Telugu Mokhtasar — Mümtehıne 60:1 – Naziat 79:46
Contents
- Mümtehıne 60:1
- Mümtehıne 60:2
- Mümtehıne 60:3
- Mümtehıne 60:4
- Mümtehıne 60:5
- Mümtehıne 60:6
- Mümtehıne 60:7
- Mümtehıne 60:8
- Mümtehıne 60:9
- Mümtehıne 60:10
- Mümtehıne 60:11
- Mümtehıne 60:12
- Mümtehıne 60:13
- Sâff 61:1
- Sâff 61:2
- Sâff 61:3
- Sâff 61:4
- Sâff 61:5
- Sâff 61:6
- Sâff 61:7
- Sâff 61:8
- Sâff 61:9
- Sâff 61:10
- Sâff 61:11
- Sâff 61:12
- Sâff 61:13
- Sâff 61:14
- Cumua 62:1
- Cumua 62:2
- Cumua 62:3
- Cumua 62:4
- Cumua 62:5
- Cumua 62:6
- Cumua 62:7
- Cumua 62:8
- Cumua 62:9
- Cumua 62:10
- Cumua 62:11
- Münafikun 63:1
- Münafikun 63:2
- Münafikun 63:3
- Münafikun 63:4
- Münafikun 63:5
- Münafikun 63:6
- Münafikun 63:7
- Münafikun 63:8
- Münafikun 63:9
- Münafikun 63:10
- Münafikun 63:11
- Teğabün 64:1
- Teğabün 64:2
- Teğabün 64:3
- Teğabün 64:4
- Teğabün 64:5
- Teğabün 64:6
- Teğabün 64:7
- Teğabün 64:8
- Teğabün 64:9
- Teğabün 64:10
- Teğabün 64:11
- Teğabün 64:12
- Teğabün 64:13
- Teğabün 64:14
- Teğabün 64:15
- Teğabün 64:16
- Teğabün 64:17
- Teğabün 64:18
- Talak 65:1
- Talak 65:2
- Talak 65:3
- Talak 65:4
- Talak 65:5
- Talak 65:6
- Talak 65:7
- Talak 65:8
- Talak 65:9
- Talak 65:10
- Talak 65:11
- Talak 65:12
- Tahrim 66:1
- Tahrim 66:2
- Tahrim 66:3
- Tahrim 66:4
- Tahrim 66:5
- Tahrim 66:6
- Tahrim 66:7
- Tahrim 66:8
- Tahrim 66:9
- Tahrim 66:10
- Tahrim 66:11
- Tahrim 66:12
- Mülk 67:1
- Mülk 67:2
- Mülk 67:3
- Mülk 67:4
- Mülk 67:5
- Mülk 67:6
- Mülk 67:7
- Mülk 67:8
- Mülk 67:9
- Mülk 67:10
- Mülk 67:11
- Mülk 67:12
- Mülk 67:13
- Mülk 67:14
- Mülk 67:15
- Mülk 67:16
- Mülk 67:17
- Mülk 67:18
- Mülk 67:19
- Mülk 67:20
- Mülk 67:21
- Mülk 67:22
- Mülk 67:23
- Mülk 67:24
- Mülk 67:25
- Mülk 67:26
- Mülk 67:27
- Mülk 67:28
- Mülk 67:29
- Mülk 67:30
- Kalem 68:1
- Kalem 68:2
- Kalem 68:3
- Kalem 68:4
- Kalem 68:5
- Kalem 68:6
- Kalem 68:7
- Kalem 68:8
- Kalem 68:9
- Kalem 68:10
- Kalem 68:11
- Kalem 68:12
- Kalem 68:13
- Kalem 68:14
- Kalem 68:15
- Kalem 68:16
- Kalem 68:17
- Kalem 68:18
- Kalem 68:19
- Kalem 68:20
- Kalem 68:21
- Kalem 68:22
- Kalem 68:23
- Kalem 68:24
- Kalem 68:25
- Kalem 68:26
- Kalem 68:27
- Kalem 68:28
- Kalem 68:29
- Kalem 68:30
- Kalem 68:31
- Kalem 68:32
- Kalem 68:33
- Kalem 68:34
- Kalem 68:35
- Kalem 68:36
- Kalem 68:37
- Kalem 68:38
- Kalem 68:39
- Kalem 68:40
- Kalem 68:41
- Kalem 68:42
- Kalem 68:43
- Kalem 68:44
- Kalem 68:45
- Kalem 68:46
- Kalem 68:47
- Kalem 68:48
- Kalem 68:49
- Kalem 68:50
- Kalem 68:51
- Kalem 68:52
- Hakka 69:1
- Hakka 69:2
- Hakka 69:3
- Hakka 69:4
- Hakka 69:5
- Hakka 69:6
- Hakka 69:7
- Hakka 69:8
- Hakka 69:9
- Hakka 69:10
- Hakka 69:11
- Hakka 69:12
- Hakka 69:13
- Hakka 69:14
- Hakka 69:15
- Hakka 69:16
- Hakka 69:17
- Hakka 69:18
- Hakka 69:19
- Hakka 69:20
- Hakka 69:21
- Hakka 69:22
- Hakka 69:23
- Hakka 69:24
- Hakka 69:25
- Hakka 69:26
- Hakka 69:27
- Hakka 69:28
- Hakka 69:29
- Hakka 69:30
- Hakka 69:31
- Hakka 69:32
- Hakka 69:33
- Hakka 69:34
- Hakka 69:35
- Hakka 69:36
- Hakka 69:37
- Hakka 69:38
- Hakka 69:39
- Hakka 69:40
- Hakka 69:41
- Hakka 69:42
- Hakka 69:43
- Hakka 69:44
- Hakka 69:45
- Hakka 69:46
- Hakka 69:47
- Hakka 69:48
- Hakka 69:49
- Hakka 69:50
- Hakka 69:51
- Hakka 69:52
- Meâric 70:1
- Meâric 70:2
- Meâric 70:3
- Meâric 70:4
- Meâric 70:5
- Meâric 70:6
- Meâric 70:7
- Meâric 70:8
- Meâric 70:9
- Meâric 70:10
- Meâric 70:11
- Meâric 70:12
- Meâric 70:13
- Meâric 70:14
- Meâric 70:15
- Meâric 70:16
- Meâric 70:17
- Meâric 70:18
- Meâric 70:19
- Meâric 70:20
- Meâric 70:21
- Meâric 70:22
- Meâric 70:23
- Meâric 70:24
- Meâric 70:25
- Meâric 70:26
- Meâric 70:27
- Meâric 70:28
- Meâric 70:29
- Meâric 70:30
- Meâric 70:31
- Meâric 70:32
- Meâric 70:33
- Meâric 70:34
- Meâric 70:35
- Meâric 70:36
- Meâric 70:37
- Meâric 70:38
- Meâric 70:39
- Meâric 70:40
- Meâric 70:41
- Meâric 70:42
- Meâric 70:43
- Meâric 70:44
- Nuh 71:1
- Nuh 71:2
- Nuh 71:3
- Nuh 71:4
- Nuh 71:5
- Nuh 71:6
- Nuh 71:7
- Nuh 71:8
- Nuh 71:9
- Nuh 71:10
- Nuh 71:11
- Nuh 71:12
- Nuh 71:13
- Nuh 71:14
- Nuh 71:15
- Nuh 71:16
- Nuh 71:17
- Nuh 71:18
- Nuh 71:19
- Nuh 71:20
- Nuh 71:21
- Nuh 71:22
- Nuh 71:23
- Nuh 71:24
- Nuh 71:25
- Nuh 71:26
- Nuh 71:27
- Nuh 71:28
- Cinn 72:1
- Cinn 72:2
- Cinn 72:3
- Cinn 72:4
- Cinn 72:5
- Cinn 72:6
- Cinn 72:7
- Cinn 72:8
- Cinn 72:9
- Cinn 72:10
- Cinn 72:11
- Cinn 72:12
- Cinn 72:13
- Cinn 72:14
- Cinn 72:15
- Cinn 72:16
- Cinn 72:17
- Cinn 72:18
- Cinn 72:19
- Cinn 72:20
- Cinn 72:21
- Cinn 72:22
- Cinn 72:23
- Cinn 72:24
- Cinn 72:25
- Cinn 72:26
- Cinn 72:27
- Cinn 72:28
- Müzzemmil 73:1
- Müzzemmil 73:2
- Müzzemmil 73:3
- Müzzemmil 73:4
- Müzzemmil 73:5
- Müzzemmil 73:6
- Müzzemmil 73:7
- Müzzemmil 73:8
- Müzzemmil 73:9
- Müzzemmil 73:10
- Müzzemmil 73:11
- Müzzemmil 73:12
- Müzzemmil 73:13
- Müzzemmil 73:14
- Müzzemmil 73:15
- Müzzemmil 73:16
- Müzzemmil 73:17
- Müzzemmil 73:18
- Müzzemmil 73:19
- Müzzemmil 73:20
- Müddessir 74:1
- Müddessir 74:2
- Müddessir 74:3
- Müddessir 74:4
- Müddessir 74:5
- Müddessir 74:6
- Müddessir 74:7
- Müddessir 74:8
- Müddessir 74:9
- Müddessir 74:10
- Müddessir 74:11
- Müddessir 74:12
- Müddessir 74:13
- Müddessir 74:14
- Müddessir 74:15
- Müddessir 74:16
- Müddessir 74:17
- Müddessir 74:18
- Müddessir 74:19
- Müddessir 74:20
- Müddessir 74:21
- Müddessir 74:22
- Müddessir 74:23
- Müddessir 74:24
- Müddessir 74:25
- Müddessir 74:26
- Müddessir 74:27
- Müddessir 74:28
- Müddessir 74:29
- Müddessir 74:30
- Müddessir 74:31
- Müddessir 74:32
- Müddessir 74:33
- Müddessir 74:34
- Müddessir 74:35
- Müddessir 74:36
- Müddessir 74:37
- Müddessir 74:38
- Müddessir 74:39
- Müddessir 74:40
- Müddessir 74:41
- Müddessir 74:42
- Müddessir 74:43
- Müddessir 74:44
- Müddessir 74:45
- Müddessir 74:46
- Müddessir 74:47
- Müddessir 74:48
- Müddessir 74:49
- Müddessir 74:50
- Müddessir 74:51
- Müddessir 74:52
- Müddessir 74:53
- Müddessir 74:54
- Müddessir 74:55
- Müddessir 74:56
- Kıyamet 75:1
- Kıyamet 75:2
- Kıyamet 75:3
- Kıyamet 75:4
- Kıyamet 75:5
- Kıyamet 75:6
- Kıyamet 75:7
- Kıyamet 75:8
- Kıyamet 75:9
- Kıyamet 75:10
- Kıyamet 75:11
- Kıyamet 75:12
- Kıyamet 75:13
- Kıyamet 75:14
- Kıyamet 75:15
- Kıyamet 75:16
- Kıyamet 75:17
- Kıyamet 75:18
- Kıyamet 75:19
- Kıyamet 75:20
- Kıyamet 75:21
- Kıyamet 75:22
- Kıyamet 75:23
- Kıyamet 75:24
- Kıyamet 75:25
- Kıyamet 75:26
- Kıyamet 75:27
- Kıyamet 75:28
- Kıyamet 75:29
- Kıyamet 75:30
- Kıyamet 75:31
- Kıyamet 75:32
- Kıyamet 75:33
- Kıyamet 75:34
- Kıyamet 75:35
- Kıyamet 75:36
- Kıyamet 75:37
- Kıyamet 75:38
- Kıyamet 75:39
- Kıyamet 75:40
- İnsan 76:1
- İnsan 76:2
- İnsan 76:3
- İnsan 76:4
- İnsan 76:5
- İnsan 76:6
- İnsan 76:7
- İnsan 76:8
- İnsan 76:9
- İnsan 76:10
- İnsan 76:11
- İnsan 76:12
- İnsan 76:13
- İnsan 76:14
- İnsan 76:15
- İnsan 76:16
- İnsan 76:17
- İnsan 76:18
- İnsan 76:19
- İnsan 76:20
- İnsan 76:21
- İnsan 76:22
- İnsan 76:23
- İnsan 76:24
- İnsan 76:25
- İnsan 76:26
- İnsan 76:27
- İnsan 76:28
- İnsan 76:29
- İnsan 76:30
- İnsan 76:31
- Mürselat 77:1
- Mürselat 77:2
- Mürselat 77:3
- Mürselat 77:4
- Mürselat 77:5
- Mürselat 77:6
- Mürselat 77:7
- Mürselat 77:8
- Mürselat 77:9
- Mürselat 77:10
- Mürselat 77:11
- Mürselat 77:12
- Mürselat 77:13
- Mürselat 77:14
- Mürselat 77:15
- Mürselat 77:16
- Mürselat 77:17
- Mürselat 77:18
- Mürselat 77:19
- Mürselat 77:20
- Mürselat 77:21
- Mürselat 77:22
- Mürselat 77:23
- Mürselat 77:24
- Mürselat 77:25
- Mürselat 77:26
- Mürselat 77:27
- Mürselat 77:28
- Mürselat 77:29
- Mürselat 77:30
- Mürselat 77:31
- Mürselat 77:32
- Mürselat 77:33
- Mürselat 77:34
- Mürselat 77:35
- Mürselat 77:36
- Mürselat 77:37
- Mürselat 77:38
- Mürselat 77:39
- Mürselat 77:40
- Mürselat 77:41
- Mürselat 77:42
- Mürselat 77:43
- Mürselat 77:44
- Mürselat 77:45
- Mürselat 77:46
- Mürselat 77:47
- Mürselat 77:48
- Mürselat 77:49
- Mürselat 77:50
- Nebe' 78:1
- Nebe' 78:2
- Nebe' 78:3
- Nebe' 78:4
- Nebe' 78:5
- Nebe' 78:6
- Nebe' 78:7
- Nebe' 78:8
- Nebe' 78:9
- Nebe' 78:10
- Nebe' 78:11
- Nebe' 78:12
- Nebe' 78:13
- Nebe' 78:14
- Nebe' 78:15
- Nebe' 78:16
- Nebe' 78:17
- Nebe' 78:18
- Nebe' 78:19
- Nebe' 78:20
- Nebe' 78:21
- Nebe' 78:22
- Nebe' 78:23
- Nebe' 78:24
- Nebe' 78:25
- Nebe' 78:26
- Nebe' 78:27
- Nebe' 78:28
- Nebe' 78:29
- Nebe' 78:30
- Nebe' 78:31
- Nebe' 78:32
- Nebe' 78:33
- Nebe' 78:34
- Nebe' 78:35
- Nebe' 78:36
- Nebe' 78:37
- Nebe' 78:38
- Nebe' 78:39
- Nebe' 78:40
- Naziat 79:1
- Naziat 79:2
- Naziat 79:3
- Naziat 79:4
- Naziat 79:5
- Naziat 79:6
- Naziat 79:7
- Naziat 79:8
- Naziat 79:9
- Naziat 79:10
- Naziat 79:11
- Naziat 79:12
- Naziat 79:13
- Naziat 79:14
- Naziat 79:15
- Naziat 79:16
- Naziat 79:17
- Naziat 79:18
- Naziat 79:19
- Naziat 79:20
- Naziat 79:21
- Naziat 79:22
- Naziat 79:23
- Naziat 79:24
- Naziat 79:25
- Naziat 79:26
- Naziat 79:27
- Naziat 79:28
- Naziat 79:29
- Naziat 79:30
- Naziat 79:31
- Naziat 79:32
- Naziat 79:33
- Naziat 79:34
- Naziat 79:35
- Naziat 79:36
- Naziat 79:37
- Naziat 79:38
- Naziat 79:39
- Naziat 79:40
- Naziat 79:41
- Naziat 79:42
- Naziat 79:43
- Naziat 79:44
- Naziat 79:45
- Naziat 79:46
Mümtehıne 60:1
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించే వారా మీరు నా శతృవులను మరియు మీ శతృవులను వారిపై ప్రేమ చూపుతూ,వారిని ఇష్టపడుతూ స్నేహితులుగా చేసుకోకండి. వాస్తవానికి వారు మీ ప్రవక్త చేత మీ వద్దకు వచ్చిన ధర్మమును తిరస్కరించారు. ప్రవక్తను వారు ఆయన ఇంటి నుండి వెలివేశారు మరియు అలాగే మిమ్మల్ని కూడా మీ నివాసమైన మక్కా నుండి వెలివేశారు. వారు మీ విషయంలో ఎటువంటి బంధుత్వమును మరియు ఎటువంటి రక్త సంబంధమును లెక్క చేయలేదు. కేవలం మీరు మీ ప్రభువైన అల్లాహ్ ను విశ్వసించటం వలన. ఒక వేళ మీరు నా మర్గములో ధర్మ పోరాటము కొరకు బయలు దేరితే,నా ఇష్టతను కోరుకుంటూ ఉంటే మీరు అలా చేయకండి. మీరు వారితో ఉన్న ప్రేమ వలన ముస్లిముల సమాచారములను రహస్యంగా చేరవేస్తున్నారు. మీరు వాటిలో నుండి ఏవి దాచుతున్నారో మరియు ఏవి బహిర్గతం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. వాటిలో నుండి ఏదీను మరియు వేరేవి ఏవి కూడా నాపై గోప్యంగా ఉండవు. మరియు ఎవరైతే ఈ స్నేహమును,ప్రేమాభిమానములను అవిశ్వాసపరులపై చూపుతాడో అతడు మధ్యే మార్గము నుండి మరలిపోయాడు మరియు సత్య మార్గము నుండి తప్పిపోయాడు. సరైన మార్గము నుండి తప్పిపోయాడు.
Mümtehıne 60:2
ఒక వేళ వారు మీపై ప్రాభల్యం వహిస్తే తమ హృదయములలో దాచి ఉంచిన శతృత్వమును బహిర్గతం చేసేవారు. మరియు బాదించటంతో,కొట్టటంతో తమ చేతులను మీ వైపునకు చాపుతారు. మరియు దూషించటంతో,తిట్టటంతో తమ నాలుకలను చలాయిస్తారు. మీరు వారిలా అయిపోవటం కొరకు మీరు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల తిరస్కారమును చూపాలని వారు ఆశిస్తారు.
Mümtehıne 60:3
మీ బంధుత్వము మరియు మీ సంతానము మీరు అవిశ్వాసపరులతో వారి మూలంగా స్నేహం చేసినప్పుడు మీకు ఏ విధంగాను ప్రయోజనం చేకూర్చరు. ప్రళయదినమున అల్లాహ్ మీ మధ్య వేరు పరుస్తాడు. కావున ఆయన మీలో నుండి స్వర్గ వాసులను స్వర్గములో ప్రవేశింపజేస్తాడు మరియు నరక వాసులను నరకంలో ప్రవేశింపజేస్తాడు. మీలో నుండి ఒకరు ఇంకొకరికి లాభం కలిగించరు. మరియు మీరు చేస్తున్నది అల్లాహ్ చూస్తున్నాడు. మీ కర్మల్లోంచి ఏదీ పరిశుద్ధుడైన ఆయనపై గోప్యంగా ఉండదు. వాటి పరంగా ఆయన మీకు తొందరలోనే ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Mümtehıne 60:4
ఓ విశ్వాసపరులారా వాస్తవానికి మీ కొరకు ఇబ్రాహీమ్ అలైహిస్సలాంలో మరియు ఆయనతో పాటు ఉన్న విశ్వాసపరులలో ఒక ఆదర్శం ఉన్నది ఎప్పుడైతే వారు అవిశ్వాసపరులైన తమ జాతి వారితో ఇలా పలికారో : నిశ్ఛయంగా మీతో మరియు మీరు అల్లాహ్ ని వదిలి ఆరాధిస్తున్న విగ్రహాలతో మాకు ఎటువంటి సంబంధము లేదు. మీరు ఏ ధర్మంపై ఉన్నారో ఆ ధర్మమును మేము తిరస్కరిస్తున్నాము. మీరు ఒక్కడైన అల్లాహ్ ను విశ్వసించి ఆయనతో పాటు ఎవరినీ సాటి కల్పించకుండా ఉండనంత వరకు మా మధ్య మరియు మీ మధ్య శతృత్వము మరియు ద్వేషము బహిర్గతమవుతూ ఉంటుంది. కాబట్టి మీరు అవిశ్వాసపరులైన మీ జాతి వారితో సంబంధమును వదులుకోండి. కాని ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రితో అల్లాహ్ యందు మీ కొరకు నేను తప్పకుండా మన్నింపును వేడుకుంటాను అని పలికిన మాటలో ఆదర్శం లేదు. ఎందుకంటే ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి నుండి నిరాశులు కాక ముందు జరిగినది. కావున ఒక విశ్వాసపరుడు ఒక ముష్రిక్ కొరకు మన్నింపు వేడుకోవటం సరికాదు. మరియు నేను మీ నుండి అల్లాహ్ శిక్షను ఏమాత్రం తొలగించలేను. ఓ మా ప్రభువా మేము మా వ్యవహారాలన్నింటిలో నీపైనే నమ్మకమును కలిగి ఉన్నాము. మరియు మేము పశ్చాత్తాపముతో నీ వైపునకే మరలాము. ప్రళయదినమున మరలింపు అన్నది నీ వైపునే జరుగును.
Mümtehıne 60:5
ఓ మా ప్రభువా అవిశ్వాసపరులను మాపై ప్రాభల్యమును కలిగించి మమ్మల్ని వారి కొరకు పరీక్షా సాధనంగా చేయకు అప్పుడు వారు ఇలా పలుకుతారు : ఒక వేళ వారు సత్యంపై ఉంటే మాకు వారిపై ప్రాభల్యం కలిగేది కాదు కదా. మరియు ఓ మా ప్రభువా నీవు మా పాపములను మన్నించు. నిశ్ఛయంగా నీవే ఓడించబడని సర్వాధిక్యుడివి. నీ సృష్టించటంలో,నీ ధర్మ శాసనంలో,నీ విధి వ్రాతలో వివేకవంతుడివి.
Mümtehıne 60:6
ఇహలోకములో మరియు పరలోకములో అల్లాహ్ నుండి మంచిని ఆశించేవారు మాత్రమే ఈ మంచి ఆదర్శమును ఆదర్శంగా తీసుకుంటారు. మరియు ఎవరైతే ఈ మంచి ఆదర్శము నుండి విముఖత చూపుతారో నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల నుండి అక్కరలేని వాడు. ఆయనకు వారి విధేయత అవసరం లేదు. మరియు ఆయన అన్ని స్థితుల్లో స్థుతింపబడినవాడు.
Mümtehıne 60:7
ఓ విశ్వాసపరులారా బహుశా అల్లాహ్ మీ మధ్య మరియు అవిశ్వాసపరుల్లో నుండి మీరు శతృత్వము చేసిన వారి మధ్య ప్రేమాభిమానములను వారికి అల్లాహ్ ఇస్లాం యొక్క భాగ్యమును కలిగించి వేస్తాడేమో. మరియు అల్లాహ్ వారి హృదయములను విశ్వాసము వైపునకు మరలించే సామర్ధ్యము కల సమర్ధుడు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని మన్నించేవాడును మరియు వారిపై కరుణించేవాడును.
Mümtehıne 60:8
మీ ఇస్లాం కారణంగా మీతో పోరాడని,మిమ్మల్ని మీ ఇండ్ల నుండి బహిష్కరించని వారికి మీరు మీపై ఉన్న వారి హక్కును చెల్లించి వారితో మీరు సద్వ్యవహారం చేయటం మరియు వారికి న్యాయం చేయటం నుండి అల్లాహ్ మిమ్మల్ని నిరోధించడు. నిశ్ఛయంగా అల్లాహ్ తమ స్వయములో,తమ ఇంటివారిలో మరియు తాము స్నేహం చేసిన వారిలో న్యాయం చేసే వారిని ఇష్టపడుతాడు.
Mümtehıne 60:9
అల్లాహ్ మాత్రం మీ విశ్వాసము వలన మీతో పోరాడి మిమ్మల్ని మీ నివాసముల నుండి వెళ్ళగొట్టి మరియు మిమ్మల్ని వెళ్ళగొట్టటానికి సహాయం చేసిన వారితో మీరు స్నేహం చేయటం నుండి మిమ్మల్ని ఆపుతున్నాడు. మరియు మీలో నుండి ఎవరైతే వారితో స్నేహం చేస్తారో వారందరు అల్లాహ్ ఆదేశమును విబేధించటం వలన వినాశన స్థానమునకు చేరి తమ స్వయంపై హింసకు పాల్పడినవారు.
Mümtehıne 60:10
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా విశ్వాస స్త్రీలు అవిశ్వాస ప్రదేశము నుండి ఇస్లాం ప్రదేశమునకు మీ వద్దకు హిజ్రత్ చేసి వచ్చినప్పుడు మీరు వారి విశ్వాసము యొక్క నిజమవటం విషయంలో వారితో పరీక్ష తీసుకోండి. వారి విశ్వాసము గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. వారి హృదయములు దేనిపై మరలి ఉన్నాయో ఏదీ కూడా ఆయనపై గోప్యంగా లేదు.వారిని పరీక్షించిన తరువాత మీకు వారి నిజాయితీ గురించి బహిర్గతం అయిన తరువాత ఒక వేళ మీరు వారిని మీరు విశ్వాసపరులని తెలుసుకుంటే వారిని మీరు వారి అవిశ్వాస భర్తల వైపునకు వాపసు చేయకండి. విశ్వాసపర స్త్రీలు అవిశ్వాసపరుల వివాహ బంధంలో కొనసాగటం ధర్మ సమ్మతం కాదు. మరియు అవిశ్వాసపరులు విశ్వాసపర స్త్రీలను వివాహం చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. మరియు వారు వారికి చెల్లించిన మహర్ ను మీరు వారి భర్తలకు ఇచ్చివేయండి. ఓ విశ్వాసపరులారా వారి ఇద్దత్ ముగిసిన తరువాత వారికి వారి మహర్ ఇచ్చినప్పుడు వారితో మీరు వివాహం చేసుకోవటంలో మీపై ఎటువంటి దోషం లేదు. మరియు ఎవరి భార్య అయితే అవిశ్వాసపరురాలో లేదా ఇస్లాం నుండి తిరిగిపోయినదో అమె అవిశ్వాసం వలన వారి నికాహ్ బంధం తెగిపోవటం వలన ఆమెను ఆపకూడదు. మరియు మీరు అవిశ్వాసపరులతో మీ మరలిపోయిన భార్యలకు మీరు ఖర్చు చేసిన మహర్ లను అడిగి తీసుకోండి. మరియు వారు కూడా ఇస్లాం స్వీకరించిన తమ భార్యలకు ఖర్చు చేసిన మహర్ లను అడిగి తీసుకోవాలి. మీకు ఈ ప్రస్తావించబడినది మీ వైపు నుండి మరియు వారి వైపు నుండి మహర్ ల మరలింపు అది అల్లాహ్ ఆదేశము. పరిశుద్ధుడైన ఆయన తాను తలచుకున్నదాని ద్వారా మీ మధ్య తీర్పునిస్తాడు. మరియు అల్లాహ్ కు తన దాసుల స్థితుల గురించి మరియు వారి కర్మల గురించి బాగా తెలుసు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. తన దాసుల కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన వాటి విషయంలో వివేకవంతుడు.
Mümtehıne 60:11
మరియు ఒక వేళ మీ భార్యల్లోంచి ఎవరైన అవిశ్వాసపరుల వద్దకు మరలి వెళ్ళిపోవటమే జరిగి మీరు అవిశ్వాసపరుల నుండి వారి మహర్ లను కోరితే వారు వాటిని ఇవ్వకపోతే మీరు అవిశ్వాసపరుల నుండి యుద్ద ప్రాప్తిని పొందినప్పుడు ఎవరి భార్యలు మరలి వెళ్ళిపోయారో ఆ భర్తలకు వారు ఖర్చు చేసిన మహర్ లను ఇవ్వండి. మరియు మీరు ఆ అల్లాహ్ తో ఎవరి ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి మీరు విశ్వసించిన ఆయనతో భయపడండి.
Mümtehıne 60:12
ఓ ప్రవక్తా విశ్వాసపర స్త్రీలు మీ వద్దకు మీతో ప్రమాణం చేస్తూ వచ్చినప్పుడు - మక్కా విజయదినమున జరిగినట్లుగా- వారు అల్లాహ్ తో పాటు దేనినీ సాటి కల్పించరని, అంతే కాక వారు ఆయన ఒక్కడి ఆరాధన చేస్తారని,దొంగతనం చేయరని,వ్యభిచారము చేయరని,అజ్ఞాన కాలం నాటి వారి అలవాటును అనుసరిస్తూ తమ సంతానమును హతమార్చరని,తమ భర్తలకు తమ సంతానమును వ్యభిచార సంతానముగా అంటగట్టమని, ఏ మంచి కార్యంలో నౌహా చేయటం,జుట్టు పీక్కోవటం,బట్టలను చించుకోవటం లాంటి కార్యముల నుండి వారించబడటం నుండి మీపై అవిధేయత చూపమని (మీతో ప్రమాణం చేస్తే) వారితో మీరు ప్రమాణం చేయించండి. మరియు మీతో వారి ప్రమాణం తరువాత మీరు వారి కొరకు వారి పాపముల మన్నింపును అల్లాహ్ తో వేడుకోండి. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును.
Mümtehıne 60:13
ఓ అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి తమ కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించేవారా అల్లాహ్ ఆగ్రహమును చూపిన జాతి వారితో మీరు స్నేహం చేయకండి. వారు పరలోకముపై నమ్మకము లేనివారు. అంతే కాదు వారు దాని నుండి నిరాశ చెంది ఉన్నారు తమ మృతులు తమ వైపునకు మరలటం నుండి మరణాంతరం లేపబడటంపై తమ అవిశ్వాసం వలన తాము నిరాశులైనట్లు.
Sâff 61:1
ఆకాశములలో ఉన్నవన్ని మరియు భూమిలో ఉన్నవన్ని పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన అల్లాహ్ పరిశుద్దతను మరియు ఆయనకు తగని వాటి నుండి ఆయన అతీతను తెలుపుతున్నవి. మరియు ఆయన ఎవరు ఓడించని సర్వాధిక్యుడు, తన సృష్టించటంలో మరియు తన విధి వ్రాతలో మరియు తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.
Sâff 61:2
ఓ అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచేవారా వాస్తవానికి మీరు చేయని దాన్ని మేము చేశాము అని ఎందుకు పలుకుతున్నారు ?! మీలో నుండి ఒకరు ఇలా పలికినట్లు : నేను నా ఖడ్గముతో ఇలా పోరాడాను మరియు ఇలా కొట్టాను. వాస్తవానికి అతడు తన ఖడ్గముతో పోరాడలేదు మరియు కొట్టలేదు.
Sâff 61:3
మీరు చేయని దాని గురించి మీరు పలకటం అల్లాహ్ యందు చాలా అసహ్యకరమైనది. విశ్వాసపరునికి అల్లాహ్ తో సత్యం పలికే వాడిగా ఉండటం మాత్రమే తగినది. అతని మాటను అతని ఆచరణ సత్యం చేయాలి.
Sâff 61:4
నిశ్ఛయంగా అల్లాహ్ తన మన్నతను ఆశిస్తూ ఒకరి ప్రక్కన ఒకరు ఒకే పంక్తిలో ఉండి ఒక దానితో ఒకటి ఇమిడి ఉన్న కట్టడము వలె తన మన్నతను ఆశిస్తూ తన మార్గములో పోరాడే విశ్వాసపరులను ఇష్టపడుతాడు.
Sâff 61:5
ఓ ప్రవక్తా మూసా తన జాతి వారితో ఇలా పలికినప్పటి వైనమును ఒక సారి గుర్తు చేసుకోండి : ఓ నా జాతి వారా నేను మీ వద్దకు పంపించబడ్డ అల్లాహ్ ప్రవక్తనని తెలిసికూడా నా ఆదేశమును విబేధించి ఎందుకని మీరు నాకు బాధను కలిగిస్తున్నారు ?!. ఎప్పుడైతే వారు ఆయన వారి వద్దకు తీసుకుని వచ్చిన సత్యము నుండి వాలిపోయారో,మరలిపోయారో అల్లాహ్ వారి హృదయములను సత్యము నుండి మరియు స్థిరత్వము నుండి మరలింపజేశాడు. మరియు అల్లాహ్ తన విధేయత నుండి వైదొలగిపోయిన జాతి వారిని సత్యము పొందే భాగ్యమును కలిగించడు.
Sâff 61:6
ఓ ప్రవక్తా మర్యమ్ కుమారుడగు ఈసా అలైహిస్సలాం ఇలా పలికినప్పటి వైనమును మీరు ఒక సారి గుర్తు చేసుకోండి : ఓ ఇస్రాయీలు సంతతివారా నిశ్ఛయంగా నేను అల్లాహ్ ప్రవక్తను ఆయన నన్ను నా కన్న ముందు అవతరింపబడిన తౌరాత్ ను దృవీకరించేవాడిగా పంపించాడు. నేను ప్రవక్తల్లో మొదటి వాడిని కాను. మరియు నా తరువాత వచ్చే ఒక ప్రవక్త గురించి శుభవార్తనిచ్చే వానిగా పంపించాడు అతని పేరు అహ్మద్. ఎప్పుడైతే ఈసా అలైహిస్సలాం వారి వద్దకు తన నిజాయితీని సూచించే వాదనలను తీసుకుని వచ్చారో వారు ఇలా పలికారు : ఇది ఒక స్పష్టమైన మంత్రజాలము కావున మేము దీన్ని అనుసరించము.
Sâff 61:7
అల్లాహ్ పై అబద్దమును కల్పించుకునే వాడి కంటే పెద్ద దుర్మార్గుడు ఎవడూ ఉండడు. ఎందుకంటే అతడు ఆయనకు సాటి కల్పించుకుని ఆయనను వదిలి వారిని ఆరాధించాడు. వాస్తవానికి అతడు అల్లాహ్ కొరకు ప్రత్యేకించబడిన ఏక దైవోపాసన ధర్మమైన ఇస్లాం వైపునకు పిలవబడ్డాడు. మరియు షిర్కుతో,పాప కార్యములతో తమపై దుర్మార్గమునకు పాల్పడిన జాతి వారిని అల్లాహ్ వారి సన్మార్గము మరియు వారి సంస్కరణ ఉన్న దాని వైపునకు భాగ్యము కలిగించడు.
Sâff 61:8
ఈ తిరస్కారులందరు తమ నుండి వెలువడిన చెడు మాటల ద్వారా మరియు సత్యమును వక్రీకరించటం ద్వారా అల్లాహ్ వెలుగును ఆర్పివేయాలనుకుంటున్నారు. మరియు అల్లాహ్ భూమండల తూర్పు పశ్ఛిమాల్లో తన ధర్మమునకు ఆధిక్యతను కలిగించి మరియు తన కలిమాకు ఉన్నత శిఖరాలకు చేర్చి వారికి విరుద్దంగా తన వెలుగును పూర్తి చేసేవాడును.
Sâff 61:9
అల్లాహ్ యే తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇస్లాం ధర్మమును ఇచ్చి పంపించాడు. అది సన్మార్గ ధర్మము మరియు మంచిని మార్గ నిర్దేశకం చేసేది మరియు ప్రయోజనకర జ్ఞాన మరియు సత్కర్మ ధర్మము. భూమిపై దానికి అధికారము కలగటమును ద్వేషించే ముష్రికులకు ఇష్టం లేకపోయిన దాన్ని ధర్మములన్నింటిపై ఆధిక్యతను కలిగించటానికి.
Sâff 61:10
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా ఏమీ నేను మీకు మిమ్మల్ని బాధకరమైన శిక్ష నుండి రక్షించే ఒక లాభదాయకమైన వ్యాపారము వైపునకు మార్గ నిర్ధేశకం చేయనా ?.
Sâff 61:11
ఈ లాభదాయక వ్యాపారము అది మీరు అల్లాహ్ పై, ఆయన ప్రవక్తపై విశ్వాసం చూపటం మరియు పరిశుద్ధుడైన ఆయన మార్గంలో మీ సంపదలను ఖర్చు చేసి,మీ ప్రాణములను వినియోగించి ఆయన మన్నతను ఆశిస్తూ పోరాడటం. ఈ ప్రస్తావించబడిన కార్యము మీ కొరకు మేలైనది ఒక వేళ మీరు తెలుసుకుంటే దాని వైపునకు త్వరపడండి.
Sâff 61:12
మరియు ఈ వ్యాపారము యొక్క ప్రయోజనం అది అల్లాహ్ మీ కొరకు మీ పాపములను మన్నించటం మరియు మిమ్మల్ని భవనముల క్రింది నుండి,చెట్ల క్రింది నుండి కాలువలు ప్రవహించే స్వర్గ వనములలో ప్రవేశింపజేయటం మరియు శాశ్వత స్వర్గ వనముల్లో ఉన్న మంచి నివాసములలో మిమ్మల్ని ప్రవేశింపజేయటం. వాటి నుండి మరలింపు అన్నది ఉండదు. ఈ ప్రస్తావించబడిన ప్రతిఫలమే ఎటువంటి విజయము సరితూగని గొప్ప విజయము.
Sâff 61:13
మరియు ఈ వ్యాపార ప్రయోజనముల్లోంచి మీరు ఇష్టపడే ఇంకొక లక్షణం ఉన్నది అది ఇహలోకంలో త్వరగా లభించేది. అల్లాహ్ మీ శతృవులకు విరుద్ధంగా మీకు సహాయం చేయటం మరియు ఆయన మీకు విజయం కలిగించే దగ్గరలోని విజయం అది మక్కాపై విజయం మొదలుగునవి. ఓ ప్రవక్తా మీరు విశ్వాసపరులకు సంతోషమును కలిగించే ఇహలోకములో సహాయము పరలోకంలో స్వర్గపు విజయము గురించి తెలియపరచండి.
Sâff 61:14
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా ఈసా అలైహిస్సలాం హవారీలతో అల్లాహ్ మార్గములో నాకు ఎవరు సహాయకులుగా ఉంటారు అని పలికినప్పుడు హవారీలు సహాయము చేసిన మాదిరిగా మీ ప్రవక్త తీసుకుని వచ్చిన అల్లాహ్ ధర్మము కొరకు మీ సహాయము ద్వారా అల్లాహ్ కు సహాయకులుగా అయిపోండి. అప్పుడు వారు (హవారీలు) త్వరపడుతూ ఆయనకు ఇలా సమాధానమిచ్చారు : మేము అల్లాహ్ కు సహాయకులుగా ఉంటాము. అప్పుడు ఇస్రాయీలు సంతతి వారిలోంచి ఒక వర్గము ఈసా అలైహిస్సలాం పై విశ్వాసమును కనబరచినది. ఇంకొక వర్గము ఆయనను తిరస్కరించింది. అప్పుడు మేము ఈసా అలైహిస్సలాం పై విశ్వాసమును కనబరచిన వారికి ఆయనను తిరస్కరించిన వారికి విరుద్ధంగా మద్దతును కలిగించాము. అప్పుడు వారు వారిపై ఆధిక్యతను కలిగినవారైపోయారు.
Cumua 62:1
ఆకాశములలో ఉన్నవన్ని మరియు భూమిలో ఉన్నవన్ని సృష్టితాలు అల్లాహ్ కు తగని లోపములు ఉన్న గుణాల నుండి పరిశుద్ధతను కొనియాడుతున్నవి మరియు ఆయన అతీతను తెలుపుతున్నవి. ఆయన ఒక్కడే రాజ్యమును ఏలే ఏకైక రాజాది రాజు, ప్రతీ లోపము నుండి పరిశుద్ధుడు. ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో మరియు తన ధర్మ శాసనంలో మరియు తన విధి వ్రాతలో వివేకవంతుడు.
Cumua 62:2
ఆయనే చదవలేని వ్రాయలేని వారైన అరబ్బులలో వారిలో నుంచే ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన తనపై అవతరింపజేసిన అతని ఆయతులను వారికి చదివి వినిపిస్తాడు. మరియు ఆయన వారిని అవిశ్వాసము నుండి,దుర లక్షణాల నుండి పరిశుద్ధపరుస్తాడు. మరియు వారికి ఖుర్ఆన్ ను బోదిస్తాడు. మరియు వారికి సున్నత్ ను నేర్పిస్తాడు. మరియు నిశ్చయంగా ఆయన వారి వద్దకు ప్రవక్తగా పంపించక మునుపు వారు సత్యము నుండి స్పష్టమైన అపమార్గంలో ఉండేవారు. ఎందుకంటే వారు విగ్రహాలను ఆరాధించేవారు. మరియు రక్తమును చిందించేవారు. మరియు బంధుత్వమును త్రెంచేవారు.
Cumua 62:3
మరియు ఆయన ఈ ప్రవక్తను అరబ్బుల్లోంచి ఇతర జనుల వైపునకు మరియు వారే కాకుండా ఇంకా రాని వారి వైపునకు పంపించాడు. మరియు వారు తొందరలోనే వస్తారు. మరియు ఆయన ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో మరియు తన ధర్మ శాసనంలో మరియు తన విధి వ్రాతలో వివేకవంతుడు.
Cumua 62:4
ఈ ప్రస్తావించబడినది - అరబ్బుల వైపునకు మరియు ఇతరుల వైపునకు ప్రవక్తను పంపించడం - అల్లాహ్ అనుగ్రహము ఆయన దాన్ని తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ గొప్ప ఉపకారము చేసేవాడు. మరియు ఆయన ఉపకారములో నుంచి ఈ సమాజపు ఒక ప్రవక్తను ప్రజలందరి వైపునకు ఆయన ప్రవక్తగా పంపించటం.
Cumua 62:5
తౌరాతులో ఉన్న దానికి కట్టుబడి ఉండమని బాధ్యత ఇవ్వబడిన తరువాత దాని బాధ్యత వహించని యూదుల ఉపమానము పెద్ద పెద్ద పుస్తకాలు మోసే గాడిద లాంటిది. దానిపై మోయబడినవి పుస్తకాలా లేదా వేరేవా దానికి తెలియదు. అల్లాహ్ ఆయతులను తిరస్కరించే జాతి వారి ఉపమానము ఎంతో చెడ్డది. మరియు అల్లాహ్ దుర్మార్గ జనులకు సత్యమును పొందే భాగ్యమును కలిగించడు.
Cumua 62:6
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ యూదత్వముపై దానిలో మార్పు చేర్పులైన తరువాత ఉండిపోయినవారా ప్రజలను కాకుండా మిమ్మల్ని అల్లాహ్ కొరకు ప్రత్యేకమైన స్నేహితులుగా మీరు ఒక వేళ వాదిస్తే మీరు మరణమును కోరుకోండి - మీ వాదనకు తగ్గట్టుగా - మీకు ప్రత్యేకించుకున్నది గౌరవం త్వరగా లభించటానికి ఒక వేళ మీరు ప్రజలు కాకుండా అల్లాహ్ స్నేహితులని మీ వాదనలో సత్యవంతులే అయితే.
Cumua 62:7
మరియు వారు ఎన్నటికి మరణమును ఆశించరు. కాని వారు చేసుకున్న అవిశ్వాసము,పాపకార్యములు,దుర్మార్గము,తౌరాతులో మార్పు చేర్పుల వలన ఇహలోకంలో శాశ్వతంగా ఉండిపోవటమును ఆశిస్తారు. మరియు అల్లాహ్ కు దుర్మార్గుల గురించి బాగా తెలుసు. వారి కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వాటిపరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Cumua 62:8
ఓ ప్రవక్తా ఈ యూదులందరితో మీరు ఇలా పలకండి : నిశ్చయంగా మీరు ఏ మరణము నుండి పారిపోతున్నారో అది త్వరగా లేదా అలస్యంగా మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ తరువాత మీరు ప్రళయదినమున గోచర,అగోచర విషయాల గురించి జ్ఞానము కల అల్లాహ్ వైపునకు మరలించబడుతారు. ఆ రెండిటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. అప్పుడు ఆయన మీరు ఇహలోకంలో చేసుకున్న వాటి గురించి మీకు తెలియపరుస్తాడు. మరియు వాటి పరంగా ఆయన మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Cumua 62:9
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా జుమా రోజున ప్రసంగం చేసే వారు మెంబరుపై ఎక్కిన తరువాత అజాన్ ఇచ్చే వారు పిలుపు ఇచ్చినప్పుడు మీరు ఖుత్బాకి,నమాజుకు హాజరు కావటం కొరకు త్వరపడండి. మరియు మీరు విధేయత చూపటం నుండి అశ్రద్ధవహించకుండా ఉండటానికి వ్యాపారమును వదిలివేయండి. జుమా నమాజు కొరకు అజాన్ ఇవ్వబడిన తరువాత పరుగెత్తి రావటం, వ్యాపారమును వదిలివేయటం లాంటి ఆదేశించబడినవి ఇవి మీకు ఎంతో మేలైనది - ఓ విశ్వాసపరులారా - ఒక వేళ మీకు అది తెలిసి ఉంటే మీరు అల్లాహ్ మీకు ఆదేశించిన వాటిని చేసి చూపించండి.
Cumua 62:10
మీరు జుమా నమాజును పూర్తి చేసినప్పుడు హలాల్ సంపాదనను,మీ అవసరాలను పూర్తి చేసుకోవటమును అన్వేషిస్తూ భూమిలో విస్తరించిపోండి. మరియు హలాల్ సంపాదన మార్గము నుండి మరియు హలాల్ ప్రయోజనం నుండి అల్లాహ్ అనుగ్రహమును ఆశించండి. మరియు మీరు ఆహారోపాధిని మీరు అన్వేషిస్తున్న సమయంలో అల్లాహ్ ను ఎక్కువగా స్మరించండి. ఆహారోపాధిని మీ అన్వేషించటం మిమ్మల్ని అల్లాహ్ స్మరణను మరపింపజేయకూడదు. మీరు ఇష్టపడే వాటి ద్వారా విజయమును ఆశిస్తూ మరియు మీరు భయపడే వాటి నుండి విముక్తి పొందుతూ.
Cumua 62:11
మరియు కొంత మంది ముస్లిములు ఏదైన వ్యాపారమును లేదా వినోదమును చూసినప్పుడు దాని వైపునకు బయలుదేరి వేరైపోయేవారు. మరియు ఓ ప్రవక్తా వారు మిమ్మల్ని మెంబరుపై నిలబడి ఉండగా వదిలేసేవారు. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా తెలపండి : సత్కార్యము చేయటంపై అల్లాహ్ వద్ద ఉన్న ప్రతిఫలము మీరు బయలుదేరి వెళ్ళిన వ్యాపారము,వినోదము కన్న ఎంతో మేలైనది. మరియు అల్లాహ్ జీవనోపాధి ప్రసాదించటంలో అత్యుత్తముడు.
Münafikun 63:1
ఓ ప్రవక్తా ఇస్లాంను బహిర్గతం చేసి అవిశ్వాసమును హృదయముల్లో దాచిన కపటులు మీ సభలో హాజరు అయినప్పుడు వారు ఇలా పలికేవారు : నిశ్చయంగా వాస్తవానికి నీవు అల్లాహ్ ప్రవక్త అని మేము సాక్ష్యం పలుకుతున్నాము. నిశ్చయంగా మీరు ఆయన ప్రవక్త అని అల్లాహ్ కు తెలుసు. మరియు మీరు ఆయన ప్రవక్త అని తమ హృదయముల లోతు నుండి వారు సాక్ష్యం పలుకుతున్నారన్న వాదనలో కపటులు అబద్దము పలుకుతున్నారని అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడు.
Münafikun 63:2
విశ్వాసవంతులన్న తమ వాదనపై వారు చేసే తమ ప్రమాణములను హతమార్చబడటం నుండి మరియు బందీకాబడటం నుండి తమ కొరకు పరదాగా మరియు ఢాలుగా చేసుకునేవారు. మరియు వారు వ్యపింపజేసిన సందేహాలు,అపోహల ద్వారా ప్రజలను విశ్వాసము నుండి మరల్చేవారు. నిశ్చయంగా వారు ఆచరించే కపటత్వము మరియు అబద్దపు ప్రమాణాలు ఎంతో చెడ్డవైనవి.
Münafikun 63:3
ఇది ఎందుకంటే వారు కపటత్వాన్ని విశ్వసించారు. మరియు విశ్వాసము వారి హృదయములకు చేరుకోలేదు. ఆ తరువాత వారు రహస్యంగా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును చూపారు. అప్పుడు వారి అవిశ్వాసం వలన వారి హృదయములపై సీలు వేయబడినది. కాబట్టి వాటిలో విశ్వాసము ప్రవేశించదు. కావున ఈ సీలు వేయబడటం వలన తమకు ప్రయోజనం కలిగించే వాటిని,తమకు ఋజు మార్గం ఉన్న వాటిని వారు అర్ధం చేసుకోలేరు.
Münafikun 63:4
ఓ చూసేవాడా నీవు వారిని చూసినప్పుడు వారు ఉన్న తాజాదనము మరియు అనుగ్రహాల వలన వారి రూపాలు మరియు వారి ఆకారాలు నీకు అద్భుతంగా కనిపిస్తాయి. వారు మాట్లాడితే, వాక్చాతుర్యాన్ని కలిగి ఉన్నందున మీరు వారి మాటలు వింటారు. ఓ ప్రవక్తా వారు మీ సభలో ఉన్నప్పుడు ఆనించి ఉంచిన కట్టె వలె ఉంటారు. వారు దేనిని అర్ధం చేసుకోరు. మరియు దాన్ని గుర్తుంచుకోరు. వారిలో ఉన్న పిరికితనం వలన ప్రతీ స్వరము తమను లక్ష్యంగా చేసుకున్నదని వారు భావిస్తారు. వారే వాస్తవనికి శతృవులు. ఓ ప్రవక్తా వారు మీ రహస్యాలను బహిర్గతం చేయటం గాని లేదా మీ పట్ల కుట్రలు పన్నటం గాని చేస్తారని మీరు వారితో జాగ్రత్తగా ఉండండి. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక. వారు విశ్వాసము నుండి దాని సూచనలు స్పష్టమైనా కూడా మరియు దాని ఆధారాలు బహిర్గతమైనా కూడా ఎలా మరలించబడుతున్నారు ?.
Münafikun 63:5
మరియు ఈ కపటులందరితో : మీ నుండి జరిగిన తొందరపాటుకు కారణం చూపుతూ దైవ ప్రవక్త వద్దకు రండి ఆయన మీ కొరకు అల్లాహ్ యందు మీ పాపముల నుండి మన్నింపును వేడుకుంటారు అని పలకబడినప్పుడు వారు తమ తలలను హేళనగా,ఎగతాళిగా ఊపారు. మరియు నీవు వారిని వారికి ఇవ్వబడిన ఆదేశము నుండి విముఖత చూపుతుండగా చూస్తావు. మరియు వారు సత్యమును స్వీకరించటం నుండి మరియు దాన్ని అంగీకరించటం నుండి అహంకారమును చూపుతారు.
Münafikun 63:6
ఓ ప్రవక్తా వారి పాపముల కొరకు మీరు మన్నింపు వేడుకోవటం మరియు వారి కొరకు మీరు మన్నింపు వేడుకోకపోవటం సమానము. అల్లాహ్ వారి కొరకు వారి పాపములను మన్నించడు. నిశ్చయంగా అల్లాహ్ తన విధేయత నుండి వైదొలగిపోయిన ,ఆయన అవిధేయతపై మొండిగా ఉన్న జనులకు భాగ్యమును కలిగించడు.
Münafikun 63:7
వారే ఇలా పలికేవారు : మీరు మీ సంపదలను అల్లాహ్ ప్రవక్త వద్ద ఉన్న పేద వారిపై మరియు మదీనా చుట్టు ప్రక్కల ఉన్న పల్లె వాసులపై వారు ఆయన వద్ద నుండి వేరవ్వనంత వరకు ఖర్చు చేయకండి. మరియు ఆకాశములలో ఉన్న ఖజానాలు మరియు భూమిలో ఉన్న ఖజానాలు అల్లాహ్ కే చెందుతాయి. ఆయన వాటిని తన దాసుల్లోంచి తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. కాని పరిశుద్ధుడైన ఆయన చేతిలోనే ఆహారపు ఖజానాలు ఉన్నాయని కపటులకు తెలియదు.
Münafikun 63:8
వారి నాయకుడు అబ్దుల్లాహ్ ఇబ్నె ఉబయ్ ఇలా పలికే వాడు : ఒక వేళ మేము మదీనాకు వాపసు అయితే గౌరవోన్నతుడు - అంటే వారు నేను మరియు నా జాతివారు - అక్కడ నుండి నీచులను - వారు ముహమ్మద్ మరియు అతని సహచరులని - తప్పకుండా వెళ్ళగొడుతాము. గౌరవం అన్నది ఒక్కడైన అల్లాహ్ కొరకు మరియు ఆయన ప్రవక్త కొరకు మరియు విశ్వాసపరుల కొరకు. మరియు అది అబ్దుల్లాహ్ ఇబ్నె ఉబయ్ మరియు అతని సహచరుల కొరకు కాదు. కాని గౌరవం అన్నది అల్లాహ్ కొరకు,ఆయన ప్రవక్త కొరకు,విశ్వాసపరుల కొరకు అని కపటులకు తెలియదు.
Münafikun 63:9
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీ సంపదలు గాని మీ సంతానము గాని నమాజు నుండి లేదా ఇస్లాం యొక్క ఇతర అనివార్య కార్యాల నుండి మిమ్మల్ని నిర్లక్ష్యంలో పడవేయకూడదు. మరియు ఎవరినైతే అతని సంపదలు,అతని సంతానము అతనిపై అల్లాహ్ అనివార్యం చేసిన నమాజు,ఇతర వాటి నుండి నిర్లక్ష్యంలో పడవేస్తాయో వారందరు వాస్తవానికి ప్రళయదినమున తమ స్వయానికి,తమ ఇంటివారికి నష్టం కలిగించుకుని నష్టపోయేవారు.
Münafikun 63:10
మరియు మీరు మీలో నుండి ఎవరికి మరణం రాక ముందే అల్లాహ్ మీకు ప్రసాదించిన సంపదల్లోంచి ఖర్చు చేయండి. అప్పుడు అతడు తన ప్రభువుతో ఓ నా ప్రభువా ఎందుకని నీవు నాకు కొంత గడువు ఇవ్వలేదు. నేను నా సంపద నుండి అల్లాహ్ మార్గంలో దానం చేసి తమ సత్కర్మలు చేసుకున్న అల్లాహ్ యొక్క పుణ్య దాసుల్లోంచి అయిపోయే వాడిని.
Münafikun 63:11
ఏ మనిషి యొక్క మరణం ఆసన్నమై అతని ఆయుషు పూర్తి అవుతుందో అతనికి పరిశుద్ధుడైన అల్లాహ్ గడువు ఇవ్వడు. మీరు ఏమి చేస్తున్నారో అల్లాహ్ తెలుకునేవాడు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఒక వేళ అది మంచిదైతే మంచిదవుతుంది. ఒక వేళ అది చెడ్డదైతే అది చెడ్డదవుతుంది.
Teğabün 64:1
ఆకాశములలో ఉన్నవన్ని మరియు భూమిలో ఉన్నవన్ని సృష్టితాలు అల్లాహ్ కు తగని లోపములు ఉన్న గుణాల నుండి పరిశుద్ధతను కొనియాడుతున్నవి మరియు ఆయన అతీతను తెలుపుతున్నవి. రాజ్యాధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. ఆయన తప్ప రాజ్యాధికారి ఎవరూ లేరు. మంచి పొగడ్తలు ఆయనకే చెందుతాయి. మరియు ఆయన ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
Teğabün 64:2
ఓ ప్రజలారా ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. అయితే మీలో నుండి ఆయనను అవిశ్వసించేవాడున్నాడు అతని పరిణామము నరకాగ్ని. మరియు మీలో నుండి ఆయనను విశ్వసించేవాడున్నాడు అతని పరిణామము స్వర్గము. మీరు చేసేదంతా అల్లాహ్ వీక్షిస్తున్నాడు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Teğabün 64:3
ఆయన ఆకాశములను మరియు భూమిని సత్యముతో సృష్టించాడు. ఆ రెండింటిని ఆయన వృధాగా సృష్టించలేదు. ఓ ప్రజలారా ఆయన మీ రూపకల్పన చేశాడు. మీ రూపమును ఆయన తన వద్ద నుండి ఉపకారముగా,అనుగ్రహముగా మంచిగా చేశాడు. ఒక వేళ ఆయన తలచుకుంటే దాన్ని దుర్బరంగా చేసేవాడు. ప్రళయదినమున ఆయన ఒక్కడి వైపే మరలటం జరుగుతుంది. అప్పుడు ఆయన మీకు మీ కర్మల ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఒక వేళ అవి మంచిగా ఉంటే మంచిని మరియు చెడుగా ఉంటే చెడుని.
Teğabün 64:4
ఆకాశములలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మీరు గోప్యంగా ఉంచి చేసే మీ కర్మలన్ని ఆయనకు తెలుసు. మరియు మీరు బహిర్గతం చేసి చేసేవన్ని ఆయనకు తెలుసు. హృదయముల్లో ఉన్న మంచి లేదా చెడు గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Teğabün 64:5
ఓ ముష్రికులారా మీకన్న మునుపటి తిరస్కార జాతుల వారైన నూహ్,ఆద్,సమూద్,ఇతర జాతుల లాంటి వారి సమాచారము మీకు చేరలేదా. వారు ఉన్న అవిశ్వాసము యొక్క శిక్షను ఇహలోకములోనే రుచి చూశారు. మరియు పరలోకంలో వారి కొరకు బాధాకరమైన శిక్ష కలదు. ఎందుకు చేరలేదు. నిశ్చయంగా ఆ సమాచారం మీకు చేరినది. కావున వారికి జరిగిన దాని నుండి మీరు గుణపాఠం నేర్చుకోండి. వారిపై దిగినది మీపై దిగక ముందే మీరు అల్లాహ్ ముందు పశ్చాత్తాప్పడండి.
Teğabün 64:6
ఈ శిక్ష ఏదైతే వారికి సంభవించినదో దానికి కారణం వారి వద్దకు వారి ప్రవక్తలు అల్లాహ్ వద్ద నుండి స్పష్టమైన వాదనలను మరియు స్పష్టమైన ఆధారాలను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు ప్రవక్తలు మానవుల్లోంచి కావటమును నిరాకరిస్తూ ఇలా పలికారు : ఏమీ ఒక మనిషి మమ్మల్ని సత్యం వైపునకు మార్గదర్శకం చేస్తాడా ?. అప్పుడు వారు తిరస్కరించారు మరియు వారిని విశ్వసించటం నుండి విముఖత చూపారు. వారు అల్లాహ్ కు ఏమాత్రం నష్టం కలిగించ లేదు. అల్లాహ్ కు వారి విశ్వాసము,వారి విధేయత అవసరం లేదు. ఎందుకంటే వారి విధేయత ఆయనకి ఏమి అధికం చేయదు. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు తన దాసుల అవసరం లేని వాడు. ఆయన మాటల్లో,ఆయన చేతల్లో పొగడబడినవాడు.
Teğabün 64:7
అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారు అల్లాహ్ వారిని వారి మరణం తరువాత జీవింపజేసి మరల లేపడని భావించేవారు. ఓ ప్రవక్తా మరణాంతరం లేపబడటమును నిరాకరించే వీరందరితో మీరు ఇలా పలకండి : ఎందుకు కాదు. నా ప్రభువు సాక్షిగా ప్రళయదినమున మీరు తప్పకుండా లేపబడుతారు. ఆ పిదప మీరు ఇహలోకములో చేసుకున్న కర్మల గురించి మీకు తప్పకుండా తెలుపబడును. ఈ మరణాంతరం లేపటం అల్లాహ్ కు ఎంతో సులభము. నిశ్చయంగా ఆయన మిమ్మల్ని మొదటిసారి సృష్టించాడు. కనుక లెక్క తీసుకుని ప్రతిఫలం ప్రసాదించటం కొరకు ఆయన మిమ్మల్ని మీ మరణాంతరం మరల లేపటంపై సామర్ధ్యం కలవాడు.
Teğabün 64:8
కావున ఓ ప్రజలారా మీరు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచండి మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచండి. మరియు మేము మా ప్రవక్తపై అవతరింపజేసిన ఖుర్ఆన్ పై విశ్వాసమును కనబరచండి. మరియు మీరు చేసేదంత అల్లాహ్ కు తెలుసు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Teğabün 64:9
ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు మీ కర్మల ప్రతిఫలం ప్రసాదించటం కొరకు మిమ్మల్ని సమావేశపరిచే ప్రళయదినమును గుర్తు చేసుకోండి. ఆ రోజున అవిశ్వాసపరుల నష్టము మరియు వారి లోపము బహిర్గతమవుతుంది. ఎందుకంటే స్వర్గములోని నరక వాసుల నివాసములకు విశ్వాసపరులు వారసులవుతారు. మరియు నరకములోని స్వర్గవాసుల నివాసములకు నరకవాసులు వారసులవుతారు. మరియు ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి సత్కార్యము చేస్తాడో అల్లాహ్ అతని నుండి అతని పాపములను మన్నించివేస్తాడు. మరియు అతన్ని స్వర్గ వనాల్లో ప్రవేశింపజేస్తాడు. వాటి భవనముల క్రింది నుండి మరియు వాటి వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. వారు వాటిలో నుండి బయటకు రారు. మరియు వారి నుండి వాటి అనుగ్రహములు అంతం కావు. వారు పొందే ఈ గొప్ప విజయము దానికి ఎటువంటి విజయము సరితూగదు.
Teğabün 64:10
మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి మేము మా ప్రవక్తలపై అవతరింపజేసిన మా ఆయతులను తిరస్కరిస్తారో వారందరు నరక వాసులు వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వారి గమ్య స్థానము చెడ్డ గమ్య స్థానము.
Teğabün 64:11
ఎవరికైన అతని ప్రాణ విషయంలో లేదా అతని సంపద విషయంలో లేదా అతని సంతాన విషయంలో ఏదైన ఆపద కలిగితే అది కేవలం అల్లాహ్ నిర్ణయం మరియు ఆయన విధి వ్రాతతో మాత్రమే. మరియు ఎవరైతే అల్లాహ్ పై,ఆయన నిర్ణయంపై,ఆయన విధి వ్రాతపై విశ్వాసమును కనబరుస్తాడో అల్లాహ్ అతని మనస్సుకు తన ఆదేశమును స్వీకరించే మరియు తన నిర్ణయం పై సంతోషపడే భాగ్యమును కలిగిస్తాడు. మరియు ప్రతీది అల్లాహ్ కు తెలుసు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
Teğabün 64:12
మరియు మీరు అల్లాహ్ కు విధేయత చూపండి. మరియు ప్రవక్తకు విధేయత చూపండి. ఒక వేళ ఆయన ప్రవక్త మీ వద్దకు తీసుకుని వచ్చిన వాటి పట్ల మీరు విముఖత చూపితే ఆ విముఖత చూపటం యొక్క పాపము మీపైనే. మరియు మా ప్రవక్తపై కేవలం మేము చేరవేయమని ఆయనకు ఆదేశించిన వాటిని చేరవేయటం మాత్రమే బాధ్యత. వాస్తవానికి ఆయన దేనిని చేరవేయమని ఆదేశించబడ్డారో మీకు చేరవేశారు.
Teğabün 64:13
అల్లాహ్ యే వాస్తవ ఆరాధ్య దైవము. ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్యదైవం లేడు. విశ్వాసపరులు ఒక్కడైన అల్లాహ్ పైనే తమ వ్యవహారాలన్నింటిలో నమ్మకమును కలిగి ఉండాలి.
Teğabün 64:14
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించేవారా నిశ్చయంగా మీ భార్యలు,మీ సంతానము మిమ్మల్ని వారు అల్లాహ్ స్మరణ నుండి,ఆయన మార్గంలో ధర్మ పోరాటం చేయటం నుండి నిర్లక్ష్యం వహించే వారిగా చేసేవారు కావటం వలన మరియు మిమ్మల్ని ఆపటం వలన మీ కొరకు శతృవులు. కావున వారు మీ విషయంలో మిమ్మల్ని ప్రభావితం చేయటం నుండి మీరు జాగ్రత్తపడండి. ఒక వేళ మీరు వారి తప్పులను క్షమించి వేసి వాటి నుండి మీరు విముఖత చూపి వాటిపై పరదా కప్పివేస్తే నిశ్చయంగా అల్లాహ్ మీ కొరకు మీ పాపములను మన్నించి వేసి మీపై దయ చూపుతాడు. మరియు ప్రతిఫలము ఆచరణ ఎలా ఉంటే అలా ఉంటుంది.
Teğabün 64:15
నిశ్చయంగా మీ సంపదలు మరియు మీ సంతానము మీ కొరకు ఒక పరీక్ష. నిశ్చయంగా వారు మిమ్మల్ని నిషిద్ధమైన వాటిని సంపాదించటంపై మరియు అల్లాహ్ విధేయతను వదిలివేయటం పై ప్రేరేపిస్తాయి. మరియు అల్లాహ్ వద్ద సంతానపు విధేయతపై,సంపాదనలో నిమగ్నమవటం పై, ఆయన విధేయతను ప్రాధాన్యతనిచ్చే వారి కొరకు గొప్ప ప్రతిఫలం కలదు. ఈ గొప్ప పుణ్యమే అది స్వర్గము.
Teğabün 64:16
కావున మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయన విధేయతపై మీ శక్తి మేరకు భయపడండి. మరియు మీరు వినండి మరియు మీరు అల్లాహ్ కు,ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. మరియు మీరు అల్లాహ్ మీకు ప్రసాదించిన మీ సంపదలను మంచి మార్గముల్లో ఖర్చు చేయండి. మరియు ఎవరినైతే అల్లాహ్ అతని హృదయ లోభత్వం నుండి రక్షిస్తాడో వారందరు తాము ఆశించిన వాటితో విజయం పొందుతారు. మరియు తాము భయపడే వాటి నుండి ముక్తి పొందుతారు.
Teğabün 64:17
ఒక వేళ మీరు అల్లాహ్ కు ఆయన మార్గంలో మీ సంపదలను ఖర్చు చేసి మంచి అప్పును ఇస్తే ఆయన మీ కొరకు పుణ్యమును పది రెట్ల నుండి ఏడువందల రెట్ల వరకు ఇంకా అధికంగా రెట్టింపు చేస్తాడు. మరియు ఆయన మీ కొరకు మీ పాపములను మన్నించివేస్తాడు. మరియు అల్లాహ్ కొద్దిపాటి ఆచరణపై అధిక పుణ్యమును ప్రసాదించి ఆదరించేవాడు. మరియు శిక్షను త్వరగా విధించని సహనశీలుడు.
Teğabün 64:18
పరిశుద్ధుడైన అల్లాహ్ అగోచర విషయాల గురించి తెలిసినవాడును మరియు గోచర విషయాల గురించి తెలిసినవాడును. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ఎవరూ ఓడించ లేని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో,తన ధర్మ శాసనంలో,తన విధి వ్రాతలో వివేకవంతుడు.
Talak 65:1
ఓ ప్రవక్తా మీరు లేదా మీ సమాజము నుండి ఎవరైన తమ భార్యకు విడాకులు ఇవ్వదలచినప్పుడు ఆమె గడువు (ఇద్దత్) ఆరంభంలో ఆమెకు విడాకులివ్వండి. విడాకులు శుద్ధావస్తలో ఇవ్వాలి అందులో ఆమెతో సంబోగించకుండా ఉండాలి. ఆ గడువులో మీరు వారి వైపు మరలదలచుకుంటే మీ భార్యల వైపు మరలే అధికారం మీకు కలగటానికి. మరియు మీరు మీ ప్రభువైన అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటిస్తూ మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడండి. మీరు విడాకులిచ్చిన స్త్రీలను వారు ఉన్న నివాసముల నుండి మీరు వెళ్ళగొట్టకండి. మరియు వారు కూడా తమ గడువు ముగియనంతవరకు స్వయంగా వెళ్ళిపోకూడదు. కాని ఒక వేళ వారు వ్యభిచారము లాంటి ప్రత్యక్షమైన అశ్లీల కార్యమునకు పాల్పడితే తప్ప. ఈ ఆదేశాలు అల్లాహ్ తన దాసుల కొరకు విధించిన హద్దులు. మరియు ఎవరైతే అల్లాహ్ హద్దులను అతిక్రమిస్తాడో అతడు తన ప్రాణముపై దుర్మార్గమునకు పాల్పడ్డాడు. ఎందుకంటే అతడు తన ప్రభువుకు అవిధేయత చూపటం వలన దాన్ని వినాశన స్థానములకు చేర్చాడు. ఓ విడాకులిచ్చేవాడా నీకు తెలియదు బహుశా అల్లాహ్ దీని తరువాత భర్త మనస్సులో ఆకర్షణను కలిగిస్తే అప్పుడు అతడు తన భార్య వైపుకు మరలుతాడు.
Talak 65:2
వారి గడువు ముగిసే సమయం ఆసన్నమైనప్పుడు మీరు వారివైపు ప్రేమతో,మంచిగా వ్యవహరిస్తూ మరలండి లేదా వారి గడువు ముగిసేంత వరకు వారి వైపు మరలటమును వదిలి వేయండి. అప్పుడు వారికి తమపై పూర్తి అధికారముంటుంది, అది కూడా వారి కొరకు ఉన్న హక్కులను వారికి అప్పగించటంతో పాటు. మరియు మీరు వారి వైపు మరలదలచుకుంటే లేదా వారి నుండి విడిపోవదలచుకుంటే అప్పుడు మీరు తగాదాను అంతమొందించటానికి మీలో నుండి ఇద్దరు న్యాయవంతులైన సాక్షులను ఏర్పాటు చేసుకోండి. ఓ సాక్ష్యం పలికేవారా మీరు అల్లాహ్ మన్నతను ఆశిస్తూ సాక్ష్యం ఇవ్వండి. ఈ ప్రస్తావించబడిన ఆదేశాలతో అల్లాహ్ పై,ప్రళయదినం పై విశ్వాసమును చూపే వాడు హితోపదేశం గ్రహిస్తాడు. ఎందుకంటే అతడే హితోపదేశము ద్వారా ప్రయోజనం చెందుతాడు. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటిస్తూ ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడతాడో అతడిని అల్లాహ్ అతడికి కలిగే ప్రతీ ఇబ్బంది నుండి,బాధ నుండి బయటపడే మార్గమును తయారు చేస్తాడు.
Talak 65:3
మరియు ఆయన అతను ఆలోచించని మరియు అతని మనసులో లేని చోటు నుండి అతనికి ఆహారోపాధిని కలిగిస్తాడు. మరియు ఎవరైతే తన వ్యవహారాల్లో అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉంటాడో ఆయన అతనికి చాలు. నిశ్చయంగా అల్లాహ్ తన ఆదేశమును చేసి తీరుతాడు. దేని నుండి కూడా ఆయన అశక్తుడు కాడు. మరియు ఏదీ ఆయన నుండి తప్పిపోదు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ వస్తువుకు నిర్ణీత లెక్కను ఉంచాడు. అది దానికి చేరుతుంది. కావున కష్టానికి ఒక నిర్ణీత లెక్క ఉన్నది. మరియు సుఖానికి ఒక నిర్ణీత లెక్క ఉన్నది. ఆ రెండిటిలో నుంచి ఏది కూడా మనిషిపై శాశ్వతంగా ఉండదు.
Talak 65:4
మరియు ఆ విడాకులివ్వబడిన స్త్రీలు ఎవరైతే తమ వయస్సు అధికమవటం వలన రుతుస్రావము అవటం నుండి నిరాశులయ్యారో ఒక వేళ మీరు వారి గడువు ఎలా ఉంటుందని సందేహ పడితే వారి గడువు మూడు నెలలు. మరియు ఏ స్త్రీలైతే తమ చిన్న వయస్సు వలన రుతుస్రావ వయస్సుకు చేరలేదో వారి గడువు కూడా అలాగే మూడు నెలలు. మరియు గర్భిణీ స్త్రీలు విడాకుల వలన లేదా మరణం వలన వారి గడువు ముగింపు వారు తమ గర్భమును ప్రసవించినప్పుడు. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడుతాడో అల్లాహ్ అతని వ్యవహారములను అతని కొరకు సులభతరం చేస్తాడు. మరియు అతని కొరకు ప్రతీ కష్టతరమైన పనిని సులభం చేస్తాడు.
Talak 65:5
ఈ ప్రస్తావించబడిన తలాఖ్ (విడాకులు),మరలింపు,గడువు ఆదేశాలు అల్లాహ్ ఆదేశము ఓ విశ్వాసపరులారా ఆయన దాన్ని మీ వైపునకు అవతరింపజేశాడు మీరు దాన్ని తెలుసుకోవటానికి. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఆయన ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడుతాడో ఆయన అతను పాల్పడిన అతని పాపములను తుడిచివేస్తాడు. మరియు ఆయన అతనికి పరలోకములో గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. అది స్వర్గములో ప్రవేశము. మరియు తరగని అనుగ్రహాలను పొందటం.
Talak 65:6
ఓ భర్తల్లారా మీరు మీ స్థోమతను బట్టి మీరు నివాసం ఉన్న చోటే వారికి నివాసమును కల్పించండి. అల్లాహ్ మీపై దాని కన్న మించి భారం వేయడు. మరియు మీరు ఖర్చు చేసే విషయంలో గాని నివాసమును కల్పించే విషయంలో గాని ఇతర విషయముల్లో గాని వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశముతో వారికి కీడును కలిగించకండి. మరియు ఒక వేళ విడాకులివ్వబడిన స్త్రీలు గర్భవతులైతే వారు తమ గర్భమును ప్రసవించే వరకు వారిపై ఖర్చు చేయండి. ఒక వేళ వారు మీ కొరకు మీ సంతానమునకు పాలు త్రాపిస్తే వారు పాలు త్రాపించినందుకు వారికి ప్రతిఫలం ఇవ్వండి. ప్రతిఫలం విషయంలో ధర్మానుసారంగా పరస్పరం సంప్రదించుకోండి. ఒక వేళ భర్త భార్య ఆశించిన ప్రతిఫలం విషయంలో పిసినారి తనం చూపి మరియు ఆమె తాను ఆశించిన దానిపై తప్ప ఇష్టపడకుండా పిసినారి తనం చూపితే తండ్రి తన సంతానమునకు పాలు త్రాపించే వేరొక స్త్రీను ఏర్పాటు చేసుకోవాలి.
Talak 65:7
ఎవరికైతే సంపదలో విశాలత్వం ఉన్నదో అతడు తాను విడాకులిచ్చిన స్త్రీ పై మరియు తన సంతానముపై తన స్తోమత ప్రకారం ఖర్చు చేయాలి. మరియు ఎవరి ఆహారోపాధి కుదించబడి ఉన్నదో అతడు అల్లాహ్ తనకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయాలి. అల్లాహ్ ఏ వ్యక్తిపై కూడా అతనికి ప్రసాదించిన దానిలో మాత్రమే భారం వేస్తాడు. దానికి మించి అతనిపై భారం వేయడు. మరియు అతని సామర్ధ్యముకు మించి భారం వేయడు. తొందరలోనే అల్లాహ్ అతని క్లిష్టమైన,కష్టమైన స్థితిని విశాలత్వమును,ఐశ్వర్యమును కలిగింపజేస్తాడు.
Talak 65:8
మరియు ఎన్నో నగర వాసులు పరిశుద్ధుడైన తమ ప్రభువు ఆదేశమును మరియు ఆయన ప్రవక్తలు అలైహిముస్సలాంల ఆదేశమును ధిక్కరించినప్పుడు మేము వారి దుష్కర్మలపై వారితో కఠినంగా లెక్క తీసుకున్నాము. మరియు మేము వారికి ఇహపరాల్లో అతి చెడ్డదైన శిక్షను విధించాము.
Talak 65:9
కావున వారు తమ దుష్కర్మల పరిణామమును రుచి చూశారు. మరియు వారి ముగింపు ఇహలోకములో నష్టముగా మరియు పరలోకములో నష్టముగా జరిగినది.
Talak 65:10
అల్లాహ్ వారి కొరకు తీవ్రమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. కావున ఓ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను విశ్వసించిన బుద్ధిమంతులారా వారిపై దిగినది మీపై దిగనంతవరకు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీ వద్దకు హితోపదేశమును అవతరింపజేశాడు. అది మీకు ఆయన పై అవిధేయత యొక్క దుష్పరిణామమును మరియు ఆయన పై విధేయత యొక్క మంచి పరిణామమును గుర్తు చేస్తుంది.
Talak 65:11
ఈ హితోపదేశం అతడు ఆయన వద్ద నుండి పంపించబడ్డ ఒక ప్రవక్త . ఆయన ఎటువంటి సందేహము లేని స్పష్టమైన అల్లాహ్ ఆయతులను వారికి చదివి వినిపిస్తున్నారు. అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి, ఆయన ప్రవక్తను దృవీకరించి సత్కర్మలు చేసే వారిని అపమార్గపు చీకట్ల నుండి సన్మార్గపు వెలుగు వైపునకు ఆయన తీస్తారని ఆశిస్తూ. మరియు ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి, సత్కర్మలు చేస్తారో వారిని అల్లాహ్ స్వర్గ వనాల్లో ప్రవేశింపజేస్తాడు. వాటి భవనముల ,వాటి వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వాస్తవానికి అల్లాహ్ అతనకి మంచి ఆహారోపాధిని ప్రసాదించాడు. ఎందుకంటే ఆయన అతన్ని అనుగ్రహాలు అంతం కాని స్వర్గములో అతన్ని ప్రవేశింపజేశాడు.
Talak 65:12
అల్లాహ్ ఆయనే సప్తాకాశములను సృష్టించాడు. మరియు ఆయన సప్తాకాశములను సృష్టించినట్లే సప్త భూములను ఆయన సృష్టించాడు. వాటి మధ్య అల్లాహ్ యొక్క విశ్వ ,ధార్మిక ఆదేశము దిగుతుంది. అల్లాహ్ ప్రతీ వస్తువుపై సామర్ధ్యం కలవాడని మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ. ఆయనను ఏదీను అశక్తుడిని చేయదు. మరియు పరిశుద్ధుడైన ఆయన జ్ఞాన పరంగా ప్రతీ వస్తువును చుట్టుముట్టి ఉన్నాడు. ఆకాశముల్లోగాని భూమిలో గాని ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
Tahrim 66:1
ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు అనుమతించిన మీ దాసిని అయిన మారియాతో ప్రయోజనం చెందటంను ఎందుకు మీ కొరకు నిషేధించుకున్నారు. దాని ద్వారా మీ సతీమణుల ఇష్టతను వారు ఆమెను ద్వేషించుకోవటం వలన మీరు కోరుకుంటూ. మరియు అల్లాహ్ మిమ్మల్ని మన్నించేవాడును మరియు మీ పై కరుణించేవాడును ?!.
Tahrim 66:2
వాస్తవానికి అల్లాహ్ మీ కొరకు పరిహారము ద్వారా మీ ప్రమాణాల నుండి బయటపడటమును ధర్మ బద్ధం చేశాడు ఒక వేళ మీరు దాని కన్న మంచి దాన్ని పొందితే లేదా ఆ విషయంలో ప్రమాణమును భంగపరచి ఉంటే. మరియు అల్లాహ్ మీకు సహాయం చేసేవాడును. మరియు మీ పరిస్థితులను గురించి,మీకు ప్రయోజనం కలిగించే వాటి గురించి ఆయనకు బాగా తెలుసు. తాను ధర్మ బద్ధం చేసే విషయంలో మరియు తన విధి వ్రాతలో వివేకవంతుడు.
Tahrim 66:3
మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హఫ్సా రజిఅల్లాహు అన్హా కి ప్రత్యేకించి ఒక విషయమును తెలియపరచినప్పటి సంఘటనను మీరు గుర్తు చేసుకోండి. మరియు అది ఆయన తన సతీమణి మారియాకి ఎన్నటికి దగ్గరవనని (చెప్పిన విషయం). హఫ్సా ఆ విషయమును ఆయిషాకు తెలియపరచినప్పుడు అల్లాహ్ తన ప్రవక్తకు ఆయన రహస్యం బట్టబయలు అవటంను తెలియపరిస్తే ఆయన హఫ్సాను మందలించి ఆమెకు కొంత విషయమును తెలియపరచి కొంత విషయమును తెలియపరచలేదు. అప్పుడు ఆమే ఆయనతో ఈ విషయం మీకు ఎవరు తెలియపరచారు అని ప్రశ్నించినది. ఆయన సమాధానమిస్తూ ప్రతీది తెలుసుకునే వాడు మరియు ప్రతీ గోప్యమును తెలుసుకునేవాడు నాకు తెలియపరచాడు అని పలికారు.
Tahrim 66:4
మీరు ఇద్దరు పశ్చాత్తాపం చెందటం మీపై తప్పనిసరి ఎందుకంటే మీరిద్దరి హృదయములు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన దాసిని నుండి దూరం ఉండటమును మరియు ఆమెను తనపై నిషేదించుకన్న విషయమును (బయట పడటమును) అయిష్ట పడిన దాని ఇష్టత వైపునకు వాలాయి. మరియు ఒక వేళ మీరిద్దరు ఆయనకు విరుద్దంగా మరలటానికి పట్టుబట్టితే నిశ్చయంగా అల్లాహ్ ఆయన సంరక్షకుడు మరియు సహాయకుడు. మరియు అలాగే జిబ్రయీలు మరియు సత్పురుషులైన విశ్వాసపరులు ఆయనకు సంరక్షకులు మరియు ఆయనకు సహాయం చేసేవారు. మరియు దైవ దూతలు అల్లాహ్ సహాయము తరువాత ఆయనకు సహాయకులు మరియు ఆయనకు బాధ కలిగించే వారికి విరుద్దంగా సహాయం చేసే వారు.
Tahrim 66:5
బహుశా పరిశుద్ధుడైన ఆయన ప్రభువు ఒక వేళ ఆయన ప్రవక్త మీకు విడాకులు ఇస్తే మీకన్న మంచి భార్యలను ఆయనకు బదులుగా ప్రసాదిస్తాడు. వారు ఆయన ఆదేశమునకు కట్టుబడి ఉండేవారై ఉంటారు, ఆయనపై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరిచే వారై ఉంటారు. అల్లాహ్ కు విధేయులై ఉంటారు. తమ పాపములపై పశ్ఛాత్తాపము పడేవారై ఉంటారు. తమ ప్రభువును ఆరాధించేవారై ఉంటారు. ఉపవాసాలుండేవారై ఉంటారు. విధవలు మరియు ఇతరులతో వివాహం కాని కన్యలై ఉంటారు. కానీ ఆయన వారికి విడాకులివ్వ లేదు.
Tahrim 66:6
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు మీ కొరకు,మీ ఇంటి వారి కొరకు మనుషులతో,రాళ్ళతో మండించబడే పెద్ద అగ్ని నుండి రక్షణను ఏర్పరచుకోండి. ఈ అగ్ని పై అందులో ప్రవేశించే వారిపై కఠినంగా వ్వహరించే కఠినమైన దూతలు ఉంటారు. అల్లాహ్ వారికి ఆదేశించినప్పుడు ఆయన ఆదేశమును నెరవేర్చకుండా ఉండరు. ఆయన వారికి ఇచ్చిన ఆదేశమును ఆలస్యం చేయకుండా,అశ్రద్ధ వహించకుండా నెరవేరుస్తారు.
Tahrim 66:7
ప్రళయదినమున అవిశ్వాసపరులతో ఇలా పలకబడును : ఓ అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచినవారా మీరు చేసుకున్న అవిశ్వాస కార్యము నుండి,పాప కార్యముల నుండి ఈ రోజు వంకలు పెట్టకండి. మీ వంకలు అంగీకరించబడవు. మీరు మాత్రం ఈ రోజు మీరు ఏదైతే ఇహలోకంలో అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచారో,ఆయన ప్రవక్తలను తిరస్కరించారో దాని ప్రతిఫలం ప్రసాదించబడుతారు.
Tahrim 66:8
ఓ అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు అల్లాహ్ వద్ద మీ పాపముల నుండి నిజమైన తౌబా చేయండి. బహుశా మీ ప్రభువు మీ నుండి మీ పాపములను తుడిచివేసి మిమ్మల్ని స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటి భవనముల క్రింది నుండి ప్రళయదినమున కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ రోజు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మరియు ఆయనతో పాటు విశ్వసించిన వారిని నరకములో ప్రవేశింపజేసి అవమానమును కలిగించడు. సిరాత్ వంతెనపై వారి కాంతి వారి ముందట మరియు వారి కుడివైపున పరుగెడుతూ ఉంటుంది. వారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా మేము స్వర్గంలో ప్రవేశించే వరకు,సిరాత్ వంతెనపై తమ వెలుగును పోగొట్టుకున్న కపటుల మాదిరిగా మేము కానంత వరకు మా వెలుగును నీవు మా కొరకు పూర్తి చేయి. మరియు నీవు మా పాపములను మన్నించు. నిశ్చయంగా నీవు ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడివి. కావున నీవు మా వెలుగును పూర్తి చేయటం నుండి మరియు మా పాపములను మన్నించటం నుండి అశక్తుడివి కావు.
Tahrim 66:9
ఓ ప్రవక్తా మీరు అవిశ్వాసపరులతో ఖడ్గము సహాయంతో మరియు కపటులతో నాలుక సహాయంతో, హద్దులను నెలకొల్పుతూ పోరాడండి. మరియు వారు మీతో భయపడేంత వరకు వారిపై మీరు కఠినంగా వ్యవహరించండి. వారు దేని వైపునైతే ప్రళయదినమున ఆశ్రయం పొందుతారో ఆ నివాసము నరకము. వారు మరలి వెళ్ళేదైన వారి ఆశ్రయం అతి చెడ్డ ఆశ్రయం.
Tahrim 66:10
అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరచే వారి కొరకు అల్లాహ్ ఒక ఉపామానమును తెలియపరుస్తున్నాడు - విశ్వాసపరులతో వారి సంబంధము వారికి ప్రయోజనం కలిగించదు - అల్లాహ్ ప్రవక్తల్లోంచి ఇద్దరు ప్రవక్తలైన నూహ్,లూత్ అలైహిమస్సలాంల ఇద్దరి భార్యల పరిస్థితి ద్వారా. వారిద్దరు పుణ్యాత్ములైన ఇద్దరు దాసుల వివాహ బంధంలో ఉన్నారు. వారిద్దరు తమ భర్తల పట్ల అవినీతి చూపారు ఎలాగంటే వారు అల్లాహ్ మార్గము నుండి నిరోదించి మరియు తమ జాతిలో నుండి అవిశ్వాసపరులకు మద్దతు పలికి. వారు ఈ పుణ్య దాసుల వివాహంలో ఉండటం వారికి ప్రయోజనం కలిగించలేదు. వారిద్దరితో ఇలా పలకబడింది : మీరిద్దరు అవిశ్వాసపరులు,పాపాత్ములందరితో కలిసి నరకములో ప్రవేశించండి.
Tahrim 66:11
మరియు అల్లాహ్ పై ఆయన ప్రవక్తలపై విశ్వాసమును కనబరిచే వారి కొరకు అవిశ్వాసపరులతో వారి సంబంధము వారికి నష్టం కలిగించదని మరియు వారు సత్యంపై స్థిరంగా ఉన్నంత వరకు వారి విషయంలో ప్రభావం చూపదని అల్లాహ్ ఫిర్ఔన్ భార్య ఇలా పలికినప్పటి పరిస్థితి ద్వారా ఒక ఉపమానమును తెలియపరచాడు : ఓ నా ప్రభువా స్వర్గంలో నీ వద్ద నా కొరకు ఒక గృహమును నిర్మించు. మరియు ఫిర్ఔన్ దౌర్జన్యము నుండి,అతని ఆదిపత్యము నుండి మరియు అతని దుష్కర్మల నుండి నన్ను రక్షించు. మరియు అతని మితిమీరటంలో,అతని దుర్మార్గములో అతన్ని అనుసరించటంతో తమపై హింసకు పాల్పడిన జాతి వారి నుండి నన్ను రక్షించు.
Tahrim 66:12
మరియు వ్యభిచారము నుండి తన మర్మావయవమును పరి రక్షించుకున్న ఇమ్రాన్ కుమార్తె అయిన మర్యమ్ స్థితి ద్వారా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలపై విశ్వాసము కనబరిచే వారి కొరకు అల్లాహ్ ఒక ఉపమానమును తెలియపరచాడు. అప్పుడు అల్లాహ్ జిబ్రయీల్ ను అందులో ఊదమని ఆదేశించాడు. అప్పుడు ఆమె అల్లాహ్ సామర్ధ్యముతో తండ్రి లేకుండానే మర్యమ్ కుమారుడగు ఈసా గర్భమును దాల్చింది. మరియు ఆమే అల్లాహ్ ధర్మ శాసనాలను మరియు ఆయన ప్రవక్తలపై అవతరింపబడిన ఆయన గ్రంధములను దృవీకరించింది. మరియు ఆమె అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటిని విడనాడి విధేయత చూపే వారిలోంచి అయిపోయినది.
Mülk 67:1
ఒక్కడైన ఆయన చేతిలో రాజ్యాధికారము కలిగిన అల్లాహ్ మేలు ఎంతో అధికము మరియు ఎక్కువ. మరియు ఆయన ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదినూ అశక్తుడిని చేయదు.
Mülk 67:2
ఆయనే ఓ ప్రజలారా మీలో నుంచి ఆచరణ పరంగా మంచివారో పరీక్షించటం కొరకు మరణమును,జీవనమును సృష్టించాడు. ఆయనే ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన దాసుల్లోంచి పశ్ఛాత్తాపడే వారి పాపములను మన్నించేవాడును.
Mülk 67:3
ఆయనే సప్త ఆకాశములను సృష్టించాడు. ప్రతీ ఆకాశము దాని ముందు ఉన్న దాని పై ఉండి ఒక ఆకాశము ఇంకో ఆకాశమునకు అంటిపెట్టుకుని లేనట్లుగా ఉన్నది. ఓ సందర్శకుడా నీవు అల్లాహ్ సృష్టించిన దానిలో ఎటువంటి హెచ్చు తగ్గులను మరియు అస్తవ్యస్తతను చూడలేవు. కావున నీవు దృష్టిని సారించు ఏమీ నీవు ఏదైన పగులును లేదా బీటలను చూశావా ?! నీవు ఖచ్చితంగా దాన్ని చూడలేవు. నీవు మాత్రం ఒక నిర్మాణాత్మకమైన విస్తృతమైన సృష్టిని చూస్తావు.
Mülk 67:4
ఆ తరువాత నీవు పదే పదే దృష్టిని సారించు నీ చూపులు ఎటువంటి లోపమును గాని అస్తవ్యస్తతను చూడ లేక నిరాశులై నీ వైపునకు మరలుతాయి. మరియు అవి చూడలేక అలసిపోయి ఉంటాయి.
Mülk 67:5
మరియు మేము భూమికి అతి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని ప్రకాశవంతమైన నక్షత్రాలతో అలంకరించాము. మరియు మేము ఆ నక్షత్రాలను అగ్ని జ్వాలలుగా చేశాము. దొంగ చాటుగా వినే షైతానులు వాటి ద్వారా కొట్టబడుతారు. మరియు అవి వారిని దహించి వేస్తాయి. మరియు మేము పరలోకంలో వారి కొరకు భగభగ మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము.
Mülk 67:6
మరియు తమ ప్రభువును తిరస్కరించే వారి కొరకు ప్రళయదినమున మండుతున్న అగ్ని శిక్ష కలదు. వారు దేనివైపునైతే మరలి వెళ్ళుతున్నారో ఆ మరలే స్థానము ఎంతో చెడ్డది.
Mülk 67:7
వారు నరకాగ్నిలో విసిరి వేయబడినప్పుడు వారు తీవ్రమైన భయంకరమైన గర్జనను వింటారు. మరియు అది కుండ ఉడికినట్లు ఉడకబెట్టబడుతుంటుంది.
Mülk 67:8
దాదాపు దాని కొంతభాగము దానిలో ప్రవేశించేవారిపై తీవ్రమైన కోపము వలన ప్రేలిపోయి వేరైపోయినట్లుగా ఉంటుంది. అవిశ్వాసపరులైన దాని వాసుల్లోంచి ఒక సమూహం అందులో విసిరివేయబడినప్పుడు దాని బాధ్యత వహించే దూతలు వారిని గద్దిస్తూ ఇలా ప్రశ్నిస్తారు : ఏమీ అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని భయపెట్టే ఒక ప్రవక్త ఇహలోకంలో మీ వద్దకు రాలేదా ?.
Mülk 67:9
మరియు అవిశ్వాసపరులు ఇలా సమాధానమిస్తారు : ఎందుకు రాలేదు. అల్లాహ్ శిక్ష నుండి మమ్మల్ని భయపెడుతూ ఒక ప్రవక్త మా వద్దకు వచ్చాడు. అప్పుడు మేము అతన్ని తిరస్కరించి అతనితో ఇలా పలికాము : అల్లాహ్ ఎటువంటి దైవ వాణిని అవతరింపజేయలేదు. ఓ ప్రవక్తల్లారా మీరు మాత్రం సత్యము నుండి ఘోర అపమార్గములో ఉన్నారు.
Mülk 67:10
మరియు అవిశ్వాసపరులు ఇలా పలుకుతారు : ఒక వేళ మేము ప్రయోజనం చెందే విధంగా విని ఉంటే లేదా అసత్యము నుండి సత్యమును వేరు చేసే వారి బుద్ది లాగా మేము అర్ధం చేసుకుని ఉంటే మేము నరక వాసులందరితో ఉండేవారము కాదు. అంతే కాదు మేము ప్రవక్తలను విశ్వసించి వారు తీసుకుని వచ్చిన దాన్ని దృవీకరించి ఉండేవారము. మరియు మేము స్వర్గ వాసుల్లోంచి అయి ఉండేవారము.
Mülk 67:11
అప్పుడు వారు స్వయంగా అవిశ్వసించిన దాన్ని,తిరస్కరించిన దాన్ని అంగీకరిస్తారు. అప్పుడు వారు నరకానికి అర్హులవుతారు. కావున నరక వాసుల కొరకు (దైవ కారుణ్యం) దూరమవుగాక.
Mülk 67:12
నిశ్చయంగా ఎవరైతే తమ ఏకాంతములో అల్లాహ్ తో భయపడుతారో వారి కొరకు వారి పాపముల మన్నింపు కలదు. మరియు వారి కొరకు గొప్ప ప్రతిఫలం కలదు. అది స్వర్గము.
Mülk 67:13
ఓ ప్రజలారా మీరు మీ మాటలను గోప్యంగా ఉంచి పలికినా లేదా వాటిని బహిరంగంగా పలికినా అల్లాహ్ వాటి గురించి తెలుసుకుంటాడు. నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయనకు తన దాసుల హృదయముల్లో ఉన్నది బాగా తెలుసు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Mülk 67:14
సృష్టిరాసులన్నింటిని సృష్టించిన వాడికి రహస్యము గురించి మరియు రహస్యము కన్న గోప్యమైన వాటి గురించి తెలియదా ?! మరియు ఆయన తన దాసుల పట్ల సూక్ష్మ గ్రాహి,వారి వ్యవహారముల గురించి బాగా తెలిసినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Mülk 67:15
ఆయనే భూమిని మీ కొరకు దానిపై నివాసముండటానికి సౌలభ్యముగా,మరియు మెత్తగా చేశాడు. కావున మీరు దాని ప్రక్కలలో,దాని మార్గముల్లో నడవండి. మరియు ఆయన అందులో మీ కొరకు సిద్ధం చేసి ఉంచిన ఆయన ఆహారోపాధిలో నుండి తినండి. మరియు లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మీరు మరణాంతరం లేపబడి వెళ్ళటం ఆయన ఒక్కడివైపే.
Mülk 67:16
ఏమీ ఆకాశముల్లో ఉన్న అల్లాహ్ భూమిని ఖారూన్ క్రింది నుండి అది నివాసమునకు సౌలభ్యంగా,యోగ్యంగా ఉన్నతరువాత కూడా చీల్చినట్లు మీ క్రింది నుండి చీల్చుతాడన్న దాని నుండి నిర్భయులైపోయారా ?!. అప్పుడు అది స్థిరంగా ఉన్న తరువాత కూడా మిమ్మల్ని తీసుకుని ప్రకంపిస్తుంది.
Mülk 67:17
లేదా ఆకాశముల్లో ఉన్న అల్లాహ్ లూత్ జాతి వారిపై రాళ్ళను కురిపించినట్లు మీపై ఆకాశము నుండి రాళ్ళను కురిపించడని నిర్భయులైపోయారా ?!. మీరు నా శిక్షను కళ్ళారా చూసినప్పుడు మీకు నా హెచ్చరిక ఎలా ఉందో మీరు తెలుసుకుంటారు. కాని మీరు శిక్షను కళ్ళారా చూసిన తరువాత దాని నుండి ప్రయోజనం చెందలేరు.
Mülk 67:18
నిశ్చయంగా ఈ ముష్రికులందరి కన్న ముందు గతించిన సమాజాల వారు తిరస్కరించారు. వారు తమ అవిశ్వాసంపై,తమ తిరస్కారంపై మొండిగా వ్యవహరించినప్పుడు అల్లాహ్ శిక్ష వారిపై అవతరించింది. అయితే వారిపై నా శిక్ష ఎలా ఉందో ?! నిశ్చయంగా అది తీవ్రమైన శిక్షగా అయినది.
Mülk 67:19
ఏమీ ఈ తిరస్కారులందరు తమపై పక్షులను అవి ఎగిరేటప్పుడు చూడటంలేదా అవి తమ రెక్కలను గాలిలో ఒక సారి చాపితే ఇంకోసారి వాటిని తమ వైపు ముడుచుకుంటున్నాయి. అవి భూమిపై పడిపోకుండా వాటిని అల్లాహ్ మాత్రమే అదిమిపట్టి ఉన్నాడు. నిశ్చయంగా ఆయన ప్రతీది చూస్తున్నాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Mülk 67:20
ఓ అవిశ్వాసపరులారా ఒక వేళ అల్లాహ్ మిమ్మల్ని శిక్షించదలచితే అల్లాహ్ శిక్షను మీ నుండి ఆపే ఏ సైన్యము మీ కొరకు లేదు. అవిశ్వాసపరులు మాత్రం మోసగించబడి ఉన్నారు. వారిని షైతాను మోసం చేశాడు. అతనితో వారు మోసపోయారు.
Mülk 67:21
ఒక వేళ అల్లాహ్ తన ఆహారోపాధిని మీకు చేరటం నుండి ఆపివేస్తే మీకు ఆహారమును ప్రసాదించేవాడు ఎవడూ ఉండడు. కాని జరిగిందేమిటంటే అవిశ్వాసపరులు వ్యతిరేకతలో,అహంకారంలో,సత్యము నుండి ఆగిపోవటంలో కొనసాగిపోయారు.
Mülk 67:22
ఏమీ తన ముఖంపై తల క్రిందలై నడిచేవాడు - అతడు ముష్రికు - ఎక్కువ సన్మార్గంపై ఉన్నాడా లేదా సన్మార్గంపై తిన్నగా నడిచే విశ్వాసపరుడు ఎక్కువ సన్మార్గంపై ఉన్నాడా ?!
Mülk 67:23
ఓ ప్రవక్తా తిరస్కరించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు. మరియు ఆయన మీ కొరకు వినే చెవులను మరియు మీరు చూసే కళ్ళను మరియు మీరు అర్ధం చేసుకునే హృదయములను చేశాడు. ఆయన మీకు అనుగ్రహించిన అనుగ్రహాలపై మీరు చాలా తక్కువ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
Mülk 67:24
ఓ ప్రవక్తా తిరస్కరించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : అల్లాహ్ యే మిమ్మల్ని భూమిలో వ్యాపింపజేశాడు మరియు అందులో విస్తరింపజేశాడు. ఏమీ సృష్టించలేనటువంటి మీ విగ్రహాలు కాదు. ప్రళయదినమున లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మీరు ఆయన ఒక్కడి వైపే సమీకరించబడుతారు. మీ విగ్రహాల వైపు కాదు. కావున మీరు ఆయనతో భయపడండి. మరియు ఆయన ఒక్కడినే ఆరాధించండి.
Mülk 67:25
మరణాంతరం లేపబడటంను దూరంగా భావిస్తూ మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వారు ఇలా పలికేవారు : ఓ ముహమ్మద్ నీవు మరియు నీ సహచరులు మాతో చేసిన ఈ వాగ్దానము ఎప్పుడు పూర్తి కానున్నది ఒక వేళ మీరు అది రాబోతున్నదని మీ వాదనలో మీరు సత్యవంతులే అయితే ?!
Mülk 67:26
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా ప్రళయము యొక్క జ్ఞానము అల్లాహ్ వద్ద ఉన్నది. అది ఎప్పుడు వాటిల్లుతుందో ఆయనకు మాత్రమే తెలుసు. నేను మాత్రం మీకు స్పష్టంగా హెచ్చరించేవాడిని.
Mülk 67:27
ఎప్పుడైతే వారిపై వాగ్దానం వచ్చిపడి వారు శిక్షను తమకు దగ్గరవటమును కళ్లారా చూసినప్పుడు అది ప్రళయదినము అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారి ముఖములు మారిపోతాయి మరియు నల్లగా మారిపోతాయి. మరియు వారితో ఇలా పలకబడును : ఇది అదే దేనినైతే మీరు ఇహలోకంలో కోరేవారో మరియు తొందరపెట్టేవారో.
Mülk 67:28
ఓ ప్రవక్తా ఈ తిరస్కరించే ముష్రికులతో వారిని ఖండిస్తూ ఇలా పలకండి : మీరు నాకు చెప్పండి ఒక వేళ అల్లాహ్ నన్ను మరణింపజేసి, నాతోపాటు ఉన్న విశ్వాసపరులను మరణింపజేస్తే అవిశ్వాసపరులని బాధాకరమైన శిక్ష నుండి ఎవరు రక్షిస్తారు ?!. దాని నుండి వారిని ఎవరూ రక్షించరు.
Mülk 67:29
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో మీరు ఇలా పలకండి : అనంత కరుణామయుడు అయిన ఆయనే మిమ్మల్ని తన ఒక్కడి ఆరాధన వైపు పిలుస్తున్నాడు. మేము ఆయన్ని విశ్వసించాము. మా వ్యవహారాలన్నింటిలో ఆయన ఒక్కడిపైనే మేము నమ్మకమును కలిగి ఉన్నాము. మీరు తొందరలోనే ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎవరు స్పష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్నారో ఎవరు సన్మార్గంపై ఉన్నారో.
Mülk 67:30
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీరు నాకు చెప్పండి ఒక వేళ మీరు త్రాగే నీరు మీరు చేరలేనంత వరకు భూమి లోతులో అయిపోతే మీ వద్దకు ఎక్కువగా ప్రవహించే నీరును ఎవరు తీసుకుని వస్తారు ?! అల్లాహ్ తప్ప ఎవరూ కాదు.
Kalem 68:1
(నూన్) సూరె బఖరా ఆరంభములో వీటి సారుప్యముపై చర్చ జరిగినది. అల్లాహ్ కలముపై ప్రమాణం చేశాడు మరియు ప్రజలు తమ కలములతో వ్రాసే వాటి గురించి ప్రమాణం చేశాడు.
Kalem 68:2
ఓ ప్రవక్త అల్లాహ్ మీకు అనుగ్రహించిన దైవ దౌత్యము వలన మీరు పిచ్చివారు కాదు. అంతే కాదు ముష్రికులు మీపై వేస్తున్న అపనింద అయిన పిచ్చితనముతో మీకు సంబంధము లేదు.
Kalem 68:3
నిశ్చయంగా మీ కొరకు మీరు ప్రజలకు సందేశాలను చేరవేసే విషయంలో అనుభవించిన బాధపై అంతం కాని పుణ్యం కలదు. దాని ద్వారా మీపై ఎవరికీ ఎటువంటి ఉపకారము లేదు.
Kalem 68:4
మరియు నిశ్చయంగా మీరు ఖుర్ఆన్ తీసుకుని వచ్చిన ఉత్తమ గుణాలు కలవారు. కాబట్టి మీరు అందులో ఉన్న నైతికతను పరిపూర్ణ రీతిలో పూర్తి చేసేవారు.
Kalem 68:5
అయితే తొందరలోనే మీరు చూస్తారు మరియు ఈ తిరస్కారులందరు చూస్తారు.
Kalem 68:6
సత్యము తేటతెల్లం అయినప్పుడు మీలో నుండి ఎవరికి పిచ్చి ఉన్నదో స్పష్టమైపోతుంది.
Kalem 68:7
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువుకు తెలుసు ఎవరు ఆయన మార్గము నుండి మరలిపోయారో. దాని వైపునకు సన్మార్గం పొందేవారి గురించి ఆయనకు బాగా తెలుసు. కావున ఎవరు దాని నుండి తప్పిపోయారో ఆయనకు తెలుసు. మరియు మీరు దాని వైపునకు ఎవరిని మార్గదర్శకం చేశారో ఆయనకు తెలుసు.
Kalem 68:8
ఓ ప్రవక్తా మీరు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వారి మాట వినకండి (అనుసరించకండి).
Kalem 68:9
ధర్మ లెక్క విషయంలో ఒక వేళ మీరు వారి పట్ల మెతక వైఖరిని చూపి వారిపై కనికరిస్తే వారు మీ పట్ల మెతక వైఖరిని చూపి మీ పై కనికరిస్తారని ఆశించారు.
Kalem 68:10
మరియు మీరు అసత్యముపై అధికముగా ప్రమాణాలు చేసే,దిగజారిన వాడి మాటలు వినకండి.
Kalem 68:11
ప్రజల వీపు వెనుక వారి గురించి అధికముగా చెడు ప్రస్తావన చేసేవాడి (గీబత్ చేసేవాడు) వారి మధ్య దూరాలు పెంచటానికి వారి మధ్య చాడీలు చెప్పేవాడి మాటను;
Kalem 68:12
మంచిని అధికంగా నిరోధించేవాడి,ప్రజలపై వారి సంపదలలో,వారి మానమర్యాదల విషయంలో,వారి ప్రాణముల విషయంలో మితిమీరిపోయేవాడి,అధికముగా పాపాలు,అవిధేయ కార్యాలు చేసేవాడి;
Kalem 68:13
కఠినుడు,కర్కశుడు,తన జాతివారిలో నిందార్హుడు;
Kalem 68:14
అతడు సంపద,సంతానము కలవాడని అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసము కనబరచటం నుండి అహంకారమును చూపాడు.
Kalem 68:15
మా ఆయతులు అతనిపై చదివి వినిపించబడినప్పుడు వాడు ఇవి వ్రాయబడిన పూర్వికుల కట్టుకథలు అని అన్నాడు.
Kalem 68:16
మేము తొందరలోనే అతని ముక్కుపై ఒక గర్తును పెడతాము అది అతనిలో లోపమును ఏర్పరుస్తుంది మరియు అతనికి అంటిపెట్టుకుని ఉంటుంది.
Kalem 68:17
నిశ్చయంగా మేము ఈ ముష్రికులందరిని ఏ విధంగానైతే మేము తోటవారిని పరీక్షించామో అలా కరువుకాటకాల ద్వారా మరియు ఆకలి ద్వారా పరీక్షించాము. అప్పుడు వారు ప్రొద్దిన వేళ త్వరగా వెళ్ళి వాటి ఫలాలను తప్పకుండా కోస్తామని ప్రమాణం చేశారు చివరికి దాని నుండి ఏ పేదవాడు తినకూడదు అని.
Kalem 68:18
మరియు వారు తమ ప్రమాణంలో ఇన్ షా అల్లాహ్ అన్న తమ ఈ మాటతో మినహాయించలేదు.
Kalem 68:19
అప్పుడు అల్లాహ్ దానిపై అగ్నిని పంపించాడు. అప్పుడు అది దాని యజమానులు నిదురపోతుండగా తినివేసింది. వారు దాని నుండి అగ్నిని తొలగించలేకపోయారు.
Kalem 68:20
అప్పుడు అది కటిక చీకటి రాత్రివలె నల్లగా అయిపోయింది.
Kalem 68:21
తెలతెల్ల వారే వేళ వారు ఒకరినొకరు పిలవసాగారు.
Kalem 68:22
ఇలా పలుకుతూ : ఒకవేళ మీరు దాని ఫలాలను కోసేవారే అయితే పేదవారు రాక ముందే మీరు మీ పంట వద్దకు ఉదయాన్నే బయలుదేరండి.
Kalem 68:23
అప్పుడు వారు తమ చేను వద్దకు తొందర చేస్తూ ఒకరితో ఒకరు నెమ్మది స్వరముతో పలుకుతూ బయలుదేరారు.
Kalem 68:24
వారు ఒకరినొకరు ఇలా పలకసాగారు : ఈ రోజు మీ వద్దకు తోటకాడ ఏ పేదవాడు రాకూడదు.
Kalem 68:25
వారు తమ ఫలముల నుండి వారిని ఆపటంపై దృఢ నిర్ణయం చేసుకుంటూ ఉదయ మొదటి వేళలో బయలు దేరారు.
Kalem 68:26
ఎప్పుడైతే వారు దాన్ని కాలిపోయి ఉండగా చూశారో వారు ఒకరినొకరు మేము దాని దారి తప్పిపోయాము అని అన్నారు.
Kalem 68:27
కాదు కాదు దాని నుండి పేదలను ఆపే మన గట్టి నిర్ణయం వలన మేము దాని ఫలాలను కోయటం నుండి ఆపబడ్డాము.
Kalem 68:28
వారిలో ఉన్నతుడు ఇలా పలికాడు : మీరు పేదవారిని దాని నుండి ఆపటంపై గట్టి నిర్ణయం ఏదైతే చేసుకున్నారో అప్పుడు నేను మిమ్మల్ని మీరు ఎందుకు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడటం లేదు మరియు ఆయన వైపునకు పశ్ఛాత్తాపముతో మరలటం లేదు అని మీతో చెప్పలేదా ?!
Kalem 68:29
వారు ఇలా పలికారు : మా ప్రభువు పరిశుద్ధుడు. మా తోట ఫలముల నుండి పేదవారిని ఆపటం పై మేము గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు మేము మా స్వయంపై దుర్మార్గమునకు పాల్పడ్డాము.
Kalem 68:30
అప్పుడు వారు నిందించుకునే దారిలో తమ మాటల్లో తిరోగమునకు ముందడుగు వేశారు.
Kalem 68:31
వారు అవమానముతో కృంగిపోతూ ఇలా పలికారు : అయ్యో మా నష్టము. నిశ్చయంగా మేము పేదవారిని వారి హక్కు నుండి ఆపి హద్దును అతిక్రమించిన వారిలో అయిపోయాము.
Kalem 68:32
బహుశా మా ప్రభువు తోట కన్న మేలైనది మాకు బదులుగా ప్రసాదిస్తాడు. నిశ్చయంగా మేము అల్లాహ్ ఒక్కడినే కోరుతున్నాము. మేము ఆయన నుండి మన్నింపును ఆశిస్తున్నాము మరియు ఆయనతో మేలును కోరుతున్నాము.
Kalem 68:33
ఆహారోపాధి నుండి దూరం చేసి ఈ శిక్ష లాగే మేము మాపై అవిధేయత చూపే వారిని శిక్షిస్తాము. మరియు పరలోక శిక్ష ఎంతో పెద్దది ఒక వేళ వారు దాని తీవ్రతను,దాని శాశ్వతను తెలుసుకుంటే.
Kalem 68:34
నిశ్చయంగా అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడేవారి కొరకు వారి ప్రభువు వద్ద అనుగ్రహ భరితమైన స్వర్గ వనాలు కలవు. వారు అందులో పరమానందమవుతారు. వారి అనుగ్రహాలు అంతం కావు.
Kalem 68:35
ఏమీ మేము ప్రతిఫల విషయంలో ముస్లిములను అవిశ్వాసపరులుగా చేస్తామా ఏవిధంగానైతే మక్కా వాసుల్లోంచి ముష్రికులు వాదించేవారో అలా ?!
Kalem 68:36
ఓ ముష్రికులారా మీకు ఏమయింది మీరు ఎలా ఈ అన్యాయమైన,వక్రమమైన తీర్పునిస్తున్నారు ?!
Kalem 68:37
లేదా మీ వద్ద ఏదైన పుస్తకం ఉన్నదా అందులో మీరు విధేయుడికి మరియు అవిధేయుడికి మధ్య సమానత ఉన్నట్లు చదువుతున్నారా ?!
Kalem 68:38
నిశ్చయంగా మీ కొరకు ఆ పుస్తకములో మీరు పరలోకములో మీ కొరకు మీరు ఏదైతే ఎంచుకుంటున్నారో అది ఉన్నదా.
Kalem 68:39
లేదా మీ కొరకు మా వద్ద మీరు మీ స్వయం కొరకు ఏవైతే నిర్ణయించుకుంటారో అవి ఉన్నట్లు తాకీదు చేయబడ్డ ప్రమాణాలు ఉన్నాయా?!
Kalem 68:40
ఓ ప్రవక్తా మీరు ఈ మాటను పలికిన వారిని అడగండి వారిలో నుండి ఎవరు దీనికి హామిగా ఉంటాడు ?!
Kalem 68:41
లేదా వారి కొరకు అల్లాహ్ కాకుండా ఎవరైన భాగస్వాములు ఉన్నారా వారు వారిని ప్రతిఫల విషయంలో విశ్వాసపరులతో సమానులుగా చేస్తున్నారా ?! అయితే వారు తమ ఈ భాగస్వాములందరిని తీసుకుని రావాలి ఒక వేళ వారు తాము వాదిస్తున్న విషయమైన వారు ప్రతిఫల విషయంలో విశ్వాసపరులతో సమానులు అన్న దానిలో సత్యవంతులే అయితే.
Kalem 68:42
ప్రళయదినమున భయానక పరిస్థితి బహిర్గతమవుతుంది మరియు మన ప్రభువు తన పిక్కను బహిర్గతం చేస్తాడు. మరియు ప్రజలు సాష్టాంగపడటం వైపు పిలవబడుతారు. అప్పుడు విశ్వాసపరులు సాష్టాంగపడుతారు. మరియు అవిశ్వాసపరులు మరియు కపటులు ఉండిపోతారు. వారు సాష్టాంగం చేయలేకపోతారు.
Kalem 68:43
వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి,వారిపై అవమానము,పరాభవము ఆవరించి ఉంటుంది. వాస్తవానికి ఇహలోకంలో వారితో అల్లాహ్ కు సాష్టాంగపడమని కోరబడేది మరియు వారు ఈ రోజు ఉన్న దాని కంటే ఆరోగ్యంగా ఉండేవారు.
Kalem 68:44
ఓ ప్రవక్తా మీరు నన్ను మరియు మీ పై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ను తిరస్కరించిన వారిని వదలండి. మేము తొందరలోనే వారిని శిక్ష వైపునకు క్రమక్రమంగా తీసుకుని వెళతాము ఎలాగంటే అది వారిపట్ల వ్యూహమని మరియు వారిని నెమ్మదిగా తీసుకెళ్ళబడటం అని వారికి తెలియదు.
Kalem 68:45
మరియు వారు తమ పాపములో పెరిగిపోవటానికి నేను వారికి కొంత కాలం గడువిస్తాను. నిశ్చయంగా నా వ్యూహం అవిశ్వాసపరుల పట్ల మరియు తిరస్కారుల పట్ల దృఢమైనది. వారు నా నుండి తప్పించుకోలేరు. మరియు నా శిక్ష నుండి భద్రంగా ఉండరు.
Kalem 68:46
ఓ ప్రవక్తా వారిని మీరు దేని వైపునైతే పిలుస్తున్నారో దానిపై ఏదైన ప్రతిఫలం వారితో మీరు కోరారా వారు దాని కారణం వలన పెద్ద విషయాన్ని మోస్తున్నారు. కావున అది మీ నుండి విముఖత చూపటానికి కారణమా ?! వాస్తవం మరోలా ఉన్నది. మీరు వారితో ఎటువంటి ప్రతిఫలమును అడగలేదు. అలాగైతే మిమ్మల్ని అనుసరించటం నుండి వారిని ఏది ఆటంకపరుస్తుంది?
Kalem 68:47
లేదా వారి వద్ద అగోచర జ్ఞానం ఉన్నదా కాబట్టి వారు తమకు ఇష్టమైన వాదనలు వేటితోనైతే మీతో వాదిస్తున్నారో వాటిని వ్రాస్తున్నారా ?!.
Kalem 68:48
అయితే ఓ ప్రవక్త మీ ప్రభువు వారికి గడువిచ్చి నెమ్మదిగా తీసుకుని వెళ్లే ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దానిపై సహనం చూపండి. మరియు తన జాతివారితో విసుగు చెందిన చేప వారైన యూనుస్ అలైహిస్సలాం మాదిరిగా మీరు అవకండి. అప్పుడు అతను సముద్రపు చీకటిలో మరియు చేప కడుపు చీకటిలో బాధలో ఉన్న స్థితిలో తన ప్రభువును పిలిచాడు.
Kalem 68:49
ఒక వేళ అతనికి దైవ కారుణ్యమే చేరకుండా ఉంటే చేప అతడిని నిందించబడిన స్థితిలో ఖాళీ నేలలో విసిరివేసేది.
Kalem 68:50
అయితే అతని ప్రభువు అతడిని ఎన్నుకుని అతడిని తన పుణ్య దాసుల్లో చేశాడు.
Kalem 68:51
అల్లాహ్ ను అవిశ్వసించి ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారు దగ్గర దగ్గర మీ వైపు వారి తీవ్ర పదునైన చూపులతో మిమ్మల్ని పడవేసేటట్లున్నారు ఎప్పుడైతే వారు మీపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ను విన్నారో. మరియు వారు తమ మనోవాంఛలను అనుసరిస్తూ మరియు సత్యము నుండి విముఖత చూపుతూ ఇలా పలికేవారు : నిశ్ఛయంగా దీన్ని తీసుకుని వచ్చిన ప్రవక్త పిచ్చివాడు.
Kalem 68:52
మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ మానవులకు,జిన్నులకు ఒక హితోపదేశము మరియు ఒక జ్ఞాపిక మాత్రమే.
Hakka 69:1
అందరిపై వచ్చి తీరేదైన మరణాంతరం లేపబడే ఘడియను అల్లాహ్ ప్రస్తావిస్తున్నాడు.
Hakka 69:2
ఆ పిదప ఈ ప్రశ్న ద్వారా దాని విషయ గొప్పతనం తెలపబడింది : అనివార్యమయ్యే ఈ సంఝటన ఏమిటి ?.
Hakka 69:3
ఈ అనివార్య సంఘటన ఏమిటో మీకు ఏమి తెలుసు ?.
Hakka 69:4
తన భయానక పరిస్థితులతో ప్రజలను తట్టేటటువంటి ప్రళయమును సాలిహ్ జాతి సమూద్ మరియు హూద్ జాతి ఆద్ తిరస్కరించినది.
Hakka 69:5
ఇక సమూద్ జాతి, వారిని అల్లాహ్ అత్యంత తీవ్రమైన,భయంకరమైన గర్జనతో నాశనం చేశాడు.
Hakka 69:6
ఇక ఆద్ జాతి, వారిని అల్లాహ్ అత్యంత క్రూరమైన తీవ్రమైన చలిగాలి ద్వారా నాశనం చేశాడు.
Hakka 69:7
అల్లాహ్ దాన్ని వారిపై ఏడు రాత్రులు,ఎనిమిది దినముల కాలం వరకు పంపించాడు అది వారిని కూకటి వేళ్ళతో సహా నాశనం చేయసాగింది. నీవు జాతి వారిని వారి ఇళ్ళల్లో నాశనమై భూమిపై పడి ఉండగా చూస్తావు. వారి వినాశనం తరువాత వారు నేలపై పడి ఉన్న బోసిపోయిన ఖర్జూరపు బోదెలవలే ఉన్నారు.
Hakka 69:8
అయితే వారికి శిక్ష కలిగిన తరువాత వారిలోని ఏ ప్రాణమును మిగిలి ఉండగా నీవు చూస్తున్నావా ?!
Hakka 69:9
మరియు ఫిర్ఔన్,అతని కన్నా మునుపటి సమాజాల వారు మరియు తలక్రిందులు చేయబడి శిక్షింపబడిన బస్తీల వారైన లూత్ జాతి వారు షిర్కు మరియు అవిధేయ కార్యాల్లాంటి పాప కార్యములకు పాల్పడ్డారు.
Hakka 69:10
వారిలో నుండి ప్రతి ఒక్కరు తమ వద్దకు పంపించబడ్డ తమ ప్రవక్తకు అవిధేయత చూపి అతన్ని తిరస్కరించారు. అప్పుడు అల్లాహ్ వారి వినాశనం పరిపూర్ణమయ్యే కఠినమైన పట్టుతో పట్టుకున్నాడు.
Hakka 69:11
ఎప్పుడైతే నీరు ఎత్తులో తన పరిమితికి మించి దాటిపోయినదో నిశ్చయంగా మేము మీరు ఎవరి వెన్నులలో ఉన్నారో వారిని మా ఆదేశముతో నూహ్ అలైహిస్సలాం తయారు చేసిన నడిచే ఓడలో ఎక్కించాము. అప్పుడు మిమ్మల్ని ఎక్కించటం అయినది.
Hakka 69:12
మేము ఓడను మరియు దాని గాధను ఒక హితబోధనగా చేయటానికి దాని ద్వారా అవిశ్వాసపరుల వినాశనముపై మరియు విశ్వాసపరుల ముక్తిపై ఆధారమివ్వటానికి. మరియు గుర్తుంచుకునే చెవులు దేన్నైతే విన్నాయో దాన్ని గుర్తుంచుకుంటాయి.
Hakka 69:13
బాకా ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత బాకాలో (కొమ్ములో) ఒకే ఒక ఊదటం ఊదినప్పుడు. అది రెండవ బాకా.
Hakka 69:14
మరియు భూమి,పర్వతాలు ఎత్తబడుతాయి ఆ తరువాత అవి రెండు ఒకే సారి తీవ్రంగా దంచబడుతాయి. అప్పుడు భూమి భాగాలు మరియు దాని పర్వత భాగాలు విడిపోతాయి.
Hakka 69:15
అదంతా జరిగే రోజు ప్రళయం వాటిల్లుతుంది.
Hakka 69:16
ఆ రోజు ఆకాశం దాని నుండి దైవ దూతలు దిగటం కొరకు బ్రద్దలైపోతుంది. అది ఆ రోజు ఆకాశము దృఢంగా పట్టు కలిగి ఉండి కూడా బలహీనంగా ఉంటుంది.
Hakka 69:17
మరియు దైవ దూతలు దాని అంచులపై ఉంటారు. మరియు ఆ రోజు నీ ప్రభువు యొక్క సింహాసనమును ఎనిమిది సన్నిహిత దూతలు మోస్తుంటారు.
Hakka 69:18
ఆ రోజున ఓ ప్రజలారా మీరు అల్లాహ్ ముందు హాజరు చేయబడుతారు. అల్లాహ్ పై మీ నుండి ఏ గోప్య విషయం గోప్యంగా ఉండదు అది ఏదైనా కూడా. అంతేకాదు అల్లాహ్ వాటి గురించి తెలుసుకునేవాడును,వాటిని ఎరుగువాడును.
Hakka 69:19
ఇక ఎవరికైతే అతని కర్మల పుస్తకము అతని కుడి చేతిలో ఇవ్వబడుతుందో అతను అప్పుడు సంతోషముతో,ఆనందముతో ఇలా పలుకుతాడు : నా కర్మల పుస్తకమును మీరు పుచ్చుకుని చదవండి.
Hakka 69:20
నేను మరల లేపబడుతానని మరియు నా ప్రతిఫలమును నేను పొందుతానని నిశ్ఛయంగా నాకు ఇహలోకంలోనే తెలుసు మరియు నేను నమ్మేవాడిని.
Hakka 69:21
అతడు శాశ్వతమైన అనుగ్రహాలను చూడటం వలన అతడు సంతృప్తికరమైన జీవితంలో ఉంటాడు.
Hakka 69:22
ఉన్నతమైన స్థానము కల స్వర్గములో.
Hakka 69:23
దాని ఫలాలు వాటిని తినేవారికి దగ్గరగా ఉంటాయి.
Hakka 69:24
వారితో మర్యాదపురంగా ఇలా పలకబడును : మీరు తినండి మరియు త్రాగండి మీరు ఇహలోకంలో గడిచిన దినములలో చేసుకున్న సత్కర్మల వలన అందులో ఎటువంటి బాధ ఉండదు.
Hakka 69:25
మరియు ఇక ఎవరి కర్మల పత్రం అతని ఎడమ చేతిలో ఇవ్వబడుతుందో అతడు తీవ్రమైన అవమానముతో ఇలా పలుకుతాడు : అయ్యో నా పాడుగాను నాకు శిక్షను అనివార్యం చేసే దుష్కర్మలు ఉన్న నా కర్మల పత్రం నాకు ఇవ్వకపోతే ఎంత బాగుండేది.
Hakka 69:26
అయ్యో నా పాడుగాను నా లెక్క ఏమౌతుందో నాకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది.
Hakka 69:27
బహుశా నేను మరణించిన మరణం దాని తరువాత ఎన్నటికి నేను మరల లేపబడకుండా ఉండే మరణం అయి ఉంటే ఎంత బాగుండేది.
Hakka 69:28
నా సంపద అల్లాహ్ యొక్క శిక్షను నా నుండి ఏమాత్రం తొలగించలేకపోయింది.
Hakka 69:29
నా వాదన మరియు నేను నమ్మకం ఉంచుకున్న బలము మరియు శక్తి నా నుండి అదృశ్యమైపోయాయి.
Hakka 69:30
మరియు ఇలా పలకబడుతుంది : ఓ దైవదూతలారా అతన్ని పట్టుకోండి మరియు అతని చేతులను అతని మెడకేసి కట్టిపడేయండి.
Hakka 69:31
ఆ తరువాత అతడిని నరకములో దాని వేడిని అనుభవించటానికి ప్రవేశింపజేయండి.
Hakka 69:32
ఆ తరువాత అతడిని డబ్బై మూరల పొడవైన గొలుసులో ప్రవేశింపజేయండి.
Hakka 69:33
నిశ్ఛయంగా అతడు మహోన్నతుడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు.
Hakka 69:34
మరియు పేదవారిని అన్నం తినిపించటంపై ఇతరులను ప్రోత్సహించేవాడు కాదు.
Hakka 69:35
ప్రళయ దినమున అతని నుండి శిక్షను తొలగించే దగ్గర బంధువు ఎవడూ అతని కొరకు ఉండరు.
Hakka 69:36
నరక వాసుల శరీరాల నుండి కారే (చీము) రసం తప్ప అతను తినటానికి ఆహారముగా ఏమీ ఉండదు.
Hakka 69:37
ఆ ఆహారమును పాపాత్ములు మరియు అవిధేయులు మాత్రమే తింటారు.
Hakka 69:38
అల్లాహ్ మీరు చూసే వాటి గురించి ప్రమాణం చేశాడు.
Hakka 69:39
మరియు ఆయన మీరు చూడని వాటి గురించి ప్రమాణం చేశాడు.
Hakka 69:40
నిశ్ఛయంగా ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు దాన్ని గౌరవనీయుడైన ఆయన ప్రవక్త ప్రజలకు చదివి వినిపిస్తాడు.
Hakka 69:41
మరియు అది ఏ కవి యొక్క వాక్కు కాదు ఎందుకంటే అది కవిత్వ పద్ధతిలో లేదు. మీరు చాలా తక్కువ విశ్వసిస్తున్నారు.
Hakka 69:42
మరియు అది ఏ జ్యోతిష్యుని వాక్కు కాదు. జ్యోతిష్యుల వాక్కు ఈ ఖుర్ఆన్ కు భిన్నంగా ఉండే విషయము. మీరు చాలా తక్కువ హితోపదేశం గ్రహిస్తున్నారు.
Hakka 69:43
మరియు కాని అది సృష్టిరాసులందరి ప్రభువు వద్ద నుండి అవతరించబడినది.
Hakka 69:44
మరియు ఒక వేళ ముహమ్మద్ మేము పలకని ఏవైన అబద్దపు మాటలను మాపై కల్పించుకుని ఉంటే.
Hakka 69:45
మేము అతనిపై ప్రతీకారం తీర్చుకుంటాము. మరియు మేము అతడిని మా బలముతో మరియు సామర్ధ్యముతో పట్టుకుంటాము.
Hakka 69:46
ఆ పిదప మేము హృదయముతో కలిసి ఉన్న అతని నరమును కోసివేస్తాము.
Hakka 69:47
అయితే మీలో నుండి ఎవరు దాని నుండి మమ్మల్ని ఆపేవాడు ఉండడు. అతడు మాపై కల్పించుకోవటం మీ వలన చాలా దూర విషయం.
Hakka 69:48
మరియు నిశ్చయంగా ఖుర్ఆన్ తమ ప్రభువు ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి తమ ప్రభువు భీతి కలిగిన వారి కొరకు ఒక హితోపదేశము.
Hakka 69:49
మరియు నిశ్చయంగా మీలో నుండి ఈ ఖుర్ఆన్ ను తిరస్కరించేవాడు ఎవడో మాకు తెలుసు.
Hakka 69:50
మరియు నిశ్చయంగా ఖుర్ఆన్ పట్ల తిరస్కారము ప్రళయదినమున పెద్ద అవమానమునకు కారణమగును.
Hakka 69:51
మరియు నిశ్ఛయంగా ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి అవటంలో ఎటువంటి సందేహము గాని ఎటువంటి సంశయం గాని లేని నమ్మదగిన సత్యము.
Hakka 69:52
ఓ ప్రవక్తా మీరు మీ ప్రభువుకు తగని వాటి నుండి ఆయన పరిశుద్ధతను కొనియాడండి మరియు మహోన్నతుడైన నీ ప్రభువు నామము యొక్క స్మరణను చేయండి.
Meâric 70:1
ముష్రికుల్లోంచి ఒక వేడుకునే వాడు తనపై మరియు తన జాతి వారిపై శిక్షను గురించి ఒక వేళ ఈ శిక్ష వచ్చేదే అయితే రావాలని వేడుకున్నాడు. మరియు అది అతని తరపు నుండి హేళణగా. మరియు అది ప్రళయదినమున వాటిల్లుతుంది.
Meâric 70:2
అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి కొరకు ఈ శిక్షను తొలగించేవాడు ఎవడూ ఉండడు.
Meâric 70:3
ఔన్నత్యమును,స్థానములను,శుభాలను,అనుగ్రహాలను కల అల్లాహ్ వద్ద నుండి.
Meâric 70:4
ఆయన వైపునకు దైవదూతలు మరియు జిబ్రయీలు ఆ స్ధానముల్లో ప్రళయదినము నాడు ఎక్కుతారు. ఆ రోజు ఎంత పెద్దదిగా ఉంటుందంటే దాని పరిమాణము యాభైవేల సంవత్సరములు ఉంటుంది.
Meâric 70:5
ఓ ప్రవక్త మీరు ఎటువంటి ఆందోళన మరియు ఫిర్యాదు లేని సహనమును చూపండి.
Meâric 70:6
నిశ్ఛయంగా వారు ఈ శిక్షను దూరంగా, వాటిల్లటం అసంభవంగా భావిస్తున్నారు.
Meâric 70:7
మరియు మేము దాన్ని దగ్గరగా ,ఖచ్చితంగా వాటిల్లుతుందని భావిస్తున్నాము.
Meâric 70:8
ఆ రోజు ఆకాశము కరిగించబడిన ఇత్తడి మరియు బంగారము, ఇతర వాటిలాగా అయిపోతుంది.
Meâric 70:9
మరియు పర్వతాలు తేలికతనంలో ఉన్ని వలె అయిపోతాయి.
Meâric 70:10
మరియు ఏ దగ్గరి బందువు ఏ దగ్గరి బందువుని అతని పరిస్థితిని గురించి అడగడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు తన గురించి తీరిక లేకుండా ఉంటాడు.
Meâric 70:11
ప్రతీ మనిషి తన దగ్గరి బందువును చూస్తాడు అతడిపై అతను గోప్యంగా ఉండడు. మరియు దానితో పాటు పరిస్థితి భయానకంగా ఉండటం వలన ఒకరినొకరు అడగరు. నరకాగ్నికి హక్కుదారైన వాడు శిక్ష కొరకు తనకు బదులుగా తమ సంతానమును ఇవ్వాలనుకుంటాడు.
Meâric 70:12
మరియు తన భార్యను,తన సోదరుడిని పరిహారంగా ఇవ్వాలనుకుంటాడు.
Meâric 70:13
మరియు తన దగ్గరి బందువులైన తన వంశము వారిని ఎవరైతే కష్టాల్లో తనకు తోడుగా నిలబడుతారో వారిని పరిహారంగా ఇవ్వాలనుకుంటాడు.
Meâric 70:14
మరియు భూమిలో ఉన్న మానవులను,జిన్నులను,ఇతరులందరిని పరిహారంగా ఇవ్వాలనుకుంటాడు. ఆ పిదప ఆ పరిహారము అతనిని నరకాగ్ని శిక్ష నుండి రక్షిస్తుందనుకుంటాడు.
Meâric 70:15
ఈ అపరాధి ఆశించినట్లు విషయం కాదు. నిశ్ఛయంగా అది పరలోక అగ్ని భగభగమండుతుంది మరియు ప్రజ్వలిస్తుంది.
Meâric 70:16
దాని వేడి తీవ్రత వలన మరియు దాని మండటం వలన తల చర్మం తీవ్రంగా వలచి విడిపోతుంది.
Meâric 70:17
అది సత్యము నుండి విముఖత చూపి దాని నుండి దూరమై,దానిపై విశ్వాసమును కనబరచకుండా ఆచరించని వాడిని పిలుస్తుంది
Meâric 70:18
మరియు అతడు సంపదను కూడబెట్టాడు. దాని నుండి అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటం నుండి పిసినారితనమున చూపాడు.
Meâric 70:19
నిశ్ఛయంగా మానవుడు తీవ్ర పిసినారిగా పుట్టించబడ్డాడు.
Meâric 70:20
అతనికి రోగము లేదా పేదరికం నుండి కీడు సంభవించినప్పుడు అతడు తక్కువ సహనం చూపేవాడై ఉంటాడు.
Meâric 70:21
మరియు అతనికి సంతోషమును కలిగించే కలిమి మరియు ఐశ్వర్యము కలిగినప్పుడు అతడు దాన్ని అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం నుండి ఎక్కువగా నిరోధించుకుంటాడు.
Meâric 70:22
కాని నమాజులను పాటించేవారు. వారు ఈ దుర లక్షణాల నుండి భద్రంగా ఉంటారు.
Meâric 70:23
వారే తమ నమాజులలో నిబద్ధులై ఉంటారు. వాటి నుండి నిర్లక్ష్యం చూపరు. వాటిని వారు వాటి నిర్ణీత సమయముల్లో పాటిస్తారు.
Meâric 70:24
మరియు వారు తమ సంపదలో విధించబడిన నిర్దిష్టమైన భాగమును (వాటాను) ఉంచుతారు.
Meâric 70:25
వారు దాన్ని తమను యాచించిన వారికి ఇస్తారు మరియు ఏదైన కారణం చేత ఆహారోపాధి ఆగిపోయి యాచించని వారికి ఇస్తారు.
Meâric 70:26
మరియు వారు ప్రళయదినమును విశ్వసిస్తారు. ఆ దినము అల్లాహ్ హక్కుదారుడైన ప్రతీ వ్యక్తికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Meâric 70:27
మరియు వారే తమ సత్కర్మలను ముందు పంపించుకున్నా కూడా తమ ప్రభువు యొక్క శిక్ష నుండి భయపడేవారు.
Meâric 70:28
నిశ్ఛయంగా వారి ప్రభువు యొక్క శిక్ష భయంకరమైనది దాని నుండి ఏ బుద్ధిమంతుడు సురక్షితంగా ఉండడు.
Meâric 70:29
మరియు తమ మర్మాంగాలను వాటిని కప్పి ఉంచి మరియు వాటిని అశ్లీల కార్యాల నుండి దూరంగా ఉంచి పరిరక్షిస్తారు.
Meâric 70:30
కాని తమ భార్యలతో లేదా తమ ఆదీనంలో ఉన్న బానిసలతో. ఎందుకంటే వారితో సంభోగము,మొదలగు వాటి ద్వారా ప్రయోజనం చెందటంలో వారు దూషించబడరు.
Meâric 70:31
ఎవరైతే ప్రస్తావించబడిన భార్యలను,దాసినీలను వదిలి ఇతర వాటి ద్వారా ప్రయోజనం చెందాలని కోరుకుంటే వారందరు అల్లాహ్ హద్దులను అతిక్రమించినవారు.
Meâric 70:32
మరియు వారే తమ వద్ద అమానతుగా పెట్టబడిన సంపదలను మరియు రహస్యాలను,ఇతరవాటిని మరియు ప్రజలతో తాము చేసిన ప్రమాణాలను పరిరక్షిస్తారు. వారి అమానతులలో అవినీతికి పాల్పడరు మరియు వారి ప్రమాణాలను భంగపరచరు.
Meâric 70:33
మరియు వారే కోరిన విధంగా తమ సాక్ష్యములపై స్థిరంగా ఉంటారు. అందులో ఏ బంధుత్వము మరియు శతృత్వము ప్రభావం చూపదు.
Meâric 70:34
మరియు వారే తమ నమాజులను వాటిని వాటి సమయముల్లో ,పరిశుద్దతతో మరియు మనశ్శాంతితో పాటించి పరిరక్షిస్తారు. వారిని ఏ పరధ్యానం వాటి నుండి నిర్లక్ష్యంలో పడవేయదు.
Meâric 70:35
ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరు తాము పొందే శాశ్వత అనుగ్రహాలతో మరియు గౌరవోన్నతుడైన అల్లాహ్ ముఖ దర్శనంతో స్వర్గవనాల్లో సగౌరవంగా ఉంటారు.
Meâric 70:36
ఓ ప్రవక్తా మీ జాతి వారిలో నుంచి ఈ ముష్రికులందరికి మీ చుట్టూ మిమ్మల్ని తిరస్కరించటానికి త్వరపడేటట్లు ఏది లాగుతుంది ?.
Meâric 70:37
మీ కుడి వైపు నుండి మీఎడమవైపు నుండి గుంపులు గుంపులుగా మిమ్మల్ని చుట్టు ముడుతున్నారు.
Meâric 70:38
ఏమీ వారిలో నుండి ప్రతి ఒక్కడు అల్లాహ్ అతడిని అనుగ్రహములు కల స్వర్గములో ప్రవేశింపజేస్తాడని మరియు అతడు అందులో ఉన్న శాశ్వత అనుగ్రహాలను తాను తన అవిశ్వాసం పై ఉండి అనుభవిస్తాడని ఆశిస్తున్నాడా ?.
Meâric 70:39
వారు అనుకున్నట్లు విషయం కాదు. నిశ్చయంగా మేము వారిని వారికి తెలిసిన వాటి నుండి సృష్టించాము. వాస్తవానికి మేము వారిని నీచమైన నీటితో సృష్టించాము. కావున వారు బలహీనులు. తమ స్వయం కొరకు ఎటువంటి లాభం గాని నష్టం గాని చేసుకునే అధికారం వారికి లేదు. అటువంటప్పుడు వారు ఎలా అహంకారము చూపుతారు ?.
Meâric 70:40
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆయన తూర్పు పడమరలకు మరియు సూర్యుడు,చంద్రుడు మరియు అన్నిరకాల నక్షత్రాలకు ప్రభువు నిశ్ఛయంగా మేము సామర్ధ్యం కలవారమని ప్రమాణం చేస్తున్నాడు.
Meâric 70:41
వారి స్థానంలో అల్లాహ్ పై విధేయత చూపే వారిని తీసుకుని రావటంపై. మరియు మేము వారిని నాశనం చేస్తాము. మేము దాని నుండి అశక్తులము కాము. వారిని నాశనం చేసి వారి స్థానంలో వేరే వారిని తీసుకుని రావాలని మేము కోరుకున్నప్పుడు మేము ఓడిపోము.
Meâric 70:42
ఓ ప్రవక్తా మీరు వారిని వారు ఉన్న అసత్యములో,అపమార్గములో మునిగి ఉండగా మరియు ఖుర్ఆన్ లో వారికి వాగ్దానం చేయబడిన ప్రళయ దినమును వారు పొందే వరకు తమ ఇహలోక జీవితంలో ఆటల్లో మునిగి ఉండగా వదిలివేయండి.
Meâric 70:43
ఆ రోజు వారు సమాదుల నుండి వేగముగా వెలికి వస్తారు. వారు ఒక జెండా వైపునకు ఉరకలు వేస్తూ పరుగెత్తుతున్నట్లు.
Meâric 70:44
వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి. వారిపై అవమానము క్రమ్ముకుని ఉంటుంది. ఇదే ఆ దినము దేని గురించైతే వారికి ఇహలోకంలో వాగ్దానం చేయబడినది. వారు దాని గురించి పట్టించుకునేవారు కాదు.
Nuh 71:1
నిశ్ఛయంగా మేము నూహ్ అలైహిస్సలాంను తన జాతి వారి వద్దకు పంపించాము. వారు అల్లాహ్ కు సాటి కల్పించటం వలన వారిపై వచ్చే బాధాకరమైన శిక్షకు ముందు ఆయన తన జాతి వారిని భయపెట్టానికి వారిని ఆహ్వానించమని.
Nuh 71:2
నూహ్ అలైహిస్సలాం తన జాతి వారితో ఇలా పలికారు : ఓ నా జాతి వారా నిశ్చయంగా నేను ఒక వేళ మీరు అల్లాహ్ యందు పశ్చాత్తాప్పడకపోతే మీ కోసం నిరీక్షిస్తున్న ఒక శిక్ష నుండి మీ కొరకు స్పష్టంగా హెచ్చరించేవాడిని.
Nuh 71:3
మీకు నా హెచ్చరిక యొక్క ఆవశ్యకత ఏమిటంటే, నేను మీకు చెప్తున్నాను: అల్లాహ్ ఒక్కడిని మాత్రమే మీరు ఆరాధించండి మరియు ఆయనతో దేనినీ సాటి కల్పించకండి. మరియు ఆయన ఆదేశించిన వాటిని పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనతో భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో మీరు నన్ను అనుసరించండి.
Nuh 71:4
నిశ్చయంగా మీరు ఒక వేళ అలా చేస్తే అల్లాహ్ మీ కొరకు మీ పాపములను ఏవైతే దాసుల హక్కులతో సంబంధము లేదో వాటిని మన్నించివేస్తాడు. మరియు ఇహలోకంలో మీ సమాజ కాలమును అల్లాహ్ జ్ఞానములో నిర్ణయించబడిన సమయం వరకు పొడిగిస్తాడు. మీరు భూమిని దానిపై మీరు ఉన్నంతకాలం ఏలుతారు. నిశ్చయంగా మరణం వచ్చినప్పుడు గడువు ఇవ్వబడదు. ఒక వేళ మీకు తెలిస్తే మీరు అల్లాహ్ పై విశ్వాసము వైపునకు మరియు మీరు ఉన్న షిర్కు,మార్గభ్రష్టత నుండి పశ్చాత్తాప్పడటం వైపునకు త్వరపడుతారు.
Nuh 71:5
నూహ్ అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభూ నిశ్చయంగా నేను నీ దాసులను నీ తౌహీద్ వైపునకు రాత్రింబవళ్ళు క్రమం తప్పకుండా పిలిచాను.
Nuh 71:6
వారిని నా పిలవటం నేను దేని వైపునైతే వారిని పిలిచానో దాని నుండి బెదిరి పారిపోవటమును మరియు దూరమును మాత్రమే అధికం చేసింది.
Nuh 71:7
మరియు నేను ఎప్పుడెప్పుడైతే వారిని వారి పాపములకు మన్నింపు గలవైన నీ ఒక్కడి ఆరాధన మరియు నీపై,నీ ప్రవక్తపై విధేయత చూపటం వైపునకు పిలిచానో వారు తమ చెవులను తమ వేళ్ళతో నా పిలుపును వినటం నుండి వాటిని ఆపటానికి అడ్డుపెట్టుకునేవారు. మరియు నన్ను చూడకుండా ఉండటానికి తమ ముఖములను తమ వస్త్రములతో కప్పుకునేవారు. మరియు వారు తాము ఉన్న షిర్కుపైనే కొనసాగిపోయేవారు. మరియు దేని వైపునైతే నేను వారిని పిలిచానో దాన్ని స్వీకరించటం నుండి మరియు దానికి కట్టుబడి ఉండటం నుండి అహంకారమును చూపేవారు.
Nuh 71:8
ఆ పిదప ఓ నా ప్రభువా నేను వారిని బహిరంగంగా పిలిచాను.
Nuh 71:9
ఆ పిదప నిశ్చయంగా నేను పిలవటంలో వారి కొరకు నా స్వరమును బిగ్గరగా చేశాను మరియు నేను రహస్యంగా గోప్యంగా చెప్పాను. మరియు నేను వారిని నెమ్మదైన స్వరముతో పిలిచాను. వారికి నా పిలుపు యొక్క రకరకాల పద్దతులతో పిలిచాను.
Nuh 71:10
అప్పుడు నేను వారితో ఇలా పలికాను : ఓ నా జాతి వారా మీరు మీ ప్రభువుతో ఆయన వైపునకు పశ్ఛాత్తాప్పడుతూ పాపముల మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన తన దాసుల్లోంచి తన వైపునకు పశ్ఛాత్తాపముతో మరలే వారి పాపములను మన్నించేవాడు.
Nuh 71:11
నిశ్ఛయంగా మీరు ఇలా చేస్తే అల్లాహ్ మీపై వర్షమును మీకు దాని అవసరం ఉన్నప్పుడల్లా క్రమం తప్పకుండా కురిపిస్తాడు. మీకు కరువు అన్నది సంభవించదు.
Nuh 71:12
మరియు ఆయన మీకు సంపదలను మరియు సంతానమును అధికంగా ప్రసాదిస్తాడు. మరియు ఆయన మీ కొరకు తోటలను చేస్తాడు మీరు వాటి ఫలముల నుండి తింటారు. మరియు ఆయన మీ కొరకు సెలయేరులను చేస్తాడు మీరు వాటి నుండి త్రాగుతారు మరియు మీ పంటలకు,మీ పశువులకు నీటిని పట్టిస్తారు.
Nuh 71:13
ఓ నా జాతి ప్రజలారా మీ విషయమేమిటి మీరు అల్లాహ్ గొప్పతనానికి భయపడటం లేదు ?. అందుకనే మీరు పట్టించుకోకుండా ఆయనపై అవిధేయత చూపుతున్నారు.
Nuh 71:14
వాస్తవానికి ఆయన మిమ్మల్ని ఒక దశ తరువాత ఇంకో దశగా సృష్టించాడు. వీర్యపు బిందువు నుండి రక్తపు ముద్దగా,ఆ తరువాత మాంసపు ముద్దగా.
Nuh 71:15
ఏమీ ఒక ఆకాశముపై ఇంకో ఆకాశముగా ఏడు ఆకాశములను అల్లాహ్ ఎలా సృష్టించాడో మీరు చూడటంలేదా ?!
Nuh 71:16
మరియు ఆయన వాటిలో నుండి భూమికి దగ్గరలో ఉన్న ఆకాశములో చంద్రుడిని భూ వాసులకు వెలుగుగా చేశాడు. మరియు ఆయన సూర్యుడిని కాంతివంతముగా చేశాడు.
Nuh 71:17
మరియు అల్లాహ్ మీ తండ్రి అయిన ఆదంను మట్టితో సృష్టించటంతో మిమ్మల్ని భూమి నుండి సృష్టించాడు. ఆ పిదప మీరు అది మీ కొరకు ఉత్పత్తి చేసే వాటిని ఆహారంగా తీసుకొంటున్నారు.
Nuh 71:18
ఆ పిదప ఆయన మిమ్మల్ని మీ మరణం తరువాత అందులో మరలింపజేస్తాడు. ఆ తరువాత మరణాంతరం లేపటం కొరకు ఆయన మిమ్మల్ని దాని నుండి వెలికి తీస్తాడు.
Nuh 71:19
మరియు అల్లాహ్ మీ కొరకు భూమిని నివాసం కొరకు విస్తరింపజేసి సిద్ధం చేశాడు.
Nuh 71:20
మీరు దాని విశాలమైన మార్గముల్లో ధర్మ సమ్మతమైన సంపాదన కొరకు శ్రమిస్తూ నడుస్తారని ఆశిస్తూ.
Nuh 71:21
నూహ్ అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభువా నిశ్ఛయంగా నా జాతి వారు నేను వారికి నీ తౌహీదు గురించి మరియు నీ ఒక్కడి ఆరాధన గురించి ఇచ్చిన ఆదేశం విషయంలో నా పై అవిధేయత చూపారు. మరియు వారిలో నుండి తక్కువ స్థానం కలవారు నీవు ధనాన్ని,సంతానమును అనుగ్రహించిన తమ నాయకులను అనుసరించారు. వారికి నీవు అనుగ్రహించినది వారిని అపమార్గములో మాత్రం అధికం చేసింది.
Nuh 71:22
వారిలోని పెద్దవారు తమ క్రిందటి స్థానం కలవారిని నూహ్ కి వ్యతిరేకంగా రెచ్చగొట్టటంతో పెద్ద కుట్రనే పన్నారు.
Nuh 71:23
మరియు వారు తమను అనుసరించే వారితో ఇలా పలికారు : మీరు మీ దేవతలను ఆరాధించటమును వదలకండి. మరియు మీరు మీ విగ్రహములైన వద్ద్ ని గాని సువాను గాని యగూస్ ని గాని యఊఖ్ ని గాని మరియు నస్ర్ ని గాని ఆరాధించటమును వదలకండి.
Nuh 71:24
వాస్తవానికి వారు తమ ఈ విగ్రహాల ద్వారా చాలా మంది ప్రజలను అపమార్గమునకు లోను చేశారు. ఓ నా ప్రభువా నీవు అవిశ్వాసంపై,పాప కార్యములపై మొండితనముతో తమ స్వయమునకు హింసించుకున్న వారిని నీవు సత్యం నుండి తప్పిపోవటంలో మాత్రం అధికం చేయి.
Nuh 71:25
వారు పాల్పడిన తమ పాపముల వలన ఇహలోకంలో తుఫాను ద్వారా ముంచబడ్డారు. తమ మరణం తరువాత వెంటనే నరకాగ్నిలో ప్రవేశించబడ్డారు. వారు తమను మనుగటం నుండి.నరకాగ్ని నుండి రక్షించే ఏ సహాయకుడిని అల్లహ్ ను విడిచి ఎవరినీ తమ కొరకు పొందలేదు.
Nuh 71:26
మరియు నూహ్ అలైహిస్సలాం ఆయన జాతి వారిలో నుండి విశ్వసించిన వారు తప్ప ఇంకా ఎవరు విశ్వసించరని అల్లాహ్ ఆయనకు తెలియపరచినప్పుడు ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు అవిశ్వాసపరుల్లోంచి ఎవరినీ భూమిపై తిరుగుతుండగా లేదా సంచరిస్తుండగా వదలకు.
Nuh 71:27
నిశ్ఛయంగా ఓ మా ప్రభువా ఒక వేళ నీవు వారిని వదిలి,వారికి గడువిస్తే వారు విశ్వాసపరులైన నీ దాసులను అపమార్గమునకు గురి చేస్తారు. మరియు నీపై విధేయత చూపని పాపాత్ముడిని,నీ అనుగ్రహములపై నీకు కృతజ్ఞత తెలపని కఠిన కృతఘుృడిని మాత్రమే వారు జన్మనిస్తారు.
Nuh 71:28
ఓ నా ప్రభువా నీవు నా పాపములను మన్నించు మరియు నా తల్లిదండ్రులను మన్నించు మరియు విశ్వాసిగా నా ఇంటిలోనికి ప్రవేశించిన వారిని మన్నించు. మరియు విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను మన్నించు. మరియు అవిశ్వాసము,పాప కార్యముల ద్వారా తమ స్వయముపై దుర్మార్గమునకు పాల్పడిన వారిని వినాశనంలో మరియు నష్టంలో అధికం చేయి.
Cinn 72:1
ఓ ప్రవక్తా మీరు మీ జాతి వారితో ఇలా పలకండి : నఖ్లా ప్రాంతంలో జిన్నుల్లోంచి ఒక వర్గము నేను ఖుర్ఆన్ ను పటిస్తుండగా విన్నదని అల్లాహ్ నాకు దైవ వాణి ద్వారా తెలియపరచాడు. వారు తమ జాతి వారి వైపునకు మరలి వెళ్ళినప్పుడు వారితో ఇలా పలికారు : నిశ్చయంగా మేము తన స్పష్టపరచటంలో మరియు తన వాక్చాతుర్యంలో విచిత్రమైన చదవబడిన ఒక వాక్కును విన్నాము.
Cinn 72:2
మేము విన్న ఈ వాక్కు విశ్వాసం విషయంలో మరియు మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో సరైన దానిపై సూచిస్తుంది. కాబట్టి మేము దాన్ని విశ్వసించాము. మరియు మేము దాన్ని అవతరించిన మా ప్రభువుతో పాటు ఎవరిని సాటి కల్పించము.
Cinn 72:3
మరియు మేము విశ్వసించాము ఎందుకంటే - మా ప్రభువు ఔన్నత్యము మరియు ఆయన వైభవము అత్యున్నతమైనది - ఆయన ముష్రికులు అంటున్నట్లుగా భార్యను గాని సంతానమును గాని చేసుకోలేదు.
Cinn 72:4
మరియు ఇబ్లీసు అల్లాహ్ పై పరిశుద్ధుడైన ఆయనకు భార్యను మరియు సంతానమును అంటగట్టి వికృత మాటలు పలుకుతున్నాడు.
Cinn 72:5
మానవుల్లోంచి మరియు జిన్నుల్లోంచి ముష్రికులు ఆయనకు భార్య మరియు సంతానం ఉన్నదని వాదించినప్పుడు వారు అబద్దం పలకటం లేదని మేము భావించాము. అప్పుడు మేము వారిని అనుకరిస్తూ వారి మాటలను నిజమని నమ్మాము.
Cinn 72:6
మరియు అజ్ఞాన కాలంలో మానవుల్లోంచి కొందరు పురుషులు భయానక ప్రదేశంలో బస చేసినప్పుడు జిన్నల్లోంచి కొందరు పురుషులతో శరణు వేడుకునేవారు. అప్పుడు వారిలో నుండి ఒకడు ఇలా పలికే వాడు : నేను ఈ ప్రాంతపు నాయకునితో అతని జాతివారి యొక్క మూర్ఖుల కీడు నుండి శరణు వేడుకుంటున్నాను. అప్పుడు మానవుల్లోంచి పురుషులకు జిన్నుల్లోంచి పురుషుల నుండి భయం అధికమైపోయింది.
Cinn 72:7
ఓ జిన్నుల్లారా మీరు అనుకున్నట్లే మానువులు కూడా అల్లాహ్ ఎవరినీ అతని మరణం తరువాత లెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపడని భావించారు.
Cinn 72:8
మరియు మేము ఆకాశం యొక్క వార్తలను అడిగాము, మరియు ఆకాశం దైవదూతల యొక్క బలమైన కాపలాతో నిండినట్లు మేము కనుగొన్నాము. వారు మేము చేస్తున్న విన్న వాటిని దోచుకుని పోయే కార్యం నుండి వారు దాన్ని కాపలాకాస్తున్నారు. మరియు అది (ఆకాశం) భగభగ మండే అగ్ని జ్వాలలతో నిండి పోయి ఉంది ఆకాశమునకు దగ్గర వెళ్ళే ప్రతి ఒక్కడి పై అవి విసరబడుతున్నాయి.
Cinn 72:9
మరియు మేము గతంలో ఆకాశములో స్థానములను ఏర్పరచుకుని అక్కడ నుండి దైవ దూతలు పరస్పరం చర్చించుకునే మాటలను వినే వారము. అప్పుడు వాటి గురించి మేము భూలోకవాసుల్లోంచి జ్యోతిష్యులకు సమాచారమిచ్చేవారము. ఇప్పుడు విషయం మారినది. ఇప్పుడు మనలో నుంచి ఎవరైన వింటే అతడు తన కొరకు సిద్ధం చేసి ఉంచిన మండే అగ్నిని పొందుతాడు. ఎప్పుడైతే అతడు దగ్గరకు వెళతాడో అది అతనిపై పంపించబడును. అప్పుడు అది అతడిని దహించివేస్తుంది.
Cinn 72:10
ఈ పతిష్టమైన కాపలాకి కారణం ఏమిటో మాకు తెలియదు. భూవాసులకి కీడు చేసే ఉద్దేశించబడినదా లేదా అల్లాహ్ వారికి మేలు చేయదలచాడా. నిశ్చయంగా ఆకాశ సమాచారం మా నుండి తెగిపోయినది.
Cinn 72:11
మేము జిన్నుల సమాజమునకు చెందినవారము. మాలో నుండి దైవభీతి కలవారు,పుణ్యాత్ములు ఉన్నారు. మరియు మాలో నుండి అవిశ్వాసులు,అవిధేయులు ఉన్నారు. మేము వేరువేరు రకాలుగా మరియు విభిన్న ఇష్టాలు కలవారిగా ఉండేవారము.
Cinn 72:12
పరిశుద్ధుడైన అల్లాహ్ మా పట్ల ఏదైన విషయమును నిర్ణయించుకున్నప్పుడు మేము ఆయన నుండి తప్పించుకోలేమని పూర్తిగా నమ్మాము. మరియు ఆయన మమ్మల్ని చుట్టుముట్టి ఉండటం వలన మేము పారిపోయి ఆయన నుండి ఖచ్చితంగా తప్పించుకోలేము.
Cinn 72:13
మరియు నిశ్ఛయంగా మేము సవ్యమైన మార్గమును చూపించే ఖుర్ఆన్ ను విన్నప్పుడు దాన్ని విశ్వసించాము. కావున ఎవడైతే తన ప్రభువును విశ్వసిస్తాడో అతడు తన పుణ్యాలు తరుగుతాయని మరియు తన పూర్వ పాపాలతో వేరే పాపము అంటగట్టబడుతుందని భయపడడు.
Cinn 72:14
మరియు నిశ్చయంగా మాలో నుండి అల్లాహ్ కు విధేయులమైన ముస్లిములు ఉన్నారు. మరియు మాలో నుండి సత్యమైన మరియు స్థిరమైన మార్గము నుండి దూరమైనవారు ఉన్నారు. ఎవరైతే విధేయతతో మరియు సత్కర్మతో అల్లాహ్ కు వినయంగా ఉంటారో వారందరు సన్మార్గమును మరియు సరైన మార్గమును నిర్ణయించుకున్నారు.
Cinn 72:15
మరియు సత్యమార్గము నుండి మరియు స్థిర మార్గము నుండి దూరమైన వారు నరకమునకు ఇందనమవుతారు. అది వారి లాంటి జనులతో వెలిగించబడుతుంది.
Cinn 72:16
జిన్నుల్లోంచి ఒక వర్గము విన్నదని ఆయనకు దైవ వాణి ద్వారా తెలియపరచినట్లే ఒక వేళ జిన్నులు మరియు మానవులు ఇస్లాం మార్గముపై స్థిరంగా ఉండి అందులో ఉన్న వాటిని ఆచరిస్తే అల్లాహ్ వారికి అధికంగా నీటిని త్రాపిస్తాడని మరియు రకరకాల అనుగ్రహాలను ఎక్కువగా ప్రసాదిస్తాడని ఆయనకు దైవ వాణి ద్వారా తెలియపరచాడు.
Cinn 72:17
వారు అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత తెలుపుకుంటారా లేదా వాటి వట్ల కృతఝ్నులవుతారా అందులో మేము వారిని పరీక్షించటం కొరకు. మరియు ఎవరైతే ఖుర్ఆన్ నుండి మరియు అందులో ఉన్న ఉపదేశాల నుండి విముఖత చూపుతాడో అతడిని అతడి ప్రభువు కఠినమైన శిక్షలో ప్రవేశింపజేస్తాడు దాన్నిమోసే శక్తి అతనికి ఉండదు.
Cinn 72:18
మరియు నిశ్ఛయంగా మస్జిదులు పరిశుద్ధుడైన ఆయన కొరకే ఇతరుల కొరకు కాదు. కావున మీరు అందులో అల్లాహ్ తో పాటు ఎవరిని ఆరాధించకండి. అప్పుడు మీరు తమ ఆరాధనాలయాలు,తమ చర్చుల విషయంలో యూదులు,క్రైస్తవులవలే అయిపోతారు.
Cinn 72:19
మరియు అల్లాహ్ దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నఖ్లా ప్రాంతములో తన ప్రభువును ఆరాధిస్తూ నిలబడినప్పుడు జిన్నులు ఆయన ఖుర్ఆన్ పఠనమును వారు విన్నప్పుడు రద్ది తీవ్రత వలన ఆయనపై దాదాపుగా కిక్కిరిసిపోయినట్లు ఉన్నారు.
Cinn 72:20
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో మీరు ఇలా పలకండి : నేను ఒక్కడైన నా ప్రభువును మాత్రమే ఆరాధిస్తాను. మరియు నేను అతనితో పాటు ఇతరులను సాటి కల్పించను (ఆ ఇతరులు) ఎవరైనా అయినా సరే.
Cinn 72:21
మీరు వారితో ఇలా పలకండి : నిశ్ఛయంగా అల్లాహ్ మీ పై విధివ్రాతలో వ్రాసి పెట్టిన ఎటువంటి కీడును మీ కొరకు తొలగించే అధికారం నాకు లేదు. మరియు అల్లాహ్ మీ నుండి ఆపివేసిన ఏ ప్రయోజనమును తీసుకుని వచ్చే అధికారము నాకు లేదు.
Cinn 72:22
మీరు వారితో ఇలా పలకండి : ఒక వేళ నేను అల్లాహ్ కు అవిధేయత చూపితే అల్లాహ్ నుండి నన్ను ఎవరు రక్షించలేరు. మరియు నేను ఆశ్రయం పొందటానికి ఆయన కాకుండా ఏ ఆశ్రయమును నేను పొందలేను.
Cinn 72:23
కాని నన్ను అల్లాహ్ మీకు చేరవేయమని ఆదేశించిన వాటిని మరియు నాకు మీ వైపునకు ఇచ్చి పంపించిన ఆయన సందేశములను మీకు చేరవేసే అధికారం నాకు కలదు. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతాడో అతడి పరిణామం నరకంలో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశము. అందులో నుండి అతడు ఎన్నటికి బయటకు రాలేడు.
Cinn 72:24
మరియు అవిశ్వాసపరులు తమ అవిశ్వాసముపైనే కొనసాగుతారు చివరికి వారు తమకు ఇహలోకంలో వాగ్దానం చేయబడిన శిక్షను ప్రళయదినమున కళ్ళారా చూసినప్పుడు. అప్పుడు వారు సహాయపరంగా ఎవరు ఎక్కువ బలహీనుడో వారు తొందరలోనే తెలుసుకుంటారు. మరియు సహాయం చేయటానికి సంఖ్యాపరంగా ఎవరు తక్కువో వారు త్వరలోనే తెలుసుకుంటారు.
Cinn 72:25
ఓ ప్రవక్తా మరణాంతరమును తిరస్కరించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీతో వాగ్దానం చేయబడిన శిక్ష దగ్గరలో ఉన్నదో లేదా దానికి అల్లాహ్ కు మాత్రమే తెలిసిన సమయం ఉన్నదో నాకు తెలియదు.
Cinn 72:26
పరిశుద్ధుడైన ఆయన అగోచర విషయాలన్నింటిని తెలిసినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. తన అగోచర జ్ఞానం గురించి ఆయన ఎవరికి తెలియపరచడు. అంతేకాదు అది ఆయన జ్ఞానంతో ప్రత్యేకించబడి ఉంటుంది.
Cinn 72:27
కాని పరిశుద్ధుడైన ఆయన తాను ఇష్టపడిన ప్రవక్తకు మాత్రమే (తెలియపరుస్తాడు). నిశ్చయంగా ఆయన దాని గురించి తాను తలచిన వారికి తెలియపరుస్తాడు. మరియు ఆయన ప్రవక్త ముందు దైవదూతలను కాపలాగా పంపిస్తాడు వారు దాన్ని ప్రవక్త కాకుండా ఇతరులు తెలుసుకోకుండా ఉండేందుకు పరిరక్షిస్తారు.
Cinn 72:28
ప్రవక్త తన కన్నా మునుపటి ప్రవక్తలు ఏ సందేశాలను చేరవేయమని వారికి వారి ప్రభువు ఆదేశించినటువంటి తమ ప్రభువు సందేశాలను అల్లాహ్ చుట్టూ ఉంచిన పరిరక్షణ వలన మరియు దైవదూతల మరియు ప్రవక్తల వద్ద ఉన్న దాన్నిఅల్లాహ్ జ్ఞాన పరంగా చుట్టు ముట్టి ఉండటం వలన చేరవేశారని తెలుసుకుంటారని ఆశిస్తూ. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ప్రతీ వస్తువు యొక్క లెక్కను ఆయన లెక్కవేసి ఉంచాడు. పరిశుద్ధుడైన ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
Müzzemmil 73:1
ఓ తన దుస్తులతో చుట్టుకున్నవాడా (అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)
Müzzemmil 73:2
రాంత్రంతా నీవు నమాజు చదువు అందులో నుంచి కొంచము తప్ప.
Müzzemmil 73:3
మీరు తలచుకుంటే అందులో (రాత్రిలో) సగ భాగం నమాజు చదవండి లేదా మీరు మూడవ వంతు వచ్చే వరకు సగం కన్నా కొంచెం తక్కువ నమాజు చదవండి.
Müzzemmil 73:4
లేదా మీరు మూడింట రెండు వంతుల వరకు వచ్చే వరకు దాన్ని పెంచండి, మీరు ఖుర్ఆన్ ను చదివినప్పుడు స్పష్టపరచండి. మరియు దానిని చదవడంలో నిదానంగా చదవండి.
Müzzemmil 73:5
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీపై ఖుర్ఆన్ ను వేస్తాము. అది అందులో ఉన్న అనివార్య విషయాలు మరియు హద్దులు మరియు ఆదేశాలు మరియు పద్దతులు మొదలైన వాటి వలన భారమైన మాట.
Müzzemmil 73:6
నిశ్ఛయంగా రాత్రి ఘడియలు చదవటానికి తోడుగా మనస్సునకు ఎంతో ఉపయుక్తమైనవి మరియు మాట సూటిగా వెలువడటానికి ఎంతో అనువైనది.
Müzzemmil 73:7
నిశ్ఛయంగా పగటిపూట మీ పనుల కార్యచరణ ఉంటుంది దాని వలన మీకు ఖుర్ఆన్ పఠనం కొరకు తీరిక లేకున్నది. కావున మీరు రాత్రి వేళ నమాజును చదవండి.
Müzzemmil 73:8
అన్ని రకాల స్మరణల ద్వారా మీరు అల్లాహ్ స్మరణ చేయండి. మరియు పరిశుద్ధుడైన ఆయన వైపునకు (ప్రాపంచికి విషయాల నుండి దూరంగా ఉండి) ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకించుకుని మరలండి.
Müzzemmil 73:9
ఆయన తూర్పు పడమరల ప్రభువు. ఆయన తప్ప వాస్తవ ఆరాధ్యదైవం ఎవరూ లేరు. మీ వ్యవహారములన్నింటిలో ఆయనపైనే మీరు నమ్మకమును కలిగి ఉండి ఆయన్ని మీరు కార్యసాధకునిగా చేసుకోండి.
Müzzemmil 73:10
సత్యతిరస్కారులు పలికే హేళన,దూషణ పై మీరు సహనమును చూపండి. మరియు ఎటువంటి బాధ లేని విధంగా వారి నుండి తొలగిపోండి.
Müzzemmil 73:11
ఈ ప్రపంచంలోని ఆనందాలను ఆస్వాదించే తిరస్కరించే వారి గురించి మీరు చింతించకండి. నన్ను మరియు వారిని విడిచిపెట్టి, వారి సమయం వచ్చే వరకు కొంతకాలం వేచి ఉండండి.
Müzzemmil 73:12
నిశ్చయంగా పరలోకంలో మా వద్ద భారీ గొలుసులు మరియు ఉగ్రమైన అగ్ని ఉన్నాయి.
Müzzemmil 73:13
మరియు తీవ్రమైన చేదు వలన గొంతులో ఇరుక్కునే ఆహారము మరియు బాధాకరమైన శిక్ష; మునుపటి వాటి కంటే అధికముగా.
Müzzemmil 73:14
సత్యతిరస్కారులకు ఈ శిక్ష సంభవించే రోజు భూమి మరియు పర్వతాలు ప్రకంపిస్తాయి. మరియు పర్వతాలు ఆ దినపు భయానక పరిస్థితుల వలన జారిపోయి చెల్లాచెదురైపోయే ఇసుక వలె అయిపోతాయి.
Müzzemmil 73:15
నిశ్చయంగా మేము ప్రళయదినమున మీ కర్మలపై సాక్షిగా ఒక ప్రవక్తను మీ వైపునకు పంపాము. ఏ విధంగానైతే మేము ఫిర్ఔన్ వద్దకు ఒక ప్రవక్తను పంపించామో ఆయన మూసా అలైహిస్సలాం.
Müzzemmil 73:16
అప్పుడు ఫిర్ఔన్ అతని ప్రభువు వద్ద నుండి తన వైపునకు పంపించబడ్డ ప్రవక్తను తిరస్కరించాడు. అప్పుడు మేము అతడిని ఇహలోకంలో ముంచి పరలోకంలో అగ్ని శిక్ష ద్వారా తీవ్రంగా శిక్షించాము. మీరు మీ ప్రవక్త పై అవిధేయత చూపకండి మీకు కూడా అతడికి సంభవించినది సంభవిస్తుంది.
Müzzemmil 73:17
మిమ్మల్ని మీరు ఎలా నిరోధించుకుంటారు మరియు రక్షించుకుంటారు - ఒక వేళ మీరు అల్లాహ్ ను అవిశ్వసించి, ఆయన ప్రవక్తను తిరస్కరించినట్లయితే - తీవ్రమైన, సుదీర్ఘమైన ఆ రోజు నుండి, అది చిన్నపిల్లల తలను దాని భయానక తీవ్రత వలన మరియు పొడవు కారణంగా ముసలివారిలా మార్చివేస్తుంది.
Müzzemmil 73:18
దాని భయాందోళన వలన ఆకాశము బ్రద్దలైపోతుంది. అల్లాహ్ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది.
Müzzemmil 73:19
నిశ్ఛయంగా ప్రళయదినమున సంభవించే భయాందోళనలు మరియు తీవ్రతల ప్రకటనతో కూడుకున్న ఈ ఉపదేశము ఒక హితోపదేశము. విశ్వాసపరులు దాని నుండి ప్రయోజనం చెందుతారు. కాబట్టి తన ప్రభువు వద్దకు చేర్చే మార్గమును అవలంబించదలచినవాడు దాన్ని అవలంబించవచ్చు.
Müzzemmil 73:20
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువుకు తెలుసు మీరు ఒక్కొక్కసారి మూడింట రెండు వంతుల రాత్రి కన్న తక్కువ నమాజు చేస్తున్నారని మరియు ఒక్కొక్కసారి మీరు దానిలో (రాత్రిలో) సగం నిలబడుతున్నారని మరియు ఒక్కొక్కసారి దాని మూడో వంతు భాగం. మరియు విశ్వాసపరుల్లోంచి ఒక వర్గము మీతో పాటు నిలబడుతుందని. మరియు అల్లాహ్ రేయింబవళ్ళ పరిమాణాలను నిర్ణయిస్తాడు. మరియు వాటి ఘడియలను షుమారు చేస్తాడు. దాని ఘడియలను లెక్కవేయటం మరియు షుమారు చేయటం మీకు సాధ్యం కాదని పరిశుద్ధుడైన ఆయనకు తెలుసు. అప్పుడు ఆశించిన దాని కొరకు పరిశోధించటానికి దాని కన్న ఎక్కువ నిలబడటం మీకు భారం కావచ్చు. అందుకనే ఆయన మీపై దయ చూపాడు. కాబట్టి మీరు మీకు సౌలభ్యం ఉన్నంత వరకు రాత్రి నమాజు చదవండి. ఓ విశ్వాసపరులారా మీలో రోగము అలసటకు గురి చేసిన రోగులు ఉంటారని మరియు ఇతరులు అల్లాహ్ ప్రసాదించే ఆహారోపాధిని ఆశిస్తూ ప్రయాణం చేసేవారు ఉంటారని మరియు ఇతరులు అల్లాహ్ మన్నతను ఆశిస్తూ,అల్లాహ్ వాక్కు ఉన్నత శిఖరాలకు చేరటానికి అవిశ్వాసపరులతో పోరాడేవారు ఉంటారని అల్లాహ్ కు తెలుసు. కావున వీరందరిపై రాత్రి (నమాజు కొరకు) నిలబడటం భారం కావచ్చు. కాబట్టి మీరు మీకు సౌలభ్యంగా ఉన్నంత వరకు రాత్రి నమాజు (తహజ్జుద్) చదవండి. మరియు మీరు విధి గావించబడిన నమాజును పరిపూర్ణ పద్దతిలో పాటించండి. మరియు మీరు మీ సంపదల జకాత్ ను చెల్లించండి. మరియు మీరు మీ సంపదల నుండి అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండి. మరియు మీరు ఏ మేలునైనా మీ స్వయం కొరకు ముందు పంపించుకుంటే దాన్ని మీరు మంచిగా మరియు పెద్ద పుణ్యముగా పొందుతారు. మరియు మీరు అల్లాహ్ తో మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారికి మన్నించేవాడును మరియు వారిపై అపారంగా కరుణించేవాడును.
Müddessir 74:1
ఓ తన దుస్తులతో చుట్టుకున్నవాడా (అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)
Müddessir 74:2
మీరు లేచి అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టండి.
Müddessir 74:3
మరియు నీ ప్రభువు యొక్క ఉన్నతను చాటిచెప్పు.
Müddessir 74:4
మరియు మీరు మీ మనస్సును పాపముల నుండి మరియు మీ వస్త్రములను మాలిన్యముల నుండి పరిశుద్ధపరచండి.
Müddessir 74:5
మరియు మీరు విగ్రహాల ఆరాధన నుండి దూరం దూరంగా ఉండండి.
Müddessir 74:6
నీ సత్కర్మను అధికంగా కోరటం ద్వారా నీ ప్రభువుపై నీవు ఉపకారం చేయకు.
Müddessir 74:7
మీరు పొందే బాధలపై అల్లాహ్ కొరకు సహనం వహించండి.
Müddessir 74:8
బాకాలో రెండోవసారి ఊదబడినప్పుడు.
Müddessir 74:9
అప్పుడు ఆ దినము కఠినమైన దినమై ఉంటుంది.
Müddessir 74:10
అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరిచే వారిపై సులభముగా ఉండదు.
Müddessir 74:11
ఓ ప్రవక్తా మీరు నన్ను మరియు నేను తన తల్లి గర్భంలో ఎటువంటి సంపద గాని సంతానము గాని లేకుండా ఒంటరిగా పుట్టించిన వాడిని (అతడు వలీదిబ్నె ముగైరహ్) వదిలివేయండి.
Müddessir 74:12
మరియు నేను అతనికి చాలా సంపదను ఇచ్చాను.
Müddessir 74:13
మరియు నేను అతని కొరకు అతనికి తోడుగా ఉండి అతనితో పాటు సభలలో హాజరై ఉండే కుమారులను ప్రసాదించాను. అతని సంపద అధికంగా ఉండటం వలన వారు ఏ ప్రయాణం కొరకు అతనిని వీడి వెళ్ళరు.
Müddessir 74:14
మరియు నేను అతని కొరకు జీవితంలో మరియు ఆహారొపాధిలో మరియు సంతానములో విస్తారమును ప్రసాదించాను.
Müddessir 74:15
ఆ పిదప అతడు నాపై అవిశ్వాసం ఉండి కూడా నేను అతనికి వాటన్నింటిని ఇచ్చిన తరువాత కూడా అతనికి నేను ఇంకా అధికంగా ఇస్తానని అతడు ఆశ పెట్టుకుని ఉంటాడు.
Müddessir 74:16
అతను అనుకున్నట్లు విషయం కాదు. నిశ్చయంగా అతడు మన ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను విబేధిస్తూ,వాటిని తిరస్కరిస్తూ ఉండేవాడు.
Müddessir 74:17
నేను తొందరలోనే అతనిపై శిక్ష భారమును మోపుతాను అతను దాన్ని మోయలేడు.
Müddessir 74:18
నిశ్ఛయంగా ఈ అనుగ్రహాలను అనుగ్రహించిన ఈ అవిశ్వాసపరుడు ఖుర్ఆన్ విషయంలో దాన్ని అసత్యమని నిరూపించటానికి తాను పలకవలసిన మాటల గురించి ఆలోచించాడు మరియు దాన్ని తన మనస్సులో దాచి ఉంచాడు.
Müddessir 74:19
అయితే అతడు నాశనమైపోను మరియు శిక్షింపబడుగాక అతడు ఎలాంటి ప్రణాళిక చేశాడు.
Müddessir 74:20
మరి అతడు నాశనమైపోను మరియు శిక్షింపబడుగాక అతడు ఎలాంటి ప్రణాళిక చేశాడు.
Müddessir 74:21
ఆ తరువాత తాను చెప్పే విషయంలో దృష్టిని మరల్చి పునరాలోచన చేశాడు.
Müddessir 74:22
ఆ తరువాత ఖుర్ఆన్ విషయంలో ఎత్తి పొడవటానికి (దెప్పి పొడవటానికి) అతడు ఏమీ పొందనప్పుడు తన ముఖమును పాడు చేసుకుని నల్లగా మాడ్చుకున్నాడు.
Müddessir 74:23
ఆ తరువాత అతడు విశ్వాసము నుండి వెన్ను తిప్పాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించటం నుండి అహంకారమును చూపాడు.
Müddessir 74:24
మరియు ఇలా పలికాడు : ముహమ్మద్ తీసుకుని వచ్చినది ఇది అల్లాహ్ వాక్కు కాదు. కాని ఇది ఇతరుల నుండి నకలు చేయబడిన మంత్రజాలము.
Müddessir 74:25
ఇది అల్లాహ్ వాక్కు కాదు. కాని అది మానవుని వాక్కు.
Müddessir 74:26
నేను తొందరలోనే ఈ అవిశ్వాసపరుడిని నరకాగ్ని స్థానముల్లోంచి ఒక స్థానములో ప్రవేశింపజేస్తాను అది సఖర్ అతడు దాని వేడిని అనుభవిస్తాడు.
Müddessir 74:27
ఓ ముహమ్మద్ సఖర్ ఏమిటో మీకు ఏమి తెలుసు?.
Müddessir 74:28
అందులో శిక్షింపబడే వాడి నుండి అది అతనిపై వచ్చి ఏది మిగిల్చదు. మరియు అతడిని వదలదు. ఆ తరువాత అతడు ఎలా ఉండేవాడో అలా అయిపోతాడు. మరల అది అతనిపై వస్తుంది. ఇలాగే కొనసాగుతూ ఉంటుంది.
Müddessir 74:29
కాల్చివేయటంలో తీవ్రమైనది మరియు చర్మములను మార్చి వేసేది.
Müddessir 74:30
దానిపై పంతొమ్మిది దూతలు ఉంటారు. మరియు వారు దాని రక్షకులు.
Müddessir 74:31
మరియు మేము నరక సంరక్షకులుగా దైవదూతలను మాత్రమే చేశాము. మానవులకు వాళ్ళను ఎదుర్కొనే శక్తి లేదు. తాను మరియు తన జాతి వారు వారిని అదిగమించే సామర్ధ్యం ఉన్నదని ఆ తరువాత నరకము నుండి బయటకు వస్తారని వాదించినప్పుడు అబూజహల్ అబద్దము పలికాడు. మరియు మేము వారి ఈ సంఖ్య లెక్కను అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచే వారి కొరకు పరీక్షగా చేశాము. వారు పలికినదే పలుకుతారు. అప్పుడు వారిపై శిక్ష రెట్టింపు చేయబడును. మరియు తౌరాత్ ఇవ్వబడిన యూదులకు మరియు ఇంజీలు ఇవ్వబడిన క్రైస్తవులకు తమ గ్రంధముల్లో ఉన్న దాన్ని దృవీకరించే ఖుర్ఆన్ అవతరింపబడినప్పుడు నమ్మకం కలగటానికి. మరియు గ్రంధవహులు తమను ఏకీభవించినప్పుడు విశ్వాసపరుల విశ్వాసం అధికమవటానికి. మరియు యూదులు,క్రైస్తవులు మరియు విశ్వాసపరులు సందేహంలో పడకుండా ఉండటానికి. మరియు విశ్వాసము విషయములో వ్యాకులములో ఉన్నవారు మరియు అవిశ్వాసపరులు ఈ విచిత్రమైన సంఖ్య ద్వారా అల్లాహ్ ఏమి చేయదలచాడు ? అని పలకటానికి. ఈ సంఖ్యను నిరాకరించే వాడిని అపమార్గమునకు లోను చేయటం మరియు దాన్ని దృవీకరించే వారిని సన్మార్గం చూపినట్లే అల్లాహ్ ఎవరిని అపమార్గమునకు గురి చేయదలచుకుంటే వారిని అపమార్గమునకు గురి చేస్తాడు మరియు తాను సన్మార్గమునకు గురి చేయదలచిన వారికి సన్మార్గమునకు గురి చేస్తాడు. మరియు మీ ప్రభువు యొక్క సైన్యములు అవి అధికంగా ఉండి పరిశుద్ధుడైన ఆయనకు తప్ప ఎవరికి తెలియదు. (ఏమీ ముహమ్మద్ కొరకు సహాయకులు పంతొమ్మిది మందేనా ?) అని తక్కువ చేస్తూ మరియు తిరస్కరిస్తూ పలికిన అబూజహల్ దీన్ని తెలుసుకోవాలి. నరకాగ్ని మానవులకు ఒక హితబోధన మాత్రమే. వారు దాని ద్వారా పరిశుద్ధుడైన అల్లాహ్ గొప్పతనమును తెలుసుకుంటారు.
Müddessir 74:32
ముష్రికుల్లోంచి కొందరు అనుకుంటున్నట్లు నరక రక్షకులకు అతడు సరిపోతాడని చివరికి వారిని దాని నుండి తొలగించి వేస్తాడని మాట కాదు. అల్లాహ్ చంద్రునిపై ప్రమాణం చేశాడు.
Müddessir 74:33
మరియు ఆయన గడిచిపోయే రాత్రి పై ప్రమాణం చేశాడు.
Müddessir 74:34
మరియు ఆయన ప్రకాశించే వేళప్పుడు ఉదయం పై ప్రమాణం చేశాడు.
Müddessir 74:35
నిశ్ఛయంగా నరకాగ్ని పెద్ద ఆపదల్లోంచి ఒకటి.
Müddessir 74:36
ప్రజలకు హెచ్చరించటానికి మరియు భయపెట్టటానికి.
Müddessir 74:37
ఓ ప్రజలారా మీలో నుండి ఎవరు తలచుకుంటే వారు అల్లాహ్ పై విశ్వాసముతో మరియు సత్కర్మతో ముందుకు సాగాలి లేదా అవిశ్వాసముతో మరియు పాప కార్యములతో వెనుకకు జరగాలి.
Müddessir 74:38
ప్రతీ ప్రాణము తాను చేసుకున్న కర్మల వలన పట్టుకోబడుతాడు. అతని కర్మలు అతడిని నాశనం చేస్తాయి లేదా అవి అతడిని వినాశనం నుండి ముక్తిని కల్పించి అతడిని రక్షిస్తాయి.
Müddessir 74:39
విశ్వాసపరులు తప్ప ఎందుకంటే వారి పాపముల వలన వారిని పట్టుకోబడదు. కాని వారి సత్కర్మల వలన అవి మన్నించబడతాయి.
Müddessir 74:40
మరియు వారు ప్రళయదినమున స్వర్గవనములలో ఒకరితో ఒకరు అడుగుతుంటారు.
Müddessir 74:41
తాము చేసుకున్న పాప కర్యముల ద్వారా తమ స్వయమును నాశనం చేసుకున్న అవిశ్వాసపరుల గురించి.
Müddessir 74:42
వారు వారితో ఇలా పలుకుతారు : మిమ్మల్ని నరకములో ఏది ప్రవేశింపజేసింది ?.
Müddessir 74:43
అప్పుడు అవిశ్వాసపరులు ఇలా పలుకుతూ వారికి జవాబు ఇస్తారు : ఇహలోకములో ఫర్జ్ నమాజులో పాటించేవారిలో నుంచి మేము కాలేదు.
Müddessir 74:44
అల్లాహ్ మాకు ప్రసాదించిన దానిలో నుండి మేము పేదవారికి తినిపించేవారము కాదు.
Müddessir 74:45
మరియు మేము అసత్య ప్రజలతో ఉండి వారు ఎక్కడికి వెళితే అక్కడికి వారితో పాటు కలిసి తిరిగేవారము. మరియు అపమార్గమునకు,మార్గభ్రష్టతకు లోనైన వారితో కూర్చుని మాట్లాడే వారము.
Müddessir 74:46
మరియు మేము ప్రతిఫల దినమును తిరస్కరిస్తూ ఉన్నాము.
Müddessir 74:47
మరియు మేము దాన్ని తిరస్కరించటంలో పడి ఉన్నాము చివరకు మాకు మరణం వచ్చి చేరింది. అప్పుడు అది మాకు మరియు మా పశ్చాత్తాపమునకు మధ్య వచ్చి పడింది.
Müddessir 74:48
ప్రళయదినమున దైవదూతలు, ప్రవక్తలు మరియు నీతిమంతులలో నుండి సిఫారసు చేసేవారి యొక్క మధ్యవర్తిత్వం వారికి ఏమి ప్రయోజనం చేకూర్చదు ఎందుకంటే సిఫారసు స్వీకరించబడటానికి సిఫారసు చేయబడే వ్యక్తి నుండి ఇష్టత ఉండటం షరతు.
Müddessir 74:49
ఈ ముష్రికులందరిని ఏది ఖుర్ఆన్ నుండి విముఖత చూపేవారిగా చేసినది ?!
Müddessir 74:50
దాని నుండి తమ విముఖతలో మరియు తమ బెదిరిపోవటంలో వారు తీవ్రంగా బెదిరిపోయిన అడవి గాడిదలవలె ఉన్నారు.
Müddessir 74:51
అవి సంహం ముందు నుండి దానితో భయపడి పారిపోయాయి.
Müddessir 74:52
అలా కాదు, ఈ ముష్రికులలో ప్రతి ఒక్కరూ తన తల వద్ద ముహమ్మద్ అల్లాహ్ వద్ద నుండి వచ్చిన ఒక ప్రవక్త అని చెప్పే ఒక ప్రచురించబడిన పుస్తకాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు, దానికి కారణం సాక్ష్యాలు తక్కువగా ఉండటం లేదా బలహీనమైన వాదనలు కాదు, మొండితనం మరియు అహంకారం.
Müddessir 74:53
విషయం అలా కాదు. కాని వారు తమ అవిశ్వాసంలో కొనసాగిపోవటానికి కారణం వారు పరలోక శిక్షను విశ్వసించకుండా తమ అవిశ్వాసంలోనే ఉండిపోయారు.
Müddessir 74:54
వినండి నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ ఒక హితబోధన మరియు ఒక ఉపదేశం.
Müddessir 74:55
కాబట్టి ఎవరైతే ఖుర్ఆన్ ను చదివి దాని ద్వారా హితబోధన గ్రహించదలచుతారో వారు దాన్ని చదవాలి మరియు దానితో హితబోధన గ్రహించాలి.
Müddessir 74:56
వారు హితబోధన గ్రహించాలని అల్లాహ్ తలచుకుంటే తప్ప వారు హిత బోధన గ్రహించలేరు. పరిశుద్ధుడైన ఆయనే, ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనతో భయపడటానికి యోగ్యుడు మరియు పశ్చాత్తాపముతో ఆయన వైపునకు మరలినప్పుడు తన దాసుల పాపములను ఆయన మన్నించటం కొరకు యోగ్యుడు.
Kıyamet 75:1
అల్లాహ్ ప్రళయదినముపై ప్రమాణం ఛేశాడు ఆ రోజు ప్రజలు సర్వలోకాల ప్రభువు ముందు నిలబడుతారు.
Kıyamet 75:2
మరియు ఆయన ఆ మంచి మనస్సు పై ప్రమాణం చేశాడు ఏదైతే తన యజమానిని సత్కర్మల విషయంలో నిర్లక్ష్యం చేసినందుకు మరియు దుష్కర్మలు చేసినందుకు నిందిస్తుంది. ఆయన ఈ రెండు విషయములపై ప్రమాణం చేసి ప్రజలు లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు తప్పకుండా లేపబడుతారని తెలియపరచాడు.
Kıyamet 75:3
ఏమి మానవుడు అతని మరణం తరువాత మరల లేపబడటం కొరకు మేము అతని ఎముకలను సమీకరించమని అనుకుంటున్నాడా ?.
Kıyamet 75:4
ఎందుకు కాదు, మేము వాటిని సమీకరించటంతో పాటు అతని వ్రేళ్ళ చివర్లను ముందు ఎలా ఉండేవో అలా సరిగా సృష్టించి మరలించటంపై సామర్ధ్యము కలవారము.
Kıyamet 75:5
మరణాంతరం లేపబడటమును తిరస్కరించటం ద్వారా మానవుడు తన పాపములపై భవిష్యత్తులో ఎవరు ఆపేవాడు లేడని కొనసాగిపోవాలని అనుకుంటున్నాడు.
Kıyamet 75:6
ప్రళయదినమును దూరంగా భావించే విధంగా అతడు అది ఎప్పుడు జరగబోతుంది ? అని అడుగుతున్నాడు.
Kıyamet 75:7
మరియు తాను తిరస్కరించిన దాన్ని చూడగానే కళ్ళు ఆందోళన చెంది ఆశ్ఛర్యపోయినప్పుడు.
Kıyamet 75:8
మరియు చంద్రుని కాంతి వెళ్ళి పోయినప్పుడు.
Kıyamet 75:9
మరియు సూర్య,చంద్రుల పరిమాణం సమీకరించబడినప్పుడు.
Kıyamet 75:10
ఆ రోజు పాపాత్ముడైన మానవుడు ఎటు పారిపోవాలి ? అని అంటాడు.
Kıyamet 75:11
ఆ రోజు పారిపోయి తప్పించుకోవటం ఉండదు మరియు ఆశ్రయం తీసుకోవటానికి ఎటువంటి ఆశ్రయం ఉండదు మరియు రక్షణ పొందటానికి ఎటువంటి రక్షణ ప్రదేశం ఉండదు.
Kıyamet 75:12
ఓ ప్రవక్త లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు ఆ రోజు మరలే చోటు మరియు తరలి వెళ్ళే చోటు మీ ప్రభువు వైపునే.
Kıyamet 75:13
ఆ రోజున మానవుడికి తాను చేసి పంపిన తన కర్మల గురించి మరియు తాను వాటిలో నుండి వెనుక వదిలి వచ్చిన వాటి గురించి తెలుపబడుతుంది.
Kıyamet 75:14
అంతే కాదు మానవుడు తాను స్వయంగా తనకు విరుద్దంగా సాక్షి అవుతాడు. ఎందుకంటే అతను చేసిన పాపముల గురించి అతని అవయవములు అతనికి విరుద్ధంగా సాక్ష్యం పలుకుతాయి.
Kıyamet 75:15
మరియు ఒక వేళ అతడు సాకులను తీసుకుని వచ్చి తాను చెడు చేయలేదని వాటితో తన తరపు నుండి వాదిస్తే అవి అతనికి ప్రయోజనం కలిగించవు.
Kıyamet 75:16
ఓ ప్రవక్తా మీరు ఖుర్ఆన్ విషయంలో అది మీ నుండి తప్పిపోతుందని త్వరపడుతూ మీ నాలుకను కదల్చకండి.
Kıyamet 75:17
నిశ్చయంగా మేము దానిని మీ కొరకు మీ హృదయంలో సేకరించి, దాని పఠనాన్ని మీ నాలుకపై స్థిరపరచటం మా బాధ్యత.
Kıyamet 75:18
మా దూత జిబ్రయీల్ మీకు ఖుర్ఆన్ చదివి వినిపించినప్పుడు మీరు ఆయన ఖిరాఅత్ చేసేటప్పుడు మౌనంగా ఉండి వినండి.
Kıyamet 75:19
ఆ పిదప నిశ్చయంగా మీ కొరకు దాని వివరణ ఇవ్వటం మా బాధ్యత.
Kıyamet 75:20
ఖచ్చితంగా అలా జరగదు. మరణాంతరం లేపబడటం అసంభవం అని మీరు వాదించినట్లు విషయం కాదు. మిమ్మల్ని ఆరంభంలో సృష్టించటం పై సామర్ధ్యం కలవాడు మీ మరణం తరువాత మిమ్మల్ని జీవింపజేయటం నుండి అశక్తుడు కాడని మీకు తెలుసు. కాని మరణాంతరం లేపబడటమును మీ తిరస్కారమునకు కారణం వేగముగా అంతమైపోయే ఇహలోక జీవితముపై మీ ప్రేమ.
Kıyamet 75:21
మరియు పరలోక జీవితమును మీరు వదిలి వేయటం దాని యొక్క మార్గము అల్లాహ్ మీకు ఆదేశించిన విధేయత కార్యాలను పాటించటం మరియు మీకు వారించబడిన నిషేధితాలను వదిలివేయటం.
Kıyamet 75:22
ఆ దినమున విశ్వాసపరుల మరియు సజ్జనుల ముఖములు వెలుగుతో వికశించిపోతుంటాయి.
Kıyamet 75:23
అవి తమ ప్రభువు వైపు దానితో ఆనందపడుతూ చూస్తుంటాయి.
Kıyamet 75:24
అవిశ్వాసపరుల మరియు దుష్టుల ముఖములు ఆ దినమున విచారముతో ఉంటాయి.
Kıyamet 75:25
వాటిపై పెద్ద యాతన మరియు బాధాకరమైన శిక్ష దిగుతుందని అవి భావిస్తాయి.
Kıyamet 75:26
ముష్రికులు మరణించినప్పుడు తాము శిక్షింపబడమని భావించినట్లు విషయం కాదు. వారిలో నుండి ఒకరి ప్రాణం అతని ఛాతీ పై భాగమునకు చేరుకున్నప్పుడు.
Kıyamet 75:27
ప్రజల్లోంచి కొందరు కొందరితో ఇలా పలుకుతారు : బహుశా ఇతను స్వస్థత పొందటానికి ఇతడిని మంత్రించేవాడు ఎవడున్నాడు ?.
Kıyamet 75:28
మరణ ఘడియలు ఆసన్నమైనప్పుడు అతడు మరణంతో ఇహలోకమును వీడటం ఖాయం అని పూర్తి నమ్మకమును కలిగి ఉంటాడు.
Kıyamet 75:29
మరియు ఇహలోక ముగింపు మరియు పరలోక ఆరంభమున భయాందోళనలు సమీకరించబడుతాయి.
Kıyamet 75:30
ఇలా జరిగినప్పుడు మృతుడు తన ప్రభువు వైపునకు తీసుకుని వెళ్ళబడుతాడు.
Kıyamet 75:31
అయితే అవిశ్వాసపరుడు అతని వద్దకు ఆయన ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని నమ్మలేదు మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ కొరకు నమాజును పాటించలేదు.
Kıyamet 75:32
మరియు కాని అతడు అతని వద్దకు ఆయన ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించి దాని నుండి విముఖత చూపాడు.
Kıyamet 75:33
ఆ తరువాత ఈ అవిశ్వాసపరుడు తన కుటుంబం వారి వద్దకు తన నడకలో అహంకారమును చూపుతూ గర్వంగా వెళ్ళాడు.
Kıyamet 75:34
అల్లాహ్ అవిశ్వాసపరుడిని అతని శిక్ష అతని స్నేహితుడని మరియు అది అతనికి దగ్గరకు రాబోతుందని హెచ్చరించాడు.
Kıyamet 75:35
ఆ పిదప ఈ వాక్యమును తాకీదుగా మరల ప్రస్తావించి ఇలా పలికాడు : అవును నీకు నాశనం మీద నాశనం రానున్నది (ثُمَّ أَوْلَى لَكَ فَأَوْلَى).
Kıyamet 75:36
ఏమీ మానవుడు అల్లాహ్ అతనిపై ధర్మ బాధ్యతను వేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశాడని అనుకుంటున్నాడా ?.
Kıyamet 75:37
ఏమిటీ ఈ మానవుడు ఒక రోజు మాతృ గర్భంలో వేయబడ్డ ఒక వీర్యపు బిందువులా లేడా ?.
Kıyamet 75:38
ఆ పిదప దాని తరువాత అతడు గడ్డ కట్టిన రక్తపు ముక్కగా అవ్వలేదా. ఆ తరువాత అల్లాహ్ అతన్ని సృష్టించాడు. మరియు అతని సృష్టిని సరిగా చేశాడు.
Kıyamet 75:39
అప్పుడు అతని లింగమును మగ మరియు ఆడగా రెండు రకాలుగా చేశాడు.
Kıyamet 75:40
ఏమీ మానవుడిని వీర్య బిందువుతో ఆ తరువాత రక్తముద్దతో సృష్టించినవాడు మృతులను లెక్క తీసుకుని ప్రతిఫలం ప్రసాదించటానికి సరి క్రొత్తగా జీవింపజేయటంపై సమర్ధుడు కాడా ?! ఎందుకు కాదు నిశ్చయంగా అతడు సామర్ధ్యం కలవాడు.
İnsan 76:1
మానవునిపై ఒక సుదీర్ఝ కాలం గడిచినది అందులో అతడు తనకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్నాడు.
İnsan 76:2
నిశ్చయంగా మేము మానవుడిని పురుషుని యొక్క నీరు మరియు స్త్రీ యొక్క నీటి మధ్య ఒక మిశ్రమ బిందువుతో సృష్టించాము. మేము అతన్ని అతనిపై వేసిన బాధ్యతల ద్వారా పరీక్షిస్తాము. మేము అతన్ని వినేవాడిగా చూసేవాడిగా చేశాము అతనిపై మేము వేసిన ధర్మ బాధ్యతలను అతను నెరవేర్చటానికి.
İnsan 76:3
నిశ్చయంగా మేము అతనికి సన్మార్గమును మా ప్రవక్తల నోట స్పష్టపరచాము. దాని ద్వారా అతనికి అపమార్గము స్పష్టమైనది. కావున అతను దీని తరువాత సన్మార్గము కొరకు మార్గదర్శకం పొందాలి. అప్పుడు అతను అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకునే విశ్వాసపర దాసుడవుతాడు. లేదా అతను దాని నుండి మార్గభ్రష్టత పొందాలి అప్పుడు అతను అల్లాహ్ ఆయతులను తిరస్కరించే నిరాకరించే దాసుడవుతాడు.
İnsan 76:4
నిశ్చయంగా మేము అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి కొరకు గొలుసులను సిద్ధం చేసి ఉంచాము వాటి ద్వారా వారు నరకంలో ఈడ్చబడుతారు. మరియు మెడలో వేసే పట్టాలను సిద్ధం చేశాము వాటి ద్వారా వారు అందులో బంధించబడుతారు. మరియు దహించివేసే అగ్నిని సిద్ధం చేశాము.
İnsan 76:5
నిశ్చయంగా అల్లాహ్ కొరకు విధేయత చూపే విశ్వాసపరులు ప్రళయదినమున మంచి వాసన కొరకు కర్పూరముతో కలుపబడిన మధు పానియంతో ఉన్న పాత్రలను సేవిస్తారు.
İnsan 76:6
విధేయుల కొరకు సిద్ధపరచబడిన ఈ పానీయము తేలికగా పొందేటటువంటి సెలయేరు నుండి ఉంటుంది. అది సమృద్ధిగా ఉంటుంది మరియు క్షీణించదు. అల్లాహ్ దాసులు దాన్ని తాము తలచుకున్న చోటికి దాన్ని ప్రవహింపజేసుకుని దాని పానియాలను తీసుకునిపోతారు.
İnsan 76:7
దాన్ని త్రాగే దాసుల గుణములు ఏమిటంటే వారు తమపై తప్పనిసరి చేసుకున్న విధేయ కార్యాలను పూర్తి చేస్తారు. మరియు ఆ దినముతో దేని కీడు అయితే విస్తరించిపోతుందో,వ్యాపిస్తుందో భయపడుతుంటారు. అది ప్రళయదినము.
İnsan 76:8
మరియు వారు భోజనమును దాని అవసరం ఉండి,దాని కోరిక ఉండి దాని ప్రీతి వారికి ఉండి కూడా తినిపిస్తారు. వారు దాన్ని అవసరం కల పేద వారికి,అనాదలకు,ఖైదీలకు తినిపిస్తారు.
İnsan 76:9
మరియు వారు తమ మనస్సుల్లో గోప్యంగా మేము వారికి అల్లాహ్ మన్నత కొరకు మాత్రమే తినిపిస్తున్నాము. కావున వారు వారికి తినిపించటంపై వారి నుండి ఎటువంటి ప్రతిఫలమును మరియు పొగడ్తలను ఆశించరు.
İnsan 76:10
నిశ్చయంగా మేము మా ప్రభువు నుండి ఆ దినముతో దేనిలో నైతే దుష్టుల ముఖములు దాని తీవ్రత వలన మరియు దాని అత్యంత దుర్బరమవటం వలన ఉదాసీనతకు లోనవుతాయో భయపడుతున్నాము.
İnsan 76:11
మరియు అల్లాహ్ తన అనుగ్రహముతో వారిని ఆ గొప్ప దినపు కీడు నుండి రక్షించాడు. మరియు వారికి వారి ముఖములలో తాజాదనమును,కాంతిని వారికి మర్యాద కొరకు మరియు వారి హృదయములలో సంతోషం కలిగించటం కొరకు ప్రసాదిస్తాడు.
İnsan 76:12
విధేయ కార్యాలపై వారి సహనము వలన మరియు అల్లాహ్ నిర్ణయించిన వాటిపై వారి సహనము వలన మరియు పాప కార్యములు చేయకుండా వారి సహనము వలన అల్లాహ్ వారికి స్వర్గమును ప్రతిఫలముగా ప్రసాదిస్తాడు వారు అందులో సుఖభోగాలను అనుభవిస్తారు. మరియు పట్టు వస్త్రములను ప్రసాదిస్తాడు వారు వాటిని తొడుగుతారు.
İnsan 76:13
వారు అక్కడ అలంకరించబడిన పీఠములపై ఆనుకుని కూర్చుని ఉంటారు. ఈ స్వర్గములో వారు తమను బాధించే సూర్య కిరణాలు కల ఎటువంటి సూర్యుడిని గాని ఎటువంటి తీవ్రమైన చలిని కాని చూడరు. అంతేకాదు వారు ఎటువంటి వేడి గాని ఎటువంటి చల్లదనము లేని శాశ్వతమైన నీడలో ఉంటారు.
İnsan 76:14
వాటి నీడలు వారికి దగ్గరగా ఉంటాయి. మరియు వాటి ఫలాలు వాటిని తినే వారి కొరకు అందుబాటులో ఉంచబడి ఉంటాయి. కావున వారు వాటిని తేలికగా ,సులభంగా పొందుతారు. ఎలాగంటే పడుకున్న వాడు,కూర్చున్న వాడు,నిలబడి ఉన్నవాడు వాటిని పొందుతాడు.
İnsan 76:15
వారు త్రాగ దలచినప్పుడు వారి మధ్య సేవకులు వెండి పాత్రలను మరియు స్వచ్చమైన రంగు కల గ్లాసులను తీసుకుని చక్కరులు కొడతారు.
İnsan 76:16
అవి తమ రంగు స్వచ్ఛతనంలో గాజును పోలి ఉంటాయి ఇంకా అవి వెండివి ఉంటాయి. వారు కోరిన విధంగా అంచనా వేయబడి ఉంటాయి. దాని కన్న అధికంగా ఉండవు మరియు తరిగి ఉండవు.
İnsan 76:17
మరియు గౌరవించబడిన వీరందరు సొంటి కలపబడిన మధుపాత్రలు త్రాపించబడుతారు.
İnsan 76:18
వారు స్వర్గంలో ఒక చెలమ నుండి త్రాపించబడుతారు. దాన్ని సల్ సబీల్ అని పిలవబడును.
İnsan 76:19
మరియు స్వర్గంలో వారి మధ్య తమ యవ్వనంలో అను నిత్యం ఉండిపోయే పిల్లలు చక్కరులు కొడుతంటారు. నీవు వారిని చూసినప్పుడు వారి ముఖముల తాజాదనము వలన,వారి మంచి రంగుల వలన,వారు అధికంగా ఉండటం వలన,వారు వేరు వేరుగా ఉండటం వలన నీవు వారిని వెదజెల్లిన ముత్యాలుగా భావిస్తావు.
İnsan 76:20
మరియు నీవు అక్కడ స్వర్గంలో చూసినప్పుడు వర్ణించలేనన్ని అనుగ్రహములను నీవు చూస్తావు. మరియు ఏ రాజ్యాధికారము సరితూగని గొప్ప రాజ్యాధికారమును నీవు చూస్తావు.
İnsan 76:21
వాస్తవానికి వారి శరీరములపై శ్రేష్టమైన వస్త్రాలు ఉంటాయి. మరియు అవి పల్చటి పట్టు వస్త్రాలు మరియు మందమైన వస్త్రాలు. మరియు వారికి అక్కడ వెండి కంకణములు తొడిగించబడుతాయి. మరియు అల్లాహ్ వారికి ప్రతీ బాధ నుండి ఖాళీ అయిన పానీయమును త్రాపిస్తాడు.
İnsan 76:22
మరియు వారితో మర్యదపూరకంగా ఇలా పలకబడును : నిశ్చయంగా మీరు ప్రసాదించబడిన ఈ అనుగ్రహాలు మీరు చేసుకున్న సత్కర్మలకు మీకు ప్రతిఫలము. మరియు మీ కర్మ అల్లాహ్ వద్ద స్వీకరించబడినది.
İnsan 76:23
నిశ్ఛయంగా మేము ఓ ప్రవక్తా ఈ ఖుర్ఆన్ ను మీపై క్రమక్రమంగా అవతరింపజేశాము. దాన్ని మేము మీపై ఒకే సారి అవతరింపజేయలేదు.
İnsan 76:24
కావున నీవు అల్లాహ్ విధి వ్రాతపరంగా లేదా ధర్మపరంగా తీర్పునిచ్చిన దానిపై సహనం చూపు. మరియు నీవు ఏ పాపాత్మునికి అతను పిలిచే పాపము విషయంలో అనుసరించకు మరియు ఏ అవిశ్వాసపరునికి అతను పిలిచే అవిశ్వాసం విషయంలో అనుసరించకు.
İnsan 76:25
మరియు నీవు దినపు మొదటి వేళ ఫజర్ నమాజు ద్వారా మరియు దాని చివరి వేళ జుహర్,అసర్ నమాజు ద్వారా నీ ప్రభువు స్మరణ చేయి.
İnsan 76:26
మరియు రాత్రి వేళ రెండు నమాజులలో అనగా మగ్రిబ్ మరియు ఇషా నమాజులలో ఆయన్ను ధ్యానించు. మరియు వాటి తరువాత తహజ్జుద్ నమాజ్ పాటించు.
İnsan 76:27
నిశ్చయంగా అవిశ్వాసులు ఈ తాత్కాలిక ఇహలోక జీవితాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు. అందులో ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే దాని వెనుక వచ్చే అంతిమదినం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు - ఆ అంతిమదినం ఎంతో భారమైన దినం. ఎందుకంటే అందులో దిగ్భ్రాంతికి గురి చేసే తీవ్రమైన పరిస్థితులు మరియు పరీక్షలు ఉన్నాయి.
İnsan 76:28
మేము వారిని సృష్టించాము. బలమైన కీళ్ళు, అవయవాలు మరియు ఇతర శరీర భాగాలతో వారిని బలోపేతం చేశాము. ఒకవేళ మేము తలుచుకుంటే వారిని నాశనం చేసి, వారికి బదులుగా అలాంటి బలమైన వారిని సృష్టించగలము.
İnsan 76:29
ఎవరైతే తన ప్రభువు సంతృప్తి చెందే మార్గాన్ని అనుసరించాలని కోరుకుంటున్నారో, అలాంటి వారి కొరకు ఈ సూర ఒక ఉపదేశం మరియు జ్ఞాపిక. కాబట్టి అలాంటి వారు దానిని పొందగలరు.
İnsan 76:30
అల్లాహ్ ను సంతృప్తి పరిచే మార్గాన్ని అనుసరించాలని కోరుకునే వారిలో అల్లాహ్ కోరినవారు తప్ప, మరెవ్వరూ దానిని అనుసరించలేరు. ప్రతి ఆజ్ఞ ఆయన అధీనంలోనే ఉంది. తన దాసులలో ఎవరు సన్మార్గంలో కొనసాగుతారో మరియు ఎవరు కొనసాగరో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆయన సృష్టించడంలో, శక్తి సామర్ధ్యాలలో మరియు శాసించడంలో మహావివేకవంతుడు.
İnsan 76:31
తన దాసులలో నుండి, ఆయన తన ఇష్టానుసారం తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. వారికి దైవవిశ్వాసం (ఈమాన్) మరియు పుణ్యకార్యాల జ్ఞానం ప్రసాదిస్తాడు. మరియు స్వయంగా అవిశ్వాసంలో మరియు పాపాలలో మునిగి పోవడం వలన సత్యతిరస్కారుల కొరకు ఆయన పరలోకంలో బాధాకరమైన శిక్షను తయారు చేశాడు. అదే నరకాగ్ని శిక్ష.
Mürselat 77:1
అంతులేని పర్షియన్ సైనిక పంక్తుల వలే, ఒకదాని తర్వాత ఒకటి నిరంతరంగా, వేగంగా వీస్తున్న పెనుగాలులపై అల్లాహ్ ప్రమాణం చేశాడు.
Mürselat 77:2
తీవ్రంగా వీచే పెనుగాలులపై ప్రమాణం చేశాడు.
Mürselat 77:3
వర్షమును వ్యాపింపజేసే పెనుగాలులపై ప్రమాణం చేశాడు.
Mürselat 77:4
సత్యం మరియు అసత్యాలను వేరు పరిచేందుకు క్రిందికి దిగి వచ్చే దైవదూతలపై ప్రమాణం చేశాడు.
Mürselat 77:5
మరియ దైవ వాణిని తీసుకుని దిగే దైవదూతలపై ప్రమాణం చేశాడు.
Mürselat 77:6
వారు దైవ వాణిని తీసుకుని దిగుతారు అల్లాహ్ వద్ద నుండి ప్రజలకు సాకులు లేకుండా చేయటానికి మరియు ప్రజలను అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించటానికి.
Mürselat 77:7
నిశ్చయంగా మీకు వాగ్దానం చేయబడిన మరణాంతరం లేపబడటం మరియు లెక్క తీసుకోబడటం మరియు ప్రతిఫలం ప్రసాదించటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది.
Mürselat 77:8
నక్షత్రములు వాటి కాంతి తుడిచి వేయబడి వాటి వెలుగు వెళ్ళిపోయినప్పుడు.
Mürselat 77:9
మరియు ఆకాశము దాని నుండి దైవదూతలు దిగటానికి చీలిపోయినప్పుడు.
Mürselat 77:10
మరియు పర్వతాలు తమ స్థానం నుండి పెకిలించవేయబడి తునాతునకలుగా చేయబడి చివరికి దూళిగా అయిపోయినప్పుడు.
Mürselat 77:11
మరియు దైవ ప్రవక్తలు ఒక నిర్ణీత కాలం కొరకు సమావేశపరచబడినప్పుడు.
Mürselat 77:12
ఒక గొప్ప దినం కొరకు వారిని వారి జాతులపై సాక్ష్యం పలకటం కొరకు వాయిదా వేయబడ్డారు.
Mürselat 77:13
దాసుల మధ్య తీర్పునిచ్చే దినం కోసం. అప్పుడు సత్యపరుడు అసత్యపరుడి నుండి మరియు పుణ్యాత్ముడు పాపాత్ముడి నుండి స్పష్టమవుతాడు.
Mürselat 77:14
ఓ ప్రవక్తా తీర్పు దినం ఏమిటో మీకు ఏది తెలిపినది ?
Mürselat 77:15
ఆ దినమున అల్లాహ్ వద్ద నుండి ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని తిరస్కరించే తిరస్కారుల కొరకు వినాశనము,యాతన,నష్టము కలుగును.
Mürselat 77:16
ఏమీ మేము పూర్వ సమాజములను వారు అల్లాహ్ ను తిరస్కరించినప్పుడు మరియు తమ ప్రవక్తలను తిరస్కరించినప్పుడు నాశనం చేయలేదా ?!
Mürselat 77:17
ఆ తరువాత మేము వెనుకటి తరాల వారిలో నుంచి తిరస్కారులను వారి వెనుక తీసుకుని వచ్చి వారిని వినాశనమునకు గురి చేసినట్లే వారిని వినాశనమునకు గురి చేస్తాము.
Mürselat 77:18
ఆ సమాజములను నాశనం చేసినట్లే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే ఆపరాదులను మేము నాశనం చేస్తాము.
Mürselat 77:19
ఆ దినమున అపరాదులకు శిక్ష గురించి అల్లాహ్ హెచ్చరికను తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును.
Mürselat 77:20
ఓ ప్రజలారా ఏమీ మేము మిమ్మల్ని హేయమైన అల్పమైన నీటితో సృష్టించలేదా. అది వీర్య బిందువు.
Mürselat 77:21
అయితే మేము ఆ హీనమైన నీటిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము. అది స్త్రీ గర్భాశయం.
Mürselat 77:22
ఒక నిర్ణీత కాలం వరకు అది గర్భం యొక్క కాలం.
Mürselat 77:23
మేము జన్మించే పిల్లవాడి గుణమును,అతని సామర్ధ్యమును,అతని రంగు,ఇతరవాటిని నిర్ణయించాము. మేమే ఈ పూర్తి ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునేవారము.
Mürselat 77:24
ఆ దినమున అల్లాహ్ సామర్ధ్యమును తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును.
Mürselat 77:25
ఏమీ మేము భూమిని ప్రజలందరిని సమీకరించేదిగా చేయలేదా.
Mürselat 77:26
అది వారిలో నుంచి జీవించి ఉన్న వారిని తన పై నివాసమును కల్పించి మరియు వారిలో నుంచి మరణించిన వారిని తనలో ఖననం చేయటం ద్వారా సమీకరిస్తుంది.
Mürselat 77:27
మరియు మేము అందులో స్థిరమైన ఎత్తైన పర్వతాలను చేశాము అవి దాన్ని ప్రకంపించటం నుండి ఆపుతాయి. మరియు ఓ ప్రజలారా మేము మీకు తియ్యటి నీటిని త్రాపించాము. కాబట్టి ఎవరైతే దాన్ని సృష్టించాడో మిమ్మల్ని మరల లేపటం నుండి అశక్తుడు కాడు.
Mürselat 77:28
ఆ దినమున తమపై ఉన్న అల్లాహ్ అనుగ్రహములను తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును.
Mürselat 77:29
మరియు తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వారితో ఇలా పలకబడును : ఓ తిరస్కరించేవారా మీరు తిరస్కరించిన శిక్ష వైపుకు మీరు నడవండి.
Mürselat 77:30
మీరు మూడు శాఖలుగా చీలిపోయిన నరకాగ్ని పొగ నీడ వైపుకు నడవండి.
Mürselat 77:31
అందులో నీడ చల్లదనం ఉండదు. మరియు అది నరకాగ్ని జ్వాలలను,దాని వేడిని మీ వైపునకు ప్రజ్వలించటం నుండి ఆపదు.
Mürselat 77:32
నిశ్ఛయంగా నరకాగ్ని నిప్పు రవ్వలను విసురుతుంది. ప్రతీ నిప్పు రవ్వ తన పెద్దదవటంలో మేడలా ఉంటుంది.
Mürselat 77:33
విసరబడే నిప్పు రవ్వలు తమ నల్లదనంలో మరియు తమ పెద్ద పరిమాణంలో నల్లని ఒంటెలవలె ఉంటాయి.
Mürselat 77:34
ఆ దినమున అల్లాహ్ శిక్షను తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును.
Mürselat 77:35
ఈ రోజు వారు దేని గురించీ మాట్లాడరు.
Mürselat 77:36
వారికి తమ ప్రభువు వద్ద తమ అవిశ్వాసం,తమ పాపముల గురించి సాకులు చెప్పుకోవటానికి అనుమతించబడదు.
Mürselat 77:37
ఆ దినమున ఈ దినపు సమాచారములను తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును.
Mürselat 77:38
ఇది సృష్టితాల మధ్య తీర్పు దినం. మేము మిమ్మల్ని మరియు పూర్వ సమాజములను ఒకే మట్టిలో సమీకరించాము.
Mürselat 77:39
ఒక వేళ మీ కొరకు అల్లాహ్ శిక్ష నుండి విముక్తి కొరకు ఏదైన పన్నాగం ఉంటే నాపై పన్నాగం పన్నండి.
Mürselat 77:40
ఆ దినమున తీర్పు దినమును తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును.
Mürselat 77:41
నిశ్చయంగా తమ ప్రభువు ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడే వారు విశాలమైన స్వర్గము యొక్క వృక్షాల నీడలలో మరియు తీయటి ప్రవహించే నీటి సెలయేరులలో ఉంటారు.
Mürselat 77:42
మరియు వారు తినటానికి కోరుకునే ఫలాల మధ్య ఉంటారు.
Mürselat 77:43
మరియు వారితో ఇలా పలకబడును : మీరు పరిశుద్ధమైన వాటిలో నుంచి తినండి మరియు మీరు ఎటువంటి కలతీ లేని పానియమును హాయిగా త్రాగండి. మీరు ఇహ లోకంలో చేసుకున్న సత్కర్మలకు బదులుగా.
Mürselat 77:44
నిశ్ఛయంగా మేము మీకు ప్రతిఫలం ప్రసాదించినట్లే సజ్జనులకు వారి కర్మల ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
Mürselat 77:45
ఆ దినమున అల్లాహ్ దైవభీతిపరులకు సిద్దం చేసి ఉంచిన వాటిని తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును.
Mürselat 77:46
మరియు సత్యతిరస్కారులతో ఈ విధంగా పలకబడును : మీరు తినండి మరియు ప్రాపంచిక రుచులతో కొంత కాలం ఇహలోకంలో లబ్ది పొందండి. నిశ్చయంగా మీరు అల్లాహ్ పట్ల మీ అవిశ్వాసం వలన మరియు ఆయన ప్రవక్తలను మీరు తిరస్కరించటం వలన అపరాదులయ్యారు.
Mürselat 77:47
ఆ దినమున ప్రతిఫలం దినమున తమకు ప్రసాదించబడే వాటిని తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును.
Mürselat 77:48
ఈ తిరస్కారులందరితో మీరు అల్లాహ్ కొరకు నమాజును చదవండి అంటే వారు ఆయన కొరకు నమాజు చదివేవారు కాదు.
Mürselat 77:49
ఆ దినమున అల్లాహ్ వద్ద నుండి ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని తిరస్కరించే తిరస్కారుల కొరకు వినాశనము,యాతన,నష్టము కలుగును.
Mürselat 77:50
తమ ప్రభువు వద్ద నుండి అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ను విశ్వసించనప్పుడు వారు ఇతర ఏ సందేశాన్ని విశ్వసిస్తారు ?!
Nebe' 78:1
ఈ ముష్రికులందరు తమ వైపు అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పంపించిన తరువాత ఏ నిషయం గురించి పరస్పరం ప్రశ్నించుకుంటున్నారు ?!
Nebe' 78:2
వారు గొప్ప వార్తను గురించి ఒకరినొకరు అడుగుతున్నారు. మరియు అది మరణాంతరం లేపబడటం వార్తకు సంబంధించి వారి ప్రవక్త పై అవతరింపబడిన ఈ ఖుర్ఆను
Nebe' 78:3
ఈ ఖుర్ఆన్ అదే దేని గురించైతే వారు మంత్రజాలమవటం లేదా కవిత్వమవటం లేదా జ్యోతిష్యమవటం లేదా పూర్వికుల కట్టు కధలవటం గురించి వారు తెలుపుతున్న విషయంలో విబేధించుకున్నారు.
Nebe' 78:4
వారు భావించినట్లు విషయం కాదు. ఖుర్ఆన్ ను తిరస్కరించే వీరందరు తమ తిరస్కారము యొక్క దుష్పరిణామమును తొందరలోనే తెలుసుకుంటారు.
Nebe' 78:5
ఆ పిదప వారికి దాని గురించి తాకీదు చేయబడింది.
Nebe' 78:6
ఏమీ మేము భూమిని వారు దానిపై స్థిరంగా ఉండటానికి పాన్పుగా చేయలేదా ?!
Nebe' 78:7
మరియు మేము పర్వతాలను దానిపై అది ప్రకంపించకుండా ఉండటానికి మేకుల స్థానంలో ఉంచాము.
Nebe' 78:8
మరియు మేము ఓ ప్రజలారా మిమ్మల్ని రకరకాలుగా సృష్టించాము : మీలో పురుషులు మరియు స్త్రీలు ఉన్నారు.
Nebe' 78:9
మరియు మీరు విశ్రాంతి తీసుకోవటానికి మేము మీ నిద్రను కర్యకలాపముల నుండి విరామంగా చేశాము.
Nebe' 78:10
మరియు మీరు మీ మర్మావయవాలను కప్పుకునే దుస్తుల మాదిరిగా రాత్రిని తన చీకటి ద్వారా మీకు ఆచ్ఛాదనగా చేశాము.
Nebe' 78:11
మరియు మేము పగలును సంపాదన కోసం మరియు జీవనోపాది శోధన కోసం మైదానముగా చేశాము.
Nebe' 78:12
మరియు మేము మీపై దృఢ నిర్మితమైన మరియు పటిష్ట నిర్మితమైన సప్తాకాశములను నిర్మించాము.
Nebe' 78:13
మరియు మేము సూర్యుడిని తీవ్రంగా వెలిగే మరియు ప్రకాశించే దీపముగా చేశాము.
Nebe' 78:14
మరియు మేము కురవటానికి వేళ అయిన మేఘముల నుండి ఎక్కువగా ఉప్పొంగే నీటిని కురిపించాము.
Nebe' 78:15
దాని ద్వారా మేము రకరకాల ఆహార ధాన్యాలను మరియు రకరకాల మొక్కలను వెలికితీయటానికి.
Nebe' 78:16
మరియు మేము దాని ద్వారా కొమ్మలు అధికంగా ఒక దానిలో ఒకటి చొచ్చబడిన చెట్ల వలన చుట్టబడిన తోటలను వెలికితీశాము.
Nebe' 78:17
నిశ్చయంగా సృష్టి రాశుల మధ్య తీర్పుదినము ఒక వేళతో నిర్ధారితమై నిర్ణీతమై ఉంది. దానికి విరుద్ధంగా జరగదు.
Nebe' 78:18
దైవ దూత బాకాలో రెండవ సారి ఊదిన రోజు ఓ ప్రజలారా మీరు సమూహాలు సమూహాలుగా వస్తారు.
Nebe' 78:19
మరియు ఆకాశము తెరవబడుతుంది అప్పుడు దాని కొరకు తెరవబడిన తలుపుల వలే ద్వారములు అయిపోతాయి.
Nebe' 78:20
మరియు పర్వతాలు నడిపించబడుతాయి చివరికి అవి వ్యాపించబడ్డ దూళిగా మారిపోతాయి. అప్పుడు అవి ఎండమావుల వలె అయిపోతాయి.
Nebe' 78:21
నిశ్ఛయంగా నరకము మాటువేసి వేచి ఉంది.
Nebe' 78:22
దుర్మార్గుల కొరకు అది ఒక మరలే చోటు. వారు దాని వైపునకు మరలి వెళతారు.
Nebe' 78:23
వారు అందులో అంతం లేని యుగాలు కాలాల వరకు ఉంటారు.
Nebe' 78:24
వారు అందులో తమ నుండి నరకాగ్ని వేడిని చల్లబరిచే ఎటువంటి చల్ల గాలి రుచి చూడరు. మరియు వారు అందులో ఆస్వాదించటానికి ఎటువంటి పాణియంను చవిచూడరు.
Nebe' 78:25
మరియు వారు తీవ్రమైన వేడి నీటిని మరియు నరక వాసుల నుండి ప్రవహించే చీముని మాత్రమే చవిచూస్తారు.
Nebe' 78:26
వారు ఉన్న అవిశ్వాసము మరియు అపమార్గమునకు తగిన విధంగా ప్రతిఫలం.
Nebe' 78:27
నిశ్చయంగా వారు ఇహలోకంలో అల్లాహ్ వారిని పరలోకంలో లెక్క తీసుకోవటం నుండి భయపడేవారు కాదు. ఎందుకంటే వారు మరణాంతరం లేపబడటమును విశ్వసించేవారు కాదు. ఒక వేళ వారు మరణాంతరం లేపబడటం నుండి భయపడి ఉంటే అల్లాహ్ ను విశ్వసించి సత్కర్మలు చేసి ఉండేవారు.
Nebe' 78:28
మరియు వారు మన ప్రవక్త పై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరించేవారు.
Nebe' 78:29
మరియు వారి కర్మల్లోంచి ప్రతీ దాన్ని మేము నమోదుచేసి ఉంచాము మరియు లెక్కవేసి ఉంచాము. మరియు అది వారి కర్మల పత్రాలలో వ్రాయబడి ఉంది.
Nebe' 78:30
ఓ మితిమీరే వారా మీరు ఈ శాశ్వత శిక్షను రుచి చూడండి. మేము మీ శిక్షపై శిక్షను మాత్రమే మీపై అధికం చేస్తాము.
Nebe' 78:31
నిశ్చయంగా తమ ప్రభువు ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనతో భయపడే వారి కొరకు సాఫల్య స్థలం కలదు వారు అందులో తాము ఆశించిన దానితో సాఫల్యం చెందుతారు. అది స్వర్గము.
Nebe' 78:32
ఉధ్యానవనాలు మరియు ద్రాక్ష ఫలాలు కలవు.
Nebe' 78:33
పొంగే పరువాలు కల సమవయస్కులైన స్త్రీలు ఉంటారు.
Nebe' 78:34
మద్యముతో నిండిన పాత్ర.
Nebe' 78:35
వారు స్వర్గంలో అసత్య మాటలు వినరు మరియు వారు అబద్దమును వినరు. మరియు వారు ఒకరితో ఒకరు అబద్దము మాట్లాడుకోరు.
Nebe' 78:36
ఇదంతా అల్లాహ్ తన వద్ద నుండి వారికి ప్రసాదించిన తగినంత అనుగ్రహము మరియు ప్రసాదము.
Nebe' 78:37
ఆకాశముల మరియు భూమి ప్రభువు మరియు వాటి మధ్య ఉన్న వాటి ప్రభువు. ఇహలోక,పరలోక కరుణామయుడు. భూమిలో గాని అకాశములో గాని ఉన్న వాటన్నింటికి ఆయన వారికి అనుమతిస్తే తప్ప ఆయనతో మాట్లాడలేరు.
Nebe' 78:38
ఏ రోజునైతే జిబ్రయీలు మరియు దైవదూతలు పంక్తుల్లో నిలబడుతారో కరుణామయుడు అనుమతిస్తే తప్ప ఎవరి కొరకు సిఫారసు గురించి వారు మాట్లాడరు. మరియు వారు తౌహీద్ వాక్కు లాంటి సరైన మాటనే మాట్లాడుతారు.
Nebe' 78:39
మీకు వర్ణించబడినది అది ఆ రోజు దాని వాటిల్లటంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ఎవరైతే అల్లాహ్ శిక్ష నుండి ముక్తి పొందదలచాడో అతడు తన ప్రభువు ఇష్టపడే సత్కర్మలతో దాని వైపునకు మార్గమును తయారు చేసుకోవాలి.
Nebe' 78:40
ఓ ప్రజలారా నిశ్చయంగా మేము దగ్గరలోనే కలిగే శిక్ష నుండి మిమ్మల్ని భయపెట్టాము. ఆ రోజు మనిషి ఇహలోకంలో ముందస్తు పంపించుకున్న తన కర్మను చూసుకుంటాడు. మరియు అవిశ్వాసి శిక్ష నుండి ముక్తిని ఆశిస్తూ ఇలా పలుకుతాడు : అయ్యో ఆ పశువుల మాదిరిగా వేటినైతే ప్రళయదినమున మీరు మట్టి అయిపోండి అని పలకబడినదో నేను కూడా మట్టినైపోతే బాగుండును.
Naziat 79:1
అవిశ్వాసపరుల ఆత్మలను కఠినంగా మరియు బలంగా గుంజే దైవదూతలపై అల్లాహ్ ప్రమాణం చేశాడు.
Naziat 79:2
మరియు విశ్వాసపరుల ఆత్మలను సులువుగా మరియు తేలికగా తీసే దైవదూతలపై ప్రమాణం చేశాడు.
Naziat 79:3
మరియు అల్లాహ్ ఆదేశమును తీసుకుని ఆకాశము నుండి భూమివైపునకు తేలయాడే దైవదూతలపై ప్రమాణం చేశాడు.
Naziat 79:4
మరియు అల్లాహ్ ఆదేశమును నెరవేర్చటంలో ఒకరితో ఒకరు పోటీపడే దైవదూతలపై ప్రమాణం చేశాడు.
Naziat 79:5
దాసుల కార్యముల బాధ్యత అప్పగించబడిన దూతలవలె అల్లాహ్ తమకు ఆదేశించిన వాటిని నెరవేర్చేటటువంటి దూతల పై ఆయన ప్రమాణం చేశాడు. లెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు వారిని ఆయన తప్పకుండా మరల లేపుతాడని వీటన్నింటిపై ప్రమాణం చేశాడు.
Naziat 79:6
ఆ రోజు మొదటి బాకా ఊదబడినప్పుడు భూమి ప్రకంపిస్తుంది
Naziat 79:7
ఈ బాకా వెనుకే రెండవ బాకా ఊదబడుతుంది.
Naziat 79:8
ఆ దినమున కొంత మంది ప్రజల హృదయాలు భయపడుతుంటాయి.
Naziat 79:9
వారి చూపులపై అవమాన ఛాయలు ప్రత్యక్షమై ఉంటాయి.
Naziat 79:10
మరియు వారు ఇలా పలుకుతుండేవారు : ఏమి మేము మరణించిన తరువాత జీవనం వైపునకు మరలుతామా ?.
Naziat 79:11
ఏమీ మేము క్రుశించిపోయి ఖాళీ అయిపోయిన ఎముకలు అయపోయినప్పుడు మరలించబడుతామా ?.
Naziat 79:12
వారు ఇలా పలికారు : మేము మరలినప్పుడు ఆ మరలింపు నష్టము కలిగిస్తుంది, మరలే వారికి నష్టపూరితమైనది.
Naziat 79:13
మరణాంతరం లేపబడే విషయం శులభమైనది. అది కేవలం బాకా ఊదే బాధ్యత కల దూత నుండి ఒక గర్జింపు మాత్రమే.
Naziat 79:14
అప్పుడు అందరు భూమిపై దానిలోపల మృతులుగా ఉన్న తరువాత కూడా జీవించబడుతారు.
Naziat 79:15
ఓ ప్రవక్తా ఏమీ మీ వద్దకు మూసా వార్త ఆయన ప్రభువుతో పాటు మరియు ఆయన శతృవు అయిన ఫిర్ఔన్ తోపాటు మీకు చేరినదా ?!
Naziat 79:16
ఆయనను పరిశుద్ధుడైన ఆయన ప్రభువు పరిశుద్ధ తువా లోయలో పిలిచినప్పుడు.
Naziat 79:17
అతనితో అతను చెప్పిన దాని విషయంలో ఇలా చెప్పాడు : నీవు ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు. నిశ్చయంగా అతడు దుర్మార్గంలో మరియు అహంకారంలో మితిమీరిపోయాడు.
Naziat 79:18
అతడితో నీవు ఇలా పలుకు : ఓ పిర్ఔన్ నీవు అవిశ్వాసము నుండి మరియు పాపకార్యముల నుండి పరిశుద్ధుడివవుతావా ?.
Naziat 79:19
మరియు నిన్ను సృష్టించి,నిన్ను జాగ్రత్తగా చూసుకున్న నీ ప్రభువు వైపునకు నేను మార్గదర్శకం చేస్తే నీవు ఆయనతో భయపడుతావా మరియు ఆయన ఇష్టపడే కార్యములను చేసి ఆయనకు క్రోధాన్ని కలిగించే వాటి నుండి దూరంగా ఉంటావా ?.
Naziat 79:20
అప్పుడు మూసా అలైహిస్సలాం అతని ముందు తాను తన ప్రభువు వద్ద నుండి ప్రవక్త అని సూచించే పెద్ద అద్భుతమును ప్రవేశపెట్టారు. అది చేయి మరియు చేతి కర్ర.
Naziat 79:21
అయితే ఫిర్ఔన్ తో ఈ అద్భుతమును తిరస్కరించటం తప్ప ఇంకేమి జరగ లేదు. మరియు అతను మూసా అలైహిస్సలాం తనకు ఆదేశించిన దాన్ని ఉల్లంఘించాడు.
Naziat 79:22
ఆ తరువాత అతడు అల్లాహ్ పట్ల అవిధేయత చూపటంలో కృషి చేస్తూ మరియు సత్యము పట్ల విముఖత చూపుతూ మూసా అలైహిస్సలాం తీసుకుని వచ్చిన దానిపై విశ్వాసం చూపటం నుండి విముఖత చూపాడు.
Naziat 79:23
అప్పుడు అతడు తన జాతివారిని మరియు తన అనుచరులను మూసా అలైహిస్సలాం పై ఆధిపత్యం చెలాయించటం కొరకు సమీకరించాడు. అప్పుడు ఇలా పలుకుతూ ప్రకటించాడు
Naziat 79:24
నేనే మీ యొక్క మహోన్నత ప్రభువును. కాబట్టి మీపై నాకు తప్ప ఇతరులకు విధేయత చూపే బాధ్యత లేదు.
Naziat 79:25
అల్లాహ్ అతడిని పట్టుకుని ఇహలోకంలో అతడిని సముద్రంలో ముంచి శిక్షించాడు మరియు అతడిని పరలోకంలో తీవ్రమైన శిక్షలో ప్రవేశింపజేసి శిక్షించాడు.
Naziat 79:26
నిశ్ఛయంగా మేము ఫిర్ఔన్ ను ఇహలోకంలో మరియు పరలోకంలో శిక్షించిన దానిలో అల్లాహ్ తో భయపడే వారి కొరకు హితబోధన కలదు. అతడే హితబోధనల ద్వారా ప్రయోజనం చెందుతాడు.
Naziat 79:27
ఓ తిరస్కారులారా మరల లేపి మిమ్మల్ని ఉనికిలోకి తీసుకుని రావటం అల్లాహ్ పై కష్టమా లేదా ఆయన తయారు చేసిన ఆకాశమును ఉనికిలోకి తీసుకు రావటం (కష్టమా) ?!
Naziat 79:28
ఆయన దాని కప్పును పైకి చాలా ఎత్తుగా లేపాడు. దాన్ని సమాంతరంగా క్రమపరిచాడు. అందులో ఎటువంటి పగులు గాని బీట గాని ఎటువంటి లోపముగాని లేదు.
Naziat 79:29
మరియు దాని సూర్యుడు అస్తమించినప్పుడు దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు అది ఉదయించినప్పుడు దాని వెలుగును బహిర్గతం చేశాడు.
Naziat 79:30
ఆకాశమును సృష్టించిన తరువాత భూమిని విస్తరింపజేశాడు. అందులో దాని ప్రయోజనాలను నిక్షిప్తం చేశాడు.
Naziat 79:31
దాని నుండి దాని నీటిని ప్రవహించే సెలయేరుల రూపంలో వెలికి తీశాడు. మరియు పశువులు మేసే మొక్కలను అందులో మొలకెత్తించాడు.
Naziat 79:32
మరియు పర్వతములను భూమిపై స్థిరంగా నాటాడు.
Naziat 79:33
ఓ ప్రజలారా ఇవన్ని మీకు మరియు మీ పశువులకు ప్రయోజనములు. వీటన్నింటిని సృష్టించినవాడు వారిని సరి క్రొత్త రూపంలో మరలించటం నుండి అశక్తుడు కాడు.
Naziat 79:34
తన భయానక పరిస్థితులతో ప్రతీ వస్తువును కప్పివేసే రెండవ బాకా వచ్చినప్పుడు. మరియు ప్రళయం వస్తుంది.
Naziat 79:35
అది వచ్చిన రోజు మనిషి తాను చేసిన దాన్ని గుర్తు చేసుకుంటాడు అది మంచి అయినా గాని చెడు అయినా గాని.
Naziat 79:36
మరియు నరకం తీసుకు రాబడుతుంది. దాన్ని చూసే వారి కొరకు ప్రత్యక్షంగా బహిర్గతం చేయబడుతుంది.
Naziat 79:37
ఇక అపమార్గంలో ఎవరైతే హద్దును అతిక్రమిస్తాడో
Naziat 79:38
మరియు నిత్యం ఉండే పరలోక జీవితంపై అంతమైపోయే ఇహలోక జీవితమును ప్రాధాన్యతనిచ్చాడో
Naziat 79:39
నిశ్చయంగా నరకాగ్ని అతను శరణు తీసుకునే అతని నివాస స్థలమవును.
Naziat 79:40
మరియు ఎవరైతే తన ప్రభువు ముందట తాను నిలబడటం నుండి భయపడి అల్లాహ్ నిషేదించిన వాటిలో నుండి తన మనోవాంఛలను అనుసరించటం నుండి తన మనసును ఆపుకున్నాడో అతను శరణు తీసుకునే అతని నివాస స్థలం స్వర్గము.
Naziat 79:41
మరియు ఎవరైతే తన ప్రభువు ముందట తాను నిలబడటం నుండి భయపడి అల్లాహ్ నిషేదించిన వాటిలో నుండి తన మనోవాంఛలను అనుసరించటం నుండి తన మనసును ఆపుకున్నాడో అతను శరణు తీసుకునే అతని నివాస స్థలం స్వర్గము.
Naziat 79:42
ఓ ప్రవక్తా మరణాంతరం లేపబడటంను తిరస్కరించే వీరందరు ప్రళయం ఎప్పుడు వాటిల్లుతుందని మిమ్మల్ని అడుగుతున్నారు.
Naziat 79:43
దాని గురించి మీకు ఎటువంటి జ్ఞానం లేదు చివరికి మీరు దాన్ని వారికి తెలియపరచటానికి. మరియు అది మీ విషయం కాదు. మీ విషయం మాత్రం మీరు దాని కొరకు సిద్ధం కావటం.
Naziat 79:44
నీ ప్రభువు ఒక్కడి వద్దే ప్రళయం యొక్క జ్ఞానం ముగింపు ఉన్నది.
Naziat 79:45
నువ్వు మాత్రం ప్రళయం నుండి భయపడే వారికి హెచ్చరించే వాడివి. ఎందుకంటే నీ హెచ్చరికతో ప్రయోజనం చెందేవాడు అతడే.
Naziat 79:46
ఏ రోజైతే వారు ప్రళయమును కళ్లారా చూస్తారో వారు తమ ఇహలోక జీవితంలో ఒక రోజు సాయంత్రం వేళను లేదా దాని ఉదయం వేళను గడిపినట్లు ఉంటారు.