Telugu Mokhtasar — Sebe' 34:1 – Zümer 39:75
Contents
- Sebe' 34:1
- Sebe' 34:2
- Sebe' 34:3
- Sebe' 34:4
- Sebe' 34:5
- Sebe' 34:6
- Sebe' 34:7
- Sebe' 34:8
- Sebe' 34:9
- Sebe' 34:10
- Sebe' 34:11
- Sebe' 34:12
- Sebe' 34:13
- Sebe' 34:14
- Sebe' 34:15
- Sebe' 34:16
- Sebe' 34:17
- Sebe' 34:18
- Sebe' 34:19
- Sebe' 34:20
- Sebe' 34:21
- Sebe' 34:22
- Sebe' 34:23
- Sebe' 34:24
- Sebe' 34:25
- Sebe' 34:26
- Sebe' 34:27
- Sebe' 34:28
- Sebe' 34:29
- Sebe' 34:30
- Sebe' 34:31
- Sebe' 34:32
- Sebe' 34:33
- Sebe' 34:34
- Sebe' 34:35
- Sebe' 34:36
- Sebe' 34:37
- Sebe' 34:38
- Sebe' 34:39
- Sebe' 34:40
- Sebe' 34:41
- Sebe' 34:42
- Sebe' 34:43
- Sebe' 34:44
- Sebe' 34:45
- Sebe' 34:46
- Sebe' 34:47
- Sebe' 34:48
- Sebe' 34:49
- Sebe' 34:50
- Sebe' 34:51
- Sebe' 34:52
- Sebe' 34:53
- Sebe' 34:54
- Fatır 35:1
- Fatır 35:2
- Fatır 35:3
- Fatır 35:4
- Fatır 35:5
- Fatır 35:6
- Fatır 35:7
- Fatır 35:8
- Fatır 35:9
- Fatır 35:10
- Fatır 35:11
- Fatır 35:12
- Fatır 35:13
- Fatır 35:14
- Fatır 35:15
- Fatır 35:16
- Fatır 35:17
- Fatır 35:18
- Fatır 35:19
- Fatır 35:20
- Fatır 35:21
- Fatır 35:22
- Fatır 35:23
- Fatır 35:24
- Fatır 35:25
- Fatır 35:26
- Fatır 35:27
- Fatır 35:28
- Fatır 35:29
- Fatır 35:30
- Fatır 35:31
- Fatır 35:32
- Fatır 35:33
- Fatır 35:34
- Fatır 35:35
- Fatır 35:36
- Fatır 35:37
- Fatır 35:38
- Fatır 35:39
- Fatır 35:40
- Fatır 35:41
- Fatır 35:42
- Fatır 35:43
- Fatır 35:44
- Fatır 35:45
- Yâsin 36:1
- Yâsin 36:2
- Yâsin 36:3
- Yâsin 36:4
- Yâsin 36:5
- Yâsin 36:6
- Yâsin 36:7
- Yâsin 36:8
- Yâsin 36:9
- Yâsin 36:10
- Yâsin 36:11
- Yâsin 36:12
- Yâsin 36:13
- Yâsin 36:14
- Yâsin 36:15
- Yâsin 36:16
- Yâsin 36:17
- Yâsin 36:18
- Yâsin 36:19
- Yâsin 36:20
- Yâsin 36:21
- Yâsin 36:22
- Yâsin 36:23
- Yâsin 36:24
- Yâsin 36:25
- Yâsin 36:26
- Yâsin 36:27
- Yâsin 36:28
- Yâsin 36:29
- Yâsin 36:30
- Yâsin 36:31
- Yâsin 36:32
- Yâsin 36:33
- Yâsin 36:34
- Yâsin 36:35
- Yâsin 36:36
- Yâsin 36:37
- Yâsin 36:38
- Yâsin 36:39
- Yâsin 36:40
- Yâsin 36:41
- Yâsin 36:42
- Yâsin 36:43
- Yâsin 36:44
- Yâsin 36:45
- Yâsin 36:46
- Yâsin 36:47
- Yâsin 36:48
- Yâsin 36:49
- Yâsin 36:50
- Yâsin 36:51
- Yâsin 36:52
- Yâsin 36:53
- Yâsin 36:54
- Yâsin 36:55
- Yâsin 36:56
- Yâsin 36:57
- Yâsin 36:58
- Yâsin 36:59
- Yâsin 36:60
- Yâsin 36:61
- Yâsin 36:62
- Yâsin 36:63
- Yâsin 36:64
- Yâsin 36:65
- Yâsin 36:66
- Yâsin 36:67
- Yâsin 36:68
- Yâsin 36:69
- Yâsin 36:70
- Yâsin 36:71
- Yâsin 36:72
- Yâsin 36:73
- Yâsin 36:74
- Yâsin 36:75
- Yâsin 36:76
- Yâsin 36:77
- Yâsin 36:78
- Yâsin 36:79
- Yâsin 36:80
- Yâsin 36:81
- Yâsin 36:82
- Yâsin 36:83
- Saffat 37:1
- Saffat 37:2
- Saffat 37:3
- Saffat 37:4
- Saffat 37:5
- Saffat 37:6
- Saffat 37:7
- Saffat 37:8
- Saffat 37:9
- Saffat 37:10
- Saffat 37:11
- Saffat 37:12
- Saffat 37:13
- Saffat 37:14
- Saffat 37:15
- Saffat 37:16
- Saffat 37:17
- Saffat 37:18
- Saffat 37:19
- Saffat 37:20
- Saffat 37:21
- Saffat 37:22
- Saffat 37:23
- Saffat 37:24
- Saffat 37:25
- Saffat 37:26
- Saffat 37:27
- Saffat 37:28
- Saffat 37:29
- Saffat 37:30
- Saffat 37:31
- Saffat 37:32
- Saffat 37:33
- Saffat 37:34
- Saffat 37:35
- Saffat 37:36
- Saffat 37:37
- Saffat 37:38
- Saffat 37:39
- Saffat 37:40
- Saffat 37:41
- Saffat 37:42
- Saffat 37:43
- Saffat 37:44
- Saffat 37:45
- Saffat 37:46
- Saffat 37:47
- Saffat 37:48
- Saffat 37:49
- Saffat 37:50
- Saffat 37:51
- Saffat 37:52
- Saffat 37:53
- Saffat 37:54
- Saffat 37:55
- Saffat 37:56
- Saffat 37:57
- Saffat 37:58
- Saffat 37:59
- Saffat 37:60
- Saffat 37:61
- Saffat 37:62
- Saffat 37:63
- Saffat 37:64
- Saffat 37:65
- Saffat 37:66
- Saffat 37:67
- Saffat 37:68
- Saffat 37:69
- Saffat 37:70
- Saffat 37:71
- Saffat 37:72
- Saffat 37:73
- Saffat 37:74
- Saffat 37:75
- Saffat 37:76
- Saffat 37:77
- Saffat 37:78
- Saffat 37:79
- Saffat 37:80
- Saffat 37:81
- Saffat 37:82
- Saffat 37:83
- Saffat 37:84
- Saffat 37:85
- Saffat 37:86
- Saffat 37:87
- Saffat 37:88
- Saffat 37:89
- Saffat 37:90
- Saffat 37:91
- Saffat 37:92
- Saffat 37:93
- Saffat 37:94
- Saffat 37:95
- Saffat 37:96
- Saffat 37:97
- Saffat 37:98
- Saffat 37:99
- Saffat 37:100
- Saffat 37:101
- Saffat 37:102
- Saffat 37:103
- Saffat 37:104
- Saffat 37:105
- Saffat 37:106
- Saffat 37:107
- Saffat 37:108
- Saffat 37:109
- Saffat 37:110
- Saffat 37:111
- Saffat 37:112
- Saffat 37:113
- Saffat 37:114
- Saffat 37:115
- Saffat 37:116
- Saffat 37:117
- Saffat 37:118
- Saffat 37:119
- Saffat 37:120
- Saffat 37:121
- Saffat 37:122
- Saffat 37:123
- Saffat 37:124
- Saffat 37:125
- Saffat 37:126
- Saffat 37:127
- Saffat 37:128
- Saffat 37:129
- Saffat 37:130
- Saffat 37:131
- Saffat 37:132
- Saffat 37:133
- Saffat 37:134
- Saffat 37:135
- Saffat 37:136
- Saffat 37:137
- Saffat 37:138
- Saffat 37:139
- Saffat 37:140
- Saffat 37:141
- Saffat 37:142
- Saffat 37:143
- Saffat 37:144
- Saffat 37:145
- Saffat 37:146
- Saffat 37:147
- Saffat 37:148
- Saffat 37:149
- Saffat 37:150
- Saffat 37:151
- Saffat 37:152
- Saffat 37:153
- Saffat 37:154
- Saffat 37:155
- Saffat 37:156
- Saffat 37:157
- Saffat 37:158
- Saffat 37:159
- Saffat 37:160
- Saffat 37:161
- Saffat 37:162
- Saffat 37:163
- Saffat 37:164
- Saffat 37:165
- Saffat 37:166
- Saffat 37:167
- Saffat 37:168
- Saffat 37:169
- Saffat 37:170
- Saffat 37:171
- Saffat 37:172
- Saffat 37:173
- Saffat 37:174
- Saffat 37:175
- Saffat 37:176
- Saffat 37:177
- Saffat 37:178
- Saffat 37:179
- Saffat 37:180
- Saffat 37:181
- Saffat 37:182
- Sâd 38:1
- Sâd 38:2
- Sâd 38:3
- Sâd 38:4
- Sâd 38:5
- Sâd 38:6
- Sâd 38:7
- Sâd 38:8
- Sâd 38:9
- Sâd 38:10
- Sâd 38:11
- Sâd 38:12
- Sâd 38:13
- Sâd 38:14
- Sâd 38:15
- Sâd 38:16
- Sâd 38:17
- Sâd 38:18
- Sâd 38:19
- Sâd 38:20
- Sâd 38:21
- Sâd 38:22
- Sâd 38:23
- Sâd 38:24
- Sâd 38:25
- Sâd 38:26
- Sâd 38:27
- Sâd 38:28
- Sâd 38:29
- Sâd 38:30
- Sâd 38:31
- Sâd 38:32
- Sâd 38:33
- Sâd 38:34
- Sâd 38:35
- Sâd 38:36
- Sâd 38:37
- Sâd 38:38
- Sâd 38:39
- Sâd 38:40
- Sâd 38:41
- Sâd 38:42
- Sâd 38:43
- Sâd 38:44
- Sâd 38:45
- Sâd 38:46
- Sâd 38:47
- Sâd 38:48
- Sâd 38:49
- Sâd 38:50
- Sâd 38:51
- Sâd 38:52
- Sâd 38:53
- Sâd 38:54
- Sâd 38:55
- Sâd 38:56
- Sâd 38:57
- Sâd 38:58
- Sâd 38:59
- Sâd 38:60
- Sâd 38:61
- Sâd 38:62
- Sâd 38:63
- Sâd 38:64
- Sâd 38:65
- Sâd 38:66
- Sâd 38:67
- Sâd 38:68
- Sâd 38:69
- Sâd 38:70
- Sâd 38:71
- Sâd 38:72
- Sâd 38:73
- Sâd 38:74
- Sâd 38:75
- Sâd 38:76
- Sâd 38:77
- Sâd 38:78
- Sâd 38:79
- Sâd 38:80
- Sâd 38:81
- Sâd 38:82
- Sâd 38:83
- Sâd 38:84
- Sâd 38:85
- Sâd 38:86
- Sâd 38:87
- Sâd 38:88
- Zümer 39:1
- Zümer 39:2
- Zümer 39:3
- Zümer 39:4
- Zümer 39:5
- Zümer 39:6
- Zümer 39:7
- Zümer 39:8
- Zümer 39:9
- Zümer 39:10
- Zümer 39:11
- Zümer 39:12
- Zümer 39:13
- Zümer 39:14
- Zümer 39:15
- Zümer 39:16
- Zümer 39:17
- Zümer 39:18
- Zümer 39:19
- Zümer 39:20
- Zümer 39:21
- Zümer 39:22
- Zümer 39:23
- Zümer 39:24
- Zümer 39:25
- Zümer 39:26
- Zümer 39:27
- Zümer 39:28
- Zümer 39:29
- Zümer 39:30
- Zümer 39:31
- Zümer 39:32
- Zümer 39:33
- Zümer 39:34
- Zümer 39:35
- Zümer 39:36
- Zümer 39:37
- Zümer 39:38
- Zümer 39:39
- Zümer 39:40
- Zümer 39:41
- Zümer 39:42
- Zümer 39:43
- Zümer 39:44
- Zümer 39:45
- Zümer 39:46
- Zümer 39:47
- Zümer 39:48
- Zümer 39:49
- Zümer 39:50
- Zümer 39:51
- Zümer 39:52
- Zümer 39:53
- Zümer 39:54
- Zümer 39:55
- Zümer 39:56
- Zümer 39:57
- Zümer 39:58
- Zümer 39:59
- Zümer 39:60
- Zümer 39:61
- Zümer 39:62
- Zümer 39:63
- Zümer 39:64
- Zümer 39:65
- Zümer 39:66
- Zümer 39:67
- Zümer 39:68
- Zümer 39:69
- Zümer 39:70
- Zümer 39:71
- Zümer 39:72
- Zümer 39:73
- Zümer 39:74
- Zümer 39:75
Sebe' 34:1
సర్వస్తోత్రాలన్నీ అల్లాహ్ కొరకే ఆకాశముల్లో ఉన్నవన్నీ, భూమిలో ఉన్నవన్నీ సృష్టిపరంగా,అధికారపరంగా పర్యాలోచనపరంగా ఆయనకే చెందుతాయి. పరలోకములో పొగడ్తలు పరిశుద్ధుడైన ఆయన కొరకే. మరియు ఆయన తన సృష్టించటంలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు. తన దాసుల స్థితులను గురించి తెలుసుకునే వాడు. వాటిలో నుండి ఏది ఆయనపై గోప్యంగా ఉండదు.
Sebe' 34:2
భూమిలో ప్రవేశించే నీరు,మొక్కల గురించి ఆయనకు తెలుసు. మరియు దాని నుండి వెలుపలకి వచ్చే మొక్కలు,ఇతరవాటి గురించి ఆయనకు తెలుసు. మరియు ఆకాశము నుండి దిగే వర్షము,దైవదూతలు,ఆహారము గురించి ఆయనకు తెలుసు. మరియు ఆకాశము వైపునకు ఎక్కే దైవదూతలు,తన దాసుల కర్మలు,వారి ఆత్మల గురించి ఆయనకు తెలుసు. మరియు ఆయన విశ్వాసపరులైన తన దాసులపై అపారంగా కరుణించేవాడు, తన వద్ద పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడును.
Sebe' 34:3
అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారు ఇలా అంటారు : ప్రళయం మా వద్దకు ఎన్నటికీ రాదు. ఓ ప్రవక్తా వారితో అనండి : ఎందుకు రాదు అల్లాహ్ సాక్షిగా మీరు తిరస్కరిస్తున్న ప్రళయం మీ వద్ధకు తప్పకుండా వస్తుంది. దాని యొక్క సమయం గురించి అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అగోచరమైన ప్రళయము,ఇతర వాటి గురించి పరిశుద్ధుడైన ఆయనకు తెలుసు. ఆకాశముల్లో గాని భూమిలో గాని చిన్న చీమ బరువంతది కూడా పరిశుద్ధుడై ఆయన జ్ఞానము నుండి అదృశ్యం కాదు. ఈ ప్రస్తావించబడిన దాని నుండి చిన్నది గాని పెద్దది గాని ఆయన నుండి అదృశ్యం కాదు కానీ అది ఒక స్పష్టమైన పుస్తకములో వ్రాయబడి ఉన్నది. అది లౌహె మహ్ఫూజ్ అందులో ప్రళయం వరకు జరిగేవన్ని వ్రాయబడి ఉన్నాయి.
Sebe' 34:4
అల్లాహ్ లౌహె మహ్ఫూజ్ లో నిరూపితం చేసిన దాన్ని అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి,సత్కార్యములు చేసిన వారికి ప్రతిఫలమును ప్రసాదించటానికి నిరూపించాడు. ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరి కొరకు అల్లాహ్ వద్ద నుండి వారి పాపములకు మన్నింపు ఉన్నది. ఆయన వాటి వలన వారిని శిక్షించడు. మరియు వారి కొరకు గౌరవప్రధమైన ఆహారోపాధి కలదు. అది ప్రళయదినమున ఆయన స్వర్గము.
Sebe' 34:5
మరియు ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన ఆయతులను (సూచనలను) విఫలం చేయటానికి ప్రయత్నిస్తారో వారు వాటిని మంత్రజాలము అన్నారు. మరియు మా ప్రవక్తలను జ్యోతిష్యుడు,మంత్రజాలకుడు,కవి అన్నారు. ఈ గుణాలతో వర్ణించబడిన వారందరి కొరకు ప్రళయదినాన ఎంతో చెడ్డదైన,తీవ్రమైన శిక్ష కలదు.
Sebe' 34:6
మరియు అనుచరుల్లోంచి విద్వాంసులు, గ్రంధవహుల పండితుల్లోంచి విశ్వసించిన వారు మీ వైపునకు అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ఎటువంటి సందేహం లేని సత్యమని సాక్ష్యం పలుకుతారు. మరియు అది ఎవరూ ఓడించలేని ఆధిక్యుడి మార్గం వైపునకు మార్గదర్శకతం వహిస్తుంది. ఆయన ఇహపరాల్లో స్థుతింపదగినవాడు.
Sebe' 34:7
మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసం కనబరచిన వారు తమలోని కొంతమందితో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాని గురించి ఆశ్ఛర్యపోతు,హేళన చేస్తూ ఇలా పలికారు : మీరు మరణించి ముక్కలు ముక్కలగా చేయబడినప్పుడు మీరు మీ మరణం తరువాత జీవింపజేయబడి లేపబడుతారని మీకు తెలియపరిచే ఒక వ్యక్తి ని మేము మీకు చూపించమా ?.
Sebe' 34:8
మరియు వారు ఇలా పలికారు : ఈ వ్యక్తి అల్లాహ్ పై అబద్దమును కల్పించుకుని మా మరణము తరువాత మేము మరల లేపబడటం గురించి తాను చెప్పినది చెబుతున్నాడా లేదా అతను పిచ్చివాడా వాస్తవం లేని వాటి గురించి అర్ధంపర్ధం లేకుండా మాట్లాడుతున్నాడా ?. వీరందరు అనుకుంటున్నట్లు విషయం కాదు. అంతే కాక జరిగిందేమిటంటే పరలోకమును విశ్వసించని వారే ప్రళయదినమున కఠిన శిక్షలో ఉంటారు. మరియు ఇహలోకంలో సత్యము నుండి చాలా దూరపు అపమార్గములో పడి ఉంటారు.
Sebe' 34:9
ఏమీ మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వీరందరు తమ ముందట ఉన్న భూమిని చూడటం లేదా,మరియు తమ వెనుకనున్న ఆకాశమును చూడటంలేదా ?. మేము భూమిని వారి కాళ్ళ క్రింది నుండి కూర్చదలచకుంటే దాన్ని మేము వారి క్రింది నుండి కూర్చి వేస్తాము. మరియు ఒక వేళ మేము వారిపై ఆకాశము నుండి ఏదైన ముక్కను పడవేయదలచుకుంటే వారిపై దాన్ని పడవేశేవారము. నిశ్ఛయంగా ఇందులో తన ప్రభువు వైపు ఎక్కువగా మరలే ప్రతీ దాసుని కొరకు ఒక ఖచ్చితమైన సూచన కలదు. దానితో అతడు అల్లాహ్ సామర్ధ్యముపై ఆధారం చూపుతాడు. అయితే దానిపై సామర్ధ్యం కలవాడు మీ మరణం తరువాత, మీ శరీరములు ముక్కలు ముక్కలు చేసిన తరువాత మిమ్మల్ని మరల లేపటంపై సామర్ధ్యం కలవాడు.
Sebe' 34:10
మరియు మేము దావూద్ అలైహిస్సలాంకు మా వద్ద నుండి దైవదౌత్యమును,అధికారమును ప్రసాదించాము. మరియు మేము పర్వతాలకు ఇలా ఆదేశించాము : ఓ పర్వతాల్లారా మీరు దావూద్ తో కలిసి తస్బీహ్ ను చదవండి. మరియు ఇలాగే మేము పక్షులకూ తెలిపాము. మరియు ఆయన కొరకు ఇనుమును దానితో ఆయన తాను తలచిన పరికరములను తయారు చేసుకోవటానికి మెత్తగా చేశాము.
Sebe' 34:11
ఓ దావూద్ మీ యోధులను వారి శతృవుల బాధ నుండి రక్షించటానికి మీరు విస్తృత కవచాలను తయారుచేయండి. మరియు సువ్వలను చుట్టటం కొరకు సరైనవిగా చేయండి, అయితే మీరు వాటిని సన్నవిగా చేయకండి ఎందుకంటే అవి వాటిలో స్థిరంగా ఉండవు మరియు వాటిని గట్టిగా (లావుగా) చేయకండి ఎందుకంటే అవి అందులో దూరవు. మీరు సత్కార్యమును చేయండి. నిశ్ఛయంగా నేను మీరు చేసేవాటిని చూసేవాడిని. మీ కర్మల్లోంచి ఏదీ నా పై గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే నేను వాటిపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాను.
Sebe' 34:12
మరియు మేము దావూద్ కుమారుడైన సులైమాన్ అలైహిమస్సలామ్ కు గాలిని వశపరచాము. అది ఉదయము పూట ఒక నెల ప్రయాణపు గమ్యాన్ని చేదిస్తూ పయనిస్తుంది. సాయంత్రం పూట ఒక నెల ప్రయాణపు గమ్యాన్ని చేదిస్తూ పయనిస్తుంది. మరియు రాగితో ఆయన తలచుకున్నది తయారు చేయటానికి ఆయన కొరకు మేము రాగి ఊటను ప్రవహింపజేశాము. మరియు అతని ప్రభువు ఆజ్ఞతో, అతని సన్నధిలో పని చేసే జిన్నులను మేము అతనికి వశపరచాము. మరియు జిన్నుల్లోంచి మేము చేయమని ఆదేశంచిన కార్యం నుండి ఎవరైన మరలిపోతే మేము వారికి మండే అగ్ని శిక్షను రుచి చూపిస్తాము.
Sebe' 34:13
ఈ జిన్నులందరు సులైమాన్ అలైహిస్సలాం కొరకు ఆయన కోరిన నమాజుల కొరకు మస్జిదులను, భవనములను మరియు ఆయన కోరిన ప్రతిమలను మరియు ఆయన కోరిన పెద్ద పెద్ద నీటి హౌజుల్లాంటి గంగాళాలను, స్థిరంగా ఉండే అవి పెద్దవిగా ఉండటం వలన కదలించలేని వంట దేగిశాలను తయారు చేసేవారు. మరియు మేము వారిని ఇలా ఆదేశించాము : ఓ దావూద్ వంశీయులారా మీరు అల్లాహ్ మీకు అనుగ్రహించిన వాటికి అల్లాహ్ కు కృతజ్ఞతగా ఆచరించండి. మరియు నా దాసుల్లోంచి నేను ప్రసాదించిన వాటిపై నాకు కృతజ్ఞత తెలుపుకునేవారు తక్కువ మంది ఉన్నారు.
Sebe' 34:14
మేము సులైమాన్ అలైహిస్సలాం పై మృత్యువును నిర్ణయించినప్పుడు జున్నులకు ఆయన ఆనుకుని ఉన్న ఆయన చేతికర్రను తింటున్న చీడ పురుగు తప్ప ఎవరూ ఆయన మరణించినట్లు తెలియపరచలేదు. ఎప్పుడైతే ఆయన పడిపోయారో జిన్నులకి తమకు అగోచర విషయాల గురించి జ్ఞానం లేదని స్పష్టమయ్యింది. ఒక వేళ వారికి అది తెలిసి ఉంటే వారు తమ కొరకు ఉన్న అవమానకరమైన శిక్షలో ఉండేవారు కాదు మరియు అది వారు చేసే ఆ కష్టమైన కార్యాలు వేటినైతే వారు సులైమాన్ అలైహిస్సలాం కొరకు ఆయన జీవించి ఉండి తమను పర్యవేక్షిస్తున్నారని తమ భావనతో చేసేవారో.
Sebe' 34:15
నిశ్ఛయంగా సబా తెగ కొరకు వారు నివాసముండే వారి నివాసములో అల్లాహ్ సామర్ధ్యముపై, వారిపై ఉన్న ఆయన అనుగ్రహములపై స్పష్టమైన సూచన కలదు. అది రెండు తోటలు : ఒకటి కుడివైపున రెండవది ఎడమ వైపున కలదు. మరియు మేము వారితో ఇలా పలికాము : మీరు మీ ప్రభువు ప్రసాదించిన ఆహారము నుండి తినండి. మరియు ఆయన అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోండి. ఇది ఉత్తమమైన పట్టణము. మరియు ఈ అల్లాహ్ తన వైపు పశ్చాత్తాప్పడి వచ్చేవారి పాపములను మన్నించే ప్రభువు.
Sebe' 34:16
అప్పుడు వారు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవటం నుండి,ఆయన ప్రవక్తలపై విశ్వాసము కనబరచటం నుండి విముఖత చూపారు. అప్పుడు మేము వారిని వారి అనుగ్రహాలను శిక్షగా చేసి శిక్షించాము. అప్పుడు మేము వారిపై ఉధృతమైన వరదను పంపించాము అది వారి కట్టను శిథిలం చేసి వారి పంటలను ముంచివేసింది. మరియు మేము వారి రెండు తోటలను చేదు ఫలములు గల రెండు తోటలుగా చేశాము. మరియు వాటిలో ఫలించని ఝూవుక చెట్లు,కొన్ని రేగు చెట్లు కలవు.
Sebe' 34:17
ఈ మార్పు ఏదైతే వారు ఉన్న అనుగ్రహాల్లో జరిగినదో అది వారి కృతఘ్నత వలన,అనుగ్రహాల పట్ల కృతజ్ఞత తెలుపుకోవటం నుండి వారి విముఖత తెలుపుకోవటం వలన. మేము ఈ తీవ్రమైన శిక్షను పరిశుద్ధుడైన అల్లాహ్ అనుగ్రహాలను ఎక్కువగా తిరస్కరించేవాడికి,వాటిపట్ల కృతఘ్నుడయ్యే వాడికి మాత్రమే విధిస్తాము.
Sebe' 34:18
మరియు యమన్ లో సబా వాసుల మధ్య,మేము శుభాలను ప్రసాదించిన సిరియా (షామ్) బస్తీల మధ్య దగ్గర దగ్గరగా ఉండే బస్తీలను మేము ఏర్పరచాము. మరియు మేము అందులో పయనమును నిర్ధారించాము ఏవిధంగానంటే వారు సిరియా చేరే వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక బస్తీ నుండి ఇంకొక బస్తీకి నడుస్తున్నారు. మరియు మేము వారితో ఇలా పలికాము : మీరు అందులో మీకు ఇష్టమయినప్పుడు రాత్రి లేదా పగలు శతృవు నుండి,ఆకలి నుండి,దాహం నుండి భద్రంగా ప్రయాణమును కొనసాగించండి.
Sebe' 34:19
అప్పుడు వారు దూరాలను దగ్గర చేస్తూ తమపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలతో వారు మిడిసిపోయారు. మరియు ఇలా పలికారు : ఓ మా ప్రభువా నీవు ఈ బస్తీలను తొలగించి మా ప్రయాణముల మధ్య దూరములను కలిగించు తద్వారా మేము ప్రయాణముల అలసట రుచిని చూడవచ్చు మరియు మా సవారీల గొప్పతనము స్పష్టమవుతుంది. మరియు వారు అల్లాహ్ అనుగ్రహాలతో మిడిసి పడటం,ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవటం నుండి విముఖత చూపటం,తమలో నుండి పేదవారిపై తమ అసూయ చెందటం వలన తమ స్వయముపైనే హింసకు పాల్పడ్డారు. అయితే మేము వారిని వారి తరువాత వారు చెప్పుకునే మాటలుగా చేశాము. మరియు వారు ఒకరితో ఒకరు సంభాషించుకోకుండా వారిని బస్తీల్లో పూర్తిగా విచ్చిన్నం చేశాము. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన సబావాసులపై అనుగ్రహించబడటం,ఆ పిదప వారి కృతఘ్నత,వారి మిడిసిపడటం వలన వారితో ప్రతీకారం తీసుకోవటం లో అల్లాహ్ పై విధేయత చూపటంపై,అయన పై అవిధేయత నుండి దూరంగా ఉండటంపై,ఆపదపై ఎక్కువగా సహనం చూపే ప్రతి ఒక్కరి కొరకు,తనపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలపై ఎక్కువగా కృతజ్ఞతలు తెలుపుకునే ప్రతి ఒక్కరి కొరకు గుణపాఠం ఉన్నది.
Sebe' 34:20
మరియు ఇబ్లీసు వారిని మోహింపజేయగలడని,వారిని సత్యము నుండి తప్పించగలడని తాను ఊహించినది వారిపై నిజం చేసి నిరూపించాడు. అప్పుడు విశ్వాసపరుల్లోంచి ఒక వర్గము తప్ప వారు అవిశ్వాసములో,అపమార్గములో అతన్ని అనుసరించారు. ఎందుకంటే వారు(విశ్వాసులు) అతన్ని అనుసరించకుండా అతని ఆశలపై నీరు చల్లారు.
Sebe' 34:21
మరియు ఇబ్లీసుకి అతను వారిని మార్గభ్రష్టతకు లోను చేసే ఎటువంటి అధికారము వారిపై లేదు. మరియు అతను మాత్రం వారికి అలంకరించి చూపిస్తాడు,వారిని మోహింపజేస్తాడు. కాని ఎవరు పరలోకముపై, అందులో ఉన్న ప్రతిఫలంపై విశ్వాసం పెడతాడో,ఎవరు పరలోక విషయంలో సందేహములో ఉన్నాడో మేము తెలుసుకోవటానికి వారిని మోహింపజేయటానికి అతనికి అనుమతినిచ్చాము. ఓ ప్రవక్తా మీ ప్రభువు ప్రతీ వస్తువుని కనిపెట్టుకుని ఉంటాడు. ఆయన తన దాసుల కర్మలను కనిపెట్టుకుని ఉంటాడు. వాటిపరంగానే వారికి ఆయన ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Sebe' 34:22
ఓ ప్రవక్తా మీరు ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీరు అల్లాహ్ ను వదిలి మీ కొరకు ఆరాధ్య దైవాలుగా భావించుకున్న వారిని మీకు ప్రయోజనమును తీసుకుని రావటానికి లేదా మీ నుండి నష్టమును దూరం చేయటానికి పిలుచుకోండి. అయితే వారికి ఆకాశముల్లో గాని భూమిలో గాని రవ్వంత బరువు గల దానికి అధికారం లేదు. మరియు అల్లాహ్ తో పాటు వారికి వాటిలో భాగస్వామ్యం లేదు. మరియు అల్లాహ్ కి సహాయం చేయటానికి సహాయకుడెవడూ లేడు. ఎందుకంటే ఆయన భాగస్వాముల,సహాయకుల అక్కర లేనివాడు.
Sebe' 34:23
మరియు పరిశుద్ధుడైన ఆయన వద్ద ఆయన అనుమతించిన వారి కొరకు మాత్రమే సిఫారసు ప్రయోజనం చేకూరుస్తుంది. మరియు అల్లాహ్ తన గొప్పతనం వలన తాను ఇష్టపడిన వారి కొరకు మాత్రమే సిఫారసు విషయంలో అనుమతిస్తాడు. ఆయన గొప్పతనములోంచి ఆయన ఆకాశములో మాట్లాడినప్పుడు ఆయన మాట కొరకు దైవదూతలు వినయంతో తమ రెక్కలతో కొడతారు చివరికి వారి హృదయముల నుండి భయం తొలిగిపోవగానే దైవదూతలు జిబ్రయీల్ తో మీ ప్రభువు ఏమి అన్నాడు ? అని అంటారు. జిబ్రయీల్ ఆయన సత్యం పలికాడు అని సమాధానమిస్తారు. మరియు ఆయన తన అస్తిత్వములో,తన ఆధిక్యతలో మహోన్నతుడు, ఇతర వస్తువులన్నింటి నుండి గొప్పవాడు.
Sebe' 34:24
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఆకాశముల నుండి వర్షమును కురిపించటం ద్వారా మరియు భూమి నుండి పండ్లను,పంటలను,ఫలములను మొలకెత్తించటం ద్వారా మీకు ఆహారోపాధిని కలిగిస్తున్న వాడెవడు ?. మీరు ఇలా పలకండి : అల్లాహ్ యే వాటి నుండి మీకు ఆహారోపాధిని కలిగిస్తున్నవాడు. ఓ ముష్రికులారా నిశ్ఛయంగా మేము లేదా మీరు సన్మార్గంపై లేదా స్పష్టంగా మార్గం నుండి తప్పటంపై ఉన్నాము. మాలో నుండి ఒకరు ఖచ్చితంగా అలా ఉన్నాము. మరియు సన్మార్గమువారు విశ్వాసపరులే, మార్గభ్రష్టతవారు ముష్రికులే అన్నదానిలో ఎటువంటి సందేహం లేదు.
Sebe' 34:25
ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : ప్రళయదినమున మీరు మేము పాల్పడినటువంటి మా పాపముల గురించి ప్రశ్నించబడరు మరియు మేము మీరు చేస్తున్నటువంటి కార్యముల గురించి ప్రశ్నించబడము.
Sebe' 34:26
వారితో అనండి : ప్రళయదినమున అల్లాహ్ మీకూ,మాకూ మధ్య సమీకరిస్తాడు. ఆ తరువాత మీ మధ్య,మా మధ్య న్యాయపరంగా తీర్పునిస్తాడు. అప్పుడు ఆయన సత్యపరుడిని అసత్యపరుడి నుండి స్పష్టపరుస్తాడు. మరియు ఆయనే న్యాయపరంగా తీర్పునిచ్చేవాడును మరియు తాను తీర్పునిచ్చే దాని జ్ఞానము కలవాడును.
Sebe' 34:27
ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : మీరు అల్లాహ్ కొరకు భాగస్వాములుగా చేసుకుని ఆయనతోపాటు ఆరాధనలో మీరు సాటికల్పిస్తున్న వారిని నాకు చూపించండి. సాధ్యం కాదు. ఆయన కొరకు భాగస్వాములు ఉన్నారని మీరు అనుకుంటున్నట్లు విషయం కాదు. వాస్తవానికి ఆ అల్లాహ్ యే ఎవరూ ఆధిక్యత చూపని సర్వశక్తిమంతుడు, తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
Sebe' 34:28
ِఓ ప్రవక్తా మేము మిమ్మల్ని ప్రజలందరి కొరకు దైవభీతి కలవారికి స్వర్గము ఉన్నదని శుభవార్తనిచ్చేవాడిగా మరియు అవిశ్వాసపరులని,పాపాత్ములని నరకాగ్ని నుండి భయపెట్టేవానిగా పంపించాము. కాని చాలామంది ప్రజలకి ఇది తెలియదు. ఒక వేళ వారు దాన్ని తెలుసుకుంటే వారు నిన్ను తిరస్కరించేవారు కాదు.
Sebe' 34:29
మరియు ముష్రికులు తమకు భయపెట్టబడుతున్న శిక్ష గురించి తొందరచేస్తూ ఇలా పలికేవారు : శిక్ష గురించి చేయబడిన ఈ వాగ్దానము ఎప్పుడు నెరవేరనుంది ? ఒక వేళ అది సత్యమని మీరు వాదిస్తున్న విషయంలో మీరు సత్యవంతులే అయితే (తెలపండి).
Sebe' 34:30
ఓ ప్రవక్తా శిక్ష గురించి తొందర చేస్తున్న వీరందరితో ఇలా పలకండి : మీ కొరకు నిర్ణీత ఒక రోజు నిర్ణయించబడి ఉంది. దాని నుండి మీరు ఒక్కఘడియ వెనుకకు జరగలేరు మరియు దాని నుండి ఒక ఘడియ ముందుకు జరగలేరు. మరియు ఈ దినము అది ప్రళయదినము.
Sebe' 34:31
మరియు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచిన వారు ఇలా అంటారు : ముహమ్మద్ తన పై అవతరింపబడినదని అనుకుంటున్న ఈ ఖుర్ఆన్ ను మేము ఖచ్చితంగా విశ్వసించము. మరియు మేము పూర్వ దివ్యగ్రంధములను ఖచ్చితముగా విశ్వసించము. ఓ ప్రవక్తా ఒక వేళ దుర్మార్గులు లెక్క తీసుకోవటం కొరకు ప్రళయదినమున తమ ప్రభువు వద్ద ఆపబడినప్పుడు మీరు చూస్తే వారు తమ మధ్య పరస్పరం ఆరోపించుకుంటారు. వారిలో నుండి ప్రతి ఒక్కరు బాధ్యతను,దూషణను ఇంకొకరిపై నెట్టుతారు. బలహీనులుగా భావించబడిన అనుసరించేవారు తమను బలహీనులుగా భావించేవారితో ఇలా పలుకుతారు : మీరు మమ్మల్ని అపమార్గమునకు లోను చేయకుండా ఉంటే మేము కూడా అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విశ్వసించేవారము.
Sebe' 34:32
అనుసరించబడిన వారు ఎవరైతే సత్యము నుండి అహంకారమును చూపినారో వారు అనుసరించేవారు ఎవరినైతే వారు బలహీనులుగా భావించేవారో వారితో ఇలా అంటారు : ఏమీ ముహమ్మద్ మీ వద్దకు తీసుకుని వచ్చిన సన్మార్గము నుండి మేము మిమ్మల్ని ఆపామా ?. అలా కాదే . కానీ మీరు దుర్మార్గులు,చెడును ప్రభలింపజేసే చెడ్డవారు.
Sebe' 34:33
మరియు ఆ అనుసరించేవారు ఎవరినైతే వారి నాయకులు బలహీనులుగా భావించేవారో వారు సత్యము నుండి అహంకారమును చూపిన తాము అనుసరించేవారితో ఇలా పలుకుతారు : రాత్రింబవళ్ళు మీ కుట్రలు ఎప్పుడైతే మీరు మమ్మల్ని అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచమని,ఆయనను వదిలి సృష్టితాలను ఆరాధించమని ఆదేశించేవారో మమ్మల్ని సన్మార్గము నుండి ఆపినాయి. వారు శిక్షను చూసి,తాము శిక్షించబడుతారని తెలుసుకున్నప్పుడు తాము ఇహలోకములో పాల్పడిన అవిశ్వాసముపై కలిగిన అవమానమును దాచివేస్తారు. మరియు మేము అవిశ్వాసపరుల మెడలలో సంకెళ్ళను వేస్తాము. వారు ఇహలోకములో అల్లాహ్ ను వదిలి ఇతరుల ఆరాధనచేయటం,పాపాలకు పాల్పడటం ఏదైతే చేశారో దానికి ప్రతిఫలంగా మాత్రమే వారు ఈ ప్రతిఫలమును ప్రసాదించబడుతారు.
Sebe' 34:34
మరియు మేము బస్తీల్లోంచి ఏ బస్తీలో ప్రవక్తను పంపిస్తే అతడు వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టేవాడు. కాని అందులో ఉన్న అధికారము,మర్యాద,సంపద కల ఐశ్వర్య వంతులు ఇలా పలికేవారు : ఓ ప్రవక్తలు నిశ్ఛయంగా మేము మీరు ఇచ్చి పంపించబడిన వాటిని తిరస్కరిస్తున్నాము.
Sebe' 34:35
మరియు ఉన్నతులైన వీరందరు గర్వపడతూ,అహంకారపడుతూ ఇలా పలికారు : మేము ఎక్కువ సంపద,ఎక్కువ సంతానము కలిగినవారము. మేము శిక్షింపబడుతామని మీరు అనుకుంటున్నది అసత్యము. మేము ఇహలోకములో,పరలోకములో శిక్షంపబడము.
Sebe' 34:36
ఓ ప్రవక్తా మీరు తమకు ఇవ్వబడిన అనుగ్రహాలపై అహంకారమునకు లోనయ్యే వీరందరితో ఇలా పలకండి : పరిశుద్ధుడైన,మహోన్నతుడైన నా ప్రభువు తాను కోరుకున్న వాడి కొరకు ఆహారోపాధిని అతడు కృతజ్ఞత తెలుపుకుంటాడా లేదా కృఘ్నుడవుతాడా పరీక్షించటానికి విస్తృతపరుస్తాడు. మరియు తాను కోరుకున్న వారిపై దాన్ని అతడు సహనం వహిస్తాడా లేదా క్రోధానికి గురవుతాడా పరీక్షించటానికి కుదించివేస్తాడు. కానీ చాలా మంది ప్రజలకు అల్లాహ్ విజ్ఞత కలవాడని తెలియదు. ఆయన ఏదైన విషయాన్ని పూర్తి విజ్ఞతతో మాత్రమే అంచనా వేస్తాడు. దాన్ని తెలుసుకునేవాడు తెలుసుకుంటాడు మరియు దాన్ని తెలిసికోని వాడు తెలియకుండా ఉంటాడు.
Sebe' 34:37
మరియు మీరు గర్వపడే మీ సంపదలు,మీ సంతానము మిమ్మల్ని అల్లాహ్ మన్నత వైపునకు తీసుకునిపోవు. కాని ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి సత్కార్యములు చేస్తాడో వాడు రెట్టంపు పుణ్యాన్ని పొందుతాడు. అప్పుడు సంపదలు అల్లాహ్ మార్గములో వాటిని ఖర్చు చేయటం వలన,సంతానము అతని కొరకు వారు దుఆ చేయటం వలన అతనికి దగ్గర చేస్తాయి. వారందరు సత్కార్యములను చేసే విశ్వాసపరులు వారి కొరకు వారు చేసిన కర్మలకు రెట్టింపు పుణ్యం ఉంటుంది. మరియు వారు స్వర్గములోని ఉన్నత స్థానములలో తాము భయపడే శిక్ష,మరణం,అనుగ్రహాలు అంతం అయిపోవటం నుండి నిశ్ఛింతగా ఉంటారు.
Sebe' 34:38
మరియు మా ఆయతుల నుండి ప్రజలను మరలించటంలో శాయాశక్తుల కృషి చేసి,తమ లక్ష్యాలను సాధించటానికి ప్రయత్నం చేసే అవిశ్వాసపరులు వీరందరు ఇహలోకములో నష్టమును చవిచూస్తారు,పరలోకములో శిక్షింపబడుతారు.
Sebe' 34:39
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా పరిశుద్ధుడైన,మహోన్నతుడైన నా ప్రభువు తన దాసుల్లోంచి తాను కోరుకున్న వారికి ఆహారోపాధిని విస్తరింపజేస్తాడు మరియు వారిలో నుంచి తాను కోరుకున్న వారిపై దాన్ని కుదించివేస్తాడు. మరియు అల్లాహ్ మార్గంలో మీరు ఏదైన ఖర్చు చేస్తే పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ దాని కన్న మేలైన దాన్ని, పరలోకములో గొప్ప పుణ్యమును మీకు ఇచ్చి ఇహలోకములో మీపై దాన్ని రెట్టింపు చేసి ఇస్తాడు. మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ అందరికన్న ఉత్తమ ఆహారప్రధాత. అయితే ఎవరైతే ఆహారమును ఆశిస్తాడో అతడు పరిశుద్ధుడైన ఆయనతోనే మొర పెట్టుకోవాలి.
Sebe' 34:40
ఓ ప్రవక్తా అల్లాహ్ వారందరిని సమీకరించే రోజును ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ తరువాత పరిశుద్ధుడైన ఆయన దైవ దూతలతో ముష్రికులను మందలించటానికి,వారిని దూషించటానికి ఇలా పలుకుతాడు : ఏమీ వీరందరు ఇహలోక జీవితంలో అల్లాహ్ ను వదిలి మిమ్మల్ని ఆరాధించేవారా ?.
Sebe' 34:41
దైవదూతలు ఇలా పలికారు : నీవు పరిశుద్ధుడవు,అతీతుడవు !. వారు కాకుండా నీవే మా సంరక్షకుడవు. వారికి మాకి మధ్య ఎటువంటి విధేయత (విశ్వసనీయత) లేదు. అంతే కాదు ఈ ముష్రికులందరు షైతానులను ఆరాధించేవారు. వాటిని వారు దైవ దూతలు అని భావించి అల్లాహ్ ను వదిలి వాటిని ఆరాధించేవారు. వారిలో చాలా మంది వాటిని విశ్వసించేవారు.
Sebe' 34:42
సమీకరించబడే,లెక్కతీసుకోబడే రోజు ఇహలోకములో వారు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే పూజించే వారో ఆ ఆరాధ్య దైవాలకి ఎటువంటి ప్రయోజనం కలిగించే అధికారం ఉండదు. వారికి ఎటువంటి నష్టం కలిగించే అధికారం ఉండదు. మరియు మేము అవిశ్వాసముతో,పాపకార్యములతో తమ స్వయంపై హింసకు పాల్పడిన వారితో ఇలా పలుకుతాము : ఇహలోకములో మీరు తిరస్కరించిన నరకాగ్ని శిక్షను చవిచూడండి.
Sebe' 34:43
మరియు తిరస్కారులైన ఈ ముష్రికులపై మా ప్రవక్త పై అవతరింపబడిన ఎటువంటి సందేహం లేని స్పష్టమైన మా ఆయతులు చదివి వినిపించబడితే వారన్నారు : వీటిని తీసుకుని వచ్చిన వ్యక్తి కేవలం మిమ్మల్ని మీ తాతముత్తాతలు ఉన్న ధర్మం నుండి మరల్చదలచాడు. మరియు వారు ఇలా పలికారు : ఈ ఖుర్ఆన్ కేవలం అబద్దము మాత్రమే అతడు దాన్ని అల్లాహ్ పై కల్పించుకున్నాడు. మరియు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచిన వారు ఖుర్ఆన్ తో ఎప్పుడైతే అది అల్లాహ్ వద్ద నుండి వారి వద్దకు వచ్చినదో ఇలా పలికారు : ఇది భర్తకి అతని భార్యకి మధ్య,కొడుకుకి,అతని తండ్రికి మధ్య వేరు చేయటానికి స్పష్టమైన మంత్రజాలము మాత్రమే.
Sebe' 34:44
మరియు మేము వారికి ఎటువంటి గ్రంధములను ఇవ్వ లేదు వారు వాటిని చదివితే అవి వారికి ఈ ఖుర్ఆన్ ముహమ్మద్ కల్పించుకున్న అబద్దము అని నిర్దేశించటానికి. ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని ప్రవక్తగా పంపించక మునుపు వారి వద్దకు ఏ ప్రవక్తనూ వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టటానికి పంపించలేదు.
Sebe' 34:45
ఆద్,సమూద్,లూత్ జాతి లాంటి పూర్వ జాతులు తిరస్కరించాయి. మీ జాతిలో నుండి ముష్రికులు పూర్వ జాతులు పొందినటువంటి శక్తి,బలం,సంపద,సంఖ్య లో నుండి పదోవంతును కూడా పొందలేదు. వారిలో నుండి ప్రతి ఒక్కరు (పూర్వ జాతులు) తమ ప్రవక్తను తిరస్కరించాయి. అప్పుడు వారికి ఇవ్వబడిన సంపద,బలం,సంఖ్య వారికి ప్రయోజనం కలిగించలేకపోయినవి. అప్పుడు వారిపై నా శిక్ష వచ్చిపడింది. ఓ ప్రవక్తా వారిపై నా శిక్ష ఎలా ఉందో మరియు వారి కొరకు నా యాతన ఏ విధంగా ఉన్నదో చూడండి.
Sebe' 34:46
ఓ ప్రవక్తా మీరు ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : నేను మాత్రం మిమ్మల్ని ఒక పద్ధతితో సూచిస్తున్నాను,మీకు ఉపదేశం చేస్తున్నాను. అదేమిటంటే మీరు పరిశుద్ధుడైన అల్లాహ్ కొరకు మనోవాంఛల నుండి ఖాళీ అయి ఇద్దరు ఇద్దరుగా లేదా ఒకొక్కరిగా నిలబడండి. ఆ తరువాత మీరు మీ సహచరుని చరిత్ర గురించి,అతని బుద్ధి,అతని నిజాయితీ,అతని అమానత్ మీకు ఏది తెలుసో దాని గురించి సుధీర్ఘంగా అలోచిస్తే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు పిచ్చి లేదని మీకు స్పష్టమవుతుంది. అతను శిక్ష రాక ముందే మీ కొరకు హెచ్చరించేవాడు మాత్రమే ఒక వేళ మీరు అల్లాహ్ వైపునకు ఆయనతోపాటు సాటి కల్పించినందుకు పశ్చాత్తాప్పడకపోతే.
Sebe' 34:47
ఓ ప్రవక్తా తరస్కారులైన ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : నేను మీ వద్దకు తీసుకుని వచ్చిన సన్మార్గము,మేలు పై ఏదైన బదులు లేదా ప్రతిఫలమును మీతో కోరి ఉంటే - దాని ఉనికిని ఊహించుకొని - అది మీ కొరకే. నా ప్రతిఫలం ఒక్కడైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది. పరిశుద్ధుడైన ఆయన ప్రతీ దానిపై సాక్షి. ఆయన నేను మీకు సందేశాలను చేరవేశాను అన్న దానిపై సాక్ష్యం పలుకుతాడు. మరియు మీ కర్మలపై సాక్ష్యం పలుకుతాడు. వాటి ప్రతిఫలం మీకు ఆయన ప్రసాదిస్తాడు.
Sebe' 34:48
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా నా ప్రభువు సత్యమును అసత్యముపై ఆధిక్యతను కలిగించి దాన్ని నిర్వీర్యం చేస్తాడు. మరియు ఆయన అగోచర విషయాల గురించి బాగా తెలిసినవాడు. ఆకాశములలో గాని భూమిలో గానీ ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు తన దాసుల యొక్క కర్మలు ఆయనపై గోప్యంగా ఉండవు.
Sebe' 34:49
ఓ ప్రవక్తా తిరస్కారులైన ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : సత్యం వచ్చినది అదే ఇస్లాం. మరియు ఎటువంటి ప్రభావం లేదా శక్తి కనిపించని అసత్యం తొలగిపోయింది. మరియు అది తన ప్రభావం చూపే వైపునకు మరలదు.
Sebe' 34:50
ఓ ప్రవక్తా తిరస్కారులైన ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఒక వేళ నేను మీకు చేరవేస్తున్న సందేశముల విషయంలో సత్యము నుండి తప్పిపోతే నేను తప్పిన దాని నష్టం నాకు మాత్రమే. అందులో నుంచి ఏదీ మీకు చేరదు. మరియు ఒక వేళ నేను దాని వైపునకు (సత్యం వైపునకు) సన్మార్గం పొందితే అది కేవలం పరిశుద్ధుడైన నా ప్రభువు నాకు దైవవాణి ద్వారా తెలపటంవలనే. నిశ్చయంగా ఆయన తన దాసుల మాటలను బాగా వినేవాడు. నేను ఏమి చెబుతానో అది ఆయన వినకుండా ఉండడు.
Sebe' 34:51
ఓ ప్రవక్తా ఒక వేళ మీరు ఈ తిరస్కారులందరు ప్రళయదినాన శిక్షను కళ్ళారా చూసినప్పుడు భయకంపితులైనప్పుడు చూస్తే (ఎంత బాగుండేది). వారి కొరకు దాని నుండి పారిపోయే ప్రదేశముండదు. మరియు శరణం తీసుకోవటానికి ఎటువంటి శరణాలయం ఉండదు. మరియు వారు దగ్గర ప్రదేశము నుండి అందరికన్న ముందు శులభంగా పట్టుకోబడుతారు. ఒక వేళ మీరు దాన్ని చూస్తే మీరు ఆశ్ఛర్యకరమైన విషయాన్ని చూస్తారు.
Sebe' 34:52
మరియు వారు తమ పరిణామమును చూసినప్పుడు మేము ప్రళయదినంపై విశ్వాసమును కనబరుస్తాము అంటారు. విశ్వాసమును పట్టుకోవటం,దాన్ని పొందటం వారికి ఎలా సాధ్యమవుతుంది. వాస్తవానికి వారు ప్రతిఫల నివాసము కాకుండా ఆచరణలు చేసే నివాసమైన ఇహలోక నివాసము నుండి ఆచరణల నివాసము కాకుండా ప్రతిఫల నివాసమైన పరలోక నివాసము వైపునకు వారి వైదొలగటం వలన వారి నుండి విశ్వాసము స్వీకరించబడే ప్రదేశము దూరమైపోయింది.
Sebe' 34:53
మరియు ఎలా వారి నుండి విశ్వాసము లభిస్తుంది మరియు అది స్వీకరించబడుతుంది. వాస్తవానికి వారు దాన్నిఇహలోక జీవితంలోనే తిరస్కరించారు. మరియు వారు సత్యమును పొందటం నుండి దూరం నుండి అనుమానంతో విసురుతున్నారు. ఏవిధంగానైతే వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో ఆయన మంత్రజాలకుడు,జోతిష్యుడు,కవి అని పలికేవారో.
Sebe' 34:54
ఈ తిరస్కారులందరు తాము కోరుకున్న జీవిత సుఖాలు పొందకుండా,అవిశ్వాసము నుండి పశ్చాత్తాపముపడటం నుండి,నరకాగ్ని నుండి విముక్తి పొందటం నుండి ,ఇహలోక జీవితం వైపునకు మరలటం నుండి ఆపబడ్డారు. వారి కన్న మనుపటి తిరస్కార జాతుల వారి విధంగా వ్యవహరించబడినట్లు. నిశ్చయంగా వారు కూడా ప్రవక్తలు తీసుకుని వచ్చిన అల్లాహ్ తౌహీద్ గురించి,మరణాంతరం లేపబడటంపై విశ్వాసం గురించి సందేహములో పడి ఉండేవారు. అవిశ్వాసంపై పురిగొల్పే సందేహంలో.
Fatır 35:1
పొగడ్తలన్నీ పూర్వ నమూనా లేకుండా ఆకాశములను,భూమిని సృష్టించినవాడైన అల్లాహ్ కే చెందుతాయి. ఆయనే దైవదూతలను సందేశాలను చేరవేసేవానిగా చేశాడు వారు ఆయన విధి ఆదేశాలను నిర్వర్తిస్తుంటారు మరియు వారిలో నుండి దైవప్రవక్తలకు దైవ వాణిని చేరవేసేవారు ఉన్నారు. మరియు ఆయన వారికి ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించటంపై బలమును చేకూర్చాడు. అయితే వారిలో నుండి కొందరు రెండు రెక్కల వారు,మూడు రెక్కల వారు,నాలుగు రెక్కల వారు ఉన్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాలను నిర్వర్తించటానికి వారు వాటి ద్వారా ఎగురుతారు. అల్లాహ్ సృష్టి లో నుండి ఎవరికి తలచుకుంటే వారికి అవయములను గాని అందమును గాని స్వరమును గాని అధికం చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
Fatır 35:2
నిశ్చయంగా ప్రతీ వస్తువు యొక్క తాళములు అల్లాహ్ చేతిలో ఉన్నవి. అయితే ఆయన ప్రజల కొరకు ఆహారోపాధిని,సన్మార్గమును,ఆనందమును తెరిస్తే ఎవరూ దాన్ని ఆపలేరు. మరియు వాటిలో నుండి ఆయన దేన్ని ఆపినా, ఆపిన తరువాత దాన్ని ఎవడూ పంపించలేడు. మరియు ఆయన ఎవరూ ఓడించలేని సర్వశక్తిమంతుడు, తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
Fatır 35:3
ఓ ప్రజలారా మీరు మీపై ఉన్నఅనుగ్రహములైన మీ హృదయములను,మీ నాలుకలను,మీ పనిచేసే మీ అవయవాలను గుర్తు చేసుకోండి. ఏమీ మీ కొరకు అల్లాహ్ ను వదిలి ఆకాశము నుండి మీపై వర్షం కురిపించటం ద్వారా మీకు ఆహారోపాధిని ప్రసాదించే మరియు భూమి నుండి ఫలములను,పంటలను మొలకెత్తించి మీకు ఆహారోపాధిని ప్రసాదించే సృష్టికర్త ఎవరైనా ఉన్నారా ?. ఆయన తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఎవరూ లేరు. అటువంటప్పుడు దీని తరువాత మీరు ఎలా ఈ సత్యము నుండి మరలిపోయి,అల్లాహ్ పై కల్పించుకుని అల్లాహ్ కొరకు భాగస్వాములు ఉన్నారని భావిస్తున్నారు. వాస్తవానికి ఆయనే మిమ్మల్ని సృష్టించాడు మరియు మీకు ఆహారోపాధిని ప్రసాదించాడు.
Fatır 35:4
ఓ ప్రవక్తా ఒక వేళ మీ జాతి వారు మిమ్మల్ని తిరస్కరిస్తే మీరు సహనం వహించండి. మీరు తన జాతి వారు తిరస్కరించిన మొదటి ప్రవక్త కాదు. మీకు పూర్వ జాతులు ఆద్,సమూద్, లూత్ జాతి వారు లాంటి వారు తమ ప్రవక్తలను తిరస్కరించారు. మరియు ఒక్కడైన అల్లాహ్ వైపు వ్యవహారాలన్నీ మరలించబడుతాయి. ఆయన తిరస్కారులను తుదిముట్టిస్తాడు మరియు ఆయన తన ప్రవక్తలకు,విశ్వాసపరులకు సహాయం చేస్తాడు.
Fatır 35:5
ఓ ప్రజలారా నిశ్చయంగా అల్లాహ్ చేసిన వాగ్దానమైనటువంటి మరణాంతరం లేపబడటం, ప్రళయదినమున ప్రతిఫలం ప్రసాదించటం సత్యము అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇహలోక జీవిత రుచులు,వాటి కోరికలు ఈ దినము కొరకు సత్కర్మతో సిద్ధం అవటం నుండి మిమ్మల్ని మోసగించకూడదు. మరియు షైతాను అసత్యమును తన అలంకరణ ద్వారా, ప్రాపంచిక జీవితం వైపునకు మరలించటం ద్వారా మిమ్మల్ని మోసగించకూడదు.
Fatır 35:6
ఓ ప్రజలారా నిశ్చయంగా షైతాను మీకు శాశ్వత శతృవు. కాబట్టి మీరు అతడితో పోరాటమును కొనసాగించటంతో అతడిని శతృవుగా చేసుకోండి. షైతాను మాత్రం తనను అనుసరించేవారిని వారి పరిణామము ప్రళయదినమున భగభగ మండే అగ్నిలో ప్రవేశం అవ్వాలని అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచటం వైపునకు పిలుస్తాడు.
Fatır 35:7
షైతానును అనుసరిస్తూ అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచిన వారి కొరకు కఠినమైన శిక్ష కలదు. మరియు ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి సత్కర్మలు చేస్తారో వారి కొరకు అల్లాహ్ వద్ద వారి పాపముల మన్నింపు కలదు. మరియు వారి కొరకు దాని కన్నా పెద్ద ప్రతిఫలం కలదు అది స్వర్గము.
Fatır 35:8
నిశ్ఛయంగా ఎవరి కొరకైతే షైతాను అతని దుష్కర్మను మంచిగా చేసి చూపిస్తే దాన్ని మంచిదని నమ్మితే అతను అల్లాహ్ ఎవరికొరకైతే సత్యాన్ని మంచిగా చూపితే దాన్ని సత్యమని నమ్ముతాడో అతనితో సమానుడు కాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తాను కోరుకున్న వారికి అపమార్గమునకు లోను చేస్తాడు. మరియు తాను కోరుకున్న వారికి సన్మార్గము చూపుతాడు . అతనును ధ్వేషించే వాడెవడూ లేడు. ఓ ప్రవక్తా మీరు మార్గభ్రష్టుల మార్గభ్రష్టతపై బాధపడుతూ మీ స్వయాన్ని హతమార్చుకోకండి. నిశ్ఛయంగా పరిశుద్ధుడైన అల్లాహ్ వారు చేస్తున్న వాటి గురించి బాగా తెలిసినవాడు. వారి కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Fatır 35:9
మరియు అల్లాహ్ యే గాలులను పంపిస్తాడు అప్పుడు ఈ గాలులు మేఘమును కదుపుతాయి. అప్పుడు మేము మేఘమును ఎటువంటి మొక్కలు లేని ప్రదేశమునకు తీసుకుని వెళతాము. అప్పుడు మేము దాని నీటితో భూమిని అది బంజరు అయిన తరువాత కూడా అందు మేము మొలకెత్తించిన మొక్కల ద్వారా జీవింపజేస్తాము. ఏ విధంగానైతే మేము ఈ భూమిని దాని మరణం తరువాత అందు మేము మొక్కలను వేయటం ద్వారా జీవింపజేశామో అలాగే ప్రళయదినమున మృతుల మరణాంతరం లేపబడటం జరుగుతుంది.
Fatır 35:10
మరియు ఎవరైతే ఇహలోకంలో లేదా పరలోకంలో గౌరవాన్ని ఆశిస్తాడో అతడు దాన్ని అల్లాహ్ తో మాత్రమే కోరుకోవాలి. ఆ రెండింటిలో గౌరవమన్నది అల్లాహ్ ఒక్కడి కొరకే. ఆయన వైపునకే ఆయన సద్సమరణ ఎగబ్రాకుతుంది. మరియు దాసుల సత్కర్మ దాన్ని ఆయన వైపునకు ఉన్నతినిస్తుంది. మరియు ఎవరైతే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హతమార్చే ప్రయత్నం చేయటం లాంటి కుట్రలను పన్నుతారో వారి కొరకు కఠినమైన శిక్ష కలదు. మరియు ఈ అవిశ్వాసపరులందరి కుట్ర నిర్వీర్యమైపోతుంది,పాడైపోతుంది. మరియు వారి కొరకు గమ్యం సాధించదు.
Fatır 35:11
మరియు అల్లాహ్ యే మీ తండ్రి అయిన ఆదంను మట్టితో సృష్టించాడు. ఆ తరువాత మిమ్మల్ని ఇంద్రియ బిందువుతో సృష్టించాడు. ఆ తరువాత ఆయన మిమ్మల్ని మగవారిగా,ఆడవారిగా చేశాడు మీరు మీ మధ్య పరస్పరం వివాహం చేసుకొంటున్నారు. మరియు ఏ స్త్రీ కూడా పరిశుద్ధుడైన ఆయనకు తెలియకుండా గర్భం దాల్చదు మరియు తన బిడ్డకు జన్మనివ్వదు. వాటిలో నుంచి ఏదీ ఆయన నుండి అదృశ్యమవదు. మరియు ఆయన సృష్టిలో నుండి ఎవరి ఆయుషులో అధికమైనా లేదా అందులో నుండి తరిగినా అది లౌహ్ మహఫూజ్ లో వ్రాయబడి ఉండకుండా ఉండదు. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడినటువంటి మీ పుట్టుక మట్టి నుండి కావటం,మీ పుట్టుక వివిధ దశలో కావటం,మీ ఆయుషులు లౌహె మహఫూజ్ లో వ్రాయటం అల్లాహ్ పై సులభము.
Fatır 35:12
మరియు రెండు సముద్రాలు సమానం కాజాలవు : అందులో ఒకటి చాలా తియ్యదైనది. దాని తియ్యదనం వలన దాన్ని త్రాగటం సులభమైనది. మరియు రెండవది ఉప్పగా,చేదుగా ఉన్నదైనది దాని అధిక ఉప్పదనం వలన దాన్ని త్రాగటం సాధ్యం కాదు. ప్రస్తావించబడిన రెండు సముద్రముల్లోంచి ప్రతీ ఒక్కటి నుండి మీరు తాజా మాంసమును తింటున్నారు అది చేపలు. ఆ రెండింటి నుండి మీరు ముత్యములను,పగడములను వెలికితీస్తున్నారు. వాటిని మీరు అలంకరణగా తొడుగుతున్నారు. ఓ వీక్షించేవాడా నీవు ఓడలను చూస్తావు అవి తమ పయనముతో మీరు వ్యాపారము ద్వారా అల్లాహ్ అనుగ్రహమును అన్వేషించటానికి వస్తూ,పోతుండగా సముద్రమును చీల్చుతున్నాయి. మరియు బహుశా మీరు అల్లాహ్ కి ఆయన మీకు ప్రసాదించిన తన చాలా అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలుపుకుంటారని.
Fatır 35:13
అల్లాహ్ రాత్రిని పగలులో ప్రవేశింపజేసి దాన్ని పొడుగుగా అధికం చేస్తున్నాడు. మరియు పగలును రాత్రిలో ప్రవేశింపజేసి పొడుగుగా అధికం చేస్తున్నాడు. మరియు పరిశుద్ధుడైన ఆయన సూర్యుడిని నిబద్ధుడిగా చేశాడు మరియు చంద్రుడిని నిబద్ధుడిగా చేశాడు. వాటిలో నుండి ప్రతి ఒక్కటి అల్లాహ్ కు తెలిసిన ఒక నిర్ణీత సమయంలో పయనిస్తున్నాయి. అది ప్రళయదినము. వాటిలో ప్రతీ ఒక్కటిని నిర్ణయించి దాన్ని నడిపిస్తున్నవాడు ఆయనే మీ ప్రభువైన అల్లాహ్,అధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. ఆయనను వదిలి మీరు ఆరాధిస్తున్న విగ్రహాలకు ఖర్జూరపు టెంకపై ఉన్న పొర అంత దాని అధికారము కూడా లేదు. అటువంటప్పుడు మీరు ఎలా నన్ను కాదని వారిని పూజిస్తున్నారు ?!.
Fatır 35:14
ఒక వేళ మీరు మీ ఆరాధ్య దైవాలను వేడుకుంటే అవి మీ వేడుకలను వినలేవు. అవి తమలో ఎటువంటి ప్రాణము లేని,తమకు ఎటువంటి వినికిడి శక్తి లేని స్థిర రాసులు. ఒక వేళ అవి తఖ్దీర్ ప్రకారం విన్నా మీ కొరకు వారు స్వీకరించజాలవు. ప్రళయదినాన మీ సాటి కల్పించటం నుండి , మీరు వారి ఆరాధన చేయటం నుండి విసుగును చూపిస్తారు. ఓ ప్రవక్తా మీకు పరిశుద్ధుడైన అల్లాహ్ కన్నా ఎక్కువ నిజంగా తెలిపేవారు ఎవరూ ఉండరు.
Fatır 35:15
ఓ ప్రజలారా మీరు మీ వ్యవహారాలన్నింటిలో,మీ పరిస్థితులన్నింటిలో అల్లాహ్ అవసరం కలవారు. మరియు అల్లాహ్ యే స్వయం సమృద్ధుడు ఏ విషయంలోను ఆయనకు మీ అవసరం లేదు. తన దాసుల కొరకు ఆయన నిర్ణయించే వాటిపై ఇహపరాల్లో స్థుతింపబడేవాడు.
Fatır 35:16
ఒక వేళ పరిశుద్ధుడైన ఆయన ఏదైన వినాశనం ద్వారా మిమ్మల్ని తొలగించదలచుకుంటే దాని ద్వారా మిమ్మల్ని తుదిముట్టించి తొలగిస్తాడు. మరియు మీకు బదులుగా ఆయనను ఆరాధించి,ఆయనతోపాటు ఎవరిని సాటి కల్పించని ఒక క్రొత్త సృష్టిని తీసుకునివస్తాడు.
Fatır 35:17
మిమ్మల్ని తుదిముట్టించటం ద్వారా తొలగించటం,మీకు బదులుగా ఒక క్రొత్త సృష్టిని తీసుకొని రావటం పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ నుండి జరగడం సాధ్యం కాని పని కాదు.
Fatır 35:18
మరియు ఒక పాపాత్ముడైన ప్రాణము వేరొక పాపాత్ముడైన ప్రాణము యొక్క పాపమును మోయదు. అంతే కాదు ప్రతీ పాపాత్ముడైన ప్రాణము తన పాపమునే మోస్తుంది. ఒక వేళ తన పాపముల బరువేయబడిన ఏ ప్రాణమైన తన పాపముల్లోంచి కొంచెమైన మోయటానికి వాటిని మోసే వాడిని పిలిచినా తన పాపముల్లోంచి కొంచెము కూడా మోయబడదు. ఒక వేళ పిలవబడిన వాడు అతనికి దగ్గర బందువైనా సరే. ఓ ప్రవక్తా మీరు కేవలం తమ ప్రభువును చూడకుండానే భయపడే వారిని, నమాజును దాని పరిపూర్ణ పద్దతిలో పూర్తి చేసేవారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెడుతారు. వారే మీ భయపెట్టటం ద్వారా ప్రయోజనం చెందుతారు. మరియు ఎవరైతే పాపముల నుండి మరియు వాటిలో నుండి పెద్దది షిర్కు నుండి పరిశుద్ధుడవుతాడో అతడు తన స్వయం కొరకు పరిశుద్ధుడయ్యాడు. ఎందుకంటే దాని ప్రయోజనం అతని వైపునకే మరలుతుంది. అల్లాహ్ తన విధేయత నుండి అక్కరలేనివాడు. మరియు ప్రళయదినమున లెక్క తీసుకొనటం,ప్రతిఫలం కొరకు అల్లాహ్ వైపునకే మరలిపోవలసినది.
Fatır 35:19
గ్రుడ్డివాడు,చూపు కలవాడు ఏ విధంగా సమానులు కారో అలాగే అవిశ్వాసపరుడు మరియు విశ్వాసపరుడు స్థానమును బట్టి సమానులు కారు.
Fatır 35:20
చీకట్లు మరియు వెలుగు సమానము కానట్లే అవిశ్వాసము మరియు విశ్వాసము సమానము కాదు.
Fatır 35:21
నీడ మరియు వేడి గాలి సమానము కానట్లే స్వర్గము మరియు నరకము తమ ప్రభావములలో సమానము కావు.
Fatır 35:22
బ్రతికి ఉన్నవారు మరియు మృతులు సమానము కానట్లే విశ్వాసపరులు మరియు అవిశ్వాసపరులు సమానులు కారు. నిశ్ఛయంగా అల్లాహ్ తాను కోరుకున్న వారికి తన సన్మార్గమును వినిపిస్తాడు. ఓ ప్రవక్తా మీరు సమాధులలో మృతినివలె ఉన్న అవిశ్వాసపరులను వినిపించలేరు.
Fatır 35:23
మీరు కేవలం వారికి అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరిక చేసేవారు మాత్రమే.
Fatır 35:24
ఓ ప్రవక్తా నిశ్చయంగా మేము మిమ్మల్ని ఎటువంటి సందేహం లేని సత్యముతో,విశ్వాసపరులకు అల్లాహ్ వారి కొరకు తయారు చేసి ఉంచిన గౌరవప్రదమైన పుణ్యమును గురించి శుభవార్తనిచ్చేవాడిగా,అవిశ్వాసపరులకు వారి కొరకు ఆయన తయారు చేసి ఉంచిన బాధాకర శిక్ష నుండి హెచ్చరించేవాడిగా పంపించాము. పూర్వ జాతుల్లోంచి ఏ జాతి కూడా అందులో అల్లాహ్ వద్ద నుండి ఆయన శిక్ష నుండి వారిని హెచ్చరించే ఏ ప్రవక్తా రాకుండా గడిచిపోలేదు.
Fatır 35:25
ఓ ప్రవక్తా ఒక వేళ మీ జాతివారు మిమ్మల్ని తిరస్కరిస్తే సహనం చూపండి. మీరు తన జాతి వారు తిరస్కరించిన మొదటి ప్రవక్త కాదు. ఆద్,సమూద్,లూత్ జాతి లాంటి పూర్వ జతులు తమ ఈ ప్రవక్తలందరిని తిరస్కరించారు. అల్లాహ్ వద్ద నుండి వారి వద్దకు వారి ప్రవక్తలు తమ నిజాయితీని సూచించే స్పష్టమైన వాదనలను తీసుకుని వచ్చారు. మరియు వారి ప్రవక్తలు వారి వద్దకు ప్రతులను (సహీఫాలను),ప్రకాశమానమైన గ్రంధమును దానిలో యోచన చేసేవాడి కొరకు,దీర్ఘంగా ఆలోచించేవాడి కొరకు తీసుకుని వచ్చారు.
Fatır 35:26
మరియు అయినా వారు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను తిరస్కరించారు మరియు ఆయన వద్ద నుండి వారు తీసుకుని వచ్చిన వాటి విషయంలో వారిని వారు నమ్మలేదు. అప్పుడు నేను అవిశ్వసించిన వారందరిని నాశనం చేశాను. ఓ ప్రవక్తా నేను వారిని నాశనం చేసినప్పుడు వారిపై నా శిక్ష ఎలా ఉందో మీరు యోచన చేయండి.
Fatır 35:27
ఓ ప్రవక్తా పరిశుద్ధుడైన అల్లాహ్ ఆకాశము నుండి వర్షపు నీటిని కురిపించటమును మీరు చూడలేదా. అప్పుడు మేము ఆ నీటితో వేరు వేరు రంగులు కల ఫలములను వెలికి తీశాము. వాటి వృక్షములకు దాని నుండి నీరు పెట్టిన తరువాత వాటిలో ఎరుపు,పచ్చని,పసుపు,ఇతర రంగులు కలవు. మరియు పర్వతములలోంచి తెల్లటి కనుమలను, ఎర్రటి కనుమలను,ముదురు నలుపు కనుమలను వెలికి తీశాము.
Fatır 35:28
మరియు మనుషుల్లోంచి,జంతువుల్లోంచి,పశువుల్లోంచి (ఒంటెలు,ఆవులు,గొర్రెలు) ప్రస్తావించిన వాటిలాగే వాటికి వేరు వేరు రంగులు కలవు. అవి మాత్రం మహోన్నతుడైన అల్లాహ్ స్థానమును గౌరవిస్తున్నాయి మరియు పరిశుద్ధుడైన ఆయన గురించి జ్ఞానం కలవారు ఆయన నుండి భయపడుతారు. ఎందుకంటే వారు ఆయన గుణాలను,ఆయన శాసనములను,ఆయన సామర్ధ్యపు ఆధారాలను గుర్తించారు. నిశ్చయంగా అల్లాహ్ ఎవరూ ఓడించలేని సర్వ శక్తిమంతుడు. తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడిన వారి పాపములను మన్నించేవాడు.
Fatır 35:29
నిశ్ఛయంగా వారు మేము మా ప్రవక్తపై అవతరింపజేసిన అల్లాహ్ గ్రంధమును చదువుతారు మరియు అందులో ఉన్నవాటిపై ఆచరిస్తారు. మరియు వారు నమాజును ఉత్తమ పద్దతిలో పూర్తి చేస్తారు. మరియు వారు మేము వారికి ప్రసాదించిన వాటిలో నుంచి జకాత్ విధి దానం పద్దతిలో,ఇతర పద్దతిలో (స్వచ్ఛందంగా) గోప్యంగా,బహిర్గంగా ఖర్ఛు చేస్తారు. వారు ఈ ఆచరణల ద్వారా అల్లాహ్ వద్ద ఎన్నటికి నష్టం కలగని వ్యాపారమును ఆశిస్తారు.
Fatır 35:30
అల్లాహ్ వారి కర్మల పరిపూర్ణ ప్రతిఫలమును వారికి ప్రసాదించటానికి. ఆయనే దీనికి యోగ్యుడు. నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన ఈ గుణములు కలిగిన వారి పాపములను మన్నించేవాడును, వారి సత్కర్మలను ఆదరించేవాడును.
Fatır 35:31
ఓ ప్రవక్తా మేము మీ వైపునకు దైవ వాణి ద్వారా అవతరింపజేసిన గ్రంధం ఎటువంటి సందేహము లేని సత్యము. దానినే అల్లాహ్ పూర్వ గ్రంధాలను ధృవీకరించే విధంగా అవతరింపజేశాడు. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల గురించి తెలుసుకునే వాడును,చూసేవాడును. ఆయన ప్రతీ జాతి ప్రవక్తకు వారి కాలంలో తన నుండి వారికి ఏమి అవసరమో దైవవాణి ద్వారా తెలియపరుస్తాడు.
Fatır 35:32
ఆ తరువాత మేము సమాజాలపై ఎన్నుకున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజమునకు మేము ఖుర్ఆన్ ను ప్రసాదించాము. అయితే వారిలో కొందరు నిషిద్ధ కార్యాలకు పాల్పడి, విధిగావించబడిన వాటిని వదిలివేసి తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడినవారు ఉన్నారు. మరియు వారిలో కొందరు విధిగావించబడిన వాటిని చేసి,నిషిద్ధమైన వాటిని వదిలివేసి దానికి తోడుగా కొన్ని సమ్మతమైన వాటిని వదిలివేసి,కొన్ని సమ్మతం కాని వాటిని చేసి మధ్యస్థంగా ఉండేవారు ఉన్నారు. మరియు వారిలో నుండి కొందరు అల్లాహ్ సెలవుతో సత్కార్యములను చేయటంలో మున్ముందు ఉండేవారు ఉన్నారు. ఈ ప్రస్తావించబడినటువంటి ఈ సమాజము కొరకు ఎంచుకోవటం, దానికి ఖుర్ఆన్ ను ప్రసాదించటం ఇది పెద్ద అనుగ్రహము. దానికి సరితూగే ఏ అనుగ్రహము లేదు.
Fatır 35:33
కలకాలం నిలిచే స్వర్గవనాలు వాటిలో ఈ ఎంచుకోబడిన వారందరు ప్రవేశిస్తారు. వారు వాటిలో ముత్యాలను,బంగారపు కంకణములను తొడుగుతారు. మరియు వాటిలో వారి వస్త్రాలు పట్టు వస్త్రాలై ఉంటాయి.
Fatır 35:34
మరియు వారు స్వర్గంలో ప్రవేశించిన తరువాత ఇలా పలుకుతారు : పొగడ్తలన్ని ఆ అల్లాహ్ కొరకే ఎవరైతే మేము నరకములో ప్రవేశము నుండి మేము భయపడటము వలన కలిగిన దుఃఖమును మా నుండి తొలగించాడో. నిశ్ఛయంగా మా ప్రభువు తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించు వాడును, వారి విధేయతపై వారి కొరకు ఆదరించేవాడును.
Fatır 35:35
ఆయనే తన అనుగ్రహముతో శాశ్వత నివాసము, దాని తరువాత ఎటువంటి తరలింపు లేని దాన్ని మనకు ప్రసాదించాడు. మాకు ఎటువంటి సామర్ధ్యము గాని శక్తి గాని లేదు. అందులో మాకు ఎటువంటి అలసట గాని,సమస్య గాని తలెత్తదు.
Fatır 35:36
మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరుస్తారో వారి కొరకు నరకాగ్ని గలదు,వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వారు మరణించి శిక్ష నుండి ప్రశాంతతను పొందటానికి వారిపై మరణ తీర్పు ఇవ్వబడదు. మరియు వారి నుండి నరకము శిక్ష కొంచెము కూడా తగ్గించబడదు. ఈ ప్రతిఫలం ప్రసాదించినట్లే ప్రళయదినాన మేము తన ప్రభువు యొక్క అనుగ్రహాలను తిరస్కరించే వాడికి ప్రసాదిస్తాము.
Fatır 35:37
మరియు వారు అందులో తమ బిగ్గర స్వరాలతో మొర పెట్టుకుంటూ ఇలా పలుకుతూ అరుస్తారు : ఓ మా ప్రభూ నీవు మమ్మల్ని నరగాగ్ని నుండి వెలికి తీ మేము నీ మన్నతను పొంది నీ శిక్ష నుండి భద్రంగా ఉండటానికి మేము ఇహలోకములో చేసిన కర్మలకు భిన్నంగా సత్కర్మను చేస్తాము. అప్పుడు అల్లాహ్ వారికి ఇలా సమాధానమిస్తాడు : ఏ మేము మీకు హితబోధనను గ్రహించదలిచేవాడు హితబోధన గ్రహించి,అల్లాహ్ ముందు పశ్చాత్తాప్పడి,సత్కర్మను చేసేంత వయస్సును ఇవ్వ లేదా ?. మరియు మీకు అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరిస్తూ ప్రవక్త మీ వద్దకు రాలేదా ?. వీటన్నిటి తరువాత మీకు ఎటువంటి వాదన గాని వంక గాని లేదు. కాబట్టి మీరు అగ్ని శిక్షను చవిచూడండి. అవిశ్వాసము ద్వారా,పాపకార్యముల ద్వారా తమ స్వయంపై హింసకు పాల్పడే వారి కొరకు అల్లాహ్ శిక్ష నుండి వారిని రక్షించటానికి లేదా దాన్ని వారి నుండి తేలిక చేయటానికి ఎటువంటి సహాయకుడు ఉండడు.
Fatır 35:38
నిశ్చయంగా అల్లాహ్ ఆకాశముల,భూమి యొక్క అగోచరమును తెలిసినవాడు. దానిలో నుంచి ఏదీ అతని నుండి తప్పిపోదు. నిశ్ఛయంగా ఆయన తన దాసులు తమ హృదయముల్లో గోప్యంగా ఉంచే మేలును,చెడును తెలిసినవాడు.
Fatır 35:39
ఓ ప్రజలారా ఆయనే మీలో నుండి కొందరిని భూమిలో కొందరిపై ప్రతినిధులుగా చేశాడు మీరు ఎలా ఆచరిస్తారో ఆయన మిమ్మల్ని పరీక్షించటానికి. అయితే ఎవరైతే అల్లాహ్ పట్ల,ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటి పట్ల అవిశ్వాసమును కనబరుస్తాడో అతని అవిశ్వాసము యొక్క పాపము,అతని పరిణామము అతనిపైనే మరలుతుంది. అతని అవిశ్వాసము అతని ప్రభువుకు హాని తలపెట్టదు.అవిశ్వాసపరుల అవిశ్వాసము పరిశుద్ధుడైన తమ ప్రభువు వద్ద తీవ్ర ధ్వేషమును మాత్రమే అధికం చేస్తుంది. మరియు అవిశ్వాసపరుల అవిశ్వాసము నష్టమును మాత్రమే అధికం చేస్తుంది. ఎందుకంటే అల్లాహ్ వారి కొరకు స్వర్గంలో తయారు చేసి ఉంచిన వాటిని నష్టపోతారు ఒక వేళ వారు విశ్వసిస్తే (నష్టపోరు).
Fatır 35:40
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న మీ భాగస్వాముల గురించి నాకు తెలియపరచండి. వారు భూమి నుండి ఏమి సృష్టించారు ?. వారు దాని పర్వతాలను సృష్టించారా ?,దాని వాగులను సృష్టించారా ?, దాని జంతువులను సృష్టించారా ?. లేదా ఆకాశములను సృష్టించటంలో వారు అల్లాహ్ తో పాటు భాగస్వాములా ?. లేదా మేము వారికి మేము ఏదైన పుస్తకమును ఇచ్చామా అందులో వారి భాగస్వాముల కొరకు వారి ఆరాధన నిజమవటంపై ఏదైన ఆధారమున్నదా ?. వీటిలో నుండి ఏదీ వారికి కలగలేదు. అంతే కాదు అవిశ్వాసము ద్వారా,పాప కార్యముల ద్వారా తమ స్వయంపై హింసకు పాలపడినవారు ఒకరినొకరు మోసపూరిత మాటల వాగ్దానం మాత్రమే చేసుకుంటున్నారు.
Fatır 35:41
నిశ్ఛయంగా పరిశుద్ధుడైన అల్లాహ్ ఆకాశములను,భూమిని వాటి స్థానముల నుండి తొలగిపోకుండా ఆపి ఉంచాడు. ఒక వేళ అవి రెండు తమ స్థానముల నుండి తొలగిపోతే - అనుకోండి - పరిశుద్ధుడైన ఆయన తరువాత తొలగిపోవటం నుండి ఆ రెండింటిని ఆపేవాడు ఎవడూ ఉండడు. నిశ్చయంగా ఆయన సహనశీలుడు శిక్షించటంలో తొందర చేయడు, తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడేవారి పాపములను మన్నించేవాడు.
Fatır 35:42
మరియు తిరస్కారులైన ఈ అవిశ్వాసపరులందరు ధృడమైన,గట్టివైన ప్రమాణాలు చేసి చెప్పేవారు : ఒక వేళ వారి వద్దకు అల్లాహ్ వద్ద నుండి ఒక ప్రవక్త వచ్చి ఆయన శిక్ష నుండి హెచ్చరించి ఉంటే వారు తప్పకుండా యూదుల కన్న,క్రైస్తవుల కన్న,ఇతరుల కన్న ఎక్కువగా సత్యము పై స్థిరత్వము కలిగిన వారై,అనుసరించేవారై పోతారని. మరియు ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు వద్ద నుండి వారి వద్దకు ప్రవక్తగా వచ్చి వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టారో అయన రాక వారిని సత్యము నుండి దూరమును,అసత్యముతో సంబంధమును అధికం చేసింది. వారు తమ కన్న పూర్వం గతించిన వారి కన్న ఎక్కువగా సన్మార్గంపై ఉంటారని వారు చేసిన ధృడ ప్రమాణాలను పూర్తి చేయలేదు.
Fatır 35:43
మరియు వారు అల్లాహ్ పై చేసిన వారి ప్రమాణము మంచి సంకల్పముతో,మంచి ఉద్ధేశముతో కాదు. కాని భూమిలో అహంకారమును చూపటానికి,ప్రజలను మోసం చేయటానికి. మరియు చెడు వ్యూహం దాన్ని పాల్పడే వ్యూహకర్తలనే చుట్టుకుంటుంది. అహంకారమును చూపే ఈ వ్యూహకర్తలందరు ఖచ్చితంగా వాటిల్లే అల్లాహ్ సంప్రదాయం కోసం మాత్రమే నిరీక్షిస్తున్నారు. మరియు అది వారిలాంటి వారి పూర్వికులను తుది ముట్టుంచినట్లే వారి వినాశనము. అయితే నీవు అహంకారులైన వారిని తుదిముట్టించటంలో అల్లాహ్ సంప్రదాయం వారిపై వాటిల్లకుండా మార్చటమును ,అది ఇతరులపై వాటిల్లి మారటమును పొందవు. ఎందుకంటే అది వాటిల్లే దైవిక సంప్రదాయం.
Fatır 35:44
ఏమీ ఖురైష్ జాతి వారిలో నుంచి నిన్ను తిరస్కరించిన వారు వారి కన్న మునుపు తిరస్కరించిన సమాజముల పరిణామం ఏమైందో యోచన చేయటానికి భూమిలో సంచరించలేదా ?. అల్లాహ్ వారిని నాశనం చేసినప్పుడు వారి ముగింపు చెడ్డ ముగింపు కాలేదా ?. వాస్తవానికి వారు ఖురైష్ కన్న ఎక్కువ బలం కలవారు. మరియు ఆకాశములలో గాని భూమిలో గాని ఏదీ అల్లాహ్ నుండి తప్పిపోదు. నిశ్చయంగా ఆయన ఈ తిరస్కారులందరి కర్మల గురించి బాగా తెలిసినవాడు. వారి కర్మల్లోంచి ఏది ఆయన నుండి అధృశ్యమవదు,ఆయన నుండి తప్పిపోదు. ఆయన తలచినప్పుడు వారిని వినాశనము చేయటం పై సామర్ధ్యము కలవాడు.
Fatır 35:45
ఒక వేళ అల్లాహ్ ప్రజలకు వారు చేసిన అవిధేయ కార్యాలపై, వారు పాల్పడిన పాపములపై శీఘ్రంగా శిక్షిస్తే వెంటనే భూవాసులందరినీ,వారి ఆదీనంలో ఉన్న జంతువులను,సంపదలను నాశనం చేసేవాడు. కానీ పరిశుద్ధుడైన ఆయన తన జ్ఞానంలో నిర్ణీతమైన సమయం వరకు వారికి గడువునిస్తాడు. మరియు అది ప్రళయదినము. ప్రళయదినం వచ్చినప్పుడు, నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసులను వీక్షిస్తున్నాడు. వారి నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన వారి కర్మల పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఒక వేళ (అవి) మేలైనవి అయితే మేలుగా, ఒక వేళ చెడ్డవైతే చెడుగా.
Yâsin 36:1
(يسٓ) యా-సీన్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
Yâsin 36:2
అల్లాహ్ ప్రమాణం చేస్తున్నాడు ఆ ఖుర్ఆన్ పై దేని వాక్యాలు అయితే నిర్దుష్టముగా చేయబడ్డాయో. మరియు దాని ముందు నుండి గాని దాని వెనుక నుండి గాని అసత్యము దాని వద్దకు రాదు.
Yâsin 36:3
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీరు అల్లాహ్ తన దాసుల వైపునకు వారికి తన తౌహీద్ గురించి,తన ఒక్కడి ఆరాధన గురించి ఆదేశించటానికి పంపించిన ప్రవక్తల్లోంచి వారు.
Yâsin 36:4
(మీరు) సరళమైన పద్దతి పై,సరైన ధర్మం పై ఉన్నారు. మరియు ఈ సరళమైన పద్దతి,సరైన ధర్మం ఎవరూ ఆధిక్యత చూపలేని సర్వశక్తిమంతుడైన,విశ్వాసపరులైన తన దాసులపై అపారంగా కరుణించేవాడైన నీ ప్రభువు వద్ద నుండి అవతరింపబడినది.
Yâsin 36:5
(మీరు) సరళమైన పద్దతి పై,సరైన ధర్మం పై ఉన్నారు. మరియు ఈ సరళమైన పద్దతి,సరైన ధర్మం ఎవరూ ఆధిక్యత చూపలేని సర్వశక్తిమంతుడైన,విశ్వాసపరులైన తన దాసులపై అపారంగా కరుణించేవాడైన నీ ప్రభువు వద్ద నుండి అవతరింపబడినది.
Yâsin 36:6
మీరు ఒక జాతి వారిని భయపెట్టటానికి,వారిని మీరు హెచ్చరించటానికి దాన్ని మేము మీ వైపునకు అవతరింపజేశాము. మరియు వారు ఆ అరబ్ వాసులు ఎవరి వద్దకైతే వారిని హెచ్చరించే ఏ ప్రవక్తా రాలేదో. మరియు వారు విశ్వాసము నుండి,ఏకేశ్వరోపాసన నుండి (తౌహీద్ నుండి) పరధ్యానంలో ఉండేవారు. మరియు ఇదే విధంగా హెచ్చరించటం తెగిపోయిన ప్రతీ జాతి పరిస్థితి ఉంటుంది. వారు తమను హెచ్చరించే ప్రవక్తల అవసరం కలవారు.
Yâsin 36:7
వీరందరి కొరకు వారి వద్దకు అల్లాహ్ వద్ద నుండి ఆయన ప్రవక్త నోట సత్యం చేరి,వారు దాన్ని విశ్వసించకుండా తమ అవిశ్వాసముపైనే ఉండిపోయిన తరువాత అల్లాహ్ వద్ద నుండి శిక్ష అనివార్యమైపోయింది. కాబట్టి వారు అల్లాహ్ పై,ఆయన ప్రవక్త పై విశ్వాసమును కనబరచరు. మరియు వారు తమ వద్ద వచ్చిన సత్యము ప్రకారం ఆచరించరు.
Yâsin 36:8
ఈ విషయంలో వారి ఉపామానము వారిలా ఉన్నది ఎవరి మెడలలో బేడీలు వేయబడి వారి చేతులు వారి మెడలతోపాటు వారి గడ్డాల యొక్క సమీకరించబడిన స్థలం క్రింద వరకు కలిపి కట్టబడి ఉన్నవి. కాబట్టి వారు తమ తలలను ఆకాశము వైపునకు ఎత్తవలసి వచ్చినది. కావున వారు వాటిని క్రిందకు దించలేక పోతున్నారు. అయితే వీరందరు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచటం నుండి కట్టబడి ఉన్నారు. కనుక వారు అతనికి లొంగటం లేదు. మరియిు వారు అతని కోసం తమ తలలను క్రిందకు దించటంలేదు.
Yâsin 36:9
మరియు మేము వారి ఎదుట సత్యము నుండి ఒక అడ్డుని ఏర్పాటు చేశాము మరియు వారి వెనుక ఒక అడ్డుని ఏర్పాటు చేశాము. మరియు మేము వారి చూపులను సత్యము నుండి కప్పివేశాము. కావున వారు దానితో ప్రయోజనం చెందే విధంగా చూడలేరు. అవిశ్వాసముపై వారి మొండితనము,మొరటతనము స్పష్టమైన తరువాత ఇది వారి కొరకు సంభవించినది.
Yâsin 36:10
ఓ మొహమ్మద్ సత్యాన్ని వ్యతిరేకించే ఈ అవిశ్వాసపరులందరి వద్ద వారిని మీరు భయపెట్టినా లేదా భయపెట్టకపోయినా సమానమే. మీరు అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన దాన్ని వారు విశ్వసించరు.
Yâsin 36:11
నిశ్చయంగాఎవడైతే ఈ ఖుర్ఆన్ ను విశ్వసించి అందులో వచ్చిన వాటిని ఆచరించి, తనను ఎవరూ గమనించని వేళ ఏకాంతములో తన ప్రభువుతో భయపడుతాడో అతడే మీ హిచ్చరించటం నుండి ప్రయోజనం చెందుతాడు. కాబట్టి మీరు ఈ లక్షణములు కలవాడికి అతనికి సంతోషమును కలిగించే అల్లాహ్ అతని పాపములను తుడిచి వేయటం,వాటిని ఆయన మన్నించటం,పరలోకంలో అతని కొరకు నిరీక్షిస్తున్న గొప్ప పుణ్యం అది స్వర్గము గురించి మీరు తెలియపరచండి.
Yâsin 36:12
నిశ్ఛయంగా మేము ప్రళయదినమున లెక్క తీసుకోవటం కొరకు వారిని మరల లేపటం ద్వారా మృతులను జీవింపజేస్తాము. మరియు ఇహలోక వారి జీవితంలో వారు చేసుకున్న సత్కర్మలను,దుష్కర్మలను మేము వ్రాస్తాము. మరియు వారి కొరకు ఉండే వారు మరణించిన తరువాత మిగిలిన వారి చిహ్నము కొనసాగే దానము (సదఖే జారియ) లాంటి సత్కర్మ లేదా అవిశ్వాసం లాంటి దుష్కర్మను వ్రాస్తాము. మరియు నిశ్ఛయంగా మేము ప్రతీ దాన్ని ఒక స్పష్టమైన గ్రంధంలో వ్రాసి ఉంచాము. అది లౌహె మహ్ఫూజ్.
Yâsin 36:13
ఓ ప్రవక్తా ఈ మొండివారైన తిరస్కారులందరికి వారికి గుణపాఠమయ్యే ఒక ఉపమానమును ఇవ్వండి. అది బస్తీ వాసుల వారి వద్దకు వారి ప్రవక్తలు వచ్చినప్పటి గాధ.
Yâsin 36:14
అప్పుడు మేము వారి వద్దకు మొదట్లో వారిని అల్లాహ్ తౌహీదు వైపునకు,ఆయన ఆరాధన వైపునకు పిలవటానికి ఇద్దరు ప్రవక్తలను పంపించాము. అప్పుడు వారు ఈ ఇద్దరి ప్రవక్తలను తిరస్కరించారు. అప్పుడు మేము వారితోపాటు మూడవ ప్రవక్తను పంపించి వారికి బలం చేకూర్చాము. అప్పుడు ముగ్గురు ప్రవక్తలు బస్తీ వాసులతో ఇలా పలికారు : మేము ముగ్గరము మీ వైపునకు మిమ్మల్ని అల్లాహ్ తౌహీదు వైపునకు,ఆయన ధర్మమును అనుసరించటం వైపునకు పిలవటానికి ప్రవక్తలుగా పంపించబడ్డాము.
Yâsin 36:15
బస్తీ వాసులు ప్రవక్తలతో ఇలా పలికారు : మీరు మా లాంటి మానవులు మాత్రమే. కనుక మీ కొరకు మాపై ఎటువంటి ప్రత్యేకత లేదు. అనంత కరుణామయుడు మీపై ఎటువంటి దైవ వాణిని అవతరింపజేయలేదు. మరియు మీరు కేవలం మీ ఈ పిలవటంలో అల్లాహ్ పై అబద్దమును కల్పించుకున్నారు.
Yâsin 36:16
ముగ్గురు ప్రవక్తలు బస్తీ వాసుల తిరస్కారమును ఖండిస్తూ ఇలా పలికారు : ఓ బస్తీ వాసులారా నిశ్ఛయంగా మా ప్రభువుకు మేము మీ వైపునకు ఆయన వద్ద నుండి ప్రవక్తలుగా పంపించబడ్డామని తెలుసు. ఈ విషయంలో ఆయన మా కొరకు వాదనగా చాలు.
Yâsin 36:17
ఆయన మాకు చేరవేయమని ఆదేశించిన వాటిని స్పష్టంగా మీకు చేరవేయటం మాత్రమే మా బాధ్యత. మీకు సన్మార్గంపై తీసుకుని వచ్చే అధికారము మాకు లేదు.
Yâsin 36:18
బస్తీ వాసులు ప్రవక్తలతో ఇలా పలికారు : నిశ్ఛయంగా మేము మీతో అపశకునమును పొందాము. ఒక వేళ మీరు తౌహీద్ వైపునకు మమ్మల్ని పిలవటమును విడనాడకపోతే మరణించే వరకు మేము మిమ్మల్ని రాళ్ళతో కొట్టి శిక్షిస్తాము. మరియు మా నుండి మీకు బాధాకరమైన శిక్ష తప్పకుండా చేరుతుంది.
Yâsin 36:19
ప్రవక్తలు వారిని ఖండిస్తూ ఇలా పలికారు : అల్లాహ్ పట్ల మీ అవిశ్వాసము,ఆయన ప్రవక్తలను అనుసరించటమును మీరు వదిలివేయటం వలన మీ అపశకునం మీతోనే అంటుకుని ఉంది. ఏమి ఒక వేళ మేము అల్లాహ్ గురించి మీకు హితబోధన చేస్తే మీరు దాన్ని అపశకునంగా భావిస్తున్నారా ?. అది కాదు మీరు అవిశ్వాసము,పాపకార్యములను పాల్పడటంలో మితిమీరిపోతున్న జనులు.
Yâsin 36:20
మరియు బస్తీ నుండి దూర ప్రాంతము నుండి ఒక వ్యక్తి పరుగెడుతూ ప్రవక్తలను తిరస్కరించటం,వారిని హతమార్చటం,బాధపెట్టటం గురించి బెదిరించటంపై తన జాతి వారిపై భయపడి వచ్చాడు. అతను ఇలా పలికాడు : ఓ నా జాతి వారా మీరు ఈ ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని అనుసరించండి.
Yâsin 36:21
ఓ నా జాతి వారా మీరు తాను తీసుకుని వచ్చిన దాన్ని చేరవేయటంలో మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును కోరని వాడిని అనుసరించండి. మరియు వారు అల్లాహ్ నుండి చేరవేస్తున్న ఆయన వహీ విషయంలో సన్మార్గంపై ఉన్నారు. ఎవరైతే అలా ఉంటాడో అతడు అనుసరించబడటానికి యోగ్యుడు.
Yâsin 36:22
హితోపదేశం చేసే ఆ వ్యక్తి ఇలా పలికాడు : ఏ ఆపే వస్తువు నన్ను సృష్టించిన అల్లాహ్ ఆరాధన చేయటం నుండి నన్ను ఆపుతుంది ?. మరియు ఏ ఆపే వస్తువు మిమ్మల్ని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించటం నుండి ఆపుతుంది ?. మరణాంతరం లేపబడి ప్రతిఫలం కొరకు మీరు ఆయన ఒక్కడి వైపు మరలించబడుతారు.
Yâsin 36:23
ఏమీ నేను నన్ను సృష్టించిన అల్లాహ్ ను వదిలి అన్యాయంగా ఇతర ఆరాధ్య దైవాలను చేసుకోవాలా ?. ఒక వేళ అనంత కరుణామయుడు నాకు ఏదైన కీడు కలిగించదలిస్తే ఈ ఆరాధ్యదైవాల సిఫారసు కొంచము కూడా నాకు ఉపయోగపడదు. మరియు నాకు ఎటువంటి లాభము గాని నష్టము గాని చేసే అధికారము వారికి లేదు. మరియు ఒక వేళ నేను అవిశ్వాస స్థితిలో మరణిస్తే అల్లాహ్ నాకు కీడు కలగించదలచిన దాని నుండి వారు నన్ను రక్షించలేరు.
Yâsin 36:24
నిశ్ఛయంగా నేను అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధ్యదైవాలుగా చేసుకున్నప్పుడు నేను స్పష్టమైన తప్పిదములో ఉన్నాను ఎందుకంటే నేను ఆరాధనకు అర్హుడు కాని వాడిని ఆరాధించాను మరియు దానికి అర్హుడైన వాడి ఆరాధనను నేను వదిలివేసాను.
Yâsin 36:25
ఓ నా జాతి వారా నిశ్చయంగా నేను నా ప్రభువు,మీరందరి ప్రభవును విశ్వసించాను. అయితే మీరు నన్ను వినండి. మరియు మీరు నాకు బెదిరిస్తున్నహత్యను లెక్క చేయను. అయితే అతని జాతి వారి నుండి అతన్ను హత్య చేయటం తప్ప ఇంకేమి అవలేదు. అప్పుడు అల్లాహ్ అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేశాడు.
Yâsin 36:26
అతని అమరగతినొందిన తరువాత అతనితో గౌరవంగా ఇలా పలకబడింది : నీవు స్వర్గంలో ప్రవేశించు. అతను స్వర్గంలో ప్రవేశించి అందులో ఉన్న అనుగ్రహాలను చూసి ఆశతో ఇలా పలుకాడు : అయ్యో నన్ను తిరస్కరించి,నన్ను హతమార్చిన నా జాతి వారు నాకు కలిగిన పాపముల మన్నింపుని, నా ప్రభువు నాకు కలిగించిన గౌరవమును చూసి ఉంటే ఎంత బాగుండేది. వారూ నేను విశ్వసించినట్లు విశ్వసించేవారు. నా ప్రతిఫలం లాంటి ప్రతిఫలమును వారు పొంది ఉండేవారు.
Yâsin 36:27
అతని అమరగతినొందిన తరువాత అతనితో గౌరవంగా ఇలా పలకబడినది : నీవు స్వర్గంలో ప్రవేశించు. అతను స్వర్గంలో ప్రవేశించి అందులో ఉన్న అనుగ్రహాలను చూసి ఆశతో ఇలా పలుకాడు : అయ్యో నన్ను తిరస్కరించి,నన్ను హతమార్చిన నా జాతి వారు నాకు కలిగిన పాపముల మన్నింపుని, నా ప్రభువు నాకు కలిగించిన గౌరవమును చూసి ఉంటే ఎంత బాగుండేది. వారూ నేను విశ్వసించినట్లు విశ్వసించేవారు. నా ప్రతిఫలం లాంటి ప్రతిఫలమును వారు పొంది ఉండేవారు.
Yâsin 36:28
అతన్ని తిరస్కరించి,అతన్ని హతమార్చిన అతని జాతి వారిని నాశనం చేసే విషయంలో మేము ఆకాశము నుండి అవతరింపజేసే దైవ దూతల సైన్యం మాకు అవసరం లేదు. వారి విషయం మా వద్ద దాని కన్న ఎక్కువ సులభము. అప్పుడు నిశ్చయంగా మేము ఆకాశము నుండి శిక్ష దూతలను దించకుండా ఒక అరుపు ద్వారా వారి వినాశనమవటమును నిర్ణయించాము.
Yâsin 36:29
అతని జాతి వారి వినాశనము యొక్క గాధ ఒక్క అరుపు మాత్రమే. మేము దాన్ని వారిపై పంపించాము. తక్షణమే వారు నేలకొరిగిపోయి వారిలో నుండి ఎవరూ మిగలకుండా పోయారు. వారి ఉపమానం ఆ రగిలించబడి ఆరిపోయిన అగ్నిలా ఉన్నది. దాని ఆనుమాలు కూడా లేకుండా పోయాయి.
Yâsin 36:30
అయ్యో ప్రళయదినమున తిరస్కారులైన దాసుల అవమానము మరియు వారి విచారము. ఎందుకంటే వారు శిక్షను చూస్తారు. ఇది ఎందుకంటే ఇహలోకములో వారి వద్దకు అల్లాహ్ వద్ద నుండి ఏ ప్రవక్త వచ్చినా అతన్ని వారు హేళన చేసేవారు. అతన్ని ఎగతాళి చేసేవారు. వారు అల్లాహ్ విషయంలో నిర్లక్ష్యం చేసిన దానికి ప్రళయదినమున వారి పరిణామము అవమానమయ్యింది.
Yâsin 36:31
ఏమి ప్రవక్తలను తిరస్కరించే,హేళన చేసే వీరందరు తమ కన్న మునుపు గతించిన సమాజములలో గుణపాఠమును పొందలేదా ?. వారు మరణించారు. మరియు వారు ఇహలోకము వైపునకు ఇంకొక సారి ఎన్నటికి మరలి రారు. అంతే కాదు వారు చేసుకున్న కర్మలకు అప్పజెప్పబడ్డారు. మరియు తొందరలోనే అల్లాహ్ వాటి పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Yâsin 36:32
మరియు సమాజములన్ని ఎటువంటి మినహాయింపు లేకుండా ప్రళయదినాన మరణాంతరం వారి లేపబడిన తరువాత వారి కర్మలపరంగా మేము వారికి ప్రతిఫలం ప్రసాదించటానికి మా వద్ద హాజరుపరచబడకుండా ఉండవు.
Yâsin 36:33
మరియు మరణాంతరం లేపబడటం సత్యం అనటానికి తిరస్కారుల కొరకు మరణాంతరం లేపబడటమునకు సూచన : ఈ ఎండిన బంజరు భూమి దీనిపై మేము ఆకాశము నుండి వర్షమును కురిపించి అందులో రకరకాల మొక్కలను మొలకెత్తించాము. మరియు అందులో నుండి రకరకాల ధాన్యములను ప్రజలు వాటి నుండి తినటానికి వెలికి తీశాము. అయితే ఎవరైతే వర్షమును కురిపించి,మొక్కలను వెలికి తీసి ఈ భూమిని జీవింపజేయగలడో అతడు మృతులను జీవింపజేసి మరణాంతరం వారిని లేపటంపై సామర్ధ్యం కలవాడు.
Yâsin 36:34
మరియు మేము వర్షమును కురిపించిన ఈ భూమిలో ఖర్జూరపు,ద్రాక్ష తోటలను తయారు చేశాము. మరియు అందులో వాటిని నీటిని సమకూర్చే నీటి ఊటలను ప్రవహింపజేశాము.
Yâsin 36:35
ప్రజలు అల్లాహ్ వారిపై అనుగ్రహించిన ఈ తోటల ఫలముల నుండి తినటానికి. మరియు వారి కొరకు ఇందులో ఎటువంటి శ్రమ లేదు. ఏమీ వారు అల్లాహ్ కి అతని ఈ అనుగ్రహాలపై ఆయన ఒక్కడి ఆరాధన చేసి,ఆయన ప్రవక్తలపై విశ్వాసమును కనబరచి కృతజ్ఞతలు తెలుపుకోరా ?!.
Yâsin 36:36
రకరకాల మొక్కలను,వృక్షములను సృష్టించిన మరియు స్వయాన ప్రజల్లో నుంచి ఆడమగను సృష్టించినప్పుడు మరియు భూమిపై,సముద్రంలో,ఇతర వాటిలో ప్రజలకు తెలియని అల్లాహ్ యొక్క ఇతర సృష్టితాలను సృష్టించిన అల్లాహ్ అతీతుడు,మహోన్నతుడు.
Yâsin 36:37
మరియు మేము పగలును తొలగించి,రాత్రిని దాని నుండి పగలును మేము తొలగించి తీసుకుని వచ్చి వెలుగును తొలగించటంలో ఆల్లాహ్ తౌహీద్ పై ప్రజలకు సూచన కలదు. మరియు మేము పగలు వెళ్ళిపోయిన తరువాత చీకటిని తీసుకుని వస్తాము. అప్పుడు ప్రజలు చీకటిలో ప్రవేశిస్తారు.
Yâsin 36:38
మరియు నిర్ణీత కాలములో పయనిస్తున్న ఈ సూర్యుడు అల్లాహ్ ఏకత్వమునకు వారి కొరకు ఒక సూచన. దాని పరిమాణం అల్లాహ్ కు తెలుసు అతడు (సూర్యుడు) దాన్ని అతిక్రమించడు. ఈ నిర్ధారించిన విధానం ఎవరు ఆధిక్యతను కనబరచని సర్వశక్తిమంతుడి, తన సృష్టితాల వ్యవహారముల్లోంచి తనపై ఏదీ గోప్యంగా లేని సర్వజ్ఞుడి నిర్ధారించిన విధానం.
Yâsin 36:39
మరియు వారి కొరకు పరిశుద్ధుడైన ఆయన ఏకత్వముపై సూచించే ఒక సూచన మేము ప్రతీ రాత్రి దశలను నియమించిన ఈ చంద్రుడు. అది చిన్నదిగా మొదలై ఆ తరువాత పెద్దదవుతుంది ఆ తరువాత చిన్నదిగా మారి చివరికి అది ఖర్జూరపు చెట్టు యొక్క ఆ రెమ్మ మాదిరిగా అయిపోతుంది ఏదైతే ఒంకరుగా ఉన్నది,తన సన్నదనములో,తన వంకరుతనంలో,తన పసుపుతనంలో,తన పాత అవటంలో చెరిపిపోయేలా ఉన్నది.
Yâsin 36:40
మరియు సూర్య,చంద్రుల,రాత్రి,పగలుల సూచనలు అల్లాహ్ విధివ్రాతతో నిర్ధారించబడి ఉన్నవి. అయితే అవి తమ నిర్ధారిత వాటి నుండి అతిక్రమించవు. కాబట్టి సూర్యుడికి చంద్రుడిని దాని పయన మార్గమును మార్చి లేదా దాని కాంతిని తొలగించి కలవటం సాధ్యం కాదు. మరియు రాత్రికి పగటిలో దాని సమయం పూర్తవక మనుపు ప్రవేశించటం సాధ్యం కాదు. మరియు ఈ ఉపయుక్తంగా చేయబడిన సృష్టితాలు,వేరే అయిన నక్షత్రాలు,ఉల్కలు వాటి కొరకు ప్రత్యేకించబడిన వాటి పయన మార్గాలు ఉన్నవి. వాటిని అల్లాహ్ నియమించి ఉన్నాడు,వాటిని పరిరక్షిస్తున్నాడు.
Yâsin 36:41
మరియు ఇదేవిధంగా మేము నూహ్ కాలములో ఆదమ్ సంతతిలో నుండి తుఫాను నుండి ముక్తి పొందిన వారిని అల్లాహ్ యొక్క సృష్టితాలతో నిండిన నావలో ఎక్కించటం వారి కొరకు అల్లాహ్ ఏకత్వము పై ఒక సూచన మరియు ఆయన దాసులపై ఆయన అనుగ్రహము. అల్లాహ్ అందులో ప్రతీ రకము నుండి రెండింటిని ఎక్కించాడు.
Yâsin 36:42
మేము నూహ్ నావ లాంటి సవారీలను వారి కొరకు సృష్టించటం అల్లాహ్ తౌహీద్ పై వారి కొరకు ఒక సూచన మరియు ఆయన దాసులపై ఆయన అనుగ్రహము.
Yâsin 36:43
మరియు ఒక వేళ మేము వారిని ముంచివేయదలచితే వారిని ముంచివేస్తాము. అప్పుడు వారికి సహాయం చేయటానికి ఏ సహాయకుడు ఉండడు ఒక వేళ మేము వారిని ముంచదలిస్తే. మా ఆదేశముతో,మా తీర్పుతో వారు మునిగినప్పుడు వారిని రక్షించటానికి రక్షకుడెవడూ ఉండడు.
Yâsin 36:44
వారు అదిగమించని ఒక నిర్ణీత కాలం వరకు వారు ప్రయోజనం చెందటం కొరకు మునగటం నుండి వారిని రక్షించి,వారిని మరలించి వారిపై మేము కరుణిస్తే తప్ప. బహుశా వారు గుణపాఠం నేర్చుకుని విశ్వసిస్తారేమో.
Yâsin 36:45
మరియు విశ్వాసము నుండి విముఖత చూపే ముష్రికులందరితో ఇలా పలకబడినప్పుడు : మీరు ఎదుర్కోబోతున్న పరలోక విషయం, దాని ప్రతికూలత విషయంలో జాగ్రత్తపడండి. మరియు వెనుకకు మళ్ళిపోయే ఇహలోకముతో అల్లాహ్ మీపై తన కారుణ్యముతో ఉపకారము చేస్తాడని ఆశిస్తూ జాగ్రత్తపడండి. వారు దానికి కట్టుబడి ఉండలేదు. అంతే కాదు వారు దాన్ని లెక్క చేయకుండా దాని నుండి విముఖత చూపారు.
Yâsin 36:46
మరియు ఎప్పుడైన మొండిగా వ్యవహరించే ఈ ముష్రికులందరి వద్దకు అల్లాహ్ ఏకత్వమును,ఆరాధనకు ఆయన ఒక్కడే యోగ్యుడవటమునకు సూచించే అల్లాహ్ ఆయతులు వస్తే వారు వాటితో గుణపాఠమును నేర్చుకోకుండా వాటి నుండి విముఖత చూపేవారు.
Yâsin 36:47
మరియు మొండిగా వ్యవహరించే వారితో మీరు పేదవారికి,అగత్యపరులకు అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుండి ఇచ్చి సహాయం చేయండి అని అనబడినప్పుడు వారు విశ్వసించిన వారితో తిరస్కరిస్తూ ఇలా పలుకుతూ వాపసు చేస్తారు : అల్లాహ్ ఎవరికైతే తినిపించదలచుకుంటే అతనికి తినిపిస్తాడో వాడిని మేము తివిపించాలా ?! కావున మేము ఆయన ఇచ్చకు విరుద్ధంగా చేయము. ఓ విశ్వాసపరులారా మీరు మాత్రం స్పష్టమైన తప్పిదములో,సత్యము నుండి దూరంగా ఉన్నారు.
Yâsin 36:48
మరియు మరణాంతరం లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులు దాన్ని తిరస్కరిస్తూ,దాన్ని దూరంగా భావిస్తూ ఇలా పలికేవారు : ఓ విశ్వాసపరులారా ఈ మరణాంతరం లేపబడటం ఒక వేళ మీరు అది వాటిల్లుతుంది అన్న మీ వాదనలో సత్యవంతులేనైతే ఎప్పుడో చెప్పండి ?!
Yâsin 36:49
మరణాంతరము లేపబడటమును తిరస్కరించే,దాన్ని దూరంగా భావించే వీరందరు మాత్రం బాకాలో ఊదినప్పటి మొదటి ఊదటమునకు నిరీక్షిస్తున్నారు. వారు తమ ప్రాపంచిక కార్యాలైన క్రయ విక్రయలు,(తోటలకు) నీళ్ళను పెట్టటం,(జంతువులను) మేపటం ఇతర ప్రాపంచిక కార్యాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు అది వారిని అకస్మాత్తుగా పట్టుకుంటుంది.
Yâsin 36:50
ఈ అరుపు వారిపై అకస్మాత్తుగా వచ్చినప్పుడు వారు ఒకరినొకరు వీలునామ వ్రాసుకోలేక పోతారు. మరియు వారు తమ ఇండ్లకు,తమ ఇంటివారి వద్దకు మరలి వెళ్ళలేకపోతారు. అంతేకాదు వారు తమ ఈ కార్యాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు మరణిస్తారు.
Yâsin 36:51
మరియు మరణాంతరం లేపటం కొరకు రెండవసారి బాకా ఊదినప్పుడు వారందరు తమ సమాధుల నుండి లెక్కతీసుకొనబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు తమ ప్రభువు వైపునకు వేగముగా వెలికి వస్తారు.
Yâsin 36:52
మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఈ అవిశ్వాసపరులందరు అవమానపడుతూ ఇలా అంటారు: అయ్యో మా దౌర్భాగ్యము మా సమాధుల నుండి మమ్మల్ని ఎవరు మరల లేపాడు ?!. వారి ప్రశ్న గురించి వారు ఇలా సమాధానమివ్వబడుతారు : అల్లాహ్ వాగ్దానం చేసినది ఇదే నిశ్చయంగా అది ఖచ్చితంగా జరిగినది. మరియు దైవ ప్రవక్తలు తమ ప్రభువు వద్ద నుండి చేరవేసిన దీని విషయంలో నిజం పలికారు.
Yâsin 36:53
సమాధుల నుండి మరణాంతరం లేపబడే విషయం కేవలం బాకాలో రెండవసారి ఊదటం యొక్క ప్రభావము మాత్రమే. అంతే సృష్టితాలన్ని ప్రళయదినాన లెక్కతీసుకొనబడటం కొరకు మా వద్ద హాజరు చేయబడుతారు.
Yâsin 36:54
ఆ రోజు తీర్పు న్యాయముతో జరుగును. ఓ దాసులారా మీ పాపములను అధికం చేసి లేదా మీ పుణ్యాలను తగ్గించి మీకు కొంచెము కూడా అన్యాయం చేయబడదు. ఇహలోకములో మీరు చేసుకున్న కర్మలకు మీరు పూర్తిగా ప్రతిఫలము మాత్రమే ప్రసాదించబడుతారు.
Yâsin 36:55
నిశ్చయంగా స్వర్గవాసులు శాశ్వత అనుగ్రహాలను, గొప్ప సాఫల్యమును చూసినప్పుడు ప్రళయదినాన తమ ఇతర విషయాల గురించి నిశ్ఛింతగా ఉంటారు. వారు వాటిలో సుఖభోగాలను అనుభవిస్తూ సంతోషముగా ఉంటారు.
Yâsin 36:56
వారు మరియు వారి సతీమణులు స్వర్గము యొక్క విశాలమైన నీడల క్రింద ఆసనాలపై కూర్చుని ఆస్వాదిస్తుంటారు.
Yâsin 36:57
వారి కొరకు ఈ స్వర్గములో ద్రాక్ష,అంజూరము,దానిమ్మ లాంటి రకరకాల శ్రేష్టమైన ఫలములు ఉంటాయి. మరియు వారి కొరకు వారు కోరుకునే ప్రతీది ఇష్టపడే ప్రదేశముల్లోంచి,రకరకాల అనుగ్రహాల్లోంచి కలవు. వాటిలో నుంచి వారు ఏది కోరుకున్న అది లభిస్తుంది.
Yâsin 36:58
మరియు వారి కొరకు ఈ అనుగ్రహాలపై సలాం వారికి కరుణామయుడైన తమ ప్రభువు వద్జ నుండి వారిపై మాటగా లభించును. ఎప్పుడైతే ఆయన వారికి సలాం చేస్తాడో ప్రతీ వైపు నుండి వారికి శాంతి కలుగును. మరియు వారికి అభినందన కలుగును దాని కన్న గొప్ప అభినందన ఏదీ ఉండదు.
Yâsin 36:59
మరియు ప్రళయదినాన ముష్రికులతో ఇలా పలుకబడును : మీరు విశ్వాసపరుల నుండి వేరైపోండి. వారు మీతో పాటు కావటం వారికి తగదు. మీ ప్రతిఫలాలను వారి ప్రతిఫలాలతో మరియు మీ లక్షణాలను వారి లక్షణాలతో విబేధించటానికి.
Yâsin 36:60
ఏమీ నేను మీకు నా ప్రవక్తల నోటితో మీకు ఆజ్ఞాపించి,ఆదేశించి మీతో ఇలా పలకలేదా : ఓ ఆదం సంతతివారా మీరు అన్ని రకాల అవిశ్వాస,పాప కార్యాలకు పాల్పడి షైతాను మాట వినకండి. నిశ్చయంగా షైతాను మీకు స్పష్టమైన శతృవు. తన శతృత్వమును బహిర్గతము చేసే శతృవుకు విధేయత చూపటం బుద్దిమంతుడికి ఎలా తగదు.
Yâsin 36:61
ఓ ఆదం సంతతివారా నేను నా ఒక్కడి ఆరాధన చేయమని,నాతోపాటు ఎవరినీ సాటి కల్పించవద్దని మిమ్మల్ని ఆదేశించాను. నా ఒక్కడి ఆరాధన చేయటం,నాకు విధేయత చూపటం నా మన్నతకు,స్వర్గ ప్రవేశమునకు దారి తీసే తిన్నని మార్గము. కాని దేని గురించైతే నేను మీకు బోధించానో మరియు ఆదేశించానో వాటిని మీరు పాటించలేదు.
Yâsin 36:62
మరియు నిశ్చయంగా షైతాను మీలో నుండి చాలా మంది సృష్టితాలను అపమార్గమునకు లోను చేశాడు. ఏ మీకు మీ ప్రభువుకు విధేయత చూపమని,పరిశుద్ధుడైన ఆయన ఒక్కడి ఆరాధన చేయమని ఆదేశించే, మీకు స్పష్టమైన శతృవైన షైతాను విధేయత నుండి భయపెట్టే బుద్దులు లేవా ?!
Yâsin 36:63
ఇది అదే నరకము దేని గురించైతే ఇహలోకములో మీ అవిశ్వాసం మూలంగా మీతో వాగ్దానం చేయబడిందో. మరియు అది మీ నుండి అదృశ్యంగా ఉండేది. మరియు మీరు ఈ రోజు దాన్ని కళ్ళారా ప్రత్యక్షంగా చూస్తున్నారు.
Yâsin 36:64
మీరు ఈ రోజు అందులో ప్రవేశించండి. మరియు ప్రాపంచిక మీ జీవితంలో అల్లాహ్ పట్ల మీరు కనబరచిన మీ అవిశ్వాసం మూలంగా దాని వేడితో బాధను అనుభవించండి.
Yâsin 36:65
ఆ రోజు మేము వారి నోళ్ళపై ముద్ర వేస్తాము అప్పుడు వారు మూగవారై తాము పాల్పడిన అవిశ్వాసము,పాపాలను తిరస్కరించటం గురించి మాట్లాడరు. మరియు వారి చేతులు వాటితో ఇహలోకంలో చేసిన వాటి గురించి మాతో మాట్లాడుతాయి. మరియు వారి కాళ్ళు వారు పాల్పడే పాపాల గురించి,వాటి వద్ద నడిచి వెళ్ళిన దాన్ని గురించి సాక్ష్యం పలుకుతాయి.
Yâsin 36:66
మరియు ఒక వేళ మేము వారి కళ్ళను పోగొట్టదలచితే వాటిని పోగొట్టుతాము. అప్పుడు వారు చూడలేరు. అప్పుడు వారు దారి వైపునకు దాని ద్వారా దాటి స్వర్గము వైపునకు వెళ్లటానికి పరుగెత్తుతారు. వారు దాటటం అసాధ్యం . వాస్తవానికి వారి చూపు పోయినది.
Yâsin 36:67
మరియు ఒక వేళ మేము వారి సృష్టిని మార్చటమును,వారిని వారి కాళ్ళపై కూర్చోపెట్టటమును కోరుకుంటే మేము వారి సృష్టిని మార్చేవారము, వారిని వారి కాళ్ళ పై కూర్చోపెట్టేవారము. అప్పుడు వారు తమ స్థానమును విడిచిపెట్టలేరు. మరియు వారు ముందుకు వెళ్ళటంగాని వెనుకకు మరలటం గాని చేయలేరు.
Yâsin 36:68
మరియు మేము ప్రజల్లోంచి ఎవరి ఆయుషును పొడిగించి అతని జీవితమును పొడిగిస్తామో అతన్ని మేము బలహీన దశకు మరలుస్తాము. ఏమీ వారు తమ బుద్ధులతో ఆలోచన చేసి ఈ నివాసము స్థిరమైన,శాశ్వతమైన నివాసము కాదని, స్థిరమైన నివాసము అది పరలోక నివాసమని గుర్తించటంలేదా.
Yâsin 36:69
మరియు అతను కవి అన్న వాదన మీ కొరకు నిజం అవ్వటానికి మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమునకు కవిత్వమును నేర్పలేదు. మరియు ఆయనకు అది తగదు ఎందుకంటే అది ఆయన స్వభావము నుంచి కాదు. మరియు అతని స్వభావమునకు అది తగదు. ఆయనకు మేము కేవలం హితోపదేశమును,స్పష్టమైన ఖుర్ఆన్ ను దానిలో యోచన చేసే వారి కొరకు నేర్పించాము.
Yâsin 36:70
ఆయన బ్రతికి ఉన్న హృదయం కలవాడికి,జ్ఞానోదయం ఉన్నవాడికి హెచ్చరించటానికి. అతడే దానితో ప్రయోజనం చెందుతాడు. మరియు అవిశ్వాసపరులపై శిక్ష నిరూపితమవుతుంది. అప్పుడు దాని అవతరణ గురించి, అతని సందేశము వారికి చేరవేయటం గురించి వారిపై వాదన నిరూపితమైనది. వారు వంక పెట్టటానికి ఎటువంటి వంక వారి కొరకు మిగల్లేదు.
Yâsin 36:71
ఏమీ మేము వారి కొరకు పశువులను సృష్టించినది వారు చూడలేదా ?. వారు ఈ పశువులకు యజమానులు. వారు తమ ప్రయోజనాలకు తగిన విధంగా వాటిని ఉపయోగించుకుంటారు.
Yâsin 36:72
మరియు మేము వాటిని వారి ఆదీనంలో చేశాము మరియు వాటిని వారికి కట్టుబడి ఉండేటట్లుగా చేశాము. వాటిలో నుండి కొన్నింటి వీపులపై వారు సవారీ చేస్తున్నారు మరియు తమ బరువులను మోయిస్తున్నారు. మరియు వాటిలో నుండి కొన్నింటి మాంసమును వారు తింటున్నారు.
Yâsin 36:73
మరియు వారి కొరకు వాటి వీపులపై సవారీ చేయటం,వాటి మాంసములను తినటమే కాకుండా వాటి ఉన్ని,వాటి జుట్టు,వాటి వెంట్రుకలు,వాటి ధరలు లాంటి ప్రయోజనాలు కలవు. వాటి నుండి వారు దుప్పట్లను,వస్త్రాలను తయారుచేస్తున్నారు. మరియు వారి కొరకు వాటిలో పానియములు కలవు అప్పుడే వారు వాటి పాలును త్రాగుతున్నారు. ఏమీ వారు తమపై ఈ అనుగ్రహాలను,ఇతరవాటిని అనుగ్రహించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోరా ?.
Yâsin 36:74
ముష్రికులు అల్లాహ్ ను వదిలి కొన్ని ఆరాధ్య దైవములను తయారు చేసుకున్నారు. అవి తమకు సహాయం చేస్తాయని,తమకు అల్లాహ్ శిక్ష నుండి రక్షిస్తాయని ఆశిస్తూ వారు వాటిని ఆరాధిస్తున్నారు.
Yâsin 36:75
వారు తయారు చేసుకున్న ఈ ఆరాధ్య దైవాలకు తమ స్వయానికి సహాయం చేసుకునే శక్తి లేదు. మరియు అల్లాహ్ ను వదిలి వాటిని ఆరాధించేవారికి సహాయం చేసే శక్తి లేదు. మరియు వారు,వారి విగ్రహాలు అందరు శిక్షలో హాజరుపరచబడుతారు. వారిలో నుండి ప్రతి ఒక్కడు ఇంకొకడి నుండి విసుగుని చూపుతాడు.
Yâsin 36:76
ఓ ప్రవక్తా మీరు ప్రవక్తగా పంపించబడలేదన్న లేదా మీరు కవి అన్న వారి మాట మీకు బాధ కలిగించకూడదు. మరియు ఇతర వారి అపనిందలు. నిశ్చయంగా వారు వాటిలో నుండి దాచుతున్నవి,బహిర్గతం చేస్తున్నవి మాకు తెలుసు. వాటిలో నుండి ఏదీ మాపై గోప్యంగా ఉండవు. తొందరలోనే మేము వాటి పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
Yâsin 36:77
ఏమీ మరణాంతరం లేపబడే ఈ మనిషి యోచన చేయటంలేదా ? మేము అతడిని వీర్యముతో సృష్టించాము,ఆ తరువాత అతడు పుట్టి,పెరిగే వరకు వివిధ దశల నుండి పయనిస్తాడు ఆ తరువాత అతడు అధికముగా వాదించే వాడిగా,తగువులాడే వాడిగా అయిపోయాడు. ఏమీ అతడు మరణాంతరం లేపబడటము వాటిల్లిటములో ఆధారం చూపటానికి వీటిని చూడటంలేదా ?.
Yâsin 36:78
ఈ అవిశ్వాసి మరణాంతరం లేపబడటము అసాధ్యము అని తెలపటంపై కృశించిపోయిన ఎముకల ద్వారా ఆధారమును చూపినప్పుడు పరధ్యానంలో పడిపోయాడు,అజ్ఞానుడైపోయాడు మరియు ఇలా పలికాడు : వాటిని ఎవరు మరలింపజేస్తాడు ?. వాస్తవానికి దాని నుండి దాని సృష్టి అదృశ్యంగా ఉన్నది అది ఉనికిలో లేనిది.
Yâsin 36:79
ఓ ప్రవక్తా అతనికి మీరు సమాధానమిస్తూ ఇలా పలకండి : ఈ కృశించిపోయిన ఎముకలను వాటిని మొదటిసారి సృష్టించినవాడే జీవింపజేస్తాడు. కాబట్టి వాటిని మొదటిసారి సృష్టించిన వాడు వాటి వైపునకు జీవితమును మరల్చటం నుండి అశక్తుడవడు. మరియు పరిశుద్ధుడైన ఆయనకు ప్రతీ దాన్ని సృష్టించే జ్ఞానం కలదు. ఆయనపై దాని నుండి ఏది గోప్యంగా ఉండదు.
Yâsin 36:80
ఓ ప్రజలారా ఆయనే మీ కొరకు పచ్చటి తడి చెట్ల నుండి అగ్నిని సృష్టించాడు మీరు దానిని దాని నుండి వెలికి తీస్తున్నారు. మీరు దాని నుండి మంటను వెలిగించుకుంటున్నారు. అయితే ఎవరైతే రెండు విభిన్నమైన వాటి మధ్య అంటే పచ్చటి చెట్టు నీటి తడికి,అందులో మండే మంటకు మధ్య సమీకరించాడో అతడే మృతులను జీవింపజేయటంపై సామర్ధ్యం కలవాడు.
Yâsin 36:81
ఏమీ ఆకాశములను,భూమిని వాటిలో ఉన్నవి పెద్దవైనా కూడా సృష్టించిన వాడికి మృతులను వారికి మరణమును కలిగించిన తరువాత జీవింపజేసే సామర్ధ్యం లేనివాడా ?. ఎందుకు కాదు అతనికి దాని సామర్ధ్యం కలదు. మరియు ఆయన సృష్టితాలన్నింటిని సృష్టించిన అధిక సృష్టికర్త. వాటి గురించి బాగా తెలిసినవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Yâsin 36:82
కేవలం అల్లాహ్ ఆదేశం,పరిశుద్ధుడైన ఆయన వ్యవహారం ఎలా ఉండిద్దంటే ఆయన ఏదైన చేయదలచుకుంటే దాన్ని ఇలా అంటాడు : "నీవు అయిపో" అప్పుడు తాను కోరుకున్నది అయిపోతుంది. జీవింపజేయటం,మరణింపజేయటం,మరణాంతరం లేపటం మొదలగునవి ఆయన కోరుకునే వాటిలోంచివే.
Yâsin 36:83
ముష్రికులు అల్లాహ్ కు అంటగడుతున్న నిస్సహాయత నుండి ఆయన పరిశుద్ధుడు,అతీతుడు. ఆయనే అన్ని వస్తువుల అధికారము కలవాడు వాటిలో తాను తలచుకున్న విధంగా నడిపిస్తాడు. మరియు ఆయన చేతిలోనే ప్రతీ వస్తువు యొక్క తాళములు కలవు. పరలోకములో మీరు ఆయన ఒక్కడివైపే మరలింపబడుతారు. అప్పుడు ఆయన మీ కర్మల పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Saffat 37:1
నేను తమ ఆరాధన చేయటంలో వరసగా బారులుతీరి నిలబడిన దైవదూతలపై ప్రమాణం చేస్తున్నాను.
Saffat 37:2
మరియు మేఘములను సమీకరించి తెచ్చి వాటిని అల్లాహ్ కురిపించదలచిన చోట నడిపించే దైవదూతలపై నేను ప్రమాణం చేస్తున్నాను.
Saffat 37:3
మరియు నేను అల్లాహ్ వాక్కును పఠించే దైవదూతలపై ప్రమాణం చేస్తున్నాను.
Saffat 37:4
ఓ ప్రజలారా నిశ్ఛయంగా మీ సత్య ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనకు ఎవరూ సాటిలేరు. ఆయనే అల్లాహ్.
Saffat 37:5
ఆకాశములకు ప్రభువు మరియు భూమికి ప్రభువు మరియు ఆ రెండింటి మధ్య ఉన్నవాటికి ప్రభువు మరియు సంవత్సరమంతా తన ఉదయించే స్థలములలో,తన అస్తమించే స్థలములలో ఉన్న సూర్యుడి ప్రభువు.
Saffat 37:6
నిశ్ఛయంగా మేము భూమికి దగ్గరలో ఉన్న ఆకాశములను అందమైన అలంకరణతో అందంగా ముస్తాబు చేశాము అవి చూడటానికి మిణుకు మిణుకుమని మెరిసే వజ్రవైఢూర్యాల్లాంటి నక్షత్రములు.
Saffat 37:7
మరియు మేము భూమికి సమీపంలో ఉన్న ఆకాశమును విధేయత నుండి వైదొలగిన తలబిరుసైన ప్రతీ షైతాను నుండి నక్షత్రముల ద్వారా భద్రపరిచాము. అవి అతనిపై విసరబడుతాయి.
Saffat 37:8
ఈ షైతానులందరికి దైవదూతలు ఆకాశములో తమ ప్రభువు దివ్యవాణి ద్వారా తన ధర్మ విషయాలను,తన తఖ్దీర్ విషయాలను తెలియపరచిన వాటి గురించి చర్చించుకుంటున్నప్పుడు వినలేరు. ప్రతీ వైపు నుండి వారిపై అగ్ని జ్వాలలు విసిరివేయబడుతాయి.
Saffat 37:9
వారిని (షైతానులను) ధూత్కరించటానికి మరియు వారిని (దైవదూతలను) వినటం నుండి దూరంగా ఉంచటానికి. మరియు వారి కొరకు పరలోకంలో బాధను కలిగించే శాశ్వతమైన అంతము కాని శిక్ష కలదు.
Saffat 37:10
కాని షైతానుల్లోంచి ఎవరైన ఎగరేసుకునిపోతే - అది దైవదూతలు సంప్రదించుకునే మాటల్లోంచి మాట అయి ఉంటుంది. అది వారి మధ్య చక్కరులు కొట్టేదై ఉంటుంది,దాని గురించి జ్ఞానం లోకవాసులకు చేరి ఉండదు - అప్పుడు కాంతివంతమైన అగ్ని జ్వాల అతడిని వెంబడించి కాల్చివేస్తుంది. ఒక్కొక్క సారి అగ్ని జ్వాల అతడిని కాల్చక ముందే ఆ మాటను అతడు తన సోదరుల వద్దకు చేరవేస్తాడు అప్పుడు అది జ్యోతిష్యులకు చేరుతుంది. అప్పుడు వారు దానితో పాటు వంద అబద్దాలను కలిపి చెబుతారు.
Saffat 37:11
ఓ ముహమ్మద్ మరణాంతరం లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులతో అడగండి : ఏమీ వారు మేము సృష్టించిన ఆకాశములు,భూమి,దైవదూతల కన్న సృష్టిపరంగా బలమైన వారా,అవయవాలపరంగా పెద్ద వారా ?. నిశ్ఛయంగా మేము వారిని జిగట మట్టితో సృష్టించాము. అటువంటప్పుడు వారు ఎలా మరణాంతరం లేపబడటమును తిరస్కరిస్తున్నారు. వాస్తవానికి వారు స్వయంగా బలహీన సృష్టి నుండి సృష్టించబడిన వారు. అది జిగట మట్టి ?.
Saffat 37:12
ఓ ముహమ్మద్ వాస్తవానికి మీరు అల్లాహ్ సామర్ధ్యము నుండి,ఆయన సృష్టి వ్యవహారాల విషయంలో ఆయన పర్యాలోచన నుండి ఆశ్చర్యపోయారు. మరియు మీరు ముష్రికుల మరణాంతరం లేపబడటమును తిరస్కరించటం నుండి ఆశ్ఛర్యపోయారు. మరియు ఈ ముష్రికులందరు మరణాంతరము లేపబడటము పట్ల తమ తిరస్కారము యొక్క తీవ్రత వలన మీరు ఆయన విషయము గురించి చెబుతున్న వాటి నుండి ఎగతాళి చేస్తున్నారు.
Saffat 37:13
మరియు ఈ ముష్రికులందరు హితబోధనల్లోంచి ఏదైన హితబోధన ద్వారా హితబోధన చేయబడితే వారు తమకు ఉన్న హృదయాల కఠినత్వం వలన దానితో హితబోధనను గ్రహించరు,ప్రయోజనం చెందరు.
Saffat 37:14
మరియు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచనల్లోంచి ఆయన నిజాయితీపై సూచించే ఏదైన సూచనను చూసినప్పుడు హేళన చేయటంలో,దాని నుండి ఆశ్ఛర్యమును చూపటంలో అధికం చేసేవారు.
Saffat 37:15
మరియు ఇలా పలికారు : ఓ ముహమ్మద్ నీవు తీసుకుని వచ్చినది కేవలం స్పష్టమైన మంత్రజాలము మాత్రమే.
Saffat 37:16
అయితే మేము మరణించి మట్టిగా,కృశించిపోయి ముక్కలుగా అయిన ఎముకలుగా మారిపోయినప్పుడు ఏమీ మేము దాని తరువాత జీవింపజేయబడి మరల లేపబడతామా ?. నిశ్ఛయంగా ఇది చాలా దూరమైన విషయం.
Saffat 37:17
ఏమిటీ మా కన్న మునుపు చనిపోయిన పూర్వ మా తాతముత్తాతలు మరల లేపబడుతారా ?.
Saffat 37:18
ఓ ముహమ్మద్ వారికి సమాధానమిస్తూ ఇలా పలకండి : అవును మీరు మట్టిగా,కృశించిపోయిన ఎముకలుగా మారిపోయిన తరువాత మరల లేపబడుతారు మరియు మీ పూర్వ తాతముత్తాతలూ మరల లేపబడుతారు. మీరందరు అధములై,నీచులై లేపబడుతారు.
Saffat 37:19
అది బాకాలో కేవలం ఒకేే ఒక ఊదటం (రెండవ బాకా) మాత్రమే అప్పుడు వారందరు ప్రళయదిన భయానక స్థితులను చూసి అల్లాహ్ తమకు ఏమి చేస్తున్నాడో అని ఎదురుచూస్తుంటారు.
Saffat 37:20
మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ముష్రికులు ఇలా పలుకుతారు : అయ్యో మా పాడుగాను ఇది ఆ ప్రతిఫలదినము దేనిలోనైతే అల్లాహ్ తన దాసులకు వారు తమ ఇహలోక జీవితములో చేసుకున్న కర్మలకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడో.
Saffat 37:21
అప్పుడు వారితో ఇలా పలకబడుతుంది : ఇది దాసుల మధ్య తీర్పునిచ్చే ఆ దినము దేనిగురించైతే మీరు ఇహలోకంలో నిరాకరించేవారో,తిరస్కరించేవారో.
Saffat 37:22
మరియు ఆ రోజు దైవదూతలతో ఇలా పలకబడుతుంది : తమ షిర్కు వలన దుర్మార్గమునకు పాల్పడిన ముష్రికులను,షిర్కు లో వారిని పోలిన వారిని,తిరస్కారములో వారితో పాటు నడిచేవారిని, అల్లాహ్ ను వదిలి వారు ఆరాధించే విగ్రహాలను మీరు సమీకరించండి. మరియు వారికి మీరు నరకమునకు దారి చూపించండి,వారిని దానిపై మార్గదర్శకం చేసి వారిని దాని వైపునకు తీసుకునిపోండి. నిశ్చయంగా అది వారి గమ్యస్థానము.
Saffat 37:23
మరియు ఆ రోజు దైవదూతలతో ఇలా పలకబడుతుంది : తమ షిర్కు వలన దుర్మార్గమునకు పాల్పడిన ముష్రికులను,షిర్కు లో వారిని పోలిన వారిని,తిరస్కారములో వారితో పాటు నడిచేవారిని, అల్లాహ్ ను వదిలి వారు ఆరాధించే విగ్రహాలను మీరు సమీకరించండి. మరియు వారికి మీరు నరకమునకు దారి చూపించండి,వారిని దానిపై మార్గదర్శకం చేసి వారిని దాని వైపునకు తీసుకునిపోండి. నిశ్ఛయంగా అది వారి గమ్యస్థానము.
Saffat 37:24
వారిని నరకాగ్నిలో ప్రవేశపెట్టక మునుపు లెక్క తీసుకోవటం కొరకు ఆపండి. అప్పుడు వారు ప్రశ్నించబడుతారు. ఆ పిదప వారిని నరకాగ్ని వైపునకు తీసుకునిరండి.
Saffat 37:25
వారిని మందలిస్తూ వారితో ఇలా పలకబడుతుంది : మీకేమయింది మీరు ఇహలోకములో ఎలాగైతే ఒకరినొకరు సహాయపడేవారో,మీ విగ్రహాలు మీకు సహాయం చేస్తారని ఆరోపించేవారో అలా ఒకరినొకరు ఎందుకు సహాయం చేసుకోవటం లేదు.
Saffat 37:26
కాని వారు ఆ రోజు అల్లాహ్ ఆదేశమునకు కట్టుబడినవారై,లోబడినవారై ఉంటారు. తమ అశక్తి వలన,తమ నిస్సహాయత వలన ఒకరినొకరు సహాయం చేసుకోరు.
Saffat 37:27
మరియు వారు ఒకరినొకరు దూషించుకుంటూ,వాదులాడుతూ ముందుకు వస్తారు. అప్పుడు దూషణ,వాదులాట వారికి ప్రయోజనం కలిగించదు.
Saffat 37:28
అనుసరించేవారు అనుసరించబడేవారితో ఇలా పలుకుతారు : ఓ మా పెద్దలారా నిశ్ఛయంగా మీరు ధర్మం,సత్యం వైపు నుండి మా వద్దకు వచ్చి మా కొరకు అవిశ్వాసమును, అల్లాహ్ తో సాటి కల్పించటంను,పాపకార్యములకు పాల్పడటంను అలంకరించి చూపించారు. మరియు ప్రవక్తలు అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన సత్యము నుండి మమ్మల్ని మీరు ధ్వేషమును కలిగించారు.
Saffat 37:29
అనుసరించబడేవారు అనుసరించేవారితో ఇలా పలుకుతారు : విషయం మీరు వాదించినట్లు కాదు. కానీ మీరు అవిశ్వాసంపై ఉన్నారు. మీరు విశ్వాసపరులు కారు. అంతేకాక మీరు తిరస్కరించేవారు.
Saffat 37:30
ఓ అనుసరించేవారా మేము మిమ్మల్ని అవిశ్వాసంలో,షిర్కులో,పాపములను పాల్పడటంలో పడవేయటానికి అణచివేత లేదా ఆధిపత్యం ద్వారా మాకు మీపై ఎలాంటి అధికారం లేదు. అంతే కాదు మీరు అవిశ్వాసంలో,మార్గభ్రష్టతలో మితిమీరిపోయే జనులు.
Saffat 37:31
కావున మాపై మీపై అల్లాహ్ బెదిరింపు ఈ ఆయతులో అనివార్యమయింది : {لأَمْلأَنَّ جَهَنَّمَ مِنْكَ وَمِمَّنْ تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ} "నీతోను,నిన్ను అనుసరించే వారందరితోనూ నేను నరకాన్ని నింపుతాను". ఆపై నిశ్చయంగా మేము మా ప్రభువు బెదిరించిన దాని రుచి ఖచ్చితంగా చూస్తాము.
Saffat 37:32
కావున మేము మిమ్మల్ని మార్గభ్రష్టత వైపునకు,అవిశ్వాసము వైపునకు పిలిచాము. నిశ్ఛయంగా మేము కూడా సన్మార్గము నుండి తప్పిపోయి ఉన్నాము.
Saffat 37:33
నిశ్ఛయంగా అప్పుడు అనుసరించేవారు,అనుసరించబడినవారు ప్రళయదినమున శిక్షలో భాగస్వాములవుతారు.
Saffat 37:34
నిశ్ఛయంగా మేము ఏవిధంగానైతే వీరందరికి శిక్ష రుచి చూపించామో అలాగే ఇతర అపరాధులతో వ్యవహరిస్తాము.
Saffat 37:35
నిశ్ఛయంగా ఈ ముష్రికులందరితో ఇహలోకములో "లా ఇలాహ ఇల్లల్లాహ్" మీ వాస్తవ ఆరాధ్యదైవం అల్లాహ్ తప్ప ఇంకెవరూ లేరు దానికి తగ్గట్టుగా ఆచరించమని,దానికి వ్యతిరేకమైన వాటిని వదిలివేయమని పలికినప్పుడు వారు దాన్ని స్పందించడానికి,దానికి కట్టుబడి ఉండటానికి సత్యము నుండి గర్వముతో దానిపై అహంకారముతో నిరాకరించారు.
Saffat 37:36
మరియు వారు తమ అవిశ్వాసము కొరకు వాదిస్తూ ఇలా పలికేవారు : ఏమీ మేము ఒక పిచ్చి కవి మాటపై మా ఆరాధ్య దైవాల ఆరాధనను వదిలిపెట్టాలా ?! వారి ఈ మాటకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని అర్ధం.
Saffat 37:37
నిశ్ఛయంగా వారు పెద్ద నిందనే వేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎటువంటి పిచ్చివారు కాదు,ఎటువంటి కవి కాదు. కాని ఆయన అల్లాహ్ తౌహీద్ వైపునకు,అయన ప్రవక్త ను అనుసరించటం వైపునకు పిలిచే ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. మరియు ఆయన దైవప్రవక్తలను వారు అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన తౌహీదును,వాగ్దాన దినము యొక్క నిరూపణను నిజం చేసి చూపించారు. ఏ విషయంలోను వారిని విబేధించలేదు.
Saffat 37:38
ఓ ముష్రికులారా నిశ్ఛయంగా మీరు ప్రళయదినమున మీ అవిశ్వాసము,ప్రవక్తల పట్ల మీ తిరస్కారము వలన బాధాకరమైన శిక్ష రుచి చూస్తారు.
Saffat 37:39
ఓ ముష్రికులారా మీరు ఇహలోకములో చేసిన అల్లాహ్ పట్ల అవిశ్వాసం,పాపకార్యములకు పాల్పడిన దానికి మాత్రమే ప్రతిఫలం ప్రసాదించబడుతారు.
Saffat 37:40
కానీ అల్లాహ్ తన ఆరాధన కొరకు ప్రత్యేకించుకున్న విశ్వాసపరులైన అల్లాహ్ దాసులు. మరియు వారు ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకించుకున్నారు. వారే ఈ శిక్ష నుండి విముక్తి పొందుతారు.
Saffat 37:41
చిత్తశుద్ధి కల ఈ దాసులందరి కొరకు ఆహారోపాధి కలదు. దాన్నే అల్లాహ్ వారికి ప్రసాదిస్తాడు. అది తన శ్రేష్ఠతలో,తన మంచితనములో,తన ఎల్లప్పుడు ఉండటంలో పేరుగాంచినది.
Saffat 37:42
మరియు ఈ జీవనోపాధి నుండే వారు తినే మరియు కోరుకునే ఉత్తమమైన ఫలములను ప్రసాదించబడుతారు. మరియు ఆపైన వారు స్థానములను పెంపొందించబడి,గౌరవోన్నతుడైన అల్లాహ్ ముఖమును దర్శించుకోవటం ద్వారా గౌరవించబడుతారు.
Saffat 37:43
వీటన్నింటిని వారు అంతంకాని,తొలగిపోని శాశ్వతమైన,స్థిరమైన అనుగ్రహాలు కల స్వర్గవనాలలో పొందుతారు.
Saffat 37:44
వారు ఎదురెదురుగా ఆసనములపై ఆనుకుని కూర్చొని ఒకరినొకరు చూస్తుంటారు.
Saffat 37:45
వారి మధ్య తమ స్వచ్చదనంలో ప్రవహించే నీటి వలే ఉండే మధు గ్లాసులు త్రిప్పబడుతాయి.
Saffat 37:46
అవి రంగులో తెల్లవిగా ఉంటాయి వాటిని త్రాగేవాడు పరిపూర్ణ రుచిని ఆస్వాదిస్తాడు.
Saffat 37:47
అది ఇహలోకపు మధ్యం లాంటిది కాదు. అందులో మతిని పోగొట్టే మత్తు ఉండదు. మరియు దాన్ని వినియోగించేవారికి తలనొప్పి ఉండదు. దాన్ని త్రాగేవాడి శరీరము,బుద్ధి భద్రంగా ఉంటాయి.
Saffat 37:48
మరియు స్వర్గములో వారి దగ్గర శీలవతులైన స్త్రీలు ఉంటారు. వారి చూపులు తమ భర్తలకు తప్ప ఇతరుల.వైపునకు వాలవు. అందమైన కళ్ళుగల వారై ఉంటారు.
Saffat 37:49
వారు తమ రంగులో పసుపురంగులో కలిసిన తెల్లగా ఉండి ఎవరిచేతులు తాకని భద్రంగా ఉన్న తెల్లని పక్షులవలే ఉంటారు.
Saffat 37:50
అప్పుడు స్వర్గవాసులు ఒకరినొకరు తమ గతము గురించి ఇహలోకములో వారికి సంభవించిన దాని గురించి ప్రశ్నించుకుంటూ మరలుతారు.
Saffat 37:51
విశ్వాసపరులందరిలో నుండి పలికేవాడు ఒకడు ఇలా పలుకుతాడు : నిశ్చయంగా నాకు ఇహలోకంలో మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఒక స్నేహితుడుండేవాడు.
Saffat 37:52
అతడు నాతో తిరస్కరిస్తూ,హేళన చేస్తూ ఇలా పలికేవాడు : ఓ మిత్రమా ఏమీ నీవు మృతులు మరల లేపబడటమును నమ్మేవారిలోంచివా ?.
Saffat 37:53
ఏమీ మేము మరణించి మట్టిగా,కృశించిపోయిన ఎముకలుగా మారిపోయినప్పుడు మేము మరలలేపబడుతామా మరియు మేము ఇహలోకంలో చేసిన మా కర్మలకు ప్రతిఫలం ప్రసాదించబడుతామా ?.
Saffat 37:54
విశ్వాసపరుడైన అతని మితృడు స్వర్గవాసులైన తన మితృలతో ఇలా పలుకుతాడు : ఏమీ మరణాంతరం లేపబడటమును తిరస్కరించిన స్నేహితుడి పరిణామమును మేము చూడటానికి మీరు నాతోపాటు తొంగి చూస్తారా ?.
Saffat 37:55
అప్పుడు అతను తొంగి చూస్తాడు. తన స్నేహితుడిని నరకం మధ్యలో చూస్తాడు.
Saffat 37:56
అతడు ఇలా పలుకుతాడు : అల్లాహ్ సాక్షిగా ఓ నా మిత్రమా నీవు నన్ను అవిశ్వాసము,మరణాంతరము లేపబడటము వైపు నీ పిలుపు ద్వారా నన్ను నరకములో ప్రవేశింపజేసి నాశనం చేసి ఉండేవాడివే.
Saffat 37:57
ఒక వేళ నాపై విశ్వసము కొరకు మార్గదర్శకము,దాని సౌభాగ్యము ద్వారా అల్లాహ్ అనుగ్రహమే లేకపోతే నీలాగా నేనూ శిక్ష వైపు హాజరు అయ్యేవారిలో నుంచి అయిపోయేవాడిని.
Saffat 37:58
అయితే మేము - స్వర్గవాసులు - మరణించము.
Saffat 37:59
ఇహలోకములోని మన మొదటి మరణం తప్ప. అంతే కాదు మేము స్వర్గంలో శాశ్వతంగా ఉంటాము. మరియు అవిశ్వాసపరులు శిక్షింపబడినట్లు మేము శిక్షింపబడము.
Saffat 37:60
నిశ్ఛయంగా మా ప్రభువు మాకు ప్రతిఫలంగా ప్రసాదించిన స్వర్గములో ప్రవేశము,అందులో శాశ్వత నివాసము,నరకాగ్ని నుండి భద్రత గొప్ప సాఫల్యము. దానికి సరితూగే ఎటువంటి సాఫల్యము లేదు.
Saffat 37:61
ఇటువంటి గొప్ప సాఫల్యము కొరకు ఆచరించే వారు ఆచరించటం తప్పనిసరి. నిశ్ఛయంగా ఇదే లాభదాయకమైన వ్యాపారము.
Saffat 37:62
తన విధేయత కొరకు ప్రత్యేకించుకున్న తన దాసుల కొరకు అల్లాహ్ సిద్ధం చేసి ఉంచినటువంటి ఈ ప్రస్తావించబడిన అనుగ్రహాలు స్థానమును బట్టి,ఆతిధ్యమును బట్టి మేలైనవా,గొప్పవా లేదా ఖుర్ఆన్ లో దూషించబడినటువంటి జముడు చెట్టు ఏదైతే అవిశ్వాసపరుల ఆహారమో అది లావు చేయదు,ఆకలినీ తీర్చదు అది (మేలైనదా).
Saffat 37:63
నిశ్ఛయంగా మేము ఈ వృక్షమును ఒక పరీక్షగా చేశాము. దాని ద్వారా అవిశ్వాసముతో,పాపకార్యములతో దుర్మార్గులైనవారు పరీక్షింపబడుతారు. అందుకనే వారు ఇలా పలికారు : నిశ్ఛయంగా అగ్ని వృక్షములను తినివేస్తుంది. అందులో అవి మొలకెత్తటం అసంభవం.
Saffat 37:64
నిశ్ఛయంగా జముడు చెట్టు ఒక ప్రాణాంతక చెట్టు. అది నరకము యొక్క లోతు నుండి వెలికి వచ్చే వృక్షము.
Saffat 37:65
దాని నుండి వాటి ఫలములు వెలికి వచ్చే భయంకర దృశ్యము షైతానుల తలలవలె ఉంటాయి. దృశ్యం యొక్క వికారము సమాచారము ఇచ్చేవారి వికారమునకు సూచన. మరియు ఇది అంటే దాని ఫలములు రుచిలో చెడ్డవని అర్ధం.
Saffat 37:66
అయితే అప్పుడు అవిశ్వాసపరులు చేదైన,వికారమైన దాని పండ్లను తింటారు. తమ ఖాళీ కడుపులను దానితో నింపుకుంటారు.
Saffat 37:67
నిశ్ఛయంగా వారు దాని నుండి తిన్న తరువాత వారి కొరకు వికారమైన వేడి మిశ్రమ పానియం ఉంటుంది.
Saffat 37:68
ఆ తరువాత నిశ్ఛయంగా దాని తరువాత వారి మరలింపు మండే అగ్నిశిక్ష వైపుకు అవుతుంది. అప్పుడు వారు ఒక శిక్ష నుండి ఇంకో శిక్ష వైపునకు మరలుతారు.
Saffat 37:69
నిశ్ఛయంగా ఈ అవిశ్వాసపరులందరు తమ తాతముత్తాతలను సన్మార్గము నుండి తప్పిపోయినవారిగా పొందుతారు. వారు వారిని నమూనాగా చేసుకున్నది అనుకరణగా మాత్రమే, ఎటువంటి ఆధారపరంగా కాదు.
Saffat 37:70
అప్పుడు వారు తమ తాతముత్తాతల అడుగుజాడలోనే మర్గభ్రష్టతలో తొందరపడుతూ అనుసరించారు.
Saffat 37:71
వాస్తవానికి వారికి మునుపు చాలా మంది పూర్వికులు పెడదారి పట్టి ఉన్నారు. ఓ ప్రవక్తా జాతుల్లోంచి మొదట పెడదారిన పడినది మీ జాతి కాదు.
Saffat 37:72
మరియు నిశ్చయంగా మేము ఆ మొదటి జాతుల వారిలో ప్రవక్తలను పంపించాము.వారు వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టేవారు. అప్పుడు వారు తిరస్కరించారు.
Saffat 37:73
ఓ ప్రవక్తా ఆ జాతుల ముగింపు ఎవరినైతే వారి ప్రవక్తలు హెచ్చరిస్తే వారు వారిని స్వీకరించలేదో ఏమయిందో మీరు చూడండి. నిశ్ఛయంగా వారి అవిశ్వాసం వలన,వారి ప్రవక్తలను వారు తిరస్కరించటం వలన వారి ముగింపు నరకాగ్నిలో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశమయింది.
Saffat 37:74
అల్లాహ్ తనపై విశ్వాసమునకు ప్రత్యేకించుకున్నవారు తప్ప. నిశ్ఛయంగా వారు తిరస్కారులైన అవిశ్వాసపరులందరి ముగింపు ఏదైతో జరిగినదో ఆ శిక్ష నుండి ముక్తి పొందేవారయ్యారు.
Saffat 37:75
మరియు నిశ్ఛయంగా మన ప్రవక్త నూహ్ అలాహిస్సలాం తనును తిరస్కరించిన తన జాతి వారిపై బద్దుఆ (శపించినప్పుడు) చేసినప్పుడు మమ్మల్నే వేడుకున్నాడు. మేమే ఎంతో చక్కగా ప్రార్ధనలను అంగీకరించేవారము. నిశ్ఛయంగా మేము వారికి వ్యతిరేకంగా ఆయన ప్రార్దనను స్వీకరించటంలో తొందర చేశాము.
Saffat 37:76
మరియు నిశ్ఛయంగా మేము అతనిని,అతని కుటుంబీకులని,అతనితోపాటు విశ్వసించినవారిని అతని జాతి వారి వేదింపుల నుండి,అవిశ్వాసపరులైన అతని జాతి వారిపై పంపించబడ్డ పెద్ద తూఫాను ద్వారా మునగటం నుండి రక్షించాము.
Saffat 37:77
మరియు మేము అతని కుటుంబం వారిని,విశ్వాసపరులైన అతనిని అనుసరించేవారిని ఒక్కరినే రక్షించాము. నిశ్ఛయంగా మేము అతని జాతిలో నుండి అవిశ్వాసపరులైన ఇతరులను ముంచివేశాము.
Saffat 37:78
మరియు మేము అతని కొరకు తరువాత వచ్చే సమాజముల్లో మంచి కీర్తిని మిగిల్చాము వారు దాని ద్వారా అతనిని పొగిడేవారు.
Saffat 37:79
నూహ్ కొరకు తరువాత వచ్చే సమాజములలో ఆయన గురించి చెడు పలకటం నుండి భద్రత మరియు శాంతి కలుగుగాక. అంతే కాదు ఆయన కొరకు కీర్తి మరియు మంచి ప్రస్తావన మిగిలి ఉంటుంది.
Saffat 37:80
నిశ్ఛయంగా మేము నూహ్ అలైహిస్సలాంకు ప్రసాదించినటువంటి ఈ ప్రతిఫలం లాంటి దాన్ని ఒక్కడైన అల్లాహ్ కొరకు తమ ఆరాధన చేయటంలో, తమ విధేయత చూపటంలో మంచిగా చేసే వారికి ప్రసాదిస్తాము.
Saffat 37:81
నిశ్ఛయంగా నూహ్ అల్లాహ్ విధేయతలో ఆచరించే విశ్వాసపరులైన మా దాసుల్లోంచివారు.
Saffat 37:82
ఆ తరువాత మిగిలిన వారిని మేము వారిపై పంపించిన తూఫాను ద్వారా ముంచివేశాము. వారిలో నుండి ఎవరూ మిగలలేదు.
Saffat 37:83
మరియు నిశ్చయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ తౌహీద్ వైపునకు పిలవటంలో ఆయనను ఏకీభవించిన అతని ధర్మం వారిలోంచి వారు.
Saffat 37:84
అయితే షిర్కు నుండి భద్రమైన హృదయముతో, అల్లాహ్ కొరకు ఆయన సృష్టితాల్లో హితోపదేశం చేసేవాడిగా తన ప్రభువు వద్దకు వచ్చినప్పటి వేళ మీరు గుర్తు చేసుకోండి.
Saffat 37:85
ఆయన తన తండ్రితో,తన జాతి వారైన ముష్రికులతో వారిని మందలిస్తూ మీరు అల్లాహ్ ను వదిలి ఎవరిని ఆరాధిస్తున్నారు ? అని అడిగినప్పుడు.
Saffat 37:86
ఏమీ మీరు అల్లాహ్ ను వదిలి అసత్య దైవాలను ఆరాధిస్తున్నారా ?.
Saffat 37:87
ఓ నా జాతివారా సర్వలోకాల ప్రభువు గురించి మీరు ఇతరులను ఆరాధిస్తూ ఆయనను కలిసినప్పుడు మీ ఆలోచనేమిటి ?. మరియు ఆయన మీకు ఏమి చేస్తారని మీరు అనుకుంటున్నారు ?!
Saffat 37:88
అప్పుడు ఇబ్రాహీం తన జాతి వారితోపాటు బయలుదేరటం నుండి ముక్తి పొందటం కొరకు వ్యూహమును రచిస్తూ నక్షత్రముల వైపు ఒక చూపు చూశారు.
Saffat 37:89
అప్పుడు ఆయన తన జాతి వారితో వారి జాతరకి బయలుదేరటం నుండి కారణం చూపుతూ ఇలా పలికారు : నిశ్ఛయంగా నేను అనారోగ్యంగా ఉన్నాను.
Saffat 37:90
అప్పుడు వారు ఆయనను తమ వెనుక వదిలి వెళ్ళిపోయారు.
Saffat 37:91
అప్పుడు ఆయన వారు అల్లాహ్ ను వదిలి ఆరాధించే వారి ఆరాధ్య దైవాల వద్దకు మెల్లగా వెళ్ళారు. అప్పుడు వారి ఆరాధ్య దైవాలను హేళన చేస్తూ ఇలా పలికారు : ఏమీ ముష్రికులు మీ కొరకు తయారు చేసినటువంటి ఆహారమును మీరు తినరా ?!
Saffat 37:92
మీ విషయమేమిటి మీరు మాట్లాడటం లేదు మరియు మిమ్మల్ని అడిగిన వారికి సమాధానమివ్వటం లేదు ?. ఏమీ ఇలాంటివి అల్లాహ్ ను వదిలి ఆరాధన చేయబడుతున్నాయా ?!
Saffat 37:93
అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వాటిని విరగ్గొట్టటం కొరకు తన కుడి చేత్తో కొడుతూ వారి వైపుకు వెళ్ళారు.
Saffat 37:94
అప్పుడు ఈ విగ్రహాల ఆరాధకులు ఆయన వద్దకు తొందరగా వచ్చారు.
Saffat 37:95
అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని స్థిరంగా ఎదుర్కొన్నారు. మరియు వారితో ఇలా పలికారు : ఏమీ మీరు మీ చేతులతో చెక్కిన దేవతలను అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్నారా ?!
Saffat 37:96
పరిశుద్ధుడైన అల్లాహ్ మమ్మల్నీ సృష్టించాడు మరియు మీ ఆచరణనూ సృష్టించాడు. మరియు ఈ విగ్రహాలు మీ కర్మల్లోంచివే. కాబట్టి ఆయన తన ఒక్కడి ఆరాధన చేయబడటం కొరకు,తనతోపాటు ఇతరులను సాటికల్పించకుండా ఉండటం కొరకు యోగ్యుడు.
Saffat 37:97
ఎప్పుడైతే వారు ఆయన్ను వాదనతో ఎదుర్కోవటం నుండి అశక్తులయ్యారో బలప్రయోగమునకు ఆశ్రయించారు. అప్పుడు వారు ఇబ్రాహీంను ఏమి చేయాలన్న విషయంలో పరస్పరం సంప్రదింపులు చేశారు. వారు ఇలా పలికారు : మీరు అతని కొరకు ఒక కట్టడమును నిర్మించండి. మరియు దాన్ని కట్టెలతో నింపివేసి దాన్ని నిప్పంటించండి. ఆ తరువాత అతన్ని అందులో విసిరివేయండి.
Saffat 37:98
అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం జాతివారు ఇబ్రాహీం అలైహిస్సలాంను హతమార్చి ఆయన నుండి విముక్తి పొందటానకి ఇబ్రాహీం అలైహిస్సలాంను కీడు చేయదలచారు. మేము ఆయనపై అగ్నిని చల్లగా,శాంతిదాయకంగా చేసినప్పుడు మేము వారిని నష్టపోయేవారిలోంచి చేశాము.
Saffat 37:99
ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా పలికారు : నిశ్చయంగా నేను నా ప్రభువు వైపునకు ఆయన ఆరాధనను పూర్తిగా చేయటానికి నా జాతి వారి నగరమును వదిలి వలసపోయేవాడిని. తొందరలోనే నా ప్రభువు ఇహపరాల్లో నాకు మేలు దేనిలో ఉన్నదో దాన్ని నాకు సూచిస్తాడు.
Saffat 37:100
ఓ నా ప్రభువా నాకు సహాయకునిగా,ప్రవాసంలో నా జాతివారి నుండి బదులుగా అయ్యే ఒక పుణ్య కుమారుడిని నాకు ప్రసాదించు.
Saffat 37:101
అప్పుడు మేము అతని అర్ధనను స్వీకరించి అతనికి సంతోషమును కలిగించే శుభవార్తనిచ్చాము. ఎందుకంటే మేము అతనికి పెద్దరికమును చాటి సహనశీలుడయ్యే ఒక కుమారుడిని ప్రసాదించాము. మరియు ఈ పిల్లవాడు అతడే ఇస్మాయీల్ అలైహిస్సలాం.
Saffat 37:102
ఇస్మాయీల్ అలైహిస్సలాం యవ్వనానికి చేరుకుని తన తండ్రి పరుగెత్తటమునకు తన పరుగెత్తటము చేరువైనప్పుడు అతని తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక కలను చూశారు. మరియు దైవప్రవక్తల కల దైవవాణి అవుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ కల అంశము గురించి తన కుమారుడికి సమాచారమిస్తూ ఇలా పలికారు : ఓ నా ప్రియ కుమారా నిశ్చయంగా నేను కలలో నిన్ను జుబహ్ చేస్తున్నట్లుగా చూశాను. అయితే నీవు ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటో చూడు. అప్పుడు ఇస్మాయీల్ అలైహిస్సలాం తన తండ్రికి ఇలా పలుకుతూ సమాధానమిచ్చారు : ఓ నా తండ్రి నన్ను జుబహ్ చేసే విషయం గురించి మీకు అల్లాహ్ ఆదేశించిన దాన్ని చేసి తీరండి. తొందరలోనే మీరు నన్ను అల్లాహ్ ఆదేశమును స్వీకరించే వారిలోంచి,సహనం చూపే వారిలోంచి పొందుతారు.
Saffat 37:103
ఎప్పుడైతే వారిద్దరు అల్లాహ్ కి లోబడి ఆయనకు విధేయులయ్యారో ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడిని తన ప్రభువు అతన్ని జుబహ్ చేయమని ఆదేశించిన దాన్ని నెరవేర్చటానికి అతని నుదటి మీద బొర్లా పడుకోబెట్టారు.
Saffat 37:104
మరియు మేము ఇబ్రాహీం ను అతను తన కుమారుడిని జుబహ్ చేయమని అల్లాహ్ ఆదేశించిన దాన్ని నెరవేర్చటానికి పూనుకుని ఉన్నప్పుడు ఇలా పిలిచాము : ఓ ఇబ్రాహీం
Saffat 37:105
నిశ్ఛయంగా నీవు నీ నిదురలో చూసిన కలను నీ కుమారుని జుబహ్ చేసే దృఢ సంకల్పము ద్వారా నిజం చేసి చూపించావు. ఈ పెద్ద పరీక్ష నుండి నిన్ను విముక్తిని కలిగించి మేము నీకు ప్రతిఫలమును ప్రసాదించినట్లే సజ్జనులకు ప్రతిఫలమును ప్రసాదిస్తాము. కావున మేము వారిని పరీక్షల నుండి,కష్టాల నుండి విముక్తిని కలిగిస్తాము.
Saffat 37:106
నిశ్ఛయంగా ఇదే స్పష్టమైన పరీక్ష. మరియు నిశ్ఛయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అందులో సాఫల్యం చెందారు.
Saffat 37:107
మరియు మేము ఇస్మాయీలు అలైహిస్సలాంకు బదులుగా ఆయన తరపు నుండి జుబహ్ చేయటానికి ఒక పెద్ద గొర్రెను పరిహారంగా ఇచ్చాము.
Saffat 37:108
మరియు మేము తరువాత వచ్చే తరాలలో ఇబ్రాహీం అలైహిస్సలాం పై మంచి కీర్తిని ఉంచాము.
Saffat 37:109
అల్లాహ్ వద్ద నుండి ఆయన కొరకు అభినందనలు, ప్రతీ నష్టము,ఆపద నుండి భద్రత యొక్క ప్రార్ధన లభించినది.
Saffat 37:110
మేము ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఆయన విధేయత చూపటంపై ఈ ప్రతిఫలమును ప్రసాదించినట్లే సజ్జనులకు ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
Saffat 37:111
నిశ్ఛయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ కొరకు ఆరాధనను తగిన విధంగా పూర్తి చేసే విశ్వాసపరులైన మా దాసుల్లోంచివారు.
Saffat 37:112
మరియు మేము ఆయనకు తన ఏకైక కుమారుడిని జుబహ్ చేయటంలో అల్లాహ్ కు తన విధేయత చూపటంపై ప్రతిఫలంగా ప్రవక్త, పుణ్యదాసుడయ్యే ఇంకొక కుమారుడి శుభవార్తనిచ్చాము. అతడే ఇస్హాఖ్ అలైహిస్సలాం.
Saffat 37:113
మరియు మేము అతనిపై,అతని కుమారుడగు ఇస్హాఖ్ పై మా వద్ద నుండి శుభాలను కురిపించాము. అప్పుడు మేము వారి కొరకు అనుగ్రహాలను అధికం చేశాము. మరియు వారిద్దరి సంతానము అధికమవటం వాటిలో నుండే. మరియు వారి సంతానములో నుండి తమ ప్రభువు కొరకు తమ విధేయతను మంచిగా చేసే వారున్నారు. మరియు వారిలో నుండి అవిశ్వాసము,పాపకార్యములకు పాల్పడటం ద్వారా తమ స్వయంపై స్పష్టమైన దుర్మార్గమునకు పాల్పడిన వారున్నారు.
Saffat 37:114
మరియు నిశ్ఛయంగా మేము మూసా మరియు ఆయన సోదరుడైన హారూన్ పై దైవదౌత్యము ద్వారా ఉపకారము చేశాము.
Saffat 37:115
మరియు మేము వారిని, వారి జాతి వారైన ఇస్రాయీలు సంతతి వారిని ఫిర్ఔన్ వారిని బానిసలుగా చేసుకోవటం నుండి మరియు మునగటం నుండి విముక్తిని కలిగించాము.
Saffat 37:116
మరియు మేము వారికి ఫిర్ఔన్,అతని సైన్యములకు వ్యతిరేకముగా సహాయం చేశాము. అప్పుడు వారికి వారి శతృవులపై విజయం కలిగింది.
Saffat 37:117
మరియు మేము మూసా,ఆయన సోదరుడు హారూన్ కి తౌరాతును అల్లాహ్ వద్ద నుండి ఎటువంటి సందేహము లేని గ్రంధముగా ప్రసాదించాము.
Saffat 37:118
మరియు మేము వారిద్దరికి ఎటువంటి వంకరుతనం లేని రుజుమార్గమును చూపించాము. మరియు అది పరిశుద్ధుడైన సృష్టికర్త ఇష్టతకు చేరవేసే ఇస్లాం ధర్మం.
Saffat 37:119
మరియు మేము వచ్చే తరాలలో వారికి మంచి కీర్తిని మరియు మంచి ప్రస్తావనను మిగిలి ఉండేలా చేశాము.
Saffat 37:120
వారి కొరకు అల్లాహ్ వద్ద నుండి మంచి అభినందనలు,వారికి కీర్తి, ప్రతీ ఇష్టం లేని వాటి నుండి భద్రత కొరకు ప్రార్ధన కలవు.
Saffat 37:121
నిశ్ఛయంగా మేము మూసా,హారూన్ కు ఈ మంచి ప్రతిఫలమును ప్రసాదించినట్లే తమ ప్రభువు కొరకు తమ విధేయత ద్వారా మంచి చేసేవారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
Saffat 37:122
నిశ్ఛయంగా మూసా,హారూన్ అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే, ఆయన వారి కొరకు ధర్మబద్దం చేసిన వాటిని ఆచరించే మా దాసులలోంచివారు.
Saffat 37:123
మరియు నిశ్ఛయంగా ఇల్యాస్ తన ప్రభువు వద్ద నుండి పంపించబడిన ప్రవక్తల్లోంచి వారు. అల్లాహ్ ఆయన పై దైవదౌత్యము,సందేశాలను చేరవేయటమును అనుగ్రహించాడు.
Saffat 37:124
అతను తాను ప్రవక్తగా పంపించబడిన తన జాతి ఇస్రాయీలు సంతతి వారితో ఇలా పలికినప్పుడు : ఓ నా జాతివారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి అందులో నుండి తౌహీదు ఉన్నది మరియు తాను వారించిన వాటి నుండి జాగ్రత్త వహించి వాటిలో నుండి షిర్కు ఉన్నది మీరు అల్లాహ్ కి భయపడరా ?.
Saffat 37:125
ఏమీ మీరు అల్లాహ్ ను వదిలి మీ విగ్రహమైన బఅల్ ను ఆరాధిస్తున్నారా మరియు సర్వోత్తముడైన అల్లాహ్ ఆరాధనను వదిలివేస్తున్నారా ?!.
Saffat 37:126
మరియు అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించిన,మీ పూర్వికులైన తాతముత్తాతలను సృష్టించిన మీ ప్రభువు. ఆయనే ఆరాధనకు యోగ్యుడు. ఆయన కాకుండా లాభం చేయలేని,నష్టం కలిగించని విగ్రహాలు కావు.
Saffat 37:127
అయితే అతని జాతివారి నుండి అతన్ని తిరస్కరించటం తప్ప ఇంకేమి జరగలేదు. వారి తిరస్కారము వలన వారు శిక్షలో హాజరుచేయబడుతారు.
Saffat 37:128
కాని అతని జాతి వారిలో నుంచి విశ్వాసపరుడై అల్లాహ్ కొరకు ఆయన ఆరాధన విషయంలో చిత్తశుద్ధి కలవాడై ఉండేవాడు నిశ్ఛయంగా అతడు శిక్ష వైపునకు హాజరు చేయటం నుండి ముక్తి పొందుతాడు.
Saffat 37:129
మరియు మేము వచ్చే తరాలలో అతనికి మంచి కీర్తిని మరియు మంచి ప్రస్తావనను మిగిలి ఉండేలా చేశాము.
Saffat 37:130
అల్లాహ్ వద్ద నుండి ఇల్,యాస్ పై అభినందనలు మరియు కీర్తి కలుగుగాక.
Saffat 37:131
నిశ్ఛయంగా మేము ఇల్,యాస్ కు ఈ మంచి ప్రతిఫలమును ప్రసాదించినట్లే విశ్వాసపరులైన మా దాసుల్లోంచి మంచి చేసే వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
Saffat 37:132
నిశ్ఛయంగా ఇల్,యాస్ వాస్తవంగా విశ్వాసపరులైన,తమ ప్రభువు పై తమ విశ్వాసములో సత్యవంతులైన మా దాసులలోని వాడు
Saffat 37:133
మరియు నిశ్చయంగా లూత్ అల్లాహ్ తమ జాతుల వారి వద్దకు శుభవార్తనిచ్చేవారిగా,హెచ్చరించే వారిగా పంపించిన ప్రవక్తల్లోంచి వాడు.
Saffat 37:134
అయితే అతని జాతి వారిపై పంపించబడ్డ శిక్ష నుండి మేము అతన్ని,అతని జాతి వారిని రక్షించినప్పటి వైనమును నీవు గుర్తుచేసుకో.
Saffat 37:135
అతని భార్య తప్ప. ఆమెకూడా వారిలాగా అవిశ్వాసపరురాలు కావటం వలన ఆమె జాతి వారి యొక్క శిక్ష ఆమెకూ వర్తించే స్త్రీ అయిపోయినది.
Saffat 37:136
ఆ తరువాత అతన్ని తిరస్కరించి,అతను తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించని వారిలో నుంచి అయిన అతని జాతి వారిలో నుండి మిగిలిన వారినీ కూడా మేము తుదిముట్టించాము.
Saffat 37:137
మరియు నిశ్ఛయంగా ఓ మక్కా వాసులారా మీరు షామ్ (శిరియా) వైపు మీ ప్రయాణములలో వారి నివాసములపై నుండి ఉదయం వేళ ప్రయాణిస్తూ ఉంటారు.
Saffat 37:138
మరియు అలాగే మీరు వాటిపై నుండి రాత్రి వేళలో కూడా ప్రయాణిస్తూ ఉంటారు. ఏమీ వారి యొక్క తిరస్కరించటం,వారి యొక్క అవిశ్వాసము కనబరచటం,ముందెన్నడూ వారితో జరగని అశ్లీల కార్యమును వారి యొక్క పాల్పడటం తరువాత వారికి ఏమి జరిగినదో దాని ద్వారా మీరు అర్ధం చేసుకోరా,హితబోధన గ్రహించరా ?.
Saffat 37:139
మరియు నిశ్ఛయంగా మా దాసుడగు యూనుస్ అల్లాహ్ తమ జాతుల వారి వద్దకు శుభవార్తనిచ్చేవారిగా,హెచ్చరించే వారిగా పంపించిన ప్రవక్తల్లోంచి వాడు.
Saffat 37:140
తన ప్రభువు అనుమతి లేకుండా తన జాతి వారి నుండి పారిపోయి ప్రయాణికులతో,సామానుతో నిండిన ఒక పడవ పై సవారీ అయినప్పుడు.
Saffat 37:141
పడవ అది నిండిపోవటం వలన మునగటానికి దగ్గరలో ఉన్నది. అప్పుడు ప్రయాణికులు ఎక్కువవటం వలన పడవ మునిగి పోతుందేమోనని భయముతో తమలోని కొందరిని తీసి పడవేయటానికి ప్రయాణికులు చీటీ వేశారు. ఆ ఓడిపోయిన వారిలో నుండి యూనుస్ అయ్యాడు. అప్పుడు వారు అతన్ని సముద్రంలో పడవేశారు.
Saffat 37:142
ఎప్పుడైతే వారు అతన్ని సముద్రంలో పడవేశారో పెద్ద చేప అతన్ని పట్టుకుని మ్రింగివేసింది. మరియు అతడు తన ప్రభువు అనుమతి లేకుండా సముద్రం వద్దకు వెళ్ళటం వలన అతడు నిందించబడే కార్యము చేశాడు.
Saffat 37:143
యూనుస్ తనకు సంభవించిన దాని కన్న మునుపు ఎక్కువగా అల్లాహ్ స్మరణ చేసేవారిలో నుంచి కాకపోయి ఉంటే మరియు చేప కడుపులో ఆయన పరిశుద్ధత కొనియాడటం లేకపోయి ఉంటే.
Saffat 37:144
ఆయన చేప కడుపులోనే అది అతనికి సమాదిగా అయిపోయి ప్రళయదినం వరకు ఉండిపోయేవాడు.
Saffat 37:145
అప్పుడు మేము అతడిని చేప కడుపు నుండి తీసి చెట్లు,కట్టడాలు లేని ఖాళీ ప్రదేశంలో పడవేశాము. అతడు చేప కడుపులో కొంత కాలం ఉండటం వలన బలహీన శరీరము కలవాడి స్థితిలో ఉన్నాడు.
Saffat 37:146
మరియు మేము ఆ ఖాళీ ప్రదేశంలో ఆనపకాయ చెట్టును అతనిపై దాని ద్వారా అతను నీడను పొందటానికి,దాని నుండి తినటానికి మొలిపించాము.
Saffat 37:147
మరియు మేము అతడిని అతని జాతి వారి వద్దకు ప్రవక్తగా పంపించాము. మరియు వారి సంఖ్య లక్ష మంది ఉంటుంది అంతకంటే ఎక్కువే ఉంటుంది.
Saffat 37:148
అప్పుడు వారు విశ్వసించారు మరియు ఆయన తీసుకుని వచ్చిన దాన్ని నిజమని నమ్మారు. అప్పుడు అల్లాహ్ వారి ఇహలోక జీవితంలో వారి నిర్ణీత ఆయుషు ముగిసేవరకు వారికి ప్రయోజనం చేకూర్చాడు.
Saffat 37:149
అయితే ఓ ముహమ్మద్ మీరు ముష్రికులతో నిరాకరించే విధంగా అడగండి : ఏమీ మీరు మీకు ఇష్టంలేనివైన కుమార్తెలను అల్లాహ్ కొరకు చేసి మీరు ఇష్టపడే కుమారులను మీ కొరకు చేసుకుంటున్నారా ?. ఇదేమి పంపకము ?!
Saffat 37:150
దైవదూతలను వారు ఎలా స్త్రీలు అనుకున్నారు. వాస్తవానికి వారి పుట్టించే సమయంలో వారు హాజరై లేరు. మరియు వారు దాన్ని చూడనూ లేదు ?!.
Saffat 37:151
జాగ్రత్త నిశ్ఛయంగా ముష్రికులు అల్లాహ్ పై అబద్దమును పలకటం వలన మరియు ఆయనపై కల్పించుకుని అపాదించటం వలన వారు ఆయనకు సంతానమును అంటగడుతారు. నిశ్ఛయంగా వారు తమ ఈ వాదనలో అసత్యపరులు.
Saffat 37:152
జాగ్రత్త నిశ్ఛయంగా ముష్రికులు అల్లాహ్ పై అబద్దమును పలకటం వలన మరియు ఆయనపై కల్పించుకుని అపాదించటం వలన వారు ఆయనకు సంతానమును అంటగడుతారు. నిశ్ఛయంగా వారు తమ ఈ వాదనలో అసత్యపరులు.
Saffat 37:153
ఏమీ అల్లాహ్ తన స్వయం కొరకు మీరు ఇష్టపడే మగ సంతానమునకు బదులుగా మీరు ద్వేషించే ఆడ సంతానమును ఎన్నుకున్నాడా ?!. ఖచ్చితంగా కాదు.
Saffat 37:154
ఓ ముష్రికులారా మీకేమయింది. మీరు అల్లాహ్ కొరకు కుమార్తెలను చేసి,మీ కొరకు కుమారులని చేసి ఈ దుర్మార్గపు నిర్ణయం చేస్తున్నారు ?.
Saffat 37:155
ఏమీ మీరు ఉన్న ఈ చెడు విశ్వాసము అసత్యమని గ్రహించలేకపోతున్నారా ?!. నిశ్ఛయంగా మీరు ఒక వేళ గ్రహిస్తే ఈ మాటను పలికేవారు కాదు.
Saffat 37:156
లేదా మీ వద్ద దీని గురించి ఏదైన పుస్తకం లేదా ఎవరైన ప్రవక్త నుండి స్పష్టమైన వాదన గాని,స్పష్టమైన ఆధారం గాని ఉన్నదా ?.
Saffat 37:157
మీరు వాదిస్తున్న విషయంలో ఒక వేళ మీరు నీతిమంతులే అయితే ఈ విషయంపై మీకొరకు ఆధారమయ్యే మీ పుస్తకాన్ని మీరు తీసుకుని రండి.
Saffat 37:158
మరియు ముష్రికులు దైవదూతలు అల్లాహ్ కుమార్తెలు అని ఆరోపించినప్పుడు వారు అల్లాహ్ కు మరియు తమ నుండి తెరలో ఉంచబడిన దైవదూతలకు మధ్య సంబంధమును అంటగడుతున్నారు. వాస్తవానికి అల్లాహ్ ముష్రికులను లెక్క తీసుకోవటానికి తొందరలోనే హాజరు పరుస్తాడన్న విషయం దైవదూతలకు తెలుసు.
Saffat 37:159
పరిశుద్ధుడైన ఆయనకు తగనటువంటి సంతానము,భాగస్వామి మరియు ఇతరలు ఉండటం వేటి గురించైతే ముష్రికులు తెలుపుతున్నారో వాటి నుండి అల్లాహ్ పరిశుద్ధుడు మరియు అతీతుడు.
Saffat 37:160
చిత్తశుద్ధిగల అల్లాహ్ దాసులు తప్ప. ఎందుకంటే వారు పరిశుద్ధుడైన అల్లాహ్ కు తగినటువంటి గొప్ప,పరిపూర్ణ గుణాలను మాత్రమే తెలుపుతారు.
Saffat 37:161
అయితే ఓ ముష్రికులారా నిశ్ఛయంగా మీరు మరియు అల్లాహ్ ను వదిలి మీరు ఆరాధిస్తున్నవారు.
Saffat 37:162
ఎవరినీ కూడా మీరు సత్య ధర్మం నుండి తప్పించలేరు.
Saffat 37:163
కాని అల్లాహ్ ఎవరిపైనైతే అతడు నరకవాసుల్లోంచి అవుతాడని తీర్పునిస్తాడో. నిశ్చయంగ అల్లాహ్ అతనిపై తన తీర్పును జారీ చేస్తాడు. అప్పుడు అతడు అవిశ్వాసమునకు పాల్పడి నరకములోకి ప్రవేశిస్తాడు. కాని మీకు,మీ ఆరాధ్యదైవాలకు దాని శక్తి లేదు.
Saffat 37:164
మరియు దైవదూతలు అల్లాహ్ కొరకు తమ ఆరాధనను, ముష్రికులు ఆరోపిస్తున్న దాని నుండి తమ నిర్దోషత్వమును స్పష్టపరుస్తూ ఇలా పలుకుతారు : అల్లాహ్ ఆరాధనలో,ఆయన విధేయతలో ఒక నిర్ణీత స్థానం లేకుండా మాలో నుండి ఎవడూ లేడు.
Saffat 37:165
మరియు మేమే దైవదూతలము అల్లాహ్ ఆరాధనలో,ఆయన విధేయతలో పంక్తుల రూపములో నిలబడేవారము. మరియు మేము అల్లాహ్ కు తగని గుణాలు మరియు లక్షణాల నుండి పరిశుద్ధతను కొనియాడుతాము.
Saffat 37:166
మరియు మేమే దైవదూతలము అల్లాహ్ ఆరాధనలో,ఆయన విధేయతలో పంక్తుల రూపములో నిలబడేవారము. మరియు మేము అల్లాహ్ కు తగని గుణాలు మరియు లక్షణాల నుండి పరిశుద్ధతను కొనియాడుతాము.
Saffat 37:167
మరియు నిశ్ఛయంగా మక్కా వాసుల్లోంచి ముష్రికులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక ముందు ఇలా పలికేవారు : ఒక వేళ మా వద్ద పూర్వికుల గ్రంధముల్లోంచి తౌరాత్ లాంటి ఏదైన గ్రంధము ఉంటే మేము అల్లాహ్ కొరకు ఆరాధనను ప్రత్యేకించేవారము. మరియు వారు ఈ విషయంలో అబద్దము పలికారు. వాస్తవానికి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు దాన్ని తిరస్కరించారు. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన తమ కొరకు నిరీక్షిస్తున్న తీవ్రమైన శిక్షను తెలుసుకుంటారు.
Saffat 37:168
మరియు నిశ్ఛయంగా మక్కా వాసుల్లోంచి ముష్రికులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక ముందు ఇలా పలికేవారు : ఒక వేళ మా వద్ద పూర్వికుల గ్రంధముల్లోంచి తౌరాత్ లాంటి ఏదైన గ్రంధము ఉంటే మేము అల్లాహ్ కొరకు ఆరాధనను ప్రత్యేకించేవారము. మరియు వారు ఈ విషయంలో అబద్దము పలికారు. వాస్తవానికి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు దాన్ని తిరస్కరించారు. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన తమ కొరకు నిరీక్షిస్తున్న తీవ్రమైన శిక్షను తెలుసుకుంటారు.
Saffat 37:169
మరియు నిశ్చయంగా మక్కా వాసుల్లోంచి ముష్రికులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక ముందు ఇలా పలికేవారు : ఒక వేళ మా వద్ద పూర్వికుల గ్రంధముల్లోంచి తౌరాత్ లాంటి ఏదైన గ్రంధము ఉంటే మేము అల్లాహ్ కొరకు ఆరాధనను ప్రత్యేకించేవారము. మరియు వారు ఈ విషయంలో అబద్దము పలికారు. వాస్తవానికి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు దాన్ని తిరస్కరించారు. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన తమ కొరకు నిరీక్షిస్తున్న తీవ్రమైన శిక్షను తెలుసుకుంటారు.
Saffat 37:170
మరియు నిశ్ఛయంగా మక్కా వాసుల్లోంచి ముష్రికులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక ముందు ఇలా పలికేవారు : ఒక వేళ మా వద్ద పూర్వికుల గ్రంధముల్లోంచి తౌరాత్ లాంటి ఏదైన గ్రంధము ఉంటే మేము అల్లాహ్ కొరకు ఆరాధనను ప్రత్యేకించేవారము. మరియు వారు ఈ విషయంలో అబద్దము పలికారు. వాస్తవానికి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు దాన్ని తిరస్కరించారు. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన తమ కొరకు నిరీక్షిస్తున్న తీవ్రమైన శిక్షను తెలుసుకుంటారు.
Saffat 37:171
మరియు నిశ్చయంగా మా ప్రవక్తల కొరకు మా మాట ఇంతకు ముందే జరిగిపోయింది అలాహ్ ఆధారము,బలముతో వారిపై చేసిన ఉపకారము ద్వారా వారు తమ శతృవులపై సహాయం (విజయం) పొందుతారని మరియు అల్లాహ్ వాక్కు (కలిమ) అదే గొప్పదవ్వాలని అల్లాహ్ మార్గములో పోరాడే మా సైనికులకే ఆధిక్యం కలుగుతుందని.
Saffat 37:172
మరియు నిశ్చయంగా మా ప్రవక్తల కొరకు మా మాట ఇంతకు ముందే జరిగిపోయింది అలాహ్ ఆధారము,బలముతో వారిపై చేసిన ఉపకారము ద్వారా వారు తమ శతృవులపై సహాయం (విజయం) పొందుతారని మరియు అల్లాహ్ వాక్కు (కలిమ) అదే గొప్పదవ్వాలని అల్లాహ్ మార్గములో పోరాడే మా సైనికులకే ఆధిక్యం కలుగుతుందని.
Saffat 37:173
మరియు నిశ్ఛయంగా మా ప్రవక్తల కొరకు మా మాట ఇంతకు ముందే జరిగిపోయింది అలాహ్ ఆధారము,బలముతో వారిపై చేసిన ఉపకారము ద్వారా వారు తమ శతృవులపై సహాయం (విజయం) పొందుతారని మరియు అల్లాహ్ వాక్కు (కలిమ) అదే గొప్పదవ్వాలని అల్లాహ్ మార్గములో పోరాడే మా సైనికులకే ఆధిక్యం కలుగుతుందని.
Saffat 37:174
ఓ ప్రవక్తా ఈ వ్యతిరేకించే ముష్రికులందరి నుండి వారి వద్దకు వారి శిక్ష సమయం వచ్చేవరకు అల్లాహ్ కు తెలిసిన కొంత కాలం వరకు విముఖత చూపండి.
Saffat 37:175
మరియు మీరు వారిపై శిక్ష అవతరించేటప్పుడు వారిని చూడండి. తొందరలోనే వారూ చూస్తారు. అప్పుడు చూడటం వారికి ప్రయోజనం చేకూర్చదు.
Saffat 37:176
ఏమీ ఈ ముష్రికులందరు అల్లాహ్ శిక్ష గురించి తొందరపెడుతున్నారా ?.
Saffat 37:177
అయితే ఎప్పుడైతే వారిపై అల్లాహ్ శిక్ష దిగుతుందో అప్పుడు వారి ఉదయం దుర్భరమైన ఉదయం అవుతుంది.
Saffat 37:178
ఓ ప్రవక్తా అల్లాహ్ వారి శిక్ష గురించి తిర్పునిచ్చేంత వరకు వారి నుండి మీరు విముఖత చూపండి.
Saffat 37:179
మరియు మీరు చూడండి. అప్పుడు వారందరు తొందరలోనే తమపై వాటిల్లే అల్లహ్ శిక్షను,ఆయన యాతనను చూస్తారు.
Saffat 37:180
ఓ ముహమ్మద్ బలవంతుడైన నీ ప్రభువు ముష్రికులు కల్పించి తెలిపే లోపపూరితమైన లక్షణాల నుండి అతీతుడు మరియు పరిశుద్ధుడు.
Saffat 37:181
మరియు అల్లాహ్ అభినందనలు మరియు ఆయన పొగడ్తలు గౌరవోన్నతులైన ఆయన ప్రవక్తలపై కలుగుగాక.
Saffat 37:182
పొగడ్తలన్నీ పరిశుద్దుడైన,మహోన్నతుడైన అల్లాహ్ కే చెందుతాయి. ఆయనే దానికి యోగ్యుడు. మరియు ఆయన లోకాలన్నింటికి ప్రభువు. వారికి ఆయన తప్ప ఇంకెవరూ ప్రభువు లేడు.
Sâd 38:1
సూరె బఖరా ఆరంభంలో విడి విడిగా ఉండే అక్షరాల (హురూఫె ముఖత్తఆత్ ల) సారూప్యముపై చర్చ జరిగినది. ప్రజలకు వారి ఇహలోకములో,పరలోకములో వారికి ప్రయోజనం కలిగించే వాటితో హితబోధనతో కూడుకుని ఉన్న ఖుర్ఆన్ పై ప్రమాణం చేశాడు. ముష్రికులు అల్లాహ్ తో పాటు భాగస్వాములు ఉన్నారని భావిస్తున్నట్లు విషయం లేదు.
Sâd 38:2
కాని అవిశ్వాసపరులు అల్లాహ్ ఏకత్వము నుండి గర్వములో,అహంకారములో మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో విభేదాల్లో,ఆయనతో విరోధంలో ఉన్నారు.
Sâd 38:3
వారికన్న మునుపు తమ ప్రవక్తలను తిరస్కరించినటువంటి ఎన్నో తరాలను నాశనం చేశాము. అప్పుడు వారు తమపై శిక్ష అవతరించేటప్పుడు సహాయమును కోరుతూ పిలిచారు. మరియు ఆయన వద్ద నుండి సహాయం వారికి ప్రయోజనం కలిగించటానికి వారి కొరకు శిక్ష నుండి తప్పించుకునే సమయం లేకపోయింది.
Sâd 38:4
మరియు వారి వద్దకు ఒక వేళ వారు తమ అవిశ్వాసములోనే కొనసాగితే అల్లాహ్ శిక్ష నుండి వారిని భయపెడుతూ వారిలో నుండే ఒక ప్రవక్త వచ్చినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. మరియు ఎప్పుడైతే అవిశ్వాసపరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చినది సత్యం అవటంపై ఆధారాలను చూశారో ఇలా పలికారు : ఇతడు ప్రజలను మంత్రజాలానికి గురిచేసే ఒక మంత్రజాలకుడు, తాను అల్లాహ్ ప్రవక్త అని తన వైపు దైవవాణి అవతరింపబడుతుందని తాను వాదించిన విషయంలో అసత్యపరుడు.
Sâd 38:5
ఏమీ ఈ వ్యక్తి బహుళ దైవాలను ఒకే ఆరాధ్యదైవంగా,ఆయన తప్ప ఇంకో దైవం లేనట్లుగా చేశాడా ?. ఇతని ఈ కార్యము అత్యంత ఆశ్ఛర్యకరము.
Sâd 38:6
మరియు వారి నాయకులు,వారి పెద్దలు తమను అనుసరించే వారితో ఇలా పలుకుతూ వెళ్ళారు : మీరు దేనిపైనైతే ఉన్నారో అలాగే నడవండి. మరియు మీరు ముహమ్మద్ ధర్మంలో ప్రవేశించకండి. మీ దైవాల ఆరాధనలో స్థిరంగా ఉండండి. నిశ్చయంగా ముహమ్మద్ మిమ్మల్ని ఒకే ఆరాధ్య దైవ ఆరాధన వైపునకు పిలుస్తున్న విషయం ఎటువంటిదంటే అతడు మనకంటే పైకి ఎదిగి మేము అతన్ని అనుసరించేవారమైపోవాలని కోరుతున్నాడు.
Sâd 38:7
ముహమ్మద్ మమ్మల్ని పిలుస్తున్న అల్లాహ్ ఏకేశ్వరోపాసనను మా తాతముత్తాతలను మేము దేనిపైనైతే పొందామో అందులో, ఈసా అలైహిస్సలాం మతంలో మేము వినలేదు. మేము అతని నుండి విన్నది ఇది అబద్దము,బూటకం మాత్రమే.
Sâd 38:8
ఏమీ మా అందరి మధ్యలో అతనిపైనే ఖుర్ఆన్ అవతరింపబడటం మరియు అతనినే ప్రత్యేకించటం సరైనదా ?. మరియు మాపై అవతరింపబడలేదు. వాస్తవానికి మేము నాయకులము,పెద్దలము. వాస్తవానికి ఈ ముష్రికులందరు మీపై అవతరింపబడిన దైవవాణి విషయంలో సందేహంలో ఉన్నారు. మరియు వారు అల్లాహ్ శిక్షను రుచిచూసినప్పుడు వారు తమకు గడువు ఇవ్వటం వలన మోసపోయారు. ఒక వేళ వారు దాని రుచి చూసి ఉంటే అవిశ్వాసంపై,అల్లాహ్ తోపాటు సాటి కల్పించటంపై,ఆయన మీవైపునకు అవతరింపజేసిన దైవవాణి విషయంలో సందేహ పడటంపై ధైర్యం చేసేవారు కాదు.
Sâd 38:9
లేదా ఈ తిరస్కరించే ముష్రికులందరి వద్ద ఎవరూ ఓడించలేని సర్వశక్తివంతుడైన నీ ప్రభువు యొక్క అనుగ్రహపు నిధులు కలవా. ఆయనే తాను కోరినదంతా తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహము యొక్క నిధుల్లోంచి దైవదౌత్యము. దాన్ని ఆయన తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. దాన్ని వారు తాము తలచిన వారికి అనుగ్రహించటానికి మరియు తాము కోరిన వారికి దాన్ని అనుగ్రహించటానికి అది వారి కొరకు కాదు.
Sâd 38:10
లేదా వారికి ఆకాశములపై,భూమిపై మరియు వాటిలో ఉన్నటువంటి వాటిపై అధికారం ఉన్నదా ? .వారికి ఇచ్చే,ఆపే హక్కు ఉండాటానికి. ఒక వేళ ఇది వారి వాదన అయితే వారు నిర్ణయించుకున్నది ఆపటం లేదా ఇవ్వటం గురించి ఆదేశమునకు సామర్ధ్యం పొందటానికి ఆకాశమునకు చేరవేసే కారకాలను తయారు చేసుకోవాలి. వారికి దాని శక్తి లేదు.
Sâd 38:11
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించే వీరందరు తమ కన్న ముందు గతించిన తమ ప్రవక్తలను తిరస్కరించిన సైన్యములవలే పరాభవమునకు లోనయిన సైన్యము.
Sâd 38:12
వీరందరు మొదట తిరస్కరించిన వారు కాదు. వీరికన్న ముందు నూహ్ జాతివారు తిరస్కరించారు. మరియు ఆద్ తిరస్కరించింది. మరియు ఫిర్ఔన్ ఎవరికైతే మేకులు ఉండి వాటితో ప్రజలను యాతనకు గురిచేసేవాడో తిరస్కరించాడు.
Sâd 38:13
మరియు సమూద్ తిరస్కరించింది. మరియు లూత్ జాతి తిరస్కరించింది.మరియు షుఐబ్ జాతి తిరస్కరించింది. వారందరే ఆ వర్గాలు ఎవరైతే తమ ప్రవక్తలను తిరస్కరించటంపై మరియు వారు తీసుకుని వచ్చిన దాన్ని అవిశ్వసించటంపై వర్గములుగా మారారు.
Sâd 38:14
ఈ వర్గములన్నింటిలో నుంచి ప్రతీ వర్గము నుండి ప్రవక్తలను తిరస్కరించటం మాత్రమే వాటిల్లింది. అప్పుడు వారిపై అల్లాహ్ శిక్ష అనివార్యమయ్యింది. మరియు వారిపై ఆయన శిక్ష దిగింది. ఒక వేళ అది కొంత సమయం వరకు ఆలస్యం అయినా సరే.
Sâd 38:15
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించే వీరందరు ఎటువంటి మరలింపులేని రెండవ బాకా ఊదబడటమునకు ఎదురుచూస్తున్నారు. ఒక వేళ వారు తమ తిరస్కార స్థితిలోనే మరణిస్తే వారిపై శిక్ష వాటిల్లి తీరుతుంది.
Sâd 38:16
మరియు వారు పరిహాసమాడుతూ ఇలా పలికేవారు : ఓ మా ప్రభువా ప్రళయదినం కన్న ముందే ఇహలోకములోనే శిక్ష నుండి మా భాగమును తొందరగా ఇచ్చివేయి.
Sâd 38:17
ఓ ప్రవక్తా ఈ తిరస్కారులందరు మీకు ఇష్టం లేని వాటిని పలుకుతున్న వాటిపై మీరు సహనం చూపండి. మరియు తన శతృవునితో పోరాడటానికి మరియు అల్లాహ్ కు విధేయత చూపటంపై సహనం చూపటానికి శక్తి ఉన్న మన దాసుడగు దావూద్ ను మీరు గుర్తు చేసుకోండి. నిశ్చయంగా ఆయన పశ్ఛాత్తాపము ద్వారా అల్లాహ్ వైపునకు అధికంగా మరలేవాడును,ఆయనకు ఇష్టమగు ఆచరణలను అధికంగా చేసేవాడును.
Sâd 38:18
నిశ్ఛయంగా మేము పర్వతాలను దావూద్ కి ఉపయుక్తంగా చేశాము. పగటి చివరివేళలో మరియు దాని మొదటి వేళలో సూర్యోదయం అయ్యే వేళ ఆయన పరిశుద్ధతను కొనియాడినప్పుడు ఆయన పరిశుద్ధతను కొనియాడటంతోపాటు అవి పరిశుద్ధతను కొనియాడేవి.
Sâd 38:19
మరియు మేము పక్షులను గాలిలో ఆగి ఉన్న స్థితిలో ఆదీనంలో చేశాము. ప్రతీ ఒక్కరు ఆయనకు విధేయతగా పరిశుద్దతను కొనియాడుతూ విధేయులై ఉన్నారు.
Sâd 38:20
అతని శతృవులపై ప్రతిష్ట,బలం మరియు విజయాన్ని ప్రసాదించటం ద్వారా మేము అతని రాజ్యమునకు బలము చేకూర్చాము. మరియు మేము అతనికి దైవదౌత్యమును, అతని వ్యవహారముల్లో సరైనత్వమును ప్రసాదించాము. మరియు మేము అతనికి ప్రతీ ఉద్దేశంలో ప్రయోజనకర మాటతీరును మరియు మాట్లాడటంలో,ఆదేశించటంలో అనుగ్రహమును ప్రసాదించాము.
Sâd 38:21
ఓ ప్రవక్తా మీ వద్దకు ఇద్దరు తగాదాపడే వారి వార్త వచ్చినదా ?. అప్పుడు వారు దావూద్ అలైహిస్సలాం వద్దకు ఆయన ఆరాధనాలయం పై ఎక్కి వచ్చారు.
Sâd 38:22
అప్పుడు వారిద్దరు అకస్మాత్తుగా దావూద్ అలైహిస్సలాం వద్దకు ప్రవేశించారు. అప్పుడు ఆయన వారిద్దరు తన వద్దకు ప్రవేశించటం కొరకు ఈ అసాధారణ మార్గముతో అకస్మాత్తుగా తన వద్దకు ప్రవేశించటం నుండి భయపడ్డారు. ఎప్పుడైతే ఆయన భయము వారికి స్పష్టమయ్యిందో వారు ఇలా పలికారు : నీవు భయపడకు. మేమిద్దరము ప్రత్యర్ధులము. మాలోని ఒకరు మరొకరికి అన్యాయం చేశారు. కావున నీవు మా మధ్య న్యాయంగా తీర్పునివ్వు. నీవు మా మధ్య తీర్పునిచ్చినప్పుడు మా పై దౌర్జన్యం చేయకు. మరియు నీవు మమ్మల్ని సరైన మార్గమైన ఋజుమార్గమును చూపించు.
Sâd 38:23
ప్రత్యర్ధుల్లోంచి ఒకడు దావూద్ అలైహిస్సలాంతో ఇలా పలికాడు : నిశ్ఛయంగా ఈ వ్యక్తి నా సోదరుడు. అతని వద్ద తొంభై తొమ్మిది ఆడ గొర్రెలు కలవు. మరియు నా వద్ద ఒకే ఒక ఆడ గొర్రె ఉన్నది. అయితే అతను దానిని కూడా తనకే ఇచ్చివేయమని నన్ను కోరుతున్నాడు. మరియు అతడు వాదనలో నాపై ఆధిక్యతను చూపాడు.
Sâd 38:24
అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారి మధ్య తీర్పునిచ్చారు. ఆరోపించే వ్యక్తిని ఉద్దేశించి ఇలా పలికారు : నిశ్చయంగా నీ సోదరుడు నీ గొర్రెను తన గొర్రెలతో కలపమని నిన్ను అడిగినప్పుడు నీకు అన్యాయం చేశాడు. మరియు నిశ్చయంగా భాగస్వాముల్లోంచి చాలా మంది ఒకరిపై ఒకరు అతని హక్కును తీసుకుని,అన్యాయం చేసి అతిక్రమిస్తారు. కాని విశ్వాసపరులు వారే సత్కర్మలు చేస్తారు. ఎందుకంటే వారు తమ భాగస్వాములపట్ల న్యాయం చేస్తారు. అన్యాయం చేయరు. ఇటువంటి గుణాలు కలిగినవారు చాలా తక్కువమంది ఉంటారు. మరియు దావూద్ అలైహిస్సలాం మేము ఈ తగాదా ద్వారా అతన్ని పరీక్షలో పడవేశామని పూర్తిగా నమ్మారు. అప్పుడు ఆయన తన ప్రభువుతో మన్నింపును వేడుకుని అల్లాహ్ సాన్నిద్యం కొరకు సాష్టాంగపడ్డారు. పశ్ఛాత్తాపంతో ఆయన వైపు మరలారు.
Sâd 38:25
అప్పుడు మేము ఆయన కొరకు స్వీకరించి దాన్ని ఆయన కొరకు మన్నించాము. మరియు నిశ్ఛయంగా ఆయన మా వద్ద సాన్నిద్యం పొందిన వారు. మరియు ఆయన కొరకు పరలోకంలో మంచి పరిణామం కలదు.
Sâd 38:26
ఓ దావుద్ నిశ్చయంగా మేము నిన్ను భూమిలో ప్రతనిధిగా (ఖలీఫాగా) చేశాము. నీవు ధార్మిక,ప్రాపంచిక ఆదేశాలను,తీర్పులను జారీ చేస్తున్నావు. కాబట్టి నీవు ప్రజల మధ్య న్యాయముతో తీర్పునివ్వు. మరియు నీవు ప్రజల మధ్య నీ ఆదేశమివ్వటంలో ప్రత్యర్ధుల్లోంచి ఒకరు దగ్గరి బందువు కావటం వలన లేదా స్నేహితుడు కావటం వలన మగ్గుచూపటంతో లేదా ఏదైన విరోదం వలన అతని నుండి మరలిపోవటంతో మనోవాంఛలను అనుసరించకు. అప్పుడు మనోనాంఛ నిన్ను అల్లాహ్ సన్మార్గము నుండి తప్పించి వేస్తుంది. నిశ్ఛయంగా ఎవరైతే అల్లాహ్ సన్మార్గము నుండి తప్పిపోతారో లెక్కతీసుకునే దినమును వారి మరలిపోవటం వలన వారికి కఠినమైన శిక్ష కలదు. ఒక వేళ వారు దాన్ని గుర్తుంచుకుని దాని నుండి భయపడి ఉంటే వారు తమ మనోవాంఛలతో పాటు మరలేవారు కాదు.
Sâd 38:27
మరియు మేము ఆకాశమును,భూమిని వృధాగా సృష్టించలేదు. ఇది అవిశ్వాసపరుల భ్రమ మాత్రమే. ఈ విధమైన భ్రమను కలిగి ఉండే అవిశ్వాసపరులందరి కొరకు వారు తమ అవిశ్వాస స్థితిలోనే మరణించి,అల్లాహ్ పట్ల చెడుగా భావిస్తే ప్రళయదినాన నరకాగ్ని శిక్ష నుండి వినాశనం కలుగును.
Sâd 38:28
మేము అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను అనుసరించి,సత్కర్మలను చేసిన వారిని అవిశ్వాసముతో,పాపకార్యములతో భూమిపై చెడును ప్రభలించిన వారికి సమానులుగా చేయము. మరియు మేము తమ ప్రభువుపై ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి భీతి కలిగిన వారిని పాపకార్యముల్లో మునిగి ఉండే అవిశ్వాసపరులు,కపటవిశ్వాసుల మాదిరిగా చేయము. నిశ్ఛయంగా వారి మధ్య సమానత అన్యాయమవుతుంది. అది పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ కు తగదు. కాని అల్లాహ్ దైవభీతి కలిగిన విశ్వాసపరులని స్వర్గములో ప్రవేశింపజేయటం ద్వారా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు దుష్టులైన అవిశ్వాసపరులని నరకములో ప్రవేశింపజేసి శిక్షిస్తాడు. ఎందుకంటే వారు అల్లాహ్ వద్ద సమానులు కాజాలరు. అలాగే ఆయన వద్ద వారి ప్రతిఫలము కూడా సమానం కాజాలదు.
Sâd 38:29
నిశ్ఛయంగా ఈ ఖుర్ఆన్ మేము మీ వైపునకు అవతరింపజేసిన ఒక గ్రంధం చాలా మేళ్ళు,ప్రయోజనాలు కలిగి ఉన్నది. ప్రజలు వాటి ఆయతుల్లో యోచన చేయటానికి, వాటి అర్దములలో యోచన చేయటానికి. మరియు దాని ద్వారా ప్రకాశవంతమైన,సరైన బుద్ధి కలవారు హితబోధన గ్రహించటానికి.
Sâd 38:30
మరియు మేము దావూద్ కు అతని కుమారుడగు సులైమాన్ ను మా వద్ద నుండి ఆయనపై అనుగ్రహముగా,సౌభాగ్యముగా దాని ద్వారా ఆయన కంటిచలువ కొరకు ప్రసాదించాము. సులైమాన్ అలైహిస్సలాం ఎంతో మంచి దాసుడు. నిశ్చయంగా ఆయన ఎక్కువగా పశ్చాత్తాప్పడేవాడు మరియు అల్లాహ్ వైపునకు మరలేవాడు. మరియు ఆయన వైపునకు పశ్చాత్తాపముతో మరలే వాడు.
Sâd 38:31
మీరు ఆయనపై వేగవంతమైన మేలురకమైన గుర్రములు సాయంకాలం ప్రవేశపెట్టబడినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. అవి మూడు కాళ్ళపై నిలబడి నాలుగవ కాలును ఎత్తి ఉన్నవి. సూర్యుడు అస్తమించేవరకు ఈ మేలు జాతి గుర్రములు అతనిపై ప్రవేశపెట్టబడుతూ ఉన్నవి.
Sâd 38:32
అప్పుడు సులైమాన్ అలైహిస్సలాం ఇలా పలికారు : నిశ్ఛయంగా నేను నా ప్రభువు స్మరణపై సంపదను ఇష్టపడటముపై ప్రాధాన్యతనిచ్చాను. అందులో నుంచి ఈ గుర్రములు. చివరికి సూర్యుడు అస్తమించాడు. మరియు నేను అసర్ నమజ్ ను ఆలస్యంగా చేశాను.
Sâd 38:33
ఈ గుర్రాలను మళ్ళీ నా వద్దకు తీసుకుని రండి (అని. సులైమాన్ అలైహిస్సలాం అన్నారు). వాటిని ఆయన వద్దకు మరల తీసుకుని రావటం జరిగింది. అప్పుడు ఆయన ఖడ్గముతో వాటి పిక్కలపై మరియు వాటి మెడలపై కొట్టసాగారు.
Sâd 38:34
మరియు నిశ్ఛయంగా మేము సులైమాన్ అలైహిస్సలాంను పరీక్షించాము. మరియు ఆయన రాజ్య సింహాసనంపై ఒక షైతానును పడవేశాము. అతడు మనిషి రూపంలో ఉన్నాడు ఆయన రాజ్యంలో కొంత కాలం ఏలాడు. ఆ తరువాత సులైమాన్ అలైహిస్సలాంకు ఆయన రాజ్యము తిరిగి వచ్చినది. షైతానులపై ఆయనకు ఆధిక్యత కలిగినది.
Sâd 38:35
సులైమాన్ అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు నా పాపములను మన్నించు. మరియు నాకు ప్రత్యేకమైన సామ్రాజ్యమును ప్రసాదించు. అది నా తరువాత ప్రజల్లోంచి ఎవరికీ కలగకూడదు. ఓ నా ప్రభువా నీవు ఎక్కువగా అనుగ్రహించే వాడివి, గొప్ప ప్రధాతవి.
Sâd 38:36
అప్పుడు మేము ఆయన కొరకు స్వీకరించాము. మరియు మేము గాలిని ఆయన ఆదేశముకు అనుగుణంగా సుతిమెత్తగా వీచేటట్లుగా ఆయనకు ఆదీనంలో చేశాము. అందులో దాని బలముతో పాటు వేగమైన గాలి లేదు మరియు అది వీచటంలో వేగముగా లేదు. అది ఆయనను ఆయన కోరిన చోటుకు ఎత్తుకుని వెళుతుంది.
Sâd 38:37
మరియు మేము ఆయన కొరకు ఆయన ఆదేశముకు అనుగుణంగా నడిచే జిన్నాతులను వశపరచాము. వారిలో నుండి కట్టడములను నిర్మించేవారున్నారు. మరియు వారిలో నుండి సముద్రంలో మునిగి దాని నుండి ముత్యాలను వెలికితీసే గజఈతగాళ్ళు ఉన్నారు.
Sâd 38:38
జిన్నాతుల్లోంచి తలబిరుసు కలిగిన వారు ఆయనకు వశపరచబడినవి. వారు సంకెళ్ళలో బంధింపబడి ఉన్నారు.కదలలేరు.
Sâd 38:39
ఓ సులైమాన్ ఇది మా అనుగ్రహము దేనినైతే నీవు మాతో కోరటం వలన మేము దాన్ని నీకు ప్రసాదించాము. అయితే నీవు తలచిన వారికి ఇవ్వు మరియు నీవు తలచిన వారికి ఇవ్వకు. ఇచ్చిన విషయంలో లేదా ఆపిన విషయంలో నీతో లెక్కతీసుకోబడదు.
Sâd 38:40
మరియు నిశ్చయంగా సులైమాన్ అలైహిస్సలాం మా వద్ద సాన్నిద్యం పొందిన వారిలోంచి వారు. మరియు ఆయన కొరకు మంచి మరలే చోటు కలదు. అది స్వర్గము.
Sâd 38:41
ఓ ప్రవక్తా మీరు మా దాసుడగు అయ్యూబ్ తన ప్రభువైన అల్లాహ్ ను ఇలా వేడుకున్నప్పటి వైనమును గుర్తు చేసుకోండి : నిశ్ఛయంగా షైతాను నాకు అలసటను మరియు శిక్షను కలిగించాడు
Sâd 38:42
అప్పుడు మేము అతనితో ఇలా పలికాము : మీరు మీ కాలును నేలపై కొట్టండి. ఆయన తన కాలును నేలపై కొట్టారు. అప్పుడు దాని నుండి నీరు పొంగి వచ్టినది. ఆయన దాని నుండి త్రాగారు మరియు స్నానం చేశారు. అప్పుడు ఆయనకు ఉన్న కీడు మరియు బాధ తొలగిపోయింది.
Sâd 38:43
అప్పుడు మేము అతని కొరకు దుఆను స్వీకరించి ఆయనకు కలిగిన కష్టమును తొలగించాము. మరియు మేము అతనికి అతని కుటుంబంవారిని ప్రసాదించాము. మరియు మేము అతనికి వారి వంటివారిని కుమారుల్లోంచి మనవుళ్ళోంచి మా వద్ద నుండి కారుణ్యంగా ఆయనకు మరియు ఆయన సహనంనకు ప్రతిఫలంగా ప్రసాదించాము. సరైన బుద్దుల కలవారు సహనము యొక్క పరిణామం ఆపద తొలిగిపోవటం మరియు పుణ్యం అని హితబోధన గ్రహించాలి.
Sâd 38:44
అప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం తన భార్యపై ఆగ్రహం చెంది ఆమెకు వంద కొరడా దెబ్బలు కొడతారని శపధం చేశారు. మేము ఆయనకు ఇలా ఆదేశించాము : నీవు ఖర్జూర పండ్ల గుత్తి కట్టను నీ చేతిలో తీసుకుని నీ ప్రమాణము యొక్క వియోచనం కొరకు దానితో ఆమెను కొట్టు. నీవు చేసిన ప్రమాణమును భంగపరచకు. అప్పుడు ఆయన ఖర్జూరపు పండ్ల గుత్తి కట్టతో ఆమెను కొట్టారు. నిశ్చయంగా మేము ఆయన్ని పరీక్షించిన దానిలో సహనం చూపేవాడిగా పొందాము. ఆయన ఎంతో మంచి దాసుడు. నిశ్ఛయంగా ఆయన అల్లాహ్ వైపునకు ఎక్కువగా మరలే వాడును,పశ్చాత్తాపముతో మరలేవాడును.
Sâd 38:45
ఓ ప్రవక్తా మీరు మేము ఎంచుకున్న మా దాసులైన మరియు మేము పంపించిన ప్రవక్తలైన ఇబ్రాహీం,ఇస్హాఖ్,యాఖూబ్ లను గుర్తు చేసుకోండి. వారు అల్లాహ్ పై విధేయత చూపే విషయంలో మరియు ఆయన మన్నతలను కోరకునే విషయంలో బలవంతులుగా ఉండేవారు. మరియు వారు సత్యం విషయంలో అంతర్దృష్టి కలవారు,నీతిమంతులు.
Sâd 38:46
నిశ్ఛయంగా మేము వారిపై ఒక ప్రత్యేక గుణమును అనుగ్రహించి దానితో వారిని ప్రత్యేకించాము. మరియు అది వారి హృదయములను పరలోక నివాస చింతనతో నిర్మించటం మరియు దాని కొరకు సత్కర్మతో సిద్ధం కావటం మరియు ప్రజలను దాని కొరకు ఆచరించటం వైపునకు పిలవటం.
Sâd 38:47
మరియు నిశ్ఛయంగా వారు మా వద్ద మా విధేయత కొరకు,మా ఆరాధన కొరకు ఎన్నుకోబడినవారు. మరియు మేము వారిని మా దైవదౌత్యమును మోయటానికి మరియు ప్రజలకు దాన్ని చేరవేయటానికి ఎన్నుకున్నాము.
Sâd 38:48
ఓ ప్రవక్తా మీరు ఇబ్రాహీం అలైహిస్సలామ్ కుమారుడగు ఇస్మాయీల్ అలైహిస్సలాంను జ్ఞాపకం చేసుకోండి మరియు అల్ యసఅ ను జ్ఞాపకం చేసుకోండి. మరియు జుల్ కిఫ్ల్ ను జ్ఞాపకం చేసుకోండి. మరియు వారిపై మంచిగా కీర్తించండి. వారు దానికి యోగ్యులు. మరియు వారందరు అల్లాహ్ వద్ద ఎంచుకోబడిన మరియు ఎన్నుకోబడిన వారిలో నుంచి వారు.
Sâd 38:49
వీరందరి కొరకు ఖర్ఆన్ లో మంచి కీర్తి ద్వారా ఈ గుర్తింపు కలదు. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండే దైవభీతి కలవారి కొరకు పరలోక నివాసములో మంచి మరలే చోటు కలదు.
Sâd 38:50
ఈ మంచి మరలింపు అది వారు ప్రళయదినాన ప్రవేశించే శాశ్వత స్వర్గ వనాలు. మరియు వారిపై మర్యాదగా వారి కొరకు వాటి తలుపులు తెరవబడి ఉంటాయి.
Sâd 38:51
వారి కొరకు అలంకరించబడి ఉన్న ఆసనాలపై ఆనుకుని కూర్చుని తమ సేవకులతో తాము కోరుకునే చాలా రకరకాల ఫలాలను మరియు తాము కోరే మధుపానీయముల్లోంచి,ఇతర వాటిలోంచి పానీయములను తమ ముందు ప్రవేశపెట్టమని కోరుతుంటారు.
Sâd 38:52
మరియు వారి వద్ద తమ భర్తల ముందు తమ చూపులను క్రిందకు వాల్చిన స్త్రీలు ఉంటారు. వారు వారిని దాటి ఇతరుల వద్దకు వెళ్ళరు. మరియు వారు సమవయస్కులై ఉంటారు.
Sâd 38:53
ఓ దైవభీతి కలవారా ఇది మీరు ఇహలోకములో చేసుకున్న మీ సత్కర్మలపై ప్రళయదినమున మంచి ప్రతిఫలము ప్రసాదించబడతుందని మీకు చేయబడిన వాగ్ధానము.
Sâd 38:54
నిశ్చయంగా మేము ప్రస్తావించిన ఈ ప్రతిఫలము మీమిచ్చే జీవనోపాధి దాన్ని మేము ప్రళయదినమున దైవభీతికలవారికి ప్రసాదిస్తాము. మరియు అది నిరంతరం ఉండే జీవనోపాధి. అది తరగదు మరియు అంతమవదు.
Sâd 38:55
మేము ప్రస్తావించిన ఇది దైవభీతి కలవారి యొక్క ప్రతిఫలము. మరియు నిశ్చయంగా అవిశ్వాసముతో,పాపకార్యములతో అల్లాహ్ హద్దులను అతిక్రమించే వారి కొరకు దైవభీతి కలవారి ప్రతిఫలమునకు భిన్నంగా ప్రతిఫలముంటుంది. వారి కొరకు ప్రళయదినమున వారు మరలివెళ్ళే అతి చెడ్డ మరలే చోటు కలదు.
Sâd 38:56
ఈ ప్రతిఫలం అది నరకము వారిని చుట్టుముట్టి ఉంటుంది. వారు దాని వేడిని మరియు దాని జ్వాలలను అనుభవిస్తారు. వారి కొరకు దాని నుండి ఒక పరుపు ఉంటుంది. వారి పరుపు ఎంతో చెడ్డదైన పరుపు.
Sâd 38:57
ఈ శిక్ష అత్యంత వేడిగల నీరు, అందులో శిక్షింపబడే నరకవాసుల శరీరముల నుండి కారే చీము రూపంలో ఉంటుంది. అయితే వారు దాన్ని త్రాగాలి. అది దాహమును తీర్చని వారి పానీయం.
Sâd 38:58
మరియు వారి కొరకు ఈ శిక్ష కన్న వేరే రూపంలో ఇంకో శిక్ష కలదు. అయితే వారి కొరకు ఎన్నో రకాల శిక్షలు కలవు. వారు వాటి ద్వారా పరలోకంలో శిక్షింపబడుతారు.
Sâd 38:59
మరియు నరకవాసులు ప్రవేశించినప్పుడు వారి మధ్య ప్రత్యర్దుల మధ్య వాటిల్లే ధూషణలు వాటిల్లుతాయి. మరియు వారు ఒకరి నుండి ఒకరు విసుగును చూపుతారు. వారిలో నుండి కొందరు ఇలా పలుకుతారు : ఇది నరకవాసుల్లోంచి ఒక వర్గము మీతో పాటు నరకంలో ప్రవేశిస్తుంది. అప్పుడు వారు వారికి ఇలా సమాధానమిస్తారు : వారికి ఎలాంటి స్వాగతం లేదు నిశ్ఛయంగా వారు మేము బాధపడుతున్నట్లే నరకాగ్ని శిక్ష వలన బాధపడుతారు.
Sâd 38:60
అనుసరించేవారి వర్గము అనుసరించబడిన తమ నాయకులతో ఇలా పలుకుతారు : కాదు మీకే ఓ అనుసరించబడిన నాయకులారా ఎటువంటి స్వాగతం లేదు. మీరే మాకు అపమార్గమునకు లోను చేయటం వలన,పెడదారికి గురి చేయటం వలన ఈ బాధాకరమైన శిక్షకు కారణమయ్యారు. ఈ నివాస స్థలం ఎంత చెడ్డ నివాస స్థలము. అందరి నివాస స్థలము అది నరకాగ్ని.
Sâd 38:61
అనుసరించేవారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా మా వద్దకు వచ్చిన తరువాత సన్మార్గము నుండి ఎవరైతే మమ్మల్ని తప్పించారో వారికి నరకాగ్నిలో రెట్టింపు శిక్షను కలిగించు.
Sâd 38:62
తలబిరుసులైన అహంకారులు ఇలా అంటారు : మాకేమయ్యింది మేము ఇహలోకంలో శిక్షకు అర్హులైన వారైన దుష్టుల్లోంచి భావించిన వారైన జనులను మాతో పాటు నరకంలో చూడటం లేదే ?.
Sâd 38:63
ఏమీ వారి గురించి మా పరిహాసము మరియు ఎగతాళి తప్పైనదా అందుకే వారు శిక్షకు అర్హులు కాలేదా ? లేదా వారి గురించి మా పరిహాసము సరై వారు నరకంలో ప్రవేశించారా. మరియు మా దృష్టి వారిపై పడలేదా ?!.
Sâd 38:64
నిశ్ఛయంగా మేము మీకు ప్రస్తావించిన నరక వాసుల మధ్య ఈ ఘర్షణ ప్రళయదినాన తప్పకుండా జరిగితీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు మరియు సంశయం లేదు.
Sâd 38:65
ఓ ముహమ్మద్ మీరు మీ జాతిలో నుండి అవిశ్వాసపరులతో ఇలా పలకండి : నేను కేవలం మీకు అల్లాహ్ శిక్ష నుండి అది మీపై ఆయన పట్ల మీ అవిశ్వాసం వలన మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించటం వలన వాటిల్లుతుందని హెచ్చరించేవాడిని మాత్రమే. పరిశుద్ధుడైన అల్లాహ్ తప్ప ఆరాధనకు యోగ్యుడైన దైవం పొందబడడు. కావున ఆయన తన గొప్పతనంలో,తన గుణాల్లో,తన నామములలో అద్వితీయుడు. మరియు ఆయనే ప్రతీ దానిపై ఆధిక్యతను కనబరిచే ఆధిక్యుడు. కాబట్టి ప్రతీది ఆయనకు లోబడి ఉన్నది.
Sâd 38:66
మరియు ఆయన ఆకాశములకు ప్రభువు మరియు భూమికి ప్రభువు మరియు వాటి మధ్య ఉన్న వాటికి ప్రభువు. మరియు ఆయన తన రాజ్యాధికారములో సర్వాధిక్యుడు,ఆయనను ఎవరు ఓడించలేరు. మరియు ఆయన తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడు.
Sâd 38:67
ఓ ప్రవక్త ఈ తిరస్కారులందరితో ఇలా పలకండి : నిశ్చయంగా ఖుర్ఆన్ గొప్ప విషయంగల సందేశము.
Sâd 38:68
మీరు ఈ గొప్ప విషయం గల సందేశము నుండి విముఖులవుతున్నారు. దాని వైపు శ్రద్ధ వహించటం లేదు.
Sâd 38:69
ఆదమ్ అలైహిస్సలాం సృష్టి విషయంలో దైవదూతల మధ్య జరిగిన చర్చ గురించి నాకు ఎటువంటి జ్ఞానం ఉండేది కాదు ఒక వేళ అల్లాహ్ నాపై దైవవాణి అవతరింపజేసి నాకు తెలియపరచకుండా ఉంటే.
Sâd 38:70
అల్లాహ్ నాకు దైవ వాణి చేయవలసినది చేశాడు ఎందుకంటే నేను మీకు ఆయన శిక్ష నుండి హెచ్చరించే వాడిని,హెచ్చరికను స్పష్టంగా చేసేవాడిని.
Sâd 38:71
మీ ప్రభువు దైవదూతలతో ఇలా పలికినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి : నిశ్ఛయంగా నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను. మరియు అతడు ఆదమ్ అలైహిస్సలాం.
Sâd 38:72
నేను అతని సృష్టిని సరిగా చేసి అతని రూపమును సరిదిద్ది అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరు అతనికి సాష్టాంగపడండి.
Sâd 38:73
అప్పుడు దైవదూతలు తమ ప్రభువు ఆదేశమును చేసి చూపించారు. అప్పుడు వారందరు గౌరవప్రదమైన సాష్టాంగమును చేశారు. వారిలో నుండి ఆదం అలైహిస్సలాంకు సాష్టాంగపడకుండా ఎవరూ మిగలలేదు.
Sâd 38:74
కాని ఇబ్లీస్ సాష్టాంగపడటం నుండి అహంకారమును చూపాడు. మరియు అతడు తన ప్రభువు ఆదేశంనకు వ్యతిరేకంగా తన గర్వం వలన అవిశ్వాసపరుల్లోంచి అయిపోయాడు.
Sâd 38:75
అల్లాహ్ ఇలా పలికాడు : ఓ ఇబ్లీస్ నేను నా చేతితో సృష్టించిన ఆదంకు సాష్టాంగపడటం నుండి నిన్ను ఏది ఆపినది ?!. ఏమీ సాష్టాంగపడటం నుండి గర్వం నిన్ను ఆపినదా లేదా ముందు నుండే నీవు నీ ప్రభువుపై గర్వం,అహంకారం కలవాడివా ?!.
Sâd 38:76
ఇబ్లీస్ ఇలా పలికాడు : నేను ఆదం కన్న గొప్పవాడిని. నిశ్చయంగా నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు ఆదంను మట్టితో సృష్టించావు. మరియు అతని ఉద్దేశం ప్రకారం అగ్ని మట్టికన్న ఎంతో గొప్ప మూలకము.
Sâd 38:77
అల్లాహ్ ఇబ్లీసుకు ఇలా ఆదేశమిచ్చాడు : నీవు స్వర్గము నుండి వెళ్ళిపో. నిశ్చయంగా నీవు శపించబడ్డావు మరియు ధూషించబడ్డావు.
Sâd 38:78
మరియు నిశ్చయంగా నీపై స్వర్గం నుండి ధూత్కారము ప్రతిఫలదినం వరకు ఉంటుంది. మరియు అది ప్రళయదినము.
Sâd 38:79
ఇబ్లీస్ ఇలా పలికాడు : నీవు నాకు గడువునిచ్చి నీ దాసులను నీవు మరల లేపే రోజు వరకు నాకు మరణం కలిగించకు.
Sâd 38:80
అల్లాహ్ ఇలా పలికాడు : నీవు గడువివ్వబడిన వారిలో వాడివి.
Sâd 38:81
వినాశనము కొరకు నియమిత,నిర్ధారిత సమయ రోజు వరకు.
Sâd 38:82
ఇబ్లీస్ ఇలా పలికాడు : అయితే నేను నీ సామర్ధ్యము,నీ ఆధిక్యత పై ప్రమాణం చేస్తున్నాను నేను ఆదం సంతతినంతటినీ తప్పకుండా అపమార్గమునకు లోను చేస్తాను.
Sâd 38:83
నీవు ఎవరినైతే నా మార్గభ్రష్టత నుండి రక్షించి నీ ఒక్కడి ఆరాధన చేయటం కొరకు ప్రత్యేకించుకున్నావో వారు తప్ప.
Sâd 38:84
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికాడు : అయితే సత్యం నా నుండే. నేను పలికేది సత్యము. అది తప్ప ఇంకొకటి నేను పలకను.
Sâd 38:85
నేను తప్పకుండా ప్రళయదినమున నరకమును నీతో మరియు నీ అవిశ్వాసంలో నిన్ను అనుసరించిన ఆదం సంతతినంతటితో నింపివేస్తాను.
Sâd 38:86
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : నేను మీకు చేరవేసిన హితోపదేశములపై మీతో ఎటువంటి ప్రతిఫలమును అడగటం లేదు. మరియు నేను నాకు ఆదేశం ఇవ్వబడిన దాని కంటే అధికంగా తీసుకుని వచ్చే బాధ్యుడిని కాను.
Sâd 38:87
ఖుర్ఆన్ కేవలం బాధ్యులైన మానవులకి మరియు జిన్నులకి ఒక హితోపదేశం మాత్రమే.
Sâd 38:88
మరియు ఈ ఖుర్ఆన్ సందేశమును మరియు అది సత్యం పలికేదని మీరు మరణించే కొద్ది సమయము ముందు తెలుసుకుంటారు.
Zümer 39:1
ఖుర్ఆన్ అవతరణ ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడైన అల్లాహ్ వద్ద నుండి జరిగింది. తన సృష్టించటంలో మరియు తన పర్యాలోచనలో మరియు తన ధర్మ శాసనాల్లో వివేకవంతుడు. అది పరిశుద్ధుడైన ఆయన వద్ద నుండి కాకుండా ఇతరుల వద్ద నుండి అవతరించలేదు.
Zümer 39:2
ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మేము సత్యముతో కూడుకుని ఉన్న ఖుర్ఆన్ ను మీపై అవతరింపజేశాము. అయితే దాని సందేశములన్ని సత్యము మరియు దాని ఆదేశాలన్ని న్యాయపూరితమైనవి. కాబట్టి మీరు అల్లాహ్ నే ఆయన కొరకు ఏకేశ్వరోపాసనను చేస్తూ,ఆయన కొరకు షిర్కు నుండి తౌహీదును ప్రత్యేకిస్తూ ఆరాధన చేయండి.
Zümer 39:3
వినండి షిర్కు నుండి ఖాళీ అయిన ధర్మం అల్లాహ్ కే ప్రత్యేకము. మరియు ఎవరైతే అల్లాహ్ ను వదిలి విగ్రహాలను మరియు షైతానులను స్నేహితులుగా చేసుకుని అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధించే వారు తమ ఆరాధనను వారి కొరకు తమ మాటల్లో ఇలా నిరాకరిస్తారు : మేము వారందరిని ఆరాధించేది వారు మమ్మల్ని స్థానపరంగా దగ్గర చేయటానికి మరియు మా అవసరాలను ఆయనకు చేరవేయటానికి మరియు మా కొరకు ఆయన వద్ద సిఫారసు చేయటానికి. నిశ్చయంగా అల్లాహ్ ప్రళయదినాన ఏకేశ్వరోపాసన చేసే విశ్వాసపరుల మధ్య మరియు సాటికల్పించే అవిశ్వాసపరుల మధ్య వారు తౌహీద్ విషయంలో విభేదించుకునే దాని గురించి తీర్పునిస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ పై ఆయన కొరకు సాటిని అంటగట్టి అబద్దమును పలికే వాడిని మరియు తనపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలపట్ల కృతఝ్నుడయ్యే వాడిని సత్యం వైపునకు సన్మార్గం పొందటము కొరకు సౌభాగ్యమును కలిగించడు.
Zümer 39:4
ఒక వేళ అల్లాహ్ కొడుకుని చేయదలచుకుంటే తన సృష్టి రాసుల్లోంచి తాను కోరిన వారిని ఎంచుకుని అతడిని కొడుకు స్థానమును కలిగించేవాడు. అతడు ఈ ముష్రికులందరు పలికే మాటల నుండి అతీతుడు మరియు పరిశుద్ధుడు. ఆయన తన అస్తిత్వంలో, తన గుణాల్లో, తన కార్యాల్లో ఒక్కడు. వాటిలో ఆయనకు సాటి ఎవరూ లేరు. తన సృష్టితాలపై ఆధిక్యతను కలిగినవాడు.
Zümer 39:5
ఆయన గొప్ప జ్ఞానముతో ఆకాశములను మరియు భూమిని సృష్టించాడు. దుర్మార్గులు పలికినట్లు వృధాగా కాదు. ఆయన రాత్రిని పగటిపై ప్రవేశింపజేస్తాడు. మరియు పగలును రాత్రిపై ప్రవేశింపజేస్తాడు. ఒకటి వచ్చినప్పుడు రెండవది అదృశ్యమైపోతుంది. మరియు ఆయన సూర్యుడిని ఉపయుక్తంగా చేశాడు. మరియు చంద్రుడిని ఉపయుక్తంగా చేశాడు. వాటిలో నుండి ప్రతి ఒక్కటి ఒక నిర్ధారిత సమయం కొరకు పయనిస్తుంది. అది ఈ జీవితము ముగింపు. వినండి పరిశుద్ధుడైన ఆయనే సర్వాధిక్యుడు ఎవరైతే తన శతృవులపై ప్రతీకారం తీర్చుకుంటాడో. మరియు ఆయనపై ఎవరూ ఆధిక్యతను చూపరు. ఆయన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడు.
Zümer 39:6
ఓ ప్రజలారా మీ ప్రభువు మిమ్మల్ని ఒకే ప్రాణమైన ఆదం నుండి సృష్టించాడు. ఆ తరువాత ఆదం నుండి ఆయన భార్య హవ్వాను సృష్టించాడు. మరియు ఆయన మీ కొరకు ఒంటెల నుండి,ఆవుల నుండి,గొర్రెల నుండి,మేకల నుండి ఎనిమిది రకముల వాటిని సృష్టించాడు. ప్రతీ రకము నుండి మగ,ఆడను సృష్టించాడు. పరిశుద్ధుడైన ఆయన మిమ్మల్ని మీ మాతృ గర్భములో ఒక దశ తరువాత ఇంకో దశను కడుపు,గర్భము,మావి (తల్లి గర్భములో శిసువుపై ఉండే పొర) యొక్క చీకట్లలో సృష్టించాడు. వాటన్నింటిని సృష్టించిన వాడే మీ ప్రభువైన అల్లాహ్. రాజ్యాధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. ఆయన తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఇంకొకడు లేడు. అటువంటప్పుడు మీరు ఎలా ఆయన ఆరాధన చేయటం నుండి ఏమీ సృష్టించకుండా తామే సృష్టించబడి వాటి ఆరాధన చేయటం వైపునకు మరలిపోతున్నారు ?!.
Zümer 39:7
ఓ ప్రజలారా ఒక వేళ మీరు మీ ప్రభువు పట్ల అవిశ్వాసమును కనబరిస్తే నిశ్ఛయంగా అల్లాహ్ మీ విశ్వాసము అక్కర లేని వాడు. మరియు మీ అవిశ్వాసం ఆయనకు నష్టం కలిగించదు. మరియు మీ అవిశ్వాసము యొక్క నష్టము మీ వైపునకు మాత్రమే మరలుతుంది. మరియు ఆయన తన దాసుల కొరకు తనను అవిశ్వసించటమును ఇష్టపడడు. మరియు వారిని అవిశ్వసించమని ఆదేశించడు. ఎందుకంటే అల్లాహ్ అశ్లీలత గురించి,చెడు గురించి ఆదేశించడు. మరియు ఒక వేళ మీరు అల్లాహ్ కు ఆయన అనుగ్రహాలపై కృతజ్ఞత తెలిపి ఆయనపై విశ్వాసమును కనబరిస్తే ఆయన మీ కృతజ్ఞత నుండి సంతుష్టపడి మీకు దాని ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు ఒక ప్రాణం వేరే ప్రాణము యొక్క పాపమును మోయదు. అంతేకాదు ప్రతీ వ్యక్తి తాను చేసుకున్న దానికి ప్రతిగా తాకట్టుగా ఉంటాడు. ఆ తరువాత మీరు ప్రళయదినమున మీ మరలటం ఒక్కడైన మీ ప్రభువు వైపునకు జరుగును. అప్పుడు ఆయన ఇహలోకంలో మీరు చేసుకున్న కర్మల గురించి మీకు సమాచారమిస్తాడు. మరియు ఆయన మీ కర్మలపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. నిశ్ఛయంగా పరిశుద్ధుడైన ఆయన తన దాసుల హృదయములలో ఉన్న వాటి గురించి బాగా తెలిసినవాడు. వాటిలో ఉన్నది ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Zümer 39:8
మరియు అవిశ్వాసపరుడికి ఏదైన కీడు రోగము ,సంపదను కోల్పోవటము, మునిగిపోయే భయం రూపంలో సంభవించినప్పుడు అతడు పరిశుద్ధుడైన తన ప్రభువుతో ఆయన ఒక్కడి వైపు మరలుతూ తనకు కలిగిన కీడును తొలగించమని వేడుకుంటాడు. ఆయన అతనికి కలిగిన కీడును తొలగించి అతనికి అనుగ్రహాన్ని కలిగించినప్పుడు అతడు ముందు నుండి కడువినయంతో వేడుకున్న అల్లాహ్ ను వదిలివేస్తాడు. మరియు అతడు అల్లాహ్ కొరకు భాగస్వాములను చేసుకుని వారిని అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తాడు ఇతరులను అల్లాహ్ మర్గము ఏదైతే ఆయనకు చేరుతుందో దాని నుండి మరలించటానికి. ఓ ప్రవక్తా ఈ స్థితి కలిగిన వాడితో ఇలా పలకండి : నీ అవిశ్వాసముతో మిగిలిన నీ జీవితమంతా ప్రయోజనం చెందు. అది కొద్దిపాటి కాలమే. నిశ్ఛయంగా నీవు నరకవాసుల్లోంచి వాడివి ప్రళయదినమున నీవు దాన్ని ఒక స్నేహితుడు తన స్నేహితుడిని అట్టిపెట్టుకుని ఉన్నట్లుగా అట్టిపెట్టుకుని ఉంటావు.
Zümer 39:9
ఏమిటీ ఎవరైతే అల్లాహ్ కు విధేయుడై రాత్రి సమయములను తన ప్రభువు కొరకు సాష్టాంగపడుతూ మరియు ఆయన కొరకు నిలబడుతూ గడిపి,పరలోక శిక్ష నుండి భయపడి తన ప్రభువు కారుణ్యము గురించి యోచన చేస్తాడో అతడు ఉత్తముడా లేదా ఆ విశ్వాసపరుడు ఎవరైతే కష్ట సమయముల్లో అల్లాహ్ ను ఆరాధించి కలిమిలో ఆయన పట్ల అవిశ్వాసమును కనబరచి,అల్లాహ్ తో పాటు భాగస్వాములను చేసుకుంటాడో అతడు ఉత్తముడా ?!. ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఏమీ ఎవరైతే అల్లాహ్ తమపై అనివార్యం చేసిన వాటిని అల్లాహ్ ను తాము గుర్తించటం వలన తెలుసుకుంటారో వారు మరియు ఎవరైతే వీటిలో నుండి ఏమీ తెలియనివారు సమానులవుతారా ?!. ఈ రెండు వర్గముల మధ్య ఉన్న వ్యత్యాసమును సరైన బుద్ధులు కలవారు మాత్రమే గుర్తిస్తారు.
Zümer 39:10
ఓ ప్రవక్తా మీరు నాపై,నా ప్రవక్తలపై విశ్వాసమును కనబరచిన నా దాసులతో ఇలా పలకండి : మీరు మీ ప్రభువుతో ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయభీతిని కలిగి ఉండండి. మీలో నుండి ఇహలోకంలో సత్కర్మలను చేసిన వారి కొరకు ఇహలోకములో విజయము (సహాయము),ఆరోగ్యము, సంపద రూపములో మరియు పరలోకములో స్వర్గము రూపములో మేలు కలదు. మరియు అల్లాహ్ యొక్క భూమి విశాలమైనది. కావున మీరు అందులో అల్లాహ్ ఆరాధన చేయటానికి ఏదైన ప్రదేశం పొంది,మిమ్మల్ని ఏ ఆటంకము ఆపనంత వరకు హిజ్రత్ చేయండి. సహనం పాటించేవారు ప్రళయదినమున వారి పుణ్యము లెక్క లేనంత మరియు దాని అధికమవటం వలన,దాని రకరకాలు ఉండటం వలన షుమారు చేయలేనంత ప్రసాదించబడుతుంది.
Zümer 39:11
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్ఛయంగా అల్లాహ్ నేను ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకిస్తూ ఆయన ఒక్కడినే ఆరాధన చేయాలని ఆదేశించాడు.
Zümer 39:12
మరియి నేను ఈ సమాజము (ఉమ్మత్) నుండి మొట్టమొదట ఆయనకు విధేయుడినై,కట్టుబడి ఉండే వాడినవ్వాలని ఆయన నాకు ఆదేశించాడు.
Zümer 39:13
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఒక వేళ నేను అల్లాహ్ కు అవిధేయుడినై ఆయనకు విధేయత చూపకుండా ఉంటే గొప్ప దిన శిక్ష నుండి భయపడుతున్నాను. అది ప్రళయదినము.
Zümer 39:14
ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి : నిశ్చయంగా నేను అల్లాహ్ ఒక్కడినే ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకిస్తూ ఆరాధిస్తున్నాను. ఆయనతో పాటు నేను ఇతరులను ఆరాధించను.
Zümer 39:15
ఓ ముష్రికులారా మీరు ఆయనను వదిలి మీరు కోరుకున్న విగ్రహాలను ఆరాధించుకోండి (బెదిరించటానికి ఈ ఆదేశం). ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా వాస్తవానికి నష్టపోయే వారు ఎవరంటే తమ స్వయానికి,తమ ఇంటి వారికి నష్టం కలిగించుకుని వారు ఒక్కరే స్వర్గములో ప్రవేశించటం వలన లేదా తమతో పాటు వారూ నరకములో ప్రవేశించటం వలన తమ నుండి వారిని విడిపోవటం వలన వారు వారిని కలుసుకోరు. ఎన్నటికి కలవరు. వినండి ఇదే ఎటువంటి సందేహం లేని స్పష్టమైన నష్టము.
Zümer 39:16
వారి కొరకు వారిపై నుండి పొగ,జ్వాల,వేడి క్రమ్ముకుని ఉంటాయి. మరియు వారి క్రింది నుండి పొగ,జ్వాల,వేడి క్రమ్ముకుని ఉంటాయి. ఈ ప్రస్తావించబడిన శిక్ష ద్వారా అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. ఓ నా దాసులారా మీరు నా ఆదేశాలను పాటిస్తూ మరియు నేను వారించిన వాటికి దూరంగా ఉంటూ నాకు భయపడండి.
Zümer 39:17
మరియు ఎవరైతే విగ్రహాల ఆరాధన చేయటం నుండి మరియు అల్లాహ్ ను వదిలి ఆరాధించబడే వాటన్నిటి ఆరాధన నుండి దూరంగా ఉండి,పశ్చాత్తాపముతో అల్లాహ్ వైపునకు మరలుతారో వారి కొరకు మరణము సమయమున,సమాధిలో,ప్రళయదినమున స్వర్గము యొక్క శుభవార్త కలదు. ఓ ప్రవక్తా మీరు నా దాసులకు శుభవార్తనివ్వండి.
Zümer 39:18
ఎవరైతే మాటను విని దాని నుండి మంచిని,చెడును వ్యత్యాసపరచి మంచిమాటను దానిలో ఉన్న ప్రయోజనం వలన అనుసరిస్తారో ఈ గుణాలతో వర్ణించబడిన వారికే అల్లాహ్ సన్మార్గము కొరకు భాగ్యమును కలిగించాడు. మరియు వారందరు సరైన బుద్ధులు కలవారు.
Zümer 39:19
ఎవరిపైనైతే తాను తన అవిశ్వాసమును కనబరచటంలో,అపమార్గంలో కొనసాగిపోవటం వలన శిక్ష యొక్క వాక్కు అనివార్యమైపోయినదో ఓ ప్రవక్తా అతనికి సన్మార్గం చూపటంలో, అతడిని అనుగ్రహించటంలో మీకు ఎటువంటి వ్యూహం లేదు. ఓ ప్రవక్తా ఏమిటీ మీరు ఈ లక్షణాలు కలిగిన వాడిని నరకాగ్ని నుండి రక్షించగలరా ?!.
Zümer 39:20
కానీ ఎవరైతే తమ ప్రభువు నుండి ఆయన ఆదేశములను పాటిస్తూ మరియు ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉంటూ భయపడుతారో అటువంటి వారి కొరకు ఎత్తైన భవనములు కలవు. అవి ఒక దానిపై ఒకటి ఉంటాయి. వాటి క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అల్లాహ్ వారికి వాటి గురించి గట్టి వాగ్దానం చేశాడు. మరియు అల్లాహ్ వాగ్దానమును భంగపరచడు.
Zümer 39:21
నిశ్చయంగా మీరు వీక్షించటం వలన అల్లాహ్ ఆకాశము నుండి వర్షపు నీటిని కురిపించాడని తెలుసుకున్నారు. అప్పుడు ఆయన దాన్ని సెలయేరులలో,ప్రవాహములలో ప్రవేశింపజేశాడు. ఆ తరువాత ఆ నీటితో రకరకాల రంగులుకల పంటలను వేలికి తీస్తాడు. ఆ తరువాత పంటలు ఎండిపోతాయి. ఓ వీక్షకుడా నీవు దాన్ని పచ్చగా ఉండిన తరువాత పసుపు రంగులో చూస్తావు. ఆ పిదప అది ఎండిన తరువాత ఆయన దాన్ని చూర్ణంగా,విచ్చిన్నంగా చేస్తాడు. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన దానిలో జీవించి ఉన్న హృదయములు కలవారి కొరకు హితోపదేశం కలదు.
Zümer 39:22
ఏమి ఎవరి హృదయమునైతే అల్లాహ్ ఇస్లాం కొరకు తెరిస్తే అతడు దానివైపునకు మార్గం పొంది,తన ప్రభువు వద్ద నుండి వెలుగుపై ఉంటే అతడు ఎవరి హృదయమైతే అల్లాహ్ స్మరణ నుండి కఠినంగా మరిపోయినదో అతనిలా ఉంటాడా ?. వారిద్దరు ఎన్నటికి సమానులు కారు. సన్మార్గం పొందిన వారి కొరకు సాఫల్యము కలదు. మరియు అల్లాహ్ స్మరణ నుండి కఠినంగా మారిపోయిన హృదయములు కలవారి కొరకు నష్టము కలదు. వారందరు సత్యము నుండి స్పష్టమైన అపమార్గంలో ఉన్నారు.
Zümer 39:23
అల్లాహ్ తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సర్వశ్రేష్ఠమైన బోధనలైన ఖుర్ఆన్ ను అవతరింపజేశాడు. ఆయన దానిని పరస్పరం పోలినట్లుగా అవతరింపజేశాడు. అవి నిజాయితీలో,శ్రేష్ఠతలో,సంకీర్ణంలో,వ్యతిరేకతలు లేకపోవటంలో ఒక దానితో మరోకటి పోలి ఉన్నాయి.అందులో ఎన్నో గాధలు,ఆదేశములు,వాగ్దానములు,బెదిరింపులు,సత్యవంతుల గుణాలు,అసత్యపరుల గుణాలు మరియు వేరేవి ఉన్నాయి. అందులో ఉన్న హెచ్చరికలను,బెదిరింపులను తమ ప్రభుతో భయపడేవారు విన్నప్పుడు వారి శరీరములపైన ఉన్న రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తరువాత అందులో ఉన్న ఆశలను,శుభవార్తలను విన్నప్పుడు అల్లాహ్ స్మరణ వైపునకు వారి శరీరములు మరియు వారి హృదయములు మెత్తబడిపోతాయి. ఈ ప్రస్తావించబడిన ఖుర్ఆన్,దాని ప్రభావము అల్లాహ్ మార్గదర్శకత్వము. దాని ద్వారా ఆయన తాను తలచిన వారికి సన్మార్గం చూపుతాడు. మరియు అల్లాహ్ ఎవరిని పరాభవమునకు లోను చేస్తాడో అతడికి ఆయన సన్మార్గము కొరకు భాగ్యమును కలిగించడు. అప్పుడు అతని కొరకు సన్మార్గం చూపేవాడెవడూ ఉండడు.
Zümer 39:24
ఏమీ ఈ వ్యక్తి ఎవరినైతే అల్లాహ్ సన్మార్గం చూపించి మరియు అతడిని ఇహలోకములో అనుగ్రహించి,పరలోకములో అతడిని స్వర్గములో ప్రవేశింపజేశాడో అతడు మరియు ఎవరైతే అవిశ్వాసమును కనబరిచి తన అవిశ్వాస స్థితిలో మరణిస్తే ఆయన (అల్లాహ్) అతడిని చేతులూ కాళ్ళు బందించబడినట్లు ప్రవేశింపజేస్తే అతడు బోర్లాపడినటువంటి తన ముఖముతో మాత్రమే నరకాగ్ని నుండి కాపాడుకోవలసిన వాడు సమానులవుతారా ?. మరియు అవిశ్వాసముతో,పాపకార్యములతో తమ స్వయంపై హింసకు పాల్పడిన వారితో మందలించే విధంగా ఇలా పలకబడుతుంది : మీరు చేసుకున్న అవిశ్వాసము,పాపకార్యములను రుచి చూడండి. ఇదే మీ ప్రతిఫలము.
Zümer 39:25
ఈ ముష్రికులందరికన్న ముందు ఉన్న సమాజములన్ని తిరస్కరించినవి. అప్పుడు వారి వద్దకు శిక్ష అకస్మాత్తుగా వచ్చిపడింది ఏ విధంగానంటే దాని కొరకు పశ్ఛాత్తాపముతో సిద్ధమవటానికి దాన్ని వారు గ్రహించలేకపోయారు.
Zümer 39:26
అప్పుడు అల్లాహ్ వారికి అవమానకరమైన,సిగ్గుమాలిన,పరాభవమైన శిక్ష రుచి చూపించాడు. మరియు నిశ్చయంగా వారి కోసం నిరీక్షిస్తున్నటువంటి పరలోక శిక్ష ఎంతో పెద్దది మరియు తీవ్రమైనది. ఒక వేళ వారు తెలుసుకుంటే (బాగుండేది).
Zümer 39:27
మరియు నిశ్చయంగా మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ లో మంచి గురించి, చెడు గురించి మరియు సత్యం గురించి,అసత్యం గురించి మరియు విశ్వాసము గురించి,అవిశ్వాసము గురించి మరియు ఇతరవాటి గురించి ప్రజలకొరకు రకరకాల ఉపమానములను తెలియపరచాము. వాటిలో నుండి మేము తెలియపరచిన వాటి (ఉపమానముల) ద్వారా వారు గుణపాఠం నేర్చుకుని సత్యమును ఆచరించి అసత్యమును విడనాడుతారని ఆశిస్తూ (తెలియపరచాము).
Zümer 39:28
మేము దాన్ని అందులో ఎటువంటి వక్రత గాని వంకరుతనం గాని సందేహము గాని లేకుండా,వారు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడుతూ ఉంటారని ఆశిస్తూ ఖుర్ఆన్ ను అరబీ భాషలో తయారు చేశాము.
Zümer 39:29
అల్లాహ్ ముష్రిక్ (బహుదైవాలను ఆరాధించేవాడు) కొరకు మరియు మువహ్హిద్ (ఏకేశ్వరోపాసన చేసేవాడు) కొరకు ఒక ఉపమానము ఒక వ్యక్తిది తెలుపుతున్నాడు అతడు చాలా మంది తగాదాలాడే భాగస్వాముల ఆదీనంలో ఉన్నాడు. వారిలో కొంతమంది సంతృప్తి చెందితే కొందరు ఆగ్రహంగా ఉన్నారు. అప్పుడు అతడు కలతలో మరియు గందరగోళంలో పడిపోయాడు. మరియు ఇంకో వ్యక్తిది తెలుపుతున్నాడు అతడు ఒకే వ్యక్తికి ప్రత్యేకమై ఉన్నాడు. అతను ఒక్కడే అధికారం కలవాడు. మరియు అతని అవసరాలను తెలుసుకుంటాడు. అప్పుడు అతను ప్రశాంతంగా మరియు నిస్సంకోచముగా ఉన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు సమానులు కారు. ప్రశంసలన్నీ అల్లాహ్ కే శోభిస్తాయి. కానీ వారిలో చాలా మందికి తెలియదు. అందుకనే వారు అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పిస్తున్నారు.
Zümer 39:30
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీరు మరణిస్తారు మరియు వారు కూడా ఖచ్చితంగా మరణిస్తారు.
Zümer 39:31
ఆ తరువాత ఓ ప్రజలారా నిశ్చయంగా మీరు ప్రలయదినమున మీ ప్రభువు వద్ద మీరు పరస్పరం వివాదమాడుకున్న విషయం గురించి తగువులాడుతారు. అప్పుడు అసత్యపరుడు నుండి సత్యపరుడు స్పష్టమవుతాడు.
Zümer 39:32
మరియు అల్లాహ్ కు తగనటువంటి భాగస్వామిని,భార్యను,సంతానమును అంటగట్టే వాడి కంటే పెద్ద దుర్మార్గుడు ఎవడూ ఉండడు. మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిసుకుని వచ్చిన దైవ వాణిని తిరస్కరించే వాడికంటే పెద్ద దుర్మార్గుడు ఇంకెవడూ ఉండడు. ఏమీ నరకాగ్నిలో అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్త తీసుకుని వచ్చిన దాని పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి కొరకు ఆశ్రయం,నివాసం లేదా ?!. ఎందుకు లేదు నిశ్చయంగా వారి కొరకు అందులో ఆశ్రయం మరియు నివాసము ఉన్నవి.
Zümer 39:33
మరియు దైవప్రవక్తల్లోంచి,ఇతరుల్లోంచి ఎవరైతే తన మాటల్లో,తన చేతల్లో సత్యాన్ని తీసుకుని వస్తాడో మరియు దాన్ని విశ్వాసస్థితిలో నమ్మి దానికి తగినట్లుగా ఆచరిస్తాడో వారందరే వస్తవానికి దైవభీతి కలవారు. వారు తమ ప్రభువు ఆదేశమును పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటారు.
Zümer 39:34
వారి కొరకు వారి ప్రభువు వద్ద వారు కోరుకునే శాశ్వత సుఖాలు కలవు. ఇది తమ సృష్టికర్తతో,ఆయన దాసులతో మంచిగా మెలిగే వారి కర్మల ప్రతిఫలం.
Zümer 39:35
అల్లాహ్ వారు ఇహలోకములో చేసుకున్న పాపములను వాటి నుండి వారి పశ్ఛాత్తాపము వలన మరియు వారి ప్రభువు వైపు వారి మరలటం వలన తుడిచి వేయటానికి మరియు వారు చేసుకున్న సత్కర్మలకు మంచి ప్రతిఫలమును వారికి ప్రసాదించటానికి.
Zümer 39:36
ఏమీ అల్లాహ్ తన దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఆయన ధర్మ ,ప్రాపంచిక విషయంలో చాలడా మరియు ఆయన నుండి ఆయన శతృవును అడ్డుకోడా ?!. ఎందుకు కాదు . నిశ్చయంగా ఆయన ఆయనకి చాలు. ఓ ప్రవక్తా వారు మిమ్మల్ని తమ అజ్ఞానం మరియు తమ మూర్ఖత్వం వలన తాము అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న విగ్రహాల నుండి అవి మీకు కీడు కలిగిస్తాయని భయపెడుతున్నారు. అల్లాహ్ ఎవరినైతే నిస్సహాయుడిగా వదిలి వేసి అతనికి సన్మార్గం పొందే భాగ్యమును కలిగించడో అతనికి సన్మార్గం చూపించి అనుగ్రహించటానికి మార్గదర్శకుడెవడూ ఉండడు.
Zümer 39:37
మరియు అల్లాహ్ ఎవరికైతే సన్మార్గమును పొందే భాగ్యమును కలిగిస్తాడో అతడికి మార్గభ్రష్టతకు లోను చేసే వాడెవడూ అతడిని మార్గభ్రష్టతకు గురి చేయలేడు. ఏమీ అల్లాహ్ ఎవరూ ఓడించని, తనను అవిశ్వసించి తనకు అవిధేయతకు పాల్పడిన వారితో ప్రతీకారము తీర్చుకునే సర్వాధిక్యుడు కాడా ?!. ఎందుకు కాదు నిశ్చయంగా ఆయన ప్రతీకారము తీర్చుకునే సర్వాధిక్యుడు.
Zümer 39:38
ఓ ప్రవక్త ఒక వేళ మీరు ఈ ముష్రికులందరితో ఆకాశములను,భూమిని ఎవరు సృష్టించారు అని అడిగితే వారు తప్పకుండా వాటిని సృష్టించినవాడు అల్లాహ్ అని సమాధానమిస్తారు. మీరు వారి విగ్రహాల అసమర్ధతను బహిరంగపరుస్తూ ఇలా పలకండి : మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న ఈ విగ్రహాల గురించి నాకు తెలియపరచండి. ఒక వేళ అల్లాహ్ నాకు ఏదైన కీడును కలగదలచితే అవి అతని కీడును నా నుండి తొలగించగలవా ?! లేదా నా ప్రభువు తన వద్ద నుండి నాకు ఏదైన కారుణ్యమును అనుగ్రహించదలచితే వాటికి ఆయన కారుణ్యమును ఆపె శక్తి కలదా ?! . మీరు వారితో ఇలా పలకండి : అల్లాహ్ ఒక్కడే నాకు చాలు. నా వ్యవహారాలన్నింటిలో ఆయనపైనే నేను నమ్మకమును కలిగి ఉంటాను. నమ్మకమును కలిగి ఉండేవారు ఆయన ఒక్కడిపైనే నమ్మకమును కలిగి ఉంటారు.
Zümer 39:39
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ నా జాతి వారా మీరు మీకు సంతృప్తికరమైన స్థితి అయిన అల్లాహ్ తో పాటు సాటి కల్పించటంపై ఆచరించండి. నిశ్చయంగా నేనూ నా ప్రభువు నాకు ఆదేశించినటువంటి ఆయన ఏకత్వం వైపునకు పిలవటం మరియు ఆరాధనను ఆయనకే ప్రత్యేకించుకోవటం పై ఆచరిస్తాను. అయితే తొందరలోనే మీరు ప్రతీ మార్గము యొక్క పరిణామమును తెలుసుకుంటారు.
Zümer 39:40
అయితే ఇహలోకములో ఎవరిపై వారిని పరాభవము కలిగించే,అవమానము కలిగించే శిక్ష వస్తుందో,ప్రళయ దినాన అతనిపై అంతము కాని,తొలగిపోని శాశ్వత శిక్ష వస్తుందో వారు తొందరలోనే తెలుసుకుంటారు.
Zümer 39:41
ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మేము ఖుర్ఆన్ ను మీపై ప్రజల కొరకు సత్యముతో అవతరింపజేశాము మీరు వారిని హెచ్చరించటానికి. ఎవరైతే సన్మార్గము పొందుతాడో అతని సన్మార్గం పొందటం యొక్క ప్రయోజనం అతని స్వయం కొరకే. అయితే అతని సన్మార్గం పొందటం అల్లాహ్ కు ప్రయోజనం చేకూర్చదు. ఎందుకంటే ఆయన దాని నుండి అక్కరలేనివాడు. మరియు ఎవరైతే అపమార్గము పొందుతాడో అతని అపమార్గం పొందటం యొక్క నష్టము అతని స్వయమునకే కలుగును. అయితే పరిశుద్ధుడైన అల్లాహ్ కు అతని అపమార్గము నష్టం కలిగించదు. మరియు మీరు వారిని సన్మార్గముపై బలవంతం చేయటానికి మీరు వారిపై బాధ్యులు కారు. వారికి చేరవేయమని మీకు ఆదేశించబడిన వాటిని చేరవేయటం మాత్రమే మీపై బాధ్యత కలదు.
Zümer 39:42
అల్లాహ్ యే ఆత్మలను వాటి ఆయుషు ముగిసేటప్పుడు స్వాధీనపరచుకుంటాడు. వేటి ఆయుషు పూర్తికాలేదో ఆ ఆత్మలను నిదుర సమయములో స్వాధీనపరచుకుని వేటి యొక్క మరణం నిర్ణయించబడినదో వాటిని ఆపుకుని వేటి పై దాని (మరణం) నిర్ణయం కాలేదో వాటిని పరిశుద్ధుడైన ఆయన జ్ఞానంలో నిర్ధారించబడిన వేళ వరకు వదిలివేస్తాడు. నిశ్చయంగా స్వాధీనపరచటం,వదిలివేయటం మరియు మరణం కలిగించటం,జీవింపజేయటంలో వీటిని చేసే సామర్ధ్యం కలవాడు ప్రజలను వారి మరణం తరువాతా లెక్కతీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు మరణాంతరం లేపటంపై సామర్ధ్యం కలవాడని యోచన చేసే ప్రజలకు ఆధారాలు కలవు.
Zümer 39:43
వాస్తవానికి ముష్రికులు తమ విగ్రహాలను అల్లాహ్ ను వదిలి వారి వద్ద ప్రయోజనమును ఆశిస్తూ సిఫారసు చేసేవారిగా చేసుకున్నారు. ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : ఏమీ ఒక వేళ వారికి మీపై,వారి స్వయంపై ఎటువంటి అధికారము లేకపోయినా,వారు ఏమీ అర్ధం చేసుకోకపోయినా మీరు వారిని సిఫారసు చేసేవారిగా చేసుకుంటారా. వారు మాట్లాడలేని మూగబోయిన, వినలేని,చూడలేని,ప్రయోజనం కలిగించని,నష్టం కలిగించని రాతిపలకలు ?!.
Zümer 39:44
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : సిఫారసు అంతా ఒక్కడైన అల్లాహ్ కే చెందుతుంది. ఆయన వద్ద ఆయన అనుమతించిన వారు మాత్రమే సిఫరసు చేస్తారు. మరియు ఆయన ఇష్టపడిన వారి కొరకు మాత్రమే సిఫారసు చేస్తాడు. ఆకాశముల సామ్రాజ్యాధికారము మరియు భూమి సామ్రాజ్యాధికారము ఆయన ఒక్కడి కొరకే చెందుతుంది. ఆ తరువాత ప్రళయదినమున లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు ఆయన ఒక్కడి వైపునకే మీరు మరలించబడుతారు. అప్పుడు ఆయన మీ ఆచరణల పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Zümer 39:45
మరియు ఒక్కడైన అల్లాహ్ ప్రస్తావన వచ్చినప్పుడు పరలోకమును మరియు అందులో ఉన్నటువంటి మరణాంతరం లేపబడటము,లెక్క తీసుకోబడటం,ప్రతిఫలం ప్రసాదించబడటం పై విశ్వాసమును కనబరచని ముష్రికుల హృదయములు ధ్వేషిస్తాయి. మరియు అల్లాహ్ ను వదిలి వారు ఆరాధించే విగ్రహాల ప్రస్తావన వచ్చినప్పుడు వారు సంతోషపడేవారు,ఆనందపడేవారు.
Zümer 39:46
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ అల్లాహ్ భూమ్యాకాశములను పూర్వ నమూనా లేకుండా సృష్టించినవాడా, అగోచర,గోచరాలను తెలిసినవాడా వాటిలో నుండి ఏదీ నీపై గోప్యంగా ఉండదు. నీవు ఒక్కడే ప్రళయదినమున దాసుల మధ్య వారు ఇహలోకంలో విభేదించుకున్న వాటి విషయంలో తీర్పునిచ్చేవాడివి. అప్పుడు సత్యవంతుడు ,అసత్యవంతుడు మరియు పుణ్యాత్ముడు, దుష్టుడు స్పష్టమవుతారు.
Zümer 39:47
మరియు ఒక వేళ షిర్కు,పాప కార్యములతో తమ స్వయముపై హింసకు పాల్పడిన వారి కొరకు భూమిలో ఉన్న విలువైన వస్తువులు,సంపదలు ఉంటే దాన్ని వారు మరణాంతరం లేపబడిన తరువాత చూసిన కఠినమైన శిక్షకు పరిహారంగా చెల్లిస్తారు. కాని అది వారి కొరకు ఉండదు. ఒక వేళ అది వారి వద్ద ఉన్నా అది వారి నుండి స్వీకరించబడదు. మరియు వారి కొరకు అల్లాహ్ వద్ద నుండి వారు ఊహించని రకరకాల శిక్షలు బహిర్గతమవుతాయి.
Zümer 39:48
మరియు వారు చేసుకున్న షిర్కు,పాపకార్యముల దుష్ఫలితాలు వారి ముందు బహిర్గతమవుతాయి. మరియు వారికి ఆ శిక్ష దేని గురించైతే వారు ఇహలోకములో భయపెట్టబడినప్పుడు పరిహాసమాడేవారో అది వారిని చుట్టుముట్టుతుంది.
Zümer 39:49
అవిశ్వాస మానవునికి రోగము గాని పేదరికం గాని వేరే ఏమైనా కలిగినప్పుడు అతనికి కలిగిన వాటిని అతని నుండి మేము తొలగించటానికి మమ్మల్ని వేడుకుంటాడు. ఆ తరువాత మేము అతనికి ఆరోగ్యము లేదా సంపద అనుగ్రహమును ప్రసాదించినప్పుడు అవిశ్వాసపరుడు ఇలా పలుకుతాడు : అల్లాహ్ తన జ్ఞానం వలన నేను దానికి యోగ్యుడినని గుర్తించి నాకు ప్రసాదించాడు. వాస్తవమేమిటంటే అది ఒక పరీక్ష మరియు మోసము. కాని చాలా మంది అవిశ్వాసపరులకు అది తెలియదు. అందుకనే వారు అల్లాహ్ వారికి అనుగ్రహించిన వాటితో మోసపోతున్నారు.
Zümer 39:50
వాస్తవానికి ఇలాంటి మాటనే వారికన్న పూర్వం గతించిన అవిశ్వాసపరులూ పలికారు. అప్పుడు వారు సంపాదించుకున్న సంపదలు మరియు స్థానం వారికి ఏమీ పనికి రాలేదు.
Zümer 39:51
అప్పుడు వారు పాల్పడిన షిర్కు,అవిధేయ కార్యాల యొక్క పాపముల ప్రతిఫలం వారిపై పడింది. మరియు హాజరై ఉన్న వీరందరిలోంచి షిర్కు,పాపకార్యములకు పాల్పడి తమపై హింసకు పాల్పడిన వారిపై వారు చేసుకున్న దుష్కర్మల ప్రతిఫలము గతించిన వారి మాదిరిగా వచ్చిపడుతుంది. మరియు వారు అల్లాహ్ నుండి తప్పించుకోలేరు మరియు ఆయనను ఓడించలేరు.
Zümer 39:52
ఏమి ఈ ముష్రికులందరు వారు పలికినదే పలికారా. మరియు వారికి తెలియదా అల్లాహ్ తాను తలచిన వారిపై ఆహారోపాధిని పుష్కలంగా ఇస్తాడు. అతడిని పరీక్షించటానికి అతడు కృతజ్ఞత తెలుపుకుంటాడా లేదా కృతఘ్నుడవుతాడా ?!. మరియు ఆయన దాన్ని తాను కోరిన వారిపై కుదించివేస్తాడు అతడిని పరీక్షించటానికి అతడు అల్లాహ్ యొక్క కుదించటంపై సహనం చూపుతాడా లేదా ఆగ్రహానికి లోనవుతాడా ?!. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడినటువంటి ఆహారోపాధిని పుష్కలంగా చేయటం మరియు దాన్ని కుదించటంలో విశ్వసించే జనుల కొరకు అల్లాహ్ పర్యాలోచనపై సూచనలు కలవు. ఎందుకంటే వారే ఆధారాల ద్వారా ప్రయోజనం చెందుతారు. మరియు అవిశ్వాసపరులు వాటిపై నుండి వాటి నుండి విముఖత చూపుతూ దాటిపోతారు.
Zümer 39:53
ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ తో పాటు సాటి కల్పించి,పాపకార్యములకు పాల్పడి తమ స్వయంపై అతిక్రమించిన నా దాసులతో ఇలా పలకండి : మీరు అల్లాహ్ కారుణ్యము నుండి మరియు మీ పాపములకు ఆయన మన్నింపు నుండి నిరాశ చెందకండి. నిశ్ఛయంగా అల్లాహ్ ఆయన వైపునకు పశ్చాత్తాపముతో మరలేవారి పాపములన్నింటిని మన్నించి వేస్తాడు. నిశ్ఛయంగా ఆయన పశ్ఛాత్తాప్పడే వారి పాపములను బాగా మన్నించేవాడును, వారిపై కరుణించేవాడును.
Zümer 39:54
మరియు మీరు ప్రళయదనమున శిక్ష మీ వద్దకు రాక మునుపు పశ్ఛాత్తాపముతో మరియు సత్కర్మలతో మీ ప్రభువు వైపునకు మరలండి. మరియు ఆయనకు విధేయులవ్వండి. ఆ తరువాత శిక్ష నుండి మిమ్మల్ని రక్షించటం ద్వారా మీకు సహాయపడే వాడిని మీ విగ్రహాల్లోంచి గాని మీ ఇంటి వారిలోంచి గాని మీరు పొందరు.
Zümer 39:55
మరియు మీరు మీ ప్రభువు తన ప్రవక్తపై అవతరింపజేసిన శ్రేష్ఠమైన ఖుర్ఆన్ ను అనుసరించండి. అయితే మీరు దాని ఆదేశములను పాటించండి మరియు అది వారించిన వాటి నుండి దూరంగా ఉండండి. మీ వద్దకు శిక్ష అకస్మాత్తుగా రాక ముందే. మరియు మీరు దాని కొరకు పశ్చాత్తాపముతో సిద్ధం కావటానికి దాన్ని మీరు గ్రహించలేరు.
Zümer 39:56
ప్రళయదినమున అవమాన తీవ్రత వలన ఏ ప్రాణమయినా ఇలా పలకటం నుండి జాగ్రత్తగా ఉండటానికి మీరు దాన్ని చేయండి : అయ్యో అల్లాహ్ విషయంలో అది దేనిపైనైతే ఉన్నదో అవిశ్వాసము,పాపకార్యముల వలన అది చేసిన నిర్లక్ష్యం పై మరియు విశ్వాసపరులపై,విధేయులపై అది ఎగతాళి చేయటం పై దాని అవమానము.
Zümer 39:57
లేదా అది (ప్రాణము) విధి వ్రాత గురించి వాదించి ఇలా పలకటం నుండి : ఒక వేళ అల్లాహ్ నన్ను అనుగ్రహించి ఉంటే నేను కూడా ఆయనకు భయపడేవారిలోంచి అయిపోయి,ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండేవాడిని.
Zümer 39:58
లేదా అది శిక్షను చూసినప్పుడు ఆశపడుతూ ఇలా పలకటం నుండి : ఒక వేళ నాకు ఇహలోకం వైపునకు మరలింపు ఉంటే నేను అల్లాహ్ తో తౌబా చేసి తమ కర్మలను మంచిగా చేసుకునే వారిలో నుంచి అయిపోతాను.
Zümer 39:59
సన్మార్గమును ఆశించి నీవు అనుకున్నట్లు విషయం కాదు. వాస్తవానికి నా సూచనలు నీ వద్దకు వచ్చాయి అప్పుడు నీవు వాటిని తిరస్కరించి అహంకారమును చూపావు. మరియు అల్లాహ్ పట్ల,ఆయన ఆయతుల పట్ల,ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరిచే వారిలో నుంచి అయిపోయావు.
Zümer 39:60
మరియు ప్రళయదినమున మీరు అల్లాహ్ పై ఆయనతో సాటిని మరియు సంతానమును అంటగట్టి అబద్దమును ఆపాదించే వారి ముఖములను నల్లగా మారటమును చూస్తారు. వారి దుష్టత్వమునకు ఒక చిహ్నము. ఏమీ అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచటం పై అహంకారమును చూపేవారి కొరకు నరకంలో ఆశ్రయం లేదా ?. ఎందుకు లేదు. నిశ్చయంగా వారి కొరకు అందులో ఆశ్రయం ఉన్నది.
Zümer 39:61
ఎవరైతే తమ ప్రభువు పట్ల ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయభీతి కలిగి ఉంటారో వారిని అల్లాహ్ వారి సాఫల్య ప్రదేశమైన స్వర్గములో ప్రవేశింపజేసి శిక్ష నుండి రక్షిస్తాడు. వారికి శిక్ష ముట్టుకోదు. తాము ఇహలోక భాగములను కోల్పోవటంపై దుఃఖించరు.
Zümer 39:62
అల్లాహ్ యే ప్రతీ వస్తువును సృష్టించినవాడు. మరియు ఆయన ప్రతీ వస్తువును సంరక్షించేవాడు. దాని వ్యవహారమును పర్యాలోచన చేసి దాన్ని తాను తలచిన విధంగా నడిపిస్తాడు.
Zümer 39:63
ఆకాశములలో,భూమిలో ఉన్న మేళ్ళ నిక్షేపాల యొక్క తాళాలు ఆయన ఒక్కడి చేతిలో కలవు. ఆయన వాటిని తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. తాను తలచిన వారి నుండి వాటిని ఆపుతాడు. మరియు అల్లాహ్ ఆయతులపట్ల అవిశ్వాసమును కనబరిచేవారందరే తమ ఇహలోక జీవితంలో విశ్వాసమును కోల్పోవటం వలన మరియు వారు పరలోకములో నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటూ ప్రవేశించటం వలన నష్టమును చవిచూస్తారు.
Zümer 39:64
ఓ ప్రవక్తా మిమ్మల్ని తమ విగ్రహాలను ఆరాధించమని ప్రేరేపించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఓ మీ ప్రభువు పట్ల అజ్ఞానులైన వారా మీరు నన్ను అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధన చేయమని ఆదేశిస్తున్నారా ?. కేవలం అల్లాహ్ ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. కాబట్టి నేను ఆయనను వదిలి ఇతరులను ఆరాధించనంటే ఆరాధించను.
Zümer 39:65
ఓ ప్రవక్తా నిశ్చయంగా అల్లాహ్ మీ వైపునకు ఇలా దైవవాణిని అవతరింపజేశాడు మరియు మీకన్న పూర్వ ప్రవక్తలకు ఇలా దైవవాణిని అవతరింపజేశాడు : ఒక వేళ మీరు అల్లాహ్ తో పాటు ఇతరులను ఆరాధన చేస్తే మీ సత్కర్మ యొక్క పుణ్యము వృధా అయిపోతుంది. మరియు మీరు ఇహలోకములో మీ ధర్మమును నష్టపోవటము ద్వారా మరియు పరలోకములో శిక్ష ద్వారా నష్టపోయేవారిలోంచి అయిపోతారు.
Zümer 39:66
అలా కాదు మీరు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించి ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించకండి. మరియు మీరు ఆయన మీకు అనుగ్రహించిన ఆయన అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలుపుకునే వారిలోంచి అయిపోండి.
Zümer 39:67
మరియు ముష్రికులు బలహీనులైన,అశక్తులైన అల్లాహ్ సృష్టిరాసుల్లోంచి ఇతరులను ఆయనతో పాటు సాటి కల్పించినప్పుడు అల్లాహ్ ను ఏవిధంగా ఆదరించాలో ఆవిధంగా ఆదరించలేదు. మరియు వారు అల్లాహ్ సామర్ధ్యమును నుండి నిర్లక్ష్యం వహించారు. దాని (అల్లాహ్ సామర్ధ్యం) దృశ్యముల్లోంచి భూమి తనలో ఉన్నటువంటి పర్వతాలు,చెట్లు,కాలువలు,సముద్రాలతో సహా ప్రళయదినమున ఆయన ఆదీనంలో (పిడికిిలిలో) ఉంటాయి. మరియు సప్తాకాశములన్నీ ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. మరియు ముష్రికులు ఆయన గురించి పలుకుతున్న మాటల నుండి,విశ్వసిస్తున్న విశ్వాసముల నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు మరియు మహోన్నతుడు.
Zümer 39:68
ఆ రోజు బాకా ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత కొమ్ములో (బాకాలో) ఊదుతాడు. అప్పుడు ఆకాశములలో మరియు భూమిలో ఉన్నవన్నీ చనిపోతాయి. ఆ పిదప దైవదూత రెండవసారి మరణాంతరం లేపబడటానికి అందులో (బాకాలో) ఊదుతాడు. అప్పుడు జీవించిన వారందరు నిలబడి అల్లాహ్ వారి పట్ల ఏమి వ్యవహరిస్తాడని నిరీక్షిస్తుంటారు.
Zümer 39:69
సర్వాధిక్యుడైన ప్రభువు దాసుల మధ్య తీర్పునివ్వటం కొరకు ప్రత్యక్షమయినప్పుడు భూమి కాంతితో వెలిగిపోతుంది. మరియు ప్రజల కర్మల పత్రాలు తెరవబడుతాయి. మరియు ప్రవక్తలను తీసుకుని రావటం జరుగుతుంది. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జాతి వారిని దైవ ప్రవక్తల కొరకు వారి జాతుల వారిపై సాక్ష్యం పలకటానికి తీసుకురాబడుతుంది. మరియు అల్లాహ్ వారందరి మధ్య న్యాయపరంగా తీర్పునిస్తాడు. ఆ రోజు వారికి అన్యాయం చేయబడదు. అప్పుడు ఏ మనిషి యొక్క పాపము అధికం చేయబడదు మరియు ఏ పుణ్యమూ తగ్గించబడదు.
Zümer 39:70
అల్లాహ్ ప్రతీ ప్రాణము యొక్క పుణ్యమును పూర్తి చేస్తాడు. దాని ఆచరణ మంచి అయినా గాని చెడు అయినా గాని. వారు చేస్తున్నది అల్లాహ్ కు తెలుసు. వారి కార్యల్లోంచి మంచివైనవి , చెడ్డవైనవి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే ఆ రోజు వారికి వారి కర్మలపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Zümer 39:71
మరియు దైవదూతలు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారిని నరకం వైపునకు గుంపులు గుంపులుగా అవమానపరచి తోలుతారు. చివరికి వారు నరకం వద్దకు వచ్చినప్పుడు వారి కొరకు దానిపై బాధ్యులుగా నియమింపబడిన దైవదూతల్లోంచి దాని పర్యవేక్షకులు దాని తలపులను తెరుస్తారు. మరియు వారు వారితో మందలింపులతో ఇలా పలుకుతూ అభివందనములు చేస్తారు : ఏమీ మీ వద్దకు మీ కోవకు చెందిన ప్రవక్తలు తమపై అవతరింపబడిన మీ ప్రభువు ఆయతులను మీపై చదువుతూ మరియు మిమ్మల్ని ప్రళయదినమున కలవటం గురించి అందులో ఉన్న కఠినమైన శిక్ష నుండి మిమ్మల్ని భయపెడుతూ రాలేదా ?. అవిశ్వాసపరులు స్వయంగా అంగీకరిస్తూ ఇలా పలుకుతారు : ఎందుకు కాదు. వాస్తవానికి ఇదంత జరిగింది. మరియు అవిశ్వాసపరులపై శిక్ష యొక్క వాక్కు అనివార్యమైనది. మరియు మేము అవిశ్వసిస్తూ ఉండేవారము.
Zümer 39:72
వారిని అవమానపరుస్తూ మరియు అల్లాహ్ కారుణ్యము నుండి, నరకాగ్ని నుండి బయటపడటం నుండి నిరాశపరుస్తూ వారితో ఇలా పలకబడుతుంది : మీరు నరక ద్వారాలలోనికి అందులో శాశ్వతంగా ఉంటూ ప్రవేశించండి. సత్యం ముందు గర్వపడే మరియు అహంకారమును చూపే వారి నివాసము ఎంతో చెడ్డది మరియు దుర్భరమైనది.
Zümer 39:73
మరియు దైవదూతలు తమ ప్రభువు ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి ఆయన భయభీతి కలిగిన విశ్వాసపరులను గౌరవోన్నతులైన(దైవదూదలు) గుంపులుగుంపులుగా స్వర్గం వైపునకు మృధువుగా తీసుకునివస్తారు. చివరికి వారు స్వర్గం వద్దకు వచ్చినప్పుడు వారి కొరకు దాని ద్వారములు తెరవబడి ఉంటాయి. మరియు దాని బాధ్యత ఇవ్వబడిన దైవదూతలు వారితో ఇలా పలుకుతారు : ప్రతీ కీడు నుండి మరియు మీరు ఇష్టపడని ప్రతీ దాని నుండి మీపై శాంతి కురియుగాక. మీ మనస్సులు,మీ కర్మలు శ్రేష్ఠమయ్యాయి. అయితే మీరు స్వర్గములో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించండి.
Zümer 39:74
స్వర్గంలో ప్రవేశించినప్పుడు విశ్వాసపరులు ఇలా పలుకుతారు : పొగడ్తలన్నీ ఆ అల్లాహ్ కొరకే ఎవరైతే తన ప్రవక్తల నోటి ద్వారా మాకు చేసిన వాగ్దానమును మాకు నిజం చేసి చూపించాడో. నిశ్ఛయంగా ఆయన మమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపచేస్తాడని,స్వర్గము యొక్కభూమికి మమ్మల్ని వారసులను చేస్తానని మాకు వాగ్దానం చేశాడు. మేము అక్కడ దిగదలచిన చోటులో దిగుతాము. తమ ప్రభువు మన్నతను ఆశిస్తూ సత్కర్మలు చేసే వారి పుణ్యము ఎంతో గొప్పది.
Zümer 39:75
మరియు దైవదూతలు ఈ హాజరుపరచబడే రోజున సింహాసనమును (అర్ష్ ను) చుట్టుముట్టి ఉంటారు. అవిశ్వాసపరులు పలుకుతున్న అల్లాహ్ కు తగని మాటల నుండి వారు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడుతూ ఉంటారు. మరియు అల్లాహ్ సృష్టిరాసులందరి మధ్య న్యాయముతో తీర్పునిస్తాడు. గౌరవించిన వాడిని గౌరవిస్తాడు. మరియు శిక్షించిన వాడిని శిక్షిస్తాడు. మరియు ఇలా పలుకబడింది : ప్రశంసలన్నీ సృష్టిరాసుల ప్రభువైన అల్లాహ్ కొరకు తన విశ్వాసపరులైన దాసుల కొరకు కారుణ్యము గురించి,మరియు అవిశ్వాసపరుల దాసుల కొరకు శిక్ష గురించి ఆయన తీర్పునిచ్చిన తన తీర్పు పై.