్ఔన్,అతని నాయకుల వద్దకు పంపించిన విషయమును మూసా వద్ద ముగించినప్పుడు మీరు మూసా అలైహిస్సలాం కొరకు కొండ పడమర వైపున లేరు. మరియు మీరు ప్రత్యక్షంగా ఉన్న వారిలో లేరు చివరకు మీరు ఆ సమాచారము తెలుసుకుని దాన్ని ప్రజలకు తెలియపరచారు. మీరు వారికి చెప్పినది అల్లాహ్ మీకు వహీ ద్వారా తెలియపరచాడు.

Kasas 28:45

కాని మేము మూసా తరువాత ఎన్నో సమాజాలను,సృష్టితాలను ప్రభవింపజేశాము. వారిపై సుదీర్ఘ కాలం గడిచిపోయింది చివరకు వారు అల్లాహ్ ప్రమాణములను మరచిపోయారు. మరియు మీరు మద్యన్ వాసుల మధ్య నివాసమూ లేరు వారిపై మా ఆయతులను చదివి వినిపించటానికి. కానీ మేము మిమ్మల్ని మా వద్ద నుండి ప్రవక్తగా పంపించి,మూసా వృత్తాంతమును,మద్యన్ లో ఆయన నివాసమును మీకు వహీ ద్వారా మేము తెలియపరచాము. అప్పుడు అందులో నుండి మీకు అల్లాహ్ వహీ ద్వారా మీకు తెలియపరచిన దాన్ని మీరు ప్రజలకు తెలియపరచారు.

Kasas 28:46

మరియు మేము మూసాను పిలిచి ఆయనకు ఏదైతే మేము దివ్యవాణిని అవతరింపజేశామో అప్పుడు మీరు తూర్ వైపున లేరు. కాని మేము మిమ్మల్ని ప్రజల కొరకు నీ ప్రభువు వద్ద నుండి కారుణ్యంగా పంపించాము. మేము ఆ వృత్తాంతమును మీకు దైవ వాణి ద్వారా తెలియపరచాము మీరు మీ కన్న పూర్వం ఎటువంటి హెచ్చరించే వాడు హెచ్చరించటానికి రాని జాతి వారిని హెచ్చరించటానికి బహుశా వారు హితోపదేశం గ్రహించి,మీరు వారి వద్దకు పరిశుద్ధుడైన అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసిస్తారని.

Kasas 28:47

మరియు ఒక వేళ వారు ఉన్న అవిశ్వాసము,పాప కార్యముల వలన వారిపై దైవ శిక్ష వచ్చి చేరితే వారి వద్దకు ఒక ప్రవక్త పంపించకపోవటంపై వాదిస్తూ ఇలా పలుకుతారు : నీవు ఎందుకని మా వద్దకు ఒక ప్రవక్తను పంపించలేదు అప్పుడు మేము నీ ఆయతులను అనుసరించి,వాటిని ఆచరించి,మేము విశ్వసించి వారి ప్రభువు ఆదేశముపై ఆచరించే వారిలో నుండి అయిపోయేవారము. ఒక వేళ అలా జరిగి ఉంటే మేము వారిని శీఝ్రంగా శిక్షించేవారము. కానీ మేము దాన్ని వారి నుండి ఆలస్యం చేశాము చివరికి వారి వద్దకు ఒక ప్రవక్తను పంపించి వారిని మన్నించటానికి.

Kasas 28:48

ఎప్పుడైతే ఖురైష్ జాతి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం తీసుకుని వచ్చారో వారు యూదులను ఆయన గురించి అడిగారు. అప్పుడు వారు వారికి ఈ వాదనను నేర్పిస్తే వారు అన్నారు : మూసా తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని సూచించే చేయి,చేతి కర్ర లాంటి మహిమలు ఇవ్వబడినట్లు ఎందుకని ముహమ్మద్ కు ఇవ్వబడలేదు. ఓ ప్రవక్తా మీరు వారిని ఖండిస్తూ ఇలా తెలియపరచండి : ఏమీ మునుపు మూసా ఇవ్వబడిన వాటిని యూదులు తిరస్కరించలేదా ?!. మరియు వారు తౌరాత్,ఖుర్ఆన్ విషయంలో ఇలా పలికారు నిశ్ఛయంగా అవి రెండూ మంత్రజాలములు ఒక దానికొకటి మద్దతిస్తున్నవి. మరియు వారు నిశ్ఛయంగా మేము తౌరాత్,ఖుర్ఆన్ ను పూర్తిగా తిరస్కరిస్తున్నాము అని అన్నారు.

Kasas 28:49

ఓ ప్రవక్తా వారందరితో ఇలా పలకండి : మీరు తౌరాత్,ఖుర్ఆన్ కన్న ఎక్కువ మార్గదర్శకం కల అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన ఏదైన గ్రంధమును తీసుకుని రండి. ఒక వేళ మీరు తీసుకుని వస్తే నేను దాన్ని అనుసరిస్తాను,ఒక వేళ మీరు తౌరాత్,ఖుర్ఆన్ మంత్రజాలము అని వాదిస్తున్న విషయంలో మీరు సత్యవంతులే అయితే.

Kasas 28:50

ఒక వేళ ఖురైష్ మీరు తౌరాత్,ఖుర్ఆన్ కన్న ఎక్కువ మార్గ దర్శకం గల ఏదైన పుస్తకమును తీసుకుని రమ్మని మీరు వారికి ఇచ్చిన పిలుపును స్వీకరించకపోతే ఆ రెండింటి పట్ల వారి తిరస్కారము ఎటువంటి ఆధారం కాదు అని నమ్మండి. అది కేవలం మనోవాంచలను అనుసరించటం మాత్రమే. పరిశుద్ధుడైన అల్లాహ్ యొక్క ఎటువంటి మార్గ నిర్దేశకం లేకుండా తన మనోవాంచలను అనుసరించే వాడి కన్నపెద్ద మార్గభ్రష్టుడు ఎవడూ ఉండడు. నిశ్ఛంగా అల్లాహ్ ,అల్లాహ్ పట్ల తమ అవిశ్వాసం వలన తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడే జనులకు సన్మార్గము,మార్గదర్శకత్వం కొరకు భాగ్యమును కలిగించడు.

Kasas 28:51

మరియు నిశ్ఛయంగా మేముఇస్రాయీలు సంతతి నుండి ముష్రికులకు,యూదులకు పూర్వ సమాజాల వృత్తాంతముల ద్వారా,వారు మా ప్రవక్తలను తిరస్కరించినప్పుడు వారిపై మేము దించిన శిక్ష ద్వారా మాటను దాని ద్వారా వారు హితబోధన గ్రహించి వారికి సంభవించినది వీరికి సంభవించకముందే విశ్వసిస్తారని ఆశిస్తూ మాటను చేరవేశాము.

Kasas 28:52

ఎవరైతే ఖుర్ఆన్ అవతరణ ముందు నుండే తౌరాత్ పట్ల విశ్వాసముపై స్థిరంగా ఉన్నారో వారే ఖుర్ఆన్ పై తమ గ్రంధముల్లో దాని సమాచారము,దాని గుణమును వారు పొందటం వలన విశ్వాసమును కనబరుస్తారు.

Kasas 28:53

దాన్ని వారిపై పఠించబడినప్పుడు వారు ఇలా పలికేవారు : మేము దాన్ని విశ్వసించాము నిశ్చయంగా అది ఎటువంటి సందేహము లేని,మన ప్రభువు వద్ద నుండి అవతరింపబడిన సత్యము. నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ కన్న ముందు నుండే ప్రవక్తలు దాని కన్న ముందు తీసుకుని వచ్చిన వాటిపై ఉన్న మన విశ్వాసము వలన విధేయులమై ఉండేవారము.

Kasas 28:54

ప్రస్తావించబడిన గుణములతో వర్ణించబడిన వీరందరికి అల్లాహ్ వారి గ్రంధము పట్ల విశ్వాసముపై వారి సహనము వలన,ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడినప్పుడు ఆయనపై తమ విశ్వాసము వలన వారి ఆచరణలకు రెండు సార్లు వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు వారు తమ సత్కర్మల పుణ్యాలతో వారు చేసుకున్న పాపాలను తొలగించుకుంటారు. మరియు మేము వారికి ప్రసాదించిన వాటిని మంచి మార్గముల్లో ఖర్ఛు చేస్తారు.

Kasas 28:55

గ్రంధవహుల్లో నుండి విశ్వాసపరులైన వీరందరు అసత్య మాటను విన్నప్పుడు దాని వైపునకు శ్రద్ధ చూపకుండానే దాని నుండి విముఖత చూపుతారు. మరియు దాన్ని కలిగిన వారిని (అసత్యపరులని) ఉద్దేశించి ఇలా పలుకుతారు : మా కర్మలు మాకు,మీ కర్మలు మీకు. మీరు మా నుండి దూషణ,బాధల నుండి నిశ్ఛింతగా ఉన్నారు. ధర్మ విషయముల్లో,ప్రాపంచిక విషయంలో నష్టము,బాధ కలిగిన అజ్ఞాన వాసుల తోడు మాకు అవసరం లేదు.

Kasas 28:56

ఓ ప్రవక్తా నిశ్చయంగా మీరు ఇష్టపడిన వారికి అబూతాలిబ్,ఇతరుల్లాంటి వారిని విశ్వాసము భాగ్యమును కలిగించి సన్మార్గమును కలిగించ లేరు. కాని ఒక్కడైన అల్లాహ్ అతడే తాను కోరిన వారికి సన్మార్గపు భాగ్యమును కలిగించగలడు. మరియు ఆయనే సన్మార్గము వైపునకు మార్గము పొందే వారు ఎవరో తన ముందస్తు జ్ఞానము ద్వారా బాగా తెలిసిన వాడు.

Kasas 28:57

మరియు మక్కా వాసుల్లోంచి ముష్రికులు ఇస్లాంను అనుసరించటం నుండి,దానిపట్ల విశ్వాసమును కనబరచటం నుండి వంకలు చూపుతూ ఇలా పలుకుతారు : ఒక వేళ మేము నీవు తీసుకుని వచ్చిన ఈ ఇస్లామును అనుసరిస్తే మా శతృవులు మా దేశము నుండి మమ్మల్ని వేగముగా గెంటివేస్తారు. ఏమీ మేము ఈ ముష్రికులందరిని హరమ్ ప్రాంతములో నివాసమును కలిగించలేదా ?. అక్కడ రక్తపాతము,హింస నిషిద్ధము. వారిపై ఇతరుల దాడి నుండి అక్కడ వారు నిశ్చింతగా ఉన్నారు. అక్కడ అన్ని రకాల ఫలములు మా వద్ద నుండి ఆహారముగా చేరుతున్నాయి. దాన్ని మేము వారి వద్దకు తీసుకుని వచ్చాము. కాని వారిలో నుండి చాలా మందికి అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహాలకి కృతజ్ఞతలు తెలపటం తెలియదు.

Kasas 28:58

మరియు చాలా బస్తీలు తమపై ఉన్నఅల్లాహ్ అనుగ్రహములను తిరస్కరించి పాప కార్యముల్లో,అవిధేయకార్యముల్లో వృధా అయిపోయినవి. అప్పుడు మేము వారిపై ఒక శిక్షను పంపించి దాని ద్వారా వారిని తుదిముట్టించాము. ఇవి నాశనమైన వారి నివాసములు వాటిపై నుండి ప్రజలు పోతుంటారు. అక్కడ నివాసమున్న వారి తరువాత పయనమయ్యే వారిలో నుండి కొద్దిమంది తప్ప నివాసముండలేదు. మరియు ఆకాశముల్లో,భూమిలో మరియు వాటిలో ఉన్న వారికి మేము వారసులమయ్యాము.

Kasas 28:59

ఓ ప్రవక్తా మీ ప్రభువు నగరములను ముఖ్య నగరమైన మక్కాలో మిమ్మల్ని ప్రవక్తగా పంపించినట్లు వాటిలో పెద్ద నగరములో ఒక ప్రవక్తను పంపించి అక్కడి వాసులను మన్నించినంత వరకు వినాశనం చేయడు. మరియు మేమూ నగరవాసులు సత్యంపై స్థిరంగా ఉన్న స్థితిలో ఉంటే నాశనం చేయము. మేము మాత్రం ఒక వేళ వారు అవిశ్వాసం, పాప కార్యములకు పాల్పడటం వలన దుర్మార్గులైతే వారిని నాశనం చేస్తాము.

Kasas 28:60

మరియు మీకు మీ ప్రభువు ప్రసాదించినది ఏదైన దాని ద్వారా మీరు ఇహలోక జీవితంలో ప్రయోజనం చెందుతారు,అలంకరించుకుంటారు. ఆ పిదప అది అంతమైపోతుంది. మరియు పరలోకంలో అల్లాహ్ వద్ద ఉన్న గొప్ప ప్రతిఫలం ఇహలోకంలో ఉన్న సామగ్రి,అలంకరణ కన్న మేలైనది,శాస్వతంగా ఉండేది. ఏమీ మీరు దాన్ని అర్ధం చేసుకొని అంతమైపోయే దానిపై శాస్వతంగా ఉండే దాన్ని ప్రాధాన్యతనివ్వరా ?!.

Kasas 28:61

ఏమీ పరలోకము,అందులో ఉన్న శాస్వత అనుగ్రహాల గురించి మేము వాగ్దానం చేసిన వాడు అతనితో సమానుడు కాగలడా ఎవడికైతే మేము ఇహలోకంలో అతను ప్రయోజనం చెందే సంపద,అలంకరణను ప్రసాదించామొ. ఆ తరువాత అతడు ప్రళయదినాన నరకాగ్ని వైపునకు హాజరు చేయబడే వారిలో నుండి అయిపోతాడు ?!.

Kasas 28:62

మరియు ఆరోజు వారిని పరిశుద్ధుడైన,మహోన్నతుడైన వారి ప్రభువు ఇలా పలుకుతూ పిలుస్తాడు : నన్ను వదిలి మీరు ఆరాధించే నా భాగస్వాములు, వారు నా భాగస్వాములని మీరు వాదించిన వారు ఏరి ?.

Kasas 28:63

అవిశ్వాసం వైపున పిలిచే వారిలో నుండి ఎవరిపైనైతే శిక్ష అనివార్యమైనదో వారు ఇలా అంటారు : ఓ మా ప్రభువా వీరందరు మేము అపమార్గమును పొందిన విధంగా మేము అపమార్గమునకు లోను చేసిన వారు. మేము వారి నుండి నీ వద్ద నిర్దోషత్వమును కోరుతున్నాము. వారు మమ్మల్ని ఆరాధించేవారు కాదు. వారు కేవలం షైతానులను ఆరాధించేవారు.

Kasas 28:64

మరియు వారితో ఇలా అనబడుతుంది : మీరు ఉన్న అవమానము నుండి మిమ్మల్ని రక్షించటానికి మీరు మీ భాగస్వాములను పిలవండి. అప్పుడు వారు తమ భాగస్వాములను పిలుస్తారు. కాని వారు వారి పిలుపునకు సమాధానమివ్వరు. మరియు వారు తమ కొరకు సిద్ధం చేసి ఉంచిన శిక్షను చూసి తాము ఇహలోకంలో సత్యమునకు దారి పొంది ఉండాల్సిందని కోరుకుంటారు.

Kasas 28:65

మరియు ఆరోజు వారిని వారి ప్రభువు ఇలా పలుకుతూ పిలుస్తాడు : నేను మీ వద్దకు పంపించిన నా ప్రవక్తలకు మీరు ఏమి సమాధానమిచ్చారు ?.

Kasas 28:66

అప్పుడు వారు వాదించినవి వారిపై గోప్యమైపోయాయి,వారు ఏమీ ప్రస్తావించలేదు. వారు శిక్షించబడుతారని వారు పూర్తి నమ్మకముతో ఉండటం వలన వారికి కలిగిన ఆపద భయానక పరిస్థితి వలన వారు ఒకరినొకరు ప్రశ్నించుకోరు.

Kasas 28:67

కాని ఈ ముష్రికులందరిలో నుండి ఎవడైతే తన అవిశ్వాసము నుండి పశ్చాత్తాప్పడి,అల్లాహ్ పై,ఆయన ప్రవక్తలపై విశ్వాసమును కనబరచి,ఏదైన సత్కార్యమును చేస్తే బహుశా అతడు తాము ఆశించిన దాన్ని పొంది సాఫల్యము చెందే వారిలోంచి,తాము భయపడే వాటి నుండి ముక్తి పొందే వారిలో నుంచి అయిపోతాడు.

Kasas 28:68

మరియు ఓ ప్రవక్తా నీ ప్రభువు తాను సృష్టించదలచిన దాన్ని సృష్టిస్తాడు. మరియు తన విధేయత కొరకు,తన దౌత్యము కొరకు తాను కోరుకున్న వారిని ఎన్నుకుంటాడు. ముష్రికులకు అల్లాహ్ పై అభ్యంతరం తెలిపే అనుమతి ఉండదు. పరిశుద్ధుడైన ఆయన అతీతుడు మరియు ఆయన వారు ఆయనతో పాటు సాటి కల్పించేవారి నుండి పరిశుద్ధుడు.

Kasas 28:69

మరియు నిశ్ఛయంగా నీ ప్రభువుకి తన దాసుల హృదయాలు ఏమి దాస్తున్నాయో,ఏమి బహిర్గతం చేస్తున్నాయో తెలుసు. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే దాని పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

Kasas 28:70

మరియు ఆయనే అల్లాహ్ పరిశుద్ధుడు ఆయన తప్ప సత్య ఆరాధ్య దైవం లేడు. ఇహలోకములో స్థుతులన్నీ ఆయన ఒక్కడికే చెందుతాయి మరియు పరలోకంలో స్థుతులన్నీ ఆయన ఒక్కడికే చెందుతాయి. మరియు ఆయనకు తిరుగులేని జారి అయ్యే న్యాయ వ్యవస్థ కలదు. ప్రళయదినాన మీరు లెక్క కొరకు,ప్రతిఫలం కొరకు ఆయన ఒక్కడి వైపే మరలింపబడుతారు.

Kasas 28:71

ఓ ప్రవక్తా మీరు ఈ ముష్రికులందరితో ఇలా అడగండి : మీరు నాకు చెప్పండి ఒక వేళ అల్లాహ్ మీపై శాశ్వతంగా ఎడతెగకుండా,అంతం లేకుండా ప్రళయం వరకు రాత్రిని ఉండేటట్లు చేస్తే అల్లాహ్ కాకుండా మీ వద్దకు పగటి వెలుగులాంటి వెలుగును తీసుకుని వచ్చే ఆరాధ్య దైవం ఎవడు ?. ఏమీ మీరు ఈ వాదనలను వినరా,దానిని మీ వద్దకు తీసుకుని వచ్చే వాడు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం కాడని మీరు తెలుసుకోరా ?.

Kasas 28:72

ఓ ప్రవక్తా వారితో ఇలా అడగండి : మీరు నాకు చెప్పండి ఒక వేళ అల్లాహ్ ప్రళయం వరకు పగలును శాశ్వతంగా,ఎడతెగకుండా మీపై చేస్తే అల్లాహ్ కాకుండా మీ వద్దకు పగలు చేసిన కార్యల వలన కలిగిన అలసట నుండి మీరు విశ్రాంతి తాసుకోవటానికి మీరు ఉండే రాత్రిని తీసుకుని వచ్చే ఆరాధ్య దైవం ఎవడు ?!. ఏమీ మీరు ఈ సూచనలను చూడటం లేదా,వీటన్నింటిని మీ వద్దకు తీసుకుని వచ్చే వాడు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని మీరు తెలుసుకోరా ?!.

Kasas 28:73

ఓ ప్రజలారా మీరు పగలు పని చేయటం వలన అలసిపోయిన తరువాత విశ్రాంతి తీసుకోవటానికి రాత్రిని మీ కొరకు చీకటిగా చేయటం మరియు మీరు ఆహారోపాధి అన్వేషణలో శ్రమించటానికి పగలును మీ కొరకు కాంతివంతంగా చేయటం పరిశుద్ధుడైన ఆయన కారుణ్యము. బహుశా మీరు మీపై ఉన్నఅల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటారని,వాటి పట్ల కృతఘ్నులు కారని.

Kasas 28:74

మరియు ఆరోజు వారిని పరిశుద్ధుడైన,మహోన్నతుడైన వారి ప్రభువు ఇలా పలుకుతూ పిలుస్తాడు : నన్ను వదిలి మీరు ఆరాధించే నా భాగస్వాములు, వారు నా భాగస్వాములని మీరు వాదించిన వారు ఏరి ?.

Kasas 28:75

మరియు మేము ప్రతీ జాతి నుండి దాని ప్రవక్తను తీసుకుని వస్తాము,అతడు వారికి వ్యతిరేకంగా వారు ఉన్న అవిశ్వాసం,తిరస్కారం గురించి సాక్ష్యం పలుకుతాడు. ఆ జాతుల్లోంచి తిరస్కరించిన వారితో మేము ఇలా పలుకుతాము : మీరు ఉన్న అవిశ్వాసము,తిరస్కారముపై మీ వాదనలను, ఆధారాలను ఇవ్వండి. అప్పుడు వారి వాదనలు అంతమైపోతాయి. మరియు ఎటువంటి సందేహం లేని సత్యము అల్లాహ్ కొరకే అని వారికి నమ్మకం కలుగుతుంది. పరిశుద్ధుడైన ఆయన కొరకు వారు కల్పించుకుని సాటికల్పించిన వారు వారి నుండి అదృశ్యమైపోతారు.

Kasas 28:76

నిశ్ఛయంగా ఖారూను మూసా అలైహిస్సలాం జాతి వారిలో నుండి వాడు. అతడు వారిపై అహంకారమును చూపాడు. మరియు మేము అతనికి ఎన్నో సంపదల యొక్క నిధులను ప్రసాదించాము అంటే దాని నిధుల తాళములను మోయటం బలవంతులైన సమూహమునకు భారంగా ఉండేది. అతడి జాతివారు అతడితో ఇలా పలికారు : నీవు అహంకార సంతోషమును కలిగి ఉండకు. నిశ్చయంగా అల్లాహ్ అహంకార సంతోషమును చూపేవారిని ఇష్టపడడు. అంతేకాక వారిని ద్వేషిస్తాడు మరియు దానిపై వారిని శిక్షిస్తాడు.

Kasas 28:77

మరియు నీవు అల్లాహ్ నీకు ప్రసాదించిన సంపదల్లో వాటిని మంచి మార్గముల్లో ఖర్చు చేసి పరలోక నివాసములో ప్రతిఫలాన్ని ఆశించు. మరియు నీవు తినటం,త్రాగటం,వస్త్రములు ధరించటం మొదలగు అనుగ్రహాల నీ భాగమును మరువకు. ఎటువంటి దుబారా లేకుండా,సందేహం లేకుండా (ఖర్చు చేయి). పరిశుద్ధుడైన ఆయన నీతో మంచిగా వ్యవహరించినట్లే నీ ప్రభువుతో,ఆయన దాసులతో మంచిగా వ్యవహరించు. మరియు నీవు పాపకార్యములకు పాల్పడి,విధేయ కార్యాలను విడనాడి భూమిలో అల్లకల్లోలాను కోరుకోకు. నిశ్చయంగా అల్లాహ్ వాటి ద్వారా భూమిలో అల్లకల్లోలాలను రేకెత్తించే వారిని ఇష్టపడడు. అంతే కాదు వారిని ద్వేషిస్తాడు.

Kasas 28:78

ఖారూన్ ఇలా పలికాడు : ఈ సంపదలన్నీ నాకు మాత్రం నా జ్ఞానం వలన,సామర్ధ్యం వలన ఇవ్వబడినవి. నేను వాటి హక్కుదారుడను. ఏమీ అతని కన్నా ముందు తమ శక్తి అధికంగా కల,తమ అధిక సంపదలు కల జాతుల వారిని అల్లాహ్ అంతమొందించాడన్న విషయం ఖారూనుకు తెలియదా ?. అప్పుడు వారి బలము,వారి సంపదలు వారికి ప్రయోజనం కలిగించలేదు. మరియు ప్రళయదినాన పాపత్ములు తమ పాపముల గురించి వాటి గురించి అల్లాహ్ కు జ్ఞానం ఉండటం వలన ప్రశ్నించబడరు. అప్పుడు వారిని ప్రశ్నించటం గద్దింపు ప్రశ్న,మందలింపు ప్రశ్న.

Kasas 28:79

అప్పుడు ఖారూను తన అహంకారమును ప్రదర్శిస్తూ తన వైభవంలో బయలుదేరాడు. ఖారూను సహచరుల్లోంచి ఇహలోక జీవిత వైభవములో అత్యాశను కలిగిన వారు ఇలా పలికారు : అయ్యో మా దౌర్భాగ్యం మేము కూడా ఖారూన్ కు ఇవ్వబడినట్లు ఇహలోక వైభవమును ఇవ్వబడి ఉంటే ఎంత బాగుండేది. నిశ్చయంగా ఖారూను పరిపూర్ణమైన పెద్ద వాటా కలిగిన వాడు.

Kasas 28:80

మరియు జ్ఞాన సంపన్నులు ఖారూనును అతని వైభవంలో చూసినప్పుడు,అతని సహచరులు ఆశపడుతున్న దానిని విన్నప్పుడు ఇలా పలికారు : మీ పాడు గాను! అల్లాహ్ ప్రసాదించే ప్రతిఫలం పరలోకంలో ఉన్నది. మరియు ఏవైతే ఆయన తయారు చేసి ఉంచాడో అనుగ్రహాలు అతన్ని విశ్వసించి,సత్కార్యములు చేసిన వారి కొరకు ఉన్నయో అవి ఖారూనుకు ఇవ్వబడిన ప్రాపంచిక వైభవము కన్న గొప్పవి. ఈ మాటను పలకటానికి,దానికి తగ్గట్టుగా ఆచరించటానికి ఇహలోకంలో ఉన్న అంతమైపోయే ప్రాపంచిక సామగ్రిపై అల్లాహ్ వద్ద ఉన్న పుణ్యముపై ప్రాధాన్యత ఇవ్వటంపై సహనం చూపే ఓర్పుగలవారికే ఈ భాగ్యం కలిగించబడుతుంది.

Kasas 28:81

అప్పుడు మేము అతని ద్రోహానికి ప్రతీకారంగా అతనిని,అతని ఇంటిని,అందులో ఉన్న వారందరిని భూమిలోకి కూర్చివేశాము. అల్లాహ్ తప్ప అతనికి సహాయం చేయటానికి ఎటువంటి వర్గము వారు అతని కొరకు లేకుండాపోయారు. మరియు అతను స్వయంగా తనను కాపాడుకోలేకపోయాడు.

Kasas 28:82

అతన్ని కూర్చక ముందు అతని సంపదలో,అతని వైభవంలో ఆశను కలిగిన వారు ఇలా పలకసాగారు : అల్లాహ్ తన దాసుల్లోంచి తాను కోరిన వారికి ఆహారోపాధిని విస్తరింపజేస్తాడని,వారిలో నుండి తాను కోరిన వారిపై కుంచింపజేస్తాడని మాకు తెలియదా ఏమిటీ ?!. ఒక వేళ మేము పలికిన దానికి ఆయన శిక్షించకుండా అల్లాహ్ అనుగ్రహమే మాపై లేకుంటే ఖారూన్ ను కూర్చినట్లు మమ్మల్ని ఆయన కూర్చేవాడు. నిశ్చయంగా అవిశ్వాసపరులు ఇహలోకంలో గాని,పరలోకంలో గాని సాఫల్యం చెందరు. అంతే కాదు వారి పరిణామం,వారి స్థితి ఆ రెండింటిలో నష్టమే.

Kasas 28:83

ఈ పరలోక గృహమును మేము సత్యముపై విశ్వాసమును కనబరచి,దాన్ని అనుసరించటం నుండి భూమిలో అహంకారమును కోరని వారి కొరకు,అందులో చెడును ఆశించని వారి కొరకు అనుగ్రహాల,మర్యాదల గృహముగా చేస్తాము. స్థుతింపబడిన పరిణామమైన అనుగ్రహాలు కల స్వర్గము,అందులో ఉండే అల్లాహ్ ప్రసన్నత తమ ప్రభువు ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి తమ ప్రభువు భీతి కలిగిన వారి కొరకు ఉంటుంది.

Kasas 28:84

ప్రళయదినాన ఎవరైన నమాజు,జకాతు,ఉపవాసము మొదలగు వాటి లోంచి ఏ సత్కార్యమును తీసుకుని వచ్చినా అతని ఆ సత్కార్యము కన్నా మంచిగా ప్రతిఫలముంటుంది. ఏ విధంగా నంటే అతని కొరకు పుణ్యము పది రెట్లు అధికం చేయబడుతుంది. మరియు ఎవరైన అవిశ్వాసము, వడ్డీ సొమ్ము తినటం, వ్యభిచారము మొదలగు వాటిలో నుంచి ఏ దుష్కార్యమును తీసుకుని వచ్చినా దుష్కార్యములకు పాల్పడిన వారికి మాత్రం అధికం చేయకుండా వారు చేసిన దుష్కార్యమునకు సమాన ప్రతిఫలమే ప్రసాదించటం జరుగుతుంది.

Kasas 28:85

నిశ్ఛయంగా మీపై ఎవరైతే ఖుర్ఆన్ ను అవతరింపజేసి దాని ప్రచారమును,అందులో ఉన్న వాటిపై ఆచరణను మీపై విధిగావించాడో అతడు మిమ్మల్ని మక్కాకు విజయంతో మరలింపజేస్తాడు. ఓ ప్రవక్తా ముష్రికులతో ఇలా తెలపండి : ఎవరు సన్మార్గమును తీసుకొని వచ్చాడో,ఎవరు సన్మార్గము నుండి,సత్యము నుండి తప్పి స్పష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్నాడో నా ప్రభువుకు బాగా తెలుసు.

Kasas 28:86

ఓ ప్రవక్తా ఖుర్ఆన్ దైవ వాణి రూపంలో అల్లాహ్ వద్ద నుండి నీ వైపునకు అవతరిస్తుందని ప్రవక్తగా పంపించక మునుపు నీవు ఆశించ లేదు. కాని పరిశుద్ధుడైన ఆయన వద్ద నుండి కారుణ్యము నీపై దాని అవతరణను నిర్ణయించినది. కావున నీవు అవిశ్వాసపరులకు వారు ఉన్న అపమార్గములో సహాయకునిగా ఉండకు.

Kasas 28:87

ఈ ముష్రికులందరు అల్లాహ్ ఆయతుల నుండి అవి మీపై అవతరించిన తరువాత వాటిని మీరు పఠించటమును,వాటి ప్రచారమును వదిలివేయటానికి మరలించకూడదు. మరియు మీరు ప్రజలను అల్లాహ్ పై విశ్వాసము వైపునకు,ఆయన ఏకత్వం వైపునకు,ఆయన ధర్మంపై ఆచరణ వైపునకు పిలవండి. మరియు మీరు అల్లాహ్ తో పాటు ఇతరులను ఆరాధించే ముష్రికుల్లోంచి కాకండి. కాని మీరు ఒక్కడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించి ఏకేశ్వరోపాసన చేసే వారిలో నుంచి అయిపోండి.

Kasas 28:88

మరియు మీరు అల్లాహ్ తో పాటు వేరే ఆరాధ్య దైవమును ఆరాధించకండి. ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు. పరిశుద్ధుడైన ఆయన ముఖము తప్ప ప్రతీది నశిస్తుంది. న్యాయ నిర్ణయం ఆయన ఒక్కడి కొరకే,తాను కోరినది నిర్ణయిస్తాడు. ఆయన ఒక్కడి వైపునకే ప్రళయదినాన మీరు లెక్క తీసుకనబడటానికి,ప్రతిఫలం ప్రసాదించబడటానికి మరలింపబడుతారు.

Ankebut 29:1

(الٓـمٓ) అలిఫ్-లామ్-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.

Ankebut 29:2

ఏమీ ప్రజలు తాము అన్నమాట "మేము అల్లాహ్ ను విశ్వసించాము" తో వారు అన్న మాట వాస్తవికతను స్పష్టపరిచే ఎటువంటి పరీక్ష లేకుండా విడిచి పెట్టబడతారని భావిస్తున్నారా. వారు వాస్తవంగా విశ్వాసపరులా ?!. వారు అనుకుంటున్నట్లు విషయం కాదు.

Ankebut 29:3

మరియు నిశ్ఛయంగా మేము వారి కన్న పూర్వం ఉన్న వారిని పరీక్షించాము. అల్లాహ్ స్వరూప జ్ఞానముతో తప్పకుండా తెలుసుకుంటాడు మరియు తమ విశ్వాసంలో సత్యవంతుల నిజాయితీని,అందులో అసత్యపరుల అబద్దమును మీకు బహిర్గతం చేస్తాడు.

Ankebut 29:4

లేక షిర్కు,మొదలగు పాప కార్యములకు పాల్పడేవారు మమ్మల్ని ఓడించి మా శిక్ష నుండి తప్పింకోగలరని భావిస్తున్నారా ?. వారు నిర్ణయించుకుంటున్న వారి నిర్ణయం ఎంత చెడ్డది. వారు ఒక వేళ తమ అవిశ్వాస స్థితిలో మరణిస్తే వారు అల్లాహ్ ను అశక్తుడిని చేసి ఆయన శిక్ష నుండి తప్పించుకోలేరు.

Ankebut 29:5

ఎవరైతే ప్రళయ దినాన తనకు ప్రతిఫలం ప్రసాదించటానికి అల్లాహ్ ను కలుసుకునే ఆశ కలిగి ఉంటాడో అతడు దాని కొరకు అల్లాహ్ నిర్ణయించిన గడువు తొందరలోనే రాబోతుందని తెలుసుకోవాలి. మరియు అతడు తన దాసుల మాటలను బాగా వినేవాడు,వారి కర్మలను బాగా తెలిసినవాడు. వాటిలో నుండి ఏది ఆయన నుండి తప్పించుకోదు. మరియు ఆయన వాటిపరంగా వారికి తొందరలోనే ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

Ankebut 29:6

మరియు తన మనస్సును విధేయత చూపటంపై,పాపకార్యముల నుండి దూరంగా ఉండటంపై ప్రేరేపించి సాధన చేసేవాడు మరియు అల్లాహ్ మార్గంలో సాధన చేసేవాడు తన స్వయం కోసం సాధన చేసిన వాడు. ఎందుకంటే దాని ప్రయోజనం అతని వైపునకే మరలుతుంది. మరియు అల్లాహ్ సృష్టితాలన్నింటి నుండి అక్కరలులేని వాడు. వారి విధేయత అతనికి ఏమీ అధికం చేయదు మరియు వారి అవిధేయత ఆయనకు ఏమీ తగ్గించదు.

Ankebut 29:7

మరియు ఎవరైతే విశ్వసించి,వారికి మేము పరీక్షించిన దానిపై సహనం చూపి,సత్కార్యాలు చేస్తారో వారు చేసిన సత్కార్యాలకు బదులుగా మేము తప్పకుండా వారి పాపాలను తుడిచివేస్తాము. మరియు మేము వారికి పరలోకములో వారు ఇహలోకములో చేసుకున్న దాని కన్న మంచి ప్రతిఫలమును ప్రసాదిస్తాము.

Ankebut 29:8

మరియు మేము మానవునికి అతని తల్లిదండ్రులపట్ల మంచిగా వ్యవహరించమని,వారికి ఉపకారము చేయమని ఆదేశించాము. ఓ మానవుడా ఒక వేళా నీ తల్లిదండ్రులు నీకు సాటి కల్పించటం గురించి జ్ఞానం లేని దానిని నాతో పాటు సాటి కల్పించమని ప్రేరేపిస్తే ఏవిధంగా నైతే సఅద్ బిన్ అబీ వఖ్కాస్ రజిఅల్లాహు అన్హుకి ఆయన తల్లితో జరరిగినదో ఆ విషయంలో నీవు వారి మాట వినకు. ఎందుకంటే సృష్టి కర్తకు అవిధేయత చూపటంలో ఏ సృష్టికి విధేయత చూపకూడదు. ప్రళయదినాన నా ఒక్కడి వైపే మీ మరలటం జరుగుతుంది. అప్పుడు నేను మీరు ఇహలోకంలో ఏమి చేసేవారో మీకు తెలియపరుస్తాను. మరియు దాని పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాను.

Ankebut 29:9

మరియు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి,సత్కార్యములను చేసేవారిని మేము తప్పకుండా ప్రళయదినాన పుణ్యాత్ముల్లో చేర్చుతాము. వారితోపాటు వారిని సమీకరిస్తాము. మరియు వారి పుణ్యమును వారికే ప్రసాదిస్తాము.

Ankebut 29:10

మరియు ప్రజల్లోంచి కొంత మంది మేము అల్లాహ్ ను విశ్వసించాము అని అనేవారు ఉన్నారు. అవిశ్వాసపరులు అతని విశ్వాసం వలన అతన్ని హింసించినప్పుడు తనకు కలిగిన వారి శిక్షను అల్లాహ్ శిక్షగా చేసుకుని అవిశ్వాసపరులకు అనుగుణంగా విశ్వాసము నుండి మరలిపోతాడు. ఓ ప్రవక్తా ఒక వేళ మీకు మీ ప్రభువు వద్ద నుండి ఏదైన సహాయం కలిగితే వారు తప్పకుండా ఇలా పలుకుతారు : ఓ విశ్వాసపరులారా మేము మీతో పాటు విశ్వాసముపై ఉన్నాము. ఏమీ ప్రజల మనస్సులలో ఉన్న దాని గురించి అల్లాహ్ కు బాగా తెలియదా ?!. వాటిలో ఉన్న అవిశ్వాసము,విశ్వాసము ఆయనపై గోప్యంగా ఉండదు. అటువంటప్పుడు వారు తమ హృదయములలో ఉన్న దాని గురించి అల్లాహ్ కి ఎలా తెలియపరచగలరు. వాస్తవానికి వాటిలో ఉన్నదాని గురించి వారి కన్న బాగా ఆయనకు తెలుసు.

Ankebut 29:11

మరియు అల్లాహ్ వాస్తవంగా తనపై విశ్వాసమును కనబరచిన వారిని తప్పకుండా స్పష్టపరుస్తాడు. మరియు ఆయన విశ్వాసమును బహిరంగపరచి అవిశ్వాసమును గోప్యంగా ఉంచే కపటులను స్పష్టపరుస్తాడు.

Ankebut 29:12

మరియు అవిశ్వాసపరులు అల్లాహ్ ఒక్కడిని విశ్వసించే వారితో ఇలా పలుకుతారు : మీరు మా ధర్మమును,మేము దేనిపైనైతే ఉన్నామో దానిని అనుసరించండి. మేమే మీ పాపములను మోస్తాము,వాటి ప్రతిఫలము మీరు కాకుండా మేమే పొందుతాము. వాస్తవానికి వారు వారి పాపముల్లోంచి ఏదీ మోయరు. మరియు నిశ్ఛయంగా వారు దాన్ని తమ హృదయములలో అబద్దము పలుకుతున్నారు.

Ankebut 29:13

మరియు తమ అసత్యము వైపు పిలిచే ఈ ముష్రికులందరు తాము పాల్పడినటువంటి పాపములను తప్పకుండా మోస్తారు. మరియు తమ పిలుపును అనుసరించినటువంటి వారి పాపములను అనుసరించిన వారి పాపములను వారి కొరకు ఏమాత్రం తగ్గించకుండా మోస్తారు. మరియు ప్రళయదినాన వారు ఇహలోకములో కల్పించుకున్న అసత్యాల గురించి వారు తప్పకుండా ప్రశ్నించబడుతారు.

Ankebut 29:14

మరియు నిశ్ఛయంగా మేము నూహ్ అలైహిస్సలాంను ఆయన జాతి వారి వద్దకు ప్రవక్తగా పంపించాము. అప్పుడు ఆయన వారిని అల్లాహ్ ఏకేశ్వరోపాసన వైపునకు పిలుస్తూ వారిలో తొమ్మిది వందల యాభై సంవత్సరములు ఉండిపోయారు. అప్పుడు వారు అతన్ని తిరస్కరించి తమ అవిశ్వాసంపై కొనసాగిపోయారు. అప్పుడు వారికి అల్లాహ్ పట్ల వారి అవిశ్వాసం వలన,ఆయన ప్రవక్తల పట్ల వారి తిరస్కారం వలన దుర్మార్గంలో ఉన్న స్థితిలో తుఫాను పట్టుకుంది. అప్పుడు వారందరు మునిగి చనిపోయారు.

Ankebut 29:15

అప్పుడు మేము నూహ్ ను,ఆయనతోపాటు ఉన్న విశ్వాసపరులను మునిగి చావకుండా నావలో రక్షించాము. మరియు మేము నావను గుణపాఠం నేర్చుకునే ప్రజల కొరకు ఒక గుణపాఠంగా చేశాము.

Ankebut 29:16

ఓ ప్రవక్తా మీరు ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతివారితో ఇలా పలికినప్పటి వృత్తాంతమును గుర్తు చేసుకోండి : మీరు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించండి. మరియు ఆయన ఆదేశించిన వాటిని పాటించటం ద్వారా ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయన శిక్షకు భయపడండి. మీకు ఆదేశించబడినది మీ కొరకు ఎంతో మేలైనది ఒక వేళ మీరు దాన్ని తెలుసుకుంటే.

Ankebut 29:17

ఓ ముష్రికులారా మీరు కేవలం లాభం కలిగించలేని,నష్టం కలిగించలేని కొన్ని విగ్రహాలను మాత్రమే ఆరాధిస్తున్నారు. మీరు వారిని ఆరాధన కొరకు హక్కుదారులని వాదించినప్పుడు మీరు అబద్దమును కల్పించుకున్నారు. నిశ్ఛయంగా మీరు అల్లాహ్ ను వదలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు మీకు ఆహారమును ప్రసాదించటానికి ఎటువంటి మీ ఆహారోపాధి అధికారము వారికి ఉండదు. కాబట్టి మీరు అల్లాహ్ వద్ద ఆహారమును కోరండి. ఆయనే ఆహార ప్రధాత. మీరు ఆయన ఒక్కడినే ఆరాధించండి. మరియు ఆయన మీకు అనుగ్రహించిన ఆహారముపై ఆయనకు కృతజ్ఞత తెలుపుకోండి. ప్రళయదినాన లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు ఆయన ఒక్కడి వైపే మీరు మరలించబడుతారు,మీ విగ్రహాల వైపు కాదు.

Ankebut 29:18

ఓ ముష్రికులారా మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరిస్తే మీకన్న పూర్వ జాతులు నూహ్, ఆద్,సమూద్ జాతి లాంటి వారు కూడా తిరస్కరించారు. ప్రవక్తపై కేవలం స్పష్టంగా చేరవేసే బాధ్యత మాత్రమే ఉన్నది. నిశ్ఛయంగా అతని ప్రభువు మీకు చేరవేయమని ఆదేశించిన వాటిని మీకు చేరవేశాడు.

Ankebut 29:19

ఏమీ అల్లాహ్ సృష్టిని ఏవిధంగా ఆరంభించాడో,ఆ తరువాత దాని వినాశనం తరువాత ఎలా మరలింపజేస్తున్నాడో ఈ తిరస్కారులందరు చూడటం లేదా ?!. నిశ్ఛయంగా ఇది అల్లాహ్ పై ఎంతో సులభము. ఆయన సామర్ధ్యం కలవాడు ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.

Ankebut 29:20

ఓ ప్రవక్త మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వీరందరితో ఇలా తెలపండి : మీరు భూమిలో సంచరించి అల్లాహ్ సృష్టిని ఏ విధంగా ఆరంభించాడో చూడండి. ఆ తరువాత అల్లాహ్ ప్రజలను వారి మరణం తరువాత మరల లేపటం కొరకు,లెక్క తీసుకోవటం కొరకు రెండవ సారి జీవింపజేస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. అతన్ని ఏదీ అశక్తుడిని చేయదు. ప్రజలను ఆయన మరలా లేపటం నుండి అశక్తుడు కాడు ఏవిధంగా నైతే ఆయన వారిని ఆరంభంలో సృష్టించటంలో అశక్తుడు కాలేదో.

Ankebut 29:21

తన సృష్టితాల్లో నుండి తాను కోరిన వారికి తన న్యాయము ద్వారా శిక్షిస్తాడు. మరియు తన సృష్టితాల్లోంచి తాను కోరిన వారికి తన అనుగ్రహము ద్వారా కరుణిస్తాడు. ఆయన మిమ్మల్ని మీ సమాధుల నుండి జీవింపజేసి లేపినప్పుడు మీరు ప్రళయదినాన ఆయన ఒక్కడి వైపునకే మరలించబడుతారు.

Ankebut 29:22

మరియు మీరు మీ ప్రభువు నుండి తప్పించుకోలేరు. మరియు మీరు భూమిలో గాని,ఆకాశములో గాని ఆయన శిక్ష నుండి విముక్తి పొందలేరు. మరియు మీ కొరకు మీ వ్యవహారమును రక్షించే రక్షకుడు అల్లాహ్ తప్ప ఇంకెవ్వడూ లేడు. మరియు అల్లాహ్ తప్ప ఆయన శిక్షను మీ నుండి తొలగించే సహాయకుడు మీ కొరకు ఎవడూ లేడు.

Ankebut 29:23

మరియు పరిశుద్ధుడైన ఆయన ఆయతులను,ప్రళయ దినాన ఆయనను కలుసుకోవటమును తిరస్కరించే వారందరు నా కారుణ్యమును నుండి నిరాశ్యులైపోయారు. వారు తమ అవిశ్వాసం వలన ఎన్నటికి స్వర్గంలో ప్రవేశించలేరు. వారందరి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది అది పరలోకములో వారి కొరకు నిరీక్షిస్తుంది.

Ankebut 29:24

ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతి వారికి అల్లాహ్ ఒక్కడినే ఆరాధించి ఆయన కాకుండా ఇతరులైన విగ్రహాల ఆరాధనను విడనాడండి అని ఆదేశించినప్పుడు ఆయన జాతి వారి సమాధానం మీ విగ్రహాలకు సహాయం చేయటం కొరకు అతడిని చంపి వేయండి లేదా అతన్ని అగ్నిలో పడవేయండి అని మాత్రం అయింది. అప్పుడు అల్లాహ్ ఆయనను అగ్ని నుండి రక్షించాడు. నిశ్ఛయంగా ఆయనను అగ్నిలో వేసిన తరువాత దాని నుండి ఆయనను రక్షించటంలో విశ్వసించే జనులకు గుణపాఠం కలదు. ఎందుకంటే వారే గుణపాఠము ద్వారా ప్రయోజనం చెందుతారు.

Ankebut 29:25

మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతి వారితో ఇలా పలికారు : మీరు కొన్ని విగ్రహాలను ఆరాధ్య దైవాలుగా చేసుకుని ఇహలోక జీవితంలో పరస్పర పరిచయం కొరకు,పరస్పరం ప్రేమించుకోవటం కొరకు వాటిని ఆరాధించేవారు. ఆ తరువాత ప్రళయదినాన మీ పరస్పర ప్రేమ అంతమైపోతుంది. శిక్షను కళ్ళారా చూసినప్పుడు మీలోని ఒకరినొకరు సంబంధము లేదని చెబుతారు. మరియు ఒకరినొకరు శపించుకుంటారు. నరకాగ్ని మీరు శరణు తీసుకునే మీ నివాసము. అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని ఆపే సహాయకుల్లోంచి మీ కొరకు ఎవరు ఉండరు. అల్లాహ్ ను వదిలి మీరు ఆరాధించే మీ విగ్రహాల్లోంచి గాని ఇతరుల్లోంచి గాని ఉండరు.

Ankebut 29:26

అప్పుడు ఆయనపై లూత్ అలైహిస్సలాం విశ్వాసమును తీసుకుని వచ్చారు. మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా పలికారు : నిశ్ఛయంగా నేను నా ప్రభువు వైపునకు శుభ ప్రదమైన సిరియా ప్రాంతము వైపునకు వలసపోతాను. నిశ్ఛయంగా ఆయనే ఎవరూ ఆధిక్యత చూపలేని సర్వశక్తిమంతుడు. మరియు ఆయన తన వైపునకు వలసపోయి వచ్చే వారిని అవమానమునకు లోను చేయడు. తన విధి వ్రాతలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.

Ankebut 29:27

మరియు మేము ఇబ్రాహీం అలాహిస్సలాంనకు ఇస్హాఖ్ ను,అతని కుమారుడగు యాఖూబ్ ను ప్రసాదించాము. మరియు అతని సంతానములో దైవ దౌత్యమును, అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన గ్రంధములను చేశాము. మరియు ఇహలోకములో సత్య మార్గముపై ఆయన సహనమునకు ప్రతిఫలంగా సంతానము మంచితనము,మంచి ప్రశంసలను ప్రసాదించాము. మరియు నిశ్ఛయంగా అతడు పరలోకములో పుణ్యాత్ముల ప్రతిఫలం ప్రసాదించబడుతాడు. ఇహలోకంలో అతనికి ప్రసాదించబడినది పరలోకంలో అతని కొరకు సిద్ధం చేసి ఉంచిన గౌరవప్రదమైన ప్రతిఫలమును తగ్గించదు.

Ankebut 29:28

ఓ ప్రవక్తా లూత్ అలైహిస్సలాంను ఆయన తన జాతి వారితో ఇలా పలికినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి : నిశ్ఛయంగా మీరు మీ కన్నా ముందు లోక వాసుల్లోంచి చేయని నీతి మాలిన పనిని మీరు చేశారు. మీరే మంచి స్వభావము నిరాకరించే ఈ పాపమును మొదట ఆరంభించిన వారు.

Ankebut 29:29

ఏమీ మీరు మీ కామ కోరికలు తీర్చుకోవటానికి మగవారి వెనుక భాగము వద్దకు వస్తున్నారా,మరియు మీరు ప్రయాణికులపై దారి కొడుతున్నారా అప్పుడు వారు మీరు పాల్పడే అశ్లీల కార్యంనకు భయపడి మీ దరిదాపుల నుండి ప్రయాణం చేయటం లేదు. మరియు మీరు మీ సభలలో నగ్నత్వం, మీ వద్ద నుండి వెళ్ళేవారిని మాటలతో,చేతలతో బాధ పెట్టటం లాంటి అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్నారా ?. అసభ్యకరమైన చర్యల నుండి ఆయన వారింపు తరువాత ఆయన జాతి వారి జవాబు ఆయనతో ఈ విధంగా పలకటం తప్పా ఇంకేమి ఉండేది కాదు : నీవు నీ వాదనలో సత్యవంతుడివే అయితే నీవు మమ్మల్ని బెదిరిస్తున్న అల్లాహ్ శిక్షను మా వద్దకు తీసుకునిరా.

Ankebut 29:30

లూత్ అలైహిస్సలాం తన జాతి వారి మొండి వైఖరి,తమపై శిక్షను కురిపించమని వారి కోరిక తనను తక్కువగా అంచనా వేస్తూ చేయటం తరువాత తమ ప్రభువును వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువు అవిశ్వాసము,అసభ్యకరమైన పాపములను వ్యాపింపజేసి భూమిలో ఉపద్రవాలను సృష్టించే జనులకి వ్యతిరేకంగా నాకు సహాయం చేయి.

Ankebut 29:31

మరియు ఎప్పుడైతే మేము పంపించిన దూతలు ఇబ్రాహీం అలైహిస్సలాంనకు ఇస్హాఖ్,అతని తరువాత అతని కుమారుడు యాఖూబ్ గురించి శుభవార్తనిస్తూ వచ్చారో అప్పుడు ఆయనతో ఇలా పలికారు : నిశ్చయంగా మేము లూత్ అలైహిస్సలాం ఊరైన సదూమ్ ఊరి వాసులను తుదిముట్టించే వారము. నిశ్ఛయంగా దాని వాసులు అశ్లీల కార్యములకు పాల్పడటం వలన దుర్మార్గులైపోయారు.

Ankebut 29:32

ఇబ్రాహీం అలైహిస్సలాం దైవ దూతలతో ఇలా పలికారు : నిశ్చయంగా మీరు తుదిముట్టించదలచిన ఈ ఊరి వాసులలో లూత్ కూడా ఉన్నారు. ఆయన దుర్మార్గుల్లోంచి కారు కదా. దైవ దూతలు ఇలా సమాధానమిచ్చారు : అక్కడ ఉన్న వారి గురించి మాకు బాగా తెలుసు. మేము అతన్ని,అతని ఇంటి వారిని ఊరి వాసులపై కురిసే వినాశనము నుండి తప్పకుండా రక్షిస్తాము. కానీ ఆయన భార్య వినాశనమైపోయి వెనుక ఉండే వారిలోంచి అయిపోయింది. మేము తొందరలోనే ఆమెను వారితోపాటు తుదిముట్టిస్తాము.

Ankebut 29:33

లూత్ జాతి వారిని తుదిముట్టించటానికి మేము పంపించిన దూతలు లూత్ వద్దకు వచ్చినప్పుడు తన జాతి వారి చెడు నుండి వారిపై భయం వలన వారి రాక ఆయనకు చెడుగా అనిపించింది,ఆయనకు బాధను కలిగించింది. వాస్తవానికి దూతలు ఆయన వద్దకు మగవారి రూపములో వచ్చారు. మరియు అతని జాతి వారు కామ కోరికలను తీర్చుకోవటానికి స్త్రీలను కాకుండా మగవారి వద్దకు వచ్చేవారు. మరియు దైవ దూతలు ఆయనతో ఇలా పలికారు : నీవు భయపడకు. నీ జాతి వారు నీకు చెడు చేయలేరు. మరియు నీకు మేము వారి వినాశనము గరించి ఇచ్చిన వార్త పై బాధపడకు. నిశ్చయంగా మేము మిమ్మల్ని,మీ ఇంటి వారిని వినాశనం నుండి రక్షిస్తాము. కాని మీ భార్య వెనుక ఉండి వినాశనమైపోయే వారిలో అయిపోతుంది. మేము తొందరలోనే వారితోపాటు ఆమెను తుదిముట్టిస్తాము.

Ankebut 29:34

నిశ్చయంగా మేము దుశ్చర్యలకు పాల్పడే ఈ నగర వాసులపై ఆకాశము నుండి శిక్షను కురిపిస్తాము. అది మట్టితో తయారైన కంకరు రాళ్ళు. వారు అసభ్యకరమైన,అశ్లీల కార్యమునకు పాల్పడటం ద్వారా అల్లాహ్ విధేయత నుండి వైదొలిగిపోవటం వలన వారిపై శిక్షగా. మరియు అది స్త్రీలను కాకుండా పురుషులతో వారు కామ కోరికలు తీర్చుకోవటం.

Ankebut 29:35

మరియు నిశ్చయంగా మేము నాశనం చేసిన ఈ ఊరి ద్వారా బుద్ధిమంతులైన జనుల కొరకు ఒక స్పష్టమైన సూచనను విడిచిపెట్టాము. ఎందుకంటే వారే సూచనల ద్వారా గుణపాఠం నేర్చుకుంటారు.

Ankebut 29:36

మరియు మేము వంశ పరంగా వారి సోదరుడైన షుఐబ్ అలైహిస్సలాంను మద్యన్ వైపునకు ప్రవక్తగా పంపించాము. అప్పుడు ఆయన ఇలా పలికాడు : ఓ నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించండి. మరియు మీ ఆరాధన ద్వారా అంతిమ దినమున మీరు ప్రతిఫలమును అతని నుండే ఆశించండి. మరియు మీరు పాప కార్యములు చేసి వాటిని వ్యాపింపజేయటం ద్వారా భూమిలో అల్లకల్లోలాలను సృష్టించకండి.

Ankebut 29:37

అప్పుడు అతని జాతి వారు అతన్ని తిరస్కరించారు. అప్పుడు భూకంపం వారిని కబళించింది. అప్పుడు వారు తమ ఇండ్లలోనే తమ ముఖములపై బొర్లా పడిపోయినట్లు అయిపోయారు. వారి ముఖములకు మట్టి అంటుకున్నది,వారిలో ఎటువంటి చలనం లేదు.

Ankebut 29:38

మరియు మేము ఇదే విధంగా హూద్ అలైహిస్సలాం జాతి అయిన ఆద్ ను,సాలిహ్ జాతి వారైన సమూద్ ను నాశనం చేశాము. ఓ మక్కా వాసులారా హజరె మౌత్ నుండి హిజర్,షిహర్ పట్టణాల్లో ఉన్న వారి నివాసములు వారి వినాశనముపై మీకు సూచిస్తున్న దాని నుండి మీకు స్పష్టమయ్యింది. వారి ఖాళీ నివాసములు దానికి సాక్ష్యం. మరియు షైతాను వారు ఉన్న అవిశ్వాసము,ఇతర పాపములను వారికి మంచిగా చేసి చూపించాడు. అప్పుడు అతడు వారిని సన్మార్గము నుండి మరలింపజేశాడు. వారికి వారి ప్రవక్తలు బోధించటం వలన వారు సత్యం,మార్గ భ్రష్టత,సన్మార్గం,మార్గ విహీనత గురించి దూర దృష్టి కలవారై ఉండేవారు. కాని వారు సన్మార్గమును అనుసరించటముకు బదులుగా మనోవాంచలను అనుసరించటమును ఎంచుకున్నారు.

Ankebut 29:39

మరియు మేము ఖారూనును అతడు మూసా జాతి వారిపై బలవంతం చేసినప్పుడు అతనిని అతని ఇంటితో సహా (భూమిలో) కూర్చి నాశనం చేశాము. మరియు మేము ఫిర్ఔన్,అతని మంత్రి అయిన హామానును సముద్రంలో ముంచి నాశనం చేశాము. వాస్తవానికి మూసా తన విజాయితీపై సూచించే స్పష్టమైన సూచనలను వారి వద్దకు తీసుకుని వచ్చారు. కాని వారు ఆయనపై విశ్వాసము కనబరచటం నుండి మిసర్ భూమిలో అహంకారమును చూపారు. మరియు వారు మా నుండి తప్పించుకుని మా శిక్ష నుండి భద్రంగా ఉండలేరు.

Ankebut 29:40

ప్రస్తావించబడిన వారిలో నుండి ప్రతి ఒక్కరిని మేము అంతక ముందే నాశనం చేసే మా శిక్ష ద్వారా పట్టకున్నాము. వారిలో నుండి కొందరు లూత్ జాతి వారు ఉన్నారు. వారిపై మేము కాల్చి మట్టితో తయారు చేయబడిన కంకర రాళ్ళను కురిపించాము. వారిలో నుండి కొందరు సాలిహ్ అలైహిస్సలాం జాతివారు,షుఐబ్ అలైహిస్సలాం జాతి వారు ఉన్నారు వారిని భయంకరమైన గర్జన పట్టుకుంది. వారిలో నుండి ఖారూన్ కూడా ఉన్నాడు. అతని ఇంటితో సహా అతడిని మేము భూమిలో కూర్చి వేశాము. మరియు వారిలో నుండి నూహ్ అలైహిస్సలాం,ఫిర్ఔన్,హామాన్ జాతి వారు ఉన్నారు వారిని మేము ముంచి నాశనం చేశాము. మరియు అల్లాహ్ ఏ పాపము లేకుండా వారిని నాశనం చేసి వారిని హింసించడు. కానీ వారే పాప కార్యములకు పాల్పడి తమ స్వయమును హింసించుకున్నారు. కాబట్టి వారు శిక్షకు అర్హులయ్యారు.

Ankebut 29:41

అల్లాహ్ ను వదిలి కొన్ని విగ్రహాలను తయారు చేసుకుని వాటి నుండి లాభమును లేదా వాటి సిఫారసును ఆశిస్తూ వాటిని ఆరాధించే ముష్రికుల ఉపమానమును తనపై దాడి చేయటం నుండి తన రక్షణ కొరకు సాలె పురగు నిర్మించుకున్న ఒక ఇంటితో పోల్చవచ్చు. మరియు నిశ్ఛయంగా ఇండ్లలో అత్యంత బలహీనమైన ఇల్లు సాలె పురుగు ఇల్లు. అది దాని నుండి ఏ శతృవును నిరోధించదు. ఇదే విధంగా వారి విగ్రహాలు ప్రయోజనం కలిగించవు,నష్టం కలిగించవు,సిఫారసు చేయవు. ఒక వేళ ముష్రికులు ఇది తెలుసుకుంటే వారు అల్లాహ్ ను వదిలి కొన్ని విగ్రహాలను తయారు చేసుకుని ఆరాధించేవారు కాదు.

Ankebut 29:42

నిశ్చయంగా పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ కి వారు ఆయనను వదిలి దేనిని ఆరాధిస్తున్నారో తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయన ముందు దాగి ఉండదు. మరియు ఆయన ఓడించబడని సర్వ శక్తిమంతుడు. తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.

Ankebut 29:43

మరియు మేము ప్రజలకు ఇచ్చే ఉపమానములు వారిని మేల్కొలపటానికి,వారిని సత్యమును చూపించి దాని వైపునకు మార్గదర్శకం చేయటానికి. అల్లాహ్ ధర్మ శాసనములను,ఆయన విజ్ఞతలను తెలుసుకున్న వాడే వాటిని ఆశించిన విధంగా పొందగలడు.

Ankebut 29:44

పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ ఆకాశములను,భూమిని సత్యాధారంగా సృష్టించాడు. మరియు ఆయన వాటిని అసత్యాధారంగా సృష్టించలేదు. మరియు వాటిని వృధాగా సృష్టించలేదు. నిశ్చయంగా ఈ సృష్టించటంలో విశ్వాసపరుల కొరకు అల్లాహ్ సామర్ధ్యముపై స్పష్టమైన ఆధారం కలదు. ఎందుకంటే వారే అల్లహ్ సృష్టి ద్వారా పరిశుద్ధుడైన సృష్టి కర్తపై ఆధారమును గ్రహిస్తారు. కాని అవిశ్వాసపరులు పరిశుద్ధుడైన సృష్టి కర్త గొప్పతనము,ఆయన సామర్ధ్యము వైపునకు తమ దృష్టిని మరల్చకుండా జగతిలో,తమలో ఉన్న సూచనలపై నుండి వెళుతున్నారు.

Ankebut 29:45

ఓ ప్రవక్తా అల్లాహ్ మీ వైపునకు దైవ వాణి ద్వారా అవతరింపజేసిన ఖుర్ఆన్ ను ప్రజలకు చదివి వినిపించండి. మరియు మీరు నమాజును పరిపూర్ణంగా పాటించండి. నిశ్చయంగా పరిపూర్ణ లక్షణాలతో చేయబడిన నమాజు హృదయములలో పాపములకు పాల్పడటం నుండి ఆపే,సత్కార్యములు చేయటానికి మార్గదర్శకం చేసే వెలుగు కలగటం వలన దాన్ని (నమాజును) పాటించే వాడిని పాపకార్యములలో,దుష్కార్యముల్లో పడటం నుండి ఆపుతుంది. అల్లాహ్ ధ్యానము ప్రతీ వస్తువు నుండి పెద్దది,గొప్పది. మరియు వారు చేసేది అల్లాహ్ కి తెలుసు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయన ముందు గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే మీకు మీ కర్మల పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఒక వేళ అవి మంచివైతే మంచిగా (ప్రతిఫలం) ఉంటుంది. మరియు ఒక వేళ అవి చెడుగా ఉంటే చెడుగా ఉంటుంది.

Ankebut 29:46

ఓ విశ్వాసపరులారా మీరు యూదులతో,క్రైస్తవులతో మంచి పధ్ధతిలో, ఉత్తమమైన విధానంలో మాత్రమే సంభాషించండి,వాదించండి. అది హితబోధన ద్వారా, స్పష్టమైన వాదనల ద్వారా పిలుపునివ్వటం. కానీ వారిలో నుండి ఎవరైతే మొండితనం,అహంభావంతో దుర్మార్గమునకు పాల్పడ్డారో మరియు మీపై యుద్దమును ప్రకటించారో వారితో మీరు వారు ముస్లిములయ్యేంతవరకు లేదా పరాభవమునకు లోనై తమ చేతులతో జిజియా చెల్లించనంత వరకు పోరాడండి. మరియు మీరు యూదులతో,క్రైస్తవులతో ఇలా పలకండి : అల్లాహ్ మా వైపునకు అవతరించిన ఖుర్ఆన్ ను మేము విశ్వసించాము మరియు మీ వైపునకు అవతరించిన తౌరాతును,ఇంజీలును విశ్వసించాము. మరియు మీ ఆరాధ్య దైవము,మా ఆరాధ్య దైవము ఒక్కడే. ఆయన ఆరాధనలో,ఆయన దైవత్వములో,ఆయన పరిపూర్ణతలో ఆయనకు ఎవ్వరూ సాటి లేరు. మరియు మేము ఆయన ఒక్కడి కొరకే లోబడి,విధేయులై ఉన్నాము.

Ankebut 29:47

మరియు మేము మీ కన్నాపూర్వికులపై గ్రంధములను అవతరింపజేసినట్లే మీపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. తౌరాతును చదివే వీరందరిలో నుండి అబ్దుల్లాహ్ బిన్ సలాం లాంటి కొందరు తమ గ్రంధములలో దీని లక్షణములను పొందటం వలన దీనిని విశ్వసించారు. మరియు ఈ ముష్రికులందరిలో నుంచి కొందరు దీనిని విశ్వసించారు. సత్యం స్పష్టమైనా కూడా దాన్ని అవిశ్వసించటం,తిరస్కారము తమ అలవాటైన అవిశ్వాసపరులు మాత్రమే మా ఆయతులను తిరస్కరిస్తారు.

Ankebut 29:48

ఓ ప్రవక్తా మీరు ఖుర్ఆన్ కన్న ముందు ఏ గ్రంధమును చదివేవారు కాదు. మరియు మీరు దేనినీ మీ కుడి చేత్తో వ్రాసే వారు కాదు. ఎందుకంటే మీరు చదవలేని,వ్రాయలేని అజ్ఞాని. మరియు ఒక వేళ మీరు చదవగలిగి,వ్రాయగలిగితే ప్రజల్లోంచి అజ్ఞానులు మీ దైవదౌత్యం గురించి సందేహపడేవారు. మరియు మీరు పూర్వ గ్రంధాల నుండి వ్రాస్తున్నారని వారు సాకుల చెప్పేవారు.

Ankebut 29:49

అసలు మీ పై అవతరింపబడిన ఖుర్ఆన్ విశ్వాసపరుల్లోంచి జ్ఞానమివ్వబడిన వారి హృదయాలలో ఉన్న స్పష్టమైన ఆయతులు. మరియు అల్లాహ్ పై అశ్వాసమును కనబరచి,ఆయనతోపాటు సాటి కల్పించటం వలన తమ స్వయానికి హింసకు పాల్పడే వారు మాత్రమే మా ఆయతులను తిరస్కరిస్తారు.

Ankebut 29:50

మరియు ముష్రికులు ఇలా పలికారు : ఎందుకని ముహమ్మద్ పై అతని ప్రభువు వద్ద నుండి అతని కన్న ముందు ప్రవక్తలపై అవతరించినటువంటి అద్భుత సూచనలు అవతరింపబడలేదు. ఓ ప్రవక్తా ఈ ప్రతిపాదకులందరితో ఇలా పలకండి : అద్భుత సూచనలు మాత్రం పరిశుద్ధుడైన అల్లాహ్ చేతిలో ఉన్నవి. ఆయన వాటిని తాను కోరుకున్నప్పుడు అవతరింపజేస్తాడు. వాటిని అవతరింపజేసే అధికారం నా దగ్గర లేదు. నేను మీ కొరకు అల్లాహ్ శిక్ష నుండి స్పష్టంగా హెచ్చరించేవాడు మాత్రమే.

Ankebut 29:51

మరియు ఏమీ అద్భుత సూచనల కొరకు ప్రతిపాదించే వీరందరికి ఓ ప్రవక్త మీరు వారిపై చదివి వినిపించే ఖుర్ఆన్ ను మేము మీపై అవతరింపజేయటం సరిపోదా. నిశ్చయంగా వారిపై అవతరింపబడే ఖుర్ఆన్ లో విశ్వసించే జనుల కొరకు కారుణ్యము,హితబోధన కలదు. వారే అందులో ఉన్న వాటి ద్వారా ప్రయోజనం చెందుతారు. పూర్వ ప్రవక్తలపై అవతరింపబడిన ఉపమానము దేనినైతే వారు ప్రతిపాదించారో దాని కన్న వారిపై అవతరింపబడినది మేలైనది.

Ankebut 29:52

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను తీసుకుని వచ్చిన దాని విషయంలో నా నిజాయితీ పై మరియు దాని పట్ల మీ తిరస్కారముపై సాక్షిగా పరిశుద్ధుడైన అల్లాహ్ యే చాలు. ఆకాశముల్లో ఉన్న వాటి గురించి ఆయనకు తెలుసు. మరియు భూమిలో ఉన్న వాటి గురించి ఆయనకు తెలుసు. ఆ రెండింటిలో ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఆరాధించే అసత్యాలన్నింటిపై విశ్వాసమును కనబరచి, ఆరాధనకు అర్హుడైన ఒక్కడైన అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరుస్తారో వారందరు విశ్వాసమునకు బదులుగా అవిశ్వాసమును కోరుకోవటం వలన నష్టపోయేవారు.

Ankebut 29:53

ఓ ప్రవక్తా ముష్రికులు ఏ శిక్ష గురించైతే మీరు వారిని హెచ్చరించారో దాన్ని తీసుకురమ్మని మిమ్మల్ని తొందరపెడుతున్నారు. ఒక వేళ అల్లాహ్ వారిని శిక్షించటం కొరకు ముందుకు జరగని,వెనుకకు జరగని ఒక సమయమును నిర్ణయించి ఉండకపోతే వారు కోరుకున్న శిక్ష వారి వద్దకు వచ్చితీరేది. మరియు అది వారి వద్దకు అకస్మాత్తుగా వచ్చిపడేది. మరియు వారు దాన్ని నమ్మలేకపోయేవారు.

Ankebut 29:54

మీరు వారిని ఏ శిక్ష గురించి వాగ్దానం చేశారో దాని గురించి వారు మిమ్మల్ని తొందరపెడుతున్నారు. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ అవిశ్వాసపరులకు వాగ్దానం చేసిన నరకం వారిని చుట్టుముట్టుతుంది. దాని శిక్ష నుండి వారు పారిపోలేరు.

Ankebut 29:55

ఆ రోజు శిక్ష వారి పైనుండి వారిని కప్పివేస్తుంది. మరియు అది వారి కాళ్ళ క్రింది నుండి వారి కొరకు పరుపుగా అయిపోతుంది. మరియు అల్లాహ్ వారిని దూషిస్తూ వారితో ఇలా పలుకుతాడు : మీరు చేస్తుండే షిర్కు,పాప కార్యల ప్రతిఫలమును రుచి చూడండి.

Ankebut 29:56

నన్ను విశ్వసించిన ఓ నా దాసులారా నా ఆరాధన సాధ్యంకాని ప్రాంతము నుండి మీరు వలసపోండి. నిశ్చయంగా నా భూమి ఎంతో విశాలమైనది. మీరు నా ఒక్కడి ఆరాధనే చేయండి. నాతోపాటు ఎవరినీ సాటి కల్పించకండి.

Ankebut 29:57

మరణ భయం మిమ్మల్ని వలసపోవటం నుండి ఆపకూడదు. ప్రతీ ప్రాణము మరణ రుచి చూడవలసినదే. ఆ తరువాత మీరు ప్రళయదినాన లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మా ఒక్కరి వైపునకే మరలించబడుతారు.

Ankebut 29:58

మరియు ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి ఆయన సాన్నిధ్యమును చేకూర్చే సత్కార్యములు చేస్తారో వారిని మేము తప్పకుండా స్వర్గములోని పెద్దపెద్ద భవనముల్లో దించుతాము. వాటి క్రింది నుండి సెలయేరులు ప్రవహిస్తుంటాయి,వాటిలో వారు శాస్వతంగా నివాసముంటారు. వాటిలో వారికి అంతమన్నది కలగదు. అల్లాహ్ కు విధేయత చూపే వారి ఈ ప్రతిఫలము ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలము.

Ankebut 29:59

అల్లాహ్ పై విధేయతకు పాల్పడే వారి ప్రతి ఫలము శ్రేష్ఠమైనది,వారు ఆయన పై విధేయత చూపటంపై,ఆయన పై అవిధేయత చూపటం నుండి సహనం చూపుతారు. తమ వ్యవహారలన్నింటిలో ఒక్కడైన తమ ప్రభువుపై నమ్మకమును కలిగి ఉంటారు.

Ankebut 29:60

ప్రాణులన్ని అవి అధికంగా ఉన్నప్పటికి తమ జీవనోపాధిని సమకూర్చుకోలేవు,వాటిని సాధించలేవు. అల్లాహ్ వారికి జీవనోపాధిని ప్రసాదిస్తాడు మరియు మీకు జీవనోపాధిని సమకూరుస్తాడు. ఆకలి భయంతో వలసపోవటమును వదిలి వేయటానికి ఎటువంటి వంక మీకు లేదు. మరియు ఆయనే మీ మాటలను వినే వాడును,మీ సంకల్పాలను,మీ కర్మలను తెలుసుకునే వాడును. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు. మరియు ఆయన తొందరలోనే మీకు వాటిపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

Ankebut 29:61

ఓ ప్రవక్త ఒక వేళ మీరు ఈ ముష్రికులందరితో ఇలా అడిగితే : ఆకాశములను సృష్టించినదెవరు ? మరియు భూమిని సృష్టించినదెవరు ? మరియు సూర్య చంద్రులను ఒక దాని వెనుక ఒకటి వచ్చే విధంగా ఉపయుక్తంగా చేసినదెవరు ?. వారు తప్పకుండా ఇలా సమాధానమిస్తారు : వాటిని అల్లాహ్ సృష్టించాడు. అటువంటప్పుడు వారు ఎలా ఒక్కడైన అల్లాహ్ పై విశ్వాసమును కనబరచటం నుండి మరలింపబడుతున్నారు. మరియు వారు ఎలా ఆయనను వదిలి ప్రయోజనం కలిగించని,నష్టం కలిగించని ఆరాధ్య దైవాలను ఆరాధిస్తున్నారు ?.

Ankebut 29:62

అల్లాహ్ తనకు తెలిసిన విజ్ఞత వలన తన దాసుల్లోంచి తాను కోరుకున్న వారికి ఆహారోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు. మరియు తాను కోరుకున్న వారికి దాన్ని కుదించివేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీది తెలిసినవాడు. అలాగే తన దాసుల కొరకు కార్య నిర్వహణలో నుంచి ప్రయోజనకరమైనది ఆయనపై గోప్యంగా ఉండదు.

Ankebut 29:63

ఓ ప్రవక్తా ఒక వేళ మీరు ముష్రికులతో ఆకాశము నుండి నీటిని కురిపించి దాని ద్వారా భూమిని బంజరు అయిన తరువాత మొలకెత్తించిందెవరు అని అడిగితే వారు తప్పకుండా ఇలా సమాధానమిస్తారు : ఆకాశము నుండి వర్షమును కురిపించి దాని ద్వారా భూమిని మొలకెత్తించినది అల్లాహ్. ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : స్థుతులన్నీ మీపై వాదనను స్పష్టపరచిన అల్లాహ్ కొరకే. కాని జరిగిందేమిటంటే వారిలో చాలా మంది అర్ధం చేసుకోలేదు. వారు ఒక వేళ అర్ధం చేసుకునే వారైతే అల్లాహ్ తో పాటు ప్రయోజనం కలిగించని,నష్టం కలిగించని విగ్రహాలను సాటి కల్పించేవారు కాదు.

Ankebut 29:64

మరియు ఈ ఇహలోక జీవితం అందులో ఉన్న కోరికలు,సామగ్రి వాటి సంబంధికుల హృదయాలకు కేవలం వినోద కాలక్షేపం,ఆట మాత్రమే. అది తొందరగా ముగుస్తుంది. మరియు నిశ్ఛయంగా పరలోక నివాసము అది శాశ్వతమైనది కావటం వలన అదే వాస్తవ జీవితము. ఒక వేళ వారికి తెలిసి ఉంటే వారు శాశ్వతంగా ఉండే దానిపై అంతమయ్యే దాన్ని ముందుకు నెట్టరు.

Ankebut 29:65

మరియు ముష్రికులు సముద్రంలో నావలో ప్రయాణిస్తున్నప్పుడు తమను మునగటం నుండి రక్షించమని ఒక్కడైన అల్లాహ్ ను ఆయన కొరకు దుఆను ప్రత్యేకిస్తూ వేడుకునేవారు. ఎప్పుడైతే ఆయన వారిని మునగటం నుండి రక్షించాడో వారు ఆయనతోపాటు తమ ఆరాధ్య దైవాలను వేడుకుంటూ సాటి కల్పిస్తూ మరలిపోతారు.

Ankebut 29:66

మేము వారికి ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతఘ్నులవటానికి,వారికి ప్రసాదించబడిన ఇహలోక భోగభాగ్యాల్లో వారు జుర్రుకోవటానికి సాటి కల్పిస్తూ మరలిపోతారు. అయితే వారు తొందరలోనే వారు మరణించేటప్పుడు తమ దుష్పరిణామమును తెలుసుకుంటారు.

Ankebut 29:67

ఏమీ తమపై ఉన్నఅల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించే వీరందరు అల్లాహ్ వారిని మునగటం నుండి కాపాడినప్పుడు వారు ఇంకో అనుగ్రహమును చూడటం లేదా. అది మేము వారి కొరకు హరమ్ ను తయారు చేశాము అందులో వారి రక్తములు,వారి సంపదలు భద్రంగా ఉన్నవి. అదే సమయంలో ఇతరులపై దాడులు జరుగుతున్నవి. వారు హతమార్చబడుతున్నారు మరియు బంధీలు చేయబడుతున్నారు. మరియు వారి స్త్రీలు,వారి సంతానము బానిసలు చేయబడుతున్నారు. వారి సంపదలు దోచుకోబడుతున్నాయి. ఏమీ వారు అసత్యమైన వారు ఆరోపిస్తున్న వారి ఆరాధ్య దైవాలను వారు విశ్వసిస్తున్నారా. మరియు తమపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమును తిరస్కరించి వారు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోరా ?!.

Ankebut 29:68

అల్లాహ్ వైపునకు సాటిని కల్పించి లేదా ఆయన ప్రవక్త తీసుకుని వచ్చిన సత్యమును తిరస్కరించి అల్లాహ్ పై అబద్దమును కల్పించుకున్న వాడి కంటే పెద్ద దుర్మార్గుడు ఎవడూ ఉండడు. అవిశ్వాసపరుల కొరకు,వారి లాంటి వారి కొరకు నరకములో ఒక నివాస స్థలం ఉండటంలో ఏ సందేహము లేదు.

Ankebut 29:69

మరియు ఎవరైతే స్వయంగా మా మన్నతులను ఆశిస్తూ పాటుపడుతారో (సహనమును చూపుతారో) వారికి మేము తప్పకుండా సన్మార్గమును చేరే భాగ్యమును కలిగిస్తాము. మరియు నిశ్చయంగా అల్లాహ్ సహాయము,సహకారము,సన్మార్గము ద్వారా సద్వర్తనులకు తోడుగా ఉంటాడు.

Rum 30:1

(الٓـمٓ) అలిఫ్-లామ్-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.

Rum 30:2

పర్షియన్ లు రోమన్ లపై విజయం పొందారు.

Rum 30:3

సిరియా ప్రాంతము దగ్గర నుండి పర్షియన్ ల బస్తీల వరకు.మరియు రోమన్ లు పర్షియన్లు వారిపై విజయం పొందిన తరువాత తొందరలోనే వారిపై విజయం సాధిస్తారు.

Rum 30:4

మూడు సంవత్సరాల కన్న తక్కువ కాని, పది సంవత్సరాల కన్న అధికం గాని ఒక కాలంలో. రోమన్ల విజయముకు ముందు,దాని తరువాత ఆదేశమంతా అల్లాహ్ కే. రోమన్ లు పర్షియన్ ల పై విజయం పొందిన రోజు విశ్వాసపరులు సంతోషపడుతారు.

Rum 30:5

వారు రోమన్ లకు అల్లాహ్ సహాయం కలగటం వలన సంతోషపడుతారు. ఎందుకంటే వారు గ్రంధవహులు. అల్లాహ్ తాను కోరిన వారికి తాను కోరిన వారికి వ్యతిరేకంగా సహాయం చేస్తాడు. మరియు ఆయన ఓడించబడని సర్వశక్తిమంతుడు. విశ్వసించిన తన దాసులపై కరుణించేవాడు.

Rum 30:6

ఈ సహాయం మహోన్నతుడైన అల్లాహ్ తరపు నుండి వాగ్దానము. మరియు అది సాక్షాత్కరించడం ద్వారా విశ్వాసపరులు అల్లాహ్ విజయ వాగ్దానంలో నమ్మకమును అధికం చేసుకుంటారు. కాని చాలా మంది ప్రజలు తమ అవిశ్వాసం వలన దీనిని అర్ధం చేసుకోరు.

Rum 30:7

విశ్వాసము,ధర్మ ఆదేశాల గురించి వారికి తెలియదు. వారికి మాత్రం జీవనోపాధి సంపాదనకు,భౌతిక నాగరికత నిర్మాణమునకు సంభంధించిన ఇహలోక జీవితము గురించి బాహ్యపరంగా తెలుసు. మరియు వారు వాస్తవ జీవిత నివాసమైన పరలోకము నుండి విముఖత చూపుతున్నారు. దాని పట్ల వారు శ్రద్ధ చూపరు.

Rum 30:8

ఏ ఈ తిరస్కరించే ముష్రికులందరు తమ స్వయంలో అల్లాహ్ వారిని,ఇతరులను ఎలా సృష్టించాడో యోచన చేయరా ?. అల్లాహ్ ఆకాశములను,భూమిని సత్యముతో మాత్రమే సృష్టించాడు. వాటిని ఆయన వృధాగా సృష్టించలేదు. అవి రెండు లోకములో ఉండటానికి ఒక నిర్ణీత సమయమును వాటి కొరకు ఆయన తయారు చేశాడు. మరియు నిశ్చయంగా ప్రజల్లోంచి చాలా మంది ప్రళయదినాన తమ ప్రభవును కలవటం గురించి తిరస్కరించారు. అందువలనే వారు మరణాంతరం లేపబడటం కొరకు తమ ప్రభువు వద్ద స్వీకృతమయ్యే సత్కర్మ ద్వారా సిద్ధమవటం లేదు.

Rum 30:9

ఏ వీరందరు వీరికన్న మునుపటి తిరస్కార జాతుల ముగింపు ఏవిధంగా అయినదో యోచన చేయటానికి భూమిలో సంచరించలేదా ?. ఈ జాతుల వారు వీరికన్న ఎక్కువ బలవంతులు. మరియు వారు వ్యవసాయం కొరకు,నిర్మాణం కొరకు దున్నారు. వీరందరు నిర్మించిన వాటి కంటే ఎక్కువగా వారు నిర్మించారు. మరియు వారి వద్దకు వారి ప్రవక్తలు అల్లాహ్ ఏకత్వముపై స్పష్టమైన ఆధారాలను,వాదనలను తీసుకుని వస్తే వారు తిరస్కరించారు. అల్లాహ్ వారిని తుదిముట్టించినప్పుడు వారిని హింసించలేదు. కాని వారే తమ అవిశ్వాసం వలన వినాశన స్థానములకు రావటం వలన తమ స్వయమును హింసించుకున్నారు.

Rum 30:10

ఆ తరువాత ఎవరి కర్మలైతే అల్లాహ్ తో పాటు సాటి కల్పించటం,దుష్కర్మలకు పాల్పడటంతో చెడుగా అయినవో వారి ముగింపు అత్యంత చెడు ముగింపు అయినది. ఎందుకంటే వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించారు. మరియు వారు వాటి గురించి హేళన చేసేవారు. మరియు వాటి గురించి పరిహాసమాడేవారు.

Rum 30:11

అల్లహ్ యే పూర్వ నమూనా లేకుండా సృష్టిని ప్రారంభిస్తాడు. ఆ తరువాత దాన్ని అంతం చేస్తాడు. ఆ తరువాత దాన్ని మరలా తీసుకుని వస్తాడు. ఆ తరువాత మీరు ప్రళయదినాన లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాధించటం కొరకు ఆయన ఒక్కడి వైపునకే మరలించబడుతారు.

Rum 30:12

మరియు ప్రళయం నెలకొన్న రోజు అపరాధులు అల్లాహ్ కారుణ్యము నుండి నిరాశ చెందుతారు. మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసముపై వారి వాదన అంతమవటం వలన ఆ రోజు వారి ఆశ అంతమైపోతుంది.

Rum 30:13

వారు ఇహలోకములో ఆరాధించే వారి భాగ స్వాముల్లోంచి ఎవరూ శిక్ష నుండి వారిని రక్షించటానికి సిఫారసు చేసేవారు వారి కొరకు ఉండరు. మరియు వారు తమ భాగస్వాములను తిరస్కరిస్తారు. నిశ్చయంగా వారి అవసరమున్నప్పుడు వారు సహాయమును వదిలివేశారు ఎందుకంటే వారందరు వినాశనంలో సమానము.

Rum 30:14

మరియు ఏ రోజు ప్రళయం నెలకొంటుందో ఆ రోజు ప్రజలు ఇహ లోకములోని తమ కర్మలను బట్టి ప్రతిఫలం విషయంలో వర్గములుగా విడిపోతారు. కొంత మంది ఇల్లియ్యీన్ లో లేపబడుతారు,మరికొందరు నీచాతి నీచమైన స్థానమైన సిజ్జీన్ లో దించబడుతారు.

Rum 30:15

ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసమును కనబరచి,ఆయన వద్ద స్వీకృతమయ్యే సత్కార్యములు చేస్తారో వారు స్వర్గములో అక్కడ వారు పొందే ఎన్నడూ అంతం కాని శాశ్వత అనుగ్రహాలతో పరవశించబడుతారు.

Rum 30:16

మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల తిరస్కారమును కనబరచి,మా ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరించి,మరణాంతరం లేపబడటమును,లెక్క తీసుకొనబడటమును తిరస్కరిస్తారో వారందరు శిక్ష కొరకు హాజరుపరచబడుతారు. మరియు వారు దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు.

Rum 30:17

కావున మీరు సాయంత్ర వేళలో ప్రవేశించేటప్పుడు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడండి. అది మగ్రిబ్,ఇషా రెండు నమాజుల వేళ. మరియు మీరు ఉదయ వేళలో ప్రవేశించేటప్పుడు ఆయన పరిశుద్ధతను కొనియాడండి. అది ఫజర్ నమాజు వేళ.

Rum 30:18

ప్రశంసలు పరిశుద్ధుడైన ఆయన ఒక్కడి కొరకే. ఆకాశముల్లో ఆయన దూతలు ఆయన స్థుతులను పలుకుతారు. మరియు భూమిలో ఆయన సృష్టితాలు ఆయన స్థుతులను పలుకుతాయి. మరియు మీరు సంధ్యా కాలములో ప్రవేశించేటప్పుడు ఆయన పరిశుద్ధతను కొనియాడండి. అది అసర్ నమాజు వేళ. మరియు మీరు మధ్యాహ్న కాలములో జొహర్ నమాజు వేళ ప్రవేశించినప్పుడు ఆయన పరిశుద్ధతను కొనియాడండి.

Rum 30:19

వీర్య బిందువు నుండి ఆయన మనిషిని,పిల్లను గ్రుడ్డు నుండి వెలికి తీయటంలాగా నిర్జీవి నుండి జీవిని వెలికి తీస్తాడు. మరియు ఆయన మనిషి నుండి వీర్యమును,కోడి నుండి గ్రుడ్డును వెలికి తీయటం లాగా జీవి నుండి నిర్జీవిని వెలికి తీస్తాడు. మరియు ఆయన భూమి ఎండిపోయిన తరువాత వర్షమును కురిపించి,దాన్ని మొలకెత్తింపజేసి దాన్ని జీవింపజేస్తాడు. భూమిని మొలకెత్తింపజేసి దాన్ని జీవింపజేసినట్లు మీరు మీ సమాధుల నుండి లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు వెలికితీయబడుతారు.

Rum 30:20

అల్లాహ్ సామర్ధ్యముపై,ఆయన ఏకత్వంపై సూచించే మహోన్నత సూచనల్లోంచి ఓ ప్రజలారా మీ తండ్రిని మట్టి నుండి సృష్టించినప్పుడు మిమ్మల్ని మట్టితో సృష్టించటం. ఆ పిదప అప్పుడు మీరు మానవులుగా పునరుత్పత్తి ద్వారా అధికమవుతారు మరియు మీరు భూమి యొక్క తూర్పు పడమరలలో వ్యాప్తి చెందుతారు.

Rum 30:21

మరియు అదేవిధంగా ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఆయన గొప్ప సూచనల్లోంచి ఓ పురుషులారా మీ కొరకు మీ కోవలో నుండే భార్యలను మీ మధ్య సజాతియత కొరకు వారి వద్ద మీరు మీ స్వయం కొరకు మనశ్శాంతిని పొందటం కొరకు సృష్టించటం. మరియు మీ మధ్య,వారి మధ్య ప్రేమను,అనురాగమును కలిగించటం. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన వాటిలో యోచన చేసే జనుల కొరకు స్పష్టమైన ఆధారాలు,ఋజువులు కలవు. ఎందుకంటే వారే తమ బుద్దులను ఉపయోగించి ప్రయోజనం చెందుతారు.

Rum 30:22

మరియు ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఆయన గొప్ప సూచనల్లోంచి : ఆకాశములను సృష్టించటం,భూమిని సృష్టించటం మరియు వాటిలో నుండే మీ భాషలు వేరువేరుగా ఉండటం,మీ రంగులు వేరు వేరుగా ఉండటం. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన వాటిలో జ్ఞానం,అంతర్దృష్టి కలవారి కొరకు ఆధారాలు,సూచనలు కలవు.

Rum 30:23

మరియు ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఆయన గొప్ప సూచనల్లోంచి మీరు మీ పనుల నుండి కలిగిన అలసట నుండి విశ్రాంతి పొందటానికి రాత్రి పూట మీరు నిదురపోవటం,పగటి పూట మీరు నిదురపోవటం. మరియు ఆయన సూచనల్లోంచి మీ కొరకు పగలును చేయటం అందులో మీరు మీ ప్రభువు వద్ద నుండి ఆహారోపాధిని అన్వేషిస్తూ వ్యాప్తి చెందటానికి. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన వాటిలో యోచన చేసి,వినటమును స్వీకరించే ఉద్దేశంతో వినే జనుల కొరకు ఆధారాలు,సూచనలు కలవు.

Rum 30:24

మరియు ఆయన సామర్ధ్యం పై, ఆయన ఏకత్వంపై సూచించే ఆయన గొప్ప సూచనల్లోంచి ఆకాశములో మీకు మెరుపును చూపించటం మరియు అందులో మీ కొరకు గర్జనల నుండి భయము,వర్షము నుండి ఆశ మధ్య సమీకరించటం మరియు ఆకాశము నుండి మీ కొరకు వర్షపు నీటిని కురిపించి భూమి ఎండిపోయిన తరువాత అందులో మొలకెత్తే మొక్కల ద్వారా జీవం పోయటం. నిశ్చయంగా వీటిలో బుద్ధిమంతులకి స్పష్టమైన ఆధారాలు,సూచనలు కలవు. వారు వాటి ద్వారా మరణాంతరం లెక్క తీసుకోబడటం,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మరల లేపబడటం పై ఆధారాలను స్వీకరిస్తారు.

Rum 30:25

మరియు అల్లాహ్ సామర్ధ్యమును,ఆయన ఏకత్వమును సూచించే ఆయన సూచనల్లోంచి ఆకాశము పడిపోకుండా మరియు భూమి ధ్వంసం అవకుండా పరిశుద్ధుడైన ఆయన ఆదేశముతో నెలకొని ఉండటం. ఆ పిదప పరిశుద్ధుడైన ఆయన దైవ దూత బాకాలో ఒక ఊదటం ద్వారా మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు లెక్క తీసుకోబడటం,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మీ సమాదుల నుండి వెలికి వస్తారు.

Rum 30:26

ఆకాశముల్లో ఉన్న వారు మరియు భూమిలో ఉన్న వారు అధికార పరంగా,సృష్టి పరంగా,విధి వ్రాత పరంగా ఆయన ఒక్కడి కొరకే. ఆయన సృష్టితాల్లో నుంచి ఆకాశముల్లో ఉన్న వారు,భూమిలో ఉన్న వారు ఆయనకే లోబడి ఉన్నారు మరియు ఆయన ఆదేశమునకే కట్టుబడి ఉన్నారు.

Rum 30:27

మరియు పరిశుద్ధుడైన ఆయనే పూర్వ నమూనా లేకుండా సృష్టిని ప్రారంభించినవాడు. ఆ తరువాత దాన్ని నాశనం చేసిన తరువాత ఆయనే దానిని మరలింపజేస్తాడు. ప్రారంభించటం కన్న మరలింపజేయటమే ఎంతో సులభము. మరియు ఆ రెండు కూడా ఆయనకు సులభమే ఎందుకంటే ఆయన దేనినైన కోరినప్పుడు దానితో (కున్) నీవు అయిపో అంటాడు. అప్పుడు అది అయిపోతుంది. మరియు మహత్వము,పరిపూర్ణ గుణాల్లో నుంచి ఆయనకు వర్ణించబడిన ప్రతి దానిలో అధిక వర్ణత ఆయన అజ్జ వ జల్ల (సర్వ శక్తిమంతుడు,మహోన్నతుడు) కొరకే. మరియు ఆయన ఓటమి లేని సర్వ శక్తిమంతుడు మరియు తన సృష్టించటంలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.

Rum 30:28

ఓ ముష్రికులారా అల్లాహ్ మీలో నుండి తీసుకొనబడిన ఒక ఉపమానమును మీ కొరకు తెలియపరుస్తున్నాడు : మీ బానిసల్లో నుంచి,మీ ఆదీనంలో ఉన్న వారిలో నుంచి మీ సంపదల్లో సమానముగా భాగస్వామి అయ్యే ఎవరైన భాగస్వామి ఉన్నారా, ఏ విధంగానైతే మీలో నుండి కొందరు తమ స్వతంత్ర భాగ స్వామి తనతోపాటు సంపదను పంచుకుంటాడని భయపడుతారో ఆ విధంగా వారు మీతోపాటు మీ సంపదలను పంచుకుంటారని భయపడుతున్నారా ?. ఏమీ మీరు దీనిని మీ బానిసల నుండి మీ స్వయం కొరకు ఇష్టపడుతారా ?. మీరు దాన్ని ఇష్టపడకపోవటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అల్లాహ్ తన రాజ్యాధికారములో తన సృష్టితాల్లో నుంచి,తన దాసుల్లో నుంచి ఎటువంటి సాటి లేకపోవటంలో ఎక్కువ హక్కు దారుడు. ఇటువంటి ఉపమానములను,ఇతర వాటిని తెలిపి మేము వాదనలను,ఆధారాలను వాటి విభిన్న రూపములలో బుద్ధిగల జనులకు స్పష్టపరుస్తాము. ఎందుకంటే వారే వాటి ద్వారా ప్రయోజనం చెందుతారు.

Rum 30:29

వారి మార్గ భ్రష్టతకు కారణం ఆధారాల్లో లోపమూ కాదు మరియు వాటిలో స్పష్టత లేకపోవటమూ కాదు. కేవలం మనోవాంఛలను అనుసరించటం,తమ తాత ముత్తాతలను అనుకరించటం మాత్రమే. అల్లాహ్ ఎవరినైతే మార్గభ్రష్టతకు లోను చేస్తాడో వాడికి ఎవరు సన్మార్గము కొరకు భాగ్యమును కలిగిస్తాడు ?!. ఎవడూ అతడికి భాగ్యమును కలిగించడు. మరియు అల్లాహ్ శిక్షను వారి నుండి తొలగించే సహాయకులు వారి కొరకు ఉండరు.

Rum 30:30

అయితే ఓ ప్రవక్తా మీరు,మీతోపాటు ఉన్న వారు అన్నీ ధర్మాల నుండి వాలి అల్లాహ్ మిమ్మల్ని ఏ ధర్మం వైపునకు మరల్చాడో ఆ ధర్మం వైపునకు మరలండి. అది ఇస్లాం ధర్మం దాని (స్వభావం) పైనే అల్లాహ్ మానవులందరిని సృష్టించాడు. అల్లాహ్ సృష్టిలో ఎటువంటి మార్పు జరగదు. ఎటువంటి వంకరతనం లేని సరైన ధర్మము ఇది. కానీ చాలా మంది ప్రజలకు సత్యధర్మము అన్నది ఈ ధర్మము అని తెలియదు.

Rum 30:31

మరియు మీరు పరిశుద్ధుడైన ఆయన వైపునకు మీ పాపముల నుండి పశ్చాత్తాప్పడుతూ మరలండి. మరియు మీరు ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ ఆయన భీతి కలిగి ఉండండి. మరియు మీరు నమాజును దాని పరిపూర్ణ పధ్ధతిలో పూర్తి చేయండి. మరియు స్వభావానికి విరుద్ధంగా చేసి తమ ఆరాధనల్లో అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పించే ముష్రికుల్లోంచి మీరు కాకండి.

Rum 30:32

మరియు తమ ధర్మమును మార్చుకుని అందులోని కొన్నిటిని విశ్వసించి,కొన్నిటిని తిరస్కరించే ముష్రికుల్లోంచి మీరు కాకండి. మరియు వారు వర్గములుగా,తెగలుగా అయిపోయారు. వారిలో నుండి ప్రతీ తెగ తాము ఉన్న అసత్యముపై సంతోషముగా ఉన్నది. వారిలో తాము ఒక్కటే సత్యముపై ఉన్నారని,ఇతరులు అసత్యముపై ఉన్నారని వారు భావించేవారు.

Rum 30:33

మరియు ముష్రికులకు ఏదైన రోగము వలన లేదా పేదరికం వలన లేదా కరువు వలన ఏదైన ఆపద వచ్చినప్పుడు వారు తమకు కలిగిన ఆపదను తమ నుండి తొలగించమని వారు పరిశుద్ధుడైన,ఒక్కడైన తమ ప్రభువును కడు వినయంతో,ప్రార్ధనతో ఆయన వైపునకు మరలుతూ వేడుకునేవారు. ఆ పిదప ఆయన వారికి కలిగిన ఆపదను తొలగించి వారిపై కనికరించినప్పుడు వారిలో నుంచి ఒక వర్గము దుఆలో అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పించటం వైపునకు మరలిపోయేవారు.

Rum 30:34

అప్పుడు వారు అల్లాహ్ అనుగ్రహముల పట్ల కృతఘ్నులైపోయేవారు - మరియు వాటిలో నుండి ఆపదను తొలగించిన అనుగ్రహము ఉన్నది. మరియు వారు ఇహలోకములో వారి ముందట ఉన్న వాటితో ప్రయోజనం చెందుతారు. వారు తొందరలోనే ప్రళయ దినమున తమ కళ్ళతో తాము స్ఫష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్న దాన్ని చూస్తారు.

Rum 30:35

వారి కొరకు ఎటువంటి ఆధారం లేకుండా అల్లాహ్ తో పాటు సాటి కల్పించటం వైపునకు వారిని ఏది పిలిచినది ?! వారు అల్లాహ్ తో పాటు తమ సాటి కల్పించటంపై ఆధారము చూపే ఎటువంటి పుస్తకమును వారిపై ఆధారంగా మేము అవతరింపజేయలేదు. మరియు వారితో పాటు వారి షిర్కు గురించి మట్లాడే, వారు ఉన్న అవిశ్వాసము సరైనదని వారి కొరకు నిరూపించే ఎటువంటి పుస్తకము లేదు.

Rum 30:36

మరియు మేము ప్రజలకు మా అనుగ్రహాల్లోంచి ఆరోగ్యము, ఐశ్వర్యము లాంటి ఏదైన అనుగ్రహము రుచిని చూపించినప్పుడు వారు అహంకార సంతోషమును చూపుతారు మరియు గర్విస్తారు. మరియు ఒక వేళ వారికి వారు తమ చేజేతులా చేసుకున్న పాపము వలన బాధను కలిగించే రోగము,పేదరికం కలిగితే అప్పుడు వారు అల్లాహ్ కారుణ్యము నుండి నిరాశ్యులైపోతారు. మరియు వారు వారిని బాధ కలిగించేది తొలగిపోవటం నుండి నిరాశ్యులైపోతారు.

Rum 30:37

ఏమీ వారు చూడటం లేదా అల్లాహ్ తన దాసుల్లోంచి తాను కోరిన వారికి అతనికి పరీక్షగా ఆహారోపాధిని విస్తరింపజేస్తాడు అతడు కృతజ్ఞత తెలుపుకుంటాడా లేదా కృతఘ్నుడవుతాడా(అని) ?. మరియు వారిలో నుంచి తాను కోరున్న వారిపై దాన్ని (ఆహారోపాధిని) అతని పరీక్ష కొరకు కుదించివేస్తాడు అతడు సహనం చూపుతాడా లేదా అసహనానికి గురవుతాడా(అని) ?! కొందరిపై ఆహారోపాధిని విస్తరింపజేయటంలో,కొందరిపై దాన్ని కుదించటంలో విశ్వాసపరుల కొరకు అల్లాహ్ దయ,ఆయన కారుణ్యముపై సూచనలు కలవు.

Rum 30:38

అయితే ఓ ముస్లిమ్ నీవు బంధువులకు వారి హక్కు అయిన మంచితనము,బంధమును కలపటమును ఇవ్వు. మరియు అవసరం కలవాడికి అతని అవసరమును తీర్చే దాన్ని ఇవ్వు. మరియు తన ఊరి నుండి దారి తెగిపోయిన బాట సారికి ఇవ్వు. ఈ మార్గముల్లో ఇవ్వటం దానితో అల్లాహ్ మన్నతను కోరుకునే వారికి మేలైనది. ఎవరైతే ఈ సహాయమును,హక్కులను నెరవేరుస్తారో వారే తాము ఆశించే స్వర్గమును పొంది,తాము భయపడే శిక్ష నుండి భద్రంగా ఉండటంతో సాఫల్యం చెందుతారు.

Rum 30:39

మరియు మీరు సంపదల్లోంచి ఏదైన ప్రజల్లోంచి ఎవరికైన వారు మీకు అధికం చేసి ఇస్తారని చెల్లిస్తే అల్లాహ్ వద్ద దాని ప్రతిఫలము పెరగదు. మరియు మీరు మీ సంపదల్లోంచి ఏదైన అవసరమును తీర్చటానికి ఇచ్చి దానితో మీరు అల్లాహ్ మన్నతను కోరుకుంటారు. మీరు ప్రజల నుండి ఎటువంటి స్థానమును గాని ఎటువంటి పుణ్యమును గాని కోరుకోరు. వారందరి కొరకు అల్లాహ్ వద్ద పుణ్యము రెట్టింపు చేయబడుతుంది

Rum 30:40

మిమ్మల్ని సృష్టించటంలో,ఆ తరువాత మీకు ఆహారోపాధి సమకూర్చటంలో,ఆ తరువాత మీకు మరణమును కలిగించటంలో,ఆ తరువాత మరణాంతరం లేపటం కొరకు మిమ్మల్ని జీవింపజేయటంలో అద్వితీయమైనవాడు అల్లాహ్ ఒక్కడే. ఏ మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న మీ విగ్రహాల్లోంచి ఎవరైన వీటిలో నుండి ఏదైన చేయగలవా ?! ముష్రికులు పలుకుతున్న,విశ్వసిస్తున్న వాటి నుండి ఆయన అతీతుడు మరియు పరిశుద్ధుడు.

Rum 30:41

భూమిపై,సముద్రంలో ప్రజల జీవనోపాధిలో కొరతతో మరియు వారి స్వయంలో రోగాలు,అంటు వ్యాధుల కలగటంతో వారు చేసుకున్నపాపముల వలన ఉపద్రవం తలెత్తింది. అల్లాహ్ వారికి వారు ఆయన వైపునకు పశ్చాత్తాపముతో మరలుతారని ఆశిస్తూ ఇహలోకములోని వారి కొన్ని పాపకార్యముల ప్రతిఫలము రుచిని చూపించటానికి ఇది సంభవించింది.

Rum 30:42

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీరు భూమిలో సంచరించి మీ కన్న పుర్వ తిరస్కార జాతుల ముగింపు ఎలా అయ్యిందో యోచన చేయండి. నిశ్చయంగా చెడు పరిణామం జరిగింది. వారిలో నుండి చాలా మంది అల్లాహ్ తోపాటు సాటి కల్పించేవారు ఉండేవారు. ఆయనతో పాటు ఇతరులను ఆరాధించేవారు. అల్లాహ్ తో పాటు వారు భాగస్వామ్యం కలపటం వలన వారు నాశనం చేయబడ్డారు.

Rum 30:43

అయితే ఓ ప్రవక్తా మీరు మీ ముఖమును ఎటువంటి వంకరతనం లేని సరైన ధర్మము ఇస్లాం కొరకు ప్రళయం రాక ముందే స్థిరంగా ఉంచండి. అది వచ్చినప్పుడు దాన్ని మరల్చేవాడుండడు. ఆ రోజు ప్రజలు వర్గములుగా వేరైపోతారు. ఒక వర్గము స్వర్గములో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటుంది. ఇంకొక వర్గము నరకాగ్నిలో శిక్షించబడుతుంది.

Rum 30:44

మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరుస్తాడో అతని అవిశ్వాసము యొక్క నష్టము - అది నరకాగ్నిలో శాస్వతంగా ఉండటం - అతని పైనే మరలి వస్తుంది. మరియు ఎవరైతే సత్కర్మను చేసి దాని ద్వారా అల్లాహ్ మన్నతను ఆశిస్తాడో తమ స్వయం కొరకు వారు స్వర్గ ప్రవేశమును,అందులో ఉన్నవాటితో సుఖభోగాలను అనుభవించటమును తయారు చేసుకుంటారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

Rum 30:45

ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసమును కనబరచి తమ ప్రభువును ప్రసన్నుడిని చేసే సత్కార్యములు చేస్తారో వారికి ఆయన ప్రతిఫలమును ప్రసాదించటానికి. నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన తన పట్ల ,తన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరిచే వారిని ఇష్టపడడు. అంతేకాదు అత్యంత తీవ్రంగా ధ్వేషిస్తాడు. మరియు ఆయన తొందలోనే ప్రళయ దినాన వారిని శిక్షిస్తాడు.

Rum 30:46

మరియు ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఆయన గొప్ప సూచనల్లోంచి ఆయన వర్షం కురవటము దగ్గరవటం గురించి దాసులకు శుభవార్తనిచ్చే గాలులను పంపటం. మరియు ఓ ప్రజలాారా ఆయన మీకు వర్షం కురిసిన తరువాత సంభవించే సస్యశ్యామలం, కలిమి ద్వారా తన కారుణ్య రుచిని చూపించటానికి మరియు ఆయన ఇచ్చతో సముద్రములో ఓడలు పయనించటానికి మరియు మీరు వ్యాపారం ద్వారా సముద్రంలో ఆయన అనుగ్రహమును అన్వేషించటానికి. బహుశా మీరు మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలుపుకుంటే ఆయన మీకు వాటికన్న అధికంగా ప్రసాదిస్తాడు.

Rum 30:47

మరియు ఓ ప్రవక్తా నిశ్చయంగా మేము మీ కన్న ముందు ప్రవక్తలను వారి జాతుల వద్దకు పంపించాము. అప్పుడు వారు వారి వద్దకు తమ నిజాయితీ పై సూచించే వాదనలను,ఆధారాలను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు తమ ప్రవక్తలు తమ వద్దకు తీసుకుని వచ్చిన వాటిని తిరస్కరించారు. అయితే మేము దుష్కార్యములకు పాల్పడిన వారిపై ప్రతీకారము తీర్చుకున్నాము. అప్పుడు మేము వారిని మా శిక్షతో తుదిముట్టించాము. మరియు మేము ప్రవక్తలను, వారిని విశ్వసించిన వారిని వినాశనము నుండి రక్షించాము. మరియు విశ్వాసపరులని రక్షించటం,వారికి సహాయం చేయటం వాస్తవం దాన్ని మేము మా పై తప్పనిసరి చేసుకున్నాము.

Rum 30:48

పరిశుద్దుడైన అల్లాహ్ ఆయనే గాలులను నడిపిస్తాడు మరియు వాటిని పంపిస్తాడు. అప్పుడు ఆ గాలులు మేఘమును పైకి లేపి దాన్ని కదిలిస్తాయి. అప్పుడు ఆయన దాన్ని ఆకాశంలో తాను కోరిన విధంగా తక్కువగా లేదా ఎక్కువగా వ్యాపింపజేస్తాడు. మరియు దాన్ని ముక్కలుగా చేస్తాడు. ఓ చూసేవాడా అప్పుడు నీవు దాని మధ్యలో నుండి వర్షమును వెలికి వస్తుండగా చూస్తావు. ఆయన దాసుల్లో నుండి ఆయన కోరిన వారికి వర్షమును చేరవేసినప్పుడు వారు తమ కొరకు వర్షమును కురిపించటం ద్వారా, దాని తరువాత నేల వారికి,వారి పశువులకు అవసరమగు వాటిని మొలకెత్తించటం ద్వారా కలిగిన అల్లాహ్ కారుణ్యముతో సంబరపడిపోతారు.

Rum 30:49

మరియు వాస్తవానికి వారు తమపై అల్లాహ్ వర్షమును కురిపించక మునుపు తమపై దాని కురవటం నుండి నిరాశ్యులైపోయి ఉండేవారు.

Rum 30:50

అయితే ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ తన దాసుల కొరకు కారుణ్యంగా కురిపించిన వర్షము యొక్క చిహ్నముల వైపునకు చూడండి. అల్లాహ్ ఏ విధంగా భూమిని - అది తాను ఎండిపోయి,బంజరుగా అయిపోయిన తరువాత రకరకాల మొక్కలను మొలకెత్తించటం ద్వారా - జీవింపజేశాడు. నిశ్చయంగా ఎవరైతే బంజరు భూమిని జీవింపజేశాడో ఆయన మృతులను జీవింపజేస్తాడు. మరియు ఆయన అన్నింటిపై సామర్ధ్యము కలవాడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.

Rum 30:51

మరియు ఒక వేళ మేము వారి పంటలపై,వారి మొక్కలపై వాటిని నాశనం చేసే గాలులను పంపిస్తే అప్పుడు వారు తమ పంటలను పచ్చగా ఉండిన తరువాత కూడా పసుపు రంగులలో చూస్తారు. వాటిని వారు అలా చూసిన తరువాత పూర్వం తమపై అధికంగా కలిగిన అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నులైపోతారు.

Rum 30:52

ఎలాగైతే నీవు మృతులను వినిపింపజాలవో మరియు చెవిటి వారిని వినిపింపజాలవో వాస్తవానికి వారు తమ వినకపోవటమును నిర్ధారించుకోవటానికి నీ నుండి దూరమైపోయారు. అలాగే విముఖత చూపటంలో,ప్రయోజనం చెందక పోవటంలో వీరందరిని పోలిన వారిని మీరు సన్మార్గం చూపజాలరు.

Rum 30:53

మరియు నీవు సన్మార్గము నుండి తప్పిపోయిన వాడిని ఋజు మార్గం పై నడిపించటం వైపునకు భాగ్యం కలిగించే వాడివి కావు. నీవు కేవలం మా ఆయతులను విశ్వసించే వారిని మాత్రమే ప్రయోజనం చెందే విధంగా వినిపించగలవు. ఎందుకంటే వాడే నీవు పలికిన వాటి ద్వారా ప్రయోజనం చెందుతాడు. అయితే వారు మా ఆదేశమునకు కట్టుబడి ఉంటారు,దానికి విధేయులై ఉంటారు.

Rum 30:54

ఓ ప్రజలారా అల్లాహ్ యే మిమ్మల్ని నీచపు నీటితో సృష్టించాడు. ఆ తరువాత మీ బాల్య బలహీనత తరువాత మీ యవ్వన బలమును తయారు చేశాడు. ఆ తరువాత యవ్వన బలము తరువాత వృద్ధాప్య,ముసలితనం యొక్క బలహీనతను తయారు చేశాడు. ఆయన ప్రతీది తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. ఏది కూడా ఆయనను ఓడించని సర్వసమర్ధుడు.

Rum 30:55

ప్రళయము నెలకొనే రోజు అపరాధులు తాము తమ సమాధులలో ఒక ఘడియ మాత్రమే ఉన్నారని ప్రమాణాలు చేస్తారు. వారు ఏవిధంగా తమ సమాధులలో ఉండిన లెక్కను గుర్తించటం నుండి మరలించబడ్డారో అదే విధంగా ఇహలోకములో సత్యము నుండి మరలిపోయారు.

Rum 30:56

మరియు అల్లాహ్ జ్ఞానమును ప్రసాదించినటువంటి ప్రవక్తలు,దైవ దూతలు ఇలా పలుకుతారు : నిశ్చయంగా మీరు అల్లాహ్ తన ముందస్తు జ్ఞానంలో వ్రాసిన దానిలో మీ పుట్టుక దినము నుండి మీరు తిరస్కరించిన మరణాంతరం మీరు లేపబడే దినం వరకు ఉన్నారు. కాని మీరు మరణాంతరం లేపబడటము వాటిల్లుతుందన్న విషయాన్ని తెలుసుకోలేకపోయారు. కాబట్టి మీరు దాన్ని తిరస్కరించారు.

Rum 30:57

అయితే అల్లాహ్ సృష్టిని లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు మరణాంతరం లేపే రోజు దుర్మార్గులు కల్పించుకున్న సాకులు ప్రయోజనం కలిగించవు. మరియు తౌబా ద్వారా,ఆయన వైపు మరలటం ద్వారా అల్లాహ్ కు సంతుష్టం కలిగించమని కూడా వారితో కోరబడదు ఎందుకంటే దాని సమయం కూడా అయిపోయింది.

Rum 30:58

మరియు నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజల కొరకు వారి పట్ల శ్రద్ధ చూపుతూ ప్రతీ ఉపమానమును వారికి అసత్యము నుండి సత్యము స్పష్టమవటానికి తెలిపాము. ఓ ప్రవక్తా ఒక వేళ మీరు వారి వద్దకు మీ నిజాయితీ పై ఏదైన వాదనను తీసుకుని వస్తే అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారు మీరు తీసుకుని వచ్చిన దానిలో మీరు కేవలం మిథ్యా వాదులే అని తప్పకుండా అంటారు.

Rum 30:59

మీరు ఏదైన సూచనను తీసుకుని వస్తే దాని పట్ల విశ్వాసమును కనబరచని వీరందరి హృదయములపై ఈ ముద్రను వేసిన విధంగానే అల్లాహ్ మీరు తీసుకుని వచ్చినది సత్యము అని తెలుసుకోని అందరి హృదయములపై ముద్ర వేస్తాడు.

Rum 30:60

అయితే ఓ ప్రవక్తా మీరు మీ జాతి వారు మిమ్మల్ని తిరస్కరించిన దానిపై సహనం చూపండి. నిశ్చయంగా మీ కొరకు విజయం,సాధికారత గరించి అల్లాహ్ వాగ్దానం ఏ విధమైన సందేహం లేకండా నిరూపితమవుతుంది. మరియు మరణాంతరం మరల లేపబడుతారని విశ్వసించని వారు మిమ్మల్ని తొందరపెట్టటానికి,సహనమును వదిలివేయటానికి పురగొల్పకూడదు.

Lukman 31:1

(الٓـمٓ) అలిఫ్-లామ్-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.

Lukman 31:2

ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఈ ఆయతులు విజ్ఞతతో మాట్లాడే గ్రంధ ఆయతులు.

Lukman 31:3

మరియు అది తమ ప్రభువు హక్కులను,ఆయన దాసుల హక్కులను నెరవేర్చటంతో సత్కార్యము చేసే వారి కొరకు మార్గదర్శకత్వము,కారుణ్యము.

Lukman 31:4

వారు నమాజును పరిపూర్ణ పద్దతిలో పాటిస్తారు మరియు వారు తమ సంపదల జకాత్ విధి దానమును చెల్లిస్తారు. మరియు వారు అంతిమ దినములో ఉన్న మరణాంతరం లేపబడటం,లెక్క తీసుకోబడటం,ప్రతిఫలం ప్రసాదించబడటం,శిక్షింపబడటం పై విశ్వాసమును కనబరుస్తారు.

Lukman 31:5

ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరు తమ ప్రభువు వద్ద నుండి సన్మార్గంపై ఉన్నారు. మరియు వారందరే తాము ఆశించిన వాటిని పొంది,తాము భయపడే వాటి నుండి దూరంగా ఉండటంతో సాఫల్యం చెందుతారు.

Lukman 31:6

మరియు ప్రజల్లోంచి నజర్ బిన్ హారిస్ లాంటి వారు పరధ్యానంలో పడవేసే మాటలను ఎంచుకుని ప్రజలను ఎటువంటి జ్ఞానం లేకుండా అల్లాహ్ ధర్మం నుండి వాటి వైపు మరలిస్తారు. మరియు అల్లాహ్ ఆయతులను ఎగతాళిగా చేసుకుని వాటి నుండి పరిహాసమాడేవారు. ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరికి పరలోకంలో అవమానమును కలిగించే శిక్ష ఉన్నది.

Lukman 31:7

మరియు అతనిపై మా ఆయతులు చదివి వినిపించినప్పుడు అతడు వాటిని వినటం నుండి అహంకారమును చూపుతూ వాటిని విననట్లుగా, శబ్దములను వినటం నుండి అతని రెండు చెవులలో చెవుడు ఉన్నట్లుగా మరలిపోతాడు. ఓ ప్రవక్తా మీరు అతనికి అతని గురించి నిరీక్షించే బాధాకరమైన శిక్ష గురించి శుభవార్తనివ్వండి.

Lukman 31:8

నిశ్చయంగా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యములు చేసే వారి కొరకు అనుగ్రహభరితమైన స్వర్గ వనాలు కలవు. అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచిన వాటిని అనుభవిస్తారు.

Lukman 31:9

వారు వాటిలో శాశ్వతంగా ఉంటారు. దీని గురించి అల్లాహ్ వారితో ఎటువంటి సందేహం లేని సత్య వాగ్దానము చేశాడు. మరియు పరిశుద్ధుడైన ఆయన తనని ఎవరూ ఓడించని సర్వ శక్తిమంతుడు మరియు తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో,తన ధర్మ శాసనములలో వివేకనంతుడు.

Lukman 31:10

పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ ఆకాశములను ఎత్తుగా ఎటువంటి స్థంభములు లేకుండా సృష్టించాడు. మరియు భూమిలో అది మిమ్మల్ని తీసుకుని ప్రకంపించకుండా ఉండేందుకు పర్వతములను పాతాడు. మరియు భూమిపై రకరకాల జంతువులను విస్తరింపజేశాడు. మరియు మేము ఆకాశము నుండి వర్షపు నీటిని అవతరింపజేశాము. అప్పుడు మేము భూమిలో ఆనందభరితమైన దృశ్యము కల అన్ని రకముల వాటిని మొలకెత్తించాము. దానితో ప్రజలు,పశువులు ప్రయోజనం చెందుతారు.

Lukman 31:11

ఈ ప్రస్తావించబడినవి అల్లాహ్ సృష్టితాలు. ఓ ముష్రికులారా అల్లాహ్ ను వదిలి మీరు ఆరాధించేవి ఏమి సృష్టించాయో నాకు చూపించండి ?!. కాని దుర్మార్గులు సత్యము నుండి స్పష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్నారు. ఏవిధంగానంటే వారు తమ ప్రభువుతో పాటు ఏమీ సృష్టించని వారిని సాటి కల్పిస్తున్నారు. మరియు వారే సృష్టించబడినవారు.

Lukman 31:12

మరియు నిశ్చయంగా మేము లుఖ్మాన్ కు ధర్మ విషయంలో అవగాహన,వ్యవహారాల విషయంలో ఖచ్చితత్వమును ప్రసాదించాము. మరియు అతనితో మేము ఇలా పలికాము : ఓ లుఖ్మాన్ నీవు నీ ప్రభువునకు తన విధేయత కొరకు నీకు ఆయన అనుగ్రహించిన భాగ్యముపై కృతజ్ఞత తెలుపుకో. మరియు ఎవరైతే తన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుకుంటాడో అతని కృతజ్ఞత తేలుపుకోవటం యొక్క ప్రయోజనం అతనిపైనే మరలుతుంది. కాని అల్లాహ్ అతని కృతజ్ఞత తెలుపుకోవటం నుండి అక్కర లేని వాడు. మరియు ఎవరైతే తనపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమును తిరస్కరించి దాని పట్ల కృతఘ్నుడైపోతాడో ఆయన పరిశుద్ధుడు. అతని కృతఘ్నత యొక్క నష్టము మాత్రం అతనిపైనే ఉంటుంది. మరియు అతడు అల్లాహ్ కు ఎటువంటి నష్టం కలిగించలేడు. ఎందుకంటే ఆయన తన సృష్టితాలన్నింటి నుండి అక్కర లేని వాడు. ప్రతీ స్థితిలో స్థుతింపబడినవాడు.

Lukman 31:13

ఓ ప్రవక్తా మీరు లుఖ్మాన్ తన కొడుకును మంచి విషయంలో ప్రోత్సహిస్తూ మరియు అతన్ని చెడు నుండి హెచ్చరిస్తూ ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి : ఓ నా ప్రియ కుమారుడా నీవు అల్లాహ్ తో పాటు ఇతరులను ఆరాధించకు. నిశ్చయంగా అల్లాహ్ తో పాటు ఏ ఆరాధ్య దైవమునకు ఆరాధన చేయటం అనేది మనిషిని నరకాగ్నిలో శాశ్వతంగా ఉండటానికి దారి తీసే పెద్ద పాపమునకు పాల్పడటం ద్వారా మనిషి కొరకు పెద్ద అన్యాయము.

Lukman 31:14

మరియు మేము మానవునికి తన తల్లిదండ్రులకి విధేయత చూపమని మరియు అల్లాహ్ కొరకు అవిధేయత లేని విషయములలో వారి పట్ల ఉత్తమంగా మెలగమని తాకీదు చేశాము. అతని తల్లి అతన్ని తన గర్భములో బాధ తరువాత బాధను పొందుతూ మోసింది. మరియు అతనికి పాలు త్రాపించటమును ఆపటమనేది రెండు సంవత్సరముల కాలములో. మరియు మేము అతనితో ఇలా పలికాము : నీవు అల్లాహ్ కొరకు ఆయన నీపై అనుగ్రహించిన అనుగ్రహాలపై కృతజ్ఞత తెలుపుకో. ఆ తరువాత నీవు నీ తల్లిదండ్రులకు వారు నీ పెంపకము,నీ సంరక్షణ పట్ల స్థిరంగా ఉన్న దానికి కృతజ్ఞత తెలుపుకో. నా ఒక్కడి వైపే మరలటం జరుగుతుంది. అప్పుడు నేను ప్రతి ఒక్కరికి అతను అర్హత కలిగిన దాన్ని ప్రతిఫలమును ప్రసాదిస్తాను.

Lukman 31:15

ఒక వేళ తల్లిదండ్రులు తమ తరపు నుండి నిర్ణయించుకుని నీవు అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పించటంపై నిన్ను ప్రేరేపించటానికి ప్రయత్నం చేస్తే ఆ విషయంలో నీవు వారి మాట వినకు. ఎందుకంటే సృష్టికర్త అవిధేయతలో ఎటువంటి సృష్టికి విధేయత చూపటం సరికాదు. మరియు నీవు ఇహలోకములో మంచితనముతో,బంధుత్వముతో,ఉపకారముతో వారికి తోడుగా ఉండు. మరియు నీవు నా వైపునకు ఏకత్వముతో,విధేయతతో మరలే వారి మార్గమును అనుసరించు. ఆ తరువాత ప్రళయదినాన నా ఒక్కడి వైపునకే మీ అందరి మరలటం ఉంటుంది. అప్పుడు నేను మీరు ఇహలోకంలో చేసే కర్మల గురించి మీకు తెలియపరుస్తాను. మరియు వాటి పరంగా మీకు నేను ప్రతిఫలమును ప్రసాదిస్తాను.

Lukman 31:16

ఓ నా ప్రియ కుమారా నిశ్చయంగా దుష్కర్మ లేదా సత్కర్మ ఒక వేళ అది ఒక ఆవ గింజ బరువంత చిన్నదిగా ఉండి,ఏదైన ఒక పెద్ద రాతి బండ లోపల ఉండి దాన్ని ఎవరు తెలుసుకోకపోయినా లేదా అది ఆకాశముల్లో గాని భూమిలో గానీ ఏ ప్రదేశములో ఉన్నా నిశ్చయంగా అల్లాహ్ దాన్ని ప్రళయదినమున తీసుకుని వస్తాడు. దాని పరంగా ఆయన దాసుడికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సూక్ష్మగ్రాహి సున్నితమైన వస్తువులు ఆయనపై గోప్యంగా ఉండవు. ఆయన వాటి వాస్తవికతలను,వాటి స్థానాలను తెలుసుకునేవాడు.

Lukman 31:17

ఓ నా ప్రియ కుమారా నీవు నమాజును దాని పరిపూర్ణ పద్దతిలో పాటించి నెలకొల్పు,మంచి గురించి ఆదేశించు,చెడు గురించి వారించు. ఆ విషయంలో నీకు కలిగే బాదపై సహనం చూపు. వాటిలో నుండి నీకు ఏవైతే ఆజ్ఞాపించబడినవో అవి నీవు చేయాలని అల్లాహ్ నీపై గట్టిగా తెలిపినవి. అందులో నీకు ఎటువంటి ఎంపిక లేదు.

Lukman 31:18

మరియు నీవు నీ ముఖమును అహంకారముతో ప్రజల నుండి త్రిప్పకు మరియు నీవు భూమిపై నీ స్వయమును ఇష్టపడుతూ నవ్వుతూ నడవకు. నిశ్చయంగా అల్లాహ్ తన నడకలో గర్వించే,తనకు ప్రసాదించబడిన అనుగ్రహాల పట్ల గర్వించి ప్రజల ముందు వాటిపై అహంను ప్రదర్శించి,అల్లాహ్ కు వాటిపై కృతజ్ఞత తెలుపని ప్రతి ఒక్కడినీ ఇష్టపడడు.

Lukman 31:19

మరియు నీవు నీ నడకలో వేగమునకు,నిదానమునకు మధ్యలో ఉండి హొందాతనము బహిర్గతమయ్యే మధ్య మార్గమును పాటించు. మరియు నీ స్వరమును తగ్గించు, బాధ పెట్టేంత బిగ్గరగా దానిని చేయకు. నిశ్చయంగా స్వరాలలో అతి చెడ్డ స్వరము గాడిద స్వరము బిగ్గరగా ఉండటం వలన.

Lukman 31:20

ఓ ప్రజలారా మీరు చూడలేదా,గమనించలేదా అల్లాహ్ ఆకాశములలో ఉన్న సూర్యుడిని,చంద్రుడిని,నక్షత్రాలను ప్రయోజనం పొందటమునకు మీ కొరకు అందుబాటులో ఉంచాడు. మరియు భూమిపై ఉన్న జంతువులను,వృక్షాలను,మొక్కలను కూడా మీకు అందుబాటులో ఉంచాడు. మరియు ఆయన ప్రత్యక్షంగా కనబడే రూప అందము, మంచి శరీరాకృతి లాంటి మరియు లోపల దాగి ఉన్న బుద్ధి,జ్ఞానము లాంటి తన అనుగ్రహాలను మీపై పరిపూర్ణం చేశాడు. ఈ అనుగ్రహాలు ఉండి కూడా ప్రజల్లోంచి కొంతమంది అల్లాహ్ వద్ద నుండి దివ్య జ్ఞానముతో ఎటువంటి పత్రిక జ్ఞానం లేకుండా లేదా కాంతివంతమైన బుద్ధి, అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన ఎటువంటి స్పష్టమైన గ్రంధం లేకుండా అల్లాహ్ ఏకత్వము విషయంలో వాదులాడుతున్నారు.

Lukman 31:21

మరియు అల్లాహ్ తౌహీద్ విషయంలో వాదులాడే వీరందరితో "మీరు అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన దైవ వాణిని అనుసరించండి" అని పలికినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చేవారు : మేము దాన్ని అనుసరించము కాని మేము మా పూర్వికులను మా ఆరాధ్య దైవాల ఆరాధనల్లోంచి దేనిపై మేము పొందామో దాన్ని అనుసరిస్తాము. ఏమీ ఒక వేళ షైతాను వారి పూర్వికులను వారిని అపమార్గమునకు లోను చేసే విగ్రహారాాధన ద్వారా ప్రళయదినమున అగ్ని శిక్ష వైపునకు పిలిచినా వారు వారిని అనుసరిస్తారా ?!.

Lukman 31:22

మరియు ఎవరైతే అల్లాహ్ వైపునకు తన ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకిస్తూ,తన ఆచరణను మంచిగా చేస్తూ ముందుకు పోతాడో అతడు ముక్తిని ఆశించే వాడు, సంబంధంపెట్టుకునే దృఢమైన దాన్ని పట్టుకున్నాడు ఏ విధంగానంటే తాను పట్టుకున్నది తెగిపోతుందన్నభయం అతనికి ఉండదు. మరియు అల్లాహ్ ఒక్కడి వైపే వ్యవహారలన్నింటి పరిణామము,వాటి మరలటం ఉంటుంది. ఆయన ప్రతి ఒక్కడికి దేనికి అతడు హక్కు దారుడో దాన్ని ప్రసాదిస్తాడు.

Lukman 31:23

మరియు ఎవరైతే అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరుస్తాడో ఓ ప్రవక్తా అతని అవిశ్వాసం మిమ్మల్ని దుఃఖానికి గురి చేయకూడదు. మా ఒక్కరి వైపే ప్రళయదినాన వారి మరలటం జరుగును. అప్పుడు మేము వారు ఇహలోకంలో చేసిన దుష్కర్మల గురించి వారికి తెలియపరుస్తాము. మరియు వాటి పరంగా వారికి మేము ప్రతిఫలమును ప్రసాదిస్తాము. నిశ్ఛయంగా అల్లాహ్ హృదయములలో ఉన్న వాటిని బాగా తెలిసినవాడు. వాటిలో ఉన్నవి ఏవీ ఆయనపై గోప్యంగా ఉండవు.

Lukman 31:24

మరియు మేము ఇహలోకంలో వారికి ప్రసాదించిన సుఖాలను కొంత కాలం వరకు వారిని అనుభవించనిస్తాము. ఆ తరువాత మేము వారిని ప్రళయదినమున తీవ్ర శిక్ష వైపునకు మళ్ళిస్తాము. అది నరక శిక్ష.

Lukman 31:25

ఓ ప్రవక్తా ఒక వేళ మీరు ఈ ముష్రికులందరితో ఆకాశములను సృష్టించినదెవరు,భూమిని సృష్టించినదెవరు ? అని అడిగితే వారు తప్పకుండ వాటిని సృష్టించినది అల్లాహ్ అని సమాధానమిస్తారు. మీరు వారితో ఇలా అనండి : స్థుతులన్ని మీపై వాదనను బహిర్గతం చేసిన అల్లాహ్ కే చెందుతాయి. అంతే కాదు వారిలో చాలా మంది తమ అజ్ఞానం వలన స్థుతులకు హక్కుదారుడెవరో తెలుసుకోలేకపోతున్నారు.

Lukman 31:26

ఆకాశముల్లో ఉన్నవన్నీ,భూమిపై ఉన్నవన్నీ సృష్టి పరంగా,అధికారము పరంగా,కార్యనిర్వహణ పరంగా అల్లాహ్ ఒక్కడికే చెందుతాయి. నిశ్చయంగా అల్లాహ్ తన సృష్టితాలన్నింటి నుండి అక్కర లేని వాడు. ఇహపర లోకాల్లో స్థుతింపబడేవాడు.

Lukman 31:27

మరియు ఒక వేళ భూమిలో ఉన్న వృక్షములన్నింటిని నరికివేసి కలములుగా తయారు చేసి మరియు సముద్రమును వాటిని సిరాగా చేసి,ఒక వేళ దాన్ని ఏడు సముద్రములుగా విస్తరింపజేసిన అల్లాహ్ మాటలు వాటి ముగింపు లేకపోవటం వలన అంతం కావు. నిశ్చయంగా అల్లాహ్ అతన్ని ఎవరూ ఓడించని సర్వాధిక్యుడు. అతడు తన సృష్టించటంలో,తన వ్యవహారములను నడిపించటంలో వివేకవంతుడు.

Lukman 31:28

ఓ ప్రజలారా ప్రళయదినాన లెక్క తీసుకోవటం కొరకు, ప్రతిఫలం ప్రసాదించటం కొరకు మిమ్మల్ని సృష్టించటం,మిమ్మల్ని మరల లేపటం ఒక ప్రాణమును సృష్టించటం మాదిరి మాత్రమే. మరియు దాన్ని మరల లేపటం సులభము. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు ఒక శబ్ధమును వినటం ఇంకో శబ్ధమును వినటం నుండి ఆయనకు పరధ్యానంలో ఉంచదు. ఆయన సర్వం చూసే వాడు ఒక వస్తువును చూడటం ఇంకో వస్తువుని చూడటం నుండి ఆయనను పరధ్యానంలో ఉంచదు. మరియు ఇదేవిధంగా ఒక ప్రాణమును సృష్టించటం లేదా దాన్ని మరల లేపటం ఇంకొక ప్రాణమును సృష్టించటం,దాన్ని మరల లేపటం నుండి ఆయనను పరధ్యానంలో ఉంచదు.

Lukman 31:29

ఏమీ మీరు చూడలేదా అల్లాహ్ పగలును అధికం చేయటానికి రాత్రిని తగ్గిస్తున్నాడని మరియు రాత్రిని అధికం చేయటానికి పగలును తగ్గిస్తున్నాడని. మరియు ఆయన సూర్య,చంద్రుల పయన మార్గమును నిర్దేశించాడు అప్పుడే వాటిలోని ప్రతి ఒక్కటి ఒక నిర్ణీత కాలం వరకు తన కక్ష్యలో పయనిస్తున్నవి. మరియు అల్లాహ్ మీరు చేస్తున్న కర్మల గురించి తెలిసినవాడని (మీకు తెలియదా). మీ కర్మలలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు. మరియు తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

Lukman 31:30

ఈ కార్య నిర్వహణ,విధి వ్రాత రెండూ అల్లాహ్ ఒక్కడే సత్యమని, ఆయన తన ఉనికిలో,తన గుణాలలో,తన కార్యాలలో సత్యమని, ముష్రికులు ఆయనను వదిలి ఆరాధిస్తున్నది నిరాధారమైన అసత్యమని, అల్లాహ్ ఆయనే తన ఉనికిలో,తన ఆధిక్యతలో,తన విధి వ్రాతలో తన సృష్టితాలన్నింటిపై ఉన్నతుడని, ఆయనకన్న ఉన్నతుడు లేడని,ఆయనే అన్నింటికన్న గొప్పవాడని సాక్ష్యం పలుకుతున్నవి.

Lukman 31:31

ఏమీ మీరు చూడటం లేదా ఓడలు తన దయతో, తన ఆదీనంలో చేయటంతో ఓ ప్రజలారా పరిశుద్ధుడైన ఆయన మీకు తన సామర్ధ్యం,తన దయపై సూచించే తన సూచనలను చూపించటానికి సముద్రంలో పరిగెడుతున్నవి. నిశ్చయంగా వీటిలో తనకు ఆపద కలిగినప్పుడు ప్రతీ సహనం చూపే వాడి కొరకు మరియు తనకు అనుగ్రహాలు కలిగినప్పుడు కృతజ్ఞతలు తెలుపుకునే వాడి కొరకు ఆయన సామర్ధ్యంపై సూచించే సూచనలు కలవు.

Lukman 31:32

మరియు వారికి అన్నివైపుల నుండి ఒక అల పర్వతముల వలె,మేఘమువలె చుట్టుముట్టినప్పుడు వారు అల్లాహ్ ఒక్కడినే ఆయన కొరకు దుఆను,ఆరాధనను ప్రత్యేకిస్తూ వేడుకుంటారు. మరియు ఎప్పుడైతే అల్లాహ్ వారి కొరకు దుఆను స్వీకరించి,వారిని ఒడ్డుకు చేర్చి రక్షించి,వారిని మునగటం నుండి భద్రపరుస్తాడో వారిలో నుండి కొందరు (విశ్వాసానికి-అవిశ్వాసానికి ) మధ్యలో ఉండిపోయేవారు తమపై విధిగావించబడిన కృతజ్ఞతను పరిపూర్ణ రూపంలో నెలకొల్పరు. మరియు వారిలో నుండి కొందరు అల్లాహ్ అనుగ్రహమును తిరస్కరిస్తారు. మరియు మన ఆయతులను ప్రతీ ద్రోహి - అతడు ఈ వ్యక్తి లాంటి వాడు ఎవడైతే తనను రక్షిస్తే కృతజ్ఞత తెలుపుకునే వారిలోంచి అయిపోతానని ప్రమాణం చేశాడో - తనపై అనుగ్రహాలను ప్రసాదించిన తన ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపని ,అల్లాహ్ అనుగ్రహాలపట్ల కృతఘ్నుడై ఉండేవాడు మాత్రమే తిరస్కరిస్తాడు.

Lukman 31:33

ఓ ప్రజలారా మీరు మీ ప్రభవుపట్ల ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భీతిని కలిగి ఉండండి. మరియు మీరు ఆరోజు శిక్ష నుండి భయపడండి అందులో ఏ తండ్రి తన ఏ సంతానమునకు కొంచెముకూడా పనికి రాడు. మరియు ఏ సంతానము తన తండ్రికి కొంచెము కూడా పనికి రాడు. నిశ్చయంగా ప్రళయదినమున ప్రతిఫలమును ప్రసాదించే అల్లాహ్ వాగ్దానము నిరూపితమవుతుంది,ఖచ్చితముగా నెరవేరుతుంది. ఇహలోక జీవితము దానిలో ఉన్న కోరికలు,పరధ్యానంలో చేసే వస్తువులు మిమ్మల్ని మోసం చేయకూడదు సుమా. మరియు షైతాను నిన్ను మోసగించకూడదు మీపై అల్లాహ్ యొక్క క్షమాపణ,కోపముపై అదిగమించటం వలన,మీ నుండి శిక్షను ఆయన ఆలస్యం చేయటం వలన.

Lukman 31:34

నిశ్చయంగా అల్లాహ్ ఆయన ఒక్కడి వద్దే ప్రళయదినము గురించి జ్ఞానము కలదు. కాబట్టి అది ఎప్పుడు వాటిల్లుతుందో ఆయనకు తెలుసు.ఆయన తలచుకున్నప్పుడు వర్షమును కురిపిస్తాడు. మరియు మాతృ గర్భములో ఉన్నది మగ శిసువా లేదా ఆడ శిసువా ?,దుష్టుడా,పుణ్యాత్ముడా ? అన్నది ఆయనకు తెలుసు. మరియు ఏ ప్రాణికీ తాను రేపటి దినమున సంపాదించేది మేలైనదా లేదా చెడుదైనదా తెలియదు. మరియు ఏ ప్రాణికీ తాను ఏ ప్రాంతములో మరణిస్తాడో తెలియదు. కానీ ఇవన్నీ అల్లాహ్ కు తెలుసు. నిశ్చయంగా అల్లాహ్ వీటన్నింటిగురించి బాగా తెలిసిన వాడు,ఎరుగువాడు. వీటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.

Secde 32:1

(الٓـمٓ) అలిఫ్-లామ్-మీమ్.సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.

Secde 32:2

ఈ ఖుర్ఆన్ ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చారో అది సర్వలోకాల ప్రభువు వద్ద నుండి ఆయనపై అవతరింపబడింది ఇందులో ఏమాత్రం సందేహం లేదు.

Secde 32:3

నిశ్చయంగా ఈ అవిశ్వాసపరులందరు ఇలా పలుకుతున్నారు : నిశ్చయంగా ముహమ్మద్ దాన్ని తన ప్రభువుపై కల్పించుకున్నాడు. వారు తెలిపినట్లు విషయం కాదు. కానీ అది ఎటువంటి సందేహం లేని సత్యము. ఓ ప్రవక్త అది నీ ప్రభువు వద్ద నుండి నీపై అవతరింపబడినది మీకన్న పూర్వం అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టటానికి ఏ ప్రవక్త రాని ప్రజలకు మీరు భయపెట్టటానికి. బహుశా వారు సత్యం వైపునకు మర్గమును పొంది దానిని అనుసరించి దాని ప్రకారం ఆచరిస్తారని.

Secde 32:4

అల్లాహ్ ఆయనే ఆకాశములను,భూమిని,ఆ రెండిటి మధ్యలో ఉన్న వాటన్నింటిని ఆరు దినములలో సృష్టించాడు. మరియు ఆయన కను రెప్ప వాల్చే కన్న తక్కువ సమయంలో వాటిని సృష్టించే సామర్ధ్యం కలవాడు. ఆ పిదప ఆయన తన ఔన్నత్యానికి తగిన విధంగా సింహాసనమునకు ఎక్కి అధీష్టించాడు. ఓ ప్రజలారా మీ కొరకు ఆయన కాకుండా మీ వ్వవహారాలను రక్షించే పరిరక్షకుడెవడూ లేడు లేదా మీ కొరకు మీ ప్రభువు వద్ద సిఫారసు చేసేవాడెవడూ లేడు. ఏమీ మీరు యోచన చేయరా ?. మరియు మిమ్మల్ని సృష్టించినటువంటి అల్లాహ్ ను ఆరాధించండి మరియు ఆయనతోపాటు ఇతరులను ఆరాధించకండి.

Secde 32:5

పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ నే ఆకాశముల్లో,భూమిలో ఉన్న సృష్టి రాసులన్నింటి వ్యవహారమును నడిపిస్తున్న వాడు. ఆ తరువాత ఆ వ్యవహారము ఆయన వైపునకు ఒక దినములో పైకెక్కి చేరుతుంది. దాని పరిమాణం ఓ ప్రజలారా మీరు ఇహలోకములో లెక్క వేసే వేయి సంవత్సరాలు.

Secde 32:6

వాటన్నింటిని వ్యవహరించే ఆయన అగోచర,గోచర విషయాల జ్ఞానం కలవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ఆయనపై ఎవరూ ఆధిక్యతను చూపని సర్వశక్తివంతుడు తన శతృవుల పై ప్రతీకారము తీర్చుకునేవాడు. విశ్వాసపరులైన తన దాసులపై అపారంగా కరుణించేవాడు.

Secde 32:7

ఆయనే తాను సృష్టించిన ప్రతీ వస్తువును ఉత్తమరీతిలో సృష్టించాడు. మరియు పూర్వ నమూనా లేకుండా ఆదమ్ సృష్టిని మట్టితో ఆరంభించాడు.

Secde 32:8

ఆ తరువాత అతని సంతానమును అతని తరువాత అతని నుండి జారి వెలువడే నీటి నుండి (వీర్యం నుండి) చేశాడు.

Secde 32:9

ఆ తరువాత మానవుని సృష్టిని సరి అగు రీతిలో పరిపూర్ణం చేసి,అందులో ఆదీనంలో ఉన్న దూతను ఆదేశించి ఆత్మను ఊదటంతో తన వద్ద నుండి ప్రాణమును ఊదాడు. మరియు ఓ ప్రజలారా ఆయన మీ కొరకు చెవులను వాటి ద్వారా మీరు వినటానికి , కళ్ళను వాటి ద్వారా మీరు చూడటానికి, హృదయములను వాటి ద్వారా మీరు అర్ధం చేసుకోవటానికి చేశాడు. ఈ అనుగ్రహాలను మీపై అనుగ్రహించిన అల్లాహ్ కి చాలా తక్కువ మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

Secde 32:10

మరియు మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ముష్రికులు ఇలా పలికారు : మేము మరణించి భూమిలో అదృశ్యమైపోయి,మా శరీరములు మట్టిగా అయిపోయినప్పుడు ఏమీ సరికొత్తగా జీవించబడి మేము మరణాంతరం లేపబడుతామా ?!. వారు దాన్ని అర్ధం చేసుకోరు. అంతే కాదు వారు వాస్తవానికి మరణాంతర జీవితమును తిరస్కరిస్తున్నారు,దాన్ని వారు విశ్వసించరు.

Secde 32:11

ఓ ప్రవక్తా మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : అల్లాహ్ మీ ఆత్మలను స్వీకరించే బాధ్యతను అప్పజెప్పబడిన మరణ దూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు ప్రళయదినమున లెక్కతీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటానికి మా ఒక్కరి వైపు మరలించబడుతారు.

Secde 32:12

అపరాధులు ప్రళయదినాన మరణాంతర జీవితము పట్ల తమ అవిశ్వాసము వలన అవమానమునకు లోనై తమ తలలను క్రిందకు వాల్చుతూ బహిర్గతమవుతారు. వారు అవమానమును గ్రహిస్తారు మరియు వారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా మేము తిరస్కరించిన మరణాంతరజీవితమును మేము చూశాము. మరియు నీ వద్ద నుండి ప్రవక్తలు తీసుకుని వచ్చిన సత్యమును విన్నాము. కాబట్టి నీవు మమ్మల్ని ఇహలోక జీవితం వైపు మరలింపజేయి మేము సత్కార్యము చేస్తాము అది మా నుండి నిన్ను సంతుష్టపరుస్తుంది. నిశ్చయంగా మేము ఇప్పుడు మరణాంతర జీవితమును,ప్రవక్తలు తీసుకుని వచ్చిన సత్యమును నమ్ముతున్నాము. ఒక వేళ మీరు ఈ స్థితిలో అపరాధులను చూస్తే మీరు పెద్ద విషయమును చూస్తారు.

Secde 32:13

మరియు ఒక వేళ మేము ప్రతీ ప్రాణికి దాని సన్మార్గమును,దాని భాగ్యమును ఇవ్వదలచుకుంటే మేము దాన్ని దానిపై పురిగొల్పే వారము. మరియు కాని అవిశ్వాసపరుల్లోంచి రెండు బాధ్యత వర్గముల్లోంచి జిన్నాతులను,మానవులను వారు విశ్వాస మార్గమునకు,సన్మార్గమునకు బదులుగా అవిశ్వాస మార్గము,అపమార్గమును ఎంచుకోవటం వలన ప్రళయదినాన నరకమును నేను తప్పకుండా నింపి వేస్తానన్న నా మాట విజ్ఞతగా,న్యాయముగా అనివార్యమైనది.

Secde 32:14

ప్రళయదినాన వారిని దూషిస్తూ,మందలిస్తూ వారితో ఇలా పలకబడుతుంది : మీ లెక్క తీసుకోవటం కొరకు ప్రళయదినాన అల్లాహ్ ను కలుసుకోవటం నుండి ఇహలోకములో మీ అశ్రద్ధ వలన శిక్షను చవిచూడండి. నిశ్చయంగా మేము మిమ్మల్ని శిక్షలో మీరు దాని నుండి అనుభవిస్తున్న బాధను లెక్క చేయకండా వదిలివేశాము. మీరు ఇహలోకంలో చేసుకున్న పాపాల కారణం చేత మీరు అంతంకాని,శాశ్వత నరకాగ్ని శిక్షను చవిచూడండి.

Secde 32:15

మన ప్రవక్తలపై అవతరింపబడిన మా ఆయతులను మాత్రం వారే విశ్వసిస్తారు ఎవరికైతే వాటితో హితబోధన చేయబడితే వారు అల్లాహ్ కొరకు ఆయన స్థుతులతో పరిశుద్ధతను తెలుపుతూ సాష్టాంగపడుతారో. మరియు వారు ఏ స్థితిలోను కూడా అల్లాహ్ ఆరాధన నుండి,ఆయనకు సాష్టాంగపడటం నుండి అహంకారమును చూపరు.

Secde 32:16

వారి ప్రక్కలు వారు నిదురించే పరుపుల నుండి దూరమవుతాయి,వారు వాటిని వదిలి అల్లాహ్ వైపునకు మరలుతారు. వారు ఆయనను తమ నమాజులో,ఇతర వాటిలో ఆయన శిక్ష నుండి భయముతో,ఆయన కారుణ్య ఆశతో వేడుకుంటారు. మరియు మేము వారికి ప్రసాదించిన సంపదలనే వారు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తారు.

Secde 32:17

కాని ఏ ప్రాణి అల్లాహ్ వారు ఇహ లోకంలో చేసుకున్న కర్మలకు తన వద్ద నుండి వారికి ప్రతిఫలంగా వారి కొరకు కంటి చలువను కలిగించే వేటిని తయారు చేసి ఉంచాడో తెలియదు. అది ఎటువంటి ప్రతిఫలమంటే అల్లాహ్ మాత్రమే తన గొప్పతనం వలన దాన్ని చుట్టుముట్టి ఉన్నాడు.

Secde 32:18

ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచే వాడై ఆయన ఆదేశించిన వాటిని పాటించేవాడై ఆయన వారించిన వాటికి దూరంగా ఉండేవాడై ఉంటాడో ఆయన విధేయత నుండి వైదొలగిన వాడివలె ఉండడు. ఇరు వర్గముల వారు ప్రతిఫల విషయంలో అల్లాహ్ వద్ద సమానులు కాలేరు.

Secde 32:19

ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యములు చేస్తారో వారికి ప్రతిఫలంగా వారి కొరకు స్వర్గ వనములు తయారు చేయబడి ఉన్నాయి. వారు అందులో అల్లాహ్ వద్ద నుండి తమ కొరకు ఆతిధ్యమర్యాదలుగా,ఇహలోకములో తాము చేసుకున్న సత్కర్మల ప్రతిఫలముగా నివాసముంటారు.

Secde 32:20

మరియు ఎవరైతే అవిశ్వాసముతో,పాపకార్యములతో అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోయారో వారి కొరకు ప్రళయదినమున తయారు చేయబడిన వారి నివాస స్థలము నరకాగ్ని. అందులో వారు శాశ్వతంగా నివాసముంటారు. ఎప్పుడెప్పుడైతే వారు దాని నుండి బయటకు రావాలనుకుంటారో అప్పుడు అందులోనికే మరలించబడుతారు. మరియు వారిని దూషిస్తూ వారితో ఇలా పలకబడుతుంది : మీరు నరకాగ్ని యొక్క ఆ శిక్ష రుచి చూడండి దేని గురించైతే మీ ప్రవక్తలు మిమ్మల్ని భయపెట్టినప్పుడల్లా మీరు తిరస్కరించే వారో.

Secde 32:21

తమ ప్రభువు విధేయత నుండి వైదొలిగే ఈ తిరస్కారులందరికి ఒక వేళ వారు తౌబా చేయకపోతే వారి కొరకు పరలోకంలో తయారు చేయబడ్డ పెద్ద శిక్ష కన్న ముందే మేము తప్పకుండా ఇహలోకములో బాధల,ఆపదల రుచి చూపిస్తాము. బహుశా వారు తమ ప్రభువు విధేయత వైపునకు మరలుతారని.

Secde 32:22

అల్లాహ్ ఆయతులతో హితబోధన చేయబడినా వాటితో హితబోధన గ్రహించకుండా వాటిని లెక్క చేయకుండా వాటి నుండి విముఖత చూపే వాడి కన్నా ఎక్కువ దుర్మార్గుడు ఎవడూ ఉండడు. నిశ్చయంగా మేము అవిశ్వాసమునకు,పాపములకు పాల్పడి అల్లాహ్ ఆయతుల నుండి విముఖత చూపి అపరాదులైన వారి నుండి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము.

Secde 32:23

మరియు నిశ్చయంగా మేము మూసాకు తౌరాతును ప్రసాదించాము. అయితే ఓ ప్రవక్తా మీరు ఇస్రా,మీరాజ్ రాత్రి మూసాను మీరు కలిసిన విషయం గురించి సందేహంలో పడకండి. మరియు మేము మూసాపై అవతరింపబడిన గ్రంధమును ఇస్రాయీలు సంతతి వారి కొరకు అపమార్గము నుండి సన్మార్గము చూపే దానిగా చేశాము.

Secde 32:24

మరియు మేము ఇస్రాయీలు సంతతి వారిలో నుంచి నాయకులను చేశాము,సత్యం విషయంలో ప్రజలు వారిని అనుసరించేవారు. మరియు వారు సత్యం వైపునకు మార్గదర్శకం చేసేవారు. ఎప్పటి వరకైతే వారు అల్లాహ్ ఆదేశించిన వాటిని పాటించటంపై,అల్లాహ్ వారించిన వాటి పై,సందేశ ప్రచార మార్గములో కలిగిన బాధలపై సహనం చూపుతారో. మరియు వారు తమ ప్రవక్తలపై అవతరింపబడిన ఆయతులను గట్టిగా నమ్ముతారో.

Secde 32:25

ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు, ఆయనే ప్రళయదినమున వారు ఇహలోకములో విబేధించుకున్న వాటి విషయంలో వారి మధ్య తీర్పునిస్తాడు. అప్పుడు సత్యం పలికే వాడిని,అసత్యం పలికే వాడిని స్పష్టపరుస్తాడు. ప్రతీ ఒక్కరు దేనికి అర్హత కలిగి ఉన్నారో అది ప్రసాదించబడుతుంది.

Secde 32:26

ఏమీ వీరందరు అంధులైపోయారా మేము వారికన్నముందు గతించిన ఎన్ని జాతులను నాశనం చేశామో వారికి స్ఫష్టం కాలేదా ?!. ఇదిగో వారి వినాశనము కాక ముందు వారు నివాసమున్న నివాసములలో వారు వచ్చిపోయేవారు. అయినా వారు వారి స్థితిని చూసి హతోపదేశం గ్రహించలేదు. నిశ్చయంగా తమ అవిశ్వాసం,తమ పాపకార్యముల వలన వినాశనము కలిగిన ఈ జాతులలో గుణపాఠం ఉన్నది దాని ద్వారా వారి ప్రవక్తలు ఎవరైతే అల్లాహ్ వద్ద నుండి వారి వద్దకు వచ్చారో వారి నిజాయితీ ఆధారించబడుతున్నది. ఏమీ అల్లాహ్ ఆయతులను తిరస్కరించే వీరందరు స్వీకరించే ఉద్దేశముతో,హితబోధన గ్రహించే ఉద్దేశంతో వినటం లేదా ?!.

Secde 32:27

ఏ మరణాంతర జీవితమును తిరస్కరించే వీరందరు ఎటువంటి మొక్కలు లేని బంజరు భూమిపై మేము వర్షపు నీటిని కురిపించి అప్పుడు మేము ఆ నీటితో పంటలను వెలికి తీస్తే వాటి నుండి వారి ఒంటెలు,వారి ఆవులు,వారి గొర్రెలు తినటమును చూడటంలేదా ?!. ఏ వారు దాన్ని చూసి బంజరు భూమిని మొలకెత్తించినవాడు మృతులను జీవింపజేయటంలో సామర్ధ్యం కలవాడని గ్రహించలేరా ?!.

Secde 32:28

మరణాంతర జీవితమును తిరస్కరించి శిక్ష గురించి తొందర పెట్టేవారు ఇలా పలుకుతారు : ఈ తీర్పు ఎప్పుడు ఉన్నది దేని గురించైతే మీరు అది మీకు,మాకు మధ్యన తీర్పునిస్తుందని మరియు మా పరిణామం నరకము అవుతుందని,మీ పరిణామం స్వర్గమవుతుందని మీరు గట్టిగా వాదించినది.

Secde 32:29

ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : ఈ వాగ్దానము ప్రళయదినము అది. నిశ్చయంగా అది దాసుల మధ్య తీర్పునిచ్చే దినము. అది ఏవిధంగా ఉంటుందంటే ఆ రోజు ఇహలోకములో అల్లాహ్ ను తిరస్కరించిన వారు ప్రళయదినమును కళ్ళారా చూసిన తరువాత వారు దాన్ని నిజమని విశ్వసించినా వారికి ప్రయోజనం కలగదు. వారు తమ ప్రభువు వైపునకు పశ్చాత్తాప్పడి ఆయన వైపున మరలటానికి వారికి గడువు ఇవ్వబడదు.

Secde 32:30

ఓ ప్రవక్తా మీరు వీరందరి నుండి వారు తమ మార్గభ్రష్టతలో కొనసాగిన తరువాత వారి నుండి విముఖత చూపండి. మీరు వారిపై కురిసే దాని గురించి నిరీక్షించండి. నిశ్చయంగా వారు వారికి వాగ్దానం చేయబడిన శిక్ష గురించి నిరీక్షిస్తారు.

Ahzab 33:1

ఓ ప్రవక్తా మీరు, మీతోపాటు ఉన్నవారు అల్లాహ్ భీతిపై ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ నిలకడను చూపండి. మరియు ఆయన ఒక్కడితోనే మీరు భయపడండి. మరియు మీరు అవిశ్వాసపరులకు,కపటులకు వారి మనసుల్లో ఉన్న మనోవాంచనల విషయంలో విధేయత చూపకండి. నిశ్చయంగా అల్లాహ్ అవిశ్వాసపరులు,కపటులు పన్నే కుట్రల గురించి బాగా తెలిసినవాడు, తన సృష్టించటంలో,తన వ్యవహారాలను నడిపించటంలో వివేకవంతుడు.

Ahzab 33:2

మరియు మీ ప్రభువు మీపై అవతరింపజేసిన దైవ వాణిని మీరు అనుసరించండి . నిశ్చయంగా అల్లాహ్ మీరు చేస్తున్న వాటి గురించి తెలుసుకునే వాడు. వాటిలో నుండి ఏదీ ఆయన నుండి తప్పిపోదు. మరియు ఆయన తొందరలోనే మీకు మీ కర్మలపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

Ahzab 33:3

మరియు మీరు మీ వ్యవహారాలన్నింటిలో ఒక్కడైన అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండండి. మరియు పరిశుద్ధుడైన ఆయన తన దాసుల్లోంచి తనపై నమ్మకమును కలిగిన వాడి కొరకు పరిరక్షకుడిగా చాలు.

Ahzab 33:4

ఏ విధంగానైతే అల్లాహ్ ఒక మనిషి ఛాతీలో రెండు హృదయములను తయారు చేయలేదో అలాగే నిషిద్ధ విషయంలో భార్యలను తల్లుల స్థానమును కల్పించలేదు. మరియు అలాగే ఆయన దత్త పుత్రులకు సొంత పుత్రుల స్థానమును కల్పించలేదు. నిశ్చయంగా జిహార్ అంటే మనిషి తన భార్యను తనపై నిషేధించుకోవటం. మరియు ఇదే విధంగా దత్తత చేసుకోవటం : ఇస్లాం తప్పుబట్టిన అజ్ఞాన ఆచారాల్లోంచిది. ఈ జిహార్, దత్తత అన్నది మీ నోళ్ళతో పదేపదే వెలువడే మాటలు మాత్రమే. వాటికి ఎటువంటి వాస్తవికత లేదు. కాబట్టి భార్య తల్లి కాదు. మరియు కొడుకు అని చెప్పబడిన వాడు కొడుకు అని పిలిచే వాడికి కొడుకు కాడు. మరియు అల్లాహ్ సుబహానహు వతఆలా తన దాసులు ఆచరించటానికి సత్యమును పలుకుతున్నాడు. మరియు ఆయన సత్య మార్గము వైపునకు మార్గదర్శకం చేస్తున్నాడు.

Ahzab 33:5

మీరు మీ కుమారులని గట్టిగా వాదించుకున్న వారిని వారి వాస్తవ తండ్రులతో బంధమును కలిపి పిలవండి. ఎందుకంటే వారితో వారి బంధము అల్లాహ్ వద్ద అదే న్యాయము. ఒక వేళ మీరు వారి బంధమును కలపటానికి వారి తండ్రులెవరో తెలియకపోతే వారు ధర్మపరంగా మీ సోదరులు మరియు బానిసత్వం నుండి మీరు విముక్తి కలిగించిన వారు. అటువంటప్పుడు మీరు వారిలో నుండి ఎవరినైనా పిలిస్తే ఓ నా సోదరా లేదా ఓ నా పినతండ్రి కుమారుడా అని పిలవండి. మీలో నుండి ఎవరైన తప్పు చేసి (అనుకోకుండా) పలుకుకునే వాడిని అతను ఎవరితో పిలుచుకుంటున్నాడో అతనితో బంధం కలిపితే మీపై పాపము లేదు. కానీ దాన్ని కావాలనే పలికితే మీరు పాపం చేసినవారవుతారు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడేవారిని మన్నించేవాడును, అనుకోకుండా తప్పు చేసినప్పుడు వారిని శిక్షించకపోయినప్పుడు వారిపై కనికరించే వాడును.

Ahzab 33:6

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి విశ్వాసపరులపై స్వయంగా వారి మనస్సుల కన్నా ఆయన వారిని పిలిచే విషయములలో ఎక్కువ హక్కు కలదు. ఒక వేళ వారి మనస్సులు ఇతర వాటి వైపు మొగ్గు చూపినా సరే. మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులు విశ్వాసపరులందరి కొరకు తల్లుల స్థానముతో సమానము. కావున ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తరువాత వారిలో నుండి ఎవరితోనైనా వివాహం చేసుకోవటం ప్రతీ విశ్వాసపరునిపై నిషేధమవుతుంది. మరియు రక్తసంబంధీకులు పరస్పరం వారసత్వం విషయంలో అల్లాహ్ ఆదేశం ప్రకారం విశ్వాసపరులకన్న,అల్లాహ్ మార్గంలో ముహాజిర్ ల కన్న ఎక్కువ హక్కుదారులు. వారు (ముహాజిర్ లు, వారు) ఇస్లాం ఆరంభంలో తమ మధ్య ఉన్న వాటిలో పరస్పరం వారసులయ్యేవారు. దీని తరువాత వారి వారసత్వము రద్దు చేయబడింది. కానీ ఓ విశ్వాసపరులారా మీరు మీ స్నేహితుల యెడల వారసత్వము కాకుండా వారికి వీలునామా,వారి కొరకు ఉపకారము ద్వారా ఏదైన సద్వ్యవహారం చేయాలనుకుంటే మీకు దాని అధికారం కలదు. ఈ ఆదేశం లౌహె మహఫూజ్ లో వ్రాయబడి ఉంది కాబట్టి దానిని అమలు చేయటం తప్పనిసరి అవుతుంది.

Ahzab 33:7

ఓ ప్రవక్తా మేము ప్రవక్తలందరితో వారు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించమని,ఆయనతోపాటు దేనినీ సాటి కల్పించకండి అని,వారి వైపు అవతరింపబడిన దివ్యవాణిని చేరవేయమని గట్టిగా వాగ్దానం తీసుకున్నప్పటి వైనమును మీరు ఒక సారి గుర్తు చేసుకోండి. దాన్ని మేము ప్రత్యేకించి మీతోను,నూహ్,మూసా, మర్యమ్ కుమారుడగు ఈసాతోను తీసుకున్నాము. వారందరితో మేము ఆమానత్ గా అల్లాహ్ సందేశాలను పూర్తిగా చేరవేయటంపై గట్టి వాగ్దానమును తీసుకున్నాము.

Ahzab 33:8

అల్లాహ్ ఈ గట్టి వాగ్దానమును నీతిమంతులైన ప్రవక్తలని వారి నజాయతీ గురించి అవిశ్వాసపరులని దూషించటానికి ప్రశ్నించటానికి ప్రవక్తలందరి నుండి తీసుకున్నాడు. మరియు అల్లాహ్ తనను,తన ప్రవక్తలను అవిశ్వసించే వారి కొరకు ప్రళయదినమున బాధాకరమైన శిక్ష తయారు చేసి ఉంచాడు అది నరకాగ్ని.

Ahzab 33:9

ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీపై యుద్ధం చేయటానికి అవిశ్వాసపరుల సైన్యాలు సమీకరించబడి మదీనా వచ్చిప్పుడు మీపై కలిగిన అల్లాహ్ అనుగ్రహమును మీరు ఒక సారి గుర్తు చేసుకోండి. కపటులు,యూదులు వారికి మద్దతిచ్చారు. అప్పుడు మేము వారిపై ప్రచండమైన పెనుగాలులను దేనితోనైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంగారు సహాయం చేయబడ్డారో పంపించాము. మరియు మేము మీరు చూడలేని దైవదూతల సైన్యములను పంపించాము. అప్పుడు అవిశ్వాసపరులు ఏమీ చేయలేక వెను త్రిప్పి పారిపోయారు. మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా చూస్తున్నాడు ఆయనపై వాటిలో నుండి ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన మీ కర్మలపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

Ahzab 33:10

మరియు ఆ సమయంలో అవిశ్వాసపరులు మీ వద్దకు లోయపై నుండి,దాని క్రింది నుండి మరియు తూర్పు,పడమర రెండు దిశల నుండి వచ్చారు. చూపులు తమ శతృవులను చూడటం నుండి తప్ప ప్రతీ వస్తువు నుండి వాలిపోయినవి. హృదయములు భయము తీవ్రత వలన గొంతుల దాకా వచ్చేసినవి. మరియు మీరు అల్లాహ్ గురించి రకరకాలుగా అనుమానించారు. ఒక సారి సహాయం (విజయం) కలుగుతుందని అనుమానం చేశారు.ఒక సారి దాని నుండి పరాభవం కలుగుతుందని అనుమానించారు.

Ahzab 33:11

కందక యుద్ద సమయంలో విశ్వాసపరులు తమ శతృవుల నుండి తాము పొందిన శతృత్వము ద్వారా పరీక్షించబడ్డారు.మరియు వారు తీవ్ర భయం వలన తీవ్రంగా ప్రకంపించిపోయారు. ఈ పరీక్ష ద్వారా విశ్వాసపరుడెవరో,కపటుడెవరో స్పష్టమయ్యింది.

Ahzab 33:12

ఆ రోజున తమ మనస్సులలో సందేహమున్న కపట విశ్వాసులు,బలహీన విశ్వాసులు ఈ విధంగా పలికారు : మన శతృవులపై విజయము, భూమిలో మనకు అధికారము గురించి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మనకు చేసిన వాగ్దానం నిరాధారమైన అసత్యము.

Ahzab 33:13

ఓ ప్రవక్తా కపట విశ్వాసుల్లోంచి ఒక వర్గము వారు మదీనా వాసులతో ఇలా పలికినప్పటి వైనమును ఒక సారి గుర్తు చేసుకోండి : ఓ యస్రిబ్ వాసులారా (యస్రిబ్ ఇస్లాం కు పూర్వము మదీనా పేరు) కందకము దగ్గరలో సల్అ పాదము వద్ద మీ కొరకు ఎటువంటి వసతి లేదు. కావున మీరు మీ నివాసముల వైపునకు మరలిపోండి. వారిలో నుండి ఒక వర్గము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో తాము ఉన్న ఇండ్లు శతృవుల కొరకు బహిర్గతమైపోయాయని వాదిస్తూ తమ ఇండ్ల వైపు మరలి వెళ్ళటానికి అనుమతి కోరారు. వాస్తవానికి వారు వాదించినట్లు అవి బహిర్గతం కాలేదు. వారు మాత్రం ఈ అబద్దపు వంకతో శతృవుల నుండి పారిపోదలిచారు.

Ahzab 33:14

మరియు ఒక వేళ శతృవులు మదీనా నలుమూలల నుండి వారి వద్దకు వచ్చి వారిని అవిశ్వాసము,షిర్కు వైపునకు మరలమని అడిగితే వారు ఆ విషయాన్ని తమ శతృవుల కొరకు సమ్మతించేవారు. చాలా తక్కువమంది అవిశ్వాసం వైపునకు మరలిపోవటం నుండి ఆగే వారు.

Ahzab 33:15

వాస్తవానికి ఈ కపట విశ్వాసులందరే ఉహద్ దినమున యుద్ధము నుండి వెనుతిరిగి పారిపోయిన తరువాత ఒక వేళ అల్లాహ్ వారిని ఇంకో యుద్దం చేయడానికి హాజరుపరిస్తే వారు తప్పకుండా తమ శతృవులతో యుద్ధం చేస్తారని,వారితో భయపడి పారిపోరని అల్లాహ్ తో ప్రమాణం చేశారు. కాని వారు ప్రమాణమును భంగపరిచారు. మరియు దాసుడు అల్లాహ్ తో తాను చేసిన ప్రమాణము గురించి ప్రశ్నించబడుతాడు. మరియు తొందరలోనే అతని లెక్క తీసుకోబడును .

Ahzab 33:16

ఓ ప్రవక్తా వారందరితో ఇలా పలకండి : మీరు ఒక వేళ మరణము నుండి లేదా హతమార్చబడటం నుండి భయపడి యుద్ధం చేయటం నుండి పారిపోతే మీకు పారిపోవటం ప్రయోజనం కలిగించదు. ఎందుకంటే ఆయుషులు నిర్ధారించబడి ఉన్నవి. మరియు మీరు పారిపోయినప్పుడు మీ ఆయుషు పూర్తి కాకుండా ఉంటే నిశ్ఛయంగా మీరు ఇహలోక జీవితంలో కొంత కాలము మాత్రమే ప్రయోజనం చెందుతారు.

Ahzab 33:17

ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : ఒక వేళ అల్లాహ్ మీపై మీరు ఇష్టపడని మరణం లేదా హతమార్చటమును కోరుకుంటే లేదా మీపై మీరు ఆశించే భద్రత,మేలును కోరుకుంటే ఎవరు మిమ్మల్ని అల్లాహ్ నుండి ఆపగలడు. ఎవరూ దాని నుండి మిమ్మల్ని ఆపలేరు. మరియు ఈ కపట విశ్వాసలందరు తమ కొరకు అల్లాహ్ ను వదిలి తమ వ్యవహారమును రక్షించే పరిరక్షకునిగా,వారిని అల్లాహ్ శిక్ష నుండి ఆపే సహాయకుడినీ ఎవరిని పొందరు.

Ahzab 33:18

మీలో నుండి ఇతరులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు యుద్ధం చేయటం నుండి నిరుత్సాహ పరిచే వారిని,తమ సోదరులతో ఇలా పలికే వారి గురించి అల్లాహ్ కు తెలుసు : మీరు మా వద్దకు రండి మీరు హతమార్చబడకుండా ఉండటానికి ఆయనతో పాటు కలిసి యుద్ధం చేయకండి. మేము మీరు హతమార్చబడతారని భయపడుతున్నాము. నిరాశపడే వీరందరు యుద్దంలోకి వచ్చి అందులో చాలా అరుదుగా పాలుపంచుకుంటారు,తమ స్వయం నుండి నిందను తొలగించుకోవటానికే గాని అల్లాహ్ ఆయన ప్రవక్తకు సహాయం చేయటానికి కాదు.

Ahzab 33:19

విశ్వాసపరుల సమాజము వారా వారు తమ సంపదల్లో మీపై పరమ పీనాసులు కాబట్టి వారు వాటిని ఖర్చు చేసి మీకు సహాయపడరు. మరియు వారు తమ ప్రాణముల విషయంలో పీనాసులు కాబట్టి వారు మీతోపాటు కలిసి యుద్ధం చేయరు. మరియు వారు తమ ప్రేమా అభిమానములో పీనాసులు కాబట్టి వారు మీపై ప్రేమా అభిమానములను వెలుబుచ్చరు. శతృవును ఎదుర్కున్నప్పుడు భయం వచ్చినప్పుడు ఓ ప్రవక్తా మీరు వారిని మీ వైపు చూస్తుండగా చూస్తారు వారి కళ్ళు పిరికితనం వలన మరణ ఘడియలను చూసిన వ్యక్తి రెండు కళ్ళు తిరిగినట్లు తిరుగుతుంటాయి. ఎప్పుడైతే వారి నుండి భయం తొలగిపోయి వారు నిశ్ఛింతగ ఉంటారో అప్పుడు వారు పదునైన నాలుకల ద్వారా మాటలతో మిమ్మల్ని బాధిస్తారు. యుద్ధ ప్రాప్తి పై అత్యాస కలిగిన వారు వాటి గురించి వెతుకుతూ మీ దగ్గరకు వస్తారు. ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరు వాస్తవానికి విశ్వసించరు. అందుకే అల్లాహ్ వారి కర్మల ప్రతిఫలాన్ని వృధా చేస్తాడు. ఈ వృధా చేయటం అల్లాహ్ పై చాలా తేలిక.

Ahzab 33:20

ఈ పిరికివారందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో యుద్ధం చేయటానికి,విశ్వాసపరులతో యుద్ధం చేయటానికి సమావేశమైన సమూహాలన్ని విశ్వాసపరులని కూకటివ్రేళ్ళతో తుదిముట్టించనంత వరకు వెళ్ళరని అనుకునేవారు. మరియు ఒక వేళ సమూహాలన్ని రెండవసారి వచ్చారే అనుకోండి ఈ కపట విశ్వాసులందరు మదీనా నుండి వెళ్ళిపోయి పల్లెవాసులతో ఉండదలుస్తారు. మీ సమాచారముల గురించి ఇలా అడుగుతారు : మీ శతృవులతో మీ యుద్ధానంతరం మీకు ఏమి సంభవించినది ?. ఒక వేళ వారు ఓ విశ్వాసపరులారా మీలో ఉంటే వారు మీతోపాటు కలిసి చాలా తక్కువగా యుద్ధం చేస్తారు. మీరు వారినిలెక్క చేయకండి మరియు వారిపై విచారించకండి.

Ahzab 33:21

నిశ్ఛయంగా అల్లాహ్ ప్రవక్త పలికిన దానిలో,చేసిన దానిలో ఆయన కార్యాల్లో మీ కొరకు ఉత్మమైన ఆదర్శం కలదు. వాస్తవంగా ఆయనే స్వయంగా వచ్చి యుద్ధంలో పాల్గొన్నారు. అటువంటప్పుడు దీని తరువాత కూడా మీరు ఆయన నుండి తమను తాము ఎలా వదులుకుంటున్నారు ?. పరలోకమును ఆశించి దాని కొరకు ఆచరించేవాడు,అల్లాహ్ స్మరణ అధికంగా చేసేవాడు మాత్రమే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదర్శంగా తీసుకుంటాడు. మరియు ఎవరైతే పరలోకమును ఆశించడో,అల్లాహ్ స్మరణను అధికంగా చేయడో నిశ్ఛయంగా అతడు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును ఆదర్శంగా తీసుకోడు.

Ahzab 33:22

మరియు ఎప్పుడైతే విశ్వాసపరులు తమతో యుద్ధం కొరకు సమావేశమైన యుద్ద సమూహాలను కళ్ళారా చూశారో ఇలా పలికారు : ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మాతో వాగ్దానం చేసిన ఆపద,పరీక్ష,సహాయము. ఈ విషయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సత్యం పలికారు. అది నిర్ధారితమైనది. వారు యుద్ధ సమూహాలను కళ్ళారా చూడటం వారిని మాత్రం అల్లాహ్ పట్ల విశ్వాసంలో ఆయన పై విధేయతలో అధికం చేసింది

Ahzab 33:23

విశ్వాసపరుల్లోంచి కొందరు అల్లాహ్ కు నిజం చేసి చూపించి ఆయనకు చేసిన వాగ్దానము అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటము పై నిలకడ చూపటం,సహనం చూపటమును పూర్తిచేశారు. మరియు వారిలో నుండి అల్లాహ్ మార్గములో మరణించిన వారూ లేదా అమరగతి పొందిన వారూ ఉన్నారు. మరియు వారిలో నుండి ఆయన మార్గములో అమరగతినొందటానికి నిరీక్షిస్తున్నవారూ ఉన్నారు. ఈ విశ్వాసపరులందరు తాము అల్లాహ్ తో చేసిన వాగ్దానమును కపట విశ్వాసులు తమ వాగ్దానముల పట్ల చేసిన విధంగా మార్చలేదు.

Ahzab 33:24

అల్లాహ్ తోచేసిన వాగ్దానమును తమ నిజాయితీ ద్వారా,తమ వాగ్దానములను పరిపూర్ణం చేయటం ద్వారా పరిపూర్ణం చేసిన నిజాయితీపరులను అల్లాహ్ ప్రతిఫలమును ప్రసాదించటానికి మరియు తమ వాగ్దానములను భంగపరచిన కపట విశ్వాసులను ఒక వేళ ఆయన తలచుకుంటే శిక్షించటానికి,వారిని వారి అవిశ్వాసము గురించి పశ్చాత్తప్పడక ముందే మరణాన్ని ప్రసాదించి లేదా వారికి పశ్చాత్తాప్పడే భాగ్యమును కలిగించి వారి పశ్చాత్తాపమును స్వీకరించటానికి. మరియు అల్లాహ్ తమ పాపముల నుండి పశ్చాత్తాప్పడే వాడిని మన్నించేవాడును,అతనిపై కరుణించేవాడును.

Ahzab 33:25

మరియు అల్లాహ్ ఖురైష్ ను,గత్ఫాన్ ను,వారితోపాటు ఉన్న వారిని వారు ఆశించినది కోల్పోవటం వలన వారి వేదనతో,వారి దుఃఖముతో మరలింపజేశాడు. విశ్వాసపరులను కూకటివ్రేళ్ళతో తీసి వేసే వారి ఆలోచనలో వారు సఫలీకృతం కాలేదు. మరియు అల్లాహ్ విశ్వాసపరులకు తాను పంపించిన గాలితో,తాను అవతరింపజేసిన దైవదూతలతో సరిపోయాడు. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు ఆయనను ఎవడూ ఓడించలేడు కాని ఆయన అతడిని ఓడిస్తాడు,అతడిని నిరాశపరుస్తాడు.

Ahzab 33:26

మరియు అల్లాహ్ వారికి సహాయం చేసిన యూదులను వారు తమ శతృవుల నుండి రక్షణ కొరకు దాక్కొనే వారి కోఠల నుండి క్రిందికి దించాడు. మరియు ఆయన వారి హృదయములలో భయమును వేశాడు. ఒక వర్గమును ఓ విశ్వాసపరులారా మీరు హతమారుస్తున్నారు మరియు ఒక వర్గమును మీరు ఖైదీలుగా చేసుకుంటున్నారు.

Ahzab 33:27

మరియు అల్లాహ్ వారి వినాశనము తరువాత పంటపొలాలు,ఖర్జూరపు చెట్లు కల వారి భూమిలో మీకు అధికారమును ఇచ్చాడు. మరియు ఆయన వారి ఇండ్లపై,వారి ఇతర సంపదలపై మీకు అధికారమును కలిగించాడు. మరియు ఆయన మీరు ఇంత వరకు అడుగు పెట్టని ఖైబర్ ప్రాంతముపై మీకు అధికారమును కలిగించాడు. కాని మీరు తొందరలోనే దానిపై అడుగు పెడతారు. మరియు ఇది విశ్వాసపరుల కొరకు వాగ్దానము,శుభవార్త. మరియు అల్లాహ్ అన్నింటిపై అధికారము కలవాడు. ఆయనను ఏదీ ఓడించదు.

Ahzab 33:28

ఓ ప్రవక్తా మీరు మీ సతీమణులతో వారు ఖర్చుల విషయంలో మీ వద్ద వారికి విస్తరించి ఇవ్వటానికి లేని స్థితిలో మీతో విస్తరణను కోరినప్పుడు ఇలా పలకండి : ఒక వేళ మీరు నాతో ప్రాపంచిక జీవితాన్ని మరియు అందులో ఉన్న ఆడంభరాన్ని కోరుకుంటే నేను విడాకులు ఇవ్వబడిన స్త్రీలు ప్రయోజనం చెందే వాటితో మీకు ప్రయోజనం కలిగిస్తాను. మరియు నేను మీకు ఎటువంటి నష్టమును కలిగించటం గాని ఎటువంటి బాధ కలిగించటం గాని లేని విడాకులిస్తాను.

Ahzab 33:29

మరియు ఒక వేళ మీరు అల్లాహ్ మన్నతను,ఆయన ప్రవక్త ఇష్టతను ఆశిస్తే మరియు మీరు పరలోక నివాసములో స్వర్గమును ఆశిస్తే మీరు ఉన్న పరిస్థితిపై సహనం చూపండి. నిశ్ఛయంగా అల్లాహ్ మీలో నుండి మంచిగా సహనం చూపేవారికి,మంచిగా తోడు ఉండేవారికి గొప్ప ప్రతిఫలమును సిద్ధం చేసి ఉంచాడు.

Ahzab 33:30

ఓ ప్రవక్త సతీమణులారా మీలో నుండి ఎవరైన ప్రత్యక్షంగా ఏదైన పాపమునకు పాల్పడితే ఆమె కొరకు ప్రళయదినమున రెట్టింపు శిక్ష విధించబడుతుంది ఆమె స్థానము కొరకు,ఆమె స్థితి కొరకు మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మర్యాద రక్షణ కొరకు. మరియు ఈ రెట్టింపు శిక్ష విధించటం అల్లాహ్ పై శులభము.

Ahzab 33:31

మరియు మీలో నుండి ఎవరైతే అల్లాహ్ విధేయతపై,ఆయన ప్రవక్త విధేయతపై కొనసాగి,అల్లాహ్ వద్ద స్వీకృతమయ్యే సత్కార్యము చేస్తారో వారికి మేము ఇతర స్త్రీలకు ఇవ్వని రెట్టింపు పుణ్యాన్ని ప్రసాదిస్తాము. మరియు మేము పరలోకములో ఆమె కొరకు గౌరవప్రధమైన పుణ్యమును సిద్ధం చేసి ఉంచాము.అది స్వర్గము.

Ahzab 33:32

ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులారా మీరు ఘనతలో,గౌరవంలో సాధారణ స్త్రీల్లాంటి వారు కారు. కాని మీరు ఒక వేళ అల్లాహ్ ఆదేశాలను పాఠించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటే మీరు ఘనతలో,గౌరవంలో ఇతర స్త్రీలు చేరని స్థానంలో ఉంటారు. మీరు పరాయి మగాళ్ళతో మాట్లాడినప్పుడు మెత్తగా మాట్లాడకండి,స్వరమును మీరు సుతిమెత్తగా చేయకండి. దాని వలన కపట రోగము ఉన్న,నిషిద్ధ కోరికలు గల హృదయం వాడు ఆశపడుతాడు. మరియు మీరు సందేహమునకు దూరంగా ఉన్న మాటలను సూటిగా, అర్ధం లేనివి కాకండా,అవసరానికి తగ్గట్టుగా మాట్లాడండి.

Ahzab 33:33

మరియు మీరు మీ ఇండ్లలోనే ఉండండి. అవసరం లేకుండా వాటి నుండి బయటకు రాకండి. మరియు మీరు మీ అందాలను ఇస్లాంకు ముందు స్త్రీలు చేసిన కార్యముతో బహిర్గతం చేయకండి ఎందుకంటే వారు వాటిని మగవారిని మరల్చటానికి (ప్రలోభపెట్టటానికి) చేసేవారు. మరియు మీరు నమాజును పరిపూర్ణంగా పాఠించండి. మరియు మీరు మీ సంపదల నుండి జకాతును చెల్లించండి. మరియు అల్లాహ్ కు,ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. పరిశుద్ధుడైన అల్లాహ్ మాత్రం మీ నుండి బాధను,చెడును తొలగించదలచాడు. ఓ అల్లాహ్ ప్రవక్త సతీమణులారా ,ఓ ఆయన ఇంటి వారా మరియు ఆయన మీ మనస్సులను వాటికి ఉన్నత గుణాలను తొడిగించి మరియు వాటిని దిగజారిన గుణాల నుండి ఖాళీ చేసి సంపూర్ణంగా పరిశుద్ధపరచదలచాడు. దాని తరువాత ఎటువంటి మాలిన్యం మిగలదు.

Ahzab 33:34

మరియు దైవ ప్రవక్తపై అవతరింపబడిన అల్లాహ్ ఆయతుల్లోంచి, దైవ ప్రవక్త పరిశుద్ధ సున్నత్ లలోంచి (హదీసుల్లోంచి) మీ ఇండ్లలో పఠించబడే వాటిని స్మరిస్తూ ఉండండి. నిశ్ఛయంగా అల్లాహ్ మీపై దయ గలవాడు ఎందుకంటే ఆయన మిమ్మల్ని తన ప్రవక్త ఇండ్లలో ఉంచాడు. మీ గురించి బాగా తెలుసుకునే వాడు ఎందుకంటే ఆయన మిమ్మల్ని తన ప్రవక్త సతీమణులుగా ఎంచుకున్నాడు. మరియు ఆయన మిమ్మల్ని ఆయన జాతి వారిలో నుండి విశ్వాసపరలందరి కొరకు తల్లులుగా ఎంచుకున్నాడు.

Ahzab 33:35

నిశ్ఛయంగా విధేయత ద్వారా అల్లాహ్ కొరకు అణకువను చూపే పురుషులు,అణకువను చూపే స్త్రీలు మరియు అల్లాహ్ ని విశ్వసించే పురుషులు,విశ్వసించే స్త్రీలు మరియు అల్లాహ్ కు విధేయులైన పురుషులు,విధేయులైన స్త్రీలు మరియు తమ విశ్వాసములో,తమ మాటలో నిజం పలికే పురుషులు,నిజం పలికే స్త్రీలు మరియు విధేయత చూపటంపై,పాపకార్యముల నుండి దూరంగా ఉండటం పై,ఆపదలపై సహనం చూపే పురుషులు,సహనం చూపే స్త్రీలు మరియు తమ సంపదల నుండి విధి,స్వచ్ఛందంగా దానాలు చేసే పురుషులు,దానాలు చేసే స్త్రీలు మరియు అల్లాహ్ కొరకు విధి,స్వచ్చందంగా ఉపవాసాలు ఉండే పురుషులు,ఉపవాసాలు ఉండే స్త్రీలు మరియు తమ మర్మావయవాలను వాటిని చూడటం సమ్మతం కాని వారి ముందు బహిర్గతం కాకుండా కప్పి ఉంచి,వ్యభిచార అశ్లీల కార్యము నుండి ,దానిని ప్రేరేపించే వాటి నుండి దూరంగా ఉండి పరిరక్షించే పరుషులు,పరిరక్షించే స్త్రీలు మరియు తమ మనస్సులతో,తమ నాలుకలతో గోప్యంగా,బహిర్గంగా అల్లాహ్ ను ఎక్కువగా స్మరించే పురుషులు,స్త్రీలు వారందరి కొరకు అల్లాహ్ తన వద్ద నుండి వారి పాపముల కొరకు మన్నింపును సిద్ధం చేసి ఉంచాడు. మరియు వారి కొరకు ప్రళయదినమున గొప్ప పుణ్యమును సిద్ధం చేసి ఉంచాడు అది స్వర్గము.

Ahzab 33:36

విశ్వసించిన పురుషునికి గాని విశ్వసించిన స్త్రీకి గాని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారి విషయంలో ఏదైన విషయం గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు వారి కొరకు దాన్ని స్వీకరించే లేదా దాన్ని వదిలే అధికారం ఉండటం సరికాదు. మరియు ఎవరైతే అల్లాహ్,ఆయన ప్రవక్త పై అవిధేయత చూపుతాడో అతడు సన్మార్గము నుండి స్పష్టముగా మార్గ భ్రష్టుడవుతాడు.

Ahzab 33:37

ఓ ప్రవక్తా ఎవరిపైనైతే అల్లాహ్ ఇస్లాం అనుగ్రహం ద్వారా అనుగ్రహించాడో మరియు మీరు బానిసత్వము నుండి విముక్తి కలిగించటం ద్వారా అతనిపై అనుగ్రహించారో అతనితో మీరు అన్నప్పటి వైనమును ఒక సారి గుర్తు చేసుకోండి - దీని ఉద్దేశము జైద్ బిన్ హారిసహ్ రజిఅల్లాహు అన్హుమా ఎందుకంటే ఆయన తన భార్య జైనబ్ బిన్తె జహష్ రజిఅల్లాహు అన్,హా ను విడాకులు ఇచ్చే విషయంలో సలహా కోరుతు మీ వద్దకు వచ్చారు. - మీరు ఆయనతో ఇలా పలికారు నీవు నీ భార్యను నీ వద్దే ఉండనీ మరియు ఆమెకు విడాకులివ్వకు. మరియు నీవు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడు. వాస్తవానికి ఓ ప్రవక్తా మీరు ప్రజలకు భయపడి అల్లాహ్ జైనబ్ తో మీ వివాహం గురించి మీకు చేసిన దైవ వాణి ని మీ మనస్సులో దాచి పెట్టారు. మరియు అల్లాహ్ తొందరలోనే జైద్ ఆమెకు విడాకులిచ్చే విషయమును,ఆ తరువాత ఆమెతో మీ వివాహ విషయమును బహిర్గతం చేస్తాడు. మరియు ఈ విషయంలో మీరు భయపడటానికి అల్లాహ్ ఎక్కువ యోగ్యత కలవాడు. జైద్ మనస్సుకు మంచిగా అనిపించి ఆమెను ఆయన ఇష్టపడక ఆమెను విడాకులిచ్చినప్పుడు మేము ఆమెతో మీ వివాహం చేయించాము. ఎందు కంటే దత్త పుత్రులు తమ భార్యలను విడాకులిచ్చినప్పుడు వారి ఇద్దత్ గడువు పూర్తయిన తరువాత దత్తపుత్రుల భార్యలతో వివాహం చేసుకోవటంలో విశ్వాసపరులపై ఎటువంటి పాపం ఉండకుండా ఉండటానికి. మరియు అల్లాహ్ ఆదేశం జరిగి తీరుతుంది దానికి ఎటువంటి ఆటంకము ఉండదు. మరియు ఎటువంటి అభ్యంతరముండదు.

Ahzab 33:38

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ ఆయన దత్త పుత్రుని భార్యతో నికాహ్ విషయంలో ధర్మ సమ్మతం చేసిన దాని విషయంలో ఎటువంటి పాపము గాని లేదా ఇబ్బంది గాని లేదు. మరియు ఆయన ఆ విషయంలో తన కన్న మునుపటి దైవ ప్రవక్తల సంప్రదాయమును అనుసరించారు. మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయంలో ప్రవక్తల్లోంచి కొత్తగా మొదలెట్టినది కాదు. మరియు అల్లాహ్ ఏదైతే నిర్ణయించుకున్నాడో -ఈ వివాహం పరిపూర్ణం కావటం,దత్తత చేసుకోటం అసత్యమని నిరూపించటం మరియు అందులో దైవప్రవక్తకు ఎటువంటి అభిప్రాయం గాని లేదా ఎటువంటి ఎంపిక గాని లేదు - జరిగి తీరే నిర్ణయం దాన్ని ఎవరు మరలించలేరు.

Ahzab 33:39

ఈ ప్రవక్తలందరు వారే తమ పై అవతరింపబడిన అల్లాహ్ సందేశాలను తమ జాతుల వారి వద్దకు చేరవేస్తారు. మరియు వారు పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ తో మాత్రమే భయపడుతారు. మరియు అల్లాహ్ వారి కొరకు ధర్మ సమ్మతం చేసిన వాటిని చేసేటప్పుడు ఇతరులు చెప్పే మాటల వైపు ధ్యాసను పెట్టరు. మరియు అల్లాహ్ తన దాసులు చేసిన కర్మల కొరకు వాటి పరంగా వారికి లెక్క తీసుకోవటానికి,వాటి పరంగా వారికి ప్రతిఫలం ప్రసాదించటానికి సంరక్షకునిగా చాలు. ఒక వేళ మంచివైతే మంచి అవుతుంది.ఒక వేళ చెడు అయితే చెడు అవుతుంది.

Ahzab 33:40

ముహమ్మద్ మీలో నుండి మగవారెవరికి తండ్రి కాజాలరు. కాబట్టి ఆయన జైద్ కి తండ్రి కారు చివరికి ఆయనపై అతని భార్యతో వివాహం చేసుకో వటం అతను ఆమెని విడాకులిచ్చినప్పుడు నిషిద్ధం కావటానికి. కాని ఆయన ప్రజలవద్దకు పంపించబడ్డ అల్లాహ్ ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరను ముగించేవారు. కాబట్టి ఆయన తరువాత ఏ ప్రవక్తా లేడు. మరియు అల్లాహ్ ప్రతీది తెలిసినవాడు. తన దాసుల వ్యవహారములోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.

Ahzab 33:41

ఓ అల్లాహ్ ను విశ్వసించి తమ కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించే వారా మీరు మీ హృదయములతో,మీ నాలుకలతో,మీ అవయవాలతో అల్లాహ్ స్మరణను అధికంగా చేయండి.

Ahzab 33:42

పరిశుద్ధుడైన ఆయన పవిత్రతను దినపు మొదటి వేళలో,దాని చివరి వేళల్లో తస్బీహ్ (సుబహానల్లాహ్ పలకటం) ద్వారా,తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకటం) ద్వారా ఆ రెండింటి ప్రాముఖ్యత వలన కొనియాడండి.

Ahzab 33:43

ఆయనే మీపై కరుణిస్తాడు మరియు మీ గొప్పలు చెబుతాడు. మరియు ఆయన దూతలు మిమ్మల్ని అవిశ్వాసపు చికట్ల నుండి విశ్వాసపు కాంతి వైపునకు వెలికితీయటానికి మీ కొరకు వేడుకుంటారు. మరియు ఆయన విశ్వాసపరులపై అనంత కరుణామయుడు .కాబట్టి ఆయన వారు ఆయన ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు విధేయత చూపినప్పుడు వారిని శిక్షించడు.

Ahzab 33:44

విశ్వాసపరులు తమ ప్రభువును కలుసుకునే రోజు వారి అభినందన ప్రతీ కీడు నుండి శాంతి,భద్రత కలుగు గాక అవుతుంది. మరియు అల్లాహ్ వారి కొరకు గౌరవ ప్రధమైన పుణ్యము - అది అతని స్వర్గము - అతని కొరకు వారి విధేయత చూపటంపై, అతని అవిధేయత నుండి వారు దూరంగా ఉండటం పై వారి కొరకు ప్రతిఫలంగా సిద్ధం చేసి ఉంచాడు.

Ahzab 33:45

ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మేము మిమ్మల్ని ప్రజల వద్దకు మీరు ఇచ్చి పంపించబడ్డ సందేశములను వారికి చేరవేశే విషయంలో వారిపై సాక్షిగా మరియు వారిలో నుండి విశ్వాసపరుల కొరకు అల్లాహ్ వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన స్వర్గము గురించి శుభవార్తనిచ్చేవాడిగా మరియు అవిశ్వాసపరులకు వారి కొరకు శిద్ధం చేసి ఉంచిన ఆయన శిక్ష గురించి భయపెట్టే వాడిగా పంపించాము.

Ahzab 33:46

మరియు మేము మిమ్మల్ని అల్లాహ్ ఏకత్వము వైపునకు,ఆయన ఆదేశము పట్ల ఆయనపై విధేయత చూపటం వైపునకు పిలిచే వాడిగా పంపించాము. మరియు మేము మిమ్మల్ని ప్రతి సన్మార్గమును కోరుకునే వాడు దేనితో వెలుగును పొందుతాడో ఆ ప్రకాశించే దీపంగా పంపించాము.

Ahzab 33:47

మరియు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి,ఆయన వారి కొరకు ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించే వారికి సంతోషమును కలిగించే వారి కొరకు పరిశుద్ధుడైన అల్లాహ్ వద్ద నుండి ఇహలోకములో వారికి సహాయమును,పరలోకములో స్వర్గములో ప్రవేశము ద్వారా వారికి సాఫల్యము కలిగిన గొప్ప అనుగ్రహము ఉన్నదని మీరు శుభవార్తను ఇవ్వండి.

Ahzab 33:48

మరియు మీరు అవిశ్వాసపరులకు,కపటవిశ్వాసులకు అల్లాహ్ ధర్మం నుండి ఆపటం గురించి వారు పిలుస్తున్న విషయంలో అనుసరించకండి. మరియు వారి నుండి విముఖత చూపండి. బహుశా అది మీరు వారి వద్దకు తీసుకుని వచ్చిన దాన్ని వారు విశ్వసించటం కొరకు మరింత చెల్లుతుంది. మరియు నీవు నీ వ్యవహారాలన్నింటిలో అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండు. వాటిలో నుండి ప్రత్యేకించి నీ శతృవులపై సహాయం విషయంలో. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు దాసులు ఇహలోకములో,పరలోకములో తమ వ్యవహారాలన్నింటిలో ఆయనపైనే నమ్మకమును కలిగి ఉంటారు.

Ahzab 33:49

ఓ అల్లాహ్ ను విశ్వసించి ,తమ కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు విశ్వాసపర స్త్రీలను నికాహ్ (వివాహం) చేసుకుని ఆ తరువాత వారితో సంభోగము చేయకముందే వారికి విడాకులిచ్చినప్పుడు మీ కొరకు వారిపై ఎటువంటి ఇద్దత్ గడువు లేదు. అది ఋతుస్రావందైనా లేదా నెలల లెక్క దైనా సమానమే. వారితో సమాగమం చేయకపోవటం వలన వారి గర్భములు ఖాళీ అని తెలవటం వలన. మరియు మీరు వారికి మీ స్థోమతను బట్టి మీ సంపదలతో విడాకుల వలన వారి విరిగిన హృదయములను జోడించటము కొరకు ప్రయోజనం కలిగంచండి. మరియు వారికి బాధ కలిగించకుండా వారు తమ ఇంటి వారి వద్దకు వెళ్ళే వారి మార్గమును వదిలివేయండి.

Ahzab 33:50

ఓ ప్రవక్తా నిశ్చయంగా మీరు మహర్ చెల్లించిన మీ భార్యలను మీ కొరకు సమ్మతించాము. మరియు మేము ఆ బానిస స్త్రీలను ఎవరినైతే అల్లాహ్ బందీలుగా మీకు ఇచ్చాడో వారిని మీ కొరకు సమ్మతం చేశాము. మరియు మీ పినతండ్రి కుమార్తెలతో నికాహ్ చేయటమును, మీ మేనత్త కుమార్తెలతో నికాహ్ చేయటమును, మీ మేన మామ కుమార్తెలతో నికాహ్ చేయటమును, మీ ఆ పినతల్లులు ఎవరైతే మీతోపాటు మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేశారో వారి కుమార్తెలను నికాహ్ చేసుకోవటమును మేము సమ్మతం చేశాము. మరియు ఎటువంటి మహర్ లేకుండా తన స్వయమును నీ కొరకు సమర్పించుకున్న విశ్వాసపరురాలైన స్త్రీతో ఒక వేళ మీరు చేయదలచుకుంటే నికాహ్ చేసుకోవటమును మీ కొరకు మేము సమ్మతించాము. మరియు నికాహె హిబహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రత్యేకించినది,అది ఉమ్మత్ లో నుండి ఇతరులకు సమ్మతం కాదు. నిశ్ఛయంగా విశ్వాసపరులపై వారి భార్యల విషయంలో మేము ఏమి అనివార్యం చేశామో మాకు తెలుసు. ఎందుకంటే వారు నలుగురు భార్యల కన్నా అతిక్రమించటం వారికి సమ్మతం కాదు. మరియు వారి కొరకు వారి బానిస స్త్రీల విషయంలో మేము ధర్మబద్ధం చేసినదేదో మాకు తెలుసు ఎందుకంటే నిశ్ఛయంగా లెక్కలో ఎటువంటి పరిమితి లేకుండా వారిలో నుండి వారు కోరుకున్న వారితో ప్రయోజనం చెందటం వారి కొరకు కలదు. మరియు మేము ఇతరులకు సమ్మతం చేయనివి ప్రస్తావించబడిన వాటిని మీకు ఎటువంటి ఇబ్బంది,బాధ కలగకూడదని మీ కొరకు సమ్మతం చేశాము. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడిన వారిని మన్నించే వాడు,వారిపై కరుణించేవాడు.

Ahzab 33:51

ఓ ప్రవక్తా మీ సతీమణుల్లోంచి మీరు కోరిన వారి వంతును వెనుకకు జరిపి మీరు ఆమెతో రాత్రి గడపక పోవచ్చు మరియు వారిలో నుండి మీరు కోరుకున్న వారిని మీతో చేర్చుకుని ఆమెతో మీరు రాత్రి గడపవచ్చు మరియు మీరు వారిలో నుండి ఎవరి వంతు వెనుకకు జరిపారో ఆమెను మీరు మీతో చేర్చు కోవటమును కోరితే మీపై ఎటువంటి దోషం లేదు. మీ కొరకు ఆ ఎంపిక,విస్తరణ మీ భర్యల కంటి చలువ కలుగుటకు , మరియు మీరు వారందరికి ఇచ్చిన దానితో వారు సంతృప్తి చెందటానికి చాలా దగ్గర ఉన్నది.ఎందుకంటే మీరు ఏ అనివార్య కార్యమును వదలరని,ఏ హక్కు విషయంలో పిసినారితనమును చూపరని వారికి తెలుసు. మరియు ఓ పురుషులారా మీ హృదయముల్లో ఉన్నది భార్యల్లో నుండి కొందరిని వదిలి కొందరి వైపు మొగ్గు చూపటం అన్నది అల్లాహ్ కు తెలుసు. మరియు అల్లాహ్ కు తన దాసుల కర్మల గురించి బాగా తెలుసు.వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. వారు ఆయన యందు పశ్ఛాత్తాప్పడతారని వారి గురించి తెలియటం వలన వారిని శిక్షించటంలో తొందరపడని దయామయుడు ఆయన.

Ahzab 33:52

ఓ ప్రవక్తా మీ వివాహ బంధంలో ఉన్న మీ భార్యలు కాకుండా ఇతర స్త్రీలతో మీరు వివాహం చేసుకోవటం మీకు ధర్మసమ్మతం కాదు. మరియు ఇతర స్త్రీలను తీసుకునటానికి వారిని (భార్యలను) విడాకులివ్వటం గాని వారిలో నుండి కొందరిని విడాకులివ్వటం సమ్మతం కాదు. ఒక వేళ మీరు వివాహం చేసుకోదలచిన ఇతర స్త్రీల అందము మీకు నచ్చినా సరే. కాని మీ బానిస స్త్రీలతో ఒక నిర్ధిష్ట సంఖ్యకు పరిమితం కాకుండా మీరు ఆనందమును పొందటం మీ కొరకు సమ్మతమే. మరియు అల్లాహ్ ప్రతీ వస్తువును సంరక్షిస్తున్నాడు. మరియు ఈ ఆదేశము విశ్వాసపరుల తల్లుల యొక్క ఘనతను సూచిస్తున్నవి. నిశ్ఛయంగా వారిని విడాకులివ్వటం, వారిని వివాహం చేసుకోవటము నిషేధించబడినది.

Ahzab 33:53

ఓ అల్లాహ్ ను విశ్వసించి తమ కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇండ్లలో ఏదైన భోజనానికి వెళ్ళినప్పుడు లోపలికి రావటానికి మీకు అనుమతి దొరకితే తప్ప ప్రవేశించకండి. మరియు అన్నం వండే వరకు నిరీక్షిస్తూ మీరు కూర్చోవటమును పొడిగించకండి. కాని ఏదైన భోజనానికి మీరు ఆహ్వానించబడినప్పుడు మీరు వెళ్ళండి.మీరు భోజనం తీనేస్తే మరలిపోండి. మరియు దాని తరువాత మీరు ఒకరితో ఒకరు సాధారణ మాటలు మాట్లాడుతూ ఉండిపోకండి. నిశ్చయంగా అలా ఉండిపోవటం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు బాధిస్తుంది.అప్పుడు ఆయన మీతో మరలిపోవటమును కోరటానికి సంకోచిస్తున్నారు. మరియు అల్లాహ్ సత్యం గురించి ఆదేశించటానికి సంకోచించడు. కాబట్టి ఆయన వేచి ఉండటం నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు మీరు బాధించకుండా ఉండటానికి ఆయన వద్ద నుండి మీరు మరలిపోమని మిమ్మల్ని ఆదేశించాడు. మరియు మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణుల్లోంచి ఎవరితోనైనా పాత్ర లాంటిది,ఇతర అవసరాన్ని అడిగేటప్పుడు మీరు తెర వెనుక నుండి ఆ అవసరమును అడగండి. మరియు మీరు వారిని మీ కళ్లతో చూడకుండా ఉండటానికి వాటిని వారి నుండి ఎదురుగా నిలబడి అడగకండి. అది వారి రక్షణ కొరకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్థానము రక్షణ కొరకు. తెరచాటు నుండి ఈ అడగటం మీ మనస్సులకు,వారి మనస్సులకు షైతాను దుష్ప్రేరణలతో చెడును అలంకరించటముతో తాకకుండా ఉండటానికి మీ మనస్సులకు ఎంతో పరిశుద్ధమైనది,వారి మనస్సులకు ఎంతో పరిశుద్ధమైనది. మరియు ఓ విశ్వాసపరులారా మీరు మాట్లాడటానికి వేచి ఉండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను బాధించటం మీకు తగదు.మరియు ఆయన మరణం తరువాత ఆయన సతీమణులతో వివాహం చేసుకోవటం మీకు తగదు. మరియు తన తల్లితో వివాహం చేసుకోవటం ఎవరకీ సమ్మతం కాదు. నిశ్ఛయంగా ఇది బాధించటం (ఈజా) అవుతుంది. ఆయన మరణం తరువాత ఆయన సతీమణులతో మీ వివాహం చేసుకోవటం దాని రూపములలోనుంచే -నిషేధము మరియు అది అల్లాహ్ వద్ద మహా పాపములో షుమారు చేయబడుతుంది.

Ahzab 33:54

ఒక వేళ మీరు మీ కర్మల్లోంచి దేనినైన బహిర్గతం చేసినా లేదా దాన్ని మీ మనస్సుల్లో దాచినా దానిలో నుంచి ఏదీ అల్లాహ్ పై దాగదు. నిశ్ఛయంగా అల్లాహ్ కు ప్రతీ విషయం గురించి బాగా తెలుసు.మీ కర్మల్లోంచిగాని ఇతర వాటిలో నుంచి గాని ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.మరియు ఆయన తొందరలోనే మీ కర్మలపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు ఒక వేళ అవి మంచిగా ఉంటే మంచిగా,ఒక వేళ చెడుగా ఉంటే చెడుగా.

Ahzab 33:55

వారి తండ్రులతో,వారి కుమారులతో,వారి సోదరులతో,వారి సోదరుల కుమారులతో, వారి సోదరీమణుల కుమారులతో సంతతి పరంగా గాని పాలు త్రాగిన పరంగా గాని పరదా లేకుండా వారిని చూడటంలో,వారితో మట్లాడటంలో వారిపై ఎటువంటి పాపం లేదు. మరియు విశ్వాసపర స్త్రీలు,బానిస స్త్రీలు పరదా లేకుండా వారితో మాట్లాడటంలో వారిపై ఎటువంటి పాపం లేదు. ఓ విశ్వాసపర స్త్రీలారా పరిశుద్ధుడై ఆయన ఆదేశించిన వాటి విషయంలో,వారించిన వాటి విషయంలో మీరు అల్లాహ్ యందు భయభీతి కలిగి ఉండండి. ఆయన మీ నుండి బహిర్గతమయ్యే వాటికి, మీ నుండి జరిగే వాటికి సాక్షి.

Ahzab 33:56

నిశ్ఛయంగా అల్లాహ్ తన దూతల యందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పొగుడుతాడు. మరియు ఆయన దూతలు ఆయన కొరకు వేడుకుంటారు. ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తన దాసుల కొరకు ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు ప్రవక్తపై దరూద్ ను చదువుతూ ఉండండి మరియు అత్యధికంగా ఆయనపై సలాములు పంపుతూ ఉండండి.

Ahzab 33:57

నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను మాటలతో,చేతలతో బాధను కలిగిస్తారో ఇహలోకములో,పరలోకములో వారిని అల్లాహ్ దూరం చేస్తాడు మరియు తన కారుణ్య విశాలత్వము నుండి వారిని వెలివేస్తాడు. మరియు వారు ఆయన ప్రవక్తకు బాధించి పొందిన దానిపై వారికి ప్రతిఫలంగా ఆయన పరలోకములో అవమానమును కలిగించే శిక్షను వారి కొరకు సిద్ధం చేశాడు.

Ahzab 33:58

మరియు ఎవరైతే విశ్వాసపరులైన పురుషులను,విశ్వాసపరులైన స్త్రీలను ఆ బాధకు యోగ్యులను చేసే ఎటువంటి పాపము చేయకుండానే మాటలతో లేదా చేతలతో బాధను కలిగిస్తారో వారు అబద్దమును,బహిరంగ పాపమును మోశారు.

Ahzab 33:59

ఓ ప్రవక్తా మీరు మీ భార్యలతో,మీ కుమార్తెలతో,విశ్వాసపరుల స్త్రీలతో తమపై వారు తొడిగే దుప్పట్లను పరాయి వ్యక్తుల ముందు మర్మావయవాలు వారి నుండి బహిర్గతం కాకుండా ఉండటానికి వేళాడదీసుకోమని చెప్పండి. అది వారు స్వతంత్రులు అని గుర్తుపడటానికి ఆస్కారము. అప్పుడు బానిస స్త్రీలను ఏవిధంగా ఎదురువచ్చి బాధించటం జరుగుతుందో ఆ విధంగా వారిని ఎవరు ఎదురుపడి బాధించరు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడేవారి పాపములను మన్నించేవాడు,అతనిపై కరుణించేవాడు.

Ahzab 33:60

ఒక వేళ కపటులు తమ అవిశ్వాసమును దాచి,తమ ఇస్లామును బహిర్గతం చేయటం ద్వారా,మరియు ఎవరి హృదయములలో నైతే వారి మనోవాంచనలతో వారి సంబంధము వలన పాపములు కలవో వారు,మరియు ఎవరైతే విశ్వాసపరుల మధ్య వేరు చేయటానికి మదీనాలో అబద్దపు సమాచారములను తీసుకుని వస్తున్నారో వారు తమ కపటత్వమును మానుకోకపోతే ఓ ప్రవక్తా మేము తప్పకుండా వారిని శిక్షించటం గురించి మీకు ఆదేశమిస్తాము మరియు మేము మీకు వారిపై ఆధిక్యతను ప్రసాదిస్తాము. వారు మదీనాలో మీతోపాటు తక్కువకాలం నివాసముంటారు. వారు భూమిలో కల్లోలాను సృష్టించటం వలన వారు వినాశనం చేయబడటం వలన లేదా దాని నుండి గెంటి వేయటం వలన.

Ahzab 33:61

అల్లాహ్ కారుణ్యము నుండి గెంటివేయబడినవారు, వారి కపటత్వం వలన,భూమిలో కల్లోలాలను వారి వ్యాపింపజేయటం వలన వారు ఏ ప్రాంతములో లభించినా పట్టుకోబడుతారు మరియు అతిదారుణంగా చంపబడుతారు.

Ahzab 33:62

ఇది కపటవిశ్వాసుల విషయంలో వారు కపట విశ్వాసమును ప్రదర్శించినప్పుడు నడుస్తున్న అల్లాహ్ సంప్రదాయము. మరియు అల్లాహ్ సంప్రదాయము జరిగి తీరుతుంది నీవు దాని కొరకు ఎన్నడూ ఏవిధమైన మార్పును పొందవంటే పొందవు.

Ahzab 33:63

ఓ ప్రవక్తా ప్రళయం గురించి ముష్రికులు మీతో తిరస్కారపు,నిరాకరణపు ప్రశ్న అడుగుతున్నారు. మరియు యూదులు కూడా మీతో అడుగుతున్నారు : దాని వేళ ఎప్పుడు ?. మీరు వారందరికి ఇలా సమాధానమివ్వండి : ప్రళయం యొక్క జ్ఞానము అల్లాహ్ వద్ద ఉన్నది దాని గురించి నా వద్ద ఏమీ లేదు. ఓ ప్రవక్తా ప్రళయం దగ్గరలో ఉన్నదన్నది మీరు ఎలా గ్రహించగలరు ?.

Ahzab 33:64

నిశ్చయంగా పరిశుద్ధుడైన అల్లాహ్ అవిశ్వాసపరులని తన కారుణ్యము నుండి గెంటివేశాడు. మరియు ప్రళయదినమున వారి కొరకు వారి కోసం వేచి ఉండే మండే అగ్నిని తయారు చేసి ఉంచాడు.

Ahzab 33:65

తమ కొరకు తయారు చేయబడిన ఈ నరకాగ్ని శిక్షలో వారు శాశ్వతంగా ఉంటారు. అందులో తమకు ప్రయోజనం కలిగించే ఎటువంటి సంరక్షకుడిని గాని తమ నుండి దాని శిక్షను దూరం చేసే ఎటువంటి సహాయకుడిని వారు పొందరు.

Ahzab 33:66

ప్రళయదినాన నరకాగ్నిలో వారి ముఖములు అటూ ఇటూ బొర్లించబడుతాయి. వారు తీవ్ర విచారముతో,సిగ్గుతో ఇలా పలుకుతారు : అయ్యో మా పాడు గాను మా ఇహలోక జీవితంలో మేము అల్లాహ్ కు ఆయన మాకు ఆదేశించిన దాన్ని పాటించి,మమ్మల్ని వారించిన వాటి నుండి దూరంగా ఉండి విధేయత చూపి,ప్రవక్త కు తాను తన ప్రభువు వద్ద నుండి తీసుకుని వచ్చిన దాని విషయంలో విధేయత చూపి ఉంటే ఎంత బాగుండేది.

Ahzab 33:67

వీరందరు బలహీనమైన,అసత్యమైన వాదనను తీసుకుని వచ్చి ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా నిశ్చయంగా మేము మా నాయకులను,మా జాతుల పెద్దలను అనుసరించాము. వారు మమ్మల్ని సన్మార్గము నుండి మార్గ భ్రష్టులు చేశారు.

Ahzab 33:68

ఓ మా ప్రభువా మమ్మల్ని సన్మార్గము నుండి తప్పించిన ఈ నాయకులు,పెద్దలందరి కొరకు మా కొరకు నీవు తయారు చేసిన శిక్షను వారు మమ్మల్ని మార్గభ్రష్టతకు గురి చేసినందుకు రెండింతలు చేయి. మరియు వారిని నీ కారుణ్యము నుండి ఘోరముగా గెంటివేయి.

Ahzab 33:69

ఓ అల్లాహ్ ను విశ్వసించి తమ కొరకు ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించే వారా మీరు మీ ప్రవక్తను బాధ కలిగించకండి. అప్పుడు మీరు మూసాను బాధ కలిగించిన వారి మాదిరిగా అయిపోతారు. ఉదాహరణకు వారు ఆయన శరీరములో లోపమును చూపించారు. అప్పుడు అల్లాహ్ ఆయనను వారు అన్న మాటల నుండి మచ్చలేని వాడిగా నెగ్గు తేల్చాడు. అప్పుడు వారికి వారు అతని విషయంలో అన్న మాటల నుండి అతని శ్రేయస్కరం స్పష్టమయ్యింది. మరియు మూసా అలైహిస్సలాం అల్లాహ్ యందు ఎంతో ఆదరణీయుడు. ఆయన అభ్యర్ధన తిరస్కరించబడదు. ఆయన ప్రయత్నాలు నిరాశపడవు.

Ahzab 33:70

ఓ అల్లాహ్ ను విశ్వసించి తమ కొరకు ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించే వారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి భయపడండి. మరియు మీరు నిజమైన,సరైన మాట మాట్లాడండి.

Ahzab 33:71

నిశ్ఛయంగా మీరు ఒక వేళ అల్లాహ్ కు భయపడి సరైన మాట మాట్లాడితే ఆయన మీ ఆచరణలను మీ కొరకు సంస్కరిస్తాడు మరియు వాటిని మీ నుండి స్వీకరిస్తాడు. మరియు మీ నుండి మీ పాపములను తుడిచివేసి వాటి మూలంగా మిమ్మల్ని పట్టుకోడు. మరియు ఎవరైతే అల్లాహ్ కు,ఆయన ప్రవక్తకు విధేయత చూపుతాడో అతడు గొప్ప సాఫల్యమును పొందుతాడు. దానికి ఏ సాఫల్యము సరితూగదు. అది అల్లాహ్ మన్నత,స్వర్గములో ప్రవేశము ద్వారా సాఫల్యము.

Ahzab 33:72

నిశ్ఛయంగా మేము ధర్మ బాధ్యతలను,సంపదలను,రహస్యాలను రక్షంచే బాధ్యతలను ఆకాశముల ముందు,భూమి ముందు,పర్వతాల ముందు ఉంచాము అవి వాటిని మోయటం నుండి నిరాకరించినవి, దాని పరిణామం నుండి భయపడినవి. మరియు వాటిని మనిషి ఎత్తుకున్నాడు. నిశ్ఛయంగా అతడు తన స్వయంపై అధికంగా హింసకు పాల్పడేవాడు,వాటిని మోయటం యొక్క పరిణామం గురించి తెలియనివాడు.

Ahzab 33:73

మనిషి దాన్ని అల్లాహ్ తరపు నుండి విధి వ్రాత మూలంగా ఎత్తుకున్నాడు. అల్లాహ్ కపట విశ్వాసులైన పురుషులను,కపట విశ్వాసులైన స్త్రీలను,ముష్రికులైన పురుషులను,ముష్రికులైన స్త్రీలను వారి కపటవిశ్వాసము పై, అల్లాహ్ తో పాటు వారు షిర్కు చేయటం పై శిక్షించటానికి మరియు అల్లాహ్ విశ్వాసపరులైన పురుషులను,విశ్వాసపరులైన స్త్రీలను ఎవరైతే బాధ్యతల అమానతును మోయటమును మంచిగా చేశారో వారి పశ్ఛాత్తాపమును స్వీకరించటానికి. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడును, వారిపై కరుణించేవాడును.