Telugu Mokhtasar — Abese 80:1 – Nas 114:6
Contents
- Abese 80:1
- Abese 80:2
- Abese 80:3
- Abese 80:4
- Abese 80:5
- Abese 80:6
- Abese 80:7
- Abese 80:8
- Abese 80:9
- Abese 80:10
- Abese 80:11
- Abese 80:12
- Abese 80:13
- Abese 80:14
- Abese 80:15
- Abese 80:16
- Abese 80:17
- Abese 80:18
- Abese 80:19
- Abese 80:20
- Abese 80:21
- Abese 80:22
- Abese 80:23
- Abese 80:24
- Abese 80:25
- Abese 80:26
- Abese 80:27
- Abese 80:28
- Abese 80:29
- Abese 80:30
- Abese 80:31
- Abese 80:32
- Abese 80:33
- Abese 80:34
- Abese 80:35
- Abese 80:36
- Abese 80:37
- Abese 80:38
- Abese 80:39
- Abese 80:40
- Abese 80:41
- Abese 80:42
- Tekvir 81:1
- Tekvir 81:2
- Tekvir 81:3
- Tekvir 81:4
- Tekvir 81:5
- Tekvir 81:6
- Tekvir 81:7
- Tekvir 81:8
- Tekvir 81:9
- Tekvir 81:10
- Tekvir 81:11
- Tekvir 81:12
- Tekvir 81:13
- Tekvir 81:14
- Tekvir 81:15
- Tekvir 81:16
- Tekvir 81:17
- Tekvir 81:18
- Tekvir 81:19
- Tekvir 81:20
- Tekvir 81:21
- Tekvir 81:22
- Tekvir 81:23
- Tekvir 81:24
- Tekvir 81:25
- Tekvir 81:26
- Tekvir 81:27
- Tekvir 81:28
- Tekvir 81:29
- İnfitar 82:1
- İnfitar 82:2
- İnfitar 82:3
- İnfitar 82:4
- İnfitar 82:5
- İnfitar 82:6
- İnfitar 82:7
- İnfitar 82:8
- İnfitar 82:9
- İnfitar 82:10
- İnfitar 82:11
- İnfitar 82:12
- İnfitar 82:13
- İnfitar 82:14
- İnfitar 82:15
- İnfitar 82:16
- İnfitar 82:17
- İnfitar 82:18
- İnfitar 82:19
- Mütaffifin 83:1
- Mütaffifin 83:2
- Mütaffifin 83:3
- Mütaffifin 83:4
- Mütaffifin 83:5
- Mütaffifin 83:6
- Mütaffifin 83:7
- Mütaffifin 83:8
- Mütaffifin 83:9
- Mütaffifin 83:10
- Mütaffifin 83:11
- Mütaffifin 83:12
- Mütaffifin 83:13
- Mütaffifin 83:14
- Mütaffifin 83:15
- Mütaffifin 83:16
- Mütaffifin 83:17
- Mütaffifin 83:18
- Mütaffifin 83:19
- Mütaffifin 83:20
- Mütaffifin 83:21
- Mütaffifin 83:22
- Mütaffifin 83:23
- Mütaffifin 83:24
- Mütaffifin 83:25
- Mütaffifin 83:26
- Mütaffifin 83:27
- Mütaffifin 83:28
- Mütaffifin 83:29
- Mütaffifin 83:30
- Mütaffifin 83:31
- Mütaffifin 83:32
- Mütaffifin 83:33
- Mütaffifin 83:34
- Mütaffifin 83:35
- Mütaffifin 83:36
- İnşikak 84:1
- İnşikak 84:2
- İnşikak 84:3
- İnşikak 84:4
- İnşikak 84:5
- İnşikak 84:6
- İnşikak 84:7
- İnşikak 84:8
- İnşikak 84:9
- İnşikak 84:10
- İnşikak 84:11
- İnşikak 84:12
- İnşikak 84:13
- İnşikak 84:14
- İnşikak 84:15
- İnşikak 84:16
- İnşikak 84:17
- İnşikak 84:18
- İnşikak 84:19
- İnşikak 84:20
- İnşikak 84:21
- İnşikak 84:22
- İnşikak 84:23
- İnşikak 84:24
- İnşikak 84:25
- Büruc 85:1
- Büruc 85:2
- Büruc 85:3
- Büruc 85:4
- Büruc 85:5
- Büruc 85:6
- Büruc 85:7
- Büruc 85:8
- Büruc 85:9
- Büruc 85:10
- Büruc 85:11
- Büruc 85:12
- Büruc 85:13
- Büruc 85:14
- Büruc 85:15
- Büruc 85:16
- Büruc 85:17
- Büruc 85:18
- Büruc 85:19
- Büruc 85:20
- Büruc 85:21
- Büruc 85:22
- Târık 86:1
- Târık 86:2
- Târık 86:3
- Târık 86:4
- Târık 86:5
- Târık 86:6
- Târık 86:7
- Târık 86:8
- Târık 86:9
- Târık 86:10
- Târık 86:11
- Târık 86:12
- Târık 86:13
- Târık 86:14
- Târık 86:15
- Târık 86:16
- Târık 86:17
- A'lâ 87:1
- A'lâ 87:2
- A'lâ 87:3
- A'lâ 87:4
- A'lâ 87:5
- A'lâ 87:6
- A'lâ 87:7
- A'lâ 87:8
- A'lâ 87:9
- A'lâ 87:10
- A'lâ 87:11
- A'lâ 87:12
- A'lâ 87:13
- A'lâ 87:14
- A'lâ 87:15
- A'lâ 87:16
- A'lâ 87:17
- A'lâ 87:18
- A'lâ 87:19
- Gâşiye 88:1
- Gâşiye 88:2
- Gâşiye 88:3
- Gâşiye 88:4
- Gâşiye 88:5
- Gâşiye 88:6
- Gâşiye 88:7
- Gâşiye 88:8
- Gâşiye 88:9
- Gâşiye 88:10
- Gâşiye 88:11
- Gâşiye 88:12
- Gâşiye 88:13
- Gâşiye 88:14
- Gâşiye 88:15
- Gâşiye 88:16
- Gâşiye 88:17
- Gâşiye 88:18
- Gâşiye 88:19
- Gâşiye 88:20
- Gâşiye 88:21
- Gâşiye 88:22
- Gâşiye 88:23
- Gâşiye 88:24
- Gâşiye 88:25
- Gâşiye 88:26
- Fecr 89:1
- Fecr 89:2
- Fecr 89:3
- Fecr 89:4
- Fecr 89:5
- Fecr 89:6
- Fecr 89:7
- Fecr 89:8
- Fecr 89:9
- Fecr 89:10
- Fecr 89:11
- Fecr 89:12
- Fecr 89:13
- Fecr 89:14
- Fecr 89:15
- Fecr 89:16
- Fecr 89:17
- Fecr 89:18
- Fecr 89:19
- Fecr 89:20
- Fecr 89:21
- Fecr 89:22
- Fecr 89:23
- Fecr 89:24
- Fecr 89:25
- Fecr 89:26
- Fecr 89:27
- Fecr 89:28
- Fecr 89:29
- Fecr 89:30
- Beled 90:1
- Beled 90:2
- Beled 90:3
- Beled 90:4
- Beled 90:5
- Beled 90:6
- Beled 90:7
- Beled 90:8
- Beled 90:9
- Beled 90:10
- Beled 90:11
- Beled 90:12
- Beled 90:13
- Beled 90:14
- Beled 90:15
- Beled 90:16
- Beled 90:17
- Beled 90:18
- Beled 90:19
- Beled 90:20
- Şems 91:1
- Şems 91:2
- Şems 91:3
- Şems 91:4
- Şems 91:5
- Şems 91:6
- Şems 91:7
- Şems 91:8
- Şems 91:9
- Şems 91:10
- Şems 91:11
- Şems 91:12
- Şems 91:13
- Şems 91:14
- Şems 91:15
- Leyl 92:1
- Leyl 92:2
- Leyl 92:3
- Leyl 92:4
- Leyl 92:5
- Leyl 92:6
- Leyl 92:7
- Leyl 92:8
- Leyl 92:9
- Leyl 92:10
- Leyl 92:11
- Leyl 92:12
- Leyl 92:13
- Leyl 92:14
- Leyl 92:15
- Leyl 92:16
- Leyl 92:17
- Leyl 92:18
- Leyl 92:19
- Leyl 92:20
- Leyl 92:21
- Duhâ 93:1
- Duhâ 93:2
- Duhâ 93:3
- Duhâ 93:4
- Duhâ 93:5
- Duhâ 93:6
- Duhâ 93:7
- Duhâ 93:8
- Duhâ 93:9
- Duhâ 93:10
- Duhâ 93:11
- İnşirah 94:1
- İnşirah 94:2
- İnşirah 94:3
- İnşirah 94:4
- İnşirah 94:5
- İnşirah 94:6
- İnşirah 94:7
- İnşirah 94:8
- Tin 95:1
- Tin 95:2
- Tin 95:3
- Tin 95:4
- Tin 95:5
- Tin 95:6
- Tin 95:7
- Tin 95:8
- Alak 96:1
- Alak 96:2
- Alak 96:3
- Alak 96:4
- Alak 96:5
- Alak 96:6
- Alak 96:7
- Alak 96:8
- Alak 96:9
- Alak 96:10
- Alak 96:11
- Alak 96:12
- Alak 96:13
- Alak 96:14
- Alak 96:15
- Alak 96:16
- Alak 96:17
- Alak 96:18
- Alak 96:19
- Kadr 97:1
- Kadr 97:2
- Kadr 97:3
- Kadr 97:4
- Kadr 97:5
- Beyyine 98:1
- Beyyine 98:2
- Beyyine 98:3
- Beyyine 98:4
- Beyyine 98:5
- Beyyine 98:6
- Beyyine 98:7
- Beyyine 98:8
- Zilzal 99:1
- Zilzal 99:2
- Zilzal 99:3
- Zilzal 99:4
- Zilzal 99:5
- Zilzal 99:6
- Zilzal 99:7
- Zilzal 99:8
- Adiyat 100:1
- Adiyat 100:2
- Adiyat 100:3
- Adiyat 100:4
- Adiyat 100:5
- Adiyat 100:6
- Adiyat 100:7
- Adiyat 100:8
- Adiyat 100:9
- Adiyat 100:10
- Adiyat 100:11
- Karia 101:1
- Karia 101:2
- Karia 101:3
- Karia 101:4
- Karia 101:5
- Karia 101:6
- Karia 101:7
- Karia 101:8
- Karia 101:9
- Karia 101:10
- Karia 101:11
- Tekâsür 102:1
- Tekâsür 102:2
- Tekâsür 102:3
- Tekâsür 102:4
- Tekâsür 102:5
- Tekâsür 102:6
- Tekâsür 102:7
- Tekâsür 102:8
- Asr 103:1
- Asr 103:2
- Asr 103:3
- Hümezeh 104:1
- Hümezeh 104:2
- Hümezeh 104:3
- Hümezeh 104:4
- Hümezeh 104:5
- Hümezeh 104:6
- Hümezeh 104:7
- Hümezeh 104:8
- Hümezeh 104:9
- Fil 105:1
- Fil 105:2
- Fil 105:3
- Fil 105:4
- Fil 105:5
- Kureyş 106:1
- Kureyş 106:2
- Kureyş 106:3
- Kureyş 106:4
- Mâûn 107:1
- Mâûn 107:2
- Mâûn 107:3
- Mâûn 107:4
- Mâûn 107:5
- Mâûn 107:6
- Mâûn 107:7
- Kevser 108:1
- Kevser 108:2
- Kevser 108:3
- Kâfirun 109:1
- Kâfirun 109:2
- Kâfirun 109:3
- Kâfirun 109:4
- Kâfirun 109:5
- Kâfirun 109:6
- Nasr 110:1
- Nasr 110:2
- Nasr 110:3
- Tebbet 111:1
- Tebbet 111:2
- Tebbet 111:3
- Tebbet 111:4
- Tebbet 111:5
- İhlas 112:1
- İhlas 112:2
- İhlas 112:3
- İhlas 112:4
- Felak 113:1
- Felak 113:2
- Felak 113:3
- Felak 113:4
- Felak 113:5
- Nas 114:1
- Nas 114:2
- Nas 114:3
- Nas 114:4
- Nas 114:5
- Nas 114:6
Abese 80:1
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నుదిటిపై మడతలు పడేటట్లు చేశారు మరియు ముఖం త్రిప్పుకున్నారు.
Abese 80:2
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమ్మె మక్తూమ్ ఆయనతో సన్మార్గమును కోరుతూ రావటం వలన. మరియు ఆయన గ్రుడ్డివారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముష్రికుల పెద్ద వారితో వారి సన్మార్గమును ఆశిస్తూ నిమగ్నమై ఉండగా ఆయన వచ్చారు.
Abese 80:3
ఓ ప్రవక్త మీకేమి తెలుసు బహుశా ఈ గ్రుడ్డి వాడు తన పాపముల నుండి పరిశుద్ధుడవుతాడేమో ?!
Abese 80:4
లేదా మీ నుండి ఆయన విన్న హితోపదేశముల ద్వారా హితబోధన గ్రహించి వాటి ద్వారా ప్రయోజనం చెందుతాడేమో.
Abese 80:5
ఇక ఎవడైతే తన వద్ద ఉన్నసంపద వలన మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటం నుండి తన స్వయం పట్ల నిర్లక్ష్యం వహించాడో.
Abese 80:6
అతని కొరకు మీరు ఆసక్తి చూపి అతని వైపు ముందడుగు వేస్తున్నారు.
Abese 80:7
ఒక వేళ అతడు తన పాపముల నుండి అల్లాహ్ యందు పశ్ఛాత్తాపముతో పరిశుద్ధుడు కానప్పుడు నీకేమగును.
Abese 80:8
మరియు ఎవరైతే మేలును వెతుకుతూ నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చాడో
Abese 80:9
మరియు అతడు తన ప్రభువుతో భయపడుతున్నాడో
Abese 80:10
మీరు అతనిపట్ల నిర్లక్ష్యం చేసి ఇతరులైన ముష్రికుల పెద్దవారి పట్ల శ్రద్ధ చూపుతున్నారు.
Abese 80:11
విషయం అది కాదు. అది మాత్రం స్వీకరించేవారి కొరకు ఒక హితోపదేశము మాత్రమే.
Abese 80:12
ఎవరైతే అల్లాహ్ ను స్మరించదలచాడో ఆయనను స్మరించాలి మరియు ఈ ఖుర్ఆన్ లో ఉన్న వాటి ద్వారా హితబోధన గ్రహించాలి.
Abese 80:13
ఈ ఖుర్ఆన్ దైవదూతల వద్ద ప్రతిష్టాకరమైన పుటలలో ఉన్నది.
Abese 80:14
ఉన్నత ప్రదేశంలో ఉంచబడి ఉంది, పవిత్రమైనది దానికి ఎటువంటి మలినము గాని అశుద్ధత గాని తగలదు.
Abese 80:15
మరియు అది దైవదూతల్లోంచి లేఖకుల చేతుల్లో ఉంది.
Abese 80:16
తమ ప్రభువు వద్ద గౌరవంతులు వారు, మంచిని,విధేయ కార్యములను అధికంగా చేసేవారు.
Abese 80:17
కృతఘ్నుడైన మానవుడు నాశనం గాను. అతడు అల్లాహ్ పట్ల ఎంత కృతఘ్నుడు.
Abese 80:18
అల్లాహ్ అతడిని ఏ వస్తువుతో సృష్టించాడు చివరికి అతడు భూమిలో అహంకారమును చూపుతున్నాడు మరియు ఆయనను తిరస్కరిస్తున్నాడు ?!
Abese 80:19
అల్పమైన నీటితో అతన్ని సృష్టించాడు. అతని సృష్టిని ఒక దశ తరువాత ఇంకొక దశగా తీర్చిదిద్దాడు.
Abese 80:20
ఈ దశల తరువాత అతని కొరకు అతని తల్లి కడుపు నుండి బయటకు వచ్చే మార్గమును శులభతరం చేశాడు.
Abese 80:21
ఆ పిదప అతనికి జీవితంలో ఆయుషును నిర్ధారించిన తరువాత అతనికి మరణమును ప్రసాదించాడు. మరియు అతని కొరకు సమాదిని ఏర్పరచాడు అందులో అతడు మరణాంతరం లేపబడే వరకు ఉండిపోతాడు.
Abese 80:22
ఆ తరువాత అతను తలచినప్పుడు లెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు అతడిని మరల లేపుతాడు.
Abese 80:23
ఈ అవిశ్వాసపరుడు తనపై ఉన్న తన ప్రభువు హక్కును నెరవేర్చాడని భావిస్తున్నట్లు విషయం కాదు. అతడు తనపై అల్లాహ్ అనివార్యం చేసిన విధులను నెరవేర్చలేదు.
Abese 80:24
అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే మానవుడు తాను తినే ఆహారం ఎలా లభించినదో గమనించాలి.
Abese 80:25
దాని మూలము ఆకాశము నుండి ధారాపాతంగా,బలంగా కురిసే వర్షం నుండి వచ్చింది.
Abese 80:26
ఆ తరువాత మేము భూమిని చీల్చాము. అది మొక్కలతో చీలిపోయింది.
Abese 80:27
అప్పుడు మేము గోదుమ,మొక్కజొన్న మరియు ఇతర ధాన్యాలను అందులో మొలకెత్తించాము.
Abese 80:28
మరియు మేము అందులో ద్రాక్ష పండ్లను మరియు కూరగాయలను మొలకెత్తించాము వారి పశువులకు మేత అవటానికి.
Abese 80:29
మరియు మేము అందులో ఆలివ్ (జైతూన్) ను మరియు ఖర్జూరములను మొలకెత్తించాము.
Abese 80:30
మరియు మేము అందులో అధికముగా వృక్షములు గల తోటలను మొలకెత్తించాము.
Abese 80:31
మరియు మేము అందులో ఫలములను మొలకెత్తించాము మరియు అందులో మీ పశువులు మేసే వాటిని మొలకెత్తించాము.
Abese 80:32
మీ ప్రయోజనం కొరకు మరియు మీ పశువుల ప్రయోజనం కొరకు.
Abese 80:33
చెవులను చెవిటిగా చేసే పెద్ద ధ్వని వచ్చినప్పుడు మరియు అది రెండవ బాకా.
Abese 80:34
ఆ రోజు మనిషి తన సోదరుడి నుండి పారిపోతాడు.
Abese 80:35
మరియు అతడు తన తల్లి నుండి,తండ్రి నుండి పారిపోతాడు.
Abese 80:36
మరియు తన భార్య నుండి,తన సంతానము నుండి పారిపోతాడు.
Abese 80:37
ఆ దినమును బాధ తీవ్రత వలన వారిలో నుండి ప్రతి ఒక్కరికి ఇంకొకరి నుండి నిర్లక్ష్యం వహించే స్థితి ఉంటుంది.
Abese 80:38
ఆ రోజున పుణ్యాత్ముల ముఖములు కాంతివంతంగా ఉంటాయి.
Abese 80:39
అల్లాహ్ వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన తన కారుణ్యం వలన సంతోషముతో ఆహ్లాదకరంగా ఉంటారు.
Abese 80:40
దుష్టుల ముఖములపై ఆ రోజున దుమ్ము చేరి ఉంటుంది.
Abese 80:41
వారిపై చీకటి కమ్ముకుని ఉంటుంది.
Abese 80:42
ఈ పరిస్థితితో వర్ణించబడిన వీరందరే అవిశ్వాసము మరియు దుష్కర్మల మధ్య సమీకరించబడ్డారు.
Tekvir 81:1
సూర్యుని ఆకారము సమీకరించబడి దాని వెలుగు తొలగిపోయినప్పుడు.
Tekvir 81:2
మరియు నక్షత్రములు రాలిపోయి వాటి కాంతి తుడిచివేయబడినప్పుడు.
Tekvir 81:3
మరియు పర్వతములు తమ స్థానము నుండి కదిలించబడినప్పుడు.
Tekvir 81:4
యజమానులు తాము పోటీపడేటటువంటి గర్భిణీ ఒంటెలను నిర్లక్ష్యంగా వదిలివేసినప్పుడు
Tekvir 81:5
మరియు కృూరమృగాలు మానవులతో పాటు ఒకే నేలలో సమీకరించబడినప్పుడు.
Tekvir 81:6
మరియు సముద్రాలు వెలిగించబడినప్పుడు చివరికి అవి అగ్నిగా అయిపోతాయి.
Tekvir 81:7
మరియు ప్రాణములు తమ లాంటి వారితో కలిపివేయబడినప్పుడు. అప్పుడు దుష్టుడు దుష్టునితో మరియు దైవబీతిపరుడు దైవబీతిపరునితో కలిపివేయబడుతాడు.
Tekvir 81:8
మరియు పూడ్చబడిన ఆడ పిల్ల అది జీవించి ఉన్నప్పుడు అల్లాహ్ దానిని ప్రశించినప్పుడు.
Tekvir 81:9
నిన్ను హతమార్చినవాడు ఏ పాపము వలన నిన్ను హతమార్చాడు ?!
Tekvir 81:10
మరియు దాసుల కర్మల పుస్తకములు తెరవబడినప్పుడు ప్రతి ఒక్కడు తమ కర్మల పుస్తకమును చదవటానికి.
Tekvir 81:11
మరియు ఆకాశము మేక నుండి తోలు ఒలిచివేయబడినట్లు ఒలిచివేయబడినప్పుడు
Tekvir 81:12
మరియు నరకాగ్ని వెలిగించబడినప్పుడు.
Tekvir 81:13
మరియు స్వర్గం దైవభాతిపరులకు దగ్గర చేయబడినప్పుడు.
Tekvir 81:14
ఇవి సంభవించినప్పుడు ప్రతి ప్రాణి తాను ఆ రోజు కొరకు ఏమి చేసుకున్నాడో తెలుసుకుంటుంది.
Tekvir 81:15
దాగిన నక్షత్రాలపై అల్లాహ్ అవి రాత్రి ప్రత్యక్షం కాక ముందే ప్రమాణం చేశాడు.
Tekvir 81:16
తమ కక్ష్యల్లో ప్రకాశించేవి అవి జింకలు తాము దాక్కొనే ప్రదేశంలో అంటే తమ ఇండ్లలోకి ప్రవేశించే మాదిరిగా తెల్లవారగానే కనుమరుగవుతాయి.
Tekvir 81:17
మరియు ఆయన రాత్రి మొదటి వేళ అది వచ్చినప్పుడు మరియు దాని చివరి వేళ అది వెళ్ళినప్పుడు ప్రమాణం చేశాడు
Tekvir 81:18
మరియు ఆయన ఉదయంపై దాని కాంతి ఉదయించినప్పుడు ప్రమాణం చేశాడు.
Tekvir 81:19
నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు దాన్ని నీతి మంతుడైన ఒక దైవదూత చేరవేశాడు. ఆయనే జిబ్రయీల్ అలైహిస్సలాం. అల్లాహ్ ఆయనపై నమ్మకం ఉంచాడు.
Tekvir 81:20
మహాబలవంతుడు, పరిశుద్ధుడైన సింహాసన యజమాని వద్ద ఉన్నత స్థానం కలవాడు.
Tekvir 81:21
ఆకాశ వాసులు అతనిపై విధేయత చూపుతారు. ఆయన చేరవేసే దైవ వాణి విషయంలో నమ్మకస్తుడు.
Tekvir 81:22
మీతోపాటే ఉండే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు అతని బుద్ధి గురించి,అతని నీతి గురించి,అతని నిజాయితీ గురించి తెలుసు. అతడు మీరు నిందమోపినట్లు పిచ్చివాడు కాదు.
Tekvir 81:23
మరియు నిశ్ఛయంగా మీ సహచరుడు జిబ్రయీల్ ను స్పష్టమైన ఆకాశపు అంచులపై ఆయన సృష్టించబడిన ఆయన రూపములో చూశాడు.
Tekvir 81:24
మరియు మీ సహచరుడు మీకు చేరవేయమని అతనికి ఆదేశించబడిన వాటిని మీకు చేరవేయటంలో మీయందు పిసినారి కాదు. మరియు అతడు జ్యోతిష్యులు తీసుకున్నట్లు ఎటువంటి వేతనం తీసుకోడు.
Tekvir 81:25
మరియు ఈ ఖుర్ఆన్ దైవ కారుణ్యము నుండి ధూత్కరించబడిన షైతాను వాక్కు కాదు.
Tekvir 81:26
అయితే ఈ వాదనల తరువాత అది అల్లాహ్ వద్ద నుండి అన్న దానికి నిరాకరించటమునకు మీరు ఏ మార్గములో నడుస్తారు ?!
Tekvir 81:27
ఖుర్ఆన్ జిన్నులకు మరియు మానవులకు ఒక జ్ఞాపిక మరియు హితోపదేశం మాత్రమే.
Tekvir 81:28
మీలో నుండి సత్య మార్గంపై తిన్నగా నడవదలచిన వారి కొరకు.
Tekvir 81:29
తిన్నగా ఉండటము గాని ఇతర వాటిగా గాని అల్లాహ్ తలచుకుంటే తప్ప మీరు తలచుకోలేరు. ఆయన సృష్టి రాసులన్నింటి ప్రభువు.
İnfitar 82:1
మరియు ఆకాశము దాని నుండి దైవదూతలు దిగటానికి చీలిపోయినప్పుడు.
İnfitar 82:2
మరియు నక్షత్రాలు రాలిపోయి చెల్లాచెదురైపోయినప్పుడు.
İnfitar 82:3
మరియు సముద్రాలు ఒకదానిపై ఒకటి తెరవబడి కలిసిపోయినప్పుడు.
İnfitar 82:4
మరియు సమాధులు అందులో ఉన్న మృతులు లేపబడటానికి వాటి మట్టి పెళ్ళగింపబడినప్పుడు.
İnfitar 82:5
అప్పుడు ప్రతీ మనిషి తాను చేసుకున్న ఆచరరణను మరియు తాను చేయకుండా వెనుక వదిలేసిన ఆచరణను తెలుసుకుంటాడు.
İnfitar 82:6
ఓ తన ప్రభువును తిరస్కరించే మానవుడా తన వద్ద నుండి దాతృతంగా నిన్ను శిక్షించటంలో తొందర చేయకుండా నీకు గడువునిచ్చిన నీ ప్రభువు ఆదేశమును విభేదించేటట్లు ఏది చేసింది ?.
İnfitar 82:7
ఆయనే నీవు ఉనికిలో లేని తరువాత నీకు ఉనికిని ప్రసాదించాడు. మరియు నిన్ను సరైన,తగిన పరిమాణంలో ఉన్న అవయవాలు కలిగిన వాడిగా తీర్చి దిద్దాడు.
İnfitar 82:8
ఆయన నిన్ను ఏ రూపంలో సృష్టించదలిచాడో ఆ రూపంలో నిన్ను సృష్టించాడు. మరియు నిశ్చయంగా ఆయన నిన్ను గాడిద రూపంలో గాని కోతి రూపంలో గాని కుక్క రూపంలో గాని ఇతర వాటిలా గాని సృష్టించకుండా నీపై ఉపకారం చేశాడు.
İnfitar 82:9
ఓ నిర్లక్ష్యం వహించేవారా (మోసపోయినవారా) మీరు భావించినట్లు విషయం కాదు. కాని మీరు ప్రతిఫల దినమును తిరస్కరిస్తున్నారు. కావున మీరు దాని కొరకు ఆచరించటం లేదు.
İnfitar 82:10
మరియు నిశ్ఛయంగా మీపై దైవదూతలు కనిపెట్టుకుని వారు మీ కర్మలను నమోదు చేస్తున్నారు.
İnfitar 82:11
వారు అల్లాహ్ వద్ద గౌరవోన్నతులు,లేఖకులు మీ కర్మలను వ్రాస్తున్నారు.
İnfitar 82:12
మీరు చేస్తున్న కర్మను వారు తెలుసుకుని దాన్ని వ్రాస్తున్నారు.
İnfitar 82:13
నిశ్చయంగా మంచిని,విధేయ కార్యములను అధికంగా చేసేవారు ప్రళయదినమున శాశ్వత అనుగ్రహాల్లో ఉంటారు.
İnfitar 82:14
మరియు నిశ్చయంగా పాపాలను చేసేవారు నరకాగ్నిలో ఉంటారు. అది వారిపై మండించబడుతుంది.
İnfitar 82:15
వారు అందులో ప్రతిఫలదినమున ప్రవేశిస్తారు. దాని వేడిని కళ్ళారా చూస్తారు.
İnfitar 82:16
వారు దాని నుండి ఎన్నటికి అదృశ్యమవరు. అంతే కాదు వారు అందులో శాశ్వతంగా ఉంటారు.
İnfitar 82:17
ఓ ప్రవక్తా ప్రతిఫల దినం ఏమిటో మీకు ఏమి తెలుసు ?.
İnfitar 82:18
ఆ పిదప ప్రతిఫల దినం ఏమిటో మీకేమి తెలుసు ?!
İnfitar 82:19
ఆ రోజు ఎవరూ ఎవరికి లాభం చేకూర్చ లేడు.ఆ రోజు పూర్తి వ్వవహారము అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. ఆయన తాను తలచుకున్న దానితో నిర్వహిస్తాడు. ఆయనకు తప్ప ఎవరికి చెందదు.
Mütaffifin 83:1
కొలతల్లో,తూనికలలో తగ్గించి ఇచ్చేవారి కొరకు వినాశనము,నష్టము కలదు.
Mütaffifin 83:2
వారు ఇతరుల నుండి కొలిచి తీసుకున్నప్పుడు తగ్గించకుండా పూర్తిగా తమ హక్కును తీసుకుంటారు.
Mütaffifin 83:3
మరియు వారు ప్రజలకు కొలచి ఇచ్చినప్పుడు లేదా వారికి తూకమేసి ఇచ్చినప్పుడు కొలవటంలో,తూకమేయటంలో తగ్గించి ఇచ్చేవారు. మరియు ఈ పరిస్థితి మదీనా వాసులది దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు హిజ్రత్ చేసి వచ్చినప్పుడు ఉండేది.
Mütaffifin 83:4
ఏమీ ఈ దుష్కార్యమునకు పాల్పడేవారు అల్లాహ్ వద్దకు మరల లేపబడి వెళతారని నమ్మకం లేదా ?!
Mütaffifin 83:5
ఒక గొప్ప దినములో లెెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు అందులో ఉన్న పరీక్ష మరియు భయాందోళనల వలన.
Mütaffifin 83:6
ఆ దినమున ప్రజలు లెక్క కొరకు సృష్టితాలందరి ప్రభువు ముందు నిలబడుతారు.
Mütaffifin 83:7
మరణాంతరం మరల లేపబడటం లేదని మీరు భావించినట్లు విషయం కాదు. నిశ్చయంగా అవిశ్వాసపరులైన,కపటులైన పాపాత్ముల కర్మల పుస్తకములు అత్యంత క్రిందటి భూమిలో నష్టములో ఉంటాయి.
Mütaffifin 83:8
ఓ ప్రవక్తా సిజ్జీన్ ఏమిటో మీకు ఏమి తెలుసు ?.
Mütaffifin 83:9
నిశ్ఛయంగా వారి కర్మల పుస్తకం చెదరదు అందులో అధికం చేయబడదు మరియు తరగించబడదు.
Mütaffifin 83:10
సత్య తిరస్కారుల కొరకు ఆ రోజు వినాశనం,నష్టము కలదు.
Mütaffifin 83:11
ఎవరైతే అల్లాహ్ ఇహ లోకంలో తన దాసులు చేసుకున్న వారి కర్మల ప్రతిఫలం ప్రసాదించే దినమును తిరస్కరిస్తారో వారికి.
Mütaffifin 83:12
అల్లాహ్ హద్దులను అతిక్రమించే అధిక పాపములు కల ప్రతి ఒక్కరు ఆ దినమును తిరస్కరిస్తారు.
Mütaffifin 83:13
మన ప్రవక్త పై అవతరింపబడిన మా ఆయతులను అతనికి చదివి వినిపించబడినప్పుడు అవి పూర్వ సమాజాల కట్టు కథలు అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడినవి కావు అనేవాడు.
Mütaffifin 83:14
ఈ తిరస్కారులందరు ఊహించినట్లు విషయం కాదు. కాని వారు చేసుకున్న పాపాలు వారి బుద్ధులను అదిగమించి వాటిని కప్పివేశాయి. వారు తమ మనస్సులతో సత్యమును చూడలేదు.
Mütaffifin 83:15
వాస్తవానికి వారు ప్రళయదినమున తమ ప్రభువు దర్శనం నుండి ఆపబడుతారు.
Mütaffifin 83:16
ఆ పిదప నిశ్చయంగా వారు నరకాగ్నిలో ప్రవేశిస్తారు. దాని వేడిని వారు అనుభవిస్తారు.
Mütaffifin 83:17
ఆ పిదప ప్రళయదినమున వారిని నిందిస్తూ వారితో ఇలా పలకబడును : మీరు పొందే ఈ శిక్ష అదే దేని గురించైతే మీ ప్రవక్తలు మీకు తెలిపినప్పుడల్లా మీరు దాన్ని తిరస్కరించేవారు.
Mütaffifin 83:18
లెక్క తీసుకోవటం గాని ప్రతిఫలం ప్రసాదించటం గాని లేదని మీరు ఊహంచినట్లు విషయం కాదు. నిశ్చయంగా విధేయత చూపేవారి కర్మల పుస్తకం ఇల్లియ్యీన్ లో ఉంటుంది.
Mütaffifin 83:19
ఓ ప్రవక్తా ఇల్లియ్యూన్ ఏమిటో మీకు ఏమి తెలుసు ?.
Mütaffifin 83:20
నిశ్చయంగా వారి కర్మల పుస్తకం చెదరదు అందులో అధికం చేయబడదు మరియు తరగించబడదు.
Mütaffifin 83:21
ఈ పుస్తకం వద్ద ప్రతి ఆకాశమునకు దగ్గర ఉండే దైవదూతలు హాజరవుతారు.
Mütaffifin 83:22
నిశ్ఛయంగా విధేయకార్యములను అధికంగా చేసేవారు ప్రళయదినమున శాశ్వత అనుగ్రహాల్లో ఉంటారు.
Mütaffifin 83:23
అలంకరించబడిన ఆసనములపై కూర్చుని తమ ప్రభువు వైపునకు మరియు వారి మనస్సులను ఆనందపరిచే,వారికి సంతోషమును కలిగించే వాటన్నింటి వైపు వారు చూస్తుంటారు.
Mütaffifin 83:24
నీవు వారిని చూసినప్పుడు వారి ముఖముల్లో అందం పరంగా,సంతోషం పరంగా సుఖభోగాల ప్రభావమును చూస్తావు.
Mütaffifin 83:25
వారికి వారి సేవకులు సీలు వేయబడిన పాత్ర నుండి మధువును త్రాపించుతారు.
Mütaffifin 83:26
దాని ముగింపు వరకు దాని నుండి కస్తూరి సువాసన పరిమళిస్తూ ఉంటుంది. మరియు ఈ గౌరవోన్నత ప్రతిఫలం విషయంలో ముందుకు సాగే వారు ముందుకు సాగాలి. అల్లాహ్ ను సంతోష పెట్టే కార్యాలను చేసి మరియు ఆయనను క్రోధానికి గురి చేసే వాటిని వదిలి.
Mütaffifin 83:27
సీలు వేయబడిన ఈ పానీయం తస్నీమ్ సెలయేరు నుండి కలుపబడి ఉంటుంది.
Mütaffifin 83:28
మరియు అది స్వర్గము యొక్క ఉన్నత స్థానంలో ఉన్న ఒక సెలయేరు దాని నుండి సాన్నిధ్యం పొందిన వారు తాగుతారు అది పరిశుద్ధమైనది కలితీలేనిది. దాని నుండి విశ్వాసపరులందరు త్రాగుతారు. అది వేరే దానితో కలిసి ఉంటుంది.
Mütaffifin 83:29
నిశ్చయంగా తాము ఉన్న అవిశ్వాసముతో అపరాధమునకు పాల్పడినవారు విశ్వాసపరులపై పరిహాసంగా నవ్వేవారు.
Mütaffifin 83:30
మరియు వారు విశ్వాసపరుల యెదుట నుండి పోయినప్పుడు ఒకరినొకరు పరిహాసంగా,హచ్చరికగా కనుసైగలు చేసుకునేవారు.
Mütaffifin 83:31
మరియు వారు తమ ఇంటివారి వద్దకు మరలినప్పుడు తాము ఉన్న అవిశ్వాసము మరియు విశ్వాసపరుల పట్ల పరిహాసముతో సంబరపడుతూ మరలేవారు.
Mütaffifin 83:32
మరియు వారు ముస్లిములను చూసినప్పుడు నిశ్చయంగా వీరందరు తమ తాతముత్తాతల ధర్మమును వదిలివేయటం వలన సత్యమార్గము నుండి తప్పిపోయారు అని అనేవారు.
Mütaffifin 83:33
వారు తమ ఈ మాట పలకటానికి అల్లాహ్ వారిని వారి కర్మలను పరిరక్షించే బాధ్యత ఇవ్వలేదు.
Mütaffifin 83:34
కాని అల్లాహ్ ను విశ్వసించేవారు ప్రళయదినమున అవిశ్వాసపరులపై నవ్వుతారు ఏవిధంగానైతే వారు ఇహలోకంలో వారిపై నవ్వే వారో అలా.
Mütaffifin 83:35
అలంకరించబడిన ఆసనములపై కూర్చొని అల్లాహ్ తమ కొరకు సిద్ధం చేసి ఉంచిన శాశ్వత అనుగ్రహాలను చూస్తుంటారు.
Mütaffifin 83:36
నిశ్చయంగా అవిశ్వాసపరులు తాము ఇహలోకంలో చేసుకున్న తమ కర్మలకు హీనమైన శిక్షతో ప్రతిఫలం ప్రసాదించబడ్డారు.
İnşikak 84:1
మరియు ఆకాశము దాని నుండి దైవదూతలు దిగటానికి బ్రద్ధలైపోయినప్పుడు.
İnşikak 84:2
మరియు అది తన ప్రభువు మాటను విధేయతగా విన్నది. అదే దాని విధ్యుక్త ధర్మం.
İnşikak 84:3
మరియు చర్మము విస్తరించబడినట్లు భూమిని అల్లాహ్ విస్తరింపజేసినప్పుడు
İnşikak 84:4
మరియు అది తనలో ఉన్న నిధులను,మృతులను బయటకు విసిరివేసి వాటి నుండి అది ఖాళీ అయిపోతుంది.
İnşikak 84:5
మరియు అది తన ప్రభువు మాటను విధేయతగా విన్నది. అదే దాని విధ్యుక్త ధర్మం.
İnşikak 84:6
ఓ మానవుడా నిశ్చయంగా నీవు మంచిని గాని చెడుని గాని చేస్తావు. ప్రళయదినమున దాన్ని పొందుతావు అల్లాహ్ దానిపై నీకు ప్రతిఫలం ప్రసాదించటానికి.
İnşikak 84:7
ఇక ఎవరి కర్మల పుస్తకం అతని కుడి చేతిలో ఇవ్వబడుతుందో
İnşikak 84:8
తొందరలోనే అల్లాహ్ అతనితో తేలికపాటి లెక్క తీసుకుని అతని కర్మను అతనికి దానిపై పట్టుకోకుండా ఇస్తాడు.
İnşikak 84:9
మరియు అతను తన ఇంటి వారి వైపుకు ఆనందముగా మరలుతాడు.
İnşikak 84:10
మరియు ఇక ఎవరి కర్మల పుస్తకం అతని వీపు వెనుక నుండి అతని ఎడమ చేతిలో ఇవ్వబడుతుందో
İnşikak 84:11
తొందరలోనే అతడు తన స్వయంపై వినాశనమును పిలుచుకుంటాడు.
İnşikak 84:12
మరియు అతడు నరకాగ్నిలో ప్రవేశించి దాని వేడిని అనుభవిస్తాడు.
İnşikak 84:13
నిశ్ఛయంగా అతడు తాను ఉన్న అవిశ్వాసము,అవిధేయత వలన ఇహలోకంలో తన ఇంటివారి మధ్య సంతోషముగా ఉండేవాడు.
İnşikak 84:14
నిశ్చయంగా అతడు తన మరణం తరువాత జీవనం వైపునకు మరలడని భావించాడు.
İnşikak 84:15
ఎందుకు కాదు. తప్పకుండా అల్లాహ్ అతడిని మొదటి సారి సృష్టించినట్లే జీవనం వైపునకు మరలిస్తాడు. నిశ్చయంగా అతని ప్రభువు అతని స్థితిని వీక్షించేవాడు. దానిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండేది కాదు. మరియు అతడిని అతని కర్మ పరంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
İnşikak 84:16
సూర్యాస్తమయం తరువాత ఆకాశపు అంచుల్లో ఉండే ఎరుపుదనంపై అల్లాహ్ ప్రమాణం చేశాడు.
İnşikak 84:17
మరియు రాత్రిపై,అందులో సమీకరించబడే వాటిపై ప్రమాణం చేశాడు.
İnşikak 84:18
మరియు నెలవంక సమీకరించబడి పరిపూర్ణమై పూర్ణచంద్రుడైనప్పుడు సాక్షిగా
İnşikak 84:19
ఓ ప్రజలారా మీరు తప్పకుండా ఒక స్థితి తరువాత ఇంకో స్థితికి మారుతారు వీర్యబిందువు నుండి రక్తపు ముద్దగా ఆ తరువాత మాంసపు ముద్దగా. జీవనం ఆ తరువాత మరణం ఆతరువాత మరణాంతర జీవితం.
İnşikak 84:20
ఈ అవిశ్వాసపరులందరికి ఏమయింది అల్లాహ్ పై మరియు అంతిమ దినముపై విశ్వాసము కనబరచటం లేదు ?.
İnşikak 84:21
వారిపై ఖుర్ఆన్ పఠించబడినప్పుడు వారు తమ ప్రభువు కొరకు సాష్టాంగపడటం లేదు ?!
İnşikak 84:22
అలా కాదు అవిశ్వాసపరులు తమ వద్ద తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని తిరస్కరిస్తున్నారు.
İnşikak 84:23
మరియు వారి హృదయములు సేకరించే వాటి గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. వారి కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
İnşikak 84:24
ఓ ప్రవక్తా వారి కోసం నిరీక్షించే బాధాకరమైన శిక్ష గురించి వారికి తెలియపరచండి.
İnşikak 84:25
కాని ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి సత్కర్మలు చేస్తారో వారికి అంతం కాని పుణ్యం కలదు. మరియు అది స్వర్గము.
Büruc 85:1
సూర్య చంద్రుల మరియు ఇతర వాటి గ్రుహములు కల ఆకాశముపై అల్లాహ్ ప్రమాణం చేశాడు.
Büruc 85:2
మరియు ఆయన ఆ ప్రళయదినంపై ప్రమాణం చేశాడు దేనిలోనైతే ఆయన సృష్టిరాసులను సమీకరిస్తానని వాగ్దానం చేశాడో.
Büruc 85:3
మరియు ఆయన ప్రతీ సాక్ష్యం పలికేవాడిపై ప్రమాణం చేశాడు ఉదాహరణకు దైవప్రవక్త తన జాతి గురించి సాక్ష్యం పలుకుతారు. మరియు ప్రతీ సాక్ష్యం ఇవ్వబడిన దాని పై ప్రమాణం చేశాడు ఉదాహరణకు జాతి (ఉమ్మత్) తన ప్రవక్త గురించి సాక్ష్యం పలుకుతుంది.
Büruc 85:4
భూమిని పెద్దగా చీల్చిన వారు శపించబడ్డారు.
Büruc 85:5
మరియు వారు అందులో అగ్నిని వెలిగించారు. మరియు వారు అందులో విశ్వాసపరులను జీవించి ఉన్న స్థితిలో వేశారు.
Büruc 85:6
అప్పుడు వారు ఆ చీల్చబడిన అగ్నితో నిండబడిన దాని వద్ద కూర్చుని ఉన్నారు.
Büruc 85:7
మరియు వారు విశ్వాసపరులకు ఇచ్చే శిక్షను,యాతనను చూస్తున్నారు. ఆ సమయంలో వారు ప్రత్యక్షమై ఉండటం వలన.
Büruc 85:8
ఈ అవిశ్వాసపరులందరు విశ్వాసపరుల పట్ల ప్రతీకారం తీసుకున్నది కేవలం వారు ఎవరు ఓడించలేని సర్వ శక్తిమంతుడైన మరియు ప్రతీ దానిలో స్థుతించబడిన అల్లాహ్ పై విశ్వాసం కనబరచారని మాత్రమే.
Büruc 85:9
ఆయన ఒక్కడి కొరకే భూమ్యాకాశముల రాజ్యాధికారము. మరియు ఆయన ప్రతీది తెలుసుకునేవాడు. తన దాసుల వ్యవహారముల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Büruc 85:10
నిశ్చయంగా ఎవరైతే విశ్వాసపర పురుషులను మరియు విశ్వాసపర స్త్రీలను వారిని ఒక్కడైన అల్లాహ్ పై విశ్వాసము నుండి మరల్చటానికి శిక్షిస్తారో ఆ తరువాత తమ పాపముల గురించి అల్లాహ్ యందు పశ్ఛాత్తాప్పడరో వారి కొరకు ప్రళయదినమున నరకము యొక్క శిక్ష కలదు. మరియు వారి కొరకు వారిని దహించి వేసే అగ్ని శిక్ష కలదు. ఏదైతే వారు విశ్వాసపరులను అగ్నితో కాల్చివేసే కార్యం చేసేవారో దానికి ప్రతిఫలంగా.
Büruc 85:11
నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి సత్కార్యములు చేస్తారో వారి కొరకు స్వర్గవనాలు కలవు వాటి భవనముల క్రింది నుండి,వాటి వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రతిఫలము ఏదైతే ఆయన వారి కొరకు సిద్ధం చేశాడో ఏ సాఫల్యం సరితూగని పెద్ద సాఫల్యము.
Büruc 85:12
ఓ ప్రవక్త నిశ్చయంగా దుర్మార్గుని కొరకు మీ ప్రభువు పట్టు - మరియు నిశ్ఛయంగా అతనికి కొంత సమయం గడువు ఇవ్వటం - ఎంతో దృఢమైనది.
Büruc 85:13
నిశ్చయంగా ఆయనే సృష్టిని మరియు శిక్షను ఆరంభించేవాడు మరియు వాటిని మరల ఉనికిలోకి తెచ్చేవాడు.
Büruc 85:14
మరియు ఆయనే తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడేవారి పాపములను మన్నించేవాడు. మరియు నిశ్చయంగా ఆయన దైవభీతిపరుల్లోంచి తన స్నేహితులను ఇష్టపడుతాడు.
Büruc 85:15
సింహాసనము వాడు,గౌరవోన్నతుడు.
Büruc 85:16
పాపముల నుండి తాను కోరిన మన్నింపును తాను తలచిన వారికి చేసేవాడును మరియు తాను తలచిన వారికి శిక్షించేవాడును. పరిశుద్ధుడైన ఆయనను బలవంతం చేసేవాడు ఎవడూ లేడు.
Büruc 85:17
ఓ ప్రవక్తా సత్యముకి వ్యతిరేకముగా పోరాడటానికి మరియు దాని నుండి ఆపటానికి సైనికులను కూడబెట్టిన సైన్యాల సమాచారము మీ వద్దకు వచ్చినదా ?
Büruc 85:18
ఫిర్ఔన్ మరియు సాలిహ్ అలైహిస్సలాం సహచరులైన సమూద్ వారి (సమాచారము)
Büruc 85:19
వీరందరిని విశ్వాసము నుండి వారందరి వద్దకు సత్యతిరస్కార సమాజముల సమాచారములు రాకపోవటం మరియు వారి వినాశనము నుండి సంభవించినది ఆటంకపరచలేదు కాని వారు తమ ప్రవక్త తమ వద్దకు తీసుకుని వచ్చిన దాన్ని తమ మనోవాంఛలను అనుసరిస్తూ తిరస్కరించేవారు.
Büruc 85:20
మరియు అల్లాహ్ వారి కర్మలను చుట్టుముట్టేవాడును వాటిని లెక్కవేసేవాడును. ఆయన నుండి ఏదీ తప్పి పోదు. వాటి పరంగా ఆయన వారికి తొందరలోనే ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Büruc 85:21
సత్యతిరస్కారులన్నట్లు ఖుర్ఆన్ కవిత్వము కాదు వ్యాకరణము కాదు. కాని అది దివ్యమైన ఖుర్ఆన్.
Büruc 85:22
మార్పు చేర్పుల నుండి తరుగు పెరుగుల నుండి భద్రంగా లౌహె మహఫూజ్ లో ఉంది.
Târık 86:1
అల్లాహ్ ఆకాశముపై ప్రమాణం చేశాడు మరియు ఆయన రాత్రి వేళ వచ్చే నక్షత్రముపై ప్రమాణం చేశాడు.
Târık 86:2
ఓ ప్రవక్తా ఈ గొప్ప నక్షత్రము విషయము ఏమిటో మీకేమి తెలుసు ?!
Târık 86:3
తన ప్రకాశవంతమైన కాంతితో ఆకాశమును ప్రకాశవంతం చేసే నక్షత్రం అది.
Târık 86:4
ఏ మనిషి కూడా అల్లాహ్ ప్రళయదినం లెక్క తీసుకోవటం కొరకు అతని కర్మలను పరిరక్షించే ఒక దైవదూతను అతనిపై బాధ్యతగా నియమించకండా ఉండడు.
Târık 86:5
మనిషి అల్లాహ్ అతన్ని దేని నుంచి సృష్టించాడో గమనించాలి ; అల్లాహ్ సామర్ధ్యము మరియు మనిషి అసమర్ధత అతనికి స్పష్టమవటానికి.
Târık 86:6
అల్లాహ్ అతనిని చిమ్ముకుంటూ వెలువడే నీటితో సృష్టించాడు అది తల్లి గర్భంలో గుమ్మరించబడుతుంది.
Târık 86:7
ఈ నీరు మనిషి వెన్నుముక ఎముకల మధ్య నుండి మరియు రొమ్ము ఎముకల మధ్య నుండి వెలువడుతుంది.
Târık 86:8
నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన ఈ హీనమైన నీటితో అతడిని సృష్టించినప్పుడు అతన్ని లెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు అతని మరణం తరువాత జీవింపజేసి మరల లేపటం పై సామర్ధ్యం కలవాడు.
Târık 86:9
ఆ రోజు రహస్య విషయాలు పరీక్షించబడుతాయి. అప్పుడు హృదయములు దాచిన సంకల్పాలు మరియు విశ్వాసాలు,ఇతర విషయాలు బట్టబయలు చేయబడుతాయి. అప్పుడు వాటి నుండి పుణ్యాత్ముడు మరియు పాపాత్ముడు వేరు చేయబడుతారు.
Târık 86:10
ఆ రోజు మానవునికి అల్లాహ్ శిక్ష నుండి ఆపటానికి ఎటువంటి శక్తి ఉండదు మరియు అతడికి సహాయం చేయటానికి ఏ సహాయకుడు ఉండడు.
Târık 86:11
అల్లాహ్ వర్షము కల ఆకాశముపై ప్రమాణం చేశాడు. ఎందుకంటే అది దాని వైపు నుండి పదే పదే కురుస్తుంది.
Târık 86:12
మరియు ఆయన భూమిపై ఏదైతే తనలో ఉన్న మొక్కలు,ఫలములు,వృక్షములతో చీలిపోతుందో ప్రమాణం చేశాడు.
Târık 86:13
నశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ సత్యఅసత్యాల మధ్య మరియు నిజము అబద్దాల మధ్య వేరు చేసే మాట.
Târık 86:14
మరియు అది ఆట మరియు అసత్యము కాదు. కాని అది గంభీరము మరియు సత్యము.
Târık 86:15
నిశ్చయంగా తమ వద్దకు తమ ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించేవారు ఆయన దావత్ ను తిరస్కరించటానికి దాన్ని అసత్యపరచటానికి చాలా కుట్రలు పన్నుతున్నారు.
Târık 86:16
మరియు నేను ధర్మమును భహిర్గతం చేసి అసత్యాన్ని పరిసమాప్తం చేయటానికి పన్నాగం పన్నుతున్నాను.
Târık 86:17
ఓ ప్రవక్త ఈ తిరస్కారులకు గడువివ్వండి. వారికి కొంత గడువివ్వండి. మరియు వారి శిక్షను,వారి వినాశనమును మీరు తొందరగా కోరకండి.
A'lâ 87:1
తన సృష్టిరాసుల కన్న గొప్ప వాడైన నీ ప్రభువు పరిశుద్దతను కొనియాడు ఆయన నామమును పలుకుతూ ఆయననే నీవు స్మరించినప్పుడు మరియు నీవు ఆయన గొప్పతనమును పలుకుతూ.
A'lâ 87:2
ఆయనే మనిషిని సమగ్రంగా సృష్టించాడు మరియు అతని రూపమును తగిన ప్రమాణంలో తీర్చిదిద్దాడు.
A'lâ 87:3
మరియు ఆయనే సృష్టితాలను వాటి జాతులను వాటి రకాలను మరియు వాటి గుణములను అంచనా వేశాడు. మరియు ప్రతీ సృష్టి రాసిని దానికి తగిన దాని వైపునకు మరియు దానికి అనుకూలమైన దాని వైపునకు మార్గదర్శకం చేశాడు.
A'lâ 87:4
మరియు ఆయనే భూమి నుండి మీ పశువులు మేసే మేతను వెలికితీశాడు.
A'lâ 87:5
మరల దాన్ని తాజాగా పచ్చగా ఉన్న తరువాత ఆయన నల్లటి ఎండు గడ్డిగా మార్చి వేశాడు.
A'lâ 87:6
ఓ ప్రవక్తా మేము తొందరలోనే ఖుర్ఆన్ ను మీకు చదివింపజేస్తాము మరియు దాన్ని మీ హృదయంలో సమీకరిస్తాము. మీరు దాన్ని మరచిపోరు. కాబట్టి మీరు చదివే విషయంలో జిబ్రయిల్ కన్న ముందు చదవకండి ఏ విధంగానైతే మీరు దాన్ని మరవకుండా ఉండటానికి అత్యాశతో చేసేవారో అలా.
A'lâ 87:7
కాని విజ్ఞతతో దాని నుండి మీరు మరవాలని అల్లాహ్ తలచినది తప్ప. నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయనకు బహిర్గతం చేయబడేవి మరియు గోప్యంగా ఉంచబడేవి తెలుసు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
A'lâ 87:8
మరియు స్వర్గంలో ప్రవేశింపజేసే కర్మల్లోంచి అల్లాహ్ సంతుష్టపడే వాటిని చేయటమును మీకు మేము సులభతరం చేస్తాము.
A'lâ 87:9
కావున ఖుర్ఆన్ నుండి మేము మీకు దైవవాణి ద్వారా తెలియజేసిన వాటిని మీరు ప్రజలకు బోధించండి మరియు వారిని హితోపదేశం విన్నంత కాలం హితోపదేశం చేయండి.
A'lâ 87:10
అల్లాహ్ తో భయపడే వాడు మీ హితబోధనలతో హితబోధన గ్రహిస్తాడు. ఎందుకంటే అతడే హితబోధనతో ప్రయోజనం చెందుతాడు.
A'lâ 87:11
మరియు అవిశ్వాసపరుడు హితబోధన నుండి దూరమైపోతాడు మరియు అతడు దాని నుండి బెదిరిపోతాడు. ఎందుకంటే అతడు నరకాగ్నిలో ప్రవేశించటం వలన పరలోకంలో ప్రజలందరికెల్ల పెద్ద దౌర్భాగ్యవంతుడు.
A'lâ 87:12
అతడే పరలోక పెద్ద నరకాగ్నిలో ప్రవేశిస్తాడు. దాని వేడి అనుభవిస్తాడు మరియు శాశ్వతంగా దాన్ని అనుభవిస్తాడు.
A'lâ 87:13
ఆ తరువాత అతడు అందులో ప్రవేశిస్తాడు ఏ విధంగా నంటే అతడు అనుభవించే శిక్ష నుండి ఉపశమనం పొందటానికి అందులో అతడు మరణించడు. మరియు అతడు మంచి గౌరవ ప్రధమైన జీవితమును జీవించడు.
A'lâ 87:14
నిశ్ఛయంగా షిర్కు నుండి మరియు పాప కార్యముల నుండి పరిశుద్ధుడైనవాడు ఆశించిన వాటి ద్వారా సాఫల్యం చెందుతాడు.
A'lâ 87:15
మరియు అతడు తన ప్రభువును ఆయన ధర్మబద్ధం చేసిన స్మరణల ద్వారా స్మరించాడు. మరియు నమాజును దాన్ని పాటించుటకు కోరబడిన గుణము ద్వారా పాటించాడు.
A'lâ 87:16
కాని మీరు ఇహలోక జీవితమును ముందు పెడుతున్నారు. మరియు దాన్ని పరలోక జీవితం పై ఆ రెండిటి మధ్య పెద్ద లోపమున్నాకూడు ప్రాధాన్యతనిస్తున్నారు.
A'lâ 87:17
మరియు పరలోకం ఇహలోకము కన్న మేలైనది మరియు గొప్పది. మరియు అందులో ఉన్న సుఖభోగాలు,వైభవాలు,శాశ్వతమైనవి. ఎందుకంటే అందులో ఉన్న అనుగ్రహాలు అంతము కానివి,శాశ్వతమైనవి.
A'lâ 87:18
నిశ్చయంగా మేము మీకు ప్రస్తావించిన ఈ ఆదేశాలు మరియు సమాచారములు ఖుర్ఆన్ కన్న పూర్వం అవతరించబడిన గ్రంధముల్లో కలవు.
A'lâ 87:19
అవి ఇబ్రాహీం మరియు మూసా అలైహిమస్సలాం పై అవతరింపబడిన గ్రంధములు.
Gâşiye 88:1
ఓ ప్రవక్తా తన భయాందోళనల ద్వారా ప్రజలను క్రమ్ముకునే ప్రళయ సంగతి నీకు చేరినదా ?!
Gâşiye 88:2
ప్రజలు ప్రళయదినమున దౌర్భాగ్యులై ఉంటారు లేదా పుణ్యాత్ములై ఉంటారు . కావున దౌర్భాగ్యుల ముఖములు క్రుంగిపోయి క్రిందకు వాలి ఉంటాయి.
Gâşiye 88:3
అవి సంకెళ్ళు వేసి ఈడ్చబడటం వలన మరియు వాటికి వేయబడిన బేడీల వలన అలసి సలసి ఉంటాయి.
Gâşiye 88:4
ఈ ముఖములు వేడైన అగ్నిలో ప్రవేశించి దాని వేడిని అనుభవిస్తాయి.
Gâşiye 88:5
వారికి తీవ్ర వేడిదైన సెలయేరు నుండి త్రాపించబడును.
Gâşiye 88:6
వారి కొరకు అత్యంత చెడ్డదైన మరియు దురవాసన గల మొక్కల్లోంచి షిబ్రిక్ పేరు గల మొక్క తప్ప వారు ఆహారంగా తీసుకోవటానికి ఎటువంటి ఆహారముండదు. అది ఎండిపోయినప్పుడు విషపూరితంగా అయిపోతుంది.
Gâşiye 88:7
అది దాన్ని తినే వాడిని లావు చేయదు మరియు అతని ఆకలిని ఆపదు.
Gâşiye 88:8
ఆ రోజున పుణ్యాత్ముల ముఖములు తాము పొందిన అనుగ్రముల వలన అనుగ్రహము కలవిగా,వికసించి,సంతోషముగా ఉంటాయి.
Gâşiye 88:9
తాము ఇహలోకంలో చేసుకున్న తమ సత్కర్మ పట్ల సంతుష్టంగా ఉంటారు. నిశ్చయంగా వారు తమ కర్మల పుణ్యమును ఆదా చేసి ఉండగా రెట్టింపు చేసి ఉండగా పొందారు.
Gâşiye 88:10
ఉన్నతమైన స్థానము కల స్వర్గములో.
Gâşiye 88:11
స్వర్గములో వారు ఎటువంటి అసత్య మాటను మరియు వ్యర్ధ మాటను వినరు. ఇవే కాక నిషిద్ధ మాటలు వినరు.
Gâşiye 88:12
ఈ స్వర్గములో ప్రవహించే సెలయేరులు ఉంటాయి వారు వాటిని తాము కోరిన విధంగా త్రవ్వి తీసుకుని పోతారు మరియు వాటిని మరల్చుకుంటారు.
Gâşiye 88:13
అందులో ఎత్తైన ఆసనాలుంటాయి.
Gâşiye 88:14
మరియు పాత్రలు త్రాగటానికి సిద్ధం చేసి ఉంచబడి ఉంటాయి.
Gâşiye 88:15
మరియు అందులో వరుసగా ఒక దానితో ఒకటి ఆనించి పెట్టబడిన దిండ్లు ఉంటాయి.
Gâşiye 88:16
మరియు అందులో అక్కడక్కడ అనేక తివాచీలు పరచబడి ఉంటాయి.
Gâşiye 88:17
ఏమిటీ వారు ఒంటెల వైపునకు యోచన చేసే దృష్టితో చూడరా ఎలా అల్లాహ్ వాటిని సృష్టించాడు మరియు వాటిని ఆదం సంతతి కొరకు ఆదీనంలో చేశాడు ?.
Gâşiye 88:18
మరియు ఆకాశం వైపునకు చూడరా ఏ విధంగా దాన్ని పైకి ఎత్తాడో చివరికి అది వారిపై భద్రమైన కప్పుగా అయిపోయింది. అది వారిపై పడదు.
Gâşiye 88:19
మరియు పర్వతముల వైపుకు చూడరా ఏ విధంగా వాటిని పాతి పెట్టాడో మరియు భూమి వాటి వలన ప్రజలను తీసుకుని ప్రకంపించకుండా స్థిరంగా ఉంది.
Gâşiye 88:20
మరియు భూమి వైపు చూడరా ఎలా ఆయన దాన్ని పరచాడో మరియు దాన్ని ప్రజలు దానిపై నివాసం ఉండటానికి సిద్ధం చేశాడో ?!
Gâşiye 88:21
ఓ ప్రవక్తా వారందరిని మీరు హితబోధన చేయండి మరియు వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టండి. మీరు హితబోధన చేసే వారు మాత్రమే. మీతో వారి హితబోధనను మాత్రమే కోరబడింది. ఇక వారి విశ్వాసము భాగ్యము ఒక్కడైన అల్లాహ్ చేతిలో ఉంది.
Gâşiye 88:22
మీరు వారిని విశ్వాసముపై బలవంతం పెట్టటానికి మీరు వారిపై నియమింపబడలేదు.
Gâşiye 88:23
కాని ఎవరైతే వారిలో నుండి విశ్వాసం నుండి ముఖము చాటేశాడో మరియు అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసం కనబరచాడో.
Gâşiye 88:24
అతన్ని అల్లాహ్ ప్రళయదినమున నరకములో ప్రవేశింపజేసి పెద్ద శిక్ష విధిస్తాడు. అందులో శాశ్వతంగా ఉంటాడు.
Gâşiye 88:25
నిశ్చయంగా వారి మరణం తరువాత వారి మరలటం మా ఒక్కరి వైపే.
Gâşiye 88:26
ఆ పిదప వారి కర్మలపై వారి లెక్క తీసుకోవటం మా ఒక్కరిపై బాధ్యత కలదు. మరియు మీకూ లేదు మరియు ఇతరులకూ దాని బాధ్యత లేదు.
Fecr 89:1
అల్లాహ్ ఫజర్ పై ప్రమాణం చేశాడు.
Fecr 89:2
జిల్ హిజ్జా యొక్క మొదటి పది రాత్రులపై ప్రమాణం చేశాడు.
Fecr 89:3
మరియు వస్తువుల్లోంచి జతపై,ఒక దాని పై ప్రమాణం చేశాడు.
Fecr 89:4
మరియు రాత్రి వచ్చినప్పుడు మరియు అది కొనసాగినప్పుడు మరియు మరలి వెళ్ళినప్పుడు ప్రమాణం చేశాడు . మరియు ఈ ప్రమాణాలకు జవాబు : మీరు మీ కర్మలపై తప్పకుండా ప్రతిఫలం ఇవ్వబడుతారు.
Fecr 89:5
ఏమీ ఈ ప్రస్తావించబడిన వాటిలో బుద్ధిమంతుడు తృప్తి చెందటానికి ఏ ప్రమాణము లేదా ?!
Fecr 89:6
ఓ ప్రవక్తా హూద్ జాతి అయిన ఆద్ తమ ప్రవక్తను తిరస్కరించినప్పుడు మీ ప్రభువు ఏమి చేశాడో మీరు గమనించలేదా ?!
Fecr 89:7
పొడవైన తమ తాత ఇరమ్ తో సంబంధం కల ఆద్ జాతిని.
Fecr 89:8
వారి లాంటి జాతిని అల్లాహ్ పట్టణాల్లో ఎవరినీ సృష్టించలేదు.
Fecr 89:9
ఏమీ సాలిహ్ జాతి సమూద్ పట్ల మీ ప్రభువు ఏమి చేశాడో మీరు గమనించలేదా. వారు పర్వతాల రాతి పలకలను పగల కొట్టేవారు. వాటి నుండి రాళ్ళతో ఇండ్లను నిర్మించేవారు.
Fecr 89:10
ఏమీ ఫిర్ఔన్ పట్ల మీ ప్రభువు ఏమి చేశాడో మీరు గమనించలేదా అతని వద్ద మేకులుండేవి వాటితో ప్రజలను శిక్షించేవాడు.
Fecr 89:11
వీరందరు అణచివేతలో మరియు అన్యాయంలో అదిగమించారు. అతని ప్రతీ అదిగమించటం అతని దేశంలోనే ఉండేది.
Fecr 89:12
అవిశ్వాసమును,పాప కార్యములను వ్యాపింపజేసి దౌర్జన్యాన్ని అధికం చేశారు.
Fecr 89:13
అయితే అల్లాహ్ వారికి తన కఠినమైన శిక్ష రుచి చూపించాడు. మరియు వారిని భూమి నుండి కూకటి వ్రేళ్ళతో పెకిలించేశాడు.
Fecr 89:14
ఓ ప్రవక్త నిశ్చయంగా మీ ప్రభువు ప్రజల కర్మలపై మాటు వేసి ఉన్నాడు. మరియు వాటిని పర్యవేక్షిస్తున్నాడు. సత్కర్మలు చేసిన వారికి స్వర్గము ప్రతిఫలంగా ఇవ్వటానికి మరియు ఎవరైతే పాప కార్యం చేస్తారో వారికి నరకమును ప్రతిఫలంగా ఇవ్వటానికి.
Fecr 89:15
ఇక మానవుడు అతని స్వభావములో నుంచి అతడిని అతని ప్రభువు పరీక్షించినప్పుడు మరియు అతనికి గౌరవ మర్యాదలు ప్రసాదించినప్పుడు మరియు అతనికి ధన,సంతానము మరియు గౌరవము ద్వారా అనుగ్రహించినప్పుడు అది అల్లాహ్ వద్ద తనకు గౌరవం ఉన్నందువల్ల అని భావిస్తాడు. అప్పుడు అతడు ఇలా పలుకుతాడు : నాకు ఆయన గౌరవమర్యాదల హక్కు ఉండటం వలన నా ప్రభువు నన్ను గౌరవించాడు.
Fecr 89:16
మరియు ఇక అతడిని పరీక్షించినప్పుడు మరియు అతనిపై అతని ఆహారోపాధిని కుదించి వేసినప్పుడు అది తన ప్రభువు తనను అగౌరవపరచటం వలన అని భావిస్తాడు మరియు ఇలా పలుకుతాడు : నా ప్రభువు నన్ను అవమానించాడు.
Fecr 89:17
ఖచ్చితంగా కాదు. మనిషి భావిస్తున్నట్లు అనుగ్రహాలు తన దాసునికి అల్లాహ్ మన్నతపై మరియు ఆగ్రహం చూపటం తన ప్రభువు తరపు నుండి దాసునికి అవమానము చూపటం కాదు. కాని వాస్తవానికి మీరు అల్లాహ్ మీకు ప్రసాదించిని ఆహారోపాధి నుండి అనాధలను గౌరవించలేదు.
Fecr 89:18
మరియు మీరు ఆహారము పొందని నిరుపేదకు తినిపించటానికి ఒకరినొకరు ప్రోత్సహించరు.
Fecr 89:19
మరియు మీరు బలహీన స్త్రీల మరియు అనాధల హక్కులను వాటి హలాల్ ను లెక్క చేయకుండా బాగా తింటున్నారు.
Fecr 89:20
మరియు మీరు సంపదను బాగా ఇష్టపడుతున్నారు. అందుకే మీరు దానిపై అత్యాశ వలన దాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటానికి పిసినారితనమును చూపుతున్నారు.
Fecr 89:21
ఇది మీ చర్య అవటం మీకు తగదు. భూమి తీవ్రంగా కదిలి ప్రకంపించినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి.
Fecr 89:22
ఓ ప్రవక్త మీ ప్రభువు తన దాసుల మధ్య తీర్పు ఇవ్వటానికి వస్తాడు మరియు దైవ దూతలు పంక్తులు కట్టుకుని వస్తారు.
Fecr 89:23
ఆ రోజున నరకము తీసుకురాబడుతుంది దానికి డబ్బై వేల కళ్ళెములుంటాయి. ప్రతీ కళ్ళెమును డబ్బై వేల దైవ దూతలు పట్టుకుని దాన్ని లాగుతుంటాయి. అల్లాహ్ విషయంలో తాను ఏమి తప్పిదము చేశాడో మనిషి గుర్తు చేసుకుంటాడు. ఆ రోజున గుర్తు చేసుకోవటం అతనికి ఏమి ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే అది ప్రతిఫల దినము ఆచరణ దినము కాదు.
Fecr 89:24
అతడు తీవ్ర అవమానముతో ఇలా పలుకుతాడు : అయ్యో నా పాడుగాను వాస్తవ జీవితమైన పరలోక నా జీవితం కొరకు సత్కర్మలను చేసి పంపుకుని ఉంటే ఎంత బాగుండేది.
Fecr 89:25
ఆ రోజున అల్లాహ్ శిక్ష లాంటి శిక్షను ఎవరు శిక్షింపబడడు. ఎందుకంటే అల్లాహ్ శిక్ష తీవ్రమైనది. మరియు శాశ్వతమైనది.
Fecr 89:26
అవిశ్వాసపరులకు ఆయన బంధీ లాంటి బంధీని ఎవరు బేడీలలో బంధించబడరు.
Fecr 89:27
మరియు ఇక విశ్వాసపరుని ఆత్మతో మరణ సమయమున మరియు ప్రళయదినాన ఇలా పలకబడును : విశ్వాసమముతో మరియు సత్కర్మతో ఓ తృప్తి పొందే ఆత్మా
Fecr 89:28
నీవు నీ ప్రభువు వైపునకు నీవు పొందే అధిక ప్రతిఫలమునకు ఆయనతో ఆనందిస్తూ,పరిశుద్ధుడైన ఆయన వద్ద నీ కొరకు ఉన్న సత్కర్మ నుండి సంతుష్టపడుతూ మరలు.
Fecr 89:29
అయితే నీవు నా పుణ్య దాసుల్లో చేరిపో
Fecr 89:30
మరియు నేను వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన నా స్వర్గములో వారితో పాటు ప్రవేశించు.
Beled 90:1
పవిత్ర పట్టణమైన మక్కతుల్ ముకర్రమ పై అల్లాహ్ ప్రమాణం చేశాడు.
Beled 90:2
ఓ ప్రవక్త మీరు చేసేది హతమార్చబడటానికి హక్కు దారుడైన వాడిని హతమార్చటం మరియు బంధీ చేయబడటానికి హక్కుదారుడైన వాడిని బంధీ చేయటం మీకు ధర్మ సమ్మతము.
Beled 90:3
మరియు అల్లాహ్ మానవుని తండ్రిపై ప్రమాణం చేశాడు. మరియు అతని నుండి కలిగే సంతానముపై ప్రమాణం చేశాడు.
Beled 90:4
నిశ్చయంగా మేము మనిషిని శ్రమలో,కష్టములో సృష్టించాము. ఇహలోకంలో కష్టాలను అతడు అనుభవిస్తాడు.
Beled 90:5
ఏమిటి మనిషి తాను పాపకార్యములకు పాల్పడినప్పుడు అతనిపై ఎవరి అదుపు లేదని మరియు అతనితో ఎవరు ప్రతీకారము తీర్చుకోడని బావిస్తున్నాడా, ఒక వేళ అతడు తనను సృష్టించిన తన ప్రభువైనా కూడా ?!
Beled 90:6
అతను ఇలా అంటున్నాడు : నేను ఒక దానిపై ఒకటి పేరుకుపోయిన చాలా సంపదను ఖర్చు చేశాను.
Beled 90:7
తాను ఖర్చు చేసిన దానిపై ప్రగల్బాలు పలికే ఇతను తనను అల్లాహ్ చూడటం లేదని భావిస్తున్నాడా ? మరియు ఆయన అతని సంపద విషయంలో అతడు ఎక్కడ నుండి సంపాదించాడు మరియు ఎక్కడ ఖర్చు చేశాడు అన్న దానిలో లెక్క తీసుకోడని భావిస్తున్నాడా ?.
Beled 90:8
ఏమీ మేము అతని కొరకు అతను చూసే రెండు కళ్ళను తయారు చేయలేదా ?!
Beled 90:9
మరియు అతను మాట్లాడే నాలుకను మరియు రెండు పెదాలను.
Beled 90:10
మరియు మేము అతనికి మంచి మార్గమును మరియు దుర్మార్గమును పరిచయం చేశాము.
Beled 90:11
మరియు అతను స్వర్గం నుండి అతన్ని వేరు చేసే కనుమను దాటటానికి మరియు అదిరోహించటానికి ఆశిస్తున్నాడు.
Beled 90:12
ఓ ప్రవక్త అతడు స్వర్గంలో ప్రవేశించటానికి అతను దాటే కనుమ ఏమిటో మీకేమి తెలుసు ?!
Beled 90:13
అది పురుషుడైనా లేదా స్త్రీ అయినా బానిసత్వం నుండి విడిపించడం.
Beled 90:14
లేదా ఆహారం లభించటం అరుదుగా ఉండే కరువు దినంలో ఆహారమును తినిపించటం
Beled 90:15
తనకు సమీప బందువైన తన తండ్రిని కోల్పోయిన శిసువుకు (సమీప అనాధకు)
Beled 90:16
తన యాజమాన్యంలో ఏమీ లేని బీధ వానికి
Beled 90:17
ఆ తరువాత అతడు అల్లాహ్ ను విశ్వసించి మరియు విధేయత కార్యాలు చేయటంపై,అవిధేయత కార్యాలను విడనాడటంపై,ఆపదలపై ఓర్పు చూపమని ఒకరినొకరు సహనం చూపుకోమని తాకీదు చేసుకున్న వారిలో నుంచి మరియు అల్లాహ్ దాసులపై కరుణించమని ఒకరినొకరు తాకీదు చేసుకున్న వారిలొ నుంచి అయిపోయాడు.
Beled 90:18
ఈ సుగుణాలు కలిగిన వారందరే కుడి పక్షం వారు.
Beled 90:19
మా ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరించిన వారే ఎడమ పక్షం వారు.
Beled 90:20
వారిపై ప్రళయ దినమున బందించబడిన నరకాగ్ని ఉంటుంది అందులో వారు శిక్షంపబడుతారు.
Şems 91:1
అల్లాహ్ సూర్యుని పై ప్రమాణం చేశాడు మరియు దాని ఉదయించే స్థలం నుండి ఉదయించి దాని ప్రకాశించే వేళ పై ప్రమాణం చేశాడు.
Şems 91:2
మరియు దాని అస్తమించిన తరువాత దాన్ని అనుసరించే చంద్రునిపై ప్రమాణం చేశాడు.
Şems 91:3
మరియు తన వెలుగుతో భూమిపై ఉన్న వాటిని బహిర్గతం చేసే పగలుపై ప్రమాణం చేశాడు.
Şems 91:4
మరియు భూమిపై ఉన్న వాటిని క్రమ్మి వేసినప్పుడు చీకటిగా అయిపోయే రాత్రిపై ప్రమాణం చేశాడు.
Şems 91:5
మరియు ఆయన ఆకాశముపై ప్రమాణం చేశాడు మరియు దాని దృడనిర్మాణం పై ప్రమాణం చేశాడు.
Şems 91:6
మరియు ఆయన భూమిపై ప్రమాణం చేశాడు. మరియు దానిపై ప్రజలు నివాసముండుటకు దాన్ని విస్తరించిన ప్రక్రియపై ప్రమాణం చేశాడు.
Şems 91:7
మరియు ఆయన ప్రతీ ప్రాణిపై ప్రమాణం చేశాడు. మరియు దాని కొరకు అల్లాహ్ సృష్టిని తీర్చి దిద్దిన దానిపై ప్రమాణం చేశాడు.
Şems 91:8
చెడు ఏదైతే ఉన్నదో దాని నుండి భద్రంగా ఉండటానికి మరియు మేలు ఏదైతే ఉన్నదో దానికి అది దగ్గర అవ్వటానికి దానికి నేర్పించకుండానే అర్ధం అయ్యేటట్లు చేశాడు.
Şems 91:9
ఎవరైతే తన మనస్సును సద్గుణాలతో అలంకరించుకుని పరిశుద్ధపరచుకున్నాడో మరియు దాని నుండి దుర్గుణాలను ఖాళీ చేశాడో అతడు తాను ఆశించిన వాటితో సాఫల్యం పొందాడు.
Şems 91:10
నిశ్ఛయంగా ఎవరైతే తన మనస్సును దాన్ని అవిధేయ కార్యాల్లో మరియు పాపకార్యాల్లో గోప్యంగా ఉంచి అణగద్రొక్కాడో అతడు విఫలుడయ్యాడు.
Şems 91:11
సమూద్ జాతి అవిధేయ కార్యములను పాల్పడటంలో మరియు పాపకార్యములకు పాల్పడటంలో తాను హద్దును అతిక్రమించటం వలన తన ప్రవక్త సాలిహ్ ను తిరస్కరించింది.
Şems 91:12
వారిలో నుండి దుష్టుడు తనను తన జాతి వారు సారధిగా నిలబెట్టిన తరువాత నిలబడినప్పుడు.
Şems 91:13
అయితే దైవ ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : మీరు అల్లాహ్ ఒంటెను మరియు దాని వంతు దినములో దాని త్రాగటమును వదిలివేయండి. దానికి చెడును తలపెట్టకండి.
Şems 91:14
అయితే వారు ఒంటె విషయంలో తమ ప్రవక్తను తిరస్కరించారు. మరియు వారిలోని దుష్టుడు తాను చేసిన దానిపై వారి ఇష్టతతో దాన్ని హతమార్చాడు. కాబట్టి వారు పాపములో భాగస్వాములయ్యారు. అప్పుడు అల్లాహ్ వారిపై తన శిక్షను కురిపించాడు. వారి పాపముల వలన భయంకర శబ్దముతో వారిని నాశనం చేశాడు. వారిని నాశనం చేసిన శిక్షలో వారిని సమానం చేశాడు.
Şems 91:15
వారిని నాశనం చేసిన శిక్ష ఏదైతే వారిపై అల్లాహ్ అమలు చేశాడో పరిశుద్ధుడైన ఆయన దాని పర్యవసానాల నుండి భయపడడు.
Leyl 92:1
రాత్రి తన చీకటితో ఆకాశమునకు మరియు భూమికి మధ్య ఉన్న వాటిని కప్పి వేసినప్పుడు అల్లాహ్ దానిపై ప్రమాణం చేశాడు.
Leyl 92:2
మరియు పగలు బహిర్గతమై,ప్రత్యక్షమైనప్పుడు దానిపై ప్రమాణం చేశాడు.
Leyl 92:3
మరియు రెండు రకములైన తన సృష్టి అయిన మగ,ఆడ పై ప్రమాణం చేశాడు.
Leyl 92:4
ఓ ప్రజలారా నిశ్చయంగా మీ కర్మ రకరకాలుగా ఉంటుంది. అందులో స్వర్గములో ప్రవేశమునకు కారణమయ్యే సత్కర్మలు కలవు. మరియు నరకములో ప్రవేశమునకు కారణమయ్యే పాప కార్యములు కలవు.
Leyl 92:5
ఇక ఎవరైతే జకాతు,ఖర్చు చేయటం,పాపపరిహారములోంచి ఏదైతే ఖర్చు చేయటం తనపై తప్పనిసరో దాన్ని ఇచ్చాడో మరియు దేని నుండైతే అల్లాహ్ వారించాడో దాని నుండి దూరంగా ఉండాటో.
Leyl 92:6
మరియు పరిహారంగా అల్లాహ్ తనకు ఏదైతే ఇస్తానని వాగ్దానం చేశాడో దాన్ని నమ్ముతాడో.
Leyl 92:7
అతనిపై మేము తొందరలోనే సత్కర్మను చేయటమును మరియు అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటమును సులభతరం చేస్తాము.
Leyl 92:8
మరియు ఎవరైతే తన సంపద విషయంలో పిసినారితనం చూపి దాన్ని దేనిలోనైతే ఖర్చు చేయటం తనపై అనివార్యమో ఖర్చు చేయలేదో మరియు అల్లాహ్ నుండి తన సంపద విషయంలో నిర్లక్ష్యం వహించి అల్లాహ్ తో ఆయన అనుగ్రహముల్లోంచి ఏదీ అర్దించలేదో.
Leyl 92:9
అల్లాహ్ ఏదైతే బదులుగా ఇస్తానని మరియు తన సంపదలో నుంచి అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటంపై ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేశాడో దాన్ని అబద్దమని తిరస్కరించాడు.
Leyl 92:10
తొందరలోనే మేము చెడును చేయటమును అతనిపై సులభతరం చేస్తాము. మరియు మేలును చేయటమును అతనిపై కష్టతరం చేస్తాము.
Leyl 92:11
అతను నాశనం అయి నరకంలో ప్రవేశించినప్పుడు తాను పిసినారి తనం చూపిన తన సంపద తనకు ఏమి పనికి రాలేదు.
Leyl 92:12
నిశ్చయంగా మేము అసత్య మార్గము నుండి సత్య మార్గమును స్పష్టపరచటం మా బాధ్యత.
Leyl 92:13
మరియు నిశ్చయంగా పరలోక జీవితం మా కొరకే మరియు ఇహలోక జీవితం మా కొరకే. వాటిలో మేము తలుచుకున్నట్లు వ్యవహారాలు నడుపుతాము. మాకు తప్ప అది ఎవరికి చెందదు.
Leyl 92:14
ఓ ప్రజలారా ఒక వేళ మీరు అల్లాహ్ కు అవిధేయత చూపితే దహించి వేసే నరకాగ్ని నుండి నేను మిమ్మల్ని హెచ్చరించాను.
Leyl 92:15
ఈ నరకాగ్నిని అనుభవించువాడు దుష్టుడు మాత్రమే మరియు అతడు అవిశ్వాసపరుడు.
Leyl 92:16
అతడే దైవ ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించాడు మరియు అల్లాహ్ ఆదేశించిన వాటిని పాటించటం నుండి విముఖత చూపాడు.
Leyl 92:17
ప్రజల్లో అత్యంత దైవ భీతి కలిగిన వారైన అబూబకర్ రజిఅల్లాహు అన్హు దాని నుండి దూరంగా ఉంటారు.
Leyl 92:18
ఆయనే పాపముల నుండి పరిశుద్ధుడగుటకు తన సంపదను పుణ్య మార్గాల్లో ఖర్చు చేశారు.
Leyl 92:19
మరియు తన సంపద నుండి తాను ఖర్చు చేసినది, ఎవరో తనకు ఉపకారము చేసిన దానికి బదులుగా కాదు.
Leyl 92:20
తన సంపదలో నుంచి తాను ఖర్చు చేసినది తన సృష్టి రాసుల కన్న మహోన్నతుడైన తన ప్రభువు మన్నతును కోరుతూ మాత్రమే.
Leyl 92:21
మరియు అతడు తనకు అల్లాహ్ ప్రసాదించే గొప్ప ప్రతిఫలముతో సంతుష్టపడుతాడు.
Duhâ 93:1
పగటి మొదటి వేళ పై అల్లాహ్ ప్రమాణం చేశాడు
Duhâ 93:2
మరియు రాత్రిపై ప్రమాణం చేసాడు అది చీకటి అయినప్పుడు మరియు అందులో ప్రజలు కదలకుండా ఉన్నప్పుడు .
Duhâ 93:3
ఓ ప్రవక్త మీ ప్రభువు మిమ్మల్ని వదలలేదు మరియు మిమ్మల్ని ద్వేషించ లేదు; వహీ ఆగి పోయినప్పుడు ముష్రికులు పలికినట్లు.
Duhâ 93:4
మరియు పరలోక నివాసము మీ కొరకు ఇహలోకము కన్న మేలైనది. అందులో ఉన్న శాశ్వతమైన,అంతం కాని అనుగ్రహాల వలన.
Duhâ 93:5
మరియు ఆయన తొందరలోనే మీకు మరియు మీ జాతికి చాలా పుణ్యమును ప్రసాదిస్తాడు. చివరికి ఆయన మీకు మరియు మీ జాతి వారికి ప్రసాదించిన దానితో మీరు సంతోషపడుతారు.
Duhâ 93:6
నిశ్చయంగా ఆయన మిమ్మల్ని బాల్యంలో మీ తండ్రి మీ నుండి మరణించి ఉండగా పొందాడు. అప్పుడు ఆయన మీకు ఆశ్రయం కల్పించాడు. ఎలాగంటే మీ తాత అబ్దుల్ ముత్తలిబ్ మీపై దయ చూపారు. ఆ తరువాత మీ బాబాయి అబూతాలిబ్.
Duhâ 93:7
గ్రంధం ఏమిటో విశ్వాసం ఏమిటో మీకు తెలియని స్థితిలో ఆయన మీకు పొందాడు. అయితే ఆయన వాటిలో నుండి మీకు తెలియని దానిని ఆయన నేర్పించాడు.
Duhâ 93:8
మరియు ఆయన మిమ్మల్ని బీద వారిగా పొంది మిమ్మల్ని ధనికులుగా చేశాడు.
Duhâ 93:9
అయితే మీరు బాల్యంలో తన తండ్రిని కోల్పోయిన వాడితో చెడుగా వ్యవహరించకండి. మరియు అతడిని అవమానపరచకండి.
Duhâ 93:10
మరియు అవసరం ఉండి చేయి చాపి అడిగే వాడిని గద్దించకండి.
Duhâ 93:11
మరియు మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞత తెలుపుకో. మరియు వాటిని బహిరంగంగా ప్రకటించు.
İnşirah 94:1
నిశ్చయంగా మేము మీ హృదయమును మీ కొరకు విస్తరింపజేశాము. కాబట్టి మేము వహీని పొందటమును మీవద్ద ఇష్టమైనదిగా చేశాము.
İnşirah 94:2
మరియు మీ మునుపటి పాపాలకు మేము మిమ్మల్ని క్షమించాము మరియు మీరు ఉన్న అజ్ఞానపు రోజుల బరువును మేము తొలగించాము
İnşirah 94:3
ఏదైతే మిమ్మల్ని అలసింపజేసి చివరికి అది మీ వెన్నును విరిచివేయటానికి దగ్గరగా ఉన్నదో.
İnşirah 94:4
మరియు మేము మీ చర్చను మీ కొరకు పైకి లేపాము. అజాన్ లో మరియు ఇఖామత్ లో మరియు ఇతరవాటిలో మీ ప్రస్తావన జరిగినది.
İnşirah 94:5
నిశ్చయంగా కఠినం,కుదింపుతో పాటు సులభము,విశాలము ఉంది.
İnşirah 94:6
నిశ్చయంగా కఠినం,కుదింపుతో పాటు సులభము,విశాలము ఉంది. మీరు ఇది తెలుసుకున్నప్పుడు మీ జాతి వారి బాధపెట్టటం మీకు భయాందోళనకు గురి చేయకూడదు. మరియు అల్లాహ్ వైపు పిలవటం నుండి మిమ్మల్ని నిరోధించకూడదు.
İnşirah 94:7
మీకు మీ పనుల నుండి తీరిక దొరికి మీరు వాటిని పూర్తి చేసినప్పుడు మీ ప్రభువును ఆరాధించడానికి కృషి చేయండి.
İnşirah 94:8
మరియు మీ కోరికను మరియు మీ ఉద్దేశమును ఒక్కడైన అల్లాహ్ కి మాత్రమే చేయండి.
Tin 95:1
అల్లాహ్ అంజూరం పై మరియు అది మొలచే ప్రదేశము పై మరియు జైతూన్ (ఆలివ్) పై మరియు ఈసా అలైహిస్సలాం ప్రవక్తగా పంపించబడ్డ ఫలస్తీన్ లోని భూమిలో అది మొలచే ప్రదేశంపై ప్రమాణం చేశాడు.
Tin 95:2
మరియు ఆయన తన ప్రవక్త మూసా అలైహిస్సలాంతో సంభాషించిన ప్రాంతమైన సీనాయ్ పర్వతంపై ప్రమాణం చేశాడు.
Tin 95:3
మరియు పవిత్ర పట్టణం మక్కాపై ప్రమాణం చేశాడు. అందులో ప్రవేశించే వారికి శాంతి కలుగును మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా అందులో పంపించబడ్డారు.
Tin 95:4
నిశ్చయంగా మేము మానవుడిని ఉత్తమ సృష్టిలో మరియు ఉత్తమ రూపంలో ఉనికిలోకి తెచ్చాము.
Tin 95:5
ఆ పిదప మేము అతనిని ఇహలోకంలో వృద్దాప్యము వైపునకు మరియు ముసలి తనం వైపునకు మరల్చాము కావున అతను తన శరీరముతో ప్రయోజనం చెందడు ఏ విధంగానైతే అతడు తన స్వభావమును పాడు చేసుకుని నరకాగ్నిలోకి పోతే దానితో ప్రయోజనం చెందడో.
Tin 95:6
కాని అల్లాహ్ ను విశ్వసించి సత్కర్మలు చేసిన వారు ఒక వేళ వారు వృద్దాప్యమునకు చేరుకున్నా వారి కొరకు అంతం కాని శాశ్వత ప్రతిఫలం కలదు. అది స్వర్గము. ఎందుకంటే వారు తమ స్వభావమును శుద్ధపరుచుకున్నారు.
Tin 95:7
ఓ మానవుడా ఆయన అధిక సామర్ధ్య సూచనలను కళ్ళారా చూసిన తరువాత కూడా నిన్ను ఏ విషయం ప్రతిఫల దినమును తిరస్కరించటం పై పురిగొల్పుతుంది ?!
Tin 95:8
ఏమీ అల్లాహ్ ప్రళయదినమును ప్రతిఫలదినంగా చేసి తీర్పునిచ్చేవారిలో నుంచి ఉత్తమ తీర్పునిచ్చేవాడు మరియు వారిలో నుండి ఉత్తమంగా న్యాయపూరితంగా వ్యవహరించేవాడు కాడా ?! ఏమీ అల్లాహ్ ఉపకారము చేసినవాడికి అతని ఉపకారము యోక్క ప్రతిఫలం,మరియు దుష్కర్మకు పాల్పడినవాడికి అతని దుష్కర్మ ప్రతిఫలం ప్రసాదించడానికి తన దాసుల మధ్య తీర్పునివ్వకుండా వారిని వృధాగా వదిలేస్తాడని అతడు అనుకుంటున్నాడా ?!
Alak 96:1
ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు దైవవాణి ద్వారా చేరవేసిన దాన్ని సృష్టితాలన్నింటిని సృష్టించిన మీ ప్రభువు నామముతో ఆరంభిస్తూ చదవండి.
Alak 96:2
ఆయన మానవుడిని వీర్యబిందువుగా ఉన్న తరువాత గడ్డ కట్టిన రక్తపు ముద్దతో సృష్టించాడు.
Alak 96:3
ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు దైవవాణి ద్వారా చేర వేసిన దాన్ని చదవండి. మీ ప్రభువు ఏ దాత కూడా ఆయన దాతృత్వానికి సరతూగని పరమదాత. ఆయన అధిక దాతృత్వం మరియు ఉపకారం కలవాడు.
Alak 96:4
ఆయనే కలము ద్వారా వ్రాయటమును బోధించాడు
Alak 96:5
ఆయన మానవునికి తెలియని విషయాలను బోధించాడు
Alak 96:6
వాస్తవానికి నిశ్చయంగా అబూజహల్ లాంటి పాపాత్ముడు మానవుడు అల్లాహ్ హద్దులను అతిక్రమించటంలో హద్దును అతిక్రమించాడు.
Alak 96:7
తన వద్ద ఉన్న గౌరవం మరియు సంపద మూలంగా తనను నిరపేక్షాపరుడిగా భావించటం వలన.
Alak 96:8
ఓ మమానవుడా నిశ్చయంగా ప్రళయదినమున నీ ప్రభువు వైపునకు మరలవలసి ఉంది. ఆయన ప్రతి ఒక్కరికి అతని హక్కును ఇస్తాడు.
Alak 96:9
నిరోధించే అబూజహల్ విషయమును నీవు ఆశ్చర్యముతో చూశావా?
Alak 96:10
మా దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కాబా వద్ద నమాజ్ చేసినప్పుడు
Alak 96:11
నీవు చెప్పు ఒక వేళ ఈ నిరోధించబడినవాడు తన ప్రభువు వద్ద నుండి సన్మార్గంపై ఉండి,పూర్తి అవగాహనతో ఉంటే
Alak 96:12
లేదా అతడు ప్రజలను అల్లాహ్ ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయన భీతి కలిగి ఉండమని ఆదేశించి ఉంటే ఏమీ ఇటువంటి వ్యక్తి అయిన అతడు నిరోధించబడతాడా ?!
Alak 96:13
ఒక వేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని నిరోధించే ఇతడు ఒక వేళ తిరస్కరించి,దాని నుండి విముఖత చూపితే మీరేమంటారు అతడు అల్లాహ్ కు భయపడడా ?!
Alak 96:14
ఈ దాసుడిని నమాజు చదవటం నుండి నిరోధించేవాడికి అల్లాహ్ తాను చేస్తున్నది చూస్తున్నాడని ,ఆయనపై దానిలో నుండి ఏదీ గోప్యంగా లేదని తెలియదా ?!
Alak 96:15
ఈ మూర్ఖుడు ఊహించినట్లు విషయం కాదు. ఒక వేళ అతడు మా దాసుడిని బాధపెట్టటం నుండి మరియు అతన్ని తిరస్కరించటం నుండి ఆగకపోతే మేము తప్పకుండా అతని తల ముందు భాగమును (నుదుటను) గట్టిగా పట్టుకుని బలవంతాన నరకాగ్ని వైపుకు లాక్కుని వెళతాము.
Alak 96:16
ఆ నుదుటి కలవాడు అబద్దము పలికేవాడు మరియు తప్పులు చేసేవాడు.
Alak 96:17
అయితే అతని తల ముందు భాగమును పట్టుకుని నరకాగ్ని వైపుకు తీసుకెళ్ళబడినప్పుడు అతను తన సహచరులను మరియు తనతో పాటు కూర్చునే వారిని తనను శిక్ష నుండి రక్షించటానికి వారి సహాయం కోరతూ పిలుచుకోవాలి.
Alak 96:18
మేము కూడా తొందరలోనే నరక భటులైన కఠిన దూతలను పిలుచుకుంటాము. వారు అల్లాహ్ తమకు ఆదేశించిన దానికి అవిధేయత చూపరు మరియు తమకు ఆదేశించబడిన దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. కావున రెండు వర్గముల్లోంచి ఎవరు ఎక్కువ బలవంతులో మరియు సామర్ధ్యులో చూడాలి.
Alak 96:19
ఈ దుర్మార్గుడు మీకు చెడు కలిగిస్తాడని ఊహించినట్లు విషయం కాదు. కావున మీరు ఏ ఆదేశంలో గాని ఏ వారింపులో గాని అతని మాట వినకండి. అల్లాహ్ కొరకు సాష్టాంగపడండి. విధేయత కార్యాల ద్వారా ఆయనకు దగ్గరవ్వండి. ఎందుకంటే అవి ఆయనకు దగ్గర చేస్తాయి.
Kadr 97:1
నిశ్ఛయంగా మేము రమజాన్ నెలలో ఘనమైన రాత్రిలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖుర్ఆన్ అవతరణను ఆరంభించినట్లే పూర్తి ఖుర్ఆన్ ను భూమికి దగ్గర ఉన్న ఆకాశము పై ఒకేసారి అవతరింపజేశాము.
Kadr 97:2
ఓ ప్రవక్తా ఈ రాత్రిలో ఉన్న మేలు,శుభము ఏమిటో నీకు తెలుసా ?!
Kadr 97:3
ఈ రాత్రి గొప్ప మేలు కలిగిన రాత్రి. విశ్వాసముతో మరియు పుణ్యాన్ని ఆశిస్తూ అందులో ఆరాధన చేస్తూ జాగారం చేసే వాడి కొరకు అది వెయ్యి నెలల కన్నా శ్రేష్ఠమైనది.
Kadr 97:4
దైవదూతలు మరియు జిబ్రయీల్ అలైహిస్సలాం అందులో పరిశుద్ధుడైన తమ ప్రభువు ఆదేశముతో ఆ సంవత్సరం అల్లాహ్ నిర్ణయించిన ప్రతీ విషయమును అది ఆహారం అయినా లేదా మరణం అయినా లేదా జననం అయినా లేదా ఇతర విషయాలు అల్లాహ్ అంచనా వేసిన వాటిని తీసుకుని దిగుతారు.
Kadr 97:5
ఈ శుభప్రధమైన రాత్రి దాని ఆరంభం నుంచి ఫజర్ ఉదయించటంతో దాని ముగింపు అయ్యే వరకు పూర్తిగా మేలు కలది.
Beyyine 98:1
యూదుల్లోంచి,క్రైస్తవుల్లోంచి మరియు ముష్రికుల్లోంచి అవిశ్వాసపరులు వారి వద్దకు స్పష్టమైన ఆధారము మరియు జ్యోతిర్మయమైన వాదన వచ్చేంత వరకు అవిశ్వాసులు తమ సమావేశము,తమ సంయోగము నుండి విడిపోరు.
Beyyine 98:2
ఈ స్పష్టమైన ఆధారము మరియు జ్యోతిర్మయమైన వాదన ఏమిటంటే అది అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త .ఆయన అతనిని పంపించాడు. పరిశుద్ధులు తప్ప ఎవరు ముట్టని పరిశుద్ధ గ్రంధములను చదివి వినిపిస్తాడు.
Beyyine 98:3
ఈ గ్రంధాల్లో సత్య సమాచారాలు మరియు న్యాయపూరితమైన ఆదేశాలు కలవు. అవి ప్రజలను వారి ప్రయోజనం ఉన్న వాటి వైపుకు మరియు వారి సన్మార్గం ఉన్న వాటి వైపుకు మార్గదర్శకం చేస్తాయి.
Beyyine 98:4
తౌరాత్ ఇవ్వబడిన యూదులు మరియు ఇంజీలు ఇవ్వబడిన క్రైస్తవులు అల్లాహ్ వారి వద్దకు తన ప్రవక్తను పంపించిన తరువాతే విభేదించుకున్నారు. అయితే వారిలో నుండి ఇస్లాం స్వీకరించిన వారు ఉన్నారు మరియు వారిలో నుంచి ఆయన ప్రవక్త నిజాయితీ జ్ఞానము తనకు కలిగిన తరువాత కూడా తన అవిశ్వాసంలో కొనసాగిన వారు ఉన్నారు.
Beyyine 98:5
మరియు యూదుల మరియు క్రైస్తవుల అపరాధము మరియు వ్యతిరేకత బహిర్గతమవుతుంది. వారి గ్రంధంలో వారికి ఆదేశించబడిన అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం,బహుదైవారాధన నుండి దూరంగా ఉండటం,నమాజు పాటించటం,జకాత్ ఇవ్వటం గురించే వారు ఈ ఖుర్ఆన్ లో ఆదేశించబడ్డారు. ఎటువంటి వంకరతనం లేని తిన్నని ధర్మం గురించి వారికి ఆదేశించబడినది.
Beyyine 98:6
నిశ్చయంగా యూదుల్లోంచి,క్రైస్తవుల్లోంచి,ముష్రికుల్లోంచి తిరస్కరించిన వారు ప్రళయదినమున నరకములో ప్రవేశిస్తారు అందులో శాశ్వతంగా నివాసముంటారు. వారందరే అత్యంత నికృష్ట సృష్టి; అల్లాహ్ ను వారు అవిశ్వసించటం వలన మరియు ఆయన ప్రవక్తను వారు తిరస్కరించటం వలన.
Beyyine 98:7
నిశ్చయంగా అల్లాహ్ ను విశ్వసించి సత్కర్మలు చేసిన వారందరే ఉత్తమ సృష్టి.
Beyyine 98:8
వారి ప్రతిఫలం పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన వారి ప్రభువు వద్ద స్వర్గ వనాలు కలవు వాటి భవనముల మరియు వాటి వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో శాశ్వతంగా నివాసముంటారు. అల్లాహ్ వారు ఆయనను విశ్వసించి ఆయనకు విధేయత చూపటం వలన వారి నుండి సంతుష్టపడినాడు. మరియు వారు ఆయన నుండి పొందిన ఆయన కారుణ్యము నుండి సంతృప్తి చెందినారు. ఈ కారుణ్యమును తన ప్రభువు నుండి భయపడి ఆయన ఆదేశించిన వాటిని పాటించి ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉన్న వాడు పొందుతాడు.
Zilzal 99:1
భూమి ప్రళయదినమున తనకు సంభవించే తీవ్ర ప్రకంపనతో ప్రకంపించినప్పుడు.
Zilzal 99:2
మరియు భూమి తన లోపల ఉన్న మృతులను,ఇతరవాటిని వెలికి తీసివేసినప్పుడు.
Zilzal 99:3
మానవుడు కలవర పడి ఇలా పలుకుతాడు : భూమికి ఏమయ్యింది కదులుతుంది,ప్రకంపిస్తుంది.
Zilzal 99:4
ఆ గొప్ప దినమున భూమి తనపై అతడు చేసిన మంచీ చెడుల గురించి తెలుపుతుంది.
Zilzal 99:5
ఎందుకంటే అల్లాహ్ దానికి తెలియపరచాడు మరియు దానికి దాని గురించి ఆదేశించాడు.
Zilzal 99:6
భూమి ప్రకంపించే ఆ గొప్ప దినమున ప్రజలు లెక్క తీసుకోబడే స్థానం నుండి వర్గములుగా బయలుదేరుతారు తాము ఇహలోకంలో చేసుకున్న తమ కర్మలను చూడటానికి.
Zilzal 99:7
ఎవరైతే చిన్న చీమంత బరువైన మేలు కార్యములను,పుణ్య కార్యములను చేసి ఉంటే దాన్ని తన ముందట చూసుకుంటాడు.
Zilzal 99:8
ఎవరైతే చిన్న చీమంత బరువైన మేలు కార్యములను,పుణ్య కార్యములను చేసి ఉంటే దాన్ని తన ముందట చూసుకుంటాడు.
Adiyat 100:1
అల్లాహ్ ఆ గుర్రములపై ప్రమాణం చేశాడు ఏవైతే వేగంగా పరిగెడుతున్నవో చివరికి తీవ్రంగా పరిగెట్టటం వలన వారి రొప్పే శబ్దము వినబడుతుంది.
Adiyat 100:2
మరియు ఆ గుర్రములపై ప్రమాణం చేశాడు ఏవైతే తమ కాలి గిట్టెలతో అగ్నిని రాజేస్తున్నవో అవి వాటితో రాతి పలకలపై రాకినప్పుడు వాటిపై తీవ్రంగా వాటిల్లటం వలన.
Adiyat 100:3
మరియు ఉదయం వేళ శతృవులపై దాడి చేసే గుర్రములపై ప్రమాణం చేశాడు.
Adiyat 100:4
మరియు అవి తమ పరిగెట్టటం వలన దుమ్మును లేపుతాయి.
Adiyat 100:5
తమ సవారీలను తీసుకుని శతృవుల సమూహం మధ్యలో దూరిపోతాయి.
Adiyat 100:6
నిశ్చయంగా మానవుడు తన నుండి తన ప్రభువు ఆశించే మేలును ఎక్కువగా ఆపుతాడు.
Adiyat 100:7
మరియు నిశ్చయంగా మేలుని ఆపటంపై తాను స్వయంగా సాక్షి. అది స్పష్టమైనప్పుడు దాన్ని నిరాకరించలేడు.
Adiyat 100:8
నిశ్చయంగా అతను సంపద పట్ల చాలా ప్రేమ కలిగిన వాడు దానిలో పిసినారితనం చూపుతాడు.
Adiyat 100:9
ఏమీ ఇహలోకముతో ఈ మోసపోయే మానవునికి అల్లాహ్ సమాదులలో ఉన్న మృతులను లెక్క తీసుకోవటానికి మరియు ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపి నేల నుండి వెలికి తీసినప్పుడు తాను ఊహిస్తున్నట్లు విషయం కాదని తెలియదా ?!
Adiyat 100:10
హృదయముల్లో ఉన్న సంకల్పాలు మరియు విశ్వాసాలు మరియు ఇతర విషయాలు బహిర్గతం చేయబడుతాయి మరియు స్పష్టం చేయబడుతాయి.
Adiyat 100:11
నిశ్చయంగా వారి ప్రభువు వారి గురించి ఆ దినమున బాగా తెలిసిన వాడు. తన దాసుల వ్యవహారముల్లోంచి ఏదీ ఆయన పై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వారికి దాని పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Karia 101:1
ప్రళయం అదే ఏదైతే ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టుతుందో.
Karia 101:2
ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటి ?!.
Karia 101:3
ఓ ప్రవక్త మీకేమి తెలుసు - ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటి ?! అది ప్రళయదినం.
Karia 101:4
ఆ రోజు అది ప్రజల హృదయములను తట్టుతుంది.వారు అక్కడ ఇక్కడ విస్తరించి పడి ఉన్న చిమ్మెటల వలె అయిపోతారు.
Karia 101:5
మరియు పర్వతాలు వాటి నడవటంలో,వాటి కదలికల్లో తేలికదనంలో ఈకబడిన ఉన్ని వలే అయిపోతాయి.
Karia 101:6
మరియు ఎవరి సత్కర్మలు అతని దుష్కర్మల కన్న బరువుగా వంగుతాయో.
Karia 101:7
అతడు మనస్సుకు నచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. దాన్ని అతడు స్వర్గంలో పొందుతాడు.
Karia 101:8
మరియు ఇక ఎవరి దుష్కర్మలు అతని సత్కర్మల కన్న బరువుగా వంగుతాయో.
Karia 101:9
అయితే అతని నివాసము మరియు అతని ఆశ్రమం ప్రళయదినాన అది నరకము
Karia 101:10
ఓ ప్రవక్తా అది ఏమిటో మీకు ఏమి తెలుసు ?.
Karia 101:11
అది తీవ్ర వేడి గల నరకాగ్ని.
Tekâsür 102:1
ఓ ప్రజలారా సంపదల పట్ల,సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం మిమ్మల్ని అల్లాహ్ విధేయత నుండి పరధ్యానంలో పడవేసింది.
Tekâsür 102:2
చివరికి మీరు మరణించి మీ సమాదులలో ప్రవేశించారు.
Tekâsür 102:3
వాటి పట్ల ప్రగల్భాలు పలకటం అల్లాహ్ విధేయత నుండి మిమ్మల్ని పరధ్యానంలో పడవేయటం మీకు సరి కాదు. ఈ పరధ్యానం యొక్క పర్యవసానం ఏమిటో మీరు తొందరలోనే తెలుసుకుంటారు.
Tekâsür 102:4
ఆ పిదప మీరు తొందరలోనే దాని పర్యవసానమును తెలుసుకుంటారు.
Tekâsür 102:5
వాస్తవం ఒక వేళ మీరు అల్లాహ్ వైపు మరల లేపబడి వెళతారని మరియు ఆయన మీకు మీ కర్మల ప్రతిఫలం ప్రసాదిస్తాడని మీరు ఖచ్చితంగా తెలుకుని ఉంటే సంపదల పట్ల,సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం ద్వారా మీరు పరధ్యానంలో పడేవారు కాదు.
Tekâsür 102:6
అల్లాహ్ సాక్షిగా ప్రళయదినమున మీరు నరకాగ్నిని తప్పకుండా చూస్తారు.
Tekâsür 102:7
ఆ తరువాత మీరు దాన్ని ఖచ్చితంగా చూస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు.
Tekâsür 102:8
ఆ తరువాత అల్లాహ్ ఆ దినమున మీకు అనుగ్రహించిన ఆరోగ్యము,ఐశ్వర్యము,ఇతర వాటి గురించి మీకు తప్పకుండా అడుగుతాడు.
Asr 103:1
పరిశుద్ధుడైన అల్లాహ్ అసర్ వేళపై ప్రమాణం చేశాడు.
Asr 103:2
నిశ్చయంగా మానవుడు నష్టములో,వినాశనంలో ఉన్నాడు.
Asr 103:3
కాని అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించి సత్కర్మలు చేసిన వారు మరియు ఒకరినొకరు సత్యము గురించి మరియు సత్యముపై సహనమును చూపటం గురించి బోధించుకున్న వారు. ఈ గుణములను కలిగిన వారు తమ ఇహపరాల జీవితంలో సాఫల్యం పొందుతారు.
Hümezeh 104:1
ప్రజల గురించి ఎక్కువగా చాడీలు చెప్పేవాడి కొరకు మరియు వారి విషయంలో దెప్పిపొడిచే వాడి కొరకు దుష్పరిణామము మరియు కఠిన శిక్ష కలదు.
Hümezeh 104:2
అతడి ఉద్దేశం సంపదను సేకరించటం మరియు దాన్ని లెక్కపెట్టి ఉంచటం తప్ప అతనికి వేరే ఉద్దేశం లేదు.
Hümezeh 104:3
అతడు సేకరించిన అతని సంపద అతడిని మరణం నుండి ముక్తిని కలిగిస్తుందని మరియు అతడు ఇహలోక జీవితంలో శాశ్వతంగా ఉండిపోతాడని భావిస్తున్నాడు.
Hümezeh 104:4
ఈ మూర్ఖుడు ఊహించినట్లు విషయం కాదు. అతడు తప్పకుండా నరకాగ్నిలో విసిరివేయబడుతాడు. అది తన శిక్ష తీవ్రత వలన తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని దంచివేస్తుంది, విచ్చిన్నం చేస్తుంది.
Hümezeh 104:5
ఓ ప్రవక్త తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని తుత్తునియలు చేసే ఈ నరకాగ్ని ఏమిటో మీకేమి తెలుసు ?.
Hümezeh 104:6
నిశ్చయంగా అది అల్లాహ్ రాజేసిన అగ్ని.
Hümezeh 104:7
అది ప్రజల శరీరముల నుండి వారి హృదయముల్లోకి చొచ్చుకుపోయేది.
Hümezeh 104:8
నిశ్చయంగా అది తనలో శిక్షింపబడే వారిపై నలువైపుల నుండి బంధించబడి ఉంటుంది.
Hümezeh 104:9
విస్తరించిన పొడవైన స్తంభాలలో చివరికి వారు దాని నుండి వెలుపలికి రాలేరు.
Fil 105:1
ఓ ప్రవక్తా మీ ప్రభువు అబ్రహా పట్ల మరియు అతని సహచరులైన ఏనుగుల వారి పట్ల వారు కాబాను శిధిలం చేయుటకు పూనుకున్నప్పుడు ఏమి చేశాడో మీరు చూడలేదా ?!
Fil 105:2
నిశ్ఛయంగా దాన్ని పడవేసే వారి దుర పన్నాగమును అల్లాహ్ నిర్వీర్యం చేశాడు. కావున ప్రజలను కాబా నుండి మరల్చటమును ఏదైతే వారు పొందలేదో. మరియు దాని నుండి వారు ఏమి పొందలేదు.
Fil 105:3
మరియు వారిపై పక్షులను పంపించాడు అవి వారిపై సమూహాలు సమూహాలుగా వచ్చినవి.
Fil 105:4
అవి వారిపై మట్టితో చేయబడిన కంకర రాళ్ళను విసిరాయి.
Fil 105:5
అప్పుడు అల్లాహ్ వారిని పశువులు తిని తొక్కి వేసిన పంట ఆకుల వలె చేశాడు.
Kureyş 106:1
ఖురేష్ యొక్క అలవాటు వలన మరియు వారికి అలవాటు పరచటానికి.
Kureyş 106:2
నిశ్ఛింతగా యమన్ వైపునకు శీతాకాల ప్రయాణము మరియు వేసవి కాలంలో షామ్ (సిరియా) వైపునకు ప్రయాణం (అలవాటు పరచటానికి).
Kureyş 106:3
కావున వారు ఈ పరిశుద్ధ గృహము యొక్క ఒక్కడే ప్రభువైన అల్లాహ్ ను ఆరాధించాలి. ఎవరైతే వారి కొరకు ఈ ప్రయాణమును శులభతరం చేశారో. మరియు ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించకూడదు.
Kureyş 106:4
ఆయనే వారిని ఆకలితో ఉన్నప్పుడు తినిపించాడు మరియు భయాందోళనలో శాంతిని కలిగించాడు. అరబ్ వాసుల హృదయములలో హరమ్ యొక్క గౌరవమును వేయటంతో మరియు అక్కడి వాసుల గౌరవమును వేయటంతో.
Mâûn 107:1
ఏమీ ప్రళయదినం నాటి ప్రతిఫలమును తిరస్కరించే వాడిని నీవు గుర్తించావ ?!
Mâûn 107:2
అతనే అనాథను అతని అవసరం నుండి చాలా మొరటుగా నెట్టివేస్తాడు.
Mâûn 107:3
పేదవాడికి భోజనం తినిపించటం విషయంలో స్వయమును ప్రేరేపించడు మరియు ఇతరులను ప్రేరేపించడు.
Mâûn 107:4
తమ నమాజుల విషయంలో అశ్రద్ధ వహించి వాటి సమయం దాటేంతవరకు వాటిని పట్టించుకోని నమాజీల శిక్ష మరియు వినాశనం.
Mâûn 107:5
తమ నమాజుల విషయంలో అశ్రద్ధ వహించి వాటి సమయం దాటేంతవరకు వాటిని పట్టించుకోని నమాజీల శిక్ష మరియు వినాశనం.
Mâûn 107:6
వారే తమ నమాజులను మరియు తమ కర్మలను ప్రదర్శిస్తారు. ఆచరణను అల్లాహ్ కొరకు చిత్తశుద్ధితో చేయరు.
Mâûn 107:7
మరియు ఇతరులకు సహాయం చేయటం నుండి ఆపుతారు. ఆ సహాయం చేయటంలో ఎటువంటి నష్టం ఉండదు.
Kevser 108:1
ఓ ప్రవక్త నిశ్చయంగా మేము మీకు చాలా మేలును ప్రసాదించాము. మరియు స్వర్గములో కౌసర్ సెలయేరు అందులో నుంచే.
Kevser 108:2
కావున మీరు ఈ అనుగ్రహముపై అల్లాహ్ కు కృతజ్ఞతను తెలుపుకోండి ఆయన ఒక్కడి కొరకు మీరు నమాజును పాటించి మరియు జుబాహ్ చేసి. ముష్రికులు తమ విగ్రహాల సామిప్యము పొందటం కొరకు ఏదైతే జుబాహ్ చేసేవారో దానికి వ్యతిరేకంగా.
Kevser 108:3
నిశ్చయంగా మిమ్మల్ని ద్వేషించేవాడు ప్రతీ మేలు నుండి తెగిపోయేవాడు,మరపింపబడేవాడు అతడే ఒక వేళ అతని ప్రస్తావన జరిగిన చెడ్డగా ప్రస్తావన జరుగును.
Kâfirun 109:1
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచేవారా.
Kâfirun 109:2
ఇప్పుడు గాని భవిష్యత్తులో గాని నేను మీరు ఆరాధించే విగ్రహాలకు ఆరాధన చేయను.
Kâfirun 109:3
నేను ఆరాధించే దైవమును మీరు ఆరాధించరు. ఆయనే ఒక్కడైన అల్లాహ్.
Kâfirun 109:4
మరియు మీరు ఆరాధించే విగ్రహాలకు నేను ఆరాధన చేయను.
Kâfirun 109:5
నేను ఆరాధించే దైవమును మీరు ఆరాధించరు. ఆయనే ఒక్కడైన అల్లాహ్.
Kâfirun 109:6
మీ స్వయం కొరకు మీరు సృష్టించిన మీ మతం మీ కొరకు ఉన్నది. అల్లాహ్ నా పై అవతరింపజేసిన నా ధర్మం నా కొరకు ఉన్నది.
Nasr 110:1
ఓ ప్రవక్తా మీ ధర్మమునకు అల్లాహ్ సహాయము మరియు దానికి ఆయన గౌరవం ప్రాప్తించబడినప్పుడు మరియు మక్కా విజయం సంభవించినప్పుడు.
Nasr 110:2
మరియు మీరు ప్రజలను ఒక సమూహం తరువాత ఒక సమూహం ఇస్లాంలో ప్రవేశిస్తుండగా చూస్తారు.
Nasr 110:3
కాబట్టి మీరు అది మీరు ఏ మిషన్ తో పంపించబడ్డారో దాని ముగింపు దగ్గరపడినది అనటాని సూచనగా తెలుసుకోండి. కావున మీరు మీ ప్రభువు స్థుతులతో పరిశుద్ధతను కొనియాడండి సహాయము,విజయము యొక్క అనుగ్రహము పై ఆయనకు కృతజ్ఞతగా. మరియు ఆయనతో మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా ఆయన తన దాసుల పశ్చాత్తాపమును బాగా స్వీకరిస్తాడు మరియు వారిని మన్నిస్తాడు.
Tebbet 111:1
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయి అయిన అబూలహబ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రెండు చేతులు అతని కర్మ నిర్వీర్యమవటంతో నాశనమైపోయినవి. ఎప్పుడైతే అతడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను బాధ కలిగించాడో. మరియు అతని ప్రయత్నం నిర్వీర్యమైపోయినది.
Tebbet 111:2
అతడి సంపద మరియు అతని సంతానములో నుంచి అవి అతడి నుండి శిక్షను తొలగించకపోతే మరియు అతనికి కారుణ్యమును తీసుకుని రాకపోతే దేనికి పనికి వస్తాయి ?.
Tebbet 111:3
ప్రళయదినమున అతడు ప్రజ్వలించే అగ్నిలో ప్రవేశిస్తాడు. మరియు దాని వేడిని అనుభవిస్తాడు.
Tebbet 111:4
మరియు అతని భార్య అయిన ఉమ్మెజమీల్ అతనితో పాటు అందులో ప్రవేశిస్తుంది. ఆమె దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన మార్గంలో ముళ్ళను పరచి బాధ కలిగించేది.
Tebbet 111:5
ఆమె మెడలో ఖర్జూరపు నారతో పేనబడిన తాడు ఉంటుంది. దానితో ఆమె నరకాగ్నిలోకి ఈడ్చబడుతుంది.
İhlas 112:1
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : దైవత్వంలో ఏకైకుడు ఆయనే అల్లాహ్. ఆయన తప్ప ఏ వాస్తవ ఆరాధ్యదైవం లేడు.
İhlas 112:2
ఆయన ఎటువంటి నాయకుడంటే ఆయన వైపునకే పరిపూర్ణత యొక్క మరియు అందం యొక్క గుణాల్లో నాయకత్వము యొక్క ముగింపు ఉంటుంది. ఆయన వైపునకే సృష్టితాలన్ని అవసరము కలవై ఉంటాయి.
İhlas 112:3
అతడే ఎవడైతే ఎవరిని కనలేదు మరియు అతడిని ఎవరూ కనలేదు. కాబట్టి పరిశుద్ధుడైన ఆయనకు ఎటువంటి సంతానము లేదు. మరియు ఆయనకు జన్మనిచ్చినవాడు లేడు.
İhlas 112:4
అతని సృష్టించటంలో అతనికి పోల్చదగినది ఏది లేదు.
Felak 113:1
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను ఉదయపు ప్రభువుతో రక్షణ కోరుతున్నాను మరియు నేను ఆయనతో శరణం వేడుకుంటున్నాను.
Felak 113:2
సృష్టితాల్లోంచి బాధను కలిగించే వాటి కీడు నుండి.
Felak 113:3
మరియు నేను అల్లాహ్ తో రాత్రి వేళ బహిర్గతమయ్యే జంతువుల,దొంగల కీడుల నుండి శరణం వేడుకుంటున్నాను.
Felak 113:4
మరియు నేను ముడులలో ఊదే మంత్రజాలకుల కీడు నుండి అల్లాహ్ తో శరణం వేడుకుంటున్నాను.
Felak 113:5
మరియు నేను అల్లాహ్ తో అసూయ చెందే వాడి కీడు నుండి అతడు అసూయను కలిగించే కార్యాలకు పురికొల్పే వాటిని చేసినప్పుడు శరణు వేడుకుంటున్నాను.
Nas 114:1
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను ప్రజల ప్రభువుతో రక్షణ కోరుతున్నాను మరియు నేను ఆయనతో శరణం వేడుకుంటున్నాను.
Nas 114:2
ప్రజల చక్రవర్తి. ఆయన తాను తలచుకున్న వాటితో వారిలో కార్య నిర్వహణ చేస్తాడు. ఆయన తప్ప వారికి ఏ చక్రవర్తి లేడు.
Nas 114:3
వారి వాస్తవ ఆరాధ్య దైవము. అతను తప్ప వారికి ఏ వాస్తవ ఆరాధ్యదైవము లేడు.
Nas 114:4
ఆ షైతాన్ కీడు నుండి ఎవడైతే మానవునికి అల్లాహ్ స్మరణ నుండి అతడు పరధ్యానంలో ఉన్నప్పుడు తన దుష్ప్రేరణను వేస్తాడు. మరియు అతడు ఆయన స్మరణ చేసినప్పుడు అతని నుండి వెనుకడుగు వేస్తాడు.
Nas 114:5
అతడు తన దుష్ప్రేరితాలను ప్రజల హృదయాల్లో వేస్తాడు.
Nas 114:6
మరియు అతడు జిన్నుల్లోంచి అయినట్లే మానవుల్లోంచి అవుతాడు.